పుతిన్‌ కొత్త ప్లాన్‌.. యూఎస్‌లోని ప్రాంతాన్ని ఆక్రమిస్తాం: రష్యా వార్నింగ్‌!

Vyacheslav Volodin said Russia could Reclaim Alaska from US - Sakshi

ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో రష్యా బలగాలు.. ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఉక్రెయిన్‌లో దాడుల కారణంగా రష్యా, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అమెరికా.. తాజాగా రష్యా భారీ షాకిచ్చింది. తమపై ఆర్థిక ఆంక్షలను విధిస్తే.. అమెరికాలోని అలాస్కాను తిరిగి స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. ఉక్రెయిన్‌ ఆక్రమణను కారణంగా చూపించి రష్యాకు చెందిన ఆస్తులను స్తంభింపచేసినా, జప్తు చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా దిగువ సభ స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోదిన్ హెచ్చరించారు.

ఇక, రష్యా సోవియట్‌ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు 1861 జార్‌ అలెగ్జాండర్‌ తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా రష్యాలోని కొంత భూభాగాన్ని అమ్మేశాడు. 1867అక్టోబరు 18లో చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభంలో భాగంగా సోవియట్‌ యూనియన్‌లోని అలస్కా, అలూటియన్ దీవులను జార్‌ అలెగ్జాండర్‌.. 7.2 మిలియన్ డాలర్లకు అమెరికాకు అమ్మేశాడు. ఆ తర్వాత కొద్ది కాలంలో అలస్కాలో రష్యా కాలనీలు సైతం ఉన్నాయి.  ఇక, 1881లో జార్‌ అలెగ్జాండర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. కాగా, అక్టోబరు 18న అమెరికాలో అలాస్కా విలీనమైన కారణంగా ఆ తేదీన అలాస్కా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతుండగా పాశ్చాత్య దేశాలు ర‍ష్యపై విధించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పలు దేశాలు రష్యా, అలాగే రష్యన్ బిలియనీర్లకు చెందిన ఆస్తులను జప్తు చేశాయి. దీంతో రష్యా సైతం అమెరికా, ఇతర దేశాలకు చెందిన ప్రముఖులు రష్యాలో అడుగుపెట్టకుండా ఆంక్షలు విధించింది. 

ఇది కూడా చదవండి: యుద్ధం ముగించండి.. ససేమిరా అంటున్న రష్యా!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top