పశ్చిమాసియాలో ఇరాన్‌తో అమెరికా యుద్ధం కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. యుద్ధం, దాడుల ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గమైన హార్మూజ్ జలసంధి మూతపడింది. దీంతో, ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. పరిస్థితి ఎంతకు దిగజారిదంటే.. ఇంధన సంక్షోభంతో క్యూబా ప్రభుత్వం అక్కడ బ్లాక్ అవుట్ విధించింది. రోజుకు 20 నుంచి 22 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. అయితే, క్యూబా పరిస్థితికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక కారణమే..
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా చాలా వరకు దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ హార్మూజ్ మూసివేతతో ప్రస్తుత పరిస్థితి నుంచి బయట పడేందుకు పలు దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని దేశాలు ఇంధన కోటాను విధిస్తున్నాయి. అలాగే, శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాల్లో వారానికి ఒక వాహనానికి కేవలం 5 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. ఇక, పలు దేశాల్లో లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించాయి.
అయితే తాజాగా ఇంధన సంక్షోభం కారణంగా క్యూబా పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనం కారణంగా ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు.. క్యూబాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోయాయి. దేశం మొత్తం అంధకారంలోకి మునిగిపోయింది. సంక్షోభం కారణంగా చేసేదేమీ లేక క్యూబా ప్రభుత్వం అక్కడ బ్లాక్ అవుట్ విధించింది. దీంతో, క్యూబా రాజధాని హవానాలో రోజుకు 20 నుంచి 22 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కోతల కారణంగా ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఇంధన ప్రభావం పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతింది.
Cuba has completely run out of diesel and fuel oil, the country's energy and mines minister said, as the capital Havana faces its worst rolling blackouts in decades amid a US blockade that has strangled the island of fuel. pic.twitter.com/jzzrwQyQRZ
— #𝕎𝕒𝕣 ℍ𝕠𝕣𝕚𝕫𝕠𝕟 (@WarHorizon) May 14, 2026
మరోవైపు.. ట్రంప్ బెదిరింపుల కారణంగా క్యూబాకు చమురు సరఫరా చేసే వెనిజులా, మెక్సికో దేశాల సరఫరాను నిలిపివేశాయి. క్యూబాకు ఇంధనం పంపే దేశాలపై భారీ సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించడమే ఇందుకు కారణం. మరోవైపు క్యూబాలో ప్రస్తుతం భారీ విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఇదే విషయంపై క్యూబా ఇంధన మంత్రి విసింటే డి లా ఓ లెవీ మాట్లాడుతూ.. దేశంలో గ్యాస్ నిల్వలు చాలా పరిమితంగా ఉన్నాయని, పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. ఏ దేశం ఇంధనం అమ్మేందుకు ముందుకు వచ్చినా కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
కారణాలు..
అమెరికా ఆంక్షలు: 2026 జనవరిలో ట్రంప్ ప్రభుత్వం క్యూబాకు ఇంధనం సరఫరా చేసే దేశాలపై టారిఫ్‌లు, ఆర్థిక శిక్షలు విధిస్తామని హెచ్చరించింది.
జలసంధి బ్లాకేడ్: అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ ఆయిల్ ధరలు పెరిగి, రవాణా ఖర్చులు కూడా పెరిగాయి.
సరఫరా తగ్గుదల: మెక్సికో, వెనిజులా వంటి ప్రధాన సరఫరాదారులు ఇంధనం పంపడం ఆపేశారు.
రష్యా సహాయం: డిసెంబర్ నుంచి ఇప్పటివరకు క్యూబాకు ఒకే ఒక్క పెద్ద రష్యన్ ఆయిల్ ట్యాంకర్ (Anatoly Kolodkin) మాత్రమే ఇంధనం అందించింది.
ప్రత్యామ్నాయాలు
దేశీయ ఉత్పత్తి: క్యూబా ప్రస్తుతం దేశీయ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది.
సౌర శక్తి: గత రెండు సంవత్సరాల్లో 1,300 మెగావాట్ల సౌర శక్తి ఏర్పాటు చేశారు. కానీ గ్రిడ్ అస్థిరత కారణంగా దీని సామర్థ్యం తగ్గింది.
అంతర్జాతీయ చర్చలు: క్యూబా ఇంధనం అమ్మడానికి సిద్ధంగా ఉన్న ఏ దేశం నుండైనా కొనుగోలు చేస్తామని ప్రకటించింది.
Cuba Runs Out of Diesel and Fuel Oil as Trump's Oil Blockade Causes Severe Humanitarian Crisis and Nationwide Blackouts pic.twitter.com/rUTz6rYJ5P
— The Matrix is Glitching (@TMisGlitching) May 14, 2026
ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా క్యూబా మాత్రమే కాదు, ప్రస్తుతం ఇంధన సంక్షోభం అనేక దేశాలను ప్రభావితం చేస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలో 40% తగ్గుదల వచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్, ఇటలీ, జర్మనీ, బంగ్లాదేశ్ వంటి దేశాలు హార్మూజ్ జలసంధి మూసివేత మరియు మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి.
పాకిస్తాన్
పెట్రోల్ ధరలు రూ. 414.78 లీటరుకు, డీజిల్ ధరలు రూ. 414.58 లీటరుకు చేరాయి. పాకిస్తాన్ దేశ చరిత్రలోనే ఇది అత్యధికం.
ప్రభుత్వం వారానికి ఒకసారి ధరలు సవరించాల్సి వస్తోంది.
మధ్యతరగతి, రైతులు, రవాణా రంగం తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ఇటలీ
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి.
ప్రభుత్వం ఎక్సైజ్ పన్నులు తగ్గించడం ద్వారా వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
జర్మనీ
విమానయాన రంగం ప్రపంచ యుద్ధం-II తర్వాత అత్యంత తీవ్రమైన జెట్ ఇంధన కొరతను ఎదుర్కొంటోంది.
ఇంధన ధరలు $85–90/bbl నుండి $150–200/bbl వరకు పెరిగాయి.
అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి.
విమాన సర్వీస్ రద్దులు, విమానయాన రంగం సంక్షోభం.
బంగ్లాదేశ్
ఇంధన కొరతతో విశ్వవిద్యాలయాలు మూసివేయబడ్డాయి.
ప్రభుత్వ ప్రయాణాలు పరిమితం చేయబడ్డాయి.
వాహనాలకు ఇంధన సరఫరా పరిమితులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రోత్సాహం.
ఈజిప్ట్..
ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రోజు రిమోట్ వర్క్ తప్పనిసరి.
వాణిజ్య, పబ్లిక్ లైటింగ్ పరిమితులు.
విద్యుత్, ఇంధన పొదుపు చర్యలు
ప్రభుత్వ ప్రయాణాలు, లైటింగ్ పరిమితులు.


