- 2014 నుంచి జరిగిన నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ జరపాలి
- బాబు హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు.. దానిపై సమాధానం చెప్పాలి
- నేను ఎలాంటి తప్పు చేయలేదు
- మేము, మా కుటుంబం ఎవరివద్ద డబ్బు తీసుకోలేదు
- నేను లై డిటెక్టర్ పరీక్ష కు సిద్ధం
- సత్య శోధన పరీక్షకు సిద్ధంగా ఉన్నా
- నేను ఏ అవినీతికి పాల్పడలేదు
- టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం
న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారాలకు ఇకనైనా ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. తిరుమల ప్రసాదంపై పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకని మాట్లాడితే మంచిదన్నారు. లడ్డూ ప్రసాదంపై జంతువుల కొవ్వు ఆరోపణలపై సిట్ ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఈరోజు(గురువారం, నవంబర్ 27వ తేదీ) న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. తిరుమల లడ్డూ విషయంలో తాము ఎటువంటి తప్పు చేయలేదన్నారు.
ప్రసాదం టెస్టింగ్ విసయంలో పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పుడు ఎలా కల్తీ జరుగుతుందన్నారు. తమ హయాంలో నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించామని, టీటీడీలో 15 ఏళ్లుగా ఏం జరుగుతుందో తెలుసుకుని మాట్లాడాలన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించామన్నారు. ఈవో, చంద్రబాబులు తిరుమల లడ్డూ వివాదంపై పరస్పర విరుద్ధ ఆరోపణలు చేశారని, దానిపై ఇప్పటివరకఊ సిట్ క్లారిటీ ఇవ్వలేదన్నారు.
తిరుమల లడ్డూ అంశంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎవరి మీద బురద జల్లుతున్నారని ప్రశ్నించారు. 2019-2024 వరకూ తయారైనా లడ్డూలన్నీ కల్తీ చేసినట్లు తప్పుడు ప్రచారాలకు దిగారన్నారు. రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి.. కోట్లాడి మంది భక్తుల మనోభవాలను దెబ్బతీస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో భక్తుల కానుకలను ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేసిన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు.
గత పది ఏళ్ల నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ చేయాలి
టీటీడీలో గత పది ఏళ్ల నెయ్యి కొనుగోళ్లపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు వైవీ సుబ్బారెడ్డి. ‘ 2014 నుంచి జరిగిన నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ జరపాలి. 2024 ఆగస్టులో బాబు హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు..దానిపై సమాధానం చెప్పాలి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. మేము, మా కుటుంబం ఎవరివద్ద డబ్బు తీసుకోలేదు. నేను లై డిటెక్టర్ పరీక్ష కు సిద్ధం. సత్య శోధన పరీక్షకు సిద్ధంగా ఉన్నా. నేను ఏ అవినీతికి పాల్పడలేదు. అలాగే, ఎస్ బ్యాంక్ లో టీటీడీ డబ్బు డిపాజిట్లు, శ్రీనివాస సేతు వ్యవహారంపై దర్యాప్తు చేయాలి. అప్పన్న నా పిఎ కాదు. ఆయనకు నాకు సంబంధం లేదు. అప్పన్న ఎంపీ వేమిరెడ్డి దగ్గర పని చేశారు’ అని తెలిపారు.



