ప్రతిష్టాత్మక వేదికపై 'వారణాసి' టీజర్‌.. అధికారికంగా ప్రకటన | Mahesh Babu And Rajamouli Movie Varanasi Teaser Released At This Prestigious Venue, Check Out Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

'వారణాసి' టీజర్‌.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్‌

Jan 4 2026 12:19 PM | Updated on Jan 4 2026 1:30 PM

Mahesh Babu and rajamouli movie Varanasi Teaser released at This Prestigious Venue

మహేష్బాబు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్చిత్రం వారణాసి.. యాక్షన్‌ అడ్వెంచరస్‌గా రానున్న మూవీపై ఇండియన్సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రమంలో టీజర్విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారుకొద్దిరోజుల క్రితం జరిగిన గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌లో #GlobeTrotterevent టైటిల్‌ వీడియోను విడుదల చేశారు. మూవీ కథా నేపథ్యాన్ని తెలిపేలా ఉన్న వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్అయింది.

 జనవరి 5న పారిస్‌లో టీజర్‌
వారణాసి నుంచి వచ్చిన తాజా అప్‌డేట్ ఏమిటంటే.., అభిమానులను ఆశ్చర్యపరుస్తూ మూవీ టీజర్ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ఇప్పుడు చరిత్ర సృష్టించనుంది. పారిస్‌(Paris)లోని 'లే గ్రాండ్ రెక్స్‌'(Grand Rex)లో టీజర్ను విడుదల చేయనున్నారు. 2,702 సీట్లు కలిగిన థియేటర్‌.. యూరప్‌లోనే అతిపెద్దదిగా రికార్డ్క్రియేట్చేసింది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై టీజర్‌ను ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రంగా మహేష్బాబు వారణాసి చిత్రం నిలుస్తుంది. జనవరి 5 రాత్రి 9 గంటలకు టీజర్విడుదల కానుంది. 

భారతీయ సినిమాల ఫ్రెంచ్ పంపిణీదారు అన్న ఫిల్మ్స్ ఈ వార్తను ధృవీకరించింది. టీజర్‌ను పెద్ద స్క్రీన్‌పై గొప్ప ఫార్మాట్‌లో ప్రదర్శించడంతుందని ఇది ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తుందని వారు భావిస్తున్నారు. వారణాసిని ప్రపంచ వార్తల్లో ఉంచడానికి రాజమౌళి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీని మార్చి 2027లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ, షోయింగ్ బిజినెస్‌కు చెందిన ఎస్.ఎస్. కార్తికేయతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. స్వరకర్త ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చగా.. కథ స్క్రీన్‌ప్లేను విజయేంద్ర ప్రసాద్ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement