క్షణికావేశం.. తీరని శోకం | Telangana Incident | Sakshi
Sakshi News home page

క్షణికావేశం.. తీరని శోకం

Mar 15 2026 5:39 AM | Updated on Mar 15 2026 5:39 AM

Telangana Incident

ఇద్దరు పిల్లల గొంతు నులిమి తల్లి ఆత్మహత్య 

రహమత్‌నగర్‌: క్షణికావేశంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో విషాదం నింపింది. తాను లేని బతుకు పిల్లలకు ఎందుకనుందోగానీ ముక్కుపచ్చలారని చిన్న పిల్లల గొంతు నులిమేసింది. ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ ఘటనలో తల్లి, కొడుకు మృతి చెందగా పాప మృత్యువుతో పోరాడుతోంది. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తగూడెంకు చెందిన మురళివేణుకు మందమర్రికి చెందిన సత్యవాణి (33)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రుద్రాన్‌‡్ష (5), తన్విక(2) పిల్లలున్నారు. ప్రైవేటు పనులు చేసుకునే మురళి వేణు తన భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో బోరబండ డివిజన్‌లోని పెద్దమ్మగుడి నగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. మురళివేణు తండ్రికి కిడ్నీలు పాడైపోవడంతో రెండు రోజులకుకోమారు డయాలసిస్‌ చేయిస్తుంటాడు.

తల్లి హౌస్‌ కీపింగ్‌ పనికి వెళ్తోంది. ఐదు సంవత్సరాల క్రితం ము­రళివేణుకు ట్రాన్స్‌కో జూనియర్‌ లైన్‌మెన్‌గా ప్రైవేటు ఉద్యోగం వచ్చింది. గత కొన్ని రోజులుగా సత్యవాణి, మురళిల మధ్య మ­నస్పర్థలు మొదలయ్యాయి. తనతో, పిల్లలతో గడపడం లే­దంటూ, బయట పనులే ఎక్కువయ్యాయని ఇంట్లో గొడవ పడే­వారని తెలిసింది. ఈ క్రమంలోనే తమ పెళ్లి రోజైన శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన సత్యవాణి తన పిల్లలు రుద్రాన్‌‡్ష, తన్వికల గొంతు నులిమేసింది. వారు చనిపోయారని భావించాక తానూ ఉరి వేసుకుని బలవర్మణం చెందింది.

ఆమె అత్త హౌస్‌ కీపింగ్‌ పని ముగించుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాక గమనించి 100 డయల్‌కు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి చేరుకున్న బోరబండ ఎస్‌హెచ్‌ఓ సురేందర్‌ గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే తల్లి సత్యవతి, కొడుకు రుద్రాన్‌‡్ష మృతి చెందారు. కూతురు తన్విక కొన ఊపిరితో ఉండగా చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప పరి«స్థితి విషమంగా ఉందని సమాచారం. బోరబండ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement