ముఖం మీద ఒక్క చిన్నమచ్చ కూడా ఉండకూడదు. ముడతలు అస్సలు రాకూడదు. ఫిల్టర్ ఫోటో కాపీ అంత అందంగా ఫేస్ వెలిగిపోవాలి. ఇదే నేటి మిలీనియల్స్ , జెన్ Z ఆరాటం. సౌందర్యానికి కొత్త అర్థం చెబుతూ తమన అందానికి మెరుగులు దిద్దుకునేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. హైపర్-విజిబిలిటీ ,సోషల్ మీడియా ఫిల్టర్ల యుగంలో, అందానికి అర్థం, పరమార్థం మారిపోతోంది. కొత్త పుంతలు తొక్కుతోంది. అందాన్ని రక్షించుకునేందుకుగా మిలీనియల్స్ , జెన్ Z లు బొటాక్స్, ఫిల్లర్లు, కెమికల్ పీల్స్ , లేజర్ టోనింగ్ మైక్రోనీడ్లింగ్ లాంటి ట్రీట్‌మెంట్స్ వైపు పరుగులు పెడుతున్నారు.
వృద్ధాప్యం సంకేతాలను ఆలస్యం చేయడానికి సూక్ష్మమైన, సైన్స్-ఆధారిత చికిత్సలను ఉపయోగించే చర్మ సంరక్షణకు ఒక చురుకైన విధానంగా ఉంటోంది. ముడతలొచ్చేదాకా ఆగకుండా, అవి రాకుండా ఏం చేయాలి అనేది తపన. కొల్లాజెన్‌ను రక్షించడం, ఆకృతిని మెరుగుపర్చుకోవడం, గ్లోను పెంచుకోవడమే లక్ష్యం.
ప్రీవెంటివ్ ఈస్తటిక్స్ అంటే వృద్ధాప్య చాయలను ఆలస్యం చేయడానికి సూక్ష్మమైన, ముందస్తు జోక్యాలను ఉపయోగించడం. గతంలో 40-50వ పడిలో ఉన్నవారు ఇలాంటి చికిత్సలను కోరుకున్నారు. కానీ ఇపుడు 20- 30లలో ఉన్నవారే స్కిన్ హెల్త్‌కోసం, ముడతలు లేదా పిగ్మెంటేషన్‌ను నివారించడానికి బోటాక్స్, ఫిల్లర్లు, కెమికల్ పీల్స్ లేదా లేజర్ టోనింగ్ వంటి ఎంపికలను ఎంచుకుంటున్నారని గోవాలోని మణిపాల్ హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ - ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అమీ పెడ్నేకర్ వివరించారు.
చదవండి: ఢిల్లీలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ : ఎంతవరకు సేఫ్, ఎలా బుక్ చేసుకోవాలి?
అయితే ఇలాంటి ట్రీట్‌మెంట్స్ బాధ్యతాయుతంగా ,వైద్య పర్యవేక్షణలో చేసినప్పుడు, చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. “మెడికల్-గ్రేడ్ స్కిన్‌కేర్, సన్‌స్క్రీన్ , మినిమల్లీ ఇన్వాసివ్ విధానాలు సురక్షితమైన, ప్రభావవంతమైన నివారణ సంరక్షణకు పునాదిని ఏర్పరుస్తాయి. అవి సాధ్యమైనంత ఎక్కువ కాలం దాని అసలు రూపంలో సహజ సౌందర్యాన్ని నిర్వహించడానికి సహాయపడతాయంటారు.
చదవండి: నా భర్తొక నార్సిసిస్ట్, తీవ్ర హింస: మాజీ మిస్ ఇండియా
సమస్య ఎక్కడ వస్తుంది అంటే?
కానీ డిమాండ్ పెరిగేకొద్దీ, నిపుణులు అభివృద్ధి చెందుతున్న ప్రతికూలతలపై డాక్టర్ అమీ హెచ్చరిస్తున్నారు . అర్హత లేని ప్రొవైడర్లచే ఇంజెక్షన్లు ,పవర్ ఆధారిత చికిత్సలను అధికంగా ఉపయోగించడం హానికరమంటున్నారు.“అధిక ఫిల్లర్లు లేదా అశాస్త్రీయ పరికరాల కలయికలు అసహజ ఫలితాలకు లేదా శాశ్వత సమస్యలకు దారితీయవచ్చు. అందుకే శరీర నిర్మాణ శాస్త్రం శరీరధర్మ శాస్త్రంపై లోతైన అవగాహన చాలా అవసరం అంటారాయన.
బెంగళూరులోని ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్‌లోని ప్లాస్టిక్, పునర్నిర్మాణ మరియు సౌందర్య శస్త్రచికిత్స విభాగం HOD డాక్టర్ అశోక్ బి.సి. కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "నివారణ సౌందర్యశాస్త్రం, సరిగ్గా చేసినప్పుడు, దుష్ప్రభావాలను తగ్గించవచ్చు . ఇన్వాసివ్ విధానాల అవసరాన్ని ఆలస్యం చేస్తుంది. కానీ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో జరిగాలి. లేదంటే ఏదైనా పొరబాటుజరిగితే ఇన్ఫెక్షన్, అలెర్జీ ప్రతిచర్యలు లేదా మచ్చలు వంటి సమస్యలొస్తాయని చెప్పారు.
ఇదీ చదవండి: లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!
గమనించాల్సిన అంశాలు
నివారణ సౌందర్యశాస్త్రం అనేది ఒకే పరిమాణానికి సరిపోయేది కాదని ఇద్దరు నిపుణులు నొక్కి చెప్పారు. ఏదైనా సౌందర్య చికిత్సను ప్రారంభించే ముందు స్వీయ-అవగాహన మానసిక పరీక్షల అవసరాన్ని డాక్టర్ అశోక్ నొక్కి చెప్పారు.
కొంతమంది వ్యక్తులు శారీరక సమస్యల కంటే భావోద్వేగ లేదా విశ్వాస సమస్యలను పరిష్కరించడానికి సౌందర్య విధానాలను కోరుకుంటారు. నిపుణులు తప్పనిసరిగా గుర్తించాల్సిన అంశాలివి అంటారు.
గర్భిణీలు, తల్లిపాలు ఇస్తున్నవారు లేదా చురుకైన చర్మ వ్యాధులు లేదా కెలాయిడ్-ప్రోన్ స్కిన్ ఉన్నవారు వారు కొన్ని సౌందర్య ప్రక్రియలకు దూరంగా ఉండాలి.
అర్హత కలిగిన, అనుభవజ్ఞుడైన సౌందర్య వైద్యుడు ఎల్లప్పుడూ వివరణాత్మక వైద్య చరిత్రను తీసుకొని రోగులకు తదనుగుణంగా మార్గనిర్దేశం చేస్తాడు.
అంతిమంగా, నివారణ సౌందర్యశాస్త్రం ధోరణులను గురించి ఆందోళన కంటే దీన్ని ఎలా వాడుతున్నామనేదే ముఖ్యం. భయంగా కాకుండా ఆనందంగా వృద్ధాప్యాన్ని ఆహ్వానించాలి. ఆధునికఘు ఆపాదించుకోవడంతపాటు, మొత్తం ఆరోగ్యంపై శ్రద్ద నిబద్ధత ముఖ్యం. నిజమైన, శాశ్వతమైన అందం ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆలోచనలు, నిబద్ధతత, విశ్వాసంతోనే వస్తుంది.


