ఢిల్లీలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌ : ఎంతవరకు సేఫ్‌, ఎలా బుక్‌ చేసుకోవాలి? | Delhi First Hot Air Balloon Ride from Nov 29th check full details | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌ : ఎంతవరకు సేఫ్‌, ఎలా బుక్‌ చేసుకోవాలి?

Nov 26 2025 4:24 PM | Updated on Nov 26 2025 4:29 PM

Delhi First Hot Air Balloon Ride from Nov 29th check full details

Delhi’s First Hot-Air Balloon Ride  న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం  ఢిల్లీలో మొట్ట మొదటి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌లు ప్రారంభం కానున్నాయి. దీనికి ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA ) మంగళవారం బాన్సేరాలో ట్రయల్ రన్‌ను కూడా ప్రారంభించింది. ఢిల్లీలో వినోద, సాహస కార్యక్రమాలను విస్తరించే చర్యల్లో భాగంగా  అసిత రివర్ ఫ్రంట్, యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ,కామన్వెల్త్ గేమ్స్ (CWG) విలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో అదనపు లాంచ్ సైట్‌లను ప్లాన్ చేశారు.విజయవంతమైన ట్రయల్ రన్‌ల తర్వాత  నవంబర్ 29 నుండి హాట్‌ ఎయిర్‌ బెలూన్ రైడ్‌లను ఢిల్లీ వాసులు ఎంజాయ్‌ చేయవచ్చు.

యమునా  నది ఒడ్డున  ఆహ్లాదంగా 
యమునా నది ఒడ్డున ఉన్న ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) బాన్సేరా పార్క్‌లో సర్టిఫైడ్ నిపుణుల పర్యవేక్షణ, కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌లతో శనివారం నుండి  ఈ రైడ్స​ అందుబాటులోకి రానున్నాయి.  మెరుగైన ఎంటర్‌టైన్‌మెంట్‌,ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో తొట్టతొలిగా వీటిని ప్రారంభింస్తున్నామని,  ఢిల్లీని మరింత శక్తివంతమైన నగరంగా మార్చే దిశగా  ఇదొక అడుగు అధికారులు చెబుతున్నారు. ఈ బెలూన్ రైడ్‌లతో, ఢిల్లీ పర్యాటక  రంగం మరింత ఆకర్షణీయంగా మారుతుందని అంచనా.  ఈ నేపథ్యంలో  అసలు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌ ఏంటి? ఎలా ఉంటాయి? ఎంతవరకు  సురక్షితం లాంటి విషయాలను చూద్దాం.

అసలేంటీ హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ రైడ్‌ 
హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ నిర్వహణను చాలా సురక్షితంగా, పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. వేడి గాలిని బెలూన్ రైడ్‌లో ఉపయోగిస్తారు. హాట్ ఎయిర్ బెలూన్లలో 3 కీలక భాగాలు, ఒక బెలూన్ (ఎన్వలప్), ఒక బుట్ట , బర్నర్లతో కూడిన సాధారణ వాహనాలు. ఇవన్నీ చాలా బలమైన మెటల్ కేబుల్స్‌​ ద్వారా  కలుపుతారు. తద్వారా ఎక్కడా లూజ్‌గా లేకుండా దృఢంగా ఉండేలా చేసుకుంటారు.

ఎలా ఎగురుతుంది?
బెలూన్ కింద ఇంధనాన్ని మండించి, వేడి గాలితో నింపడం ద్వారా ఇవి పనిచేస్తాయి. ఆ వేడి గాలి లిఫ్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది.వేడి గాలి ద్వారా లిఫ్ట్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా హాట్ ఎయిర్ బెలూన్‌లు ఎగురుతాయి. వీటికి వాడే ప్రాథమిక ఇంధనం ప్రొపేన్.ఇది ఒక రకమైన ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG).ప్రెషరైజ్డ్ ట్యాంకులలో నిల్వ  చేసి మండిస్తారు. లోపల గాలి బయటి గాలి కంటే వేడిగా, తక్కువసాంద్రతతో ఉన్నప్పుడు, బెలూన్ పైకి లేచి పైకి లేస్తుంది. ఎత్తును నిర్వహించడానికి, పైలట్ క్రమానుగతంగా బర్నర్‌ను మండిస్తాడు.

 క్యూబిక్ అడుగుకు దాదాపు 7 గ్రాముల లిఫ్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది. తగినంత సూపర్ హీట్ గాలితో, సాధారణంగా 77,000 నుండి 600,000 క్యూబిక్ అడుగుల వరకు, బెలూన్ . దాని ప్రయాణీకులు టేకాఫ్ తీసుకోవచ్చు.బెలూన్లను వేర్వేరు ఎత్తులలో కనిపించే వివిధ వాయు ప్రవాహాలపై ఆధార పడి పైలట్లు నావిగేట్ చేస్తారు. పైలట్ బెలూన్‌లో నిరంతరం మారుతున్న ఉష్ణోగ్రతను ఉపయోగించి ఎత్తును సర్దుబాటుచేసుకుంటూ దానిని నియంత్రిస్తారు. అలాగే"ఎన్వలప్ ఆఫ్ సేఫ్టీ" మార్గదర్శకాల ప్రకారం, పైలట్లను మాదకద్రవ్యాలు, మద్యం  సేవించారా అనేది  చెక్‌ చేస్తారు.

 

ప్రొఫెషనల్ ఆపరేటర్లు భద్రతా ప్రమాణాలు 
బెలూనింగ్ ,విమానయాన-సంబంధిత వినోద సేవలలో ముందస్తు అనుభవం ఉన్న సర్టిఫైడ్ ఆపరేటర్‌ను DDA నియమించింది. ఈ బృందం   అనేక టెస్టింగ్‌ కార్యక్రామలను కూడా నిర్వహించింది.  ప్రతీ  రైడ్‌కు ముందు  భద్రతా తనిఖీలుంటాయి. హాట్ ఎయిర్ బెలూన్‌లు టెథర్  చేస్తారు. అంటే అవి ఎక్కేటప్పుడు నేలకు లంగరు వేయడం తోపాటు, చుట్టు పక్కల అందమైన నగర దృశ్యాలు అన్ని వైపుల నుంచి  కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి అన్ని నియమాలు, కార్యాచరణ అంతా  భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఎంత ఛార్జ్‌ చేస్తారు
ప్రతి బెలూన్ రైడ్ ధర 15-20 నిమిషాల  వ్యవధిలో  ఒక్కొక్కరికి రూ. 3,000 (పన్నులు మినహాయించి). వాతావరణ పరిస్థితులను బట్టి ఆపరేటర్ ప్రతిరోజూ రెండు స్లాట్‌లను నడుపుతారు,ఉదయం ఒకటి ,సాయంత్రం ఒకటి. ప్రతి ట్రిప్‌కు సామర్థ్యం బాస్కెట్‌కు దాదాపు నలుగురు వ్యక్తులకు పరిమితం.

ఎలా బుక్ చేసుకోవాలి:
ఢిల్లీలోని హాట్-ఎయిర్ బెలూన్ రైడ్‌ల కోసం బుకింగ్‌లను ప్రతి సైట్‌లో DDA నియమించిన ప్రైవేట్ ఆపరేటర్ నిర్వహిస్తారు. బాన్సేరా పార్క్‌లో  పనివేళలలో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. థ్రిల్లోఫిలియా వంటి సైట్‌ల ద్వారా కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

ప్రమాదాల మాట ఏంటి? 
హాట్‌  ఎయిర్‌బెలూన్‌లో కూర్చొని  మేఘాల్లో, ఆకాశ తీరంలో విహరిస్తూ.. సుందర దృశ్యాలను వీక్షించడం అదొక  అద్భుతమైన జీవితకాల అనుభూతి. అయితే కొండకచో కొన్ని ప్రమాదాలు సంభవించిన దాఖలాలు కూడా లేకపోలేదు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అందించిన 2022 డేటా ప్రకారం, 1964లో అమెరికాలో మొత్తం 775 హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదాలు నమోదయ్యాయి. వాటిలో 70 మాత్రమే మరణాలు సంభవించాయి. 2000-2011 మధ్య కొన్ని ప్రమాదాలుచోటు చేసుకున్నాయి. కమర్షియల్‌ హాట్‌  ఎయిర్ బెలూన్ ఎగరడం చుట్టూ ఉన్న నిబంధనలు సడలించిన మూలంగానే  ఇవి జరిగినట్టు  2013 అధ్యయనంలో   తేలింది. 2016లో టెక్సాస్‌లోని లాక్‌హార్ట్‌లో జరిగిన ప్రమాదంలో వేడి గాలి బెలూన్ విద్యుత్ లైన్‌లను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుని 16 మంది మరణించారు. ఈ సంఘటన తరువాత "ఎన్వలప్ ఆఫ్ సేఫ్టీ"  లాంటి కొన్ని సేఫ్టీ నిబంధనలను మరింత కఠినతరం చేశారు.

మేఘాల మధ్య విహరించడం అనే ఆనందాన్నిఅనుభవించిన వాళ్లకి మాత్రమే అర్థమయ్యే థ్రిల్‌. ఇటీవలి సంవత్సరాలలో హాట్ ఎయిర్ బెలూన్ విహారయాత్రలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.  ఇలాంటి సాహసాలు  కొంత రిస్క్‌తో కూడుకున్నవే.  హాట్ ఎయిర్ బెలూన్ అనుభవాన్ని ప్లాన్ చేసేటప్పుడు  రైడర్లు కూడా సేఫ్టీ మెజర్స్‌ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో  చెక్‌ చేసుకోవాలి.  చిన్న పిల్లలను లేదా గర్భిణీ స్త్రీలను  ఇలాంటి ప్రయాణాలకు దూరంగా ఉండటం ఉత్తమం.  భయాలు, బెంగ లేకుండా హాట్‌ఎయిర్‌ బెలూన్‌ రైడ్‌ను ఆస్వాదించడమే. హ్యాడీ  రైడ్‌  అండ్‌ థ్రిల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement