Palnadu
-
కృష్ణమ్మ గర్భాన చారిత్రక సౌందర్యం
బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జున కొండ విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయం మధ్య ఉన్న నాగార్జునకొండ మ్యూజియంకు ఎనలేని ప్రశస్తి ఉంది. వేసవిసెలవుల్లో ప్రతి విద్యార్థితో పాటు పెద్దలు విజ్ఞానం.. విహార యాత్రలో భాగంగా బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జున కొండను సందర్శించాల్సిందే. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం ఎందరో యాత్రికులు అనునిత్యం నాగార్జునకొండను సందర్శిస్తారు. చైనా, టిబెట్, శ్రీలంక తదితర దేశాల వారైతే ఇక్కడి తథాగతుని ప్రతిమకు ప్రార్థనలు జరుపకుండా వెనుకకురారు. ప్రపంచంలోనే మానవ నిర్మిత ఐలాండ్ మ్యూజియంలలో రెండవదయిన ఈమ్యూజియం విశిష్టత క్లుప్తంగా... ఇక్ష్వాకుల రాజధాని పూర్వం మహాయాన బౌద్ధ ప్రవక్త అయిన ఆచార్య నాగార్జునుని విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది. బుద్ధదంత ధామమయమైన మహాస్థూపం, విశాలమైన వివిధ భిక్షువిహారాలు ఉన్నాయి. వీటన్నింటితో ఇక్ష్వాకుల రాజధానిగా విలసిల్లిన విజయపురి ప్రాంతం నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ సమయంలో ముంపునకు గురి కాకుండా కేంద్ర పురావస్తు శాఖ వారు అక్కడ విశేష సామగ్రిని పరిరక్షించి నేడు నాగార్జున కొండలో ప్రదర్శిస్తున్నారు. నాగార్జునకొండ మ్యూజియంలో నాగార్జునకొండ లోయలో బౌద్ధ శిధిలావశేషాలు, ఇక్ష్వాకుల విజయపురి శిథిలాలు ఏవిధంగా పొందుపర్చారో వాటిని అదేవిధంగా పునర్నిర్మించారు. ఈమ్యూజియంలో మహాస్థూపంపై ఏర్పాటు చేసిన శిలా శిల్ప ఫలకాలు, ఆయకాస్తంభాలు, వివిధ విహారాలు, విశ్వవిద్యాలయాల్లోను లభించిన ఫలకాలను బుద్ధవిగ్రహాలను జాతక కథ క్రమాలను, బుద్ధచరిత్రాంశ శిల్పాలను తదితర వస్తు సామాగ్రిని క్రమపద్ధతిలో అందంగా పొందుపరిచారు. ఇక్ష్వాకు వంశీయుల శిలాశాసనాలు,వారి జీవిత విశేషాలు బౌద్ధస్తంభాలు తదితర మైనవి కూడా ఈమ్యూజియంలో ఉన్నాయి. నాటి విశ్వవిద్యాలయానికి మచ్చుతునక అనుపు ఈవిశ్వవిద్యాలయం శిథిల అవశేషాలు నాగార్జునకొండలోయలో ఏవిధంగా ఉన్నాయో అదే విదంగా ఆ ఇటుకలతోనే అనుపు వద్ద అమర్చారు. కష్ణానదితీరాన విశాలమైన విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం నెలకొని ఉండేది. ఇది ప్రాచీన కాలపు గురుకులమై గురుశిష్య నివాసాలు ఒకేదగ్గరుండి సకల శాస్త్ర విజ్ఞాన కేంద్రమైన సయస్త విద్యల్లో పేరుపొంది ప్రపంచఖ్యాతి గాంచింది. స్నానఘట్టాలు నాగార్జునకొండపై ఇక్ష్వాకు రాజసౌధ ప్రాంగణంలో కష్ణానదితీరం నానుకోని నిర్మించిన స్నానఘట్టాలు ఉండేవి. ఇవికేవలం స్నానాలకే కాక వస్తు సామగ్రిని నౌకలద్వారా రవాణా చేయడానికిగాను నావల రేవులుగా కూడా వాడి ఉంటారని భావిస్తున్నారు. ఈస్నాన వేదికలను నున్నని నాపరాళ్లతో పరచబడినవి. ఇక్కడ స్నానానికి ఎంతో సౌకర్యంగా ఉండేది. హారతీ దేవాలయం విశ్వవిద్యాలయానికి కొద్దిదూరంలో హారతీ దేవాలయం దాని దిగువన చతురస్త్రాకారంలో ఒకపెద్ద సరస్సు ఉంది. దీనికి నలువైపుల మెట్లతో ఒడ్డు ప్రాంతాలున్నాయి. మెట్లతో గ్యాలరీల మాదిరిగా ఉండటంతో దీని క్రీడాప్రాంగణం వేరే ప్రాంతంలో బయల్పడి నందున ఆసంశయం తీరింది. హారతీ దేవాళయంలో ప్రవేశానికి ముందు ఈసరస్సులో స్నానమాచరించేవారు. ఆకాలంలో పిల్లలకు మశూచి వచ్చినా, దంపతులకు సంతానం లేకున్నా హారతీ దేవిని దర్శించి పూజలు చేసేవారని ప్రతీతి. సింహళ విహారం మహాచైత్యం పక్కన సింహళవిహార శిథిలాలున్నాయి. ఈవిహారంలో బుద్ధ విగ్రహాన్ని స్థాపించారు. సింహళీయులు, ఈవిహారంలో నివసించి, నాగార్జునకొండలో పలుకుబడి సంపాదించుకున్నారని ప్రతీతి. చాంతిసిరి ఈవిహారానికి ఎన్నోధానధర్మాలు చేసినట్లు చరిత్రద్వారా వెల్లడవుతుంది. ఇవేకాక ఇంకా కూర్మక్షతి కుండం, ఇక్ష్వాకు రాజసౌధాలు, సతీసహగమన ఘట్టం, ఇక్ష్వాకురాజులు అశ్వమేథ యాగశాల తదితర మైన కట్టడాలు కూడా నాగార్జునకొండలో ఉన్నాయి. ఎలా చేరుకోవాలి.. నాగార్జున కొండకు చేరడానికి నాగార్జునసాగర్ నుంచి ఏపీ వైపు నుంచి( రైట్బ్యాంకునుంచి), తెలంగాణ వైపు(హిల్‌కాలనీ నుంచి) లాంచీలు ఉంటాయి. లాంచీప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. యాత్రికులు అక్కడ ఎక్కువ సమయం గడిపేందుకు వీలుండదు. లాంచీలు కేవలం గంట సమయం మాత్రమే కేటాయించడంతో అన్ని విశేషాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్న యాత్రికులకు నిరాశే మిగులుతుంది. బుద్ధధాతువును సందర్శించే యోగం కూడా అందరికి లేదు. కేవలం వీఐపీలకు మినహా ఎవరికీ అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్ది యాత్రికులు అక్కడ ఉండే విధంగా వసతులు కల్పిస్తే కానీ నాగార్జునకొండ మ్యూజియం ఏర్పాటుకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది బుద్ధధాతువుపై కట్టిన అందాల చైత్యం. ఈస్థూపం నుంచి తవ్వి తీసిన ధాతువును ప్రస్తుతం బుద్ధుడు మొదటి ప్రసంగం చేసిన సారానాథ్లో ఉంచి పూజిస్తున్నారు. ఇది శారీరక స్థూపాల జాతికి చెందినది. దీని అంతర్భాగంలో బుద్ధభగవానుని అస్థికలు అమర్చబడ్డాయి. ఇది ప్రాచీన శిల్ప నిర్మాణ ప్రావీణ్యానికి నిదర్శనం. చక్రము దాని ఆకులను ఇటుక గోడల్లా నిర్మించి ఆకుల మధ్య ఖాళీ స్థలాన్ని మట్టితో కప్పి స్థూపాకారాన్ని తయారు చేసి ఉపరితలాన్ని చుట్టుపక్కల పాలరాతి పలుకలు కప్పి అర్థగోళాకారంగా అందంగా నిర్మించారు. -
ప్రజల సమస్యలను ఎత్తిచూపిన ప్రదర్శనలు
మాచర్ల రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ నెమలిదిన్నె వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్ పోలీసులు ఆదివారం అక్రమంగా అరెస్టు చేశారు. వెంకట రంగారెడ్డిది మాచర్ల మండలం కంభంపాడు గ్రామం కాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామం వదిలి వెళ్లి విజయవాడలో నివాసం ఉంటున్నాడు. వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్ పోలీసులు అరెస్టు చేసి మాచర్ల కోర్టులో హాజరుపరచనుననట్లు పోలీసులు తెలిపారు. వెంకట రంగారెడ్డిని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరచనున్నట్లు సమాచారం. ఇప్పటికే నెమలిదిన్నే వెంకట రంగారెడ్డిపై 14 అక్రమ కేసులు బనాయించి పోలీసులు అరెస్టు చేశారు. 15వ కేసును బనాయించి 15వ సారి జైలు పంపే పనిలో పోలీసులు ఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నరసరావుపేట టౌన్: ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకున్న హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ షేక్ ఫిరోజ్ ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజెండ్ల మండలం దాట్లవారిపాలెం గ్రామానికి చెందిన గొట్టం నాగిరెడ్డి (36) ఆర్టీసీ బస్టాండ్‌లో నిద్రిస్తుండగా ఈ నెల 16న అతనిపై మాచవరం మండలం చెన్నయపాలెం గ్రామానికి చెందిన భీమవరపు వెంకటేశ్వరరావు కర్రతో దాడి చేసి హత్య చేశాడు. మృతుడు, నిందితుడు ఇద్దరూ పట్టణంలో యాచిస్తూ రాత్రుళ్లు ఆర్టీసీ బస్టాండ్‌లో నిద్రిస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా మృతుడు నాగిరెడ్డి, నిందితుడు వెంకటేశ్వరరావును మద్యం సేవించేందుకు డబ్బుల కోసం వేధిస్తూ అనేక మార్లు దాడికి పాల్పడ్డారన్నారు. దీంతో కక్ష పెంచుకొని అతనిపై విచక్షణ రహితంగా దాడి చేయటంతో నాగిరెడ్డి మృతి చెందాడన్నారు. హత్యకు ఉపయోగించిన కర్రను, రక్తపు మరకల దుస్తులను నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. పర్చూరు(చినగంజాం): మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న తొమ్మిదో జాతీయ స్థాయి నాటిక పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. కళానికేతన్ వీరన్నపాలెం డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నాటిక పోటీలు ఆద్యంతం ఉత్కంఠంగా సాగాయి. ఆదివారం రాత్రి ప్రదర్శించిన నాటిక పోటీలకు సంబంధించి యార్లగడ్డ రాజేష్, పద్మజ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా చిట్టినేని రవీంద్రబాబు, హరిచందన దంపతులు నటరాజ పూజ కార్యక్రమం నిర్వహించారు. దెబ్బ తింటున్న సంప్రదాయాలు.. ప్రదర్శనలో ముందుగు విశాఖపట్టణం తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘చిటికెన వేలు’ నాటిక అభివృద్ధి పేరుతో వస్తున్న కొత్త పుంతలకు అనుగుణంగా తమ పెద్దల చేతివేలు పట్టుకొని సాగే సంప్రదాయం దెబ్బతింది అనే సారాంశంతో సాగింది. కొండ ప్రాంతంలో జీవనం చేసే సోమన్న కుటుంబం భూమిని స్వేచ్ఛగా సాగు చేసుకొని పంటలు పండించుకుంటూ, తాగునీటి అవసరాలు తీర్చుకుంటూ పెద్దల నుంచి సంక్రమించిన భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయన తన పెద్దల చిటికెన వేలు పట్టుకొని వారి అడుగుజాడల్లో నడచిన సోమన్న ఆయన కొడుకు రెంజింను కూడా అలాగే నడిపించాడు. నాగరి కథ అభివృద్ధి పేరుతో వారి మనవడు కొత్త పుంతలను ఆహ్వానించాడు. తండ్రి చిటికెన వేలు విడిచి ప్రభుత్వాధికారులకు తన భూమి హక్కులను, చిటికెన వేలు కూడా సమర్పించుకున్నాడనేది సారాంశం. ‘జనరల్ బోగీ’ల్లో ఎన్నో కష్టాలు.. రెండో ప్రదర్శన కొలకలూరు శ్రీసాయి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘జనరల్ బోగీలు’ అనే నాటిక రైలులో జనరల్ బోగీల్లో సామాన్యులు ఎదుర్కొనే సమస్యలను గురించి కొనసాగింది. రైలులో జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికుల అవస్థలు గురించి తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక. రైలులో జనరల్ బోగీలలో ప్రయాణించే వారి వివరాలు రైల్వే వాళ్ల దగ్గర ఉండవు. ప్రమాదం జరిగిన సందర్భాలలో వారి కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ సాగిన నాటిక. మూడో నాటిక దీపం కింద ‘చీకటి’ అనే నాటికను వీరన్నపాలెం గ్రామంలోని నటులు ప్రదర్శించారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గోరంట్ల యమునా కుమార్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జెట్టి హరిబాబు ఆహ్వానం పలుకగా ముఖ్య అతిథిగా కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరి సత్యనారాయణ, గౌరవ అతిథులుగా పేర్ని వీరనారాయణ, గోరంట్ల రమేష్, యార్లగడ్డ రజిని, కొల్లా వెంకట్రావు, దండమూడి ఏలీషా చౌదరి, కఠారి రమేష్ నాయుడు పాల్గొనగా కళానికేతన్ కార్యదర్శి కొల్లా శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. -
యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలి
ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తాడేపల్లి రూరల్: యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో–క్రికెట్ ముద్దు బ్రో అనే నినాదంతో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో సుమారు 40 వేల ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఒత్తిడిని అధిగమించడానికి, విజయాలను సాధించడానికి క్రీడలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. టోర్నమెంట్లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ కె.నగేష్‌బాబు, డీఎస్పీ ఏపీ పోలీస్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎ.శాంతిరాజు, శ్వాస ఆర్గనైజేషన్ ప్రతినిధి డాక్టర్ అనిత జ్యోతి పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన వేంకటేశ్వర బాల కుటీర్ పాఠశాలలో జరుగుతున్న మెన్ అండ్ విమెన్ టీమ్ చాంపియన్ షిప్– 2026 పోటీలు ఆదివారం ముగిశాయి. పురుషుల విభాగంలో ఆద్యంత రామన్ నాయుడు, కేజీ అఖిల్, కె.హర్షవర్ధన్, ముక్కుపాటి చేతన్, ఉమెన్ విభాగంలో తేజ అనూష తన్నీరు, జయ అహల్య తన్నీరు, అనన్య గొల్లపల్లి, కంచర్ల అంజుశ్రీలు విజయం సాధించారు. పోటీల నిర్వాహకుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ గెలుపొందిన ఎనిమిది మంది రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారన్నారు. విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీంద్రరాజు, బాలకుటీర్ సీఏఓ దుర్గా రఘురామ్, ప్రిన్సిపాల్ సుధామాధవి బహుమతులు ప్రదానం చేశారు. అర్బిటర్‌గా అనిల్ వ్యవహరించారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కర్నూలులో ఈ నెల 24న జరిగే 12వ సీనియర్ రాష్ట్ర స్థాయి ఈత పోటీలకు గుంటూరు జిల్లా నుంచి పది మంది బాల బాలికలు ఎంపికయ్యారని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ ఖాజామొహిద్దీన్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మెహబూబ్ షంషేర్ ఖాన్ మెమోరియల్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కోచ్ నాంచారమ్మ, నాగేశ్వరరావుల పర్యవేక్షణలో గుంటూరు జిల్లా జట్టు ఎంపిక చేశామన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు గుంటూరు జిల్లా నుంచి సీహెచ్ గౌతమ్, మేదర నాగచైతన్య, బి.నాగ చైతన్య, బి.స్వర్ణసుజిత్, కే అభినవసాగర్, అకిశెట్టి విష్ణుదేవరాయలు, షేక్ నస్రిన్, షేక్ నజరీన్, లక్ష్మీపావని, జి.జాన్వీలు ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బ్రస్ట్ స్ట్రోక్, బటర్ ఫ్లై విభాగాలలో ఎంపికై నట్లు వెల్లడించారు. బాపట్ల: ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం బాపట్ల జిల్లా కేంద్రంలో భద్రపరిచిన ఈవీఎంల గోదామును జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్‌తో కలసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ గోదాం వద్ద నిరంతర నిఘా ఉంటుందన్నారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్ షేక్ సలీమా, ఎన్నికల పర్యవేక్షకులు షఫీ తదితరులు పాల్గొన్నారు. -
ఔత్సాహిక నటీనటులకు శిక్షణ ఒక వరం
తెనాలి: ఔత్సాహిక నటీనటులకు నటశిక్షణ ఒక వరమని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస నాయక్ అన్నారు. మా–ఏపీ ఆధ్వర్యంలో గత మూడురోజులుగా స్థానిక అంబేడ్కర్ కాలేజీలో జరిగిన సినీనటన శిక్షణ తరగతులు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముగింపు సభకు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్‌రాజా అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి శ్రీనివాసనాయక్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఔత్సాహికులు సినిమా నటనపై కనీస అవగాహనకు రాగలిగామని చెప్పటంతో సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రలో సినీపరిశ్రమ అభివృద్ధి కోసం దిలీప్‌రాజా చేస్తున్న ప్రయత్నాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని చెప్పారు. అవసరమైన చర్చల సందర్భంలో మా–ఏపీకి ఆహ్వానం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మూడురోజుల నటశిక్షణ తీసుకున్న 60 మందికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఆడిషన్ల పేరుతో, కార్డుల పేరుతో డబ్బులు వసూలుచేస్తున్న సంఘాల పట్ల ఔత్సాహికులు అప్రమత్తంగా ఉండాలని దిలీప్‌రాజా సూచించారు. డీఓపీ మైనేని హరిప్రసాద్, మహిళా దర్శకురాలు నాగశ్రీ, శకనాల చంద్రశేఖర్, స్టయిల్ రవి, పాత్రుడు, వర్మ, జాలా రాజకుమారి, బాషా తదితరులున్నారు. -
పాస్‌పోర్ట్ అప్పగించిన మాజీ మంత్రి రజిని
నరసరావుపేట టౌన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి విడదల రజిని తన పాస్‌పోర్ట్‌ను ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో అందజేశారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి విడదల రజినిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తప్పుడు కేసును కొట్టివేయాలని ఆమె రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, ప్రతి ఆదివారం చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెట్టటంతోపాటు పాస్‌పోర్ట్‌ను విచారణ అధికారి అయిన డీఎస్పీకి అప్పగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో విడదల రజిని మొదట చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెట్టారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్పీ ఎం.హనుమంతరావుకు పాస్‌పోర్టును అందజేశారు. ఆమె వెంట మైనార్టీ నాయకుడు దరియావలి, న్యాయవాది నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
నిరసనకు సిద్ధం
‘పెట్రో’భారంపై సత్తెనపల్లి: సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు ఇచ్చిన హామీలు అంతా మోసమేనని తేలుతోంది. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని అప్పట్లో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ధరలు తగించకపోగా పెంచుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీల పెంపు, గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. యుద్ధ సంక్షోభాన్ని బూచిగా చూపుతూ పాలకులు మంట పెట్టారు. లీటర్ పెట్రోల్‌పై రూ. 3.35, డీజిల్‌పై రూ.3.16 చొప్పున ధర పెంచడంతో ప్రత్యక్షంగా వాహనదారులపై ఆ భారం పడింది. పరోక్షంగా నిత్యావసర వస్తువులు సహా అన్ని రకాల సామగ్రిపై పడుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ తీరుపై సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రూ.కోట్లల్లో భారం జిల్లావ్యాప్తంగా 194 పెట్రోల్, డీజిల్ బంకులు (ఫిల్లింగ్ స్టేషన్లు) ఉన్నాయి. రోజుకు జిల్లాలో 4.20 లక్షల లీటర్ల డీజిల్, 2.35 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెరిగిన ధరలతో జిల్లాలో పెట్రోల్ లీటరు రూ.113కు చేరింది. డీజిల్ రూ. 100.69కి పెరిగింది. ఆ ప్రకారం నెలకు మొత్తం దాదాపు రూ.6.34 కోట్ల మేర భారం అదనంగా పడుతోంది. మరోవైపు దాదాపు అన్ని రంగాలపై ఈ ప్రభావం కనిపిస్తోంది. ప్రధానంగా రవాణా రంగాన్ని ఈ పెంపు నిర్ణయం సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యావసరాలు, వంటనూనెలు, కూరగాయలు, ఇలా అన్ని రకాల వస్తువులను రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి దిగుమతి, ఎగుమతి చేస్తుంటారు. ఇంధన ధరల పెంపుతో వీటి ధరలు పెరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి గత నెలలో వినియోగదారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. వారం రోజులపాటు పెట్రోల్, డీజిల్ అమ్మకాలను రేషన్ విధించారు. వరి కోతలపై ప్రభావం పడి రైతులు సకాలంలో పనులు చేయలేకపోయారు. ఫలితంగా అకాల వర్షాలతో కొంత నష్టపోయారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై వైఎస్సార్ సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిరసన చేపట్టనున్నారు. ఆర్డీవోలు, తహసీల్దారులకు వినతి పత్రాలు అందించనున్నారు. ఎన్నికలకు ముందు కూటమి... తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు విస్మరించింది. ధరలు మరింతగా పెంచడం ద్వారా సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై భారం మోపడంతోపాటు రైతులు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు. -
రాకెట్ వేగంతో ముంచేశాడు!
సాక్షి, నరసరావుపేట: అతడు నోరు విప్పితే రాకెట్, నాసా, ఇస్రో, సోలార్ సిస్టమ్, స్విస్ బ్యాంక్, టాక్స్ ఫ్రీ... వంటి పదాలను అలవోకగా మాట్లాడుతుంటాడు. ఇవన్నీ చూసి ఏ నాసా శాస్త్రవేత్తో అనుకుంటే వేలాది మంది బాధితుల జాబితాలో మీరూ చేరినట్టే. అతనో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయని ఆర్థిక నేరస్థుడు. ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకొని ఎదగాలనుకునే మనస్తత్వం అతినిది. అతనే చిలకలూరిపేట రూరల్ మండలం గొట్టిపాడుకు చెందిన నాగండ్ల వెంకట్రావు. మొదట్లో ఆటో డ్రైవర్‌గా పనిచేశాడు. ఇలా రూ.కోట్లు సంపాదించలేమని అనుకున్నాడో ఏమో.. తనకు పరిచయమైన కొందరు కేటుగాళ్లతో కలసి రాకెట్ ల్యాబ్ పేరిట కొత్త దందాకు తెరదీశాడు. దండుకోవడమే పని రూ.10 వేలు కడితే రూ.10 కోట్లు ఖాతాలో వేస్తామంటూ నమ్మించాడు. సింగపూర్ బ్యాంక్ ఖాతాలో రూ.3 లక్షలు జమ అయ్యాయని, వాటిని తీసుకోవాలంటే ఈ– కేవైసీతోపాటు మరో రూ.3,500 కట్టాలంటూ ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకొని మరికొంత దండుకునే ప్రయత్నం చేశాడు. అతని కుమారుడు వంశీ, పీఏ నీరజల సహాయంతో మూడు రోజుల క్రితం నరసరావుపేట ఎస్ఆర్కేటీ కాలనీలో రాకెట్ ల్యాబ్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ సమాచారంతో శనివారం నరసరావుపేట రూరల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదుతో వెంకట్రావు, వంశీ, పీఏ నీరజలపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కిషోర్ తెలిపారు. అప్పుడే అప్రమత్తమై ఉంటే... నాగండ్ల వెంకట్రావు తొలుత స్వగ్రామం గొట్టిపాడులో నాసా పేరుతో ఇదే తరహా మోసానికి పాల్పడ్డాడు. ఇందులో ఓ 20 మంది ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారి నుంచి రూ.2 లక్షల వరకు వసూల్ చేసి మోసం చేశాడు. దీనిపై వెంకట్రావుపై అదే గ్రామానికి చెందిన చప్పిడి బాలస్వామి ఫిర్యాదుతో ఈ ఏడాది మార్చి 9వ తేదీన చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులకు ఇవ్వాల్సిన నగదు వెనక్కి ఇచ్చిన వెంకట్రావు ఫిర్యాదుదారులపై కౌంటర్ కేసులు, మీడియా సమావేశాలతో బెదిరింపులకు దిగాడని సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులపై సైతం వెంకట్రావు బెదిరింపులకు దిగినట్టు తెలిసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారించి అతడి ఆట కట్టించి ఉంటే నరసరావుపేటలో రాకెట్ ల్యాబ్ పేరుతో మరోసారి ఇలా మోసానికి దిగేవాడు కాదని బాధితులు వాపోతున్నారు. చిలకలూరిపేట, నరసరావుపేటలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో వేల సంఖ్యలో రాకెట్ ల్యాబ్ బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారనే సమాచారం తెలుసుకున్న కొందరు బాధితులు కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి ఫోన్లు చేస్తున్నారు, తాము వచ్చి వెంకట్రావు మోసాలపై ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఇంత జరిగినా పోలీసు విచారణలో వెంకట్రావు మాత్రం తాను నిజాయతీపరుడినేనని చెబుతున్నట్లు సమాచారం. చందాదారులు అనవసరంగా హైరానా పడ్డారని, స్విస్ ఖాతాలలో తప్పకుండా నగదు జమ అవుతాయని చెప్పారు. కేరళ నుంచి తమ భాగస్వామి వచ్చి మొత్తం వివరిస్తాడని నమ్మబలుకుతున్నాడట. ఏది ఏమైనా ఇప్పటికే పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో యూపిక్స్ స్కాం, సాయిసాధన చిట్‌ఫండ్స్ స్కాంలతోపాటు పలువురు వ్యాపారులు ఐపీ పెట్టడంతో గతేడాదిగా వరుస ఆర్థిక మోసాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు గట్టిగా వ్యవహరించకపోతే మరింత మంది బాధితులు నష్టపోయే ప్రమాదముంది. -
నేడు మామిళ్లపల్లికి జోగి రమేష్ రాక
పొన్నూరు: మండలంలోని మామిళ్ళపల్లి రైతులపై టీడీపీ నాయకులు దాడి చేసి అక్రమ కేసులు బనాయించిన నేపథ్యంలో రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు సోమవారం మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు జోగి రమేష్ విచ్చేస్తున్నారని పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. చేబ్రోలు: కలుషిత ఆహారం తినటంతో చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం పాత దళితవాడలో ప్రబలిన డయేరియా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు వైద్యాధికారులు ఆదివారం ప్రకటించారు. స్థానిక తెలుగు బాప్టిస్టు చర్చిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపునకు ఒక్క డయేరియా కేసు కూడా రాలేదని వైద్యాధికారులు తెలిపారు. జ్వరం కేసులు మాత్రం నాలుగు వచ్చినట్లు వివరించారు. అస్వస్థతకు గురైన బాధితులందరూ పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన వారికి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లును అందజేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలియజేశారు. చేబ్రోలు, వేజండ్ల, పరిసిర ప్రాంతాలకు చెందిన వైద్యాఽధికారులు, సిబ్బంది వైద్య సేవలు అందజేశారు. వట్టిచెరుకూరు, చేబ్రోలు ప్రాంతాలకు చెందిన రెండు 108 వాహనాలను మెడికల్ క్యాంపు వద్ద అందుబాటులో ఉంచారు. పరిస్థితి సాధారణ స్థితికి రావటంతో సోమ, మంగళవారాల్లో మెడికల్ క్యాంపును తీసివేసే అవకాశం ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. ఇంకొల్లు(చినగంజాం): ఆటో హ్యాండిల్ అదుపు తప్పడంతో పంట కాలువలోకి దూసుకెళ్లి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామానికి చెందిన అన్నపురెడ్డి ముసలయ్య (58) తన ఆటోలో ఒంగోలు నుంచి ఇంకొల్లు గ్రామానికి కొబ్బరి బొండాల లోడుతో వస్తున్నాడు. మరికొద్ది సేపట్లో ఇంకొల్లు చేరుకునే క్రమంలో కొణికి గ్రామం దాటిన తరువాత అతని ఆటో హ్యాండిల్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దాంతో ముసలయ్య ఆటోను నియంత్రించలేకపోవడంతో ఆటో పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటో నీటిలో బోల్తా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 30 ఏళ్లుగా ముసలయ్య ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. భార్య వెంకటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జీ సురేష్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి పోస్టుమార్టం నిమిత్తం చీరాల వైద్యశాలకు తరలించారు. ముగ్గురికి తీవ్రగాయాలు కారంచేడు: ఆటోను కారు ఎదురుగా ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ ప్రధాన రహదారిలో కారంచేడు అంబేడ్కర్ కాలనీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. చీరాల మండలం పాత చీరాలకు చెందిన ఒక కుంటుంబ ఆటోలో ఏడుగురితో కలిసి పల్నాడు జిల్లా కోటప్పకొండ దైవ దర్శనం కోసం చేసుకొని తిరిగి చీరాల వస్తున్నారు. ఈ క్రమంలో చీరాల వైపు నుంచి పర్చూరు వైపునకు వస్తున్న కారు కారంచేడు అంబేడ్కర్ కాలనీ సమీపంలో వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 సిబ్బంది చీరాల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చీరాల: చీరాల ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్‌పై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. స్థానిక జయంతిపేటకు చెందిన వాసిమళ్ల హరీష్ చీరాల ఆర్టీసీ డిపోలో హైర్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌లోకి వస్తుండగా చీరాల మండలం కీర్తివారిపాలేనికి చెందిన చుక్క సుబ్రహ్మణ్యం, ఏలిక రమేష్‌లు హరీష్ వద్దకు వచ్చి ఒక మహిళతో తనకు అక్రమ సంబంధం ఉందనే నెపంతో తనను చంపాలని ఉద్దేశంతో తనతో గొడవపడ్డారన్నారు. ఈ క్రమంలో ఇరువురు కులం పేరుతో దూషించారని, రమేష్ తనను కిందకు పడవేయగా సుబ్రహ్మణ్యం కత్తితో కడుపులో పొడిచారన్నారు. చుట్టుపక్కల వాళ్లు కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యారన్నారు. చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా అవుట్‌పోస్టు పోలీసులు క్షతగాత్రుడి వద్ద నుంచి వివరాలను నమోదు చేసుకున్నారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. -
మూడోసారీ మారువేషంలో..
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ శనివారం అర్థరాత్రి మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. తలపాగా పెట్టుకుని, ముఖానికి మాస్క్ ధరించి, సాధారణ వ్యక్తి మాదిరిగా పలు వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. డాక్టర్ యశస్వి రమణ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా 2024 అక్టోబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రిలో పలు సమస్యలు ఉన్నాయని, వాటిని ఆస్పత్రి అధికారులు పరిష్కరించలేకపోతున్నారని మీడియాలో వరుసగా కథనాలు రావటంతో 2025 నవంబర్‌లో బిచ్చగాడి వేషం ధరించి రాత్రిళ్లు ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. మళ్లీ రెండోసారి 2025 డిసెంబర్లో మార్చురీ విభాగం వద్ద డబ్బులు తీసుకుంటున్నారని మీడియాలో కథనాలు రావటంతో మారు వేషంలో మార్చురీ వద్ద తనిఖీలు చేశారు. నేడు తాజాగా మూడోసారి ఆస్పత్రిలో మారు వేషంలో తనిఖీలు చేశారు. మూడుసార్లు మారువేషాల్లో తనిఖీలు చేసినా ఆయనకు ఏ విధమైన లోపాలు కనిపించకపోవటం, ఆస్పత్రిలో అందరూ విధుల్లో ఉండటం, రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోవటం వంటి విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మారు వేషం వేసిన ప్రతిసారి సోషల్ మీడియాలో దానిని పోస్ట్ చేసి ఆయన వైరల్ అయ్యారే తప్పా రోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. మూడుసార్లు తూతూ మంత్రమే.. సాధారణంగా ఆస్పత్రిలో రాత్రిళ్లు విధుల్లో కొంత మంది వైద్య సిబ్బంది, వైద్యులు ఉండరనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీ అసిస్టెంట్ సర్జన్, డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్లు అందుబాటులో ఉండరనేది నగ్నసత్యం. ఒకవేళ ఎవరైనా బాధితులు చికిత్స కోసం వచ్చి ఎమర్జెన్సీ వార్డుల్లో మరణిస్తే దానిని ధ్రువీకరించి డ్యూటీ అసిస్టెంట్స్ డాక్టర్స్, సర్జన్స్ సంతకాలు చేయాల్సి ఉంది. కాని వీరు ఉండకపోవటంతో పీజీ వైద్యులతో సంతకాలు చేయించటం లేదా కొన్ని సార్లు ఉదయం డ్యూటీ డాక్టర్స్ వచ్చే వరకు భౌతిక కాయాలను ఉంచి సంతకాలు చేయించి తరలిస్తున్నట్లు ప్రతి ఒక్కరు చెవులు కొరుక్కుంటున్నారు. కాని సూపరింటెండెంట్ తనిఖీలు ఇలాంటి లోపాలు ఏమీ కనిపించలేదు. ఆయన తనిఖీలు చేసిన శనివారం, ఆదివారం సమయాల్లో సాధారణంగా పెద్ద డాక్టర్స్ రాకుండా జూనియర్స్పైనే పని వదిలి వెళ్లటం ఇక్కడ పరిపాటే. శనివారం రాత్రి వేళల్లో సూపరింటెండెంట్ తనిఖీలు చేసిన సమయంలో అందరూ విధుల్లో ఉన్నారనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మారువేషాల్లో తన సొంత పబ్లిసిటీ కోసం తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఎలాంటి తప్పిదాలను గుర్తించలేదు. ఎవరిపైనా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. -
ఖాతార్నాక్ సమస్యలు
ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026 ఖాతా తెరుచుకోవాలంటే ఎఫ్ఐఆర్ నమోదైన పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాల్సిందే బెట్టింగ్, ఆన్లైన్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్ నిందితుల వలలో అమాయకులు కేసు మూలాలు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో మరిన్ని వెతలు ఏటీఎం కేంద్రాల వద్ద నగదు మార్పిడి సమయంలో మోసాలకు ఆస్కారం నరసరావుపేటలోని ఓ బిర్యానీ సెంటర్‌కు పది రోజుల క్రితం ఓ వ్యక్తి వచ్చి బిర్యానీ తిన్నాడు. రూ.220 బిల్లు చెల్లించాడు. నాలుగు రోజుల తరువాత ఆ హోటల్ నిర్వాహకుడి బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యింది. స్థానిక అరండల్‌పేటలోని బ్యాంక్‌కు వెళ్లి దీనిపై ఆరా తీయగా ఆన్లైన్ క్రికెట్ యాప్ వినియోగించే బుకీ ఖాతా నుంచి ఈ లావాదేవీ జరిగిందని అధికారులు తెలిపారు. నిత్యం వందల మంది హోటల్‌కు వచ్చి తిని ఫోన్ పే చేస్తుంటారని, వారేం చేస్తారో ఎలా తెలుస్తుందని యజమాని వాపోయారు. తనకు రూ.220 బిర్యానీ నిమిత్తం జమ అయ్యిందని, బుకీతో సంబంధలేదంటూ లెటర్లు మీద లెటర్లు ఇస్తే రెండు నెలల తరువాత ఖాతా అందుబాటులోకి వచ్చింది. ఇలా ఎందరో అమాయకులకు సైబర్ నేరాలు, క్రికెట్ బుకీలతో సంబంధం లేకపోయినా ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి. -
వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించకుండా చూడాలి
నరసరావుపేట: ఓటర్ల క్రమబద్ధీకరణ ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించకుండా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) పనిచేయాలని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రామిరెడ్డిపేటలోని ఓ ఫంక్షన్ హాలులో బీఎల్ఏల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం డాక్టర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చే నెల నుంచి ‘సర్’ ద్వారా ఓటర్ లిస్టుల ప్రక్షాళన మొదలు పెట్టబోతుందని అన్నారు. పార్టీ వారికి చెందిన ఓట్లు తొలగింపునకు గురికాకుండా చూసుకోవాలన్నారు. పార్టీ శ్రేణులు, పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఒక టీంగా ఏర్పడాలని సూచించారు. రాష్ట్ర బూత్ లెవెల్ ఏజెంట్ల కన్వీనర్ రవీంద్రారెడ్డి వీడియా ప్రజంటేషన్ ద్వారా సర్ కార్యక్రమం గురించి వివరించారు. ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, నరసరావుపేట, రొంపిచర్ల మండలాల కన్వీనర్లు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, తన్నీరు శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గంటెనపాటి గాబ్రియేలు, ఎన్కే ఆంజనేయులు, పాలపర్తి వెంకటేశ్వరరావు, కనకా పుల్లారెడ్డి, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, పట్టణ వర్కింగ్ అధ్యక్షుడు అచ్చిశివకోటి, గడ్డం వెంకటరావు పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ... సత్తెనపల్లి: ‘సర్’పై బూత్ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ జోనల్ ఇన్చార్జ్ కందుల రవీంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సదస్సుకు సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి అధ్యక్షత వహించారు. నియోజకవర్గ పరిశీలకుడు రేపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి బూత్ కమిటీ సభ్యుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందుగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వలంటీర్ల వింగ్ జిల్లా అధ్యక్షుడు ఎం. ఉమామహేశ్వరరరెడ్డి, జిల్లా బూత్ అధ్యక్షుడు ఇందూరి నరసింహారెడ్డి, నియోజకవర్గ బూత్ అధ్యక్షుడు కాల్వపల్లి బ్రహ్మారెడ్డి వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ మౌలాలి, రాయపాటి పురుషోత్తమ రావు, నక్కా శ్రీనివాసరావు, రాజారపు శివనాగేశ్వరరావు, కొర్లకుంట వెంకటేశ్వర్లు, సయ్యద్ గోరా, మేడ ప్రవీణ్ కుమార్ రెడ్డి, వాకుమళ్ల చెంచిరెడ్డి, యర్రం పున్నారెడ్డి, రసూల్, ఆదినారాయణ, సాంబ శివరావు పాల్గొన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లను సమన్వయం చేసుకొని సర్ నిర్వహించాలి పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ పార్టీ శ్రేణులకు గజ్జల దిశానిర్దేశం -
రూ.10 వేలు కొట్టు.. రూ.10 కోట్లు పట్టు
● గిఫ్ట్ మనీ పేరుతో నయా మోసం ● నరసరావుపేటలో కార్యాలయం ప్రారంభం ● స్థ్ధానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ● పోలీసుల విచారణతో వెలుగుచూసిన భారీ స్కాం ● పోలీసుల అదుపులో నిర్వాహకుడు వెంకట్రావు ● పలు రాష్ట్రాల్లో ఇదే తరహా మోసాలు నరసరావుపేట రూరల్: పది వేలు చెల్లిస్తే పది కోట్లు ఇస్తామంటూ స్కీమ్‌ను ప్రారంభించి అమాయక ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని నరసరావుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ శివారు ప్రాంతమైన కేసానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్టీ నగర్లో రెండు రోజుల క్రితం చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగండ్ల వెంకట్రావు కార్యాలయాన్ని ప్రారంభించాడు. వెంకట్రావు కోకోనట్ మర్చంట్ పేరుతో ప్రారంభించిన కార్యాలయానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో స్కీమ్‌లో సభ్యుల నుంచి నిర్వాహకులు ఈకేవైసీ తీసుకుంటున్నట్టు సేకరిస్తున్నట్టు గుర్తించారు. గిఫ్ట్ మనీ పేరుతో టోకరా.. రాకేట్ ల్యాబ్ పేరుతో వెంకట్రావు గత కొంతకాలంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గిఫ్ట్ మనీ స్కీమ్‌ను నిర్వహిస్తున్నాడు. స్కీమ్‌లో చేరిన సభ్యులు మొదటగా రూ.10 వేలు చెల్లిస్తే రూ.10 కోట్లు వరకు లబ్ధిపొందవచ్చని నమ్మబలుకుతున్నాడు. తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశతో అధిక సంఖ్యలో స్కీమ్‌లో సభ్యులుగా చేరుతున్నారు. ఇందుకోసం 500 మంది వరకు ఏజెంట్లు ఈ స్కీమ్‌లో పనిచేస్తున్నారు. వీరంతా కలిసి దాదాపు నాలుగు వేల మందిని స్కీమ్‌లో సభ్యులుగా చేర్చినట్టు తెలుస్తుంది. స్కీమ్‌లో చేరి రూ.10 వేలు చెల్లించిన నాలుగు రోజుల తరువాత సింగపూర్‌లో వారి పేరుపై అకౌంట్ ప్రారంభించి రూ.3 లక్షలు జమ చేసినట్టు నమ్మించేందుకు నకిలీ సందేశాలు పంపుతారు. నెల రోజుల తరువాత రూ.10 కోట్లు జమ చేస్తామని నమ్మబలికి ఇప్పటికే రూ.కోట్లులో వసూలు చేసినట్టు సమాచారం. బ్లాక్ మనీనీ వైట్‌గా మార్చే పేరుతో.... పిడుగుపాటు వలన ఏర్పడే ఖోగోళిక పదార్థం అమ్మడం వలన లక్షల కోట్లు వచ్చాయని, బ్లాక్ మనీనీ వైట్ చేసే క్రమంలో పేదలకు సాయం చేస్తున్నట్టు వెంకట్రావు తెలపడంతో పోలీసులు విస్తుపోయారు. సభ్యులుగా చేరిన వారి అకౌంట్లో రూ.10 కోట్లు జమ చేసి అందులో సగం తాము తీసుకోవడం ద్వారా వైట్‌మనీగా మార్చుతున్నట్టు వివరించాడు. ఇందుకోసం సింగపూర్‌లో అకౌంట్ తెరిచేందుకు సభ్యుల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్టు తెలిపాడు. ఈ స్కీమ్ వెనుక పెద్దల ప్రేమేయం ఉందని నిర్వాహకుడు చెప్పుకొస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో పాటు రెవెన్యూ, పోలీసు, న్యాయాధికారులు తమకు అండగా ఉన్నారంటూ పోలీసులను బెదిరించాడు. వెంకట్రావు మాటలపై అనుమానంతో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఇదంతా బోగస్‌గా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. స్కీమ్ నిర్వాహకుల్లో ఒకరు కేరళలో ఉన్నారని, ఆతన్ని కూడా విచారించిన తరువాత చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బారావు తెలిపాడు. చిలకలూరిపేటతో పాటు పలు చోట్లు వెంకట్రావు మోసాలపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. -
అక్రమాలకు ‘సహకారం’
● అన్నవరం పీఏసీఎస్‌లో అవినీతిపై ఫిర్యాదులు ● విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ ● వెలుగులోకి సీఈవో శ్రీనివాసరావు అక్రమాలు, వేధింపులు ● సీఈవో వైఖరితో ఉద్యోగి ఆత్మహత్య ● విచారణ నిలిపివేయాలని సహకార మంత్రికి ఎమ్మెల్యే లేఖ ● అంగీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు ● పాలకుల తీరుపై అన్నదాతల తీవ్ర ఆగ్రహం నరసరావుపేట టౌన్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సదస్సు నిర్వహించారు. సమాధాన్ సమరోహ 2026లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జియావుద్దీన్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నవారు ఆగస్టు 21, 22, 23 తేదీలలో జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని కోరారు. దీనికోసం ఈ నెల 31వ తేదీలోపు నిర్దేశిత గూగుల్ ఫారం పూరించి తమ అంగీకారం తెలియజేయాలన్నారు. ప్రజల అవగాహన కోసం ముద్రించిన ప్రత్యేక కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఏపీపీ కట్ట కాళిదాస్, మొదటి పట్టణ సీఐ షేక్ టి.ఫిరోజ్, ట్రాఫిక్ సీఐ లోకనాథం, ఎస్ఐ వంశీకృష్ణ, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, పలువురు ప్రజలు పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షలో పల్నాడు జిల్లా 87.30 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఐసెట్ ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 511 మంది నమోదు కాగా పరీక్షకు 449 మంది హాజరయ్యారు. వీరిలో 392 మంది అర్హత సాధించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 201 మంది పురుషులు, 191 మంది మహిళలు ఉన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో చేరేందుకు అర్హులు. పథకాలను మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోండి మాచర్ల రూరల్: మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగపర్చుకోవాలని సైనిక సంక్షేమ ఉమ్మడి జిల్లా శాఖాధికారి ఆర్.గుణశీల కోరారు. శనివారం పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబాల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుందని సాగు భూమితో పాటు పిల్లల చదువులలో రిజర్వేషన్, క్యాంటీన్లో సబ్సిడీపై అందించే వివిధ వస్తువులను సకాలంలో తీసుకోవాలని కోరారు. విద్యకు స్కాలర్షిప్, కుమార్తె వివాహానికి నగదు, వైకల్య గ్రాంటు, ఈసీహెచ్ఎస్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలను అందుకోవాలన్నారు. మృతిచెందిన మాజీ సైనికుల భార్యలకు గుర్తింపు కార్డులను అందించారు. ఇటీవల అంగవైకల్యం పొందిన ఇన్నారెడ్డి గృహానికి వెళ్ళి పరామర్శించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కేపీ సిద్ధంరాజు, ప్రధానకార్యదర్శి తాటి వినోద్‌బాబు, కోశాధికారి ఆర్ గోపాల్ నాయక్, ఉపాధ్యక్షులు వి.మరియదాసు, సభ్యులు కారంకి శ్రీనివాసరావు, రామారావు, పి.బాబు, ఇన్నారెడ్డి, శేఖర్, రవి పాల్గొన్నారు.పొన్నూరు: మామిళ్లపల్లి రైతులపై టీడీపీ నాయకులు దాడి చేసి అక్రమ కేసులు బనాయించిన నేపథ్యంలో రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదివారం రానున్నారని పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు మామిళ్లపల్లి అడ్డరోడ్డు నుంచి మామిళ్లపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. లక్ష్మీపురం: ఓ ఇంట్లో 25 సవర్ల బంగారం, రూ.2.50 లక్షల నగదు చోరీ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. ముత్యాలరెడ్డినగర్ 8వ లైన్ ప్రాంతానికి చెందిన దుగ్గెంపూడి ప్రభాకర్‌రెడ్డి కన్స్ట్రక్షన్ పని చేస్తుంటారు. భార్య భూలక్ష్మి ఇంటి వద్దనే ఉంటుంది. ఇంట్లో బీరువాలో ఉన్న 25 సవర్ల బంగారం, అలాగే బీరువాలో ఉన్న రూ.2.50 లక్షల నగదు కనిపించలేదు. దీన్ని గమనించిన ప్రభాకర్‌రెడ్డి ఆయన సతీమణి భూలక్ష్మి, ఇంట్లో పని చేసే మహిళపై అనుమానం వ్యక్తం చేశారు. బాధితులు అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసరావుపేట రూరల్: అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన అవినీతిపై జరుగుతున్న విచారణను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. మూడు దశాబ్దాలుగా అన్నవరం సొసైటీలో తిష్ట వేసిన వ్యక్తి అందినకాడికి దండుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డాడు. వాటిని తట్టుకోలేక గుమస్తా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో మహిళా ఉద్యోగిని కూడా జీతాలు ఇవ్వకుండా వేధించాడు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగి.. సొసైటీలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని విన్నవించారు. దీంతో అక్రమాల డొంక కదిలింది. దీనిని ఆదిలోనే ఆపాలని సదరు ఉద్యోగి ఏకంగా కూటమి ఎమ్మెల్యేతో ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో విచారణను ప్రభుత్వం నిలిపివేసింది. రొంపిచర్ల మండలం అన్నవరం పీఏసీఎస్ అవినీతిపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు పలు మార్లు ఫిర్యాదులు అందాయి. సొసైటీ పరిధిలోని రైతులతోపాటు సిబ్బంది సైతం అవినీతి గురించి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్... జిల్లా సహకార అధికారిని విచారణకు ఆదేశించారు. సొసైటీ రికార్డులను పరిశీలించి రైతులను అధికారులు విచారించారు. పీఏసీఎస్‌లో అవినీతి నిజమేనని నిగ్గు తేల్చారు. విచారణలో రూ.16.86 లక్షల అవినీతి జరిగిందని నిర్ధారించారు. సెక్షన్ 52 ప్రకారం పూర్తి స్థాయి విచారణకు జిల్లా సహకార అధికారి నాగరాజు ఈ ఏడాది మార్చి 30వ తేదీన ఆదేశించారు. పీఏసీఎస్ సీఈవోగా పనిచేస్తున్న దొప్పలపూడి శ్రీనివాసరావు అవినీతిలో కీలక సూత్రధారి అని అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. శ్రీనివాసరావు భార్య ఉషారాణిని సొసైటీ ఉద్యోగినిగా చూపిస్తూ 2014–19 కాలానికి రూ.6.12 లక్షలు వేతనంగా డ్రా చేశాడు. అయితే ఉషారాణిని కార్యాలయంలో ఎప్పుడూ చూడలేదని విచారణలో అధికారులకు రైతులు తెలిపారు. గతంలో శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయ్యాడు. ఈ కాలానికి కూడా సొసైటీ నుంచి జీతాలు, పాత బకాయిలను సొసైటీ మినిట్ పుస్తకంలోని ఖాళీ పేజీలలో నకిలీ తీర్మానాలు సృష్టించి మొత్తం రూ.8.94 లక్షలు తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. రైతు నుంచి వసూళ్లు చేసిన రూ.1.90 లక్షలను బ్యాంక్‌లో జమ చేయనట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా గతంలో సొసైటీలో పెయిడ్ సెక్రటరీగా పనిచేసిన జేపీ కుమార్‌కు ఇవ్వాల్సిన మొత్తం రూ.3.45 లక్షలను కూడా శ్రీనివాసరావు నకిలీ తీర్మానాలతో డ్రా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే చదలవాడ అండ అన్నవరం పీఏసీఎస్‌లో జరిగిన అవినీతిపై పూర్తి స్ధాయి విచారణ జరిగితే మరింత అక్రమాలు వెలుగులోకి వస్తాయని భావించిన సీఈవో శ్రీనివాసరావు... ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబును ఆశ్రయించాడు. సీఈవోపై వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని ఎమ్మెల్యే నేరుగా సహకార శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు ఏప్రిల్ 2వ తేదీన లేఖ రాశారు. దీనిపై స్పందించిన మంత్రి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్నవరం పీఏసీఎస్‌పై విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి వంతు పాడుతూ ఎమ్మెల్యే విచారణ నిలిపివేయాలని కోరడంపై రైతుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
ప్లాస్టిక్ రహిత సమాజంతో మేలు
నరసరావుపేట: ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్ లభిస్తుందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ థీమ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. రెండు కార్యాలయాల వద్ద ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ కార్యాలయంలో మొక్క నాటి నీరు పోశారు. ఆర్డీఓ కె.బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బి.రమ్యకీర్తన, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించండి జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దీనికోసం అవసరమైన ప్రతిపాదనలు, పరిష్కారాలను రూపొందించాలని సూచించారు. రీసర్వే ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక. క్షేత్రస్థాయి సమస్యలు, జాయింట్ ఎల్బీఎం, 22–ఏ, అన్ – సర్వేయిడ్ – అన్ – సెటిల్డ్ గ్రామాలు, ఎస్టేట్, ఈనాం గ్రామాల సమస్యలు, ఈనాం భూములకు సంబంధించి ఉన్న న్యాయపరమైన, రెవెన్యూ చిక్కులు, ఎండీఆర్, వెబ్ ల్యాండ్, అడంగల్ రికార్డులు, వ్యవసాయ సాగు పట్టాలు, ఇళ్ల పట్టాలు, టైటిల్ డీడ్లు తదితర అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను నిశితంగా పరిశీలించి, పరిష్కారానికి సమగ్ర నివేదికలను రూపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. వాటి పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు. -
డప్పు కళాకారులకు పింఛన్లు మంజూరు చేయాలి
అచ్చంపేట: డప్పు కళాకారులంకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ చర్మకారుల సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి గార్లపాటి దాసు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బుల్ల రాజారావు పిలుపు మేరకు శనివారం మండలంలోని చిగురుపాడు ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ డప్పు కళాకారులంతా పనులులేక దయనీయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లు నిండిన వారందరికి పింఛన్లు మంజూరు చేయాలని, నివేశన స్థలాలు లేనివారికి రెండు సెంట్లు స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే పక్కా ఇల్లు కట్టించాలని కోరారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుంచి డప్పు కళాకారులకు ఐడీ కార్డులు మంజూరు చేసి ఆర్టీసీ బస్సులలో రాయితీలు, సంక్షేమ పథకాలలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామ సచివాలయాలలో దండోరా ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు స్థాపించి, ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రెండు లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిలకా భాస్కరరావు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ శిఖా తిమోతి, ఎస్సీ సెల్ నియోజకవర్గ కన్వీనర్ తుడుం ఇమ్మానియోలు, మండల కార్యదర్శి తాళ్లూరి సైదులు పాల్గొన్నారు. -
గర్భిణుల వద్దకే వైద్యం
నరసరావుపేట టౌన్: ప్రభుత్వ ఏరియా వైద్యశాల్లో గర్భిణుల రక్త పరీక్షల కోసం పడుతున్న తీవ్ర ఇబ్బందులపై గర్భిణుల సహనానికే పరీక్ష అన్న శీర్షికతో ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. పల్నాడు బస్టాండ్ వద్ద ఉన్న పాత వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో లింగంగుంట్లలో నిర్మించిన 200 పడకల ప్రభుత్వ ఏరియా వైద్యశాల్లో 15 రోజుల క్రితం గైనిక్ విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే గ్రౌండ్‌ఫ్లోర్‌లో గైనిక్ విభాగాన్ని ఏర్పాటు చేసి రక్త, మూత్ర పరీక్షల నిర్వహణ మాత్రం మూడవ అంతస్తులో ఏర్పాటు చేశారు. ఉన్న లిఫ్ట్ సాంకేతిక సమస్యతో తరుచూ మోరాయిస్తుంది. లిఫ్ట్ సరిగ్గా పనిచేయకపోవటంతో గర్భిణులు రక్త, మూత్ర పరీక్షల కోసం మూడు అంతస్తుల మెట్లు ఎక్కుతూ నానా అవస్థలు పడుతున్నారు. మరొకరి సహాయంతో ఇబ్బందులు పడుతూ పరీక్షల కేంద్రానికి చేరుకుంటున్నారు. దీనిపై స్పందించిన వైద్యాధికారులు రక్త సేకరణ కేంద్రాన్ని గ్రౌండ్‌ఫ్లోర్‌లో శనివారం ఏర్పాటు చేశారు. ఇద్దరు సిబ్బంది అక్కడ విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. వచ్చిన గర్భిణుల వద్ద నుంచి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించారు. -
రసాయనాల కోరల్లోంచి... ప్రకృతి ఒడిలోకి
యడ్లపాడు: ఆధునిక జీవనశైలిలో మనిషి ఆరోగ్యం రసాయనాల కోరల్లో చిక్కుకుంటోంది. పళ్లెంలో వడ్డించే ప్రతి ముద్దా విషతుల్యమవుతున్న తరుణంలో ప్రత్యామ్నాయం ప్రకృతి సాగు విధానమే శరణ్యం. పల్నాడు జిల్లాలోని 527 గ్రామాల్లో ఇప్పటికే 396 గ్రామాల్లో ప్రకృతి సేద్యం వైపు రైతుల అడుగులు పడ్డాయి. జిల్లాలోని 348 రైతు సేవా కేంద్రాలలో 240 కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉండగా, మిగిలిన వాటిలో వ్యవసాయ, ఉద్యాన సహాయకులు అందుబాటులో ఉన్నారు. వీరు ఘన, ద్రవ జీవామృతాల తయారీపై ప్రకృతి సేద్యంపై ఆసక్తి చూపే రైతులకు మెలకువలు నేర్పుతున్నారు. రసాయనాల్లేని ఆహారమే అసలైన అమృత భాండాగారమని భావించిన జిల్లా యంత్రాంగం ఒక బృహత్తర సంకల్పంతో దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. కేవలం పొలాల్లోనే కాకుండా, ప్రతి ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంతో పాటు ఇంటి పెరటిని ఒక పోషక విలువల వనంగా(న్యూట్రీ, టెర్రస్ గార్డెన్) మార్చడమే ధ్యేయంగా ప్రణాళిక చేస్తోంది. ప్రకృతి సాగు జిల్లా లక్ష్యం.. జిల్లాను ప్రకృతి వ్యవసాయానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలని కలెక్టర్ కృతికా శుక్లా కృతనిశ్చయంతో ఉన్నారు. జిల్లాలో ఈ ఏడాది 82,598 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు విస్తీర్ణాన్ని చేపట్టాలని ఆ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు సుమారు 70 వేల మంది రైతులను ఈ విధానంలో భాగస్వాములు అయ్యేలా ప్రణాళిక చేసింది. వివిధ రకాల పంటలను కేవలం ప్రకృతి పద్ధతుల్లో చేసేలా వారిని చైతన్యం చేయనుంది. ఖరీఫ్ సీజన్‌కు ముందుగా పీఎండీఎస్ సాగుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రకృతి సాగులో కీలకమైన పీఎండీఎస్‌కు 30 రకాల విత్తనాలతో కూడిన 32 వేల విత్తనగుళికలను తయారు చేసి ఆయా కిట్లను ఇప్పటికే సిద్ధం చేశారు. వీటిని జిల్లాలోని 28 బయోరీసోర్సు ఇన్న్ఫుట్ సెంటర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచారు. ప్రకృతి ఎరువులు, కషాయాల తయారీపై అవగాహన పెంచేందుకు మండలస్థాయి ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. ప్రతి గ్రామానికి ఒకరు చొప్పున ఎంపిక చేసి ఈ శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
మోదీ విధానాలతో దేశంలో ఆర్థిక సంక్షోభం
నరసరావుపేట ఈస్ట్: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఆందోళన వ్యక్తం చేశారు. అరండల్‌పేటలోని సీపీఐ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ విధానాల కారణంగా కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూరుతూ, సామాన్యునిపై ఆర్థిక భారాలు అధికమవుతున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ దేశ గౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తాకట్టు పెట్టి రష్యా నుంచి ఆయిల్, ఇరాన్ నుంచి గ్యాస్ కొనుగోలు నిలిపి వేశారని విమర్శించారు. 5 రాష్ట్రాలలో ఎన్నికల సందర్భంగా దేశంలో పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచటం దేశ ప్రజలను మోసం చేయటమే అని స్పష్టం చేశారు. ఇందుకు ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రూపాయి పతనావస్థకు చేరి డాలరు మారకం రూ.96.07కు చేరిందని ఎద్దేవా చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జూన్ 1 నుంచి 4వ తేదీ వరకు కోటప్పకొండలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సమ్మేళనం జయప్రదం చేయాలని అక్కినేని వనజ కోరారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకులు వై.చెంచయ్య, జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, గిరిజన సమాఖ్య నాయకులు శ్రీనునాయక్, రాంబాబునాయక్ పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ -
రెండు లారీలు ఢీకొని డ్రైవర్ మృతి
నాదెండ్ల: ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా స్లో అవటంతో వేగంగా వస్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ ఆర్.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు.. నూతన బైపాస్ రోడ్డుపై గణపవరం పరిధిలోని హైవే కంట్రోల్ రూమ్ సమీపంలో గుంటూరు నుంచి వినుకొండ వెళ్తున్న లారీని గుంటూరులో పత్తి అన్లోడ్ చేసి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ వెనుక వైపు నుంచి ఢీకొంది. పత్తి లారీ డ్రైవర్ ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరుకు చెందిన మన్నెం సుబ్రహ్మణ్యం(37) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చేపల పట్టివేతపై రెవెన్యూ విచారణ
బొల్లవరం(ముప్పాళ్ల): ‘మట్టిపై కన్నేస్తే... చేపలు దొరికాయ్..’ అంటూ సాక్షిలో వచ్చిన కథనం పై రెవెన్యూ అధికారులు శనివారం విచారణ చేపట్టారు. మండలంలోని బొల్లవరం గ్రామ సమీపంలో ఉన్న ఏడు ఎకరాల భూమిలో తవ్విని చెరువులో మట్టి తవ్వకాలు చేసేందుకు గాను నీళ్లు వెళ్లే బెట్టే క్రమంలో దొరికిన చేపల ఆదాయం కోసం టీడీపీ నాయకులు పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ అంశం బయటకు పొక్కటంతో రెవెన్యూ అధికారులు చెరువు ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని ఫొటోలలో సేకరించారు. అక్కడి వారి నుంచి వివరాలు సేకరించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు ఆర్ఐ ఆంజనేయులు, వీఆర్వోలు తెలిపారు. చెరువులో నీటిని బయటకు పంపినట్లుగా గుర్తించామని, పరిశీలించే సమయంలో చిన్నపాటి చేపలు బాక్స్‌ల్లో ఉండటాన్ని గుర్తించారు. అన్ని పనులు వెంటనే నిలిపివేయాలని, పంచాయతీ, రెవెన్యూ అధికారుల అనుమతితోనే తదుపరి చర్యలు చేపట్టాలని అక్కడ ఉన్న వారిని ఆదేశించారు. అనుమతులు లేకుండా పనులు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నకరికల్లుః ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని త్రిపురాపురం సమీపంలో అద్దంకి– నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు.. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలేనికి చెందిన షేక్ మస్తాన్‌షరీఫ్(34) ద్విచక్ర వాహనంపై సంతమాగులూరు అడ్డరోడ్డు నుంచి కొండమోడుకు బయలుదేరాడు. మార్గంమధ్యలో మండలంలోని త్రిపురాపురం సమీపంలో హైవే డివైడర్‌ను ఢీకొన్నాడు. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. డీఎస్ఓ నరసింహారెడ్డి నరసరావుపేట ఈస్ట్: శాప్ ఆధ్వర్యంలో వివిధ క్రీడాంశాలలో రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలను ఈనెల 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు వివిధ క్రీడా వేదికలపై నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రకటించిన తేదీలను శాప్ అధికారులు మార్పు చేసినట్టు వివరించారు. సవరించిన తేదీల మేరకు తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు జూడో, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నీస్, కాకినాడలోని డీఎస్ఏ స్టేడియంలో ఈనెల 29 నుంచి 30వ తేదీ వరకు వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో, విశాఖపట్నం కొమ్మాది స్టేడియంలో ఈనెల 31, జూన్1వ తేదీ వరకు అథ్లెటిక్స్, సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తారని వివరించారు. ఆయా పోటీలలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న బాల బాలికలు తప్పని సరిగా తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని కోరారు. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయని క్రీడాకారులు శాప్ క్రీడా యాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
సమగ్ర శిక్ష పోస్టుల భర్తీలో మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి
నరసరావుపేట: పల్నాడు జిల్లా విద్యా శాఖలో సమగ్ర శిక్ష విభాగం కింద ఖాళీగా ఉన్న జీసీడీఓ, ఏఎల్‌ఎస్‌సీఓ పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ పల్నాడు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారికి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఆంజనేయరాజు మాట్లాడుతూ అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా మార్కులు కేటాయించి మెరిట్ జాబితా సిద్ధం చేయడంలో విద్యాశాఖ అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల ఒకటో తేదీ నాటికే మెరిట్ జాబితా సిద్ధమైనా కొందరు అనర్హులకు డీఆర్పీ శిక్షణ పేరిట అదనపు మార్కులు కేటాయించి జాబితాలో మార్పులు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. -
వేధింపులకు ఉద్యోగి బలి
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మర్రిపాలెంలో ఉద్యోగంలో చేరిన శ్రీనివాసరావు తిరిగి అన్నవరం సొసైటీకి సీఈవోగా వచ్చాడు. అప్పటి నుంచి సిబ్బందిపై వేధింపులు ప్రారంభించాడు. జీతాలు ఇవ్వకుండా బెదిరించడంతో తట్టుకోలేక ఓరుగంటి శ్రీనివాసరెడ్డి అనే గుమస్తా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో శ్రీనివాసరావుతోపాటు సొసైటీ పీఐసీ నర్రా సురేంద్రబాబుపై కేసు నమోదు అయింది. సొసైటీ ఉద్యోగిని పచ్చవ భవానికి 18 నెలలు జీతం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. దీనిపై ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా జరిగిన విచారణలో అవినీతి వెలుగు చూసింది. -
ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల
గుంటూరు మెడికల్: డీఎంహెచ్ఓ కార్యాలయం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎఫ్ఎన్ఓ, ఎల్జీఎస్ ఉద్యోగాలకు జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీహెచ్సీ, అర్బన్ పీహెచ్‌సీల్లో 45 పోస్టులకు గాను దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును శుక్రవారం విడుదల చేశామన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పెదకాకాని: చరిత్ర పుస్తకాలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలు తెలుసుకునేందుకు దోహదపడతాయని వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వలయంలో శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేక్ అబ్దుల్ హకీంజానీ రచించిన మన కవుల చరిత్ర మొదటి భాగం గ్రంథాన్ని వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 70కి పైగా పుస్తకాలను రచించిన అబ్దుల్ హకీంజానిని అభినందించారు. ఈ సందర్భంగా హకీంజానీ మాట్లాడుతూ 500 పేజీలకు పైగా మన కవుల చరిత్ర రెండవ విభాగం త్వరలో వెలువడుతుందన్నారు. -
బస్సును తప్పించబోయి లారీ బోల్తా
చిలకలూరిపేటటౌన్: బస్సును తప్పించబోయి లారీ బోల్తా పడిన ఘటన మండలంలోని కావూరు ప్రాంతంలో జరిగింది. సేకరించిన వివరాల ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు నుంచి పొగాకు లోడుతో నరసరావుపేట వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాన్ని నడపడం వల్లే దానిని తప్పించబోయి అదుపుతప్పి తమవాహనం బోల్తా పడిందని లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంలో లారీ పాక్షికంగా ధ్వంసం కాగా, పరిస్థితి గమనించి డ్రైవర్ పక్కకు దూకాడు. లారీ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాచవరం: ప్రమాదవశాత్తూ నేల బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పిన్నెల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం నీలయ్యపాలెం గ్రామానికి చెందిన కొరడాల విశ్వనాథం (45) రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి మతిస్థిమితం కోల్పోయాడు. కొంతకాలంగా గ్రామాన్ని విడిచి పలు గ్రామాల్లో సంచరిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున గొర్రెల కాపరులు నేల బావిలో మతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని చొక్కా జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మృతుని వివరాలు గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించే రెండు సంంత్సరాలు కాలపరిమితి గల బీపీఈడీ, డీపీఈడీ కోర్సులలో ప్రవేశానికి ఏపీ పీసెట్–2026 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాల్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకూ ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏఎన్‌యూలో 2026–2027 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి రూ.1000 అపరాధ రుసుంతో 20వ తేదీ వరకూ, రూ.2000 అపరాధ రుసుంతో మే 25వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసిన వారు తమ తప్పులను 24 నుంచి 26వ తేదీలోగా సరిదిద్దుకోవచ్చన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను మే 28 నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌లోని తేది, సమయం ప్రకారం పరీక్షకు హాజరు కావాలన్నారు. ఏపీ పీసెట్ 2026 దేహదారుఢ్య పరీక్ష, క్రీడానైపుణ్య పరీక్షలు జూన్ 3వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ప్రారంభమవుతాయని తెలిపారు. పూర్తి వివరాలు వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ (సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 27వ తేదీ వరకు ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు, సన్ వ్యవస్ధాపకుడు కె.యశ్వంత్ తెలిపారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో శిక్షణ తరగతుల పోస్టర్లు ఆవిష్కరించారు. కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్న శిక్షణ తరగతుల్లో 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు హాజరు కావచ్చునని తెలిపారు. ఐఏఎస్, సివిల్ సర్వీస్ పరీక్షలపై విద్యార్థి స్థాయి నుంచి అవగాహన కల్పించడం లక్ష్యంగా పరీక్షల విధానం, సన్నద్ధత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కె.యశ్వంత్ మాట్లాడుతూ 12 ఏళ్లుగా ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు 94913 36996, 79895 70755, 93469 84938 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విన్ మణిదీప్, సన్ వలంటీర్లు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న దిచక్రవాహనం
ఒకరు మృతి–మరొకరికి గాయాలు వినుకొండ: మండలంలోని చీకటీగలపాలెం సమీపంలో గురువారం రాత్రి జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వినుకొండ పట్టణానికి చెందిన కంభంపాటి కార్తీక్ తన స్నేహితుడు క్రాంతితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చీకటీగలపాలెం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కార్తీక్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న క్రాంతికి తీవ్రగాయాలు కావడంంతో స్థానికులు వెంటనే స్పందించచి చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి ప్రతిభ
మంగళగిరిటౌన్: చైనాలో ఈ నెల 10 నుండి 15వ తేదీ వరకు జరిగిన ఏషియన్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారిణి ప్రతిభ చాటి మెడల్స్ సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయభాస్కరావు తెలిపారు. మంగళగిరిలోని వారి కార్యాలయం నుంచి శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర షానూన్ ఈ పోటీల్లో 47 కేజీల విభాగంలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. షానూన్ ఉత్తమ ప్రదర్శన చేసి పతకం సాధించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. -
మెట్ల పూజ మార్గంలో జారిపడిన శ్లాబు పెచ్చులు
బాలిక తలకు గాయం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి పాత మెట్ల మార్గంలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడి ఓ బాలిక తలకు గాయమైంది. ఈ ఘటన శుక్రవారం ఇంద్రకీలాద్రిపై చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన పద్మావతి తన కుమార్తె స్నేహతో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. పద్మావతి మెట్ల పూజ చేసుకుంటూ కొండపైకి వెళ్తోంది. మహామండపం పక్కనే ఉన్న పాత మెట్ల మార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ కొండపైకి చేరుకుంటుండగా, మెట్ల మార్గంలోని పాత స్టోర్ రూమ్ సమీపంలో కుళాయి వద్దకు వచ్చేసరికి బాలిక స్నేహ నిల్చున చోట పై నుంచి పెద్ద పెచ్చు ఊడిపడింది. ఆ పెచ్చు బాలిక తలపై పడటంతో గాయం అయి తీవ్ర రక్తస్రావం అయింది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఉన్న దేవస్థాన ఆరోగ్య కేంద్రానికి బాలికను తీసుకొచ్చారు. అయితే అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో నర్సు వైద్యం అందించింది. గాయం నుంచి రక్తస్రావం తగ్గడంతో వెంటనే దేవస్థాన అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలికకు వైద్యం చేసిన వైద్యులు ఐదు కుట్లు వేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆలయ ఈవో శీనానాయక్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు దేవస్థానం ఇద్దరు వైద్యులను నియమించింది. అయితే శుక్రవారం రద్దీ వేళ ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో లేకపోవడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని భక్తులు ఆలయ ఈవో శీనానాయక్ దృష్టికి తీసుకెళ్లారు. -
రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్యవినుకొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఢిల్లీ తరహాలో ఉధృతమైన పోరాటాలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని అవ్వారు కల్యాణ మండపంలో రెండు రోజుల పాటు జరిగే అఖిల భారత కిసాన్ మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అమెరికా ఆంక్షలకు లొంగి దేశీయ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతోందని మండిపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, పత్తి, మొక్కజొన్న రైతులు దళారుల చేతిలో మోసపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు భూములు కట్టబెట్టడం ఆపాలని, మద్దతు ధరతో ప్రభుత్వమే నేరుగా పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో పల్నాడు జిల్లా రైతు సంఘం నాయకులు ఏపూరి గోపాలరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి ఆంజనేయులునాయక్, వై.రాధాకృష్ణ, ఎల్ఐసీ యూనియన్ నాయకులు బొంకూరి వెంకటేశ్వర్లు, ఏజీపీ జ్ఞానేశ్వరరావు, న్యాయవాది రామకోటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు సురేష్ రాజా, ముని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు
ఏపీఎఫ్డీసీ ఎండీ కేఎస్ విశ్వనాథన్తెనాలి: రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ చెప్పారు. స్థానిక అంబేడ్కర్ జూనియర్ కాలేజ్‌లో మా–ఏపీ నిర్వహిస్తున్న మూడు రోజుల ఉచిత సినీనటన శిక్షణ తరగతులను శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం రూ.నాలుగు కోట్ల లోపు చిత్రీకరించిన 15 చిన్న బడ్జెట్ సినిమాలకు సబ్సిడీ రూ.10 లక్షల చెల్లింపునకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సినిమా నటనపై అవగాహన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వివిధ ప్రాంతాల ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న మా ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజాను అభినందించారు. ఆంధ్రాలో సినిమాలు చిత్రికరించే నిర్మాతలకు ప్రభుత్వం మౌలిక సదుపాయలను కల్పించడానికి టూరిజం శాఖ సమన్వయంతో కార్యాచరణను సిద్ధం చేసిందని విశ్వనాథన్ వివరించారు. దీనికోసం మా–ఏపీ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. శిక్షణ తరగతుల నిర్వాహకుడు, దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ సినిమాలో నటించాలనుకునే ఔత్సాహికులకు శిక్షణలో ప్రాథమిక అంశాలను బోధిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను ఇస్తామని చెప్పారు. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి డి.మధుబాబు, తూటా రామకృష్ణ, మధుమతి, కెమెరా హరి శ్రీనివాస్, మహిళా దర్శకురాలు నాగశ్రీ, జాలా రాజ కుమారి, స్టైల్ రవి, రమేష్ పాల్గొన్నారు. -
దివ్యాంగులపై దాడులతో టీడీపీ అరాచకం
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డినరసరావుపేట: అభివృద్ధిలో పోటీపడలేని టీడీపీ నాయకులు అమాయకులైన దివ్యాంగులపైనా దాడులు చేస్తూ అరాచకానికి పాల్పడుతున్నారని గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో దివ్యాంగుడు సైదారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గురజాల నియోజకవర్గంలోని తాళ్లచెరువు గ్రామానికి చెందిన దివ్యాంగుడు సైదారెడ్డి బతుకుదెరువు కోసం గ్రామంలో చిన్న బడ్డీ బంకు పెట్టుకొని 30 ఏళ్లుగా తన కుటుంబాన్ని పోషించుకుంటుండగా టీడీపీ నాయకులు ఆ బడ్డీ బంకుతోపాటు మరో దివ్యాంగురాలు జాన్‌బీ షాపును సైతం ధ్వంసం చేశారన్నారు. గ్రామంలో తాగునీటి సరఫరా, రోడ్ల బాగోగులు పట్టించుకోని వారు అమాయకులైన దివ్యాంగులు సైదారెడ్డి, జాన్బీలపై దాడిచేయటం దుర్మార్గం అన్నారు. వారి కుటుంబాలకు ఆధారమైన కొట్టును ధ్వంసం చేసిన వారికి బుద్దీ, జ్ఞానం ఉండాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రెండుమూడురోజుల వ్యవధిలోనే తన నియోజకవర్గంలో మొదటిగా వారికే న్యాయం చేస్తామన్నారు. చేతనైతే తమతో అభివృద్ధిలో పోటీ పడాలని టీడీపీ నాయకులకు సూచించారు. తాము రెండు, మూడు కోట్ల రూపాయలతో రోడ్లు వేసి ఇళ్ల పట్టాలు అందజేశామని, సచివాలయాలు కట్టామని, తాగునీటి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. చేతనైతే వాటిని పూర్తిచేయాలని టీడీపీ నాయకులకు సూచించారు. -
మట్టిపై కన్నేస్తే.. చేపలు దొరికాయ్..
బొల్లవరం(ముప్పాళ్ల): మట్టిపై కన్నేసిన అక్రమ దారులకు ఏకంగా లక్షల రూపాయల విలువ చేసే చేపలు దొరికాయి. వాటాలు పంచుకునే విషయంలో టీడీపీ నాయకుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సంఘటన మండలంలోని చాగంటివారిపాలెం రెవెన్యూ పరిధిలోని బొల్లవరం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొల్లవరం గ్రామానికి సమీపంలో ఏడు ఎకరాల భూమిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆదేశాల మేరకు చేపల చెరువును తవ్వించేందుకు శ్రీకారం చుట్టి పనులు చేపట్టారు. పనుల్లో భాగంగా కొంత మట్టిని అమ్ముకోగా, మరికొంత మట్టిని కట్టలు వేయించారు. తర్వాత ఎన్నికలు రావటంతో చెరువు పనులు నిలిచిపోయాయి. వర్షాలకు, కాల్వల ద్వారా తవ్విన చెరువులోకి నీరు చేరింది. కాల్వల ద్వారా వచ్చిన చేపలు చెరువులో ఉండటంతో పెరిగి పెద్దయ్యాయి. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మట్టిని అమ్ముకునేందుకు గాను ఇంజిన్లతో నీటిని వెల్లబెట్టే ప్రయత్నం చేస్తుండగా లక్షల విలువ చేసే చేపలు బయటపడ్డాయి. ఒక్కో చేప మూడు నుంచి నాలుగు కేజీల వరకు కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు. చెరువులో లభించిన చేపల విలువ సుమారు రూ. 2 నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మట్టికోసం వస్తే చేపలు దొరకడంతో అక్రమార్కుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న కూటమిలోని మరో వర్గం చేపల ఆదాయంలో మాకు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుంది. ఇరు వర్గాల వారు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఈ విషయం నియోజకవర్గ నేత వద్దే తేల్చుకుంటామని ఎవరికి వారే భీిష్మించుకుంటున్నారు. -
నైపుణ్యాలే యువత భవితను నిర్ణయిస్తాయి
మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వెస్ట్: జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కృషి చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌న్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరలో జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ, జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్, శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, శాసనసభ్యులు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్‌లతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రస్తుతం గుంటూరు ప్రాంతంలో సంవత్సరానికి సుమారు 6,500 మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉందన్నారు. దీనిని అదనంగా 9 వేల మేర పెంచి మొత్తం 17 వేల మందికి శిక్షణ అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. శిక్షణ కేంద్రాల కొరతను అధిగమించేందుకు మూతపడిన ఇంజినీరింగ్ కళాశాలలను వినియోగంలోకి తీసుకురావడంపై చర్చిస్తున్నామని చెప్పారు. తెనాలి బుర్రిపాలెంలో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించిన విధానం మంచి ఫలితాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యువత ఉద్యోగం వచ్చిన వెంటనే కనీసం 20 శాతం పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు. కనీసం ఆరు నెలల జీతానికి సమానమైన ఎమర్జెన్సీ ఫండ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని తెలిపారు. తక్కువ ఖర్చుతో లభించే ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత పథకాలపై కూడా యువత అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి, నైపుణ్య అభివృద్ధి అధికారి సంజీవరావు, జిల్లా పరిశ్రమల అధికారి జయలక్ష్మి, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ సందీప్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహేంద్ర పాల్ రెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ప్రజలపై ఇంధన భారం
సత్తెనపల్లి: పేద, సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోంది. యుద్ధం బూచిగా ఇంధన ధరలు పెంచడంతోపాటు జేబులు గుల్లవుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు దొరక్క ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి వంటింటి బడ్జెట్ తలకిందులైంది. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో ఆ ప్రభావంతో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇక్కడ అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతలో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచేసింది. ఖర్చుల భారం కన్నీళ్లు పెట్టిస్తున్నా చంద్రబాబు సర్కారు ధరల నియంత్రణకు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాలకుల తీరుపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. నిత్యావసర సరుకులదీ అదే దారినూనెలు సలసల కాగుతున్నాయి. పామాయిల్ కిలో రూ. 110 నుంచి రూ. 130కి పెరిగింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 155 నుంచి రూ. 174, రైస్ బ్రాన్ ఆయిల్ రూ. 130 నుంచి రూ.160కి చేరింది. కిలో కందిపప్పు రూ.100 నుంచి రూ.120, పెసరపప్పు రూ.90 నుంచి రూ.120, మినపగుళ్లు రూ.105 నుంచి రూ.120, పంచదార రూ.42 నుంచి రూ.46, వెల్లుల్లి రూ.160 నుంచి రూ.220కి పెరిగింది. రెండు నెలల వ్యవధిలో అన్ని రకాల సరకుల ధరలు పెరిగిపోయాయి. కూరగాయల ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. దీనికి తోడు చికెన్ ధర కిలో ఏకంగా గడిచిన కొన్ని వారాల్లో రూ. 250 నుంచి రూ. 324కు పెరిగింది. పాల ప్యాకెట్లు, పెరుగు, మజ్జిగపైనా ఆయా కంపెనీలు రూ.ఒకటి – రూ.రెండు వరకు పెంచేశాయి. ఇప్పుడు ఇంధన ధరల పెంపుతో ఆ భారం ఇంకా ఎక్కువగా ప్రజలపై పడనుంది. -
గర్భిణుల సహనానికే పరీక్ష
కడుపులో బిడ్డ కదలాడుతుంటే తల్లి గుండెల్లో ఆనందం ఉరకలేస్తుంది. నెలలు నిండేకొద్దీ పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నామనే భావన మాతృత్వపు మాధుర్యాన్ని గుర్తు చేస్తుంటుంది. కోటి ఆనందాలతో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన నిండు చూలాలి సహనానికి ప్రతిక్షణం పరీక్షగా పరిస్థితి ఉంది. కొద్దిసేపు నడిస్తేనే అలసటతో కూలబడే గర్భిణులకు మూడు అంతస్తులో పరీక్షలకు వెళ్లాలంటే ఎంతో కష్టంగా మారింది. నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిలోని ఈ దుస్థితి చంద్రబాబు సర్కారు నిర్వాకానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.నరసరావుపేట టౌన్‌్: తల్లి కాబోతున్నామనే ఆనందం కన్నా ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షల కోసం పడుతున్న అవస్థలే గర్భిణులను ఎక్కువగా వేధిస్తున్నాయి. వైద్యశాల మారినా తిప్పలు తప్పటం లేదు. పల్నాడు బస్టాండ్‌లోని పాత ఏరియా వైద్యశాలలో కొనసాగుతున్న గైనిక్ విభాగాన్ని లింగంగుంట్లలో నిర్మించిన 200 పడకల వైద్యశాల నూతన భవనంలోకి ఇటీవల మార్చారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సేవల్లో జాప్యం చోటుచేసుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న జనరల్ వార్డును ఆధునికీకరించి అందులో గైనిక్ విభాగాన్ని 15 రోజుల క్రితం నూతనంగా ఏర్పాటు చేశారు. వైద్యశాల మారింది గానీ సమస్యలు మాత్రం అదే రీతిలో ఉన్నాయి. పాత ఏరియా వైద్యశాలలో రక్తపరీక్షల కోసం గర్భిణులు మొదటి అంతస్తు ఎక్కలేక నానా అవస్థలు పడేవారు. షిఫ్ట్ చేసిన నూతన వైద్యశాలలోనైనా మెరుగైన సేవలు అందుతాయని భావించారు. ఇక్కడ కూడా రక్తపరీక్షల కోసం మూడు అంతస్తుల మెట్లు ఎక్కాల్సి రావటంతో నానా అగచాట్లు పడుతున్నారు. దీంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామనే రీతిలో వారి కష్టాలు ఉన్నాయి. రోజూ గైనిక్ విభాగానికి 400 మంది గర్భిణులు సుదూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వస్తుంటారు. అందులో 150 మంది వరకు ప్రతి రోజు రక్త పరీక్షలు అవసరం అవుతుంటాయి. సోమ, శుక్రవారాల్లో మరో 50 మందికి అదనంగా మూత్ర, రక్త పరీక్షల కోసం వస్తుంటారు. లిఫ్ట్ ఉన్నప్పటికీ తరుచూ సాంకేతిక లోపం కారణంగా పనిచేయటం లేదు. కొన్ని సమయాల్లో విద్యుత్ కోత కూడా ఉంటోంది. నిండు గర్భిణులు మెట్లు ఎక్కి వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రక్తపరీక్షల కేంద్రం వద్ద రద్దీ ఉండటంతో గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తోంది. కూర్చునేందుకు సరిపడ కుర్చీలు లేకపోవటంతో సొమ్మసిల్లుతున్నారు. తాగునీటికీ అవస్థలు ఏరియా వైద్యశాలలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. దాహర్తికి రోగులు, వారి సహాయకులు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా క్యూలైనులో గంటలకొద్దీ నిలబడి దాహార్తికి సొమ్మసిల్లి పడిపోతున్నారు. మోటార్ మరమ్మతుల కారణంగా గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రోగుల అవసరానికి సరిపడా నీరు అందుబాటులో లేకపోవటంతో వాటర్ బాటిల్స్ కొనుగోలు చేస్తున్నారు. రోగులు తల్లడిల్లిపోతున్నా సమస్య పరిష్కారానికి అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని రోగులు మండిపడుతున్నారు. -
జిల్లా స్విమ్మింగ్ జట్టు ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీసుబ్బరాయ అండ్నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్‌లో జిల్లా సీనియర్ స్విమ్మింగ్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీలో 20 మంది స్విమ్మర్లు పాల్గొనగా వారిలో 8 మందిని వివిధ కేటగిరిలలో జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్టు అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఎంపికై న జట్టు ఈనెల 24వ తేదీన కర్నూలులోని డిఎస్ఏ స్టేడియం స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించనున్న 12వ సీనియర్ అంతర్ జిల్లాల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఎంపికై న క్రీడాకారులను అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామలింగారెడ్డి, కోచ్ జి.సురేష్ అభినందించారు. -
గుంటూరు జిల్లా జైలులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా కారాగారంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. డెస్క్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా కారాగారాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ హెల్ప్ డెస్క్ వల్ల ఖైదీలకు, వారి బంధువులకు ఉన్న సమస్యలకు త్వరితగతిన పరిష్కరించడానికి వీలు కలుగుతుందన్నారు. ఖైదీలు, వారి బంధువులు హెల్ప్ డెస్క్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్, స్టాఫ్, డెప్యూటీ లీగల్ ఎయిడ్ డెఫన్స్ కౌన్సెల్, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం గుంటూరు మహిళా ప్రాంగణంలోని శిశు గృహాన్ని సందర్శించి అక్కడ ఉన్న పిల్లలకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టాభిపురంలోని మాతృశ్రీ పిల్లల ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న పిల్లలకు సురక్షితమైన బాల్యం, భవిష్యత్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో ఉండాలని ఆకాంక్షించారు. వారికి అన్ని సదుపాయాలు అందుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేనేజర్ జీవన్ క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు రూరల్: వ్యవసాయ రంగంలో సమస్యలను పరిష్కరించేలా కృత్రిమ మేధపై ఆవిష్కరణలు ఉండాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ అన్నారు. చిన్న, సన్నకారు, కౌలు రైతుల జీవితాలలో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే విధంగా ఉండాలని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా, సుస్థిరంగా మార్చే లక్ష్యంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్ సంయుక్త ఆధ్వర్యాన నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంనందున్న సమావేశ మందిరంలో శుక్రవారం వ్యవసాయంలో కృతిమ మేధస్సుపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ వ్యవసాయం పూర్తిగా డేటా ఆధారిత నిర్ణయ వ్యవస్థల వైపు పయనిస్తుందని చెప్పారు. ఈ డేటా కచ్చితత్వం రైతు సేవ కేంద్రాలలో లభ్యమయ్యేలా చూడాల్సిన ఆవశ్యకతను వివరించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ, ఐకార్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ లీడర్ డాక్టర్ రవినారాయణసాహూ, సీఆర్ఐడీఏ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏవీఎం సుబ్బారావు వ్యవసాయ, అనువర్తనాలు విభాగంలో గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ వీఎం చౌదరి, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన డాక్టర్ రాజేంద్ర మాచవరం మాట్లాడారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సెక్రటరీగా డాక్టర్ మణి వ్యవహరించారు. నాబార్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ డి.త్రిపాఠి, హైదరాబాద్ అటారీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎన్ మీరా, డాక్టర్ ఎంవీ రమణ, యూనివర్సిటీ అధికారులు, వివిధ పరిశోధన సంస్థలు, స్టార్టప్ సంస్థలు, ప్రైవేట్ రంగానికి చెందిన నిపుణులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఏఎన్‌యూ(పెదకాకాని): పరిశ్రమల రక్షణలో శిక్షణ పొందిన సేఫ్టీ నిపుణుల పాత్ర ఎంతో కీలకమని వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఆనర్స్ ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ (4 సంవత్సరాలు), 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిప్లొమా కోర్సుల అడ్మిషన్ నోటిఫికేషన్‌న్‌ను శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ పి. బ్రహ్మాజీరావు, హెడ్ ఆప్ ది ఫైర్ అండ్ సేప్టీ విభాగం అరుణ్‌కుమార్ పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు. -
డయేరియా కలకలం
చేబ్రోలు: కలుషిత ఆహారం తినటంతో కొత్తరెడ్డిపాలెం దళితవాడలో శుక్రవారం సుమారు వందమందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావటంతో స్థానికంగా కలకలం రేగింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం పాత దళితవాడ ప్రాంతంలో గత మూడు రోజులుగా ప్రార్థన కూటములు జరిగాయి. హాజరైన భక్తులకు మొదటి రెండు రోజులు శాకాహార భోజనం అందించారు. చివరి రోజు గురువారం రాత్రి చికెన్ బిర్యానీని అందజేశారు. బిర్యానీ తిన్న కొంతమంది అస్వస్థతకు గురవటంతో శుక్రవారం తెల్లవారుజామున రాజేష్, వజ్రం, జయరాణిలను 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానిక ప్రైవేటు వైద్యుని వద్ద మరి కొంతమంది చికిత్సలు పొందారు. ఉదయం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరిగిపోయింది. ప్రత్యేక వైద్య శిబిరం స్థానిక తెలుగు బాపిస్టు చర్చిలో అత్యవసరంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతున్న వారు అధిక సంఖ్యలో వచ్చారు. కుర్చీలలో, బల్లల మీద కూర్చోబెట్టి సైలెన్ ఎక్కించారు. తర్వాత సమీపంలోని పీహెచ్సీ నుంచి బెడ్లను తెప్పించి బాధితులకు సైలెన్ సీసాలు పెట్టారు. వైద్య చికిత్సలు మొదలు పెట్టారు. నీరసంగా ఉన్న మరో నలుగురిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేబ్రోలు, వట్టిచెరుకూరు ప్రాంతాల నుంచి రెండు 108 వాహనాలను మెడికల్ క్యాంపు వద్ద అందుబాటులో ఉంచారు. అధ్వానంగా పారిశుద్ధ్యం దళితవాడ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ఎక్కడ మురుగు అక్కడే, చెత్తా చెదారం నిల్వ ఉండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వస్తున్నారనే సమాచారంతో పంచాయతీ సిబ్బంది హడావుడిగా చర్చి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసే పనిలో పడ్డారు. రోజూ తమ ప్రాంతానికి పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రావటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్య సేవలకు ఆదేశం బాధితుల సంఖ్య అధికంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పరిస్థితిని సమీక్షించారు. వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మూడు రోజుల పాటు ప్రార్థన కూటమి జరిగిందని, అక్కడ బిర్యానీ తిన్న తర్వాత గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం నుంచి అస్వస్థతకు గురైనట్లు బాధితులు వివరించారు. వైద్య సిబ్బందికి షిఫ్టులవారీగా విధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇంటింటి సర్వే నిర్వహించటంతోపాటు అనుమానితులందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. బాధితులకు మంచి ఆహారం అందజేయాలన్నారు. బెడ్లు, పరుపులు, కూలర్లు అవసరం మేరకు ఏర్పాటు చేయాలని తెనాలి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారిని ఆదేశించారు. ప్రస్తుతం 44 మంది అస్వస్థతకు గురైనట్లు కలెక్టర్‌కు అధికారులు వివరించారు. పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ గ్రామంలో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని డీపీవో సాయికుమార్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నీటి నమూనాలు సేకరించి నివేదికను అందజేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈకి ఆదేశాలు జారీ చేశారు. ప్రార్థన కూటమి నిర్వహించిన సంఘ పెద్దతో కలెక్టర్ మాట్లాడారు. చికెన్ ఎక్కడ కొనుగోలు చేశారు.. ఎన్ని గంటలకు తయారు చేసి, ఎప్పుడు భోజనాలు పెట్టారు.. వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. యడ్లపాటినగర్లోని షాపులో చికెన్ కొనుగోలు చేసినట్లు తెలపటంతో షాపులో తనిఖీ చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దారు కె. శ్రీనివాసవర్మ, ఎంపీడీవో ఊహారాణి తదితరులు పాల్గొన్నారు. అదుపులోనే పరిస్థితి గుంటూరు వెస్ట్: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో 11, 12, 13 తేదీల్లో బాప్టిస్ట్ ప్రేయర్ హాలులో ప్రార్థన కూటములు జరిగాయన్నారు. 13వ తేదీ రాత్రి దాటిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారని, అక్కడికి రాని వారి ఇంటికి ఆహారాన్ని పంపించినట్లు తెలిసిందన్నారు. 14న ఉదయం, కొంత మంది మధ్యాహ్నం కూడా తిన్నారని తెలిపారు. దాదాపు 100 మంది భోజనం చేయగా 44 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. నలుగురి పరిస్థితి ఇబ్బందిగా మారడంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి పంపామన్నారు. ముందు రోజు నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు పదుల సంఖ్యలో వచ్చినప్పటికీ వైద్యసిబ్బంది స్పందించికపోవటంతో బాధితుల సంఖ్య అధికమైంది. తెనాలి, గుంటూరు వైద్యశాలలకు బాధితులు వెళ్లటంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. డీఎంహెచ్‌వో కె.విజయలక్ష్మి, తెనాలి డిప్యూటీ డీఎంహెచ్‌వో అన్నపూర్ణమ్మలు మధ్యాహ్నం ఆ ప్రాంతానికి వ,చ్చారు. ఇంటింటికీ తిరిగి పరిస్థితిని అంచనా వేశారు. వైద్య సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాధితుల సంఖ్యను గుర్తించే పని చేపట్టారు. గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో 38 డయేరియా కేసుల నమోదుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం అధికారులతో చర్చించారు. కలుషిత ఆహారం కారణంగా ఈ కేసులు నమోదైనట్లు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి వివరించారు. ముగ్గురిని చేబ్రోలు పీహెచ్‌సీకి తరలించి, అనంతరం తెనాలి జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. దీనికి ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని మంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. -
సేవల్లోనూ తీవ్ర జాప్యం
గర్భిణులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రక్త, మూత్ర పరీక్షల కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక కొన్నేళ్లుగా ఇక్కట్లకు గురవుతున్నారు. వస్తున్న వారికి సరిపడా సిబ్బంది లేకపోవటంతో పరీక్షల ప్రక్రియ నత్తనడకగా సాగుతోంది. సిబ్బందిని పెంచాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. పరీక్షల కోసం గంటల సమయం పడుతోంది. రిపోర్టులు చేతికి అందటానికి అదనంగా మరో రెండు గంటలు వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. ఉదయం పరీక్షలు చేయించిన వారికి మధ్యాహ్నం రిపోర్టులు అందుతున్నాయి. మధ్యాహ్నం పరీక్షలు చేయించిన వారికి సాయంత్రం లేకుంటే రెండవ రోజు రిపోర్టులు ఇస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఒక రోజు వృథా అవుతోంది. దీనికి తోడు విద్యుత్ అంతరాయంతో ఉక్కపోతకు గురై గర్భిణులు అల్లాడుతున్నారు. -
ప్రాధాన్యత రంగాలకు మరిన్ని రుణాలు
నరసరావుపేట: ప్రాధాన్యత రంగాలకు, కౌలు రైతులకు 2026–27 మార్చి 31 నాటికి సకాలంలో రుణాలు అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బ్యాంకులకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా డీసీసీడీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. గత ఏడాది బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ప్రొఫైల్‌ను ఆర్బీఏ ఎల్డీఎం ఎ.రామకృష్ణ, నాబార్డ్ డీడీఎం జి.శరత్‌లు జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఎంపీ లావు మాట్లాడుతూ రుణాలు విరివిగా ఇచ్చి పేదల అభివృద్ధికి సహకారం అందించాలని సూచించారు. చిన్న తరహా పరిశ్రమలకు నిర్దేశిత రుణాలను ఇవ్వకపోవడంపై బ్యాంకుల నుంచి సమాధానం కోరారు. ఆర్బీఐ మేనేజర్ ఆర్.రవీంద్రబాబు జిల్లాలోని ప్రజలందరికీ లక్ష్యాల మేరకు రుణాలను అందించాలని కోరారు. ఆర్బీఐ అధికారి కిరణ్‌కుమార్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. రైల్వేలైను నిర్మాణంపై దృష్టి పల్నాడు జిల్లాలో రైల్వేలైను నిర్మించడానికి 15 రోజుల్లో అన్ని శాఖల ఇంజినీర్లు అప్రూవల్స్, డీపీఆర్ మూడు రెవెన్యూ డివిజన్ల ఆర్డీఓలకు అందజేయాలని, వారంతా ఫీల్డ్కి వెళ్లి అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి, రైల్వేవారికి తగిన సహాయ సహకారాలు అందజేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రైల్వేశాఖ గతిశక్తి డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ పీవీ.నాయుడు, రైల్వే కన్సల్టెన్సీ సయ్యద్ చాన్‌బాషా, రెవెన్యూ, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్‌శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రైల్వేలైన్ సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరై అధికారులకు కొన్ని సూచనలు చేశారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ డీపీఆర్‌లు పూర్తిచేసి అప్రూవల్స్ వచ్చే విధంగా రైల్వే శాఖకు సహాయ సహకారాలు అందజేయాలని ఆదేశించారు. మూడు రెవెన్యూ డివిజన్ ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు రపాల్గొన్నారు. -
శుభకార్యంలో నగలు, నగదు చోరీ
● పారిపోతుండగా రోడ్డు ప్రమాదానికి గురైన నిందితుడు ● గాయపడటంతో బయటపడిన అసలు విషయం వినుకొండ: ఓ యువకుడు బుధవారం రాత్రి త్రిపురాంతకంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తన చేతివాటం ప్రదర్శించాడు. రూ. 4 లక్షల నగదు, బంగారంతో స్కూటీపై పరారయ్యాడు. కానీ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో అసలు విషయం వెలుగుచూసింది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం, చింతలచెరువు రైల్వే బ్రిడ్జి సమీపంలో తన ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. అతని ముఖానికి, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ దారిన వెళ్లే వారు వెంటనే 108 కి సమాచారం అందించారు. సిబ్బంది మహబూబ్ బాషా, నరేష్‌బాబులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేశారు. ఇలా తెలిసింది... తన పేరు యెహోషువా అని, తమది కురిచేడు మండలంలోని కాటంవారిపల్లె గ్రామమని, తాము చాలా కాలం క్రితం విజయవాడ వెళ్లి స్థిరపడ్డామని 108 సిబ్బందికి క్షతగాత్రుడు సమాచారం ఇచ్చాడు. తాను బంధువుల ఇంట్లో శుభకార్యానికి త్రిపురాంతకం వెళ్లొస్తున్నట్లు తెలిపాడు. కాటంవారి పల్లె గ్రామ చరిత్రలో ఆ పేరుగల కుటుంబం లేదని స్థానికులు తెలిపారు. అయితే క్షతగాత్రుడు కావాలని తమ వివరాలు చెప్పకుండా దాటవేసినట్లు 108 సిబ్బందికి అర్థమైంది. క్షతగాత్రుడి వద్ద ఫోనులో నంబరు తీసి అతని భార్యకు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. తన భర్త రూ.4 లక్షల నగదు, బంగారం తీసుకుని ఉడాయించాడని, బంధువుల ఇంట్లో శుభకార్యం జరుగుతుండం వాటిని తెచ్చాడని భార్య తెలిపింది. త్రిపురాంతకం నుంచి ఉడాయించగానే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయటంతో ఫోన్ నంబరు సిగ్నల్ ఆధారంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 సిబ్బంది వెంటనే ద్విచక్ర వాహనం, నగదు, ఆభరణాలను పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం వినుకొండలోని వైద్యశాలకు తరలించారు. -
అక్రమ వసూళ్లను నిరసిస్తూ రైతుల ఆందోళన
నాదెండ్ల: మైనింగ్ శాఖకు చెందిన ఏఎంఆర్ కంపెనీ చెక్‌పోస్టు సిబ్బంది రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు గురువారం ఆందోళనకు దిగారు. సాతులూరు వద్ద గుంటూరు–కర్నూలు రహదారిపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలోని చందవరం సెంటర్లో ఉన్న ఏఎంఆర్ కంపెనీ చెక్‌పోస్టు సిబ్బంది రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లను వేధిస్తున్నారని విమర్శించారు. రైతులు తమ పొలాల్లో మెరక మట్టిని తోలుకుంటున్నారని, ట్రాక్టర్‌కు రూ.500 చెల్లించాలంటూ రైతులపై ఏఎంఆర్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అన్నారు. గ్రామంలోని ఓ మహిళ తన పొలంలోని మెరక మట్టిని ట్రాక్టర్లలో ఇతర పొలాలకు తోలించిందని, అందుకు ఏఎంఆర్ సిబ్బంది అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.500 చెల్లించాల్సిందేనంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు. డబ్బులు చెల్లించకుంటే కేసులు నమోదు చేయించి జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఏఎంఆర్ సంస్ధ నుండి రైతులను కాపాడాలని, ఈ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుని చెక్‌పోస్టును తొలగించాలని డిమాండ్ చేశారు. రైతులు, ట్రాక్టర్ డ్రైవర్ల ఆందోళనతో రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్ జె నిరంజన్, నరసరావుపేట రూరల్ సీఐ సుబ్బరావు, నాదెండ్ల, నరసరావుపేట రూరల్ ఎస్సైలు ఆర్ వెంకటేశ్వరరావు, కిశోర్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఏఎంఆర్ సిబ్బందిపై కేసులు నమోదు చేస్తామని హామీనివ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. -
బైకును కళాశాల బస్సు ఢీకొని ఇద్దరు మృతి
నాదెండ్ల: గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై సాతులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు టైరు పేలి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ ఆర్. వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు... ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామానికి చెందిన వేమూరి అశోక్ (35) వ్యవసాయ పనులకు వెళ్తుండేవాడు. ఇదే గ్రామానికి చెందిన జమ్ముల సీతారామయ్య (22) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఇద్దరు ద్విచక్ర వాహనంపై నరసరావుపేటలోని ఓ హోటల్ నుంచి పార్శిల్ తీసుకుని పొనుగుపాడుకు బయలుదేరారు. సాతులూరు సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు రాగానే ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల బస్సు టైరు పేలింది. దీంతో బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో ఒకరు బస్సు టైరు కింద పడి మృతి చెందగా, మరొకరిని బస్సు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మృత్యువాత పడ్డారు. సమాచారం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్ జె. నిరంజన్, ఎస్ఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పారిపోయాడు. బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉచితమే.. లేనిది బస్సే!
పల్నాడుశుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026 చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో ప్రయాణికులకు తీవ్ర కష్టాలు 7సాక్షి, నరసరావుపేట: బస్సులలో ప్రయాణించే సమయంలో అప్పుడప్పుడు దురదృష్టవశాత్తు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. చంద్రబాబు ప్రభుత్వం సీ్త్ర శక్తి పేరుతో అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం కారణంగా బస్సు ఎక్కే సమయంలోనే తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వినుకొండ బస్టాండ్‌లో గత కొంతకాలంగా మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బస్సు వెనక్కి తీసుకుంటుండగా ఒకసారి, గ్యారేజ్ నుంచి వస్తున్న బస్సును గేటు వద్దే ఎక్కే ప్రయత్నంలో రెండోసారి నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తాజాగా బుధవారం పిడుగురాళ్ల వెళ్లే బస్సు ఎక్కే సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. వేల్పూరుకు చెందిన మోక్షజ్ఞ అనే బాలిక టైర్ కింద పడి కాలికి గాయాలయ్యాయి. వరుస ప్రమాదాలకు కారణం ఈ పథకానికి అవసరమైన మేరకు బస్సులు అందుబాటులో ఉంచకపోవడమేనని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పథకం అమలు చేసే ముందు కొత్త బస్సులను కొనుగోలు చేసి వాటి సంఖ్య పెంచుతామన్న చంద్రబాబు ప్రభుత్వం... ఆ దిశగా కనీస చర్యలు తీసుకోలేదు. దీంతో ఆర్టీసీ బస్టాండుల వద్ద ఉచిత బస్సు ఎక్కాలంటే యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. బస్సు రాగానే ఒక్కసారిగా ప్రయాణికులు గుమిగూడి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. మరికొన్నిసార్లు ప్రయాణికుల మధ్య ఘర్షణ జరుగుతోంది. పథకం అమలు తరువాత పెరిగిన అక్యూపెన్సీ ప్రకారం బస్సులను పెంచడం, అన్ని సర్వీసులకు ఉచితం అమలు చేయకపోవడమే వీటన్నింటికి కారణం. తెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.5200, మోడల్ ధర రూ.4000 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై నిత్యాన్నదానానికి ఉండవల్లికి చెందిన కొండా బాలప్రదీప్, విజయశాంతి దంపతులు రూ.1,00,116 విరాళమిచ్చారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులో చంద్రబాబు సర్కారు నిర్వాకం కారణంగా మహిళలతోపాటు సాధారణ ప్రయాణికులు కూడా నానా అవస్థలు పడుతున్నారు. సరిపడా సర్వీసులు లేక గంటల తరబడి ఎదురుచూసినా బస్సులు రావడం లేదు. వచ్చిన వాటిలో ఎక్కడానికి కూడా పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. సీట్ల కోసం పాట్లు తప్పడంలేదు. మిగిలిన వారు కాలు పెట్టాలన్నా పరిస్థితి కష్టంగా మారుతోంది. సరిపడా బస్సులు లేకపోవడంతో సమస్య తీవ్రంగా ఉన్నా పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
చిరు వ్యాపారులపై టీడీపీ ప్రతాపం
పిడుగురాళ్ల రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులపై అక్రమ కేసులు పెట్టడం సాధారణమైపోయింది. వారు ఆర్థికంగా నిలబడకుండా చేయటం, వ్యాపారాలను దెబ్బతీయడం పాలకులు, తెలుగుదేశం నాయకులకు లక్ష్యంగా మారింది. అభివృద్ది చేస్తామని అధికారంలోకి వచ్చి పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్న దివ్యాంగులపై ప్రతాపం చూపుతున్నారు. 35 ఏళ్ల నుంచి డ్రైనేజీపై చిరువ్యాపారం చేసే దివ్యాంగులపైకి యంత్రాలను తీసుకొచ్చి మరీ దుకాణాలను తొలగింపజేశారు. మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో అధికార పార్టీ నాయకులు తమ దుర్బుద్ధిని మరోసారి చాటుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేయటం, వారి సానుభూతిపరుల వ్యాపారాలు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఆధారం కోల్పోయిన కుటుంబాలు గ్రామంలోని షేక్ జానీబీ దివ్యాంగురాలు. భర్త కూడా లేరు. 30 సంవత్సరాల నుంచి బొడ్డురాయి సెంటర్లో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఆమెకు ఒక కుమార్తె. ఈ కొట్టు మీద వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పమ్మి సైదారెడ్డి చిన్నతనంలో పోలియో బారిన పడ్డారు. 35 సంవత్సరాల నుంచి బొడ్డురాయి సెంటర్లో డ్రైనేజీపై చిన్న కొట్టు ఏర్పాటు చేసుకొని గతంలో ఎస్టీడీ బూత్ నడిపారు. అనంతరం చిరుతిళ్ల దుకాణం పెట్టుకుస్తున్నారు. బొడ్డురాయి సెంటర్ తుమ్మలచెరువు గ్రామంలో ప్రజలందరికీ తెలిసిన ప్రదేశమని, ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ బొమ్మను ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకులు భావించి ఇలా వైఎస్సార్సీపీ సానుభూతి పరులను పంపిస్తున్నారని సమాచారం. తమ కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని చెప్పినా టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగి యంత్రాలతో కొట్లనుతొలగించేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న దుకాణాల తొలగింపు -
ఇజ్రాయిల్‌లో ఉద్యోగ అవకాశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: యువతకు ఇజ్రాయిల్ దేశంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా ఉపాధి అధికారి ఎం.క్రిస్టీ అభినవ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, వివిధ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో హోం బేస్డ్ కేర్ గివర్ ఇన్ ఇజ్రాయెల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. 25 నుంచి 45 ఏళ్ల వయసు గల పురుష, మహిళా అభ్యర్థులు ఈ అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీడీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతలు కలిగి, ఆంగ్ల భాషా నైపుణ్యంతోపాటు సీఈఎఫ్ఆర్ బీ2 గల అభ్యర్థులు అర్హులన్నారు. రెండేళ్లకు కాంట్రాక్ట్ ఒప్పందం ఉంటుందని, నెలకు దాదాపు రూ.1,99,770 వేతనం ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు రూ.2.10 లక్షలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుందని, అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు శుక్రవారం లోపు https:// nai punyam. ap. gov. in/ user& registration? page= program& registration సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తును https:// skillinternational@apssdc. in సైట్‌కు సైతం పంపించాలని చెప్పారు. వివరాలకు 9988853335, 8712655686, 8790118349, 8790117279 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
విద్యార్థులు విజయాల వైపు సాగాలి
మంగళగిరి టౌన్: విద్యార్థులు ఉన్నత స్థానం నుంచి అద్భుత విజయాలవైపు ప్రయాణం సాగించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణ పరిధిలోని సీకే కన్వెన్షన్‌లో గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌లతో కలసి పెమ్మసాని కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో అత్యధికంగా బాపట్లలోని కొల్లూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి దివ్యతేజశ్రీ 596 మార్కులు సాధించడం గర్వకారణమని మంత్రి తెలిపారు. 65 మంది విద్యార్థులకు రూ. 5 వేల చొప్పున అందజేశారు. అనంతరం గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా జిల్లాలో మొదటి పది స్థానాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఆయా ప్రధానోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని -
రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం
ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ నాదెండ్ల: రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమం చేపట్టిందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ అన్నారు. నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో గురువారం జరిగిన గ్రామసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతుల నుంచి 11 అర్జీలు అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఫిర్యాదులను పారదర్శకంగా వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో కె బాలకృష్ణ, జిల్లా సర్వేయర్ భానుకీర్తి, తహసీల్దార్ కుటుంబరావు, మండల సర్వేయర్ రాంబాబు, వీఆర్వో రాధాకృష్ణ, గ్రామ సర్వేయర్ కల్యాణ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. భూసారాన్ని కాపాడితేనే రైతుకు లాభం కొరిటెపాడు(గుంటూరు): అధిక దిగుబడుల మోజులో రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా వాడితే భూమి సారం కోల్పోతుందని, రైతులు పచ్చిరొట్ట పైర్ల సాగు వైపు మళ్లాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆధునిక వ్యవసాయం రైతుకు లాభాలు తెచ్చినా, అధిక దిగుబడుల లక్ష్యంగా రసాయన వినియోగం భూమిలో చౌడు పెరుగుతోందని, నీటిని నిల్వ చేసుకునే సామర్‌ాధ్యన్ని సాగుభూమి క్రమంగా కోల్పోతుందని తెలిపారు. భూసారాన్ని పరిరక్షించేందుకు జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేయాలని సూచించారు. పచ్చిరొట్ట పైర్లను 40 నుంచి 50 రోజుల వరకు సాగు చేసి 50 శాతం పూత దశలో భూమిలో కలియదున్నాలని సూచించారు. దీంతో భూమిలోని పోషకాలు అందుబాటులోకి వస్తాయని, సూక్ష్మజీవుల వృద్ధి పెరిగి నేల గుల్లబారి గాలి, నీటి ప్రసరణ మెరుగుపడుతుందని వివరించారు. పచ్చిరొట్ట పైర్లను వేసి సాగు చేసిన పంటల్లో నాణ్యత పెరగడమే కాకుండా 15 నుంచి 20 శాతం అదనపు దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. భూసార పరిరక్షణలో రైతులుభాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు మెడికల్: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల గవర్నమెంట్ జనరల్ హాస్పటల్లో 150 కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గురువారం విడుదల చేసినట్లు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) డాక్టర్ జి.శోభారాణి తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును cfw. ap. nic. in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. సర్టిఫికెట్ల పరిశీలన... పిడుగురాళ్ల గవర్నమెంట్ జనరల్ హాస్పటల్లో పలు రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి గురువారం గుంటూరు వైద్య కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లు పరిశీలించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పటల్లో 23 రకాల పోస్టులకు 206 మంది అభ్యర్థులను మెరిట్ ద్వారా ఎంపిక చేశారు. వీరిని కౌన్సెలింగ్‌కు పిలవగా, 36 మంది గైర్హాజరయ్యారు. గైర్హాజరైన అభ్యర్థుల పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇతర అభ్యర్థులతో కలెక్టర్ ఆదేశాల మేరకు భర్తీ చేస్తామని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి తెలిపారు. అభ్యర్థులకు శుక్రవారం నియామక ఉత్తర్వులు అందజేస్తామన్నారు. నర్సింగ్ కళాశాలకు ఎమ్మెస్సీ నర్సింగ్ సీట్లు మంజూరు.. గోరంట్లలోని ప్రభుత్వ నర్సింగ్కళాశాలకు ఎమ్మెస్సీ నర్సింగ్ సీట్లు మంజూరు చేస్తూ హెల్త్ సెక్రటరీ సౌరబ్ గౌర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ సర్వీస్ కోటాలో పది ఎమ్మెస్సీ నర్సింగ్సీట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీజీ సెట్లో చలపతి ఫార్మసీ విద్యార్థికి రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం నందున్న చలపతి ఫార్మశీ కళాశాల విద్యార్థులు పీజీ సెట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించి విశేష ప్రతిభ కనబరచి సంస్థకు గర్వకారణంగా నిలిచారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ సెట్ పరీక్ష ఏప్రిల్ 28వ తేదీన జరిగిందని తెలిపారు. పీజీ సెట్లో తమ విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించడం సంస్థలో అందిస్తున్న నాణ్యమైన బోధన విధానం, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం, అధ్యాపకుల అంకితభావం విద్యార్థుల కృషికి నిదర్శనమన్నారు. పరీక్షలో తమ కళాశాల విద్యార్థి బల్లా వెంకటజస్వంత్ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించి సంస్థకు విశిష్ట గౌరవాన్ని తీసుకువచ్చాడన్నారు. ఈ పరీక్షకు మొత్తం 42 మంది విద్యార్థులు హాజరుకాగా 42 మంది ఉత్తీర్ణులై ర్యాంకులు సాధించారన్నారు. ఇలాగే మరెన్నో విజయాలు సాధిస్తూ సంస్థ ప్రతిష్టను మరింతగా పెంచాలని సంస్థ చైర్మన్ వై.వి.ఆంజనేయులు ఆకాంక్షించారన్నారు. -
యువకుడి హత్యకు యత్నం
సత్తెనపల్లి: హత్యాయత్నానికి యత్నించిన యువకులకు దేహశుద్ధి చేసిన సంఘటన పట్టణంలోని వడ్డవల్లి చెక్క వంతెన వద్ద బుధవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వడవల్లి చెక్కవంతెన ఏరియాకు చెందిన నల్లబోతుల నాగరాజు, భార్య భవానీ హోటళ్లలో కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా భవానీ ఆరు నెలల నుంచి పట్టణంలోని అచ్చంపేట రోడ్లో గల శివాలయం సమీపంలో నివాసముండే పమిడిగుంట్ల మహేష్‌ను రహస్యంగా కలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు తన భార్య భవానీని ప్రశ్నించడంతో మహేష్‌తో ఉన్న వివాహేతర సంబంధం అంగీకరించింది. నాగరాజు, తన కుటుంబ సభ్యులు చెప్పినా భవానీ ఖాతరు చేయకుండా మహేష్‌తో తిరుగుతుంది. నాగరాజు ప్రశ్నిస్తున్న విషయాన్ని మహేష్‌కు భవానీ చెప్పడంతో నెల రోజులుగా నాగరాజును చంపుతానంటూ మహేష్ ఇంటి పరిసరాల్లో కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. భయపడిన నాగరాజు ఇంటికి రావడం మానేశాడు. కుటుంబ సభ్యులు నచ్చ చెప్పడంతో ఈనెల 13న సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఆ విషయాన్ని నాగరాజు భార్య భవానీ తన ప్రియుడైన మహేష్ కు ఫోన్ లో తెలియజేయగా మహేష్ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నాగరాజును హతమార్చేందుకు కత్తి తీసుకొని రాగా గమనించిన ఇరుగు పొరుగువారు మహేష్ దాడి చేస్తాడన్న భయంతో పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను కత్తి చూపించి అందర్నీ బెదిరించాడు. నా తమ్ముడు, స్నేహితులతో మళ్ళీ వస్తానని, నాగరాజును కచ్చితంగా చంపుతానని, అడ్డొచ్చిన వారిని కూడా చంపుతానని మహేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సుమారు 10:30 గంటల సమయంలో మహేష్ తమ్ముడైన ఆకాష్, అతని స్నేహితులైన మధార్వలి, షేక్ ఖాసిం సైదా అలియాస్ అండా ముగ్గురు మోటార్ సైకిల్ పై వచ్చారు. మహేష్ తమ్ముడు అయిన ఆకాష్ తను చేతిలో ఉన్న గొడ్డలితో ఇంటి సమీపముకు వచ్చి నాగరాజును హతమార్చేందుకు యత్నించగా నాగరాజు భయంతో పరుగులు పెట్టాడు. నాగరాజును వెంబడించారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న స్థానికులు అడ్డు పడటంతో ఆకాష్ పెనుగులాడి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. మిగిలిన ఇద్దరు మదార్‌వలి, ఖాసీం సైదా అలియాస్ అండా స్థానికులకు దొరకడంతో వారిరు వురికి దేహశుద్ధి చేసి విద్యుత్ స్తంభానికి కట్టేశారు. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. భవానీ, మహేష్‌ల మధ్య ఉన్న అక్రమ సంబంధానికి నాగరాజు అడ్డుస్తున్నాడనే ఉద్దేశంతో పథకం ప్రకారం నాగరాజును హతమార్చేందుకు యత్నించారు. దీనిపై నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు హత్యా నేరం క్రింద నల్లబోతుల భవానీ, పమిడి గుంట్ల మహేష్, పమిడిగుంట్ల ఆకాష్, మధార్వలి, ఖాసిం సైదా అలియాస్ అండా పై పట్టణ సీఐ ఎన్.నాగమల్లేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
21 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన మెన్ అండ్ ఉమెన్ టీమ్ చాంపియన్‌షిప్ సెలక్షన్ పోటీలు స్థానిక శ్యామలానగర్‌లోని వెంకటేశ్వర బాలకుటీర్‌లో నిర్వహిస్తామని పోటీల నిర్వాహకుడు పి.విజయ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా చెస్ వచ్చిన ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ఎంపిక చేసిన టీమ్‌ను ఈ నెల 27న బాటప్లలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ిసీహెచ్ రవీంద్ర రాజు, బాలకుటీర్ సీఏఓ దుర్గా రఘురామ్, ప్రిన్సిపల్ సుధామాధవి, విజయ్‌కుమార్ తదితరులు ఆవిష్కరించారు. మంగళగిరి టౌన్: ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన అఖిల భారత టేబుల్ టెన్నిస్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ బృందం ప్రతిభ కనబరిచింది. ఏపీ ఈగల్ బృందం గురువారం వివరాలను వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏపీ ఈగల్ బృందం రెండు కాంస్య పతకాలను సాధించినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున పోటీల్లో పాల్గొన్న ఏపీ ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ, అదనపు ఎస్పీ స్వరూపారాణి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నట్లు వివరించారు. మహిళల విభాగంలో అప్పా ఎస్పీ శోభామంజరి, స్వరూపా రాణిలు ఉమెన్ డబుల్ విభాగంలో రాణించి మరొక కాంస్య పతకాన్ని రాష్ట్ర ఖాతాలో వేశారని తెలియజేశారు. అఖిల భారత పోలీస్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖకు చెందిన అధికారులు రెండు పతకాలు సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషమని హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించిన డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు ఏపీ ఈగల్ చీఫ్ రవికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 524.30 అడుగులకు చేరింది. ఈ నీరు 157.2340 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలఅవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ప్రత్తిపాడు: హైవేపై ముందు వెళుతున్న కార్డును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గురువారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో చిలకలూరిపేట డిపో నుంచి గుంటూరు డిపోకు ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్న ఆర్టీసీ బస్సు, ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం కాటూరి ఆస్పత్రి సమీపంలో పదహారవ నంబరు జాతీయ రహదారిపై విజయవాడ వెళుతున్న ఇన్నోవా కారును వెనుక నుం,ఇ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణీకులు అదృష్టవశాత్తూ బయటపడ్డారు. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. హైవేపై ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సిబ్బందితో పాటు ప్రత్తిపాడు ఎస్ఐ నరహరి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అదే సమయంలో బస్సులో కూడా ప్రయాణీకులు ఉండటం, ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అవార్డులకు ఆరోగ్య కేంద్రాలు ఎంపిక గుంటూరు మెడికల్: జిల్లా లోని పట్టణ ఆరోగ్యకేంద్రాలు, ఆయష్మాన్ ఆరోగ్య మందిర్ల అవార్డులు, పారితోషికాలకు ఎంపికై న ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, సిబ్బందిని గురువారం డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అభినందించారు. ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో జాతీయ నాణ్యత అంచనా సంస్థ (ఎన్‌క్యూఏఎస్) రెండు రోజుల పాటు, నవజాత, మాతాశిశు, కౌమార బాలికల సంరక్షణ, సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల నివారణ అంశాలపై నిర్వహించిన ప్రమాణాలలో మూడు పట్టణ ఆరోగ్యకేంద్రాలు, మూడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు అవార్డులు రావడం అభినందనీయమన్నారు. అవార్డులకు ఎంపికై న నందులపేట (తెనాలి) –88.23 శాతం, రెడ్డిపాలెం (గుంటూరు) – 89.56శాతం, అడవితక్కెళ్లపాడు (గుంటూరు) –93.79 శాతం, మూడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు మాచవరం, పాండ్రపాడు –92.44శాతం, ఉప్పలపాడు, పెదనందిపాడు 91.75శాతం, ఉప్పలపాడు, పెదకాకాని 82.49శాతంలు అవార్డులకు ఎంపికయ్యాయని తెలిపారు. ఒక్కో పట్టణ ఆరోగ్యకేంద్రానికి రూ.3లక్షల పారితోషికం, ఒక్కో ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్కు రూ.1.26 లక్షలు ఆరోగ్యకేంద్రాలకు అభివృద్ధి, సిబ్బంది ప్రోత్సాహకాల రీత్యా అందజేయడం జరుగుతోందన్నారు. అవార్డులు పొందిన ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించి, మిగతా ఆరోగ్య కేంద్రాలు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని, ఆరోగ్యకేంద్రాల నిర్వహణను, వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందజేయాలని సూచించారు. -
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
సత్తెనపల్లి: విద్యుత్ షాక్‌కు గురై యువ రైతు మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం గోగులపాడు గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గోగులపాడు గ్రామానికి చెందిన యువ రైతు తన్నీరు వెంకటేశ్వర్లు (26) గురువారం తనకు చెందిన 2.50 ఎకరాల పొలంలో పచ్చిక కోసం వాగులో నీటిని తన పొలానికి మళ్లించేందుకు విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా షాక్‌కు గురై సమీపంలోని వాగు నీటిలో పడి పోయాడు. దీంతో అక్కడ ఉన్న రైతులు గమనించి తన్నీరు వెంకటేశ్వర్లను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య భూలక్ష్మి, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలోని మార్చురీకి తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా కేసులో మూడేళ్ల జైలు గుంటూరు లీగల్: గుంటూరులో నివాసం ఉంటూ వివిధ ప్రాంతాల చిరునామాలను ఉపయోగించుకుంటూ అక్రమంగా గంజాయిని రవాణా చేసి విక్రయిస్తున్న మద్దు రామకృష్ణయ్య గంజాయి అక్రమ రవాణా కేసులో మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. కేసు వివరాల ప్రకారం, రేపల్లె వైపు ప్రయాణిస్తున్న ఒక ఆటోలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వ్యక్తిని పోలీసులు వాహనాల తనిఖీల సందర్భంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న సంచిలో సుమారు రెండు కిలోలకు పైగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిపై ఆధారాలతో రేపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసులో సాక్ష్యాధారాలు పరిశీలించి, విచారణ అనంతరం నిజనిర్ధారణ చేసిన మొదటి అదనపు జిల్లా సెషన్ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్.సత్యవతి ముద్దాయి మద్దు రామకృష్ణయ్యకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.20 వేల జరిమా నా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.అశోక వాణి వాదనలు వినిపించారు. మాస్టర్ ఆఫ్ సైన్స్ సెమిస్టర్ ఫలితాలు విడుదల ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో జరిగిన మాస్టర్ ఆఫ్ సైన్స్ పస్ట్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణా ధికారి ఆలపాటి శివప్రసాదరావు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 28వ తేదీ లోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. -
బస్సుల సంఖ్య తగ్గించారు
గతంలో వినుకొండ నుంచి పిడుగురాళ్ల మధ్య మొత్తం 16 బస్సులు నడిచేవి. ఉచిత బస్సు పథకం ప్రారంభమైన తరువాత వాటి సంఖ్య 8కి తగ్గించారు. బస్సులు పెంచాల్సిందిపోయి తగ్గించడంతోనే వినుకొండలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులు పాయింట్లోకి రాగానే ప్రయాణికులు ఎగబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పట్టుతప్పి పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా పోలీసులను పెట్టి నియంత్రించినా ఉపయోగం లేదు. – ఉలవలపూడి రాము, సీపీఐ పట్టణ కార్యదర్శి, వినుకొండ -
ఏమాత్రం పట్టించుకోరే?
బిల్లులు చెల్లించకపోవడం వల్లే తీవ్రమైన టైఫాయిడ్ జ్వరంతో దర్శి ప్రాంతం నుంచి గత వారం ఓ వ్యక్తి నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి వచ్చాడు. రోగంతోనే కుటుంబ సభ్యుల సాయంతో ఓపీ లైన్లో పడిగాపులు కాశాడు. చివరికి ఓపీ చీటీ తీసుకుని డాక్టర్ వద్దకు వెళితే ఏవేవో పరీక్షలు చేయించమన్నారు. పరీక్షల హాలులోకి వెళ్లగా అక్కడా క్యూ లైన్ వెక్కిరించింది. ఎట్టకేలకు పరీక్షలు చేయించుకున్నాడు. సిబ్బంది చెప్పడంతో రోగంతోనే ఇంటిముఖం పట్టాడు. రెండో రోజు వచ్చి రిపోర్టులు తీసుకుని వైద్యుని వద్ద వెళితే మందులు చీటీ చేతిలో పెట్టాడు. ఆ చీటీ తీసుకుని మందులిచ్చే గది వద్దకు వెళితే.. ఇక్కడ లేవు.. బయట తెచ్చుకో అంటూ చీటీ ఇచ్చేశారు... ఇదీ నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నెలకొన్న దుస్థితి. -
విధుల్లో చేరిన ఆర్టీసీ కాల్ డ్రైవర్లు
చిలకలూరిపేట టౌన్ / యడ్లపాడు: గత రెండు రోజులుగా చిలకలూరిపేట ఆర్టీసీ డిపోను కుదిపేసిన డ్రైవర్ల ఆందోళన ఎట్టకేలకు శుభం కార్డు పడింది. చౌడవరం వద్ద డ్రైవర్ దుర్గాప్రసాద్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ, తమకు రక్షణ కల్పించడంతోపాటు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ 35 మంది కాల్ డ్రైవర్లు చేపట్టిన విధుల బహిష్కరణ బుధవారంతో ముగిసింది. జిల్లా రీజనల్ మేనేజర్ టి.అజిత కుమారి జరిపిన చర్చలు తొలుత విఫలమైనప్పటికీ, దాడికి పాల్పడిన వారిపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేయడం, ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో డ్రైవర్లు శాంతించారు. బాధిత డ్రైవర్‌కు పూర్తి న్యాయం చేస్తామని ఆర్ఎం భరోసా ఇవ్వడంతో వారు తిరిగి బుధవారం విధుల్లోకి చేరినట్లు డిపో మేనేజర్ వై.వేణు తెలిపారు. డిపోనకు చెందిన అన్ని సర్వీసులను పూర్తిగా పునరుద్ధరించినట్లు ఆయన తెలిపారు. ఈ రెండు రోజుల సమ్మె కారణంగా సకాలంలో సర్వీసులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇతర డిపోల నుంచి వచ్చిన డ్రైవర్లు విశ్రాంతి లేకుండా డబుల్ డ్యూటీలు చేయాల్సి వచ్చింది. ఐదు కీలక సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
పేదగుండెకు గుదిబండ
గుంటూరు మెడికల్: పేదల పెద్ద ఆసుపత్రి గుంటూరు జీజీహెచ్‌లో గుండె జబ్బుతో చేరి ఆపరేషన్లు చేయించుకోవాలంటే తప్పనిసరిగా రక్తాన్ని బయట కొనుక్కోవాల్సిందే. ఈ మాట వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. జీజీహెచ్‌లో బ్లడ్ బ్యాంకు ఉన్నప్పటికీ వైద్యులు మాత్రం ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి కొనుగోలు చేయించడం విమర్శలకు తావిస్తోంది. రూ. పది వేల వరకు ఖర్చు గుండె బైపాస్ సర్జరీ చేసే రోగికి ఆరు బ్లడ్బ్యాగులు అవసరమవుతాయి. ప్రైవేటు బ్లడ్‌బ్యాంకు నుంచి సుమారు దీనికోస రూ. 10వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. జీజీహెచ్‌లో బ్లడ్‌బ్యాంకు నుంచి రక్తాన్ని తెచ్చి వినియోగించేందుకు గుండె ఆపరేషన్ చేసే వైద్యులు (కార్డియో థొరాసిక్ సర్జరీ) సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇక్కడి రక్తం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం లేదని, ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయని, అందువల్లే బయట నుంచి కొనుగోలు చేయిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదే తరహాలో ఇతర విభాగాల్లోనూ బయట నుంచి రక్తం కొనుగోలు చేయిస్తే ఇక జీజీహెచ్‌లో ఉండి కూడా ఏం ప్రయోజనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర ఆపరేషన్లు చేస్తున్న వైద్యులు మాత్రం జీజీహెచ్ బ్లడ్‌బ్యాంకు నుంచి, ఆపరేషన్ చేయించుకుంటున్న రోగుల కుటుంబ సభ్యులు, బంధువుల రక్తదానం ద్వారా రక్తాన్ని సేకరించి రోగికి ఎక్కించి విజయవంతంగా ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్లు ఉచితమైనా.... గుండె బైపాస్ సర్జరీలు ప్రైవేటు ఆసుపత్రిలో పేదలు చేయించుకునే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ కొంత మంది డాక్టర్లు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో గుంటూరు జీజీహెచ్‌కు రోగులు వస్తున్నారు. కార్డియోథొరాసిక్ సర్జరీ (సీటీఎస్) వైద్యులు ఇటీవల 225 గుండె ఆపరేషన్లు పూర్తి చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. సుమారు రూ. 5 లక్షలకుపైగా ఖరీదు చేసే గుండె బైపాస్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. సీటీఎస్ వైద్య విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ప్రత్యేకంగా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం కొనుగోలు చేయించి తెప్పించే విధులు నిర్వహిస్తున్నాడు. వైద్యుల ఆదేశాల మేరకు ఇలా చేయాలని సూచిస్తున్నట్లు సదరు ఉద్యోగి తెలిపారు. ఏడాదికిపైగా ఇలా బయట కొనుగోలు చేయించడపై విమర్శలు వస్తున్నాయి. బ్లడ్‌బ్యాంకు తీరుపై విమర్శలు జీజీహెచ్ బ్లడ్‌బ్యాంకులో రక్తాన్ని తగిన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతున్నట్లు గుండె ఆపరేషన్ వైద్యులు ఆరోపణలు చేస్తున్నారు. రక్తంతోపాటు ప్లాస్మా, ప్లేట్లెట్స్, ఇతర కాంపోనెంట్స్ కూడా గుండె ఆపరేషన్ చేయించుకునేవారికి అవసరాన్ని బట్టి వినియోగిస్తారు. రక్తంతోపాటు ఇతర బ్లడ్ కాంపోనెంట్స్ ఆపరేషన్ చేసే రోగులకు ఎక్కించాల్సి వస్తే సదరు ఖర్చు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు, అంతకు మించి పెరగవచ్చు. ఇంత భారం పేద రోగులపై మోపేందుకు గుండె ఆపరేషన్ల వైద్యులు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఈ వివాదాలకు తెరదించాలి. -
బగళాముఖి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారిని బుధవారం ఏపీ హైకోర్టు న్యాయూమూర్తి జస్టిస్ ఉమామహేశ్వరరావు దంపతులు, ఏలూరు రిటైర్డ్ ఎస్పీ డీవీఎస్ మూర్తి దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ మేనేజర్ నరసింహమూర్తి, ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయం చుట్టూ వారు ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో జరిగిన పూర్ణాహుతి పూజా కార్యక్రమాలలో న్యాయమూర్తి దంపతులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తి దంపతులకు, ఎస్పీ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేసి ఈవో నరసింహమూర్తి అమ్మవారి ప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు. కార్యక్రమంలో పిట్టలవానిపాలెం తహసీల్దార్ డి.వెంకటేశ్వరరావు, బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రాన్ని ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్ హెచ్.ఇ.సిలాయ్జాకీ, ఆస్ట్రేలియన్ హై కమిషనర్ హెచ్.ఇ.ఫిలిప్లు బుధవారం సందర్శించారు. వారు విజయకీలాద్రిపై ఉన్న అన్ని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 27 అడుగుల ఏకశిలా విగ్రహం విఘ్న విమోచక హనుమాన్ను దర్శించుకున్నారు. అనంతరం వారికి చిత్రపటాన్ని, స్వామి వారి శేషవస్త్రాన్ని నిర్వాహకులు బహూకరించారు. ఆలయ విశిష్టతను జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు వివరించారు. పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం దర్శించుకున్నారు. మంత్రికి అర్చకస్వాములు, వేదపండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్ అందజేశారు. -
నీట్ రద్దుకు బాధ్యతగా కేంద్రమంత్రి రాజీనామా చేయాలి
లక్ష్మీపురం: ‘నీట్’ రద్దుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బండారుపు యశ్వంత్ రఘవీర్ డిమాండ్ చేశారు. గుంటూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష రాశారని చెప్పారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఉన్నత విద్య చదవాలని, డాక్టర్ అవ్వాలనే ఆకాంక్షతో నీట్ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అయ్యి పరీక్ష రాశారని చెప్పారు. కానీ వారి కలలను నీరుగార్చి వారి జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో హరియాణా, బిహార్ రాష్ట్రాలలో నీట్ పరీక్ష పేపర్‌ను 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు అమ్ముకొని లీకేజ్ చేశారని గుర్తు చేశారు. గతంలో ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాలలో నీట్ ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేసేవారని చెప్పారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యదర్శి సుదర్శనం అమర్నాథ్, నగర నాయకులు మహేష్, సాయి గణేష్ పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై పసుపు కొమ్ముల లారీ బోల్తా
క్లీనర్ మృతి, డ్రైవర్‌కు గాయాలు పెదకాకాని: జాతీయ రహదారిపై వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటన బుధవారం పెదకాకాని వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా, తోట్లవల్లూరు మండలం, బద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు కడప జిల్లా మైదుకూరులో విత్తన పసుపు కొమ్ములు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి లారీ బాడుగకు మాట్లాడుకుని ఆ విత్తన పసుపు కొమ్ములను లారీలో లోడు చేయించారు. పసుపు కొమ్ములతో బయలుదేరిన బుధవారం ఉదయం పెదకాకాని సమీపంలోకి చేరుకుంది. లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి ప్రక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొని ఫల్టీ కొట్టింది. లారీలో ఉన్న పసుపు కొమ్ములు రోడ్డుపై చెల్లా చెదురుగా పడటంతో వెనుక నుంచి వెళుతున్న వాహనాలు తొక్కుకుంటూనే ప్రయాణాలు సాగించాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కుమార్, క్లీనర్ ప్రసన్నకుమార్‌లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లీనర్ ప్రసన్నకుమార్ పరిస్థితి విషమంగా మారడంతో చినకాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రసన్నకుమార్(24) మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెదకాకాని పోలీసులు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పసుపు కొమ్ములను ఒక చోటకు చేర్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతుని సోదరుడు రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టిపి నారాయణస్వామి తెలిపారు. -
అక్రమ కేసులు బనాయించి వేధింపులు
పిడుగురాళ్ల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు సయ్యద్ జబీర్ అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీ కర్నూలు పట్టణ యూత్ అధ్యక్షుడు బాలుపై అక్రమ కేసులు పెట్టి, వేధించి ఆత్మహత్య చేసుకునేలా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. అణిచివేతల వలన వైఎస్సార్ సీపీ యూత్ విభాగం ఆగదని, మీరు ఎంతగా ఇబ్బందులకు గురి చేస్తే అంత రెట్టించిన ఉత్సాహంతో శ్రేణులు పనిచేస్తారని తెలిపారు. ప్రతిపక్షపార్టీగా వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వారిని ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీం మైనార్టీ యువకులను టీడీపీ నేతలు టార్గెట్ చేసి అణిచివేయాలని చూస్తున్నారని, వాటి ఆటలు సాగవని హెచ్చరించారు. దాడులను నిరశిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. పార్టీ గురజాల నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడారు. నియోజకవర్గ యువజన విభాగం అధక్షుడు బి. సాంబశివరావు, పిడుగురాళ్ల మండల యువజన విభాగం అధ్యక్షుడు ప్రసన్న, మాచవరం మండల అధ్యక్షుడు చిన్న రామాంజనేయులు, పల్నాడు జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ అబిద్, సయ్యద్ ఇమ్రాన్, కె.రమేష్, జిలానీ అబ్దుల్ మాజిద్ తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ జబీర్ -
శుభ శకునం కోసం ఎదురొస్తే ప్రాణాలే పోయాయి
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ఇంటికొచ్చిన బంధువులను తిరిగి పంపించేందుకు కారుకు శుభ శకునానికని ఎదురు వచ్చిన మహిళను వెనుక వైపు నుంచి దూసుకొచ్చిన మరోకారు ఢీకొనగా ఆమె మృత్యువాత పడిన ఘటన మండలంలోని కిలేశపురంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. ఘటనలో ఆమె కుమారుడికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం... కిలేశపురం గ్రామానికి చెందిన గుంటుపల్లి రమేష్, గంగాభవాని(44) దంపతుల కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి కుమార్తెను పుట్టింటికి కారులో తీసుకొచ్చిన బంధువులను తిరుగు ప్రయాణంలో పంపించేందుకు తన కుమారుడు వెంకట జితేంద్రతో కలిసి తల్లి గంగాభవాని శుభశకునం కోసం కారుకు డ్రైవర్ వైపు ఎదురు వచ్చింది. కారు ముందుకు సాగిన మరుక్షణం హైదరాబాద్ వైపు నుంచి దూసుకొచ్చిన మరో కారు వీరిద్దరినీ ఢీకొట్టింది. గంగాభవాని అక్కడికక్కడే మృత్యువాత పడగా, ఆమె కుమారుడు వెంకట జితేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జితేంద్రను హుటాహుటిన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
డాక్టర్ల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ శ్రీనివాసులు
గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ దాసరి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కార్యదర్శిగా దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇజాజ్ అబ్దుల్ రెహమాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా డాక్టర్ గుడిసె చంద్రశేఖర్, కేంద్ర ఎన్నికల పరిశీలకుడిగా డాక్టర్ ఇంజేటి బాబ్జిశ్యామ్‌కుమార్ వ్యవహరించారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ స్వరూప్‌కాంత్, డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ వేమూరు: అమృతలూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేద ప్రజలకు అందుతున్న వైద్య సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు అందించడం జరిగిందని వైద్యాధికారి డాక్టర్ పాలడుగు శృతి తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాతీయ నాణ్యత ప్రమాణాల హామీ బృందం సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్ 27 28 తేదీల్లో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడం జరిగిందన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అందించే వైద్య సేవలు, కాన్పుల విభాగం పనితీరు, లేబొరేటరీ పనితీరును పరిశీలించారన్నారు. అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన బృంద సభ్యులు, బుధవారం గుర్తింపు పత్రం అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర సిబ్బంది డాక్టర్ శృతిని అభినందించారు. ఆరోగ్య విస్తరణాధికారి కొల్లి శ్రీనివాసరెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకులు పుట్ట గుంట శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఐఓబీ కార్యాలయ నిర్మాణానికి ఒప్పందం
కొరిటెపాడు(గుంటూరు): అమరావతిలో ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ఎన్బీసీసీతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) మంగళవారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పందంపై బ్యాంక్ చీఫ్ రీజినల్ మేనేజర్ హర్షిత్ సింగ్ సమక్షంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం) కె.ఆస్వథ్ రామన్ నిర్వహించారు. ఐఓబీ తరపున హర్షిత్ సింగ్ అవగాహన ఒప్పందంపై సంతకం చేయగా, ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎస్ రావు, జనరల్ మేనేజర్ రాజారాం సంతకాలు చేశారు. అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలను రెండు సంస్థలు పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. అమరావతిలో ప్రతిపాదిత ప్రాంతీయ కార్యాలయం బ్యాంక్ విస్తరిస్తున్న వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఈ ప్రాంతంలో వినియోగదారుల సేవలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించనున్నట్లు ఐఓబీ బ్యాంక్ అధికారులు తెలిపారు. -
పాస్‌పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం తగదు
ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహనరసరావుపేట: ఈ–కేవైసీ, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం డివిజినల్ అధికారులు, తహసీల్దార్లతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. డ్రాఫ్ట్ పట్టాదార్ పాస్ పుస్తకాలకు ఈ–కేవైసీ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. పనులలో వెనుకబడి ఉన్న తప్పనిసరిగా ప్రగతి చూపించాలని, లేనిపక్షంలో చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ఇళ్ల గణన పరిశీలన.. జనగణనలో భాగంగా చేపట్టిన ఇళ్ల గణనను ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని రామిరెడ్డిపేటలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చేస్తున్న ఇళ్ల గణనను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే కేసులు.. నరసరావుపేట: జిల్లాలో బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే బాల్యవివాహాలు చేసే వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. సకాలంలో అధికారులను అప్రమత్తం చేయటం ద్వారా వెల్దుర్తి మండల పరిధిలోని రామచంద్రాపురం తండాలో ఒక బాల్య వివాహం, దాచేపల్లిలోని మరో వివాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నామన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు నిర్మూలన కోసం తీసుకోవలసిన చర్యలపై మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల సంరక్షణ యూనిట్, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో గ్రామస్థాయి, కమ్యూనిటీ లెవెల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థినుల ఇళ్ల వద్ద నిఘా ఉంచాలని, గ్రామస్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, స్కూల్ టీచర్లు, గ్రామ వెల్ఫేర్ సెక్రటరీ, మహిళా సంరక్షణ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
పల్నాడు
బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు.రాజుపాలెం: పెదనెమలిపురిలోని పోలేరమ్మ తిరునాళ్లను మంగళవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి సారె, బోనాలు సమర్పించారు. నీట్‌ను రద్దు చేశారని తెలియడంతో విద్యార్థులంతా తీవ్ర ఆవేదనకు లోనయ్యాం. ఎవరో చేసిన తప్పిదానికి ఒక్క నిర్ణయంతో పరీక్ష మొత్తాన్ని రద్దు చేయడం తగదు. రెండేళ్లపాటు ఎన్నో ఆశలతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని పరీక్ష రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో రద్దు నిర్ణయం కలచివేసింది. నీట్లో 720 మార్కులకు ప్రాథమిక ‘కీ’లో 691 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు వస్తుందని ఆశించాను. పరీక్ష నిర్వహించే సమయంలో పెట్టిన ఆంక్షలు, శ్రద్ధ పేపర్ లీకేజీ కాకుండా చూడడంలో ఎందుకు పెట్టలేదు. – వల్లెపు ధీరజ్కృష్ణ, విద్యార్థి, గుంటూరు ఎన్నో ఆశలతో మరెన్నో ఆకాంక్షలతో.. రాత్రనకా.. పగలనకా.. నిద్రాహారాలు మాని.. ఒకరకంగా ప్రాణం పెట్టి నీట్‌కు సిద్ధమయ్యారు.. సమయం కాకముందే కేంద్రాలకు చేరుకుని.. కఠిన ఆంక్షల పరీక్షలను దాటుకుని, పరీక్ష రాసి, హమ్మయ్యా.. అంటూ ఇంటికొచ్చారు.. తమకు రాబోయే ర్యాంకులు తలచుకుంటూ.. ఏఏ కళాశాలలో చేరాలో.. ఎక్కడెక్కడ సీటొస్తుందో నంటూ లెక్కలు వేసుకుంటూ.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నీట్ రద్దంటూ ఎన్టీఏ ప్రకటించడంతో విద్యార్థులు హతాశులయ్యారు. భవిష్యత్తుపై గంపెడాశలతో ఉన్న తమకు ఎన్టీఏ ప్రకటన శరాఘాత మైందని వాపోతున్నారు. రద్దు ప్రకటన తమ భవిష్యత్తుపై ఖచ్ఛితంగా ప్రభావం చూపుతుందని వ్యథ చెందుతున్నారు. పరీక్ష రోజు కఠిన ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టిన అధికారులు లీకేజీ విషయంలో ఎందుకు మిన్నకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 7 -
జిల్లా క్రీడాకారులకు అంతర్జాతీయ పతకాలు
మంగళగిరి టౌన్: పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించినట్లు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని తమ కార్యాలయంలో మంగళవారం విజేతల వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి చైనాలో జరుగుతున్న ఏషియన్ సబ్ జూనియర్, జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో తెనాలికి చెందిన వినయశ్రీ, జ్ఞాన దివ్య మహిళా పవర్ లిఫ్టర్లు పాల్గొని పతకాలు సాధించినట్లు తెలియజేశారు. వినయశ్రీ 84 కేజీల విభాగంలో సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించిందని, జ్ఞాన దివ్య +84 కిలోల విభాగంలో జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీ ల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించినట్లు వివరించారు. అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. పతకాలు సాధించిన క్రీడాకారులు -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
చాగంటివారిపాలెం (ముప్పాళ్ళ): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందిన సంఘటన జరిగింది. మృతురాలు పక్కనే అదే గ్రామానికి చెందిన యువకుడు రుద్రపాటి చంద్రశేఖర్ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... క్రోసూరు మండలంలోని 88 తాళ్ళూరు గ్రామానికి చెందిన షేక్ సైదాబీ (39) చాగంటివారిపాలెంకు చెందిన రుద్రపాటి చంద్రశేఖర్ కోసం మంగళవారం గ్రామానికి వచ్చింది. మధ్యాహ్నా సమయంలో ఇంటి యజమాని అంకమ్మ ఇంట్లోకి వెళ్లే సరికి చంద్రశేఖర్, సైదాబిలు పక్కపక్కనే అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా చంద్రశేఖర్ మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉండగా, సైదాబి మృతి చెంది ఉంది. చంద్రశేఖర్‌కు ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు... చంద్రశేఖర్‌తో సైదాబీకి కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఆ నేపథ్యంలోనే చాగంటివారిపాలెం గ్రామానికి తరచూ వస్తుండేదని స్థానికులు తెలిపారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, చంద్రశేఖర్‌ను బిర్యానీ కోసం బయటకు పంపించి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సైదాబీ మృతిని తట్టుకోలేక ఎక్కువ మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వెల్లడైంది. సైదాబీకి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్‌కుమార్ తెలిపారు. -
‘నీట్’ కల చెదిరిన వేళ
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026) రద్దు నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఏళ్ల తరబడి కష్టపడి సన్నద్ధమై నీట్ రాసి, జాతీయస్థాయిలో మంచి ర్యాంకు సాధిస్తామనే ధీమాతో ఉన్న విద్యార్థుల్లో ఎన్టీఏ నిర్ణయం ఆత్మ విశ్వాసాన్ని దిగజార్చింది. నీట్ నిర్వహణ సమయంలో దేశంలో ఏ ఒక్క పోటీ పరీక్షకు లేని విధంగా మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు, విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలు, చేతికి పెట్టుకునే వాచీలపై ఆంక్షలు విధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేపర్ లీకేజీని అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈనెల 3వ తేదీన జరిగిన నీట్‌కు గుంటూరు జిల్లాలో 8,299 మంది విద్యార్థులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను అధిగమించి, ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాసిన విద్యార్థులు లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఎన్టీఏ ప్రకటించగానే తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. నిరాశ, నిస్పృహలో విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వైద్య విద్యాసంస్థలతోపాటు, రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశించేందుకు జాతీయస్థాయిలో నిర్వహించే ఏకై క ప్రవేశ పరీక్ష నీట్‌కు తీవ్రమైన పోటీ నెలకొంటుంది. దేశ వ్యాప్తంగా భర్తీ చేసే లక్షా 12వేల సీట్లకు గానూ ఈనెల 3న జరిగిన నీట్‌కు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 720 మార్కులకు ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే నీట్‌కు తీవ్రమైన పోటీ నెలకొనడంతో విద్యార్థులు 6వ తరగతి నుంచే నీట్ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తుంటారు. నీట్ రాసి ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. -
చిలకలూరిపేట ఆర్టీసీలో వీడని ప్రతిష్టంభన
● రెండోరోజూ ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు ● ఆర్ఎం రజితకుమారి ఆధ్వర్యంలో చర్చలు చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల విధుల బహిష్కరణ రెండో రోజుకూ చేరడంతో ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. తోటి డ్రైవర్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ తమకు ప్రాణరక్షణ కల్పించే వరకు స్టీరింగ్ పట్టే ప్రసక్తే లేదని కాల్ డ్రైవర్లు భీష్మించుకోవడంతో అధికారులకు ఇది పెను సవాలుగా మారింది. మొత్తం 35 మంది డ్రైవర్లకుగాను ఐదుగురు మాత్రమే విధులకు హాజరుకావడంతో డిపో నుంచి బస్సులు కదలలేదు. సమస్య జఠిలం కావడంతో పల్నాడు జిల్లా రీజనల్ మేనేజర్ టి అజితకుమారి సోమవారం స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినప్పటికీ ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. నరసరావుపేట, సత్తెనపల్లి నుంచి ఇతర డ్రైవర్లను రప్పించి, అందుబాటులో ఉన్న వారితో డబుల్ డ్యూటీలు చేయిస్తూ ఆర్టీసీ అధికారులు నెట్టుకొస్తున్నారు. డిపో పరిధిలోని అద్దె ప్రాతిపదికన నడిపే 5 సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో చీరాల, మాచర్ల వంటి మార్గాల్లో కీలకమైన సర్వీసులు లేక సామాన్య ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం చేసేందుకు మంగళవారం తిరిగి ఆర్ఎం రజిత కుమారి చిలకలూరిపేట డిపోను సందర్శించారు. అయితే విధులను బహిష్కరించిన ఆన్‌కాల్ డ్రైవర్లంతా బాధిత డ్రైవర్ దుర్గాప్రసాద్‌కు అండగ నిలిచారు. తమ తోటి డ్రైవర్‌కు న్యాయం చేయాలంటూ దుర్గాప్రసాద్‌కు మద్దతుగా మంగళవారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ వద్దనే ఉన్నారు. దీంతో డ్రైవర్లతో ఆర్ఎం ఫోన్ ద్వారా రెండోరోజు చర్చలు జరిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు ఉంటాయని, గ్రామ పెద్దల మధ్యవర్తిత్వం తర్వాత కొంత సానుకూలత వ్యక్తమైనప్పటికీ, విధుల్లో భద్రతపై శాశ్వత భరోసా లభిస్తే తప్ప ఈ అనిశ్చితి పూర్తిగా తొలగేలా లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఈ విషయంపై ఆర్ఎం అజిత కుమారిని వివరణ కోరగా బాధిత డ్రైవర్‌కు తప్పక న్యాయం జరిగేలా చూస్తామని, ఇదే విషయాన్ని కాల్డ్రైవర్లతో ఫోన్‌ద్వారా తెలియజేశామని వారు బుధవారం నుంచి విధులకు హాజరు కానున్నట్లు చెప్పారని వివరించారు. -
విజయకీలాద్రిపై హనుమజ్జయంతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం హనుమాన్ జయంతి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళా శాసనాలతో ఉదయం 9 గంటలకు యోగాంజనేయస్వామి వారికి తొమ్మిది కలశాలతో అభిషేకం, విశేష అలంకరణ, అనంతరం 27 అడుగుల ఏకశిల మూర్తి శ్రీ విఘ్నవిమోచక హనుమంతునికి 9 రకాల పుష్పాలతో, పండ్లతో విశేష సహస్రనామార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. బాపట్ల: సూర్యలంక బీచ్‌లో స్వదేశ్ దర్శిని 2.0లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 16 నుంచి 22 వరకు జరగనున్న జాతీయ సీనియర్ కుడో పోటీలకు గుంటూరుకు చెందిన ఆర్ సిద్ధార్థ ఎంపికయ్యాడని కుడో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సిద్ధార్థ బంగారు పతకం సాధించాడన్నారు. దీంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): యువత క్రీడల్లో రాణించడం ద్వారా జిల్లా, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. గతనెల 26 నుంచి 28వ తేదీ వరకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయ అన్ఎక్విప్డ్ ఓపెన్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించిన వారిని మంగళవారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ అభినందించారు. ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తుపాకుల నాగజ్యోతి, జి.స్వాతి, కె.సత్యరామరాజు, ఎన్.ప్రణతిలు బంగారు పతకాలు సాధించారు. వినోద్‌కుమార్ రజత పతకం గెలుపొందారు. కోచ్ ఖమురుద్దీన్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిశారు. కలెక్టర్ క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అదికారి అఫ్రోజ్‌ఖాన్ పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 524.50 అడుగులకు చేరింది. ఇది 157.6100 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఉచిత ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అందుకు సంబంధించిన కరపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భం ఆమె మాట్లాడుతూ 3 నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ చదివే విద్యార్థినులు, విద్యార్థులకు వేరు వేరు వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దరఖాస్తులు గ్రామ సచివాలయం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వసతి గృహ సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల కార్యాలయాల్లో పొందాలని సూచించారు. ఇన్చార్జి జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి కె.సంతోష్ కుమార్, వసతి గృహ సంక్షేమ అధికారులు జయప్రద, రాణమ్మ, రాజేశ్వరి, రామాంజనేయులు, వెంకటేశ్వర నాయక్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సంగీతంలో రెండోసారి గిన్నిస్ బుక్ రికార్డ్
కర్లపాలెం: సంగీతంలో ఓ బాలుడు తన సత్తా చాటాడు. రెండోసారి గిన్నిస్ రికార్డు సాధించాడు. కర్లపాలెం మండలం బిడారుదిబ్బ గ్రామానికి చెందిన కట్టుపల్లి విల్సన్‌బాబు, ప్రత్యూషల కుమారుడు జోయల్ విల్సన్‌బాబు. 7వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో 22 దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డు వాయిద్య కళాకారులతో కార్యక్రమం ఏర్పాటైంది. నిమిషంలో సప్తస్వరాలు, గంటపాటు ఆపకుండా కీబోర్డు వాయించటంపై పోటీలు నిర్వహించారు. జోయల్ విల్సన్బాబుకు రికార్డులో స్థానం లభించింది. 2024 డిసెంబర్ 1న విజయవాడలో జరిగిన సంగీత పోటీలలో కూడా జోయల్ విల్సన్‌బాబు పాల్గొన్నాడు. ఈ నెల 9న విజయవాడలో జరిగిన హల్లెల్ సంగీత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల నుంచి దీనికి సంబంధించి జోయల్ విల్సన్ బాబుకు సర్టిఫికెట్, మెడల్ అందాయి. -
హెచ్‌పీవీ వ్యాక్సిన్ లక్ష్యాలు పూర్తి చేయాలి
కారంచేడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్ లక్ష్యాలను వైద్య సిబ్బంది ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ రత్నమన్మోహన్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కారంచేడు, దగ్గుబాడు పీహెచ్‌సీల వైద్యాధికారులు, సూపర్వైజర్లతోపాటు పర్చూరు కో లొకేటడ్ పీహెచ్సీ వైద్య సిబ్బందితోనూ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీలోగా మీ పీహెచ్‌సీల పరిధిలో ఉన్న 15 ఏళ్లలోపు బాలికలను గుర్తించి వారికి ఈ వ్యాక్సిన్ అందించాలన్నారు. బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించడం వలన కలిగే మేలు తెలియజేయాలని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన సర్వైకల్ క్యాన్సర్నును నివారించుకోవచ్చని ఆయన తెలిపారు. మూడు పీహెచ్‌సీల పరిధిలోనూ చాలా తక్కువ మందికే వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పృథ్వీరాజ్, పర్చూరు కో లోకేటెడ్ వైద్యాధికారి డాక్టర్ సాయిప్రశాంతి, దగ్గుబాడు పీహెచ్సీ వైద్యాఽధికారి డాక్టర్ డాక్టర్ హరిత, హెల్త్ సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా?
జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా.. ? విద్యార్థులు పగలు, రాత్రి అహర్నిశలు కష్టపడి పరీక్ష రాసిన తరువాత హఠాత్తుగా రద్దు చేయడం వారిలోని మనోధైర్యం, ఆత్మ విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2024లో సైతం ఇదే విధంగా తప్పిదాలు చోటు చేసుకుంటే పరీక్షను రద్దు చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నారు. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైన నీట్ నిర్వహణలో ఎన్టీఏ ఘోరంగా విఫలమైంది. పరీక్ష నిర్వహణ పేరుతో విద్యార్థులకు కఠినమైన ఆంక్షలు విధించి, పరీక్ష నిర్వహణలో ఫెయిలయ్యారు. – బాదినేని హరిబాబు, ప్రిన్సిపాల్, భాష్యం మెడెక్స్ కళాశాల, గుంటూరు -
ఉపాధ్యాయులపై సెలవుల్లో ఒత్తిడి తగదు
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహనరావు నరసరావుపేట/నరసరావుపేట ఈస్ట్: వేసవి సెలవులు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల సెలవులు హరిస్తూ వివిధ కారణాలతో ఒత్తిడికి గురిచేస్తున్నారని యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా ప్రణాళిక రూపకల్పన, పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయల్ తరగతుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా ప్రణాళిక రూపొందించాలని షెడ్యూల్ విడుదల చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు విద్యా ప్రణాళికలు రూపొందించి 16వ తేదీన సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. విద్యాశాఖ వెకేషన్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులు కొంత కాలంగా మరచినట్టు ఉన్నారని విమర్శించారు. గత నవంబర్లోనే రూపొందించాల్సిన విద్యా ప్రణాళికను అప్పుడు పట్టించుకోని అధికారులు వేసవి సెలవుల్లో షెడ్యూల్ జారీ చేయటం ఉపాధ్యాయులను వేధించటమేనని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు విద్యా ప్రణాళిక షెడ్యూల్‌ను వాయిదా వేయాలనీ, లేని పక్షంలో బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. నరసరావుపేట రూరల్: వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని రావిపాడులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామంలోని కాసు వెంగళరెడ్డి కాలనీకి చెందిన కాలే పాపమ్మ(75) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. రెండు రోజుల కిందట వరకు మిరప కూలి పనులకు వెళ్లింది. ఎండ తీవ్రతకు తీవ్ర అస్వస్థతకు గురై ఇంటి వద్ద చికిత్స తీసుకుంటూ మంగళవారం మృతిచెందింది. రొంపిచర్ల: మండలంలోని విప్పర్ల గ్రామం వద్దగల కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విప్పర్ల గ్రామానికి చెందిన కోరా వెంకటేశ్వర్లు(30) మృతి చెందాడు. కోరా వెంకటేశ్వర్లు తన ద్విచక్రవాహనంపై రెడ్డిపాలెం గ్రామం నుంచి తన స్వగ్రామమైన విప్పర్ల గ్రామానికి వస్తూ ఎక్స్‌ప్రెస్‌వేని దాటుతుండగా నకరికల్లు వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ ప్రాంతంలో మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. విజయపురి సౌత్‌లోని డౌన్ మార్కెట్‌కు చెందిన మైలపల్లి గోవింద్ (42) శ్రీశైలానికి వెళ్లే మార్గంలో జోడుతొట్లు వద్ద ఉంటున్నాడు. సోమవారం పిల్లలతో ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబసభ్యులు సాగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో జెండాపెంట వద్ద గోవింద్ మృతి చెందాడు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మాచర్ల: రోడ్డు ప్రమాదంలో మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కర్రా నాగార్జున బాబు (24) మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. నాగార్జున బాబు భార్య పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం రాత్రి మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును చూసిన నాగార్జున సంతోషంతో తిరిగి వెళ్తూ మద్యం తాగాడు. అనంతరం వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. నాగార్జున మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాపట్ల: వైద్యరంగంలో వైద్యులతోపాటు నర్సుల పాత్ర కూడా కీలకమని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విజయమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పీపీ యూనిట్లో నర్సులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ బి.ఎస్.నారాయణభట్టు, నవనీతం, చల్లా లావణ్య, డీఎఫ్ఓ యశ్వంత్, జాషువా, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నేత నాగార్జునయాదవ్‌పై మరో కేసు
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్‌పై పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్్లో మంగళవారం మరో అక్రమ కేసు నమోదు చేశారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించిందంటూ నాగార్జునయాదవ్ గతంలో ఆరోపణలు చేశారు. ముఖ్యంగా 2024 డిసెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు 244 రోజులపాటు ఈ నిధులు స్థానిక సంస్థలకు అందలేదని ఆయన గణంకాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు అసత్యమని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని జనసేన నేత రామ సైదులు ఇచ్చిన ఫిర్యాదుతో సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కాగా, ఇదే అంశంపై నాగార్జునయాదవ్‌పై కొద్దిరోజుల కిందట కాకినాడ జిల్లాలో కూడా కేసు నమోదు చేశారు. -
ఆగస్టు చివరి నాటికి సౌరవిద్యుత్ యూనిట్ల ఏర్పాటు
నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలోని 1.91 లక్షల ఎస్సీ, ఎస్టీలకు చెందిన గృహాలపై సోలార్ రూఫ్ టాప్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం వచ్చే ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఏపీసీపీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి వెల్లడించారు. మంగళవారం జొన్నలగడ్డ రోడ్డులోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి హాజరై ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీల సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్ పథకం అమలు, రెవెన్యూ కలెక్షన్లు, లో ఓల్టేజ్ సమస్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంటిపై రెండు కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన మెటీరియల్‌లో చాలా భాగం వచ్చాయన్నారు. పీఎం సూర్యఘర్‌కు సంబంధించి 40 వేల కనెక్షన్లు, వాటిలో జిల్లాలో మూడు వేల కనెక్షన్లు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం సూర్యఘర్ మరో పది వేల యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నెలకు ఐదు వేల లక్ష్యంతో రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. సాగు కనెక్షన్లపై దృష్టి రైతులకు రోజుకు 42 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ విద్యుత్ కోసం 12 సబ్స్టేషన్లలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2027 మార్చి చివరికల్లా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తి చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ బకాయిలు కొంత ఉన్నాయని, వాటిని వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన రెవెన్యూ కూడా కొంత బాకీ ఉందన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్, కాలనీల నుంచి విద్యుత్ బకాయిలు సుమారు రూ.40 కోట్ల వరకు రావాల్సి ఉందన్నారు. వాళ్లను కూడా చెల్లించాలని కోరామన్నారు. వేసవిలో ఎక్కడా లో ఓల్టేజ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో ఏడు నూతన సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, నాలుగు చోట్ల పనులు మొదలు పెట్టారన్నారు. వచ్చే మూడు నెలల్లో మొత్తం పూర్తి చేస్తామన్నారు. మార్చి నెలలో వందశాతం రెవెన్యూ కలెక్షన్ సాధించామని, ఏప్రిల్ నెలలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి బకాయిలు అందకపోవటంతో ఐదు శాతం రెవెన్యూ తగ్గిందన్నారు. టెక్నికల్ డైరక్టర్ మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్ డైరక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఈ పి.విజయకుమార్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. 1.91 లక్షల ఎస్సీ, ఎస్టీల గృహాలపై బిగించేందుకు చర్యలు -
టార్గెట్ గుంటూరు !
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైల్వే ప్రయాణికుల భద్రత రైల్వే, పోలీస్ శాఖకు సవాల్‌గా మారింది. దొంగలు ఉమ్మడి గుంటూరులో తమకు అనువైన ప్రాంతాలను టార్గెట్‌గా పెట్టుకోవడంతో వారి నుంచి ప్రయాణికులను కాపాడటం రైల్వే పోలీసులకు కత్తిమీద సాములా మారింది. తాజాగా పొన్నూరు మండలం నిడుబ్రోలు సమీపంలో దుండగులు రైలు దోపిడీకి విఫలయత్నం చేయడం, పోలీసులు పది రౌండ్లు కాల్పులు జరపడటం కలకలం సృష్టించింది. నిడుబ్రోలు సమీపంలోని ఆలూరు రైల్వే సిగ్నల్ వద్ద రైలును ఆపి దోపిడీకి పాల్పడేందుకు దుండగులు యత్నించారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు బృందానికి ఇద్దరు అనుమానాస్పదంగా రైల్వే ట్రాక్‌పై ఉండటం కనిపించింది. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి దుండగులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లో సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసి రైలును నిలిపివేయాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు వారు అక్కడ వదిలిపెట్టి వెళ్లిన పరికరాలను చూస్తే అర్ధం అవుతోంది. సిబ్బంది కొరతే పెనుసవాలు రైల్వే శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ నేరాలు అధిగమించేందుకు ఉన్నంత సిబ్బందితోనే దొంగతనాలకు పాల్పడిన వారిపై కాల్పులు జరిపి ప్రయాణికులకు భద్రత కల్పించడంలో ఈసారి విజయం సాధించారు. సిబ్బంది కొరత వల్ల, సరైన సదుపాయాలు లేకనే ఇలాంటి పరిస్థితి నెలకొందని రైల్వే పోలీస్ అధికారులు వాపోతున్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఐఆర్పీ విభాగాలు ఉన్నాయి. వాటిలో డివిజన్‌కు కావాల్సినంత మంది సిబ్బంది లేకపోవడం పోలీసులకు పెను సవాల్‌గా మారుతుంది. ప్రధానంగా గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని జీఆర్పీ పరిధిలో 56 మంది సిబ్బంది ఉండాల్సింది ప్రస్తుతం 23 మంది మాత్రమే ఉన్నారు. వారిలో డీఎస్పీ ఆఫీస్, కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు అంటూ సిబ్బందిని కేటాయించగా 12 మంది మాత్రమే సిబ్బంది ఉండటంతో పక్క జిల్లా నుంచి వచ్చిన సిబ్బందితో రాత్రిళ్లు గస్తీ కాయాల్సి వస్తోంది. అదేవిధంగా ఆర్పీఎఫ్ గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలోని 55 మందికి గాను ప్రస్తుతం 33 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. వారిలో గుంటూరు ఆర్పీఎఫ్ పరిధిలో రెండు రైళ్లకు సిబ్బందిని బందోబస్తుకు పంపించాల్సి ఉంటుంది. అయితే 33 మందిలో సుమారు పూర్తి స్థాయిలో 25 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో కూడా సిబ్బంది కొరత ఉంది. దీంతో పక్కజిల్లాల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి విధులు కేటాయిస్తున్నారు. అసలేం జరిగింది రోజు మాదిరిగానే ఆదివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని నిడుబ్రోలు పరిసర ప్రాంతంలోని ఆలూరు వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పూర్తి స్థాయిలో చేతులకు గ్లౌజులు, మాస్కులు ధరించి, కటర్లతో సహా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసేందుకు యత్నిస్తుండగా.. అదే సమయంలో నరసరావుపేట ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుల్లు తుపాకులతో ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను చూసి ముందుగా గాల్లో కాల్పులు జరపగా ఆ ఇద్దరు వ్యక్తులు పోలీసులపై పట్టాలపై ఉండే కంకర రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అయినప్పటికి జీఆర్పీ పోలీసులు ప్రాణాలను ఫణంగా పెట్టి పది రౌండ్లు కాల్పులు జరిపి వారిని పట్టుకునేందుకు యత్నించారు. అయితే దుండగులు తప్పించుకుని పరారయ్యారు. అయితే ఈ ఘటన అంతా గుంటూరు జీఆర్పీ పరిధిలో చోటు చేసుకున్నప్పటికీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) మాత్రం విజయవాడ డివిజన్ కిందకు వస్తుంది. దీంతో ఇటు విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు, గుంటూరు జీఆర్పీ పోలీసులతో పాటు పొన్నూరు రూరల్ పోలీసులు సహా గాలింపులు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. -
మా నాన్న టీడీపీ ఎమ్మెల్యే.. నీ భర్తను నాకిచ్చేయ్!
‘‘మా నాన్న అధికార పార్టీ ఎమ్మెల్యే.. పోలీసులు నా మనషులే.. ఏమనుకుంటున్నావ్.. నేను తల్చుకుంటే నిన్ను, నీ భర్తను ఏమైనా చేయగలను’’ అంటూ అంటూ టీడీపీ మహిళా నేత ఒకరు బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు.. తన కాపురం చెడగొట్టద్దని వేడుకంటే చంపేస్తానని బెదిరిస్తోందని వాపోతోందామె. సాక్షి, పల్నాడు జిల్లా: నరసరావుపేట పట్టణానికి చెందిన కర్లకుంట కృష్ణదీప్తి తాజాగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్)ను ఆశ్రయించింది. టీడీపీకి చెందిన మల్లవరపు అభినయ సింధూర తన కాపురంలో నిప్పులు పోసిందని.. గట్టిగా నిలదీస్తే తెలుగు దేశం పెద్దలు పేర్లు చెబుతోందని చెబుతోంది. ‘‘నా భర్త కాళీ.. ముగ్గురు సంతానంతో సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యేగారి కూతురునంటూ 10 నెలల కిందట మల్లవరపు అభినయ సింధూర నా భర్తకు పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె మోజులో పడి నా భర్త ఇంటికి కూడా రాలేదు. ఆయన్ని వదిలేయాలని బతిమాలితే.. ‘నేను ఎమ్మెల్యే గారి అమ్మాయిని. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మా మావయ్య’ అని బెదిరిస్తోంది. నా భర్తకు విడాకులివ్వాలని నాపై ఒత్తిడి చేస్తోంది. మాట వినకపోతే నా భర్తను అక్రమ కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తోంది. నన్ను, నా బిడ్డలను చంపేస్తానంటోంది.. .. హానీ ట్రాప్ లేడీలా వ్యవహరిస్తున్న సింధుర మీద టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ ప్రభాకర్ కౌన్సెలింగ్ నిర్వహించి నా భర్తను కూడా మందలించారు. మనసు మార్చుకున్న నా భర్త.. మా కోసం దిగివచ్చాడు. దీంతో రేప్ కేసు పెడతానంటూ సింధూర నా భర్తపై బెదిరింపులకు దిగింది. నీ భార్యను వదిలి రాకపోతే ఆత్మహాత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తోంది. అయినా వినకుంటే నన్ను హత్య చేయిస్తానని నా భర్తకు నరకం చూపిస్తోంది. ఇప్పటికే మేం ఆర్థికంగా దెబ్బతిని.. అప్పులలో కూరుకుపోయామని ఉన్నాం. మా బతుకు మమ్మల్ని బతుకనీయండి అని వేడుకున్నా సింధూర కనికరించడం లేదు. అధికార పార్టీ నేతల అండ దండలు చూసి ఆమె రెచ్చిపోతోంది. ఆమె నుంచి మాకు ప్రాణహని ఉంది. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అని ఎస్పీ కార్యాలయంలో చేసిన ఫిర్యాదులో బాధితురాలు కృష్ణదీప్తి పేర్కొంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
గణపవరంలో క్షుద్రపూజల కలకలం
నాదెండ్ల: నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. నాదెండ్ల–గణపవరం ఎన్ఎస్పీ కాలువ కట్ట మీద ముగ్గుతో గీతలు గీసి పసుపు కుంకుమ, అరటి నిమ్మకాయలు, కొబ్బరికాయలు పెట్టి క్షుద్రపూజలు చేసినట్లు స్ధానికులు గుర్తించారు. సోమవారం ఉదయం స్థానిక రైతులు అటుగా వెళ్తూండగా, వింత ఆకృతిలో గీసిన ముగ్గు, పూజా సామాగ్రి చూసి ఆందోళనకు గురయ్యారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. 14న నాట్కో సెంటర్లో పెట్ స్కాన్ ప్రారంభం గుంటూరు మెడికల్: క్యాన్సర్ వైద్యంలో రాష్ట్రానికే తలమానికంగా ఉన్న గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో సెంటర్ మరింత అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. నాట్కో సెంటర్ విభాగంలో ఈ నెల 14న పెట్ స్కాన్ సెంటర్ ప్రారంభించనున్నారు. సోమవారం దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, తదితరులు ఉన్నారు. 23న ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలు గుంటూరు ఎడ్యుకేషన్: అధ్యాపక ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్సీ ఎంజే మాణిక్యరావు శత జయంతి ఉత్సవాలను ఈనెల 23న గుంటూరులోని ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఎంజే మాణిక్యరావు మెమోరియల్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. సోమవారం అరండల్‌పేటలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో శత జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ఎయిడెడ్ అధ్యాపకుల సంక్షేమం కోసం ఎంజే మాణిక్యరావు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు. ఆయన పోరాట ఫలితమే ఎయిడెడ్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. ఈనెల 23న జరిగే శత జయంతి ఉత్సవాలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఏఎన్‌యూ మాజీ వీసీ ప్రొఫెసర్ వి. బాలమోహన్ దాస్, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అధ్యాపకులు హాజరు కానున్నారని తెలిపారు. -
ఆర్టీసీ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోండి
1980లో అమరావతిలో బస్టాండ్ నిర్మాణం కోసం అమరేశ్వర దేవస్థాన సర్వీసు మాన్యంకు చెందిన నాలుగు సెంట్ల భూమిని ఆర్టీసీ సంస్థకు ఇచ్చారు. నెల కిందట దేవినేని సాంబశివరావు అతని అనుచరులు తన మామకు అందులో ఒక సెంటు స్థలం ఉందంటూ పొక్లెయిన్‌తో స్థలంలోని పంపుహౌస్‌ను ధ్వంసం చేశారు. ప్రశ్నించిన అధికారులపై దౌర్జన్యం చేశారు. డిపో మేనేజర్ నాగమణికి పార్టీ తరపున ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ స్థలాన్ని పరిరక్షించి ప్రహరీ నిర్మాణం చేసి పంపుహౌస్‌ను ధ్వంసం చేసినందుకు నష్టపరిహారం సంస్థకు చెల్లించేలా చూడాలి. –బి.సూరిబాబు, సీపీఎం మండల కార్యదర్శి, అమరావతి -
అర్జీలు నాణ్యతగా పరిష్కరించాలి
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ నరసరావుపేట: అర్జీలు సత్వరం అత్యంత నాణ్యతతో అలసత్వం లేకుండా గడువులోపు పరిష్కారం చేయాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్‌లకు అధ్యక్షత వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన వారిచే 119 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించినవి 15 అర్జీలు ఉండగా అందులో నరసరావుపేట డివిజన్ నుంచి ఏడు, గురజాల, సత్తెనపల్లి డివిజన్ల నుంచి నాలుగు చొప్పున ఉన్నాయి. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. డీఆర్ఓ నారదముని, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం
నరసరావుపేట రూరల్: భూ వివాదాలపై పీజీఆర్ఎస్లో అధిక ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) జేవి సంతోష్ పీజీఆర్ఎస్లో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం తదితర సమస్యలకు సంబంధించి 41 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలనిఅనదపు ఎస్పీ సూచించారు. సమాఖ్య లీడర్ మల్లెల అనీల నాకు తెలియకుండా నాలుగు పొదుపు సంఘాల్లో సభ్యురాలిగా చేర్చి బ్యాంక్‌ల నుంచి సుమారు రూ.10లక్షల వరకు రుణం తీసుకుని మోసం చేసింది. బ్యాంక్ నుంచి రుణం చెల్లించమని నోటీసులు రావడంతో విషయం తెలిసింది. దీనిపై అనీలను ప్రశ్నించగా బ్యాంక్‌కు డబ్బులు నేను చెల్లిస్తానని చెప్పిందని, రెండు సంవత్సరాల తరువాత ఇప్పుడు నేను చెల్లించనని బెదిరింపులకు పాల్పడుతుంది. ఫోర్జరీ సంతకాలతో రుణాలు పొందిన అనీలపై చర్యలు తీసుకోవాలి. –కంచర్ల సుజాత, నరసరావుపేట గ్రామంలో నాకు చెందిన 13 సెంట్లలో రెండు సెంట్లలో దుకాణాలు ఏర్పాటుచేసి అద్దెలకు ఇచ్చాను. ఈ స్థలం నాదంటూ పాపిరెడ్డి అనే వ్యక్తి వచ్చి దుకాణాదారులను బెదిరించి అద్దె వసూలు చేస్తున్నాడు. దీనిపై తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయగా స్థలాన్ని సర్వే చేసి నాదిగా నిర్దారించారు. అయినా పాపిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతూ దాడికి ప్రయత్నిస్తున్నాడు. నాకు రక్షణ కల్పించి న్యాయం చేయాలి. –దిడిచినాల రామిరెడ్డి, శిరిగిరిపాడు ఉద్యోగం కల్పిస్తానని మోసం చేశారు. గతేడాది డిసెంబర్ 11వ తేదీన రాజా హిందుస్తాన్ నిధి సంస్థలో సేల్స్ ఆఫీసర్‌గా నియమించారు. నెలకు రూ.45వేలు జీతం అని ప్రకటించి నాలుగు నెలలుగా పని చేయించుకుంటూ జీతం ఇవ్వడం లేదు. ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నట్టు సంస్థపై చర్యలు తీసుకోవాలి. –జంగాల కోటేశ్వరరావు, నరసరావుపేట ఏటీఎం సెంటర్లో సహాయం చేస్తానని చెప్పి యువతి తన అకౌంట్ నుంచి నగదు డ్రా చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన పెదనందిపాడు రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు నగదు డ్రా చేసుకునేందుకు వెళ్లాను. నాకు చదువు లేకపోవడంతో అక్కడే ఉన్న యువతిని డబ్బులు డ్రా చేసి పెట్టమని కోరాను. యువతి పలు నెంబర్లు కొట్టిన తరువాత కార్డు పనిచేయడం లేదని వెళ్లిపోయింది. దీనిపై బ్యాంక్ అధికారులను సంప్రదించగా నా అకౌంట్ నుంచి రూ.26వేలు డ్రా చేసినట్టు చెప్పారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు. –షేక్ మీరా అహ్మద్, చిలకలూరిపేట -
న్యాయమూర్తులకు పదోన్నతులు
గుంటూరు లీగల్: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కోర్టుకు జూనియర్ డివిజన్ న్యాయమూర్తులుగా పి.రాజశేఖర్ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, తెనాలి నుంచి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. పీడీఎం కోర్టు జడ్జి స్పెషల్ మొబైల్ కోర్టు, గుంటూరుకు బదిలీ అయ్యారు. జె.అంజయ్య ఉదయగిరి, నెల్లూరు జిల్లా నుంచి రైల్వే కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వి.రఘునాథ్ ఏలూరు నుంచి మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వస్తున్నట్లు సమాచారం. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు సోమవారం ఐదో రోజుకు చేరాయి. అమ్మవారు గాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరు గ్రామాలలో ఊరేగించారు. మహిళలు అమ్మవారికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనక తప్పెట్లు, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమజ్జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా త్రిదండి చిన్న జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సోమవారం దాసాంజనేయస్వామి వారికి అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజయకీలాద్రి దివ్యక్షేత్ర హనుమత్ విజయయాత్ర విజయవాడ రథం సెంటర్ నుంచి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రం వరకు కొనసాగిందని, భక్తులు అధిక సంఖ్యలో ఈ విజయయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. పొన్నూరు: పట్టణంలోని సహస్రలింగేశ్వరస్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున పంచామృత అభిషేకం, మధ్యాహ్నం లక్ష తమలపాకులు పూజ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామి వారు ఒంటె వాహనంపై నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ఆకురాతి శ్రీనివాసరావు, ధర్మకర్త సభ్యులు పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 4 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం, 7 గంటలకు విశేష అలంకరణ, 12 గంటలకు లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 7 గంటలకు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు భక్తులు పాల్గొనాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు. -
వేసవి సెలవుల్లో సమావేశాల ఏర్పాటు తగదు
ఎస్టీయూ నాయకులు నరసరావుపేట ఈస్ట్: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన తరువాత కూడా వరుసగా వివిధ సమావేశాల పేరుతో సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయులను వేధించటం తగదని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ప్రతినిధులు పేర్కొన్నారు. ఎస్టీయూ నాయకులు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావును కలసి వినతి పత్రం అందజేశారు. పాఠశాలల్లో ఆడ్మిషన్ డ్రైవ్‌ను ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో చేస్తున్నప్పటికీ, వేసవి సెలవుల మధ్యలో ఉపాధ్యాయులు అందుబాటులో లేని సమయంలో మండల స్థాయిలో పాఠశాల ప్లాన్, హ్యాబిటేషన్, క్లస్టర్ ప్లాన్, మండల ప్లాన్‌ను ఈనెల 13వ తేదీలోపు పూర్తి చేయాలని గడువు విధించటం సరికాదని తెలిపారు. ఈమేరకు సమగ్ర శిక్ష ప్లాన్ షెడ్యూల్ ప్రకటించటం అభ్యంతరకరమని తెలిపారు. అధికారుల తీరుతో విద్యా శాఖ వెకేషన్ డిపార్ట్‌మెంటా లేదా నాన్ వెకేషన్ డిపార్ట్‌మెంటా అని ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విద్యా సంవత్సరంలో నవంబర్ నెలలో స్కూల్ డెవలప్మెంట్, హ్యాబిటేషన్, క్లస్టర్, మండల ప్రణాళికలను పూర్తి చేయాల్సి ఉందనీ, వేసవి సెలవుల్లో షెడ్యూల్ విడుదల చేయటాన్ని ఎస్టీయూ వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. వేసవి సెలవులు పూర్తయిన తరువాత మరోమారు షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. డీఈఓ స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళతానని తెలి పా రు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండీ, జిల్లా ఆర్థిక కార్యదర్శి షేక్.మహబూబ్ సుభానీ, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు షేక్.కరిముల్లా, రాష్ట్ర కౌన్సిలర్ వై.రామయ్య, పి.వి.మల్లికార్జునరెడ్డి, రొంపిచర్ల మండల అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఇసుక భూముల్లో నమూనాల సేకరణ
చినగంజాం: ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి స్థానిక వ్యవసాయ భూముల రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా భగర్భ గనులు శాఖ అధికారులు సోమవారం ఇసుక నమూనాలు సేకరించారు. జిల్లా భూగర్భ గనుల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ దమయంతి ఆధ్వర్యంలో చినగంజాం సర్వే నంబర్ 828, మోటుపల్లి సర్వే నంబర్ 128లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపారని ఆరోపించిన ప్రాంతంలో మొత్తం ఆరు నమూనాలను సేకరించారు. మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన రైతులు అనుమాలశెట్టి శ్రీరామకృష్ణ తదితర రైతులు ఆ ప్రాంతంలో తమ వ్యవసాయ భూములున్నాయని ఇసుక అక్రమ తవ్వకాలు జరపడం వలన తమ భూములకు సాగు నీరు లేకుండా పోతుందన్నారు. గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అప్పుడు విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు ఆ భూములలో సాధారణ ఇసుక మాత్రమే ఉందని తవ్వకాలు జరగకుండా నిలిపివేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు నివేదిక పంపారు. అటు తరువాత స్థానిక రైతులు ఆప్రాంతంలో సాధారణ ఇసుక మాత్రమే కాదని విలువైన సిలికాన్ ఇసుక కూడా ఉందని భూగర్భగనులశాఖతో సర్వే చేయించాలని కోరడంతో సంబంధిత శాఖాధికారులు సోమవారం ఘటనా స్థలానికి వచ్చి నమూనాలను సేకరించారు. కార్యక్రమంలో భూగర్భ గనులశాఖ కార్యాలయ సబార్డినేట్ అధికారి మహేష్, రెవెన్యూ అధికారులు నాగరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు. -
మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోండి
నాదెండ్ల మండలం చందవరానికి చెందిన గొర్రపాటి శ్రీనివాసరావు తూబాడుకు చెందిన పురుగుమందుల వ్యాపారి పూదోక నాగేశ్వరరావు వద్ద ఏడాది క్రితం రూ.2.09 లక్షల విలువైన పురుగుమందులు కొనుగోలు చేశారు. ఈనెల నాలుగున నాగేశ్వరరావు శ్రీనివాసరావుపై ఒత్తిడి తీసుకొచ్చి మార్కెట్ ధర కంటే తక్కువగా రూ.8.95 లక్షల విలువైన 50 క్వింటాల మిర్చి కొనుగోలు చేశారు. బాకీ రూ.2.63లక్షలు కాగా మిగతా డబ్బులు ఇవ్వమని శ్రీనివాసరావు వ్యాపారిని అడిగినా నకిలీ బిల్లులు చూపించి నీకు దిక్కున్న చోట చెప్పుకోమని అంటున్నాడు. బాధితుడికి న్యాయం చేయండి. –జి.రామకృష్ణ, కోటనాయక్, వై.వెంకటేశ్వరరావు, ప్రజాసంఘాల నాయకులు -
ఎన్జీ రంగా వర్సిటీలో ఎస్‌ఎల్‌టీపీ ప్రోగ్రాం
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో స్ట్రేట్ లెవెల్ టెక్నికల్ ప్రోగ్రామ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం ప్రారంభించారు. సమావేశాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశోధన స్థానాలలో గత సంవత్సరం నిర్వహించిన పరిశోధనలను సమీక్షించారు. పరిశోధనల ఫలితాలను విశ్లేషించి, రైతుల సమస్యలను, వారి అవసరాలను గుర్తించి, వాటికనుగుణంగా రాబోవు సంవత్సరంలో నిర్వ హించాల్సిన పరిశోధనలకు ప్రణాళికలను రూపొందించారు. నేటి నుంచి 22వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. జన్యుశాస్త్రం, మొక్కల ప్రజననం, అణు జీవశాస్త్రం, జీవ సాంకేతికత విత్తన విజ్ఞానశాస్త్రం, సాంకేతికత తదితర విషయాలపై చర్చించారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ జెర్మ్ ప్లాజమ్ డిజిటలైజ్ చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ ఎస్.వసుంధర గత సంవత్సర నివేదికను సమర్పించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ వరి, వేరుశనగ, అపరాల పరిశోధనలో అగ్రగామి విశ్వవిద్యాలయం మరింత మెరుగ్గా పనిచేసి యూనివర్సిటీ ఖ్యాతిని పెంచి, రైతులకు సేవనందిచాలని తెలిపారు. -
క్షణికావేశంతోనే..
సాక్షి, నరసరావుపేట: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు కార్ల్ మార్క్స్. ప్రస్తుత సమాజంలో అనుబంధాల కంటే ఆర్థిక పరమైన అంశాలకే విలువనిస్తున్నారు. ఆసరాగా ఉండాల్సిన రక్తసంబంధీకులే రాబంధులుగా మారుతున్నారు. అంతవరకు తమలో ఒకరిగా ఉన్న వ్యక్తులు అంతలోనే శత్రువులుగా మారుతున్నారు. మనిషిలోని మానవత్వం మాయమైపోతోంది. కన్నవారి మీద, తోబుట్టువుల పట్ల కూడా కనీస ప్రేమ కరువవుతోంది. ఎంగిలి పాలు తాగిన అన్నదమ్ముల్లే యమకింకరులవుతున్నారు. ఆస్తి కోసమో... క్షణాకావేశమో కుటుంబ సభ్యులను చంపేందుకు వెనుకాడటం లేదు. ఇటీవల చిలకలకూరిపేటలో కన్న తల్లిదండ్రులనే చంపాలని కూతురు చేసిన హత్యాయత్నం నేపథ్యంలో మరోసారి ఈ చర్చ మొదలైంది. తల్లిదండ్రుల ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించి.. కనిపెంచిన తల్లిదండ్రులు చనిపోతే ఆస్తి వస్తుందన్న కారణంతో కూతురు తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి నిప్పుపెట్టిన ఘటన గత నెల 29వ తేదీన చిలకలకూరిపేటలో చోటుచేసుకుంది. పట్టణంలోని గుర్రాలచావిడిలో నివాసం ఉంటున్న గౌడిశెట్టి సుకన్య, మల్లికార్జునరావులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తెకు వివాహమై ఓ కూతురు పుట్టిన తరువాత భర్తతో విడాకులు తీసుకొని పట్టణంలోనే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె కొన్నాళ్లుగా ఆస్తి కోసం తల్లిదండ్రులతో గొడవ పడుతోంది. గత నెల 29న తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. మంటలు వ్యాపించి ఇంట్లో దాచిన బాణసంచా పేలడంతో పెద్ద శబ్దం రావడంతో తల్లిండ్రులకు మెలుకువచ్చి అదృష్టవశాత్తు మంటల నుంచి బయటపడ్డారు. తాము చనిపోతే ఆస్తి వస్తుందని కన్న కూతురు ఈ ఘాతుకానికి పాల్పడిందని తల్లి సుకన్య చిలకలూరిపేట టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రజలు నివ్వెరపోయారు. ఆస్తి కోసం తల్లిదండ్రులనే చంపాలని కూతురు చూడడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం కోసం తండ్రినే... పొలం కోసం కన్నకొడుకే తనను గొంతునులిమి చంపబోతే ఊరి వదిలి పారిపోయానని తనకు రక్షణ కల్పించాలని ఓ తండ్రి సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... దాచేపల్లికి చెందిన అచ్చాల కనకయ్య(70)కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు అబ్బాయిలు. అందరికీ పెళ్లికాగా చిన్న కుమారుడికి మాత్రం పెళ్లి కాకపోవడంతో వారితోనే ఉంటున్నాడు. పెద్ద కుమారుడు శ్రీనివాసరావుకి పదేళ్ల క్రితమే ఆస్తి పంపకాలు చేసేసాడు. అయితే తన బతుకుతెరువు కోసం ఉంచుకున్న కొద్దిపాటి పొలం కోసం తండ్రిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. గత నెల ఇదే క్రమంలో తనను గొంతునులిమి చంపబోతే పొన్నూరు ఆంజనేయ స్వామి గుడిలో తలదాచుకున్నానని కనకయ్య ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ముందు గోడువెళ్లబోసుకున్నాడు. కుటుంబ సభ్యులు తన ఆచూకీ కనుగొని మళ్లీ దాచేపల్లికి తెచ్చారని, అయితే తనకు పెద్ద కొడుకు ద్వారా ప్రాణహాని ఉందని ఎస్పీ ముందు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన అక్కడున్నవారిని కలచివేసింది. ఆస్తి కోసమో, పంతం కోసమో సొంత కుటుంబ సభ్యులను సైతం హత్య, దాడులు చేస్తున్న సంఘటనలు మనం నిత్యం చూస్తున్నాం. క్షణాకావేశంతో తాము ఏమి చేస్తున్నాం అన్న స్పృహ లేకపోవడంతోనే ఈ హత్యలు చేస్తున్నారు. ఆర్థికపరమైన ఆంశాలు, పట్టింపులే బంధుత్వాలు దెబ్బతినడానికి కారణమని ఎక్కువమంది మా వద్దకు వస్తున్న వారి ద్వారా తెలిసింది. కొంతమందికి మానసిక రుగ్మతల వల్ల ఇలాంటి విపరీతపోకడలకు వెళుతున్నారు. వారిని ముందుగానే గుర్తించి సరైన వైద్యం చేయిచాల్సి ఉంది. మారుతున్న కాలంతోపాటు కుటుంబ విలువలు తగ్గిపోవడం కూడా దీనికి కారణమవుతోంది. –డాక్టర్ సతీష్ అత్తిలి, మానసిక వైద్యుడు, నరసరావుపేట ఏరియా వైద్యశాల -
ఉక్కుపాదం మోపాలి
అక్రమ లే–అవుట్లు, నిర్మాణాలపై నరసరావుపేట: పల్నాడు జిల్లాలో అనుమతులు లేని అనధికార భవన నిర్మాణాలు, అక్రమ లే–అవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీఓలు, డీపీఓ, డీఎల్డీఓలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో అక్రమ లే అవుట్లపై ఆన్లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం–2016 ప్రకారం అనధికార లే–అవుట్లను గుర్తించి, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర అన్నారు. ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ ఐదు ద్వారా స్థానిక సంస్థలకు ఈ చట్టంలోని పలు సెక్షన్ల కింద ప్రత్యేక అధికారాలను కల్పించిందని, దీనిని ఉపయోగించుకొని నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పనులను నిలుపుదల చేయడం, సీలింగ్, కూల్చివేత ఉత్తర్వులు జారీ చేయడంలో వెనకాడకూడదని స్పష్టం చేశారు. ఆమోదించబడిన ప్లాన్లకు భిన్నంగా నిర్మాణాలు చేపడుతున్న వారిని నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. కేవలం చర్యలు తీసుకోవడమే కాకుండా పౌరులు ఏదైనా స్థలం లేదా భవనం కొనుగోలు చేసే ముందే సంబంధిత అనుమతులను సరిచూసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం, పటిష్టమైన పర్యవేక్షణ ద్వారానే అనధికార నిర్మాణాలకు అడ్డుకట్ట వేయగలమని, తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించి ప్రజలకు మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు అందించవచ్చని ఆమె పేర్కొన్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ఆర్డీవోలు కె.బాలకృష్ణ, శ్రీరాములు, మురళీకృష్ణ, డీఎల్డీఓలు వెంకటరెడ్డి, గబ్రూ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇళ్ల గణన పూర్తిచేయని అధికారులపై చర్యలు జిల్లాలో ఇండ్లగణనను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ హెచ్చరించారు. సోమవారం జిల్లాలో ఇండ్లగణన ప్రగతిపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జాతీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల ఒకటవ తేదీ నుంచి 30లోగా ఇళ్ల గణనను ఎన్యూమరేటర్లు ఎట్టిపరిస్థితులలోనూ పూర్తిచేయాలన్నారు. ఇళ్ల గణన ప్రారంభించి 10 రోజులు అయినప్పటికీ ఇంతవరకు నిర్దేశించిన స్థాయిలో ప్రగతి లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణన కార్యక్రమం అత్యంత ప్రధానమైనదని, ఈ విధులలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఎన్యూమరేటర్లకు తమకు రోజూవారీ నిర్దేశించిన మేర లక్ష్యాలను తప్పనిసరిగా సాధించి నెలాఖరులోగా గణన కార్యాక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. రెండురోజుల్లోగా నిర్దేశించిన స్థాయిలో ప్రగతి కనపరచని సిబ్బంది శాఖాపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహా -
మనీషి
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026మాయమవుతున్న‘మాయవయ్యాడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అన్నట్లుగా.. స్వార్ధం నిండిన సమాజంలో మనుషుల్లో మానవత్వం మంట గలిసిపోతుండగా.. అంతంతమాత్రంగానైనా ఉన్న ప్రేమలు అంతర్ధానమవుతున్నాయి. విలువల వలువలు విప్పగా.. మనిషిగా చచ్చి.. అతనిలోని రాక్షసత్వం బట్టబయలై నడిరోడ్డుపై వికటట్టహాసం చేస్తోంది. ఈక్రమంలో తోటివారికి సాయం దేవుడెరుగు.. ఆస్తిపాస్తుల కోసం సొంతవారినే హతమార్చేందుకు వెనుకాడని ఘటనలు ఎన్నో చూస్తున్నాం.. ఇందులో లింగభేదం ఎంతమాత్రం లేకపోవడం విశేషం. ఆస్తికోసం తోడబుట్టిన వారిని తుదముట్టించిన సోదరి.. కన్నతల్లిదండ్రులపై పెట్రోలు పోసి తగలబెట్టేందుకు యత్నించిన కూతురు.. వృద్ధుడనే కనికరం కూడా లేకుండా తండ్రిని చంప చూసిన కసాయి కొడుకు.. ఇలాంటి ఘటనలో జిల్లాలో నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. -
దళిత యువకులపై టీడీపీ వర్గీయుల దాడి
టాస్క్‌ఫోర్స్(ముప్పాళ్ళ): తిరునాళ్లలో భాగంగా ఎస్సీ వర్గీయులు బాణాసంచా పేల్చటానికి వీలులేదంటూ టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి అత్తోట కృష్ణ వర్గీయులు పోలీసుల సమక్షంలోనే భౌతిక దాడికి దిగిన సంఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ళ సందర్భంగా టీడీపీకి చెందిన ఒక సామాజిక వర్గీయులు విద్యుత్ప్రభ పైన ఆర్కెష్ట్రా ఏర్పాటు చేశారు. తిరునాళ్లలో భాగంగా అదే గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు జొన్నలగడ్డ ప్రసన్న, మాతంగి రత్నబాబు, మరికొందరు దీపావళి మందులు కాల్చేందుకు సిద్ధమవుతుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి అత్తోట కృష్ణ, గరికపాటి సాంబశివరావు, గరికపాటి కరుణ, ఎర్రంనేడి రవితేజ తో పాటుగా మరికొంతమంది మీకు ఇక్కడేం పనిరా అంటూ... ఒక్కసారిగా దాడికి దిగారు. దాడితో పాటుగా విచక్షణారహితంగా బూతులు తిడుతూ తీవ్రస్థాయిలో దుర్బాషలాడారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబసభ్యులను సైతం బెదిరించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు యువత తెలిపారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరగటం గమనార్హం. దాడిలో ప్రసన్న, రత్నబాబులకు స్వల్ప గాయాలయ్యాయి. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఇలాంటి దాడులు చేయడం ఏంటని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటనపై బాధితులు ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు రాష్ట్ర జట్టు ఎంపిక
సత్తెనపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగే 45వ జాతీయస్థాయి సబ్ జూనియర్స్ షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాల, బాలికల జట్టును ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పరుశరాముడు సోమవారం ప్రకటించారు. బాలుర జట్టు రామ్ తేజ్, ( కెప్టెన్ కృష్ణా జిల్లా), తిరుమల సాయి త్రినేష్ (విశాఖపట్నం), నందన్‌రెడ్డి (గుంటూరు), కార్తీక్ (కర్నూలు), శ్రీను నాయక్ (అనంతపురం), సురేష్, చితాస్ (పల్నాడు), గణేష్ (అన్నమయ్య), శేషాద్రి (తిరుపతి), అభిలాష్ (అనంతపురం), రిత్విక్ రెడ్డి (నెల్లూరు), ఎతిక్ రత్న (ఏలూరు) ఎంపికయ్యారు. బాలికల జట్టు యశస్విని (కెప్టెన్, చిత్తూరు జిల్లా), భూమిక (విశాఖపట్నం), గీతిక (గుంటూరు) ఊహ (గుంటూరు), సుచరిత (ప్రకాశం) ,హర్షిత (పల్నాడు), స్వాతి కీర్తన (పల్నాడు), శేన్షి (తిరుపతి), శ్రీలత (అన్నమయ్య), అర్చన (నెల్లూరు), జశ్విత రాణి (అనంతపురం), ఎం.హర్షిణి (గుంటూరు)లు ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులు జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో రాణించి విజయంతో తిరిగి రావాలనీ పరశు రాముడు అభినందించారు. కార్యక్రమంలో సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి కిరణ్‌కుమార్, కృష్ణా జిల్లా కార్యదర్శి విజయకుమార్ పాల్గొన్నారు. -
బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలి
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐఎస్బీఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. నగరంపాలెం ఎస్బీఐ మెయిన్ బ్రాంచి వద్ద సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సెంట్రలైజ్డ్ లంచ్ టైమ్ డిమాన్స్ట్రేషన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (ఏఐఎస్బీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్, గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్బీఐ బ్యాంక్‌లో తగిన సిబ్బంది నియామకం చేపట్టాలని, శాశ్వత ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డెప్యూటీ జనరల్ సెక్రటరీ కాకుమాను కోటి రెడ్డి, నరేంద్ర కుమార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
చిలకలూరిపేటటౌన్/ యడ్లపాడు: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులకు నిరసనగా చిలకలూరిపేట డిపో డ్రైవర్లు సోమవారం ధర్నాకు దిగారు. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి చిలకలూరిపేట వస్తున్న బస్సును చౌడవరం స్టాప్‌వద్ద ఆపకపోవడంతో స్థానికులు కొందరు ఆగ్రహించి డ్రైవర్ జి దుర్గాప్రసాద్‌పై భౌతిక దాడికి దిగడం ఈ ఉద్రిక్తతకు దారితీసినట్టు తెలిసింది. తమ సహచర ఉద్యోగిపై జరిగిన దాడిని ఖండిస్తూ సుమారు 35 మంది అద్దె ప్రాతిపదికన పనిచేసే (కాల్) డ్రైవర్లు ఉదయం నుంచే విధులను బహిష్కరించి మరుసటిరోజు బస్టాండ్ ఆవరణలో ధర్నాకు దిగారు. బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి, తమకు రక్షణ కల్పించే వరకు బస్సులు కదిలించేది లేదని భీష్మించుకోవడంతో డిపో కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. డిపో మేనేజర్ వై వేణు ఆందోళనకారులతో చర్చలు జరిపి సర్దిచెప్పే ప్రయత్నం ఫలించలేదు. కార్మికులు ససేమిరా అనడంతో పాటు సోమవారం తమ విధుల్ని పూర్తిగా బహిష్కరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు ఇక్కట్లు... డ్రైవర్ల ఆందోళన ప్రభావం సామాన్య ప్రయాణికులపై తీవ్రంగా పడింది. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులు గంటల తరబడి నిలిచిపోవడంతో బస్టాండ్‌లో వేచి ఉన్న మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన డిపో మేనేజర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇతర డ్రైవర్ల ద్వారా కొన్ని సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ, మరో 8 బస్సులు డ్రైవర్లు లేక డిపోకే పరిమితమయ్యాయి. బాధిత డ్రైవర్ ద్వారా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు మాత్రం ఆర్టీసీ సిబ్బంది నిరసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిబ్బంది భద్రతపై స్పష్టమైన హామీ లభించే వరకు పోరాటం ఆపబోమని డ్రైవర్ల సంఘం స్పష్టం చేయడంతో డిపో పరిసరాల్లో ఆందోళన వాతావరణం కొనసాగుతోంది. -
ఆర్టీసీ బస్సు కిందకు దూరిన బైక్
పట్టణానికి చెందిన వ్యక్తి మృతి చిలకలూరిపేటటౌన్: ఆర్టీసీ బస్సు కింద ద్విచక్రవాహనం దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని కృష్ణారెడ్డి డొంక చెందిన షేక్ బుజ్జి(41) బైక్‌పై చిలకలూరిపేట వైపుకు వస్తుండగా అదే సమయంలో చీరాల–సత్తెనపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురైంది. ప్రమాదవశాత్తూ బుజ్జి బైక్ ఆర్టీసీ బస్సు ముందుభాగం కిందకు దూసుకెళ్లింది. బుజ్జికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అర్బన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుజ్జి మృతి చెందాడు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. అన్ని వర్గాలకు అందుబాటులో ఇగ్నో కోర్సులు గుంటూరు ఎడ్యుకేషన్: ఇగ్నో దూర విద్య కోర్సులు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాయని టీజేపీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి పేర్కొన్నారు. ఆదివారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ ప్రాంగణంలోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయ (ఇగ్నో) అధ్యయన కేంద్రంలో 2026 జనవరి సెషన్లో చేరిన విద్యార్థులకు ఇగ్నో ఇండక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కామేశ్వరశాస్త్రి మాట్లాడుతూ వివిధ వర్గాలకు అవసరమైన విధంగా అన్ని రకాల కోర్సులను ఇగ్నో అందిస్తోందని చెప్పారు. యూజీ, పీజీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాన్వేషణలో నెలకొన్న పోటీని తట్టుకుని నిలబడేందుకు వీలుంటుందని అన్నారు. స్టడీ మెటీరియల్స్, ప్రాజెక్టు వర్క్ గురించి వివరించారు. కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ అసైన్మెంట్స్, పరీక్షలకు సన్నద్దత గురించి వివరించారు. అధ్యయన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ డీవీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇగ్నో అందిస్తున్న కోర్సులు, విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు, అధ్యయన కేంద్ర సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మూడో అంతస్తులో వివాహాల సందడి సాయంత్రం పెరిగిన రద్దీ ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ -
భద్రత దైవాధీనం
పల్నాడుసోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026● జిల్లాలో కలవరపెడుతున్న వరుస చోరీలు ● కారంపూడి దోపిడీ ఘటన మరువక ముందే సత్తెనపల్లిలో భారీ చోరీ ● తాళాలు వేసిన ఇళ్లే దొంగల టార్గెట్ ● నియంత్రణలో విఫలమవుతున్న పోలీసులు దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మ వారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు ఆదివారం నాలుగో రోజుకు చేరాయి. అమ్మవారు ధనలక్షీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కంఠంరాజుకొండూరు గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి ఆలయంలో ఆదివారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఇటీవల వైభవంగా జరిగిన నేపఽఽథ్యంలో భక్తుల కోసం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మొక్కులు తీర్చుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన మహాన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావటంతో ఆలయ ప్రాంగణంలో తిరునాళ్ల సందడి నెలకొంది. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చక్రధర్‌రెడ్డి, ఈవో నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్నంబజారు: గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో వేంచేసి ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం లక్ష మల్లెల పూజ నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి టి.సుభద్ర పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు తిరువల్లూరి వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి లక్ష మల్లెలతో పూజలు నిర్వహించటంతోపాటు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారు సువర్చలా సమేత ఆంజనేయస్వామిగా నగర పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం 8:30 గంటలకు వందలాది మంది భక్తులు, ఆంజనేయ దీక్షాపరులతో హనుమాన్ చాలీసా పారాయణం 108సార్లు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అయినవోలు నరసింహచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్ దీక్ష సమాజం సభ్యులు నాగేశ్వరరావు, సిహెచ్ రమేష్, మారుతి, వెంకటరమణ, బాపిరాజు, కిషోర్, పాలక మండల సభ్యులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 524.70 అడుగులకు చేరింది. ఇది 157.9860 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో వరుస చోరీలు ప్రజలను కలవర పెడుతున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో నిత్యం దొంగతనం కేసులు నమోదు అవుతుండటం ప్రజల్లో భద్రతపై ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు దోచుకువెళ్తున్నారు. పార్క్ చేసిన వాహనాలు క్షణాల్లో మాయమవుతున్నాయి. ● జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో 20 రోజుల క్రితం ప్రకాష్‌నగర్ రిజిష్ట్రార్ కార్యాలయం వెనుక ప్రాంతంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. యలవర్తి రాంప్రసాద్ కుటుంబ సభ్యులతో షిరిడీ యాత్రకు వెళ్లి వచ్చేలోపు ఇంటి తాళాలు పగులగొట్టి గృహంలోకి చొరబడిన దుండగులు రెండు బీరువాలను ధ్వంసం చేసి అందులోని విలువైన వస్తువులను అపహరించుకు వెళ్లారు. ● తాజాగా మూడు రోజుల క్రితం సత్తెనపల్లిలో రెండు బంగారు దుకాణాల్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. గొళ్లమూడివారి వీధిలోని నాగలక్ష్మీ జ్యూయలర్స్, శ్రీకృష్ణా డైమండ్ హాల్ జ్యూయలర్స్ దుకాణాల్లో తాళాలు పగులగొట్టి రూ.8 లక్షల విలువైన మూడు కిలోల వెండి వస్తువులను అపహరించుకు వెళ్లారు. మరో దుకాణంలో తాళాలు పగులగొట్టి చోరీకి విఫల యత్నం చేశారు. ఈ ఘటన వ్యాపార వర్గాల్లో తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ● నెల రోజుల క్రితం సత్తెనపల్లి మార్కెట్ యార్డు కార్యాలయ తాళాలు పగులగొట్టి ఆఫీస్‌లోని విలువైన వస్తువులు అపహరించుకు వెళ్లారు. సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో సత్తెనపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. అయినప్పటికీ చోరీల పరంపరకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. జిల్లాలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో చిన్నపాటి దొంగతనాలు చోటుచేసుకోవటం పరిపాటిగా మారింది. చోరీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్ని అయితే పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లని సంఘటనలు అనేకం ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పోయిన సొమ్ము తిరిగి వస్తుందన్న నమ్మకం లేక చాలా మంది ఫిర్యాదు చేయటానికి వెనకడుగు వేస్తున్నారన్నా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్నపాటి చోరీలను బాధితులు మౌనంగా భరించాల్సి వస్తుంది. ఇటీవల వినుకొండ దక్షిణం బజారుకు చెందిన అడ్డగిరి లక్ష్మి మెడలో బంగారపు గొలుసును పట్టపగలు లాక్కెళ్లారు. అడ్డువచ్చిన భర్త కొండయ్య కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడి పరారీ అయ్యారు. ఇలా ఒంటరిగా నడిచి వెళ్లే మహిళల మెడల్లో ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు నానుతాడులు లాక్కువెళ్లటం వంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అనేకం చోటుచేసుకున్నాయి. పగలు ప్రాంతాలను పరిశీలిస్తూ తాళాలు వేసిన ఇళ్లు, దుకాణాలను గుర్తిస్తున్న దొంగలు రాత్రి వేళ వాటిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు తెగబడుతున్నారు. రోజుల తరబడి తాళం వేసి ఉంటే అటువంటి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో పాటు ఇంటికి తాళాలు వేయకుండా ఆరుబయట నిద్రించే ఇళ్లపై దొంగలు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కొందరు దొంగలు సీసీ కెమెరాలకు సైతం దొరకకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ముఖాలకు మాస్క్‌లు, టోపీలు ధరించి కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. దీంతో దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నా నిందితులను గుర్తించటం సవాల్‌గా మారింది. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) తో పోలీస్ శాఖ ఇళ్లకు సాంకేతిక భద్రత ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరు వెళ్తే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి. ఆ ఇంటిని పోలీసులు ఆన్లైన్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఈ విధానం ఇళ్లకు రక్షణ కవచంలా నిలుస్తోంది. ఆన్లైన్ యాప్ సిస్టమ్‌లో అభ్యర్థిస్తే పోలీస్ సిబ్బంది ఇంటికి వచ్చి ఆ సౌకర్యాన్ని అమర్చుతారు. ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు ఈ ఉచిత సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సత్తెనపల్లిలో చోరీ జరిగిన బంగారు ఆభరణాల దుకాణం బల్లవంతపు వసూలు!యడ్లపాడు: సాధారణంగా వి ద్యార్థి దశ అంటే పుస్తకాలు, పరీక్షలు, మార్కుల చుట్టూనే తిరుగుతుంది. కానీ, కొందరు మాత్రం చదువుతోపాటు ఒక ప్రత్యేక కళను ప్రాణంగా ప్రే మిస్తారు. ఆ ప్రేమే వారిని ప దిమంది ప్రేమించేలా.. ప్రశంసల్ని పొందేలా చేస్తుంది. ఇందుకు యడ్లపాడు మండలం చారిత్రక ప్రాంతమైన కొండవీడుకు చెందిన షేక్ సనా కౌసర్‌ను చక్కని ఉదాహరణ. కుంచె లేని అక్షర చిత్రకారిణి ఆటో డ్రైవర్ రషీద్, ఫాతిమా దంపతులకు ఇద్దరు సంతానంలో చిన్న కుమార్తె కౌసర్. పేద కుటుంబమే అయినా, పేదరికానికి ప్రతిభకు సంబంధం లేదని ఈ బాలిక నిరూపించింది. స్వభావరీత్యా బిడియం ఎక్కువే అయినా, ఆమె అక్షరాల్లో మాత్రం అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. పీఎంశ్రీ జెడ్పీ హైస్కూల్ ఆవరణలోని మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన కౌసర్, తన చేతిరాతతో చిత్రకారుడినే తలపిస్తోంది. ముంబాయికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ సాధించి, ‘అక్షరం’ అంటే సమాచారం కాదు, అది ఒక ‘అలంకారం’ అని చాటిచెప్పింది శిష్యరికం నుంచి శిక్షణ వరకు.. తన గురువు డాక్టర్ షేక్ జున్ను మాస్టర్ పర్యవేక్షణలో లుసిడా, ప్రింట్ హ్యాండ్ రైటింగ్‌లో ఏడాది పాటు కఠోర సాధన చేసింది. కేవలం నేర్చుకోవడానికే పరిమితం కాలేదు. తాను నేర్చుకున్న విద్యను పదిమందికి పంచాలనే తపనతో యడ్లపాడులో బాసట ఆధ్వర్యంలో జరిగే ఉచిత వేసవి శిబిరంలో 3 నుంచి 5 తరగతుల విద్యార్థులు 43 మందికి హ్యాండ్ రైటింగ్‌పై శిక్షణ ఇచ్చింది. తనకంటే పెద్దవారైన టెన్త్, ఇంటర్ విద్యార్థులకు సైతం అక్షరాల మెలకువలు నేర్పిస్తూ ‘చిన్నారి గురువు’గా నీరాజనాలు అందుకుంటోంది. కౌసర్ ప్రతిభను గుర్తించిన బాసట సామాజిక సంస్థ, గురువు సరసన బాలికను కూర్చోబెట్టి ఘనంగా సత్కరించడం కౌసర్ పట్టుదలకు దక్కిన గౌరవం. గురుశిష్యులను సత్కరిస్తున్న బాసట స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు 7వేసవి సెలవులు రావటంతో పుణ్యక్షేత్రాలు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఉక్కపోతకు ఆరుబయట, డాబాలపై నిద్రించే వారు ఉన్నారు. ఇదే అదునుగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా రాత్రిళ్లు గస్తీ బలహీనంగా ఉందన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. పోలీస్ అధికారులు దొంగతనాల నియంత్రణపై దృష్టి సారించి రాత్రిళ్లు గస్తీ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాత నేరస్తుల కథలికలపై నిఘా ఉంచటంతో పాటు అనుమానితులపై పర్యవేక్షణ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. కారంపూడిలో పట్టపగలు వ్యక్తి పై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకువెళ్లిన సంఘటన వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. గత నెల 27వ తేదీన వినుకొండకు చెందిన యక్కల శ్రీనివాసరావు కారంపూడిలో బంగారు ఆభరణాలు విక్రయించేందుకు వచ్చాడు. అతనిని అడ్డగించి ద్విచక్రవాహనంపై వచ్చిన ఆరుగురు నిందితులు రూ.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకొని వెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవల నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.కౌసర్ సాధించిన విజయం చిన్నదే కాని, మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. ప్రతి విద్యార్థిలో నూ ఒక ప్రత్యేకమైన సృజనాత్మకత, నైపుణ్యం దాగి ఉంటాయి. చిన్న వయసులోనే పిల్లల ఆలోచనలను, వారిలోని సహజ సిద్ధమైన అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి. తమకు నచ్చిన కళలను నేర్చుకునే అవకాశం కల్పిస్తే అది వారిలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందుతుంది. తల్లిదండ్రులు ఈ దిశగా ఆలోచన చేయాలి. పిల్లల అభిరుచులను గుర్తించి వెన్నుతట్టాలి. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా కళల్లో నిష్ణాతులుగా ఎదిగేలా ప్రాథమిక స్థాయి నుంచే కృషి జరగాలి. అప్పుడే జీవితంలో వారు గొప్పగా రాణించగలుగుతారు.లీజు కాలం మార్చి 30తోనే ముగిసిన మాట వాస్తవం. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో బహిరంగ వేలం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. పాట దారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదాలు పడ్డా యి. తిరిగి నిర్వహిస్తాం. అప్పటివరకు కృష్ణానదిపై పడవలు, బల్లకట్టు నడపడం నేరం. దీనిపై తనిఖీలు నిర్వహించి నదిపై నడిచే వాహనాలను సీజ్ చేస్తాం. – కోయ శ్రీనివాసరావు, ఎంపీడీఓ, అచ్చంపేట అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.9640 టీఎంసీలు. వినుకొండ: వినుకొండ శ్రీనివాసనగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం లక్ష గోవింద నామ పారాయణం, శ్రీవారి మంత్ర హోమం నిర్వహించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపవ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి తెనాలి గాంధీనగర్‌కు చెందిన కె.మాధవరావు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. -
లీజు ముగిసినా కొనసాగుతున్న బల్లకట్టు
● ఈ ఏడాది మార్చితో ముగిసిన వైనం ● టీడీపీ నేతల అండతో వేలం నిర్వహణను అడ్డుకుంటున్న బల్లకట్టు మాఫియా ● రెండు నెలలుగా అక్రమంగా నిర్వహణ ● ప్రయాణికుల నుంచి భారీగా దోపిడీ ● జడ్పీ ఆదాయానికి గండి ● చోద్యం చూస్తున్న అధికారులు అచ్చంపేట: లీజు కాలం పూర్తయింది.. అధికారికంగా ఎలాంటి అనుమతులు లేవు.. అయినా నెలన్నర కాలంగా దర్జాగా బల్లకట్టు నిర్వహిస్తున్నారు.. ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి జడ్పీ ఖజానాకు గండిగొడుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు తమ జేబులు నింపుకొంటున్నారు. అధికారులెవ్వరూ ఇదేమిటని అడగరు.. ఆ ఛాయలకూ వెళ్లరు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలంలోని పుట్లగూడెం నుంచి ఎన్టీఆర్ జిల్లా, చందర్లపాడు మండలం రామన్నపేటకు ఎలాంటి నిబంధనలను పాటించకుండా, జిల్లా పరిషత్‌కు చెల్లించాల్సి సొమ్ము ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ప్రతి రోజు యథేచ్ఛగా కృష్ణానదిపై బల్లకటు తిప్పుతూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. వేలం జరగకుండా అడ్డుకున్న మాఫియా.. మండలంలోని పుట్లగూడెం నుంచి కృష్ణానదికి ఆవలిఒడ్డున ఉన్న రామన్నపేటకు బల్లకట్టుపై నుంచి పెద్ద పెద్ద వాహనాలు, ప్రయాణికులు, పశువులు, జీవాలు, నిత్యావసర వస్తువులు తరలించేందుకు ప్రతి యేటా మార్చి చివరలో గుంటూరు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో టెండర్లు ఆహ్వానించి బహిరంగ వేలం నిర్వహిస్తారు. గత ఏడాది పాట దక్కించుకున్నవారి లీజుకాలం ఈ ఏడాది మార్చి 30తో ముగిసింది. జిల్లా పరిషత్ అధికారులు తిరిగి టెండర్లు ఆహ్వానించి ఏప్రిల్ 8న బహిరంగ వేలం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే టెండర్లు వేయనీకుండా, బహిరంగ వేలంలో ఎవరూ పాల్గొననీయకుండా బల్లకట్టు మాఫియా అడ్డుకుంది. దీంతో బహిరంగ వేలాన్ని మే 8కి తిరిగి వాయిదా వేశారు. అప్పుడు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎవరికీ అనుమతులు దక్కలేదు. ఇదే అదనుగా కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు వదిలి యథావిధిగా బల్లకట్టును నడుపుతూ రూ.లక్షలు వసూలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్వాహకులు అడిగినంత చెల్లిస్తూ ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు కొనసాగిస్తున్నారు. నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా వసూలు చేస్తుండటంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అక్రమార్కుల జేబులు ఫుల్ అవుతున్నాయి. జిల్లా పరిషత్ ఆదాయానికి భారీ గండి అచ్చంపేట మండలంలో మాదిపాడు నుంచి తెలంగాణ రాష్ట్రం బొగ్గమాదారం వరకు, పుట్లగూడెం నుంచి ఎన్టీఆర్ జిల్లా రామన్నపేటకు బల్లకట్టు సర్వీసులు తిప్పుతారు. మాదిపాడు వద్ద నడిచే బల్లకట్టును తాత్కాలికంగా నిలిపివేశారు. ఏటా అచ్చంపేట మండలం నుంచే సుమారు పడవలపైనుంచి గానీ, బల్లకట్టు నుంచి గానీ జిల్లా పరిషత్‌కు రూ.60లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అంటే నెలకు రూ.5 లక్షలు. ఈ ఏడాది గత నెలన్నర కాలంగా అధికారికంగా సర్వీసులు నిలిచిపోవడంతో ఆ ఆదాయానికి గండిపడింది. అనధికారంగా అక్రమార్జనలు జరుగుతూనే ఉన్నా అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. లీజు కాలం మార్చి 30తోనే ముగిసిన మాట వాస్తవం. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో బహిరంగ వేలం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. పాట దారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదాలు పడ్డా యి. తిరిగి నిర్వహిస్తాం. అప్పటివరకు కృష్ణానదిపై పడవలు, బల్లకట్టు నడపడం నేరం. దీనిపై తనిఖీలు నిర్వహించి నదిపై నడిచే వాహనాలను సీజ్ చేస్తాం. – కోయ శ్రీనివాసరావు, ఎంపీడీఓ, అచ్చంపేట ప్రభుత్వ నిబంధనల మేరకు బల్లకట్టుపై ప్రయాణించే వ్యక్తికి 40కిలోల లగేజీతో సహా రూ.3 వసూలు చేయాల్సి ఉండగా రూ.50 వసూలు చేస్తున్నారు. ద్విచక్రవాహనానికి వ్యక్తితో సహా రూ.15 వసూలు చేయాల్సి ఉంగా రూ.100, కారు, ఆటో, ట్రాక్టరు ట్రక్కుతో సహా రూ.180 వసూలు చేయాల్సి ఉండగా రూ.500, లారీకి రూ.240 వసూలు చేయాల్సి ఉండగా రూ.700వరకు, టెన్ టైర్, ట్వల్ టైర్ లారీలైతే రూ.1000 కూడా వసూలు చేస్తున్నారు. -
అర్బన్ స్టేషన్‌కు హాజరైన మాజీమంత్రి విడదల రజిని
చిలకలూరిపేటటౌన్(యడ్లపాడు): న్యాయస్థానం పట్ల గౌరవంతో నిబంధనల మేరకు యడ్లపాడు పోలీస్ స్టేషన్‌న్‌లో మాజీ మంత్రి విడదల రజిని ఆదివారం హాజరై సంతకం చేశారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి వారం స్టేషన్‌న్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉండటంతో, ఈ నెల మూడో తేదీన మొదటి పర్యాయం తర్వాత తిరిగి రెండోసారి ఆమె అధికారుల ముందు హాజరయ్యారు. న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా ప్రతి ఆదివారం ఇదే రీతిన ఆమె స్టేషన్‌కు రానున్నట్లు సమాచారం. రజిని రాకపట్ల పార్టీ నాయకులు, అభిమానులు అఽధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే ఎక్కడా న్యాయస్థాన ఉత్తర్వుల ఉల్లంఘన జరగకుండా, చట్టపరమైన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ స్టేషన్లోకి ఒంటరిగా వెళ్లి ఆమె తన హాజరును నమోదు చేశారు. బయటకు వచ్చిన తర్వాత నాయకులు కలిసి ఆమె నివాసానికి వెళ్లా రు. పార్టీ వ్యవహారాలను గురించి రజినితో చర్చించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ దరియావలి, చిలకలూరిపేట మండల అధ్యక్షులు దేవినేని శంకరరావు, యడ్లపాడు మండల అధ్యక్షులు వడ్డేపల్లి నరసింహరాజు, ఎస్సీసెల్ జిల్లా నా యకులు పందుల బుల్లెబ్బాయి, నియోజకవర్గ సమన్వయకమిటీ సభ్యులు రాచమంటి చింతారావు, నాయకులు ఉడత వెంకటేశ్వరరావు, కొప్పురావూరి పటేల్, సాపా సైదావలి,తొట్టింపూటి శ్రీను, మైలా రాజేష్, డీలర్ సుభాని, ఊసా రమేష్, ఈ సూబ్వలి, తియ్యగూర అంజిరెడ్డి, నర్సింహనాయక్, మానుకొండ శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
నరసరావుపేట: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం రెండు గంట వరకు కలెక్టరేట్లో ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు తప్పనిసరిగా పాత అర్జీ రసీదు తీసుకురావాలని, అర్జీలో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమీప కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. అర్జీదారులు కలెక్టరేట్‌కు రాకుండానే తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చునని సూచించారు. అన్నీ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటలకు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు తప్పనిసరిగా రెవెన్యూ క్లినిక్‌కు హాజరై వినతులను స్వీకరిస్తారని తెలిపారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించేందుకు సంబంధిత ఏఓ, డీటీలు అందుబాటులో ఉంటారని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇనస్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు తమకు సంబంధించిన అన్ని రికార్డులతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. రైతులు, ప్రజలు తమ భూసంబంధిత సమస్యలు, రెవెన్యూ సమస్యలను ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. -
గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం
వినుకొండ: చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధి శూన్యమని, కేవలం అక్రమ మార్గాల్లో సంపాదించడమే ధ్యేయంగా పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. ఆదివారం వినుకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి, వరికి బదులు ఆరుతడి, వాణిజ్య పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం మాటలు నమ్మి రైతులు భారీగా మొక్కజొన్న, పొగాకు సాగు చేస్తే తీరా గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను వేధిస్తున్నారని విమర్శించారు. మొక్కజొన్నకు రూ. 2400 మద్దతు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, కనీసం ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. దీనివల్ల దళారులు రూ.1000 –రూ.1100లకే కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, రైతులు నిండా మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసి ఒక్క రోజులోనే డబ్బులు చెల్లిస్తున్నామని చెబుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్.. అసలు ఎంత పంట పండింది, ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసిందో బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పాలన చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వ తీరుపై గొంతు ఎత్తితే అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు, రూ.2.50 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాయని గుర్తు చేశారు. కానీ నేడు వినుకొండలో మట్టి, ఇసుక, మద్యం వంటి అక్రమ వ్యాపారాలు తప్ప అభివృద్ధి ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. వెంటనే పొగాకు కంపెనీలతో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్ ప్రసాదు, పట్టణ కన్వీనర్ కొత్తమాసు శివ, మండల కన్వీనర్లు దండు చెన్న య్య, కొండా వరుజు నాగేశ్వరరావు, ముప్పరాజు వెంకటేశ్వర్లు, కాకర్ల నారాయణరెడ్డి బేతం గాబ్రియేలుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు -
శోక సంద్రమైన ఎండుగుంపాలెం
నాదెండ్ల: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమార్తె, తండ్రి మరణవార్త విని తిరిగివచ్చిన ఉదంతం ఎండుగుంపాలెం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్ఎస్పీ తుర్లపాడు మేజర్ కాలువ డీసీ అధ్యక్షుడు నెల్లూరి రామారావు (52), తన కుమార్తె అంజలిని విదేశీ విద్య కోసం శుక్రవారం హైదరాబాద్ విమానాశ్రయంలో సాగనంపి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. దుబాయ్ విమానాశ్రయం చేరుకున్న అంజలి తన ప్రయాణ వివరాలు తెలిపేందుకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. కుటుంబ సభ్యులెవరూ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి బంధువులను ఆరా తీసింది. తండ్రి దుర్మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. కన్నీరుమున్నీరవుతూనే తదుపరి విమానంలో తిరుగు ప్రయాణమై ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకుంది. అంజలి తండ్రి భౌతికకాయాన్ని చూసి విలపించిన తీరు చూపరులకు కంట నీరు తెప్పించింది. తల్లి రాంపూర్ణమ్మ, తమ్ముడు ఈశ్వరప్రసాద్లను ఓదార్చడం సాధ్యం కాలేదు. తనను ప్రయోజకురాలిని చేయాలన్న తండ్రి కలలను తలచుకుంటూ, దశదిన కర్మల అనంతరం తిరిగి విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తానని, అదే తన తండ్రికి ఇచ్చే అసలైన నివాళి అని అంజలి ధైర్యంగా చెప్పింది. ఆదివారం మధ్యాహ్నం గ్రామస్తుల అశ్రునయనాల మధ్య రామారావు అంత్యక్రియలు ముగియగా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎన్న్ఎస్పీ అధికారులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ఉద్యోగ, కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చటంలో విఫలమైందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య తెలిపారు. అరండల్‌పేటలో ఆదివారం నిర్వహించిన పీడబ్ల్యూడీ వర్క్‌షాప్ అండ్ కెనాల్స్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ 31వ మహాసభలో వెంకటసుబ్బయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లా డారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆయా వర్గాల సమస్యలను పరిష్కంచటంలో కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాడు నాగార్జునసాగర్ పరిధిలోని ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించేలా ఏఐటీయూసీ కృషి చేసి విజయం సాధించిందని వివరించారు. కార్మిక శ్రేయస్సు కోసం అందరితో కలసి పోరాటాలలో ముందుండాలని తెలిపారు. యూనియన్ పతాకాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు ఆవిష్కరించారు. మహాసభలో నివేదికను కెనాల్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఉప్పలపాటి రంగయ్య ప్రవేశపెట్టారు. సీపీఐ సీనియర్ నాయకులు షేక్ బుడే, యూనియన్ నాయకులు ఎల్.శాంతి, ఎం.బాబురావు, కాసా సాంబయ్య పాల్గొన్నారు.ఏఐటీయూసీ డిమాండ్ -
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న వ్యక్తి మృతిచెందినట్లు ఎస్ఐ కె.సతీష్ ఆదివారం తెలిపారు. మండలంలోని కుంకలగుంట గ్రామానికి చెందిన కాకర్ల వెంకటేష్ తన స్నేహితులు ఇద్దరితో కలిసి ఈనెల 5న మాచవరం వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి కుంకలగుంటకు వస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై నిలిచి ఉన్న ట్రాక్టర్‌ను బైకు ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనలో ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న వెంకటేష్ ఆదివారం మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘ఇంజినీరింగ్’ పరీక్షలకు వేళాయె!
● రేపటి నుంచి 20 వరకు ఏపీ ఈఏపీసెట్–2026 ● 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ● 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ● ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 46,168 మంది విద్యార్థులు ● మూడు జిల్లాల్లో 21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2026 (గతంలో ఎంసెట్) ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ వరకు ఇంజినీరింగ్, ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి. కాకినాడలోని జేఎన్టీయూ భాగస్వామ్యంతో ఏపీ ఈఏపీసెట్–2026ను నిర్వహిస్తోంది. ● గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన 21 పరీక్ష కేంద్రాల్లో ఆయా తేదీల వారీగా ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 46,168 మంది విద్యార్థులు ● ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 46,158 మంది హాజరు కానున్నారు. ● గుంటూరు జిల్లాలో 15 కేంద్రాల పరిధిలో మొత్తం 33,281 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 28,158, అగ్రికల్చర్, ఫార్మసీ 5,068, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 55 మంది ఉన్నారు. ● పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల పరిధిలో మొత్తం 4,059 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 2,899, అగ్రికల్చర్, ఫార్మసీ 1,159, రెండు కలిపి రాస్తున్న విద్యార్థి ఒక్కరు ఉన్నారు. ● బాపట్ల, చీరాలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల పరిధిలో మొత్తం 8,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 7,684, అగ్రికల్చర్, ఫార్మసీ 1,120, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 24 మంది ఉన్నారు. విద్యార్థులు వీటిని వెంట తీసుకెళ్లాలి ● విద్యార్థులు ఆన్లైన్లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్–2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీలో పొందుపర్చిన నిర్ణీత బాక్స్‌లో విద్యార్థి కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అతికించి, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకోవాలి. ● పరీక్ష జరిగే రోజున సదరు ప్రింటవుట్ కాపీతోపాటు హాల్ టికెట్ వెంట తీసుకుని వెళ్లాలి. బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను అనుమతిస్తారు.గుర్తింపు కోసం ఇంటర్ హాల్ టికెట్, పాస్‌పోర్ట్, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ తీసుకుని వెళ్లాలి. ఇవి మినహా ఇతర వస్తువులను అనుమతించరు. ● విద్యార్థి ఫోటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీపై పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి, ఎడమచేతి బొటన వేలి ముద్ర వేయాలి. -
రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల కోసం సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి
నరసరావుపేట: బాలలకు విజ్ఞానం, వికాసం, వినోదం అందించే సమ్మర్ క్యాంపులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో నిర్వహించాలని చిల్డ్రనన్స్ క్లబ్ రాష్ట్ర కన్వీనర్ కె.రమాప్రభ అన్నారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ‘చిల్డ్రన్న్స్ క్లబ్ ఏర్పాటు–నిర్వహణ ఫలితాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకి ఐద్వా సీనియర్ నాయకురాలు గద్దె ఉమశ్రీ అధ్యక్షత వహించారు. రమాప్రభ మాట్లాడు తూ గతంలో ప్రభుత్వ, మిషనరీ పాఠశాలలే ప్రధానంగా ఉండేవని, ప్రస్తుతం కార్పొరేట్ విద్యావ్యవస్థ విస్తరించడంతో చిన్నారుల్లోని సహజ సృజనాత్మకత, కళలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే కార్పొరేట్ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, పాలకవర్గాలే కార్పొరేట్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి విజ్ఞాన కేంద్రాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల కార్యకర్తలు ముందుకు వచ్చి సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. 1935లో కేరళలో ప్రారంభమైన చిల్డ్రన్స్ క్లబ్ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించిందని, ఈ వేదికల ద్వారా అనేక మంది ఉత్తమ పౌరులుగా ఎదిగారని గుర్తు చేశారు. పల్నాడు జిల్లాలో కూడా చిల్డ్రన్స్ క్లబ్‌లను విస్తృతంగా ఏర్పాటు చేసి చిన్నారుల్లో అభ్యుదయ భావాలు పెంపొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం పల్నాడు బాలోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. పల్నాడు విజ్ఞాన కేంద్రం వర్కింగ్ కమిటీ కన్వీనర్ షేక్ మస్తాన్‌వలి, పల్నాడు బాలోత్సవం కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, టి.అంజిరెడ్డి, పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, విజ్ఞాన కేంద్రం వర్కింగ్ కమిటీ సభ్యులు బండారుపల్లి నాగేశ్వరరావు, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రజిని, అధ్యక్షులు అనూష, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు డి.శివకుమారి, కౌలు రైతు సంఘం నాయకులు కామినేని రామారావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు జి.మల్లేశ్వరి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకురాలు అమూల్య పాల్గొన్నారు. చిల్డ్రన్ ్స క్లబ్ రాష్ట్ర కన్వీనర్ కె.రమాప్రభ -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన పార్టీ జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహించి ర్యాంకులు ఇస్తున్నారన్నారని, కానీ అసలు ర్యాంకులు ఇవ్వాల్సింది ప్రజలు అని అన్నారు. మీ పరిపాలన మీద సగం మార్కులు కూడా ఇవ్వడం లేదన్నారు. మొదటి ర్యాంకు ఇచ్చిన వ్యవసాయ రంగంలోనే రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, కనీసం గోనె సంచులు కూడా దొరకడం లేదన్నారు. ఈ సమస్యలు కలెక్టర్ల మీటింగ్‌లో కనీసం చర్చకు నోచుకోలేదన్నారు. ఇళ్ల స్థలాలు, పట్టాల సమస్యలు 2027 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారే తప్పా నిర్ధిష్ట కార్యాచరణ లేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గాయని, గ్యాస్ ధరలు పెద్దఎత్తున పెంచినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లేకపోతే వాటి సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాగ్ధానం చేసిన విధంగా గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఓ.ఆర్.ఆర్ వల్ల భూముల కోల్పోతున్న రైతులకు అమోధ్యయోగమైన ప్యాకేజీని ఇవ్వాలన్నారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, బూరుగు వెంకటేశ్వర్లు, కె.నళీనికాంత్, జిల్లా నాయకులు ఎన్.శివాజీ, పి.కృష్ణ, జి.రమణ, పి.బాలకృష్ణ, దండా లక్ష్మీనారాయణ, వై.కృష్ణకాంత్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు -
రాజరాజేశ్వరి దేవిగా మహంకాళి దర్శనం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠం రాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు మూడో రోజుకు చేరాయి. శనివారం అమ్మవారికి సారెను మంచికలపూడి గ్రామస్తులు సమర్పించారు. అమ్మవారు రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. మంగళగిరి టౌన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పలువురు అధికారులతో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చే మార్గం, ప్రజలు వచ్చే మార్గాలను వీక్షించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ శంకర్ తదితర స్థానిక అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నిక గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులుగా జి.రత్నకుమార్, కె.శ్రీధర్‌కుమార్‌లు ఎన్నికయ్యారు. శనివారం గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్రశాఖకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ గౌరవాధ్యక్షుడిగా ఎన్.రాజేష్ ప్రభుకుమార్, సహాధ్యక్షుడిగా ఎన్.తిప్పేస్వామి, ఉపాధ్యక్షులుగా ఆర్బీవీ కృష్ణారావు, జి.రాంజీ అంబేడ్కర్, ఒ.చిట్టిబాబు, డీఎన్వీ కిరణ్, సంయుక్త కార్యదర్శులుగా కె.జగన్నాఽథ్, ఆర్.మధు వెంకటేశ్వరరావు, ఎస్పీ ప్రసన్నకుమార్, కె.సాయి ప్రకాష్, కోశాధికారిగా ఎస్.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా వి.సూరజ్, బి. రవికుమార్, ఎస్.వెంకటేష్, కో ఆప్షన్ సభ్యుడిగా బీఆర్ అంబేడ్కర్ ఎన్నికయ్యారు. తెనాలిటౌన్: స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి రోజున స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేసిన విషయం తెలిసిందే. నాల్గవ రోజైన శనివారం ఉదయం 9.30 గంటలకు నిత్యహోమం, ఆలయ బలిహరణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదురుకోల ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ వి.అనుపమ పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. -
కుమార్తెను విమానం ఎక్కించి వస్తుండగా తండ్రి మృతి
నాదెండ్ల: కుమార్తెను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపాలన్న ఆ తండ్రి కల నెరవేరిన వేళ.. ఆ ఇంట సంతోషం అంబరాన్నంటింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ లండన్ వెళ్తుంటే, ఆ విమానం ఆకాశంలోకి ఎగిరే వరకు రెప్పవాల్చకుండా చూస్తూ కుటుంబసభ్యులు మురిసిపోయారు. కానీ, ఆ ఆనందం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. విధి ఆడిన వింత నాటకంలో వీడ్కోలు పలికి తిరిగి వస్తున్న తండ్రిని కొద్ది గంటల్లోనే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన ఎన్ఎస్పీ కెనాల్స్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ నెల్లూరి రామారావు(52) తన కుమార్తె అంజలిని ఎంఎస్ విద్యకోసం లండన్ పంపేందుకు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ విమానాశ్రయానికి కారులో వెళ్లారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కుమార్తెను విమానం ఎక్కించి, వారు తిరుగు ప్రయాణమయ్యారు. మిర్యాలగూడ సమీపంలోని వేములపల్లి వద్దకు రాగానే వీరి కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. పల్టీలు కొట్టిన కారు సమీపంలోని చెట్టును ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా..కారు వెనుక సీటులో కూర్చున్న రామారావుకు అద్దాలు పగిలి తలకు బలంగా గుచ్చుకున్నాయి. తీవ్ర రక్తస్రావమై కొన ఊపిరితో ఉన్న రామారావును ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కారు నడుపుతున్న కుమారుడు ఈశ్వరప్రసాద్, భార్య రామపూర్ణమ్మల కళ్లెదుటే ఈ ఘోరం జరగడంతో వారి రోదనలు మిన్నంటాయి. అదే కారులో రామారావు బావమరిది భార్య నాగలక్ష్మి, ఆమె ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అటు లండన్ వెళ్తున్న కుమార్తెకు తండ్రి మరణవార్త తెలియక, ఇటు చేతికందిన కొడుకు తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. నల్గొండలో పోస్టుమార్టం అనంతరం రామారావు భౌతికకాయం శనివారం సాయంత్రం గ్రామానికి చేరుకోవడంతో ఎండుగుంపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఫైల్ క్లియరెన్స్‌లో రెండో స్థానంలో జిల్లా కలెక్టర్
నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగాన్ని సమర్థంగా నడిపిస్తూ, ప్రజలకు సత్వర సేవలు అందించడంలో అగ్రగామిగా నిలిచారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ–ఫైల్స్ క్లియరెన్స్ నివేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్ రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. ఒక్కో ఫైలును సగటున కేవలం 7.65 గంటల్లోనే పరిష్కరిస్తూ పాలనలో అత్యంత వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫైళ్ల పరిష్కారంలో జాప్యం లేకుండా, పారదర్శకతతో ముందుకు సాగుతూ జిల్లా అభివృద్ధి, ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఫైళ్ల క్లియరెన్స్‌లో జిల్లాను అగ్రపథంలో నిలిపిన కలెక్టర్‌ను జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు. ప్రజలకు అందాల్సిన సేవలు ఏవైనా నిర్ణీత సమయంలోగా అందేలా చూడటమే తన ప్రాధాన్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. -
రేషన్ మాఫియా దందా
గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ప్రతి నియోజకవర్గంలో మండలానికి ఒక టీడీపీ నేత రేషన్ మాఫియా నిర్వహణను పంచుకున్నారు. గుంటూరు నగరంలో, రూరల్ మండల పరిసరాల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తి చేతుల్లో రేషన్ మాఫియా నడుస్తోంది. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ డీలర్‌కు చేరేలోగానే బియ్యాన్ని మాఫియా దోచేస్తోందని డీలర్లే బాహాటంగా ఆరోపిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో అక్రమ రేషన్ దందాకు అంతులేకుండా పోయింది. ముఖ్యంగా మురళి.. ఈ పేరు చెబితేనే ప్రతి రేషన్ డీలర్ భయపడుతున్నాడంటే మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. బియ్యం గోడౌన్ నుంచి లారీ బయలుదేరగానే సంబంధిత అధికారులు ఆ వ్యక్తికి సమాచారం ఇస్తారు. వెంటనే ఆ వ్యక్తి తమ మాఫియా గణంతో ఆయా డీలర్లకు ఆదేశాలు జారీ చేస్తాడు. తమ వాహనాల్లో ఇన్ని బస్తాలు లోడు చేయాలని ఆదేశిస్తాడు. అతని మాట ఎవరైనా వినకుంటే రోజుల వ్యవధిలో అధికారులు ఆయా షాపుల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తారు. చేసేది లేక ఆ వ్యక్తి చెప్పినట్లుగానే లబ్ధిదారులకు బియ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా అతని వాహనాల్లో చెప్పినన్ని బస్తాలు లోడు చేసి పంపాల్సిందే. డిప్యూటీ తహసీల్దార్లపై ఆరోపణలు పేదలకు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సిన పౌరసరఫరాల శాఖ ప్రస్తుతం అవినీతి కుంపటిలో కూరుకుపోయింది. కింది స్థాయి నుంచి మొదలుకొని పైస్థాయి అధికారి వరకు తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 5,90,546 రేషన్ కార్డులున్నాయి. 972 డిపోల ద్వారా ప్రతి నెలా సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యంతోపాటు పంచదార, గోధుమ పిండి సరఫరా చేస్తారు. మొదటి 15 రోజులు ఈ రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. చాలా రేషన్ దుకాణాల్లో కొలతల వ్యత్యాసం ఉంటుంది. దీనిని సివిల్ సప్లైస్ అధికారులు పట్టించుకోరు. దానికిగాను కొన్ని రేషన్ దుకాణాల నుంచి ప్రతి నెలా రూ.1,000 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఏడుగురు డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు. గతంలో వెస్ట్ డీటీ మొహమ్మద్ ఖాదర్ బాషాపై ఓ రేషన్ దుకాణదారుడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాడు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఈస్ట్ డీటీపైనా ఫిర్యాదులు అందాయి. ఇలా మరికొందరిపైనా నిత్యం ఏదో ఒక సమయంలో ఫిర్యాదులొస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారి దీర్ఘకాలిక సెలవులో వెళ్లినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో కిందిస్థాయి అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. జిల్లాకు చెందిన నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉండగానే ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఈ శాఖపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రేషన్ గోడౌన్ల నుంచి డీలర్లకు వచ్చే బియ్యం బస్తా ఒకొక్కటి 50 కిలోలు ఉండాలి. కానీ 40, కిలోలు, ఇంకా కొన్నింటిలో 35 కిలోలు ఉంటున్నాయని డీలర్లు వాపోతున్నారు. తమకు వచ్చే బియ్యంలోనే కోతలు వేసి, మళ్లీ టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న మాఫియాకు వారు అడిగినన్ని బస్తాలు పంపితే ఇక లబ్ధిదారులకు ఏ విధంగా రేషన్ పంపిణీ చేయాలని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదాముల నుంచి వచ్చే బస్తాల్లో తమ వాటాగా అధికారులు బస్తాకు పది కిలోలకుపైగా దోచుకుంటుంటే, మాఫియా కూడా తామేం తక్కువ కాదని బస్తాలకు బస్తాలు దోచుకుపోతున్నారు. మాఫియా సైతం కిలో రూ.16కు కొనుగోలు చేస్తోందని, ప్రజలకు ఇచ్చి మళ్లీ వారి వద్దే రూ.15 బియ్యం కొని మాఫియా అడిగినన్ని బస్తాలు ఇస్తున్నామని డీలర్లు వాపోతున్నారు. -
కార్పొరేట్‌కు భోగం
పేదోడి రోగం.. ‘‘ఏంటి సార్ దగ్గుతున్నారు.. మీరు కూడా కొన్ని టెస్ట్‌లు చేయించుకోండి’’.. అంటూ ఠాగూర్ సినిమాలో ఓ సీన్ కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి అద్దం పడుతుంది. కేవలం పొడి దగ్గుకే టెస్టుల పేరిట దోచుకునే తీరు పల్నాడు జిల్లాలోకి కొన్ని కార్పొరేట్ వైద్యశాలల్లోనూ కనిపిస్తోంది. కాలిలో ముల్లు గుచ్చుకుంటే కంటి వరకు టెస్టులు చేయిస్తూ పేదల స్థోమతకు పరీక్ష పెడుతున్నారు. ఆస్పత్రి గడప తొక్కితే చాలు రోగం తగ్గడం సంగతి దేవుడెరుగు అప్పుల మూట గుండెలపై గుదిబండగా మారుతోంది. స్కానింగ్‌లు, రక్త పరీక్షల ల్యాబ్‌తో కుమ్మకై ్కన వైద్యుల తీరు రోగుల జేబులకు చిల్లు పెడుతోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో సేవల అందక కార్పొరేట్ ఆస్పత్రుల వారు పేద, మధ్య తరగతి వారిని దోచుకుంటున్నారు. నరసరావుపేట టౌన్: ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లిన రోగికి చికిత్స కంటే ముందే భారీ బిల్లులు భయపెడుతున్నాయి. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో కొన్ని ప్రైవేటు వైద్యశాలల్లో పరిస్థితి రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన సౌకర్యాలు, నిపుణుల కొరత కారణంగా ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితిని కొందరు కార్పోరేట్ వైద్యసంస్థలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన రోగులకు అవసరం లేని వైద్య పరీక్షలు రాస్తూ రూ.వేల నుంచి రూ.లక్షల వరకు బిల్లులు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్ల మధ్య కమీషన్ వ్యవస్థ కారణంగా రోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి. జ్వరానికి రూ. 1.5 లక్షల బిల్లు.. నరసరావుపేటకు చెందిన శ్రీనివాస్ జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. సాధారణ చికిత్సతో తగ్గే సమస్య అయినప్పటికీ అతడికి వరుసగా దాదాపు పది రకాల రక్త పరీక్షలు, స్కానింగ్‌లు, ఇతర నిర్ధారణ పరీక్షలు సూచించారు. వారం రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి బిల్లు రూ.1.50 లక్షలు కావడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. పరీక్షల పేరుతో భారీ మొత్తం వసూలు చేశారని వారు ఆరోపిస్తున్నారు. వ్యాపారంగా మారిన వైద్యం రోగి పరిస్థితిని పరిశీలించి అవసరమైన పరీక్షలు మాత్రమే సూచించాల్సిన వైద్య విధానం ప్రస్తుతం వ్యాపారంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది వైద్యులు రోగి లక్షణాలు పూర్తిగా తెలుసుకోకుండానే వరుస పరీక్షలు రాస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, థైరాయిడ్, విటమినన్ టెస్టులు, హార్మోనన్, పూర్తి రక్తపరీక్షలు, 2డీ ఈసీజీ, ఎకో పరీక్షలు, ఇలా అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద జాబితా ఇస్తూ రోగులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని పలువురు వాపోతున్నారు. రోగిని చూడకుండానే ‘అసిస్టెంట్ల’ దందా కొన్ని ఆస్పత్రుల్లో వైద్యుడిని కలిసే ముందు అక్కడి సిబ్బందే పరీక్షల జాబితా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రోగి సమస్య ఏంటో పూర్తిగా తెలుసుకోకుండానే వివిధ టెస్టులు సూచిస్తూ రూ.వేలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల వైద్యుడిని కలిసే అవకాశమే లేకుండా ముందుగానే ల్యాబ్, స్కానింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు. ఇది వైద్య నైతిక విలువలకు విరుద్ధమని ప్రజలు మండిపడుతున్నారు. గర్భిణులకు ప్రైవేట్ స్కానింగ్‌లు నరసరావుపేట ఏరియా వైద్యశాలలో రేడియాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో గర్భిణులకు అవసరమైన స్కానింగ్ పరీక్షలు బయట ప్రైవేట్ సెంటర్లలో చేయించుకోవాల్సి వస్తోంది. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు కమీషన్లు ఇస్తుండటంతో అవసరం లేకున్నా వైద్యులు స్కానింగ్ పరీక్షలు రాస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో కనీసం మూడు నుంచి నాలుగు స్కానింగ్‌లు అవసరం అవుతాయి. ప్రతి స్కానింగ్‌కు రూ.వేల ఖర్చు కావడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్నేళ్లుగా రేడియాలజిస్ట్ పోస్టు భర్తీ చేయకపోవటంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం అవసరం.. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తం వస్తోంది. అనవసర పరీక్షలపై విచారణ, ఫీజుల నియంత్రణ, కమీషన్ వ్యవస్థపై దృష్టి సారించాలి. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవటంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రేడియాలజిస్టుల నియామకం చేపట్టాలి. ఈ వ్యవహారాలపై పల్నాడు జిల్లా కలెక్టర్ తక్షణమే దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు. -
ఖాకీల వేధింపులకు దంపతుల ఆత్మహత్యాయత్నం
● మేం చనిపోతే మా కుమారుడిని కాపాడండి ● వీడియోలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మొర కొల్లూరు : బాపట్ల జిల్లా కొల్లూరు గాంధీనగర్‌కు చెందిన నంబూరు కృష్ణ, రమణ దంపతులు శుక్రవారం కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతానికి చెందిన ఓ యువతి కొద్ది రోజుల కిందట కొల్లూరులోని తమ బంధువులైన ఈ దంపతుల ఇంటికి వచ్చింది. వారి కుమారుడైన జయరాజును వివాహం చేసుకుంటానని, తమకు పెళ్లి చేయాలని యువతి కోరడంతో ఆమె ఆధార్ కార్డు ప్రకారం మేజర్ అని నిర్ధారించుకుని వివాహం జరిపించారు. కొన్ని వారాల కిందట యువతి తల్లి వచ్చి ఆమె మైనర్ అని, బలవంతంగా వివాహం చేశారని పోలీసుకలు ఫిర్యాదు చేసింది. కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు సూచన మేరకు చీమకుర్తి పోలీసుస్టేషన్‌కు యువకుడి తరఫు వారు వెళ్లారు. యువకుడిపై పోక్సో, లైంగికదాడి, కిడ్నాప్ కేసులు నమోదైనట్లు తెలిసింది. తమ బిడ్డను గొడ్డును బాదినట్లు బాదడంతోపాటు, రోజుల తరబడి స్టేషన్ వద్ద తమను వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత కక్షలను మనస్సులో పెట్టుకొని రేణుక, సురేష్, వంశీ, నవీన, శ్రీను అనే వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతూ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. పెద్ద మనిషిగా వచ్చిన వ్యక్తి బెదిరించడంతో తమను బతకనివ్వరనే ఆందోళనతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. తాము చనిపోయినా పోలీసుల వద్ద ఉన్న తమ కుమారుడిని కాపాడాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు మొరపెట్టుకున్నారు. దంపతులు పురుగుల మందు తాగి, వీడియో రూపంలో తమ బాధను వెళ్లగక్కడాన్ని గమనించిన స్థానికులు వారిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీనిపై ఎటువంటి సమాచారం అందలేదని కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. -
ఆదాయ పన్ను చెల్లింపునకు సరళీకృత విధానాలు
ఆదాయపు పన్నుశాఖ అధికారులు నరసరావుపేట: ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సరళీకృతమైన విధానాలను తీసుకొచ్చిందని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆదాయపు పన్ను సక్రమంగా సకాలంలో చెల్లించాలని ఆశాఖ అదనపు డైరెక్టర్ నెడుమారన్, డెప్యూటీ డైరెక్టర్(ఇన్వెస్టిగేషన్స్) భరత్ వెల్లడించారు. శుక్రవారం ఆదాయపు చట్టం–2025పె అవగాహన కార్యక్రమాన్ని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వనమా సాంబశివరావు అధ్యక్షతన సత్తెనపల్లిరోడ్డు కోట సెంటర్లోని వాసవీ కల్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన అధికారులు మాట్లాడుతూ చట్టాన్ని సులభతరంగా ప్రజలకు చేరువ చేయటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 1961 చట్టంలో మార్పులు, చేర్పులు చేసిందన్నారు. 1961 చట్టంలో 819 సెక్షన్లు ఉంటే వాటిని 2025 చట్టంలో 533గాను, ఫారంలు 329 నుంచి 190కు కుదించారన్నారు. రేట్లు, టాక్స్, వడ్డింపులు తగ్గించారన్నారు. పలు దేశాల చట్టాలను పరిశీలించి మనదేశ ప్రజలు అందరికీ అర్దమయ్యేరీతిలో తీసుకొచ్చారన్నారు. 1961 చట్టం ప్రకారం అందజేసే బెనిఫిట్స్ 2025 చట్టంలోకూడా వర్తిస్తాయన్నారు. సామాన్య మానవులు సైతం సులభంగా సింగిల్ ఫారంలో పన్ను చెల్లించేలా ఏర్పాటు చేశారన్నారు. సీనియర్ ఆడిటర్ చేకూరి సాంబశివరావు, చాంభర్ కార్యదర్శి పచ్చిపులుసు సతీష్‌కుమార్, చాంభర్ ప్రతినిధులు తాళ్లూరి సత్యనారాయణ, బచ్చు నాగేశ్వరరావు, హనుమత్ప్రసాదు, కొప్పూరావూరి మోహనరావు, ఆడిటర్లు, వ్యాపారులు పాల్గొన్నారు. -
పల్నాడు
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026వారాంతం ఆహా..● వారంలో ఐదు రోజులపాటు వ్యాయామాలు, మితంగా తిండి ● శని, ఆదివారాల్లో నచ్చిన పదార్థాలు ఎక్కువ తినేందుకు ఆసక్తి ● తెల్లవారుజామున 4 గంటలకే బిర్యానీ సిద్ధం చేస్తున్న హోటళ్లు ● అర్ధరాత్రి దాటిన తరువాత కూడా భారీగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు ● బయటి ఆహారంతో ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న నిపుణులు●7గుంటూరు లీగల్/చిలకలూరిపేట టౌన్: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి గుంటూరు పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట పట్టణానికి చెందిన రాయపూడి మరియదాసు(57) బాధిత బాలిక తల్లితో సహజీవనం చేస్తూ ఉండేవాడు. బాలికతో మరియదాసు అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడు. నిందితుడి ప్రవర్తన గురించి బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె పలుమార్లు హెచ్చరించినప్పటికీ, అతడు తన వైఖరి మార్చుకోలేదు. దీంతో బాధితురాలి తల్లి నిందితుడి నుంచి దూరంగా నివసించడం ప్రారంభించింది. అనంతరం బాలిక చదువుతున్న పాఠశాలలో శక్తి టీం సభ్యులు ‘గుడ్ టచ్–బ్యాడ్ టచ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో బాలిక తనపై జరుగుతున్న వేధింపులను టీం సభ్యులకు వివరించింది. శక్తి టీం సభ్యులు బాలిక తల్లిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి షేక్ షమ్మి పర్వీన్ సుల్తానా బేగం నిందితుడు రాయపూడి మరియదాసుకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదనంగా బాధిత బాలికకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫున ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. విచారణ అధికారులుగా సీఐ వి.సూర్యనారాయణ, ఎస్సై శివరామయ్య, కోర్టు కానిస్టేబుల్ ఎం.బాలాజీ నాయక్‌లు కేసు పురోగతికి సహకరించారు. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. సాక్షి, నరసరావుపేట: ఉద్యోగులైనా, వ్యాపారులైనా, విద్యార్థులైనా, గృహిణులైనా... ఇలా ఏ వర్గానికి చెందిన వారైనా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆరోగ్యం కాపాడుకోవడానికి మంచి పద్ధతులు పాటిస్తున్నారు. రోజూ వ్యాయామం, యోగా, ఆహార నియామాలు పాటించడం, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, సీజనల్ ఫ్రూట్స్ తినడం వంటివి చేస్తున్నారు. వీరిలో చాలా మంది శని, ఆదివారాలు వచ్చేసరికి తమ మెనూ మార్చేస్తున్నారు. రోజువారీ చేసే పనులు, తినే ఆహారానికి స్వస్తి పలికి సరదాగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ సరదా సందడిలో నిత్య వ్యాయామానికి దూరమవడంతోపాటు, తమకు నచ్చిన ఆహార పదార్థాలను ఎక్కువ మొత్తంలో తినేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవడంతో పాటు శరీర ఆకృతిలోనూ తేడాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిత్యం ఆహార నియమాలు పక్కాగా పాటిస్తూ, సేంద్రియ ఉత్పత్తుల వైపు మొగ్గుచూపే నగర, పట్టణ వాసులు సైతం వారాంతంలో మాత్రం మసాలాలతో కూడిన మాంసాహారం తినేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజువారీ తినే ఆహారం కన్నా విభిన్నంగా ఉండే ఆహారాన్ని తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు ఉదయం నుంచి రాత్రి వరకు డైట్ పాటించి...అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కువ కేలరీలు లభించే ఆహారం తింటున్నారు. అందుకే గుంటూరు నగరం వన్‌టౌన్ ప్రాంతంలోని హోటళ్లలో మిడ్నైట్ బిర్యానీలకు యమా గిరాకీ ఉంటోంది. కొత్తగా 4ఏఎం బిర్యానీలంటూ తెల్లవారుజామున నాలుగింటికే రకరకాల బిర్యానీలు వేడివేడిగా వడ్డిస్తున్నారు. వీటిని వారాంతంలో తినడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారు. అనధికార లే అవుట్లపై స్పెషల్ డ్రైవ్ తాడువాయి అడవిలో నరికిన చెట్టు తెనాలి: మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.5,700, మోడల్ ధర రూ.4,200 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.4920 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 524.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రజల జీవన శైలిలో మార్పులు వస్తున్నాయి. చాలా మంది వారాంతంలో ఆహార నియమాలను మార్చేసుకుంటున్నారు. రాత్రి ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు. రాత్రిళ్లు ఎక్కువసేపు మెలకువగా ఉండి, ఆహారం తినడం వల్ల ఊబకాయం వస్తుంది. వీలైనంతవరకు బయటి ఆహారం తినకపోవడం మంచిది. – డాక్టర్ అంకినీడు ప్రసాద్, ఏరియా వైద్యశాల వారంలో ఐదు రోజులు పాటు వ్యాయామం చేసి చివర రెండు రోజులు మానేయడం, ఎక్కువ ఆహారం వల్ల శరీరాకృతిలో మార్పులొస్తాయి. ఐదు రోజుల జిమ్ ఫలితం మొత్తం పోతుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా, వారాంతమైనా వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. ఆహార నియమంలో కొంత మేరకు తీసుకోవడం వెసులుబాటు తీసుకుంటే ఇబ్బంది లేదు. – అజీజ్, జిమ్ నిర్వాహకుడు, నరసరావుపేట -
ఎస్బీఐ ఉద్యోగులు సమ్మెకు సన్నద్ధం
కొరిటెపాడు(గుంటూరు): ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు ఎస్బీఐ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్, అమరావతి సర్కిల్– గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంపాలెంలోని మెయిన్ బ్రాంచ్ వద్ద ‘సైలెంట్ సిట్ ప్రొటెస్ట్‘ కార్యక్రమం నిర్వహించారు. ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ అమరావతి సర్కిల్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కె.కోటిరెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల్లో తగిన సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. శాశ్వత ఉద్యోగులను ఔట్సోర్సింగ్ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. ఇంటర్ సర్కిల్ బదిలీల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కేఆర్వీ జయకుమార్, వి.నరేంద్రకుమార్, రంగసాయి, ఇబ్రహీం షా, సంపత్, యూఎఫ్‌బీయూ అడ్వైజర్ పి.కిషోర్, స్థానిక సెక్రటరీలు, పలువురు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. -
మహంకాళి అమ్మవారికి సారె సమర్పించిన భక్తులు
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసిన మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు శుక్రవారం రెండవ రోజుకు చేరాయి. చిలువూరు గ్రామస్తులు అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో లేబర్ అడ్డాలు (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. హిందూ కాలేజ్ జంక్షన్, కంకరగుంట ప్రాంతాలను పరిశీలించారు. కార్మికులు పని కోసం రోడ్ల మీద వేచి ఉండకుండా లేబర్ అడ్డాల్లో కూర్చొంటారని తెలిపారు. పని లేని సమయంలో కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తారని అన్నారు. వివిధ ప్రాంతాల్లో పనుల నిమిత్తం ఒకచోట కార్మికులు వేచి ఉండే సంప్రదాయం ఉందని, ఆయా పనులకు వెళ్లగా మిగిలిన వారు ఆ ప్రాంతంలో ఖాళీగా ఉంటున్నారని చెప్పారు. ఇటువంటి వారిని గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలిపారు. అడ్డాల్లో తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏ గాయత్రీ దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మూడోరోజైన శుక్రవారం సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవం జరిపారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.పొన్నూరు: పట్టణంలోని సహస్ర లింగేశ్వర స్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి ఈనెల 13వ తేదీ వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీ అమర్నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఉత్సవమూర్తులకు తిరుమంజనం, అలంకరణ, రాత్రి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 11న ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మన్యుసూక్త సహిత చతుర్దశ కలశ స్నపన, అలంకారాలు, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, నివేదన, నీరాజనం, సాయంత్రం స్వామి వారి ఉష్ట్ర వాహనంపై గ్రామోత్సవం, 12న తెల్లవారుజామున విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచామృత విశేష అభిషేకం, అలంకరణ, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 4గంటలకు నివేదన, నీరాజనం, తీర్థ్ధప్రసాద వినియోగం జరుగుతుందన్నారు. రాత్రి సువర్చలా సమేత స్వామి వారికి దివ్య తిరుకల్యాణ మహోత్సవం ఉంటుందన్నారు. 13న స్వామివారి దివ్య రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. -
బంగారం దుకాణంలో చోరీ
యద్దనపూడి: గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పూనూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన కొండా మాధవరెడ్డి వెంకటరత్నం దంపతుల కుమారుడైన కృష్ణారెడ్డి(7) రాత్రి 7 గంటల ప్రాంతంలో తన ఇంటి సమీపంలోని శివాలయం సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ తరువాత కొంతసేపటికి అటుగా వెళ్తున్న కొందరు గమనించి రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని గుర్తించి 108 వాహనంలో చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి కృష్ణారెడ్డి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కగాను ఒక్క కుమారుడు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలలో చిన్నారుల ప్రతిభ
గుంటూరు వెస్ట్ (క్రీడలు): విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో ఈనెల 5, 6, 7 తేదీల్లో జరిగిన 5వ రాష్ట్రస్థాయి టైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలకు కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన 26 మంది క్రీడాకారులు హాజరయ్యారని అకాడమీ నిర్వాహకుడు కాశీనాఽథ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు అకాడమీ క్రీడాకారులకు మూడు బంగారు, ఐదు రజతాలు, 14 మంది కాంస్య పతకాలతో సహా మొత్తం 22 పతకాలు కై వసం చేసుకున్నారన్నారు. తమ అకాడమీ ద్వారా ఇప్పటికే ఎంతోమంది జాతీయస్థాయి పోటీలకు హాజరై ఎన్నో మెడల్స్ సాధించారన్నారు. రానున్న రోజుల్లోనూ జాతీయస్థాయి పోటీలకు కూడా ఇదే స్థాయిలో ఎక్కువమంది ఎంపికయ్యేలా శిక్షణ ఇస్తామన్నారు. ఆస్తి వివాదంపై ఘర్షణ దాచేపల్లి: ఆస్తి వివాదం నేపథ్యంలో సచివాలయంలోనే ఘర్షణ పడ్డారు. మండలంలోని గామాలపాడు గ్రామ సచివాలయంలో అధికారుల ఎదురుగానే ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగారు. గురువారం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. గామాలపాడులో ఉన్న ఆస్తిపై ఇరువర్గాల మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై వివరాలు తెలుసుకునేందుకు సచివాలయం అధికారులు ఇరువర్గాలను సచివాలయానికి పిలిపించారు. ఇరు వర్గాలకు సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలన చేస్తున్న క్రమంలో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు అధికారులు ఎదుటే పరస్పరం దాడులకు దిగారు. గ్రామ సచివాలయంలో ఇరువర్గాలు దాడులకు దిగిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దాడుల్లో స్థానిక టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నట్టు ఆ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. గ్రామ సచివాలయంలో జరిగిన ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. -
రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన పల్నాడు జిల్లా జట్లు
రొంపిచర్ల: కర్నూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ బేస్‌బాల్ పోటీలలో పల్నాడు జిల్లా బాల, బాలికల జట్లు సత్తా చాటాయని రొంపిచర్ల జెడ్పీ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు వై.సైదయ్య శనివారం తెలిపారు. బాలికల జట్టు మొదటి స్థానం, బాలుర జట్టు రెండవ స్థానం సాధించినట్లు తెలిపారు. మొదటి స్థానం సాధించిన పల్నాడు జిల్లా బాలికల జట్టులో రొంపిచర్ల పాఠశాలకు చెందిన క్రీడాకారులు పి.చంద్రిక, వి.శ్రీదేవి, బి.శ్రీలక్ష్మి, బి.కృప, సిహెచ్.అపర్ణ, ఓ.పావని, ఎస్.ప్రజ్ఞ, ఏ.నక్షత్ర, ఇ.పూజిత, టి. తెజస్విని, బి.మౌనిక, ఇ.నందిని, సీహెచ్.అలేఖ్యలు ఉండగా, బాలుర జట్టులో పి.అశోక్, పి.నరేంద్ర, బి. బాలకృష్ణ, జి.రిషి వర్థన్, పి.నరేంద్ర, ఎం.వెంకీ, పి.హుస్సేన్, ఎస్కే.అక్బర్లు ఉన్నారన్నారు. విజయం సాధించిన క్రీడాకారులను పల్నాడు జిల్లా బేస్‌బాల్ సెక్రటరీ వి.వేమారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వై.సైదయ్య, గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ అధినేత పి.నరసింహారెడ్డి, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. -
సోషల్ మీడియా యాక్టివిస్టుపై దాడి
పిడుగురాళ్ల: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు తమ్మిశెట్టి దుర్గారావుపై గురువారం టీడీపీ మూకలు దాడి చేసి గాయపరిచారు. తమ్మిశెట్టి దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని గంగమ్మతల్లి దేవస్థానం ఎదురుగా గల ఓ టీ షాప్‌లో జ్యూస్ పాయింట్ నడుపుకునేందుకు టీ పాయింట్ యజమాన్ని అడగ్గా ఆయన అంగీకరించారు. దీంతో దుర్గారావు జ్యూస్ పాయింట్ పెట్టుకుని నడుపుకుంటున్నాడు. టీడీపీకి చెందిన షేక్ ఇంతియాజ్ టీ షాపు యజమానికి ఫోన్ చేసి వైఎస్సార్సీపీ సోషల్‌మీడియా యాక్టివిస్ట్‌కు ఎందుకు జ్యూస్ పాయింట్‌కు అనుమతి ఇచ్చారని ప్రశ్నించాడు. ఖాళీ చేయించాల్సిందేనని హుకుం జారీ చేశాడు. టీ షాపు యజమాని దుర్గారావుకు విషయం చెప్పగా ఖాళీ చేసేందుకు కొంత సమయం కోరాడు. రాత్రి సమయంలో అందరు నడిరోడ్డుపై ఉండగానే నలుగురు టీడీపీ కార్యకర్తలు దుర్గా జ్యూస్ పాయింట్ వద్దకు వచ్చి కర్రలతో దాడి చేశారు. దుర్గారావు తప్పించుకొని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చేరుకున్నాడు. సంఘటన తెలుసుకున్న వైఎస్సార్ సీపీ స్టేట్ బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ శెట్టుపల్లి పూర్ణ దుర్గారావును నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొని వెళ్లి చికిత్స చేయించారు. దుర్గారావుకు కాసు మహేష్ పరామర్శ నరసరావుపేట: సోషల్ మీడియా కన్వీనర్ తమ్మిశెట్టి దుర్గారావుపై దాడిచేసిన టీడీపీ గుండాలపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. దాడిలో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పిడుగురాళ్ల సోషల్ మీడియా కన్వీనర్ తమ్మిశెట్టి దుర్గారావును గురువారం ఆయన పరామర్శించారు. సంఘటన జరిగిన విధానం అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మహేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పిడుగురాళ్ల నడిరోడ్డులో బుధవారం రాత్రి టీడీపీకి చెందిన నలుగురైదుగురు గుండాలు దుర్గారావుపై దాడిచేసి విచక్షణ రహితంగా కొట్టారన్నారు. కేవలం సోషల్ మీడియాలో పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డికి అనుకూలంగా పోస్టులు పెడుతున్నాడనే కారణంతో టీడీపీ నాయకులు కొంతకాలంగా దుర్గారావును వేధిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాలు, ప్రాంతాల్లో జరిగిన సంఘటనపై ఛలో గురజాల నిర్వహిస్తామన్నారు. ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. పలువురు వడ్డెర సంఘ నాయకులు కూడా దుర్గారావును పరామర్శించారు. -
ఉద్యోగుల పోరుబాట
ప్రభుత్వ పాఠశాల నిర్వహణ, విద్యాబోధన, చిన్నారుల ఆలనాపాలన, పాఠశాల నిర్మాణం .. ఇలా అనేక విధులు నిర్వహిస్తూ విద్యాశాఖ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ‘సమగ్ర శిక్ష’ ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సకుటుంబ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సత్తెనపల్లి: జిల్లాలో మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకం. వీరు ఏళ్ల తరబడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వానికి వివరించి సుమారు రెండేళ్లవుతోంది. దీనిని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 373 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ గతంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా డిమాండ్లను విస్మరించారు. మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును సైతం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానంటూ బడ్జెట్ సమావేశాల్లో చెప్పి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను విస్మరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విసిగి వేసారిన సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యాన ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో కలసి ఈ నెల 15న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటికి మహా పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ దిశగా జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు కదులుతున్నారు. అందిస్తున్న సేవలివీ... మండల విద్యా వనరుల కేంద్రం నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకంగా ఉంటారు. మొత్తం కార్యకలాపాలకు సమన్వయకర్తగా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) కోఆర్డినేటర్ వ్యవహరిస్తారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలల నిర్వహణను క్లస్టర్ రీసోర్స్ పర్సన్ (సీఆర్పీ) పర్యవేక్షిస్తారు. మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) కార్యాలయం నిర్వహణకు సహాయకారిగా మెసెంజర్ ఉపకరిస్తారు. భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు తోడ్పాటుగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ) నిలుస్తారు. వారికి కేర్‌వింగ్ వలంటీర్లు సహాయకులుగా ఉంటారు. పాఠశాలల్లో క్రాఫ్ట్, పీఈటీ, తదితర విధుల నిర్వహణలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు సేవలందిస్తారు. సమగ్ర శిక్ష భవనాల నిర్మాణ వ్యవహారాలను జిల్లా కేంద్రంలో ఉండే సైట్ ఇంజినీరు పర్యవేక్షిస్తారు. ● సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. ● ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చాలి. ● రాజ్యాంగ పరంగా పౌరుల హక్కుగా ఉన్న సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ● హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి ● మినిమం టైం స్కేల్, ఇంటి అద్దె, కరువు భత్యం ఇవ్వాలి. ● రూ. 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యూటీ, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి. ● ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలి. ● వేతనంతో కూడిన మెడికల్ లీవులు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలి. ● మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.20 లక్షలకు పెంచాలి. ● కారుణ్య నియామకాలు చేపట్టాలి. ● డీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలి. -
పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు
కలెక్టరేట్లో ఘనంగా నివాళులర్పించిన అధికారులునరసరావుపేట: గిరిజనులను అన్ని రకాలుగా చైతన్యపరచి బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడిన మహోన్నత నాయకుడు అల్లూరి సీతారామరాజు అని డీఆర్ఓ నారదముని కొనియాడారు. కలెక్టరేట్లో గురువారం అల్లూరి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ విప్లవకారుడని, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామంలో జన్మించారని తెలిపారు. సీతారామరాజు తన ప్రాథమిక విద్యను పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ గ్రామాల్లో అభ్యసించారని, 15 ఏళ్ల వయస్సులో విశాఖపట్నంలో ఉన్న హైస్కూల్, విశ్వవిద్యాలయంలో విద్యను కొనసాగించారని చెప్పారు. 18 ఏళ్ల వయస్సులో సన్యాసిగా మారి జ్యోతిష్యం, ఆయుర్వేదం వంటి విషయాల్లో ప్రావీణ్యం సాధించారని, ఆయన ఆధ్యాత్మికత, త్యాగనిరతి గిరిజనుల్లో విశేషమైన ప్రభావాన్ని చూపిందని వివరించారు. సీతారామరాజు నాయకత్వంలో జరిగిన రంపా తిరుగుబాటు బ్రిటిష్ పాలనకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చిందని తెలిపారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల గిరిజనులను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని, ఆయన నాయకత్వంలో గిరిజనులు పోలీస్స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పోరాటం బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపరిచిందని తెలిపారు. 1924 మే 7న సీతారామరాజు బ్రిటిష్ సైన్యం చేతిలో పట్టుబడి అనంతరం కాల్చి చంపబడ్డారని చెప్పారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గోవింద్ నాయక్, జిల్లా గణాంక అధికారి యూవీ సత్యనారాయణరాజు, టూరిజం అధికారి నాయుడమ్మ, కోఆర్డినేషన్ సూపరింటెండెంట్ నాగిరెడ్డి పాల్గొన్నారు. -
అత్త ఇంట్లో దొంగతనం చేసిన అల్లుడు
చేబ్రోలు: భార్య పుట్టింటికి వెళ్లి నాలుగు నెలలు గడిచినా తిరిగిరాకపోవటం, దురవ్యసనాలకు అలవాటు పడిన అల్లుడు అత్త ఇంట్లో చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కి కటకటాల పాలైన సంఘటన చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో జరిగింది. చేబ్రోలు పోలీసుస్టేషన్లో పొన్నూ రు రూరల్ సీఐ పి కృష్ణయ్య, స్థానిక ఎస్ఐ పి వీరనారాయణ గురువారం వివరాలు వెల్లడించారు. చేబ్రోలు మండలం గుండవరం గ్రామానికి చెందిన సాతర్ల గోపికి వేజండ్ల గ్రామానికి చెందిన తిరుపతమ్మతో 2010లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. కొంత కాలంగా బార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. మద్యానికి అలవాటు పడిన గోపి భార్య మీద అనుమానంతో వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధలు భరించలేక నాలుగు నెలల కింద తిరుపతమ్మ వేజండ్లలోని పుట్టింటికి వెళ్లిపోయింది. పేకాట, మద్యానికి డబ్బులు అవసరమై, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న గోపి వేజండ్లలోని భార్య ఇంటికి వెళ్లాడు. ఐదు రోజుల కిందట భార్య తిరుపతమ్మతోపాటు వారి అత్త కలిసి ధూళిపాళ్లలోని బంధువుల ఇంటిలో జరిగే శుభకార్యానికి వెళ్లారు. 4వ తేదీన వేజండ్లలోని అత్త ఇంటికి వచ్చిన అల్లుడు గోపి ఇంటిలో ఎవరూ లేకపోవటంతో తలుపులు పగలకొట్టి లోపలికి ప్రవేశించి బీరువా తాళాలు పగలకొట్టి అందు లోని బంగారు, వెండి వస్తువులను అపహరించుకొని పారిపోయాడు. సుమారు రూ.9 లక్షల విలువ చేసే బంగారు హారం, నెక్లెస్, చైన్లతో పాటు ఒక జత వెండి కాళ్ల పట్టీలను తీసుకువెళ్లిపోయాడు. ఇంటికి వచ్చి గమనించిన తిరుపతమ్మ చేబ్రోలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ పి వీరనారాయణ కేసు దర్యాప్తు చేశారు. కొత్తరెడ్డిపాలెం అడ్డరోడ్డు వద్ద నిందితుడు సాతర్ల గోపిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వివరించారు. ఎస్ఐ పి వీరనారాయణ, సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్, తెనాలి డీఎస్పీలు అభినందించారు. తొమ్మిది లక్షల బంగారు, వెండి నగలు అపహరణ -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై వడ్డేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన వై.హర్ష (20) వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో బీబీఏ రెండవ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం 6.30 సమయంలో తన స్నేహితుడైన నిఖిల్ సిద్ధార్థతో కలసి ద్విచక్రవాహనంపై తాడేపల్లి వస్తుండగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై వడ్డేశ్వరం వద్ద నిఖిల్ సిద్ధార్థ అతివేగంగా వాహనం నడుపుతూ ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని ఢీకొనడంతో నిఖిల్ సిద్ధార్థ నడుపుతున్న వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో హర్ష డివైడర్‌ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. జరిగిన సంఘటనపై హర్ష చెల్లి శ్రీ ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ అపర్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘాటెక్కిన మిర్చి వాటాలు!
మిర్చి యార్డులో పాలకవర్గం, అధికారుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మిర్చి యార్డులో భారీగా జరుగుతున్న జీరో వ్యాపారంపై వచ్చే నగదులో తమకు కూడా వాటా ఇవ్వాలని పాలకవర్గం పట్టుపడుతుండటం, దీనిపై గురువారం కార్యవర్గం సమావేశం కావడం యార్డులో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమావేశానికి కార్యదర్శి గైర్హాజరు అయ్యారు. ఎప్పుడుపడితే అప్పుడు సమావేశాలు పెడితే తాను రానని కార్యదర్శి చెప్పినట్లు పాలకవర్గ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు కార్యదర్శి వైఖరిపై మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: మిర్చి మార్కెట్ యార్డుకు సెలవులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకూ వసూలు చేసిన డబ్బుల్లో తమ వాటా చెల్లించాల్సిందేనని పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మిర్చి యార్డు కార్యదర్శి కూడా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బంధువు కావడంతో తమను అసలు లెక్క చేయడం లేదని పాలక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే మంత్రి లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదాయానికి గండి యార్డులో గత రెండేళ్లుగా బిల్లులు లేకుండా జీరో వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో యార్డుకు రావాల్సిన సెస్ రాకపోవడంతో ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఏడాదిన్నర తర్వాత పాలకవర్గం వచ్చినా అధికారులు మిర్చి యార్డుపై తమ పెత్తనం కొనసాగిస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. నిత్యం రూ.కోట్లల్లో వ్యాపారం జరిగే ఇక్కడ సెస్ రూపంలో ఆదాయం కూడా ఎక్కువగానే రావాలి. కానీ ఇది యార్డ్ ఖాతాలో జమ కావడం లేదని పాలకవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు నిబంధనలను పట్టించుకోకుండా మిర్చి కొనుగోలు చేస్తూ రైతులను ముంచేస్తున్నారు. మిర్చి యార్డులో జరుగుతున్న జీరో వ్యాపారం, దానిపై వచ్చే ఆదాయం విషయంలోనే అధికారులు, పాలకవర్గం మధ్య గొడవలు తలెత్తాయి. జీరో వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని తమకు ఇవ్వాలని పాలకవర్గ సభ్యులు పట్టుపడుతున్నట్లు సమాచారం. ఇంకా ఎన్నో విధాలుగా... ఇదే కాకుండా బిల్ టు బిల్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. మిర్చి యార్డులో రైతులు, ఎగుమతి వ్యాపారులకు మధ్యవర్తిత్వం చేసి కోనుగోళ్లు జరపడానికి కమీషన్ ఏజెంట్లు పని చేస్తుంటారు. రైతులకు కొనుగోలు చేసిన రోజే డబ్బులు చెల్లిస్తారు. వీరు మార్కెట్ యార్డు నుంచి లైసెన్స్ కలిగి ఉంటారు. లైసెన్స్ లేనివారు ఇప్పటికే ఉన్న వారి పేరుతో వ్యాపారం చేస్తూ వాస్తవంగా వసూలు చేయాల్సిన రెండు శాతానికి బదులుగా రెట్టింపు తీసుకుంటున్నారు. ఇందుకు సహకరిస్తున్న వేమెన్లు, సూపర్వైజర్లు, యార్డు యంత్రాంగానికి కాసుల వర్షం కురుస్తోంది. బిల్ టు బిల్ విధానానికి సహకరించినందుకు బస్తాకు రూ.పది వరకూ వసూలు చేస్తున్నారు. యార్డులో వచ్చే అవినీతి డబ్బుల కోసం పాలకవర్గ సభ్యులు, అధికారుల మధ్య రచ్చ జరుగుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై విజిలెన్స్ శాఖ స్పందిస్తుందో లేదో చూడాలి. -
15 నుంచి రంగస్థల నటనాభినయ ప్రత్యేక శిక్షణ శిబిరం
గుంటూరు ఎడ్యుకేషన్ భావితరాలకు భారతీయ రంగస్థల కళా వైభవాన్ని తెలియజేసే విధంగా ‘భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‘ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక రంగస్థల నాటనాభినయ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు తెలిపారు. గురువారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో వర్క్‌షాప్ ఆన్ థియేటర్ ఆర్ట్ పోస్టర్లు ఆవిష్కరించారు. రామచంద్రరాజు మాట్లాడుతూ గుంటూరు నగర యువత, విద్యార్థులతోపాటు ఔత్సాహికులకు రంగస్థల నటన, ముఖాభినయం, గాత్ర, ధ్వని అనుకరణ కళ, నాటక సృజనాత్మకత, నైపుణ్యతపై లబ్ద ప్రతిష్టులైన రంగస్థల నిపుణులు, నంది పురస్కార గ్రహీతలతో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయా కళల్లో శిక్షణ పొందదలచిన అభ్యర్థులు రోజుకు మూడు గంటలు చొప్పున నాలుగు రోజులపాటు నిర్వహించే శిక్షణ శిబిరంలో శిబిరంలో పాల్గొనేందుకు 0863–2234802, 9124519444 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటుడు డాక్టర్ ఎన్.రవికుమార్, రంగస్థల నటుడు, రచయిత కందిమళ్ల సాంబశివరావు, హిందూ కళాశాల పూర్వ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దుర్గాప్రసాద్, పూర్వ తెలుగు విభాగాధిపతి డాక్టర్ వై.మల్లికార్జునరావు, రవిశంకర్, సీరియల్ నటులు ముత్తవరపు పద్మారావు, మల్లెల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అల్లూరి త్యాగస్ఫూర్తి, దేశభక్తి స్ఫూర్తిదాయకం
నరసరావుపేట రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామారాజు త్యాగస్ఫూర్తి, దేశభక్తి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. మన్యం వీరుడు అల్లూరి వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యక్రమంలో పాల్గొని అల్లూరి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో అల్లూరి సీతారామరాజు చిరస్థాయిగా నిలిచిపోయాడని తెలిపారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలను సమీకరించి అహర్నిశలు పోరాడి దేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను అర్పించడాని వివరించారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ అల్లూరి సేవా భావం, క్రమశిక్షణ, ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, ఆర్ఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, ఎస్బీ సీఐ బి.సురేష్‌బాబు, వెల్ఫేర్ ఆర్ఐ గోపీనాధ్, సిబ్బంది పాల్గొన్నారు. -
పాతకక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి
చిలకలూరిపేటటౌన్: పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ సమీపాన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సుభానినగర్‌కు చెందిన తాపీమేస్త్రి అయిన షేక్ జానీబాషా గుర్రాల చావిడికి చెందిన వెల్డింగ్ వర్కర్ బషీర్ల మధ్య గతంలో కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలోని సాయికార్తీక్ సిటీ సెంటర్ సమీపంలో గురువారం సాయంత్రం టీ తాగుతున్న క్రమంలో బషీర్ కత్తితో దాడి చేశాడు. బాధితుడు తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా పలుచోట్ల కత్తితో పొడిచాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై 108 సిబ్బందికి సమాచారం అందించారు. రక్తస్రావం తీవ్రంగా కావడంతో బాధితుడు బాషాను తొలుత స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడు బషీర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు -
అల్లూరి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిషు పాలకులను ఎదురించిన అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. గురువారం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్రోద్యమ చరిత్రలో మరుపురానిదని, స్వాతంత్య్రం పొందడానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని నమ్మిన అల్లూరి తన పోరాటపటిమతో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్నారని కొనియాడారు. అల్లూరి వంటి మహనీయుడు మన రాష్ట్రంలో జన్మించడం అందరికీ గర్వకారణమని చెప్పారు. అల్లూరి ఆశయ సాధనకోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలన అధికారులు రాజా రత్నం, ఉమా సుమంత్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి ఆలయ వార్షికోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. అమ్మవారు భక్తులకు లక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. చిలువూరు గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మ వారికి సారె సమర్పించారు. ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. కొరిటెపాడు(గుంటూరు): స్పైసెస్ బోర్డు ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సంగీత విశ్వనాథన్ గురువారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి యార్డులో రైతులకు అందిస్తున్న సదుపాయాలు, ప్రస్తుత మిర్చి వ్యాపార పరిస్థితులు, నాణ్యత పరిరక్షణ చర్యలు, ప్రాసెసింగ్ విధానాలు, మిర్చి ఎగుమతులకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతులకు మరింత మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యార్డు అధికారులు, వ్యాపార వర్గాలతో అభిప్రాయాలు పంచుకున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు పెంచే దిశగా స్పైసెస్ బోర్డు చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ముందుగా సంగీత విశ్వనాథన్‌ను యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు సభ్యుడు కొత్తూరి వెంకట సుబ్బారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య, పలువురు యార్డు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తొలిరోజున స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేసిన విషయం తెలిసిందే. రెండో రోజైన గురువారం ఉదయం 9.30 గంటలకు నిత్యహోమం, బలిహరణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై గ్రామోత్సవం జరిపారు. స్వామి వారి భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక అంశాలను కళాకారులు ప్రదర్శించారు. -
పల్నాడు జిల్లా ఎడ్లకు ప్రథమ స్థానం
ముగిసిన ఎడ్ల బండ లాగుడు పోటీలు నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు విజయవంతంగా ముగిశాయి.. బుధవారం రాత్రి జరిగిన ఒంగోలు జాతి సీనియర్ విభాగం ఎడ్ల బండ లాగుడు పోటీలలో విజేతల ఎడ్ల జత యజమానులకు రైతు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. బుధవారం రాత్రి సీనియర్ విభాగంలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ సత్తార్ ఎడ్ల జత 3,030 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా రెడ్డిపాలేనికి చెందిన కాఠసాని హేమచంద్రారెడ్డి, జాన్వికారెడ్డి, కాకుమాను మండలం కొండబాలవారిపాలెంకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత చౌదరి ఎడ్ల జత 3000 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. గుంటూరు జిల్లా రెడ్డిపాలేనికి చెందిన కాఠసాని హేమచంద్రారెడ్డి, జాన్వికారెడ్డి, కాకుమాను మండలం కొండబాలవారిపాలెంకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత చౌదరి ఎడ్ల జత 2,778 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం వీరాయపాలెంకు చెందిన దూదేకుల పెద్ద చాంద్‌బాషా ఎడ్ల జత 2,585 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానంలో నిలిచినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.లక్ష, 80 వేలు, 70 వేలు, 60 వేల నగదు బహుమతులతోపాటు, జ్ఞాపికలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కమిటీ సభ్యులతోపాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘వన్ మంత్ –వన్ విలేజ్’ను సద్వినియోగం చేసుకోండి
యడ్లపాడు: మండలంలోని మర్రిపాలెం రెవెన్యూ గ్రామంలో గురువారం తొలిగా నిర్వహించిన వన్ మంత్–వన్ మండల్– వన్ విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ సంజనా సింహ సందర్శించారు. అధికారులను, ప్రజల్ని కలసి తెలుసుకున్నారు. జేసీ మాట్లాడుతూ మండలం మర్రిపాలెం గ్రామంలో వరుసగా నాలుగు గురువారాలు గ్రామసభలు రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ గ్రామసభల్లో ఇచ్చిన ప్రతి అర్జీ ప్రజాసమస్యల పరిష్కార వేదిక యాప్‌లో నమోదవుతుందన్నారు. ప్రతి అర్జీపై మండలస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల పరిశీలన ఉంటుందని, కావున ప్రజలు ఈ కార్యక్రమంలో సుదీర్ఘంగా ఉన్న తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు. మండలంలోని మర్రిపాలెం గ్రామంలో నిర్వహించిన తొలి గ్రామసభలో స్థానికుల నుంచి ఐదు అర్జీలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ జెట్టి విజయశ్రీ, ఎంపీడివో వి హేమలతాదేవి, ఎంఈవో ఎంవీ నాగరత్నం, ఆర్ఐ సుబ్బారావు, సర్వేయర్ గేరా సురేంద్రనాథ్, దేవదాయ, అటవీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కనీస జాగ్రత్తలు పాటించాలి
జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాల రోగులు, చిన్న పిల్లలు మారిన వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు పడుతుంటారు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను ఎండలో బయట తిరగకుండా చూడాలి. వృద్ధులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం, తదితర సహజసిద్ధ ద్రవపదార్థాలను సేవించాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే కాటన్ దుస్తులు ధరించాలి. కూలింగ్ గ్లాసు, గొడుగు, టోపీ, ఒక లీటర్ నీరు వెంట తీసుకు వెళ్లాలి. మాంసాహారం, మసాలా పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ధూమపానం, మద్యం సేవించరాదు. చెమటలు పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింతలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే అది వడదెబ్బ. వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ బి. రవి, డీఎంహెచ్‌వో, పల్నాడు -
తండ్రికి అంత్యక్రియలు చేసిన తనయ
మంగళగిరి టౌన్: తండ్రి అంత్యక్రియలు కుమార్తె నిర్వహించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన ఆళ్ల శంకరరెడ్డి(74) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. శంకరరెడ్డికి కుమారులు లేకపోవడంతో అంత్యక్రియలు చేసే విషయంలో బంధువుల మధ్య చర్చ జరిగింది. అయితే తన తండ్రికి అంత్యక్రియలు చేసే బాధ్యతను తనకు ఇవ్వాలని కుమార్తె నందీశ్వరి ధైర్యంగా ముందుకొచ్చింది. నందీశ్వరి అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేశారు. ఆమె భర్త బొంతు వీరారెడ్డి నూతక్కి గ్రామంలో ఆర్ఎంపీగా సుపరిచితులు. తండ్రికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ తన తండ్రికి నందీశ్వరి అంత్యక్రియలు నిర్వహించారు. -
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు భగభగమంటూ నిప్పులు కురిపిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు నిప్పుల కొలిమిలా మారుతోంది. గత ఐదు రోజులుగా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 44 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, ఊపిరాడని
సత్తెనపల్లి: జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 44 డిగ్రీల మార్కును దాటాయి. ఈ ఉష్ణోగ్రతలకు వృద్ధులు, చిన్నారులు, బాలింతల కష్టాలు వర్ణనాతీతం. ఒకవైపు అదిరిపోయే ఉష్ణోగ్రతలు, ఊపిరాడని ఉక్కపోత, వడగాడ్పులు .. మరోవైపు గాలి వానతో అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. జిల్లాలో సాధారణంగా 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇంట్లో ఉక్క పోత .. బయట సూర్యప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే 40 డిగ్రీలు దాటడంతో ప్రధాన రహదారులు, పట్టణాల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం 5 గంటల దాటిన సమయంలో కాసేపు ఆకాశంలో మబ్బులు కమ్ముకొని చినుకులు పడుతున్నాయి. ఆ సమయంలో మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతోపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈసారి ఎండలు ఎక్కువే.... మునుపెన్నడూ లేని విధంగా సూర్యుడు సెగలు కక్కుతుండగా .. జనం విలవిల్లాడుతున్నారు. ఏప్రిల్ చివరి వారం నుంచి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. గత ఏడాది మే మొదటి వారంలో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలుగా నమోదైంది. ఈసారి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసినప్పటికీ గతంతో పోలిస్తే మరో డిగ్రీ పెరిగింది. దీంతో ఎవరి నోట విన్నా అమ్మ బాబోయ్..! ఎండలు మండిపోతున్నాయి అంటున్నారు. అకాల వర్షాలు... ఈ సారి వేసవిలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఎండలు తీవ్రత ఒకవైపు ఉంటే .. మరోవైపు జిల్లాలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల చెట్లు కూలి పిడుగులు కూడా పడ్డాయి. ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, తదితర నియోజకవర్గాల్లో ఈదురు గాలులతో కూడిన స్వల్ప వర్షం కురిసింది. దీంతో కొన్నిచోట్ల ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరో వైపు మొక్కజొన్న, రబీ వరి, కంది, మిర్చి పంటలను సాగుచేస్తున్న రైతులకు అకాల వర్షాలతో నష్టాలు తప్పడం లేదు. పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. -
నేడు స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని
84 వేల డ్వాక్రా మహిళలకు విత్తనాల పంపిణీ ప్రారంభంనరసరావుపేట: జిల్లా వ్యాప్తంగా గురువారం స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో నకరికల్లు మండలానికి చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ వారం మహిళల ద్వారా కిచెన్ గార్డెన్ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. మండలానికి 3 వేల మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా 84 వేల మంది డ్వాక్రా మహిళలకు విత్తనాల పంపిణీ చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామంలో ఔత్సాహికులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, డీఆర్డీఏ సిబ్బందితో విత్తనాల పంపిణీ చేపడతామన్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంపై అవగాహన పెంచేందుకు టమోటా, పాలకూర, చుక్కకూర, తోటకూర, బెండ, గోరు చిక్కుడు విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. -
అకాల వర్షం.. కర్షకులకు కష్టం
నరసరావుపేట రూరల్: అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బుధవారం ఉదయం మండలంలో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘావృతమై 7.30 గంటల సమయంలో జల్లులు ప్రారంభమయ్యాయి. మిరప, మొక్కజొన్న రైతులకు వర్షం తీవ్రంగా నష్టం కలిగించింది. మూడవ విడత మిరప కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కల్లాల్లో పంట తడవకుండా రైతులు టార్పలిన్ పట్టలతో కప్పి ఉంచారు. దాదాపు గంటన్నరపాటు కురిసిన వర్షం కారణంగా పట్టలపైనా నీరు నిలిచింది. భారీ వర్షం కావడంతో కల్లాల్లోని మిరప పంటకు నిమ్ము చేరింది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షంతో ఎకరానికి రూ.లక్ష మేర నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. వర్షం వలన తాలుగా మారుతుందని తెలిపారు. ఇప్పటికే మద్దతు ధర లభించక ఆందోళన చెందుతున్న రైతులకు కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్నలు పలుచోట్ల వర్షానికి తడిసింది. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలవాలింది. -
నేటి నుంచి మహంకాళి ఆలయ వార్షికోత్సవాలు
దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి 49 వారికోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో కె.సునీల్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఐదు రోజులపాటు వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు అమ్మవారికి విశేష అలంకారాలు, విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 11వ తేదీన చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరులలో గ్రామోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు. మంగళగిరి టౌన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, మంగళగిరి రూరల్ సీఐ అవ్వారు వెంకట బ్రహ్మం, అధికారులు పాల్గొన్నారు. లక్ష్మీపురం: ముస్లిం విద్యార్థులను ప్రోత్సహించేందుకు వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్ ఖాజా మస్తాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ ప్రతిభ చూపిన విద్యార్థులను గుర్తించి వారికి ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్(ఐఐటీ–జేఈఈ మెయిన్స్, ఎన్ఈఈటీ, ఎంసెట్) అందించనున్నట్లు వివరించారు. 250 మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వివరాల కోసం 6303325356, 8978452495 సంప్రదించాలని కోరారు. తెనాలి: తెలంగాణ సారస్వత పరిషత్ ముద్రించిన బాల సాహితీ కథా సంకలనంలో పట్టణానికి చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీంజాని రచన ‘ప్రగతి పథం’ కథ ప్రచురితమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి 180 కథలు రాగా వాటిలో ఎంపిక చేసిన 70 కథలతో ‘బాలసారస్వతం’ పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. వాతావరణ, జల కాలుష్యాన్ని ఎలా నివారించుకోవాలి, భూగర్భ జలాల్ని ఎలా పెంచుకోవాలి, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి యువత ఎలా దోహదపడాలనే అంశాలపై ఈ కథనం రాశారు. హకీంజాని ఇప్పటి వరకు పిల్ల్లల కోసం 36 పుస్తకాలు, 290 కథలు రచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం హకీంజాని కథలను 2019లో 11వ తరగతికి, 2020లో 12వ తరగతికి పాఠ్యాంశాలుగా ప్రచురించింది. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఆంధ్ర చెస్ అసోసియేషన్, గుంటూరు చెస్ అసోసియేషన్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు 8వ తేదీ నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు సిహెచ్.రవీంద్ర రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని ఐడీపీఎస్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం రూ.50,000 నగదు బహుమతులు, మొమెంటోలు, సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. అండర్–7, అండర్–9, అండర్–11, అండర్–13, అండర్–15 విభాగాల్లోని వారికి ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. వివరాలకు 99481 98809 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
ఉత్తమ విద్యార్థులకు గగనయానం
అచ్చంపేట: మార్చిలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు విద్యార్థులను బ్లూబెల్స్ పాఠశాల యాజమాన్యం బుధవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం మేరీ శ్రీలత మాట్లాతూ 595మార్కులు సాధించిన పెద్దింటి సైదేశ్వరరావు, 593 మార్కులు సాధించిన మద్దుల శ్రీలక్ష్మిలను ప్రోత్సహించేందుకు, మిగిలిన విద్యార్థులకు ప్రేరణ కల్పించడంలో భాగంలోనే విమాన ట్రిప్పు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి యేటా తమ పాఠశాల విద్యార్థులు నూరుశాతం విత్తీర్ణత సాధిస్తున్నారన్నారు. కారెంపూడి: బైక్ వరిగడ్డి ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వేపకంపల్లి గ్రామ రోడ్డు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. కారెంపూడికి చెందిన నెమలికంటి రామాంజనేయులు తెలంగాణ రాష్ట్రం వాడపల్లి నుంచి బైక్‌పై స్వగ్రామం కారెంపూడి వస్తున్నారు. దాచేపల్లి రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి సమీప ప్రాంతంలో ఆగి ఉన్న వరిగడ్డి ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్నారు. దీంతో బైక్‌పై ఉన్న రామాంజనేయులు (42) తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామాంజనేయులుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనతో కారెంపూడి గ్రామంలో విషాదం అలుముకుంది. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మృతుని కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి జాతీయ స్థాయి పేటెంట్ లభించినట్లు ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిశోర్ బుధవారం తెలిపారు. వీసీ మాట్లాడుతూ విజ్ఞాన్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థి అంపసాని చెన్నయ్య, డాక్టర్ కె. చంద్రశేఖర్ సంయుక్తంగా ప్రతిపాదించిన పరిశోధనకు ఈ పేటెంట్ మంజూరైనట్లు వెల్లడించారు. ‘పోర్టబుల్ సాయిల్ ఫెస్టిసైడ్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ కిట్’ అనే అంశంపై చేసిన పరిశోధనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా అథారిటీ సంస్థ పేటెంట్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పేటెంట్‌కు 20 సంవత్సరాలపాటు హక్కులు ఉంటాయని వివరించారు. ఈ కిట్ వ్యవసాయ భూముల్లో పురుగు మందుల అవశేషాలను తక్షణమే గుర్తించి విశ్లేషించడానికి ఉపయోగపడుతుందని, రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉందని వివరించారు. బయోటెక్ విభాగానికి చెందిన డాక్టర్ కే చంద్రశేఖర్(హెచ్–ఇండెక్స్–43), ఫార్మసీ విభాగానికి చెందిన డాక్టర్ మిథున్ రుద్రపాల్(హెచ్–ఇండెక్స్–36) స్కోపస్‌లో అత్యుత్తమ హెచ్–ఇండెక్స్‌ను సాధించినట్లు చెప్పారు. -
కలెక్టరేట్ ఉద్యోగిపై పోలీసుల దాడి హేయం
గుంటూరు వెస్ట్: కలెక్టరేట్ కార్యాలయ ఆఫీస్ సబార్డినేట్ పై నగరపాలెం పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీఆర్ఎస్ఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సదరు పోలీసులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ, డీఆర్వోలకు వినతిపత్రం అందజేసారు. కిరణ్ కుమార్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి కలెక్టరేట్ సమీపంలో (ఆఫీస్ సబార్డినేట్) వాచ్మెనన్గా పని చేస్తున్న జి.సురేష్ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సురేష్ తాను కలెక్టరేట్ వాచ్‌మన్ అని, విధులకు ఆలస్యమవుతుందని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదని, ఈ క్రమంలో బైక్ ముందుకు నడుపుతుండగా ఏఎస్ఐ కాలికి టైరు ఆనుకుందని వివరించారు. వెంటనే అక్కడ సివిల్ డ్రెస్సులో ఉన్న కానిస్టేబుల్ లాఠీతో సురేష్ చెవిపై బలంగా కొట్టడంతో తీవ్రగాయమైందని, సురేష్ చేతిలో ఉన్న ఫోన్, బైక్ లాగేసుకుని పంపించేసారన్నారు. వెంటనే కలెక్టరేట్ ఏఓకి సమాచారం అందడంతో సిబ్బందిని అప్రమత్తం చేసి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు. సహచర ఉద్యోగుల పట్ల ఇటువంటి చర్యలు ఎంతమాత్రం తగవని, ఇవి ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనకు కారణమవుతాయని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని కలెక్టరేట్ ఉద్యోగస్తులు విస్తుపోతున్నారన్నారు. కొందరు పోలీస్ అధికారుల దుందుడుకు చర్యలు మొత్తం డిపార్ట్‌మెంట్‌కే చెడ్డపేరు తెస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులపై దాడులను ఏపీఆర్ఎస్ఏ సహించబోదని స్పష్టం చేశారు. గాయపడిన సురేష్‌కు పూర్తి వైద్యం అందించాలని, దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌పై, అనుచితంగా ప్రవర్తించిన ఏఎస్ఐల పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ స్పందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి వెంకట్రావు, రాష్ట కార్యదర్శి దివ్య దుర్గాదేవి, సిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రటరీ బాలాజీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలని జేసీకి ఉద్యోగ సంఘాల ఫిర్యాదు -
టెక్స్టైల్ రంగాన్ని ఆదుకోవాలి
కొరిటెపాడు: టెక్స్టైల్ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకురావడం అభినందనీయమని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు అన్నారు. గుంటూరు కాటన్ అసోసియేషన్ కార్యాలయంలో టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ నిపుణుల(ఢిల్లీ) బృందం బుధవారం భేటీ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పిన్నింగ్, జిన్నింగ్, వివింగ్ పరిశ్రమలకు అండగా నిలబడాలని అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు కోరారు. ఎగుమతులను 37 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంపొందించేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాల అవసరమని తెలిపారు. 2030 నాటికి ఈ లక్ష్యాలను సులువుగా చేరుతాయని పేర్కొన్నారు. జిన్నింగ్ పరిశ్రమ ఏపీలో ఉండగా, పంట తెలంగాణలో ఉంటుందని, తద్వారా వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు వేర్వేరుగా సెస్సు చెల్లిస్తున్నామని తెలిపారు. దీంతో క్యాండీకి రూ.600కుపైగా వ్యాపారస్తులు నష్టపోతున్నారని అన్నారు. ఏపీలో చెల్లించే చెస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పెరిగిన ముడి సరుకు ధర, విద్యుత్ ఛార్జీలతో వివింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. వాటిపై రాయితీచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వివింగ్ పరిశ్రమకు ఎంఎస్ఎంఈ కేంద్ర మంత్రిత్వ మంత్రిత్వ శాఖ 2013–14 ఇచ్చిన 20 శాతం రాయితీలను పునరుద్ధరించాలని కోరారు. టెక్స్టైల్ రంగానికి గ్రీన్ ఎనర్జీ పవర్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లకు స్థలాన్ని కేటాయించి, పరిశ్రమ ఏర్పాటుకు యాభై శాతం రాయితీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. టెక్స్‌టైల్స్‌ను విద్యుత్ ఆధారిత పరిశ్రమగా గుర్తించాలని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రోత్సహకాలు ప్రకటిస్తే ఎగుమతులతోపాటు యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ భేటీలో ఢిల్లీ ప్రతినిధి ధ్రువ మంగళ, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ జేడీ రాజారావు, అసోసియేషన్ సభ్యులు ఉప్పుటూరి సాంబశివ రావు, మాఘం సురేంద్రబాబు పాల్గొన్నారు. ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు -
హోరాహోరీగా ఎడ్లబండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి జరిగిన ఒంగోలు జాతి సీనియర్ విభాగం ఎడ్ల బండ లాగుడు పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన న్యూ కేటగిరీ విభాగం ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో 20 నిమిషాల వ్యవధిలో 1.450 టన్నుల బరువును పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన మంగు రమాదేవి ఎడ్ల జత 4,050 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాలవారిపాలెంనకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత, పోతిన లక్షిత్కి చెందిన ఎడ్ల జత 4,006 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలకు చెందిన పిన్నెబోయిన సతీష్ కుమార్ యాదవ్, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన సుఖవాసి సతీష్‌బాబు ఎడ్ల జత 3,947 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురానికి చెందిన కొప్పుల హేమలతారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 3,750 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.50 వేలు, రూ.45 వేలు, రూ.40 వేలు, రూ.35 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. -
పవర్ లిఫ్టింగ్ జాతీయస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
మంగళగిరి టౌన్: చైనాలో జరిగే పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలకు భారత్ తరఫున గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపికై నట్లు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విజయ భాస్కరరావు తెలిపారు. స్ధానిక జిమ్‌లో బుధవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చైనాలో జరిగే సబ్ జూనియర్ అండ్ జూనియర్(మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ముగ్గురు మహిళా పవర్ లిఫ్టర్లు ఎంపికయ్యారని, క్రీడాకారులు బుధవారం భారతదేశం నుంచి పోటీలకు బయలుదేరి వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న మహిళా పవర్ లిఫ్టర్లు ఎం. షానూన్ 47 కేజీల విభాగం, జూనియర్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్, ఇ.ఎల్. వినయశ్రీ 84 కేజీల విభాగం, సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్, నాగం జ్ఞాన దివ్య +84 కేజీల విభాగం,జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ విభాగాల్లో తలపడనున్నారని వివరించారు. -
ఆమె ఎలా చనిపోయింది..?
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా క్రోసూరు పోలీసుస్టేషన్‌కు విచారణ నిమిత్తం వచ్చిన ఒక మహిళ తీవ్ర గాయాలపాలై మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందడం తీవ్ర చర్చకు దారితీసింది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం... విడాకుల విషయంలో బాపట్ల కోర్టుకు తిరుగుతున్న క్రమంలో చీరాలకు చెందిన పల్లపు రేణుక (39)కు వెంకటేశ్వరరెడ్డి అనే కోర్టు కానిస్టేబుల్ పరిచయమయ్యాడు. మొదటి భర్త విడాకుల అనంతరం వెంకటేశ్వరరెడ్డితో రేణుక కొంతకాలం సహజీవనం చేసింది. అప్పటికే రేణుకకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణుకకు పిల్లలు పుట్టరనే నెపంతో కానిస్టేబుల్ వెంకటేశ్వరెడ్డి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు, కేసుల దాకా వెళ్లింది. పొన్నూరులో పనిచేస్తున్న సమయంలో ఇదే వివాదంపై సస్పెండ్ అయిన వెంకటేశ్వరరెడ్డి ప్రస్తుతం గురజాలలో విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం నమోదైన కేసులో శాఖాపరమైన విచారణ నిమిత్తం మంగళవారం సాయంత్రం క్రోసూరు సీఐ సురేష్ ముందు ఇద్దరు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో అల్పాహారం తిన్న తరువాత రేణుకకు ఫిట్స్ రావడంతో మొదటి అంతస్తు నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందింది. ఎయిమ్స్ వద్ద బంధువుల ఆందోళన రేణుక మృతిపై ఆమె బంధువులు మంగళగిరి ఎయిమ్స్ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. రేణుకను పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి కొట్టడంతోనే మరణించిందని ఆరోపించారు. రేణుక కింద పడిన వెంటనే ఎందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, మంగళగిరికి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. కానిస్టేబుల్‌పై హత్య కేసు నమోదు చేసి శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేశారు. సీఐల చర్చలతో మారిన సీన్ ఈ క్రమంలో బంధువులు, కులసంఘం నేతలతో పెదకూరపాడు, అచ్చంపేట సీఐలు చర్చించారు. మంగళగిరి ఎయిమ్స్ వేదికగా హైడ్రామా నడిచిన అనంతరం సాయంత్రానికి పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతున్న ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ‘రేణుకకు ఫిట్స్ ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఏం తినకపోవడం వల్ల కళ్లు తిరిగి కిందపడిపోయింది. మా బిడ్డ మృతిపై అనవసర రాద్దాంతం చేయొద్దు’ అని మృతురాలి తండ్రి చంద్రబాబు వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకూరపాడు పోలీసులు మీడియాకు సమాచారమిచ్చారు. -
చట్టం అమలే ఎగతాళి!
జిల్లాలో గుట్టుగా బాల్య వివాహాలు సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా బాల్యవివాహాలు గుట్టుగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని అధికారుల దృష్టికి వస్తుండగా, చాలా వరకు రావడం లేదు. కొన్నిచోట్ల బాల్యవివాహాలు అధికారులు నిలుపుదల చేసినట్టు లిఖితపూర్వకంగా హామీ తీసుకుంటున్నప్పటికీ రహస్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి వివాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాల్య వివాహాలు నిలుపుదల చేస్తున్నామని ఇరువురి తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాత అధికారులు అక్కడితో ఆ అంశాన్ని వదిలేస్తున్నారు. ఆ తర్వాత ఆ వివాహానికి సంబంధించి ఎటువంటి ఆరా తీయడం లేదు. లిఖితపూర్వకంగా బాల్యవివాహం చేయబోమని రాసి ఇచ్చినప్పటికీ ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులు వారికి నిజంగానే బాల్యవివాహాన్ని నిలుపుదల చేశారా, లేదంటే అధికారులు వెళ్లిపోవడానికి ఆ విధంగా హామీ ఇస్తున్నారా .. అనేది అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ దాన్ని నిలుపుదల చేయడానికి వెళ్లిన అధికారులపై వదిలేయండని ఒత్తిడి తెస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితమివ్వని సదస్సులు... బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహ్ ముక్త్ భారత్, బేటీ బచావో.. బేటీ పడావో, కిశోరి వికాసం, ప్రత్యేక వాహన ప్రచారం సహా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటి నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా రూ. లక్షలు వెచ్చిస్తున్నారు. మండల సమాఖ్య, ఆరోగ్య సిబ్బంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, విద్యాసంస్థలు, ప్రజాప్రతినిధులు, పురోహితులు, పాస్టర్లు, ఇమామ్‌ల వంటి దైవ సేవకులు, షామియానాలు వేసేవారు, ఫొటోగ్రాఫర్లు, భజంత్రీలు వాయించే వారితోపాటు ప్రతి విభాగం వారికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కానీ ప్రణాళిక ప్రకారం జరగకపోవడం... ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపడం, ప్రచార ఆర్భాటానికే పరిమితం కావడం వంటి కారణాలతో ఈ కార్యక్రమాలు ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. ఆయా శాఖల సిబ్బంది నుంచే ఈ మాట వినిపిస్తోంది. కమిటీలు ఉన్నా ఫలితం సున్నా బాల్యవివాహాల నియంత్రణలో మహిళా, శిశు సంక్షేమ శాఖకు మించిన బాధ్యత చైల్డ్ మ్యారేజ్ ప్రాహిబిషన్ ఆఫీసర్లపై (సీఎంపీఓ) ఉంది. బాల్య వివాహ నిరోధక చట్టం (పీసీఎంఏ)–2006 ప్రకారం, 31,39 జీఓలను అనుసరించి వివిధ స్థాయిల్లో కమిటీలను నియమించారు. జిల్లా ఉన్నతాధికారి సహా డీఆర్ఓ ఆధ్వర్యాన జిల్లా స్థాయి .. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల డివిజన్లలో ఆర్డీఓల ఆధ్వర్యాన డివిజన్ స్థాయి ... రెండు లేదా మూడు మండలాలకు ఒక బ్లాక్ చొప్పున సీడీపీఓల ఆధ్వర్యాన బ్లాక్ స్థాయి .. ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓ, ఎస్ఐ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, జీఎంఎస్కేలు, సీఎంపీఓల ఆధ్వర్యాన మండల స్థాయిల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా జీఎంఎస్కే నోడల్ అధికారిగా, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, మహిళా కార్యదర్శి, స్కూల్ హెచ్ఎం, అంగన్వాడీ వర్కర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఇలా 10 మందితో కలిపి ప్రతి గ్రామంలోనూ ఒక చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ కమిటీ కూడా వేశారు. బాల్యవివాహాల నియంత్రణ, నిరోధం కోసం వీటిని ఏర్పాటు చేశారు. పీసీఎంఏ చట్టాన్ని క్షేత్రస్థాయికి చేర్చి, బాల్యవివాహల నియంత్రణలో సీఎంపీఓలు కీలకపాత్ర పోషించాలి. పూర్తిగా నిరోధించాలి. ఈ కమిటీలన్నీ ఏం చేస్తున్నాయనేది ఎవ్వరికీ అంతుబట్టని పరిస్థితి. ఇవే కనుక సక్రమంగా పనిచేస్తే చిన్నారులకు ఈ దుస్థితి ఎందుకు వస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. పుస్తకాలు చేతపట్టాల్సిన అభం శుభం తెలియని పసి మొగ్గలు మెడలో పసుపు తాడుతో మరొకరి వెంట నడుస్తున్నారు. చిన్న ప్రాయంలోనే పురిటి నొప్పులు పడుతున్నారు. సామాజిక దురాగతాలు, పేదరికం, తల్లిదండ్రుల అవగాహన లోపం, అఘాయిత్యాల పేరిట వారి బాల్యం నాశనం అవుతోంది. బంగారు భవిష్యత్తు మసకబారుతోంది. రక్షించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. చట్టం ఉన్నా అమలు తీరును ఎగ‘తాళి’ చేసింది. వందల మంది బాలికల జీవితాలు బుగ్గిపాలవడం ఆవేదన కలిగిస్తోంది. -
9,10 తేదీల్లో జాతీయస్థాయి డప్పుల పోటీలు
వినుకొండ: దరువు సాంస్కృతిక ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9,10 తేదీల్లో పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీ గ్రౌండ్స్‌లో జాతీయస్థాయి డప్పు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ పోటీల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత, కర్ణాటక వాసి నండోజ పిండి పాపన్ హళ్లి ముని వెంకటప్ప మాదిగకు సన్మానం జరుగుతుందన్నారు. పోటీలకు ఆరు రాష్ట్రాల నుంచి ఎంపికై న నిష్ణాతులైన 12 టీమ్‌లు పాల్గొంటాయని, విజేతలైన టీమ్‌లకు మొదటి బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.50వేలు, మూడో బహుమతి రూ.30వేలు నగదు, పాల్గొన్న టీమ్‌లకు రూ.10వేలు నగదు, ప్రశంసాపత్రం, సన్మానం ఉంటుందన్నారు. కార్యక్రమాన్ని దరువు వ్యవస్థాపకులు ఎర్రగుంట్ల భాస్కర్‌రావ్, కన్వీనర్ ప్రసాద్, కో–కన్వీనర్ స్కైలాబ్ కిరణ్, కో–ఆర్డినేటర్ బేతం గాబ్రియేల్, మోజేస్, సలహాదారులు చాట్ల రామయ్య, ఆర్గనైజర్స్ బంక ఎలియాజర్, కూచిపూడి వినోద్‌కుమార్ తదితరులు పర్యవేక్షిస్తారని తెలిపారు. రెంటచింతల: మండలంలోని గోలి గ్రామానికి చెందిన వడితే చంద్రూ నాయక్(38) మిట్టగుడిపాడు–గోలి గ్రామాల మార్గ మధ్యలోని ఓ కల్వర్టు వద్ద మృతి చెందినట్లు మంగళవారం ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఏప్రిల్ 30న గురువారం అదే గ్రామానికి చెందిన గురవయ్యకు ఆ ప్రాంతంలోని పొలం గట్టున చంద్రూ నాయక్ కన్పించాడు. అప్పటి నుంచి మంగళవారం వరకు చంద్రూ నాయక్ జాడలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండ తీవ్రతకు మంచినీరు లేక దప్పికతో మృతి చెందినట్లు పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్ఐ సీహెచ్ నాగార్జున కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగరంపాలెం: భద్రత దృష్ట్యా హెల్మెట్ల వినియోగం చోదకులకు చాలా అవసరమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఆప్కా సాబ్‌కి అవాజ్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో హోంగార్డులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రజా భద్రత కోసం నిరంతరం విధులు నిర్వర్తించే హోంగార్డులకు హెల్మెట్లను విరాళంగా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. సమాజ సేవ చేయడం సంస్థ ప్రధాన ఉద్దేశమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్‌లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్ఐ సురేష్, సంస్థ సభ్యులు శివ కుమార్, డాక్టర్ రాధమాధవి, కిరణ్ పాల్గొన్నారు. -
డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా బిల్లు అమలు చేయాలి
నరసరావుపేట: డీలిమిటేషన్ ప్రక్రియతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రి డిమాండ్ చేశారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఐద్వా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి రజిని అధ్యక్షతన నిర్వహించిన డీలిమిటేషన్–మహిళా రిజర్వేషన్ బిల్లుపై అవగాహన సదస్సులో సావిత్రి మాట్లాడారు. డిలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బిల్లును అమలు చేయడంలో ఆలస్యం చేస్తుందన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లును అమలు చేయడం కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని స్పష్టం చేశారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం అమలు విషయంలో ఆలస్యం జరుగుతుందని డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ అమలుకు మద్దతుగా ఈ నెల 7న విజయవాడలో 2కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పే కూటమి ప్రభుత్వ పెద్దలు, అదేస్థాయిలో నాణ్యమైన విద్య, వైద్యం, ఆహారం జీవన ప్రమాణాల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ నాయకుల మద్దతు లేకుండా గంజాయి సాగు జరగడం అది బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండటం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై. రాధాకృష్ణ, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, సీఐటీయు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు జి.మల్లేశ్వరి, మహిళా సంఘం సీనియర్ నాయకురాలు జి.ఉమశ్రీ, జిల్లా అధ్యక్షురాలు జె.అనూషలు పలు అంశాలపై మాట్లాడారు. వివిధ మహిళా సంఘాలు ప్రజా సంఘాలు అధిక సంఖ్యలోమహిళలు పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రి -
షేక్ షబీనాకు స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్
తెనాలి: తెనాలి పట్టణానికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌లో మరోసారి సత్తా చాటింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఈనెల ఒకటి నుంచి 3వ తేదీ వరకు జరిగిన 13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్–జూనియర్, జూనియర్, మాస్టర్స్ (పురుషులు, మహిళలు) ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో షబీనా జూనియర్ విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. జూనియర్స్‌లో 84 కిలోల విభాగంలో పోటీపడిన షేక్ షబీనా స్క్వాట్‌లో 200 కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 110 కిలోలు, డెడ్ లిఫ్ట్‌లో 200 కిలోల బరువును ఎత్తి ఓవరాల్‌గా 510 కిలోలు బరువులతో బంగారు పతకం కై వసం చేసుకోవటం విశేషం. అదనంగా ‘ఆంధ్రప్రదేశ్ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్’ను కూడా సాధించారని గుంటూరుకు చెందిన పవర్ లిఫ్టింగ్ కోచ్ ఎం.అశోక్‌కుమార్ తెలియజేశారు. పట్టణానికి చెందిన క్రీడాకారులు పలువురకు షబీనాను అభినందించారు. గుంటూరు మెడికల్: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వై.రమణ ఆధ్వర్యంలో జనాభా పరిశోధన సంస్థ బృందం మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ నెల 5,6,7,8 తేదీలలో సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, ఆర్బీఎస్కే కార్యక్రమంలో భాగంగా జరిగే స్క్రీనింగ్‌పై సమీక్షించారు. పుట్టుకతో వచ్చే రుగ్మతలు, వ్యాధులు, లోపాలు, ఎదుగుదలలో జాప్యం ఉన్న పిల్లలను పరీక్షించి, తక్షణ చికిత్సకై జిల్లా సత్వర చికిత్స కేంద్రాలకు రిఫర్ చేయడం, ఫాలో అప్ చేయడం, క్షేత్ర స్థాయిలో ఎదుర్కొనే సమస్యల గురించి సమీక్షించారు. జిల్లా ప్రగతికి తగిన మార్గదర్శకాలు సూచించారు. గుంటూరు, తెనాలిలో సత్వర చికిత్స కేంద్రాలను, గుంటూరు జీజీహెచ్‌ని, ఎన్ఆర్సీ (పౌష్టికాహార పునరావాస కేంద్రం)ని సందర్శించారు. పిల్లలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర సుజాత, ఆర్బీఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీధర్, మేనేజర్ శిరీష పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఈ నెల 24న గుంటూరు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికలు గుంటూరులోని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నామినేషను స్వీకరిస్తారని, 10 – 11 గంటలకు పరిశీలన, 11 – 12 గంటలకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామన్నారు. మధ్యాహ్నం 12 – ఒంటి గంట వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికైన సభ్యుల వివరాలను ఎన్నికల అధికారి మధ్యాహ్నం 2 గంటలకు తెలియజేస్తారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తగిన ఆధారాలతో ఫుట్‌బాల్ క్లబ్ రిజిస్ట్రేషన్ పత్రాలు, రెన్యువల్ పత్రాలు తీసుకురావాలని కోరారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు విజయవాడ విద్యాధరపురానికి చెందిన అన్ని త్రివిక్రమ్‌బాబు కుటుంబం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని వారు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచన అనంతరంఆలయ అధికారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు శంకరబాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
పల్నాడు
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 525.20 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,500, మోడల్ ధర రూ.3,500 వరకు పలికింది. 7 -
బడిబాటలో కలెక్టర్ సందడి
చిలకలూరిపేటటౌన్: మండలం పరిధిలోని గోపాలంవారిపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ కృతికాశుక్ల మంగళవారం పర్యటించారు. ముందుగా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్షరాలా ఒక ఉపాధ్యాయురాలిగా మారిపోయారు. పాఠశాల ప్రాంగణంలో చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి చదువుల పురోగతిని అడిగి తెలుసుకున్న కలెక్టర్.. ప్రభుత్వ బడుల్లో అందుతున్న కార్పొరేట్ స్థాయి వసతులను వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. అక్షర వెలుగులతో గ్రామం మెరవాలని ఆకాంక్షించారు. అనంతరం సమీపంలోని టెక్స్టైల్ పార్కును సందర్శించారు. అక్కడ పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి, జిల్లా ప్రగతిలో వస్త్ర పరిశ్రమ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్, టెక్ట్స్‌టైల్స్ ప్రతినిధులు సామినేని కోటేశ్వరరావు, పలువురు పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. -
స్కూల్ బస్సులు నిబంధనలు పాటించాలి
నరసరావుపేట రూరల్: విద్యార్థుల భద్రత కోసం స్కూల్ బస్సులను నిబంధనలకు అనుగుణంగా సిద్ధం చేయాలని జిల్లా రవాణా శాఖ అధికారి జి.సంజీవకుమార్ తెలిపారు. జిల్లాలోని బడి బస్సులపై ప్రత్యేక తనిఖీల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. జిల్లాలోని నాలుగు కార్యాలయాల పరిధిలో 162 ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 770 బస్సులు ఉన్నట్టు వివరించారు. బస్సులను బృందాలు తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఎటువంటి మరమ్మతులు చేపట్టాల్సి ఉందో వివరిస్తారు. ప్రతి బస్సుకు ఏఐఎస్–140 ప్రకారం వీఎల్టీడీ, పానిక్ బటన్ అమర్చాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తనిఖీ బృందాలు 119 బస్సులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. 31 వరకు గడువు మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 31వ తేదీలోగా బస్సులను సిద్ధం చేయాలని పాఠశాల యాజమాన్యాలకు ఆర్టీవో సూచించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్, భద్రతా పరికరాల ఏర్పాటు, సరైన పత్రాలు, ఇతర నిబంధనలు తప్పనిసరని స్పష్టం చేశారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో తరచూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. స్కూల్ బస్సులకు సంబంధించిన అత్యవసర ద్వారం, స్పీడ్ గవర్నర్, ఫైర్ డిస్టెన్షన్ అలారం, హ్యాండ్ బ్రేక్, సిగ్నల్ లైట్స్, డిటెన్షన్ అగ్నిమాపక యంత్రాలు, అత్యవసరద్వారం పనితీరును పరిశీలిస్తారని వివరించారు. అత్యవసర ద్వారంకు ఎటువంటి ప్రతిబంధకం లేకుండా సీట్లను అమర్చాలని సూచించారు. కచ్చితంగా అమలు చేయాలి పాఠశాల బస్సులలో నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నిర్దేశిత గడువు తరువాత ఏవైనా ఉల్లంఘనలు గమనిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని అన్ని స్కూల్ యాజమన్యాలు రవాణా శాఖతో సహకరించాలని కోరారు.


