విజయ్‌ సూటు.. వీధుల్లో ఆమ్‌బులెన్స్‌!! | Vijay suit Instamart mango ambulance marketing turns pure storytelling | Sakshi
Sakshi News home page

విజయ్‌ సూటు.. వీధుల్లో ఆమ్‌బులెన్స్‌!!

May 14 2026 11:56 AM | Updated on May 14 2026 12:06 PM

Vijay suit Instamart mango ambulance marketing turns pure storytelling

సోషల్‌ మీడియా ఎఫెక్ట్‌తో మార్కెటింగ్‌ రూపురేఖలు మారిపోయాయి. ఒక  ప్రొడక్టును జనాల్లోకి పంపించాలంటే.. దాని నాణ్యత, ధరలతో సంబంధం లేకుండా పోతోంది. వీలైనంత వైవిధ్యంగా జనాలకు దానిని ప్రదర్శించాల్సి వస్తోంది. చిన్నాచితకాలే కాదు బ్రాండెడ్‌ కంపెనీలు ఈ విషయంలో కూడా పోటీ పడుతున్నాయి.  ఈ పోటీలో అవసరమైతే ఎంతకైనా వెళ్తున్నాయి. 

ముంబైలో మామిడి పండ్ల కొరతను వైవిధ్యంగా క్యాష్‌ చేసుకోవాలని ఇన్‌స్టామార్ట్‌ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆమ్‌బులెన్స్‌ అనే కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చింది. ఆంబులెన్స్‌లాంటి వెహికిల్‌లో ఓ వ్యక్తి బెడ్‌ మీద పడుకుని ఉంటాడు. అతని చుట్టూరా మామిడి పండ్లు ఉంటాయి. అది ఆంబులెన్స్‌కాదు.. మామిడి ఫీవర్‌కు ఆమ్‌ (మామిడి) + అంబులెన్స్=ఆమ్‌బులెన్స్‌ అంటూ ఇన్‌స్టామార్ట్‌ ప్రచారం ఉవ్వెత్తున్న చేస్తోంది. 

ఇక.. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్‌ ప్రమాణం చేసింది తెలిసిందే. సీఎంగా ఆయన సూట్‌ అవతారం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే విజయ్‌ ట్రెండింగ్‌లో ఉండడంతో తమిళనాడులోని పలు వస్త్రదుకాణాలు ఆయన ఫొటోలను తెగ వాడేస్తున్నాయి. ది చెన్నై సిల్క్స్‌ ఓ అడుగు ముందుకేసి ఆ కాంబోపై ఆఫర్లు ప్రకటించింది.  ఫ్యాషన్‌ను ఫన్‌గా మార్చిన ఈ స్టంట్‌.. సీఎంను కాస్త “Chief Marketing Influencer” కాన్సెప్ట్‌తో వస్త్రాలను పరిచయం చేస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. 

వేసవిలో బ్రాండ్లు కేవలం ఉత్పత్తులు అమ్ముకోవడంతో పాటు వినియోగదారుల మనసును గెలుచుకోవడానికి కొత్త కొత్త స్టంట్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇన్‌స్టామార్ట్‌ ఆమ్‌బులెన్స్‌, తమిళనాడు సీఎం విజయ్‌ వస్త్రధారణ మార్కెట్‌లోనే కాదు ఇటు సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌ చేస్తున్నాయి. మార్కెటింగ్‌లో ఈ రెండు స్టోరీ టెల్లింగులను చూసిన వాళ్లంతా ‘వారెవ్వా.. ఏం వాడకమయ్యా’ అని ఫిదా అయిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement