జైళ్లలో స్మోకింగ్‌ జోన్‌ ఉండాలి: రాజ్‌పాల్‌ యాదవ్‌ | Rajpal Yadav: Jails need Smoking Areas like Airports, Railway Stations | Sakshi
Sakshi News home page

Rajpal Yadav: జైళ్లలో స్మోకింగ్‌ జోన్‌ ఉండాలి.. తీహార్‌ నుంచి రిలీజైన నటుడు

Feb 19 2026 3:34 PM | Updated on Feb 19 2026 3:37 PM

Rajpal Yadav: Jails need Smoking Areas like Airports, Railway Stations

చెక్‌ బౌన్స్‌ కేసులో తీహార్‌ జైలుకు వెళ్లిన ప్రముఖ హాస్య నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌ తాత్కాలిక బెయిల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం జైలు సౌకర్యాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రైల్వే స్టేషన్స్‌, విమానాశ్రాయాల మాదిరిగా జైళ్లలోనూ పొగ తాగేందుకు ప్రత్యేక ప్రాంతాలు (స్మోకింగ్‌ జోన్స్‌) ఏర్పాటు చేయాలన్నాడు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా ఖైదీలు తమ తప్పులను సరిదిద్దుకుని మారేందుకు వీలైన సంస్కరణ కేంద్రాలుగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. 

బయట నుంచి చూసేవారికి ఎవరు కరడుగట్టిన నేరస్థులు, ఎవరు పొరొపాటున నేరం చేసి వచ్చారో అర్థం కాదని తెలిపాడు. ప్రస్తుతం తన ఇంట్లో వివాహ వేడుక ఉందని, ఆ సెలబ్రేషన్స్‌ పూర్తయ్యాక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నాడు. ప్రస్తుతం సింపతీ సాధించడం కన్నా డబ్బు సంపాదించమే ముఖ్యమని పేర్కొన్నాడు.

ఏం జరిగింది?
రాజ్‌పాల్‌ యాదవ్‌, ఆయన భార్య రాధపై మురళీ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2017లో చెక్‌ బౌన్స్‌ కేసు పెట్టింది. తమ వద్ద తీసుకున్న రూ.5 కోట్లు తిరిగివ్వడం లేదని, పైగా ఇచ్చిన చెక్‌లు కూడా బౌన్స్‌ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2018లో ఈ చెక్‌బౌన్స్‌ కేసులో ఢిల్లీ మెజిస్ట్రేట్‌ కోర్టు రాజ్‌పాల్‌ దంపతులను దోషులుగా తేల్చింది. నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

2019లో సెషన్స్‌ కోర్టు ఈ శిక్షను సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ రాజ్‌పాల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఫిర్యాదుదారుడికి డబ్బు చెల్లిస్తానంటూ స్టే తెచ్చుకున్నాడు. కానీ, వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో న్యాయస్థానం సీరియస్‌ అయింది. కోర్టు ఆదేశాల మేరకు నటుడు తీహార్‌ జైలులో లొంగిపోయాడు. 

ఫిర్యాదుదారునికి రాజ్‌పాల్‌ యాదవ్‌ రూ.1.5 కోట్లు డిపాజిట్‌ చేయడంతో ఢిల్లీ హైకోర్టు మార్చి 18 వరకు ఆయన శిక్షను సస్పెండ్‌ చేసింది. తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేయడంతో ఫిబ్రవరి 17న నటుడు విడుదలయ్యాడు. కాగా రాజ్‌పాల్‌ యాదవ్‌.. హంగామా, భూల్‌ భూలయా, డ్రీమ్‌ గర్ల్‌ 2, బేబీ జాన్‌ వంటి అనేక హిందీ చిత్రాల్లో నటించాడు. కిక్‌ 2 సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యాడు.

చదవండి: ఆ హీరోను చూసి నా మాజీ ప్రియుడు భయపడ్డాడు: మృణాల్‌

Advertisement
 
Advertisement
Advertisement