ఓటీటీలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ప్రకటన | Daughter of Prasad Rao Kanabadutaledu web series realse date locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ప్రకటన

Feb 19 2026 7:48 AM | Updated on Feb 19 2026 9:44 AM

Daughter of Prasad Rao Kanabadutaledu web series realse date locked

రాజీవ్‌ కనకాల, ఉదయబాను, ప్రధాన పాత్రధారులుగా నటించిన 'డాటరాఫ్‌ ప్రసాద్‌ రావు: కనపడుట లేదు' వెబ్‌ సిరీస్‌ విడుదలపై ప్రకటన వచ్చింది. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ గతేడాదిలోనే స్ట్రీమింగ్‌ కావల్సి ఉంది. అయితే, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ విడుదల చేశారు. దర్శకుడు పోలూరు కృష్ణ తెరకెక్కించిన ఈ సిరీస్‌  ‘జీ 5’(Zee 5)లో  ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.  రెక్కీ, విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ సిరీస్‌లను అందించిన సౌతిండియన్‌ స్ర్కీన్స్‌ దీన్ని రూపొందించింది.

తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఈ వెబ్‌ సిరీస్‌(D/O Prasad Rao Kanabadutaledhu )ను తెరకెక్కించారు. నటి వసంతిక ఇందులో రాజీవ్‌ కనకాల కూతురు స్వాతి పాత్రలో నటించింది.  ప్రతి కుటుంబానికి కనెక్ట్‌ అయ్యే కాన్సెప్ట్‌తో పాటు ఎన్నో సస్పెన్స్‌ పాయింట్స్‌ను  దర్శకుడు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తండ్రి ఆశయాలకు ఎంతో కష్టపడి ఉద్యోగంలో చేరిన కూతురు ఊహించని రీతిలో అదృశ్యమవుతుంది. ఈ మిస్సింగ్‌ కేసును ఛేదించేందుకు పోలీసు అధికారిణి (ఉదయభాను) రంగంలోకి దిగుతుంది. స్వాతిని కడ్నాప్‌ చేసింది ఎవరు..? ఆమెను టార్గెట్‌ చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి..? అనేది తెరపై చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement