
ఆస్టిన్, న్యూజెర్సీ, రాలీలో సన్నాహక సభలు విజయవంతం
అమెరికా,డల్లాస్ లోని డాక్టర్ పెప్పర్ ఎరినా వేదికగా జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. డల్లాస్ సభను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సన్నాహక సభల్లో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సందడి నెలకొంది. ఆస్టిన్, న్యూజెర్సీ, రాలీలో నిర్వహించిన సన్నాహక సభలు విజయవంతమయ్యాయి.
ఆస్టిన్ లో నిర్వహించిన సన్నాహక సభలో 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే లు, గండ్ర వెంకట రమణ రెడ్డి, పెద్ది సుధర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ మహేష్ తన్నేరు, అభిలాష్ రంగినేని, వంశీ కంచర్ల కుంట్ల, శ్రీధర్ రెడ్డి, వ్యాళ్ల హరీష్ రెడ్డి, వెంకట్ మంతెన, శ్రీనివాస్ పొన్నాల, శీతల్ గంపవరం, అరుణ్ బీఆర్ఎస్ , వెంకట్ గౌడ్ దుడాల, రాజ్ పడిగల, మల్లిక్ , నవీన్ కనుగంటి, సుధీర్ జలగం, గాయకురాలు స్పూర్తి జితేంద్ర తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆస్టిన్‌లో వక్తలు వివరించారు.

ఇక న్యూజెర్సీలోని గోదావరి ప్రిన్స్‌టన్‌లో జరిగిన సన్నాహక సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యే గదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బాల మల్లు, కార్పొరేటర్ రోజా మాధవరం, యుగంధర్, జక్కిరెడ్డి శ్రీనివాస్ , రవి ధన్నపునేని, మహేష్ పొగాకు తదితరులు పాల్గొన్నారు. జూన్ 1న డల్లాస్‌లో జరిగే గ్రాండ్ సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యూఎస్ఏ.. నార్త్ కరోలినాలోని రాలీలో.. యూనిటీ, సన్నాహక సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, టీటీజీఏ అధ్యక్షుడు భారతి వెంకన్నగారి, మాజీ అధ్యక్షులు చంద్ర ఎల్లపంతుల, కృష్ణ పెండోటి, మహిపాల్ బేరెడ్డి, హరీష్ కుందూర్, పున్నం కొల్లూరు, వీరేందర్ బొక్కా, శంకర్ రేపాల, అరుణ జ్యోతి కట్క, శ్రీధర్ అంచూరి, రఘు యాదవ్ , రాజు కటుకం , శ్రీనాథ్ అంబటి , క్రాంతి కుమార్ కట్కం, ఉమేష్ పరేపల్లి , హరి అప్పని, రాఘవ రావు తదితరులు హాజరై ప్రసంగించారు.
రానున్న రెండు రోజుల్లో హ్యూస్టన్, డెలావేర్, వాషింగ్టన్, కాలిఫోర్నియా, డల్లాస్‌లో సన్నాహక సభలు నిర్వహించనన్నారు. అలాగే, మే 30 సాయంత్రం అతిథులతో భారీ ఎత్తున సభ నిర్వహించనున్నారు. కేటీఆర్ యూఎస్ పర్యటన వివరాలను మహేశ్ బిగాల తెలిపారు.
అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారని వివరించారు. జూన్ 1న టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ భారీ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్ఆర్ఐలు హాజరవుతారు.
జూన్ 2న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లో భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచే కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్, భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి మాట్లాడనున్నారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యూఎస్ పర్యటనపై అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రవాస తెలంగాణవాసులతో పాటు ప్రవాస భారతీయులు, విద్యార్థులను తన పర్యటనలో కేటీఆర్ కలవనున్నారు.