అలాస్కాలోనూ డెమోక్రాట్ల విజయం  | Democrat Mary Peltola wins Alaska Senate seat, US midterm elections | Sakshi
Sakshi News home page

అలాస్కాలోనూ డెమోక్రాట్ల విజయం 

Nov 19 2026 6:02 AM | Updated on Nov 19 2026 6:02 AM

Democrat Mary Peltola wins Alaska Senate seat, US midterm elections

నికరంగా తొమ్మిది స్థానాలు కైవసం

సెనేట్‌లో 56 – 44కు సంఖ్యాబలం

వాషింగ్టన్‌: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు మరో విజయాన్ని నమోదు చేశారు. అలాస్కా స్థానం నుంచి డెమోక్రాట్ల తరఫున పోటీ చేసిన మేరీ పెల్టోలా రిపబ్లికన్ల అభ్యర్థి, సెనేటర్‌ డాన్‌ సల్లివాన్‌పై ఘన విజయం సాధించారు. దీంతో ఈ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాల్లో డెమోక్రాట్లు రిపబ్లికన్లపై విజయం సాధించినట్లు అయ్యింది. సెనేట్‌లో డెమోక్రాట్ల బలం కూడా 56కు చేరుకుంది. ప్రతిపక్ష రిపబ్లికన్ల బలం 44కు పరిమితమైంది. 

ఈ స్థాయి విజయం దక్కడం డెమోక్రాట్లకు 1958 తరువాత ఇదే మొదటిసారి. అప్పట్లో రిపబ్లికన్‌ అధ్యక్షుడు డ్వైట్‌ ఐసన్‌హోవర్‌ అధ్యక్షుడిగా ఉండగా.. మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు నికరంగా 13 స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించారు. అంతేకాకుండా.. ఆ ఏడాదే ఏర్పాటైన రెండు అలాస్కా స్థానాలను కూడా గెలుచుకున్నారు.  అలాస్కాలో డెమోక్రాట్ల విజయం తరువాత వచ్చే ఏడాది జనవరి నుంచి సెనేట్‌ బలాబలాలు 56–44గా మారనున్నాయి. 

ఈ స్థాయి ఆధిక్యం కూడా పదహారేళ్ల అనంతరం డెమోక్రాట్లకు దక్కడం విశేషం. 2011 జనవరి మూడవ తేదీతో ముగిసిన 111వ కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకు 58 స్థానాలు ఉండేవి. హౌస్‌ విషయానికి వస్తే ఇప్పటివరకూ అందిన ఫలితాల ప్రకారం డెమోక్రాట్లు నికంగా 42 స్థానాలను సంపాదించుకున్నారు. నలభై ఏళ్ల క్రితం రొనాల్డ్‌ రీగన్‌ కాలం నాటి రికార్డును అధిగమించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement