ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌..తెలుగులో అత్యధికంగా ఈ సినిమాకే..! | telugu Movies Full List of Winners of The 70th Filmfare Awards | Sakshi
Sakshi News home page

70th Filmfare Awards: ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌.. అత్యధికంగా ఈ సినిమాకే..!

Feb 22 2026 9:05 AM | Updated on Feb 22 2026 10:35 AM

telugu Movies Full List of Winners of The 70th Filmfare Awards

సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక కేరళలో అట్టహాసంగా ప్రారంభమైంది.  70వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం శనివారం కొచ్చిలో జరిగింది. ఈ వేడుకల్లో 2024 ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌(పుష్ప-2) అవార్డ్ అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ విభాగంలో తేజ సజ్జా(హనుమాన్) అవార్డ్ స్వీకరించారు. అదే ఏడాదికిగానూ ఉత్తమనటిగా నివేదా థామస్(35-చిన్న కథ కాదు) అవార్డ్ అందుకుంది. 2024లో ఉత్తమ చిత్రంగా పుష్ప-2 నిలవగా.. సుకుమార్‌కు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. ఈ వేడుకను కేరళ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ విత్ కేరళ టూరిజం పేరుతో కొచ్చిలోని అడ్లక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుక జరిగింది. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన సినీ తారలకు అవార్డులు అందించారు.
 

70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ విజేతల పూర్తి జాబితా(తెలుగు)

  • ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్
  • ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)
  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్ (వెంకీ అట్లూరి)
  • బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్: అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)
  • బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): తేజా సజ్జా (హను-మాన్)
  • ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్):  కాజల్ అగర్వాల్ (సత్యభామ)
  • ఉత్తమ సహాయనటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
  • ఉత్తమ సహాయనటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
  • బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2)
  • ఉత్తమ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: శ్రీ కృష్ణ (కుర్చి మడతపెట్టి - గుంటూరు కారం)
  • ఉత్తమ నేపథ్య గాయని: శిల్పా రావు (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)
  • బెస్ట్ డెబ్యూ డైరెక్టర్:  యదు వంశీ (కమిటీ కుర్రోల్లు)
  • బెస్ట్‌ డెబ్యూ యాక్టర్: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోల్లు)
  • బెస్ట్ డెబ్యూ నటి: నయన్ సారిక (గం గం గణేశ)
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్:  నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)
  • రామకృష్ణ అండ్ మోనిక (పుష్ప 2)
  • ఉత్తమ కొరియోగ్రఫీ
  • శేఖర్ మాస్టర్ (కుర్చి మడతపెట్టి - గుంటూరు కారం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement