అయ్యప్ప మాలేస్తే ఆదాయం తగ్గుతుందన్నాడుగా.. | Posani Krishna Murali Comments On Chandrababu Over Tirumala Issue | Sakshi
Sakshi News home page

అయ్యప్ప మాలేస్తే ఆదాయం తగ్గుతుందన్నాడుగా..

Sep 28 2024 3:48 PM | Updated on Sep 28 2024 4:29 PM

Posani Krishna Murali Comments On Chandrababu Over Tirumala Issue

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనపై చంద్రబాబు చేస్తున్నరాద్దాంతంపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.  తిరుమల పర్యటనకు సంబంధించి వైఎస్‌ జగన్‌ను డిక్లరేషన్‌ అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు పోసాని.  హిందూ ధర్మా పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న బాబు.. ఒకప్పుడు అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మద్యం అమ్మకాలు జరగడం లేదని ఘోరంగా వ్యాఖ్యానించాడని గుర్తు చేశారు.

మతతత్వ పార్టీ బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నానని,  ఇదే విషయాన్ని గతంలో మసీద్‌లోనే చెప్పాడని గుర్తు చేశారు.తనకు ఏ పార్టీలో కలవాలని లేకున్నా కూడా ఢిల్లీ నుంచి వచ్చి కలవండి అంటే బీజేపీలో కలిశాను అని బాబు చెప్పాడని తెలిపారు. మోదీ అంటే కేడీ.. కేడీ అంటే మోదీ అని  ఘోరంగా తిట్టిన బాబు.. మళ్లీ ఢిల్లీకి వెళ్లి మోదీ.. అమిత్ షా కాళ్లు పట్టుకున్న ఫోటోలను కూడా చూశామని ఎద్దేవా చేశారు. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.

‘చంద్రబాబు లాంటి వ్యక్తి ఉంటాడనే అంబేద్కర్‌ చాలా బలమైన రాజ్యాంగం రాశారు. ఓట్ల కోసం క్రిస్టియన్‌, ముస్లింల ఇంటికి చంద్రబాబు వెళ్లలేదా?, నేను, నా భార్య కలిసి చర్చ్‌, మసీద్‌కు వెళ్లాం. మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ అఫిడవిట్‌ అడగలేదు. జగన్‌ది గ్రేట్‌ పాలిటిక్స్‌.. నీది డర్టీ పాలిటిక్స్‌ బాబూ’ అని ధ్వజమెత్తారు పోసాని
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement