'కుడి కన్ను ఫోకస్ చేయమని చెప్పింది.. ఆ సీన్‌ చేశాక షాకయ్యా' | Director Gopichand Malineni praises Varalaxmi Sarath Kumar | Sakshi
Sakshi News home page

Gopichand Malineni: 'కుడి కన్ను ఫోకస్ చేయమని చెప్పింది.. ఆ సీన్‌ చేశాక షాకయ్యా'

Feb 22 2026 8:08 AM | Updated on Feb 22 2026 11:17 AM

Director Gopichand Malineni praises Varalaxmi Sarath Kumar

హనుమాన్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం సరస్వతి. ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్‌ కాగా.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను తన కూతురి కోసం ఈ క్రూరమైన ప్రపంచానికి ఎలా ఎదుర్కొందన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు.  తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన టాలీవుడ్ డైరెక్టర్‌ గోపిచంద్ మలినేని.. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ గురించి మాట్లాడారు. సావిత్రి, ఊర్వశి శారద లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ అని కొనియాడారు. క్రాక్ మూవీలో జయమ్మ క్యారెక్టర్‌ చూసి ఇలా ఉంటుందా అని.. మొత్తం ప్రకాశం డిస్ట్రిక్ వాళ్లంతా కూడా షాకయ్యారని వెల్లడించారు. ఆ సీన్‌ చేసే సమయంలో ఒక చిన్న ఎక్స్‌ప్రేషన్‌ ఉందని వరలక్ష్మీకి చెప్పానని తెలిపారు. వెంటనే ఆమె కుడి కన్నుకు కెమెరా పెట్టండని నాతో చెప్పింది.. ఆ షాట్ చెప్పగానే ఆమె కుడి కంటి నుంచి ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేశాయని గోపిచంద్ అన్నారు. అది చూసి నేను కూడా షాకయ్యానని వెల్లడించారు. అంతా ఎక్స్‌ట్రార్డినరీ ఫర్మామెన్స్‌ వరలక్ష్మీదేనని ప్రశంసించారు. 

అంతేకాకుండా బాలయ్యతో వీరసింహారెడ్డి చేస్తున్నప్పుడు నాలుగు పేజీల డైలాగ్స్ ఇచ్చామని గోపీచంద్ తెలిపారు. రెండున్నర్ర రోజులు షూటింగ్ ప్లాన్ చేశాం.. కానీ మూడు గంటల్లోనే సీన్ అయిపోయిందన్నారు. ఈ సీన్‌ను సింగిల్ షాట్‌లోనే పూర్తి చేసిందని వరలక్ష్మీపై ప్రశంసలు కురిపించారు.  వరలక్ష్మి పెర్ఫార్మెన్స్ చూసి ఊర్వశి శారద గారిని చూసినట్లు ఉందని బాలయ్య అన్నారని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement