ఆపరేషన్ సిందూర్‌పై మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఆపరేషన్ పేరుతో ఇప్పటికే ఓ సినిమా ఫిక్సయింది. తాజాగా మరో మూవీ సైతం రానుందని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ది కశ్మీర్ ఫైల్స్ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించనున్నారని బాలీవుడ్‌లో టాక్. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టు వివరాలు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అయితే తనపై వస్తున్న ఈ రూమర్స్‌పై వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ఆపరేషన్ సిందూర్ ఆధారంగా రూపొందిస్తారని వస్తున్న వార్తలతో తనకు సంబంధం లేదన్నారు. ప్రస్తుతం తాను అతిపెద్ద జాతీయవాద ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నానని వెల్లడించారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని.. చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించేందుకు వివేక్ నిరాకరించారు.
తాజా న్యూస్ ప్రకారం టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి వివేక్ అగ్నిహోత్రి 'ఆపరేషన్ సిందూర్' తెరకెక్కించున్నారని వార్తలొచ్చాయి. ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తారని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. గతేడాది అగ్నిహోత్రి ది బెంగాల్ ఫైల్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
మరోవైపు ఆపరేషన్ సిందూర్ పేరుతో దర్శకుడు ఉత్తమ్ నితిన్ సినిమాని ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కాగా.. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన ఏప్రిల్ 22, 2025న జరిగింది.


