రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన పల్నాడు జిల్లా జట్లు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన పల్నాడు జిల్లా జట్లు

May 8 2026 11:14 AM | Updated on May 8 2026 11:14 AM

రొంపిచర్ల: కర్నూల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్‌ బేస్‌బాల్‌ పోటీలలో పల్నాడు జిల్లా బాల, బాలికల జట్లు సత్తా చాటాయని రొంపిచర్ల జెడ్పీ హైస్కూల్‌ వ్యాయామ ఉపాధ్యాయులు వై.సైదయ్య శనివారం తెలిపారు. బాలికల జట్టు మొదటి స్థానం, బాలుర జట్టు రెండవ స్థానం సాధించినట్లు తెలిపారు. మొదటి స్థానం సాధించిన పల్నాడు జిల్లా బాలికల జట్టులో రొంపిచర్ల పాఠశాలకు చెందిన క్రీడాకారులు పి.చంద్రిక, వి.శ్రీదేవి, బి.శ్రీలక్ష్మి, బి.కృప, సిహెచ్‌.అపర్ణ, ఓ.పావని, ఎస్‌.ప్రజ్ఞ, ఏ.నక్షత్ర, ఇ.పూజిత, టి. తెజస్విని, బి.మౌనిక, ఇ.నందిని, సీహెచ్‌.అలేఖ్యలు ఉండగా, బాలుర జట్టులో పి.అశోక్‌, పి.నరేంద్ర, బి. బాలకృష్ణ, జి.రిషి వర్థన్‌, పి.నరేంద్ర, ఎం.వెంకీ, పి.హుస్సేన్‌, ఎస్‌కే.అక్బర్‌లు ఉన్నారన్నారు. విజయం సాధించిన క్రీడాకారులను పల్నాడు జిల్లా బేస్‌బాల్‌ సెక్రటరీ వి.వేమారెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వై.సైదయ్య, గుంటూరు జిల్లా సాఫ్ట్‌ బాల్‌ అధినేత పి.నరసింహారెడ్డి, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement