Turkey: కూలిన సైనిక హెలికాప్టర్.. వీడియో వైరల్‌! | Turkey military helicopter crashes during training flight VIDEO | Sakshi
Sakshi News home page

Turkey: కూలిన సైనిక హెలికాప్టర్.. వీడియో వైరల్‌!

Nov 25 2026 7:26 AM | Updated on Nov 25 2026 7:26 AM

Turkey military helicopter crashes during training flight VIDEO

అంకారా: టర్కీలో మరో సైనిక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. మంగళవారం శిక్షణ కోసం బయలుదేరిన టర్కీ వైమానిక దళానికి చెందిన ఏఎస్‌-532 హెలికాప్టర్ కూలిపోయింది. ఎస్కిసెహిర్ నుంచి టేకాఫ్ అయిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే జెండర్‌మెరీ, పోలీసులు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రక్షణ శాఖ వెల్లడించింది. హెలికాప్టర్‌లో ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి గాయాలయ్యాయి? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.
 

స్థానిక మీడియా హేబెర్లర్ కథనం ప్రకారం ఎస్కిసెహిర్‌లోని టెపెబాసి జిల్లాలో యోరుకాకాయిర్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాద స్థలంలో శకలాలను గుర్తించినట్లు సమాచారం. కాగా నవంబర్ నెలలో టర్కీలో సైనిక హెలికాప్టర్ కూలిపోవడం ఇది రెండోసారి. నవంబర్ 12న మలాత్యా ప్రావిన్స్‌లోని యెషిల్యుర్ట్ జిల్లాలో ఎస్‌-70 సైనిక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి కారణం కూడా అప్పట్లో వెల్లడికాలేదు. నాటి ప్రమాదంలో హెలికాప్టర్ శకలాలు ఓ నివాస భవనంపై పడటంతో ఇద్దరు పౌరులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఇదీ చదవండి: సౌదీలో హౌతీల బీభత్సం.. ఇద్దరు భారతీయులకు గాయాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement