Filmfare Awards 2024
-
ఈ అవార్డ్ వారికే అంకితమిస్తున్నా: అల్లు అర్జున్
పుష్ప-2 మూవీకి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ రావడంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఇంత అద్భుతమైన గౌరవం ఇచ్చినందుకు ఫిల్మ్‌ఫేర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నన్ను ఇంతలా ప్రేమించే దేశంలో అవార్డ్ స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు తానెప్పుడు విధేయుడినని ట్వీట్ చేశారు. ఈ అవార్డ్‌ను హద్దుల్లేని నా అభిమానుల ప్రేమకు అంకితం చేస్తున్నట్లు బన్నీ ప్రకటించారు.కాగా..కేరళలోని కొచ్చిన్‌లో జరిగిన 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో ఐకాన్‌స్టార్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. 2024లో విడుదలైన పుష్ప-2 చిత్రానికి ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, బెస్ట్ మ్యూజిల్ ఆల్బమ్‌కు దేవీశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో రామకృష్ణ అండ్ మోనిక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా 2024లో ఉత్తమ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో అత్యధికంగా ఐదు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు కొల్లగొట్టింది. Thank you, Filmfare, for this wonderful honour. It’s my absolute pleasure to receive it in a land where I am loved in such a unique way. I’m humbled by everyone’s blessings, and I dedicate this award to all my fans for their infinite love. 🖤 pic.twitter.com/EYPdC9BJl9— Allu Arjun (@alluarjun) February 22, 2026 -
Filmfare Awards 2024: ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ పోటీలో ‘సత్య’
సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన షార్ట్ ఫిలిం ‘సత్య’ ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పోటీ పడుతోంది. పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో "సత్య" షార్ట్ ఫిలిం పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా సాయిదుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తమ మనసుకు దగ్గరైన షార్ట్ ఫిలిం ఇదని, "సత్య" షార్ట్ ఫిలిం చూసి ఓటు వేయాలని ప్రేక్షకుల్ని కోరారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ తో కలిసి తమ విజయదుర్గ ప్రొడక్షన్స్ సంస్థలో చేసిన తొలి ప్రయత్నంగా "సత్య" ఎన్నో మెమొరీస్ ఇచ్చిందని సాయిదుర్గ తేజ్ పేర్కొన్నారు. "సత్య" షార్ట్ ఫిలింలో స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించింది. హర్షిత్, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. విజయకృష్ణ వీకే దర్శకత్వం వహించారు. మ్యూజికల్ షార్ట్ ఫిలింగా "సత్య" ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది. ఫిలింఫేర్ వెబ్ సైట్ ద్వారా ప్రేక్షకులు తమ ఓటును వినియోగించుకోవచ్చు.For the first time ever, the world can watch Satya and bless us with your valuable vote 🇮🇳❤This story, so dear to our hearts, is competing for the People’s Choice Award at the Filmfare Short Film Awards 2024. We need your support to win—click the link, watch the film, and… pic.twitter.com/vrG0Ddsivn— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 24, 2024


