పవిత్ర ఉన్నప్పుడు నాన్న సైలెంట్‌: నరేశ్‌ కుమారుడు | Naveen Vijay Krishna About VK Naresh, Pavitra Lokesh | Sakshi
Sakshi News home page

నరేశ్‌-పవిత్ర బంధంపై నవీన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాన్నలా నేనుండలేను!

Feb 22 2026 11:30 AM | Updated on Feb 22 2026 2:37 PM

Naveen Vijay Krishna About VK Naresh, Pavitra Lokesh

సీనియర్‌ నటుడు నరేశ్‌, నటి పవిత్ర లోకేశ్‌ చాలాకాలంగా కలిసే ఉంటున్నారు. వీరిద్దరి గురించి నరేశ్‌ కుమారుడు, నటుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవీన్‌ మాట్లాడుతూ.. నటుల జీవితం చాలా కష్టతరం. వాళ్లందరూ ఏ కష్టం, బాధ వచ్చినా బాత్రూమ్‌లోనే ఏడుస్తారు. అలా కన్నీళ్లు పెట్టుకోని యాక్టర్స్‌ ఉండరు.

స్టార్‌ హోటల్స్‌లో భోజనం
నా విషయానికి వస్తే.. నేను బైక్స్‌, ఫుడ్‌ కోసం లక్షలు ఖర్చుపెట్టాను. కానీ రానురానూ ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో పెట్టే భోజనం కంటే ఇంటిభోజనమే మేలని రియలైజ్‌ అయ్యాను అన్నాడు. పవిత్ర లోకేశ్‌ గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా మంచి మనిషి. తనను తరచూ కలుస్తుంటాను. ఆవిడ అందరినీ ప్రేమగా పలకరిస్తుంటుంది. అందరితోనూ ఇట్టే కలిసిపోతుంది. నాన్నకు సరైన జోడీ అని నా అభిప్రాయం. ఆమె ఉన్నప్పుడు ఆయన కూడా సైలెంట్‌గా ఉంటాడు.

నాన్న హ్యాపీ
50 + ఏజ్‌లో నాన్న ఇంత ప్రశాంతంగా ఉండటానికి ఆవిడే కారణం. ఇది చాలా మంచి విషయం. ప్రేమకు ఎటువంటి హద్దులు లేవనడానికి ఇది నిదర్శనం. పవిత్ర- నాన్నల బంధాన్ని నిర్మల నానమ్మ, కృష్ణ తాతయ్య కూడా ఆమోదించారు. నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా సరే నానమ్మ- తాతయ్య సపోర్ట్‌ చేసేవారు. పవిత్ర వచ్చాక నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు.

నావల్ల కాదు
ఇకపోతే నాన్న మల్టీ టాలెంటెడ్‌. ఎమోషన్స్‌ బ్యాలెన్స్‌ చేసుకుంటూ పనులు పూర్తి చేస్తాడు. కానీ, నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌ని. నాన్నలా నేనుండలేను అని చెప్పుకొచ్చాడు. కాగా నరేశ్‌, అతడి మొదటి భార్య నేత్రల సంతానమే నవీన్‌. ఇతడు నందిని నర్సింగ్‌ హోమ్‌, ఊరంతా అనుకుంటున్నారు వంటి పలు సినిమాల్లో నటించాడు. దర్శకుడిగా సత్య అనే షార్ట్‌ ఫిలిం తీశాడు. అయితే నవీన్‌ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నాడు.

చదవండి: OTT: పాతిరాత్రి మూవీ రివ్యూ

Advertisement
 
Advertisement
Advertisement