కువైట్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్‌ దాడి? | Iranian army claims drone attack on US airbase at Kuwait | Sakshi
Sakshi News home page

కువైట్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్‌ దాడి?

Nov 19 2026 6:06 AM | Updated on Nov 19 2026 6:06 AM

Iranian army claims drone attack on US airbase at Kuwait

దుబాయ్‌: కువైట్‌లో అమెరికాకు చెందిన అలీ అల్‌ సలేం వైమానిక స్థావరంపై డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్‌ సైన్యం బుధవారం ప్రకటించింది. దీంతో కువైట్‌లో కొన్ని వారాల తర్వాత తొలిసారిగా వైమానిక రక్షణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇరాన్‌ ప్రభుత్వ మీడియా ప్రసారం చేసిన ఒక ప్రకటన ప్రకారం.. అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలతో పాటు డ్రోన్, క్షిపణి ప్రయోగ వేదికలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్‌ సైన్యం పేర్కొంది. అయితే, యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ దీనిపై ఇంకా స్పందించలేదు. బుధవారం ఉదయం తమ వాయు రక్షణ వ్యవస్థలు డ్రోన్‌ దాడులను అడ్డుకుంటున్నాయని కువైట్‌ సైన్యం వెల్లడించింది. ఇరాన్‌ పదేపదే చేస్తున్న దాడులను కువైట్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. అవి కువైట్‌ భద్రత, స్థిరత్వానికి ముప్పుగా మారాయని ఆరోపించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement