అత్యాచార బాధితురాలిగా నరకం చూశా: నటి | Actress Kani Kusruti Opens Up About Her Challenging Role In Assi Movie, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అత్యాచార బాధితురాలిగా నరకం చూశా: నటి

Feb 19 2026 11:36 AM | Updated on Feb 19 2026 11:56 AM

Actress Kani Kusruti Comments On Assi movie

నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'అస్సీ' (Assi). బాలీవుడ్‌లో ఫిబ్రవరి 20న విడుదల కానుంది.  అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్సివ్ కోర్ట్‌రూమ్ డ్రామాను థియేటర్స్‌లో చూడాలని ఆమె కోరారు. మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కఠినమైన సామాజిక కథాంశంతో అస్పీని తెరకెక్కించారు. ఇందులో తాప్సీ ధైర్యంతో కూడిన న్యాయవాదిగా నటించగా..  మలయాళ నటి కని కుస్రుతి అత్యాచార బాధితురాలిగా మెప్పించారని తెలుస్తోంది. తాజాగా తన పాత్ర గురించి ఆమె మాట్లాడింది.

అస్పీ చిత్రంతో తాను పరిమ అనే పాత్రలో నటించానని నటి కని కుస్రుతి(Kani Kusruti) అన్నారు. సమాజంలో అత్యాచారానికి గురైన ఒక మహిళ అనుభవించే మానసిక వేదన ఎలా ఉంటుందో ఈ మూవీ చిత్రీకరిస్తున్న సమయంలో తెలిసొచ్చిందని ఆమె అన్నారు. బాధితుల క్షోభను వేరొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా క‌ష్ట‌మైన విషయమన్నారు. అలాంటి పాత్ర‌లో తాను న‌టించ‌డం అతిపెద్ద సవాల్‌గా మారిందని గుర్తుచేసుకున్నారు.  ఒక నటిగా నటించాను. కానీ, కొన్ని క్షణాల్లో అది నిజంగా తనకే జరుగుతోందా అనేంతగా పరిమ అనే పాత్రలో లీనమయ్యానని క‌ని కుస్రుతి తెలిపారు.  

ఈ సినిమా ద్వారా అత్యాచార భాదితురాలికి న్యాయం జరగాలంటే ఎలాంటి పోరాటం చేయాల్సి వస్తుందనేది తనకు అర్థం అయిందని ఆమె అన్నారు. భారతీయ న్యాయ వ్యవస్థలో ఉన్న చిక్కులు కూడా తనకు అర్థం అయ్యాయని తెలిపారు.  కోర్టు విచారణ సమయంలో బాధితులకు  పాత గాయాలను పదేపదే గుర్తూ చేస్తూ ఉంటుంటే ఆ స్థానంలో ఉన్న ఒక మహిళ ఎంతటి నరకం అనుభవిస్తుందో  తనకు అర్థమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

'అస్సీ'లో తాప్సీ పన్ను, కని కుస్రుతి, రేవతి, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా, మహమ్మద్ జీషన్ అయ్యూబ్, నసీరుద్దీన్ షా నటించారు. ఢిల్లీలో ఒక పాఠశాల ఉపాధ్యాయురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం, దాని చుట్టూ సాగే న్యాయపోరాటాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. తాప్సీ తన కెరీర్‌లో వైవిధ్యమైన, సామాజిక సందేశం ఉన్న మరో పాత్రలో నటించారు. దేశంలో  సగటున ఒక రోజులో  80 అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయి. దానిని సూచిస్తూ ఈ చిత్రానికి ‘అస్సి’ (హిందీలో 80) అని పేరు పెట్టారు. ఈ మూవీ ట్రైలర్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలను పెంచేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement