ఈ అవార్డ్ వారికే అంకితమిస్తున్నా: అల్లు అర్జున్ | Tollywood Hero Allu Arjun Responds On His Filmfare Award | Sakshi
Sakshi News home page

Allu Arjun: ఈ అవార్డ్ వారికే అంకితమిస్తున్నా: అల్లు అర్జున్

Feb 22 2026 1:04 PM | Updated on Feb 22 2026 1:17 PM

Tollywood Hero Allu Arjun Responds On His Filmfare Award

పుష్ప-2 మూవీకి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ రావడంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఇంత అద్భుతమైన గౌరవం ఇచ్చినందుకు ఫిల్మ్‌ఫేర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నన్ను ఇంతలా ప్రేమించే దేశంలో అవార్డ్ స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు తానెప్పుడు విధేయుడినని ట్వీట్ చేశారు. ఈ అవార్డ్‌ను హద్దుల్లేని  నా అభిమానుల  ప్రేమకు అంకితం చేస్తున్నట్లు బన్నీ ప్రకటించారు.

కాగా..కేరళలోని కొచ్చిన్‌లో జరిగిన 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో ఐకాన్‌స్టార్‌ ఉత్తమ నటుడిగా అవార్డ్‌ అందుకున్నారు. 2024లో విడుదలైన పుష్ప-2 చిత్రానికి ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, బెస్ట్ మ్యూజిల్ ఆల్బమ్‌కు దేవీశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో రామకృష్ణ అండ్ మోనిక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా 2024లో ఉత్తమ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో అత్యధికంగా ఐదు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు కొల్లగొట్టింది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement