జీవితంలో ఒక్క పుస్తకం చదవలేదు: అక్షయ్‌ కుమార్‌ | Akshay Kumar Says He Never Read a Book, says Twinkle Khanna Reads One Daily | Sakshi
Sakshi News home page

నా భార్య రచయిత్రి, నేను మాత్రం ఒక్క పుస్తకం ముట్టలే!

Feb 18 2026 6:33 PM | Updated on Feb 20 2026 9:28 PM

Akshay Kumar Says He Never Read a Book, says Twinkle Khanna Reads One Daily

భార్య పుస్తకాల రచయిత్రి, కానీ తాను మాత్రం ఇంతవరకు ఒక్క పుస్తకం కూడా చదవలేదంటున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌. ప్రస్తుతం ఈయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో "వీల్‌ ఆఫ్‌ ఫార్చ్యూన్‌". తాజాగా ఈ షో ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికర విషయం చెప్పాడు అక్షయ్‌. నా భార్య ట్వింకిల్‌ ఖన్నా రచయిత్రి. నాకు తెలిసి తను రోజుకొక పుస్తకం అయినా చదివేస్తుంది.

పుస్తకం చదివిన పాపాన పోలేదు
నేను మాత్రం ఇంతవరకు జీవితంలో ఒక్క పుస్తకం కూడా చదవలేదు. కాకపోతే అందరి ముఖాల్ని ఇట్టే చదివేయగలను. మనుషుల్ని చదవడం కన్నా ఉత్తమమైనది మరొకటి లేదని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చాడు. అక్షయ్‌ ప్రస్తతం భూత్‌ బంగ్లా అనే హారర్‌ కామెడీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. అలాగే వెల్‌కమ్‌ టు ద జంగిల్‌ అనే మరో ప్రాజెక్ట్‌ అతడి చేతిలో ఉంది.

సినిమా
అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా విషయానికి వస్తే.. బర్సాత్‌, జబ్‌ ప్యార్‌ కిస్సే హోతా హై, బాద్‌షా వంటి పలు సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె పుస్తక రచయిత్రిగా మారింది. మిసెస్‌ ఫన్నీబోన్స్‌, పైజామాస్‌ ఆర్‌ పర్‌గివింగ్‌, వెల్‌కమ్‌ టు ప్యారడైజ్‌ వంటి ఎన్నో పుస్తకాలు రాసింది. ఇటీవల 'టూ మచ్‌ విత్‌ కాజోల్‌ అండ్‌ ట్వింకిల్‌ 'అనే షోకి సహ వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది.

చదవండి: రెండుసార్లు గుండెపోటు, వీల్‌చైర్‌కే పరిమితమయ్యా..: అనురాగ్‌ కశ్యప్‌

Advertisement
 
Advertisement
Advertisement