‘మిరాకిల్’ చేద్దాం రండి అంటున్న హెబ్బా పటేల్ | Hebah Patel To Join The Sets Of Prabhas Nimmala Miracle Movie | Sakshi
Sakshi News home page

‘మిరాకిల్’ చేద్దాం రండి అంటున్న హెబ్బా పటేల్

Feb 19 2026 2:51 PM | Updated on Feb 19 2026 3:05 PM

Hebah Patel To Join The Sets Of Prabhas Nimmala Miracle Movie

రణధీర్ భీసు హీరోగా తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘మిరాకిల్‌’. సత్య గ్యాంగ్, ఫైటర్ శివ  చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నెల 24 నుంచి  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనున్న మూడో షెడ్యూల్ లో సెట్స్ లో జాయిన్ కానుందని చిత్రబృందం వెల్లడించింది.

ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.  సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాయుడు పెండ్ర విలన్ గా పరిచయమవుతున్నాడు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము), సమీర్ దత్తా, అనుశ్రీ, బెజవాడ మస్తాన్, ఆర్. కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు!!
 

Advertisement
 
Advertisement
Advertisement