1980లో అమరావతిలో బస్టాండ్ నిర్మాణం కోసం అమరేశ్వర దేవస్థాన సర్వీసు మాన్యంకు చెందిన నాలుగు సెంట్ల భూమిని ఆర్టీసీ సంస్థకు ఇచ్చారు. నెల కిందట దేవినేని సాంబశివరావు అతని అనుచరులు తన మామకు అందులో ఒక సెంటు స్థలం ఉందంటూ పొక్లెయిన్‌తో స్థలంలోని పంపుహౌస్‌ను ధ్వంసం చేశారు. ప్రశ్నించిన అధికారులపై దౌర్జన్యం చేశారు. డిపో మేనేజర్ నాగమణికి పార్టీ తరపున ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ స్థలాన్ని పరిరక్షించి ప్రహరీ నిర్మాణం చేసి పంపుహౌస్‌ను ధ్వంసం చేసినందుకు నష్టపరిహారం సంస్థకు చెల్లించేలా చూడాలి.
–బి.సూరిబాబు, సీపీఎం మండల కార్యదర్శి, అమరావతి


