'అందుకే బాలీవుడ్‌ వదిలేయాల్సి వచ్చింది.. కానీ'.. వారణాసి బ్యూటీ | Actress Priyanka Chopra I don't think I ever wanted to leave Bollywood | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: 'అందుకే బాలీవుడ్‌ వదిలేయాల్సి వచ్చింది.. కానీ'.. వారణాసి బ్యూటీ

Feb 22 2026 10:30 AM | Updated on Feb 22 2026 10:58 AM

Actress Priyanka Chopra I don't think I ever wanted to leave Bollywood

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ బిగ్‌ ప్రాజెక్ట్‌లో కనిపించనుంది. రాజమౌళి- మహేశ్‌ బాబు కాంబోలో  వస్తోన్న వారణాసిలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అడ్వెంచరస్‌ మూవీ కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక ప్రస్తుతం ది బ్లఫ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆమె నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపథ్యంలోనే ది బ్లఫ్‌ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక హాలీవుడ్‌కి వెళ్లడంపై మాట్లాడింది. నేను బాలీవుడ్‌ను వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. హిందీ చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు చాలా కారణాల వల్ల పరిమితంగానే ఫీలయ్యానని పేర్కొంది. అందువల్లే హాలీవుడ్‌లో అడుగుపెట్టాల్సి వచ్చిదంని వెల్లడించింది. ఇండియన్ సినిమాల్లో చేయడం అంటే తనకు చాలా ఇష్టమని.. వారణాసిలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ప్రియాంక చోప్రా తెలిపింది.

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..' నేను హిందీ చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు చాలా కారణాల వల్ల పరిమితంగా భావించా. నా కెరీర్‌ మరింత విస్తరించాలనుకున్నా. అందుకే హాలీవుడ్‌లో పనిచేశా. కానీ బాలీవుడ్‌ని వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు.  పరిమితమైన అవకాశాలే రావడంతో ప్రాజెక్టుల విషయంలో కొంత ఒత్తిడికి గురయ్యా. అలాంటి పరిస్థితుల్లోనే హాలీవుడ్‌లోకి అడుగుపెట్టా. నాకు భారతీయ సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు రాజమౌళి సార్‌తో వారణాసి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని తెలిపింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement