'ఉస్తాద్ భగత్ సింగ్' రెండో పాట రిలీజ్ | Ustaad Bhagat Singh Movie Song Latest | Sakshi
Sakshi News home page

Ustaad Bhagat Singh Song: పవన్ ఫ్యాన్స్‌కి మాత్రమే నచ్చేలా కంపోజ్ చేసిన సాంగ్

Feb 22 2026 8:25 PM | Updated on Feb 23 2026 9:00 AM

Ustaad Bhagat Singh Movie Song Latest

పవన్ కల్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. మార్చి 26న థియేటర్లలోకి రానుంది. అందుకు తగ్గట్లే ప్రమోషన్లు మొదలుపెట్టారు. గతంలో 'దేఖ్ లేంగే సాలా' పేరుతో ఓ పాట రిలీజ్ చేయగా.. ఇప్పుడు 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పేరుతో మరో సాంగ్ విడుదల చేశారు.

'మెడపై ముట్టుకుంటే తొడ గొట్టినట్లే..' అంటూ సాగే ఈ పాటలో ఈ ఒక్క లైన్ తప్పితే మిగతా లిరిక్స్ ఏమంత ఆకట్టుకునేలా అయితే లేవు. దానికి తోడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి మాత్రమే నచ్చేలా ఈ సాంగ్ కంపోజ్ చేసినట్లు అనిపిస్తుంది. ట్యూన్ కూడా రెగ్యులర్‌గానే అనిపించింది. పాటలో చాలావరకు పవన్ మేనరిజమ్‌నే చూపించారు. సినిమాలో ఓ డైలాగ్‌తో ఈ పాట పుట్టిందని దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యాట్యూబ్‌లో ఓకే ఓకే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?

ఇకపోతే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా.. దళపతి విజయ్ చేసిన 'తెరి' రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. టీమ్ ఈ విషయాన్ని ఖండించింది గానీ చాలామంది నెటిజన్లకు ఇంకా ఈ సందేహం అలానే ఉండిపోయింది. దానికి తోడు ఈ మూవీపై ఇప్పటివరకు అయితే పెద్దగా బజ్ కూడా లేదు. అలానే ధురంధర్ 2, టాక్సిక్ చిత్రాలు రిలీజైన తర్వాత వారమే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి వాటి నుంచి పోటీ తట్టుకుని ఎలా నిలబడుతుందనేది కూడా చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement