breaking news
Alaska
-
పుతిన్ పైచేయి!
ఉక్రెయిన్‌పై దురాక్రమణ దండయాత్ర మొదలెట్టాక రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అమెరికాసహా పలు దేశాల నుంచి అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్ వారెంట్లు, సైబర్ దాడులతో శత్రుదేశాలు చుట్టుముట్టినా ఏమాత్రం బెదరక పుతిన్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని ట్రంప్ సమక్షంలోనే ప్రదర్శించి రష్యాకు ఎదురులేదని నిరూపించారు. సంయుక్త ప్రకటన సమయంలోనూ ట్రంప్ కంటే ముందే మాట్లాడి తన వాదనను మొదటే గట్టిగా వినిపించారు. దాదాపు 13 నిమిషాలపాటు సంయుక్త ప్రకటన చేస్తే అందులో అగ్రభాగం 8 నిమిషాలు పుతినే మాట్లాడాడు. దాంతో ట్రంప్ చివర్లో మమ అనిపించి ప్రసంగాన్ని ముగించారు. ట్రంప్‌తో భేటీ పర్వంలో అడుగడుగునా పుతిన్ తన పైచేయిని ప్రదర్శించడం విశేషం.ఎర్రతివాచీ స్వాగతంలో తొలి గెలుపు ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చు కోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలను స్వీకరించిన ట్రంప్ నుంచే స్వయంగా రెడ్‌కార్పెట్ సాదర స్వాగతాన్ని పొంది పుతిన్ తన రష్యాకు అంతర్జాతీయంగా ప్రభ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఉక్రెయిన్ యుద్ధంలో లక్షలాది మంది అమాయక ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలను బలితీసుకున్నారన్న అపవాదు ఉన్న దేశాధ్యక్షునికి అలస్కా ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ స్వాగతంతో ట్రంప్ ముగిస్తే సరిపోయేది. కానీ అత్యంత ఆప్తుడైన మిత్రుడు తరలివస్తే ఎంతగా ప్రేమతో ఆహా్వనం పలుకుతామో అదేతరహాలో పుతిన్‌కు ట్రంప్ ఎర్రతివాచీ పరిచి మరీ సాదరంగా ఆహా్వనించారు. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా సమహోదా ఉన్న ట్రంప్ స్వయంగా వెళ్లి ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలకలేదు. కానీ యుద్ధనేరారోపణలు ఎదుర్కొ ంటున్నాసరే స్వయంగా ట్రంప్ వెళ్లి పుతిన్‌కు స్వాగతం పలకడం ద్వారా అగ్రరాజ్యాధినేతకు తాను ఏమాత్రం తీసిపోనని పుతిన్ బహిరంగంగా నిరూపించారు. ఉక్రెయిన్ మొదలయ్యాక దౌత్యపరంగా, ఆర్థికంగా, ఆంక్షల పరంగా రష్యా ఏకాకిగా తయారైందని పశి్చమదేశాల మీడియా చెబుతున్నదంతా ఒట్టిమాటలేనని, అమెరికా దృష్టిలో పుతిన్ ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన ప్రపంచనేత అని రుజువైంది. ట్రంప్‌తో సోదరభావంతో మెలగడం, కరచాలనం, ఒకే కారులో ప్రయాణించడం ద్వారా తానూ ట్రంప్ ఒకేస్థాయి అని పుతిన్ అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు.కాల్పుల విరమణ.. గప్‌చుప్ ఉక్రెయిన్‌తో దాడులు ఆపి కాల్పుల విరమణను అమల్లోకి తేవడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం. అలాంటి కీలక ‘కాల్పుల విరమణ’పదాన్ని మాటవరసకైనా ట్రంప్ ప్రస్తావించకుండా పుతిన్ విజయవంతంగా కట్టడిచేశారు. మేమే ‘ఆ మార్గం’లో ఇంకా పయనించలేదు. అక్కడి దాకా వెళ్లేందుకు ఇంకొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది అని మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారుగానీ ‘కాల్పుల విరమణ’అనే పదం పలకడానికి కూడా ఆయన సాహసించలేదు. తద్వారా పుతిన్ తన కనుసన్నల్లో, తాను అనుకున్నదే భేటీలో జరిగేలా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పాక్షిక విజయం కూడా సాధించని ట్రంప్ ఈ భేటీలో మా ప్రతిపాదనలకు పుతిన్ ఒప్పుకోకపోతే రష్యాపై మరోదఫా ఆంక్షలు విధిస్తానని రెండ్రోజుల ముందు ట్రంప్ చేసిన భీష్మప్రతిజ్ఞ ఉత్తిదేనని తేలిపోయింది. ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోకుండానే భేటీ ముగిసినా సరే ట్రంప్‌లో ఎలాంటి నిరసన, ఆందోళన కనిపించలేదు. పైగా పుతిన్ చేసిన మాస్కో పర్యటన ప్రతిపాదనకు ట్రంప్ సంతోషం వ్యక్తంచేయడం విచిత్రం. పైగా తాము అనుకున్న ఫలితాలు రాకపోయినా ట్రంప్.. పుతిన్‌తో చర్చలు సానుకూలంగా సాగాయని విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం. దీంతో భేటీపై ట్రంప్‌కు ఎలాంటి పట్టు సాధించలేకపోయారని అర్థమవుతోంది. భేటీ జరుగుతున్నాసరే రష్యా దాడులుచేసేలా పుతిన్ ఆదేశాలిచ్చి తన మొండి వైఖరిని మరోసారి చూపించారు. శాంతి చర్చలను వాణిజ్య చర్చలుగా మార్చిన పుతిన్ యుద్ధం ఆపాలన్న డిమాండ్‌తో ముందుకొచి్చన అమెరికాను వాణిజ్యచర్చలకు బలవంతంగా పుతిన్ కూర్చోబెట్టినట్లు ఈ భేటీ తర్వాత ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతోంది. ‘‘వాణిజ్యం, డిజిటల్, హై–టెక్, స్పేస్ వంటి రంగాల్లో అమెరికా–రష్యా పెట్టుబడులు, వాణిజ్య సహకారం మరింతగా బలపడనుంది. ఆర్కిటిక్లోనూ సహకారం బాగుంది’’అని సంబంధంలేని విషయాలనూ పుతిన్ చెప్పుకొస్తున్నా ఆయనను అడ్డుకోవాల్సిందిపోయి ట్రంప్ ఆయనకు వంతపాడటం విచిత్రం. పుతిన్‌తోపాటు ట్రంప్ ఆ తర్వాత గొంతు కలుపుతూ.. ‘‘రష్యా వ్యాపార భాగస్వాములు మాతో వాణిజ్యానికి ఉవి్వళ్లూరుతున్నారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా శాంతి చర్చలను పుతిన్ విజయవంతంగా వాణిజ్యచర్చలుగా మార్చేశారు. పదికి పది.. కానీ సున్నా సమావేశం ముగిశాక ఈ భేటీలో పూర్తి సత్ఫలితాలను సాధించామని, 10/10 మార్కులు కొట్టేశానని ట్రంప్ చేసిన వ్యాఖ్యానాల్లో పిసరంతైనా నిజం లేదని తేలిపోయింది. వాస్తవానికి ఆ పది మార్కులు పుతిన్ దోచేశారు. శాంతి ఒప్పందం దిశగా కనీసం ఒక్క షరతు విషయంలో పుతిన్‌ను ట్రంప్ ఒప్పించలేకపోయారు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌తో కరచాలనం, రెడ్‌కార్పెట్ స్వాగతం, ట్రంప్ కలిసి మీడియాకు ఫొటోలకు పోజులు, కలిసి కారులో ప్రయాణం, దారి పొడవునా కారులో నవ్వులు, భేటీ సందర్భంగా తమ వాదనను గట్టిగా వినిపించడం, సంయుక్త ప్రకటన వేళ తొలుత మాట్లాడం సహా ప్రతి సందర్భంలోనూ పుతిన్ పైచేయి సాధించారు. సాధారణంగా ఇతర దేశాల నేతలు మాట్లాడేటప్పుడు హఠాత్తుగా కల్గజేసుకుని, వెటకారంగా మాట్లాడి వారిని అవమానించే ట్రంప్.. ఈసారి మాత్రం పుతిన్ మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండటం గమనార్హం. యుద్ధం, శాంతి, ఉక్రెయిన్ ప్రాంతాల దురాక్రమణ, కాల్పుల విరమణ వంటి కీలక పదాలను కనీసం ట్రంప్ ప్రస్తావించేందుకు సైతం సాహసించకపోవడం పుతిన్ దౌత్యవిజయంగా చెప్పొచ్చు. సొంత గడ్డపై జరిగిన భేటీలోనే నోరుమెదపని ట్రంప్ ఇక రష్యాలో జరగబోయే రెండో రౌండ్ భేటీలో ఏపాటి మాట్లాడతారనే అనుమానాలు బలపడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్కంఠతో మొదలై ఉసూరుమనిపించి..
జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్–రిచర్డ్స్‌న్(అలాస్కా): ఎడాపెడా టారిఫ్‌ల పిడిగుద్దులు కురిపించి ప్రపంచదేశాలకు సుంకాల ముచ్చెమటలు పట్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శక్తిసామర్థ్యాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎదుట నిర్విర్యమయ్యాయి. అలాస్కాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రపంచ దేశా లు అత్యంత ఉత్కంఠతతో ఎదురుచూసిన ట్రంప్, పుతిన్ శిఖరాగ్ర చర్చలు దాదాపు మూడు గంటలపాటు జరిగినా చివరకు ఎలాంటి సత్ఫలితాలనివ్వకుండానే ముగిశాయి. దీంతో దురాక్రమణ జెండా ఎగరేసి ఉక్రెయిన్‌పై బాంబుల మోత మోగిస్తున్న రష్యాను నిలువరించి ఉక్రెయిన్‌లో శాంతికపోతాలు ఎగిరేలా చేస్తానన్న ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞ నెరవేరలేదు. అలాస్కాకు చేరుకున్నది మొదలు చర్చలు, సంయుక్త ప్రకటనదాకా ఆద్యంతం పుతిన్‌దే పైచేయి కనిపించింది. అయితే శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేశామని ట్రంప్ ప్రకటించగా ఒప్పందం కంటే ‘పరస్పర అవగాహన’దిశగా సఖ్యత కుదిరిందని పుతిన్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌లో శాంతిస్థావనకు ఇరునేతలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే నిర్దిష్ట ప్రణాళికలను ఇరువురూ బయటపెట్టలేదు. కానీ ఈ చర్చలకు కొనసాగింపుగా రష్యా రాజధాని మాస్కోలో మరోదఫా చర్చలు జరిగే అవకాశముంది. పుతిన్‌పై ప్రశ్నల శరాలు తన ఏలుబడిలో రష్యా మీడియా పుతిన్‌ను ముక్కుసూటి ప్రశ్నలడిగే దుస్సాహసం చేయదు. కానీ అమెరికాలో అడుగుపెట్టిన పుతిన్‌కు అమెరికా అంతర్జాతీయ మీడియా ప్రశ్నలతో మూకుమ్మడి దాడి చేసింది. పుతిన్ దాదాపు ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వనప్పటికీ ప్రశ్నల బాణాలు సంధిస్తూ మీడియా పుతిన్‌కు నోటమాట రానివ్వకుండా చేసింది. ‘‘ఉక్రెయిన్‌లో అమాయక పౌరుల ప్రాణాలను తీయడం ఎప్పుడు ఆపేస్తారు? శాంతిస్థాపనకు కంకణం కట్టుకున్నానని మీరు చెప్పే మాటలను ట్రంప్ ఎందుకు నమ్మాలి? ఇలా పలు ప్రశ్నలను మీడియా గట్టిగా అడిగినా పుతిన్ మౌనంగా ఉండిపోయారు. తాను ఆ ప్రశ్నలను వినదల్చుకోలేదు అన్నట్లు చెవులు మూసుకున్నారు. సాదర స్వాగతం పలికిన ట్రంప్ పుతిన్ కంటే ముందే యాంకరేజ్ సిటీలోని ఎయిర్‌పోర్ట్‌కు ట్రంప్ చేరుకున్నారు. తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పుతిన్‌కు ట్రంప్ ఎర్ర తివాచీ పరచి మరీ సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజిచ్చారు. రెడ్‌కార్పెట్‌పై నడిచి వెళ్లేటప్పుడు అమెరికా అత్యంత భారీ బాంబులను జారవిడిచే బీ–2 బాంబర్ యుద్ధవిమానాలతోపాటు ఎఫ్–22 ఫైటర్జెట్లు గగనతలంలో దూసుకుపోయాయి. ట్రంప్ తన బీస్ట్ కారులో పుతిన్‌ను ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో ఇద్దరూ వెనకసీట్లో కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. తర్వాత జాయింట్ ఎల్మెండార్ఫ్–రిచర్డ్స్‌న్ వైమానిక స్థావరంలో ఏర్పాటుచేసిన సమావేశమందిరానికి చేరుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలçహాదారు మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, జాతీయ భద్రతా సలహాదారు యూరీ ఉషకోవ్ల సమక్షంలో ట్రంప్, పుతిన్‌లు సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్‌పై దాడులు మొదలెట్టాక పుతిన్ అమెరికా గడ్డపై కాలుమోపడం ఇదే తొలిసారి.అమెరికా మా పొరుగు దేశం భేటీ తర్వాత సంయుక్త సమావేశంలో పుతిన్ తొలుత మాట్లాడారు. ‘‘అమెరికా, రష్యాలు పొరుగుదేశాలే. మమ్మల్ని కేవలం మహాసముద్రాలే వేరుచేస్తున్నాయి. అది కూడా కేవలం నాలుగు కిలోమీటర్లే. మిగతా అంశాల్లో మేం మిత్రదేశాలమే. అందుకే రెడ్‌కార్పెట్‌పై నాకు స్వాగతం పలకేటప్పుడు ట్రంప్ నన్ను హలో పొరుగుమిత్రుడా(నెయిబర్) అని సంబోధించారు. అమెరికాలో ఇప్పటికీ ఆర్థోడాక్స్ చర్చిలు ఉన్నాయి. మా మధ్య సాంస్కృతిక బంధం బలోపేతానికి కృషి చేస్తాం. పరస్పర ప్రయోజనకర, సమస్థాయి ఒప్పందాలకు ఈ సాంస్కృతికబంధాలు వారధిగా నిలుస్తాయి. ప్రచ్ఛన్నయుద్ధంకాలంనుంచి ఇరు దేశాల సంబంధాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. ఇకమీదట విభేదాలు విడనాడి చర్చల మార్గంలో పయనిద్దాం. వాస్తవానికి ఇలాంటి భేటీ ఎప్పుడో జరగాల్సింది’’అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం అంశాన్ని పుతిన్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘సంక్షోభమే ఈ సమావేశాలకు ప్రధాన పునాది. ఉక్రెయిన్ను చుట్టుముట్టిన సమస్యలకు పరిష్కారం వెతకాల్సి ఉంది. ఉక్రేనియన్ల ఆందోళనను అప్పుడూ పట్టించుకున్నా. ఇప్పుడూ పట్టించుకుంటున్నా. మా మూలాలు ఒక్కటే. పరస్పర సంఘర్షణ కారణంగా ఇరువైపులా శాంతి ప్రక్రియలో ఉక్రేనియన్లు, యురోపియన్లు అవరోధాలు కల్పించొద్దు. అంతా శుభమే జరగాలని కోరుకుంటున్న ట్రంప్‌కు నా ధన్యవాదాలు. మా ఇరు పక్షాలు చక్కటి ఫలితాల కోసమే పాటుపడుతున్నాయి. అమెరికా శ్రేయస్సు కోసం ట్రంప్ పరితపిస్తున్నారు. అలాగే రష్యా స్వప్రయోజనాలు మాకు ముఖ్యం. ట్రంప్‌తో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. కానీ ఉక్రెయిన్ అంశంలో అమెరికాతో ఒక అవగాహనకు వచ్చాం’’అని పుతిన్ స్పష్టంచేశారు.నేరుగా శాంతి ఒప్పందమే అత్యుత్తమం తర్వాత ట్రంప్ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడు వ్లాదిమిర్‌తో సమావేశం అత్యంత సత్ఫలితాలనిచి్చంది. అయితే తదుపరి దశ(శాంతిచర్చల)కు చేరే క్రమంలో ఎంతో పురోగతి సాధించాం. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మాకు సువర్ణావకాశం దక్కింది. కానీ ఇంకా కొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది. (శాంతి)ఒప్పందం కుదరాలంటే అంతకుముందు మరో ఒప్పందం కుదరాలి. సంక్షోభం సమసిపోవాలంటే నాటో కూటమి దేశాలు, ఉక్రెయిన్ వల్లే సాధ్యం. ఒప్పందం పూర్తిగా వాళ్ల చేతుల్లోనే ఉంది. వారానికి వేల మంది చనిపోకుండా నిలువరించాల్సి ఉంది. చర్చల కొనసాగింపుగా మరోదఫా వ్లాదిమిర్‌తో భేటీ కావాల్సి ఉంది’’అని ట్రంప్ అన్నారు. దీంతో వెంటనే పుతిన్ కల్పించుకుని ‘‘ఈసారి మాస్కోలో కలుద్దాం’’అని అన్నారు. తర్వాత ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘ఉక్రెయిన్, రష్యాలు నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఈ యుద్ధాన్ని ముగించేందుకు అత్యుత్తమ మార్గం. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నా అది సమగ్ర స్థాయిలో అమలుకావడం కష్టమే. కాల్పుల విరమణ తరచూ ఉల్లంఘనలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఉక్రెయిన్, రష్యా నేరుగా శాంతి ఒప్పందం చేసుకోవాలి. సోమవారం వైట్‌హౌస్‌లో జెలెన్స్కీతో సమావేశమవుతా. మా చర్చలు ఫలవంతమయ్యాక పుతిన్‌తో మాట్లాడతా. ఆ తర్వాత పుతిన్, జెలెన్స్కీలు ఒక్కచోటకు చేర్చి యుద్ధవిరమణకు కృషిచేస్తా’’అని ట్రంప్ అన్నారు. -
ట్రంప్-పుతిన్‌ల భేటీపై భారత్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య అలస్కాలో జరిగిన సమ్మిట్‌ను భారత్ స్వాగతించింది. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సుదీర్ఘంగా సాగిన సమావేశాన్ని భారత్ అభినందించింది. రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న దీర్ఘ కాలిక యుద్ధానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎక్కడైనా శాంతికి తొలి అడుగు పడాలంటే అది చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.‘అమెరికా-రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం పురోగతిని భారత్ అభినందిస్తుంది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే ముందుకు వెళ్లడం మంచి పరిణామం. ఉక్రెయిన్ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.కాగా, అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) అర్థరాత్రి గం. 12.30 ని.లు దాటాకా ఇరువురి అధ్యక్షుల మధ్య దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిపోయింది వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు.కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పుకొచ్చారు.మరొకవైపు ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తానని ట్రంప్ తెలిపారు. కానీ ఏం జరుగుతుందో తెలియదన్నారు. ‘రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు ట్రంప్. -
ఇవే ప్రశ్నలు వీళ్లిద్దరినీ కాకుండా.. ఆయన్ని అడిగే దమ్ముందా?
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది. శాంతి చర్చల్లో ముందడుగు పడకపోతే కఠినంగా వ్యవహరిస్తానంటూ రష్యాపై రంకెలు వేసిన ట్రంప్.. అలస్కా చర్చల తర్వాత కాస్త మెత్తబడ్డాడు. ఉక్రెయిన్ శాంతి చర్చలు అర్ధరహితంగా ముగిసినట్లు వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ క్రమంలో.. ట్రంప్ ఇంకా అలస్కాలో ఉండగానే పుతిన్ అక్కడి నుంచి నిష్క్రమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..అలస్కాలో జర్నలిస్టులు సంధించిన ప్రశ్నలను ఇరు దేశాల అధినేతలు స్వీకరించలేదు. తాము చెప్పాలనుకున్నది చెప్పి.. తలోదారి వెళ్లిపోయారు. యాంకరేజ్ విమానాశ్రయంలో, అలాగే చర్చలు ప్రారంభం కావడానికి ముందు పీస్ రూమ్‌లోనూ ఇరు దేశాధినేతలు మీడియా ముందు ఆసీనులయ్యారు. ఆ సమయంలో ఉక్రెయిన్ కాల్పుల విరమణ, యుద్ధంలో సాధారణ పౌరులు మరణించడం లాంటి ప్రశ్నలు పుతిన్‌కు ఎదురయ్యాయి. ‘‘సాధారణ పౌరుల్ని చంపడం ఇంకెప్పుడు ఆపుతారు?’’ అంటూ ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. దానికి పుతిన్ తనకేమీ వినబడడం లేదన్నట్లు సైగ చేసి చూపించారు. అదే సమయంలో ‘‘ట్రంప్ మిమ్మల్ని మాత్రమే ఎందుకు నమ్ముతున్నారు?’’ అని మరో విలేఖరి ప్రశ్నించగా.. జర్నలిస్టుల గోలతో పుతిన్ ఇచ్చిన వివరణ వినిపించనట్లే కనిపించింది. పుతిన్‌పై అంతర్జాతీయ నేరస్థుల కోర్టు కేసు ఉన్నప్పటికీ.. అమెరికా భూభాగంలోకి ఎందుకు ఆహ్వానించారు?. ఉక్రెయిన్ను నేరుగా భాగం కానీయకుండా కాల్పులవిరమణ డీల్ కుదర్చాలని ట్రంప్ భావిస్తున్నారా?. పుతిన్ ఎలాంటి రాయితీలు ఇవ్వవచ్చు? ట్రంప్ ఏమి అంగీకరించవచ్చు? ఇది యుద్ధ విరామానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ నాటకం మాత్రమేనా? అని ప్రశ్నలు గుప్పించారు. అయితే వీటిలో వేటికి సమాధానాలు రాలేదు. దీంతో.. సోషల్ మీడియా సదరు జర్నలిస్టుల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఇవే ప్రశ్నలను గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును అడిగే దమ్ముందా? అని నిలదీస్తోంది. ‘‘2023 అక్టోబర్ 7వ తేదీన గాజా యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటిదాకా 60 వేలమందికిపైనే మరణించారు. అందులో 70 శాతం మహిళలు, చిన్నారులే ఉన్నారని నివేదికలు గణాంకాలతో సహా చెబుతున్నాయి. అయితే ఈ మరణాలపై నెతన్యాహు ఏనాడూ స్పందించగా పోగా.. కనీసం విచారం కూడా వ్యక్తం చేసింది లేదు. పైగా ఎంతసేపు హమాస్ అంతమే శాంతికి మార్గం అంటూ చెబుతూ వస్తున్నారు. దీనికి తోడు మానవతా సాయం అందకుండా చేశారనే ఆరోపణలు ఆయపై ఉన్నాయి. ఈ క్రమంలో యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహుపై వారెంట్ సైతం జారీ చేసింది.ఈ పరిణామాలపై ఇటు ఇజ్రాయెల్.. అటు అమెరికా జర్నలిస్టులెవరూ ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. మరోవైపు.. రెండుసార్లు నెతన్యాహు అమెరికా పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనూ జర్నలిస్టులెవరూ.. గాజా పౌరుల మరణాల గురించి ఎందుకు నిలదీయలేదు?’’ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో లక్షల మంది మరణించారు. మూడున్నరేళ్ల యుద్ధానికి పుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశంలో పర్సూయింగ్ పీస్ పేరిట అలస్కా చర్చల్లో పాల్గొన్నారు. ట్రంప్-పుతిన్‌లు ఐదారుగంటలు అలస్కాలోనే గడపగా.. రెండున్నర గంటలపాటు చర్చలు జరిగాయి. అయితే.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు పట్టుబట్టగా.. అందుకు రష్యా అధినేత ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. Vladimir Putin’s reaction was nothing short of remarkable—reporters shouted, but his expression told its own story. pic.twitter.com/07vkASuJIc— Tarique Hussain (@Tarique18386095) August 15, 2025భేటీకి ముందు జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించని ఇరువురు నేతలు.. సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ మీడియా ప్రతినిధులను ప్రశ్నలకు అనుమతించలేదు. మరోవైపు.. అలస్కా చర్చల సారాంశం కోసం రష్యా అధికారుల బృందాన్ని పలువురు జర్నలిస్టులు కలిసే ప్రయత్నమూ విఫలమైంది. అదే సమయంలో.. ట్రంప్ తన అనుకూల రిపోర్టర్లతో పుతిన్‌పై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేశారని, దాని నుంచి పుతిన్ భలేగా తప్పించుకున్నారనే వాదన నెట్టింట నడుస్తోంది... అలస్కాలో ట్రంప్ దౌత్యం విఫలమేనని కొన్ని అమెరికన్ మీడియా చానెల్స్ ప్రముఖంగా చర్చిస్తున్నాయి. కానీ, ట్రంప్ మాత్రం ఎంతో కొంత పురోగతి సాధించాం అని చెబుతుండడం గమనార్హం. ‘‘పుతిన్ చాలా టఫ్, స్ట్రాంగ్ ఫెల్లో. ఇక దారికి రావాల్సింది జెలెన్స్కీనే’ అన్నట్లు ఫ్యాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇంకోవైపు.. అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీలో రష్యా అనుకూల ఏకపక్ష డీల్ కుదరనందుకు సంతోషమంటూ ఉక్రెయిన్ ఎద్దేవా ప్రకటన విడుదల చేసింది. -
వీడియో: ట్రంప్ ఓవరాక్షన్ ప్లాన్.. పుతిన్‌నే భయపెట్టే ప్రయత్నం!
అలాస్కా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసిన వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఎంత బలమైన దేశమో.. చెప్పేందుకు పుతిన్‌కు చూపించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ పెద్ద ప్లానే చేశారు. పుతిన్‌ను ట్రంప్ ఆహ్వానిస్తున్న సమయంలో స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్స్ విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా విమానం దిగిన పుతిన్‌కు ట్రంప్ ఘన స్వాగతం పలికారు. అయితే, వారిద్దరూ ముందుకు సాగుతున్న సమయంలో అనూహ్యంగా స్టెల్త్ బాంబర్లు, F-22, F-35 ఫైటర్ జెట్లువిమానాలు గాల్లో దర్శనమిచ్చాయి. ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. దీంతో, ట్రంప్ చప్పట్లు కొడుతూ.. పుతిన్‌తో ఏదో మాట్లాడారు. మరోవైపు.. పుతిన్ మాత్రం వాటిని చూస్తూ ముందుకు కదిలారు.Trump flies a B-2 over Putin’s head in a show of strength, look at the Trump’s body language, it’s all about dominance pic.twitter.com/cleGOmuedF— Prayag (@theprayagtiwari) August 15, 2025ఇక, ట్రంప్-పుతిన్ సమావేశం జరుగుతున్నంత సేపూ కూడా అవి గాల్లోనే చక్కర్లు కొడుతూ కనిపించాయి. దీని ద్వారా పుతిన్ అమెరికా సైనిక శక్తిని గ్రహించాలని ట్రంప్ భావించారు. గత నెలలో ఇరాన్ అణు కర్మాగారాలను ట్రంప్ సైన్యం ఇదే బీ-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించి నాశనం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. అందరి కంటే తానే బలవంతుడు, తన దేశమే బలమైన దేశం అని నిరూపించాలని ట్రంప్ ఇలా చేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పుతిన్‌ను హెచ్చరించేందుకే ట్రంప్ ఇలా చేశారని మరి కొందరు అంటున్నారు. 🔥 THIS is how you negotiate.Trump forced Putin and his motorcade to drive past a HUGE lineup of F-22s and attack helicopters on his way to the meeting…… Immediately after buzzing Putin’s head with a B-2 Stealth BomberIt’s pretty obvious who’s in the power position 🇺🇸 pic.twitter.com/0SF8sqDXQr— Nick Sortor (@nicksortor) August 15, 2025Trump made B-2 bombers fly over Putin in Alaska.What an insecure guy! Flexing military muscle for a guest he himself invited after failing to make any impact in Ukraine, like a scared kid trying to look tough with gimmicks. pic.twitter.com/29aFCTEvJD— THE SKIN DOCTOR (@theskindoctor13) August 15, 2025 -
పుతిన్ ఆలోచన అదే.. రష్యాపై విరుచుకుపడిన జెలెన్ స్కీ
కీవ్: అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన భేటీ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, పుతిన్ జరిపే చర్చల సఫలం కావు అంటూ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ముగించే ఉద్దేశ్యం పుతిన్‌కు లేదంటూ విమర్శలు చేశారు. అందువల్లే ఈ భేటీని పుతిన్ వ్యక్తిగత విజయంగా జెలెన్ స్కీ అభివర్ణిస్తున్నారు.అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య భేటీ జరుగుతున్న నేపథ్యంలో జెలెన్ స్కీ స్పందించారు. ఈ సందర్బంగా జెలెన్ స్కీ ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లేకుండా ట్రంప్, పుతిన్ చర్చలేంటి?. ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న రోజున కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తున్నాయి. యుద్ధాన్ని ముగించే ఉద్దేశ్యం మాస్కోకు లేదని మరోసారి నిరూపితం అయ్యింది. యుద్ధానికి సరైన ముగింపు ఎలా సాధించాలనే దానిపై ఉక్రెయిన్.. వాషింగ్టన్, యూరోపియన్ మిత్రదేశాలతో చర్చలు జరుపుతోంది. ఆయా దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్ సాధ్యమైనంత పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మేము అమెరికా నుండి బలమైన స్థానాన్ని ఆశిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.On the day of negotiations, the Russians are killing as well. And that speaks volumes. Recently, weʼve discussed with the U.S. and Europeans what can truly work. Everyone needs a just end to the war. Ukraine is ready to work as productively as possible to bring the war to an end,… pic.twitter.com/tmN8F4jDzl— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 15, 2025ఉక్రెయిన్ డిమాండ్స్ ఇవే?రష్యాతో ఘర్షణలో బాధిత దేశమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ భాగస్వామి చేయకుండా ట్రంప్, పుతిన్ జరిపే చర్చలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ కారణంగానే వీరి భేటీని పుతిన్ వ్యక్తిగత విజయంగా జెలెన్స్కీ అభివర్ణిస్తున్నారు.శాంతి చర్చలు జరపాలంటే రష్యా బేషరతుగా కాల్పుల విరమణను ప్రకటించాలన్నది ఉక్రెయిన్ డిమాండ్. రష్యాకు తమ భూభాగాల అప్పగింత ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది.యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని, రష్యా అపహరించుకుపోయిన తమ దేశ చిన్నారులను తిరిగి అప్పగించాలని కోరుతోంది.భవిష్యత్తులో తమ దేశంపై రష్యా దాడి చేయకుండా రక్షణలు కల్పించాలని పట్టుబడుతోంది.రష్యాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఒక్కసారిగా కాకుండా క్రమంగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది.అవసరమైతే వాటిని మళ్లీ విధించేందుకు అవకాశం ఉండాలి. మరోవైపు.. అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ ఎలాంటి ఫలితం తేల్చకుండానే ముగిసిపోయింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు. ట్రంప్ స్పందిస్తూ.. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. -
ట్రంప్, పుతిన్ మధ్య ముగిసిన భేటీ.. యుద్ధంపై ట్విస్ట్!
అలాస్కా: అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు. కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పుకొచ్చారు.#WATCH | Alaska, USA | US President Donald Trump says, "We had a very productive meeting, there were many points that we agreed on. Couple of big ones that we haven't quite gotten there but we made some headway. There's no deal until there's a deal so I will call up NATO in a… pic.twitter.com/mY5t9zkoCT— ANI (@ANI) August 15, 2025ఇదే సమయంలో డీల్ పూర్తికావడంపై నిర్ణయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేతుల్లోనే ఉంది. ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తా. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉంది. రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు. పుతిన్‌తో ఏయే విషయాలు చర్చించారు..? ఇంకా మిగిలి ఉన్న అంశాలు ఏంటనే విషయంపై వివరించేందుకు ట్రంప్ నిరాకరించారు. #WATCH | Alaska, USA | Russian President Vladimir Putin says, "... We see the strive of the administration and President Trump personally to help facilitate the resolution of the Ukrainian conflict and his strive to get to the crux of the matter to understand this history is… pic.twitter.com/kiOKgw2JBf— ANI (@ANI) August 15, 2025అనంతరం, పుతిన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ట్రంప్‌తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్‌తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. కాగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు.#WATCH | Alaska, USA | "Next time in Moscow," says Russian President Vladimir Putin as US President Trump thanks his counterpart for today's meeting."... I could see it happening," replies President Trump.Source: The White House/ YouTube pic.twitter.com/N3U6Rygllj— ANI (@ANI) August 15, 2025 పుతిన్‌కు ఘన స్వాగతం..ఇదిలా ఉండగా.. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికైంది. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్ లావ్రోవ్, విదేశాంగ విధాన సలహాదారు యురి యుషకోవ్ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్, పుతిన్ మధ్యే చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇరుదేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. వీరి భేటీ ముగిసినట్లు వైట్‌హౌస్, క్రెమ్లిన్లు ప్రకటించాయి.#WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin exchange greetings in Anchorage, ahead of their talks.Source: Reuters pic.twitter.com/mdGoQe6qqx— ANI (@ANI) August 15, 2025 అంతకు ముందు తొలుత ఇద్దరు నేతలు అలాస్కాలోని యాంకరేజ్‌కు చేరుకున్నారు. అక్కడ పుతిన్‌కు ట్రంప్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ట్రంప్‌కు చెందిన వాహనంలో సమావేశాని భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వెళ్లారు. ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో కథ మళ్లీ ముందుకే వచ్చింది. #WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin share the same car to reach the venue for their talks. Source: Reuters pic.twitter.com/X9YkJvqb6g— ANI (@ANI) August 15, 2025 -
చర్చలు విఫలమైతే మరిన్ని టారిఫ్‌లు
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్, పుతిన్ మధ్య అలస్కాలో శుక్రవారం జరిగే చర్చలు విఫలమైతే భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ తేల్చిచెప్పారు. ట్రంప్, పుతిన్ చర్చల ద్వారా ఫలితంపైనే టారిఫ్‌లపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ సానుకూల ఫలితాలు రాకపోతే భారత్‌పై సుంకాల మోత తప్పదని వెల్లడించారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు ఇండియాపై సెకండరీ టారిఫ్‌లు విధిస్తామన్నారు. అప్పటికీ రష్యా దారికి రాకపోతే సెకెంటరీ టారిఫ్‌లు మరింత పెరుగు తాయని స్పష్టంచేశారు. భారత్ గనుక ముడి చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగు తుందని అమెరికా అంచనా వేస్తోంది. భారత్ ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. -
అదే జరిగితే భారత్‌కు మరిన్ని సుంకాలు తప్పవు: అమెరికా
భారత్ సుంకాలతో దాడి చేసిన అమెరికా.. భారత్‌కు మరో హెచ్చరిక జారీ చేసింది. భారత్‌పై మరిన్ని సుంకాలు లేదంటే ఆంక్షలు తప్పవని అంటోంది. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చర్చల ఫలితాలను బట్టి ట్రంప్ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.రష్యాతో చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై ఇప్పటికే సుంకాలు విధించాం. ఒకవేళ.. ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు గనుక విఫలమైతే భారత్‌పై మరిన్ని సుంకాలు, ఆంక్షలు తప్పవు. తుది నిర్ణయం చర్చల ఫలితాలను బట్టే ఉంటుంది అని ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ బుధవారం బ్లూమరాంగ్‌టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్‌పై సెకండరీ టారిఫ్‌లు, లేదంటే పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది అని స్కాట్ స్పష్టం చేశారు.భారత్ తమ మిత్రదేశమంటూనే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించింది అమెరికా. అంతేకాదు.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు తమ వాణిజ్యం ద్వారా భారత్ పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆ టైంలో ఆరోపించారు. ఈ తరుణంలో.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు ఆపకపోవడంతో పెనాల్టీ కింద మరో 25 శాతం మోపారు. దీంతో భారత్‌పై అగ్రరాజ్యం టారిఫ్‌లు 50 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారమని తెలిసినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు కూడా. ట్రంప్ విధించిన దటి దఫా సుంకాలు ఇప్పటికే అమలు అవుతుండగా.. ఈ నెల 27 నుంచి రెండో దఫా ప్రకటించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై వాషింగ్టన్లో వరుస చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. అదే సమయంలో.. భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండబోవని ప్రకటించారాయన. అయితే ఫాక్స్‌న్యూస్‌తో ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడారు. ఇరు దేశాల చర్చలు కొనసాగే అవకాశమూ ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25న అమెరికా నుంచి ప్రతినిధులు భారత్‌కు చేరుకుంటారని తెలిపారు. అయితే.. వ్యవసాయ, డెయిరీ మార్కెట్‌ను కాపాడుకునే ఉద్దేశంలో భారత్ ఉందని, ఇది చర్చలకు విఘాతంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.మూడున్నరేళ్ల యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలు ఉండబోతున్నాయని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధినేత కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది అలస్కా వేదికగా శుక్రవారం జరగబోయే చర్చలతోనే తేలిపోతుందని చెబుతున్నారాయన. అదే సమయంలో భూభాగాల మార్పిడితోనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఇరు దేశాలకు మరోసారి సూచించారు కూడా. అయితే ఈ ఆలోచనను ఉక్రెయిన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భూభాగాల విషయంలో రాజీ పడటం తమ రాజ్యాంగానికి విరుద్ధమని అంటోంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీకి యూరప్ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ లేకుండా జరిగే చర్చలకు అర్థం ఉండదని, పుతిన్‌తో జరగబోయే ఒకే ఒక్క భేటీ రష్యా లక్ష్యాలకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వవచ్చని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. -
ట్రంప్, పుతిన్ ఏకాంత చర్చలే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతోందని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం జరిగే గదిలో ట్రంప్, పుతిన్‌తోపాటు ఇద్దరు అనువాదకులు మాత్రమే ఉంటారని తెలిపాయి. ఇంకెవరికీ ప్రవేశం ఉండదని పేర్కొన్నాయి. ఇరువురు నేతలు దాదాపు నాలుగేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు జరుపబోతున్నారు. ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2018 జూలై 16న ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో ట్రంప్, పుతిన్ మధ్య రెండు గంటలపాటు గోప్యమైన భేటీ జరిగింది. అప్పటి చర్చల్లో పెద్దగా ఏదీ సాధించలేకపోయారు. ఫల వంతం కాలేదు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు కూడా అదే తరహాలో గోప్యంగా మాట్లాడుకోవాలని నిర్ణయించుకోవడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటిలాగే విఫలమయ్యే అవకాశం లేకపోలేదని విమర్శకులు అంటున్నారు. ట్రంప్, పుతిన్ తోపాటు ఇరుపక్షాల నుంచి ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొంటే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం పుతిన్‌తో ఏకాంత చర్చలకే ట్రంప్ మొగ్గు చూపడం వెనుక స్పష్టమైన కారణం ఉన్న ట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌తో గట్టిగా వాదించి, ఒప్పించడానికి ఏకాంత భేటీ దోహదపడు తుందని ఆయన భావిస్తున్నట్లు సమా చారం. ఎందుకంటే చర్చల గదిలో ఇతరు లు కూడా ఉంటే వారు అప్పటికప్పుడు పుతిన్ మనసు మార్చేసి, వెనక్కి లాగే ప్రమాదం లేకపోలేదు. అలాంటి పరిస్థితి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులతో పని కాదన్న అంచనాతో స్వయంగా తానే రంగంలోకి దిగాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్‌తో మొదట కాల్పుల విరమణకు, ఆ తర్వాత శాంతి ఒప్పందానికి రష్యా అధినేతను ఎలాగైనా ఒప్పించాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పుతిన్ విజయమే: బోల్టన్ అలస్కాలో జరిగే భేటీని పుతిన్ విజయంగా డొనాల్డ్ ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అభివర్ణించారు. సమావేశానికి ట్రంప్‌ను స్వయంగా రప్పిస్తుండడం ద్వారా పుతిన్ ఇప్పటికే పైచేయి సాధించారని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపేస్తుందన్న నమ్మకం తనకు లేదని తేల్చిచెప్పారు. అయితే, జాన్ బోల్టన్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికాకు అపజయం ఉండదని పేర్కొన్నారు. -
అలస్కా చర్చల్లో జెలెన్స్కీకీ చోటు?
వాషింగ్టన్: ఈ నెల 15వ తేదీన అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన దౌత్యపరమైన విభేదాలకు తెరతీసింది. ఈ సమావేశంలో కుదరబోయే ఒప్పందంపై ఉప్పందుకున్న యూరప్ దేశాల నేతలు ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ణయించే భేటీలో అధ్యక్షుడు జెలెన్స్కీకి చోటు కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సమావేశమైన యూరప్ దేశాల ఉన్నతాధికారులు..ట్రంప్ దౌత్య ప్రయత్నాలకు మద్దతు పలికారు. అదే సమయంలో, ట్రంప్–పుతిన్ చర్చల తర్వాత ముందుగా కాల్పుల విరమణ అమల్లోకి రావాలని, ఉక్రెయిన్‌కు సైతం ఒప్పందంలో భాగస్వామి అయ్యే అవకాశమివ్వాలని జేడీ వాన్స్‌ను కోరారు. అలస్కాలో శుక్రవారం పుతిన్–ట్రంప్ మధ్య జరిగే శిఖరాగ్రంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు లేదు. అయితే, జెలెన్స్కీ పాల్గొనే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. ట్రంప్–పుతిన్‌ల సమావేశం తర్వాత మాత్రమే జెలెన్స్కీకి చాన్సుంటుందని చెబుతున్నారు. వేగంగా చోటుచేసుకున్న పరిణామాల నడుమ అలస్కా శిఖరాగ్రంపై నిర్ణయం వెలువడింది. శిఖరాగ్రం వేదికను ఇంకా ఖరారు చేయలేదు. అంతేకాదు, ఇద్దరు నేతల మధ్య చర్చకు రావాల్సిన అంశాలపైనా స్పష్టత రాలేదని చెబుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు నేతలతో కలిసి త్రైపాక్షిక చర్చలకు సైతం సిద్దంగా ఉన్నా, పుతిన్ వినతి మేరకు ద్వైపాక్షిక చర్చలకు అవసరమైన ఏర్పాట్లు మాత్రమే చేస్తున్నామని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. యూరప్ నేతల డిమాండ్లివీ..అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అవనున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..ఇందులో జెలెన్స్కీ పాల్గొనేదీ లేనిదీ మాత్రం స్పష్టం చేయలేదు. యుద్ధానికి ముగింపు పలికే విషయంలో ఉక్రెయిన్ను కూడా భాగస్వామిగా చేర్చుకోవాలని జెలెన్‌స్కీతోపాటు యూరప్ దేశాల నేతలు కోరుతున్నారు. ట్రంప్ ప్రకటనను స్వాగతించిన జెలెన్స్కీ, తమ భూభాగాన్ని రష్యాకు ధారాదత్తం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తోసిపుచ్చారు. పుతిన్–ట్రంప్ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అంశాలేమిటి, కుదరనున్న ఒప్పందం వివరాలేమిటి? అంటూ జేడీ వాన్స్‌తో సమావేశమైన యూరప్ దేశాల ఉన్నతాధికారులు కూపీ లాగారు. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్కు పుతిన్ బుధవారం అందించిన పత్రాల్లో ఏముందంటూ ఆరా తీశారు. ‘ఈ చర్చల్లో ఉక్రెయిన్‌కు భాగస్వామ్యం ఉండాలి. చర్చల అనంతరం ముందుగా కాల్పుల విరమణ అమల్లోకి రావాలి. ఆ తర్వాతే మిగతా అంశాల అమలు విషయం తేల్చాలి. ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని కోల్పోవాల్సి వస్తే..ప్రస్తుతం రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలి...’వంటి షరతులను వారు జేడీ వాన్స్‌కు వినిపించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనపై ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలండ్, యూకే, ఈయూ, ఫిన్లాండ్ దేశాల నేతలు సంతకాలు చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకూ గ్యారెంటీ ఇవ్వాలని కోరారు. తమ ప్రతినిధి విట్కాఫ్ మాస్కోలో పుతిన్‌తో జరిపిన సమావేశంలో కుదిరిన ఒప్పందంపై మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్.. కొన్ని భూభాగాలను వదులుకోవడం వంటి అంశాలున్నాయని చెప్పడం యూరప్ దేశాలతోపాటు జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పుతిన్ అందజేసిన పత్రంలో తాము పాక్షికంగా ఆక్రమించుకున్న ప్రాంతాలతోపాటు డోన్బాస్ ప్రాంతం పూర్తిగా స్వాధీనం చేయాలనే అంశం ఉన్నట్లు యూరప్ దేశాలంటున్నాయి. ఖెర్సన్, జపొరిజియాల్లోనూ రష్యా ఆర్మీ తిష్టవేసింది. వీటి విషయం తేల్చలేదు. అమెరికా ఇచ్చే భద్రతాపరమైన గ్యారంటీల విషయం సైతం అస్పష్టంగా ఉంది. దీనిపై వైట్ హౌస్ అధికారులను ఈయూ నేతలు పదేపదే ప్రశ్నిస్తున్నా స్పందనలేదు. -
పుతిన్, ట్రంప్ భేటీ 15న
వాషింగ్టన్: ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ భేటీకి వేదిక, తేదీ ఖరారయ్యాయి. ఈ నెల 15వ తేదీన అలస్కాలో ఇరువురు నేతలు సమావేశం కాబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం స్వయంగా వెల్లడించారు. పుతిన్‌తో తన భేటీ గురించి శనివారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే శుక్రవారం రష్యా అధ్యక్షుడిని కలుసుకోబోతున్నట్లు తెలిపారు. ఇద్దరు నేతలు ముఖాముఖి సమావేశం అవుతుండడం నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా పుతిన్‌ను ట్రంప్ ఒప్పిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల మోత మోగించారు. భారత ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. అంతేకాకుండా రష్యా ప్రత్యర్థి దేశమైన ఉక్రెయిన్‌పై సైనిక సాయం భారీగా పెంచబోతున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో ట్రంప్, పుతిన్ భేటీ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అతిపెద్ద యుద్ధం ఉక్రెయిన్–రష్యా సమరమే. దీనికి సాధ్యమైనంత త్వరగా తెరదించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. పుతిన్‌ను కలుసుకోబోతున్నట్లు ఇటీవల హఠాత్తుగా ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఒకప్పటి రష్యా భూభాగమే అలస్కా పుతిన్, ట్రంప్ సమావేశానికి అలస్కా వేదిక అవుతుండడం మరో విశేష పరిణామం. అలస్కా 1867 దాకా రష్యా సామ్రాజ్యంలో అంతర్భాగమే. అప్పటి జార్ చక్రవర్తి అలెగ్జాండర్–2 ఈ ప్రాంతాన్ని అమెరికాకు విక్రయించారు. బ్రిటిష్ సైన్యం దీన్ని ఆక్రమిస్తుందన్న భయంతో అప్పటికప్పుడు అమ్మకానికి పెట్టారు. ఎకరాకు ఒక డాలర్ చొప్పున అమ్మేసినట్లు చెబుతుంటారు. 19వ శతాబ్దంలో ప్రపంచంలో ఇది అతిపెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అలస్కా భూభాగం విలువ 10 బిలియన్ డాలర్లు(రూ.8.75 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. బంగారం సహా సహజ వనరులకు లోటులేని ప్రాంతం అలస్కా. అమెరికా విస్తీర్ణంలో ఐదింట ఒక వంతు అలాస్కా ఉంటుంది. అలస్కాతో రష్యాకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆగస్టు 15న సమావేశం ఎందుకు? ఇక ఇద్దరు కీలక నాయకుల భేటీ కోసం నిర్ణయించిన తేదీకి కూడా చెప్పుకోదగ్గ ప్రాధాన్యం ఉంది. ఆగస్టు 15వ తేదీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తేదీ అని మనకు తెలుసు. కానీ, ఎక్కువ మందికి తెలియని సంగతి ఏమిటంటే.. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తేదీ ఆగస్టు 15. జపాన్ చక్రవర్తి హిరోహితో లొంగుబాటు ప్రకటనతో ఈ యుద్ధం ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి 80 ఏళ్లు పూర్తికాబోతున్నాయి. 1945 ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి తెరపడగా సరిగ్గా రెండేళ్లకు ఇండియాకు స్వాతంత్య్రం లభించింది. జపాన్‌లో మిత్రదేశాల సైన్యాన్ని లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్ ముందుండి నడిపించారు. విజయం చేకూర్చి పెట్టారు. అదే మౌంట్‌బాటెన్ ఇండియా గవర్నర్ జనరల్ హోదాలో 1947లో స్వాతంత్య్ర దినాన్ని ఆగస్టు 15గా నిర్ణయించారు. అది ఆయనకు ఇష్టమైన తేదీ కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆగస్టు 15వ తేదీన పుతిన్, ట్రంప్ కలుసుకోబోతున్నారు. -
ఇక రంగంలోకి ట్రంప్.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాడా?
ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల భేటీ తేదీ, వేదిక ఖరారు అయ్యింది. ఆగస్టు 15వ తేదీన అలస్కాలో తాను పుతిన్‌తో భేటీ కాబోతున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు.నాకు, పుతిన్‌కు మధ్య భేటీ కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ సమావేశం వచ్చే శుక్రవారం ఆగస్టు 15వ తేదీన గ్రేట్ అలస్కా స్టేట్‌లో జరగోబోతోంది అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారాయన. మరోవైపు.. క్రెమ్లిన్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. అయితే ఈ చర్చలతో ట్రంప్ ఏం సాధించబోతున్నారనే విశ్లేషణ ఇప్పటికే మొదలైంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి శాంతి చర్చలు పలు దఫాలుగా జరిగాయి. ఇస్తాంబుల్(టర్కీ)లో చర్చలు జరిగినా, తన రాయబారితో ట్రంప్ స్వయంగా ఇరు దేశాల మధ్య ట్రంప్ సంప్రదింపులు ఇప్పటివరకు శాంతి ఒప్పందం కుదరలేదు. అయితే ఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనడం కోసం స్వయంగా ట్రంపే ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారని వైట్‌హౌజ్ అంటోంది. తద్వారా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడనున్నాయని అంటోంది. భౌగోళికంగా తటస్థ ప్రాంతం కావడం వల్ల ఉక్రెయిన్ చర్చలకు అలస్కా ఎంపిక చేసినట్లు చెబుతోంది. కొసమెరుపు ఏంటంటే.. యుద్ధ రుణభారంతో కుంగిపోయిన పూర్వపు రష్యా సామ్రాజ్యపు అధినేత జార్ అలెగ్జాండర్-2 1867లో అలస్కాను అమెరికాకు 7.2 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. రష్యా డిమాండ్లు• క్రిమియా, డోనెత్స్క్, లుహాన్స్క్ వంటి ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని రష్యా కోరుతోంది.• నాటోలో చేరే ఉక్రెయిన్ ఆలోచనను విరమించుకోవాలని రష్యా పట్టుబడుతోంది.ఉక్రెయిన్ వైఖరి• భూభాగాలపై రాజీకి ఉక్రెయిన్ నిరాకరణ• అంతర్జాతీయ మద్దతుతో శాంతి చర్చలు కొనసాగించాలన్న పట్టుదలఇప్పటివరకు రష్యా కాల్పుల విరమణకు అంగీకరించింది లేదు. అమెరికా ప్రతినిధులు జెలెన్స్కీతో కూడిన త్రైపాక్షిక సమావేశాన్ని ప్రతిపాదించినా, రష్యా ఇంకా స్పందించలేదు. మరోవైపు.. పుతిన్ శాంతి చర్చలు నాటకీయంగా మార్చేశారని జెలెన్స్కీ విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో.. తమ భాగస్వామ్యం లేకుండా శాంతి చర్చలు జరగడం సరికాదని అంటున్నారాయన. ఈ తరుణంలో.. మొన్నటిదాకా నియంతగా జెలెన్స్కీపై మండిపడ్డ ట్రంప్, ఇప్పుడు భేటీ కావడానికి సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం. తాను ఈ ఏడాది జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకాలని ట్రంప్ తీవ్రంగా భావిస్తున్నారు. జెలెన్స్కీని తన దగ్గరకు రప్పించుకున్నప్పటికీ.. విమర్శించి పంపించారే తప్ప చర్చల్లో పురోగతి సాధించలేకపోయారు. ఆపై అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ను ఇరు దేశాలకు పంపించి దౌత్యం నడిపించారు కూడా. ఈ క్రమంలో ఇటు రష్యా డిమాండ్లకు తలొగ్గాలని ఉక్రెయిన్‌కు సూచించడంతో పాటు చర్చల్లో ఉక్రెయిన్ను భాగం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.పుతిన్ స్పందనట్రంప్ ఉంటే అసలు ఈ యుద్ధం జరిగేదే కాదు ట్రంప్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నానుఅమెరికా, రష్యా ప్రశాంతంగా మాట్లాడుకోవాలిజెలెన్స్కీ అభిప్రాయంఅమెరికా నాయకత్వంపై ఆశ ఉంది రష్యా దాడులు ఆగకపోతే శాంతి సాధ్యం కాదుట్రంప్–పుతిన్ చర్చల్లో ఉక్రెయిన్ ఉండాల్సిందేపుతిన్, ట్రంప్ చివరిసారిగా 2018 ఫిన్లాండ్ రాజధాని హెల్సెంకీలో భేటీ అయ్యారు. అలాగే దాదాపు పదేళ్ల తర్వాత పుతిన్ అమెరికాకు రానున్నారు. శాంతి చర్చల్లో ఈ ఇద్దరి భేటీ కీలకం కానుంది. అలాగే ఈ సమావేశం ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.తనను తాను శాంతికాముకుడిగా ప్రకటించుకున్న ట్రంప్.. ఇప్పటిదాకా పలు దేశాల మధ్య యుద్ధాలను ఆపానంటూ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ యుద్ధాన్ని కూడా ఆపేస్తాడా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే ఉక్రెయిన్ యుద్ధాన్ని తానే ఆపేస్తానంటూ మొదటి నుంచి ట్రంప్ చెబుతూ వస్తున్నారు. అయితే.. ట్రంప్ ఉక్రెయిన్ శాంతి చర్చల విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆర్థిక ఒత్తిడి, రాయబార చర్చలు, వ్యక్తిగత సంబంధాలు ద్వారా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. మూడు దేశాల మధ్య సహకారం, నమ్మకం, ప్రామాణిక చర్చలపైనే ఈ సంక్షోభం ముగియడం అనేది ఆధారపడి ఉంటుందన్నది విశ్లేషకుల మాట. -
అమెరికా తీరాలను తాకుతున్న సునామీ
-
అమెరికాను వణికించిన భూకంపం.. సునామీ హెచ్చరిక!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని అలస్కా సముద్ర తీరం భారీ భూకంపం కారణంగా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదు అయినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. అలాగే, సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. దీంతో, అధికారులు అప్రమత్తమన్నారు. ఇక, భూకంపానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వివరాల ప్రకారం.. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.37 గంటలకు అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతగా దీన్ని గుర్తించారు. 20.కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. స్యాండ్ పాయింట్ సిటీకి 87 కి.మీ దూరంలో దీని ఎపీసెంటర్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందస్తు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు.We got this incredible footage of today's earthquake from a resident in Sand Point, about 50 miles from the epicenter. We are grateful to those who shared their experiences -- it allows others to understand what an earthquake is like, and be better prepared. We are also grateful… pic.twitter.com/5tkqcbgp9Y— Alaska Earthquake Center (@AKearthquake) July 17, 2025 #BREAKING: Water levels have dropped significantly in the last 30 minutes near Raspberry Island, Alaska, following the M7.2 earthquake.This could be a sign of an incoming tsunami wave.#TsunamiWarning #Alaska #RaspberryIsland #Earthquake pic.twitter.com/nbK8cSKpil— upuknews (@upuknews1) July 16, 2025మరోవైపు.. యూఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అలస్కా, అలస్కా పెనిన్సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. గంట తర్వాత హెచ్చరికలను విరమించుకున్నారు. భూకంపాలు తరుచుగా వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలస్కా ఉంది. 1964 ఉత్తర అమెరికా ప్రాంతంలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక, 2023లో కూడా అలస్కాలో భూమి కంపించింది. అప్పుడు 7.2 తీవ్రతతో భూమి కంపించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. Receding waters ahead of the Alaska Tsunami pic.twitter.com/IEaF9UDCRS— Gpena (@SunPowerFusion) July 16, 2025🚨 BREAKING: Water is now receding along the Alaskan coast following the 7.3 earthquake, a clear sign a tsunami is approaching.Residents of Sand Point, Alaska have been ordered to EVACUATE IMMEDIATELY.The National Weather Service and U.S. Tsunami Warning Center have issued an… pic.twitter.com/tcg1GslJsV— Hank™ (@HANKonX) July 16, 2025 -
3,000 కొత్త కార్లు సముద్రంపాలు!
యాంకరేజ్: ఏకంగా 3,000 కొత్త కార్లతో చైనా నుంచి మెక్సికోకు బయల్దేరిన భారీ సరుకు రవాణా నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు మరింతగా విస్తరిస్తుండటతో నౌకను సిబ్బంది నడిసంద్రంలో వదిలేయాల్సి వచ్చింది. లైఫ్‌బోట్ సాయంతో 22 మంది సిబ్బందిని రక్షించగలిగారు. లండన్ కేంద్రంగా పనిచేసే జోడియాక్ మేరిటైమ్ సంస్థ ఈ ‘ది మార్నింగ్ మిడాస్’నౌకను నిర్వహిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికాలోని అలాస్కా రాష్ట్ర పరిధిలోని అడాక్ దీవి సమీపంలో ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు సమీపంలో ప్రయాణిస్తున్న కోస్కో హెలాస్ సరకు రవాణానౌకలోని సిబ్బంది అప్రమత్తమై మిడాస్ నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించారు. ఘటన జరిగినప్పుడు నౌకలో 800 కొత్త విద్యుత్ కార్లు సహా 3,000 కార్లు ఉన్నాయి. అగ్నికీలలను ఎలా అదుపులోకి తేవాలనే దానిపై జోడియాక్ సంస్థతో సంప్రతింపులు జరుపుతున్నామని అమెరికా తీరగస్తీ 17వ జిల్లా కమాండర్ రియర్ అడ్మిరల్ మెగాన్ డీన్ చెప్పారు. చైనాలో తయారైన ఈకార్లతో మే 26వ తేదీన నౌక బయల్దేరింది. మెక్సికోలోని లజారో కార్డెనాస్ నౌకాశ్రయానికి ఇది చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలో ఇలా అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. ఈ నౌకను 2006లో చైనాకు చెందిన నౌకాతయారీ సంస్థ తయారుచేసింది. ఈ నౌక బరువు ఏకంగా 46,800 టన్నులు. -
అమెరికాలో భారతీయురాలికి చేదు అనుభవం
వాషింగ్టన్: విదేశీ పర్యాటకులతో తరచూ అనుమాన, అవమానకర రీతిలో ప్రవర్తించిన అమెరికా దర్యాప్తు అధికారులు మరోమారు తమ బుద్ధిచూపించారు. వ్యాపార, వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న భారతీయ యువపారిశ్రామికవేత్త శ్రుతి చతుర్వేది పట్ల అలాస్కాలోని యాంకరేజ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా పురుష ఆఫీసర్‌తో ‘వ్యక్తిగత’తనిఖీలు చేయించారు. చలివాతా వరణంలో వెచ్చదనం కోసం ధరించిన అదన పు దుస్తులను విప్పించారు. కనీసం బాత్రూమ్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏకధాటిగా 8 గంటలపాటు తమ అ«దీనంలో నిర్బంధించి పలురకాల ప్రశ్నలతో వేధించారు. కనీసం సాయంకోసం ఎవరికీ ఫోన్‌చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు జరిగిన అవమానాన్ని శ్రుతి తర్వాత భారత్‌కు చేరుకున్నాక ‘ఎక్స్’సామాజిక మాధ్యమంలోని తన ఖాతాలో పోస్ట్‌చేశారు.పవర్ బ్యాంక్‌పై అనుమానంతో.. ‘‘ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినప్పుడు నా హ్యాండ్‌బ్యాగ్‌లో స్మార్ట్‌ఫోన్ పవర్‌బ్యాంక్ ఉంది. అదేదో కొత్తరకం వస్తువు అన్నట్లు దానిని పోలీసులు అనుమానంగా చూశారు. వెంటనే ఎఫ్‌బీఐ అధికారులను రప్పించి తనిఖీలు చేయించారు. తర్వాత నన్ను ఇష్టమొచ్చినట్లు, అర్థంపర్థంలేని ప్రశ్నలతో వేధించారు. వాస్తవానికి మహిళా ఆఫీసర్‌కు తనిఖీలు చేయాల్సిఉన్నా ఒక పురుష అధికారి వచ్చి నన్ను తనిఖీలు చేశాడు. విపరీతమైన చలికారణంగా ధరించిన వెచ్చటి దుస్తులను విప్పించాడు. ఏకధాటిగా 8 గంటలపాటు ఎటూ వెళ్లనివ్వలేదు. కనీసం బాత్రూమ్కు కూడా పోనివ్వలేదు. సాయం కోసం ఎవరికైనా ఫోన్ చేసుకోవడానికి వీల్లేకుండా ఫోన్, మనీ పర్సు లాక్కున్నారు. అన్ని రకాల తనిఖీలు చేసి చివరకు ఏమీ లేవని నిర్ధారించుకుని వదిలేశారు. నా ఖరీదైన లగేజీ బ్యాగ్‌ను వాళ్లే అట్టిపెట్టుకున్నారు. నా వస్తువులను బయటకుతీసి నాసిరకం వేరే బ్యాగులో కుక్కి ఇచ్చారు. భారత్‌కు ఆవల ఉన్నప్పుడు భారతీయులు శక్తిహీనులు అన్నట్లు అమెరికా పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు ప్రవర్తించారు’’అని శ్రుతి ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన పోస్ట్‌ను భారత విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు. ‘ఇండియా యాక్షన్ ప్రాజెక్ట్’, చర్చా వేదిక అయిన ‘ఛాయ్‌పానీ’లను శ్రుతి స్థాపించారు. మహిళను గంటల తరబడి అమెరికా అధికారులు వేధించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. 🛑 Shruti Chaturvedi, an entrepreneur from India🇮🇳, was held for eight hours at a US airport because of a power bank in her luggage that was deemed suspicious.#Ukraine #ShrutiChaturvedi #USA #Entrepreneur pic.twitter.com/2lrKWXRzPR— Dainik Shamtak Samachar (@DainikShaamTak) April 8, 2025 -
గల్లంతైన విమానం ఆచూకీ దొరికింది
అలాస్కా: అమెరికాలోని అలాస్కాలో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యమైంది. పైలట్ సహా అందులోని మొత్తం పది మందీ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం ఉనలక్లీట్ నుంచి టేకాఫ్ తీసుకున్న సింగిల్ ఇంజిన్ సెస్నా గ్రాండ్ కారవాన్ విమానం విమానం నోమ్ సమీపంలో గల్లంతైంది. అందులో పైలట్ సహా 10 మంది ప్రయాణికులున్నారు. మరో అరగంటలో ల్యాండవనుండగా రాడార్‌తో సంబంధం కోల్పోయింది. చిట్టచివరి లోకేషన్ ఆధారంగా హెలికాప్టర్‌తో అధికారులు గాలింపు చేపట్టి, గడ్డకట్టిన సముద్ర జలాల్లో శకలాలను కనుగొన్నారు. విమానంలో సాంకేతిక లోపం, ఇతర సమస్యలపై ప్రమాదానికి ముందు ఎలాంటి హెచ్చరికలు తమకు అందలేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రయాణించకుండానే విమానంలో నిద్రపోవచ్చు..!
భూమి నుంచి దూరంగా వెళ్లకుండా విమానంలో స్పెండ్ చేయడం గురించి విన్నారా..?. ఆ ఆలోచనే వెరైటీగా ఉంది కదూ..!. అలాంటి కోరిక ఉంటే వెంటనే ఉత్తర అమెరికాలో అలాస్కాకి వచ్చేయండి. శీతాకాలపు మంచు అందాల తోపాటు విమానంలో గడిపే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందామా..!ఆ వీడియోలో 1950ల నాటి విమానం(Airplane) వింటేజ్ డీసీ-6 విమానం విలక్షణమైన విమానహౌస్(Airplane House)గా రూపాంతరం చెందింది. ఇది ఒకప్పుడూ మారుమూల అలాస్కా(Alaska) గ్రామాలకు ఇంధనం, సామాగ్రిని సరఫరా చేసేది. ఇందులో రెండు బెడ్ రూమ్‌లు, ఒక బాత్రూమ్తో కూడిన వెకేషనల్ రెంటల్ హౌస్‌గా మార్చారు. చుట్టూ మంచుతో కప్పబడి ఉండే ప్రకృతి దృశ్యం మధ్యలో ప్రత్యేకమైన విమాన ఇల్లులో అందమైన అనుభూతి.ఇలా సర్వీస్ అయిపోయిన విమానాలను అందమైన టూరిస్ట్ రెంటల్ హౌస్‌లుగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని ప్రోత్సహించొచ్చు అనే ఐడియా బాగుంది కదూ..!. చూడటానికి ఇది ప్రయాణించకుండానే విమానంలో గడిపే ఓ గొప్ప అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. చెప్పాలంటే భూమి నుంచి దూరంగా వెళ్లకుండానే విమానంలో గడిపే ఫీలింగ్ ఇది. అయితే ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు వావ్ చాలా బాగుందని ఒకరూ, లోపల ఎలా ఉంటుందో చూడాలని యాంగ్జైటీగా ఉందని మరొకరూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ ప్రత్యేకమైన విమాన ఇంటిలో బస చేయాలంటే ఒక్క రాత్రికి సుమారు రూ. 30 వేలు పైనే ఖర్చువుతుందట. View this post on Instagram A post shared by DEBORAH + TYLER | Alaska Adventures (@raarupadventures) (చదవండి: భారతదేశపు తొలి స్టంట్ విమెన్..ధైర్యానికి కేరాఫ్ అడ్రస్..!) -
అలాస్కాలో అమెరికా చివరి ఓటరు
ఎటు చూసినా మంచు. గడ్డి తప్పించి నిలబడటానికి ఒక్క చెట్టు కూడా పెరగడానికి అనుకూలంగాకాని మైదాన ప్రాంతాలు. ఎవరికీ పట్టని అమెరికా చిట్టచివరి ప్రాంతంగా మిగిలిపోయిన అలాస్కా గురించి మళ్లీ వార్తలు మొదలయ్యాయి. గత 12 సంవత్సరాల ప్రజాస్వామ్య సంప్రదాయానికి మళ్లీ అక్కడి ఓటర్లు సిద్ధమవడమే ఇందుకు కారణం. అమెరికా పశి్చమ దిశలో చిట్టచివరి పోలింగ్ కేంద్రం ఈ టండ్రా ద్వీపంలోనే ఉంది. అడాక్ ద్వీప ప్రజలు గతంలో మెయిల్ ద్వారా ఓటు పంపించే వారు. 2012 అమెరికా ఎన్నికలప్పుడు మేం కూడా అందరిలా స్వయంగా పోలింగ్‌కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటామని ఉత్సాహం చూపారు. దాంతో అమెరికా ప్రభుత్వం ఇక్కడ తొలిసారిగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి ప్రధాన ఓటర్ల జాబితాలో ఇక్కడి వాళ్లంతా చేరిపోయారు. ‘‘మా నగర వాసులం చిట్టచివర్లో ఓటేస్తాం. ఓటింగ్ సరళిని బట్టి ఆలోపే దాదాపు విజేత ఎవరో తెల్సేవీలుంది. అయినాసరే చివర్లో ఓటేస్తున్నామన్న ఉత్సాహం మాలో రెట్టిస్తుంది. ఆ రోజు మాకందరికీ ప్రత్యేకమైన రోజు. మేం ఓటేసేటప్పటికి అర్ధరాత్రి దాటి సమయం ఒంటిగంట అవుతుంది’’అని సిటీ మేనేజర్ లేటన్ లాకెట్ చెప్పారు. అమెరికా చిట్టచివరి భూభాగం అలాస్కా ప్రాంతం అగ్రరాజ్యానికి ప్రత్యేకమైనది. గతంలో రష్యా అ«దీనంలో ఉండేది. ఎందుకు పనికిరాని భూభాగంగా భావించి చాన్నాళ్ల క్రితం అమెరికాకు అమ్మేసింది. ఇటీవలికాలంలో ఇక్కడ చమురు నిక్షేపాలు బయటపడటంతో ఈ ప్రాంతమంతా ఇప్పుడు బంగారంతో సమానం. అత్యంత విలువైన సహజవనరులతో అలరారుతోంది. చిట్టచివరి పోలింగ్ కేంద్రాలున్న అడాక్ ద్వీపం నిజానికి అలేటియన్ ద్వీపాల సముదాయంలో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన బేరింగ్ నది ఈ ద్వీపసముదాయాలకు ఉత్తరదిశలో ఉంటుంది. దక్షిణ దిశలో పసిఫిక్ మహాసముద్ర ఉత్తరప్రాంతం ఉంటుంది. అమెరికా ఈ ద్వీపాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో స్థావరంలా ఉపయోగించుకుంది. తర్వాత నేవీ స్థావరంగా అభివృద్ధిచేసింది. ‘‘ఇక్కడ చివరిగా ఓటేసింది నేనే. 2012లో మిట్ రోమ్మీపై బరాక్ ఒబామా బరిలోకి దిగి గెలిచిన విషయం మాకు మరుసటి రోజు ఉదయంగానీ తెలీలేదు’అని 73 ఏళ్ల మేరీ నెల్సన్ చెప్పారు. గతంలో అక్కడ పోలింగ్ సిబ్బందిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం వాషింగ్టన్ రాష్ట్రానికి మారారు. అలాస్కా ఆవల ఉన్న గ్వామ్, మేరియానా ద్వీపాలు, అమెరికన్ సమోవా వంటి ద్వీపాల్లో ప్రజలు ఉన్నా వారిని ఓటర్లుగా గుర్తించట్లేరు. దీంతో చివరి ఓటర్లుగా అలాస్కా ఓటర్లు చరిత్రలో నిలిచిపోయారు. రెండో ప్రపంచయుద్ధ స్థావరం ఎక్కువ రోజులు మంచును చవిచూసే అలాస్కా గతంలో యుద్ధాన్ని చవిచూసింది. రెండో ప్రపంచయుద్దకాలంలో జపాన్ అ«దీనంలోని అటూ ద్వీపాన్ని ఆక్రమించేందుకు అమెరికా తన సేనలను ఇక్కడికి పంపింది. 1942 ఆగస్ట్‌లో సేనలు ఇక్కడికొచ్చి సైనిక శిబిరాల నిర్మాణం మొదలెట్టాయి. దీంతో శత్రుదేశ విమానాలు ఇక్కడ 9 భారీ బాంబులను జారవిడిచాయి. 1943 మేలో 27,000 మంది అమెరికా సైనికులు ఇక్కడికి చేరుకున్నారు. మెషీన్ గన్లమోతలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ప్రాంతంపై మక్కువతో రచయితలు డాషిల్ హామెట్, గోరే విడల్ కొన్నాళ్లు ఇక్కడే ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్డ్, బాక్సింగ్ ఛాంపియన్ జో లెవీస్, పలువురు హాలీవుడ్ తారలు తరచూ ఇక్కడికి వచి్చపోతుంటారు. 33 వృక్షాల జాతీయవనం ! అలాస్కాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు భారీ వృక్షాల ఎదుగుదలకు సరిపడవు. దీంతో ఇక్కడ గడ్డి, చిన్న మొక్కలు తప్పితే వృక్షాలు ఎదగవు. ఇక్కడ చెట్లు పెంచి అడవిని సృష్టించాలని అమెరికా ప్రభుత్వం 1943–45కాలంలో ఒక ప్రయత్నంచేసింది. చివరికి చేసేదిలేక చేతులెత్తేసింది. అప్పటి ప్రయత్నానికి గుర్తుగా 1960లలో అక్కడి 33 చెట్ల ముందు ఒక బోర్డ్ తగిలించింది. ‘‘మీరిప్పుడు అడాక్ జాతీయ వనంలోకి వచ్చి వెళ్తున్నారు’అని దానిపై రాసింది. నేవీ బేస్ ఉన్నంతకాలం 6,000 మందిదాకా జనం ఉండేవారు. తర్వాత ఇక్కడ ఉండలేక చాలా మంది వలసవెళ్లారు. 2020 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 171 మంది ఉంటున్నారు. 2024 అనధికార గణాంకాల ప్రకారం ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నది కేవలం 50 మంది మాత్రమే. కనీసం పది మంది విద్యార్థులయినా వస్తే స్కూలు నడుపుదామని నిర్ణయించుకున్నారు. ఎలాగోలా గత ఏడాది ఆరుగురు విద్యార్థులతో స్కూలు మొదలుపెట్టారు. తీరా గత ఏడాది నవంబర్‌కు వచ్చేసరికి ఐదుగురు మానేశారు. ఇప్పుడు అక్కడ ఒకే విద్యార్థి ఉన్నారని అలేటియన్ రీజియన్ స్కూల్ డిస్ట్రిక్ సూపరింటెండెంట్ మైక్ హన్లీ చెప్పారు. ‘‘జనం వెళ్లిపోతున్నారు. చివరికి ఎవరు మిగులుతారో. ఈసారి చివరి ఓటు ఎవరేస్తారో చూడాలి’అని అడాక్ సిటీ క్లర్క్ జేన్ లికనాఫ్ చెప్పారు. – యాంకరేజ్(అమెరికా) -
ప్రపంచాన్ని వణికించిన 10 భూకంపాలు
భూకంపం.. నివారించడం సాధ్యం కాని పెనువిపత్తు. దీనికి జాగ్రత్త, అప్రమత్తత ఒక్కటే పరిష్కారం. ముందస్తుగా సన్నద్ధం కావడం వల్ల భూకంపాలు వంటి విపత్తుల వల్ల కలిగే వినాశనం నుంచి కొంత వరకు కాపాడుకోవచ్చు. ఆఫ్రికాలోని మొరాకోలో సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి సంభవించిన విధ్వంసకర భూకంపం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ భూకంపం కారణంగా రెండు వేల మందికి పైగా ప్రజలు మరణించినట్లు నిర్ధారించారు. మొరాకో కంటే ముందుగా ప్రపంచంలోని అనేక దేశాలలో భూకంపాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు మనం ప్రపంచంలో సంభవించిన పది భారీ భూకంపాల గురించి తెలుసుకుందాం. 1. ప్రిన్స్ విలియం సౌండ్, అలాస్కా 1964, మార్చి 28న అమెరికాలోని అలాస్కాలో సంభవించిన భూకంప తీవ్రత 9.2గా అంచనా వేశారు. ఆ సమయంలో కెనడా సహా పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో భూమి సుమారు మూడు నిమిషాల పాటు కంపించింది. 250 మందికిపైగా ప్రజలు మరణించగా, వేల మంది గల్లతయ్యారు. 2. వాల్డివియా, చిలీ 1960, మే 22న చిలీలో సంభవించిన భూకంపం 1655 మందిని సమాధి చేసింది. సుమారు మూడు వేల మంది క్షతగాత్రులయ్యారు. భూకంపం కారణంగా దాదాపు రెండు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. విపత్తు కారణంగా చిలీ సుమారు 550 అమెరికా మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. భూకంప తీవ్రత 9.5గా నమోదైంది. 3. గుజరాత్, భుజ్ 2001లో భారతదేశంలోని గుజరాత్‌లోని భుజ్‌లో సంభవించిన భూకంప తీవ్రత 7.7గా అంచనా వేశారు. ఈ భూకంపం కారణంగా నగరం మొత్తం శిథిలాల కుప్పగా మారిపోయింది. కచ్, భుజ్లలో ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భూకంపం కారణంగా 1.5 లక్షల మందికి పైగా ప్రజలు నష్టపోయారు. 4. పాకిస్తాన్, క్వెట్టా 2005, అక్టోబర్ 8న పాకిస్తాన్‌లోని క్వెట్టాలో సంభవించిన భూకంపంలొ 75 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 80 వేల మంది గాయపడ్డారు. ఈ భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. 5. ఇండోనేషియా, సుమత్రా 2012 ఏప్రిల్ 11న ఇండోనేషియాలోని సుమత్రాలో సంభవించిన భూకంప తీవ్రత 8.6గా నమోదైంది. ఈ భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ భూకంపంలో 2,27,898 మంది మరణించారు. 6. జపాన్, ఫుకుషిమా 2011 మార్చి 11న జపాన్‌లోని ఫుకుషిమాలో సంభవించిన భూకంపంలొ 18 వేల మందికి పైగా మరణించారు. ఆ సమయంలో జపాన్ విపత్తులను ఎదుర్కొంటోంది. భూకంపం వచ్చిన వెంటనే జపాన్‌లో సునామీ సంభవించింది, ఇది కొన్ని మిలియన్ల ప్రజలను ప్రభావితం చేసింది. 7. ఫ్రాన్స్, హైతీ 2019 జనవరి 13న ఫ్రాన్స్‌లోని హైతీలో సంభవించిన భూకంప తీవ్రత 7.0గా నమోదయ్యింది. ఈ భూకంపంలో దాదాపు 3 లక్షల 16 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో భూకంపం కారణంగా 80 వేల భవనాలు ధ్వంసమయ్యాయి. 8. నేపాల్ 2015, ఏప్రిల్ 25న సంభవించిన భూకంపం ఎనిమిది వేల మంది ప్రాణాలను బలిగొంది. భూకంప తీవ్రత 8.1గా నమోదయ్యింది. ఈ భూకంప ప్రకంపనలు భారతదేశం, దాని పొరుగు దేశాలలో కూడా కనిపించాయి. 9. దక్షిణ అమెరికా, చిలీ 1060 మే 22న చిలీలో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 9.5గా నమోదైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన భూకంపంగా పరిగణిస్తారు. ఈ ఘటనలో సుమారు ఎనిమిది లక్షల మంది మరణించారు. 10. దక్షిణ ఆఫ్రికా, మొరాకో 2023, సెప్టెంబరు 8న ఆఫ్రికాలోని మొరాకోలో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అయితే ఈ గణాంకాలు ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు. ఇది కూడా చదవండి: తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? -
అలస్కాలో పగిలిన హిమానీనదం.. కేదార్నాథ్ విపత్తును తలపించేలా..
అమెరికాలోని అలస్కాలో ఒక నది ప్రవహిస్తుంటుంది. దాని పేరు మెండెన్‌హాల్. ఇదే పేరుతో హిమానీనదం(అతి పెద్ద మంచు దిబ్బ) ఉంది. ఇది జనెవు నగరానికి సమీపంలో కొండల నడుమ ఉంది. ఇక్కడ ఈ హిమానీనదం కారణంగా ఒక సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు గుండా నది ప్రవహిస్తుంటుంది. సరస్సుకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడ్డుకట్టు తెగిపోవడంతో నదికి హఠాత్తుగా వరద పోటెత్తింది. ఫలితంగా ఉపద్రవం ముంచుకొచ్చింది. ఇది 2013లో మనదేశంలోని కేదార్‌నాథ్‌లో సంభవించిన విపత్తును తలపించేలా ఉంది. జనెవు నగర డిప్యూటీ సిటీ మేనేజర్ రాబ్ బర్న్ ఈ విపత్తుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. మెండెన్‌హాల్ నదికి అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా పలు రోడ్లు నీట మునిగాయి. రెండు భవనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు నిరాశ్రయులయ్యారు. కొందరు వరదల్లో కొట్టుకుపోయారు. పలు భవనాలు ప్రమాదం అంచున ఉన్నాయి. నదీ తీరప్రాంతమంతా కోతకు గురయ్యింది. దీంతో అక్కడ ముప్పు మరింతగా పెరిగింది. నది నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వృక్షాలతో పాటు మట్టికూడా కొట్టుకువస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించామని రాబ్ బర్న్ తెలిపారు. కాగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఈ హిమానీనదం గురించి పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఈ హిమానీనదం పగిలిపోయే అవకాశాలు ఒక శాతం మాత్రమే ఉన్నాయని చెబుతూవస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ విపత్తు సంభవించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదన్నారు. ఇది గ్లోబల్ వార్మింగ్ పరిణామాలను సూచిస్తున్నదన్నారు. జనెవుకు చెందిన శామ్ నోలన్ ఈ నది ఒడ్డున ఒక భవనం పడిపోతున్న దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. నదిలోని నీరు ఉధృతంగా రావడానికి తోడు, నదిలోని మట్టి కోతకు గురి కావడంతో భవనం అమాంతం కూలిపోయిందన్నారు. ప్రకృతి ప్రకోపాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన తెలిపారు. ఈ వరదల కారణంగా పలు రోడ్లు తెగిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇది కూడా చదవండి: డాక్టర్ vs పేషెంట్.. ఏది న్యాయం? ఏది అన్యాయం? -
గజాలు,ఎకరాల్లో కాదు..కిలోమీటర్లలో భూ కొనుగోళ్లు!
వివిధ దేశాలు, దీవులను కొన్న దేశాలు సాధారణంగా ఎక్కడైనా భూమిని చదరపు అడుగులు, చదరపు గజాలు లేదా ఎకరాల్లో కొంటారని అందరికీ తెలుసు. కానీ కొన్ని దేశాలు ద్వీపాలు లేదా వేరే దేశాలను కొనుగోలు చేశాయని తెలుసా? దాదాపు 20 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌ల్యాండ్‌ను కొనేందుకు అమెరికా పలుమార్లు విఫలయత్నం చేసిందని తెలుసా? అలా దేశాలను లేదా ద్వీపాలను ఇతర దేశాలు కొనాల్సిన అవసరం.. దాని వెనకున్న ఉద్దేశమేంటి? అందుకు ఎంత వెచ్చించాయి. ఇలాంటి వెరైటీ భూకొనుగోళ్లలో కొన్నింటి గురించి క్లుప్తంగా... అలాస్కా ఉత్తర అమెరికా ఖండం ఎగువ భాగాన 17 లక్షల చ.కి.మీ.పైగా విస్తీర్ణం మేర విస్తరించిన ఈ ప్రాంతాన్ని అమెరికా 1867లో రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అప్పటి రష్యన్ చక్రవర్తి కేవలం 72 లక్షల డాలర్లకు ఈ ప్రాంతాన్ని అమ్మేశాడు. అమెరికా కొనుగోలు చేసిన అతిస్వల్పకాలంలోనే అలాస్కాలో అత్యంత విలువైన బంగారు గనులు బయటపడ్డాయి. అంతేకాదు.. ఆపై చమురు నిక్షేపాలతోపాటు అనేక ఖనిజాలు లభించాయి. ఇప్పుడు అలస్కాలో ఏటా 8 కోట్ల టన్నుల చమురును అమెరికా వెలికితీస్తోంది. సింగపూర్ బ్రిటన్ 1819లో సింగపూర్‌ను కొన్నది. ఈస్టిండియా కంపెనీ వాణిజ్య అవసరాల కోసం మలేసియాలోని జోహర్ రాజ్యం నుంచి సింగపూర్‌ను కొనుగోలు చేసింది. దీనికోసం జోహర్ సుల్తాన్ హుస్సైన్షాకు ఏడాదికి 5,000 స్పెయిన్ డాలర్లు అదే రాజ్యానికి సైన్యాధికారి అయిన అబ్దుల్ రహమాన్‌కు 3,000 డాలర్లు ఇచ్చేట్లు బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా బ్రిటన్ సింగపూర్‌ను వదుకోవాల్సి వచ్చింది. తిరిగి మలేసియాలో భాగమైన సింగపూర్ 1965లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఫ్లోరిడా బ్రిటన్ సింగపూర్‌ను కొనుగోలు చేసిన 1819లోనే అక్కడ అమెరికా ఫ్లోరిడాను స్పెయిన్ నుంచి కొన్నది. దీనికోసం అమెరికా కేవలం 50 లక్షల డాలర్లను వెచ్చించింది. 1845లో ఫ్లోరిడా అమెరికా 27వ రాష్ట్రంగా అవతరించింది. ఫిలిప్పైన్స్ సుదీర్ఘ పోరాటం తరువాత స్వాతంత్య్రం సాధించిన ఫిలిప్పైన్స్‌ను ఒకప్పుడు స్పెయిన్ నుంచి అమెరికా కొనుగోలు చేసింది. 1898లో ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా 2 కోట్ల డాలర్లు వెచ్చించి అమెరికా ఫిలిప్పైన్స్‌ను సొంతం చేసుకుంది. గ్వదర్ బలూచిస్తాన్ రాష్ట్రంలో భాగమైన ఈ తీరప్రాంత పట్టణాన్ని పాకిస్తాన్ 1958లో ఒమన్ నుంచి కొనుగోలు చేసింది. దీనికోసం 550 కోట్ల పాకిస్తాన్ రూపాయలను వెచ్చించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా గ్వదర్ పోర్టును పాకిస్తాన్ 2013లో చైనాకు అప్పగించింది. అప్పట్లో ఈ పోర్టు విలువను 4,600 కోట్ల డాలర్లుగా విలువ కట్టారు. వర్జిన్ ఐలాండ్స్ అమెరికా 1917లో డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐల్యాండ్స్‌ను కొనుగోలు చేసింది. దీనికోసం 2.5 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని అమెరికా డెన్మార్క్‌కు అప్పగించింది. అప్పట్లోనే 10 కోట్ల డాలర్లతో గ్రీన్‌ల్యాండ్‌ను కూడా కొంటామని అమెరికా ప్రతిపాదించినా డెన్మార్క్ అంగీకరించలేదు. 1867 నుంచి 2019 వరకు అమెరికా పలుమార్లు గ్రీన్‌ల్యాండ్‌ను కొనే ప్రయత్నాలు చేసింది. కానీ గ్రీన్‌ల్యాండ్‌పై సార్వభౌమాధికారంగల డెన్మార్క్ మాత్రం ఈ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తోంది. ఆఖరి కొనుగోలు ప్రపంచంలో ఇతర దేశాలను లేదా ప్రాంతాలను కొనుగోలు చేసే ప్రక్రియ చివరగా సౌదీ అరేబియా ఈజిప్టు మధ్య జరిగింది. 2017లో ఎర్ర సముద్రంలోని రెండు చిన్నదీవులైన టీరన్, సనఫిర్లను సౌదీకి అప్పగించేందుకు ఈజిప్టు అంగీకరించింది. దీనికోసం 2 కోట్ల అమెరికన్ డాలర్లను సాయంగా ఇచ్చేందుకు సౌదీ ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటికీ ఈజిప్టు పౌరులు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కట్నంగా నాటి బొంబాయి ప్రస్తుత ముంబై ఒకప్పటి బొంబాయిని బ్రిటన్ రాజు చార్లెస్–2 కట్నంగా పొందారు. ప్రస్తుత ముంబైలో ఉన్న అనేక ప్రాంతాలు, ద్వీపాలు అప్పట్లో పోర్చుగీసు రాజ్యం అదీనంలో ఉండేవి. చార్లెస్–2 పోర్చుగీసు యువరాణి కేథరీన్ను పెళ్లి చేసుకున్నందుకు కట్నంగా కింగ్ జాన్–4 బొంబాయిని కట్నంగా రాసిచ్చారు. అప్పట్లో పోర్చుగీసు వాళ్లు బొంబాయిని బోమ్బెహియాగా పిలిచేవారు. తరువాత ఆంగ్లేయులు బాంబేగా మార్చారు. కట్నంగా పొందిన బొంబాయిని చార్లెస్... బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా కంపెనీకి అప్పగించారు. నటోవతు ద్వీపం 2014లో ఫిజికి చెందిన నటోవతు అనే దీవిలో 5,000 ఎకరాలను కిరిబటి రిపబ్లిక్ 87 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. రానున్న రోజుల్లో సముద్ర మట్టాలు పెరిగితే తమ దేశం మునిగిపోతుందని ముందుజాగ్రత్త చర్యగా కిరిబటి తన జనాభా సంరక్షణ కోసం ఈ భూమిని కొనుగోలు చేసింది. అమ్మకానికి మరెన్నో దీవులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మానవరహిత దీవులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మాదిరిగానే దీవుల అమ్మకం, కొనుగోళ్ల కోసం ఏజెంట్లు, ఆన్లైన్ వెబ్సైట్లు కూడా సేవలు అందిస్తున్నాయి. ధనవంతులు వెకేషన్ల కోసం ఇలాంటి దీవుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రదేశాన్ని బట్టి వాటి రేట్లు ఉంటాయి. మధ్య అమెరికాలో కొంత తక్కువగా... యూరప్ కొంత ఎక్కువగా ఈ దీవుల రేట్లు ఉన్నాయి. ప్రైవేట్ ఐలాండ్స్ వంటి ఆన్లైన్ వెబ్సైట్ల ప్రకారం దక్షిణ అమెరికాలో అతితక్కువగా మన కరెన్సీలో రూ. 5 కోట్లుగా ఓ దీవి విలువ ఉంటే యూరప్‌లో రూ. 7 కోట్లకు ఎంచక్కా దీవిని సొంతం చేసుకోవచ్చు. ఎందరో హాలీవుడ్ స్టార్లతోపాటు బాలీవుడ్ స్టార్లు ఇలాంటి దీవులను కొనుగోలు చేశారు. షారుక్‌ఖాన్ దుబాయ్ సమీపంలో 70 కోట్ల డాలర్లకు ఓ దీవిని సొంతం చేసుకోగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పాప్‌సింగర్ మీకా కూడా దీవులు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. 30 భద్రత, ఆర్థిక లేదా వాణిజ్య అవసరాల కోసం ఓ దేశం మరో దేశాన్ని మొత్తంగా లేదా కొంత భాగాన్ని కొన్న ఉదంతాలు -
7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
అలస్కాను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో యూఎస్‌లోని పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భూకంప తీవ్రత భూమిలోపల 9.3 కిలోమీటర్ల మేర సంభవించినట్లు పేర్కొన్నారు. అలస్కా ద్వీపకల్పంతో సహా అలూటియన్ దీవులు, కుక్ ఇన్లెట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. కాగా.. ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఇప్పుడే అంచనా వేయలేమని వెల్లడించారు. అలస్కా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో భాగంగా ఉంది. తరచూ భూకంపాలకు నిలయంగా మారుతోంది. Notable quake, preliminary info: M 7.4 - 106 km S of Sand Point, Alaska https://t.co/ftepDWDKb7 — USGS Earthquakes (@USGS_Quakes) July 16, 2023 అలస్కాలో చివరిసారిగా అత్యధికంగా 1964లో 9.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. అలస్కా ద్వీపకల్పం, యూఎస్ పశ్చిమ తీరం, హవాలీని సునామీ అతలాకుతలం చేసింది. 250 మందికి పైగా ప్రాణనష్టం జరిగింది. ఇదీ చదవండి: America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!
ఏ దేశంలోని రోడ్లయినా వివిధ ప్రాంతాలను కలుపుతాయనే విషయం మనకు తెలిసిందే. వివిధ రోడ్లపై ప్రయాణించడం ద్వారా మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవచ్చు. అయితే కొన్ని రోడ్లు చిన్నవిగా, మరికొన్ని రోడ్లు పెద్దవిగా ఉండటాన్ని మనం గమనించేవుంటాం. మనదేశంలోని అతిపెద్ద రోడ్డు విషయానికివస్తే అది నేషనల్ హైవే-44. ఇది 3,745 కిలోమీటర్ల దూరం కలిగివుంది. ఇది కన్యాకుమారితో మొదలై శ్రీనర్ వరకూ ఉంటుంది. అయితే ప్రపంచంలో దీనికి మించిన అతిపెద్ద హైవే ఉందని, దానిపై ప్రయాణిస్తే ఏకంగా 14 దేశాలు చుట్టేయచ్చనే సంగతి మీకు తెలుసా? ఉత్తర అమెరికా- దక్షిణ అమెరికాలను కలిపే పాన్ అమెరికా హైవే ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి. అలస్కాలో మొదలై అర్జెంటీనా వరకూ ఈ రహదారి కొనసాగుతుంది. రెండు మహా ద్వీపాలను అనుసంధానించే ఈ సింగిల్ రూట్ నిర్మాణానికి 1923లో తొలి అడుగు పడింది. ఈ హైవేను మొత్తం 14 దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ రహదారిలోని 110 కిలోమీటర్ల ఒక భాగం నిర్మాణం ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఈ భాగాన్ని డారియన్ గ్యాప్ అని అంటారు. ఇది పనామా కొలంబియాల మధ్య ఉంది. కాగా ఈ డారియన్ గ్యాప్ ప్రాంతం కిడ్నాప్‌లు, డ్రగ్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్ తదితర అక్రమ కార్యకలాపాలకు నిలయంగా మారింది. దీంతో జనం ఈ మార్గాన్ని దాటేందుకు బోటు లేదా ప్లెయిన్ మాధ్యమంలో బైపాస్ చేస్తారు. చదవండి: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. భార్య కోసం ఇండియా నుంచి యూరప్‌కు సైకిల్‌పై ఆ 14 దేశాలు ఇవే.. 1. యునైటెడ్ స్టేట్స్ 2.కెనడా 3. మెక్సికో 4. గ్వాటెమాల 5. ఎల్ సల్వడార్ 6.హోండురాస్ 7. నికరాగ్వా 8. కోస్టా రికా 9.పనామా 10.కొలంబియా 11. ఈక్వెడార్ 12. పెరూ 13.చిలీ 14. అర్జెంటీనా ప్రయాణానికి ఎంత సమయం పడుతుందంటే... ఎవరైనా ప్రతీరోజూ సుమారు 500 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలిగితే వారు 60 రోజుల్లో ఈ రహదారి ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. కార్లెస్ సాంటామారియా అనే సైకిలిస్టు ఈ రహదారిని 177 రోజుల్లో చుట్టివచ్చాడు. ఈ నేపధ్యంలో అతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఈ రహదారి మొత్తం పొడవు 48 వేల కిలోమీటర్లు. The Pan-American highway is the longest highway in the world. This road is about 19.000 miles/30.000km long #nowyouknow #FridayThoughts pic.twitter.com/oRdBTMhFRD — 🇺🇦Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) November 6, 2020 -
గడ్డకట్టిన సముద్రం మీదుగా 150 మైళ్ల ప్రయాణం..నెల తర్వాత ఇంటికి..
అలాస్కా: ఏడాది వయస్సు ఆ్రస్టేలియన్ షెపర్డ్ కుక్క పిల్ల పేరు ననుక్. దీని సాహసం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. యజమాని కుటుంబంతోపాటు టూర్‌కెళ్లి తప్పిపోయింది. గడ్డకట్టిన బేరింగ్ సముద్రం మీదుగా 150 మైళ్లు ప్రయాణించింది. మధ్యలో సీల్స్, మంచు ఎలుగుబంట్ల దాడిలో గాయపడింది. చివరికి నెల తర్వాత అలాస్కాలోని గాంబెల్లో యజమాని మాండీ ఇవోర్రిగన్ ఇంటికి చేరుకుంది. మాండీ కుటుంబం గత నెలలో బేరింగ్ జలసంధిలోని సెంట్ లారెన్స్ దీవిలో సవూంగా ప్రాంతానికి వెళ్లింది. అక్కడే మాండీ కుటుంబానికి చెందిన ననుక్, స్టార్‌లైట్ అనే కుక్కలు తప్పిపోయాయి. కొద్ది రోజులకు స్టార్‌లైట్ ఇంటికి చేరుకుంది. కానీ, ననుక్కు దారి దొరకలేదు. సోషల్ మీడియాలో ననుక్ గురించి మాండీ కుటుంబం పోస్టులు పెట్టింది. చివరికి అక్కడికి 150 మైళ్ల దూరంలోని వేల్స్లో ఉన్నట్లు తెలిసింది. విమానయాన సంస్థల సహకారంతో ననుక్ను సొంతూరికి రప్పించారు. శరీరంపై కొద్దిపాటి గాయాలే తప్ప మొత్తమ్మీద ఆరోగ్యంగా ఉన్న ననుక్ను చూసి మాండీ కుటుంబంలోని చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే, ననుక్ అంతదూరం ప్రయాణించడం మాత్రం మిస్టరీయేనని కుటుంబీకులు చెబుతున్నారు. చదవండి: ఈకల్లో విషం.. తాకితే మరణం.. రెండు రకాల విషపూరిత పక్షులను గుర్తించిన సైంటిస్టులు -
అమెరికా గగనతలంలో మరో బెలూన్ కలకలం
వాషింగ్టన్: చైనా భారీ నిఘా బెలూన్ను అమెరికా కూల్చేసిన ఘటన మరువకముందే అగ్రరాజ్యంలో మరో గగనతల ఉల్లంఘన ఉదంతం చోటుచేసు కుంది. అలాస్కాలో కారు పరిమాణంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఒక వస్తువును కూల్చేశామని వైట్‌హౌస్ తెలిపింది. ‘పౌర విమానాల రాకపోకలకు కాస్తంత విఘాతం కల్గించేదిగా ఉన్న వస్తువును కూల్చేశాం. శిథిలాలను వెతికే పనిలో ఉన్నాం’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ చెప్పారు. ‘ 40వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న వస్తువును 24 గంటలపాటు నిశితంగా పరిశీలించాక అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలమేరకు యుద్ధవిమానం కూల్చేసింది. అది గడ్డ కట్టిన అమెరికా సముద్రజలాల్లో పడింది’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి కోఆర్డినేటర్ (వ్యూహాత్మక కమ్యూనికేషన్స్) జాన్ కిర్బీ మీడియాతో చెప్పారు. ‘‘ఇటీవల కూల్చేసిన చైనా నిఘా బెలూన్‌కు స్వయం నియంత్రణ, గమన వ్యవస్థ ఉన్నాయి. సున్నిత సైనిక స్థావరాలపై నిఘా పెట్టింది. కానీ ఈ వస్తువు ఏం చేసిందనేది ఇంకా తెలియదు’’ అని ఆయన అన్నారు. -
అలుపెరుగని బాటసారి.. 11 రోజులు నాన్–స్టాప్ జర్నీ.. ప్రపంచ రికార్డు
సిడ్నీ: పొడవైన ముక్కు, పొడవైన కాళ్లతో చూడగానే ఆకట్టుకొనే గాడ్విట్ పక్షి ఒకటి (శాస్త్రీయ నామం లిమోసా ల్యాపోనికా) అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికాలోని అలాస్కా నుంచి ఆస్ట్రేలియాకు చెందిన ఈశాన్య టాస్మానియా ద్వీపంలోని అన్సాన్స్ బే వరకూ 11 రోజుల్లో 8,425 మైళ్లు (13,558.72 కిలోమీటర్లు) ప్రయాణించింది. ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా ప్రయాణం సాగించడం గమనార్హం. కేవలం ఐదు నెలల వయసున్న ఈ మగ పక్షి (234684) ఈ నెల 13వ తేదీన అలాస్కా నుంచి బయలుదేరింది. ఓషియానియా, వనౌతు, న్యూ కాలెడోనియా తదితర ద్వీపాల గగనతలం నుంచి ప్రయాణం సాగించింది. ఈ నెల 24వ తేదీన అన్సాన్స్ బే ప్రాంతంలో కాలుమోపింది. సరిగ్గా చెప్పాలంటే 11 రోజుల ఒక గంట సమయంలో అలుపెరుగని తన ప్రయాణాన్ని పూర్తిచేసింది. ఈ పక్షికి సైంటిస్టులు 234684 అనే ఒక నంబర్ ఇచ్చారు. అలాస్కాలో పలు గాడ్విట్ పక్షులకు 5జీ శాటిలైట్ ట్యాగ్లు అమర్చి గాల్లోకి వదిలారు. వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించారు. మిగతా పక్షులకంటే 234684 నంబర్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించినట్లు తేల్చారు. నాన్–స్టాప్‌గా గాల్లో దూసుకెళ్తూ 11 రోజుల ఒక గంటలో టాస్మానియాకు చేరుకుందని న్యూజిలాండ్‌లోని పుకొరోకొరో మిరండా షోర్బర్డ్ సెంటర్ ప్రకటించింది. నీటిపై వాలితే మృత్యువాతే గాడ్విట్ పక్షులు వలసలకు పెట్టింది పేరు. ప్రతిఏటా వేసవిలో టాస్మానియాకు చేరుకుంటాయి. అక్కడ సంతతిని వృద్ధి చేసుకొని యూరప్ దేశాలకు తిరిగి వస్తుంటాయి. 2021లో 4బీబీఆర్‌డబ్ల్యూ అనే గాడ్విట్ మగ పక్షి 8,108 మైళ్లు(13,050 కిలోమీటర్లు) నాన్–స్టాప్‌గా ప్రయాణించింది. ఇప్పటిదాకా ఇదే రికార్డు. ఈ రికార్డును 234684 పక్షి బద్దలుకొట్టింది. ఇది 11 రోజుల ప్రయాణంలో సగంబరువును కోల్పోయి ఉంటుందని టాస్మానియాలోని పక్షి శాస్త్రవేత్త ఎరిక్ వోహ్లర్ చెప్పారు. ఈ రకం పక్షులు నీటిపై వాలలేవని, ఒకవేళ వాలితే చనిపోతాయని తెలిపారు. ఎందుకంటే వాటి కాలి వేళ్లను కలుపుతూ చర్మం ఉండదని వెల్లడించారు. గాట్‌విట్ జాతి పిట్టల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి. అవి బార్–టెయిల్డ్ గాడ్విట్, బ్లాక్–టెయిల్డ్ గాడ్విట్, హడ్సోనియన్ గాడ్విట్, మార్బ్ల్డ్ గాడ్విట్. పొడవైన ముక్కును సముద్ర తీరాల్లోని ఇసుకలోకి దూర్చి అక్కడున్న పురుగులు, కీటకాలను తింటాయి. -
అమెరికాలోని ప్రాంతాన్ని ఆక్రమిస్తాం.. రష్యా షాకింగ్ కామెంట్స్!
ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో రష్యా బలగాలు.. ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఉక్రెయిన్‌లో దాడుల కారణంగా రష్యా, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా.. తాజాగా రష్యా భారీ షాకిచ్చింది. తమపై ఆర్థిక ఆంక్షలను విధిస్తే.. అమెరికాలోని అలాస్కాను తిరిగి స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ ఆక్రమణను కారణంగా చూపించి రష్యాకు చెందిన ఆస్తులను స్తంభింపచేసినా, జప్తు చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా దిగువ సభ స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోదిన్ హెచ్చరించారు. ఇక, రష్యా సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు 1861 జార్ అలెగ్జాండర్ తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా రష్యాలోని కొంత భూభాగాన్ని అమ్మేశాడు. 1867అక్టోబరు 18లో చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభంలో భాగంగా సోవియట్ యూనియన్‌లోని అలస్కా, అలూటియన్ దీవులను జార్ అలెగ్జాండర్.. 7.2 మిలియన్ డాలర్లకు అమెరికాకు అమ్మేశాడు. ఆ తర్వాత కొద్ది కాలంలో అలస్కాలో రష్యా కాలనీలు సైతం ఉన్నాయి. ఇక, 1881లో జార్ అలెగ్జాండర్ దారుణ హత్యకు గురయ్యాడు. కాగా, అక్టోబరు 18న అమెరికాలో అలాస్కా విలీనమైన కారణంగా ఆ తేదీన అలాస్కా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతుండగా పాశ్చాత్య దేశాలు రష్యపై విధించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పలు దేశాలు రష్యా, అలాగే రష్యన్ బిలియనీర్లకు చెందిన ఆస్తులను జప్తు చేశాయి. దీంతో రష్యా సైతం అమెరికా, ఇతర దేశాలకు చెందిన ప్రముఖులు రష్యాలో అడుగుపెట్టకుండా ఆంక్షలు విధించింది. Kremlin official suggests Russia could one day try to reclaim Alaska from the US https://t.co/TahOMTXDz1 via @Yahoo — Kazimierz (@Dm047Kazimierz) July 8, 2022 ఇది కూడా చదవండి: యుద్ధం ముగించండి.. ససేమిరా అంటున్న రష్యా! -
చంద్రుడిపై నీటికి భూమే ఆధారం
అలాస్కా: చంద్రుడిపై నీటిజాడలను భారతీయ చంద్రయాన్ మిషన్ నిర్ధారించి 14ఏళ్లవుతోంది. చంద్రుడిపై నీటికి భూమే ఆధారమని తాజాగా అలాస్కా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. భూమి ఉపరితల వాతావరణ పొరల నుంచి తప్పించుకున్న హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు చంద్రుడిపై చేరి ఉంటాయని, అక్కడ వీటి సంయోగం ద్వారా నీటి అణువులు ఉద్భవించాయని తెలిపారు. చంద్రుడి ఉపరితలం లోపల పల్చని మంచురూపంలో దాదాపు 3,500 క్యూబిక్ కిలోమీటర్ల మేర నీరు వ్యాపించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలను జర్నల్సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. భూమి మాగ్నటోస్పియర్ పరిధిలోకి చంద్రుడు ప్రతినెలా ఐదురోజులు వస్తాడు. ఆ సమయంలో భూమిపైనుంచి ఆక్సిజన్, హైడ్రోజన్ అయాన్లు భూఆకర్షణను తప్పించుకొని చంద్రుడిపైకి చేరి ఉంటాయని, ఇది లక్షల ఏళ్ల పాటు జరిగిన ప్రక్రియని వివరించారు. తాజా వివరాలు భవిష్యత్ అంతరిక్షయానాలకు ఉపయోగపడతాయని తెలిపారు. -
చుక్కలు చూడాలా? అయితే ఆ హోటల్‌కి వెళ్లాల్సిందే..!
చుక్కలు చూస్తూ విహారయాత్రను ఆనందించాలని అనుకుంటూన్నారా! అయితే, తప్పకుండా ఈ హోటల్‌కు వెళ్లాల్సిందే! సుమారు సముద్ర మట్టానికి సుమారు ఆరువేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ హోటల్ రాత్రి వేళల్లోనే కాదు, బస కోసం అయ్యే బిల్లులోనూ పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. అలస్కాలోని డాన్ షెల్డన్ యాంఫిథియేటర్ శిఖరంపై ఉన్న ‘షెల్డన్ షాలెట్’ హోటల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైంది. ఒక జంట మూడురోజులు బస చేయాలంటే రూ. 26 లక్షలు ఖర్చు చేయాలి. కేవలం పదిమందికి మాత్రమే వసతి కల్పిస్తారు. ఇక్కడకు చేరుకోవాలంటే వాయుమార్గం ఒక్కటే దిక్కు. ఇందుకోసం హోటల్ యాజమాన్యం కొన్ని ప్రైవేటు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు రుచికరమైన ఆహారం, అతిథుల ఆనందం కోసం పర్వతారోహణ, చేపలవేట వంటి పలు వినోద కార్యక్రమాలనూ అందిస్తోంది. (చదవండి: ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..! ) ఓ కల.. నిజానికి.. ఈ నిర్మాణం వెనుక ఓ చిన్న కథ ఉంది. హోటల్ యజమానులైన రాబర్ట్, కేన్ల తల్లిదండ్రులు ప్రశాంతమైన, అద్భుతమైన ఓ యాత్రను కోరుకున్నారు. ఈ విషయం ఆ అన్నదమ్ములకు వారు మరణించిన తర్వాత తెలిసింది. సుమారు దశాబ్దం పాటు శ్రమించి, హోటల్ నిర్మాణానికి అనుమతి పొందారు. చుట్టూ పర్వతాలు, చక్కటి వాతావరణం, ఎటు చూసినా ప్రశాంతత ప్రతిబింబించేలా చేశారు. అలా వారి తల్లిదండ్రులు కోరుకున్న ఆనందాన్ని కొంతమందికైనా పంచే ప్రయత్నమే ఈ ‘షెల్డన్ షాలెట్’. బాగుంది కదూ! మీరు కూడా మీ జోడీతో జాలీగా ఎంజాయ్ చేయాలనుకుంటే రెడీ అయిపోండి..కాకపోతే, కాస్త ఖర్చు అవుతుంది మరి! -
మీరొస్తే కూత.. మేమొస్తే కోత: కబడ్డీ ఆడిన భారత్-అమెరికా సైనికులు
వాషింగ్టన్: భారత్-అమెరికా సైన్యాల మధ్య యుద్ధ్ అభ్యాస్ సంయుక్త విన్యాసాలు అమెరికాలోని అలాస్కాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి 29వరకు దాదాపు 14 రోజుల పాటు జరగనున్న ఈ సంయుక్త విన్యాసాల్లో మన దేశం ఆర్మీ తరపున 350 మంది జవాన్లు పాల్గొంటుండగా.. అమెరికా నుంచి 300 మంది సైనికులు హాజరవుతున్నారు. అమెరికా బలగాలతో కలిసిపోయేందుకు... భారత సైన్యం వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో శనివారం ఇరు దేశాల సైనికులు కలిసిపోయి.. రెండు జట్లుగా ఏర్పడి కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాయి. అమెరికన్ సైన్యం మన కబడ్డీ కూత మోత మోగించగా.. భారత జవాన్లు ఫుట్‌బాల్ పోటీలో గోల్స్ మీద గోల్స్ చేశారు.. ఈ స్నేహపూర్వక క్రీడల్లో రెండు దేశాల సైన్యాలు... నాలుగు మిశ్రమ జట్లుగా ఏర్పడి పోటీ పడి.. క్రీడా స్ఫూర్తిని చాటారు. (చదవండి: మేరా భారత్ మహాన్: భగవద్గీత స్ఫూర్తి.. ఆకాశాన్ని అంటిన కీర్తి) మంచులో సందడి ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు మంచును విసురుకుంటూ ఎంజాయ్ చేశారు.. భారత్-అమెరికా సైన్యాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు. ఇరుదేశాల సైన్యం ఒకరినినొకరు అర్థం చేసుకునేందుకు ఈ క్రీడలు బాగా ఉపయోగపడినట్లు సైనికాధికారులు తెలిపారు. భారత్- అమెరికా సైన్యాల మధ్య అతిపెద్ద సైనిక సంయుక్త విన్యాసాలను 17వ సారి నిర్వహిస్తున్నారు. రెండు సైన్యాల మధ్య అవగాహన, పరస్పర సహకారం పెంచడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరగనున్నాయి. భారత్-అమెరికా సైన్యాల 16వ యుద్ధ్ అభ్యాస్ విన్యాసాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని బికానేర్లో జరిగాయి. చదవండి: ఒక మెట్టు కాదు... వంద మెట్లు పైకెదిగాం #WATCH | As part of 'Ice-breaking activities', Indian Army contingent and American contingent participated in friendly matches of Kabaddi, American Football and Volleyball at Joint Base Elmendorf Richardson, Anchorage, Alaska (US) (Video Source: Indian Army) pic.twitter.com/Xe6uM0NigT — ANI (@ANI) October 17, 2021 -
అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
న్యూయార్క్ : అమెరికాలోని అలాస్కాలో బుధవారం భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.2గా నమోదైంది. ఈ నేపథ్యంలో నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్(ఎన్టీడబ్ల్యూసీ) దక్షిణ పెనిసులా, పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. హవాయ్ రాష్ట్రంలో సునామీ వాచ్ హెచ్చరికలు ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం 1.27 గంటల ప్రాంతంలో హవాయ్ గవర్నర్ డేవిడ్ ఐగే ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ఫైనల్ అప్డేట్ : అలాస్కాలో భూకంపం కారణంగా హవాయ్‌కి సునామీ వాచ్ హెచ్చరిక రద్దు చేయడమైంది’’ అని పేర్కొన్నారు. FINAL UPDATE: Tsunami Watch canceled for Hawaii following a magnitude 8.1 earthquake off Alaska earlier tonight. — Governor David Ige (@GovHawaii) July 29, 2021 -
అమెరికా–చైనా మాటల యుద్ధం
వాషింగ్టన్: అమెరికా–చైనాల మధ్య విభేదాలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. అధ్యక్షుడిగా జో బైడెన్ పగ్గాలు చేపట్టాక అమెరికాలోని అలాస్కాలో రెండు దేశాల మధ్య జరిగిన మొట్టమొదటి భేటీ ఇందుకు వేదికగా మారింది. చైనా చర్యలు నిబంధనల ఆధారంగా కొనసాగుతున్న ప్రపంచ స్థిరతకు భంగకరంగా మారాయని అమెరికా ఆరోపించగా, తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని గట్టిగా ఎదుర్కొంటామని చైనా బదులిచ్చింది. అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్, చైనా నుంచి విదేశాంగ శాఖ ఉన్నతాధికారి యాంగ్ జీయిచి, విదేశాంగ మంత్రి వాంగ్ యీ చర్చల్లో పాల్గొన్నారు. చర్చలకు ముందు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ చర్చల్లో తాము ప్రస్తావించబోయే అంశాలు రెండు దేశాలతోపాటు, ప్రపంచానికే కీలకమైనవని అన్నారు. ‘జిన్జియాంగ్, తైవాన్, హాంకాంగ్‌లలో చైనా ప్రభుత్వ చర్యలపై మా ఆందోళనను ఈ చర్చల్లో ప్రస్తావిస్తాం. అలాగే, అమెరికాపై సైబర్ దాడులపైనా చర్చిస్తాం’ అని చెప్పారు. చైనా చర్యలు నిబంధనల ఆధారంగా కొనసాగుతున్న ప్రపంచ స్థిరతకు భంగకరంగా మారాయి. ఇవి అంతర్గత వ్యవహారాలు అనుకునేందుకు వీలు లేదు కాబట్టే, మేం వీటిని చర్చల్లో లేవనెత్తాలని భావిస్తున్నాం’ అని బ్లింకెన్ చెప్పారు. దీనిపై చైనా విదేశీవ్యవహారాల శాఖ ఉన్నతాధికారి యాంగ్ జీయిచి స్పందించారు. ఐక్యరాజ్యసమితి ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను, అంతర్జాతీయ చట్టాలను మాత్రమే అనుసరిస్తామే తప్ప, కేవలం కొన్ని దేశాలు మాత్రమే వాదించే నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమతను అనుసరించబోమని తెలిపారు. తమ అంతరంగిక వ్యవహారాల్లో అమెరికా తలదూర్చడాన్ని గతంలో మాదిరిగానే ఇకపైనా గట్టిగా వ్యతిరేకిస్తామన్నారు. -
విమానాలు కుప్పకూలి ఏడుగురు మృతి
అలస్కా: అమెరికాలోని అలస్కాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు విమానాలు ఢీకొని కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అలాస్కాకు సమీపంగా కెనాయ్ ద్వీపకల్పంలోని సోల్డోట్నా నగరంలో ఉన్న విమానాశ్రయం వద్ద రెండు విమానాలు ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. వివరాలు.. అలస్కా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేట్ రిపబ్లిక్ సభ్యుడు గ్యారీ నాప్ ఒక విమానంలో ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. మరో విమానంలో దక్షిణ కెరొలిన నుంచి నలుగురు పర్యాటకులు, కాన్సాస్ నుంచి ఒక పర్యాటక గైడ్, సోల్డోట్నా నుంచి ఒక పైలప్ ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. రెండు విమానాలు సోల్డోట్నా నగరంలోని విమానాశ్రయం వద్ద ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ప్రమాదానికి గురైన విమానాల్లో ఒకటి హవిలాండ్ డీహెచ్సీ-2గా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిష్ట్రేషన్(ఎఫ్ఏఏ) గుర్తించింది. అదే విధంగా ఈ ప్రమాదంపై ఎఫ్ఏఏ, జాతీయా రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో మృతి చెందిన గ్యారీ నాప్(67) రిపబ్లికన్, స్టేట్ హౌజ్‌లో సభ్యుడుగా కొనసాగుతున్నారు. -
అలస్కాలో తీవ్ర భూకంపం
అలస్కా: అమెరికాలోని అలస్కా దక్షిణతీరంలో సంభవించిన శక్తివంతమైన తీవ్ర భూకంపం తీరప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. దీన్ని ముందు సునామీగా భావించిన జనం భయంతో ఎత్తైన కొండ ప్రాంతాలకు పరుగులు పెట్టారు. అతి తక్కువ జనాభా కలిగిన అలస్కా ద్వీపకల్పంలో ఏర్పడిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదు అయ్యింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం పెర్రివిల్లేకు ఆగ్నేయ దిశలో తీరం నుంచి సముద్రంలోకి 105 కిలోమీటర్ల దూరంలో 17 మైళ్ళ లోతులో ఈ భూకంపం వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటల 12 నిముషాలకు ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌ఫై ఇంత భారీస్థాయిలో భూకంప తీవ్రత నమోదైనప్పటికీ, భూమి పెద్దగా కంపించినట్టు స్థానిక ప్రజలకు అనిపించలేదని అలస్కా రాష్ట్ర భూకంప పరిశోధకులు మైకేల్ వెస్ట్ చెప్పారు. ఇదిలా ఉండగా, అలస్కాకి 160 కిలోమీటర్ల పరిధిలోని చిన్న పట్టణాల్లో ఉన్న ప్రజలు భూమి తీవ్రంగా కంపించినట్లు భావించారని వెస్ట్ తెలిపారు. ఇంకా 805 కిలోమీటర్ల దూరంగా ఉన్నవాళ్ళు సైతం భూమి స్వల్పంగా కంపించిన విషయాన్ని గ్రహించారని వెస్ట్ చెప్పారు. ఎటువంటి నష్టం వాటిల్లినట్లు వార్తలు రాలేదని కోడియాక్ పోలీసు అధికారులు చెప్పారు. -
అలస్కాలో భూకంపం: సునామీ వార్నింగ్
వాషింగ్టన్: అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6.12కు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. దీంతో సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా జియాలాజికల్ సర్వే హెచ్చరికలు జారీ చేసింది. ఆంకరేజ్కు నైరుతి దిశగా 500 మైళ్లు, పెర్రివిల్లేకు దక్షిణ, ఆగ్నేయ దిశగా 60 మైళ్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. దీంతో ఆ ప్రాంతం నుంచి చుట్టుపక్కల 300 కిలోమీటర్ల మేర సునామీ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. భూకంపంలో సంభవించిన ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది (మెక్సికోలో భారీ భూకంపం) చదవండి: 7.3 తీవత్రతో భూకంపం, సునామీ హెచ్చరిక -
హెలీకాప్టర్‌తో ‘మ్యాజిక్ బస్సు’ తరలింపు
అలస్కా : అమెరికాలోని దట్టమైన అడవుల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న ‘బస్సు 142’ను హెలీకాప్టర్ సహాయంతో తరలించారు. రియల్ స్టోరీతో తెరకెక్కిన ‘ఇన్ టు ది వైల్డ్’ చిత్రం అంటే సాహసికులు అమితంగా ఇష్టపడతారు. డబ్బుతో పనిలేకుండా కేవలం ప్రకృతితో కలిసి జీవించాలనుకునే వ్యక్తి క్రిస్ మెక్కాండ్లెస్(24). ఆయన సాహస యాత్రకు వెళ్లి 1992లో మరణిస్తాడు. ఇతనికి సంబంధించిన కథే ‘ఇన్ టు ది వైల్డ్’. మెక్కాండ్లెస్ ఆశ్రయం పొందిన బస్సునే మ్యాజిక్ బస్‌గా పిలుస్తారు. అయితే అలస్కా ఆర్మీ నెషనల్ గార్డ్, అలస్కాలోని సహజ వనరుల విభాగం కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి, ఈ బస్సును హెలీకాప్టర్ సహాయంతో అక్కడి నుంచి తరలించారు.(గాల్వన్ లోయ మాదే : చైనా) 1940 దశకానికి చెందిన ఫెయిర్‌బ్యాంక్స్ సిటీకి చెందిన ఈ బస్సును సందర్శించడానికి ఎన్నో ప్రమాదకరమైన ప్రాంతాలను దాటుకుని వెళ్లాలి. స్టాంపెడ్ ట్రయల్ మార్గం గుండా హీలీ సమీపంలోని మారుమూల ప్రాంతాల మీదుగా టెక్లానికా నది దాటుకుని ఈ బస్సు ఉన్న చోటుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమై యాత్ర. 1961లో రోడ్డు నిర్మాణ పనులు చేసే సమయంలో కార్మికులు షెల్టర్ కోసం ఈ బస్సును వాడి అనంతరం అక్కడే వదిలేసివెళ్లారు. అయితే ఒంటరిగా ప్రపంచానికి దూరంగా సొంతంగా బతకాలనుకున్న క్రిస్ మెక్కాండ్లెస్కి ఈ బస్ కనిపిస్తుంది. కొద్దికాలం బస్సులో జీవించి తర్వాత తిరిగి వెళ్లాలనుకుంటాడు. కానీ, ఆ సమయానికి టెక్లానికా నది ఉదృతంగా ప్రవహించడంతో దాటడం కష్టం అవుతుంది. దీంతో తిరిగి బస్సులోకి వస్తాడు. ఇక ఆ బస్సులోనే దాదాపు 113 రోజులు గడిపి అనంతరం చనిపోతాడు. అయితే అతని సాహాస యాత్రలోని ప్రతీ విషయాన్ని తన పుస్తకంలో రాసుకుని, ఫోటోలు తీసి పెట్టేవాడు. అనంతరం అతని అనుభవాల ఆధారంగా జాన్ క్రాకోర్ 1996లో ‘ఇన్ టు ది వైల్డ్’ పుస్తకాన్ని రాశాడు. ఈ కథనే తర్వాత 2007లో చిత్రంగా తెరకెక్కి ప్రపంచం వ్యాప్తంగా మంచి హిట్ అయింది. ఇక కథను తెలుసుకున్న ఎందరో సాహసికులు ఆ బస్సును చూడాలని, ఎంతో ప్రమాదకరమైన యాత్రను చేయాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే కొందరు మృతిచెందగా, మరెందరో గాయాలపాలవుతున్నారు. (కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది) ‘అలస్కా ప్రకృతి అందాలను చూడటానికి వచ్చే వారి భద్రత మాకు ముఖ్యం. బస్సును చూడాలని కొందరు యాత్రికులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వీరిని కాపాడటానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా కొందు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు’ అందుకే బస్సును తరలిస్తున్నామని అలస్కాలోని సహజ వనరుల విభాగం అధికారి ఒకరు తెలిపారు. -
‘భూమిపై గ్రహాంతర జీవి; అదేం కాదు’
అలాస్కా: సముద్రంలో మనుషులకు తెలియని ఎన్నో వింతజీవులు, జలచరాలు తరుచూ కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తాయి. అటువంటి ఓ సముద్ర వింత జీవి అలాస్కాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ద్వీపం దగ్గర ఉన్న సముద్ర తీరంలో దర్శనమిచ్చింది. ఈ వింత సముద్ర జీవికి సంబంధించిన వీడియోను సారా వాసర్ అల్ఫోర్డ్ అనే మహిళ ‘ గ్రహంతర జీవిగా కనిపిస్తున్న కొత్త సముద్రపు జీవి’ అనే ట్యాగ్‌తో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన శరీరాన్ని సాగదీస్తూ, మెలికలు తిప్పుతూ వింతగా కదులుతున్న ఈ అరుదైన సముద్రజీవిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కదులుతున్న సమయంలో జీవి శరీరంలోని రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో.. ‘ఇప్పుడు భూమిపై ఉన్న వింతైన గ్రహాంతర జీవి’ అని కొంతమంది...‘ఇది సముద్రంలోని పగడపు జీవి.. మెలికలు తిరిగే స్టార్ ఫిష్ .. దాన్ని మళ్లీ సముద్రంలో వదిలేయండి’ అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీటిపై స్పందించిన సారా వాసర్.. ‘ఈ సముద్ర జీవి.. స్టార్ ఫిష్ జాతికి చెందిన ‘బాస్కెట్ స్టార్’ అని.. దాన్ని తిరిగి సముద్రంలోకి వదిలేస్తున్నా’ అని సోషల్ మీడియాలో పేర్కొంది. -
మేం బతుకుతామనుకోలేదు..!
అలస్కా: హిమానీ నదుల్లో బోటింగ్ చేస్తే భలే మజాగా ఉంటుంది కదా! మరి ఆ సమయంలో అక్కడే ఉన్న మంచు శిఖరాలు కుప్పకూలిపోయి భయానక వాతావరణం సృష్టిస్తే.. ఏమైనా ఉంటుందా? ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సరిగ్గా ఇదే సంఘటనను ప్రత్యక్షంగా చూశారు ఇద్దరు వ్యక్తులు. అమెరికాలోని అలస్కాలో యూట్యూబ్ ఛానల్‌ను నడిపే ఇద్దరు వ్యక్తులు శనివారం స్పెన్సర్ హిమానీ నది సమీపంలో సాహసయాత్రకు దిగారు. అయితే అక్కడి మంచు కొండలు ఒక్కసారిగా కుప్పకూలడంతో నదిలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో వారు ప్రయాణిస్తున్న పడవ అతలాకుతలమైంది. అయినప్పటికీ మంచు విస్ఫోటన దృశ్యాల్ని కెమెరాలో బంధిస్తూ దానికి చేరువగా వెళ్లాలని చూశారు. కానీ ప్రకృతి ప్రతాపం చూపించడంతో వారు వెనుదిరగక తప్పలేదు. ఈ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మేం ఇంకా బతికే ఉండటం మా అదృష్టమంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ సాహస యాత్రలో ఎలాంటి గాయాలు తగలకుండా బయటపడ్డామని వారి అనుభూతిని పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘చావు తప్పి కన్ను లొట్టపోయింది’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కనుమరుగు కానుందా?
