ఈ రోజుల్లో నిర్మాతకు విలువే లేదు: దిల్ రాజు ఆవేదన | Dil Raju Comments about Producers Value In Now a days | Sakshi
Sakshi News home page

Dil Raju: వాళ్లే సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు: దిల్ రాజు

Feb 18 2026 4:34 PM | Updated on Feb 18 2026 5:02 PM

Dil Raju Comments about Producers Value In Now a days

టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో నిర్మాతలకు విలువ లేకుండా పోయిందన్నారు. నిర్మాత అంటే ఇచ్చేవాడని... అందరూ తీసుకునేవాళ్లేనని అన్నారు.  ఈ రోజుల్లో తీసుకునేవాళ్లే.. ఇచ్చేవాళ్లను శాసించే లెవెల్‌లో సినిమా ఇండస్ట్రీ ఉందని వెల్లడించారు. ప్రముఖ నిర్మాత అంటే అట్లూరి పూర్ణచంద్రరావు బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్న దిల్‌ రాజు మాట్లాడారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఈ రోజుల్లో నిర్మాతలకు విలువ లేదు. రజినీకాంత్‌ చెప్పినట్లు నిర్మాత అంటే ఇచ్చేవాడు.. అందరూ తీసుకునేవాళ్లే. అప్పట్లో అట్లూరి పూర్ణచంద్రరావు లాంటి నిర్మాతలు ఉన్నారు. నా దిల్ సినిమాను హిందీలో రీమేక్ చేస్తానంటే రైట్స్ ఫ్రీగా ఇస్తానని చెప్పా'  అని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement