ఆగి ఉన్న లారీని ఢీకొన్న దిచక్రవాహనం | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న దిచక్రవాహనం

May 16 2026 3:13 AM | Updated on May 16 2026 3:13 AM

ఆగి ఉన్న లారీని ఢీకొన్న దిచక్రవాహనం

ఒకరు మృతి–మరొకరికి గాయాలు

వినుకొండ: మండలంలోని చీకటీగలపాలెం సమీపంలో గురువారం రాత్రి జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వినుకొండ పట్టణానికి చెందిన కంభంపాటి కార్తీక్‌ తన స్నేహితుడు క్రాంతితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చీకటీగలపాలెం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కార్తీక్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న క్రాంతికి తీవ్రగాయాలు కావడంంతో స్థానికులు వెంటనే స్పందించచి చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement