సోషల్ మీడియాలో విజయ్- రష్మిక వెడ్డింగ్‌ కార్డ్.. టీమ్ ఆగ్రహం..! | Special request from Team Vijay Deverakonda Rashmika Wedding | Sakshi
Sakshi News home page

Vijay Deverakonda-Rashmika: నెట్టింట వెడ్డింగ్ కార్డ్ వైరల్.. విజయ్ దేవరకొండ టీమ్ ఆగ్రహం

Feb 18 2026 10:04 PM | Updated on Feb 18 2026 10:04 PM

Special request from Team Vijay Deverakonda Rashmika Wedding

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా విజయ్‌ దేవరకొండ- రష్మిక పెళ్లిపై తెగ చర్చ నడుస్తోంది. ఈ నెల 26న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని వెడ్డింగ్ కార్డ్ నెట్టింట తెగ వైరలైంది. తాజాగా దీనిపై విజయ్ దేవరకొండ టీమ్‌ స్పందించింది. వివాహం, రిసెప్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం కరెక్ట్‌ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

'విజయ్‌- రష్మిక  పెళ్లి గురించి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పెళ్లి, రిసెప్షన్‌ వేదిక వివరాలను వెల్లడిస్తున్నారు. ఇలాంటి వాటితో అతిథులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. వీరి పెళ్లికి  టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన వారితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతారు. ఇలాంటి వేదికల వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం సరైంది కాదు. పెళ్లికి హాజరయ్యే అతిథులు కాంటాక్ట్ కావాల్సిన ఫోన్‌ నెంబర్‌ వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ చేస్తే.. అది కూడా పోస్ట్ చేశారు. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయవద్దని' విజయ్‌ టీమ్‌ పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement