హిజాబ్ లేకుండా పాట పాడటంతో పాటు దానిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిందనే కారణంగా లేడీ సింగర్ పరస్తూ అహ్మదీని రెండేళ్ల క్రితం డిసెంబరులో అరెస్ట్ చేశారు. ఇప్పుడు అదే విషయమై అత్యంత దారుణమైన శిక్ష విధించారు. హిజాబ్ లేకుండా పరస్తూ పాడిన పాటని ఇరాన్ అధికార వ్యవస్థ నేరంగా పరిగణించింది.
ఈ క్రమంలోనే పరస్తూ అహ్మదీని 74 కొరడా దెబ్బలు కొట్టాలని శిక్ష విధించింది. ఆమెతోపాటు మరో నలుగురు సంగీత బృంద సభ్యులకూ ఇదే శిక్ష విధించారు. రెండేళ్లపాటు సంగీత కార్యకలాపాలపై నిషేధం, ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ లేకుండా ఒంటరిగా పాడటాన్ని ఇరాన్ ప్రభుత్వం నిషేధించింది. హిజాబ్ ధరించకుండా కనిపించిన అమినీ అనే యువతి.. పోలీసు నిర్బంధంలో ఉండగా చనిపోవడం 2022లో ఇరాన్ వ్యాప్తంగా అల్లర్లకు దారి తీయడం తెలిసిందే.