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమ వుతున్న కర్బనవాయువులు ఇదే వేగంతో పెరుగుతుంటే ఈ శతాబ్దం ముగిసేలోపే గ్రీన్‌ల్యాండ్‌లోని 4.5 శాతం మంచుకొండలు కరిగిపోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. దానితోపాటు సముద్ర మట్టాలు 13 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ఉద్గారాలను తగ్గించకపోతే 3000 సంవత్సరం కల్లా గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పూర్తిగా కరిగే అవకాశం ఉందని అమెరికాలోని అలస్కా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఆండీ ఆష్వాండెన్ తెలిపారు. గ్రీన్‌ల్యాండ్‌లో 6,60,000 చదరపు కిలోమీటర్ల మేర మంచు పరచుకొని ఉంది. ఈ మంచుకొండల కింద ఉన్న ప్రాంతాల పరిస్థితులపై ఆయన అధ్యయనం చేశారు. దాదాపు 500 రకాల విభిన్న పరిస్థితులను అంచనా వేశారు. వీటిని అంచనా వేసే క్రమంలో పెద్ద మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. వాటి నుంచి కరుగుతున్న హిమ శాతాన్ని కలిపి ఈ మేరకు అంచనాలు వేశారు. 1991, 2015 మధ్య సంవత్సరానికి 0.02 శాతం చొప్పున సముద్రమట్టం పెరిగిందని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశోధన చేసిన మొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం. నగరాలకు ముంపు తప్పదు... ఇప్పుడు ఉన్న కర్బన ఉద్గార శాతం ఇలాగే కొనసాగితే 3000 సంవత్సరం కల్లా సముద్రమట్టం 24 అడుగులు పెరుగుతుందని హెచ్చరించారు. దీనివల్ల సముద్రపు ఒడ్డున ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలస్, న్యూ ఓర్లాన్స్ వంటి నగరాలు సముద్రంలో మునగడం ఖాయమన్నారు. కర్బన వాయువులు పెరగకుండా జగ్రత్తలు తీసుకుంటే సముద్ర మట్టం కేవలం 6.5 అడుగులు మాత్రమే పెరిగే అవకాశం ఉందన్నారు. -
‘నీ బెస్ట్‌ఫ్రెండ్‌ని చంపు.. 9 మిలియన్ డాలర్లిస్తాను’
వాషింగ్టన్ : డబ్బుకు ఆశపడి స్నేహితురాలిని హత్య చేసిన యువకుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలు.. అలస్కాకు చెందిన డానియెల్ బ్రహ్మెర్(18)కు ఇండియానాకు చెందిన స్కిమిల్లర్(21)తో ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. అయితే స్కిమిల్లర్ తనను తాను టైలర్ అనే ఓ బిలయనీర్‌గా పరిచయం చేసుకున్నాడు. తనకు బాగా డబ్బుందని బ్రహ్మెర్ను నమ్మించాడు. ఈ క్రమంలో వీరిద్దరు తరచుగా ఆన్లైన్ వేదికగా మాట్లాడుకునే వారు. కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ అత్యాచారం, హత్య చేయడం వంటి అంశాల గురించి చర్చించుకున్నారు. దీనిలో భాగంగా స్కిమిల్లర్.. ‘నీ బెస్ట్‌ఫ్రెండ్ ఎవరినైనా చంపి.. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నాకు పంపించు. అలా చేస్తే.. నీకు 9 మిలియన్ డాలర్ల సొమ్ము(రూ. 62,69,89,500 ) చెల్లిస్తాను’ అని చెప్పాడు. డబ్బుకు ఆశపడిన బ్రహ్మెర్ మరో నలుగురు స్నేహితులతో కలిసి ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత తన మిత్రబృందంలో మనోవైకల్యంతో బాధపడుతున్న 19 ఏళ్ల సింథియా హాఫ్‌మన్‌ను చంపేందుకు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఈ నెల 2న హాఫ్‌మన్‌ను వాకింగ్ వెళ్దామని చెప్పి బయటకు తీసుకెళ్లారు బ్రహ్మెర్ బృందం. ఆ తర్వాత హాఫ్మన్ నోటికి టేప్ వేసి ఓ నది వద్దకు తీసుకెళ్లి ఆమె తల మీద కాల్చి.. నదిలో తోసేశారు. రెండు రోజుల తర్వాత నదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతురాలిని హాఫ్మన్గా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం దర్యాప్తులో భాగంగా హాఫ్మన్ మృతదేహం దొరికిన ప్రాంతంలో సీసీటీవీ కెమరాలను పరిశీలించగా.. హాఫ్‌మాన్‌తో పాటు బ్రహ్మెర్ మిత్రబృందం కూడా ఉండటం పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో అతన్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బ్రహ్మెర్ మొబైల్‌ని పరిశీలించగా దానిలో అతను తుపాకీతో హాఫ్‌మన్‌ను కాల్చడం.. నదిలో తోయడం.. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్కిమిల్లర్కు పంపడం వంటి విషయాలు వెలుగు చూశాయి. దాంతో పోలీసుల బ్రహ్మెర్, స్కిమిల్లర్తో పాటు.. అతని నలుగురు స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్టు బ్రహ్మెర్, స్కిమిల్లర్లకు జీవిత ఖైదు విధించింది. -
అలస్కాలో అలజడి
-
విశోక గీతం
విద్యార్థిగా ఇక్కడే చదువుకున్నారు.. న్యాయవాదిగా హైకోర్టుకు వెళ్లినా.. కొన్నాళ్లకే తిరిగొచ్చారు. స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అయినా.. విశాఖనే సొంతూరుగా మార్చుకున్నారు.. తన భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నారు. వ్యాపార రంగంపై మక్కువతో అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గోల్డ్‌స్పాట్ శీతలపానీయాల డిస్ట్రిబ్యూటర్‌గా ఆ రంగంలో అడుగుపెట్టి గోల్డ్‌స్పాట్ మూర్తిగా విశాఖ ప్రజలకు చిరపరిచితుడిగా మారిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలోని అలస్కా ప్రాంతంలో దుర్మరణం పాలవ్వడం విశాఖను విషాదంలో నింపింది. 80లలో గీతం కళాశాల స్థాపించి దాన్ని డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లిన ఆయన దానికి అనుబంధం గీతం వైద్య, దంత వైద్య కళాశాలలను కూడా స్థాపించి విద్యాసంస్థల అధినేతగా.. గీతం మూర్తిగా సుప్రసిద్ధులయ్యారు. 1984లో రాజకీయాల్లో ప్రవేశించి రెండుసార్లు విశాఖ ఎంపీగా ఎన్నిక కావడంతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. విశాఖ నగరంతోపాటు ఎదుగుతూ తన సంస్థల ద్వారా కొన్నివేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మూర్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించిందని.. ఆయన ఇక లేరని తెలుసుకొని వేలా ది మంది ఆయన సిబ్బంది, ఆప్తులు, సన్నిహితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన మృతికి సంతాప సూచకంగా గీతం విద్యాసంస్థలను మూసివేసి నివాళులర్పించారు. సాగర్‌నగర్(విశాఖతూర్పు): ఎమ్మెల్సీ ఎంవీ వీఎస్ మూర్తి విశాఖ వాసులకు గీతం మూర్తిగా సుపరిచితులు. ఈనెల 6న కాలిఫోర్ని యాలో గీతం విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు వెళ్లిన మూర్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందారు. తాను అభిమానించే గాంధీ జయంతి రోజే అనంత లోకా లకు వెళ్లడం యాదృశ్చికంగా జరిగినా విశేషమని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. మూర్తి ప్రస్థానం ఇలా.. మూర్తి 1938లో తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెంలో మతుకుమిల్లి పట్టాభిరామయ్య, మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. ఆయనకు సోదరి వీరరాఘవమ్మ. భార్య సావిత్రిదేవి, వీరికి కుమారులు రామారావు, లక్ష్మణరావు, కుమార్తె భారతి ఉన్నారు. వీరు ప్రారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నారు. సావిత్రిదేవి 2009లో కాలం చేశారు. మూర్తి మనవుడు భరత్‌కు సినీనటుడు బాలకృష్ణ చిన కుమార్తె తేజస్వితో వివాహం చేశారు. మూర్తికి దివంగత లోకసభ స్పీకర్ బాలయోగి, మాజీ ముఖ్య మంత్రులు ఎన్టీఆర్, నాదేండ్ల భాస్కరరావు, ప్రస్తుత ముఖ్య మంత్రి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విద్యాభ్యాసం సాగిందిలా.. అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెంలో మూడో తరగతి వరకు మూర్తి చదివారు. కపిలేశ్వరపురంలో ఎస్ఎస్ఎల్సీ, కాకినాడ పీఆర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో లా చదివారు.డిగ్రీలో ఏయూ నుంచి బంగారు పతకం సాధించారు. ఆర్ధికశాస్త్రంలో పీహెచ్డీ డిగ్రీ పొందారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, అల్లాడి భాస్కరరావు, నల్లా సత్యనారాయణ, పిల్లా సూర్యనారాయణలతో కలిసి లా ప్రాక్టీస్ చేశారు. 1965లో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ పేరిట వ్యాపారం ప్రారంభించి జిల్లాలోని కాకినాడ, మండపేట, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. 1968లో వైజాగ్ బాట్లింగ్ కంపెనీ స్థాపించారు. (గోల్డ్‌స్పాట్ కంపెనీ) అప్పటి నుంచి గోల్డ్ స్పాట్ మూర్తి గా పేరొచ్చింది. 1971 టెక్నో సంచుల ఫ్యాక్టరీ ప్రా రంభించారు. 1978లో టూత్ఫెస్టు ట్రస్టులో చురు కైన పాత్ర పోషించారు. 1980లో గీతమ్ ఇంజినీరింగ్ కళాశాల స్థాపించారు. 2013లో గీతమ్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. గీతంను ప్రగతి పథాన నడిపించి గోల్డ్‌స్పాట్ నుంచి గీతం మూర్తిగా మారిపోయారు. రాజకీయ వేత్తగా.. 1991, 1999లో వైజాగ్ ఎంపీగా చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఆయన అవార్డు అందుకున్నారు.ఎన్టీఆర్ సమయంలో వుడా చైర్మన్‌గా పనిచేశారు. విస్తరించిన విద్యాసంస్థలు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గీతం వర్సిటీ క్యాంప్‌లను అభివృద్ధి చేసి నైపుణ్యంతో కూడిన అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు అభివృద్ధి పరిచారు. పుస్తక పఠనం, పుస్తకాలంటే మూర్తికి ఎంతో ఇష్టం. ఇది మూర్తిలోని పట్టుదలకు నిదర్శనమని మూర్తి బంధువులు చెబుతున్నారు. మూర్తికి ఇష్టులైన మహాత్మ గాంధీ, మదర్ థెరిస్సా వంటి మహోన్నుతులు అంటే చాలా ఇష్టం. మహాత్మ గాంధీ పేరుతో గీతంలో ఒక స్టడీ సెంటర్ నెలకొల్పి ఆయనపై పరిశోధన అంశాలను నెలక్పొడం విశేషం. మూర్తి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మహాత్మగాంధీ అంటే ఎంతో ఇష్టం డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి మహాత్మగాంధీ అంటే ఎంతో అభిమానం. ఆయన తన విద్యా సంస్థలకు జాతిపిత పేరు పెట్టుకున్నారు. గీతం విద్యాసంస్థలను గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ పేరుతో ఆయన 1980లో నగర శివారు రుషికొండలో ప్రారంభించారు. నాలుగు దశాబ్దాలుగా గీతం విశ్వవిద్యాలయం, తర్వాత డీమ్డ్ విశ్వవిద్యాలయం వరకు ఎదిగింది. మృత్యువులోనూ వీడని బంధం సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): అమెరికాలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గీతం అధ్యక్షుడు డాక్టర్ మూర్తితోపాటు ఆయన చిరకాల మిత్రుడు వెలువోలు బసవపున్నయ్య కూడా కన్నుమూశారు. పున్నయ్య జర్నలిస్టు, సామాజిక సేవారంగంలో ఉన్నారు. వెలువోలు ట్రస్టు పేరుతో ఆయన అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తికి ఎంతో సన్నిహింగా ఉంటూనే రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డితోనూ ఉండటం విశేషం. బసవపున్నయ్య మృతి పట్ల విశాఖలోని జర్నలిస్టు సంఘాలు తమ సంతాపాన్ని ప్రకటించాయి. -
అలస్కాలో భూకంపం
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలోని ఉత్తర అలస్కా ప్రాంతంలో అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపతీవ్రంత 6.4గా నమోదైంది. ఈ విషయాన్ని యూఎస్ జియోగ్రాఫికల్ సర్వే ధృవీకరించింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు ఇంకా సమాచారం అందలేదు. ఇంత తీవ్రతతో భూకంపం సంభవించడం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి. 1995లో వచ్చిన భూకంపమే(5.2 మాగ్నిట్యూడ్) ఇప్పటి వరకు అత్యంత తీవ్రమైన భూకంపమని అధికారులు చెబుతున్నారు. భూకంపం సంభవించిన తర్వాత పలుమార్లు ప్రకంపనలు కూడా వచ్చాయని జియోగ్రాఫికల్ సర్వే అధికారులు వెల్లడించారు. -
మినీ లైఫ్ ఆఫ్ పై
మాస్కో: అడుగుల ఎత్తున్న ఎగిసి పడ్డ అలలు.. దారి తప్పిన ఒంటరి నావ.. అందులో బిక్కు బిక్కు మంటూ ప్రాణాలతో గడిపిన వ్యక్తి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. సరదాగా నదీ విహారానికి వెళ్లిన వ్యక్తి తప్పిపోయి సముద్రం గుండా మరో ఖండాంతరానికి చేరుకున్నాడు. అలస్కా యాంకరేజ్‌కు చెందిన జాన్ మార్టిన్ విలియమ్-3.. అనే వ్యక్తి రెండు వారాల క్రితం క్రితం యుకోన్ నదీ తీరంలో విహారానికి వెళ్లాడు. వ్యక్తిగత బోట్లో విహారం చేస్తుండగా.. అలా బేరింగ్ సముద్రంలోకి చేరుకున్నాడు. అక్కడ అలల తాకిడికి తప్పిపోగా.. బేరింగ్ సముద్రం గుండా 50 మైళ్లు ప్రయాణించి రష్యా తీరానికి చేరుకున్నాడు. ఆగష్టు 1న చుకోట్కా రీజియన్‌లోని లావ్రెంటియా గ్రామానికి(రష్యా) చేరకున్న అతన్ని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వాతావరణంలో మార్పులు, నేవీగేషన్ వ్యవస్థను కోల్పోవటంతో అతను దారితప్పిపోయినట్లు తెలుస్తోంది. అతని నుంచి వివరాలు సేకరించిన అనంతరం అమెరికా దౌత్య అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాలను రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా జోఖరోవా శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆ రెండు వారాలు ఉప్పు నీటిని వేడి చేసుకుని తాగటం, చేపలతో ఆకలి తీర్చుకున్నట్లు మార్టిన్ వెల్లడించాడు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగానే ఉన్నాడని, త్వరలోనే స్వస్థలానికి పంపిస్తామని మరియా జోఖరోవా వెల్లడించారు. -
అలస్కాలో భారీ భూకంపం
అలస్కా : అలస్కాలోని కొడియక్ ఐలాండ్ కేంద్రంగా మంగళవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో తొలుత నేషనల్ సునామీ సెంటర్ సునామీ హెచ్చరిక జారీ చేసింది. వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియా, హవాయి, బ్రిటిష్ కొలంబియాల్లో సునామీ సంభవించే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. కొద్దిసేపటి తర్వాత సునామీ హెచ్చరికను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సముద్ర అలల తాడికి తక్కువగా ఉందని అందిన సమాచారం మేరకే హెచ్చరికను ఉపసంహరిస్తున్నామని వెల్లడించింది. అయితే, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొడియాక్ ఐలాండ్‌కు ఈశాన్య దిశగా 177 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ అంతర్భాగంలో ఆరు మైళ్ల లోపల భూమిలో కదలికలు రావడం వల్ల భూకంపం సంభవించినట్లు వివరించింది. -
అమెరికాపై కిమ్ తీవ్ర అసభ్య పదజాలం..!
అగ్రరాజ్యంపై కిమ్ జాంగ్ ఉన్ తిట్లు..! సియోల్: ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఉత్తర కొరియా అమెరికాకు పుండుమీద కారం చల్లేరీతిలో వ్యాఖ్యలు చేసింది. ఈ బాలిస్టిక్ క్షిపణి విజయం.. అమెరికా బాస్టర్డ్స్కు వారి స్వాతంత్ర్య దినోత్సవ కానుక అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పేర్కొన్నట్టు ఆ దేశ మీడియా తెలిపింది. 'జులై 4 వార్షికోత్సవం సందర్భంగా పంపిన ఈ కానుకను చూసి అమెరికా బాస్టర్డ్స్ అంతగా సంతోషించరు' అని కిమ్ అన్నట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. 'వారి విసుగును దూరం చేసేందుకు అప్పుడప్పుడు ఇలాంటి కానుకలను మనం పంపిస్తూ ఉండాలి' అని కిమ్ వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు పేర్కొంది. ప్రపంచ దేశాల హెచ్చరికలను, ఆంక్షలను బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా మంగళవారం ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అమెరికాతో పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యమున్న ఈ క్షిపణి (వాసోంగ్-14) పరీక్షను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారని ఉ.కొరియా టీవీ చానల్ పేర్కొంది. ‘కిమ్ ఈ పరీక్షకు ఆదేశించారు. క్షిపణి 2,802 కి.మీ.ఎత్తుకు చేరుకుని 933 కి.మీ ప్రయాణించింది. 39 నిమిషాల పయనం తర్వాత జపాన్ సముద్రంలో పడిపోయింది. పూర్తి స్థాయి అణుశక్తి దేశమైన ఉ.కొరియా వద్ద ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగల అత్యంత శక్తిమంతమైన ఐసీబీఎం ఉంది. అమెరికా నుంచి అణు యుద్ధ ముప్పునకు ఇది ముగింపు పలుకుతుంది’ అని తెలిపింది. ఉ.కొరియా క్షిపణి ఒకటి 2,802 కి.మీ ఎత్తుకు వెళ్లడం ఇదే తొలి సారి. ఉ.కొరియాలోని ఉత్తర ఫియోంగాన్ రాష్ట్రంలో ఈ పరీక్ష జరిపారని దక్షిణ కొరియా తెలిపింది. ఇది భూమిపై నుంచి ప్రయోగించిన మధ్యశ్రేణి క్షిపణి అని, అమెరికాకు దీనివల్ల ముప్పులేదని అమెరికా పసిఫిక్ కమాండ్ పేర్కొంది. ఐసీబీఎం 6,700 కి.మీ. వరకు దూసుకెళ్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉ.కొరియా ఈ ఏడాదిలో క్షిపణి పరీక్ష నిర్వహించ డం ఇది 11వసారి. అమెరికా స్వాతంత్య్రదినమైన జూలై4న ఐసీబీఎంను పరీక్షించడం గమనార్హం. -
ఖండాంతర క్షిపణి ప్రయోగం
► విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా ► అమెరికా సహా పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యం సియోల్: ప్రపంచ దేశాల హెచ్చరికలను, ఆంక్షలను ఉత్తర కొరియా మరోసారి బేఖాతరు చేసింది. అమెరికాతో పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యమున్న తన తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని మంగళవారం విజయవంతంగా పరీక్షించామని ప్రకటించింది. వాసోంగ్–14 క్షిపణి పరీక్షను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారని ఉ.కొరియా టీవీ చానల్ పేర్కొంది. ‘కిమ్ ఈ పరీక్షకు ఆదేశించారు. క్షిపణి 2,802 కి.మీ.ఎత్తుకు చేరుకుని 933 కి.మీ ప్రయాణించింది. 39 నిమిషాల పయనం తర్వాత జపాన్ సముద్రంలో పడిపోయింది. పూర్తి స్థాయి అణుశక్తి దేశమైన ఉ.కొరియా వద్ద ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగల అత్యంత శక్తిమంతమైన ఐసీబీఎం ఉంది. అమెరికా నుంచి అణు యుద్ధ ముప్పునకు ఇది ముగింపు పలుకుతుంది’ అని తెలిపింది. ఉ.కొరియా క్షిపణి ఒకటి 2,802 కి.మీ ఎత్తుకు వెళ్లడం ఇదే తొలి సారి. ఉ.కొరియాలోని ఉత్తర ఫియోంగాన్ రాష్ట్రంలో ఈ పరీక్ష జరిపారని దక్షిణ కొరియా తెలిపింది. ఇది భూమిపై నుంచి ప్రయోగించిన మధ్యశ్రేణి క్షిపణి అని, అమెరికాకు దీనివల్ల ముప్పులేదని అమెరికా పసిఫిక్ కమాండ్ పేర్కొంది. ఐసీబీఎం 6,700 కి.మీ. వరకు దూసుకెళ్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉ.కొరియా ఈ ఏడాదిలో క్షిపణి పరీక్ష నిర్వహించ డం ఇది 11వసారి. అమెరికా స్వాతంత్య్రదినమైన జూలై4న ఐసీబీఎంను పరీక్షించడం గమనార్హం. ఇంకో మంచి పని లేదా?: ట్రంప్ ఉ.కొరియా క్షిపణి పరీక్షపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ‘ఇతనికి తన జీవితంలో చేయాల్సిన మంచిపనేదీ లేదా?’ అని ఉ.కొరియా నేత కిమ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఉ.కొరియాపై ఒత్తిడి తెచ్చి, ఈ పిచ్చిపనులను మానిపించాలని ఆ దేశానికి మిత్రదేశమైన చైనాకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అమెరికా సహా సంబంధిత పక్షాలన్నీ సంయమనం పాటించాలని చైనా కోరింది. -
విమానంలో శ్వేతనాగు.. నో ప్యానిక్!
ఓ ప్రయాణికుడు తన పెంపుడు శ్వేతనాగును తనతోపాటు విమానంలోకి తీసుకొచ్చాడు. గమ్యం చేరుకున్న తర్వాత అతను విమానం దిగాడు కానీ, ఆ పాము మాత్రం అందులోనే ఉండిపోయింది. విమానంలోకి ఎక్కిన ఓ చిన్నారి బాలుడు తన సీటులోకి కూర్చున్న వెంటనే సీటు పక్కన నిద్రపోతున్న ఆ పామును గుర్తించాడు. ’అమ్మ ఇక్కడ చూడు. ఏంటిది ఏది’అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీంతో ప్రయాణిస్తున్న విమానంలో పాము ఉన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. అయితే, ఇది విషపూరితమైన పాము కాదు. ఎక్కువసేపు స్తబ్దుగా పడుకొని ఉంటుంది. దీంతో విమానంలో పెద్దగా భయాందోళన వ్యక్తం కాలేదు. అమెరికా అలస్కా రాష్ట్రంలో అనియక్ నుంచి యాంకరేజ్ నగరానికి వెళుతున్న ప్రయాణికుల విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం తిరిగి ప్రయాణమైన సమయంలో ఓ ప్రయాణికుడు తనతోపాటు తెచ్చుకున్న పెంపుడు పాము కనిపించడం లేదని, అది విమానంలోనే ఉండిపోయిందని ఎయిర్‌పోర్టు సిబ్బందికి తెలియజేశాడు. ఇంతలోనే ఆ విమానం గాలిలోకి ఎగిరింది. ఆ తర్వాత విమానంలో పామును గుర్తించారు. అది విషపూరితమైనది కాకపోవడంతో దానిని చూసేందుకు ప్రయాణికులు ఉత్సాహం చూపారు. దానిని జాగ్రత్తగా భద్రపరిచి విమానం ల్యాండ్ అయిన తర్వాత తరలించారు. -
మంచు ప్రపంచం
అలాస్కా స్కీయింగ్, స్నోబోర్డింగ్ అంటే ఆసక్తి ఉన్నవారు... జీవితంలో ఒక్కసారైనా హెలీ స్కీయింగ్ చేయాలని అనుకోకుండా ఉంటారా? ప్రత్యేక హెలికాప్టర్ గైడ్ చేస్తుండగా... 18వేల అడుగుల ఎత్తు నుంచి స్కీయింగ్ చేయటమంటే...! జీవితాన్ని మార్చేసే అనుభవమిది. డే స్కీయింగ్‌కు ప్రపంచంలోనే అత్యుత్తమంగా భావించే అలాస్కాలో... దీని చార్జీలు ఒకరికి 1,275 డాలర్ల నుంచి మొదలవుతాయి. అలాస్కా రాష్ట్రం అమెరికాలో భాగమే అయినా... చూస్తే అదొక్కటే ఒక ప్రపంచంలా ఉంటుంది. అలాస్కాలో ఇప్పటికీ మనుషులెవరూ వెళ్లని ప్రాంతాలున్నాయి మరి. క్రూయిజ్‌లో వెళ్లినా, ఏదో ఒక కారవాన్‌ను (ఆర్వీ) అద్దెకు తీసుకుని రోడ్డు మార్గంలో వెళ్లినా... ఆ అనుభూతే వేరు. స్థానిక అలాస్కన్ తెగలతో పాటు ఎలుగుబంట్లు, తోడేళ్ల వంటి ‘బిగ్ ఫైవ్’ వన్య మృగాలనూ చూడొచ్చు. ఇక డెనాలీ నేషనల్ పార్క్‌కు వెళితే అదో ప్రపంచమే. అలాస్కాలో మిస్ కాకూడనివి... * డెనాలీ నేషనల్ పార్క్ మొత్తాన్ని హెలికాప్టర్లో చుట్టే ‘ఫ్లైట్ సీయింగ్’. - ప్రిన్స్ విలియం సౌండ్ లేదా కెనాయ్ ఫోర్డ్స్‌లో గ్లేసియర్ టూర్. * యాంకరేజ్ సిటీలోని అత్యుత్తమ మ్యూజియంల సందర్శన. * మంచులో సాహసాలు, క్రీడలు. అలాస్కాను చేరుకునేదిలా? * అలాస్కాలోని డెనాలీ నేషనల్ పార్క్‌కు వెళ్లాలన్నా, మరో ప్రాంతానికి వెళ్లాలన్నా విమానంలో యాంకరేజ్ విమానాశ్రయాన్ని చేరుకోవాలి. అక్కడి నుంచి డెనాలీ నేషనల్ పార్క్ దాదాపు 200 మైళ్ల దూరం. నాలుగు గంటలు పడుతుంది. ముందుగా బుక్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి ఒకరికి రూ.1.1 నుంచి 1.2 లక్షల వరకూ విమాన ఛార్జీలుంటాయి. అక్కడ ఆర్వీని అద్దెకు తీసుకున్నా, క్రూయిజ్ ద్వారా వెళ్లినా ఛార్జీలు కాస్తంత ఎక్కువే. * దాదాపు అమెరికాకు వెళ్లే విమానాలన్నీ ఢిల్లీ, ముంబాయి మీదుగా వెళతాయి కనక అక్కడి నుంచి అమెరికాకు వెళ్లటం కాస్తంత ఈజీ. ఇక అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నుంచి యాంకరేజ్ (అలాస్కా) కు బోలెడన్ని విమానాలుంటాయి. ఇలా ఢిల్లీ నుంచి ప్లాన్ చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.85వేలలోపే ఉంటాయి. * వీటన్నిటికన్నా ముందు... అమెరికాకు వెళ్లాలంటే వీసా ఉండాలి. టూరిస్టులక్కూడా అమెరికా వీసా అంత తేలిగ్గా రాదు. అందుకని ఇలాంటి యాత్రల్ని బాగా ముందుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు వెళ్లొచ్చు? * జూన్ మధ్య నుంచి ఆగస్టు వరకూ టూరిస్టుల కాలం. ధరలు కూడా ఎక్కువే. * మే మధ్య నుంచి జూన్ మధ్య వరకూ కాస్త ధరలు తక్కువగా ఉంటాయి. ఒకోసారి 25 శాతం డిస్కౌంట్ కూడా దొరుకుతుంటుంది. * ఆగస్టు మధ్య నుంచి సెప్టెంబరు మధ్య వరకూ కూడా డిస్కౌంట్ల కాలమే. * ఇక ఫిబ్రవరి చివరి నుంచి మార్చి మధ్య వరకూ చలికాలం. బోలెడంత మంచు. ఐస్ స్పోర్ట్స్ కేంద్రాలన్నీ పూర్తిగా పనిచేసేది ఈ కాలంలోనే. -
భర్త శవంతో టూర్‌కు వెళ్లింది!
ఓ అమెరికన్ మహిళ తన భర్త మృతదేహాన్ని వాహనంలో పెట్టుకొని రోడ్డుప్రయాణాలు చేసింది. 78 ఏళ్ల తన భర్త మృతదేహాన్ని ఓ అల్యూమినియం శవపేటికలో పెట్టుకొని.. తను ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకెళ్లింది. శవం కుళ్లిపోయి దుర్వాసన రాకుండా ఎప్పుడూ ఐస్‌ను వినియోగించింది. అయితే, అమెరికాలోని అలస్కాలో ఆమె శవంతో తిరుగుతుండటంతో కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమె భర్త శవంతో కొన్నిరోజులుగా ప్రయాణం చేస్తున్నదని, వాహనంలోని మృతదేహం ఉన్న పేటికలో ఐస్ అయినప్పుడల్లా దానిని కొనేందుకు మాత్రమే వాహనాన్ని ఆపేదని పోలీసులు తెలిపారు. భర్త మృతదేహాన్ని ఆమె నేరుగా మార్చురీకి తీసుకెళ్లాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల తీసుకెళ్లకెళ్లలేదని, భర్తతో కలిసి కొన్నిరోజులు ప్రయాణాలు చేయాలని ఉద్దేశంతో ఆమె ఇలా చేసిందని స్థానిక పోలీసు అధికారి వివరించారు. స్థానికంగా రోలింగ్ వేక్ వార్షిక ఉత్సవం జరుగుతుండటంతో భర్తతో కలిసి ఆ ఉత్సవానికి వెళ్లాలని ఆమె ఇలా చేసి ఉండొచ్చునని వివరించారు. ఆమె భర్త సహజంగానే మరణించారని, ఈ వ్యవహారంలో ఆమెపై ఎలాంటి అభియోగాలు మోపలేదని పోలీసు అధికారి చెప్పారు. ఆమె భర్త శవాన్ని స్వాధీనం చేసుకొని స్థానికంగా ఉన్న మార్చురీకి తరలించామని, మళ్లీ తన భర్త శవం కోసం ఆమె రాబోదని ఆశిస్తున్నామని తెలిపారు. -
కూలిన విమానం : ముగ్గురు మృతి
అలస్కా : అలస్కాలో శుక్రవారం కుప్పకూలిన విమానాన్ని ఆగ్నేయ ప్రాంతంలో గుర్తించినట్లు ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. విమానంలోని ముగ్గురు మరణించారని చెప్పారు. మృతులు డేవిడ్ గాలా (60), గ్రేగ్ స్కెఫ్ (61), థామస్ (57) మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ముగ్గురిది వార్నెంజల్ అని తెలిపారు. ఆ మృతదేహాలను స్వస్థలానికి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈవిమానం శుక్రవారం కూలి పోయింది. -
అలస్కాలో భూకంపం
వాషింగ్టన్ : అలస్కాలో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం మాత్రం అందలేదని తెలిపింది. అయితే సునామీ వచ్చే సూచనలు ఏమీ లేవని పేర్కొంది. భూకంప కేంద్రం 58 మైళ్ల అడుగున సంభవించినట్లు గుర్తించామని యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది. -
అలస్కాలో భూకంపం
వాషింగ్టన్ : అలస్కాలోని దక్షిణ అట్కాలోని శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదు అయింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే సునామీ వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది.దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
అమెరికాలో భారీ భూకంపం
అలస్కా: అమెరికాలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. అలస్కా దక్షిణ తీర ప్రాంతంలో రెక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా జియలాజికల్ సర్వే విభాగం ప్రకటించింది. పెడ్రో అఖాతానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం దాటికి తమ నివాసప్రాంతంలో ప్రకంపణలు గుర్తించామని పలువురు ఆంకోరేజ్ పట్టణ వాసులు ట్విట్టర్లో తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ఆస్థి, ప్రాణనష్టాలు నమోదు కాలేదు. భూమిలోపల 124 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సునామీ భయంలేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. -
సముద్రంలో మునిగిపోతున్న అమెరికా గ్రామం
అలాస్కా : భూగోళంపై నానాటికి పెరుగుతున్న భూతాపోన్నతి కారణంగా మంచు పర్వతాలు కరిగిపోతున్నాయని, సముద్రాలు అల్లకల్లోలంగా మారుతున్నాయని మనం వింటూనే ఉన్నాం. ఏదో రోజు మానవ మనుగడకే ప్రమాదం ముంచుకొస్తుందనే హెచ్చరికలూ విన్నాం. ఇప్పుడు కళ్లారా చూసే రోజులొస్తున్నాయి. మొన్నటి వరకు చుట్టూరా నిశ్చలమైన నీలి సముద్రపు కెరటాలు, పచ్చని చెట్లతో కళకళలాడిన అమెరికా అలాస్కా రాష్ట్రంలోని కివలిన గ్రామం ఇప్పుడు సముద్ర గర్భంలో కలసిపోనుంది. ఒకప్పుడు సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో ఉన్న కివలిన గ్రామం ఇప్పుడు కేవలం ఎనిమిది నుంచి పదడుగుల దూరానికి చేరింది. 2025 నాటికి కచ్చితంగా ఆ గ్రామం సముద్ర గర్భంలో పూర్తిగా కలసిపోతుందని ఇటీవల ఆ గ్రామాన్ని సందర్శించిన అమెరికా ఆర్మీ పటాలం ఇంజనీర్లు తేల్చి చెప్పారు. ఆర్కటిక్ వలయానికి 83 మైళ్ల దూరంలోని దీవిలో ఆ గ్రామం ఉంది. అందులో ప్రస్తుతం 403 మంది నివసిస్తున్నారు. ఆ గ్రామం ఎలాగూ మునిగిపోతుందని తెలిసి అలాస్కా ప్రభుత్వం అక్కడ మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎలాంటి పెట్టుబడులు పెట్టినా అవి సముద్ర జలాల్లో కలిసిపోతాయని భావిస్తోంది. ఒకప్పుడు పండ్లతోటలు, తిమింగళాల వేటపై బతికిన అక్కడి ప్రజలు నేడు ఒడ్డుకు వచ్చే సీల్స్ పై ఆధారపడి బతుకుతున్నారు. అంతో ఇంతో స్తోమత కలిగిన వాళ్లు అలాస్కా నగరం వైపు వలసపోగా, నిర్భాగ్యులు అక్కడే ఉండిపోయారు. ఎక్కడకు పోవాలో, ఎలా బతకాలో తెలియక అల్లాడిపోతున్నారని 'ది లాస్ ఏంజెలిస్ టైమ్స్' వెల్లడించింది. ఆ దీప గ్రామాన్ని 1847లో రష్యా నేవీ కనుగొన్నది. 1960లో అక్కడ ఎయిర్ స్ట్రీమ్‌ను అమెరికా ప్రభుత్వం నిర్మించింది. అప్పుడు పొడవాటి బీచ్‌లతో, ప్రకృతి రమనీయతతో అలరారుతుండేది. అర్కెటిక్ ప్రాంతంలోని మంచు పర్వతాలు కరగడంతో చెలరేగిన తుఫానుల కారణంగా బీచ్‌లన్నీ మాయం అవుతూ వచ్చాయి. సముద్రం ఆటుపోట్లను అరికట్టేందుకు సముద్రం ఒడ్డున 2011లో నిర్మించిన అడ్డుగోడలు కూడా ఇటీవలి తుఫానులకు కొట్టుకుపోయాయి. భూతాపంపై జరుగుతున్న ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం అలాస్కా నగరానికి చేరుకున్నారు. భూతాపోన్నతికి ప్రత్యక్ష సాక్షిగా బలవుతున్న తమ గ్రామాన్ని పట్టించుకుంటారేమోనని ఆ గ్రామస్తులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. -
'వందేళ్లు దాటాక వారి మనోవాంఛ తీరింది'
వాషింగ్టన్: ఎట్టకేలకు అలస్కా ప్రజల మనోవాంఛ నెరవేరింది. ఎప్పుడు తాము సాంప్రదాయబద్ధంగా పిలుచుకునే పేరుకు అధికారిక గుర్తింపునిస్తారా అని ఎదురుచూసిన వారికి చివరికి సంతృప్తి కలిగింది. తమ ప్రాంతంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతానికి తమకు నచ్చిన పేరును ధృవీకరిస్తూ అమెరికా వైట్ హౌస్ ఓ ప్రకటన చేసింది. అసలు ఇంతకి ఏమిటి ఆ విషయం అనుకుంటున్నారా.. ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తైన పర్వతం ఏదంటే టక్కున మెకిన్లీ అని ఈ రోజుల్లో కాంపిటేషన్‌కు ప్రిపేర్ అవుతున్న ఎవ్వరైనా చెప్పేస్తారు. వాస్తవానికి ఆ పేరు ఎందుకు పెట్టారో ఎప్పుడు పెట్టారో తెలుసా సరిగ్గా 1896లో. నాటి అమెరికా అధ్యక్షుడు విలియం మెకిన్లీకి గుర్తుగా. కానీ అంతకుముందు ఆ పర్వతానికి 'దెనాలి' అనే పేరుండేది. అయితే, మెకిన్లీ అని ఆ పర్వతానికి నామకరణం చేసినప్పటి నుంచి అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాని పేరు తిరిగి దెనాలిగా మార్చాలంటూ పలుమార్లు డిమాండ్లు, నిరసనలు వ్యక్తం చేశారు. పేరు మార్చడం ద్వారా తమ సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవించిన వారవుతారని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ సరిగా వారి డిమాండ్‌ను పట్టించుకోలేదు. కొంతమంది ఆ దిశగా ఆలోచనలు చేసిన ఆచరణలోకి రాలేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అలస్కా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఆ పర్వతం పేరును మెకిన్లీగా తొలగించి దెనాలిగా స్పష్టం చేశారు. ఒబామా ఇక్కడ మూడు రోజులు గడపనున్నారు. -
పోయిన పిల్లి దొరికిందోచ్!
అలస్కా: విడిపోయిన ఆ కుటుంబం రెండు నెలల తరువాత కలుసుకుంది. తప్పిపోయింది ఎవరో చిన్నారి కాదు. రెండేళ్ల వయసున్న పిల్లి! విషయమేంటంటే... కింబర్లీ చెల్ఫ్, జెస్సీ చెల్ఫ్ దంపతులు టెక్సాస్‌లోని ఎల్పాసో నగరంలో నివసిస్తున్నారు. వీరు అల్లారుముద్దుగా ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దాని పేరు మూసీ. కన్నబిడ్డ కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నారు. జెస్సీ చెల్ఫ్ సైన్యంలో పనిచేస్తున్నారు. ఆయనకు అలస్కాలోని ఫెయిర్బ్యాంకుకు బదిలీ అయింది. దీంతో ఆయన టెక్సాస్ ను వదలాల్సి వచ్చింది. ఇందుకోసం ఆ ప్యాకర్స్ సంస్థను ఆశ్రయించాడు. వారు వచ్చి ఇంటి సామానును ప్యాక్ చేసి తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి మూసీ కనిపించ లేదు. ఇళ్లంతా గాలించినా దొరకలేదు. ఇంటి సామగ్రిని పంపించేసి దంపతులిద్దరూ టెక్సాస్ మొత్తం మూడురోజులపాటు తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోయింది. చేసేది లేక మూసీ లేకుండానే దంపతులు అలస్కాకు బయల్దేరారు. దాదాపు 64 రోజుల తరువాత వారి సామగ్రి కొత్త ఇంటికి డెలివరీ అయింది. వాటిలో పరుపును విప్పి చూడగా అందులో తిండితిప్పలు లేక శుష్కించిన మూసీ కనిపించింది. అదింకా ప్రాణాలతోనే ఉంది. దీంతో కింబర్లీకి ప్రాణం లేచివచ్చినట్లయింది. దాన్ని వెంటనే వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మూసీకి ప్రాణాపాయం తప్పి కోలుకొంటోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలతోపాటు, కెనడా దేశాలను మొత్తం చుట్టి 64 రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత మూసీ ఎట్టకేలకు ఇంటికి చేరింది. మూసీ తిరిగిరావడంతో చెల్ఫ్ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
సెల్ఫీ @ 16
ప్రపంచానికి ఇప్పుడు సెల్ఫీల పిచ్చి పట్టుకుందిగానీ అమెరికాలోని అలాస్కా ప్రాంతానికి చెందిన జొనాథన్ కెల్లర్ మాత్రం 16 ఏళ్ల క్రితం నుంచి ఇదే పనిలో ఉన్నాడు. 1999 నుంచి ప్రతిరోజూ ఒక ఫొటో తీసుకోవడం మొదలెట్టాడు. అంతటితో ఆగలేదు. తాను తీసుకున్న ఫొటోలన్నింటినీ వీడియోలోకెక్కించాడు. 22 ఏళ్ల వయసులో తొలిసారి తీసిన ఫొటోతో ఇటీవల తీసిన ఫొటోని పోల్చి చూస్తే ఎన్నో మార్పులు కనిపించాయట. అప్పటి పాలబుగ్గల జొనాథన్ ఇప్పుడు కాస్తా గడ్డం బాబు అయ్యాడు. ఈ ఫొటోలన్నింటినీ ఓ వీడియోలోకి ఎక్కించి దానికి ‘లివింగ్ మై లైఫ్ ఫాస్టర్’ అని నామకరణం చేసేశాడు.