2026 మిస్ యూనివర్స్ (Miss Universe 2026) కిరీటాన్ని ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో (Jennifer Barreto) సొంతం చేసుకున్నారు.
ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 130కిపైగా దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు.
చివరి రౌండ్లో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన మెలిస్సా నూనెజ్ తొలి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ గోయెట్జ్ రెండో రన్నరప్‌గా నిలిచారు.
గత ఏడాది విజేత మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ తాజాగా జెన్నిఫర్‌కు కిరీటాన్ని అలంకరించారు.
మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి వివాహిత మరియు తల్లిగా జెన్నిఫర్ బారెటో చరిత్ర సృష్టించారు.
సొంతగడ్డపై జరిగిన పోటీల్లో విజయం సాధించడం ద్వారా ప్యూర్టో రికోకు ఇది ఆరవ మిస్ యూనివర్స్ టైటిల్‌గా నిలిచింది.
(Images Source : Instagram/missuniverse)


