‘జై బోలో తెలంగాణ’ హీరోయిన్‌ ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా? | Interesting Facts About Jai bolo Telangana Fame Meera Nandan | Sakshi
Sakshi News home page

‘జై బోలో తెలంగాణ’ హీరోయిన్‌ ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?

Feb 22 2026 3:42 PM | Updated on Feb 22 2026 3:59 PM

Interesting Facts About Jai bolo Telangana Fame Meera Nandan

మీరా నందన్‌.. ఈ పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ, 'జై బోలో తెలంగాణ' హీరోయిన్‌ అంటే మాత్రం అందరూ గుర్తు పట్టేస్తారు. 2011లో విడుదలైన ఆ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అందులో తెలంగాణ యువకుడిని ప్రేమించే ఆంధ్రా అమ్మాయిగా మీనా నందన్‌ నటించి, మెప్పించింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

ఆ సినిమా రిలీజ్‌ తర్వాత మీరా నందన్‌కి వరుస అవకాశాలు వచ్చాయి. మీరా నందన్ మాత్రం చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేసింది.కొన్నాళ్ల తర్వాత మలాయళంలో కొన్ని టీవీ షోస్‌ కూడా చేసింది. సినిమాల్లోకి వచ్చే ముందు మోడల్‌గానూ చేసింది.

2008లో ‘ముల్లా’ అనే మూవీతో హీరోయన్‌గా మారింది. ‘వాల్మీకి’ అనే సినిమాతో తమిళ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత తమిళ్‌‌లో వరుస అవకాశాలు వచ్చాయి. 'జై బోలో తెలంగాణ' తర్వాత తెలుగులోనూ వరుస చాన్స్‌లు వచ్చాయి. కానీ మీరానందన్‌ ఆసక్తి చూపించలేదు. అంతేకాదు కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే 2014లో  2024లో తన బాయ్‌ఫ్రెండ్, అకౌంటెంట్ శ్రీజుని వివాహం చేసుకుంది.

పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చి, తన మకాంను దుబాయ్‌కి మార్చింది.  ప్రస్తుతం ఆమె అక్కడ ఒక ప్రముఖ మలయాళ రేడియో స్టేషన్‌లో రేడియో జాకీ  పనిచేస్తున్నారు. రేడియో రంగంపై ఉన్న ఆసక్తితోనే ఆమె సినిమాలను పక్కన పెట్టి ఈ వృత్తిని ఎంచుకున్నట్లు సమాచారం.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ట్రావెల్ ఫోటోలను, వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సినిమాల్లో నటించకపోయినా, తనదైన శైలిలో అభిమానులకు చేరువగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement