టాలీవుడ్‌లో షూటింగ్స్ సందడి మళ్లీ పెరిగింది. సంక్రాంతి సెలవులు, ఇతర విరామాల తర్వాత స్టార్ హీరోలందరూ మేకప్ వేసుకుని లొకేషన్లలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఏ హీరో ఎక్కడ, ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారో ఓ లుక్కేద్దాం.
📽️ ప్రభాస్ - ఫౌజీ: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ వార్ డ్రామా ఫౌజీ. ఈ సినిమా కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని దండు మైలారంలో జరుగుతోంది. ఇక్కడ భారీ సెట్లు వేసి యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
📽️ రామ్ చరణ్ - పెద్ది: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం పెద్ది. ఈ సినిమా షూటింగ్ సోమవారం వరకు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఈ షెడ్యూల్ నిన్నటి పూర్తయిపోయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
📽️ మహేష్ బాబు - వారణాసి: రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం గండిపేట పరిసరాల్లో జరుగుతోంది.
📽️ ఎన్టీఆర్ - డ్రాగన్: తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ డ్రాగన్.. ప్రస్తుతం జోర్డాన్ ఎడారిలో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుంటోంది.
📽️ అల్లు అర్జున్ - AA22: అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం ముంబైలో మకాం వేశారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఉండబోతోంది.
📽️ రవితేజ - ఇరుముడి: శివ నిర్వాణ డైరెక్షన్‌లో మాస్ రాజా నటిస్తున్న ఇరుముడి షూటింగ్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని సీలేరు పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది.
📽️ విజయ్ దేవరకొండ - రణబాలి: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్‌హీరోగా నటిస్తున్న రణబాలి మూవీ షూటింగ్ గండిపేట ఏరియాలో జరుగుతోంది.
📽️ నాని - ప్యారడైజ్: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ప్యారడైజ్ షూటింగ్ ముచ్చింతల్ (హెలో నేటివ్ స్టూడియోస్)లో వేసిన ప్రత్యేక సెట్స్‌లో జరుగుతోంది.
📽️ వెంకటేష్ - ఆదర్శకుటుంబం: త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా సాగుతోంది.
📽️ గోపీచంద్ - సంకల్ప రెడ్డి: వీరి యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ అజీజ్ నగర్ సమీపంలో జరుగుతోంది.
📽️ కిరణ్ అబ్బవరం - చెన్నై లవ్ స్టోరీ: ఈ యంగ్ హీరో ప్రస్తుతం పాండిచ్చేరిలో తన సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.


