breaking news
Varanasi Movie
-
‘వారణాసి’ చూసి యావత్ దేశం గర్వపడుతుంది: మహేశ్ బాబు
నాన్నగారు(కృష్ణ) ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో నేను ఆయన మాట వినలేదు. ఇన్నాళ్లకు వారణాసి(Varanasi)లో అలాంటి పాత్ర చేశా. ఆయన ఎక్కడ ఉన్నా ఆశిస్సులు మనతో ఉంటాయి’ అన్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu). రాజమౌళి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వారణాసి’. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించాడు. గ్లోబ్ ట్రాటర్ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్లో శనివారం ఈ మూవీ టైటిల్‌తో పాటు స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ..‘వారణాసి నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రం ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుంది. దీని కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. ముఖ్యంగా రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ఈ మూవీ విడుదలైన తర్వాత యావత్ దేశం మనల్ని చూసి గర్వపడుతుంది. ఈ ఈవెంట్ కేవలం టైటిల్ ప్రకటన కోసమే. ముమ్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ(ఫ్యాన్స్) సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. ఈ ఈవెంట్ ఇంత సజావుగా జరిగేలా సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఎంఎం కీరవాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2027 వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. బయటపెట్టిన రాజమౌళి
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోని 'గ్లోబ్ ట్రాటర్'లో ప్రసారం చేశారు. విజువల్స్ అన్నీ టాప్ నాచ్ ఉండగా.. అభిమానులు దీన్ని చూసి మైమరిచిపోయారు. ఇదే అనుకుంటే.. ఈ సినిమాలో మహేశ్ బాబు శ్రీరాముడిగా నటించారని చెప్పి రాజమౌళి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 60 రోజుల పాటు రాముడి ఎపిసోడ్ చిత్రీకరించామని చెప్పారు.(ఇదీ చదవండి: మహేశ్ బాబు 'వారణాసి'.. 2027 వేసవిలో రిలీజ్)'తొలిరోజు ఫొటోషూట్‌లో మహేశ్ బాబుని శ్రీరాముడిగా రెడీ చేసి ఫొటోలు తీశాం. అయితే మహేశ్, కృష్ణుడి పాత్రకు బాగా సూట్ అవుతాడని అనుకున్నా. కానీ ఆ రోజు మహేశ్.. నా అంచనా తప్పు అని నిరూపించాడు. దీంతో మహేశ్ రాముడి గెటప్ ఫొటోని నా వాల్ పేపర్‌గా పెట్టుకున్నాను. కానీ ఎవరు చూసేస్తారేమో అనుకుని దాన్ని తీసేశాను. రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. మహేశ్‌ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటోషూట్ తీస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. రాముడి ఎపిసోడ్‌ని 60 రోజుల పాటు తీశాం. రీసెంట్‌గానే అది పూర్తయింది. ఇందులో చాలా సబ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్.. నాకు, మహేశ్ కెరీర్లోనే మర్చిపోలేని సీక్వెన్స్' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 30 నిమిషాల ఫైట్.. మహేశ్ విశ్వరూపం చూశా: విజయేంద్ర ప్రసాద్) -
మహేశ్-రాజమౌళి 'వారణాసి' సినిమా వీడియో రిలీజ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ శివారులో 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో నిర్వహించిన ఈవెంట్లో స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. దాదాపు మూడున్నర నిమిషాల పాటు సాగిన ఈ వీడియో అద్భుతమనే రేంజులో ఉంది. ఆ విజువల్స్, గ్రాఫిక్స్ మతిపోగొట్టేలా కనిపించాయి.వారణాసి 512సీఈ నుంచి మొదలుపెట్టి.. ఆస్టరాయిడ్ శంభవి 2027సీఈ.. అంటార్కిటికా ఆఫ్రికా.. ఉగ్రభట్టి గుహ.. లంకా నగరం త్రేతాయుగం.. వారణాసి మణికర్ణిక ఘాట్.. అంటూ చూపించారు. చివర్లో మహేశ్ బాబు ఎద్దుపై స్వారీ చేస్తూ చేతిలో త్రిశూలంతో కనిపించారు. చివరలో 'వారణాసి' అనే టైటిల్ పడింది. 3 నిమిషాల 40 సెకన్ల వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేదు. అయినా సరే విజువల్ వండర్ అనేలా తీర్చిదిద్దారు. -
మహేశ్ బాబు 'వారణాసి'.. 2027లో రిలీజ్
మహేశ్ బాబుతో రాజమౌళి ఓ సినిమా చేస్తున్నారు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ చేయలేదు. మిగతా యాక్టర్స్ నుంచి కూడా ఒక్కటి కూడా బయటకు రానీయకుండా జాగ్రత్తపడ్డారు. అలాంటిది ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో భారీ ఎత్తున హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. సినిమా గురించి డీటైల్స్ బయటపెట్టారు.ఇదే కార్యక్రమంలో మాట్లాడిన మూవీ టీమ్ అంతా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రానికి సంగీతమందించిన కీరవాణి కూడా చాలా మాట్లాడారు. పనిలో పనిగా మూవీ రిలీజ్ ఎప్పుడనేది కూడా చూచాయిగా బయటపెట్టారు.'మహేశ్ బాబు ఫ్యాన్స్.. మీ అందరి హృదయాల్లో పర్మినెంట్‌గా ఉండిపోటానికి ఒక కొత్త ఫ్లాట్ కొన్నా. బిల్డర్ హ్యాండోవర్ చేసేసాడు. ప్రొడ్యూసర్ హ్యాపీ. డైరెక్టర్ హ్యాపీ. టైల్స్ ఏత్తన్నారు. మెలోడీ నాదే బీటు నాదే. సమ్మర్ 2027కి గృహప్రవేశం' అని కీరవాణి చెప్పుకొచ్చారు.కీరవాణి చెప్పడమైతే చెప్పారు గానీ 2027 వేసవిలోనే కచ్చితంగా రిలీజ్ అవుతుందా అంటే సందేహమే. ఎందుకంటే రాజమౌళి తీసే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా పలు కారణాల వల్ల ఆలస్యం కావడం, ముందు అనుకున్న విడుదల తేదీ వాయిదా పడటం తెలిసిందే. మరి ఈసారైనా కీరవాణి చెప్పినట్లు 2027 వేసవిలోనే వస్తారా లేదా అనేది చూడాలి?


