laddu
-
తిరుమల లడ్డూ బాగాలేదు.. బీజేపీ మాధవి లతా సంచలన వ్యాఖ్యలు
-
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఏదైనా ఆధారాలుంటే సీబీఐకి అప్పగించాలని సూచించింది. -
చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ తిరుమలకు కల్తీ నెయ్యి
-
లడ్డూపై చర్చ జరుపుతామని మాట మార్చిన ప్రభుత్వం
-
హెరిటేజ్ పై చర్చకు ఎందుకు భయపడుతున్నావ్.. చంద్రబాబు?
-
అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్
-
ఇంకోసారి లడ్డు గురించి మాట్లాడాలంటే... బాబుపై కన్నెర్రజేసిన జడ శ్రవణ్
-
చరిత్రలో దేవుని మీద రాజకీయాలు చేయాలంటే గజగజ వణికి పోవాలి
-
స్వామితో చెలగాటం ఆడుతున్నారు కచ్చితంగా ఫలితం చూస్తారు
-
Tirupati Laddu : సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి ఫైర్
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూపై రాజకీయం చేయడం తగదన్నారు. ఇటీవల తిరుపతి లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు.తిరుపతి లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదు. తిరుమల లడ్డూలో బాత్రమ్ క్లీనర్ కలిసిందని సీఎం చెప్పడం సరికాదు. జగన్‌ను ఇరుకున పెట్టేందుకే చంద్రబాబు అలా చెప్పారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగితే పరీక్షించే మిషన్ టీటీడీ వద్ద లేదా?. తిరుపతి లడ్డూపై కేవలం రాజకీయం చేస్తున్నారు’అని ద్వజమెత్తారు. -
Varudu: దేవుడిపై నింద వేశారు.. కర్మ ఎవరినీ వదలదు..
-
బాబు పాపం పండింది పేస్ చూడండి ఎలా మాడిపోయిందో
-
Surya Rao: చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. కాళ్లు మొక్కి క్షమాపణలు చెప్పాలి..
-
ఎట్టకేలకు బాబుకు జ్ఞానోదయమైందా?
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలు లేవనెత్తి చెత్త రాజకీయం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ విషయంలో వెనక్కు తగ్గారా? నెయ్యి తీగ లాగితే హెరిటేజ్ డొంక కదిలిందన్న వార్తలు ఇందుకు కారణమా? శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రసంగం చూస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. ముఖ కవళికల్లో తేడా స్పష్టంగా కనిపించింది. స్వరంలోనూ తేడా వచ్చింది.వైసీపీపై, మరీ ముఖ్యంగా వైఎస్ జగన్‌పై మరింత తీవ్రస్థాయిలో విరుచుకుపడతారన్న టీడీపీ ఎమ్మెల్యేల అంచనాలన్నీ తల్లకిందులైపోయాయి పాపం. వాళ్లే ఆశ్చర్యపడేట్టు ప్రసంగం మొత్తమ్మీద ఈ వివాదం ప్రస్తావన దాదాపుగా లేకుండా చేశారు బాబుగారు! యజమానికి తగ్గట్టుగా నడుచుకునే ఎల్లోమీడియా కూడా కల్తీ వివాదాన్ని పక్కనపెట్టి చంద్రబాబు జగన్‌ను దూషించిన అంశాలకే పరిమితమై కథనాలు వండివార్చింది. ‘‘జగన్ కదలితే జనాలకు నరకరమే’’ అని, ‘‘రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారని’’ చంద్రబాబు విమర్శించినట్టు రాసుకుంది. జగన్‌కు ఉన్న ప్రజాదరణపై వారి అక్కసును ఇలా వెళ్లబోసుకున్నారన్నమాట.‘‘తిరుపతి లడ్డూ వ్యవహారం సున్నితమైన అంశం. దేవుడి పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బ తీయాలని కొందరు కావాలని ప్రయత్నించారు’’ ఇవీ చంద్రబాబు మాటలు. అలా చేసిందెవ్వరు? ప్రసాదం లడ్డూలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు ,పంది కొవ్వు, చేప నూనె, చివరికి బాత్రూమ్లో వాడే రసాయనాలు కలిశాయంటూ దారుణమై రీతిలో వ్యాఖ్యలు చేసింది ఇదే చంద్రబాబే కదా? వంత పాడింది ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లే. అబద్ధపు ఆరోపణలతో తిరుమలకు అప్రతిష్ట తేవద్దని మేధావులు పలువురు విజ్ఞప్తి చేసినా పట్టించుకోనిది ఎవరు? వైఎస్ జగన్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోని బాబు తన ఎల్లో మీడియా ద్వారా దారుణమైన కథనాలు రాయించారు. పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి దుర్గగుడి మెట్లు కడగడం తిరుపతి వెళ్లి ‘‘అన్అపాలజిటిక్ హిందూ’’ అంటూ సినీ ఫక్కీలో డైలాగులు కొట్టడం కూడా మనం చూశాము.సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిజం నిగ్గుతేల్చిన తరువాత కూడా అవే ఆరోపణలును మళ్లీ మళ్లీ వల్లెవేసిందే! సిట్ నివేదికలో కల్తీ లేదని స్పష్టం చేశారుగా అని ఓ విలేకరి అడిగితే.. ‘‘ఎక్కడుంది? మీకెవరు చెప్పారు? మీ దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్’’ అంటూ కసురుకున్నది దబాయించింది కూడా చంద్రబాబే! తాజాగా లడ్డూ వ్యవహారాన్ని రాజకీయానికి వాడుకుని వైసీపీపై పైచేయి సాధించాలనుకున్న చంద్రబాబు కుట్ర భగ్నం కావడంతో ఈ నాయక త్రయమే ఇప్పుడు నెపం ఇంకొకరిపై నెట్టే ప్రయత్నం చేస్తోంది.ఇందాపూర్ ఎవరిదన్నట్టు?తిరుమల,తిరుపతి దేవస్థానానికి 2014-19 మధ్య నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ కంపెనీకి, చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌కు ఉన్న లింకులు వెలుగులోకి రావడంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. కేంద్ర ఫుడ్ సేఫ్టీ సంస్థ హెరిటేజ్ పెరుగు నాణ్యతను తప్పుపట్టి జరిమానా విధించడం కూడా బాబు, హెరిటేజ్ పరువులను బజారుకీడ్చింది. తిరుమల నెయ్యి వివాదంపై ఇష్టారీతిన మాట్లాడవద్దని కేంద్ర బీజేపీ పెద్దలు, హోం మంత్రి అమిత్ షాలు హెచ్చరించారేమో... ఢిల్లీ పర్యటన తరువా బాబు స్వరం పూర్తిగా మారిపోయింది.జరిగిన తప్పు చెప్పకపోతే ఆ అపవిత్రతను కొనసాగించేందుకు వైసీపీ వారు వెనుకాడరని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అన్నారు.ఇప్పుడు అధికారంలో ఉన్నది తాను అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారా? లేక తాను అసమర్థుడినని పరోక్షంగా చెబుతున్నారా? కల్తీ నెయ్యి సరఫరా చేసింది కాక ఆ వివాదంలోకి హెరిటేజ్‌ను లాక్కొచ్చారని, తిరుమల లడ్డూ కల్తీకి, హెరిటేజ్‌కు ఏమి సంబంధం అని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి హెరిటేజ్ ఒక్క పైసా అడగలేదు అని ఆయన అన్నారు. ఆ మాట చెప్పగానే అసెంబ్లీలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలంతా చపట్లు కొట్టాలి కదా! అలా చేయలేదు.నిశ్శబ్ధంగా కూర్చుకుండిపోయారు. ఈ వివాదంలో హెరిటేజ్‌కు ఎలాటి పాత్ర లేకపోతే, దీని మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా ఉన్న ఇంద్రాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్ ఏ రకంగా వచ్చిందో వివరించి ఉండవచ్చు కదా! 2014-19 మధ్య తన ప్రభుత్వ హయాంలో టీటీడీలో నెయ్యి సరఫరాలో ఎలాంటి అవకతవక జరగలేదని ధైర్యంగా చెప్పి, కావాలంటే సీబీఐ విచారణకు చేసుకోవచ్చని సవాల్ చేసి ఉండవచ్చు? కర్ణాటక నందిని సంస్థను తప్పించడానికి 800 కిలోమీటర్లు మించిన దూరంలో ఉన్న కంపెనీలు కూడా నెయ్యి టెండర్ వేయవచ్చని ఎందుకు నిబంధనలు సడలించారో చెప్పి ఉండవచ్చు.హర్యానాకు చెందిన కంపెనీతో ఉన్న లింక్ ను వెల్లడించి, అందులో తప్పేమీ జరగలేదని వాదించి ఉండవచ్చు ! ఏ ఇతర కంపెనీకి టెండర్ దక్కకుండా ఇందాపూర్ కంపెనీకి ధరను రూ.658లకు తీసుకువెళ్లి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టడంలో ఉన్న లోగుట్టు విప్పి ఉండాల్సింది! అంటే రెట్టింపు ధరకు కట్టబెట్టరంటే అంతకుముందు ఇదే సంస్థ కిలో రూ.278లకే సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా? అంతేకాక హెరిటేజ్ పెరుగుపై వచ్చిన రిపోర్టు తప్పో, కాదో తెలిపి ఉండాలి కదా! తాను గట్టిగా అరచి పలుమార్లు చేసిన జంతు కొవ్వు ఆరోపణలపై నిర్దిష్ట క్లారిఫికేషన్ ఇవ్వడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత కాదా?అసలు 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎ.ఆర్.డెయిరీ సరఫరా చేసిన నెయ్యి నాలుగు టాంకర్లు తిరస్కరణకు గురైన మాట నిజమా?కాదా?తిరిగి అవే టాంకర్లు ఎలా టీటీడీకి సరఫరా అయ్యాయి?అంటే కల్తీకి చంద్రబాబు ప్రభుత్వమే బాద్యత వహించాలి కదా!2019-2024 కు సంబంధించి నెయ్యి కాని, లడ్డూ కాని పరీక్షలు జరగడానికి శాంపిల్స్ లేకపోయినా, తన హయాంలో జరిగిన పరీక్షల ఆధారంగా వైసీపీపై బురద చల్లడానికి యత్నించింది చంద్రబాబు కాదా! ఇలాంటి వాటన్నిటిపై అసెంబ్లీలో సవివరంగా చెప్పే అవకాశం ఉన్నప్పటికీ దానిని సీఎం వదలుకున్నారంటే ఆయన ఆత్మరక్షణలో పడ్డారనే కదా! ఇంతకాలం అబద్దాలు చెప్పారనే కదా! జగన్ పై తప్పుడు నిందలువేశారనే కదా! బోలే బాబా కంపెనీకి 2018లో టెండర్ వచ్చినప్పుడు ఉన్నది టీడీసీ ప్రభుత్వమే కదా!అప్పుడు ఎలా ఎంపిక అయింది? వీటి గురించి ఆయన మాట్లాడలేకపోయారే! హెరిటేజ్ బ్రాండ్ దెబ్బతీయడానికి యత్నిస్తున్నారని ముఖ్యమంత్రి బాధ పడ్డారు. దానిని ఫ్యాక్షన్‌తో పోల్చడానికి యత్నించారు. ఇక్కడ ఒక సంగతి గుర్తుకు వస్తుంది.సాక్షి మీడియాపై కక్షకట్టి కేసులు, భారతి సిమెంట్ సంస్థకు నష్టం తేవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఫ్యాక్షనిజం కిందే భావించవచ్చన్నమాట. తాను ఈ 20 నెలల్లో చేసిన అభివృద్ది ఏమిటో నిర్దిష్టంగా చెప్పలేదు కాని, ఇంత ప్రగతి ఎన్నడూ లేదని ఎప్పటిమాదిరి డప్పు కొట్టుకున్నట్లు మాట్లాడితే ఏమి లాభం.ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో ఒక్కో అంశం తెలిపి ఉండాలి. అలాగే ఎన్నికల మానిఫెస్టో చూపిస్తూ ఏఏ హామీలను నెరవేర్చింది చెప్పగలిగి ఉంటే మంచి పేరు వచ్చేది కదా! శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామంటూ మేకపోతు మాటలు ఎందుకు చెబుతున్నారు? ఒకపక్క రాష్ట్రంలో నిత్యం దాడులు, అరాచకాలు, ఎమ్మెల్యేల దందా నడుస్తున్నాయే! వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల ఇళ్లపైకి టీడీపీ గూండాలు వెళ్లి విధ్వంసం సృష్టిస్తే, పెట్రోల్ బాంబులు విసిరితే, వారిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు? ఇవన్ని ఎందుకు తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, బెల్ట్ షాపులపై ఎనిమిది నెలలుగా ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదని పునరుద్ఘాటించారు. ఆ ఒక్కదానికి చంద్రబాబు సమాధానం చెప్పగలరా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
KS Prasad: 5ఏళ్ల తిరుమల వెళ్లలేదు అలాంటోడు టీటీడీ చైర్మన్..
-
Audimulapu : ఆల్రెడీ ప్రాణ భిక్ష పెట్టాడు.. అయిన చంద్రబాబుకు సిగ్గు రాలేదు
-
సెంటిమెంట్‌తో ఆటలా చంద్రబాబు.. కలియుగ ప్రత్యక్ష దైవంతో పెట్టుకున్నావు
-
రూ.306లకే నెయ్యిని చంద్రబాబు హయాంలో సరఫరా చేశారు
-
Jakkampudi : చంద్రబాబుకు ఆ దేవుడే సరైన శిక్ష వేస్తాడు
-
దేవుడితో పెట్టుకున్నోడెవడూ బతకడు చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త
-
జగన్ దమ్మున్న మొనగాడు.. మీలా చేతకాని రాజకీయాలు YSRCP చేయదు
-
తప్పు చేసి దొరికిపోయి కవర్ చేసేందుకు హార్పిక్ డ్రామా
-
లడ్డూపై పవన్ వ్యాఖ్యలు నీచాతి నీచం.. గొడ్డు మాంసం తింటా అన్నాడు
-
కలియుగ దైవంపై 'నారా'రూపరాక్షసుల కుట్ర
-
NDDB రిపోర్టులో ఏముందో.. చదివి వినిపించిన మల్లాది
-
తిరుమలను అపవిత్రం చేస్తున్నావ్... చంద్రబాబూ..ఇది మహా పాపం..
-
వెంకన్నతో రాజకీయాలు వద్దు క్షమాపణలు చెప్పండి..లేదంటే..
-
రాజకీయాలకోసం ఇంత దిగజారాలా.. దేవుడు నిన్ను విడిచిపెట్టడు జాగ్రత్త..
-
నిజం చెప్పిన తిరుపతి ఎమ్మెల్యే
-
‘శ్రీవారి భక్తులకు చంద్రబాబు,పవన్ క్షమాపణలు చెప్పాలి’
భీమవరం: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముక్కు నేలకు రాసి భక్తులకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. భీమవరంలో వైయస్సార్సీపీ నాయకులు చినిమిల్లి వెంకట రాయుడు నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ సిట్ చార్జిషీట్‌తో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనే కలవలేదనే వాస్తవాలు బయటకొచ్చాయని, రాజకీయ లబ్ధి కోసం లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. శ్రీవారిని వివాదాల్లోకి లాగి తిరుమల ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదని చెప్పారు. పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాడైతే తణుకులో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జంతు వధపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి కూడా కాలుష్యానికి కారణమవుతున్న కబేళాపై ప్రజలు చేస్తున్న ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 12 వేల గోవులను చంపి విశాఖలో 1.86 లక్షల టన్నుల మాంసాన్ని అక్రమంగా నిల్వ చేస్తే ఆరోజు పట్టించుకోని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ.. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ చెప్పినా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. నిజం చెబుతుంటే మాపై దాడులులడ్డూ కల్తీ పేరుతో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని అల్లరి చేయడం మానుకుని తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా కూటమి నాయకులంతా ముక్కు నేలకు రాసి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలి. సీబీఐ సిట్ చార్జిషీట్ తర్వాత కూడా దుష్ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటం సిగ్గుచేటు. రాజకీయ లబ్ధి కోసం తిరుమలేశుడిని వివాదాల్లోకి లాగడం సరికాదు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల ఆలోచనలను దృష్టి మళ్లించడం కోసం పదే పదే తిరుమల లడ్డూ అంశాన్ని తీసుకొచ్చి వైకుంఠవాసుడిని వివాదాల్లోకి లాగుతున్నారు. సిట్ చార్జిషీట్ బయటపెట్టి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని ప్రజలకు వాస్తవాలు చెబుతున్నందుకు మా నాయకుల మీద వరుస పెట్టి దాడులకు దిగుతున్నారు.జంతువుల కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేసిందికల్తీ జరిగిందని మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అంగీకరించారంటూ ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి మరో దుష్ప్రచారం మొదలుపెట్టారు. కల్తీ జరిగిందని కూటమి నాయకులు ప్రచారం చేస్తున్న నెయ్యి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే టీటీడీలోకి ప్రవేశించిన విషయాన్ని స్పష్టం చేశారు. సీబీఐ సిట్ చార్జిషీట్లో కూడా ఈ విషయం స్పష్టంగా రాసి ఉన్నా కూడా వైయస్సార్సీపీ మీద బురదజల్లి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం సమంజసం కాదు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో నార్కో ఎనాలిసిస్ టెస్టు సహా ఎలాంటి విచారణకైనా సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. ఆ నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు మాంసం, చేపల నూనె కలిసిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా చెప్పిన తర్వాతైనా దుష్ప్రచారం ఆపడం లేదు. బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిపారంటూ చంద్రబాబు కొత్త ప్రచారం చేస్తున్నారు. కూటమి నాయకులు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలి. చంద్రబాబు ప్రచారం చేస్తున్న బోలేబాబా డెయిరీకి కూడా టీడీపీ హయాంలోనే అనుమతులు లభించాయి. ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసే కుట్రపాలన చేతకాక ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కనిపించకుండా చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమ. కనీసం స్కూళ్లలో చదివే పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా అందించలేకపోతున్నారు. రెండేళ్లు కూడా గడవకుండానే ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇన్నాళ్లూ తిరుమల లడ్డూ విషయంలో చేసిన తప్పుడు ప్రచారానికి గాను ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆలయ మెట్లు ఇప్పుడైనా సవ్యంగా పైనుంచి కిందకు కడగాలి. దేవుడి మీద నమ్మకం లేదని, దేవుడిని ఉరి తీయాలని చెప్పిన నాగబాబు సైతం సనాతన ధర్మం గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అవకాశవాద రాజకీయాలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరుస్తూ తప్పుడు ప్రచారం చేయడం తగదు. సీబీఐ సిట్ చార్జిషీట్లో మాజీ టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ సీఎం వైయస్ జగన్‌ల పేర్లు లేకపోయినా వారి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి మాటలతో హిందువుల మనోభావాలను గాయపరచడం సరికాదు.గోవధపై మీరెందుకు మాట్లాడటం లేదు? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సనాతన ధర్మాన్ని పరిరక్షించే వారే అయితే తణుకులో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కబేళా (శ్లాటర్ హౌస్)ను తక్షణం మూసేయించాలి. ఇళ్ల మధ్య ఇష్టారాజ్యంగా జరుగుతున్న జంతు వధ కారణంగా వస్తున్న దుర్వాసనతో ప్రజలు ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా జరుగుతున్న జంతు వధను ఆపేలా కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ కూడా దృష్టిసారించాలి. శ్లాటర్ హౌస్‌పై పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌కి దీనిపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదు. విశాఖలో 1.85 లక్షల టన్నుల గోమాంసాన్ని అధికారులు సీజ్ చేస్తే, అది టీడీపీ నాయకుడి అనుచరిదని తెలిసినా ఈ కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఎందుకు స్పందించలేదు? 12 వేల గోవులను చంపి ఆ మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటే పట్టించుకోని ఈ కేంద్ర మంత్రి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీం ఏర్పాటు చేసిన సిట్ స్పష్టం చేసినా ఇప్పటికీ పదే పదే అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడు. దేవుడి మీద భయం, భక్తి ఉన్నవాళ్లు చేసే పనేనా ఇది? కేంద్ర తనిఖీల్లో హెరిటేజ్ పెరుగు మంచిది కాదని తేలింది. దీనిపై చంద్రబాబు, లోకేష్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? అని కారుమూరి నాగేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. -
తిరుమల లడ్డు ప్రసాదంపై ది వైర్ వెబ్ సైట్ సంచలన కథనం
-
ఆ రోజు అలిపిరి ఘటన.. రేపు మాత్రం.... లడ్డూపై ఆగని బాబు అసత్య ప్రచారాలు
-
అది నోరా..? ఇంకేమైనాన? చెప్పు తీసి కొడతారు జాగ్రత్త
-
అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఫుల్ వీడియో ఇదిగో
-
తప్పించుకోలేరు.. సతీష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
TTD నెయ్యిలో జంతు కొవ్వు నిల్ బాబు అబద్ధాలు బట్టబయలు
-
Bhumana: పక్కా ప్లాన్ తోనే TDP దాడులు.. ఏ ఒక్కరినీ వదలం.. రాసిపెట్టుకోండి
-
Sailajanath: గుర్తుపెట్టుకోండి.. మీరు గెలిచింది EVMల వల్లే
-
Nagarjuna: కూటమి నాయకులు గుండు కొట్టించుకొని.. క్షమాపణలు చెప్పాలి
-
Prof Nageshwar: విచారణ చేయకుండా కల్తీ జరిగిందని ఎలా చెప్తారు?
-
లడ్డూపై కూటమి అపచారం.. వైఎస్సార్సీపీ పరిహార హోమం
సాక్షి, తిరుపతి: తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ ఇచ్చిన నివేదికలో ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హోమం తలపెట్టింది. ఈ హోమం కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. భూమన నివాసం వద్దే హోమం కార్యక్రమం జరుగుతోంది.ఈ సందర్బంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..‘సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డు ప్రసాదంపై తీవ్రమైన అపనింద మోపారు. మా నాయకుడు వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టాలని విష ప్రచారానికి దిగారు. హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిపై రాజకీయ ఆరోపణలు చేశారు. ఆవు కొవ్వుతో లడ్డు ప్రసాదం తయారు చేశారు అని విష ప్రచారం చేశారు.. పంది కొవ్వు, చేప కొవ్వు కలిసింది అని తప్పుడు కూతలు కూశారు. సుప్రీంకోర్టు సీబీఐ నివేదిక ఇచ్చింది జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదని, రాజకీయ ప్రమేయం లేదని చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు తట్టుకోలేక తన విష పత్రికలు, ఛానెల్స్‌తో ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. కోట్లాది మంది హిందు సమాజాన్ని మనోభావాల్ని దెబ్బతీశారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై వేసిన నిందల కారణంగా శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం చేస్తున్నాం. ఈ హోమం ద్వారా వాళ్ళు వేసిన నింద పోతుందని భావిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. తిరుమల లడ్డూ సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. లడ్డూ, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఏఐతో ఎడిట్లు చేస్తూ.. ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది. దీనికి తోడు.. వైఎస్సార్సీపీ ద్రోహం చేసిందంటూ పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది.టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో.. వెంకటేశ్వర స్వామి ఫొటోలను మార్ఫింగ్ చేసిన పోస్టుల కనిపిస్తున్నాయి. శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు చేస్తున్నాయి ఈ పార్టీ శ్రేణులు. టీడీపీ తీరుపై వెంకటేశ్వర స్వామి భక్తులు మండిపడుతున్నారు. ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి కలిసిందని ప్రచారం చేశారని.. ఇప్పుడు అలాంటిదేం లేదని తేలినా కూడా దేవుడిని అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
YSRCP Leaders : పై వాడే చూసుకుంటాడు.. త్వరలో లెక్క క్లియర్ చేస్తాడు
-
Tirumala Laddu: బద్దలైన చంద్రబాబు కుట్ర.. ఎల్లో మీడియా వత్తాసు
-
Roja: తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని CBI రిపోర్ట్ ఇచ్చింది
-
Devineni: మీకు రోజులు దగ్గరపడ్డాయి.. ఎక్కడ మెట్లు కడిగావో.. అక్కడికే వచ్చి
-
జగన్ అన్నట్టు... కల్తీ లడ్డూ వివాదంపై అంబటి స్ట్రాంగ్ కౌంటర్
-
తిరుమల లడ్డూపై సీబీఐ సంచలన రిపోర్ట్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సప్లయ్ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డవలప్మెంట్ బోర్డు(NDDB) ద్వారా నెయ్యి శాంపిల్స్‌ను సీబీఐ మరోసారి పరీక్షించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని సీబీఐ వెల్లడించింది. సీబీఐ దర్యాప్తుతో టీడీపీ, పచ్చ మీడియా ప్రచారాలు తప్పని అని తేలింది.తిరుమల లడ్డూపై సీబీఐ ఇచ్చిన సంచలన రిపోర్ట్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు చెంపపెట్టులా మారింది. చంద్రబాబు, పవన్‌లు చేసింది తప్పుడు ప్రచారమేనని నిర్థారణ అయ్యింది. సీబీఐ రిపోర్ట్‌తో చంద్రబాబు అబద్ధాల పుట్ట బద్ధలైంది. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన చంద్రబాబు, పవన్.. రాజకీయ దురుద్ధేశంతోనే లడ్డూపై దుష్ప్రచారం చేశారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.తిరుమల లడ్డూపై విషం చిమ్మిన కూటమికి దిమ్మతిరిగేలా సీబీఐ నివేదిక ఇచ్చింది. 2024లో జూలై 6న టీటీడీ సేకరించిన శాంపిల్స్‌లో మిగిలి ఉన్న శాంపిల్స్ మరోసారి పరీక్షించాలని 2025 జనవరి 8న ఎన్డీడీబీకి సీబీఐ లేఖ రాసింది. గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి 2025 మార్చి 27న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. -
KSR: కల్తీ లడ్డూలో కాదు.. బాబులో.. అందుకే కోర్టు మొట్టికాయలు
-
మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: అంబటి రాంబాబు
సాక్షి ఎన్టీఆర్ జిల్లా: రెడ్‌బుక్ పేరుతో మంత్రి లోకేష్ చేస్తున్న బెదిరింపులకు ఎట్టిపరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇబ్రహీంపట్నంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీమంత్రి జోగి రమేష్ ను అక్రమంగా 83 రోజుల పాటు జైల్లో పెట్టించి చంద్రబాబుకు ఆయనపై ఉన్న కక్ష తీర్చుకున్నారన్నారు. అయితే అన్యాయంగా జైల్లో ఉంచడంతో ప్రజల్లో ప్రస్తుతం జోగిరమేశ్కు క్రేజ్ పెరిగిందన్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడం కోసం ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటుందని వైస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉన్న వారందరిపై కేసులు పెట్టి జైళ్లో తోస్తుందన్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు ఎంత హింసిస్తే వైఎస్సార్సీపీ నేతలు అంత పట్టుదలగా పార్టీ బలోపేతానికి సిద్ధపడతారని తెలిపారు. ప్రజలంతా మళ్లీ వైఎస్ జగన్నే సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే పరోక్షంగా జనం సంతృప్తిగా లేరని తెలిపారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వాటిని తప్పుదోవ పట్టించడానికి కూటమి ప్రభుత్వం అరెస్టులు చేయిస్తుందన్నారు. చంద్రబాబు , లోకేష్‌ల పోకడే వారి పతనానికి నాంధి అని ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట నడిచిన వారు రెడ్ బుక్ పేరుతో చేస్తున్న బెదిరింపులకు భయపడతారా అని అంబటి రాంబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు రాజకీయం చేశారని లడ్డూ కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. తిరుమలలో లడ్డూ తయారికీ దశలవారిగా నెయ్యిపరీక్ష చేస్తారన్న సంగతి ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పును దేవుడు కూడా క్షమించడని అన్నారు. దివంగత నేత ఎన్టీఆర్‌ను మోసం చేసిన చంద్రబాబుకు ఆయన విగ్రహాం పెట్టే అర్హత ఎంతమాత్రం లేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని వైఎస్సారీపీ నేతలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని మాజీ మంత్రి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
జంక్ ఫుడ్ వద్దు.. ఈ లడ్డూ వెరీ గుడ్డూ!
జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ కాకుండా ఎదిగే వయసులో పిల్లలకు పోషకాలు సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు పోషకాహార నిపుణులు. తక్కువ ఖర్చులోనే పుష్కలంగా పోషకాలు లభించే లడ్డూల తయారీ గురించి..న్యూట్రిషనిస్ట్ చెప్పే హెల్దీ వాల్యూస్ గురించి... తెలుసుకుందాం.అవిసె గింజల లడ్డుకావలసినవి: అవిసె గింజలు – కప్పు (100 గ్రాములు); బాదం పప్పు – 30; రాగి పిండి – అరకప్పు; ఎండుకొబ్బరి ముక్కలు – అర కప్పు; ఖర్జూరం – 15; నెయ్యి – సరిపడా.తయారీ: స్టౌ పైన కడాయి పెట్టి, అవిసెగింజలు దోరగా వేయించాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని, అదే పాన్‌లో బాదం పలుకులు వేయించుకోవాలి. బాదం పప్పుకు బదులుగా పల్లీలు కూడా ఉపయోగించవచ్చు. బాదం పప్పులు తీసి, తర్వాత అరకప్పు ఎండుకొబ్బరి ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించి, తీయాలి. ∙పాన్‌లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించాలి. దాంట్లో అరకప్పు రాగిపిండి వేసి, కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సీజార్‌లోకి వేయించుకున్న బాదం, ఎండు కొబ్బరి ముక్కలు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో వేయించిన రాగిపిండి పోసి గ్రైండ్ చేసుకొని, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మిక్సర్ జార్లో అవిసెగింజలు వేసి, పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాగి పిండిలో కలపాలి. ∙అలాగే మిక్సీజార్‌లో గింజలు తీసేసిన ఖర్జూరాలు వేసి, గ్రైండ్ చేయాలి ∙ఖర్జూరం మిక్సర్‌ని పిండిలో వేసి, చేతితో మిశ్రమం అంతా కలిసేలా బాగా మిక్స్ చేయాలి ∙చేతికి నెయ్యి రాసుకొని, కొద్ది కొద్దిగా పిండి మిశ్రమం తీసుకొని, చిన్న చిన్న లడ్డూలు కట్టుకోవాలి ఈ అవిసె గింజల లడ్డూలు పిల్లలకు రుచిని, బలాన్ని ఇస్తాయి. నువ్వులు – బెల్లం లడ్డుకావలసినవి: తెల్ల నువ్వులు – కప్పు; బెల్లం – కప్పు; వేరుశెనగలు – కప్పు; యాలకుల పొడి - అర టీ స్పూన్; నెయ్యి – తగినంత.తయారీ: ∙నువ్వులను సన్నని మంటపై దోరగా వేయించి పక్కన పెట్టాలి. ∙బెల్లం తరుగును గిన్నెలో వేసి, కరిగించి, మెత్తటి మిశ్రమం అయ్యే వరకు ఉడికించాలి. దాంట్లో వేయించిన నువ్వులు, ఇతర పదార్థాలు కలపాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండలుగా చేయాలి.కొబ్బరి లడ్డు కావలసినవి: పచ్చికొబ్బరి తురుము – కప్పు; బెల్లం తరుగు – అరకప్పు; యాలకులు – 4 ( పొడి చేయాలి); నెయ్యి – తగినంత.తయారీ: ముందుగా పచ్చి కొబ్బరి తురుమును పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, వేయించు కోవాలి. తర్వాత బెల్లం తరుగు, యాలకుల పొడి కలిపి, వేడి చేయాలి ∙ఈ మిశ్రమం ముద్దలా తయారైన తర్వాత, చిన్న ఉండలుగా చుట్టాలి. కొబ్బరి లడ్డుకావలసినవి: మినప పప్పు – కప్పు; నెయ్యి – తగినంత; తరిగిన బెల్లం – కప్పు; జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష; యాలకుల ΄పొడి – తగినంత.మినప లడ్డు తయారీ: మినప పప్పు దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టాలి. ∙ఒక గిన్నెలో బెల్లాన్ని కరిగించి, దాంట్లో మినపపిండి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, నెయ్యి వేసి, కలిపి ఉండలు చుట్టాలి. తక్షణ శక్తి: పదేళ్లలోపు పిల్లల్లో ఎముకల వృద్ధి, మెదడు పనితీరు వేగంగా ఉంటుంది. దీనికి తగిన విధంగా పోషకాలు గల ఆహారాన్ని అందిస్తే వారి శక్తి స్థాయులు బాగుంటాయి. చదువు, ఆటలతో త్వరగా అలసిపోతుంటారు. ఇలాంటప్పుడు తక్షణ శక్తినిచ్చే పోషకాహారం వారిని వెంటనే రీచార్జ్ చేస్తుంది. పంచదార, మైదాతో తయారైన జంక్‌ఫుడ్‌కు బదులు రాగి పిండి, ఇతర చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నట్స్, డ్రై ఫ్రూట్స్, అవిసెగింజలు, నువ్వులు, కొబ్బరితో పిల్లలకు చిరుతిండ్లు తయారు చేసి ఇవ్వచ్చు. దీనివల్ల వారికి తగినంత ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వులు లభిస్తాయి. బాల్యదశ శక్తిమంతంగా ఎదగడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. – సుజాతా స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ -
సుబ్బారెడ్డి పరువు నష్టం దావా కేసులో హైకోర్టు స్పష్ఠీకరణ
-
విషపు రాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్లెం!
ఇకపై తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ, వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. – ఢిల్లీ హైకోర్టు హెచ్చరికసాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఇకపై వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ, తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి’’ అని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కథనాలు రాసిన ఈనాడు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలతో పాటు గూగుల్‌పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్.. సదరు మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. విచారణ సందర్భంగా అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియా తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. » గత ఏడాది నవంబర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలను పట్టుకుని, వాస్తవాలను వక్రీకరిస్తూ ఈనాడు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలు తన ప్రతిష్ఠ దెబ్బతినేలా కుట్రపూరిత కథనాలు రాశాయని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా, జర్నలిజం విలువలకు తిలోదకాలిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ విషపు రాతలను అడ్డుకోవాలని, ఇప్పటికే ప్రచురించిన కథనాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ప్రతివాదులు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ (ఈనాడు), తదితర సంస్థలకు నోటీసులు జారీ చేసింది.» వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దయాన కృష్ణన్... విచారణ సందర్భంగా ఆయనపై జరిగిన అసత్య ప్రచారాలు, కుట్రలను ఎండగట్టారు. ‘తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు సంస్థల విచారణ తేలనే లేదు. చార్జిషీట్లో నా క్లయింట్ పేరు కూడా లేదు. కానీ, ఈ మీడియా సంస్థలు మాత్రం కక్షగట్టి, ఆయన అక్రమాలకు పాల్పడ్డారని కథనాలు వండివార్చాయి. విచారణ జరగకముందే దోషిగా నిలబెట్టి ఉరితీశాయి’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు సాగుతుండగానే, మీడియా సమాంతర విచారణలు జరుపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని, ఇప్పటికే ప్రచురించిన కథనాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా, వాదనల తదుపరి విచారణను న్యాయమూర్తి జనవరి 29కి వాయిదా వేశారు. -
YS Jagan: బాబు పాలనలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది
-
మీ వద్ద ఆధారాలు ఉంటే నేను సిద్దమే YV సుబ్బారెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
YV: స్వామి వారితో ఆటలొద్దు.. లడ్డులో కాదు అవినీతి చెయ్యాలంటే..
-
Vellampalli Srinivas: కూటమి ప్రభుత్వం హింధువుల పట్ల కపట ప్రేమ చూపిస్తోంది
-
YV సుబ్బారెడ్డి PAగా చేసిన అప్పన్న.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో అంబటి షాకింగ్ నిజాలు
-
రుచి.. శుచి... వెంకన్న నైవేద్యం
తిరుమలేశుడు భక్త సులభుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా! అందుకే ఆయన ప్రసాదాలు ప్రత్యేకం. తిరుమలేశుని ప్రసాదం అంటే కేవలం లడ్డు, వడలే కాదు.. దోసెలు, పోలి (పూర్ణం భక్ష్యాలు), జిలేబి, తేనెతొల, సుఖియం, అప్పం, కేసరిబాత్, పాయసం, సీరా వంటివెన్నో స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాల రుచి, నాణ్యత మరెక్కడా లభించవు.మూలమూర్తికి మూడు సార్లు నైవేద్యం గర్భాలయ మూలమూర్తికి రోజుకు మూడుసార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 5 తర్వాత మొదటిగంటలో ఒకసారి, ఉదయం 10 గంటల్లోపే (మధ్యాహ్న నైవేద్యం అంటారు) మరోసారి, రాత్రి 7 గంటలకు ఒకసారి ప్రసాద సమర్పణ ఉంటుంది.మాతృ దధ్యోదనమంటే స్వామికి మహా ఇష్టం. కులశేఖరపడి దాటుకుని గర్భాలయంలోకి వెళ్లేది చిక్కటి మీగడతో కూడిన ‘మాతృదధ్యోదనం’ మాత్రమే. అది కూడా సగం పగిలిన కొత్త మట్టి ఓడులోనే పెడతారు. చివరగా ఏకాంత సేవ సమయంలో వివిధ ఫలాలు, చక్కెర, తేనెతో తయారు చేసిన ‘మేవా’, చక్కెర, జీడిపప్పు, బాదంపలుకులు, ఎండుద్రాక్ష, ఏలకులు, గసగసాలు, ఎండుకొబ్బరి ముక్కలతో తయారు చేసిన ‘పంచకజ్జాయం’, చక్కెరతో కలిపిన వేడిపాలను నివేదిస్తారు. వకుళ మాత సమక్షంలోనే..! గర్భాలయానికి ఆగ్నేయ మూలలోగల వంటశాల (పోటు)లో కొలువైన శ్రీనివాసుని తల్లి వకుళమాలిక విగ్రహం వద్ద కొంత సమయం ఉంచిన తర్వాతే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ‘గమేకార్లు’(వంట పరిచారకులు) భక్తిశ్రద్ధ్దలతో, శుచిగా పోటులో అన్నప్రసాదాలు వండుతారు.లడ్డు, వడ, అప్పం, దోసె, పోళి, సుఖియం, మురుకు, జిలేబి వంటి పిండి ప్రసాదాలు (పనియారాలు) వెండివాకిలికి బయట సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన ‘పోటుతాయారు’ అమ్మవారి విగ్రహం సమక్షంలో తయారు చేస్తారు. వారపు సేవల్లో భాగంగా సోమవారం విశేష పూజలో పెద్ద వడలు, లడ్డూలు, అన్నప్రసాదాలు, బుధవారం సహస్ర కలశాభిషేకంలో ప్రత్యేకంగా క్షీరాన్నంతోపాటు మిగిలిన అన్నప్రసాదాలు, గురువారం తిరుప్పావడ సేవలో మొత్తం 450 కిలోల బియ్యంతో తయారు చేసిన పులిహోర, జిలేబీలు, పెద్దమురుకులు (తేనెతొల) నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక శుక్రవారం నాడు పోళీలు(పూర్ణం భక్ష్యాలు), సుఖియం (ఉండ్రాళ్లు), ఆదివారం మాత్రం ‘ఆదివారం ప్రసాదం’ అనే చలిమిడి ప్రసాదాన్ని నివేదిస్తారు. దీనినే అమృత కలశం అంటారు. స్వామి తర్వాత గరుడాళ్వారుకు సమర్పిస్తారు. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామికి దోసెలు, శెనగపప్పుతో తయారు చేసిన శుండలి(గుగ్గిళ్ళు) సమర్పిస్తారు. వీటితోపాటు పెసరపప్పు పణ్ణారం, పానకం కూడా నివేదిస్తారు. ధనుర్మాస వ్రత సమయంలో అన్నప్రసాదాలతోపాటు ప్రత్యేకంగా ‘బెల్లపు దోసె’ను ప్రియంగా ఆరగిస్తాడు స్వామి.అందువల్లే ఆ నాణ్యత, రుచి..!1951వ సంవత్సరంలో ఈ ప్రసాదాల తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ‘దిట్టం’ (కొలత) కొలమానంగా నిర్ణయించింది. తర్వాత పలుమార్లు దిట్టాన్ని సవరించారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టం ప్రకారం ప్రసాదాలు తయారు చేస్తున్నారు. మూడు రుచుల్లో శ్రీవారి లడ్డూలు తిరుపతి లడ్డూలు మూడు రకాలుగా తయారు చేస్తున్నారు. వీటిలో ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డూ.ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు, పర్వదినాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలా.. అతిముఖ్యమైన వ్యక్తులు ఆలయాన్ని సందర్శించిన సందర్భాల్లో ఆస్థానం లడ్డూ తయారు చేస్తారు. దీని బరువు 750 గ్రాములు. దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమపువ్వు వేసి ఈ లడ్డూను ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. వీటిని గౌరవ అతిథులకు అందజేస్తారు. సామాన్యులకు అంతసులువుగా లభించదు. ఇక స్వామివారి నిత్య కల్యాణోత్సవ సేవలో పాల్గొనే గృహస్తులకు ప్రత్యేకమైన కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా ఇస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే చాలా రుచిగా ఉంటుంది. మూడవది 175 గ్రాముల ప్రోక్తం లడ్డూ. ఇది భక్తులందరికీ లభించే లడ్డూ.దర్శనం తర్వాత వెండివాకిలి దాటుకుని వెలుపలకు వచ్చే భక్తులకు ఉదయం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు వివిధ రకాల ప్రసాదాలు వితరణ చేస్తారు. -
ఆహా..లిక్విడ్ లడ్డు..!
ఎవరి టేస్ట్ వారికి ఆనందం. అలాంటి ఆనందమే ప్రయోగాలకు వేదికై కొత్త ఆవిష్కరణకు దారి తీస్తుంది. ఒక యువకుడు తయారు చేసిన ‘లిక్విడ్ లడ్డు’ వీడియో నెట్‌లోకంలో చక్కర్లు కొడుతూ నోరూరిస్తోంది.‘లొట్టలు వేయనక్కర్లేదు. మీరు కూడా ఎంచక్కా ఇలా తయారు చేసుకోవచ్చు’ అని వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించాడు లిక్విడ్ లడ్డు సృష్టికర్త.ఈ లిక్విడ్ లడ్డు వీడియోకు లక్షలాది వ్యూస్ వచ్చాయి, ‘ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి!’ అనే డైలాగు మనకు తెలిసిందే కదా. ఎవరూ చేయనిది కొత్త వంటలెలా పుడతాయి! అందుకే....ఈ లిక్విడ్ లడ్డు సృష్టికర్తకు ‘వెరీ గుడ్’ అని ప్రశంసలు వచ్చాయి. View this post on Instagram A post shared by Saransh Goila (@saranshgoila) (చదవండి: నేచురల్ హెయిర్ జెల్..! జుట్టు పెరగడమే కాదు..హెల్దీ కూడా..) -
తిరుమల లడ్డూ కేసు: సిట్ దర్యాప్తులో రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదం కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ బెంచ్ ఎదుట లిస్టు చేయాలని జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యవహారంలో సిట్ రాజకీయ ప్రేరేపిత దర్యాప్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని నియంత్రించేందుకు.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే నేరుగా నిష్పక్షపాత, పారదర్శక విచారణ జరపాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం(జులై 14) ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. సిట్ పని విధానంపై స్టేటస్ కో కొనసాగించాలి. సిట్ సేకరించిన రికార్డులన్నీ పరిశీలించాలి. సిట్‌కు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ నిర్దేశించాలి. సిట్ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి. దర్యాప్తు సమయంలో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ తోపాటు అడ్వకేటును అనుమతించాలి. అన్నింటికంటే ముఖ్యంగా.. దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలి అని కోర్టును కోరారు.పిటిషన్లో ఏముందంటే.. తిరుమల లడ్డు కేసులో సిట్ రాజకీయ కక్షతో, దురుద్దేశంతో దర్యాప్తు జరుపుతోంది. కదురు చిన్నప్పన్న నుంచి బలవంతంగా వీడియో స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ కు అనుగుణంగా స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. నన్ను, మాజీ ఈవోను ఈ కేసులో ఇరికించి.. అరెస్టు చేసే విధంగా బలవంతంగా సాక్షాలను చెప్పిస్తున్నారు. సిట్ పారదర్శకంగా పనిచేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈ కేసులో కదురు చిన్నప్పన్నను భయపెట్టి బలవంతపు స్టేట్మెంట్లు తీసుకుంటున్నది. ఆయన ఆస్తులను జప్తు చేస్తామని భయపెడుతోంది. రాజకీయ జోక్యంతో సిట్ దర్యాప్తు గాడి తప్పింది. రాజకీయాల కతీతంగా దర్యాప్తు జరపాల్సిన సిట్ వాటికి తిలోదకాలు ఇచ్చిందిరాష్ట్ర ప్రభుత్వ అధికారుల మితిమీరిన జోక్యంతో సిట్ దర్యాప్తుపై ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. సిట్ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. సిట్ కాంపోజిషన్ లో బ్యాలెన్స్ తప్పింది. సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుండడంతో సెలెక్టివ్ గా విచారణ చేసి, అనేక అంశాలను తొక్కి పెడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సిట్ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే నిష్పక్షపాత, పారదర్శక విచారణ జరపాలి. -
తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు
-
మీరు ఎవరికీ నోటీసులు ఇవ్వొద్దు.. విచారణ చేయొద్దు
సాక్షి, అమరావతి: ‘తిరుమల లడ్డూ వివాదంపై విచారణ పేరుతో మీరు ఎవరికీ నోటీసులు ఇవ్వొద్దు. విచారణ చేయొద్దు...’ అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ జె.వెంకటరావును హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు అనుమతి తీసుకోకుండానే సిట్ దర్యాప్తు అధికారిగా అదనపు ఎస్పీ జె.వెంకటరావును నామినేట్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో వెంకటరావు భాగం కాదని గుర్తుచేసింది. అలాంటప్పుడు సుప్రీంకోర్టు అనుమతి తీసుకోకుండా విచారణ పేరుతో సాక్షులకు నోటీసులు జారీ చేయడం కోర్టు ధిక్కారమే అవుతుందని అభిప్రాయపడింది. సిట్ దర్యాప్తు అధికారిగా వెంకటరావును నియమిస్తూ సీబీఐ డైరెక్టర్ ఇచి్చన ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. సీబీఐ, సిట్ దర్యాప్తు అధికారి హోదాలో సాక్షులకు, నిందితులకు నోటీసులు ఇవ్వకుండా వెంకటరావును హైకోర్టు నిరోధించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల లడ్డూ వివాదంపై దర్యాప్తు నిమిత్తం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడిగా లేని వెంకటరావు దర్యాప్తు అధికారి హోదాలో తనకు నోటీసు ఇచ్చి విచారణకు పిలవడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ, ఏపీ భవన్ అప్పటి ప్రత్యేక అధికారి కె.చిన్నప్పన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చిత్తరవు నాగేశ్వరరావు, న్యాయవాదులు వంపుగడవల ఉదయ్‌కుమార్, పి.యుగంధర్‌రెడ్డి వాదనలు వినిపించారు.సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’లో వెంకటరావు సభ్యుడు కాదు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న వెంకటరావు భాగం కాదని సీనియర్ న్యాయవాది నాగేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు ఉండాలని, వారిని సీఐడీ డైరెక్టర్ నామినేట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ చైర్మన్ నామినేట్ చేసిన సీనియర్ అధికారి ఒకరు సిట్‌లో ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట ఓ సిట్‌ను ఏర్పాటు చేసిందన్నారు. తిరుపతి అదనపు ఎస్పీగా ఉన్న వెంకటరావు మొదట దర్యాప్తు చేశారన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సిట్ స్థానంలో మరో సిట్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో వెంకటరావు సభ్యుడు కాదన్నారు. అయినప్పటికీ సీబీఐ డైరెక్టర్ దర్యాప్తు బాధ్యతలను వెంకటరావుకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారని తెలియజేశారు. -
తిరుమల శ్రీవారి ప్రతిష్ట దిగజార్చేలా కూటమి కుట్రలు
-
తిరుమల లడ్డూ వ్యవహారం నుంచి బయటపడటానికి బాబు యత్నిస్తున్నారు
-
తిరుమల లడ్డూ కేసులో నలుగురు అరెస్ట్
-
యూపీ: బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం
-
తిరుమల లడ్డూ కౌంటర్లో మంటలు
-
'గోంద్ లడ్డు'..పోషకాల గని..!
కావలసినవి: గోంద్ (ఎడిబుల్ గమ్) – ము΄్పావు కప్పు; బాదం పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; రైజిన్స్ – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము– 2 కప్పులు; బెల్లం పొడి– ఒకటింపావు కప్పు; ఖర్జూరాలు (గింజలు తొలగించినవి) – అర కప్పు; గసగసాలు– 2 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి– అర టీ స్పూన్; నెయ్యి – టేబుల్ స్పూన్. తయారీ: మందపాటి బాణలిలో నెయ్యి వేడి చేసి గోంద్‌ను వేయించాలి. చల్లారిన తర్వాత చిదిమి పొడి చేయాలి లేదా చపాతీలు చేసే పీట మీద వేసి చపాతీల కర్రతో ΄పొడి చేయవచ్చు. చిన్న రోలు ఉంటే అందులో వేసి దంచి పొడి చేసుకోవచ్చు. ఒక బాణలిలో కొబ్బరి తురుము, గసగసాలు, కిస్మిస్, మిగిలిన గింజలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేయిస్తూ, వేయించిన దినుసులన్నింటినీ ఒకే పాత్రలో వేయాలి. అందులో యాలకుల పొడి, ఖర్జూరాలు, గోంద్ పొడి వేసి సమంగా కలిసే వరకు స్పూన్‌తో కలపాలి. మరొక పాత్రలో బెల్లం పొడి వేసి మూడు టేబుల్ స్పూన్ల నీటిని ΄ోసి తీగ పాకం వచ్చేవరకు మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి అందులో గోంద్పొడి తోపాటు దినుసులన్నింటినీ కలిపిన మిశ్రమాన్ని వేసి కలపాలి. వేడి తగ్గే వరకు ఆగాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డులు చేయాలి. పై కొలతలతో చేస్తే 16 లడ్డులు వస్తాయి. గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. గమనిక: ఇది గోధుమ జిగురు. మార్కెట్లో గోంద్ కటిరా పేరుతో దొరుకుతుంది. ఒక్కో లడ్డులో పోషకాలు ఇలా ఉంటాయి..కేలరీలు – 120–130; కార్బోహైడ్రేట్లు – 15–18 గ్రాములు; ప్రోటీన్లు – 2–3 గ్రాములు;ఫ్యాట్ – 6–7 గ్రా.; ఫైబర్– 1–2 గ్రాములుప్రయోజనాలు..గోంద్ దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలను శక్తిమంతం చేస్తుంది. చల్లటి వాతావరణంలో దేహానికి తగినంత వెచ్చదనాన్నిస్తుంది. గింజల నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, దేహానికి అవసరమైన మైక్రో న్యూట్రియెంట్స్ అందుతాయి.బెల్లంలో ఐరన్, జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంటుంది. కొబ్బరి తురుములో ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉంటుంది. ఖర్జూరాలు, రైజిన్స్లోని యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ఉండటంతోపాటు అవి శక్తినిస్తాయి. (చదవండి: భారతదేశపు తొలి స్టంట్ విమెన్..ధైర్యానికి కేరాఫ్ అడ్రస్..!) -
సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ : నోరూరించేలా, ఈజీగా ఇలా ట్రై చేయండి!
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ మకర సంక్రాంతిని సంబరంగా జరుపుకుంటాం. ఏడాదిలో తొలి పండుగ కూడా. మరి అలాంటి పండగకి ఘుమఘుమ లాడే పిండి వంటలు లేకపోతే ఎలా? కొత్త అల్లుళ్లు, అత్తారింటి నుంచి ఎంతో ఆశతో పుట్టింటికి వచ్చిన అమ్మాయిలతో సంక్రాంతి అంతా సరదా సరదాగా గడుస్తుంది. ఈ సంబరాల సంక్రాంతికోసం కొన్ని స్పెషల్ స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ పొంగల్, బూందీ లడ్డూని సులభంగా తయారుచేసే రెసిపీ గురించి తెలుసుకుందాం.సంక్రాంతి అనగానే ముందుగానే గుర్తొచ్చే స్వీట్ పొంగల్. కొత్త బియ్యం, నెయ్యి, బెల్లంతో పొంగల్ తయారు చేసిన బంధు మిత్రులకు పంచి పెడతారు.స్వీట్ పొంగల్స్వీట్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు : బియ్యం - ఒక కప్పు, పెసరపప్పు లేదా శనగపప్పు-అరకప్పు, పాలు - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, ఏలకులు - 4, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు కొద్దిగా, నెయ్యి-అరకప్పు.తయారీమొదటపెసరపప్పును నేతిలో దోరగా వేయించుకోవాలి. తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. కుక్కర్లో కడిగిన బియ్యం, వేయించిన పప్పు రెండింటినీ వేసుకోవాలి. అందులో సరిపడా నీరు పోసి మూతపెట్టాలి. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చేదాకా బెల్లాన్ని సన్నగా తరిగిఉంచుకోవాలి. యాలకుల పొడి చేసుకోవాలి. కొబ్బరిని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్షల్ని నేతిలో వేయించుకోవాలి. కుక్కర్ మూత వచ్చాక, ఉడికిన అన్నం, పప్పులో మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఒక కప్పు పాలు, బెల్లం నీళ్లు పోసి బాగా కలపాలి. సన్నని మంటమీద ఉడకనివ్వాలి. ఇందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసి కలపి మరో పది నిమిషాలు ఉడికిస్తే చాలు. తరువాత నేతిలో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ స్వీట్ పొంగల్ రెడీ.బూందీ లడ్డు కావలసిన పదార్థాలు: శనగ పిండి - 1 కేజీ, నీరు - తగినంత. నూనె - వేయించడానికి సరిపడాపాకం కోసం: బెల్లం - 1కేజీ,కొద్దిగా నీళ్లు, యాలకుల పొడి - 1 టీస్పూన్, నిమ్మరసం - నాలుగు చుక్కలు, జీడిపప్పు ఎండు ద్రాక్ష, చిటికెడు పచ్చకర్పూరం తయారీ విధానం : ముందుగా శనగపిండిని జల్లించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని జల్లించిన శనగపిండి వేసుకుని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా , మృదువుగా ఉండేలా జారుడుగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి మూకుడు పెట్టి, సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక, బూందీ గరిటె సాయంతో ముందుగానే కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేయాలి. సన్నగా ముత్యాల్లా బూందీ నూనెలో పడుతుంది. పిండిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో బూందీ గరిటెలో వేయకూడదు. ఇలా చేస్తే పిండి ముద్దలు ముద్దలుగా పడుతుంది. కొద్దికొద్దిగా వేసుకుంటూ సన్న మంటమీద బూందీ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మొత్తం బూందీనీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం తయారీఒక కడాయిలో బెల్లం,నీళ్లు పోసి మరిగించాలి. బెల్లం కరిగి కాస్త పాకం వచ్చాక యాలకులు, పచ్చ కర్పూరం వేసి కలపాలి. తీగ పాక వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే పాకం గట్టిపడకుండా ఉంటుంది. పాకం వచ్చాక జీడిపప్పులు,కిస్మిస్తోపాటు ముందుగా రెడీ చేసుకున్న వేడి వేడి బూందీలను పాకంలో వేసి బాగా కలపండి. కాస్త వేడి వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా ఉండలుగా చేసుకోవాలి. అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్నలాంటి బూందీ లడ్డు రెడీ! -
తిరుమల లడ్డూపై సీబీఐ సిట్ విచారణ
-
Diwali 2024 మోతీ చూర్ లడ్డూ .. ఈజీగా ఇలా చేసేయ్యండి!
ఉగాది, వినాయక చవితి, దీపావళి.. ఇలా పండుగలకు మాత్రమేనా, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెళ్లిళ్లు ఇలా ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది మోతీ చూర్ లడ్డూ. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే మోతిచూర్ లడ్డూ (Motichoor laddu) స్వీట్లలో ప్రధానమైంది అనడంలో సందేహమే లేదు. మరి ఈ దీపావళికి ఈజీగా , టేస్టీగా ఈ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!మోతీ చూర్ లడ్డూ పేరు వెనుక రహస్యంహిందీ లో, 'మోతీ' అంటే ముత్యం అని అర్థం. 'చూర్ లేదా చుర్' అంటే చూర్ణం అని. అంటే శనగపిండి ముత్యాలు (బూందీ) తినేటపుడు మృదువుగా వెన్నలా కరిగిపోయేలా ఉండే లడ్డూ అన్నమాట.సాధారణంగా స్వీట్స్ షాపుల్లో కృత్రిమ రంగుల్లో మోతీచూర్ లడ్డూలు దర్శనమిస్తాయి .కృత్రిమ రంగులతో ఎరుపు లేదా నారింజ, ఆకుపచ్చ రంగులతో తయారు చేస్తారు. మనం కృత్రిమ రంగులను వాడకుండా ఉండటం మంచిది. రంగుకోసం కుంకుమపువ్వును, వాసన కోసం తినే కర్పూరాన్ని వాడుకోవచ్చు.మోతిచూర్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు:రెండు కప్పుల సెనగపిండి రెండు కప్పుల పంచదారయాలకుల పొడి, బాదం ,పిస్తా, జీడిపప్పు,కిస్మిస్ బూందీ తయారీకి నూనె, కొద్దిగా నెయ్యి,కర్పూరం పొడితయారీ: ఒక గిన్నెలో రెండు కప్పుల సెనగపిండి తీసుకోవాలి. బాగా జల్లించుకుని ఉండలు లేకుండా పిండిని బాగా జారుగా కలుపుకోవాలి. పిండిన పైకి తీసినపుడు గరిటె నుంచి చుక్కలుగా పడేలా ఉండాలి. మంచి రంగు కావాలనుకున్నవాళ్లు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును నానబెట్టి కలుపుకోని పక్కన పెట్టుకోవాలి.పంచదార పాకంఇపుడు మందపాటి గిన్నెలో రెండు కప్పుల పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి పాకం తయారుచేసుకోవాలి. ఈ పాకంలో కొద్దిగా యాలకుల పొడిని,కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. అలాగే పంచదార మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ , కొద్దిగా నిమ్మరసం పిండాలి. చివర్లో కర్పూరం పొడి వేసి పాకం వచ్చాక దింపి పక్కన పెట్టుకోవాలి.బూందీ తయారీస్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి వేడెక్క నివ్వాలి. ఈ నూనెలో నెయ్యి వేస్తే బూందీలకు టేస్టీ ఫ్లేవర్ వస్తుంది. ఈ నూనెలో జారుగా కలుపుకున్న శనగపిండితో,బూందీ గొట్టంతోగానీ, అబకతో గానీ బూందీలా నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఈ బూందీలోని నూనె పీల్చేలా కాసేపు పేపర్ నాప్కిన్పై ఉంచాలి.తరువాత ఈ బూందీ మిశ్రమాన్ని తయారు చేసుకున్న పాకంలో వేసి కలుపుకోవాలి. ఇందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ పిస్తా, మూడు చెంచాల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన పైజులో లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకునే మోతిచూర్ లడ్డూ రెడీ నోట్ : మోతీచూర్ లడ్డూ అనేది అన్ని వయసుల వారు ఇష్టపడే రుచికరమైన వంటకం. అయితే ఈ స్వీట్లో చాలా నూనె పంచదార ఉంటుంది కాబట్టి, షుగర్ వ్యాధి గ్రస్తులు, కొంచెం మితంగా తిన తినండి ,రుచిని ఆస్వాదించండి. -
మోదీకి ఛక్–ఛక్ లడ్డూ, కొరొవాయ్ కేక్.. రష్యా స్పెషల్!
కజాన్: బ్రిక్ శిఖరాగ్ర సదస్సులో వాడీవేడీ చర్చల కోసం రష్యాలోని కజాన్ నగరంలో ల్యాండయిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఛక్–ఛక్ లడ్డూలు, కొరొవాయ్ కేకులు స్వాగతం పలికాయి. ఈ కొత్తరకం పేర్ల వంటకాలను చూసి నెటిజన్లు ఆన్లైన్లో వీటి ప్రత్యేకత గురించి తెగ వెతికేస్తున్నారు. ప్రధాని మోదీకి రష్యా స్థానిక మైనారిటీలైన టాటర్ మహిళలు తమ సంప్రదాయ వేషధారణ, వంటకాలతో స్వాగతం పలికారు. ఇందులో ప్రధానంగా ఛక్–ఛక్ లడ్డూ, కొరొవాయ్ కేకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వంటకాల్లో రష్యా సంప్రదాయ, చారిత్రక విశిష్టత దాగి ఉంది. కజాన్ నగరం ఉన్న టాటర్, బష్కిర్ ప్రాంతాల ఆహార, ఆతిథ్య సంప్రదాయాలు వీటిలో సమ్మిళితమై ఉన్నాయి. ఏమిటీ ఛక్–ఛక్ లడ్డూ? ఛక్–ఛక్ లడ్డూను ప్రధానంగా గోధుమ పిండితో తయారుచేస్తారు. గోధుమపిండితో చపాతీలు చేసి పెనంపై కాల్చకుండా సన్నగా నిలువుగా, అడ్డంగా చిన్నచిన్న చతురస్రాకారపు గడుల్లా కత్తిరించుకోవాలి. తర్వాత వీటిని నూనెలో బంగారం రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత బెల్లం లేదా చక్కెర పాకం తయారుచేసి అందులో కలుపుకుని గట్టిపడ్డాక లడ్డూలాగా గుండ్రంగా చేసుకోవాలి. అంతే ఛక్–ఛక్ లడ్డూ తయార్. ఛక్–ఛక్ లడ్డూ అంటే ఇక్కడి ప్రాంతవాసులకు ఎంతో ఇష్టం. దీన్ని రుచిచూడటానికి ఇవ్వగానే మోదీ ఒకింత ఆశ్చర్యపోయారు. ఇది భారత్‌లో తయారుచేసే వంటకంలా ఉందని వ్యాఖ్యానించారు. బిహార్ వంటకం ముర్హీ కా లాయ్, పశ్చిమబెంగాల్ వంటకం మురీర్ మోవా, ఒడిశా వంటకం మువాలా ఉందని సరదాగా అన్నారు. ఛక్–ఛక్ లడ్డూ మూలాలు టాటర్స్థాన్, బష్కోర్టోస్థాన్లలో ఉన్నాయని స్థానికులు చెబతున్నారు. టాటర్‌స్థాన్‌లో ఇది జాతీయ మిఠాయిగా ప్రఖ్యాతిగాంచింది. కొరొవాయ్ కథాకమామిషు.. మోదీ రుచిచూసిన మరో తీపి పదార్థం కొరొవాయ్ కేకు. బేకరీ వంటకమైన ఈ కొరొవాయ్ కేకు అక్కడ ప్రతి పెళ్లి వేడుకల్లో తప్పకుండా ఉండాల్సిందే. అతిథులకు వడ్డించడం కోసమే ప్రత్యేకంగా దీనిని సిద్దంచేస్తారు. తూర్పు స్లావిక్ ప్రాంతవాసులు ఈ బ్రెడ్ కేక్‌ను తయారుచేసేవాళ్లు. అదే ఇప్పుడు సంప్రదాయంగా వస్తోంది. స్లావ్ ప్రాంత ప్రజలు సూర్యుడిని పూజించేవాళ్లు. వృత్తాకార సూర్యుడికి గుర్తుగా ఈ కేకును గుండ్రంగానే తయారుచేస్తారు.చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి.. అన్నివిధాలా సహకరిస్తాం: మోదీపెళ్లయిన జంట భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ పెళ్లిలో అందరికీ పంచిపెడతారు. కొన్ని సార్లు కేకు పిండి ముద్దలను పొడవుగా జడపాయల్లా అల్లి తర్వాత గుండ్రంగా చుట్టి బేక్ చేస్తారు. పూర్వం ఈ కేకులో ఉప్పు కాస్తంత ఎక్కువ వేసేవాళ్లు. ఉప్పు అతిథులతో బంధాన్ని మరింత బలపరుస్తుందని వారి నమ్మకం. బ్రిక్ సదస్సులో మాత్రం అతిథులకు దీనికి తోడుగా తేనెను అందిస్తున్నట్లు తెలుస్తోంది. -
పవన్ కళ్యాణ్ తిక్క కుదిరింది తిరుమల లడ్డుపై కోర్టు నోటీసులు..
-
పవన్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు
సాక్షి,హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సాంకేతిక ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు పవన్ వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ రామారావు కోరారు. పవన్‌తో పాటు తెలంగాణ సీఎస్‌కూ, హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పవన్ వ్యాఖ్యలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు పవన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. -
ఈ సీజన్లో స్పెషల్ లడ్డూ : రోజుకొకటి తింటే లాభాలెన్నో!
పురాతన ఆయుర్వేద కాలం నుండి, నువ్వులకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటిని ఏదో విధంగా రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో శరీరానికి వేడిని అందిస్తాయి. అలాగే బెల్లంతో కలిపి చేసిన నువ్వుల లడ్డూలను పిల్లలకు తినిపిస్తే బోలెడన్ని పోషకాలు లభిస్తాయి. నువ్వులు, నువ్వుల లడ్డూ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నువ్వులను అనేక రకాలుగా వంటకాల్లో వాడతారు. నువ్వుల పొడి, నువ్వుల కారంతోపాటు నువ్వులతో తీపి వంటకాలను చేస్తారు. ముఖ్యంగా బెల్లం, నువ్వులను కలిపి తయారు చేసిన లడ్డూలు మంచి రుచిగా ఉండటమేకాదు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.వీటిల్లో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. నువ్వులలోని మెగ్నీషియం సుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టు నాణ్యతను మెరుగుపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి ఇవి సహాయపడతాయి. ఇందులోని జింక్ , సెలీనియం వంటి ఖనిజాలతో అకాల వృద్ధాప్యాన్ని నివారించవచ్చు. నువ్వుల్లో కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. చిన్నారులు, గర్భిణీలకు ఎంతో పోషణ లభిస్తుంది. నువ్వుల్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది . రక్తహీనత ఉన్నవారికి ఇవి మేలు చేస్తాయి.ఇన్ఫెక్షన్ల నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మహిళలకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పులకు మంచి పరిష్కారం. నువ్వుల గింజలలో లిగ్నాన్స్, విటమిన్ ఇ, ఇతర యాంటీఆక్సిడెంట్లు రక్తప్రసరణను సులభం చేస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.నువ్వుల గింజలలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి, ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ లాగా పనిచేసే మొక్కల ఆధారిత సమ్మేళనాలు. ఇవి హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, సాధారణ ఋతు చక్రానికి మద్దతు ఇస్తాయి. అందుకే రజస్వల అయినపుడు ఆడపిల్లలకు నువ్వుల చిమ్నీ తినిపిస్తారు.నువ్వుల లడ్డూ తయారీకావాల్సిన పదార్థాలు: ఆర్గానికి బెల్లం, నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి. వేరు శనగ పప్పు. కావాలంటే జీడిపప్పు, బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు. తయారీముందుగా ఓ కడాయిలో నువ్వులను దోరగా వేయించాలి. చిటపడ లాడుతూ కమ్మటి వాసన వస్తాయి. అపుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో వేరు శనగ పప్పులను కూడా వేయించి ముక్కా చెక్కలాగ మిక్సీ పట్టాలి. ఇప్పుడు బెల్లాన్ని సన్నగా తరిగి, పాకం పట్టుకోవాలి. ఇది పాకం వచ్చాక నువ్వులు, మిక్సీ పట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇందులోనే యాలకుల పొడి, నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్య రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి మీదే వీటిని ఉండలు చుట్టుకోవచ్చు. లేదంటే అచ్చుల్లాగా కట్ చేసుకోవచ్చు.నువ్వులను ఇలా పలురకాలుగా నువ్వులు రెండు రకాలుగా లభిస్తాయి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. తెల్ల, నల్ల నువ్వులను వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. నువ్వుల తైలంతో శరీరానికి మర్ధన చేస్తే మంచిదని చెబుతారు. అయితే నల్ల నువ్వులను మాత్రం పూజాది కార్యక్రమాలకు వాడతారు. అలాగే శనిదోష నివారణకు నల్ల నువ్వులను దానం చేస్తారు. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిదని భావిస్తారు. -
విజయవాడ లడ్డు ఇష్యూ.. మల్లాది విష్ణు స్ట్రాంగ్ రియాక్షన్
-
హిందూ సమాజంలో బాబు నేరస్తుడయ్యాడు: భూమన
తిరుపతి, సాక్షి : టీటీడీ లడ్డూపై ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా, సీఎం చంద్రబాబు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. ఎల్లో మీడియాలో వచ్చిన కధనంపై స్పందిస్తూ మాట్లాడిన భూమన.. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం ప్రధానిని కలుస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు తిరుపతి లడ్డూ ఇస్తూ.. ‘ఇది కల్తీ లడ్డూ కాదు సార్. ఇది సిసలైన స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసింది’ అని చెబితే.. ‘బాబు చమత్కారానికి మోదీగారు విరగబడి నవ్వారట’..అని చెప్పారు. దీని వల్ల చంద్రబాబు దుర్భుద్ధి మరోసారి బట్టబయలైందని ఆయన వెల్లడించారు.తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరపనున్న నేపథ్యంలో, ప్రధాని మోదీతో పాటు, సీబీఐని ప్రభావితం చేసేలా చంద్రబాబు మాట్లాడారని, సిట్ నివేదిక తనకు అనుకూలంగా తెచ్చుకునేలా ఆయన కుట్ర చేశారని, అందుకే లౌక్యంగా ప్రధానిని వాడుకున్నారని భూమన ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు అదేపనిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో తిరుమల వైభవంలో ఎక్కడా తప్పు జరగలేదని, ఆ వైభవానికి భంగం వాటిల్లలేదని తేల్చి చెప్పారు. దీనిపై పీఠాధిపతులతో చర్చకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన, చంద్రబాబుకు దమ్ముంటే తన సవాల్‌కు స్పందించాలని కోరారు. లడ్డూ స్వీకరించిన సమయంలో ప్రధాని నవ్విన నవ్వుకు శతవిధాల అర్థాలుంటాయన్న భూమన, సర్వోన్నత న్యాయస్థానం లడ్డూ వివాదంపై మాట్లాడకూడదన్నా, సీఎం ప్రధాని వద్ద ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. అసలు నివేదిక రాకుండా, ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండానే, విచారణ జరగకుండానే, బాబు ఎలా మాట్లాడుతారని నిలదీశారు. లడ్డూ ఇస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మోదీ ఆయనను మందలించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి లడ్డూపై తప్పుడు ప్రకటన చేయడమే కాకుండా దేశ ప్రధానిని కూడా తప్పు దారి పట్టించేలా చంద్రబాబు వ్యవహారం ఉందని భూమన ఆక్షేపించారు. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు మాట్లాడింది తప్పు అని దేశమంతటా ధర్మ ఘోష చేస్తే, ప్రధాని ముందు భక్తుల మనోభావాలు అపహాస్యం చేసేలా ఆయన వ్యవహరించారని గుర్తు చేశారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి అదే పనిగా ప్రయత్నించడంలో భాగమే ప్రధాని వద్ద సీఎం వ్యాఖ్యాలని అభివర్ణించారు. ఏదేమైనా సిట్ విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న టీటీడీ మాజీ ఛైర్మన్, గత ప్రభుత్వ హయాంలో తాను కానీ, తన కంటే ముందు ఛైర్మన్‌గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి కానీ ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ‘రాజీవనేత్రుని వద్ద తప్పులు చేస్తే తట్టుకోవడం ఎవరికీ సాథ్యం కాదు. స్వామి భక్తుడినని చెప్పుకునే చంద్రబాబు శ్రీవారి లడ్డూపై ఆరోపణలు చేయడం, స్వార్థ రాజకీయం కోసం దాన్ని పదే పదే వాడుకోవడం సమంజసం కాదు. ప్రాణం కాపాడిన పరామాత్మడితో బాబు పరాచికాలు ఆడితే ఆ పైశాచిక చేష్టకు ఫలితం ఎలా ఉంటుందో ఆ దేవదేవుడే నిర్ణయిస్తాడు. లడ్డూ కల్తీ ఆరోపణలు తీవ్రమైన నేరం. హిందూ సమాజంలో దృష్టిలో చంద్రబాబు ఓ నేరస్తుడిగా మిగిలిపోతారు’ అని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఆంధ్రా అంతా ఈవీఎంల ట్యాంపరింగ్: విజయసాయిరెడ్డి -
నవరాత్రి ప్రసాదాలు: పచ్చికొబ్బరితో లడ్డు
దసరా నవరాత్రులు మొదలయ్యాయి. అమ్మవారికి ప్రసాదాలు చేయాలి. ఆ ప్రసాదాలను పిల్లలు ఇష్టంగా తినాలి. పొంగలి... పులిహోరకు తోడు ఇంకేం చేద్దాం. పచ్చికొబ్బరితో లడ్డు... మూంగ్‌దాల్ కోకోనట్ ఖీర్ ట్రై చేద్దాం. మూంగ్‌దాల్ కోకోనట్ ఖీర్ కావలసినవి: పెసరపప్పు – అరకప్పు; నీరు – ఒకటిన్నర కప్పు; కొబ్బరిపాలు – ముప్పావు కప్పు (కొబ్బరి పాలు వీలుకాక΄ోతే గేదెపాలు లేదా ఆవుపాలు); బెల్లం పొడి– ముప్పావు కప్పు; యాలకుల పొడి – అర టీ స్పూన్; జీడిపప్పు – పది; కిస్మిస్ – పది ; ఎండుకొబ్బరి పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; వెన్న తీయనిపాలు – అరలీటరు (పావు వంతుకు ఇంకే వరకు మరిగించాలి).తయారీ: ∙మందపాటి పెనం వేడి చేసి అందులో పెసరపప్పు వేసి మంట తగ్గించి పచ్చివాసనపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. వేడి తగ్గిన తరవాత పప్పును కడిగి నీటిని ΄ోసి ప్రెషర్ కుకర్‌లో రెండు – మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ∙ఈ లోపు బెల్లం పొడిని ఒక పాత్రలో వేసి నాలుగు టేబుల్ స్పూన్ల నీటిని పోసి మరిగించాలి. చిక్కబడేటప్పుడు దించి పక్కన పెట్టాలి ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిన్, ఎండుకొబ్బరి పలుకులను వేయించి పక్కన పెట్టాలి ∙ప్రెషర్ కుకర్ వేడి తగ్గిన తర్వాత మూత తీసి పెసరపప్పును మెదపాలి. అందులో కొబ్బరిపాలు కలిపి స్టవ్ మీద పెట్టి ఒక చిన్న మంట మీద ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం పాకం, యాలకుల పొడి కలిపి ఉడికించాలి. ఇప్పుడు చిక్కటి పాలను కూడా పోసి కలిపితే పెసరపప్పు పాయసం రెడీ. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఎండుకొబ్బరి పలుకులను నేతితో సహా వేసి కలపాలి. గమనిక: నీటి కొలత ప్రెషర్ కుకర్‌లో ఉడికించడానికి మాత్రమే. పాత్రను నేరుగా స్టవ్ మీద పెట్టి ఉడికిస్తే కనీసం మూడు కప్పుల నీరు అవసరమవుతుంది. కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము – 2 కప్పులు; యాలకుల పొడి– పావు టీ స్పూన్ ; జీడిపప్పు – 10; నెయ్యి– టీ స్పూన్; చక్కెర – ముప్పావు కప్పు (రుచిని బట్టి మోతాదు మార్చుకోవాలి); పాలు – కప్పు. పచ్చికొబ్బరితో లడ్డు..తయారీ: ∙ఒక పెనంలో నెయ్యి వేడి చేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాలి ∙అదే పెనంలో కొబ్బరి తురుము,పాలు, చక్కెర, యాలకుల పొడి వేసి మరిగించాలి ∙మిశ్రమం అడుగుకు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు తరచుగా కలుపుతూ ఉండాలి పాలు, చక్కెరలను కొబ్బరి తురుము పూర్తిగా పీల్చుకుని తేమ ఇంకిన తర్వాత స్టవ్ ఆపేయాలి ∙మిశ్రమం వేడి తగ్గి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో జీడిపప్పు వేసి కలిపి మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత సైజులో చేతుల్లోకి తీసుకుని లడ్డూలు చేయాలి. గమనిక : చక్కెర బదులు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చక్కెరతో చేస్తే చూడడానికి తెల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలకు చక్కెర తింటే జలుబు చేసేటట్లయితే బెల్లంతో చేసుకోవచ్చు. -
YS Jagan: బాబు దేవునితో రాజకీయం చేస్తున్నావ్
-
సుబ్రమణ్య స్వామి Vs ఏపీ.
-
ఈ పాపం చంద్రబాబుకు మాత్రమే పరిమితం అవ్వాలి
-
దేవునితో బాబు ఆటలాడుతున్నాడు ఇది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే!
-
Tirupati Laddu Row: పరువు మొత్తం పోయే
-
తిరుపతిలో గొప్ప వ్యవస్థ ఉంది.. మళ్ళీ గుర్తుచేస్తున్న ఇది టీటీడీ ప్రొసీజర్
-
లడ్డూ వివాదంపై సంచలన ట్వీట్..
-
తిరుమల లడ్డూ కేసు:.. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేడు(శుక్రవారం) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది.తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈరోజు విచారణప్రారంభమైన అనంతరం కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జర్నల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేంద్ర అధికారిని ఏర్పాటు చేస్తే మంచిదని, లడ్డూ వ్యవహారంపై ఆరోపణలు నిజమైతే హర్షించదగనిది.. ఈ కేసు విచారణకు సిట్ ఒక్కటే సరిపోదు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలి. సెంట్రల్ నుంచి సూపర్ విజన్ ఉండాలి’’ అని తుషార్ మెహతా తెలిపారు.ఈ కేసు సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు?: సుప్రీంతిరుమల లడ్డూ వివాదంపై కేసును సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘ఈ అంశంపై పొలిటికల్ డ్రామా జరగొద్దనుకుంటున్నాం. సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు.కల్తీ జరిగిందని మీరు ఊహించుకుంటున్నారా? కల్తీ నెయ్యి కేసు సీబీఐకి ఎందుకు దర్యాప్తు చేపట్టకూడదు’ అని ప్రశ్నించింది.స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టుస్వతంత్ర దర్యాప్తు ఉంటే మంచిది.సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు ఉండొచ్చు కదా. రాజకీయంగా లడ్డూపై వ్యాఖ్యలు చేయొద్దు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు. స్వంతంత్ర సిట్ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు. లడ్డూ కల్తీ జరిగితే చాలా తీవ్రమైన అంశం’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు. స్వంతంత్ర సిట్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. సిట్ సభ్యులుగా ఇద్దురు సీబీఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, FSSAI(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ఇండియా) నుంచి ఒకరు దర్యాప్తు చేపట్టనున్నారు.కాగా సెప్టెంబరు 30న ఈ కేసును విచారించిన సుప్రీం.. సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలా అనే విషయంలో తమకు సహకరించాలని మెహతాను కోరిన విషయం తెలిసిందే. నెయ్యి కల్తీ పై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించారని గత విచారణలో వ్యాఖ్యానించింది. కల్తీ అంశంపై వాస్తవాలు నిర్ధారణ కోసం సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మీడియా ముందుకు వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి. జూలైలో రిపోర్టు వస్తే .. సెప్టెంబర్‌లో మీడియాకు ఎందుకు చెప్పారు ?.సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరస్కరించిన నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా?కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా ?. సిట్ వేసిన తర్వాత మళ్లీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారు’ అంటూ ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీటీడీ తరుఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా నీళ్లు నమిలారు. -
తిరుమలకు చంద్రబాబు కళంకం తెచ్చారు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం పవిత్రమైన తిరుమలకు కళంకం తెచ్చారని హైందవ, పౌర సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ జరిగిందంటూ నిందలు మోపిన చంద్రబాబు తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో తిరుమల లడ్డూ వివాదంపై ఆచార్య రామానుజ సమితి రూపొందించిన సత్యశోధన నివేదిక విడుదల చేశారు. నెయ్యి కల్తీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్ పైనే అనుమానాలు ఉన్నాయని ఈ నివేదికలో తేల్చారు. ఎంతో కీలకమైన ఈ అంశంలో నెయ్యి శాంపిల్స్ ఒకే ల్యాబ్‌కు పంపడం, పంపే ముందు టీటీడీ ఈవో ఎన్డీడీబీ ప్రతినిధులతో సమావేశం కావడం అనుమానాలకు తావిస్తోందని నివేదికలో పేర్కొన్నారు. ఎవరూ చేయనంత అపచారమిదిఈ సందర్భంగా ఆచార్య రామానుజ సంక్షేమ సమితి చైర్మన్ డీఎస్ఎన్వీ ప్రసాదబాబు మాట్లాడుతూ.. తిరుమల చరిత్రలో ఎవరూ చేయనంత అపచారం సీఎం చంద్రబాబు చేశారన్నారు. శ్రీవారి ప్రసాదానికి కళంకం ఆపాదించారని మండిపడ్డారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఈవో శ్యామలరావును దుష్ట్రతయంగా అభివర్ణించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఆ వివాదంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల పరువు మంటగలిపారుగీతా విజన్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పొక్కులూరి సుబ్బారావు మాట్లాడుతూ.. తమ అధ్యయనంలో నెయ్యి శాంపిల్స్‌లో జంతువుల కొవ్వు కలిసినట్టు ఆధారాలు లభించలేదన్నారు. ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీం పవన్‌కళ్యాణ్ ఆరోపణలు చేసి తిరుమల పరువు మంటగలిపారని మండిపడ్డారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు క్షుద్ర రాజకీయాలను చూసి క్షుద్ర దేవతలు కూడా సిగ్గుపడతారన్నారు.లడ్డూ వివాదంలో చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారని, ఫలితంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన పాలనలో పగ ప్రతీకారాలకే ప్రాధాన్యమిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతో తన ప్రతి వైఫల్యాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లడ్డూ విషయంలో చంద్రబాబు, ఈవో శ్యామలరావు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి అడ్డంగా దొరికిపోయారన్నారు. సుప్రీం వ్యాఖ్యలు చెప్పు దెబ్బలాంటివిఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ బి.ఆశోక్‌కుమార్ మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు, పవన్, ఈవో శ్యామలరావుకు చెప్పు దెబ్బలాంటివన్నారు. నీతి, నిజాయితీ ఉన్న నాయకులు ఎవరైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు రాజీనామా చేసి ఉండేవారన్నారు. పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఓవరాక్షన్ చేస్తున్నారని, దాని కారణంగా సనాతన ధర్మం నవ్వుల పాలవుతోందని ఎద్దేవా చేశారు. సత్యశోధన నివేదికను పరిశీలిస్తే లడ్డూ ప్రసాదం విషయంలో కుట్రకోణం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో సామాజిక కార్యకర్త వంగ శోభన్‌బాబు పాల్గొన్నారు. -
పవన్ అసలు రంగు బట్టబయలైంది
ఇకనైనా దేవుడిని రాజకీయాల్లోకి లాగకండితిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. ల్యాబ్ రిపోర్టులో అస్పష్టత ఉంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు రుజువు లేకుండా మీడియా ముందు ఎందుకు హడావుడి చేశారంటూ నిలదీసింది. జూలైలో రిపోర్టు వెలువడితే ఇప్పుడెందుకు బయటపెట్టారంటూ ప్రశ్నించింది. ఇకనైనా మీరు దేవుణ్ని రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్ ఆస్కింగ్. – ప్రకాశ్‌రాజ్, ప్రముఖ నటుడుదేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి 🙏🏿🙏🏿🙏🏿జస్ట్ ఆస్కింగ్. #justasking #justpleading pic.twitter.com/kLjnnJRuun— Prakash Raj (@prakashraaj) September 30, 2024 సుప్రీంకోర్టు చంద్రబాబు చెంపలు వాయించింది తిరుమల లడ్డూ అంశంపై సరైన ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీం కోర్టు చంద్రబాబు చెంపలు వాయించింది – సుబ్రమణియన్‌స్వామి, మాజీ ఎంపీ Tirupati Laddu controversy: Supreme Court slams CM Naidu, says no conclusive proof yet. Test report was on rejected ghee https://t.co/3ZHuifcdWN via @PGurus1— Subramanian Swamy (@Swamy39) September 30, 2024బాబు, పవన్ రాజీనామా చేయాలిచంద్రబాబు, పవన్ ఇద్దరూ వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి హిందువులను మోసం చేశారు. తిరుమల దేవస్థానంపై విశ్వాసాన్ని దెబ్బ తీసినందుకు వీరే బాధ్యత వహించాలి. హిందువులను మోసం చేసినందుకు, అబద్ధాలు ఆడినందుకు పశ్చాత్తాప్పడి పదవులకు రాజీనామా చేయాలి. -పీవీఎస్ శర్మ, ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారిSC has put the ball in Central govt court whether to continue SIT investigation or with other agencies.One more issue by which Modi govt will control @ncbn in addition to #SkillDevelopmentScam We have to wait & see how both CM and Dy CM will dance to BJP tunes in Delhi.— PVS Sarma (@pvssarma) September 30, 2024From day one, since #TTDprasadam controversy erupted, I was convinced that only non-believers & dirty minds would play with devotees sentiments.I was not wrong.CM @ncbn & Dy CM @PawanKalyan raised the issue without any proof or evidence& hurt sentiments.#Thoo#CheeChee— PVS Sarma (@pvssarma) September 30, 2024భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం తిరుపతి లడ్డూ వ్యవహారం భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం. నివేదికలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి. ఒక ఆహార పదార్థంలో 14 రకాల కల్తీలు చేయవచ్చా? ఇక మతవాదులకు చెప్పడానికి ఏముంది! – ధన్య రాజేంద్రన్ (ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ చీఫ్)Tirupati laddu row: How politics is shaping the conflictWas adulterated ghee actually used in srivari laddu?Should devotees really be worried about their faith being defiled?@PoojaPrasanna4 tells you all about this and more in this week's Let Me Explain. Watch the full… pic.twitter.com/6RoAAsw0P8— TheNewsMinute (@thenewsminute) September 27, 2024 దేవుళ్లను రాజకీయాలకు దూరంగా పెట్టండి కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి – పూనమ్‌కౌర్, నటి "At least the Gods should be kept away from politics"- SUPREME COURT 🙏— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 30, 2024బాబు, పవన్‌ను చూస్తుంటే సిగ్గేస్తోంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను చూస్తుంటే సిగ్గేస్తోంది. – గబ్బర్, ప్రముఖ మలయాళీ రచయిత బాబు మతపరమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తున్నారు తిరుపతి లడ్డూను అడ్డుపెట్టుకుని మతపరమైన భావోద్వేగాలు ప్రేరేపించేందుకు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని గతంలోనే ‘ఎక్స్’లో చెప్పాను. ఈరోజు సుప్రీంకోర్టు సరిగ్గా అదే చెప్పింది. – శ్రీధర్ రామస్వామి, ఏఐసీసీ సోషల్ మీడియా నేషనల్ కో–ఆర్డినేటర్A few days ago I had posted on the Tirupati Laddu row was instigated by CBN to make it communal and he has a history to that. Today the SC has pulled up CBN for his remarks 👇 https://t.co/jHMeraRveB pic.twitter.com/PLEA4MmXUA— Sridhar Ramaswamy శ్రీధర్ రామస్వామి ✋🇮🇳 (@sridharramswamy) September 30, 2024 పవన్ అసలు రంగు బట్టబయలైంది తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీం వ్యాఖ్యలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు రంగు బట్టబయలైంది. ఇలాంటి కపట అవకాశవాదులకు మద్దతు ఇవ్వకండి – వీణా జైన్ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్) Breaking!🚨Police raid on Sadhguru Isha Foundation, Today only Madras High court raised serious concerns over itThere are multiple allegations on Sadhguru & his foundation. Details of raid yet to come pic.twitter.com/UQrQ1Z289A— Veena Jain (@DrJain21) October 1, 2024దేవాలయాలను రాజకీయాల్లోకి లాగుతారా? ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు రాజకీయాల్లోకి దేవాలయాలను లాగుతారా? ఓట్ల కోసం మన ప్రార్థనా స్థలాలను లాగడం ఎంతవరకు సమంజసం? లడ్డూ విషయంలో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబే అసత్య ప్రచారం చేసి కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం సబబేనా? రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని, బహిరంగంగా ఒకటి, రహస్యంగా మరొకటి.. బీజేపీ ఎందుకు ఆటలాడినట్టు? – ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ రాజ్యసభShame! If such be the case why did the Chief Minister claim otherwise? Will temples now be dragged into the politics of targeting opponents? For a few thousand votes it is okay to drag our places of worship?How is it okay to shake the faith of crores of devotees who believed… pic.twitter.com/DASek9o77h— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 30, 2024బాబు ప్రజలకు క్షమాపణ చెబుతారా! చంద్రబాబూ సిగ్గు సిగ్గు. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెబుతారా! – సుమంత్ రామన్, రాజకీయ విశ్లేషకులు హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారురాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు. వీరిద్దరూ క్షమాపణ చెప్పాలి. పవన్ చాలా గొప్ప నటుడు. ఆయన నటనతో రాజకీయాల్లోనూ రాణించాలనుకుంటే అది పొరపాటే. – డాక్టర్ గిరిజా షేట్కార్, యూనివర్సల్ హెల్త్ రైట్స్ అడ్వొకేట్ఇప్పుడేం చేస్తారు మీరందరూ అబ్బబ్బ.. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం ఎంత రచ్చ చేశారు? భక్తుల మనోభావాల్ని ఎంత హింసించేశారు? రాజకీయ నేతల్ని పక్కన పెడదాం.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఎంత ఓవరాక్షన్ చేశారు వీళ్లంతా. ప్రాయశి్చత్త శ్లోకాలట..! వాళ్లే కనిపెట్టేసి .. రామ రామా.. మీరు చేసింది మామూలు రచ్చనా.. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు మీరంతా! ఇప్పుడు ఏం చేస్తారు మీరందరూ? మీరు నిజంగా వేంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి.. ఎంత మంది పెడతారో చూస్తాను. – వీణావాణి, వేణు స్వామి భార్యవైఎస్ జగన్‌ను దెబ్బతీయడానికి వారు ఆడిన పెద్ద అబద్ధం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా పెద్ద అబద్ధమాడారు. ఇది వారు రాజకీయ స్వార్ధంతో ఆడిన అబద్ధం. చాలా సిగ్గు చేటు. – హర్ష్ తివారి -
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ?.. డిప్యూటీ సీఎం పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు!
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసిన ప్రకాశ్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి' అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. కాగా.. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల లడ్డు విషయంలో దీక్షలు చేస్తానంటూ మీడియా ముందుకొచ్చి మరీ ప్రకటించారు. లడ్డూ ప్రసాదం వివాదం గురించి ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ పలుసార్లు కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం వ్యాఖ్యలతో మరోసారి పవన్‌కు తనదైన శైలిలో చురకలంటించారు.(ఇది చదవండి: 'జస్ట్ ఆస్కింగ్' అంటూ మరోసారి ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్)సోమవారం సుప్రీం కోర్టులో లడ్డు అంశంపై విచారణ జరిగింది. దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా..? అంటూ కోర్టు ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలంటూ హెచ్చరించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై వెంటనే నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు షేర్ చేస్తూ.. 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి' అంటూ పోస్ట్ చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking— Prakash Raj (@prakashraaj) October 1, 2024 -
బొంకిన బాబు నోటికి ‘సుప్రీం’ తాళం!
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి పేరుతోనూ ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య వచనాలు పలికి అపచారం చేశారా? సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని మిడి మిడి జ్ఞానంతో వ్యాఖ్యానించి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరువు పోగొట్టుకున్నారా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఈ విషయం నిర్ధారణ అయినట్లేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాయకత్వం వహిస్తున్న వీరిద్దరూ అపభ్రంశపు వ్యాఖ్యలు చేసి వారి ప్రతిష్టను వారే తీసుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా హిందు భక్తుల ఛీత్కారాలకు గురయ్యే పరిస్థితి తెచ్చుకున్నారా? శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారన్న చంద్రబాబు ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇవన్నీ నిజమేనని స్పష్టమవుతోంది.రాజకీయాల్లో ఉన్నవారు అబద్ధాలు ఆడడం అన్నది పెద్ద విషయం కాకపోవచ్చు. చంద్రబాబు వంటివారు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులూ కావచ్చు. కానీ ఏ నాయకుడైనా దైవాన్ని అడ్డం పెట్టుకొని అసత్యాలు చెప్పడానికి భయపడతాడు. కానీ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల చెంతనే తాను జన్మించానని, ఆయన్ను స్మరించుకోకుండా ఏ పనీ చేయనని చెప్పుకునే అత్యంత సీనియర్ రాజకీయ నేత, చంద్రబాబు ఎంత తప్పు చేశారో చూడండి... తిరుమల లడ్డులో జంతు కొవ్వును కలిపారనే తన వాదనను సమర్థించుకోవడానకి చంద్రబాబు సెప్టెంబర్ 21న ఒక సంచలన వ్యాఖ్య చేశారు.’’వెంకటేశ్వరస్వామే నాతో నిజాలు చెప్పించారు’’ అని చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అది విన్న ప్రతి హిందువు, తిరుమలేశుని భక్తుడు చంద్రబాబు సత్యమే చెబుతున్నారేమో అన్న భ్రమ పడ్డారు. స్వామివారి మీద భక్తి ఉండే ఎవరూ ఇంతటి సాహసం చేయరు.కానీ చంద్రబాబు మాత్రం అంతకు తెగించారు. నిజానికి కొందరు మతోన్మాదులు, పూనకం వచ్చేవారు, జాతరవంటి కార్యక్రమాల్లో భవిష్యవాణి అంటూ తెలిసీ తెలియని మాటలు చెప్పేవారు మాత్రమే తనతో దేవుడే పలికిస్తున్నారని అంటారు. కానీ చంద్రబాబు కూడా వారి తరహాలోనే మాట్లాడారు. వీటిని దృష్టిలో ఉంచుకునే స్వామి వారే సుప్రీంకోర్టు రూపంలో చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేయించారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను, వైఎస్సార్ సీపీ వారిని ఉద్దేశించి ’’తప్పులు, పాపాలు చేసి సిగ్గు లేకుండా బుకాయిస్తారా? ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతోంది’’ అని తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో చంద్రబాబు మాటల దాడి చేశారు. సీన్ కట్ చేస్తే సెప్టెంబర్ 27న మళ్లీ మీడియాతో మాట్లాడుతూ కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు? అనేది అప్రస్తుతం అని ముక్తాయించారు. అంటే దాని అర్థం అప్పటివరకూ తాను ప్రచారం చేసినట్టుగా జంతు కొవ్వుతో కలిసిన నేతితో లడ్డూ తయారు చేశారన్న తన మాటలు తప్పనే కదా. నిజంగానే ఆయన మొదట చెప్పిన అబిప్రాయంతోనే ఉంటే జంతు కొవ్వు వ్యవహారంపై తన వాదనకు కట్టుబడి ఉండాలి. అలా కాకుండా ’’కల్తీ జరిగిన నెయ్యిని ఎక్కడ వాడారనేది అప్రస్తుతం‘ అని చెప్పి తప్పించుకున్నారు. తమిళనాడుకు చెందిన ఏ ఆర్ డెయిరీ మొత్తం 8 ట్యాంకర్ల నెయ్యి పంపితే నాలుగు ట్యాంకర్లు వినియోగించామని మరో నాలుగు ట్యాంకర్ల నేతి శాంపిల్స్ ఎన్డీడీబికి పంపితే ఆ నివేదిక ఆధారంగా వాటిని తిరస్కరించామని అన్నారు. తొలుత వినియోగించిన ట్యాంకర్లలో నేతిలో కల్తీ జరిగిందా అని అడిగితే ఆ తర్వాత నాలుగు ట్యాంకర్లలో జరిగింది కదా అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. తిరుమలలో ఎటువంటి ల్యాబులు లేవని అప్పటివరకూ ప్రచారం చేసిన చంద్రబాబు ఆ తర్వాత కేవలం నాణ్యతా ప్రమాణాలు పరిశీలించే ల్యాబులే ఉన్నాయని, కల్తీ జరిగిందా లేదా అని నిర్దేశించే అడల్ట్రేషన్ ల్యాబులు లేవని చెప్పుకొచ్చారు.ఆపైన ఇంక ఏవేవో మాట్లాడారు. అంతే తప్ప జంతు కొవ్వు నేతిలో కలిసిందన్న తన వ్యాఖ్యను నేరుగా ఉపసంహరించుకోకుండా అలవాటు ప్రకారం మాటమార్చే యత్నం చేశారు. ఇక్కడే ఆయనకు శ్రీ వెంకటేశ్వరస్వామి మీద నిజంగానే భక్తి ఉందా? అనే సందేహం వస్తుంది. దానికి తగినట్లుగానే సుప్రీం కోర్టు సామాన్యులకు వచ్చిన అన్ని సందేహాలను ప్రశ్నల రూపంలో సంధించింది. వాటికి చంద్రబాబు వద్ద సమాధానం లేదు. అందుకే దేవుళ్లను రాజకీయాలలోకి లాగవద్దని న్యాయమూర్తులు ఆయనకు హితవు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్ది రోజుల క్రితం మాట్లాడినప్పుడు, స్వామివారి సాక్షిగా చంద్రబాబు అబద్ధాలాడారని స్పష్టం చేశారు. ఒక వైపు ప్రమాణాలు లేని నేతి ట్యాంకర్లను వెనక్కి పంపామని ఈవో శ్యామలరావు కూడా చెప్పినా, ఒకటికి రెండుసార్లు జంతు కొవ్వు ప్రస్తావన తెచ్చి చంద్రబాబు స్వామివారి పట్ల అపచారం చేశారనేది భక్తుల ఆవేదన. తెలిసో తెలియక ఒక అబద్ధం ఆడితే, పొరపాటున అన్నానని సర్దుకుంటే ఒక మాటతో పోతుంది. అలా కాకుండా మరిన్ని అబద్ధాలు ఆడి తప్పుమీద తప్పు చేయడం సరైనదా? కాదా? అన్నది ఆయనే తేల్చుకోవాలి. అంటే వెంకటేశ్వరస్వామి తనతో నిజాలు చెప్పించారని అన్నారు గానీ, ఇప్పుడవన్నీ అబద్ధాలని తేలడంతో మొదట అసత్యాల్ని దేవుడే పలికించాడా? అన్న ప్రశ్న వస్తే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ఇదేనా ఆయనకు స్వామివారి మీద ఉన్న భక్తి, నమ్మకం? ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు చంద్రబాబును ఎండగట్టింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనడానికి ఆధారాలు ఏవి అని ప్రశ్నించింది. ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కథ మరింత ఆశ్చర్యంగా ఉంటుంది. బీజేపీ వారి మెప్పు కోసమో లేక చంద్రబాబు కన్నా తానే పెద్ద హిందువు అని చెప్పుకోవడానికో, ఏ కారణం వల్లనన్నా కానీ ఆయన కాషాయం దుస్తులు ధరించి మరీ హడావిడీ చేశారు. జరగకూడనిది ఏదో జరిగిందన్నట్టుగా చంద్రబాబు మాదిరే అబద్ధాలాడేశారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదంటూ అదే చర్చిలోనో, మసీదులోనో ఇలా జరిగితే ఊరుకుంటారా ? అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు సోషల్ మీడియా ప్రముఖులుగానీ వైఎస్సార్ సీపీ నేత పేర్నినాని వంటి వారు గానీ అనేక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి పవన్ కల్యాణ్ గాలి తీసేశారు. సనాతన ధర్మమంటే ఏంటో తెలియక పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడేశారు. సనాతన ధర్మం ప్రకారం నాలుగు వర్ణాలుంటాయి. అందులో బ్రాహ్మణులు మొదటిస్థానంలో, క్షత్రియులు రెండో స్థానంలో, వైశ్యులు మూడో స్థానంలో ఉంటారని మను ధర్మం చెబుతుంది. నాలుగో స్థానంలో ఉన్న శూద్రులు పై మూడు వర్ణాలకు విధిగా సేవ చేయాల్సి ఉంటుందట. శూద్రులకు ఆస్తి హక్తు, వేదజ్ఞానం ఉండొద్దట. ఉద్యోగం, వ్యాపారం చేయకూడదట. శూద్ర మహిళల్ని పై మూడు వర్ణాలవారు లైంగికంగా అనుభవించవచ్చట. ఇలా అనేక అశాస్త్రీయమైన అంశాలతో కూడిన సనాతన ధర్మాన్ని పవన్ ఇప్పుడు జనం మీద రుద్దుతారా? పోనీ నిజంగానే ఈయన అచ్చమైన హిందువు అయితే వ్యక్తిగత జీవితంలో అన్ని అధర్మ వ్యవహారాలు చేస్తారా? అని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు అసలు విడాకులు తీసుకోవడమనేది సనాతన ధర్మంలో ఉండనే ఉండదని చెప్పిన వీడియో ఇప్పుడు విస్తారంగా తిరుగుతోంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఎన్నిసార్ల విడాకులు తీసుకున్నది తెలిసిందే కదా. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అయితే నేరుగా ఒక భార్య ఉండగా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం సనాతన ధర్మం అవుతుందా? అని ప్రశ్నించారు. క్రైస్తవ సమావేశంలో తాను బాప్టిజం తీసుకున్నానని, తన భార్య క్రైస్తవురాలని, తన పిల్లలు క్రైస్తవులని చెప్పిన పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తే ఎవరు నమ్ముతారు? జనం చెవిలో పువ్వులు పెట్టడానికి ఇలాంటి వేషాలు వేస్తే సరిపోతుందా? దీక్ష పేరుతో కాషాయ వస్త్రాలు, ఆ వెంటనే షూటింగుల పేరుతో అమ్మాయిలతో డ్యాన్సులు చేయడం ఏ పాటి హిందూ ధర్మం? సనాతన ధర్మం? అని పేర్నినాని ప్రశ్నించారు. తన తండ్రి దీపారాధన జ్యోతితో సిగరెట్ట వెలిగించారని పవన్ కళ్యాణే చెప్పారు. బీఫ్ తింటే మంచిదే అంటారు. అయినా సనాతన ధర్మాన్ని తానే పరిరక్షిస్తా అని అంటారు. చెప్పులేసుకొని దీక్ష చేస్తారు, అంటూ రకరకాల వ్యంగ్య వ్యాఖ్యానాలు సోషల్ మీడయాలో వచ్చాయి. మరి వీటన్నటికీ సమాధానం చెప్పే ధైర్యం, నైతిక ధర్మం పవన్ కల్యాణ్ కు వున్నాయా?సుప్రింకోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబుకు అతి విధేయత ప్రదర్శించబోయి తాను కూడా గబ్బు పట్టినట్లయిందన్న విషయాన్ని పవన్ గుర్తిస్తారో?లేదో? రాజకీయాలకోసం హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూపట్ల అపచారం చేయడమే కాకుండా స్వామివారిని కూడా ఇందులోకి లాగారు. స్వామివారే తనతో మాట్లాడించారంటూ పచ్చి అబద్దాన్ని చంద్రబాబు చెప్పడం పాపమో ?కాదో? ఆయనే తేల్చుకోవాలి.ఆయన పాపంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వాటా ఎంతో అవే తేల్చుకోవాలి. తనది అజ్ఞానమో ?కాదో పవన్ కళ్యాణే నిర్ణయించుకోవాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబును ఉతికారేసిన సుప్రీంకోర్టు
-
అవును అది అబద్ధం.. అసలు నిజం చెప్పిన టీటీడీ లాయర్
-
అధికార మదం తలకెక్కితే.. జస్టిస్ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు
-
బాబు, పవన్ రాజీనామా చేయాలి మాజీ IAS డిమాండ్..
