తొలిసారి ఒకే వేదికపై 'తనూజ, కల్యాణ్‌'.. వీడియో వైరల్‌ | Thanuja And Kalyan Padala Again Meet After Biggboss9 | Sakshi
Sakshi News home page

తొలిసారి ఒకే వేదికపై 'తనూజ, కల్యాణ్‌'.. వీడియో వైరల్‌

Jan 8 2026 5:50 PM | Updated on Jan 8 2026 6:15 PM

Thanuja And Kalyan Padala Again Meet After Biggboss9

బిగ్‌బాస్‌ తెలుగు 9 విన్నర్‌ కల్యాణ్‌ పడాల, రన్నర్‌ తనూజ మరోసారి ఒక వేదికపై కలిశారు. ఈ సీజన్‌లో వీరిద్దరి ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.. హౌస్‌లో వారిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ ఇరువురి అభిమానులు మాత్రం బూతులతో రెచ్చిపోయారు. అయితే, ఈ సీజన్‌ ముగిసిన తర్వాత తనూజ ఎలాంటి ఈవెంట్‌లో కనిపించలేదు. తొలిసారిగా స్టార్‌మా కోసం 'మా సంక్రాంతి వేడుక' కార్యక్రమంలో పాల్గొంది. వీరద్దరూ కలిసి 'ఛాంపియన్‌' సినిమాలోని 'గిర గిర గింగిరాగిరే'  అనే పాటకు స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమం జనవరి 14న మధ్యాహ్నం 12కు ప్రసారం కానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రోమోను వదిలారు. దీంతో నెట్టింట వారిద్దరూ వైరల్‌ అవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement