రాజమౌళితో మరోసారి.. వారణాసిలో స్టార్ హీరో..! | Kannada Star Kicha Sudeep Will Be Part Of SS rajamouli Varanasi Movie | Sakshi
Sakshi News home page

Varanasi Movie: రాజమౌళితో మరోసారి.. వారణాసిలో ఈగ విలన్..!

Feb 19 2026 9:22 PM | Updated on Feb 20 2026 9:59 AM

Kannada Star Kicha Sudeep Will Be Part Of SS rajamouli Varanasi Movie

దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్‌ అవైటేడ్  అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైథలాజికల్‌ టచ్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో తీస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విలన్‌గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఈగ ఫేమ్, కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్ కీలక పాత్రలో కనిపించనున్నారని లేటేస్ట్ బజ్ హల్‌చల్ చేస్తోంది. ఈ విషయంలో  సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మరోసారి ఈగ తర్వాత మరోసారి కిచ్చా సుదీప్‌కు.. రాజమౌళి డైరెక్షన్‌లో పనిచేసే ఛాన్స్ దక్కనుంది. వారణాసిలో పవర్‌ఫుల్ రోల్‌ చేస్తే ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. మరి ఈ విషయంపై దర్శక, నిర్మాతలు క్లారిటీ ఇస్తే తప్ప ఫ్యాన్స్‌కు డైలామా తప్పేలా కనిపించడం లేదు. కాగా.. వారణాసిలో  బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా మెప్పించనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement