పొట్టి శ్రీరాములును అవమానించిన వ్యక్తి చంద్రబాబు: వెల్లంపల్లి | YSRCP Vellampalli Srinivas Serious Comments On CBN | Sakshi
Sakshi News home page

పొట్టి శ్రీరాములును అవమానించిన వ్యక్తి చంద్రబాబు: వెల్లంపల్లి

Mar 16 2026 12:52 PM | Updated on Mar 16 2026 3:46 PM

YSRCP Vellampalli Srinivas Serious Comments On CBN

సాక్షి, విజయవాడ: ఏపీలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేయలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు జ్ఞాపకాలను లేకుండా చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ త్రిమూర్తి చౌక్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఆర్య వైశ్యుల చందాలతో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక అంగుళానికి 5 వేల చొప్పున వసూలు చేశారు. 158 అడుగుల ఎన్టీఆర్ విగ్రహానికి మాత్రం 17వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.

పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారు. ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆయన త్యాగాన్ని గుర్తించిన పార్టీ వైఎస్సార్‌సీపీ. నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాం. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహించాం. పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను సన్మానించాం. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఒక్కసారి కూడా పొట్టి శ్రీరాములు జయంతి కానీ, ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు కానీ నిర్వహించలేదు. పొట్టి శ్రీరాములుని అవమానించిన వ్యక్తి చంద్రబాబు. ఆయన జ్ఞాపకాలను లేకుండా చేయాలని కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు. వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి కాగానే మొదటి ఏడాది ఘనంగా అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు’ అని చెప్పుకొచ్చారు. 

బాబు ఒక్క పథకానికైనా.. పొట్టి శ్రీరాములు పేరు పెట్టలేదు?

Advertisement
 
Advertisement
Advertisement