కాన్స్‌లో ప్రముఖ గాయని, నటి, మోడల్ ఆర్తి ఖేతర్పాల్ (Aarti Khetarpal) కాన్స్ రెడ్ కార్పెట్‌పైకి(Cannes 2026 Red Carpet) బృందావన్ భక్తి స్ఫూర్తిని తీసుకువచ్చారు.
డిజైనర్ సులక్షణ మోంగా రూపొందించిన ప్రత్యేక బృందావన్ లెహంగాను ధరించారు. పైగా ఆ డిజైనర్ వేర్‌కి జతగా శ్రీకృష్ణుడి చిత్రం ఉన్న జపమాల సంచిని, తులసి కంఠి మాలను జతచేశారు.
ఫ్యాషన్ వేడుక కాస్తా ఆధ్యాత్మిక శోభతో వెల్లివెరిసింది.
తన సంప్రదాయ ఫ్యాషన్ స్టైల్‌ని ఆధ్యాత్మిక గురువులు, భక్తి పుస్తకాలను ప్రచురించే సంస్థలకు, ఫ్యాషన్‌ని భక్తి విశ్వాసాన్ని మేళవింపు డిజైనర్లకు అంకితమిచ్చినట్లు పేర్కొంది ఆర్తి.