-
సుప్రీంకోర్టు సీరియస్.. రాజీనామా చేసి ఎన్నికలకు సిద్దమేనా..?
-
చంద్రబాబుకు చెంప చెళ్లుమనిపించిన సుప్రీంకోర్టు... రోజా రియాక్షన్
-
రాజీనామా..!? వాళ్ల గోతిలో వాళ్లే పడ్డారు
-
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కొమ్మినేని రియాక్షన్..
-
‘హిందువులను మోసం చేశారు, చంద్రబాబు, పవన్ రాజీనామా చేయాలి’
సాక్షి, తాడేపల్లి: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలని,. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని ఆదేశించింది.తాజాగా లడ్డూ వివాదంపై మాజీ ఐఏఎస్ పీవీఎస్ శర్మ ఘాటుగా స్పందించారు. శ్రీవారి ప్రసాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి హిందువులను మోసం చేశారని మండిపడ్డారు. భక్తుల విశ్వాసాలను దెబ్బేతీసే విధంగా, టీటీడీ దేవస్థానంపై ప్రతికూల అభిప్రాయం ఏర్పరిచేలా ప్రయత్నించినందుకు ఇద్దరు బాధ్యులేనని పేర్కొన్నారు. హిందూవులను తమ అబద్దాలతో, మోసం చేసినందుకు పశ్చాతాపంగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.Both @ncbn & @PawanKalyan have cheated Hindus by making misleading statements on lord Venkateshwara Prasadam.Both are responsible for creating a negative perception on #TTDevasthanams run temple & our faith.As repentance for their lies & cheating Hindus, they should resign.— PVS Sarma (@pvssarma) September 30, 2024 -
కల్తీ జరిగిందని ఆధారం ఉందా?
-
బిగ్ బ్రేకింగ్.. సిట్ వద్దు?
-
దేవుడిపై అబద్దాలా..నువ్వేం సీఎం..! చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
చంద్రబాబు దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా?.. లడ్డూ వివాదంపై వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : సత్యమేవ జయతే అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. లడ్డూ ప్రసాదంపై మాట మార్చిన ఈవో, చంద్రబాబుపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ వీడియోలు పోస్ట్ చేశారు. దీని అర్ధం ఏంటి చంద్రబాబు? దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. దీని అర్థం ఏంటి @ncbn ?దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా?“సత్యమేవ జయతే’’ pic.twitter.com/gQ7R6X6WfE— YS Jagan Mohan Reddy (@ysjagan) September 29, 2024 కాగా, సెప్టెంబర్ 18వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.తిరుమల లడ్డూలో‘యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ కొత్త వివాదానికి తెరలేపారు. ‘‘భక్తులకు పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఉంది, ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రిడియంట్స్ కాకుండా యానిమల్ ఫ్యాట్ కూడా వాడారు’’అని చంద్రబాబు అసత్యాలు వల్లివేశారు.సెప్టెంబర్ 22వ తేదీన చంద్రబాబు మరోసారి మాట్లాడుతూ.. తిరుమలకు నాలుగు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, దానిని వాడారని చంద్రబాబు మళ్లీ అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేశారు.టీటీడీ ఈవో శ్యామలరావు ఆ ట్యాంకర్లను వాడలేదని , వెనక్కి పంపామని చెబితే, ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు.. ఆ నెయ్యి వాడారంటూ అసత్యపు ప్రచారానికి దిగారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా వీడియోలు పోస్ట్ చేసి చంద్రబాబు అసత్యపు ప్రచారాన్ని మరోసారి ఎండగట్టే యత్నం చేశారు.ఇదీ చదవండి: దొరికిపోయిన చంద్రబాబు.. అబద్ధాలు బట్టబయలు -
అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు?: వరుదు కళ్యాణి సూటి ప్రశ్న
సాక్షి, విశాఖపట్నం: శ్రీవారి లడ్డూ విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ డిమాండ్ చేస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఈ వివాదంపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అయితే చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణకు ముందుకు రాలేదని ప్రశ్నించారు.విశాఖలో ఎమ్మెల్యే వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. చేసిన తప్పు బయట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. తిరుమలలో టీటీడీ నిబంధనలు ఉంటాయా, టీడీపీ నిబంధనలు ఉంటాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత సంస్కారం లేకుండా హోం మంత్రి అనితా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను క్రిస్టియన్ అని చెప్పిన అనితా నేడు, హిందువుని అని చెపుతున్నారని తెలిపారు. అనితా తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ తీసుకున్నారా అని ప్రశ్నించారు. చదవండి: బాబు వ్యాఖ్యలు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి: సజ్జలగతంలో సీఎంగా, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తిరుపతికి వెళ్ళారని, అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదని ప్రశ్నించారు. గతంలో ప్రధాని, హోం మంత్రితో, జగన్ తిరుపతి వెళ్లారని.. అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చి, ఇవ్వలేదని అబద్ధం చెపుతున్నారని అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారని, ఆమెకు సొంత వ్యక్తిత్వం లేదని విమర్శించారు. షర్మిల కడుపు మంటతో మాట్లాడుతున్నారని అన్నారు. -
బాబు వ్యాఖ్యలు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి: సజ్జల
సాక్షి, హైదరాబాద్: శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిదంటూ చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. బాబు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టును లీక్ చేశారని మండిపడ్డారు. ఏమీ జరగకుండానే ఏదో జరిగినట్లు ఘోరమైన ఆరోపణలు చేశారని విమర్శించారు.అయితే ప్రభుత్వ ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్లు ఖండించారని, దేనికైనా సిద్దమని చెప్పారని తెలిపారు. అంతేగాక లడ్డూ వివాదంపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారని. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. సోమవారం ఈ కేసు విచారణకు కూడా రానుందని తెలిపారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్ర బాబు ఘోరమైన అబద్ధం ఆడారు. బాబు అన్నట్టుగా జంతువుల కొవ్వు మాట షోకాజ్ నోటీసులో లేవు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ, బుడమేరు బాధితుల అంశాలు పక్కన పెట్టి.. ఇప్పుడు టీడీడీ లడ్డూను తెరపైకి తీసుకువచ్చారు . చలో తిరుపతి అని వైయస్ జగన్ ఏమైనా పిలుపు ఇచ్చారా? ఇష్యూ చేసింది టీడీపీ, ఉద్రిక్తత సృషించారు‘జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనకు అనుమతి లేదని మా నేతలకు ఇచ్చిన నోటీసులలో ఉంది. డిక్లరేషన్ అంశం భక్తుడు, టీటీడీకి సంబంధించిన అంశం. తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి నేతలు పాప పరిహారం చేసుకోవాలి. జగన్ హుందాగా వ్యవహరించారు. మతం వ్యక్తిగతం అన్నది చంద్రబాబుకు తెలియదా? ఇప్పటికే పలు మార్లు జగన్ తిరుమలకు వెళ్లి వచ్చారు. ఎప్పుడు లేని డిక్లరేషన్ అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది? జగన్ తిరుమలకు వెళతా అంటే కట్టలు కట్టుకుని వచ్చి రాజకీయం చేశారు’ అని మండిపడ్డారు. -
అయ్యప్ప మాలేస్తే ఆదాయం తగ్గుతుందన్నాడుగా..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనపై చంద్రబాబు చేస్తున్నరాద్దాంతంపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. తిరుమల పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్‌ను డిక్లరేషన్ అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు పోసాని. హిందూ ధర్మా పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న బాబు.. ఒకప్పుడు అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మద్యం అమ్మకాలు జరగడం లేదని ఘోరంగా వ్యాఖ్యానించాడని గుర్తు చేశారు.మతతత్వ పార్టీ బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నానని, ఇదే విషయాన్ని గతంలో మసీద్‌లోనే చెప్పాడని గుర్తు చేశారు.తనకు ఏ పార్టీలో కలవాలని లేకున్నా కూడా ఢిల్లీ నుంచి వచ్చి కలవండి అంటే బీజేపీలో కలిశాను అని బాబు చెప్పాడని తెలిపారు. మోదీ అంటే కేడీ.. కేడీ అంటే మోదీ అని ఘోరంగా తిట్టిన బాబు.. మళ్లీ ఢిల్లీకి వెళ్లి మోదీ.. అమిత్ షా కాళ్లు పట్టుకున్న ఫోటోలను కూడా చూశామని ఎద్దేవా చేశారు. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.‘చంద్రబాబు లాంటి వ్యక్తి ఉంటాడనే అంబేద్కర్ చాలా బలమైన రాజ్యాంగం రాశారు. ఓట్ల కోసం క్రిస్టియన్, ముస్లింల ఇంటికి చంద్రబాబు వెళ్లలేదా?, నేను, నా భార్య కలిసి చర్చ్, మసీద్‌కు వెళ్లాం. మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ అఫిడవిట్ అడగలేదు. జగన్‌ది గ్రేట్ పాలిటిక్స్.. నీది డర్టీ పాలిటిక్స్ బాబూ’ అని ధ్వజమెత్తారు పోసాని -
తిరుమల లడ్డు వివాదంలో చంద్రబాబుకు షాక్
-
జరగని తప్పుపై పచ్చగోల..
-
వైఎస్సార్సీపీ నేతలకు పోలీసుల 30 యాక్ట్ నోటీసులు
-
చంద్రబాబు చౌకబారు రాజకీయాలు.. ఎంపీ గురుమూర్తి ఫైర్
-
జగన్ పర్మిషన్ తీసుకోవాలా?
-
వైఎస్ జగన్ పై దాడికి కుట్ర
-
మీ చేత హిందువులని చెప్పించుకోవడానికి సిగ్గుపడతాం ...
-
సిట్‌తో వాస్తవాలు బయటకు రావు.. VHP లీడర్ ఫైర్
-
జగన్ తిరుమలకు వస్తే అంత భయమెందుకు బాబు
-
మతి భ్రమించి వెంకన్నతో రాజకీయం.. బాబుకు రోజులు దగ్గరపడ్డాయి
-
జగన్ ఆ సంతకం చేయనక్కరలేదు
-
అరె అవతారం..అయోమయం.. పవన్ పై ప్రకాష్ రాజ్ పంచులు
-
దేవుడుతో ఆటలొద్దు.. మీకు దమ్ముంటే లడ్డు వివాదంపై వంగా గీత రియాక్షన్
-
సాయంత్రం అయితే కోటార్ వేసేవాడు టీటీడీ మెంబెర్...? శ్రావణ్ కుమార్
-
పవన్ కు ప్రకాష్ రాజ్ మరుసారి కౌంటర్
-
చంద్రబాబు వ్యాఖ్యలపై సీబీఐ విచారణకు డిమాండ్
-
AR డైరీపై ఫిర్యాదు బయటపడ్డ టీటీడీ తప్పు
-
తిరుమల పవిత్రత రక్షణకు వైఎస్ జగన్ పిలుపు
-
బాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు.. గుడివాడ సంచలన వ్యాఖ్యలు
-
టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలు: మార్గాని భరత్
సాక్షి, రాజమండ్రి: రాజకీయాల కోసం చంద్రబాబు తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని దుయ్యబట్టారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో సాక్షిగా నిజాలు బట్టబయలయ్యాయని తెలిపారు. సీఎంకు ఇచ్చిన నివేదికలో ఒకలా.. షోకాజ్ నోటీసుల్లో మరోలా ఉందని పేర్కొన్నారు.ఈ మేరకు బుధవారం రాజమంత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలైలో రిపోర్టు వస్తే రెండు నెలల వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కేసులు ఎందుకు నమోదు చేయలేదని, అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ‘జులై 23న నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నట్లు నివేదిక వచ్చిందన్న ఈవో.. సీఎంకు ఇచ్చన నివేదికలో మాత్రం జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చని ఎన్డీడీబీ అనుమానం వ్యక్తం చేసిందని తెలిపారు. ఎన్డీడీబీ నుంచి రిపోర్టు తెప్పించిన తర్వాత సెకండ్ ఒపినియన్ ఎందుకు తీసుకోలేదు? ఎవరిని మీరు తప్పు దోవ పట్టిస్తున్నారు? ’ అని మండిపడ్డారు.చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి -
అక్కడుంది చంద్రబాబు.. SIT ఏర్పాటుపై వీహెచ్‌పీ సురేంద్ర జైన్ ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ : చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి లడ్డు వివాదాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని, లడ్డూ వివాదంలో నిజానిజాలు బయటకు రావాలంటే సిట్ సరిపోదని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. సిట్ ఏర్పాటుపై సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.‘చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడు. తన రాజకీయ స్వార్థం కోసం లడ్డు వివాదం అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. లడ్డుపై వివాదంపై నిజా నిజాలు బయటికి రావాలంటే ఆయన నియమించిన సిట్ సరిపోదు. న్యాయ విచారణ జరగాలి’ అని డిమాండ్ చేశారు.రాజకీయ ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలు బయటికి రావాలంటే న్యాయ విచారణే శరణ్యం’ అని సురేంద్ర జైన్ తెలిపారు. ఈ సందర్భంగా లడ్డూ వివాదంపై తిరుమల శ్రీవారి భక్తులు ఆందోళన చెందవద్దని, ఈ అంశంపై త్వరలోనే మేం న్యాయపరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దేశంలో అన్ని దేవాలయాలు నిర్వాహణ నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి. దేవాలయాల పరిరక్షణపై వీహెచ్‌పీ త్వరలో ఉద్యమం చేపడుతుంది’ అని సురేంద్ర జైన్ హెచ్చరించారు. సిట్‌లో చంద్రబాబు మనిషితిరుమల లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కూలంగా వ్యవహరించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ చీఫ్‌గా నియమించారు. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉండనున్నారు. -
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై అంబటి రియాక్షన్
-
మేము తప్పుచేసాం అని నిరూపించు నేను నీ బూట్లు తుడుస్తా...!
-
సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుంది
-
పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పవన్.. ప్రకాష్ రాజ్‌పై విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ .. నేను చేసిన ట్వీట్ ఏంటి? నా ట్వీట్‌పై మీరు మాట్లాడుతుందంటేంటి. మరోసారి నా ట్వీట్‌ను చదవి అర్థం చేసుకోండి. నేను షూటింగ్ నిమిత్తం విదేశాల్లో వున్నాను 30 తేదీ తరువాత వస్తాను. మీ ప్రతి మాటకు సమాధానం చెపుతాను. మీకు వీలైతే నా ట్వీట్‌ని మళ్లీ చదివి అర్థం చేసుకోండి’ అంటూ వీడియోని విడుదల చేశారు. Dear @PawanKalyan garu..i saw your press meet.. what i have said and what you have misinterpreted is surprising.. im shooting abroad. Will come back to reply your questions.. meanwhile i would appreciate if you can go through my tweet earlier and understand #justasking pic.twitter.com/zP3Z5EfqDa— Prakash Raj (@prakashraaj) September 24, 2024 ట్వీట్లో ప్రకాష్ రాజ్ ఏమన్నారంటేపవన్ కల్యాణ్... మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించుకునేలా చేస్తున్నారు? ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l— Prakash Raj (@prakashraaj) September 20, 2024 ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై పవన్ ఇలా మాట్లాడారుసున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు.చదవండి: పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే -
ఈ ప్రశ్నలకు జవాబు ఉందా బాబు?
-
టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందే: అంబటి
సాక్షి, గుంటూరు: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికే చంద్రబాబు ఆరోపణ చేశారనిస్పష్టమైపోయిందన్నారు. డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని చంద్రబాబు అంటున్నారని.. టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి, డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తారా? అని ప్రశ్నించారు.ఈ మేరకు గుంటూరులో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారా అని ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదని, తప్పు చేసినవాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని విమర్శించారు. టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని అన్నారు. తప్పు జరిగిపోయిందని ఆంధ్రజ్యోతి, ఈనాడు ముందే రాసేస్తున్నాయని దుయ్యబట్టారు.‘టీటీడీ లడ్డూలో కల్తీ జరగలేదని పవన్ నిరూపించలేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆరోపణలను నిరూపించే శక్తి లేక హంగామా చేస్తున్నారు. హిందూ సంప్రదాయల గురించి చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యం. తండ్రి చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు తలనీలాలు ఇవ్వలేదు. సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు’ అని మండిపడ్డారు. -
నిజం చెప్పేసిన లోకేష్ షాక్ లో చంద్రబాబు..
-
తిరుమల లడ్డు వివాదం.. ట్వీట్‌తో అడ్డంగా దొరికిపోయిన నారా లోకేష్
సాక్షి,అమరావతి: ట్వీట్‌తో మంత్రి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చిందని ట్వీట్ చేశారు. చంద్రబాబు స్టేట్మెంట్కి విరుద్ధంగా లోకేష్ జులై 6, జులై 12న ఏఆర్ కల్తీ నెయ్యి ట్యాంక్‌లు వచ్చినట్టు ట్వీట్లో పేర్కొన్నారు. టెస్టులకు పంపిన నాలుగు ట్యాంకుల నెయ్యి వాడలేదని లోకేష్ ప్రకటించారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడేసారంటూ సీఎం చంద్రబాబు విష ప్రచారం చేస్తుంటే అసలు ఆ ట్యాంక్‌ల నెయ్యి వాడలేదని నారా లోకేష్ ట్వీట్ చేశారు. చదవండి : చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు -
లడ్డూ వివాదం.. తిరుమలలో భూమన కరుణాకర రెడ్డి ప్రమాణం (ఫొటోలు)
-
ఆయన చరిత్ర నాకు తెలుసు సుబ్రహ్మణ్యస్వామి హాట్ కామెంట్స్
-
తిరుమల లడ్డులో పొగాకు. చంద్రబాబు పై భక్తులు ఫైర్
-
లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణం చేసిన భూమన
-
లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణం చేసిన భూమన
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. అనంతరం స్వామి వారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు.‘‘మహా మూర్తి శరణాగతి తండ్రి.. గత కొద్ది రోజులుగా నా మనసు కలత చెందుతోంది. సర్వ జగద్రక్షుడు క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం. అపచారం. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు, లడ్డు విషయంలో కళంకిత మైనది అని కలుషిత రాజకీయ మనష్కులు. అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను గాని తప్పు చేసి ఉంటే.. నేను నా కుటుంబం సర్వ నాశనం అయిపోవాలి. నెయ్యిలో తప్పు జరిగి ఉంటే సర్వ నాశనం అయిపోతాము. నేను ఏ ఒక్క రాజకీయ మాట మాట్లాడలేదు. గోవిందా..గోవిందా’’...అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు.ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణీలో స్నానం చేసి, శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద స్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని, అఖిలాండం కర్పూర హారతి వెలిగించి భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ సమయంలో భూమన వెంట ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి ఉన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు భూమన ప్రమాణం చేశారు. -
వాలంటీర్ల ధర్నా.. చంద్రబాబుకు డిమాండ్
-
చంద్రబాబు వ్యాక్యాలపై సుప్రీంకోర్టులో బీజేపీ నేత పిల్
-
కల్తీ నెయ్యి లడ్డూలు భక్తులు తిన్నారా? లేదా ? పొన్నవోలు ఫుల్ క్లారిటీ..
-
ప్రసాదం శాంపిల్స్ ను ఇతర రాష్ట్రాల ల్యాబ్ లకు పంపాలి
-
దేవుడిని కూడా బాబు రాజకీయాలకు వాడుకుంటున్నారు
-
శ్రీవారి లడ్డూ వివాదంలో నిజానిజాలు తెలియాలి: న్యాయవాది పొన్నవోలు
న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశివ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిల్ వేశారు.ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలని అన్నారు. చంద్రబాబు వేసిన సిట్‌తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెప్పే అవకాశం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించిన విషయం కనుక సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని చెప్పారు. ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన 10 ట్యాంకులలో నాలుగు ట్యాంకులు నాసిరకంగా ఉన్నాయని, ఈ నాలుగు ట్యాంకులలో వనస్పతి ఉందని మొదట టీటీడీ ఈవో చెప్పారని అన్నారు. ట్యాంకులు ముందుగానే ఒక సర్టిఫికెట్తో తిరుమలకు వస్తాయని, ఆ వచ్చిన ట్యాంకులను టీటీడీ 3 పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు.చదవండి: లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణానికి భూమన సిద్ధం‘ఆ పరీక్షల్లో సఫలమైన తర్వాతే ఆ టాంకర్ల నెయ్యిని ప్రసాదాలకు ఉపయోగిస్తారు. టెస్టుల్లో ఫెయిల్ అయితే వాటిని వెనక్కి పంపిస్తారు. కల్తీ జరిగిందని నిర్ధారించే ల్యాబ్స్ లేవని ఈవో చెప్పడం దుర్మార్గం. 2014-19 వరకు పరీక్ష కేంద్రాలకు హెడ్‌గా ఉన్న శర్మిస్ట.. టీటీడీకి కల్తీ పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని వెల్లడించారు. మే 15న మొదటి ట్యాంక్ పంపించారు. అప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నాసిరకం నాలుగు ట్యాంకర్ల నెయ్యి వెనక్కి పంపారు. అటువంటి సమయంలో లడ్డూలలో కల్తీ ఎలా జరిగిందని చెప్పారు.భక్తుల మనోభావాలు గాయపరిస్తే మీకు ఒరిగేదేమిటి. రాజకీయ లాభం కోసం దేవుడిని కూడా ఉపయోగించడం సిగ్గుచేటు. రిజెక్ట్ చేసిన నాలుగు ట్యాంకర్లలో ఎస్ వాల్యూ తక్కువగా ఉందని ఈవో చెప్పారు. 2019 నుంచి ఆగస్టు 2023 వరకు వైవి సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నారు. వై వి సుబ్బారెడ్డి హయంలో ఈ టెండర్లను పిలవలేదు. ఏఆర్ ఫుడ్స్ అసలు బిడ్డరే కాదు. భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో ఏఆర్ ఫు డ్స్కు ఆర్డర్ ఇవ్వలేదు. సప్లై జరగలేదు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఆర్డరు, సప్లై జరిగింది. ఎస్ వాల్యూ తగ్గిందని టీటీడీ ఈఓ నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. 319 రూపాయల కేజీ నెయ్యిలో 1, 450 రూపాయల యానిమల్ ఫ్యాట్ ఎలా కలుపుతారు? రాగి బిందెలో బంగారం కలుపుతారా ?కానీ రాజకీయ దురుద్దేశంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నారు.పంది కొవ్వు కలిపారని చెప్పడం అబద్ధం -
దేవుడిపై కూడా బాబు రాజకీయాలే: గడికోట శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం స్థాయిలో చంద్రబాబు మాటలు బాధ కలిగించాయని అన్నారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. దేవుడిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలను బాబు భయబ్రాంతులకు గురిచేశారని విమర్శలు గుప్పించారు. ప్రతి 6 నెలలకోసారి టెండర్ల ద్వారా నెయ్యి సేకరణ జరుగుతుందని, ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తారని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం గడికోట మాట్లాడుతూ.. కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని అన్నారు. శ్రీవారిని అడ్డం పెట్టుకొని పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. జులైలో వచ్చిన రిపోర్ట్‌ను సెప్టెంబర్‌లో బయటపెట్టారని, తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం మంచిది కాదని తెలుసుకోవాలని హితవు పలికారు.చదవండి: బాబూ.. భక్తుల మనోభావాలతో ఆడుకుంటావా?: మాజీ మంత్రి కాకాణి‘నెయ్యి ట్యాంకర్లను మూడు దశల్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత కూడా లడ్డూ తయారీకి ఎలా పంపించారు?. ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే 40 లీటర్ల పాలు అవసరం. ప్రతిరోజూ ఇలాంటి నెయ్యి 30 లీటర్లను అభిషేకం చేస్తారు. ఈ పద్ధతిలో 50 టన్నుల నెయ్యి తయారు చేయలేము. నైవేద్యం తయారీకి పవిత్రమైన నెయ్యిని వాడతారు. అభిషేకానికి, నైవేద్యానికి, దీపాలకు పవిత్రమైన నెయ్యిని ఉపయోగిస్తారు.వెన్నతో నవనీత సేవ కోసం కొండపైనే అవులను పెంచి వెన్నను తయారు చేస్తున్నారు. జూన్‌లో వచ్చిన నెయ్యి ని వెనక్కి పంపించకుండా అదే నెయ్యితో లడ్డూ ఎలా తయారు చేయించారు ?తప్పు చంద్రబాబు చేశారు.. డ్రామాలు ఎన్ని రోజులు చేస్తారు?. సెంటిమెంట్ క్రియేట్ చేసి తిరుమలను కలుషితం చేసే కుట్రలు చేస్తున్నారు. ప్రత్యర్థులపై చంద్రబాబు నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. మహానేత రాజశేఖర్ రెడ్డి.. వేద పాఠశాలను ప్రారంభించారు. 2014 - 2019 వరకు దేవాలయాలకు ఎన్ని నిధులు కేటాయించారు? 2019 - 2024 వరకు ఎన్ని నిధులు మంజూరు చేశారు ?. స్టీల్ ప్లాంట్, వరద నష్టం, మెడికల్ కాలేజీ, వంద రోజుల పాలన అంశాలను దృష్టి మళ్లించడానికి.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారునింద వేయడమే మా విధానం అన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు. వైఎస్సార్సీపీని భుజాన వేసుకొని మాట్లాడటానికి రాలేదు. శ్రీవారి భక్తుడిగా మాట్లాడుతున్నా. చిత్తశుద్ధి లోపించినప్పుడు ఇలాంటి పనులు చేస్తారు. సెంటిమెంట్‌కు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. తాపత్రయ పడి తిరుమలను రోడ్డున పడేయకుండి. అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. తిరుమలలో ఏ తప్పూ జరగలేదు. జరిగిన ప్రచారానికి ఇకనైనా ఫుల్‌స్టాఫ్ పెట్టాలి. వాస్తవాలను వక్రీకరించకుండా నిజాలని ప్రజలకు తెలియజేసే విధంగా విచారణ జరపాలి. రాజకీయ కోణంలో చూడొద్దు. తిరుమలలో పూజ విధానం జియ్యర్ల ద్వారానే జరుగుతోంది’ అని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్
ఖమ్మంరూరల్: దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం తీసుకొచ్చిన లడ్డూలో పొగాకుతో కూడిన ప్యాకెట్ రావడంతో భక్తులు నివ్వెరపోయిన ఘటన ఇది. ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ శివారు కార్తికేయ టౌన్‌షిప్‌కు చెందిన దొంతు పద్మావతి బంధువులతో కలిసి ఈనెల 19న తిరుమల వెళ్లారు. అక్కడ 20వ తేదీన సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకున్నాక లడ్డూలు కొనుగోలు చేయగా ఆదివారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. కాగా, ఉదయం లడ్డూ ప్రసాదాన్ని ఇంట్లో దేవుడి వద్ద ఉంచి బంధువులకు ఇచ్చేందుకు ముందు కొద్దిగా నోట్లో వేసుకోగా పొగాకు వాసన వచ్చింది. దీంతో పద్మావతి లడ్డూ మొత్తం చూడగా అందులో పొగాకుతో కూడిన ప్యాకెట్ కనిపించింది. కాస్త నమిలిన పొగాకును కాగితంలో చుట్టగా అది లడ్డూలో కలిసిపోయి ఉంది. దీంతో ఆమె పలువురికి చూపించగా పద్మావతితో పాటు వెళ్లిన మిగతా వారు తీసుకొచ్చిన వారు తెచ్చిన లడ్డూలు బాగానే ఉన్నాయి. కాగా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో ఇలా రావడంపై పద్మావతి సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మీకో దణ్ణం.. చంద్రబాబు వంద రోజుల పాలనపై ఆర్కే రోజా
సాక్షి,చిత్తూరు జిల్లా : సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ఆర్కేరోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 100 రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలు కప్పి పుచ్చేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చ లేకపోయారని గుర్తు చేశారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదు. చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదొకటి తెరపైకి తెచ్చి, పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజలు ఖండిస్తున్నారు, చీకొడుతున్నారు. టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ, సీఎంకు ఎలాంటి సంబంధం ఉండదని మంత్రి లోకేష్ అంటున్నారు. మాజీ సీఎం, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్యాట్ మిక్స్ చేయించినట్లుగా చంద్రబాబు సృష్టిస్తున్నారు. చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదు అని అన్నారు. ఈఓ శ్యామల రావు బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారు. జూలై 23న వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారు. అందుకే నెయ్యిని వెనక్కు పంపాం అంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారు. రెండు నెలల అనంతరం సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? అని ఆర్కే రోజా ప్రశ్నించారు.టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నింద వేశారు. మళ్లీ శ్యామలరావుపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు. మీ ప్రభుత్వంలో బయటపడిన అంశం కాబట్టి బాధ్యులు ఎవరు? సీఎం చంద్రబాబునా? ఈవో శ్యామలరావు ఆ?? వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో పీఎం మోదీ, సీజేఐలు, చంద్రబాబు సైతం ఫ్యామిలీతో రావడం జరిగింది. లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే కంప్లైంట్ ఇవ్వాలి కదా! అని తెలిపారు. ఐదేళ్లలో ఏదో జరిగిందని నింద వేయడానికి కల్తీ నెయ్యి అంటూ ప్రచారం చేస్తున్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? బీజేపీ నాయకులు సైతం గత పాలక మండలిలో ఉన్నారు. అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ప్రస్తుతం టీడీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి, పార్థసారథి గత పాలకమండలిలో ఉన్నారు.తప్పు చేశారా లేదా వాళ్లైనా చెప్పాలి!ఈరోజు ప్రాయిశ్చిత దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రాయిశ్చిత్తం ఎవరు చేస్తారు? ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే పవన్ ప్రాయిశ్చిత దీక్ష చేస్తున్నానని ఆయనే ఒప్పుకున్నట్లే కదా అని ఆర్కే రోజా పునరుద్ఘాటించారు. చదవండి : 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదు: వైఎస్ జగన్ -
జగన్ అంటే ఎందుకంత భయం చంద్రం .. ఆ రిపోర్ట్‌ను ఎందుకు దాచిపెట్టావు..?


