ఛత్రపతి శివాజీ.. ఈ పేరు వినగానే తెలియని ధైర్యం ఒంట్లోకి వస్తుంది. తన మతాన్ని, సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలకు సైతం తెగించి పోరాడిన ధీరశాలి. నేడు (ఫిబ్రవరి 19న) శివాజీ మహారాజ్ జయంతి. ఈ సందర్భంగా వెండితెరపై ఆరుసార్లు శివాజీగా వేషం వేసి మెప్పించిన నటుడెవరో చూసేద్దాం..
ఆరు సార్లు శివాజీగా..
ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత చిన్మయ్ మాండ్లేకర్.. ఒకటీ రెండుసార్లు కాదు, ఏకంగా ఆరుసార్లు వెండితెరపై శివాజీ పాత్రను పోషించాడు. ఫర్జంద్, ఫత్తేశికస్త్, పవన్‌కైండ్, షేర్ శివరాజ్, సుబేదార్, శివరాయంచ అనే ఆరు మరాఠి సినిమాల్లో శివాజీగా వేషం కట్టాడు. కానీ ఒకే ఒక్క సంఘటన వల్ల ఇకపై ఎన్నటికీ శివాజీగా కనిపించనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
అసలేం జరిగిందంటే?
మరాఠి నటుడు చిన్మయ్ మాండ్లేకర్.. శివాజీ పాత్రలో నటించినందుకుగానూ ప్రత్యేక గుర్తింపు, ఆదరణ పొందాడు. కానీ ఆయన కుమారుడికి జహంగీర్ అనే పేరు పెట్టాడు. ఆ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి తనపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కుటుంబం మొత్తానిపై విమర్శలు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన చిన్మయ్.. ఈ ట్రోలింగ్ అన్యాయం అంటూ ఓ వీడియో షేర్ చేశాడు.
సంచలన నిర్ణయం
వృత్తిపరంగా విమర్శలు చేస్తే ఓకే కానీ, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశాడు. తన కొడుకు, భార్య క్యారెక్టర్‌పై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారని, ఇది తప్పని అభిప్రాయపడ్డాడు. శివాజీ మహారాజ్ అంటే తనకు ఎంతో గౌరవం అని, ఇకపై ఆయన పాత్రను వెండితెరపై చేయనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
కుమారుడికి ఆ పేరు ఎందుకంటే?
మరి కుమారుడికి జహంగీర్ పేరు ఎందుకు పెట్టాడంటే? జహంగీర్ జంషెడ్ నవ్రోజ్‌లో జన్మించాడు. భారతరత్న జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా స్ఫూర్తితో కుమారుడికి జహంగీర్ అని పేరు పెట్టాడు. ఇక చిన్మయ్ మాండ్లేకర్.. హిందీలో తేరే బిన్ లాడెన్, సమీర్, ద కశ్మీర్ ఫైల్స్, గాంధీ గాడ్సే: ఏక్ యుధ్ సినిమాల్లో నటించాడు. కాలాపాణి, దల్దల్ వంటి వెబ్ సిరీస్‌లలోనూ యాక్ట్ చేశాడు.
చదవండి: ఓటీటీలో థ్రిల్లర్ వెబ్ సిరీస్... రిలీజ్ ఎప్పుడంటే?


