సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత, ఖర్చులు పెరగడంతో చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ధరల పట్టికలను సవరిస్తున్నాయి. టిఫిన్¯ సెంటర్లు రూ.10 నుంచి 20, హోటళ్లు బిర్యానీ, మీల్స్‌పై రూ.50 వరకు పెంచేశాయి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలుతుండడంతో పాటు కొందరు డీలర్లు కృత్రిమ కొరత సష్టిస్తున్నారు. దీంతో హోటల్ నిర్వహకులు ఒక్కో సిలిండర్‌పై అదనంగా రూ.300–500 చెల్లించాల్సి వస్తోంది. కాగా, గ్యాస్ మాత్రమే కాక రవాణా చార్జీలు కూడా పెరగడంతో కిరాణం సరుకులు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఇది హోటల్ యజమానులకు భారంగా మారింది. మేడ్చల్ జిల్లాలోని హాస్టళ్లలో టిఫిన్లు బంద్ చేశారు. మూడు పూటలా భోజనమే వడ్డిస్తున్నారు.
బావర్చి... పార్సిళ్లకే పరిమితం
హైదరాబాద్ బిర్యానీ అంటే.. బావర్చి అనేంతగా ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చి హోటల్‌పైనా సిలిండర్ కొరత ప్రభావం పడింది. నిర్వాహకులు బిర్యానీని పార్సిళ్లకు మాత్రమే పరిమితం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ నడపడం చాలా కష్టమేనని బావర్చి హోటల్ నిర్వాహకుడు సల్మాన్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పార్సిల్ సెంటర్ కూడా మూతపడేలా ఉంది. క్రాస్ రోడ్స్‌లోని మరో ప్రముఖ రెస్టారెంట్ కూడా మూతపడింది.
రైల్వేస్టేషన్‌లో పెరుగుతున్న రద్దీ
సికింద్రాబాద్: ఎండలు ముదరడం.. గ్యాస్ కొరత వల్ల వీధి వ్యాపారాలు మూతపడటం.. కాలేజీ విద్యార్థుల పరీక్షలు ముగియడం, శుభముహూర్తాలకు అనువైన వాతావరణం ఉండటంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రెండు రోజులుగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్యాస్ కొరతతో ఫుట్‌పాత్ వ్యాపారాలు ఇప్పటికే మూతపడ్డాయి. హాస్టళ్లు, హోటళ్లు కూడా మెను ఐటమ్స్‌ను తగ్గించి నేడోరేపో మూసివేసే స్థితికి చేరే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కారి్మకులు సైతం సొంత ఊర్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వస్తున్నారు. జనరల్ ప్రయాణికులను అదుపు చేసేందుకు ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.


