tirupati laddu
-
జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా? సుప్రీం కోర్టు ఆగ్రహం
-
జగన్ 2029 మార్క్ అర్ధమైంది.. బాబు, పవన్ గగ్గోలు..
-
లడ్డూపై కొవ్వు ఆరోపణలు.. భయంతో తిరుమలకు పరుగు
-
తిరుమల లడ్డూపై అపచారం.. నిజాల్ని చూపిస్తున్న గోవిందుడు
-
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
-
టీటీడీ చైర్మన్ వ్యవహారం, లడ్డూ కాంట్రాక్టుపై వైఎస్ జగన్ సీరియస్
సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలి, తిరుమల లడ్డూ కాంట్రాక్టులో స్కాంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారంటూ విమర్శించారు. పవిత్రమైన తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల. తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారు.ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుగారికి లేఖ రాస్తూ, ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా విచారణ, చర్యలు పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్‌గా నియమించి ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా?. ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా. చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడి పట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత,…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 4, 2026లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా, మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు, ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడటం, ఇదే విషయాన్ని సీబీఐ-సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తి లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.ఈ రకంగా చంద్రబాబు.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరి మీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నాడు. మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278-330గా ఉంది. 2019-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్‌కి చెందిన మానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇందాపూర్ డెయిరీకి, కిలో నెయ్యి రూ.658లకు, 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు, నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ’ అని పోస్టులో పేర్కొన్నారు. -
మండలిలో ఉద్రికత్త.. టీడీపీ సభ్యుల జులం
అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..మీడియా పాయింట్:లడ్డూపై చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రులు యత్నించారు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులులడ్డూపై చర్చ జరపాలని మండలి మొదటి రోజు నుంచి డిమాండ్ చేస్తున్నాంశాసనమండలిలో లడ్డు పై చర్చ కోసం పదిరోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాంఈరోజు చర్చకు ఒప్పుపుకుని నిజాలు బయట పడుతుంటే తట్టుకోలేకపోతున్నారుసభలో లేని వైఎస్ జగన్ గురించి మాట్లాడారువైఎస్ జగన్ రాష్ట్రంలో అనేక దేవాలయాలను దర్శించారునిన్నకాక మొన్న నందీశ్వరుడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారుతిరుమలకు ఏడుకొండలు ఉండాలని జీవో ఇచ్చింది వైఎస్సార్వైఎస్సార్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబువెంకటేశ్వరస్వామిపై ఎనలేని భక్తి ఉందని చంద్రబాబు చెప్పుకుంటాడుఒక్కసారైనా తిరుపతిలో తలనీలాలు ఇచ్చారా?లడ్డూపై నిందలు వేసి చర్చకు తెచ్చింది ఎవరు?వైఎస్ జగన్‌కి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలిలడ్డూపై చర్చ జరగకుండా పదేపదే అడ్డుపడ్డ మంత్రులుటీడీపీ ఎమ్మెల్సీల తీరుపై వైఎస్సార్సీపీ ఆందోళనఅచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ పట్టుఏపీ శాసనమండలి రేపటికి వాయిదానెయ్యికి పూతపూసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా: తూమాటి మాధవరావుజంతు కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జ్ షీట్ 209 పేజీలో చాలా క్లియర్‌గా చెప్పింది2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమల వెళ్లుంటారు కదాఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారుమీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు?దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్ వాడుతున్నాయో బయటపెట్టే ధైర్యం ఉందా?తిరుమలతో హెరిటేజ్ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారుటెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్ మిల్క్ పౌడర్ సప్లై చేశారులడ్డూపై ఆరోపణలు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారుహెరిటేజ్ పేరు తూమాటి ప్రస్తావించగానే ఉలిక్కిపడ్డ మంత్రులుతూమాటి ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ మంత్రి పయ్యావుల అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాల్సిందే..మండలి ఛైర్మన్‌పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు మీరు క్రిస్టియన్ అనుకున్నా. కానీ కాదని మీరు చెప్పారు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టిన ఎమ్మెల్సీలు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం మండలి ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలుతాను క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ తనను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరని అచ్చెన్నాయుడికి ప్రశ్నతాను హిందువునని క్రిస్టియన్ కాదని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండిపడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుఅచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: తూమాటితూమాటి మాధవరావు ప్రసంగాన్ని అడ్డుకుంటున్న మంత్రులు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్..1998లో హెరిటేజ్ టీటీడీకి మిల్క్ పౌడర్ సప్లై చేసింది. అడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఇవ్వొద్దని ఆదేశించింది.అయినప్పటికీ టీటీడీ ద్వారా బిల్లు పాస్ చేసుకున్నారునెయ్యికి పూత రాసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా.ఫిర్యాదుకు, సీబీఐ రిపోర్టుకు తేడా తెలియకుండా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు.జంతు కొవ్వు కలవలేదని సీబీఐ చార్జ్‌షీట్ 209 పేజీలో చాలా క్లియర్‌గా చెప్పారు.2019-24 మధ్య చంద్రబాబు సహా మీరంతా తిరుమలకు వెళ్లుంటారు కదా.ఆ సమయంలో కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయంటున్నారు.మీరంతా అయోధ్యకు వెళ్లి తిన్నారు కదా.. ఎందుకు ఫిర్యాదు చేయలేదు?.దేశంలో ఉన్న అన్ని డెయిరీలు ఏ కెమికల్స్ వాడుతున్నాయో బయట పెట్టే ధైర్యం ఉందా?.తిరుమలతో హెరిటేజ్ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు చెప్పారు.టెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్ మిల్క్ పౌడర్ సరఫరా చేశారు.బిల్లులు ఆలస్యమైతే బోర్డు ముందుకు తెచ్చి మరీ బిల్లులు తెచ్చుకున్నారు.2024-26 వరకు తిరుమలలో ఏం జరిగిందో విచారణకు ఆదేశించే దమ్ము మీకుందా?.మండలిలో సంచలన విషయాలను బయటపెట్టిన తూమాటి. టీడీపీ ఎమ్మెల్సీపై చైర్మన్ ఆగ్రహం..టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధపై మండలి చైర్మన్ ఆగ్రహంసభలో వైఎస్సార్సీపీ నేతలను నిందితులుగా చదివిన అనురాధఈ క్రమంలో మీరు ఏమైనా.. పోలీసా, సీబీఐ అధికారా అంటూ చైర్మన్ ఆగ్రహంమండలిలో ఉద్రిక్తత.. ఏపీ శాసన మండలిలో అధికార పార్టీ సభ్యుల రచ్చ..లడ్డూపై చర్చ జరగకుండా అధికార పార్టీ సభ్యుల జులుం.పోడియం దగ్గర అధికార పార్టీ సభ్యుల రచ్చ. మండలి చైర్మన్ ఆగ్రహం..తన మైక్ కట్ చేస్తున్నారంటూ చైర్మన్ ఆవేదన.మండలి ప్రతిష్ట నిలబడేలా చర్చ జరగాలన్న చైర్మన్.చర్చ ప్రారంభమైన 20 నిమిషాల్లో 17 సార్లు అడ్డుపడిన మంత్రులు.పర్వతనేని మాట్లాడుతుండగా నిమిషానికోసారి అడ్డుకున్న మంత్రులు.రూల్స్ మాట్లాడుతున్నామంటూనే వాస్తవాలు బయటకు రాకుండా మంత్రుల అరుపులు. మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్సీపీ లడ్డూపై చర్చను పదేపదే అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు.హెరిటేజ్, ఇందాపూర్ బంధంపై చర్చకు టీడీపీ సభ్యుల అభ్యంతరం.వైఎస్సార్సీపీ సభ్యులు ప్రసంగాన్ని పదేపదే అడ్డుకుంటున్న పయ్యావుల.హెరిటేజ్ ప్రస్తావన రాకుండా పదేపదే అడ్డుకుంటున్న మంత్రులు.వాస్తవాలు బయటకు రాకుండా మంత్రులు అడ్డుకుంటున్నారు: వైఎస్సార్సీపీ భోలే బాబా డెయిరీ ఎక్స్లెంట్ అంటూ పర్మిషన్ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే.అసెంబ్లీ సాక్షిగా హెరిటేజ్‌పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు.ఫ్లెక్సీలు వేసి దేవుడిని రోడ్డుపైకి తెచ్చారు.2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హెరిటేజ్ దగ్గర మజ్జిగ కొనుగోలు చేసింది.ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ పాల్గొనలేదని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. మంత్రుల అత్యుత్సాహం..లడ్డూపై వాస్తవాలు బయటకు రాకుండా పదేపదే మంత్రులు అడ్డుకుంటున్నారు.హెరిటేజ్, ఇందాపూర్ వ్యవహారం బయటకు రాకుండా మంత్రుల అడ్డగింత.సంఘం డెయిరీ, వైష్ణవీ డెయిరీ వ్యవహారం ప్రస్తావనకు రాగానే మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు అడ్డగింత.లడ్డూపై మండలిలో చర్చ.. మంత్రుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కామెంట్స్..ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ యూనిట్.ఈ అంశంలో పెద్ద ఆర్ధిక కుట్ర దాగి ఉంది.ఆర్థిక కుంభకోణం బయటకు రాగానే హెరిటేజ్ వైబ్‌సైట్ నుంచి ఇందాపూర్ డెయిరీని కోమ్యానుఫ్యాక్చరింగ్గా మార్చేశారు.ప్రతీ మాట, ప్రతీ పదం ఆధారాలతోనే మాట్లాడుతున్నాను.కల్తీ నెయ్యి సరఫరా చేయడం వల్లే ఇందాపూర్ డెయిరీ తిరస్కరణకు గురైంది.టీడీపీ ప్రభుత్వంలోనే ఏఆర్ డెయిరీ నుంచి నాలుగు ట్యాంకర్లు వచ్చాయి.ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది.లడ్డూ ప్రసాదంపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది.స్వయంగా సీఎం చంద్రబాబే అబద్ధాలు చెప్పారు.టీడీపీ ప్రభుత్వంలో కల్తీ జరిగితే వైఎస్సార్సీపీకి అంటగట్టాలని చేస్తున్నారు.రాజకీయ లబ్ధిగా మొదలైన కుట్ర.. ఆర్థిక కుంభకోణంగా బయటకు వచ్చింది.నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యితో లడ్డూలు చేసింది కూటమి ప్రభుత్వంలోనే.మంత్రి గారు పదేపదే మా గొంతు నొక్కుతున్నారు.ఏఆర్ డెయిరీ ట్యాంకర్లను వైష్ణవి డెయిరీ పేరుతో టీటీడీకి పంపారు.సంగం డెయిరీ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్లది.కల్తీ నెయ్యి ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి?.తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను ఎవరి ఒత్తిడితో అనుమతించారు?.సీబీఐ చార్జ్‌షీట్‌లో క్లియర్‌గా ఎటువంటి జంతు కొవ్వు లేదని చెప్పింది.ఫిర్యాదును పట్టుకుని సీబీఐ రిపోర్టు అంటూ ప్రచారం చేస్తున్నారు. చర్చ ప్రారంభించిన వెంటనే పర్వతరెడ్డిని అడ్డుకున్న మంత్రి అచ్చెన్నాయుడు.చంద్రబాబు అనలేదంటూ మండలి సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు అబద్ధాలు.పర్వతరెడ్డి ప్రసంగానికి పదేపదే అడ్డుతగులుతున్న మంత్రులు.పర్వతరెడ్డి చర్చ మొదలుపెట్టిన ఐదు నిమిషాల్లోనే ఐదు సార్లు అడ్డుకున్న మంత్రులు.పర్వతరెడ్డి ప్రసంగాన్ని పదే పదే అడ్డుకుంటున్న మంత్రి పయ్యావుల. మంత్రి అచ్చెన్నాయుడు ఓవరాక్షన్..వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలపై మంత్రి అచ్చెన్నాయుడు నోటి దురుసుఓపిక లేకపోతే పో.. అంటూ దురుసు వ్యాఖ్యలుఅచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీల ఆగ్రహం లడ్డూపై చర్చకు ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్సార్సీపీప్రభుత్వం భయంతోనే సభలో గందరగోళం సృష్టించాలని చూస్తోంది.చైర్మన్ సీరియస్.. మంత్రుల వాదనలతో నేను ఏకీభవించడం లేదు: చైర్మన్తిరుమల లడ్డూ విషయం చాలా సున్నితమైనది.లడ్డూ ప్రసాదంపై చర్చ చాలా మర్యాదగా, గౌరవప్రదంగా జరగాలి. మండలిలో మంత్రుల రగడ.. చర్చ కంటే ముందు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని మంత్రి పయ్యావుల మెలిక.చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం ప్రకటన చేయవచ్చన్న చైర్మన్.చైర్మన్‌తో మంత్రుల వాగ్వాదం.మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: చైర్మన్నేను తప్పు చేస్తున్నా అనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.కొత్త సాంప్రదాయం తీసుకు రావద్దన్న మండలి చైర్మన్. చైర్మన్ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అధికార సభ్యుల గందరగోళం. తిరుమల లడ్డు ప్రసాదంపై మండలిలో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర.ముందుగా స్టేట్మెంట్ ఇస్తామని ప్రభుత్వం పట్టు.స్వల్పకాలిక చర్చలో స్టేట్మెంట్ అనేది ఉండదు: చైర్మన్మండలి నిబంధనలపై చైర్మన్ మాట్లాడుతుండగా అడ్డుకుంటున్న మంత్రులు. మండలిలో తిరుమల లడ్డుపై చర్చ.. మండలిలో లడ్డుపై చర్చకు చైర్మన్ అనుమతి. మండలి చైర్మన్‌తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల భేటీ..శాసనమండలి చైర్మన్‌తో భేటీ అయిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుతిరుమల లడ్డుపై మండలిలో చర్చకు మండలి చైర్మన్ అనుమతిప్రశ్నోత్తరాలు ముగిసిన తరవాత తిరుమల లడ్డుపై చర్చముందుగా వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడిన తర్వాత.. ప్రభుత్వం స్టేట్మెంట్ పాస్ చేసేలా నిర్ణయంగతవారం లడ్డుపై చర్చ సందర్భంగా ప్రభుత్వం ముందు స్టేట్మెంట్ పాస్ చేయడంపై అభ్యంతరం తెలిపిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలునేడు తిరుమల లడ్డుపై చర్చకు ఆమోదం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై అరుణ్ కుమార్ ప్రశ్న..అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణపై రైతుల అభ్యంతరాలను సభలో ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్..భూసేకరణపై అభ్యంతరాలకు తక్కువ సమయం ఇచ్చారుగ్రామసభలు, ప్రజాభిప్రాయసేకరణ పెట్టకుండానే భూ సేకరణపై ముందుకు వెళ్లారుభూ యజమానిని సంప్రదించకుండా భూములు తీసుకోవడం సరికాదుగెజిట్లో 140 మీటర్ల రోడ్డును 250 మీటర్లు చేశారుబఫర్ జోన్‌ను 500 మీటర్లు చేశారుదేశంలో ఎక్కడా ఔటర్ రింగ్ రోడ్డుకి ఇలా చేయలేదుమార్కెట్ రేట్ ప్రకారం గత మూడేళ్లలో ఎంత ఎక్కువ ఉంటే అంత ఇవ్వాలికానీ అలా ఫాలో అవ్వడం లేదుసేకరించిన భూమిని వినియోగించకపోతే తిరిగి వెనక్కి ఇచ్చేయాలి..ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదుఅమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను రద్దుచేయాలి2013 భూ సేకరణ చట్టం ప్రకారం కొత్త గెజిట్ ను విడుదల చేయాలి.. రైతులను ఆదుకోవాలిమండలి సమావేశాలు ప్రారంభం..ప్రారంభమైన శాసన మండలి సమావేశాలుప్రశ్నోత్తరాలు ప్రారంభం -
కొవ్వు ఆరోపణలు.. చర్చ అంటే కూటమిలో వణుకు
-
చర్చకు వచ్చే దమ్ము లేదు కానీ పిచ్చి మాటలు మాట్లాడుతారా..?
-
లడ్డూపై చర్చ.. శాసనమండలిలో రగడ..
-
అవును నిజమే.. తప్పు ఒప్పుకున్న బాబు!
-
లడ్డూ చర్చపై.. భయంతో వణుకుతున్న చంద్రబాబు
-
తప్పు జరిగింది.. మండలికి వస్తే దొరికిపోతా
-
తిరుమల లడ్డూ ప్రసాదం, రాయలసీమ లిఫ్ట్‌పై ఏపీ శాసన మండలిలో చర్చించకుండా పలాయనం చిత్తగంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
-
వారెవ్వా బాబు.. లడ్డూ పాపం పవన్ కు.. పుణ్యం లోకేష్ కు..
-
తిరుమల ప్రతిష్టను పెంచింది వారే: వరుదు కళ్యాణి
సాక్షి, అమరావతి: తిరుమల ప్రతిష్టను పెంచింది వైఎస్సార్, వైఎస్ జగన్‌లేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. ఆమె ఇవాళ(గురువారం) అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఇంటి దైవం అంటూనే చంద్రబాబు శ్రీవారి ప్రసాదంపై నింద మోపాడంటూ.. ఆధారాలతో కూటమికి వరుదు కళ్యాణి కౌంటర్ ఇచ్చారు.టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిషన్ పార్టీ హిందూ మతాన్ని పరిరక్షిస్తామంటూనే తమ చర్యలతో కూటమి నాయకులు అడుగడుగునా హిందూ సాంప్రదాయాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కడపలోని వేంపల్లెలో నందీశ్వర ఆలయాన్ని ప్రారంభిస్తే దానిపైనే ఫేక్ వీడియాలతో తెలుగుదేశం సోషల్ మీడియా విషం కక్కింది. టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిషన్ పార్టీ అని అర్థం. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా విజయవాడలో పుష్కరాల పేరుతో 40కి పైగా ఆలయాలను కూల్చేస్తే, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని నిర్మించారు.చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తిరుమలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేశారు. ముఖ్యమంత్రులుగా ఉండి తిరుమల ప్రతిష్టను, స్వామి వారి వైభవాన్ని పెంచిన ఘనత తండ్రీకొడుకులు వైఎస్సార్, వైఎస్ జగన్‌లకే దక్కుతుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 4,111 కొత్త ఆలయాల నిర్మాణాలు మొదలు పెట్టి ఒక్కదానికి రూ.10 లక్షలు కేటాయించడం జరిగింది.అందులో 80 శాతం పనులు రామాలయాలే. రూ. 411 కోట్లతో 801 పురాతన ఆలయాల ఆధునికీకరణ పనులు చేయడం జరిగింది. దుర్గ గుడి అభివృద్ధి కోసం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వ నిధులు రూ.70 కేటాయించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా దుర్గమ్మ ఆలయంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు.వైఎస్ జగన్ పాలనలో శ్రీవారి వైభవంతూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీ నారాయణ స్వామి రథానికి దుండగులు నిప్పంటిస్తే కళ్యాణోత్సవం సమయానికి కొత్త రథం తయారు చేయించి ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రథాన్ని అందజేశారు. తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కోసం స్వచ్ఛమైన వెన్నను సమకూర్చడం కోసం తిరుమలలోని గోశాలను విస్తరించడం వైయస్ జగన్ సీఎంగా ఉండగానే జరిగింది. చిన్నారుల్లో భక్తిభావం పెంపొందించడం కోసం గోవింద కోటి, రామ కోటి రాసే వారికి ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేయడమే కాకుండా వారికి శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్పించడం జరిగింది.టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలతోపాటు వేతనాలు పెంచడమే కాకుండా కారుణ్య నియామకాలు చేపట్టారు. వంశ పారంపర్య అర్చకులకు రిటైర్మంట్ లేకుండా ఓపిక ఉన్నంత వరకు స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించారు. తిరుమలలోని స్వామి వారి గర్భగుడిని సన్నిధి గొళ్లలు తెరిచే సాంప్రదాయాన్ని పునరుద్ధరించారు. అమరావతి, చెన్నై, భువనేశ్వర్, జమ్ముకశ్మీర్, విశాఖపట్నంతోపాటు అమెరికాలో శ్రీవారి ఆలయాలను నిర్మించి స్వామి వారి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేశారు. గతంలో దివంగత వైఎస్సార్ తరహాలోనే వైఎస్ జగన్ కూడా ముఖ్యమంత్రిగా ఉండగా వేద విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవలో భక్తులందరూ దర్శించుకునేలా ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడ సేవ నిర్వహించేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.బ్రాహ్మణుల సంక్షేమం కోసం వైఎస్ జగన్మఠాధిపతులు, ఆగమ పండితులతో ఆగస్టు 2022లో రెండో విడత ధార్మిక పరిషత్తును నియమించి నిర్ణయాధికారాలను కల్పించిన ఘనత కూడా వైఎస్ జగన్‌కే దక్కుతుంది. అంతేకాకుండా దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురికాకుండా వివాదాలతో కోర్టు కేసుల కారణంగా కాలయాపన జరగకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటీస్ ఇచ్చిన వారం రోజుల్లో దేవాలయ భూములు స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి కల్పించి స్వామి వారి ఆస్తులను కాపాడారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలకు వంశపారంపర్య హక్కులను స్ధానిక భక్తుల కమిటీలకు కల్పిస్తూ జీవో ఇచ్చారు.జీవో నెంబర్ 52 ద్వారా గతంలో రూ.5 వేలు వేతనాలు పొందేవారికి రూ.10 వేలు, రూ. 10 వేలు పొందేవారికి రూ.15625 ల చొప్పున వేతనాలు పెంచుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు నిర్ణయం తీసుకుంది. అర్చక సంక్షేమ ట్రస్టు ద్వారా బ్రాహ్మణులకు రూ.48 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లుగా అరర్చ సమాఖ్య నాయకులకు అవకాశం కల్పించారు. 16 ఆగమ వేద పాఠశాలల ద్వారా 400 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలతోపాటు వారికి స్టై ఫండ్ కింద రూ. 3 కోట్లు చెల్లించారు. ధూమదీప నైవేద్యాల పథకం గతంలో చంద్రబాబు హయాంలో కేవలం 1100 ఆలయాలకు మాత్రమే ఉండగా వైఎస్సార్సీపీ హయాంలో ఆ సంఖ్యను 5338 ఆలయాల్లో అమలు చేసింది.వైఎస్సార్ హయాంలోనే శ్రీవారి వైభవం పెరిగిందిఆలయాల్లో రాజకీయ నేతల జోక్యానికి తావులేకుండా దేవాదాయ శాఖలో కీలకనిర్ణయాలు తీసుకునేలా 21 మందితో ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ 2007లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చట్ట సవరణ చేశారు. శ్రీవారి ఆలయంలో పిల్లలకు, క్యూలైన్లలో ఉండేవారికి ఉచితంగా పాలు, అన్నప్రసాద పంపిణీ కార్యక్రమానికి కూడా వైయస్సార్ గారే శ్రీకారం చుట్టారు. వేద విద్య, విజ్ఙానం, పరిశోధనలు ప్రోత్సహించే ఉద్దేశంతో 2006లో వైయస్సార్ గారు వేద విద్యాలయాన్ని ప్రారంభించారు. ఏడు కొండల వైభవాన్ని చాటేలా వేంకటేశ్వర భక్తి ఛానెల్‌ను ప్రారంభించారు.తిరుపతి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందజేయడంతోపాటు అలిపిరి వద్ద నిత్య హోమం జరిపేలా కూడా వైయస్సార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించారు. 2006లో కళ్యాణమస్తు పథకానికి రూపకల్పన చేసి మధ్యతరగతి కుటుంబాలలో వివాహం చేసుకునే ప్రతి జంటకు బంగారు మంగళ సూత్రం, వెండి మెట్టెలు, నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్లి సామాగ్రి, ధార్మిక స్తోత్ర పుస్తకం, పురోహితుడు, పెళ్లి భోజనం ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. బంగారు మంగళసూత్రం, వెండి మెట్టెలు, శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించి 36 వేల నూతన జంటలకు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.దళిత గిరిజన గోవిందం పేరుతో విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి శ్రీవారిని దళిత గిరిజన వాడలకు తీసుకెళ్లి దర్శన భాగ్యం కల్పించే భృహత్తర కార్యక్రమం కూడా దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారే ప్రారంభించారు. మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణ ఇచ్చే సమానత్వాన్ని కూడా ఆయనే ప్రారంభించారు. హిందూ ధర్మ పరిరక్షణ, స్వామి వారి ప్రతిష్టను ఇనుమడింపజేయడం కోసం వైయస్సార్ గారు ఎంతో శ్రమించారు. కానీ చంద్రబాబు మాత్రం మా ఇంటి దైవం అంటూనే తన తప్పుడు ప్రకటనలతో ఆలయ ప్రతిష్టను మంటగలిపేశారు. -
చంద్రబాబు అసలు హిందువువేనా? కేవలం రాజకీయ లబ్ధి కోసం..
-
సుబ్రమణ్యస్వామి పిటిషన్.. నేడు విచారణ జరపనున్న సుప్రీం కోర్టు ధర్మాసనం
-
టీటీడీకి 658.. ప్రజలకు 560.. కల్తీ అమ్ముతున్నారా?: ఇందాపూర్‌పై బొత్స ప్రశ్న
శాసన మండలి అప్డేట్స్..శాసనమండలి మీడియా పాయింట్ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్..మండలిలో జరుగుతున్న విధానాలు సభ్యుల హక్కులు హరించేలా ఉన్నాయిప్రభుత్వ అనుకూల వీడియోలు మాత్రమే బయటికి వస్తున్నాయిమొత్తం వీడియో ఫుటేజ్‌ను బయటికి విడుదల చేయాలిమేం పోడియం వద్ద ఉన్న ఫుటేజ్ మాత్రం ఇవ్వడం లేదుప్రభుత్వానికి కావాల్సిన ఫుటేజ్‌ను వాళ్ల పేపర్లలో వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నవి మాత్రమే ఇచ్చారుఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫుటేజ్ కావాలని అడిగినా స్పందించలేదుప్రజల హక్కులు కాపాడాలనేది మా ప్రయత్నంప్రజల హక్కులను కాలరాసే ప్రయత్నం ప్రభుత్వానిది.దేవాలయంగా భావించే సెక్రటేరియట్‌కు బూట్లు వేసుకుని సీఎం శంకుస్థాపన చేశారుచంద్రబాబు బూట్లు వేసుకుంటే తప్పులేదు..మేం చెప్పులేసుకోవడం తప్పు అనేలా ప్రచారం చేస్తున్నారుదేవుడికి పూజ చేసినప్పుడు కూడా చంద్రబాబు బూట్లు వేసుకున్నారుమండలి ఛైర్మన్‌ను సెక్రటరీ ఏమాత్రం లెక్కచేయడం లేదు.బొత్స చిట్‌చాట్..ఇందాపూర్ ఫ్యూర్ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో 560 రూపాయలకు దొరుకుతుంది.టీటీడీకి 658 రూపాయల చొప్పున ఇందాపూర్ నెయ్యి సరఫరా చేస్తున్నారు.టీటీడీకి 658 రూపాయలకు అమ్మే నెయ్యి ప్యూర్ నెయ్యి అయితే బయట 560 రూపాయలకు దొరికే నెయ్యి కల్తీనా?.ప్రజలకు కల్తీ నెయ్యి ఇస్తున్నారా?.లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా? ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి టెండర్ల వెనుక నిజాలు వెలికి తీసుకురావాలనేది మా ప్రయత్నంఅందుకే మండలిలో మేం వాయిదా తీర్మానాలు కోరుతున్నాంమేం చెప్పులతో స్వామివారి ఫొటోలు పట్టుకుని పోడియం వద్ద గొడవ చేశారని ప్రచారం చేస్తున్నారుఎవరు వేంకటేశ్వరస్వామికి అపచారం చేస్తున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలిమేం చెప్పులు విడిచిన తర్వాతే పోడియం వద్ద నిరసన చేపట్టాంచంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని మేం దేవుడి ఫొటోలతో నిరసన చేపట్టాంమేం మండలి నుంచి బయటికి రాకుండానే మా ఫొటోలు బయటికి వచ్చాయిసాక్షాత్తూ చంద్రబాబు వినుకొండ సభలో మా గురించి ప్రస్తావించారుతిరుపతి లడ్డూ కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశంమేం ఎక్కడా తిరుపతి లడ్డూని రాజకీయాల కోసం వాడుకోలేదుమాపై బురద జల్లడం కోసం శాసనమండలిని వాడుకున్నారుమొత్తం వీడియో ఫుటేజ్‌ను బయటికి ఇవ్వాలని శాసనమండలి చైర్మన్‌ను కోరాంమేం ఏనాడూ వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడలేదుమండలి చైర్మన్ నిస్సహాయత వ్యక్తం చేశారుశాసనమండలి అధికారాలకు కోత పెట్టడం బాధాకరంబీఏసీ సమావేశంలో అన్ని అంశాలను చైర్మన్ చర్చిస్తామన్నారుతప్పనిసరి పరిస్థితుల్లో మండలి చైర్మన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాల్సి వచ్చిందిసభ్యుల హక్కులనే కాపాడలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందిసెక్రటరీ జనరల్ ను ఎక్కడి నుంచో ఐదు లక్షల వేతనానికి తెచ్చారుఎవరు ఏం అడిగినా ఆయన ఇవ్వడట..రైటైర్డ్ అయిన తర్వాత కూడా ఐదు లక్షల జీతానికి పని చేసేవారిని దేశంలో ఎక్కడా చూడలేదుప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే మండలిలో ఫుటేజ్ మొత్తం బయటపెట్టాలిఇందాపూర్ , తిరుపతి లడ్డూపై చర్చ జరపాలిఅధికారంలో ఉన్నాం మేం చెప్పేదే వినాలనే ధోరణి మానుకోకపోతే ప్రజల పక్షాన వారి గొంతుకై పోరాడుతాం ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్..వేంకటేశ్వరస్వామిని నమ్మేవాళ్లే అయితే మొత్తం ఫుటేజ్‌ను బయటపెట్టండిమాట్లాడే వారి వీడియోలు మాత్రమే రికార్డ్ చేశారని చెబుతున్నారుమరి ఆ ఫొటోలు, వీడియోలు ఎలా వచ్చాయినేను చెప్పులు వేసుకుని పోడియం వద్దకు వెళ్లినట్లు నిరూపించండిఈ క్షణమే రాజీనామా చేస్తాహౌస్ మొత్తం ప్రొసీడింగ్స్‌ను రికార్డ్ చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తుందిసభలో ప్రొసీడింగ్స్ కవరేజ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడమేంటి?.మీకు దమ్ముంటే మొత్తం ఫుటేజ్‌ను విడుదల చేయండిలేకపోతే తప్పు చేశామని క్షమాపణ చెప్పండి. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కామెంట్స్..శాసనమండలి చైర్మన్ ను ఈ ప్రభుత్వం గౌరవించడం లేదుకేవలం దళితుడై నందునే మండలి చైర్మన్ ను గౌరవించడం లేదుదళితుల పట్ల ఈ ప్రభుత్వం వివక్ష చూపుతోందిచంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇందాపూర్ తెరపైకి వస్తుంది ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..ఇందాపూర్ పై చర్చ పెట్టాలని ఐదు రోజులుగా కోరుతున్నాంమేం చెప్పులు విడిచిన తర్వాతే వేంకటేశ్వరస్వామి ఫొటోలతో పోడియం వద్దకు వెళ్లాందేవదేవుడంటే మాకు అమితమైన భక్తితిరుమల పవిత్రతను, వేంకటేశ్వరస్వామిని ప్రతిష్టను దెబ్బతీసింది చంద్రబాబులడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేసింది చంద్రబాబుమండలిలో మొత్తం ఫుటేజ్‌ను బయటపెట్టాలిచంద్రబాబు తన సొంత మనుషులతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారుఏకసభ్య కమిషన్ ద్వారా ఇందాపూర్ ,హెరిటేజ్ కు ఉన్న సంబంధాల పై విచారణ చేయించాలిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..ఇందాపూర్, హెరిటేజ్ పై చర్చ జరగాలని మేం అడుగుతున్నాంకానీ చర్చ జరగనివ్వడం లేదుఅందుకే వేంకటేశ్వరస్వామి ఫొటోలతో మండలి చైర్మన్ వద్దకు వెళ్లాంపోడియం వద్దకు మేం చెప్పులతో వెళ్లలేదుమేం చెప్పులతో దేవుడి ఫొటోలతో చైర్మన్ వద్దకు వెళ్లామని తప్పుడు ప్రచారం చేశారుమండలిలో ఫుటేజ్ ను మొత్తం బయటపెట్టాలని చైర్మన్ ను కోరాంకానీ మేం మండలి నుంచి బయటికి రాకుండానే మార్ఫింగ్ ఫొటోలను ప్రచారం చేశారుమాకు పూర్తి వీడియో ఫుటేజ్ ఇచ్చే వరకూ మేం పోరాటం చేస్తూనే ఉంటాందమ్ముంటే మండలిలోని పూర్తి వీడియో ఫుటేజ్ ను ప్రభుత్వం బయటపెట్టాలి ఎమ్మెల్సీ, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్..ఏపీలో శాంతిభద్రతలు లేవుప్రశ్నించే వారి ఇంటి పై దాడులు చేస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారుఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డూ పై ప్రచారం చేసినందుకు చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదాలడ్డూ కల్తీ జరిగిందంటూ ఫ్లెక్సీలు పెట్టినందుకు చంద్రబాబుకి ఏమీ అనిపించడం లేదా?లడ్డూలో కల్తీ జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం చర్చకు భయపడుతుందిమండలిలో చెప్పులు వేసుకుని మేం దేవుడి ఫొటోలతో పోడియం వద్ద నిరసన చేశామని ప్రచారం చేస్తున్నారుశాసనమండలి సెక్రటరీ జనరల్ నియంతలా వ్యవహరిస్తున్నారుమండలి చైర్మన్ కు కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదుమా పై పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల కామెంట్స్..దేవుడి చిత్రపటం చూసైనా చంద్రబాబు బుద్ధి మారుతుందేమో అనుకున్నాం.అందరం చెప్పులు విడిచే స్వామివారి పటాలు పట్టుకున్నాం.మా చేతిలోని దేవుడి చిత్ర పటాలు లాక్కొని బయటకు పంపించారు.గతంలో టీడీపీ నేతలు చెప్పులతో పూజలు చేశారు.చంద్రబాబు గతంలో చెప్పులతో రాజధానికి శంకుస్థాపన చేశారు.తిరుమల లడ్డూ అంశాన్ని మేము రాజకీయ కోణంలో చూడటం లేదు.ఏపీలో తిరుమల ఉందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం.టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.టీటీడీకి ఇందాపూర్ నెయ్యి సరఫరాపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాం.శుక్రవారం నాటి మండలి పూర్తి వీడియో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. 👉 శాసనమండలి కాసేపు వాయిదా.. టీడీపీ ఎడిటింగ్ వీడియో విడుదలపై ఫిర్యాదు..మండలి చైర్మన్ చాంబర్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భేటీ.శుక్రవారం నాటి మండలి ఫుటేజీని విడుదల చేయాలని ఆందోళన.మొత్తం ఫుటేజీ విడుదల చేయాలని రమేష్ యాదవ్ ఫిర్యాదు.టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో విడుదల చేయడంపై ఫిర్యాదు.ఎడిట్ వీడియో బయటకు ఎలా వచ్చిందో తేల్చాలని డిమాండ్.ఫుటేజీ కోసం అసెంబ్లీ అధికారులను ఆదేశించిన చైర్మన్.మొత్తం ఫుటేజీ లేదన్న అధికారుల సమాధానంపై ఆగ్రహం. మండలిలో చర్చ జరగాల్సిందే: బొత్సతిరుపతి లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామన్న వ్యాఖ్యలపై స్పందించిన బొత్సఅసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనేది మాకు అనవసరం.మాకు మాత్రం మండలిలో చర్చ జరగాలి.రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందిదేవదేవుడిపై నిండాపనిందలు రాకుండా ప్రభుత్వం చర్చకి రావాలి.శాసనమండలిలో గందరగోళంచైర్మన్ పోడియం వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, కూటమి ఎమ్మెల్సీలునినాదాలు చేసిన ఇరుపక్షాలుసభలో గందరగోళ పరిస్థితి..సభకు కొద్ది సేపు విరామం ప్రకటించిన మండలి చైర్మన్శాసన మండలి చైర్మన్‌తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల సమావేశం11:30 గంటలకి బీఏసీ సమావేశం నిర్వహించనున్న చైర్మన్..లడ్డూ అంశంపై మండలిలో చర్చించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం👉 హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా వున్న ఇందాపూర్ డైయిరీ అంశంపై శాసన మండలిలో చర్చించాలని కోరుతూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, మరోసారి వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు.👉 దీంతో, చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్ద వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు చేశారు. .వైఎస్సార్సీపీ సభ్యులకు పోటీగా చైర్మన్ పోడియం వద్దకు కూటమి ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మండలి వాయిదా పడింది. -
‘లడ్డూ’పై బాబు సర్కారు ఏకసభ్య కమిటీ.. నేడు ‘సుప్రీం’లో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలో చంద్రబాబు రాజకీయ దురుద్దేశాలతో నిరాధార ఆరోపణలు చేయడం... దీనిపై స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ సిట్ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి, సొంత విచారణకు చంద్రబాబు ఏకసభ్య కమిటీని నియమించటాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.సీఎం అబద్ధాలు ప్రచారం చేశారురాజకీయ దురుద్దేశాలతో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని తన పిటిషన్లో సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా ఆక్షేపించారు. దీనిపై రాజకీయ కుట్రలు, వాస్తవాలను వెలికి తీసేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా స్వతంత్ర నిపుణుల కమిటీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు.స్వయంగా ‘సుప్రీం’ పర్యవేక్షిస్తున్నా ఏకసభ్య కమిటీనా..? లడ్డూ ప్రసాదం విషయంలో నిగ్గు తేల్చేందుకు స్వయంగా సుప్రీంకోర్టు ఇప్పటికే జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ సిట్ విచారణ కొనసాగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్‌తో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడం పట్ల సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, న్యాయ ప్రక్రియను పక్కదోవ పట్టించే యత్నమని పిటిషన్లో నివేదించారు.కుట్ర బెడిసికొట్టడంతో కమిటీ పన్నాగం!శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని ఇప్పటికే ప్రతిష్టాత్మక ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ లాబ్‌లు స్పష్టం చేయగా సీబీఐ దర్యాప్తులోనూ అదే విషయం స్పష్టమైంది. దీనిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో ఏ ఒక్క వైఎస్సార్సీపీ నేత పేరును ప్రస్తావించలేదు. దీంతో చంద్రబాబు దుష్ప్రచారం బెడిసికొట్టడంతో మరో కొత్త కుత్రంత్రానికి తెర తీశారు. తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవాలనే రాజకీయ కుట్రతో దినేష్ కుమార్ కమిటీని నియమించారు.బాబు సర్కారుపై ‘సుప్రీం’ ఘాటు వ్యాఖ్యలు..చంద్రబాబు సర్కారు దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘కనీసం దేవుడినైనా మీ రాజకీయాలకు దూరంగా ఉంచండి..’ అంటూ చంద్రబాబునుద్దేశించి గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడం, ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కారు తాజాగా ఏకసభ్య కమిటీని నియమించడంపై దాఖలైన పిటిషన్ నేడు విచారణకు రానుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.స్వామి పిటిషన్లో ఆరుగురు ప్రతివాదులు వీరే..⇒ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం⇒ కేంద్ర ప్రభుత్వం ⇒ చంద్రబాబు (ఏపీ సీఎం)⇒ సిట్ (రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు బందం)⇒ సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)⇒ టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) -
బాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్
-
లడ్డూపై ఏకసభ్య కమిటీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సుబ్రహ్మణ్య స్వామి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సుబ్రహ్మణ్య స్వామి సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆయన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మసనం రేపు(సోమవారం) విచారణ చేపట్టనుంది.కాగా, తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌పై చంద్రబాబు ప్రభుత్వం మరో కమిటీ నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ సీఎం చంద్రబాబు, సిట్, సీబీఐ, టీటీడీలను చేర్చారు.అయితే, తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కారు ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కల్తీ కుతంత్రం పనిచేయకపోవడంతో చంద్రబాబు.. తన సొంత కమిటీ వేశారు. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో, కూటమి ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపింది. సిట్ సూచనలకు భిన్నంగా కమిటీ ఏర్పాటు చేసి.. తమకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకోవాలని బాబు ప్రభుత్వం భావిస్తోంది. -
‘చంద్రబాబు సర్కార్ ఎందుకు తోకముడిచింది?’
సాక్షి, విజయవాడ: ఏపీలో లడ్డూ రాజకీయం నడుస్తోందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయానికి వాడుకుందని దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర పెద్దగా బాధ్యతగా ఉండాల్సిన ముఖ్యమంత్రి అసత్యాలు, అబద్ధాలు ఆడారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలాంటి జంతువుల కొవ్వు లేదు.. కల్తీ జరగలేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొందని.. చేసిన తప్పుడు ప్రచారానికి కూటమి నేతలు, ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్‌ను హిందువులకు దూరం చేయాలని కుట్రపన్నారు. సీబీఐ రిపోర్టు ఇచ్చినా జగన్‌పై బురదజల్లడం మానుకోలేదు. సీబీఐ ఛార్జిషీట్ కోర్డులో ఫైల్ చేసిన తర్వాత కూడా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. మీ కనుసన్నల్లో ఉన్న రిటైర్డ్ అధికారితో ఏకసభ్య కమిషన్ వేస్తే వాస్తవాలను ఎలా ఇస్తుంది’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు.‘‘గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే ఏకసభ్య కమిషన్ ఏంచేసింది?. వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో తొక్కిసలాట జరిగితే మీ కమిషన్ ఏంచేసింది?. ఇందాపూర్, బోలేబాబా, హెరిటేజ్‌పై చర్చకు శాసనమండలిలో వైఎస్సార్సీపీ తీర్మానం ఇచ్చింది. తీర్మానంపై కూటమి ప్రభుత్వం ఎందుకు తోకముడిచిందో సమాధానం చెప్పాలి. జంతువుల కొవ్వు, బాత్ రూమ్ కెమికల్స్ కలిపినట్లు ఏ ఆధారాలతో మాట్లాడారో సమాధానం చెప్పాలి...ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత నుంచి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి. తిరుపతి లడ్డూ చాలా సున్నితమైన అంశమని అసెంబ్లీలో చెబుతున్నారు. క్యాబినెట్ లో లడ్డూ అంశంపై చర్చించినప్పుడు తెలియదా ఇది సున్నితమైన అంశమని.. ఈ ప్రభుత్వం వేసింది ఏకసభ్య కమిషన్ కాదు తెలుగుదేశం కమిషన్. లడ్డూపై రాజకీయం చేసిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలి. ఏడు కొండలను రెండు కొండలు చేస్తానన్నాడని వైఎస్సార్‌పై అపవాదులు వేశారు...ఏడుకొండలను కాపాడాలని వైఎస్సార్ 746,747 జీవోలను తెచ్చారు. ఎంతకాలం కూటమి నేతలు దేవుడితో రాజకీయం చేస్తారు. కూటమి 20 నెలల పాలనలో ఏపీ కేంద్రంగా గోమాంసం ఎగుమతి అవుతోంది. విశాఖలో లక్షల కిలోల గో మాంసాన్ని పట్టుకున్నారు. గో మాంసం దొరికితే కూటమి నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?. ఏపీలో గోవులు యథేచ్ఛగా హత్యకు గురవుతుంటే ఏం చేస్తున్నారు?. గోవుల అక్రమ రవాణా జరుగుతుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. గోబెల్స్ మంత్రులంతా వైఎస్సార్సీపీ హిందూ మతానికి క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. మంత్రులు ఏ మొహం పెట్టుకుని హిందూ ధర్మానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు...దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు కొట్టేయడానికి జీవో నెంబర్ 15 తెచ్చారు. గొడుగుపేట ఆలయం భూములు కొట్టేయాలని చూశారు. టెక్కలిలో ఆలయ భూములు కొట్టేయాలని చూశారు. నిరాధార ఆరోపణలు చేసిన శ్రీశైలం ఆలయ ఛైర్మన్‌ను తక్షణమే ప్రభుత్వం డిస్మిస్ చేయాలి. సీబీఐ రిపోర్టు బయటికి వచ్చాక టీడీపీ నేతలకు మొహం చెల్లడం లేదు. నిన్న కూటమి మంత్రులతో లోకేష్ బలవంతంగా మాట్లాడించినట్లు తెలుస్తోంది. 21, 22, 23 తేదీల్లో ప్రజలకు, గుళ్లవద్దకు, స్వామీజీల వద్దకు వెళతామంటున్నారు. ఏపీలో ఏ దేవాలయం, స్వామీజీ వద్దకు వెళ్లి మీరు చెప్పగలుగుతారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. కల్తీ జరగకుండానే తిరుపతి లడ్డూని రాజకీయానికి వాడుకున్నారు...ఏ మొహం పెట్టుకుని వెంకటేశ్వరస్వామి వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ గురించి చెబుతారు. శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గరకు వెళ్లి ఆ స్వామికి ఏం సమాధానం చెబుతారు?. శివరాత్రికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయలేకపోయారని ఆ స్వామి మిమ్మల్ని ప్రశ్నించరా?. కాళహస్తిలో వెండి పడగలను కూటమి నేతలు అమ్ముకుంటున్నారు. తన వెండి పడగలను అమ్ముకుంటున్నారని ఆ స్వామి ప్రశ్నిస్తే ఏ మొహం పెట్టుకుని సమాధానం చెబుతారు?. శివభక్తులపై లాఠీలు ప్రయోగించిన మీరు శ్రీశైల మల్లేశ్వరుడికి ఏం సమాధానం చెబుతారు?. ట్రస్ట్ బోర్డు మెంబర్ భర్త దుర్గగుడి సిబ్బందిని దూషించారు. దుర్గగుడికి ఏ మొహం పెట్టుకుని వెళతారు?..నా క్షేత్రంలో గోవులు చనిపోతే ఏం చేశారని ద్వారకా తిరుమలేశుడు అడిగితే ఏం సమాధానం చెబుతారు. ఎలుకలు తింటున్న తన ప్రసాదాన్ని భక్తులకు ఇస్తున్నారేంటయ్యా అని అన్నవరం సత్యదేవుడు అడిగితే ఏం సమాధానం చెబుతారు?. నాశిరకం గోడలు కట్టి భక్తులు చనిపోతే ఏ మొహం పెట్టుకుని నాకు ఫిర్యాదు చేయడానికి వచ్చారయ్యా అని సింహాద్రి అప్పన్న అడిగితే ఏం సమాధానం చెబుతారు?...సినిమా వాల్ పోస్టర్ల పక్కన వెంకటేశ్వరస్వామిని నిలబెట్టడమేంటి?. నేరాలు కట్టడి చేయాల్సిన పోలీసులు టీడీపీ పెట్టిన బ్యానర్లకు కాపలా కాయడమేంటి?. హిందూ ధర్మానికి లెంపలేసుకుని క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబు, పవన్, కూటమి నేతలు. వైఎస్ జగన్‌కి సమాధానం చెప్పే అర్హత, సత్తా టీడీపీ నేతలకు లేదు’’ అని మల్లాది విష్ణు అన్నారు. -
లడ్డుకు చంద్రపోటు.. అడ్డంగా దొరికిపోయావ్ గా..
-
నెయ్యి కాంట్రాక్టు కోసమే కల్తీ డ్రామా.. దొరికిపోవడంతో మరో కొత్త కుట్ర
-
నాయుడు.. మీరు టీటీడీకి ఛైర్మన్.. టీడీపీకి కాదు: బొత్స
సాక్షి, అమరావతి: ఇవాళ కూడా సభలో యథావిధిగా ప్రభుత్వం తోకముడిచిందని శాసనమండలి విపక్షనేత, బొత్స సత్యనారాయణ అన్నారు. శాసన మండలి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. దేవదేవుడి ప్రసాదంపై చంద్రబాబు అపవాదు వేశారు. చంద్రబాబు దోపిడీపై చర్చకు రమ్మంటే సభలో గందరగోళం సృష్టించారు. తమ ధన దాహం, దోపిడీ కోసం ప్రసాదంలో కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. చర్చకు రమ్మంటే తిరిగి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారు’’ అంటూ బొత్స మండిపడ్డారు.‘‘మాకు లీగల్ నోటీసులివ్వడం హాస్యాస్పదం. చంద్రబాబు ఎందుకు చర్చకు రావడం లేదు?. మీ ధనదాహం కోసం.. మీ హెరిటేజ్ స్వలాభం కోసం ఇందాపూర్‌తో ఉన్న మీ సంబంధాలు బయటికి వస్తాయని భయపడుతున్నారు. మేం చెప్పింది వాస్తవం కాదా.. దేవదేవుడి ప్రసాదంపై ఎన్ని నిందలు వేశారు. ఇది మహాపాపం కాదా?. నిజంగా తప్పు చేస్తే వారి పై చర్యలు తీసుకోండనే మేం కోరుతున్నాం. సుప్రీంకోర్టు కూడా మేం చెప్పిందే చెప్పింది. ఇందాపూర్‌కు హెరిటేజ్ సంస్థకు ఒప్పందాలున్నాయి. ఆ ఒప్పందాల ప్రకారం తమ ధనదాహం కోసం చంద్రబాబు ఆయన కుటుంబం ఇలాంటి అకృత్యానికి పాల్పడ్డారు...చంద్రబాబు ఎంత నంగనాచిలా మాట్లాడాడు. చంద్రబాబు, పవన్, కూటమి నేతలు దేవదేవుడిపై నిందలు వేసి మహా పాపం చేశారు. సాక్ష్యాలు ఉంటే చర్చకు రమ్మంటున్నారు. చర్చ చేస్తే సాక్ష్యాలు బయటికి వస్తాయి. టీడీపీ చేస్తున్న మోసానికి టీటీడీ ఛైర్మన్ పత్రికా ప్రకటన ఇవ్వడమేంటి?. ఛైర్మన్ గారు మీరు టీటీడీకి ఛైర్మన్ టీడీపీకి కాదు. మీరు ఇలాంటి ప్రకటనలు చేయాలంటే మీ పదవికి రాజీనామా చేసి మాట్లాడండి. టీటీడీ ఛైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి వివరణలు ఇవ్వడం మానుకోండి. ఇందాపూర్‌కు హెరిటేజ్‌కు సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. ఇవిగో అచ్చెన్నాయుడు ఆధారాలు చూపిస్తున్నా....మీ మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది. మేం చెప్పేది వాస్తవమో అవాస్తవమో హెరిటేజ్ వెబ్సైట్లో చూడమని ప్రజలను కోరుతున్నా. హెరిటేజ్ నుంచి నాకు ఎలాంటి నోటీసు రాలేదు. కేరళ ప్రభుత్వం హెరిటేజ్‌ను బ్యాన్ చేయడమేనా అవార్డు. హర్యానా ప్రభుత్వం లక్ష రూపాయలు ఫైన్ వేయడమేనా రివార్డ్. ఇలాంటి సంస్థకు నేను క్షమాపణ చెప్పాలనడం సిగ్గుచేటు. శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ జరగాలి.. అదే సమయంలో ఇందాపూర్, తిరుపతి లడ్డూపై చర్చ చేయాలి. నేను కాదు క్షమాపణ చెప్పాల్సింది..దేవదేవుడి పై నిందలు వేసిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ముందు మీరు చేసిన పనికి తప్పు మాట్లాడామని లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పండి. నేను చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా. నేను చంద్రబాబు లాగా అడ్డగోలుగా మాట్లాడే వ్యక్తిని కాదు. మేం దేవదేవుడి పవిత్రత గురించి మాట్లాడుతున్నాం. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు ధనదాహం గురించి మాట్లాడుతున్నారు. నేను వ్యాపారాలు, షేర్ మార్కెట్ గురించి మాట్లాడలేదు. కేవలం ఏడాది కాలంలో హెరిటేజ్ షేర్ వాల్యూ 300 నుంచి 700 కు ఎలా వెళ్లింది. షేర్ మార్కెట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. 2021లో ఈనాడు పత్రిక ఇలాంటి నోటీసు ఇచ్చింది. మూడేళ్లు కిందా మీద పడి నోటీసులు వెనక్కి తీసుకుంది ..మళ్లీ ఇప్పుడు చంద్రబాబు కుటుంబ సంస్థ నోటీసులిచ్చింది. ఈనాడు నోటీసులకే దిక్కులేదు.. చంద్రబాబు ఈ నోటీసులు ఏంచేస్తాయి?చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్తిరుపతి లడ్డూ పై అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇందాపూర్‌తో హెరిటేజ్ సంబంధంపై సీబీఐ విచారణ జరిపించాలి. ఎస్ఐపీబీ ద్వారా హెరిటేజ్ సంస్థకు 295 కోట్ల రూపాయల రాయితీ ప్రకటించింది. 35 ఉద్యోగాల కోసం 300 కోట్ల రాయితీ ఇవ్వడమేంటి?. తక్షణమే హెరిటేజ్‌కు ఇచ్చిన రాయితీని కేంద్ర క్యాబినెట్ వెనక్కి తీసుకోవాలిచర్చకు రమ్మంటే ప్రభుత్వం భయపడుతోంది: కల్పలతారెడ్డిచర్చకు రమ్మంటే ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. ఇందాపూర్, తిరుపతి లడ్డూపై ఇవాళ కూడా వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. సభ బయట మంత్రులు చర్చకు సిద్ధమంటున్నారు. మేం కూడా చర్చకు రావాలనే కోరుతున్నాం. కానీ చర్చకు రావడం లేదని కల్పలతారెడ్డి అన్నారు.‘‘చంద్రబాబు గుట్టు బయటపడటంతోనే చర్చకు రావడం లేదనిపిస్తోంది. లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చింది. ఇందాపూర్ డెయిరీతో సంబంధాలున్నాయని హెరిటేజ్ వెబ్సైట్లో క్లియర్‌గా ఉంది. హెరిటేజ్‌కు సంబంధం ఉంది.. కాబట్టే చంద్రబాబు ఇందాపూర్‌కు నెయ్యి టెండర్లు కట్టబెట్టారు. 300 రూపాయలకు క్వాలిటీ నెయ్యి వస్తుందా అని చంద్రబాబు, పవన్ ప్రశ్నించారు. 2014-19 మధ్య ఇందాపూర్ కల్తీ నెయ్యి సప్లై చేసినట్లు మీరు ఒప్పుకుంటున్నారా? మా డిమాండ్ ప్రకారం కచ్చితంగా సభలో ఇందాపూర్‌పై చర్చించాల్సిందే’’ అని కల్పలతారెడ్డి అన్నారు. -
లడ్డూ కల్తీ, ఇందాపూర్ డైరీపై చర్చకు YSRCP డిమాండ్
-
హెరిటేజ్ కోసమే కుట్ర! టీటీడీ నెయ్యి పై తీగ లాగితే..!
-
సోషల్ మీడియా జమానా.. బాబు బుక్ అయినట్టేనా?
చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని అంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రను సోషల్ మీడియా వెలికితీస్తున్న వైనమిప్పుడు ఒక రకంగా సంచలనం సృష్టిస్తోంది. హిందూ మతోద్ధారకుడిగా తరచూ ప్రచారం చేసుకుంటున్న ఆయన అసలు రూపాన్ని బయటపెట్టాయి ఈ పోస్టులు.తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందంటూ దిక్కుమాలిన వివాదాన్ని సృష్టించి వైఎస్సార్సీపీపై రుద్దేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. పైగా.. ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన నిర్దిష్ట ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు తొమ్మిది మంది నేతలతో సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది బాబుగారికి. అక్కడ కూడా మరోసారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు కల్తీ అంటూ ఏదో మాట్లాడబోయారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్పించుకుని డబ్బుకోసం ఈ కల్తీ జరిగిందని తనకు తోచిన సలహాను చంద్రబాబు చెవిలో చెప్పేయత్నం చేశారు. దానిని అంగీకరించని చంద్రబాబు అవినీతి కాదు.. హిందూమతంపై దాడి చేయడానికి జరిగిన కుట్ర అని ప్రకటించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తిరుమల ఏడు కొండలను రెండు కొండలుగా చెప్పారని, అప్పుడు తాను దానికి వ్యతిరేకంగా మెట్ల ద్వారా తిరుమల వెళ్లి దానిపై వారి పక్షాన క్షమాపణ కోరానని అన్నారు. నిజంగా ఆయన అలా చేశారా? అన్నది గుర్తు లేదు కాని కొంతమంది సోషల్ మీడియా ప్రముఖులు చూపిన ఆధారాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది మొదలు టీడీపీ మీడియా, ఇతరత్రా వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు ఆరంభించాయి. హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయాలని ప్లాన్ చేశారు. పంచాయితీ ఎన్నికలు సందర్భంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పవిత్రమైన తిరుమల ప్రాంతంలో ఎన్నికలు జరపడం సరికాదన్న భావనతో వందేళ్లుగా తిరుమల కొండలుగా భావిస్తున్న ప్రాంతంలో ఎన్నికలు జరపవద్దని ఒక జీవో ఇచ్చారు. పచ్చ తమ్ముళ్లు దీన్ని ఓ అవకాశంగా తీసుకుని సహచర ఎల్లో మీడియా సాయంతో వివాదాన్ని సృష్టించారు. ఆ జీవోను వైఎస్‌కు అంటకట్టి అందులోని వివరాల ప్రకారం రెండు కొండలే పరిధిలోకి వస్తాయని, ఏడు కొండలు రావని అంటూ గొడవ మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న రాజశేఖరరెడ్డి తిరుమల విస్తీర్ణంపై ఉన్న అస్పష్టతను వెంటనే తొలగిస్తూ మొత్తం ఏడు కొండలూ వచ్చేలా కచ్చితమైన జీవో ఇచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలో 18 ప్రముఖ హిందూ దేవాలయాలున్న ప్రాంతాలను టెంపుల్ సిటీలుగా ప్రకటించి ఆయాచోట్ల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అన్యమత ప్రచారంపై నిషేధం విధిస్తూ మరో జీవో జారీ చేశారు.అంతేకాదు... వైఎస్ తన హయాంలో తిరుమల విశిష్టతను కాపాడేలా, హిందు మత విశ్వాసాలను పరిరక్షించేలా అనేక చర్యల తీసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలలో ఎస్వీబీసీ ఛానెల్ పెట్టి స్వామివారి ప్రచారం చేయాలని సంకల్పిస్తే చంద్రబాబు దాన్ని అసెంబ్లీలోనే వ్యతిరేకించారు. ఆ ఛానెల్‌కు రూ.40 కోట్లు వృథా అని అని వాదించారు. 2009 ఎన్నికలకు ముందు గుంటూరు వద్ద జరిగిన బైబిల్ మిషన్ ఉత్సవాల్లో చంద్రబాబు చేసిన ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఏడు కొండలూ తిరుమలేశుడివే అని, అన్యమత ప్రచారం నిషేధిస్తూ వైఎస్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తామని ఆ సభలో ప్రకటించారు. ఈ జీవోల వల్ల క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని కూడా చంద్రబాబు అన్నారట. ఇప్పుడేమో తాను రెండు కొండలు, ఏడు కొండలు పోరాటం చేశానని చెబుతున్నారు. అప్పుడేమో హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధించే జీవోను రద్దు చేస్తామన్నారు. 2019-24 మధ్యలో అన్యమత ప్రచారం జరిగిపోతుందన్నట్లు వదంతులు సృష్టించి టీడీపీ మీడియా ప్రచారం చేసేది. ఎంత ఆత్మవంచన.2009లో ప్రముఖ హిందూవాది టి.హనుమాన్ చౌదరి ఒక లేఖ రాస్తూ చంద్రబాబు తీరును తప్పు పట్టారు. అన్యమత ప్రచారానికి అవకాశం ఇచ్చే విధంగా జీవో ఇస్తానని చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. క్రిస్టియన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. క్రిస్టియన్లుగా మారిన ఎస్సీ, ఎస్టీ హిందువులకు కూడా రిజర్వేషన్లు వర్తింప చేస్తామని చంద్రబాబు ఇచ్చిన మరో హామీని కూడా ఆయన విమర్శించారు. క్రిస్టియన్ ఓట్ల కోసం, మత మార్పిడులను ప్రోత్సహించేలా చంద్రబాబు ఇలాంటి హామీలు ఇచ్చారని విమర్శిస్తూ 2009 ఫిబ్రవరి మూడున రాసిన లేఖ సోషల్ మీడియా యాక్టివిస్టులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఇది రాకపోతే చంద్రబాబు చెప్పే మాటలు నిజమేనేమో, ఈయన హిందుత్వ కోసం కట్టుబడి ఉండే వ్యక్తేమో అన్న భావన ఉండేది కదా!.1996 ఎన్నికల సమయంలో చంద్రబాబు కమ్యూనిస్టులతో పొత్తులో ఉండేవారు. ప్రచార సభలో బీజేపీని మతతత్వ పార్టీగా, మసీదులు కూల్చే పార్టీగా ధ్వజమెత్తేవారు. 2004లో ఓటమి తర్వాత జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోనని మహానాడులో ప్రకటించారు. కానీ, ఆ తర్వాత జరిగిన సంగతులు తెలిసినవే. గుజరాత్లో జరిగిన మత కలహాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి మోదీని పదవి నుంచి దించాలని డిమాండ్ చేసి, తదుపరి లోక్‌సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఓటింగ్ వరకు ఉండకుండా జారుకున్నారు. 2019లో ప్రధాని మోదీపై వ్యక్తిగత పరుష వ్యాఖ్యలు చేసింది ఇటీవలి చరిత్రే. 2024 వచ్చేసరికి మోదీ ప్రపంచానికి మార్గదర్శి అని, దేశానికి ఆయన గొప్ప సేవలు చేస్తున్నారని ప్రకటించారు. ఇప్పటికీ కూడా ప్రధానిని అదే తరహాలో పొగుడుతున్నారు.ఇక లడ్డూ వివాదంలో తను చేసిన ఆరోపణ నిజమని జనాన్ని నమ్మించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఈయన మాటలను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు లేదు. అందువల్లే ఢిల్లీ టూర్లో మీడియా లడ్డూ గురించి అడిగినా స్పందించలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో హెరిటేజ్ పెరుగు నాణ్యతపై వచ్చిన ఆరోపణలు, ఫుడ్ సేఫ్టీ సంస్థ రూ.లక్ష జరిమానా విధించిన సమాచారం రాగానే చంద్రబాబుకు చెందిన ఆ కంపెనీ స్పందించిన తీరు చర్చనీయాంశంగా ఉంది. ల్యాబ్ పరీక్షల తీరుపై హెరిటేజ్ సంస్థ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో సరైన ప్రొసీజర్ ఫాలో కాలేదని అభిప్రాయపడింది. సీల్డ్ ప్యాకెట్ల నుంచి పెరుగు సాంపుల్ తీశారా? లేక లుజ్గా తీసుకున్నారా? అన్న సందేహం వ్యక్తం చేసింది.డెయిరీ ఉత్సత్తులలో వివిధ కారణాల వల్ల స్వల్పంగా విశ్లేషణలలో తేడా రావచ్చని, ఇందులో ప్రమాదకరమైనవి కాని, ప్రజారోగ్యానికి భంగం కలిగించేవి ఏవీ లేవని పేర్కొంది. ఒక ప్రైవేటు సంస్థ అయిన హెరిటేజ్ ఇంత కంగారుపడి ఈ ప్రకటన చేసిందే. మరి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తదితరులు పదే పదే జంతు కొవ్వు, పంది మాంసం వంటివి లడ్డూలో కలిశాయని చెబుతున్నారే. అధి ధర్మమేనా ? అంటే తన సంస్థ కైతే ఒక రూల్స్.. అదే ప్రజలందరూ కొలిచే దైవం విషయంలో మరో రకంగా ప్రవర్తిస్తారా? తన దాకా వస్తేకాని తత్వం బోధపడదని అంటారు! ఇదే అన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లడ్డు వివాదం.. తిరుమలలో సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: తిరుమల లడ్డూపై కూటమి నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వేళ ఈ వ్యవహారంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డు వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు.తిరుమలలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ..‘తిరుపతి లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి. తప్పు చేసిన అధికారులను, పాత ఈవోను వదిలేయకూడదు. రాజకీయ లబ్ధి కోసమే అధికార పార్టీ లడ్డుపై రాద్ధాంతం చేస్తున్నాయి. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదు. మీ రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తులను మనోవేదనకు గురి చేయొద్దు. సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సమయంలో రాజకీయ నేతలు లడ్డుపై మాట్లాడటం ఆపేయాలి. మీ రాజకీయాల కోసం కావాలంటే కొట్టుకోండి.. కానీ దేవుడిని మాత్రం లాగొద్దు. లడ్డు వివాదంపై అనవసర చర్చలు ఆపి, భక్తుల మనోభావాలను కాపాడండి’ అని హితవు పలికారు. -
తప్పు చేశాం.. నేతల కళ్ళల్లో పశ్చాత్తాపం
-
హెరిటేజ్ పెరుగులో పెరుగు లేదట..!
ప్రపంచంలో తానే అత్యంత నీతిమంతుడినని.. తాను పుట్టిన తర్వాతే లోకంలో పద్ధతి నీతి నిజాయితీ ధర్మం అని ఉద్భవించాయని చెప్పే చంద్రబాబు తాను నిర్వహించే హెరిటేజ్ పెరుగులో పెరుగు లేకుండానే కేవలం కల్తి ఉత్పత్తులను మార్కెట్లోకి పంపించి కోట్లు కొల్లగొడుతున్నారు. శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడినట్లు ప్రపంచంలో అందరికీ నీతులు చెప్పే చంద్రబాబు ఆయన సారధ్యంలోని హెరిటేజ్ కల్తీ ఉత్పత్తులని అమ్ముతూ దొరికిపోయింది. పెరుగు అంటూ విక్రయిస్తున్న ఆ ప్యాకెట్లలో అసలు పెరిగే లేదని గురుగాంలో ఏకంగా కేసు నమోదయింది. వివిధ స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో అది మొత్తం కల్తీ అని తేలడంతో ఏకంగా లక్ష రూపాయలు పెనాల్టీ సైతం విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీంతో దెబ్బకు దెయ్యం జడుస్తుంది అన్నట్లుగా హెరిటేజ్ సంస్థ దారికి వచ్చింది. ఈ క్రమంలో సంస్థ ఒక ప్రకటన చేసింది. హెరిటేజ్ సంస్థపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది. . తమ ఉత్పత్తుల తయారీలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తామన్నారు. తమకు వెన్న శాతం తగ్గించే ఉద్దేశమే లేదన్నారు. ఇదే తరుణంలో అసలు హెరిటేజ్ పెరుగుకు సంబంధించి శాంపిల్స్ సేకరించే ప్రక్రియ సరిగా లేదంటూ ఎదురుదాడి చేసింది.అయితే హెరిటేజ్ ఉత్పత్తులకు సంబంధించిన నమూనాలను సేకరింంచే సమయంలో సరైన పద్ధతి పాటించలేదన్నారు.. ఆ మొత్తం ప్రక్రియలో లోపాలు ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు. 'నిర్దేశిత ప్రమాణాల కంటే ఎస్ఎన్ఎఫ్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు ల్యాబ్ నివేదికలో తేలింది. దీంతో అసలు ఆ నమూనాల సేకరణ ప్రక్రియ సరిగా లేదని బుకాయిస్తోంది.మరి తిరుపతి లడ్డూకు ఈ నిబంధనలు వర్తించవాహెరిటేజ్ ఉత్పత్తులకు సంబంధించి నమూనాలు సేకరించే క్రమంలో నిబంధనలు పాటించలేదని, థర్డ్ పార్టీ సమక్షంలో నమూనాలు తీయలేదని అంటూ ప్రభుత్వ సంస్థలను వాటి పనితీరును తప్పుపట్టిన హెరిటేజ్ దాని యజమాని చంద్రబాబు తిరుపతి లడ్డు విషయంలో మాత్రం తమకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తిరుపతి లడ్డు కోసం వినియోగించే నెయ్యిని కల్తీ చేశారంటూ అవాస్తవాలు ప్రచారం చేసిన చంద్రబాబు నా నమూనాలు సేకరించే విషయంలో ప్రమాణాలు పాటించారా లేదా చెప్పడం లేదు. బోలె బాబా డైరీ నుంచి వచ్చే నెయ్యి నమూనాలను థర్డ్ పార్టీ సమక్షంలో సేకరించారా లేదా. .. నెయ్యి నమూనాలను ని ట్యాంకర్ల నుంచి నేరుగా సేకరించారా ? లూజ్ నెయ్యిని వేరే పాత్రలోకి తీసుకుని దాన్ని ల్యాబ్ పరీక్షలకు పంపారా అనేది కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. తాము బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి తమకు ఇబ్బంది వచ్చినపుడు నీతులు చెప్పడం పద్ధతి కాదని ప్రజలు అంటున్నారు. ఎదుటివారిపై అభాండాలు వేసేటపుడు వెనకా ముందూ చూడని చంద్రబాబు తనవరకు వచ్చేసరికి అందరూ నిబంధనలు పాటించాలని రోదిస్తున్నారు.తిరుమల లడ్డుకోసం వాడే నేతి కి సంబంధించి నామూనాలు థర్డ్ పార్టీ సమక్షంలో తీసారా లేదా.. నేతి నాణ్యతను నిర్ధారించే పరీక్షలు సరిగానే చేశారా లేదా అనేది తేల్చకుండానే బురద చెల్లుతున్న చంద్రబాబు తన హెరిటేజ్ పెరుగు విషయానికి వచ్చేసరికి రూల్స్..నిబంధనలు అంటూ ఆక్రందనలు చేస్తున్నారు. నీవరకు వచ్చేసరికి ఒక రూల్.. మిగతావారికి ఇంకో రూల్ ఎలా బాబూ -
కల్తీపై ఢిల్లీ రిపోర్టర్ ప్రశ్న.. తప్పించుకున్న చంద్రబాబు
-
దొరికిపోయా.. కాపాడండి ప్లీజ్.. లడ్డూపై దుష్ప్రచారం.. సాయం కోసం ఢిల్లీకి..
-
‘కొంతమంది స్వాములను చంద్రబాబు భయపెట్టి లేఖలు రాయిస్తున్నారు’
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారన్నారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తిరుపతి నుంచి మీడియాతో మాట్లాడిన భూమన.. తిరుమల లడ్డూపై సిట్ ఇచ్చిన రిపోర్ట్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడు, ముద్దాడ, రవిచంద్ర బలవంతంగా పెద్ద జీయర్ స్వామితో లేఖ రాయించారు. లడ్డూ అంశంలో రాజకీయ నాయకులకు ఎలాంటి ప్రమేయంలేదని సిట్ స్పష్టంగా చెప్పింది. కొంతమంది స్వాములను చంద్రబాబు భయపెట్టి లేఖలు రాయిస్తున్నారు. చంద్రబాబు క్షద్ర రాజకీయాల్లో ఆధ్యాత్మికవేత్తలు నలిగిపోతున్నారు. స్వాములను భయపెట్టి చంద్రబాబ ఏం సాధించాలని అనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.‘కొంతమంది స్వాములకు భక్తి కంటే పైరవీలు ఎక్కువ అవసరం. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్టులపైనే ఎల్లో మీడియా దాడులు చేస్తోంది. హైందవ సమాజానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు రెడ్‌బుక్ పాలన పెద్ద జీయర్స్వామిపైకి మళ్లింది. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
హెరిటేజ్ పెరుగు నాసిరకం.. నెయ్యిపై నారా ఆరోపణలు?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్: ముఖ్యమంత్రి చంద్రబాబు.. దేవుడిని అడ్డుపెట్టుకుని కుట్రలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. బరితెగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారని అన్నారు. బోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వచ్చింది చంద్రబాబు పాలనలోనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘మేము అబద్ధాల కోరు చంద్రబాబుతో కొట్లాడుతున్నాం. ప్రతిరోజూ ఆయనతో కొట్లాడకపోతే ఆయన చెప్పే అబద్ధం ప్రపంచం అంతా తిరుగుతుంది. అందుకే మేము తిరుమల పవిత్రతపై రోజూ మాట్లాడాల్సి వస్తోంది. కేవలం హిందువుల్లో జగన్ పట్ల వ్యతిరేకత రావాలనే చంద్రబాబు దుష్ప్రచారానికి దిగాడు. దేవుడిని కూడా అడ్డు పెట్టుకుని కుట్రలకు తెర లేపారు. జంతువుల కొవ్వు కలిసింది అని మొట్టమొదటి అబద్దం చెప్పాడు. స్వామి వారి పవిత్రతకు భంగం కలగకుండా ఉండాలి అనుకుంటే ఈ విషయం మాట్లాడరు.గోప్యంగా విచారణ చేసి నిజాలు తేలిన తర్వాత ఏదైనా ఉంటే అప్పుడు ప్రకటన చేయాలి. సుప్రీంకోర్టులో సిదార్థ్ లూథ్రా వాదిస్తుంటే జడ్జీలు మాట్లాడిన మాటలు వింటే అన్నీ తెలుస్తాయి. ఆనాడు సుప్రీంకోర్టు మందలించినా మీకు బుద్ధి రాలేదు. సీబీఐ విచారణ వేసినా దర్యాప్తు చేసింది మీ అధికారులే కదా. వారిచ్చిన రిపోర్టులో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా చెప్పారు. అప్పుడన్నా నన్ను క్షమించి స్వామీ అని దేవదేవుడిని కోరాల్సింది. అప్పుడు జంతు కొవ్వు అన్నావు.. ఇప్పుడు బాత్రూం కడిగేవి వాడారు అంటున్నావు. భోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా?.82వేల కేజీల నెయ్యి కొనుగోలుకు ఒకే రోజు అనుమతించారు. సీబీఐ రిపోర్టు కాదని ఏకసభ్య కమిషన్ ఎలా వేస్తారు?. సీబీఐ దర్యాప్తు తర్వాత ఏకసభ్య కమిషన్ వేయడమేంటి?. భోలే బాబా ఫ్రాడ్ అయినప్పుడు 82వేల కేజీల నెయ్యి ఎలా ఆర్ఢర్ ఇచ్చారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులే సరికాదని ఎలా చేప్తావు చంద్రబాబు?. బాబూ నీకు ఆత్మే లేనప్పుడు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం ఏంటి?. వైఎస్ జగన్ హయాంలో నెయ్యి నాణ్యతలో ఎక్కడా పొరపాటు చేయలేదు. బరితెగించి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నావు.ఇది కూడా చదవండి: చంద్రబాబు హెరిటేజ్ గురించి తెలుసా.. నాసిరకం పెరుగు.. సీబీఐ సిట్ చెప్పినా, ల్యాబ్స్ చెప్పినా నారా వారి మాటే కరెక్ట్ అనాలని కోరుకుంటున్నారు. మళ్ళీ ఏకసభ్య కమిషన్ అంటున్నారు.. సీబీఐ విచారణ చేసినా వీళ్లు ఒప్పుకోవడం లేదు. పాలే లేకుండా పెరుగు తయారు చేసినందుకు నీ హెరిటేజ్ సంస్థకు లక్ష రూపాయలు జరిమానా కట్టావు. దీనికి పుల్ స్టాప్ పడాలంటే ఒక్కటే మార్గం.. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఇక నిరూపించుకోవాలి. దీనికి మేము జంతు కొవ్వు కలిపితే మా చేతులు పడిపోవాలి. జంతు కొవ్వు కలవకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ నోరు పడిపోవాలి. మీ ముగ్గురికి ఆ వెంకటేశ్వర స్వామి శిక్ష తప్పకుండా విధిస్తాడు. స్వామి వారికి నువ్వు చేసిన అపచారానికి కచ్చితంగా శిక్ష పడుతుంది. నీ జీవితంలో 2029 తర్వాత నువ్వు, నీ కొడుకు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఆ తర్వాత నీ జీవితంలో మంచి రోజులే ఉండవు. నీకు స్వామి వారి పట్ల భక్తి లేదు.. ప్రజల మనోభావాలపై గౌరవం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ఇక్కడితో ఆపేయ్.. తప్పు అయ్యిందని లెంపలేసుకోని..
-
తిరుపతి లడ్డూల్లో.. బాత్ రూమ్ కెమికల్స్.. అడ్డంగా దొరికినా అదే మాట
-
బీఆర్ నాయుడు అసమర్థుడు.. స్వామి భక్తుడే కాదు: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. సీబీఐ ఇచ్చిన రిపోర్టులో లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు చూపించగలరా? అని ప్రశ్నించారు. లడ్డూపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అత్యంత అసమర్థుడు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘లడ్డూ విషయమై చంద్రబాబులో ప్రాయశ్చిత్తం కనపడటం లేదు. చంద్రబాబులో తప్పు చేశామన్న బాధ అసలే లేదు. సిగ్గూ, శరం, భయం భక్తి లేకుండా మాట్లాడుతున్నారు. సీబీఐ స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా బుకాయిస్తూనే ఉన్నారు. లడ్డూపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. రోజా, జోగి రమేష్ మాట్లాడిన మాటల వీడియోని ఎల్లో మీడియా తప్పుగా ఎడిట్ చేసింది. కట్, పేస్ట్ వీడియోని ప్రసారం చేసి శునకానందం పొందారు. లడ్డూ ఇష్యూ మీద సంవత్సరం పైగా విచారణ జరిగింది. ఆ సిట్‌లో ఉన్నది చంద్రబాబు మనుషులే.చివరికి లడ్డూలో టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ వాడారని కూడా విష ప్రచారం చేస్తున్నారు. అలాంటి యాసిడ్స్‌ని స్వీటులో కలుపుకుని బీఆర్ నాయుడు తినగలరా?. టీటీడీ చైర్మన్ నాయుడు అత్యంత అసమర్థుడు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు. అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా చేసి తిరుమల క్షేత్రానికి మచ్చ తెచ్చారు. బీఆర్ నాయుడు తన టీవీ ద్వారా హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారు. బీఆర్ నాయుడు వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరిగాయి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై దాడులు, అపచారాలు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులే ఆలయాలపై దాడులు చేయిస్తున్నారు. చెప్పులు వేసుకుని పూజలు చేసే చంద్రబాబు హిందువని చెప్పుకోవటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ సనాతని అని ఎంత చెప్పుకున్నా జనం నమ్మటం ఎప్పుడో మానేశారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
వెనుక ఒక పిలకేసుకుని.. సినిమా అనుకున్నావా?
-
తిరుమల లడ్డులో కొవ్వు కలవలేదని బాధపడిన ఇద్దరు వ్యక్తులు వాళ్ళే..
-
బాబు హయాంలోనే కల్తీ.. కూటమికి షాకిచ్చిన CBI
-
బాబూ.. లడ్డూపై ప్రశ్నిస్తే కోపమెందుకు?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపులంటే కక్ష అని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. తిరుమలపై రాజకీయం చేస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం కాపులను టార్గెట్ చేసింది. కాపులంటేనే చంద్రబాబు కక్ష సాధింపు. వంగవీటి రంగాను హత్య చేశారు. ముద్రగడను అనేక రకాలుగా వేధించారు. అంబటి మీద దాడి చేసి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. రేపు ఉదయం అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్నాం. దాడులు చేసిన వారిని వదిలేశారు. అంబటి రాంబాబుపై తప్పుడు కేసులు వ్యవహారంలో న్యాయ పరంగా పోరాటం చేస్తాము.మేము చేసేది సంఘీభావ యాత్ర మాత్రమే.. రాజకీయ యాత్ర కాదు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ నివేదిక జంతు కొవ్వు కలవలేదని చెప్పిన తర్వాత కూడా మరొక కమిటీ ఎందుకు?. టీటీడీ లడ్డూలో జంతు కొవ్వు ఉందని చెప్పించడం కోసం చంద్రబాబు కమిటీ వేశారా?. వైఎస్సార్సీపీ మీద నెపం నెట్టడం కోసం మరొక కమిటీ వేస్తున్నారా. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు లేదని వచ్చిన నివేదికపై మీడియా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుంది. గతంలో తాను నాస్తికుడుని అని ప్రకటించుకున్న నాగేంద్రబాబు నేడు సనాతన ధర్మం కోసం ఎలా మాట్లాడుతున్నారు. నాగబాబు పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో ఉంది. కల్తీ లడ్డుపై పవన్ కళ్యాణ్ స్టాండ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది’ అని ఎద్దేవా చేశారు.కరణం ధర్మ శ్రీ మాట్లాడుతూ..‘కాపులను కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. తప్పుడు కేసులు పెడుతోంది. అంబటి రాంబాబు కుటుంబానికి కాపులు అందరూ అండగా ఉంటారు. రేపు అంబటి రాంబాబు కుటుంబాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు అందరూ పరామర్శిస్తారు. రాంబాబుపై అక్రమంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. అంబటిని చంపేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నం చేశారు. కాపు అనే వారికి అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
లేని కొవ్వు కోసం.. అల్లాడిపోతున్నారమ్మా
-
శ్రీవారి పేరుతో జగన్‌పై కుట్ర
సాక్షి ప్రతినిధి, తిరుపతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామినే రాజకీయ ఆయుధంగా మార్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దైవ ద్రోహం పేరుతో వైఎస్ జగన్‌పై కుట్రకు తెగబడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తాము తప్ప మరెవ్వరూ భక్తులు కారన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గతంలో తన రాజకీయాల కోసం వ్యవస్థలను వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు తిరుమల శ్రీవారినే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో గురువారం భూమన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు లేదని సీబీఐ సిట్ తేల్చిచెప్పినా చంద్రబాబు అబద్ధాలు, దుష్ప్రచారం ఆగడంలేదని మండిపడ్డారు. భూమన ఇంకా ఏమన్నారంటే..అడ్డంగా దొరికి చంద్రబాబు నంగి మాటలు..గత పత్రికా సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు ఇవాళ ప్రజలకు దొరికిపోయామన్న భావన వారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. సీబీఐ సిట్ నివేదికతో పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు ఇప్పుడు కూటమి పార్టీలనూ తన తప్పులో భాగస్వామ్యులను చేస్తున్నాడు. గత పదేళ్లలో పవన్‌కళ్యాణ్ అనేకసార్లు ‘నేను బాప్టిజమ్ తీసుకున్నాను. మా నాన్న దేవుడి దీపంతోనే సిగరెట్ ముట్టించేవాడు. మా ఇంట్లో ఏ రకమైన దైవ పూజలు జరగవు.. అవసరమైతే నేను గొడ్డు మాంసం తింటాను’.. అంటూ చెప్పాడు. ఆయన ఇవాళ సనాతన హైందవ ధర్మ పరిరక్షక అవతారిగా మారి చంద్రబాబు ఆలోచనలకు అమ్ముడుపోయాడు. ఆలయాలపై మీ అరాచకాలు మర్చిపోయావా బాబూ.. తన హయాంలో పదుల సంఖ్యలో దేవుడి ఆలయాలను కూల్చివేసిన చంద్రబాబు ఇప్పుడు జగన్ దేవాలయాలన్నీ నాశనం చేశాడంటున్నారు. నిజానికి.. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాకే తిరుమల కొండ మీద మద్యం, మాంసాలు దొరికాయి. బిర్యానీలు తింటూ, తాగి గొడవలు చేస్తూ పట్టుబడ్డారు. కొద్దిరోజుల కిందటే మద్యం బాటిళ్లు విచ్ఛలవిడిగా పడి ఉంటే.. దాన్ని ప్రశ్నించిన మా పార్టీ కార్యకర్త మీదే కేసు బనాయించారు. బాబు హయాంలోనే వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. అయోధ్య లడ్డూల పైనా అబద్ధాలు..పవన్‌కళ్యాణ్ అయితే మరింత దారుణంగా.. అయోధ్యకి పంపించిన లడ్డూలు కల్తీ అన్న విషయాన్ని ఆ రోజు ఎవరో చెబితే మాట్లాడానని చెప్పిన వ్యక్తి.. ఇవాళ మళ్లీ అయోధ్యకి పంపిన లడ్డూలు జంతుకొవ్వుతో తయారుచేసినవే అని మాట్లాడుతున్నాడు. ఆ రోజు అయోధ్యకు పంపించిన లక్ష లడ్డూలు.. మీ ప్రభుత్వ హయాంలోనే పాలక మండలి సభ్యుడైన సౌరబ్ బోరా రూ.30 లక్షల విలువైన నెయ్యి డొనేషన్‌తో తయారుచేసి అయోధ్యకి పంపించారు. పవన్‌కళ్యాణ్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. వైవీ సుబ్బారెడ్డే సీఎఫ్టీఆర్ఐ రిపోర్టు కోసం పంపిస్తే.. ఆయనే తొక్కి పెట్టారని చెప్పడం అసమంజసం. అసలు విచారణకు పంపించిందే మేమైతే తిరిగి మాపైనే లాజిక్ లేకుండా అపవాదులు వేస్తున్నారు. అడ్డంగా దొరికిపోవడంతో ఏకసభ్య కమిషన్‌తో కుట్ర..ఇక సీబీఐ సిట్ మమ్నల్ని దోషులుగా ప్రకటించలేదు. దీంతో వారు అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అంటున్నారు. ఇది మమ్మల్ని ఎలాగైనా నేరస్తుల్ని చేయాలన్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇవాళ నేరస్తుడిగా ఉన్న ప్రీమియర్ డెయిరీ 2014–19 వరకు 80 శాతం మేర మీ హయాంలోనే నెయ్యి సరఫరా చేసింది. క్షమాపణ చెప్పాల్సిందే..మేం తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ సిట్ మమ్మల్ని దోషులుగా నివేదికలో పేర్కొనలేదు. అయినా మాపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్న మీరు క్షమాపణ చెప్పాల్సిందే. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రెండు కొండలే చేశాడని చంద్రబాబు మరో పచ్చి అబద్ధం కూడా చెబుతున్నాడు. అయితే, 2007 మే 12న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చాలా స్పష్టంగా మొత్తం 120 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏడు కొండలు శ్రీ వేంకటేశ్వరస్వామివే అని జీఓ ఇచ్చారు. ఈ నిజాలన్నింటినీ దాచి చంద్రబాబు మమ్నల్ని దైవ ద్రోహులుగా చిత్రీకరించే అతిపెద్ద కుట్రకు తెగబడుతున్నాడు. మీలాంటి వాళ్లను మాత్రం దేవదేవుడు క్షమించడు.శ్రీవారి విశేష సేవలో వైఎస్సార్, జగన్..వాస్తవానికి.. వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన దైవసేవ ఎవ్వరూ చేయలేదు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం చేయాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ మీకు రాలేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో మా హయాంలోనే పాదరక్షలు ధరించకూడదని నిబంధన విధించాం. శ్రీ వేంకటేశ్వరస్వామి అఖండ కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ కూడా మా హయాంలోనే తీసుకొచ్చాం.కొండమీద హరినామ సంకీర్తన ఏర్పాటుచేసింది, నాద నీరాజనాన్ని తీసుకొచ్చింది కూడా మేమే. తిరుమలలో నిరంతరాయంగా భాగవతం, భారతంతో పాటు వేదఘోష నిర్వహించాలని నిర్ణయం కూడా మేమే తీసుకున్నాం. వందకు పైగా పీఠాధిపతులతో సదస్సులు కూడా నిర్వహించాం. అన్యమతాల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేసిన మంగళసూత్రాలతో దాదాపు 46 వేల పెళ్లిళ్లు కూడా మా హయాంలోనే నిర్వహించాం. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ, గ్రామానికి శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని కూడా మేమే తీసుకెళ్లాం. వైఎస్ జగన్ హయంలో దేశవ్యాప్తంగా స్వామివారి ఆలయాలు.. అంతేకాదు.. ఇవాళ మేం కొత్తగా ఐదు వేల ఆలయాలను కట్టబోతున్నామని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి.. వైఎస్ జగన్ హయాంలోనే రాష్ట్రవ్యాప్తంగా 3,500 ఆలయాలు కట్టారు. వాటి నిర్మాణ భాగస్వామ్యం ఆరెస్సెస్‌కు సంబంధించిన సంస్థకు అప్పగించాం. మా హయాంలో శ్రీవాణి పథకంపై విమర్శలు చేసిన మీరు ఇవాళ అదే శ్రీవాణి డబ్బుతో అమరావతిలో గుడి కడుతున్నారు. అదే డబ్బుతో గట్టు ఆంజనేయస్వామికి పవన్‌కళ్యాణ్ డబ్బులిప్పించారు. జమ్మూకశ్మీర్లోనూ, నవీ ముంబై, విశాఖలో శ్రీవారి ఆలయాలను వైఎస్ జగన్ నిర్మించారు. చెన్నైలో పద్మావతి ఆలయాన్ని నిర్మించారు. కానీ, మీరు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామికి చెందిన రూ.3 వేల కోట్ల విలువైన స్థలాన్ని ప్రైవేటు హోటల్‌కి కట్టబెట్టారు. వైకుంఠ ఏకాదశికి 10 రోజులు ఎందుకని ప్రశ్నించారు. మీరెన్ని అభాండాలు వేసినా వైఎస్సార్సీపీ హయాంలో ఎలాంటి తప్పులూ జరగలేదు.కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలకు నెయ్యి అద్దింది మీరే..భోలేబాబాను చంద్రబాబు 2018లోనే రప్పించారు. అలాగే, గత ప్రభుత్వ పాలనలో లడ్డూ నాణ్యత బాగోలేదు.. అందుకే భక్తుల సంఖ్య తగ్గిపోయిందని దారుణమైన అబద్ధాలు చెబుతున్నారు. దీనిపై మీరు విచారణకు సిద్ధమా? ఇక 2018 ఫిబ్రవరిలో లడ్డూలకు వాసన రావడానికి మీరు రోజుకు 975 కేజీల నెయ్యిని రూ.3.87 కోట్లకు కొన్నారు. (ఆధారాలు చూపించారు). అంటే.. మీరు ఆ రోజు కల్తీ నెయ్యితో లడ్డూలు తయారుచేయడంవల్ల అవి వాసన రాకుండా వాటిపై మళ్లీ నెయ్యి అద్దడం కోసమే రూ.3.87 కోట్లతో నెయ్యి కొన్నారు. ఇది మీ హయాంలోనే జరిగిన విషయం. కొద్దిమంది అవినీతి అధికారులు, మీ హయాంలో మీరు ఏర్పాటుచేసిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్, డెయిరీ సంస్థలు కుమ్మక్కై చేసిన నేరాన్ని సిట్ బయటపెట్టింది. -
నాలుక మడతేసిన పవన్.. నాగబాబు కొత్తరాగం..
కొత్తగా మతం మారినవాళ్లకు నామాలు ఎక్కువ అన్న సామెత మెగా బ్రదర్స్‌కు సరిగ్గా సరిపోయేలా ఉంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ సైతం తేల్చి చెప్పడంతో ఈ విషయంలో గాయిగత్తర చేసి అర్జెంట్‌గా సనాతని గెటప్ వేసుకుని మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడల్లా జనంలోకి వచ్చి టాపిక్ డైవర్ట్ చేసిన పవన్ ఇప్పుడు లడ్డు విషయంలో అడ్డంగా దొరికిపోవడంతో ఏం చేయాలో.. ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక తికమకపడుతున్నారు.దీంతో ఇప్పుడు తాను లడ్డు విషయంలో ఆనాడు చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం వేరని, తాను ఫలానా వాళ్లు అందులో కొవ్వు కాలిపారని అనలేదని ఏదేదో మాట్లాడుతూ తప్పించుకోవాలని చూశారు. వాస్తవానికి పవన్ తనకు తానూ ఓ కమ్యునిస్ట్ అని, తనకు దేవుడిపై నమ్మకం లేదని పలుమార్లు రాజకీయ వేదికల మీద చెప్పారు. తన తండ్రి మరీ పెద్ద కమ్యూనిస్ట్ అని, తన తల్లి దేవుడికి హారతి ఇస్తే ఆ హారతిలో సిగరెట్ వెలిగించుకునేవారని రాజకీయ వేదికలమీద చెప్పారు. ఇక తిరుమల లడ్డులో కొవ్వు కలిసింది అని, సనాతని గెటప్ వేసుకుని మెట్లు కడిగేశారు. తీరా ఇప్పుడు సీబీఐ నివేదికలో ఆ కొవ్వు అంశం లేకపోవడంతో ఏం చేయాలో తెలీక ఏదేదో మాట్లాడి పరిస్థితిని తన వైపునకు తిప్పుకునేందుకు యాతనపడుతున్నారు. ఇన్నాళ్లు అబద్ధాల మిషన్ సినిమాల్లో చూడటమే కానీ ఇలా మానవరూపంలో చూడడం ఇదే మొదటి సారి అంటూ నెటిజెన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.I am sorry to use this statement నువ్వు బ్రతికేది కుడా ఒక బ్రతుకేనా @NagaBabuOffl 👊💦ఏ మూల నుండి నువ్వు హిందువువి అయ్యావ్ ❓దేవుడునే నమ్మని నువ్వు ఎట్టా సనాతనివి అవుతావ్ ❓👊కష్టపడి పైకి వచ్చిన చిరంజీవి గారు, ఏ రోజు రాజకీయాలు కోసం ని తమ్ముడు లగా ని లాగా లుచ్చా మాటలు… pic.twitter.com/G6Ghrb5JZc— Ravindra 🙏❤️ (@kurapati1005) February 4, 2026ఇక ఎమ్మెల్సీ నాగబాబు అయితే మరింత ఎక్కువ యాక్టింగ్‌కు దిగిపోయారు. గతంలో అసలు దేవుడే లేడు.. అదొక మిథ్య.. ప్రజలు.. తమ సౌకర్యం కోసం దేవుడిని సృష్టించుకున్నారు. నేనైతే దేవుణ్ణి నమ్మను అని చెప్పిన నాగబాబు ఇప్పుడు తానూ సనాతన వాదిని అని, హిందూ ధర్మానికి రక్షకుడిని అని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములను గుత్తకు తీసుకుని మరబొమ్మను ఆడించినట్లు ఆడిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా నిలదీయడంతో ఇక ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది. గురువారం చంద్రబాబు.. మంత్రులు.. నాయకులు కలసికట్టుగా మీడియాతో మాట్లాడి మళ్ళీ లడ్డు అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుకు లడ్డు అంశం ఒక ఆయుధంగా మారిందని.. రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేనట్లుగా ఇదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. -సిమ్మదిరప్పన్న. -
తప్పు చేసి దొరికిపోయి.. డిఫెన్స్‌లో చంద్రబాబు, పవన్: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి చంద్రబాబు.. వైఎస్ జగన్‌పై విష ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. లడ్డూలో కల్తీ జరగలేదని కేంద్ర దర్యాప్తు సంస్థలే చెప్పాయి. పవన్ కల్యాణ్ పదే పదే చెప్పిన అబద్ధమే చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. భోలే బాబాను తీసుకువచ్చింది ఎవరు? అని ప్రశ్నించారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజల ముందు నటిస్తున్నారు. కెబినెట్ సమావేశంలోనే మంత్రి పార్థసారథి పచ్చి అబద్దాలు చెప్పారు. సీబీఐ నేతృత్వంలోని సిట్ మమ్మల్ని దోషులుగా ప్రకటించలేదు. మమ్మల్ని దోషులుగా చూపించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తప్పు చేసి, తప్పుగా మాట్లాడి దొరికిపోయి.. మళ్లీ ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అంటున్నారు. 2014-2019 మధ్య అధిక శాతం నెయ్యి సరఫరా ప్రిమియర్ డెయిరీనే. 2018లోనే భోలే బాబాను చంద్రబాబు తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?. ఇప్పుడు ఉన్న అధికారులే చంద్రబాబు హయాంలో ఉన్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో పవన్ చెప్పినవి ఇవే.. జగన్ రాజకీయ జీవితాన్ని సమూలంగా నాశనం చెయ్యడానికి ఏదైనా వాడుకోవడానికి సిద్దంగా ఉన్నారు. మీడియా సమావేశంలో నంగిలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం భయంతో చంద్రబాబు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డారు. చంద్రబాబు దేవుడికి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు అందరికి నవ్వు తెప్పిస్తుంది. పదేళ్ల కాలంలో పవన్.. అనేక మార్లు బాప్టజం తీసుకున్న, మా నాన్న దీపంలో సిగరెట్ వెలిగించేవారు, గొడ్డు మాంసం తింటే తప్పేంటి అన్న వ్యక్తి. కానీ, నేడు సనాతన ధర్మం అంటున్నారు. చంద్రబాబు తనంత భక్తుడే లేడని అంటారు. భగవంతునికి చంద్రబాబు ఒక్కడే భక్తుడు కాదు, రోజుకు లక్షమంది వస్తారు. చంద్రబాబు హయాంలో కొండపై మద్య మాంసాలు అనేమార్లు దొరికాయి. మత్తులో ఘర్షణలకు పాల్పడ్డారు. తొక్కిసలాటలో భక్తులు మరణించారు.చంద్రబాబుది దైవ ద్రోహం.. చంద్రబాబు అలిపిరిలో జరిగిన దాడికి మొదట బాధపడిన వ్యక్తి వైఎస్సార్, నేను. వైఎస్సార్ అలిపిరి వద్ద నిరసన కూడా చేశారు. దేవుడి దయవల్ల చంద్రబాబు బతికారు. ఆయన ఏం చెప్పినా నమ్మించడానికి పచ్చ పత్రికలు ఉన్నాయి. నెయ్యిలో నెయ్యే లేకుండా జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు. సుప్రీంకోర్టు చంద్రబాబుకు చీవాట్లు పెట్టి సిట్ వేసింది. సిట్ రిపోర్టులో క్లియర్‌గా ఉంది. ఎక్కడ కూడా జంతువుల కొవ్వుతో లడ్డులు తయారు కాలేదని రిపోర్ట్ చెప్పారు. దైవ ద్రోహానికి పాల్పడే పరిస్థితిలో ఈ ఘటన ఉంది. అయోధ్య పంపిన లడ్డులో నెయ్యి కలిసిందని అంటున్నారు పవన్. ప్రస్తుతం పాలకమండలి సభ్యులుగా ఉన్న వారు విరాళంగా ఇచ్చిన నెయ్యితో అయోధ్య లడ్డు తయారు చేశారు.వైవీ సుబ్బారెడ్డి హయాంతో నెయ్యి టెస్ట్ రిపోర్ట్ దాచేసారని మరో అబద్దం ఆడుతున్నారు. కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడు మాత్రమే, నాకు ఎటువంటి హక్కు ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిబంధనలు మార్పు చేసాము, అందులో మా దురుద్దేశం ఏమీ లేదు. మమ్మల్ని ఇరికించడానికే ఏకసభ్య కమిషన్ వేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం చంద్రబాబు, కూటమి నేతలకు ఉంది. చంద్రబాబు పచ్చ అబద్దం చెప్తారు. వేంకటేశ్వరస్వామిని మీ రాజకీయాలకు వాడుకుంటారా?. పచ్చ పత్రికలలో ఎన్ని తూటాలు ఎక్కుపెట్టినా మమ్మల్ని భయపెట్టలేరు. మేము ఒక్క తప్పు కూడా చేయలేదు. చంద్రబాబు లాంటి వాళ్లను దేవుడు క్షమించరు’ అని అన్నారు. -
పవన్.. రాజకీయాల కోసం ఇంతకు దిగజారాలా?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్‌లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రం చేస్తున్న అప్పులను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు చెప్పరు. ఆర్థిక శాఖపై కేశవ్‌కు పట్టింపు లేదు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది చంద్రబాబు హయాంలోనే. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలి. హెరిటేజ్‌లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలి. గతంలో అనేకసార్లు పవన్ దేవుడిపై నమ్మకం లేదని చెప్పారు. రాజకీయాల కోసం పవన్ కల్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు
-
భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా బాబు వ్యాఖ్యలు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఘోరంగా మాట్లాడారని వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూ విషయంలో సిట్‌పై నమ్మకం లేకనే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించింది. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘సిట్ విచారణతో జంతు కొవ్వు కలవలేదని నివేదికలో స్పష్టమైంది. సీబీఐ స్పష్టం చేసినా కూటమి మళ్లీ మళ్లీ విషప్రచారం చేస్తోంది. ఫ్లెక్సీలు పెట్టి వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి. చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. సీఎఫ్టీఆర్ఐ రిపోర్టుపై కూడా మంత్రులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం నుంచే ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. టీటీడీలో నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. ఎలాంటి ప్రమాణం చేయడానికైనా నేను సిద్ధం.దేవుడు ముందే ప్రమాణం చేస్తా.. నేనే ఏ తప్పు చేయలేదు. సత్య శోధన పరీక్షకి సిద్ధంగా ఉన్నాను. ఎన్డీడీబి నుంచి కన్ఫర్మేషన్ లేకుండానే జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. పరీక్షలు జరపాలని సీఎఫ్టీఆర్ఐకు లేఖ రాసిందే నేను. అలాంటప్పుడు నేను నివేదిక ఎలా తొక్కి పెడతాను. నివేదికపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. నెయ్యి సప్లయ్ పెంచడం కోసమే నిబంధనలు సవరించాం. నిపుణుల కమిటీ సిఫారసుల ప్రకారమే నిబంధనలు సడలించాం. నాణ్యత విషయంలో రాజీ పడలేదు. నిబంధనల సవరణకు ముందే బోలె బాబా కంపెనీ టీటీడీకి సరఫరా చేసింది. చిన్న అప్పన్న నా పీఏ కాదు. ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్ అని క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులపై బురద చల్లడానికే ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. నేను తప్పు చేస్తే సుప్రీంకోర్టుకు, సీఎఫ్టీఆర్ఐకు ఎందుకు వెళ్తాను. దేవుడిపై రాజకీయాలు చేయొద్దు. రాజకీయ నాయకుల ప్రమేయం లేదని సిట్ తేల్చి చెప్పింది. వైఎస్సార్సీపీ టార్గెట్‌గా మళ్ళీ విచారణ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎంక్వయిరీ కమిటీ వేయడం కుట్రలో భాగమే. వైఎస్సార్సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా కమిటీ వేశారు. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటాం’ అని అన్నారు. వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు. ఘోరమైన తప్పులు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పింది తప్పు అని సిట్ తేల్చి చెప్పింది. దాంతో అంబటి రాంబాబు, జోగి రమేష్‌పై దాడి చేశారు. చంద్రబాబు చెప్పిన తప్పులే.. నిజమని చెప్పేందుకు మళ్లీ కమిటీ వేశారు. తప్పు చేసిన వ్యక్తి అయితే.. వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు ఎలా వెళ్తారు?. సత్యశోధన పరీక్షకు సిద్ధమని చెప్పారు. సుబ్బారెడ్డి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు. ఆయనపై ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. రాజకీయ ఆరోపణ చేయడం తోక ముడవడం చంద్రబాబుకు పరిపాటి. టీడీపీ హయాంలో కూడా ట్యాంకర్లు తిరస్కరించారు’ అని తెలిపారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. సీబీఐ సిట్ నివేదిక టీడీపీకి చెంపపెట్టు లాంటిది. ఆ నివేదికను జీర్ణించుకోలేక మళ్లీ కమిటీ అంటూ కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ కుట్రలకు దేవుడు.. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. టీడీపీ హయాం నుంచి బోలే బాబా కంపెనీ నెయ్యి సరఫరా చేస్తోంది. అన్ని కంపెనీలను ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే నిబంధనలు సడలించారు. ఆరోపణలు వచ్చిన వెంటనే బోలె బాబాను బ్లాక్ లిస్టులో పెట్టారు. మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి పైన మాపై ఎందుకు రుద్దుతున్నారు. ఆ ట్యాంకర్లను బ్యాక్ డోర్ ద్వారా వాడుకున్నారు. టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ కోసం లడ్డు విషయాన్నీ వాడుకుంటున్నారు. గత జనవరి నుంచి టీటీడీ పూర్తిగా అప్రతిష్ట పాలైంది’ అని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ..‘లడ్డు ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సత్యశోధన పరీక్షకు సిద్ధమని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దమ్ముంటే మీరు సత్యశోధన పరీక్షలు చేయండి.. విషయాలు తేల్చండి అని సవాల్ విసిరారు. -
టీడీపీ హయాంలోనే తిరుమల నెయ్యిలో కల్తీ!
-
లడ్డూ వ్యవహారంపై మళ్లీ బుకాయింపే!
తప్పు చేసి దొరికినప్పుడల్లా చంద్రబాబు ప్రయోగించే టెక్నిక్.. ఎదురుదాడి!. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చిన నేపథ్యంలో కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఆయన తాజాగా మళ్లీ గళమెత్తుతున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి అర్థమైనా దాంతో తనకేమీ సంబంధం లేనట్టుగా నటిస్తున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ప్రచారమే చేయాలని మంత్రులు, టీడీపీ నేతలు, కేడర్‌ను ఆదేశించారట. తప్పని స్థితిలో మంత్రులు తమకు తోచిన ప్రకటనలు చేస్తున్నారు.మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా తప్పుడు ఫోటోలతో వైఎస్సార్సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేస్తోంది. విద్వేషపూరితమైన ఫ్లెక్సీలు పెట్టించి నీచ రాజకీయాలకు వెనుకాడడం లేదు. కుప్పం టూర్లో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతలు శ్రీవెంకటేశ్వర స్వామిని బజారుకు ఈడ్చాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారట. తనను క్షమాపణ చెప్పాలని అడుగుతారా అని ఆయన రుసరుసలాడారు. లడ్డూలో జంతు కొవ్వు అంటూ మాట్లాడింది ఎవరు? నిత్యం అదే విషయాన్ని దేశం అంతటా ప్రచారం చేసిందెవరు? ఇవి చాలవన్నట్లు టీడీపీని గట్టెక్కించడానికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి నిస్సిగ్గుగా అబద్దపు కథనాలు రాస్తున్నాయి. ప్రతిష్ట పూర్తిగా పోయినా ప్రజలను మోసం చేయడం కోసం ఈనాడు మీడియా లాజిక్కు లేని వ్యాఖ్యలతో దిక్కుమాలిన సంపాదకీయం ఒకటి రాసింది.జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఏ తప్పు జరగనట్లేనని జగన్ పార్టీ, మురికి మీడియా ఇప్పుడు వీధికెక్కి వీరంగాలాడుతోందని రాసి ఈనాడు పత్రిక తుచ్చమైన మీడియాగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఏం చెప్పింది ఈనాడు మీడియాకు తెలియదా?. జంతుకొవ్వు కలిసిన నెయ్యి వాడారని కదా ఆయన చెప్పారు?. అప్పుడు అదే చంఢాలాన్ని పేజీలకు, పేజీలు రాసి ప్రజలపై రుద్దాయి ఈ పత్రికలు. ఇప్పుడు ఆ జంతు కొవ్వు అంశంలోకి వెళ్లకూడదన్నట్లుగా ఎందుకు రాస్తున్నారు? అసలు ఈనాడు మీడియాకు జంతుకొవ్వు, పామాయిల్‌కు తేడా తెలియదా? పోనీ పామాయిల్ కల్తీ జరిగి ఉంటే మొత్తం లడ్డూలన్నీ అలా తయారు చేస్తుంటే ఒక్క టీటీడీ అధికారి, పోటు తదితర సిబ్బంది, పూజారులు ఎవరూ పసికట్టలేకపోయారా?. అప్పట్లో జగన్ ప్రభుత్వంపై టీటీడీ విషయంలో అనేక వదంతులు, అబద్దాలు ప్రచారం చేసిన ఎల్లో మీడియాకు తెలియకుండా ఉండేదా?. విపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు తిరుమల వెళ్లినప్పుడు లడ్డూ ప్రసాదం నాణ్యతపై ఎన్నడూ చంద్రబాబు అనుమానం వ్యక్తం చేయలేదే!. ఇవన్నీ పక్కనబెట్టి తగుదునమ్మా అటూ క్షమించరాని ఘోరాపచారమిది అంటూ రాసేసి ఈనాడు ఆత్మ వంచన చేసుకుంటే సరిపోతుందా?. తెల్లవారిలేస్తే పూజలతో గడిపే ఈనాడు యజమాని కిరణ్ ఇంతటి పాపానికి ఒడిగడుతున్నాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అంటే ఆర్థిక సంబంధాల ముందు భక్తి అన్నది ఒక నటనే అని అనుకోవాలా?మరో మాట చెప్పాలి. బహుశా ఆ సంపాదకీయాన్ని రాసిన వారు అంతకుముందు రోజు అదే పత్రికలో వచ్చిన సిట్ నివేదికలోని కొన్ని అంశాలను చదవకుండానో, చదివినా కావాలనో అసత్యాలు పులిమేసినట్లు కనిపిస్తుంది. జనవరి 29న ఈనాడులో వచ్చిన కథనం ప్రకారమే ‘హర్ష్ ఫ్రెష్ డెయిరీ’ 2018 నుంచే టెండర్లలో పాల్గొంటోంది. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీనే. 2018 ఏప్రిల్ 17న ఈవో ఆదేశాల మేరకు టీటీడీ అధికారుల కమిటీ ఆ కంపెనీని తనిఖీ చేయడానికి వెళ్లింది. ఆ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చిందని సిట్ గుర్తించిందట. అప్పట్లో ఆ కంపెనీకి నెయ్యి బిడ్ రాలేదు. కానీ, 2019 ఫిబ్రవరిలో పొందగలిగిందని ఈనాడులోనే రాశారు. అంటే అప్పుడు కూడా ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా!. ఆ తర్వాత 2019 ఆగస్టులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కంపెనీని రద్దు చేసింది. ఈనాడు ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించనూ లేదు.అంటే పొరపాటున ఎవరో జర్నలిస్టు నిజాలు రాసేయడంతో వచ్చిన ఇబ్బంది నుంచి బయటపడడం కోసం సంపాదకీయం రాశారని అనుకోవాలి. ఆ తర్వాత మళ్లీ ‘భోలే బాబా కంపెనీ’గా పేరు మార్చుకుని ఇదే సంస్థ మోసం చేసిందని సిట్ తెలిపింది. మరికొన్ని కంపెనీలు 2013 నుంచి నెయ్యి సరఫరాలో ఉంటున్నాయి. వాటికి ఈ బోలేబాబాతో సంబంధాలు ఉన్నాయా? లేదా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలైలో తిరస్కరించిన నెయ్యిని తిరిగి ఆగస్టులో ఎలా అనుమతించారు?. దీనికి టీడీపీ ప్రభుత్వం బాధ్యత వహించదా?. అసలు 2014-19 మధ్య నెయ్యి సరఫరా చేసిన కంపెనీల గురించి ఎందుకు విచారించలేదు? జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చినందుకు సంతోషించాల్సి టీడీపీ ఎల్లో మీడియా అందుకు విరుద్ధంగా గగ్గోలు పెడుతున్నాయి?. ఇదేనా వీరి భక్తి? హిందూ మతోద్ధరణ? కేసులో ఎలాగొలా టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి, మరికొందరు వైఎస్సార్సీపీ నేతలను ఇరికించలేకపోయామే అన్నది తప్ప ఇంకొకటి కాదు. అదేదో తమ సొంత సిట్ అయి ఉంటే ఈపాటికి ఎన్ని అరెస్టులు జరిగేవో!. ఎంత బురద వేసేవారమో కదా అన్నది వారి భావన కావచ్చు. ఇదే టైమ్‌లో అప్పట్లో టీటీడీ కొనుగోళ్ల కమిటీ సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి పార్ధసారథి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిల గురించి ఎందుకు ఎల్లో మీడియా రాయడం లేదు? దీనిని బట్టే వీరి కుట్ర బుద్ధి అర్థం చేసుకోవచ్చు.చంద్రబాబు నాయుడు ఎదురుదాడి చేయడం కొత్త కాదు. ఎన్టీ రామారావును పదవి నుంచి దించివేసిన తర్వాత ఆయనపై ఎన్ని నిందలను మోపింది తెలిసిన విషయమే. గోదావరి పుష్కరాలలో తన కుటుంబ స్నానాలు, డాక్యుమెంటరీ తీయడం కోసం సాధారణ భక్తులందరినీ నిలిపివేయడంతో తొక్కిసలాట జరిగితే కుంభమేళాలో జరగడం లేదా? రోడ్డు ప్రమాదాలలో జరగడం లేదా? అని దబాయించారు. తుని వద్ద రైలు దగ్దం జరిగితే, అది తన ప్రభుత్వ వైఫల్యం అని అంగీకరించకుండా రాయలసీమ నుంచి గూండాలు వచ్చి దహనం చేశారని ఆరోపించారు. కానీ, గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలపై కేసు పెట్టారు. కందుకూరు, గుంటూరులలో ఆయన సభలలో తొక్కిసలాటలు జరిగి 11 మంది మృతి చెందితే అది పోలీసుల వైఫల్యం అని విమర్శలు చేశారు. అదే వైఎస్ జగన్ టూర్లో ఒకరు ప్రమాదానికి గురైతే మాత్రం అదంతా కారులో ప్రయాణిస్తున్న జగన్ తప్పని కేసు పెట్టించారు.అలాగే ఇప్పుడు తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఆరోపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది ఆయనే. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా తన వంతు పాత్ర పోషించారు. అది వారికే ఎదురు దెబ్బ తగలడంతో జనాన్ని మోసం చేయడం కోసం కల్తీ జరిగిందంటూ లడ్డూ ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి చంద్రబాబు అండ్ కో వెనుకాడటం లేదన్న విమర్శ వస్తోంది. పార్టీ వారితో విద్వేషపూరితమైన ఫ్లెక్సీలు కూడా పెట్టిస్తున్నారంటే శాంతిభద్రతలపై ఎంత శ్రద్ద ఉన్నది అర్ధం చేసుకోవచ్చు. అదే పని వైఎస్సార్సీపీ వారు చేసి ఉంటే ఈ పాటికి పోలీసులు ఎన్ని కేసులు పెట్టేవారో!. అయితే, అన్నిసార్లు ఎదురుదాడి ఫలించదు. కూటమిలో చాలామంది ఈ పరిస్థితికి చింతిస్తున్నారు. కాకపోతే మాట్లాడలేకపోతున్నారు. ఎల్లో మీడియా భజన బృందం సహకారంతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ వికృత విన్యాసానికి ఫుల్ స్టాప్ పడడానికి ఇంకెంత కాలం పడుతుందో!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చీప్ పాలిటిక్స్ మానుకో.. లేదంటే వెంకన్న గురించి తెలుసు కదా..
-
భోలేబాబాను తెచ్చింది నారా బాబా.. తెలుసుకో పయ్యావులా !
-
సుప్రీంను లెక్కచేయకుండా బాబు సొంత కమిషన్ ఏర్పాటు..!
-
కొవ్వు లేదని ఫ్రస్ట్రేషన్ తో మరో కుట్రకు ప్లాన్
-
రెడ్బుక్కే రాజ్యాంగం, చంద్రబాబే ‘సుప్రీం’... తిరుమల శ్రీవారి లడ్డూపై సొంత విచారణ చేపట్టాలని ఏపీ సీఏం నిర్ణయం
-
భోలే బాబా వెనక ఉన్న ఆలీబాబా ఎవరు?: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జంతుకొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపిన నెయ్యి వాడారని పచ్చి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్న సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌తో అడ్డంగా దొరికిపోయి, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సిట్, నెయ్యిలో ఏ కొవ్వూ కలవలేదని చెప్పినా, మళ్లీ ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేయించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి చేతనైతే సిట్ రిపోర్ట్ తప్పని సుప్రీంకోర్టును ఆశ్రయించి, అక్కడ రుజువు చేయాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్ చేశారు. ప్రెస్ మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:సిట్ రిపోర్ట్‌పై క్యాబినెట్ నిర్ణయమా!:సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారుల్ని సీఎం చంద్రబాబు పిలిపించుకోవడం అసాధారణ విషయం. వారి దగ్గరి నుంచి 11 పేజీల నివేదిక తీసుకుని సుదీర్ఘమైన చర్చ చేశామని కేబినెట్ భేటీ నుంచి బయటికి వచ్చిన మంత్రులు చెప్పారు. చంద్రబాబును కాపాడటానికి, ఆయన చెప్పిన అబద్ధాల్ని కప్పిపుచ్చడానికే వీళ్ల ప్రయాస. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2024 సెప్టెంబర్ 20వ తేదీన కూటమి సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారని ప్రకటించడంతో, వాస్తవాలు నిగ్గు తేల్చాలని వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఏ విషయమూ నిర్థారణ కాకుండా మాట్లాడొద్దంటూ సూచించిన సుప్రీకోర్టు, ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది. అందులో సీబీఐ అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు.సిట్ అధికారులు ఏడాది కాలంగా సుదీర్ఘ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. సిట్ అదనపు ఛార్జిషీట్లో కానీ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులో కానీ, చంద్రబాబు ఆరోపించినట్లు నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, చేప నూనె కానీ కలిసినట్లు ఎక్కడా చెప్పలేదు. అయినా చంద్రబాబు ఈ ఛార్జిషీట్‌పై సంతృప్తి చెందకుండా ఇవాళ కేబినెట్ సమావేశంలో నెయ్యి విషయంలో ప్రత్యేక విచారణ చేపడుతున్నట్లు మంత్రులతో బయట ప్రకటన చేయించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్టు కాకుండా, మళ్లీ విచారణ చేయించాలన్న నిర్ణయం పూర్తిగా తప్పు.‘భోలేబాబా డెయిరీ’ వెనుక ఉన్న ‘ఆలీ బాబా’ చంద్రబాబే: ఒక మంత్రి భోలే బాబాను తెచ్చిన అలీ బాబా ఎవరని ప్రశ్నించారు. ఈ భోలే బాబాను తెచ్చిన చంద్రబాబే. 2018లోనే భోలే బాబా రంగ ప్రవేశం చేశాడు. దాదాపు 87 వేల టిన్నులకు పైగా నెయ్యి ఈ కంపెనీ సరఫరా చేసింది. అది చాలా స్పష్టంగా సీబీఐ నివేదికలోనే ఉంది. కానీ దాన్ని వదిలేసి మా హయాంలోనే నెయ్యి సరఫరా చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భోలే బాబాకు ముందున్న పేరు హర్‡్ష –వర్‡్ష డెయిరీకి అనుమతి ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఇప్పుడు భోలే బాబాను తెచ్చిన ఆలీ బాబా ఎవరో తెలిసిందని అనుకుంటున్నాం.ఆ నెయ్యిపైనా విచారణ జరిపించాలి:నెయ్యిలో కల్తీ లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సిట్ విచారణ 2019–24 మధ్య కాలానికి వేశారు. ఇందులో నిందితులుగా తేలిన ప్రీమియర్ డెయిరీ 2013 నుంచి 2024 వరకూ నెయ్యిని అనేకసార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది. మీకు నిజంగా తిరుమల శ్రీవారి మీద భక్తి ఉంటే, మీ గత ప్రభుత్వంలో సరఫరా అయిన నెయ్యిపైనా విచారణ చేయించాలి. ఆ రోజు 90 శాతానికి పైగా నెయ్యి సరఫరా చేసిన డెయిరీయే మా హయాంలోనూ సరఫరా చేసిందన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం.2018లో టీటీడీ తీర్మానంతోనే నెయ్యి కల్తీకి బీజం:విభజిత రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2018, ఆగస్టు 27న టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం 87 వేల కేజీల నెయ్యిని కొనుగోలు చేసింది. నెయ్యికి ఆ వాసన తీసుకొచ్చేందుకు ఆవు నెయ్యి ఫ్లేవర్‌ను కలిపిన నెయ్యిని రోజుకు 975 కేజీల చొప్పున కొనుగోలు చేశారు. ఆ రోజున మీరు వాడిన నెయ్యి కల్తీ నెయ్యి కాబట్టే వాసన రాలేదు. అందుకే ఏకంగా రూ.3.75 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫ్లేవర్ కలిపారు.అప్పటి జేఈవో అధ్యక్షతన పని చేసిన ఈ కొనుగోలు కమిటీలో విజయ్‌భాస్కర్‌రెడ్డి, సురేంద్రనాథ్ వంటి సాంకేతిక నిపుణుల్ని నియమించారు. వారే ఆ తర్వాత మా హయాంలోనూ కొనసాగారు. ఇప్పుడు సిట్ రిపోర్ట్ నిందితుల్లోనూ ఉన్నారు. అలాగే ప్రొక్యూర్మెంట్ జీఎం కూడా టీడీపీ హయాంలో ఉన్న వ్యక్తే ఇప్పుడు జైల్లో ఉన్నారు. అలాగే టెంపుల్ అఫైర్స్ ఏవో, ఎస్వీ గోశాల డైరెక్టర్ కూడా మొన్నటి వరకూ ఉన్నారు. వీళ్లంతా నెయ్యిని కొనాలని నిర్ణయించి, పలమనేరుకు చెందిన పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి నుంచి కేజీ నెయ్యి రూ.385 చొప్పున కొనుగోలు చేశారు. అప్పటికే రోజుకు 3 లక్షల లడ్డూలు తయారు చేసే కాలంలోనే ప్రతి రోజూ 975 కేజీల నెయ్యికి ఫ్లేవర్ అద్దడానికి వీళ్లు చేసిన దుర్మార్గం ఇది. 2018, ఆగస్టు 28న చేసిన టీటీడీ తీర్మానం 374 ఇందుకు నిదర్శనం.దమ్ముంటే 2014 నుంచీ నెయ్యి కల్తీపై విచారణ జరపండి:2014 నుంచి ఇదే సీబీఐ దర్యాప్తు వేయించే ధైర్యం మీకు ఉందా? టీటీడీని రాజకీయ పావుగా వాడుకోకపోతే మీ హయాంలోనే నెయ్యి సరఫరా చేసిన వాళ్లు, కొనుగోళ్లు చేసిన వాళ్ల మీద విచారణ చేయించండి. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ దోషి అంటున్నారు. సిట్ ఏర్పాటు చేశాక జంతుకొవ్వు విమర్శలు చేసిన మీరు ఆయన్ను రెండోసారి ఎందుకు ఈవోగా నియమించారు? నెయ్యి పేరుతో అనిల్ సింఘాల్‌ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారన్న అనుమానాలు వస్తున్నాయి.చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పదే పదే నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేప నూనె వాడారని దుష్ప్రచారం చేశారు. మీరు ఆరోపించినట్టు ఆ నెయ్యిలో అవేవీ లేవని తేలిపోయింది. అయినా మీరు ఇంకా ఎదురుదాడి చేస్తూ, గత మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తిరుమల శ్రీవారిపై భక్తి ఉంటే, ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకపోతే.. మీ హయాం నుంచే జరుగుతున్న నెయ్యి కల్తీపై విచారణ చేయించమని కోరుతున్నాం.మేము ఏ నిబంధనలూ సడలించలేదు: అలాగే మీ హయాంలో నుంచే ఉన్న అధికారుల్ని మేం నియమించినట్లు చెప్పడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. మేం నిబంధనల్ని సడలించడం వల్ల నెయ్యి కల్తీ జరిగిందనేది అబద్ధం. ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి స్టార్టప్ కంపెనీలను ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూపొందించినవి. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. మీరు తెచ్చిన నిబంధనల్ని మేం సడలించి తెచ్చిన కంపెనీ ఒక్కటి కూడా లేదు. భోలేబాబా వంటి కంపెనీలు మీ హయాంలోనే టెండర్లు వేసిన విషయం గుర్తుంచుకోండి. ఏఆర్ డెయిరీ, మాల్ గంగా వంటి సంస్థలు మేం నిబంధనలు కఠినతరం చేసిన తర్వాతే టెండర్లలో పాల్గొన్నాయి. అర్హతలు ఉన్నాయి కాబట్టే ఈ కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి.దోషులెవరో సిట్ చెప్పినా మాకు అంటగట్టే యత్నం:చంద్రబాబు జంతుకొవ్వు, ఆవు కొవ్వు కలిపారని చెప్పిన నాలుగు ట్యాంకర్లను తిరిగి శ్యామలరావు ఈవోగా, మీరు సీఎంగా ఉండగానే లడ్డూల్లో వాడారని సీబీఐ తన నివేదికలో చెప్పింది. ఇప్పడు చెప్పండి దొంగలెవరో? దోషులెవరో?. మా హయాంలో నాణ్యత లేని 18 నెయ్యి ట్యాంకర్లను మేం వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా 14సార్లు కూడా ఇలాంటి నాణ్యత లేని నెయ్యిని వెనక్కి పంపింది. సీఎస్ఆర్టీఐ రిపోర్టులు వచ్చాక ఛైర్మన్‌కు అందిస్తే ఆయన కళ్లు మూసుకున్నారని ఎలా చెప్తారు? టీటీడీ పాలక మండలి తనకున్న అధికారాల్ని ఈవోకు బదలాయించిన విషయం మీకు నిజంగా తెలియదా? అధికారులు ఈవోను కలవకుండా ఛైర్మన్‌ను ఎలా కలిశారు?వాస్తవాలన్నీ ఇలా ఉంటే, కేవలం దురుద్దేశంతో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీద నింద వేయాలని చూశారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యేకంగా విచారణ చేయిస్తాం అంటున్నారు. మీ దృష్టిలో మేము (గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం) నేరస్తులమని, శ్రీ వెంకటేశ్వరస్వామి మీద ఉన్న భక్తితో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా విచారణ జరిపిస్తామని కబుర్లు చెబుతున్నారు. నిజంగా నేరస్తులు అయితే శిక్షించమనే కదా మేం ముందు నుంచే అడుగుతున్నాం. సీబీఐ వంటి సంస్థే మేం నిర్దోషులమని నిర్థారించాక కొద్ది మంది అధికారులు, సరఫరా దారులు, టెక్నికల్ కమిటీ కుమ్మక్కై ఈ ద్రోహానికి పాల్పడ్డారని రిపోర్ట్ ఇస్తే మా వాళ్లను దోషులుగా చేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు?.మేము తప్పు చేయలేదు. అందుకే గట్టిగా నిలబడ్డాం:పవన్‌కళ్యాణ్ తమ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నెయ్యిలో ఆవు కొవ్వు, పందికొవ్వు కలిసిందని, అది అబద్దమని మా పార్టీ చేస్తున్న వాదనను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నామని, ఏం నిద్రపోతున్నారా అని కాకినాడ ఎంపీతో పాటు, తన సోదరుడిని కూడా ప్రశ్నించారు. నెయ్యిలో నిజంగా జంతుకొవ్వు కలిసినా, అది బయట పెడితే, ఎక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయోనని, సిట్ ఛార్జ్‌షీట్‌లో రాయలేదని చెబుతున్నారు.ఒకవేళ నిజంగా సీబీఐ ఆ పని చేసి ఉంటే, సనాతని, హైందవ ధర్మ పరిరక్షకుడదని చెప్పుకునే పవన్, అప్పుడు, ఇప్పుడు పదే పదే అదే మాట ఎందుకు చెబుతున్నారు. తిరుమలలో వాడిన నెయ్యిలో పందికొవ్వు, జంతుకొవ్వు, చేపనూనె కలిసిందని ఎలా ఆరోపిస్తున్నారు? సనాతనిగా ఉన్న మీరు భక్తుల మనోభావాల్ని ఎలా దెబ్బ తీస్తున్నారు?. తప్పు చేయలేదు కాబట్టే మేం ఛాలెంజ్‌గా మాట్లాడుతున్నాం. మీరు అబద్దాలు చెప్పారు కాబట్టే దాన్ని సమర్థించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. అటు టీడీపీలో కూడా ముప్పు తిప్పలు పడుతున్నారు.సీబీఐ రిపోర్ట్ పై విచారించే అధికారం మీకు లేదు:సీబీఐ నివేదిక మీద విచారణ చేసే అధికారం మీది కాదు కోర్టుది. కానీ నేరస్తుల్ని మేమే గుర్తించామంటూ విచారణలకు సిద్దమవుతున్నారు. ఇలాంటి తీర్పులు ఇచ్చే ప్రయత్నాలు మానుకుంటే మంచిది. చంద్రబాబుకు ధైర్యం ఉంటే, నెయ్యిలో ఫ్లేవర్ కలపాలన్న నాటి టీటీడీ బోర్డు నిర్ణయానికి సమాధానం చెప్పాలి. మళ్లీ చెబుతున్నాం. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదికపై, మరో విచారణ జరిపించే అధికారం మీకు లేదు.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..అనిల్ సింఘాల్ విషయంలో సీఎం పేషీనే పెద్ద నాటక వేదిక. ఆయన ఏ సిఫార్సుతో వచ్చారో మాకు తెలియదు కానీ, ఆయన్ను వచ్చిన రోజు నుంచే బదిలీ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. సీబీఐ నివేదికను అడ్డు పెట్టుకుని ఇప్పుడు బదిలీ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం సరైన విచారణ చేయలేదని కేబినెట్ తీర్మానం చేస్తే అప్పుడు మళ్లీ మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి చెప్పుకోవాలి. చంద్రబాబు మిమ్మల్ని పట్టించడం అంటే దొంగ పోలీసును పట్టించినట్లుంది. కాబట్టి నెయ్యి మీద మీరు విచారణలు చేయడం కాదు మళ్లీ సుప్రీంకోర్టుతోనే ఆ పని జరిగేలా చూడాలని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
తిరుమల లడ్డూ వివాదం.. బాబు సర్కార్ మరో డ్రామా
సాక్షి, విజయవాడ: తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ మరో డ్రామాకు తెరతీసింది. సుప్రీంకోర్టు, సిట్ ఉండగా కమిటీ మరో కమిటీ వేయాలని నిర్ణయించింది. చంద్రబాబుకి వ్యతిరేకంగా సీబీఐ రిపోర్ట్ రావడంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టింది. సీబీఐ చెప్పిన నిజాలను జీర్ణించుకోలేక కొత్త కమిటీ వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు విచారణలో ఉన్న అంశంపై మరో విచారణ కమిటీ అంటూ హడావుడి చేస్తోంది.జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించగా.. సీబీఐ ఇచ్చిన నివేదిక తమకు అనుకూలంగా లేదని టీడీపీ ఫ్రస్టేషన్లో ఉంది. దీంతో సీబీఐని తప్పు పడుతూ కొద్దిరోజులుగా కుట్రపూరిత ప్రచారం చేసింది. సీబీఐ సరిగ్గా విచారించలేదంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేసింది. సీబీఐ రిపోర్ట్‌లో లోపాలంటూ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి తెరలేపింది. ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి తిరుమల ప్రసాదంపై టీడీపీ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టింది.దుష్ప్రచారానికి కొనసాగింపుగా మరో విచారణ కమిటీ వేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. తమ చెప్పుచేతుల్లో ఉండే అధికారులతో కమిటీ వేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. తమకు నచ్చినట్టు నివేదిక రాయించుకోవడానికి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తిరుమలపై దుష్ప్రచారం చేయాలని వ్యూహం రచిస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని చూసి న్యాయ నిపుణులు విస్తుపోతున్నారు. -
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. బీజేపీకి సంబంధం ఉంది..
-
కూటమి మహాపచారంపై YSRCP పాప ప్రక్షాళన
-
రాజకీయాలకోసం దేవుడిని అడ్డం పెట్టుకున్నారు.. మీ పతనం మొదలైంది..
-
కూటమి అపచారం.. వైఎస్సార్సీపీ పాప ప్రక్షాళన పూజలు
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై విచారణ జరిపిన సీబీఐ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కూటమి అపచారానికి వైఎస్సార్సీపీ పాప ప్రక్షాళన పూజలు తలపెట్టింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పూజలు జరపాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. కాగా, కూటమి ప్రభుత్వం పాపం మీద పాపం చేస్తూ తిరుమల క్షేత్రానికి కళంకం తీసుకువచ్చింది. దీంతో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలంటూ ప్రపంచ వ్యాప్తంగా భక్తుల డిమాండ్ చేస్తున్నారు.విజయవాడఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కామెంట్స్..ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హిందువుల మనోభావాలతో ఆటలు ఆడుకుంటారా?.ప్రసాదంలో పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిసిందని చెప్తారా?.రాజకీయాల కోసం దేవుడిని కూడా లాగుతారా.రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు క్షమాపణ చెప్పాలి.జరగని ఒక ఘటన జరిగిందని ప్రచారం చేసారు సీబీఐ అలాంటిది ఏమి లేదని చెప్పింది.పవన్ కళ్యాణ్ దుర్గా గుడికి వచ్చి మళ్ళీ మెట్లు కడగాలని డిమాండ్ చేస్తున్నా.కూటమి నేతలు రాష్ట్ర ప్రజలకు మొహం చూపించలేక సమాధానం చెప్పలేక తిరుగుతున్నారు. కర్నూలు..కల్లూరు అర్బన్‌లోని వై జంక్షన్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలునంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి అపచారానికి పరిహారంగా ప్రత్యేక పూజలుచంద్రబాబు, పవన్ చేసిన అపచారానికి పరిహారంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులువారికి మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకన్నను వేడుకుంటూ టెంకాయలు కొట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలువిజయవాడలబ్బిపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పాప పక్షాళన పూజలుపూజలు చేసిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు.బందర్ రోడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ చేసిన పార్టీ శ్రేణులుచంద్రబాబు, పవన్ వెంకటేశ్వర స్వామికి భక్తులకు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు విశాఖ..సీతమ్మధార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు.పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మొల్లి అప్పారావు, మాజీ మేయర్ హరి వెంకట కుమారి , పార్టీ నేతలు.తిరుపతి లడ్డుపై తప్పుడు ప్రచారంపై నేతలు ఆగ్రహం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. కూటమికి మంచి బుద్ది ప్రసాదించాలని పూజలు.. వైయస్సార్ జిల్లా...బద్వేలు పట్టణం సిద్ధపటం రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు..కూటమి ప్రభుత్వం చేసిన విష ప్రచారానికి వ్యతిరేకంగా ఆలయంలో 101 టెంకాయ కొట్టి పూజలు నిర్వహించిన పార్టీ శ్రేణులు...కూటమి నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని పులివెందుల నాయకులు ప్రత్యేక పూజలు విశాఖ..మురళీనగర్ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు..కేకే రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు..తిరుమల లడ్డూ అంశంలో తప్పుడు ప్రచారంపై పార్టీ నేతల ఆగ్రహం..ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టిన నేతలు..పాప పరిహార పూజకు భారీగా హాజరైన పార్టీ శ్రేణులు.. -
బరితెగించిన కూటమి ప్రభుత్వం.. దేవుడితోనే రాజకీయాలు..
-
ఆరోజు వచ్చింది 4 కాదు 8 నెయ్యి ట్యాంకర్లు ఇవిగో ఆధారాలు
-
బాబు హయాంలోనే.. భోలే బాబా డెయిరీ కాంట్రాక్ట్ !
-
EVM గోల్ మాల్ నుంచి డైవర్షన్ కోసమే
-
క్షమించమని వేంకటేశ్వరుడిని వేడుకోండి!
-
తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం: ప్రొఫెసర్ నాగేశ్వర్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు.. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు భయంకరమైన ఆరోపణలు చేశారంటూ దుయ్యబట్టారు. కోట్లాది హిందువుల మత విశ్వాసాలపై దాడి కాదా? అంటూ నిలదీశారు.‘‘వాస్తవాలు గమనించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఎఫ్ఐఆర్ దాఖలు కాకుండా.. కేసు పెట్టకుండా.. విచారణ జరగకుండా సీఎం ఎలా తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు సీఎం స్థాయిలో ఉండి ఆరోపణలు చేస్తారు. సిట్ విచారణలో జంతు కొవ్వులేదని తేలింది. జంతు కొవ్వు కలిసినట్టు ఆధారాలు లేవు. తిరుమల లడ్డూను అపవిత్రం చేస్తున్నారు’’ అని నాగేశ్వర్ మండిపడ్డారు.కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ స్పష్టం చేయడంతో చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన విషయం తెలిసిందే. -
‘బాబు, పవన్, లోకేష్‌లపై కేసు పెట్టాల్సిందే’
సాక్షి, తూర్పుగోదావరి: తిరుమల విషయంలో కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇంతా జరుగుతున్నా సనాతని పవన్ ఎక్కడికి వెళ్లిపోయారు. అప్పుడు ఊగిపోయిన పవన్.. ఇప్పుడు కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు.మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో ఏ విధమైన జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని చంద్రబాబు ఏ విధంగా నిర్ధారించారో చెప్పాలి. గతంలో జంతువుల కొవ్వు కలిసిందని దారుణంగా మాట్లాడారు. రెండు రిపోర్టుల్లో యానిమల్ ఫ్యాట్ కలవలేదని స్పష్టమైన నివేదికలు వచ్చాయి. కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు. యానిమల్ ఫ్యాట్ అనే పదం ఎందుకు ఉపయోగించారు?. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిశాయని లోకేష్ మాట్లాడారు. ఇంత జరుగుతుంటే సనాతని పవన్ ఎక్కడికి పోయారు?.తిరుపతి వెంకన్న గురించి గానీ, లడ్డు గురించి గానీ ఇలా ఇంకెవరైనా మాట్లాడితే ఊరుకుంటారా?. ఇలా మాట్లాడటానికి, ఆరోపణలు చేయడానికి వీరికెవరు అధికారం ఇచ్చారు?. దేవుని గురించి మాట్లాడేందుకు వీరికేమైనా మినహాయింపు ఉందా?. 2018లో 23 లక్షల కిలోల నెయ్యి ఆర్డర్ 320/- చొప్పున చంద్రబాబు హయాంలో ఆర్డర్ ఇచ్చారు. జైనులను కూడా ఈ వ్యవహారంలో దోషులుగా చేర్చారు. మాంసాహారం అంటేనే జైనులు ఆమడ దూరంలో ఉంటారు.. చీమకు కూడా హాని చేయరు.. అటువంటి వారిని కూడా ఇరికించారు. కొవ్వుతో కలిపి తయారు చేసిన లడ్డులను అయోధ్య కూడా పంపించారని ఇష్టారీతిన పవన్ మాట్లాడేసాడు. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి?. హైకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని వీరిపై కేసు నమోదు చేయాలి. నిజంగా చంద్రబాబు, పవన్, లోకేష్ తిరుమలలో మెట్లపై ముక్కు నేలకు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను క్షమాపణ కోరాలి.పవన్ కళ్యాణ్ మాటలు తప్పు కాదా?. హిందూ ఛాంపియన్స్ అని చెప్పుకునే బీజేపీ ఎందుకు ఈ విషయంలో స్పందించడం లేదు?. ఎందుకు చంద్రబాబును కూటమి నుంచి తొలగించడం లేదు. రాజకీయాలకు లొంగిపోతున్నారా?. చంద్రబాబును ఎలా క్షమిస్తున్నారు?. వీరిని వెంకటేశ్వరుడు కచ్చితంగా ఈ జన్మలోనే శిక్షిస్తాడు. భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు చేసిన ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆరోపణలు చేయడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సీఎం.. డిప్యూటీ సీఎం.. గుట్టురట్టు
-
ఛీ కొడుతున్న శ్రీవారి భక్తులు
-
మీది ఒక బతుకేనా..? బాబు కుట్రలపై లక్ష్మీపార్వతి సీరియస్
-
మీ పాపం పండింది.. ఒక్క మాటలో ఇచ్చిపడేసిన అంబటి
-
కేటుగాళ్లు లడ్డూలా దొరికేశారు..
-
తిరుమల లడ్డూపై కూటమి కుట్ర బట్టబయలు: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి వెల్లడించారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టంగా తేల్చడంతో, ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు కొత్త కుట్రలకు తెర తీశారని ఆయన మండిపడ్డారు.‘మహా పాపం నిజం’ అంటూ పలుచోట్ల వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, మళ్లీ విష ప్రచారానికి దిగారని ఆక్షేపించారు. దేవుణ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, అలా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎం.మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..:సీబీఐ ‘సిట్’ ఛార్జ్‌షీట్‌లో ఏముంది?:తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు’ అని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది. ఆ మేరకు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ‘తిరుమలలో వాడిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలవనే లేదు’ అందులో తేల్చి చెప్పింది. హరియాణలోని ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని సిట్ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.ప్రజలను మభ్యపెట్టేలా మళ్లీ కొత్త కథనాలు:తిరుమలలో వాడిన నెయ్యిపై సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌తో తమ కుట్ర బెడిసి కొట్టడంతో, ఎదురుదాడి మొదలుపెట్టిన టీడీపీ కూటమి, మాట మార్చి కల్తీ నెయ్యి, కెమికల్ నెయ్యి అంటూ కథనాలు రాస్తోంది. ఇంకా మరో అడుగు ముందుకేసి.. ‘మహా పాపం నిజం’ అంటూ పలుచోట్ల వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, విష ప్రచారానికి దిగింది. ప్రజాక్షేత్రంలో జగన్‌గారిని ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిత్వ హననంతో పాటు, వైఎస్సార్సీపీని అప్రతిష్ట పాల్జేసే కుట్ర, దురుద్దేశంతో అలా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేస్తున్నారు.అది హిందూ ధర్మంపై దాడి:దేవుడ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ చంద్రబాబులో ఏమాత్రం మార్పు రాలేదు. లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ సిట్‌లో ఆధారాలు లేకపోవడంతో ఎలాగైనా కల్తీ మకిలీని వైయస్ఆర్సీపీకి అంటించాలనే దుర్మార్గపు ఆలోచనతో కోర్టు సూచనలను, సీబీఐ నివేదికలను కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది, ఇది ప్రజల విశ్వాసంతో పాటు, హిందూ ధర్మంపై దాడి చేయడమే.ఫిర్యాదు చేస్తాం.. కోర్టునూ ఆశ్రయిస్తాం:సీబీఐ, సిట్ ఛార్జిషీట్లో లేని అంశాలను పోస్టర్ల రూపంలో ప్రచారం చేయడం చట్టవిరుద్ధం, దీనిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. అంతే కాకుండా ఈ అంశంపై హైకోర్టులో న్యాయపోరాటం చేయడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఉంది. వాటన్నింటినీ కోర్టులో ప్రవేశపెట్టి నిజాలు బయటపెడతాం. ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా, దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గం. అందుకే పోలీసులకు ఫిర్యాదుతో పాటు, న్యాయ పోరాటం కూడా చేస్తామని ఎం.మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
లడ్డూ కల్తీపై CBI కీలక రిపోర్ట్.. ప్లాన్ ప్రకారమే కుట్ర
-
ఎవడు చెప్పాడు జంతు కొవ్వు ఉందని.. బాబు సర్కార్ కు CBI చెంపచెళ్ళు..!
-
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు... సీబీఐ దర్యాప్తులో వెల్లడి... బెడిసికొట్టిన చంద్రబాబు కుతంత్రం
-
తిరుమల లడ్డూపై జడ శ్రవణ్ సంచలన ప్రెస్ మీట్
-
అసలు మనిషి జన్మేనా.. చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్
-
తిరుమల లడ్డూ వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ విషయంలో నేటి నుంచి పబ్లిష్ అయ్యే వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు.. వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మీడియా సంస్థలకు ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించారని.. తక్షణమే వాటిని తొలగించాలని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రూ.10 కోట్ల పరిహారానికి దావా వేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ విచారణ జరిపారు. వాదనల విన్న తర్వాత ఇదివరకే ప్రచురించిన కథనాలపై నిర్ణయం తీసుకుంటామన్న కోర్టు.. కథనాలపై ఇంటెరిం ఇన్‌జంక్షన్ ఇవ్వాలన్న వినతిని కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా వేసింది. తిరుమల లడ్డూ ప్రసాద వివాదంలో ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు ఈనాడు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహా పలు మీడియా సంస్థలు కల్పిత కథనాలు రాస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ‘‘తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ, వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి’’ అంటూ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
కల్తీ నెయ్యి జరిగింది బాబు హయాంలోనే..! ఇవిగో ఆధారాలు..!!
-
వైఎస్ జగన్ ప్రశ్నలకు కూటమి నేతల్లో వణుకు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నలకు కూటమి నేతల్లో వణుకు మొదలైంది. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమిలారు. వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన అనేక ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు నోరు తెరవకపోవడం గమనార్హం.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. కూటమి సర్కార్‌కు పలు ప్రశ్నలు సంధించారు. సూపర్ సిక్స్ అమలు చేశామంటున్న ప్రభుత్వ పెద్దలను సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు చొప్పున ఇచ్చారా?. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ఇచ్చారా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చారా? అని అడిగారు.అలాగే, తిరుమల లడ్డూపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను సైతం వైఎస్ జగన్ ప్రశ్నించారు. 2024 జులైలో కల్తీ కారణంతో వెనక్కు పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను ఆగస్టులో ఎలా అనుమతి ఇచ్చారు?. కల్తీ నెయ్యితో లడ్డూలు చేసి ఉంటే మరి టీటీడీ ఛైర్మన్, ఈవోలపై ఎందుకు కేసు పెట్టలేదు? అని అడిగారు. వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. అసలు నోరే తెరవలేక పోవడం గమనార్హం. -
పచ్చముఠా.. పాపం బద్దల్
-
తిరుమల లడ్డూ ప్రసాదం.. SIT రిమాండ్ రిపోర్ట్.. ఎలాంటి కల్తీ జరగలేదు!
-
‘టీటీడీలో గత పదేళ్ల నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ చేయాలి’
న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారాలకు ఇకనైనా ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. తిరుమల ప్రసాదంపై పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకని మాట్లాడితే మంచిదన్నారు. లడ్డూ ప్రసాదంపై జంతువుల కొవ్వు ఆరోపణలపై సిట్ ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఈరోజు(గురువారం, నవంబర్ 27వ తేదీ) న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. తిరుమల లడ్డూ విషయంలో తాము ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ప్రసాదం టెస్టింగ్ విసయంలో పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పుడు ఎలా కల్తీ జరుగుతుందన్నారు. తమ హయాంలో నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించామని, టీటీడీలో 15 ఏళ్లుగా ఏం జరుగుతుందో తెలుసుకుని మాట్లాడాలన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించామన్నారు. ఈవో, చంద్రబాబులు తిరుమల లడ్డూ వివాదంపై పరస్పర విరుద్ధ ఆరోపణలు చేశారని, దానిపై ఇప్పటివరకఊ సిట్ క్లారిటీ ఇవ్వలేదన్నారు. తిరుమల లడ్డూ అంశంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎవరి మీద బురద జల్లుతున్నారని ప్రశ్నించారు. 2019-2024 వరకూ తయారైనా లడ్డూలన్నీ కల్తీ చేసినట్లు తప్పుడు ప్రచారాలకు దిగారన్నారు. రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి.. కోట్లాడి మంది భక్తుల మనోభవాలను దెబ్బతీస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో భక్తుల కానుకలను ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేసిన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. గత పది ఏళ్ల నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ చేయాలిటీటీడీలో గత పది ఏళ్ల నెయ్యి కొనుగోళ్లపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు వైవీ సుబ్బారెడ్డి. ‘ 2014 నుంచి జరిగిన నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ జరపాలి. 2024 ఆగస్టులో బాబు హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు..దానిపై సమాధానం చెప్పాలి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. మేము, మా కుటుంబం ఎవరివద్ద డబ్బు తీసుకోలేదు. నేను లై డిటెక్టర్ పరీక్ష కు సిద్ధం. సత్య శోధన పరీక్షకు సిద్ధంగా ఉన్నా. నేను ఏ అవినీతికి పాల్పడలేదు. అలాగే, ఎస్ బ్యాంక్ లో టీటీడీ డబ్బు డిపాజిట్లు, శ్రీనివాస సేతు వ్యవహారంపై దర్యాప్తు చేయాలి. అప్పన్న నా పిఎ కాదు. ఆయనకు నాకు సంబంధం లేదు. అప్పన్న ఎంపీ వేమిరెడ్డి దగ్గర పని చేశారు’ అని తెలిపారు. -
‘అసత్యాలు, వదంతులతో భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు’
విజయవాడ: తిరుమల లడ్డూలో 2019 నుండి 2024 వరకు నకిలీ నెయ్యి వాడారన్న వార్తలను మాజీ టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆ వార్తలు తప్పుడు ప్రచారమే తప్ప నిజం కావన్నారు.ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఏమన్నారంటే...లడ్డూ విషయం పై జరుగుతున్న SIT విచారణకు పూర్తిగా సహకరించామని, విచారణకు ఎప్పుడైనా హాజరుకావడానికి సిద్ధమని తెలిపారు. "శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలని, కానీ మీడియా లీకులు, రాజకీయ ప్రచారాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.అసత్యాలు, వదంతులతో భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దుచంద్రబాబు నాయుడే మొదటగా లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ నిరాధార ఆరోపణలు చేసిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తుచేశారు. అప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, కోర్టు.. సీబీఐ పర్యవేక్షణలో SITను ఏర్పాటు చేయాలని ఆదేశించిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ అదే కథను ప్రచారం చేస్తున్నారని అన్నారు.మొదట వెజిటబుల్ ఫ్యాట్ కలిపారు అంటూ ఆరోపణలు చేశారని, తర్వాత జంతువుల కొవ్వు వాడారనే ఆరోపణగా మార్చారని పేర్కొన్నారు. "ఎక్కడైనా ల్యాబ్ నివేదిక ఉందా? సిట్ అధికారికంగా ప్రకటించిందా? లీకుల పేరిట విషప్రచారం ఎందుకని ప్రశ్నించారు. ముందు అనుమానాస్పదంగా గుర్తించిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరిగి పంపించామని అధికారులు చెప్పినప్పటికీ, ఇప్పుడు మళ్లీ నెయ్యి ఏ రకంగా తిరిగి వచ్చిందో చెప్పాలన్నారు.నెయ్యి ధరలపై ఆరోపణలు కూడా తప్పుడు ప్రచారంతాను చైర్మన్‌గా ఉన్న సమయంలో రూ.326 కిలో ధరకు కొనుగోలు చేసిన నెయ్యి నకిలీదని చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. "2017–18లో రూ.276, రూ.279 ధరలకు కొనుగోలు చేసిన నెయ్యి కూడా అదే లాజిక్ ప్రకారం నకిలీ అవుతుందా? అప్పటి లడ్డూలు కూడా అపవిత్రమా?" అని ప్రశ్నించారు.భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేయొద్దుతిరుమల పవిత్రతకు భంగం కలిగించే విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం అపరాధమని, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర అని సుబ్బారెడ్డి అభివర్ణించారు. మీడియా బా -
అప్పుడో మాట.. ఇప్పుడో మాట.. దేవుడి సాక్షిగా దొరికిపోయారు
-
లడ్డూ కొత్త కథ.. డైరెక్షన్ బై చంద్రబాబు.. అడ్డంగా ఇరుక్కున్న పవన్
-
తిరుమల లడ్డూ వివాదం.. పచ్చమీడియా అబద్దాలన్నీ బయటపెడతాం
-
తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై సజ్జల షాకింగ్ నిజాలు
-
ధైర్యముంటే లడ్డూ అంశంపై సీబీఐ విచారణ జరపాలి: సజ్జల
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా తిరుమల నెయ్యి విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారన్నారు.వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేయబోయే ర్యాలీలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బోలేబాబా సప్లై చేస్తున్న నేయిలో ప్రమాణాలు లేవని వచ్చిన పిర్యాదుపై పరిశీలన జరిపి, ఆ కంపెనీని బ్లాక్‌చేయించింది వైవీ. సుబ్బారెడ్డి అని,. ఇప్పుడు అలాంటి సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తున్నారన్నారు. కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకునే ఇవన్నీ చేస్తున్నారన్నారు.కూటమి ప్రభుత్వం రాద్దాంతంపై సజ్జల సంధించిన ప్రశ్నలు..రిమాండ్ రిపోర్టు చూస్తే 2024లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ రెండో వారంలో ధర్మారెడ్డిని మీరు తొలగిచిన తర్వాత, వెంటనే శ్యామలరావును పెట్టుకున్నారు. ఇది జరిగిన తర్వాత జులై మొదటివారంలో ట్యాంకర్లలో వచ్చిన నేయిని పరీక్షలకోసం ఎన్డీడీబీకి పంపారు. రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు తిరిగి ఆగస్టులో మళ్లీ వచ్చాయి, వాటిని నేయి తయారీకి వాడారని చెప్తున్నారు. అంటే తప్పు ఎవరిది అవుతుంది? ఆరోపణలు వచ్చిన ట్యాంకర్లన్నీకూడా చంద్రబాబు పరిపాలనా కాలంలోనే కదా సప్లై అయినవి?పాలు లేకుండా నేయి తయారైందని అంటున్నారు. అలాంటప్పుడు ఏ ట్యాంకర్ కూడా పరీక్షల్లో ప్యాస్ కాకూడదు కదా? నేయిలో కల్తీ జరిగితే.. మేనేజ్ చేశారను అనుకుందాం.. అసలు నేయి లేకుండానే కెమికల్స్‌తో ఆర్టిఫిషయల్ నేయి తయారు చేశారన్నట్టుగా రిమాండ్ రిపోర్టులో రాశారు. ఇన్ని లక్షలమంది భక్తులు, ఇన్ని వందలాదిమంది తయారీదారులు.. నిజంగా కనిపెట్టలేకపోయారా? అసలు అలా తయారు చేసిన లడ్డూ నిల్వ సాధ్యమేనా? ఇవన్నీ సామాన్యులకు వస్తున్న సందేహాలు. రిమాండ్ రిపోర్టులో చూస్తే.. మార్చి 27, 2025 నాటి ఎన్డీడీబీ రిపోర్టు అని కోట్ చేస్తూ.. నేయి శాంపిళ్లను పరిశీలిస్తే.. పామాయిల్, పామ్ స్టెరిన్, పామ్ కెన్నెల్ ఆయిల్ కలిసిందని నువ్వే చెప్తున్నావు, అంటే చంద్రబాబు వచ్చిన 8 నెలల తర్వాతకూడా, పైగా తిరుమల లడ్డూపై సెప్టెంబరులో చంద్రబాబు కామెంట్లు చేసిన తర్వాత కూడా ఇలాంటి రిపోర్టు వస్తే దానికి బాధ్యత చంద్రబాబుదే కదా? ఈ ప్రభుత్వానిదే కదా? దాన్ని కూడా ఏరకంగా మరొకర్ని తప్పుబడతారు. మా హయాంలో కేజీ నేయి రూ.319లకు కొంటే తప్పుబట్టారు. కాని చంద్రబాబు హయాంలో రేట్లు చూస్తే.. రూ.273, 276, 279, 295, 285గా ఉన్నాయి. మరి దాని అర్థం చంద్రబాబుగారి హయాంలో నేయిలో బాగా కల్తీ ఉందనేదిగా దాని అర్థం? వాళ్ల సిద్ధాంతం ప్రకారమే ఇది వాస్తవమే కదా మరి?ఇదీ చదవండి: ‘ఎందుకీ ఆరోపణలు.. ఆధారాలు ఉంటే సిట్ ప్రకటించవచ్చు కదా?’ -
అడ్డంగా దొరికిన తరువాత తిరుపతి కల్తీ లడ్డుపై మరో కాంట్రవర్సీ
-
తిరుమల లడ్డుపై తప్పుడు వార్తలతో అడ్డంగా దొరికిన ఎల్లో మీడియా..
-
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
-
తిరుమల కల్తీ నెయ్యి కేసులో అంబటి షాకింగ్ నిజాలు
-
Magazine Story: దేవుడైతే ఏంటి? డైవర్షనే బాబు వర్షన్
-
కల్తీ నెయ్యిపై మరో డ్రామా.. తుఫాను నష్టంపై బాబు డైవర్షన్
-
తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం.. హైకోర్టు కీలక ఆదేశాలు
అమరావతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు స్వతంత్రంగా నిష్పక్షపాతంగా కొనసాగాలని.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుల కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కేసు అని పేర్కొంది.అమూల్యమైన లడ్డూ ప్రసాదం పవిత్రతపై ఏర్పడిన వివాదంపై జరుగుతున్న దర్యాప్తు ఇది.. అందువల్ల సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి దర్యాప్తు జరగాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దర్యాప్తును స్వయంగా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ జె.వెంకట్రావువు నియామకం తగదని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. వెంకట్రావు సుప్రీంకోర్టు సిట్ సభ్యుడు కాదని.. ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. కాబట్టి ఆయనకు దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదని తెలిపింది. -
‘లడ్డూ’ వివాదంలో అందుకే అరెస్టులు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు:తిరుమల లడ్డూపై ఆరోపణలు చేసి చంద్రబాబు ఇరుక్కుపోయారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయమై సోమవారం(ఫిబ్రవరి10) అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘తిరుపతి లడ్డూ వ్యవహారం నుంచి బయటపడడానికి బాబు ప్రయ యత్నిస్తున్నారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే చంద్రబాబు తిరుపతి లడ్డూపై ఆరోపణలు చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని అబద్ధం చెప్పారు. తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.తిరుమల లడ్డూల తయారీకి నెయ్యి సరఫరాకు ఒక పద్ధతి ఉంది.ఏఆర్ డెయిరీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే నెయ్యి సరఫరా ప్రారంభించారు.టెస్టుల్లో ఫెయిలైన ట్యాంకర్లను వెనక్కి పంపుతారు.వైఎస్ జగన్హయాంలోనూ ట్యాంకర్లను వెనక్కి పంపారు.దైవాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు’అని అంబటి రాంబాబు అన్నారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు నాయుడు అత్యంత దుర్మార్గుడు నీచుడుపవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాడునిబంధనల ప్రకారం వెనుక్కు పంపించిన నెయ్యి పైన అరెస్టులు జరుగుతున్నాయిచంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఎక్కడా స్వామివారి ప్రసాదాలలో కల్తీ జరగలేదుచంద్రబాబు నాయుడు ఆరోపణలపై విచారణ జరుగుతోంది2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 15 సార్లు నెయ్యి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వెనక్కి పంపారువైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం 18సార్లు నెయ్యి వెనుక్కు పంపారుచంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి ఇరుక్కుపోయాడు కాబట్టే ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయిస్వామివారి ప్రసాదంపైన జరగని విషయాన్ని జరిగినట్టు ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోయాడులడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని విష ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ మెట్లు తుడిచి హంగామా చేశాడువాడని నెయ్యిని వాడినట్టు వాటిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు ప్రచారం చేశాడుతిరుమల నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలు ఆధారాలు లేవుచంద్రబాబు పాలనలోనే ఏఆర్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నెయ్యి పంపిణీ చేసిందిచిరంజీవి రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి కాదుప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలిపినట్లే జనసేనను బీజేపీలో కలుపుతారాచిరంజీవి మాటలు వింటే అదే అర్థమవుతోందిప్రజారాజ్యం రూపాంతం చెంది జనసేన అయిందన్న చిరంజీవి మాటల వెనుక బీజేపీలో జనసేనను కలుపుతారు ఏమో అని చెక్ చేసుకోవాలి -
గోవిందా.. ఏమిటీ అపచారాలు?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల, తిరుపతిలో వరుసగా జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి. తిరుమలేశుని భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ స్వయంగా సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవోనే పెద్ద అభాండం వేశారు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో పంది కొవ్వు కలిసిందంటూ జరిగిందంటూ కోట్లాది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించి సీబీఐ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది.ఈ ఘటన జరిగినప్పటి నుంచి తిరుమల తిరుపతిలో వరుస సంఘటలు అధకార కూటమి నేతలు చేసిన తప్పులకు పర్యావసానమేనని భక్తులు, స్థానికులు అంటున్నారు. ఇటీవల తిరుపతి క్యూలైన్లో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందడం సహా పలు జరగరాని ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం తిరుమలలో కొందరు భక్తులు ఎగ్ పలావ్‌ని కొండపైకే తెచ్చి, అక్కడే తినడం మరింత కలకలం రేపింది. ఈ వరుస అపచారాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధార్మిక క్షేత్రం తిరుమలకు నిత్యం లక్షలాది భక్తులు వస్తుంటారు. అయినా ఒక చిన్న అవాంఛనయ సంఘటన కూడా జరిగిన దాఖలాలు లేవు. క్రౌడ్ మేనేజ్మెంట్లో టీటీడీకి ఉన్నంత పటిష్టమైన ప్రణాళికలు దేశంలో ఎక్కడా లేవు. అందుకే 9 నెలల క్రితం అయోధ్య రామాలయం ట్రస్ట్ నిర్వాహకులు తిరుమలలోని క్యూలైన్ వ్యవస్థను పరిశీలించి, టీటీడీ అధికారులతో చర్చించి వెళ్లారు. అనంతరం టీటీడీ ఇంజినీరింగ్ నిపుణులు అయోధ్యకు వెళ్లి అక్కడి వారికి శిక్షణ ఇచ్చి వచ్చారు కూడా. అంతటి సమర్ధవంతమైన వ్యవస్థ ఉన్న తిరుమలలో కూటమి ప్రభుత్వం స్వార్ధపూరిత చర్యలకు దిగింది. దాని పర్యవసానమే ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం క్యూలైన్లో తొక్కిసలాట. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఎందుకింత నిర్లక్ష్యం? తొక్కిసలాట ఘటన మరువక ముందే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్ లో షార్ట్ సర్కూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో కౌంటర్లు, క్యూలలో వేలాది భక్తులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ కౌంటర్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత తిరుమల రెండో ఘాట్ రోడ్ వద్ద ఆర్టీసి బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తుల్లో 15 మందికి పైగా గాయపడ్డారు. రెండు రోజుల క్రితం తిరుమల పద్మనాభం యాత్రిక సదన్ పైనుంచి మూడేళ్ల బాలుడు జారిపడి మృతి చెందాడు.గత ఆదివారం పరకామణిలో 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ని చోరీ చేస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అంతకు ముందు ఇదే వ్యక్తి పరకామణిలో మరిన్ని దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో తేలినట్లు తెలిసింది. అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో భక్తులను మోసం చేస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు. తిరుమల ఆలయంపై తరచూ విమానాలు చక్కర్లు కొట్టడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.ఇంకోపక్క తిరుమల పాపవినాశం పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఎర్రచందనం చెట్లను నరికి యథేచ్ఛగా తరలిస్తున్న విషయం బయటపడింది. ఇలా తరలిస్తున్న వారిలో కొందరిని టాస్‌్కఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. శనివారం తమిళనాడుకు చెందిన 18 మంది భక్తులు ఎగ్ పలావ్ తో తిరుమల కొండ పైకి వచ్చేశారు. తిరుపతిలోనే పూర్తిగా తనిఖీ చేసి పంపే పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా వీరు నిషేధిత ఆహార పదార్థాలతో తిరుమలకు చేరుకోవడం, శ్రీవారి ఆలయానికి అతి సమీపంలోని రాంబగీచ వద్దే ఆరగించడం అందరినీ విస్తుగొలిపింది.ఆ ప్రాణాలకు ఇచ్చే విలువ ఇంతేనా? వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టికెట్లు జారీకి సరైన ఏర్పాట్లు చేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ ఫలితమే భైరాగిపట్టెడ పద్మావతి పార్క్, శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ భక్తుల ప్రాణాలకు ఇచ్చే విలువేమిటో ఇక్కడే వెల్లడైంది. చనిపోయిన భక్తుల కుటుంబాలకు టీటీడీ రూ.25 లక్షలు చొప్పున మాత్రమే పరిహారం చెల్లించింది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, ప్రతి కుటుంబానికి టీటీడీలో ఉద్యోగం ఇవ్వాలని పలు పారీ్టలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం, టీటీడీ పట్టించుకోడంలేదు. -
బాబూ.. ఆ సామెత నీకు కరెక్ట్‌గా సరిపోతుంది: ఆర్కో రోజా
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చింత సచ్చిన పులుపు చావలేదు ఆన్న సామెత చంద్రబాబు కోసమే పుట్టినట్టు ఉందంటూ సెటైర్లు వేశారు. కల్తీ రాజకీయాలు చేస్తారు కాబట్టే కల్తీ రాజకీయాలను నమ్ముకున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘చింత సచ్చిన పులుపు చావలేదన్న సామెత మన ముఖ్యమంత్రి చంద్రబాబు కోసమే పుట్టినట్లు ఉన్నది. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలపై విచారణ, ఆధారాలు లేకుండా రాజకీయ దురుద్దేశంతో కల్తీ ఆరోపణలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. సుప్రీం కోర్టు చంద్రబాబు సిట్‌ను కాకుండా సీబీఐ సారథ్యంలో నూతన సిట్ ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయ విమర్శలు వద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.అయినా తన కలుషిత బుద్ధి మానుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని మోదీకి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేసిన సందర్భాన్ని కూడా తన మీడియాతో స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డు అని ముఖ్యమంత్రి అంటే ప్రధాని సంతోషించారంటూ కల్తీ వార్తలు ప్రచారంలో పెట్టారు. తాను మాట్లాడితే కోర్టు ధిక్కరణ అవుతుంది కనుక తన మీడియాతో కల్తీ కథనాలు ప్రచారంలో పెట్టారు. కల్తీ రాజకీయాలను చెసే వారు గనుక కల్తీ ప్రచారాన్ని నమ్ముకున్నట్లున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. చింత సచ్చిన పులుపు చావలేదు ఆన్న సామెత మన ముఖ్యమంత్రి @ncbn గారి కోసమే పుట్టినట్లు ఉన్నది. పవిత్రమైన తిరుమల శ్రీవారి @TTDevasthanams లడ్డు ప్రసాదాలపై విచారణ , ఆధారాలు లేకుండా రాజకియ దురుద్దేశ్యంతో కల్తీ ఆరోపణలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. సుప్రీం… pic.twitter.com/ao9VntFTgv— Roja Selvamani (@RojaSelvamaniRK) October 9, 2024 -
పవన్ కల్యాణ్‌పై కేఏ పాల్ ఫిర్యాదు
పంజగుట్ట (హైదరాబాద్): తిరుపతి లడ్డూ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ సోమవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పాల్ మాట్లాడుతూ లక్ష లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధపు మాటలు మాట్లాడారని, లడ్డూపై విచారణ జరిగిందే జూన్‌లో కాగా, అయోధ్య ప్రారంభోత్సవం జనవరిలో జరిగిందని కల్తీ ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. 14 సెక్షన్ల కింద ఫిర్యాదు చేశానని,ఆర్టికల్ 8 ప్రకారం ఆయన్ను వెంటనే ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని, లేదా ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్‌కల్యాణ్‌కు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే.. అది సినిమాలో మాదిరి చదువుతున్నాడని, గతంలోనే చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఏపీ స్పీకర్, గవర్నర్, దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఛీప్ జస్టిస్, సీబీఐ అతనిపై విచారణ చేయాలని, వెంటనే పవన్‌కల్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు -
పవన్ తన్ను తాను మోసం చేసుకుంటున్నారా!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వింత, విచిత్ర ధోరణి అంతుపట్టకుండా పోతోంది. మాటలు మార్చే విషయంలో ఘనాపాఠిగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడినే మించిపోయేలా ఉన్నాయి వపన్ చర్యలు. ఈ క్రమంలోనే ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూ.. తనను తాను మోసగించుకుంటున్నారా? లేక పార్టీ కార్యకర్తలు లేదా ప్రజలందరినీ మూర్ఖులను చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు. ఈ ప్రస్తావనంతా ఎందుకిప్పుడు అంటే...తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం, ఆ వెంటనే పవన్ రంగంలో దిగి దీక్ష డ్రామాకు తెర తీయడం మనం చూశాం. అయితే ఈలోపుగానే.. లడ్డూ తయారీలో జంతువు కొవ్వు కలిసిన నెయ్యి వాడారు అనేందుకు ఆధారాల్లేనట్లు అందరికీ తెలిసిపోయింది. ఈ పరిణామంతో చంద్రబాబైనా కొంత తగ్గాడేమో కానీ.. పవన్ మాత్రం మరింత రెచ్చిపోయాడు. తానే అసలు సిసలైన హిందువు అని జనాన్ని నమ్మించేందుకు ముందు తిరుమల యాత్ర అని ఆ తరువాత వారాహి డిక్లరేషన్ అని నానా డ్రామాలూ ఆడేశారు. ఆయా సందర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలు కూడా రంకెలేసినట్లుగా అరుపులతోనే సాగాయి. మత విద్వేషాన్ని ఎగదోయడమే లక్ష్యమన్నట్టుగా పవన్ మాట్లాడారని ప్రజలు చాలా మంది అభిప్రాయపడ్డారు.సనాతన ధర్మమంటూ మాట్లాడి, అదేమిటో చెప్పకుండా, హిందూ మతాన్ని తానే ఉద్దరిస్తున్నట్లు ఫోజు పెట్టారు. తిరుమలేశుని భక్తుణ్ణి అని చెప్పుకుంటూనే ఆయనకు అపచారం జరిగేలా లడ్డూ పై ప్రజలలో విశ్వాసం పోయేలా మళ్లీ మాట్లాడారు.అధికారంలో ఉన్నప్పుడు మన మాటలు, చేష్టలు బాధ్యతాయుతంగా ఉండాలి. ఎన్నికల ముందు ఎన్ని అబద్దాలు చెప్పినా చెల్లిపోయింది కదా అని, ఇప్పుడు కూడా అదే ధోరణిలో వెళితే జనానికే కాదు.. జనసేన కార్యకర్తలకు సైతం విసుగొచ్చే ప్రమాదముంది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన వాంగ్మూలంలోనే లడ్డూ కల్తీ ప్రస్తావనను టీటీడీ తీసుకురాకపోతే.. ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్న పవన్ లేనిపోని ఆరోపణలను వల్లెవేయడంలో ఆంతర్యమేమిటో ఆయనకే తెలియాలి.ఎర్ర కండువా నుంచి కాషాయానికి మారడం తప్పు కాదు కానీ తాను గతంలో ఏం మాట్లాడింది? ఇప్పుడు మాట్లాడుతున్నదేమిటి? అన్నది కూడా ఆలోచించుకుని ఉండాల్సింది. ఆ విజ్ఞతతో ప్రసంగించాలి. అంతే తప్ప సనాతన ధర్మ పరిరక్షకుడిని తానే అన్నట్టుగా మాట్లాడినా, పోజు పెట్టినా ప్రజల్ని తక్కువ అంచనా వేయడమే అవుతుంది.2014లో అసలు జనసేన సిద్దాంతాలుగా ఆయన ప్రకటించిందేమిటి? చెప్పిన ఏడు పాయింట్లలో మొదటిది కులాలను కలిపే ఆలోచనా విధానం అనే కదా ఉంది? ఆ తరువాత కులాల గురించి మాటలు ఎన్ని మార్చారో అందరికి తెలుసు. ఎన్నికల సందర్భంగా ఆయన చివరకు తన కులపు వాళ్లయినా తనకు మద్దతివ్వాలని అడిగిన వైనం ప్రజల మనసుల్లో తాజాగానే ఉంది. జనసేన పార్టీ సిద్ధాంతాలుగా పవన్ ప్రకటించిన వాటిల్లో రెండోది మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఈ సిద్ధాంతం కూడా ఇప్పుడు అధికారం వచ్చాక మారిపోయింది. తాను హిందూమతం కోసం పాటు పడతానని, సనాతన ధర్మం కోసం పని చేస్తానని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వీటినిబట్టే కులం, మతం విషయాలలో పవన్ వైఖరి ఎంత దారుణంగా మారిందో అర్థమవుతుంది. ఆయన నిజంగా స్వామి అవతారం ఎత్తదలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పార్టీ రాజకీయాలను వదలిపెట్టి అలాగే చేసుకోవచ్చు. అలా కాకుండా వేషం మాత్రం మార్చి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే దొంగ బాబాగా మిగిలిపోతారు.పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాటల్ని ఒకసారి గుర్తుకు చేసుకుందాం.... ఒకసారి తాను బాప్టిజం తీసుకున్నానని, ఇంకోసారి తన భార్య, కుమార్తె క్రైస్తవులని ఒకసారి చెప్పుకొచ్చారు ఆయన. పరస్పర విరుద్ధమైన ప్రకటనలకు కొదవేలేదు. వీడియోలు అనేకం కనిపిస్తున్నాయి. సనాతన దర్మంలో తండ్రి మతం కాకుండా తల్లి మతం కుమార్తెకు ఎలా వస్తుందన్న ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వగలరా? ఏదో పబ్లిసిటీ కోసం తన కుమార్తెతో తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించి తన పరువు తాను తీసుకున్నారు. ఇక వ్యక్తిగత జీవితంలోకి వెళ్లితే సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు చెబుతున్న ఈయన చేసిన నిర్వాకాలేమిటో అందరికీ తెలుసు.అయినా ఎలాంటి భేషజం లేకుండా పవన్ కళ్యాణ్ ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే, ఆయన మోసపూరిత రాజకీయం చేస్తున్నారని తెలిసిపోతుంది. రాజకీయంగా మాటలు మార్చితే ఒక పద్దతి.అలా కాకుండా మతాల మధ్య చిచ్చుపెట్టేలా అధికారంలో ఉన్న పెద్ద మనిషి వ్యవహరిస్తే అది సమాజానికి ప్రమాదం అవుతుంది. సనాతన ధర్మం అంటే తోచిన అబద్దం చెప్పడమా? తిరుపతి సభలో ఆయన మాట్లాడుతూ సనాతన దర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా తుడిచిపెట్టుకు పోతారని హెచ్చరించారు. సనాతన ధర్మం ప్రకారం విడాకుల ప్రసక్తి ఉండదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు చెబుతున్నారు.మరి పవన్ ఏమి చేశారు. రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. రెండుసార్లు హిందూ స్త్రీలకు విడాకులు ఇచ్చి మూడోసారి క్రైస్తవ మహిళను వివాహమాడారు. అంటే హిందూ ధర్మంపై దాడి చేసింది పవనే అవుతారు కదా! చట్టం ప్రకారం ఆయన చేసింది తప్పు కాకపోవచ్చు.కానీ ఆయన చెబుతున్న సనాతనం ప్రకారం అయితే అది నేరం కాదా?ఇందులో ఇతర అంశాల జోలికి వెళితే బాగుండదు. అవన్ని కూడా సనాతన ధర్మానికే కాదు..హిందూ మత విధానాలకే వ్యతిరేకంగా చేశారు. ఆయన ఇప్పుడు వచ్చి ఈ ధర్మం గురించి బోధిస్తుంటే ఏళ్ల తరబడి హైందవ ధర్మం కోసం పనిచేస్తున్న స్వామీజిలు బిత్తరపోతున్నారు.తాము ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోవాలా అన్నదానిపై పవన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారట. ఎన్నికల ముందు ఆలోచించకుండా ఇష్టారీతిలో అబద్దపు వాగ్దానాలు చేయడం సనాతన ధర్మంలో ఉందా? హిందూ మతంలో ఉందా? కలియుగ దైవానికి అపచారం చేస్తే ఎందుకు ఊరుకుంటాం అని పవన్ ప్రశ్నించారు. అపచారం చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే కదా? జంతు కొవ్వు కలిసిన నేతిని లడ్డూ తయారీలో వాడారని ఆధారం లేని సంగతి చెప్పింది వారే కదా? అది నిజమే అయితే రెండు నెలలపాటు మౌనంగా ఉండడం నేరం కాదా? అయోధ్యకు పంపిన లడ్డూలు కల్తీ అయ్యాయని పవన్ చేసిన ఆరోపణకు నిదర్శనం చూపించాలి కదా? ఈయన స్వయంగా అక్కడకు వెళ్లారు కదా.అప్పుడు ఎవరైనా ఈయనకు ఫిర్యాదు చేశారా? చేస్తే వెంటనే ప్రకటన ఇచ్చేవారు కదా? అంటే అసత్యం చెప్పారనే కదా!'ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోవాలి. అల్లా అంటే ఆగిపోతారు. అదే గోవిందా అంటే మనం ఆగిపోం.." అని అంటారు. ఇది మతాలను రెచ్చగొట్టడం కాదా? హైందవ ధర్మంలో ఇదేనా ఉంది? సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అంటే గొడవ పెట్టుకోవడానికి వచ్చాను అని పవన్ అన్నారు. గొడవలు సృష్టించడానికే ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారా? అసలు ఎవరైనా సనాతన ధర్మం గురించి ఈ మధ్యకాలంలో మాట్లాడారా? కేవలం పవన్ కళ్యాణ్ లేని వివాదం తెచ్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. జగన్ పాలనలో ఏదో జరిగిందని పచ్చి అబద్దాలు చెప్పి హిందూ మతానికి ఈయన మరింత అప్రతిష్ట తెస్తున్నారు.టీడీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని చోట్ల రధం దగ్దం చేయడం వంటివి కొన్ని జరిగాయి. అలాగే మహిళలపై ఈ నాలుగు నెల్లోనే జరిగినన్ని అత్యాచారాలు,ప్రత్యేకించి చిన్న పిల్లలపై జరిగిన ఘోరాలు సమాజాన్ని కలచివేస్తున్నాయి.వాటి గురించి మాట్లాడే ధైర్యం లేని పవన్ ఎంతసేపు గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, సనాతన ధర్మం అంటూ కొత్తపాట ఎత్తుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. నిజానికి ఆయనకు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియదనేదే విద్యాధికుల స్పష్టమైన భావన. ఏపీ ప్రజలలో మత భావాలను పెంచి బీజేపీ ఎజెండా ప్రకారం ఇలాంటి కుట్రలకు పవన్ పాల్పడుతున్నారన్నది మరికొందరి అనుమానం. చంద్రబాబే అవకాశ వాదంతో రకరకాల వర్గాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటారంటే, ఆయనను దాటి పోవాలని ఏమైనా అనుకుంటున్నారా? అన్నది తెలియదు. కానీ హనుమంతుని ముందు కుప్పి గంతులా అన్నట్లు చంద్రబాబు ఈయన తోక కట్ చేయగలరు. తన మీడియా బలంతో భ్రష్టు పట్టించగలరు. చంద్రబాబు, లోకేష్ లు తెలివిగా పవన్ కళ్యాణ్ ను ఇరికించి పరువు తీస్తున్నారా? అన్నది మరికొందరి సందేహం. ప్రస్తుతానికి ఇద్దరూ కలిసి జనాన్ని మోసం చేయడానికి ఈ గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తిరుమల లడ్డూ ప్రసాదంపై తీరు మారని పచ్చ పార్టీ
-
బాబు మెడకు జంతువుల కొవ్వు.. బాలకృష్ణ, పవన్ సైలెంట్..
-
Video: బాబూ.. ఇదేనా వెంకన్నపై నీకున్న భక్తి: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: తిరుమల వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలైంది. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు చంద్రబాబు. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్సీపీ షేర్ చేసింది.చంద్రబాబు భక్తిని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు. దేవుడంటే చంద్రబాబుకి భక్తి లేదు.. భయం అంతకంటే లేదు.. ఇదిగో సాక్ష్యం!.వేంకటేశ్వర స్వామి వీరభక్తుడనని బిల్డప్ ఇచ్చిన @ncbn.. శ్రీవారి ఆలయంలో కనీసం అక్షింతలు కాసేపు కూడా తలపై ఉండనివ్వలేదు దేవుడంటే చంద్రబాబుకి భక్తి లేదు.. భయం అంతకంటే లేదు.. ఇదిగో సాక్ష్యం!#CBNShouldApologizeHindus#SatyamevaJayate#TirupatiLaddu#CBNDestroyedAPin100Days pic.twitter.com/YZuC5A79eN— YSR Congress Party (@YSRCParty) October 5, 2024ఇదే సమయంలో లడ్డూ విషయంలో డైవర్షన్ రాజకీయాలను ప్రశ్నించింది. చంద్రబాబు రాజకీయ పునాదులు.. అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్సే. లడ్డూ వ్యవహారంలో కూడా ఆయన పద్ధతి ఇదే. వీటికి సమాధానాలు చెప్పకుండా.. ఈ డైవర్షన్లు ఎందుకు. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. కనీసం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లకైనా సమాధానం చెప్పు.1.లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిస్తే.. ఆధారాలెక్కడ? 2.కల్తీ జరిగిందని అనుకున్నప్పుడు లడ్డూలపై ఎందుకు పరీక్షలు చేయించలేదు?3.ఈవో ఒకమాట, సీఎం ఒక మాట ఎందుకు చెప్పారు? ఆరోపణలున్న నెయ్యిని తిప్పిపంపామని ఈవో, లేదు వాడారని సీఎం… పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేశారు?4.ఎలాంటి ఆధారం లేకుండా భక్తుల మనోభావాలను చంద్రబాబు ఎందుకు దెబ్బతీశారు?5.జులై 23న రిపోర్టు వస్తే సెప్టెంబరు 18వరకూ 54 రోజులపాటు ఎందుకు దీని గురించి పట్టించుకోలేదు. 6.అసలు నెయ్యి సరఫరా జరిగింది ఎప్పుడు? చంద్రబాబు పరిపాలనలో కాదా? 7.శాంపిళ్లు తీసిన జులై 6, జులై 12 తేదీల్లో నడుస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా? టీటీడీలో ఉన్నది చంద్రబాబు వేసిన ఈవోనే కదా?. -
సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు
-
సుప్రీం తప్పుపట్టినా ఆగని లడ్డు రాజకీయం.. బాబుపై జగన్ ఫైర్
-
టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా సీబీఐ సిట్ విచారణ
-
సుప్రీంకోర్టు తప్పుపట్టినా మారవా బాబూ.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. సుప్రీంకోర్టు తప్పుపట్టినా చంద్రబాబులో మార్పు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారంటూ ట్వీట్ చేసిన ఆయన.. పలు రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు, తదితరులకు ట్యాగ్ చేశారు. Even after the critical remarks of the Hon’ble Supreme Court against @ncbn , TDP continues to politicize the Laddu Prasadam issue. @BJP4India @INCIndia @arivalayam @BRSparty @samajwadiparty @AamAadmiParty @AIADMKOfficial @narendramodi @AmitShah @ShivSenaUBT_ @AITCofficial… pic.twitter.com/vefByATGT6— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2024 ‘సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేస్తూ తీర్పు ఇస్తే.. సిగ్గూ ఎగ్గూ లేకుండా ఆ తీర్పును వక్రీకరిస్తారా? మీరు చేసిన తప్పులను సుప్రీంకోర్టు ఎత్తి చూపుతూ మిమ్మల్ని నిలదీస్తే మాకు అక్షింతలు వేసిందంటూ దుష్ప్రచారం చేస్తారా?’ అంటూ నిన్న(శుక్రవారం) నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. శుక్రవారం ‘ఎక్స్’లో తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతా(హ్యాండిల్)లో చేసిన పోస్టింగ్స్ చూస్తే.. ‘తప్పు జరిగిందని తెలిసినా, దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినా చంద్రబాబులో కనీస పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అంటూ దుయ్యబట్టారు.టీడీపీ అధికారిక ఖాతా నుంచి ‘ఎక్స్’లో చేసిన ఆ పోస్టింగ్స్‌లో ఏం రాశారన్నది చదివి వినిపిస్తూ ‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో అబద్ధం మీద అబద్దాలు చెప్పుకుంటూ పోతున్నారు. మనిషి అన్నాక కొద్దిగానైనా దేవుడంటే భక్తి ఉండాలి. కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంత దారుణంగా వక్రీకరణ చేయడమా?’ అంటూ వైఎస్ జగన్ తీవ్రంగా ఆక్షేపించారు.ఇదీ చదవండి: సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణకాగా, తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సుప్రీంకోర్టు పక్కన పెట్టిన పెట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తద్వారా దర్యాప్తు విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు తామే ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. -
బాబు సిట్' క్లోజ్
-
సుప్రీం సిట్ అయినా నిజం నిగ్గుదేల్చేనా?
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ కల్తీ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గదే అయినప్పటికీ విచారణ నిస్పక్షపాతంగా సాగుతుందా? లేదా? అన్నదానిపై అప్పుడే ఒక అభిప్రాయానికి రాలేము. ఎందుకంటే.. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై కొత్త ఎత్తులు వేస్తారా? అన్న సందేహం అందరిలోనూ ఉంది కాబట్టి! లడ్డూ వ్యవహారంలో తమకు సహకరించమని సుప్రీంకోర్టు కోరిన సోలిసిటర్ జనరల్ ఒకపక్క స్వతంత్ర సిట్‌కు ఓకే అంటూనే.. ఇంకోపక్క రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌కూ సర్టిఫికెట్ ఇస్తూ వారి అర్హతలు బాగానే ఉన్నాయనడం బాబు కేంద్రాన్ని ఏ మేరకు ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి అన్నది ఇక్కడ మరచిపోరాదు.ప్రపంచం మొత్తమ్మీద కోట్లాది మందికి ఇష్టదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెలలో ఒక అర్థం పర్థం లేని ఆరోపణ చేయడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సాగిన ఈ అసత్యపు ఆరోపణలపై నిజాలు నిగ్గుదేల్చేందుకు విషయం సుప్రీంకోర్టుకు ఎక్కింది. అయినా సరే.. టీటీడీ పవిత్రతను కాపాడవలసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రే దానిని దెబ్బతీసేలా వ్యవహరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి దీనిపై దీక్ష పేరుతో ఒక డ్రామా కూడా ఆడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తోసిరాజని బహిరంగ సభపెట్టి మరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకే ఆదేశాలు ఇస్తున్న రీతిలో, మతాల మధ్య ద్వేషాలు పెంచేలా పవన్ మాట్లాడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రాజకీయ డ్రామాలు ఆపండని ఘాటుగా స్పందించడం విశేషం.ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏ విచారణకు అయినా సిద్దం అని చెప్పలేకపోవడం ద్వారా చంద్రబాబు ఎంత ఆత్మరక్షణలో పడింది అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం, టీటీడీల తరఫు న్యాయవాదులు అఫిడవిట్లలో జంతు కొవ్వు కల్తీ ప్రస్తావనే తేలేదట. సుప్రీంకోర్టు మాత్రం తుషార్ మెహతా సూచనను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ నియమించే ఇద్దరు సభ్యులకు అవకాశం కల్పించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఎలా పనిచేస్తుంది? దాని ఎజెండా ఏమిటి? కాల పరిమితి ఏమిటి? ఏ అంశాలపై విచారణ జరుపుతుంది? మొదలైన విషయాలపై స్పష్టత రావల్సి ఉంది.చంద్రబాబు, పవన్ లు అధికారంలోకి వచ్చాక జరిగిన ఈ ఘటనలను గత జగన్ ప్రభుత్వానికి పులిమి రాజకీయ లబ్ది పొందడానికి ప్రయత్నం జరిగింది. మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించి విచారణ కోరి ఉండకపోతే, చంద్రబాబు తన అరాచక ఆరోపణలు కొనసాగించే వారు. తాను చెప్పిన విధంగా నివేదిక తయారు చేసేందుకే సొంత సిట్ ను నియమించుకున్నారు. ఈ విషయాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొంతవరకు గమనించినట్లే అనుకోవాలి. అందుకే వారు పలు ప్రశ్నలు సంధించారు. ఏ ఆధారంతో లడ్డూలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని చెప్పారని సూటిగానే అడిగింది. విచారణ జరగకుండా సీఎం మీడియాకు ఎక్కడమేమిటని అసహనం వ్యక్తం చేసింది.సుప్రీం వేసిన ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ ల వద్ద జవాబు లేదు. టీటీడీ తరపున వాదించిన లాయర్ సిద్దార్ధ్ లూద్రా కల్తీ నెయ్యి తో లడ్డూ తయారు కాలేదని చెప్పారు. ఇది ప్రభుత్వం తరపున చెప్పినట్లే. అలాంటప్పుడు లడ్డూ విషయంలో స్పష్టత వచ్చినట్లయింది. ఇక విచారణ జరపవలసింది ఈ లడ్డూ వివాదంలో ఎవరి పాత్ర ఏమిటనేదే? చంద్రబాబు నాయుడు ఏ ఆధారంతో జంతుకొవ్వు కలిసిందని అన్నారు? తనతో శ్రీ వెంకటేశ్వర స్వామే నిజాలు చెప్పించారని అంటూ, గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలలో నిజం ఎంత? అబద్దం ఎంత?పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో సాగించిన తంతు ఏమిటి? ఈ ఓ శ్యామలరావు తొలుత వెజిటబుల్ ఫాట్ (వనస్పతి) కలిసిందని, ఆ టాంకర్లను వాడలేదని ఎలా చెప్పారు. తదుపరి జంతు కొవ్వు ప్రసావన ఎందుకు చేశారు. చంద్రబాబు ప్రభావంతోనే ఆయన అలా చేశారా? లడ్డూని పరీక్షకు పంపకుండా సీఎం స్థాయిలోని వ్యక్తి రెండు నెలల తర్వాత ఏ ఆరోపణ అయినా చేయవచ్చా? మైసూరులోని సంబంధిత పుడ్ టెస్టింగ్ లాబ్ కు తిరస్కరించిన నెయ్యి శాంపిల్స్ పంపించారా? లేదా? పంపిస్తే ఆ లాబ్ ఏమి రిపోర్టు ఇచ్చింది.పనికట్టుకుని గుజరాత్ లోని ఎన్.డి.డి.బి లాబ్ కు పంపడంలో ఏమైనా కుట్ర ఉందా? ఆ సంస్థ చైర్మన్ సరిగ్గా అంతకు ఒకటి, రెండు రోజుల ముందే టీటీడీ ఈఓని, మరికొందరు ప్రముఖులను ఎందుకు కలిసి వెళ్లారు? గతంలో చంద్రబాబు హయాంలో కాని, జగన్ హయాంలో కాని ఇలా నాణ్యత ప్రమాణాలు లేని నేయి ట్యాంకర్లను తిరస్కరించినప్పుడు, వేరే లాబ్ లకు పరీక్ష నిమిత్తం పంపించారా? లేదా? లేకుంటే ఎందుకు చేయలేదు. సుప్రీంకోర్టు విచారణలో పలు సందేహాలు వ్యక్తం చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ యధాప్రకారం లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని ఆరోపించడంలో ఉద్దేశం ఏమిటి? అయోధ్యకు కూడా కల్తీ నెయ్యి కలిసిన లడ్డూలు పంపారని పవన్ చెప్పడానికి ఆధారం ఏమిటి? అప్పట్లో అయోధ్యలో ఈ ప్రసాదం లడ్డూలను తిన్నవారెవరు ఎలాంటి పిర్యాదు చేయలేదు కదా? ఎన్.డి.డి.బి రహస్య నివేదిక ఇస్తే దానిని టీడీపీ ఆఫీస్ నుంచి ఎలా విడుదల చేశారు?ఇలాంటి అంశాలన్నిటిపైన కొత్త కమిటీ దర్యాప్తు చేస్తే మంచిదే. కమిటీ కూర్పులో సీబీఐ నుంచి ఇద్దరు, పుడ్ సేఫ్టి టెస్టింగ్ లాబ్ నుంచి ఒకరిని నియమించడం వరకు ఫర్వాలేదు.రాష్ట్రం నుంచి ఇద్దరు సిట్ సభ్యులను నియమించడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది. వారు చంద్రబాబు పక్షాన ఆయనకు అనుకూలంగా ప్రభావితం చేయరన్న గ్యారంటీ ఉంటుందా.? కేంద్రంలోని సీబీఐపై కూడా విపక్షాలు పలు విమర్శలు చేస్తుంటాయి. అలాంటప్పుడు సుప్రీంకోర్టు నేరుగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తే బాగుండేదేమో! లేక ఒక న్యాయమూర్తిని లేదా రిటైర్డ్ జడ్జిని నియమించి విచారణ చేయిస్తే ఎక్కువ ఉపయోగం ఉండేదేమో ఆలోచించాలి. తొలుత విచారణ జరిపినప్పుడు న్యాయమూర్తులు చేసిన ఘాటైన వ్యాఖ్యలకు తగినట్లుగా ఈ విచారణ సంఘం ఏర్పాటు కాలేదేమో అన్న అభిప్రాయం ప్రబల వచ్చు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేయాల్సిన అపచారం అంతా చేసి, కేవలం రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీయడానికి తప్పుడు ఆరోపణలు చేసి ఇంత గందరగోళం సృష్టించారన్న భావన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయడం , అందులో వివాదాస్పద ,పక్షపాతంతో పనిచేసే అధికారులను నియమించిన వైనంపై రాజకీయ పార్టీలు తప్పు పట్టాయి. ఇన్ని పరిణామాలు జరిగిన ఈ ఉదంతంలో తొలుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లనే విచారించాలి. అలాగే టీడీపీ ఆఫీస్ లో టెస్ట్ రిపోర్టు అంటూ విడుదల చేసిన టీడీపీ ప్రతినిధులను ప్రశ్నించాలి.తదుపరి ఈ ఓ శ్యామలరావును ప్రకటనలపై దర్యాప్తు చేయాలి.టెస్ట్ రిపోర్టు వచ్చిన రెండు నెలల తర్వాత దానిని ముఖ్యమంత్రి ఎందుకు బహిర్గతం చేశారో తెలుసుకోవాలి. ఎలాగూ ఏఆర్ సంస్థకు టెండర్ వచ్చిన దానిపై విచారణ జరుగుతుంది? అయితే వారు నెయ్యి సరఫరా చేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. మాజీ చైర్మన్ లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలను, మాజీ ఈఓ ధర్మారెడ్డిని ఎలాగూ కమిటీ విచారిస్తుంది! ఏది ఏమైనా మొత్తం హైందవ సమాజం అంతటిని గందరగోళంలోకి నెట్టిన ఈ అంశంలో, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు సృష్టించిన ఈ వివాదంలో నిష్పక్షపాతంగా కమిటీ విచారణ జరగాలి.అప్పుడే తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి జరిగిన అపచారానికి పరిహారం అయినట్లు అవుతుంది.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సుప్రీంకోర్టు దెబ్బకు తప్పు ఒప్పుకున్న చంద్రబాబు
-
‘ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రకు తెరలేపారు’
తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వంద రోజుల పాలనపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు అంటూ ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి. ‘ లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో చిన్నారి అశ్వియా అంజుమ్ కిడ్నాప్‌కు గురై హత్య గావించబడితే పోలీసులు కనీసం పట్టించుకోలేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ కాలిపోతే డిజిపి స్పెషల్ ఫ్లైట్, ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు. డిజిపి పనితీరు మార్చుకోవాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో నాపై బురద చల్లెందుకు ఎన్నో కుట్రలు చేశారు, ఎలాంటి ఆధారాలు లభించక లేదు’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన అశ్వియా అనే బాలిక కిడ్నాప్ గురై ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడింది. అశ్వియా కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు పరామర్శించనున్నారు. అయితే పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలు హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు పుంగనూరుకు వెళుతున్నారన్న సమాచారంతో అక్కడ పెద్ద ఎత్తును పోలీసులను మోహరించింది చంద్రబాబు సర్కారు. -
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై సీబీఐ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘సిట్’ను పక్కనపెట్టిన సుప్రీంకోర్టు
-
లడ్డూలో కాదు.. కూటమిలోనే కల్తీ
సాక్షి, విశాఖపట్నం: పవిత్రమైన తిరుపతి లడ్డూను రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారు. వందరోజుల పాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు విషరాజకీయాలకు తెరతీశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేశారంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. రెండు రోజుల తర్వాత.. కల్తీ నెయ్యి అనీ.. మరికొద్ది రోజుల తర్వాత.. లడ్డూలో కలవలేదనీ.. కలవకుండా ఆపేశామంటూ పూటకోమాట మార్చేస్తూ.. భక్తుల మనోభావాలతో రాజకీయ చదరంగమాడారు. దీనిపై నిస్పాక్షికమైన దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు, అండ్ కో చేసిన వ్యాఖ్యలపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాల్లేకుండా.. దేవుడిని రాజకీయాల్లోకి లాగారంటూ మండిపడింది. చేసిన తప్పుడు వ్యాఖ్యల్ని సమరి్థంచుకునేందుకు కూటమి ప్రభుత్వం.. రాష్ట్ర పోలీసులతో సిట్ పేరుతో ఆడాలనుకున్న నాటకాలకు ధర్మాసనం స్వస్తి పలికింది. లడ్డూ వ్యవహారం సీబీఐకి అప్పగించి.. స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కుటిల స్వార్థంతో భగవంతుడిని రాజకీయాల్లోకి లాగారంటూ ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. సుప్రీం నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టులాంటిదని అభిప్రాయపడుతున్నారు. తప్పు జరిగితే దేవుడే చూసుకుంటాడని.. తప్పుడు ఆరోపణలు చేసినా.. ఏడుకొండల వాడు విడిచి పెట్టరంటున్నారు. మతజ్వాలలు రగిలించిన ప్రభుత్వ వ్యవహారంపై చిన్నా పెద్దా తేడాలేకుండా.. యావత్ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. అసలు లడ్డూలో కల్తీ లేదని.. కూటమి ప్రభుత్వం చేసిన విషప్రచారంలోనే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుంటే బావుంటుంది ఈ మధ్య మా మిత్రులతో కలిసి భద్రాచలం వెళ్లాం. అక్కడ ప్రసాదం తినే ముందు సీఎం చంద్రబాబు దుర్బుద్ధితో చేసిన కల్తీ లడ్డూ ప్రకటన గుర్తుచేసుకొని బాధపడ్డాం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఐదుగురితో ఏర్పాటు చేసిన బృందంలో ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులకు బదులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటే బావుంటుంది. సిట్ విచారణ చేయడానికి సుప్రీంకోర్టు కాలపరిమితి విధించాలి. – జీవీఎన్ సంజయ్, సాఫ్ట్ వేర్ ఆపరేషన్ మేనేజర్ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. తెలిసితెలిసి కలియుగ దైవం వేంకటేశ్వరస్వామితో ఆడుకుంటే వారికి మామూలుగా పాపం అంటదు. వంద రోజుల ప్రభుత్వ పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కల్తీ లడ్డూ వివాదం కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. చివరకు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తిరుమల రాకుండా మతం రంగు పులిమి అడ్డు తగిలారు. సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అయింది. –దంతులూరి వెంకట శివ సూర్యనారాయణరాజు, ఎంపీపీ, భీమిలిచంద్రబాబు ప్రకటన ఆవేదనకు గురిచేసింది నేను మూడేళ్ల నుంచి తిరుమల వెంకటరమణమూర్తి గోవింద మాల వేస్తున్నాను. తిరుమల లడ్డూ ప్రసాదం జంతువుల కొవ్వుతో కల్తీ చేశారనే చంద్రబాబు ప్రకటన చాలా ఆవేదనకు గురిచేసింది. ఆధారం లేకుండా ముఖ్యమంత్రిగా ఎలా బహిరంగ ప్రకటన చేశారని చంద్రబాబును సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించిన తర్వాత కాస్త మనసు కుదుటపడింది. దర్యాప్తులో ఏ రాజకీయ పార్టీది తప్పని తేలితే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి. – మజ్జి రవికుమార్, తిరుమల గోవింద మాలధారుడుచంద్రబాబును బహిష్కరించాలి హిందూ ధర్మ పరిరక్షణే మూల సిద్ధాంతంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం బీజేపీ మెజార్టీ హిందువుల ఓట్లతో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా చంద్రబాబు తిరుపతి లడ్డూపై వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమి నుంచి బహిష్కరించాలి. సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిజాయితీగా దర్యాప్తు చేయాలలి– వాసు, జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ఫైవ్మెన్ కమిటీని స్వాగతిస్తున్నా.. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్వాగతిస్తున్నాం. విచారణకు సంబంధించి ఫైవ్‌మెన్ కమిటీతో నిజాలు బయటపడతాయన్న ఆశ ఉంది. కోట్లాది మంది హిందువులు..శ్రీవారి భక్తుల మనోభావాలను చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ దెబ్బతీశారు. సనాతన ధర్మం కోసం పవన్‌కల్యాణ్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. – వాసుపల్లి గణేష్‌కుమార్, వైఎస్సార్సీపీ దక్షిణ సమన్వయకర్తశివుడు కూడా సహించడు తిరుపతి వెంకన్న లడ్డూ్డ అంటే అది దివ్యప్రపాదం. ఒకసారి స్వామికి నివేదించాక అది అమృతం కన్నా గొప్పది. దేవతలు మనంపెట్టే నైవేద్యాలను ఆఘ్రాణ రూపంగా ఆరగిస్తారని శా్రస్తాలు చెపుతాయి. అటువంటి గొప్ప ప్రసాదం మీద కల్తీ అనే అపవాదు వ్యాపింపజేయడం గొప్ప అపచారం. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమయోచితంగా స్పందించింది. పరమ పవిత్రమైన లడ్డూపై జరిగిన దు్రష్పచారాన్ని చంద్రచూడుడు (శివుడు) మాత్రం సహిస్తాడా?? – బులుసు వేంకటేశ్వర్లు, ప్రముఖ పద్యకవి, తగరపువలసబాబు ఆరోపణలు తగవు తిరుమల లడ్డూ విషయంలో వైఎస్సార్ సీపీ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఆది నుంచి కోరింది. సుప్రీంకోర్టు కూడా ఫైవ్‌మెన్ కమిటీతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. స్వతంత్ర దర్యాప్తుతోనే వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విషయంపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. – గొలగాని హరి వెంకటకుమారి, విశాఖ నగర మేయర్నిజం నిగ్గు తేలుతుంది రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌పై హిందువులెవరికీ నమ్మకం లేదు. ఒక స్వతంత్ర ఏజెన్సీ ద్వారా దర్యాప్తు జరపాలని వైఎస్సార్సీపీ తొలి నుంచి డిమాండ్ చేస్తోంది. శ్రీవారి లడ్డూపై వచ్చిన ఆరోపణలపై నిజనిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను యావత్ హిందువులు స్వాగతిస్తున్నారు. మాపార్టీ నుంచి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సు్రíపీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు చేయించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం. – గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, విశాఖ -
దేవుడంటే బాబుకు భయమూ, భక్తి రెండూ లేవు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దుర్భుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ టీడీపీ ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తుందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. చంద్రబాబు రాజకీయ దుర్భుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చిగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేసినట్టుగా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు. ఈ విషయంలో చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. చంద్రబాబు స్వయంగా వేసుకున్న సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు... చంద్రబాబుకు దేవుడంటే భక్తి ఉంటే ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. చంద్రబాబుకు భయం, భక్తి రెండూ లేవు. ఆయనకు భయం, భక్తి ఉంటే.. ఇప్పటికైనా పశ్చాత్తాపం రావాలి. చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఇప్పటికీ టీడీపీ ట్విట్టర్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కోర్టులు వారిని తప్పుబడితే సోషల్ మీడియాలో మాపై తప్పుడు ప్రచారానికి తెరలేపారు. లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని టీటీడీ ఈవోనే చెప్పారు. చంద్రబాబు చెప్పింది తప్పు అని ఈవోనే అంటున్నారు. ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తున్నారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా చంద్రబాబు తీరు మారలేదు. సిగ్గు లేకుండా చంద్రబాబు ప్రతీ విషయాన్ని వక్రీకరిస్తున్నారు. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు అపవిత్రం చేశారని ఆరోపించారు. .. లడ్డూ వివాదంలో జాతీయ మీడియా కూడా చంద్రబాబును తప్పు బట్టింది. శ్రీవారి లడ్డూ విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ హయాంలో 14 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించాం. ఈ టెండర్లలో వచ్చిన వాళ్లకే కాంట్రాక్ట్‌లు ఇస్తారు. ప్రతీ నెయ్యి ట్యాంకర్ సర్టిఫికెట్ తీసుకుని రావాలి. నెయ్యి ట్యాంకర్లకు టీటీడీ మూడు టెస్టులు చేస్తుంది. టెస్టులు ఫెయిల్ అయితే ఆ ట్యాంకర్లను వెనక్కి పంపుతారు. ట్యాంకర్లను రిజెక్ట్ చేసినట్టు స్వయంగా ఈవోనే చెప్పారు. నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉందని ఈవోనే స్పష్టంగా వెల్లడించారు. చంద్రబాబు మాత్రం లడ్డూ ప్రతిష్టను దిగజార్చారు... కల్తీ నెయ్యి ప్రసాదానికి వాడలేదని ఈవో మరోసారి చెప్పారు. ఈవో చెప్పినప్పటికీ చంద్రబాబు మళ్లీ అసత్య ప్రచారాలు చేశారు. భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పింది. రాజకీయ డ్రామాలు చేయవద్దని హెచ్చరించింది. చంద్రబాబు మంచి వ్యక్తి అయితే ఆధారాలను చూసి సిగ్గుపడాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా బాబు వ్యవహరించారు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘టీటీడీ లడ్డూ విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాము. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాము. పొలిటికల్ కామెంట్ చేయొద్దు అని కోర్టు చెప్పింది. చంద్రబాబు వ్యాఖ్యల కారణంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగింది. ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పాము.నా హయాంలో ఏఆర్ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయి అన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దు అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. విచారణ ముగిసే వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంటుంది. మాపై చేసిన నిందలు తొలగిపోతాయని అనుకుంటున్నాము. మేము ఉన్న సమయంలో కల్తీ జరగలేదు. లడ్డులను ఇంతవరకు టెస్ట్ చేయలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ‘సుప్రీం’ నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్సార్సీపీ -
తిరుమలలో అపశృతి
తిరుపతి,సాక్షి : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రారంభం ముందు అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. సాయంత్రం ధ్వజారోహణం సమయంలో ధ్వజస్తంభంపై గరుడ పఠాని ఈ కొక్కి ద్వారానే ఏగుర వేయాల్సి ఉందని అర్చకులు తెలిపారు. కొద్దిసేపటి క్రితం కొక్కి విరగడంతో టీటీడీ మరమ్మత్తు పనులు ప్రారంభించింది. అర్చకులు ద్వారా ధ్వజస్తంభంపై టీటీడీ మరమ్మత్తు పనులను ముమ్మరం చేసింది. -
సీబీఐ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ దర్యాప్తును స్వాగతిస్తున్నాం
-
‘మీరే హిందూ మతానికి అసలైన శత్రువులు’.. పవన్‌కు డీఎంకే కౌంటర్
చెన్నై: తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది పవన్ వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడారు. ‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా’ అంటూ హెచ్చరించారు.అయితే పవన్ వ్యాఖ్యలపై డీఎంకే గట్టి కౌంటర్ ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ‘ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది’ అని సూచించారు. తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30న తొలిసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. శ్రీవారి ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడం తగదంటూ మొట్టికాయలు వేసింది. తాజాగా ఆ వ్యాఖ్యల్ని ప్రస్తావించిన హఫీజుల్లా..‘ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీలే హిందూ మతం, మానవత్వానికి నిజమైన శత్రువులు ’ ద్వజమెత్తారు. డీఎంకే ఏ మతం గురించి మాట్లాడదు. మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేది బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్. వారే అసలైన శత్రువులు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మీకు మీరే సాటి అని సెటైర్లు వేశారు. ‘ఇంకా.. కులం, అంటరానితనంపై అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, పెరియార్ ఇతర ద్రావిడ ఉద్యమ వ్యవస్థాపకుల తరహా వైఖరినే డీఎంకే అవలంభిస్తుంది. వాటికి అనుగుణంగా కులం, అంటరానితనం గురించి పోరాడుతుంది. వ్యతిరేకిస్తుందని సూచించారు.👉చదవండి: సుప్రీంలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ -
స్వతంత్ర సిట్ దర్యాప్తుపై వైవీ సుబ్బారెడ్డి ఫస్ట్ రియాక్షన్
-
‘సుప్రీం’ నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్సార్సీపీ
సాక్షి, తిరుపతి: సీబీఐ సిట్ బృందం విచారణ పూర్తిగా స్వాగతిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయంపై ఆయన స్పందిస్తూ.. లడ్డూపై కేవలం దురుద్దేశ పూర్వకంగా చంద్రబాబు ఆరోపణలు చేశారన్నారు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే నమ్మకం ఉందన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయన్నారు. సీబీఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలతాయని, సత్యం వెలుగులోకి వస్తుందని భూమన అన్నారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డిసుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పొలిటికల్ కామెంట్లు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. చంద్రబాబు వ్యాఖ్యలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేశామన్నారు. ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పాము. నా హయాంలో ఏ.ఆర్ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. విచారణ ముగిసే వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంటుంది. మా పై చేసిన నిందలు తొలగిపోతాయని అనుకుంటున్నాము. మా సమయంలో కల్తీ జరగలేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.బాబు అబద్ధాలు తేటతెల్లమయ్యాయి: రవీంద్రనాథ్రెడ్డితిరుమల లడ్డు కల్తీ ఆరోపణలపై సుప్రీం కోర్టు సిట్ వేయడం చంద్రబాబుకు చెంపపెట్టని, ఇప్పటికైనా చంద్రబాబు దేవుడిని తన స్వార్ధ రాజకీయాలకు వాడుకోవడం మానుకోవాలని వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరుని భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారని, లడ్డూలో కల్తీ నెయ్యి వాడకపోయినా కల్తీ జరిగిందంటూ చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేశారని ఆయన అన్నారు. నేటి సుప్రీం కోర్టు తీర్పుతో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని తేటతెల్లమయ్యాయని, సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి..: ఆర్కే రోజాశ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం’’ అని మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని ఆమె హితవు పలికారు.‘‘మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రే విచారణ, ఆధారాలతో సంబంధం లేకుండా రాజకీయ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి పరిధిలోని విచారణతో నిజాలు బయటికి రావని స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావాలని కోరుకున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో విచారణ జరగాలనే వాదనతో మా డిమాండ్‌కు విశ్వసనీయత పెరిగింది. సుప్రీం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి వస్తాయని, తద్వారా గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని పునరుద్ధరించినట్టు అవుతుందని తిరుపతి ఆడబిడ్డగా నమ్ముతున్నాను..!!’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు.శ్రీవారి లడ్డూ ప్రసాదాల వివాదంలో #SupremeCourt తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం. సుప్రీం తీర్పుతో అయినా సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు అందరూ మానుకుంటే మంచిది. మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర…— Roja Selvamani (@RojaSelvamaniRK) October 4, 2024 చంద్రబాబు, పవన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కొట్టు సత్యనారాయణ స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయడం స్వాగతిస్తున్నామని మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు వంద రోజుల పరిపాలన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకొని లడ్డూ రాజకీయం చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం కోట్లాది మంది హిందువుల మనోభావాలు నిలబెట్టింది. దుర్మార్గుడైన ముఖ్యమంత్రి రాజకీయ క్రీడలకు ఇది చెంపపెట్టు. లడ్డూ వివాదంపై ఇప్పటికైనా ప్రభుత్వం పుల్ స్టాప్ పెట్టి సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.ఇదీ చదవండి: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ..స్వతంత్ర సిట్ కమిటీ చంద్రబాబు పవన్ కల్యాణ్‌లను కూడా విచారణ చేయాలి. కల్తీ లడ్డూలు అయోధ్య రామలయానికి కూడా పంపారంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఏ ఆధారాలతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.? ఎవరు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మంలో బ్రాహ్మణ ఇతరులు సైతం కూడా ఆచరించే ఆగమాలు సైతం ఉన్నాయి. సనాతన ధర్మంపై పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు.సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం: కాకాణిసుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. మొదటి నుంచి వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్న దానినే సుప్రీంకోర్టు ఏకీభవించినట్లు అనిపించిందన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా నిజానిజాలు బయటికి రావు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు అయ్యే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారానే నిజాలు బయటికి వస్తాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉండాలి హిందూ భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. రాజ్యాంగం, కోర్టుల గురించి పవన్‌కు అవగాహన లేదు. హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. వారాహి డిక్లరేషన్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణలోకి తీసుకోవాలి.చంద్రబాబు రాజకీయ పతనం ఆరంభమైంది: తోపుదుర్తితిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పందిస్తూ.. తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. సుప్రీంకోర్టు.. చంద్రబాబుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం భగవంతున్ని సైతం వదలకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు రాజకీయ పతనం ఆరంభమైంది. చంద్రబాబు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, లేదంటే రాజీనామా చేయాలి’ అని తోపుదుర్తి డిమాండ్ చేశారు. -
లడ్డూ వివాదంపై సుప్రీం ఆదేశాలు.. అంబటి రియాక్షన్
-
చంద్రబాబుకు సుప్రీం ఊహించని దెబ్బ..
-
స్వతంత్ర సిట్ నిజాలు నిగ్గుతేల్చుతుందా ?
-
లడ్డూ కేసులో స్వతంత్ర సిట్ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ దర్యాప్తు
-
తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. కాసేపట్లో విచారించనున్న సుప్రీంకోర్టు
-
తిరుమల లడ్డూ కేసు:.. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేడు(శుక్రవారం) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది.తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈరోజు విచారణప్రారంభమైన అనంతరం కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జర్నల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేంద్ర అధికారిని ఏర్పాటు చేస్తే మంచిదని, లడ్డూ వ్యవహారంపై ఆరోపణలు నిజమైతే హర్షించదగనిది.. ఈ కేసు విచారణకు సిట్ ఒక్కటే సరిపోదు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలి. సెంట్రల్ నుంచి సూపర్ విజన్ ఉండాలి’’ అని తుషార్ మెహతా తెలిపారు.ఈ కేసు సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు?: సుప్రీంతిరుమల లడ్డూ వివాదంపై కేసును సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘ఈ అంశంపై పొలిటికల్ డ్రామా జరగొద్దనుకుంటున్నాం. సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు.కల్తీ జరిగిందని మీరు ఊహించుకుంటున్నారా? కల్తీ నెయ్యి కేసు సీబీఐకి ఎందుకు దర్యాప్తు చేపట్టకూడదు’ అని ప్రశ్నించింది.స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టుస్వతంత్ర దర్యాప్తు ఉంటే మంచిది.సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు ఉండొచ్చు కదా. రాజకీయంగా లడ్డూపై వ్యాఖ్యలు చేయొద్దు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు. స్వంతంత్ర సిట్ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు. లడ్డూ కల్తీ జరిగితే చాలా తీవ్రమైన అంశం’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు. స్వంతంత్ర సిట్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. సిట్ సభ్యులుగా ఇద్దురు సీబీఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, FSSAI(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ఇండియా) నుంచి ఒకరు దర్యాప్తు చేపట్టనున్నారు.కాగా సెప్టెంబరు 30న ఈ కేసును విచారించిన సుప్రీం.. సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలా అనే విషయంలో తమకు సహకరించాలని మెహతాను కోరిన విషయం తెలిసిందే. నెయ్యి కల్తీ పై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించారని గత విచారణలో వ్యాఖ్యానించింది. కల్తీ అంశంపై వాస్తవాలు నిర్ధారణ కోసం సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మీడియా ముందుకు వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి. జూలైలో రిపోర్టు వస్తే .. సెప్టెంబర్‌లో మీడియాకు ఎందుకు చెప్పారు ?.సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరస్కరించిన నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా?కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా ?. సిట్ వేసిన తర్వాత మళ్లీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారు’ అంటూ ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీటీడీ తరుఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా నీళ్లు నమిలారు. -
అది నోరా.. మోరా.. పవన్
-
తిరుమల లడ్డూ వివాదంపై నేడు విచారణ
-
పవన్‌కూ కోర్టులో మొట్టికాయలు తప్పవా?
తిరుపతి: సనాతన ధర్మాన్ని ముందు ఉంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఊగిపోయారు. గురువారం సాయంత్రం వారాహి డిక్లరేషన్ సభలో ఏకంగా న్యాయవ్యవస్థపైనే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవైపు తిరుమల లడ్డూ ప్రసాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్లపై విచారణ నడుస్తున్న వేళ.. పవన్ తాజా వ్యాఖ్యలు కచ్చితంగా చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.‘‘నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. సనాతన ధర్మం పాటించే వాళ్ల పట్ల చట్టాలు నిర్ధాక్షిణ్యంగా పని చేస్తున్నాయి. సనాతన ధర్మాన్ని దూషించేవారిని కోర్టులే రక్షిస్తున్నాయి. అయినవాళ్లకు ఆకులు.. కానివాళ్లకు కంచాలు అన్నట్లు ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆకులు కూడా పోయాయి.. చేతుల్లో పెట్టి నాకేసుకోమంటున్నారు... సనాతన ధర్మం వైరస్లాంటిదని, నాశనం చేస్తానని ఓ యువనేత అన్నారు. ఇలాంటి మాటలు ఇస్లాం గురించి అంటే తక్షణం కోర్టులు స్పందించేవి. వాళ్లను నిర్దాక్షిణ్యంగా శిక్షించేవి. సనాతన ధర్మాన్ని తిట్టినా.. శ్రీరాముడిని, సరస్వతి దేవిని తిట్టినా.. దాడి చేసినా ఏ ఒక్కకోర్టు మాట్లాడదు. అలాంటి వారిని ఏమైనా అనాలంటే కోర్టులు భయపడతాయి. ఇది న్యాయానికి ఉదాహరణ... నాకు ఏదో అన్యాయం జరిగిందని నేను బయటకు రాలేదు. జనసేన అధ్యక్షుడిగానో, ఏపీ డిప్యూటీ సీఎంగానో ఇక్కడికి రాలేదు. సనాతన ధర్మ విరోధులతో గొడవ పడడానికే వచ్చా. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా?. లడ్డూ విషయంలో కోర్టులు తీర్పులు ఇచ్చే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పవన్ అన్నారు.ఈమధ్యకాలంలో కోర్టులు ఈ తరహా వ్యాఖ్యలను అస్సలు ఉపేక్షించడం లేదు. తమ తీర్పును రాజకీయాలకు ముడిపెట్టి స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా పరిగణించి సుప్రీం కోర్టు మందలించింది. అలాగే లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తన రాజకీయం కోసం చేసిన ప్రచారంపైనా మండిపడింది. ఇవేకావు.. బాధ్యతగల పదవుల్లో ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వాళ్లపట్ల న్యాయస్థానాలు అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలున్నాయి. అలాంటిది.. పవన్ నేరుగా కోర్టులపైనే బహిరంగ సభలో వ్యాఖ్యలు చేశారు. మరి వీటిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా ఉంటుందా?. మొట్టికాయలు వేయకుండా ఉంటుందా?. ::లోకేష్ఇదీ చదవండి: చివరి నిమిషంలో లడ్డూ పిటిషన్ల విచారణ వాయిదా -
లడ్డూ కల్తీపై పిటిషన్లు... విచారణ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేటి సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. సోలిసిటర్ జనరల్ అభ్యర్థనతో చివరి నిమిషంలో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు.గత విచారణ సమయంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగించాలా? లేదంటే స్వతంత్ర దర్యాప్తు జరిపించాలా? అనే అంశంపై కేంద్రాన్ని స్పష్టత కోరింది సర్వోన్నత న్యాయస్థానం. ఇందుకు ఇవాళ్టి లోపు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం చెప్పమని కోరింది.అయితే ఇవాళ 3గం.30ని. విచారణ జరగాల్సి ఉండగా.. రేపటి వరకు సమయం కావాలని సోలిసిటర్ జనరల్ అభ్యర్థించారు. దీంతో రేపు సుదీర్ఘంగా విచారిస్తామని, ఇరువైపుల వాదనలు వింటామని చెబుతూ విచారణను చివరినిమిషంలో వాయిదా వేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.నాలుగు పిటిషన్లపై విచారణ.. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యితో అపవిత్రం అయ్యిందంటూ చేసిన ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్ధిస్తూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సంపత్, శ్రీధర్, సురేష్ చవంకేలు వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలను కలిపి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కిందటి నెల 30వ తేదీన విచారణ జరగ్గా.. సీఎం హోదాలో బాధ్యతారాహిత్యంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్‌రావు, సంపత్, శ్రీధర్ తరఫున రాఘవ్ అవస్తీ, సురేష్ చవంకే తరఫున సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్.. అలాగే ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు ఇరుపక్షాల వాదనలు సాగగా.. వాటిని కోర్టు రికార్డు చేసింది.ఇదీ చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు -
పల్టీలు కొట్టే.. పరువు పాయే!
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపడితే, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం సుప్రీంకోర్టును తప్పు పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టిన తీరు గమనించారా? తాను అర్ధవంతంగా మాట్లాడడం లేదని ఆమెకు తెలుసు. అందుకే కొంత తడబాటుగా, మరికొంత పొడి, పొడిగా మాట్లాడారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సమర్థించడానికి ఆమె తంటాలు పడ్డారు. నిజానికి ఇలాంటి సందర్భాలలో నిజాయితీగా మాట్లాడితే వారి విలువ పెరుగుతుంది. ఎంత మిత్రపక్షమైనా, వారు ఏమి చేసినా సమర్థిచే దశకు వెళితే ఆ మరక వీరికి కూడా అంటుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు.ఇప్పటికే కూటమిలో మరో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ వెనుకబడి పోతానో అని ఏదో దీక్ష అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి గబ్బు అయ్యారు. చివరికి తాను లడ్డూ కల్తీ గురించి తిరుమల యాత్ర చేయలేదని, గత ఐదేళ్లలో పాపాలు జరిగాయని అందుకు ప్రాయశ్చితంగా వెళ్లానని చెప్పవలసి వచ్చింది. పవన్ కళ్యాణ్‌కు అబద్దాలు ఆడడం, మాట మార్చడం కొత్తకాదు. కాని ఈసారి మరీ గట్టిగా బుక్ అయ్యారు. చంద్రబాబును గుడ్డిగా బలపరచబోయి పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ లు అప్రతిష్టపాలయ్యారు.తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అయిన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ సంచలన వ్యాఖ్య చేసి, దానికి ఆధారాలు చూపించలేక, పల్టీలు కొట్టిన చంద్రబాబు దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నారు. హిందువుల దృష్టిలో ఆయన దేవుడి పట్ల తీరని అపచారం చేశారు. అలాంటి వ్యక్తిని సమర్థించిన వీరిద్దరూ కూడా అపచారం చేసినట్లే అవుతుంది. తిరుమల లడ్డూపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి, రాజ్యసభ సభ్యుడు, మాజీ టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు వేసిన పిటిషన్ పై విచారణ చేస్తున్న సందర్భంలో పలు ప్రశ్నలను న్యాయమూర్తులు సంధించారు.ఇదీ చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టులడ్డూ కల్తీ అయిందనడానికి ఆధారాలు ఏమిటి? లడ్డూని ఎందుకు పరీక్షకు పంపించలేదు. ఎన్.డి.డి.బి రిపోర్టు వచ్చిన రెండు నెలల తర్వాత ఎందుకు వెల్లడి చేశారు. అందులో ఎక్కడా నిర్దిష్టంగా జంతు కొవ్వు కలిసిందని లేదే? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడవచ్చా? దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి అంటూ పలు వ్యాఖ్యలను గౌరవ న్యాయమూర్తులు చేశారు. ఈ వ్యాఖ్యలపై బిన్నాభిప్రాయం ఉంటే ఉండవచ్చు. అవి అర్ధవంతంగా ఉండాలి. అంతే తప్ప, కోర్టు ధిక్కార ధోరణిలోనో, న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించే రీతిలో ఉండకూడదు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబే ఇంతవరకు స్పందించలేకపోయారు! దానికి కారణం కేవలం తాను తప్పు చేశానన్న సంగతి తెలుసు కనుక. జంతుకొవ్వు లడ్డూలో కలిసిందని తప్పుడు ఆరోపణ చేసి దొరికిపోయానన్న విషయం తెలుసు కనుక.ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!అంతేకాదు.. సెప్టెంబర్ ఇరవై ఒక్కటో తేదీన తనతో శ్రీవెంకటేశ్వరస్వామే నిజాలు చెప్పిస్తున్నారంటూ ప్రసాదం లడ్డూపై అబద్దాలు ఆడారని తేలిపోయింది. చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో లడ్డూలో జంతునెయ్యి కలిసిందని చెప్పగానే, అలా మాట్లాడడం తప్పు అని పురందేశ్వరి ఆయనను వారించి ఉంటే మంచి పేరు వచ్చేది. ముఖ్యమంత్రి రాజ్యాంగపరంగా అధినేత స్థానంలో ఉన్నారని అంటున్నారు. అయితే రాజ్యాంగానికి అతీతంగా అబద్దాలు చెప్పవచ్చా అన్నదానికి ఆమె సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి పోస్టు రాజ్యాంగ పదవి అయితే, న్యాయమూర్తుల పదవులు రాజ్యాంగ పదవులు కావా? సీఎంకు ఉన్న పరిస్థితులు సమీక్షించుకుని మాట్లాడాలా? వద్దా అనేది ఆయన ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుందని పురందేశ్వరి అంటున్నారు.ఎంత సీఎం అయినా ఇష్టం వచ్చినట్లు స్పీచ్ ఇవ్వవచ్చా?. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీయవచ్చా?. గతంలో కూడా పలు సందర్భాలలో న్యాయస్థానాలు పలువురి ప్రకటనలు రాజ్యాంగ స్పూర్తిగా విరుద్దంగా ఉంటే తప్పు పట్టాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా అమలు అవుతుందా?లేదా అనేది కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలని ఏదో అర్థం లేని మాట చెప్పారు. ఇందులో నిర్ణయం ఏముంది? ఒక అబద్దం చెప్పడానికి సీఎంకు అధికారం ఉంటుందని ఆమె వాదించదలిచారా?. ఈ మధ్యనే ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కొంత అతిగా స్పందించారు. వెంటనే న్యాయమూర్తులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆ మీదట రేవంత్ కోర్టువారిని క్షమాపణ కోరారు.అయినా చంద్రబాబు ఇలాంటివాటన్నిటికి అతీతుడని పురందేశ్వరి అనుకుంటే ఎవరూ ఏమి చేయలేరు. ముఖ్యమంత్రి గారు.. మీరు ఎందుకు మాట్లాడారు అనే అధికారం కోర్టుకు ఉందా అనేది ఆలోచించాలి అని ముక్తాయించారు. విద్యాధికురాలైన ఆమెకు, సుమారు తొమ్మిదేళ్లపాటు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఆమెకు కోర్టుకు ఉన్న అధికారం ఏమిటో తెలియదా?. గతంలో ముఖ్యమంత్రి హోదాలో నేదురుమల్లి జనార్దనరెడ్డి పన్నెండు వైద్య కాలేజీలను మంజూరు చేశారు. అందులో అక్రమాలు జరిగాయని కొందరు కేసు వేశారు. ఆ క్రమంలో ఆయనపై సుప్రీంకోర్టు కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను తొలగించాలని నేదురుమల్లి కోర్టును కోరినా అందుకు అంగీకరించలేదు.చంద్రబాబుతో నిజానికి గతంలో దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి అంత సత్సంబంధాలు ఏవీ లేదు. 2014లో కూడా టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉంది. అప్పట్లో ఒంగోలు లేదా మరో సేఫ్ సీటును ఆమె ఆశించారు. కాని కుట్రపూరితంగా ఆమె గెలవలేని రాజంపేట లోక్ సభ స్థానాన్ని చంద్రబాబు, వెంకయ్యనాయుడులు కలిసి కేటాయించారని అనేవారు. తన భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి, ఆ తర్వాత ఎగవేయడంతో సహా పలుమార్లు చంద్రబాబు తీవ్రంగా అవమానించారనే బాధ పురందేశ్వరికి ఉండేది. ఒక కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు రాగానే ఆమె వేదికపైనుంచి దిగి వెళ్లిపోయారు. పలు చేదు అనుభవాలు ఉన్నప్పటికీ ఎక్కడ రాజీ కుదిరిందో కాని ఆమె పూర్తిగా మద్దతురాలైపోయారు.తన చెల్లి కళ్లల్లో ఆనందం చూడడానికి గాను పురందేశ్వరి తన పరపతిని తగ్గించుకున్నట్లయిందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన న్యాయ వ్యవస్థ నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నారో అందరికి తెలుసు. కొందరు న్యాయమూర్తులు తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసేవారు. ఒక జడ్జి అయితే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నంతగా తనకు సంబంధం లేని అంశాలపై కామెంట్లు చేశారు. అయినా అప్పట్లో పురందేశ్వరికి కోర్టులు అలా మాట్లాడవచ్చా అన్న సందేహం రాలేదు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో పాటు ఈమె కూడా ఆనందం చెందారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే మొత్తం మాట మార్చేశారు. నాలుక మడతేశారు. తను ఎందుకు దీక్ష చేసింది తొలుత చెప్పినదానికి, ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చినదానికి సంబంధం లేదు. ఆపసోపాలు పడుతూ పవన్ కళ్యాణ్ కాలినడకను తిరుమల వెళ్లినా, చంద్రబాబు పాపంలో ఆయనకు కూడా వాటా ఉండక తప్పదని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దేవుడిని రాజకీయాలకు వాడి చేయరాని తప్పు చేశాడు.. సిద్ధాంతం, నీతి లేని అవకాశవాది పవన్
-
లడ్డూ పిటిషన్లపై సుప్రీం విచారణ.. మరికాసేపట్లో కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మరికాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తు కొనసాగడమా? లేదంటే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం నిర్ణయం వెల్లడించనుంది. గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూ ప్రసాదంపై ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేయడం కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. అలాగే.. భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దని గట్టిగానే మందలించింది. అదే టైంలో స్వతంత్ర దర్యాప్తు అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం కోరింది సుప్రీంకోర్టు. ఆయన అభిప్రాయం మేరకు కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. ‘‘రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి. జూలైలో రిపోర్టు వస్తే.. సెప్టెంబర్‌లో మీడియాకు ఎందుకు చెప్పారు?. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి. కోట్లాదిమంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. తిరస్కరించిన నెయ్యి లడ్డూ తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా?. కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా?. సిట్ వేసిన తర్వాత మళ్లీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారు’’ అంటూ గత విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.కాగా, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.ఇదీ చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టుఅలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్ధిస్తూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలకు చెందిన సంపత్, శ్రీధర్, సురేష్ చవంకే వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలపై జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం (సెప్టెంబర్ 30) మధ్యాహ్నం విచారణ జరిపింది.పిటిషనర్ సుబ్రమణియన్ స్వామి తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్‌రావు, సంపత్, శ్రీధర్ తరఫున రాఘవ్ అవస్తీ, సురేష్ చవంకే తరఫున సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు ఇరుపక్షాల వాదనలు సాగగా.. వాటిని కోర్టు రికార్డు చేసింది. -
చంద్రబాబు వ్యాఖ్యలపై నేడు సుప్రీం కోర్టులో విచారణ..
-
పవన్ నవ్వుల పాలు!
సాక్షి ఇంటర్నెట్ డెస్క్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సెప్టెంబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. లడ్డూలో ఉపయోగించిన నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని చెబుతూ.. ‘కొవ్వు’ కామెంట్లు చేశారాయన. దానికి కొనసాగింపుగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత టీటీడీ బోర్డు చైర్మన్లతోపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పనిలో పనిగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు.ఏపీలో లడ్డూ రాజకీయంపై హైడ్రామా కొనసాగుతున్న తరుణంలోనే.. సుప్రీం కోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై స్వతంత్ర దరాప్తు జరిపించాలని కోరారు పిటిషనర్లు. వీటన్నింటిని కామన్‌గా విచారణకు స్వీకరించింది ద్విసభ్య ధర్మాసనం. తొలిరోజు విచారణలో చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: దేవుడికే ఆగ్రహం తెప్పించిన ప్రభుత్వమిది! తిరుపతి లడ్డూ ప్రచారంలో తొలుత జాతీయ మీడియా ఛానెల్స్ సైతం చంద్రబాబు వ్యాఖ్యలనే ప్రముఖంగా ప్రస్తావించాయి. ఆనక.. ఆ వ్యాఖ్యలను నిపుణులతో విశ్లేషించి.. బాబు రాజకీయాల్ని గ్రహించి.. దిద్దుబాటు కథనాలు ఇచ్చాయి. మరోవైపు ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య లడ్డూ వ్యవహారంపై తన బ్రష్‌కు పని చెప్పారు. తొలి నుంచి జరుగుతున్న పరిణామాలను.. చంద్రబాబు, పవన్‌లకు ఎదురవుతున్న అనుభవాలను ఆయన తన కార్టూన్లలో భలేగా చూపించారు. అందులో కొన్నింటిని ఫస్ట్‌పోస్ట్ పబ్లిష్ చేయగా.. మరికొన్నింటిని ఆయన ఓన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేశారు. మొత్తంగా.. ఈ లడ్డూ రాజకీయంలో చంద్రబాబు తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుంటే, నవ్వులపాలైంది పవనే అనే కామెంట్ ఎక్కడ చూసినా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Satish Acharya (@cartoonistsatish) View this post on Instagram A post shared by Satish Acharya (@cartoonistsatish) Images Courtesy: Satish Acharya -
నిబంధనలు తుంగలో తొక్కి తిరుమలలో పవన్!
సాక్షి, తిరుమల: టీటీడీ నిబంధనలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తుంగలో తొక్కేశారు. తన ఇద్దరి కుమార్తెలతో పవన్ మహాద్వారా ప్రవేశం చేశారు. భార్యకు మాత్రమే మహా ద్వార ప్రవేశం ఉంటుంది. అయితే, పిల్లలకు వర్తించదని టీటీడీ అంటోంది. నిబంధనలకు విరుద్దంగా పవన్ కల్యాణ్ క్యారివాన్ తిరుమలలో చక్కర్లు కొట్టింది. తిరుమలలో నిషేధంలో ఉన్న వాహనాలను టీటీడీ అధికారులు అనుమతించారు.మరోవైపు, డిప్యూటీ సీఎం పర్యటనలో టీటీడీ అధికారులు, భద్రతా అధికారులు పవన్ ఆశీస్సుల కోసం అత్యుత్సాహం ప్రదర్శించారు. దాదాపు గంటపాటు క్యూలైన్ నిలిపివేశారు. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ దర్శనం కారణంగా భక్తులకు మరింత ఆలస్యం అవుతుంది. గతంలో అనేక మంది డిప్యూటీ సీఎంలు స్వామివారి దర్శనానికి వచ్చిన ఎన్నడూ ఇంత రాజమర్యాదలు చెయ్యలేదు...కానీ డిప్యూటీ సీఎం హాదాలో తిరుమలకు వచ్చిన పవన్‌కు సీఎం స్థాయిలో ప్రోటోకాల్ కల్పించడం సర్వత్ర విమర్శలు తావిస్తోంది. మరో పక్క స్వామివారిని దర్శించుకున్న భక్తులు, తిరువీధుల్లో ప్రదక్షణలు చేసే భక్తలను భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. తిరువీధుల్లో ఉన్న గ్యాలరీలు తాళాలు వేసి భక్తులను అనుమతించలేదు.. దాదాపు గంటన్నర పాటు ఆలయం వద్ద భక్తులకు రాకపొకలు నిలిపేశారు. దీంతో భక్తులు గెట్లు ఎక్కి దుకారు.. గతంలో ఎన్నడు లేని విధంగా తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రసన్న చేసుకోవడానికి అధికారులు దాసోహం అయ్యారు. -
‘బావ కళ్లలో ఆనందం కోసం కాదు’..పురందేశ్వరిపై ఆర్కే రోజా ఫైర్
సాక్షి,అమరావతి : ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి రోజా ఫైరయ్యారు. బావ కళ్లల్లో ఆనందం చూడడం కంటే.. భక్తుల కళ్లల్లో ఆనందం చూడాలని సెటైర్లు వేశారు. సీఎం చంద్రబాబు ఏదైనా మాట్లాడొచ్చని అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. రోడ్లమీద మాట్లాడే బాబు,లోకేష్, పవన్ సుప్రీం కోర్టులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వ తరుపు లాయర్ ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పలేదని రోజా ప్రశ్నించారు. తిరుపతి లడ్డూపై ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడిన మీరు అత్యున్నత న్యాయం స్థానం అడిగిన ప్రశ్నలు బదులు ఇవ్వచ్చు కదా? అని రోజా అన్నారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై పురందేశ్వరి ఏమన్నారంటే?తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబును తూర్పారబట్టింది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనడానికి మీ దగ్గర ఆధారాలున్నాయా? అని ప్రశ్నిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, సుప్రీం కోర్టు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు. ‘‘సీఎం(చంద్రబాబును ఉద్దేశిస్తూ)రాజ్యంగం పరంగా రాష్ట్రాదినేత. సమీక్షలు చేసి సీఎం కామెంట్స్ చేస్తారు. అంతేకానీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉందా అనేది అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి అని పురందేశ్వరి అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా అమలవుతున్నాయా? లేదా? అని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కోర్టులకు ఉందంటూ’’ పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నమిలిన సిదార్థ్ లూథ్రాగత సోమవారం (సెప్టెంబర్ 30న)సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ వివాదంపై విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది.‘నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా? ఉంటే చూపించండి.ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు? సెకండ్ ఒపీనియన్ ఎందుకు వెళ్లలేదు.కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా..?లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదు? కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు?’’అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ధర్మాసనం వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఏపీ ప్రభుత్వం తరుపు న్యాయవాది సిదార్థ్ లూథ్రా నీళ్లు నమిలారు. గురువారం (అక్టోబర్ 3న) తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. -
చంద్రబాబు ఏదైనా అనొచ్చంట.. పురందేశ్వరికి విజయసాయి కౌంటర్
సాక్షి,అమరావతి : మీ వైఖరి కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే ఎక్కువ అన్నట్లుగా ఉందంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వెఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు రాజకీయాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, లడ్డూ అంశంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యల్ని తప్పుబట్టిన పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపై అయినా మాట్లాడుతారు. లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు. చంద్రబాబు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ధర్మాసనం కామెంట్స్ చేయడం సరికాదు’ అంటూ పురందేశ్వరి వ్యాఖ్యానించారు.ఆ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘‘పురందేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు ఈ విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డు ప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం, కోర్ట్ ధిక్కారం ఆమెపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి...పురందేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చేశారు. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏదైనా అనొచ్చంట. ఏమమ్మా! మరి న్యాయవ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థే కదా! తమరికి తెలియదా? అంత చిన్న విషయానికే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా అని చిరాకు పడిపోయారు పురంధేశ్వరి.ఆమెది బావా’తీతమైన ఆవేదన అనుకోవాలి మరి! కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే గొప్పవాడు అన్నట్లుంది ఈమె వైఖరి. ఈ వందేళ్లలో తిరుమల ఆలయానికి నారా, నందమూరి చేసిన డ్యామేజి మరి ఎవరూ చేయలేదు. ఇంకెన్ని ఘోరాలు చూడాలో గోవిందా...గోవిందా. చంద్రబాబు హిందువుల మనోభావాలను లడ్డుప్రసాదాల విషయంలో దెబ్బయటమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు’ అంటూ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 1) పురంధేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ, కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డుప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం, కోర్ట్ ధిక్కారం. ఆమెపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి. 2)… pic.twitter.com/ZWBfEhRFtW— Vijayasai Reddy V (@VSReddy_MP) October 2, 2024 -
తిరుమల: సొమ్మసిల్లిన పవన్.. పాదయాత్ర రసాభాస
సాక్షి, తిరుపతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల పాదయాత్ర రసాభాసగా సాగింది. నిన్న(మంగళవారం) తిరుపతి అలిపిరి మెట్లమార్గం నుంచి 4.45 నిముషాలకు ప్రారంభించిన పాదయాత్ర దాదాపు 5 గంటలపాటు నడిచి తిరుమలకు చేరుకున్నారు. రాత్రి 9.20 నిముషాలకు తిరుమలకు చేరుకున్నారు. నడకదారిలో పాదయాత్ర ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఆదిలోనే నిరసించిపోయారు. అలసిపోయి నడవడానికి ఇబ్బందులు పడ్డారు. దారిపొడవున కూర్చుంటూ వచ్చారు. నడవలేక అష్టకష్టాలు పడ్డారు.. ఎలాగోలా నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు.పవన్ కల్యాణ్ పాదయాత్ర సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులను మధ్యలోనే అపేసారు.. డిప్యూటీ సీఎం వద్ద మార్కులు కొట్టేయడానికి టీటీడీ అధికారులు, పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మెట్లమార్గం పొడవున రోప్ వేసి తిరుమలకు వచ్చే భక్తులను చుక్కలు చూపించారు. గోవింద నామస్మరణలతో మార్మోగాల్సిన తిరుమల గిరులు వ్యక్తిగత నినాదాలతో తిరుమల పవిత్రతను మంటగలిపారు. ఇదంతా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందే నినాదాలు చేస్తున్నా ఆపకుండా వేడుక చూశారు.. సనాతన ధర్మం అంటూ నినదిస్తున్న పవన్‌కి తిరుమల పవిత్రతను కాపాడాలని తెలియదా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు పోలీసులు మరో అడుగు ముందుకేసి మోకాళ్ళ మెట్లు వద్ద వాహనాలను ఆపివేశారు. దాదాపు గంటన్నర పాటు వాహనాలు నిలిపోవడంతో తిరుమల జీఎన్సీ వరకు వాహనాలు నిలిపోయింది. దీంతో స్వామివారిని దర్శించుకోని తిరుగు ప్రయాణం అవుతున్న భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు.ఇదీ చదవండి: కింకర్తవ్యం!? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబు అంతర్మథనంగంటపాటు ఆలస్యం కావడంతో రిజర్వేషన్ చేసుకున్న భక్తులు సకాలంలో చేరుకోలేక నానా కష్టాలు పడ్డారు. తిరుమలకు చేరుకున్న పవన్ కల్యాణ్ బస్టాండ్ వరకు నడిచి అక్కడి నుంచి వాహనంలో పద్మావతి ప్రాంతంలో ఉన్న గాయత్రి నిలయం చేరుకున్నారు. -
ప్రాయశ్చిత్త పాపం!
-
Laddu Row: సిట్ బ్రేకులపై డీజీపీ రియాక్షన్
తిరుపతి, సాక్షి: తిరుమల లడ్డూ అంశంపై సిట్ దర్యాప్తు నిలిపివేతపై డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. దర్యాప్తును తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారాయన.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఆయన.. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల లడ్డూ అంశంపై.. కేసు తీవ్రత వల్లే సిట్ వేయాల్సి వచ్చింది. అయితే సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. అందుకే దర్యాప్తును ఆపుతున్నాం. తదుపరి సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు విచారణ వుంటుంది’’ అని తెలిపారాయన.తిరుమల లడ్డూ అంశంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై నిన్న విచారణ జరిగింది. ఆ టైంలో.. సిట్ లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయించే అంశంపై అభిప్రాయం తెలియజేయాలని సోలిసిటర్ జనరల్‌ను ద్విసభ్య ధర్మాసనం కోరింది. అక్టోబర్ 3వ తేదీన తదుపరి విచారణ టైంలో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే ఐదోవ రోజు గరుడ వాహన సేవ రోజున అదనంగా భద్రతా ఏర్పాట్లు చేస్తాం. బ్రహోత్సవాల కోసం నాలుగు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తున్నాం. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం... మొబైల్ డివైజ్ ఫింగర్ ప్రింట్ ఏర్పాట్లతో అనుమానితుల్ని గుర్తిస్తాం. 2,700 సీసీ కెమరాలతో పాటు అదనంగా బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాలో తప్పులు వార్తలు ప్రచారం కాకుండా నిఘా ఉంచుతాం. గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు వీక్షించే అవకాశం వుండగా.. అదనంగా 80 వేల మంది భక్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైనులు ద్వారా అనుమతిస్తాం.మొత్తం.. 2.5 లక్షల మంది ప్రయాణించేలా గరుడ సేవ రోజున ఆర్టిసి బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తేనే సౌకర్యవంతంగా వుంటుంది అని అన్నారాయన. అలాగే.. దసరా సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండబోవనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
#TirupatiLaddu : బాబు లడ్డు కహానీ! (ఫొటోలు)
-
రాజకీయాలకు దేవుడ్ని, మతాన్ని వాడుకుంటావా బాబు: విజయసాయి రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి వెన్నుపోటుదాడులు రాజకీయ లబ్ధి కోసం దేవుడిని, మతాన్ని వాడుకుంటారన్ని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఇదే సమయంలో చంద్రబాబు రాజకీయ అజ్ఞాని అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘హిందూ మతాన్ని నమ్మడం, వాడుకోవడం.. ఈ రెండు వేరు వేరు. నిజమైన హిందువు.. దేవుని, హిందూ మతాన్ని నమ్ముకుంటాడు. రాజకీయ అజ్ఞాని, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు, దేవుడినీ, మతాన్ని వాడుకుంటారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. హిందూ మతాన్ని నమ్మడం ,,, వాడుకోవడం ... ఈ రెండు వేరు వేరు.......నిజమైన హిందువు దేవుని, హిందూ మతాన్ని నమ్ముకుంటాడు ,,, రాజకీయ అజ్ఞాని ,,, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు ,,, దేవుడినీ ,,, మతాన్ని వాడుకుంటారు… @ncbn— Vijayasai Reddy V (@VSReddy_MP) October 1, 2024ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు -
పవన్.. మీకిది తగునా?: తిరుపతి ఎంపీ గురుమూర్తి
సాక్షి,తిరుపతి : ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నల వర్షం కురిపించారు. సర్వశక్తిమంతుడిని రాజకీయాల్లోకి లాగినందుకు .. సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబును తప్పుబట్టింది. సున్నితమైన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు.. బహిరంగ సభ నిర్వహించడం న్యాయమని మీరు అనుకుంటున్నారా?భక్తులను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా?’అని గురు మూర్తి ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.


