Family
-
ఫోరెన్సిక్ వైద్యంలో 'మరణపూర్వ గాయాలు' అంటే? ఎలా గుర్తిస్తారంటే..
భోపాల్‌లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మరణించడానికి ముందు శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయలయ్యాయని ఫోరెన్సిక నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మరణపూర్వ గాయాలు అంటే ఏంటీ?, ఫోరెన్సిక్ వైద్యులు వాటిని ఎలా గుర్తిస్తారు వంటి వాటి గురించి తెలుసుకుందామా.!.ఫోరెన్సిక్ దర్యాప్తులలో ఇవి అత్యంత కీలకమైన ఆధారాలు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తే పోస్ట్‌మార్టం నిర్వహించడానికి తరలిస్తారు పోలీసులు. అక్కడ ఫోరెన్సిక నిపుణులు ఆ వ్యక్తి ఎలా మరణించాడో నిర్థారించే ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత నిపుణులు పోస్ట్‌మార్టం నివేదికలో మరణానికి ముందు గాయాలు, మరణానంతర గాయాలు అని పేర్కొంటూ ఇస్తారు. ఇవి కేసుని చేధించడానికి ఎంత కీలకం అంటే..ఆయా వ్యక్తుల మరణానికి కారణమైన నేరస్తులను వెలకితీయడానికి ప్రధాన ఆధారాలు. 'మరణపూర్వ గాయాలు' అంటే ..ఫోరెన్సిక్ వైద్యంలో, "మరణపూర్వ" అంటే మరణానికి ముందు జరిగే గాయలని అర్థం. జీవించి ఉండగానే అయ్యిన గాయాలని అర్థం. అవికోతలు లేదా రాపిడి గాయాలువాపుఎముకలు విరగడంఅంతర్గత రక్తస్రావంబలహీనమైన దెబ్బలుఆత్మరక్షణ గాయాలు తదితరాలు.వైద్యులు చెప్పేదేమిటంటే, ఈ పదం గాయాలు ఎలా జరిగాయో దానంతట అదే వెల్లడించనప్పటికీ, మరణానికి దారితీసిన పరిస్థితులను నిర్థారించడంలో కీలకపాత్ర పోషిస్తుంద.ఎలా గుర్తిస్తారంటే?మరణానంతర పరీక్ష సమయంలో, ఫోరెన్సిక్ నిపుణులు మరణానికి ముందు శరీరం గాయానికి ప్రతిస్పందించిందని చూపే ఆధారాలను సేకరిస్తారు. కణజాలంలోకి రక్తస్రావం, వాపు లేదా ఉబ్బరం, రంగు మార్పులతో కూడిన కమిలిన గాయాలు, రక్తం గడ్డకట్టడం, రక్త ప్రసరణ చురుకుగా ఉందని సూచించే కణజాల ప్రతిచర్యలు వంటివి ముఖ్యమైన సంకేతాలు. గుండె ఇంకా రక్తాన్ని పంపింగ్ చేస్తూ, శరీరం సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రతిస్పందనలు సాధ్యమవుతాయి. ఇవి చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నివేదిక. దర్యాప్తు అధికారులు ఈ గాయాలు మరణానికి ఏవిధంగా దోహదపడ్డాయి, ఆ టైంలో ఏదైన పెనుగులాట జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగాయ, స్వయంగా జరిగినవా వంటివి నిర్థారిస్తారు. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న కేలుసలలో లేదా ఏదైన కుట్రపన్ని ఉద్దేశ్యపూర్వకంగా చంపేసిన ఘటనల్లోనే ఇలాంటి బహుణ మరణ పూర్వగాయాలకు ఆస్కారం ఉంటుంది. అదీగాక పోలీసులు వైద్య నివేదికలు లేకుండా ఒక నిర్ధారణకు రాకూడదని నిపుణులు హెచ్చరిస్తుంటారు. మరణానంతర గాయాలు అంటే..మరణం తర్వాత కలిగే గాయాలను మరణానంతర గాయాలు అంటారు. ఇవి సాధారణంగా అవే జీవసంబంధమైన ప్రతిచర్యలను చూపించవు.మరణానికి పూర్వం-మరణానంతర గాయాల మధ్య వ్యత్యాసం..మరణానికి ముందు గాయాలుమరణానికి ముందు సంభవిస్తాయిరక్తస్రావం, వాపును చూపుతాయిగాయం జరిగినప్పుడు శరీరం సజీవంగా ఉందని సూచిస్తాయిమరణానంతర గాయాలుమరణం తర్వాత సంభవిస్తాయిసాధారణంగా వాపు లేదా కణజాల ప్రతిచర్య ఉండదుఇది రవాణా సమయంలో, పర్యావరణానికి గురైనప్పుడు లేదా శరీరాన్ని తాకినప్పుడు జరగవచ్చు. ఇక్కడ కేసుని చేధించడంలో ఫోరెన్సిక్ నివేదిక అనేది దర్యాప్తులో ఒక భాగం మాత్రమే. అధికారులు ఒక నిర్ధారణకు రావడానికి ముందు పోలీసుల ఇన్విస్టిగేషన్, సాక్షుల వాంగ్మూలాలు, టాక్సికాలజీ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, వైద్య చరిత్ర వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.(చదవండి: సింగింగ్'తో జీర్ణక్రియ మెరుగుపడుతుందా? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు) -
ఆస్ట్రోటూరిజం అంటే..!
ప్రయాణం అంటే ప్రపంచంలోని అన్ని ప్రదేశాలను సందర్శించడం మాత్రమే కాదు. ఈ రోజుల్లో, చాలా మంది యువ ప్రయాణికులు ప్రయాణాన్ని ఒక విభిన్న కోణంలో అనుభవించడం గురించి ఆలోచించడం ప్రారంభించారు. ప్రతిదీ చాలా నెమ్మదిగా, మరింత భావోద్వేగభరితంగా ఉండాలి వారికి. వారి ఆలోచనల్లో నుంచి పుట్టుకు వచ్చిందే ఆస్ట్రోటూరిజం. దీని అర్థం నల్లని ఆకాశంలో మిలమిల్లాడే నక్షత్రాలను చూడటం, ఉల్కాపాతాలను వీక్షించడం, ఇతర చీకటి ఆకాశ ప్రదేశాలను సందర్శించడం.. అలాంటి విశాల ప్రదేశాల కోసం వెదుకులాట మొదలయ్యింది. వాటి చుట్టూ సెలవులను ప్లాన్ చేసుకోవడం పెరిగింది. రోజువారీ జీవితంలోని టెన్షన్లకు దూరంగా ఉండి, సందర్శకులకు ఎంతో మనశ్శాంతిని అందించే మనదేశ ప్రదేశాలలో.. లడఖ్‌లోని ఖగోళశాస్త్ర శిబిరాలు, గుజరాత్ ఎడారులలోని రాత్రి ఆకాశ యాత్రలు వంటి ఇతర అనుభవాల పట్ల ప్రయాణికులు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. నక్షత్రాల కింద నిద్రించడంఆస్ట్రోటూరిజం అనేది టెలిస్కోపిక్ పరిశీలన, నక్షత్రాల కింద నిద్రించడం, ఉల్కాపాతాలు, ఖగోళ శాస్త్ర పర్యటనలు వంటి కార్యకలాపాలపై కేంద్రీకృతమై ఉంటుంది. నేడు, పర్యాటకులు మరింత తీరికైన ప్రయాణాలను కోరుకుంటున్నందున, ప్రపంచవ్యాప్తంగానూ చీకటి ఆకాశ ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతోంది. సాధారణ పర్యాటక కార్యకలాపాల్లా కాకుండా, నక్షత్రాలను చూడటానికి సమయం తీసుకుని శ్రద్ధగా గమనించాలి. నిరంతరం వారిని పనిలో మునిగిపోయేలా చేసే ఈ సాంకేతిక యుగంలో, ముఖ్యంగా యువ పర్యాటకులు ఈ యాత్రలను ఎంతో ఆకర్షణీయంగా భావిస్తున్నారు. ఎందుకు ఇష్టపడుతున్నారంటే.. చాలా కాలంగా, ప్రయాణ సంస్కృతి సోషల్ మీడియా, స్పీడ్‌గా ఉండే పర్యటన ΄్లాన్స్, అత్యంత సౌందర్యాత్మక అనుభవాల ద్వారా బాగా ప్రభావితమైంది. ఇటీవల భావోద్వేగపు అనుభవాన్ని కోరుకునే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఆస్ట్రో టూరిజంలో సుదూర ప్రాంతాలు, కనెక్టివిటీ లేకపోవడం, నిశ్శబ్దం, నిర్మలమైన ఆకాశం అందించే ప్రశాంత భావన ఈ రకమైన పర్యాటకం యువతరానికి ఆకర్షణీయంగా మారింది. సోషల్ మీడియా కూడా ఇటువంటి విహారయాత్ర ప్రణాళికలకు మరింత ఆకర్షణను జోడించి, ఈ ప్రయాణ ధోరణి వైపు మరింత మందిని ఆకర్షిస్తోంది.డార్క్ స్కై టూరిజం ప్రాంతాలుమన దేశంలో తక్కువ కాంతి, కాలుష్యం ఉన్న ప్రాంతాలైన లడఖ్ , స్పితి లోయ, రాన్ ఆఫ్ కచ్, కూర్గ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు .. నక్షత్రాలను వీక్షించే పర్యటనలపై ఆసక్తి ఉన్న పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. సాంప్రదాయేతర ప్రయాణ అనుభవాలను కోరుకునే యువ పర్యాటకులలో ఆస్ట్రోఫెస్ట్లు, పరిశీలన పర్యటనలు, ఆస్ట్రో క్యాంపులు, టెలిస్కోప్ టూరిజం వంటివి ప్రజాదరణ దుతున్నాయి. కొత్త తరం ప్రయాణికుల కోసం పర్యాటక రంగం మారుతున్న స్వభావం నుండే ఆస్ట్రోటూరిజంకు ప్రజాదరణ పెరుగుతోంది. ఈ రోజుల్లో పర్యటన అంటే ఆడంబరం కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దం, ధ్యానంతో ఎక్కువగా ముడిపడి ఉంది. (చదవండి: పెట్స్‌ని టూర్‌కి తీసుకువెళ్లాలంటే..!) -
పెట్స్‌ని టూర్‌కి తీసుకువెళ్లాలంటే..!
కుక్కలను పెంచుకునేవారికి పర్యటనలకు వెళ్లేటప్పుడు వాటిని ఎక్కడ ఉంచి వెళ్లాలో తెలియదు. తోడుగా తమతో పాటు తీసుకెళ్లాలనుకుంటారు. సాధారణంగా కారు ప్రయాణం అయితే తమతోపాటు తీసుకెళ్లే వీలుంది. కానీ, బస్సు, ట్రెయిన్, విమాన ప్రయాణాలలో పెట్స్‌ను తీసుకెళ్లడం కుదురుతుందా..?!ఏ వాహనంలోనైనా తమ పెంపుడు జంతువును తీసుకెళ్లే వీలుందా అనే విషయాన్ని ‘ముందస్తుగా బుక్ చేసుకున్నా’ కన్ఫర్మ్ చేసుకుంటూనే ఉండాలి. బడ్జెట్ తప్పనిసరిగా కేటాయించుకోవాలి. కొన్ని పెట్ రైలు ప్రయాణం కోసం నెలల తరబడి టైమ్ పట్టవచ్చు. టికెట్ రేట్లు కూడా ప్రయాణాన్ని బట్టి ఉంటాయి. హోమ్ స్టే కోసం రూ.600 నుంచి 10,000 వరకు ఉంటుంది. సౌకర్యానికే మొదటి ప్రాధాన్యత..సుదీర్గ రైలు ప్రయాణాలు, గంటల తరబడి కారు ప్రయాణాలు, విమానప్రయాణాలు జంతువులను గందరగోళాన్ని కలిగించవచ్చు. వాటి దినచర్య పెట్ యజమానికి తెలుసు కాబట్టి, దానికి తగిన విధంగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజుల ముందు నుంచే కారులో వాటిని షికారుకు తీసుకెళ్లాలి. ప్రయాణాన్ని అలవాటు చేయాలి. తేలికపాటి భోజనం పెట్టడం, తగినన్ని నీళ్లు తాగించడం చేయాలి. అవసరమైనవి వెంట తీసుకెళితే..కుక్కలు విశ్రాంతి తీసుకునే పరుపులు, ఆడుకునే బొమ్మలు, వాటికి తెలిసిన వస్తువులు వెంట తీసుకెళ్లాలి. ఇవి కొత్త పరిసరాలలో వాటి రోజువారీ జీవనాన్ని మొదలుపెట్టడానికి సహాయపడతాయి. ఆహారపు అలవాట్లలో ఆకస్మిక మార్పులు ఉన్నా, తెలిసిన వస్తువుల ద్వారా కొంత అలజడిని నివారించవచ్చు. అనుకూలమైన ప్రదేశాలుకొన్నినగరాలలో క్యాట్ కేఫ్‌లు, డాగ్ పార్కులు ఉంటాయి. వాటికి మీ పెట్స్‌ను తీసుకెళ్లినంత మాత్రానా అవి అనుకూలంగా ఉండకపోవచ్చు. మన దేశంలో పెంపుడు జంతువులను సహించేవారు ఎక్కువే మందే ఉన్నారు. అలాగని అన్ని హోటళ్లు కుక్కలను అనుమతించవు. కొన్ని హోటళ్లు మార్కెటింగ్ కోసం పెట్స్‌కు ‘అనుమతి’ని ఇస్తున్నాయి. పెట్స్ తమతో పాటు ఉండాలంటే ప్రైవేట్ విల్లాలు, ఫామ్ హౌజ్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. గోవా వంటి ప్లేసుల్లో రెస్టారెంట్లు, బీచ్‌లలో పెట్స్‌కు తగినంత స్వేచ్ఛ లభిస్తుంది. మహాబలేశ్వర్‌లోని బీచ్, కొండ ప్రాంతాల్లో చేసే ట్రెక్కింగ్, ప్రశాంతమైన వీధుల గుండా పెట్స్‌తో ప్రయాణించవచ్చు. మీతో పాటు మీ కుక్క సముద్రపు అలలతో ఆడుకోవడం, రోజంతా కొత్త అనుభవాల కోసం అన్వేషించడం, తర్వాత మీతో పాటు ముడుచుకొని విశ్రాంతి తీసుకోవడం.. పెట్‌తో చేసే ప్రయాణంలో ఇవన్నీ అందమైన జ్ఞాపకాలుగా నిలిచి΄ోతాయి. ఆందోళన అనిపించే ఎలాటి అడ్డంకి అయినా సులువుగా తొలిగిపోతుందన్న భావన మదిలో మెదులుతుంది. -
సమ్మర్ సఫారీ చేద్దామా..!
దట్టమైన అటవీ ప్రాంతంలో జీపు సఫారీ..బెంగాల్ పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లను దగ్గరినుంచి తిలకించడం, రిజర్వాయర్‌లో బోటు షికారు.. నదుల మధ్య కాటేజీలు, తాబేలు, మొసలి వంటి థీమ్ కాటేజీలు, ట్రెక్కింగ్ చేయాలన్నా.. చూడాలన్నా ఏ విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తే చాలు వన్య్రప్రాణుల సహజసిద్ధమైన జీవన శైలిని కళ్లారా చూస్తూ.. ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చు. ఈ వేసవిలో పర్యాటకులకు మంచి అనుభూతిని మిగిల్చేందుకు రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర అటవీ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాయి.ప్రకృతిని, వన్య ప్రాణులను దగ్గరి నుంచి చూడాలనుకునే వారికి సంతృప్తి పరిచేలా పలు పర్యాటక ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అడవులు, అటవీ జంతువులు, పక్షులు, నదులు, సహజ సిద్ధంగా ఏర్పడిన అందాలు, కృష్ణా, గోదావరి నదుల మధ్యలో కాటేజీలు ఇలా ఏ ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలనుకున్నా అందుకు తగిన ΄్ప్రాకేజీలు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణలోని ప్రధాన వన్య్ప్రాాణి పర్యాటక కేంద్రాలు ఇలా ఉన్నాయి. పర్యాటకులు తమ పర్యటనను అధికారిక వెబ్సైట్ల ద్వారా ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. వేసవి ఎండల దష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ అటవీ ప్రాంతం టేకు చెట్లకు ప్రసిద్ధి. ఓపెన్ టాప్ జీపుల్లో అడవి లోపలికి తీసుకెళ్తారు. ఉదయం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు, అలాగే 9:30 నుంచి 11:30 గంటలు; మధ్యాహ్నం 3:30 – 5:30 వరకు సఫారీ అందుబాటులో ఉంటుంది. సాధారణ రోజుల్లో జీపునకు (6 గురు వరకు) రూ.3,500, వారాంతాల్లో రూ.4వేల వరకు ఉంటుంది. ఏటూరునాగారం వన్య్రప్రాణి అభయారణ్యం (తాడ్వాయి)వరంగల్ సమీపంలోని ఏటూరు నాగారం వన్య్రప్రాణి అభయారణ్యంలో ’తాడ్వాయి హట్స్’ (కుటీరాలు), ’నైట్ వాచ్’ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. జీపు సఫారీకి రూ.1,500లు, అటవీ ట్రెక్కింగ్‌కు ఒక్కొక్కరికి రూ.100 ఉంటుంది. అలాగే సైక్లింగ్ సౌకర్యం ఉంది. ఇక్కడ భారీ ఉడుతలు, అడవి దున్నలు కనిపిస్తాయి.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (నల్లమల అడవులు)హైదరాబాద్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి. ఇక్కడ ‘టైగర్ స్టే‘ ప్యాకేజీ ప్రత్యేక ఆకర్షణ. ఇందులో పర్యావరణ విద్యా కేంద్రం సందర్శన, సఫారీ, ట్రెక్కింగ్ ఉంటాయి. ఫరాహాబాద్ సర్క్యూట్లో ఈ సఫారీ సాగుతుంది.కృష్ణా నది అందాలను చూస్తూ గడపడానికి తాబేలు, మొసలి వంటి థీమ్ కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమ్రాబాద్‌లో మూడు రకాల సఫారీలు అందుబాటులో ఉన్నాయి. ఫరాహాబాద్ సఫారీ మెుత్తం 16 కి.మీ. ప్రయాణం కాగా... 7 సీట్ల వాహనానికి రూ. 3 వేలు ఛార్జ్ చేస్తున్నారు. గుండం సఫారీ దట్టమైన అడవిలో 35 కి.మీ. ప్రయాణం కాగా.. వాహనానికి రూ. 5 వేలు, అక్కమహాదేవి గుహల సఫారీ 14 కి.మీ ప్రకృతి అందాల మధ్య ప్రయాణానికి.. 5 సీట్ల వాహనానికి రూ. 3 వేలు వసూలు చేస్తున్నారు. కిన్నెరసాని వన్య్రప్రాణి అభయారణ్యం (కొత్తగూడెం) ఖమ్మం సమీపంలోని కొత్తగూడెంలో ఉన్న ఈ ప్రాంతం నీరు, పచ్చదనంతో అలరారుతుంటుంది. డీర్ పార్క్ (జింకల పార్క్), రిజర్వాయర్‌లో బోటింగ్ సౌకర్యం కలవు. ఇక్కడి ప్రకతి అందాల మధ్య ప్రశాంతంగా గడపడానికి కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.. భద్రాచలం పుణ్యక్షేత్రం వెళ్లే సమయంలో వీటిని సందర్శించవచ్చు. – బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం (చదవండి: ఇరాన్లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!) -
ఇరాన్లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!
పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఎన్ని ఇక్కట్లు వచ్చాయో తెలిసిందే. గ్యాస్ నుంచి పెట్రోల్ వరకు దాని అన్నిట్లపై దాని ప్రభావం ఏం రేంజ్లో ఉందో తెలసిందే హార్బూజ్ జలసంధి మూసివేతతో వచ్చిన కష్టాలివి. భారత్ పట్ల సముచితంగా ఇరాన్ ఉన్నా..మనకు ఈ ఇబ్బందులు మాతరం ఇప్పట్లో తగ్గేలే లేని పరిస్థితి. ఈ తరుణంలో ఇరాన్లో మన భారతీయవ దేవాలయంకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పైగా విష్ణు మంత్రాలు సైతం పర్షియన్ భాషలోనే ఉండటం విశేషం. మరి ఆ ఆలయ విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్ రాజధాని అయిన బందర్ అబ్బాస్‌లో ఉన్న విష్ణు దేవాలయం ఉన్న వీడియోని నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే ఏంటా ఆలయం అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ వీడియో క్యాప్షన్‌లో రాన్‌లోని బందర్ అబ్బాస్‌లో ఉన్న పురాతన హిందూ విష్ణు దేవాలయం. 1892లో, ఖజార్ యుగంలో నిర్మించబడింది. ఈ నగరంలో పనిచేస్తున్న భారతదేశానికి చెందిన హిందూ వ్యాపారుల కోసం దీనిని నిర్మించారు, ఆ గుడిలోని పాట సైతం పర్షియన్ భాషలోనే ఉంది అని పేర్కొన్నారు. 83 ఏళ్ల నటుడు అమితాబ్ షేర్ చేసిన వీడియో కారణంగా అందరిలో ఒక్కసారిగా ఆ ఆలయ విశేషాలు గురించి తెలుసుకునే ఆసక్తిని రేకెత్తించింది. ఆలయ చరిత్రచారిత్రక కథనాలు, యూట్యూబ్‌లోని వివిధ ట్రావెల్ వ్లాగ్‌ల ప్రకారం..ఈ ఆలయం 1892లో మహమ్మద్ హసన్ సాద్-ఓల్-మాలిక్ పాలనలో హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో నిర్మించారని తెలుస్తోంది. బందర్ అబ్బాస్, భౌగోళికంగా ఇది ప్రసిద్ధిగాంచిన ప్రదేశం, అదీగాక ముఖ్యమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి వెంబడి ఉంది. ఇది విష్ణుమూర్తి ఆలయం. ఒకప్పుడు, భారతీయులకు, ఇరాన్‌లకు మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు ప్రతికగా ఈ దేవాలయం నిలుస్తోంది. ఇది ఇండో-ఇరానియన్ వాస్తుశైలికి నిలువెత్తు నిదర్శనం. అలాగే చరిత్రకారుల ప్రకారం..కవి,రచయిత మహమ్మద్ అలీ సదీద్ అల్-సల్తానే తన ఒక రచనలో బ్రిటిష్ ఇండియన్ కంపెనీ కోసం పనిచేస్తున్న భారతీయులకు 1888లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది, ఆ తర్వాత హిందూ కమ్యూనిటీలకు ప్రత్యేకంగా ఒక దేవాలయం ఏర్పడింది. అప్పట్లో ఇరు వర్గాలు ఎంత శాంతియుతంగా జీవించాయనేందుకు నిదర్శనం ఈ కట్టడం. స్థానికులు హిందువులను 'గూర్' లేదా 'గాబర్' అని పిలిచేవారు కాబట్టి, ఈ ఆలయాన్ని స్థానికులు 'గూరన్' అని పిలుస్తారు. భారత్‌లో ఉండే ఆలయాల మాదిరిగా సాంప్రదాయ వాస్తుశిల్పం ఈ ఆలయానికి లేదు. మధ్యలో ఉన్న చతురస్రాకార గది ఉల్లిపాయ ఆకారంలో ఉన్న గోపురంతో కప్పబడి ఉంటుంది, దానిపై తామర పువ్వుల చెక్కి ఉన్నాయి. ఈ గుడిలోనే పూజారులు, సన్యాసుల కోసం గదులు కూడా నిర్మించారు. 1979 ఇస్లామిక విప్లవం కారణంగా ఈ గుడిలోని చాలా విగ్రహాలు, చిత్రాలు ధ్వసం అయ్యాయి. పైగా అధిక సంఖ్యల్లో భారతీయులు ఇరాన్‌ను విడిచిపెట్టారు. ఈ ఆలయంలో బుద్ధుడు, విష్ణుమూర్తి విగ్రహాలు, శ్రీకృష్ణుని చిత్రాలను చూడవచ్చు. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా, ఆయన పక్కన రాధ కూర్చుని ఉన్న ఒక చిత్రం ఉంది. పునరుద్ధరణ అవసరమైన హిందూ దేవతల పాత విగ్రహాలు కూడా ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న ఒక గది మ్యూజియంగా మారింది. అక్కడి పెట్టెలలో ఒకదానిలో, ఆనంద తాండవం చేస్తున్న నటరాజు శివుని పురాతన విగ్రహం ఉంది. కాగా ఇరాన్లో ఇదొక్కటే హిందూ దేవాలయం కాదు, ఇరాన్‌లోని సిస్తాన్ , బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్‌లో ఒక ఆర్య సమాజ్ దేవాలయం కూడా ఉంది.ఆ ఆలయంలో పాటలు..ఏయ్ విష్ణు జాన్ (ఓ ప్రియమైన విష్ణు)ఏయ్ రామ జాన్ (ఓ ప్రియమైన రామా)ఏయ్ కృష్ణ జాన్ (ఓ ప్రియమైన కృష్ణా)దర్ ఖల్బ్-ఎ మా బేమన్ (మా హృదయాలలో ఉండిపో)హమీషే బేమన్-2 (శాశ్వతంగా ఉండిపో)నూర్-ఎ తో బేతాబాద్ (నీ కాంతి ప్రకాశించుగాక)ఇష్క్-ఎ తో బేతాబాద్ (నీ ప్రేమ ప్రకాశించుగాక) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
పాటలు పాడటం ఇంత మంచిదా..? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు
సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని మన పెద్దలు చెబతుండటం విన్నాం. అంతెందుకు శ్రావ్యమైన సంగీతం వింటుంటే శారీరకంగా, మానసికంగా బాగుంటాం అని నిపుణులు సైతం అంటున్నమాటే. తాజాగా వినడమే కాదు పాటలు పాడితే మన జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందట. పైగా గట్ హెల్త్ బాగుంటుందని సాక్షాత్తు హార్వర్డ్ నిపుణులే చెబుతున్నారు. అదేవిధంగానో ఆ నిపుణుల మాటల్లోనే తెలుసుకుందామా.!.పాడటం అనేది కళాత్మక ప్రక్రియ. మరి దీనికి జీర్ణక్రియకు సంబంధం ఎలా అంటే.. పాటలు పాడినప్పుడు మనసు, పేగులు, నాడీ వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఒక బృందంగా పాడుతున్నప్పుడు శరీరంలో ఇమ్యూనోగ్లోబిన్ (ఏ), కార్డిసాల్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో గమనించారు. పాడటం అనేది మానవ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే జీర్ణ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందట. ఒత్తిడి, ఆందోళనతో చాలామంది బాధపడుతుంటారు. కానీ కొందరు దీన్ని అధిగమించిగలుగుతారు అందుకు ఇదే కారణమని అంటున్నారు.పాడినప్పుడు ఏం జరుగుతుందంటే..శరీరంపై సానుకూల ప్రభావం మెదడు నుంచి మొదలై వేగస్ నాడి ప్రేరణ ద్వారా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకోసం బీథోవెన్ సంగీతాన్ని ఆలపిస్తున్న బృందంపై పరిశోధనలు చేయగా, వారందిరలోనూ పాడటం కారణంగా లాలాజలంలో ఒక కీలకమైన రోగనిరోధక యాంటీబాడీ నాటకీయంగా పెరగడం గుర్తించామని తెలిపారు. ఆ యాంటీబాడీ.. జీర్ణవ్యవస్థ లోపలి పొర, గొంతు, శ్వాస మార్గాలలో మన శరీరానికి మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుందట. ఫలితంగా వ్యాధికారకాలు మనపై పట్టు సాధించే అవకాశం రాకమునుపే ఈ యాంటీబాడీ అడ్డుగోడగా మారుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే గానానికి ఆరోగ్యానికి పరస్పర సంబంధం ఉందని చెబుతున్నారు. మెదడుకు, పేగుకి మధ్య ఉన్న ప్రధాన సమాచార ప్రసార మార్గం అయిన వేగస్ నాడి పాటను ఆలపించగానే ఉత్తేజితమవుతుందట. ఎప్పుడైతే పాట కోసం ఉదర శ్వాసను ఉపయోగిస్తామో అప్పుడు ఈ వేగస్ నాడీ తక్షణమే యాక్టివ్ అవుతుందట. దాంతో విశ్రాంతి, జీర్ణక్రియ అనే ప్రక్రియ ఆటోమేటిగ్గా ఆన్ అయ్యి ప్రేగులు అత్యుత్తమంగా పనిచేయడం ప్రారంభిస్తాయట. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడటమేగాక, ప్రేగుల లోపలి పొర ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు శరీరంలో మంచి సూక్ష్మజీవుల సమతుల్యతకు మద్దతిస్తుందట. గానం ఎలా హెల్ప్ అవుతుందంటే..గానం విశ్రాంతిని ప్రోత్సహించి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే ఆటోమేటిగ్గా మనం రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోతాం. దాంతో జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ పాట పడటం కోసం ఉదర శ్వాసను వినియోగిస్తాం దాంతో శ్వాశ, నాడీవ్యవస్థ నియంత్రణ ఫలితం ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. జీర్ణవ్యవస్థకు మెదడు నుంచి సరైన సంకేతాలు అందితేనే తన పనిని సజావుగా జరపగలదట. అందువల్లే గానం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నొక్కి చెప్పగలమని అన్నారు. గానం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అది సమర్థవంతంగా సంకేతాలను అందించడంతో ప్రేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అన్నారు. అందరూ పాడేటప్పుడు లోతైన శ్వాసను తీసుకుంటే వేగస్ నాడీ ఉత్తేజమయ్యి..జీర్ణవ్యవస్థ బాగుండేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే మన పూర్వీకులు మన చేత నిరంతరం జపాలు, పారాయణాల పేర్లతో మంత్రాలు, భక్తిపాటలను లయబద్ధంగా ఆలపించేలా చేసేవారని అంటున్నారు. అంటే మెరుగైన ఆరోగ్యానికి చక్కటి జీవనశైలి, శ్వాస, మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమనేది గుర్తురెగండి అని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం View this post on Instagram A post shared by Akanksha Pandey (@acanxa) (చదవండి: వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే..) -
ఆమె ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..
ఫుడ్‌తో కొంగొత్త పరిచయాలే కాదు..ఓ దేశాన్నే మైమరిపించొచ్చు. ఎంతటి శత్రుత్వాలు, కోపతాపలు..ఒక్క విందుతో సమసిపోతాయి. అలాంటి టేస్టీ ఫుడ్‌తో ఇతర దేశాల మనసును దోచుకుని కోట్లు ఆర్జించడం మాటలు కాదుకదా. అలాంటి ఘన విజయాన్నే అందుకుంది ఈ భారత సంతతి మహిళ. మన భారతీయ రుచులను జోడించి తయారు చేసిన ఐస్‌క్రీమ్ బ్రాండ్‌తో దూసుకుపోతూ..శెభాష్ అనిపించుకుంటోంది పూజా బావిషి. ఎవరామె అంటే..భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పూజా బావిషి, 'మలై' అనే ఐస్ క్రీమ్ బ్రాండ్‌తో అమెరికన్లను ఆకట్టుకుంటోంది. ఇది ఏడాదికి రూ. రెండు వేల కోట్లు టర్నోవర్‌ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఇద హోల్‌సేల్ ఈ కామర్స్ వ్యాపారంగా మారింది. 46 ఏళ్ల వ్యవస్థాపకురాలు, సీఈఓ 2015లొ ఈ మలైని ప్రారంభించారు. ఈ వ్యాపారం న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలలో నాలుగు దుకాణాలను నిర్వహిస్తోంది. చాలామటుకు ఐస్‌క్రీమ్‌లలో చాక్లెట్, వెనిలా వంటి ఫ్లేవర్లు చూశాం. కానీ అంతకుమించిన రుచి కోసం మలై వంటి వెరైటీ టేస్ట్‌ని పరిచయం చేశారు. దీని తయారీలో ఉపయోగించిన యాలకులు, గులాబీ, కుంకుమపువ్వు, జాజికాయ వంటి రుచులను జోడించడంతో అమెరికా వాసుల మనసులను దోచుకుంది ఈ మలై ఐస్ క్రీమ్. ఈ కంపెనీ 2025లోనే సుమారు రూ. రెండు వేల కోట్లు పైనే ఆర్జించేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతకుముందు ఏడాది 2024, 2025 సంత్సరాలలో సంస్థ లాభదాయకంగా సాగింది. ఇక పూజా విద్యా నేపథ్యం వచ్చేసి..బావిషి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అర్బన్ ప్లానింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే ఆమె ఆమె వాషింగ్టన్ డిసి-ఆధారిత లాభాపేక్షలేని సంస్థ అయిన ఈక్వల్ రైట్స్ సెంటర్లో పౌర హక్కుల ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిందిలా..స్నేహితులకు ఇంట్లో తయారు చేసిన ఐస్క్రీంల రుచి చూపించినప్పుడు వ్యాపారం చేయాలనే ఆలోచనకు అంకురార్పణ చేసినట్లు గుర్తు చేసుకుంది. అల్లం-స్టార్ సోంపు ఐస్ క్రీమ్ - ఒక డిన్నర్ పార్టీలో తక్షణమే అందర్నీ ఆకట్టు కోవడంతో..ఇలాంటి టేస్టే టేస్టీ ఐస్‌క్రీం షాపు పెట్టాలని భావించారట ఆమె. అయితే తన ఉత్పత్తులు మార్కెట్లో క్లిక్ అవుతాయో లేతో అన్న సందేహం మాత్రం బాగా ఉండేదని చెప్పుకొచ్చారామె. అయితే తన షాపుకు వచ్చే కస్టమర్ ఎలాంటి ఫ్లేవర్ కోరుకుంటున్నారు అనేది నిశితంగా గమనిస్తూ..టేస్టీ, టేస్టీ..మలై ఐస్‌క్రీమ్‌ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే తన షాపు కి వచ్చే కస్టమర్ ఎవరు?, వాళ్లకేం కావాలన్నదే పూర్తిగా అవగాహన ఉండాలని, లేదంటే వ్యాపారం లాభదాయకంగా ఉండదని అంటోంది. అలాగే తాను కేవలం లాభాల మీదే గాక, వ్యాపార విస్తరణపై కూడా దృష్టిపెట్టానని అన్నారు. అలాగే తాను వ్యాపారాన్ని చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి..అన్ని విధాల క్లిక అవుతుందని నమ్మకం కొనసాగేక ముందుకు తీసుకెళ్లానని అన్నారు. అలాగే భారతీయ రుచులు ప్రయోగాత్మకమైనవి కావు, ఈ రుచులను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించడం విశేషం. పైగా మార్కెట్ పరంగా అగ్రస్థానంలో ఉంది. అందుకు చాలా గర్వకారణంగా ఉందంటోంది పూజ. View this post on Instagram A post shared by Malai (@malai_icecream) (చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..) -
నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట!
మనం ఇంటి నుండి బయటకు అడుగుపెట్టగానే... ఆఫీసులు, ఆస్పత్రులు, పాఠశాలలు, మార్కెట్లు అన్నీ కేవలం 15 నిమిషాల నడక దూరంలోనే ఉంటే ఎలా ఉంటుంది? ఇదేదో ప్యారిస్ లేదా బార్సిలోనా లాంటి విదేశీ నగరాల్లోని అత్యాధునిక విధానం అనుకుంటున్నారా? కాదు.. పశ్చిమ దేశాలు ‘15 నిమిషాల నగరం’ (15-Minute City) అనే పదాన్ని కనిపెట్టక ముందే, మన భారతదేశంలోని పాత నగరాలు ఈ అద్భుతమైన జీవనశైలికి అసలైన చిరునామాలుగా నిలిచాయి. అయితే ఆధునికీకరణ వైపు పరుగెడుతూ, మన సొంత నమూనాను మనమే ఎలా చేజేతులా దూరం చేసుకున్నామో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.‘15 నిమిషాల నగరం’ అంటే ఏమిటి?కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సరికొత్త పట్టణ ప్రణాళికే ఈ ‘15 నిమిషాల నగరం’. పని ప్రదేశాలు, కిరాణా దుకాణాలు, ఆస్పతులు, పాఠశాలలు, రవాణా సౌకర్యాలు ఇలా రోజువారీ అవసరాలన్నీ ఇంటి నుండి కేవలం 15 నిమిషాల నడక లేదా సైకిల్ ప్రయాణంలో అందుబాటులో ఉండాలన్నదే ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. రోజువారీ ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడానికి పారిస్, బార్సిలోనా లాంటి ప్రపంచ నగరాలు ఇప్పుడు ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి.మన పాత నగరాలే దానికి జీవన ఉదాహరణలునిజానికి ఈ మోడల్ భారతదేశానికి ఏమాత్రం కొత్త కాదు. పాత ఢిల్లీ, ముంబైలోని కొన్ని ప్రాంతాలు, బెంగళూరులోని బసవనగుడి, అలాగే హైదరాబాద్, చెన్నైలోని పాత కాలపు వీధుల్లో ప్రజల నివాసాలు, వాణిజ్య సముదాయాలు కలిసిపోయి ఉండేవి. ఇళ్ల కిందే దుకాణాలు, గుడి పక్కనే బడి, కూరగాయల మార్కెట్లు, మందుల షాపులు అన్నీ కూతవేటు దూరంలోనే దొరికేవి. అప్పట్లో నగరాలను ప్రత్యేకంగా డిజైన్ చేయకపోయినా, అన్నీ దగ్గరగా ఉండటం వల్ల ప్రజలు నడిచి వెళ్లడానికే ఎక్కువ ఆసక్తి చూపేవారు.ఎక్కడ దారి తప్పాం?కాలక్రమంలో మన పట్టణీకరణ విధానం పూర్తిగా దారి తప్పింది. విశాలమైన రోడ్లు, భారీ గేటెడ్ కమ్యూనిటీలు, శివార్లలో ఐటీ కారిడార్ల నిర్మాణం కారణంగా నగరాల రూపురేఖలు విచ్ఛిన్నమయ్యాయి. ఆఫీసులు నివాస ప్రాంతాలకు దూరంగా వెళ్లిపోయాయి, నడక తగ్గిపోయింది. ఉదాహరణకు బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రాంతాల్లో ఆఫీసులు, మాల్స్ దగ్గరగానే ఉన్నట్లు అనిపించినా, సరైన దారులు లేక ఆ కొద్ది దూరం వెళ్లడానికే నిత్యం గంటల కొద్దీ ట్రాఫిక్‌లో నరకం చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.ముంబై ఇప్పటికీ ఎందుకు భిన్నం?దేశంలో అత్యంత జనసాంద్రత కలిగిన ముంబై నగరం ఈ ‘15 నిమిషాల నగరం’ విధానానికి నేటికీ చాలా దగ్గరగా ఉంటుంది. ముంబైలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు సొంత వాహనాలపై ఆధారపడకుండానే రైల్వే స్టేషన్లు, కిరాణా షాపులు, రెస్టారెంట్లు, ఆస్పత్రులకు సులభంగా చేరుకోగలరు. ముంబైలో జనసాంద్రత ఎక్కువ అని విమర్శలు ఉన్నప్పటికీ, ఆ సాంద్రతే అన్నీ అందుబాటులో ఉండేలా చేసింది. ప్లానర్లు ఇప్పుడు కృత్రిమంగా సృష్టించాలని చూస్తున్న ‘మిక్స్డ్-యూజ్’ విధానాన్ని ముంబై ఏనాడో ఒంటపట్టించుకుంది.నడవలేని ఫుట్‌పాత్‌లు.. ప్రాణసంకటమైన రోడ్లు15 నిమిషాల నగరం వినడానికి చాలా బాగున్నా, ఆచరణలో మన దేశంలో ఎదురవుతున్న అతిపెద్ద అడ్డంకి ‘ఫుట్‌పాత్‌లు’. నేటి భారతీయ నగరాలు పాదచారులకు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఫుట్‌పాత్‌లు మధ్యలోనే మాయమైపోతాయి, లేదా వాహనాల పార్కింగ్, ఆక్రమణలతో నడవడానికి వీల్లేకుండా మారిపోయాయి. ఇక రోడ్డు దాటడం పెద్దలకే ఒక సాహసం అయితే, పిల్లలు, వృద్ధుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. సైకిల్ ట్రాక్‌లు కూడా పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి. సురక్షితమైన దారులు లేకుండా ఈ అద్భుతమైన పద్ధతిని అమలు చేయడం అసాధ్యం.మళ్లీ మన పాత దారికి వెళ్లాల్సిన సమయంకరోనా తర్వాత పెరిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యం, ఇంధన ధరల పెరుగుదల లాంటి కారణాలతో స్థానికంగానే అన్నీ అందుబాటులో ఉండే జీవనశైలిపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. గంటల తరబడి ప్రయాణాలు చేయలేక యువత తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తరుణంలో భారతదేశం విదేశాల నుంచి ఈ ‘15 నిమిషాల నగరం’ ఆలోచనను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన పాత నగరాల స్ఫూర్తిని కోల్పోకుండా, ఆధునికతను జోడిస్తూ, మళ్లీ పాదచారులకు అనుకూలమైన నగరాలను నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఇది కూడా చదవండి: బిందెడు నీరు.. బతుకంతా కన్నీరు! -
స్కూలు బస్సుకి పసుపు రంగే ఎందుకు?
ఫ్రెండ్స్.. మనం రోజూ స్కూలుకి వెళ్లే బస్సు పసుపు రంగులోనే ఉంటుంది. ఎందుకలా ఉంటుందో మీరెపుడైనా ఆలోచించారా? ఎందుకంటారు? ఎందుకంటే పసుపు రంగు ఎంత దూరం నుంచైనా ఆకర్షిస్తుంది. దానివల్ల ప్రమాదాలు జరుగకుండా ఉంటాయి.టాక్సీలు, స్కులు బస్సులకు, రసాయనాలను సూచించే ఫలకాలకు ఈ రంగును వాడుతుంటారు. ప్రమాదాన్ని సూచించే సందర్భాలకి ఎరుపు రంగుని వాడితే, జాగ్రత్త పాటించాల్సిన సూచనల కోసం పసుపుని వాడుతారన్నమాట. అలాగే ట్రాఫిక్ సిగ్నల్‌లో ఈ రంగు లైట్ వెలిగితే.. నెమ్మదిగా వెళ్లాలని అర్థం. ఔనా?హార్న్‌బిల్ అనే పక్షి తన పిల్లల్ని ఎవరూ చూడకుండా, తాకకుండా వుండాలని వాటి నివాసం కోసం చాలా సురక్షితమైన ప్రదేశం ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఒక చెట్టుతొర్రలో వుంచి, ఆ తొర్రను వుట్టి లేదా బెరడుతో కప్పేస్తుంది. అయితే గాలి, వెలుతురు కోసం చిన్న రంధ్రం ఒకటి వుంచుతుంది. పిల్లలకు ఆ రంధ్రంలోంచి వుుక్కుతో ఆహారాన్ని అందిస్తుంది. అలా పిల్లలు పెద్దవయ్యేదాకా ఆ తల్లికి ఈ కష్టం తప్పదు వురి. -
ఏకలవ్య శిష్యరికం
ఆధునిక భారతదేశంలో ఏకలవ్యుడు దళిత, గిరిజన హక్కులకు ఆదర్శంగా ప్రత్యేకంగా నిలిచాడు. ఏకలవ్యుని గౌరవార్ధం, కేంద్ర ప్రభుత్వం భారతీయ గిరిజనుల కోసం ‘ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను‘ నిర్వహిస్తోంది. అలాగే కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు క్రీడలలో అసాధారణ విజయాలు సాధించిన 19 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులకు, వ్యక్తులకు ఏకలవ్య పురస్కారాలను ప్రదానం చేస్తోంది. ఇది ఇలా ఉండగా హర్యానాలోని గురగ్రామ్ లో ఏకలవ్యునికి అంకితం చేయబడిన ఆలయం ఒకటి ఉంది. ఆ గ్రామంలోని కాండ్సప్రాంతంలో ఆలయాన్ని అక్కడి గ్రామస్తులు అప్పట్లో నిర్మించారు. ఈ ఆలయం వద్దనే ఏకలవ్యుడు తన బొటనవేలు కోసి గురువైన ద్రోణాచార్యుడికి సమర్పించినట్లు చారిత్రాత్మక ఆధారం. ఏకలవ్యుడంటే తెలియని వాళ్లు...గురు దక్షిణగా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి ఇచ్చిన విషయం గురించి వినని వారు బహుశా ఉండరేమో.... దీక్ష... పట్టుదల...అంకిత భావం... ఎనలేని గురుభక్తితో కాదు పొమ్మన్నా సరే... ఆ గురువునే మట్టిబొమ్మగా మలుచుకొని ఒక గొప్ప విలువిద్య కారుడుగా మహాభారతంలో పేరుగాంచిన మేటి విలుకాడే ఏకలవ్యుడు....నిషాదుల రాజు హిరణ్యధన్వుని కుమారుడే ఏకలవ్యుడు. కౌరవ పాండవులకు ఆస్థాన గురువైన ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలన్నది ఏకలవ్యుని ఆకాంక్ష. అయితే ఏకలవ్యుని సామర్థ్యాన్ని గమనించిన ద్రోణాచార్యుడు అతనికి తగిన శిక్షణ ఇస్తే అతడు విలువిద్యలో కౌరవ, పాండవ రాకుమారులను మించిపోతాడని, దాంతో తాను భీష్మునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమోననే ఉద్దేశ్యంతో ఏకలవ్యుని తన శిష్యునిగా స్వీకరించేందుకు అంగీకరించలేదు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుడు అందుకు ఏమాత్రం నిరాశపడక గురువుపై ఉన్న అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసంతో ద్రోణాచార్యుని మట్టిబొమ్మను తయారు చేసుకొని స్వీయ శిక్షణతో గొప్ప విలుకాడుగా పేరుగాంచాడు.ఒకసారి ఒక వేట కుక్క ఏకలవ్యుడిని చూసి మొరగడంతో ఏకలవ్యుడు ఆ కుక్క నోరు తెరిచి ఉండగానే దానికి ఏమాత్రం హాని కలగకుండా ఏడు బాణాలు వేశాడు. ఎంతో నైపుణ్యంతో వేసిన బాణాలను చూసిన అర్జునుడు నిరాశకు లోనై ద్రోణాచార్యునికి విషయాన్ని తెలిపాడు. అనంతరం ఏకలవ్యుని కలిసిన ద్రోణాచార్యుడు, ఏకలవ్యుని ఏకాగ్రతను గుర్తించి అభినందిస్తాడు. అయితే తన ప్రియ శిష్యుడైన అర్జునుని మేటి విలుకానిగా తీర్చిదిద్దుతానని తాను అర్జునునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమో అనే ఉద్దేశ్యంతోనూ, అతను తనను గురువుగా భావించి నేర్చుకున్న విలువిద్యకు తగిన గురుదక్షిణగా ఏకలవ్యుని కుడిచేతి బొటన వేలు కోరతాడు, ఏమాత్రం సంకోచించకుండా తన కుడిచేతి బొటన వేలునే తెగ్గోసి గురువైన ద్రోణాచార్యునికి సమర్పిస్తాడు ఏకలవ్యుడు. గురువుతో ప్రత్యక్ష సంబంధం లేకుండానే ఆ గురువును ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడలలో నడుస్తూ స్వయంగా విద్యను నేర్చుకునే వారిని ఏకలవ్య శిష్యులు అనే నానుడి అలా వచ్చింది. అమృత బిందువులు – ఆలోచన లేని స్పందన అవగాహన లేని విమర్శ సంపాదన లేని ఖర్చు ప్రయత్నం లేని ఓటమి వీటివల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది.– ‘మన సంబంధం ఆస్తులతో ముడిపడిన వారంతా బంధువులవుతారు. మన విలువలు సుఖ దుఃఖాలతో ముడిపడిన వారంతా ఆత్మ బంధువులవుతారు.– సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శ్రపాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సాయం చేసే స్థాయికి మనం ఎదగాలి.– మనం గెలిస్తే మనవాళ్ళకి మనమేంటో తెలుస్తుంది. మనం ఓడిపోతే మనవాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది.– చిన్నప్పుడు దేన్నయినా పట్టుకుని నిలబడాలి. పెద్దయ్యాక దేన్నయినా తట్టుకుని నిలబడాలి.→ ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. – సి. ఎన్. మూర్తి సీనియర్ పాత్రికేయులు -
నిస్వార్థ సేవే నిజమైన ధర్మం
రాగి పాత్రని ప్రతి రోజూ శుభ్రం చేయకపోతే, చిలుం పట్టినట్లుగా, ప్రతి రోజూ విహిత కర్మాచరణ, సత్కర్మలు చేయకపోతే, మనసు కూడా మలినమై పాపగ్రస్థమవుతుంది. సత్కర్మ అంటే కేవలం పూజలు, పునస్కారాలు చేయడం మాత్రమే కాదు. సమాజానికి, తోటి ప్రాణులకు మేలు చేసే ప్రతి పని సత్కర్మే అవుతుంది. కీడు తలపెట్టకపోవడం, అందరూ బాగుండాలని కోరుకోవడం (మానసిక సత్కర్మ). మృదువుగా మాట్లాడటం, సత్యాన్ని పలకడం, ఎవరినీ మాటలతో గాయపరచకపోవడం(వాచిక సత్కర్మ). శ్రమించి పని చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, సమాజసేవ చేయడం(శారీరక సత్కర్మ). భారతీయ సంస్కృతిలో ‘యద్భావం తద్భవతి‘ అని అంటారు. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటే మన పనులు అలానే ఉంటాయి. భారతీయ జీవన విధానంలో, ధర్మశాస్త్రాలలో సత్కర్మాచరణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మనం చేసే పనులే మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనిషి పుట్టుకతో గొప్పవాడు కాడు, తను చేసే కర్మల (పనుల) ద్వారానే గొప్పవాడవుతాడు. మనం చేసే ప్రతి చిన్న మంచి పని సమాజంలో ఒక సానుకూల మార్పుకు నాంది పలుకుతుంది. కాబట్టి, ప్రతిరోజూ కనీసం ఒక మంచి పని చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలి.రోజుకు కొంత సమయం సత్సాంగత్యంలో గడపడం వల్ల పోనుపోను మనసు ప్రక్షాళితమవుతుంది. ఒకరి అనుభవం, జిజ్ఞాస ఇతరులకు చేరతాయి. దీనివల్ల వేరే ఆలోచనలు దూరంగా ఉంటాయి. నిజజీవితంలో ఏదైనా కర్మ నిర్వర్తించేటప్పుడు, అది నాకు, ఇతరులకు మంచి చేస్తుందా అనే ప్రశ్న వేసుకోవడం, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా భగవదర్పితం చేయడం వల్ల మోక్షమార్గం సులువవుతుంది. మనసు పూర్తిగా ఆ పరమాత్మపై లగ్నమైనప్పుడు, లౌకికమైన భయాలు మనిషిని ఏమీ చేయలేవు. మనసుని దైవపరం చేయడం వల్ల మనం చేసే ప్రతి పనీ నిష్కామ కర్మ అవుతుంది. సంసారమనే సాగరంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, భగవంతుడనే నావ మనల్ని మునిగిపోనివ్వదు. క్రోధం, ఈర‡్ష్య, ద్వేషం వంటి అంతర్గత శత్రువులనే మంటలు మనల్ని దహించలేవు. మనసు ప్రశాంతమైన మలయమారుతంలా మారుతుంది. లోకంలో మన చుట్టూ ఉండే ప్రతికూలతలనే విషం వ్యక్తిత్వాన్ని లేదా మనశ్శాంతిని హరించలేదు.‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం లేకుండా, ‘అంతా దైవ నిర్ణయం, నేను కేవలం నిమిత్తమాత్రుడిని’ అనే భావంతో కర్మలు చేయడం వల్ల విజయం వచ్చినా పొంగిపోము, అపజయం ఎదురైనా కుంగిపోము.ఒక వ్యక్తి చేసే ’మంచి పని’ అనేది కేవలం ఎదుటివారికి సహాయం చేయడం మాత్రమే కాదు, అది సమాజంలో ఒక సానుకూల మార్పుకు పునాది వేస్తుంది. మంచి పనిని ఆచరించడానికి పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు, మన దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులే గొప్ప మార్పును తెస్తాయి. మంచి పని చేసేటప్పుడు ఏ గుర్తింపునూ లేదా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తే, అది పైన మనం చెప్పుకున్న ’నిష్కామ కర్మ’ అవుతుంది. ఫలితం ఆశించకుండా చేసే సాయం ఎప్పుడూ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.మానవ జీవితం కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ‘కర్మ’ అంటే పని. మనం చేసే పనులే మన భవిష్యత్తును, మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ‘సత్’ అంటే మంచి, ‘ఆచరణ’ అంటే అనుసరించడం. అంటే, శాస్త్ర సమ్మతంగా, ధర్మబద్ధంగా, పరోపకార భావంతో చేసే పనులనే సత్కర్మాచరణ అంటారు. ఒక వ్యక్తి చేసే మంచి పని సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి చెట్టు నాటితే, అది వందల మందికి నీడనిస్తుంది. డబ్బు, పదవులు శాశ్వతం కావు. మనిషి మరణించిన తర్వాత కూడా అతను చేసిన మంచి పనులు మాత్రమే జీవించి ఉంటాయి. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం ఒక చిన్న మంచి పనినైనా చేస్తూ సత్కర్మ మార్గంలో పయనించాలి.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
మాను సంపంగి... మా అబ్బాయి
తెలుగు డిటెక్టివ్ సాహిత్యంలో మధుబాబు కొన్ని దశాబ్దాలు పాఠకులను ఉర్రూతలూగించిన రచయిత. ఆయన సృష్టించిన ‘షాడో’ ఒక సంచలనం. మధుబాబు అసలు పేరు వల్లూరు మధుసూదనరావు. తన కుమారుడు ఉదయ్ పెంపకం గురించి ఆయన పంచుకున్న అనుభవాలు... ‘‘చాలాకాలం క్రితం మేము ఇల్లు నిర్మించుకుంటున్న సమయంలో నా శ్రీమతి ఆదిలక్ష్మి తనకు సంపంగి చెట్టు కావాలని అడిగింది. నూజివీడులో వున్న నర్సరీ నుంచి తీసుకువచ్చాను. మంచి సంపంగి కాదది, మాను సంపంగి. చాలా ఎత్తుకు ఎదుగుతుంది. చిన్న చిన్న ఆకులు కాస్తా వెడల్పు అవుతాయి. నర్సరీ వాడు నన్ను ఏమార్చాడు. ఆ మొక్క నాటినప్పటి నుంచి మొదలయ్యాయి మా కష్టాలు. పెరిగి పెద్దదవుతున్న క్రమంలో ప్రతిరోజూ బండెడు బండెడు ఆకులు రాల్చేది. వాటిని ఎత్తి అవతల పడేయటానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది.పన్నెండు అడుగుల ఎత్తుకు ఎదిగింది చెట్టు. ఒక్క పువ్వు కూడా పూయలేదు. మాతో చాకిరీ చేయించుకోవటానికే అది మా ఇంటికి వచ్చిందని అనుకుంటున్న సమయంలో ఒకరోజు సడన్‌గా ప్రత్యక్షం అయ్యాయి మొగ్గలు. రెండే రెండు రోజుల్లో వికసించాయి. మా ఇల్లేకాదు, చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు కూడా గుబాళించిపోయాయి సువాసనతో. మా అబ్బాయికి ఆ మాను సంపెంగకి తేడా ఏమీలేదని నాకు అనిపిస్తోంది ఇప్పుడు తరచి చూసుకుంటుంటే.పసిబిడ్డడిగా ఉన్నప్పుడు పగలంతా నిద్రపోయి, రాత్రిళ్ళు లేచి కూర్చునేవాడు. నా శ్రీమతిని నిద్రపోనిచ్చేవాడు కాదు. నన్ను నా రాతలు రాసుకోనిచ్చేవాడు కాదు. బెడ్ మీద నేను కనిపించకపోతే పాము మాదిరి పాకుతూ నా రైటింగ్ రూములోకి వచ్చి నా టేబుల్ కింద దూరేవాడు. భుజం మీద వేసుకుని వేమన శతకం, దాశరథీ శతకంలో నాకు వచ్చిన పద్యాలన్నిటినీ చెబుతూ రెండు గంటలు తిప్పితే తప్ప ఊరుకునేవాడు కాదు. స్కూల్‌కి టైమ్‌కి వెళ్ళేవాడు కాదు. అక్కడ టీచర్లను చెండుకు తినేవాడు. చూసి చూసి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మేడమ్ నాకు కబురుపెట్టింది. డిజాస్టర్ ఏదో జరిగిందనే అనుమానంతో నేను నా ఉద్యోగానికి ఒకరోజు సెలవు పెట్టి నా శ్రీమతిని తోడు తీసుకుని వెళ్ళాను. ప్రిన్సిపాల్ మేడమ్ చేసిన కంప్లైంట్ వినేసరికి నాకు మతిపోయింది. టీచర్లు చెపుతున్న పాఠాన్ని ఒకసారి విని అప్పటికప్పుడు అప్పగించేస్తున్నాడట. ఏదైనా వర్క్ ఇస్తే క్షణాల మీద పూర్తిచేసి, మిగిలిన పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నాడట. ‘ఈ తలనొప్పిని మేము భరించలేము, మీ అబ్బాయిని డబల్ ప్రమోషన్ చేస్తున్నాము’ అన్నది ఆమె. అంటే సంవత్సరం మధ్యలో పై తరగతికి కాకుండా ఆపై తరగతికి పంపటం.అలా అలా తన చుట్టూ వున్న వారిని, మమ్మల్ని టెన్షన్ మీద టెన్షన్ పెడుతూ టెన్త్, ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్‌లో జాయిన్ అయ్యాడు. రెండో సంవత్సరంలో బండి కావాలన్నాడు. ఒక సంవత్సరం తాత్సారం చేసి థర్డ్ ఇయర్లో కొనిపెట్టాను. మూడోరోజున తన ఫ్రెండ్‌ని ఎక్కించుకుని ఎనభై స్పీడ్‌లో తీసుకుపోయి కొట్లాడుకుంటున్న కుక్కల మధ్యలోకి పోయి బోర్లాపడ్డాడు. కుక్కలు పారిపోయాయిట. కానీ వీడికీ వీడి దోస్తుకీ మోకాళ్ళు మోచేతులూ చెక్కుకుపోయాయి.ఆ దెబ్బకి బండిని వదిలేస్తాడని ఆశించిన నాకు ఇంకో షాకు. నాలుగు రోజులు గడవకముందే, తగిలిన దెబ్బలు ఆరకముందే అదే దోస్తుతో అదే బండిమీద అదే స్పీడుతో నేషనల్ హైవే మీద కాలేజీకి పోయివచ్చాడు. దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు మాదిరి తయారైంది పరిస్థితి. మా అదృష్టం బాగున్నది కాబోలు– ఫర్దర్ టెన్షన్లు లేకుండా ఇంజనీరింగ్ పూర్తి అయింది. మాకు తెలియకుండానే మేము పెంచిన మాను సంపెంగ మొగ్గలు వేసి పూలు పూసినట్టు ఒక్కసారిగా మార్పు వచ్చింది వాడిలో.బిట్స్ పిలానీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాడు. పెద్ద ప్యాకేజీతో బెంగళూర్‌లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. వేదం నేర్చుకున్నాడు. వయొలిన్ వాయించటం అభ్యాసం చేశాడు. రెండుసార్లు సోమయాగం చేసి సోమయాజిగా అనిపించుకున్న పెద్దమనిషి కూతుర్ని– ఆయుర్వేద వైద్యవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న అమ్మాయిని భార్యగా పొందాడు. మొక్కల్ని పెంచాలన్నా, పిల్లలని పెంచాలన్నా ఓపిక అవసరమని మాకు అర్థం అయింది. మంచిని మెచ్చుకోవాలి. ఇబ్బందుల్ని సరిదిద్ది సరైన దారికి మరలించాలి. నా సతీమణి ఆదిలక్ష్మి ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఉండివుంటే తను పెంచిన మానుసంపంగి పువ్వుల్ని చూసి ఎంత మురిసిపోయిందో, అంతకు లక్షరెట్లు తన బిడ్డ అభ్యున్నతిని చూసి మురుసుకునేది. తన పెంపకమే ఇది. తన కష్టం. తన కడుపు పంట. మొక్కల్ని పెంచాలన్నా, పిల్లలని పెంచాలన్నా ఓపిక అవసరమని మాకు అర్ధం అయింది. మంచిని మెచ్చుకోవాలి. ఇబ్బందుల్ని సరిదిద్ది సరైన దారికి మరలించాలి. షాడో మధుబాబు, రచయిత -
దాంపత్యం
కారులో కూర్చున్న అరవై రెండేళ్ళ ఆయన చేతి గడియారం వంక చూసుకుని, అసహనంగా ఇంటి గుమ్మంవైపు చూశాడు. ఆయన భార్య చేతిలో హేండ్ బేగ్‌తో వచ్చి ఆయన పక్కన కూర్చుంది. ‘‘ఆలస్యమైందే?’’ ఆయన కారు స్టార్ట్ చేస్తూ కోపంగా అడిగాడు. ‘‘హేండ్ బేగ్ కనపడలేదు.’’ ‘‘అందుకే తీసిన వస్తువు తీసిన చోటే ఉంచాలని చెప్పేది.’’ ‘‘మొదలెట్టారూ గ్రామఫోన్ రికార్డు?’’ ‘‘నేను చెప్పేవన్నీ జీవితానికి ఉపయోగించేవి. గిఫ్ట్ పేక్ తీసుకున్నావా?’’‘‘అరే. మర్చిపోయానండి. మీరైనా గుర్తు చేయాల్సింది.’’ ‘‘ఎన్నిసార్లు చెప్పినా నీకు తలకెక్కదు. పైగా గ్రామఫోన్ రికార్డ్ అంటావు. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాలి. దాన్ని నీ చెప్పుల పక్కన ఉంచమని నిన్న రాత్రి చెప్పానా? అప్పుడు మర్చిపోవని.’’ ఆయన ఆగ్రహాన్ని అణచుకుంటూ చెప్పాడు. ‘‘మన పెళ్ళై ఎన్నేళ్ళైందంటారు?’’ ఆవిడ తన భర్త వంక చూస్తూ అడిగింది. ‘‘తెలీదా?’’ ‘‘మీకు తెలిస్తే చెప్పమంటున్నాను.’’‘‘ముప్ఫై ఆరేళ్ళు. ఐతే?’’‘‘అంతకాలం నించి మీరు నన్ను సాధిస్తున్నారు. అత్తలేని సంబంధం అని మా వాళ్ళు మీకిచ్చి చేశారు. కాని మీరు డబల్ అత్తగారని వాళ్ళకి తెలీదు.’’ ‘‘ఆపుతావా?’’ ఆయన అరిచాడు. ‘‘మీరు కారుని ఆపేదాకా ఆపను. ఏం? మీరు సాధించగా లేనిది నేను సాధించకూడదా? కొత్తల్లో భయపడేదాన్ని. ఇప్పుడు ఆ భయం లేదు. మీరు గెట్ అవుట్ అంటే పెద్దాడి ఇంటికి వెళ్ళిపోతాను.’’‘‘స్టీరింగ్ వీల్ ముందు కూర్చున్న వాడికి కోపం తెప్పించకూడదు, అది ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పాలి?’’ ఆయన కోపంగా అడిగాడు. ‘‘మీరు నాకు దొరికేది ఇక్కడేగా. లేదా కేసుల ఫైల్స్ చదువుతూ, స్టెనోకి జడ్జిమెంట్ డిక్టేట్ చేస్తూ మీరు ఎప్పుడూ బిజీనే. దారిలో పూలషాప్ వస్తుంది. ఆపండి. ఓ బొకే కొనుక్కెళ్దాం.’’‘‘ఎందుకు? మర్నాడు మన డబ్బు చెత్తబుట్టలో చేరడానికా? పళ్ళబుట్టని కొనుక్కెళ్దాం.’’‘‘పూల బొకే రెండు వందల ఏభైతో పోతుంది. పళ్ళబుట్టలో అరడజను పళ్ళు. దానికి ఆరు వందలు తీసుకుంటారు. ఆ మేదర బుట్ట ఖరీదే రెండు వందలు ఉంటుంది.’’ ‘‘ఎడ్డెం అంటే తెడ్డెం అంటావు.’’‘‘కాదు. మీరు డబ్బుని వృథా చేస్తున్నారు అంటాను.’’ ‘‘ఎక్కడ ఆదా చేయాలో, ఎక్కడ ఖర్చు చేయాలో ఇంతకాలం నాతో కాపురం చేశాక కూడా నీకు బోధపడలేదు.’’ ఆయన గొణిగాడు. ‘‘ఏమిటి? గట్టిగా వినేలా తిట్టొచ్చుగా.’’ ఆయన మాట్లాడలేదు.‘‘ఇల్లు తాళం వేశానంటారా?’’ ఆవిడ కొద్దిసేపు ఆగి అడిగింది. ‘‘కారులో కూర్చున్నవాడికి ఎలా తెలుస్తుంది? అది ఇంట్లోంచి బయటికి వచ్చిన వాళ్ళకి తెలియాలి.’’ ‘‘నేను కారులోకి తాళంచెవుల గుత్తితోనే వచ్చానా అని అడుగుతున్నాను.’’ ‘‘నా దగ్గర బైనాక్యులర్స్ లేవు.’’‘‘వెనక్కి తిప్పండి.’’ ‘‘ముహూర్తం టైంకి వెళ్ళాలి.’’ ‘‘తాళం వేయకపోతే ఏ డెలివరీ బాయో ఉన్నదంతా చక్కబెట్టుకుపోతాడు. వెనక్కి తిప్పండి.’’‘‘మనం పెళ్ళి ముహూర్తానికి వెళ్ళి తీరాలి.’’ ఆయన కోపంగా అరిచాడు. ‘‘ఇంటికి తిరిగి వెళ్ళేదాకా నాకు ఆందోళనగా ఉంటుంది.’’ ‘‘ఉండనీ.’’ ‘‘మీ వల్లే నాకు బీపీ’’ ‘‘అది మీ ఇంటి పేరు. మీ నాన్నకి, అమ్మకి, అక్కయ్యకి, ఆఖరికి మీ పనిమనిషికి, పెంపుడు కుక్కకీ కూడా బీపీ. నాకు లేదు.’’ ‘‘మీలాంటి వాళ్ళ వల్లే నాకు మాకు బీపీ’’ ఆవిడ కోపంగా అరిచింది. ‘‘అరవక. నీకు బీపీ వచ్చింది.’’ ‘‘నాకేం? హైకోర్ట్ జస్టిస్ ఇంట్లో దొంగలు పడ్డారని పేపర్లో రానీండి.’’‘‘విడాకుల గురించి ఏం ఆలోచించావు?’’ ఆయన అకస్మాత్తుగా అడిగాడు. ‘‘పెద్దాడు వద్దన్నాడు. భరణం ఎంత వస్తుందో ముందు కనుక్కోమన్నాడు.’’ ‘‘ఆ ఆలోచన కూడా చేశారన్నమాట. మీ కడుపులో ఎన్ని ఆలోచనలు దాచుకున్నారు!’’ ‘‘ఆలోచనలు కడుపులో దాచరు. మెదడులో దాస్తారు. అందుకే మీ జడ్జిమెంట్లని సుప్రీం కోర్ట్ కొట్టేస్తూంటుంది.’’ ‘‘షటప్. ఎకసెక్కెమా?’’ఆయన బ్రేక్ వేయడంతో ఆ కుదుపుకి ఆవిడ తల డేష్ బోర్డుకి కొట్టుకుంది. వెనక సీట్లో కూర్చున్న దర్శకుడు చెప్పాడు. ‘‘నైస్. ‘దాంపత్యం’ సరైన టైటిల్. మీతరం వాళ్ళల్లోని గొప్పతనం ఇదే. రిహార్సల్స్ కావాలంటారు. డైలాగ్స్ కంఠతా పడతారు. బయట మీ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారని ప్రేక్షకులకి తెలుసు. స్క్రీన్ మీద ఇలా పోట్లాడుకుంటుంటే ఎంజాయ్ చేస్తారు. టేక్ చేద్దామా?’’ మీరు నాకు దొరికేది ఇక్కడేగా. లేదా కేసుల ఫైల్స్ చదువుతూ, స్టెనోకి జడ్జిమెంట్ డిక్టేట్ చేస్తూ మీరు ఎప్పుడూ బిజీనే. దారిలో పూలషాప్ వస్తుంది. ఆపండి. ఓ బొకే కొనుక్కెళ్దాం. మల్లాది వెంకట కృష్ణమూర్తి -
బ్రాండ్స్ కాదు..పర్ఫెక్ట్ కలర్ గేమ్ ఛేంజర్ తెలియాలి !
స్టయిలిష్‌గా కనిపించాలంటే, బ్రాండ్స్ కాదు బాస్.. సరైన కలర్స్‌తో కంట్రోల్ చేసి గేమ్ చేంజర్‌గా మారొచ్చు.. ఈ చిన్న ట్రిక్ని మిస్ అయితే, బడ్జెట్ ఎంత పెట్టినా లుక్ డల్‌గానే ఉంటుంది. మరి ఆ సీక్రెట్స్ ఏంటో చూద్దాం!త్రీ కలర్స్ రూల్: ఒక అవుట్‌ఫిట్‌లో కేవలం మూడు రంగుల్లో మాత్రమే ఉండాలి. అంతకంటే, మించిన రంగులు అసలు వద్దు. ఎందుకంటే, ఒకేసారి చాలా కలర్స్ వేసుకుంటే, మీరు స్టయిలిష్‌గా కాకుండా కలర్ ఎగ్జిబిషన్‌లా మారేలా చాన్స్ ఉంది.న్యూట్రల్స్‌గా బేస్: ఇంటికి పునాది ఎంత ముఖ్యమో, ఔట్‌ఫిట్‌కి కూడా బేస్ అంతే ముఖ్యం. బ్లాక్, వైట్, నేవీ, గ్రే, బీజ్, ఆలివ్ ఇవి మీ స్టయిల్‌కి బలమైన బేస్. ఇవి దేనితో అయినా ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇవి ఉంటే, మీ వాడ్రోబ్ ఎప్పుడూ ‘నో టెన్షన్ జోన్’లో ఉంటుంది.సింపుల్ స్టయిల్ ఫార్ములా: ఒక న్యూట్రల్ కలర్, ఒక మెయిన్ కలర్, ఒక చిన్న హైలైట్ అంతే, ఉదాహరణకు: నేవీ ప్యాంట్ + వైట్ టీషర్ట్ + లైట్ గ్రీన్ షర్ట్. అంతా న్యూట్రల్ కలర్స్ అయితే కాస్త బోరింగ్‌గా అనిపించొచ్చు. అందుకే, కాస్త బర్గండీ, లైట్ బ్లూ, రస్ట్, సాఫ్ట్ పింక్ లాంటి కలర్స్ జోడిస్తే లుక్‌కి లైఫ్ వస్తుంది.టెక్చ్సర్ కూడా మ్యాటర్: ఒకే కలర్ అయినా, మెటీరియల్ మారితే లుక్ మారిపోతుంది. ఉదాహరణకు: గ్రే టీషర్ట్ గ్రే స్వెటర్ రెండూ గ్రే కలర్సే కానీ ఫీల్ వేరు! కాట¯Œ , లినె¯Œ , వూల్ వంటి టెక్స్చర్స్ మిక్స్ చేస్తే మీ స్టయిల్ మరింత రిచ్‌గా కనిపిస్తుంది.రెడీగా ఉన్న సూపర్ కాంబినేషన్స్ఈ కాంబినేషన్స్ సేవ్ చేసుకోండి! ఎందుకంటే, ఇవి ట్రై చేస్తే స్టయిల్ ఎప్పుడూ మిస్ అవ్వరు1. వైట్ షర్ట్ + నేవీ ప్యాంట్ 2. లైట్ బ్లూ షర్ట్ + టాన్స్ప్యాంట్ 3. బ్లాక్ టీషర్ట్ + ఖాకీ ప్యాంట్ 4. బర్గండీ షర్ట్ + డెనిమ్ జీన్స్మీ స్కి టోన్‌కి సరిపడే కలర్స్అందరికీ అన్ని కలర్స్ సెట్ కావు. అందుకే, ఒక్కసారి మీకు సెట్ అయ్యే కలర్స్ తెలుసుకున్నారంటే, స్టయిల్ గేమ్‌లో మీరు అప్పుడే హాఫ్ విన్ అయిపోయినట్టే. ఎక్కువగా ఫెయిర్ స్కిన్‌కి లైట్, సాఫ్ట్ కలర్స్, మీడియం స్కిన్ ఉంటే ఆలివ్, నేవీ, రస్ట్. డార్క్ స్కిన్ వారికైతే బోల్డ్, బ్రైట్ కలర్స్ సూపర్‌గా కనిపిస్తాయి. -
డిజిటల్ క్రైమ్: కత్తితో పొడిస్తేనే హత్య కాదు..!
డాక్టర్ కృపాకర్ తన గదిలోనే నిర్జీవంగా పడి ఉండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తన ఫోరెన్సిక్ తెలివితేటలతో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించిన అతడు అనుమానాస్పదంగా మరణించడం పోలీస్ డిపార్ట్మెంట్ను షాక్‌కు గురిచేసింది. కృపాకర్ బ్రహ్మచారి. రాత్రి వంటమనిషి వంట చేసి వెళ్తుంది. పొద్దున్నే సర్వెంట్ డూప్లికేట్ కీతో లోపలికి వచ్చి పనులు పూర్తి చేసుకుని కాఫీతో డాక్టర్‌ను నిద్ర లేపుతుంది. ఎంత పిలిచినా డాక్టర్ లేవకపోవడం, తన గది తలుపు తీయకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫోన్ చేసింది.∙∙ డిటెక్టివ్ సిద్ధార్థ డాక్టర్ కృపాకర్ బెడ్రూమ్ను పరిశీలిస్తున్నాడు. మృతదేహం ప్రశాంతంగా ఉంది. ఎక్కడా పెనుగులాట ఆనవాళ్లు లేవు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆయన గుండె ఆగి మరణించారు. దానికి కారణం తీవ్రమైన ‘షాక్’. కానీ గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగిన దాఖలాలు లేవు. అంతగా షాక్‌కు గురి చేసే సంఘటనలు జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. డిటెక్టివ్ సిద్ధార్థకి ఒక విషయం ఆశ్చర్యం కలిగించింది. కృపాకర్ టేబుల్ మీద ఉన్న ఒక ఖరీదైన ‘స్మార్ట్ ఆడియో స్పీకర్’ వైర్ కట్ అయి ఉంది. అలాగే, కృపాకర్ చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ మరణానికి కొన్ని నిమిషాల ముందు అసాధారణమైన హార్ట్ రేట్ రికార్డ్ చేసింది. అతనికి శత్రువులు ఎవరూ లేరు... ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వెళ్లి విచారించాడు. కృపాకర్ మెడికల్ హిస్టరీ పరిశీలించాడు. కృపాకర్ స్టాఫ్‌ను ఒక్కొక్కరినీ విడివిడిగా విచారించాడు. కృపాకర్ చావుకు కారణం తెలిసింది.∙∙ కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉండటంతో నిద్రమత్తులోనే వచ్చి తలుపు తీశాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ భార్గవ్. ఎదురుగా డిటెక్టివ్ సిద్ధార్థ. ‘మీరా ఇంత రాత్రి వేళ?’ గోడ గడియారం వంక చూస్తూ అన్నాడు భార్గవ. రాత్రి పదకొండు...‘మీ డాక్టర్ చనిపోయిన బాధలో మీరు నిద్రపోయి ఉండరని ఈ టైంలో డిస్ట్రబ్ చేయాల్సి వచ్చింది.’ భార్గవ వంకే చూస్తూ అన్నాడు. ‘యస్... యస్...’ అన్నాడు భార్గవ.. ‘మరి ఇక వెళదామా?’ అన్నాడు డిటెక్టివ్ సిద్దార్థ. ‘ఎక్కడికి?’ ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ. ‘పోలీస్ స్టేషన్‌కు.. డాక్టర్ కృపాకర్‌ను డిజిటల్ టెక్నాలజీ అనే ఆయుధంతో హత్య చేసినందుకు...’ తాపీగా అన్నాడు డిటెక్టివ్ సిద్దార్థ.‘హత్య? నేనా?’ ఆశ్చర్యం నటించాడు భార్గవ.‘నీ కాల్ హిస్టరీలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ని మా శైలిలో విచారించాం. మిస్టర్ భార్గవ్, కృపాకర్ ఎదుగుదలను చూసి ఓర్వలేక పోయారు. ప్రొఫెషనల్ జెలసీ. కృపాకర్‌కు బలహీనమైన గుండె ఉందని తెలుసుకున్నారు. మీరు కృపాకర్ ఫ్యామిలీ డాక్టర్‌ను కలిశారు. డాక్టర్ కృపాకర్‌కు ‘ఫోనోఫోబియా’ (అకస్మాత్తుగా వచ్చే శబ్దాలంటే భయం) ఉందని తెలుసుకున్నారు.ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ సహాయంతో కృపాకర్ ఇంట్లోని స్మార్ట్ హోమ్ సిస్టమ్‌ను హ్యాక్ చేశారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు, గదిలోని స్పీకర్ల ద్వారా అత్యంత భయంకరమైన, అధిక డెసిబుల్స్ ఉన్న శబ్దాన్ని (అల్ట్రాసోనిక్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్) ఒక్కసారిగా ప్లే చేశారు. ఆ నిశ్శబ్ద రాత్రి ఊహించని ఆ భీకర శబ్దానికి కృపాకర్ గుండె తట్టుకోలేకపోయింది. షాక్‌తో ఆయన ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. ఆ తర్వాత రిమోట్ ద్వారా ఆ ఆడియో ఫైల్‌ను డిలీట్ చేశారు.మీ ల్యాప్‌టాప్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే సెర్చ్ హిస్టరీలో ‘హౌ టు ట్రిగ్గర్ కార్డియాక్ అరెస్ట్ యూజింగ్ సౌండ్ వేవ్స్’ అనే అంశం కనిపించింది. అంతేకాకుండా, కృపాకర్ చనిపోయిన సమయానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు మీ ఫోన్ నుండి కృపాకర్ ఇంటి వైఫై నెట్‌వర్క్‌కు కనెక్షన్ వెళ్ళినట్లు ఐటీ నిపుణులు గుర్తించారు.’ డిటెక్టివ్ సిద్ధార్థ లేస్తూ అన్నాడు.‘కత్తితో పొడిస్తేనే హత్య కాదు భార్గవ్, ఒకరి భయాన్ని ఆయుధంగా మార్చుకుని చంపడం కూడా ముమ్మాటికీ హత్యే!’ ‘టెక్నికల్ మర్డర్’ డిజిటల్ క్రైమ్. ఒక్క విషయం గుర్తుంచుకోండి. నేరస్థుల కన్నా తెలివైన వాళ్ళు పోలీసులు, డిటెక్టివ్లు. మీ తెలివితేటలు మీరు ఎదగడంపైన చూపించాల్సింది. మీ జెలసీ మిమ్మల్ని నేరస్థుడిని చేసింది.’ సిద్దార్థ భార్గవ్‌ను చూస్తూ చెప్పాడు. శ్రీ సుధామయి(చదవండి: ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!) -
ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!
పర్యాటకం కమ్ ఉపాధిని కల్పించేలా అద్బుతమైన కేఫ్ ఇది. అయితే ఇక్కడ మొత్తం ఆడవాళ్లే ఉంటారు. నిర్వహించేది..వంట చేయడం నుంచి క్లీనింగ్ వరకు మొత్తం ఆడవాళ్ల సామ్రాజ్యమే దర్శనమిస్తుంది. అలాంటి విచిత్రమైన కేఫ్ తూర్పు సిక్కింలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాబా హర్భజన్ సింగ్ పుణ్యక్షేత్రానికి సమీపంలో, 13,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది పూర్తిగా స్థానిక మహిళలతో కూడిన బృందంతో నడిచే కేఫ్. మారుమూల ఎత్తైన ప్రాంతంలో ఉండే ఈ కేఫ్ స్థితిస్థాపకత, వ్యవస్థాపకత, స్వావలంబనను ప్రతిబింబిస్తుంది. అంతేగాదు సందర్శకులకు ఓ గొప్ప అనుభవాన్ని అందిస్తోంది. ఈ కేఫ్ భారత ఆర్మీ చొరవతో ఏర్పాటైంది. స్థానికి భాగస్వాముల సమన్వయంతో త్రిశక్తి కార్ప్స్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించి, సులభతరం చేసింది. యుద్ధ భూమిని వీక్షించే కార్యక్రమంలో భాగంగా, ఈ ప్రాంత వారసత్వాన్ని, వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రదర్శిస్తూ సరిహద్దు ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కేఫ్ రూపుదిద్దుకుంది. ఇది ఒకరకరంగా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ..మారుమూల ప్రాంతా ఆర్థిక సాధికారతనకు దోహదపడుతోంది. అంతేగాదు జీవనోపాధిని ఇలా పర్యాటకంతో అనుసంధానించటంతో ఈ కార్యక్రమం సుస్థిర అభివృద్ధికి, పుణ్యక్షేత్రానికి పర్యాటకుల రాక పెరగడానికి తోడ్పడుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ ప్రయత్నం నిజంగా సమర్థవంతమైన సైనిక-పౌర సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతేగాదు ఇది సరిహద్దు ప్రాంతాలలో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి పట్ల భారత సైన్యం నిబద్ధతను బలోపేతం చేయడంతో పాటు, భారత పౌరులతో బలమైన సంబంధాలను పెంపొందిస్తుంది.(చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..) -
అపకారికి గుణపాఠం
అనగనగా ఒక ఆడవి. గుహలో సింహం పెద్దగా నోరు తెరిచి శబ్దం చేస్తోంది తప్ప మాట్లాడలేకపోతోంది. దాని ఎదురుగా కొన్ని జంతువులు కూర్చుని విచారంగా చూస్తున్నాయి. జరిగిన విషయం ఏంటంటే ఆ ఉదయం మృగరాజు ఒక జింకను వేటాడి తింటున్నప్పుడు ఒక ఎముక దవడలో గుచ్చుకుంది. దాంతో విపరీతమైన నొప్పి... తినడం కాదు కదా నోరు మూయలేని స్థితి. అంతలో ఆగమేఘాల మీద మంత్రి నక్కగారు వచ్చారు. పరిస్థితి అర్థం చేసుకుని, ‘మరేం భయం లేదు. ఇప్పుడే మన కొంగను పిలిపిస్తాను అది చిటికెలో మీ సమస్యను పరిష్కరిస్తుంది’ అని చెప్పి మిగిలిన జంతువులన్నింటినీ పంపేసింది. సింహం నిస్సహాయంగా తలూపింది. అరగంటలో అక్కడికి కొంగగారు రానే వచ్చారు. సింహం నోట్లోకి పరికించి చూసి ‘అవును మహారాజా! మీ నోట్లో ఒక ఎముక గుచ్చుకోనుంది దాన్ని తొలగిస్తాను. కానీ మీరు నాకు మూల్యం చెల్లించాలి’ అంది. సింహం, నక్క కోపంగా చూశాయి. ‘మూల్యమంటే కేవలం పది ఎండు చేపలు ఇస్తే చాలు మహారాజా!’ అంది కొంగ వినయంగా. నక్క ఏదో అనబోతుండగా సింహం వారించి సరే అలాగే అన్నట్లు తలాడించింది. పది నిమిషాల్లో సింహం నోట్లో తలపెట్టి ఆ ఎముక ఎక్కడుందో వెతికి బయటకి లాగి పడేసింది కొంగ. హమ్మయ్య అనుకుంది సింహం.‘ఏంటి ఇప్పుడు చెప్పు నీకు మూల్యం కావాలా? నా నోట్లో నీ తల ఉన్నప్పుడు కొరకకపోవడమే నీకు నేనిచ్చే మూల్యం...’ అంది సింహం వికటంగా. ‘ఇది మోసం మహారాజా...’ అనబోతున్న కొంగపైకి దూకింది నక్క. అంతేకాదు, అప్పటికప్పుడే గుహ తలుపులు మూయించేసింది. కొంగకు భయం వేసింది. గుహ కప్పు అంత ఎత్తుగా లేదు. ఒకవైపు నుంచి నక్క మరోవైపు నుంచి సింహం దాని మీద దాడికి చూస్తున్నాయి. కొంగకు ఏం పాలు పోలేదు. అక్కడక్కడే ఎగురుతూ తప్పించుకోవడానికి చూస్తోంది. పైకప్పులో బండల మధ్య ఉన్న ఒక రంధ్రాన్ని గమనించి తుర్రున దాంట్లో నుంచి ఎగిరిపోయి, ‘బతుకు జీవుడా’ అనుకుంది కొంగ.అప్పుడు సింహం విస్తుపోతూ, ‘ఆ బండల మధ్య సందును వెంటనే మూయించు’ అని నక్కను ఆదేశించింది. ప్రాణభయంతో ఎగిరిపోయిన కొంగ దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద అలసట తీర్చడానికి వాలింది. ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటు మత్తుగా కునికిపాట్లు పడుతోంది. ‘ఏంట్రా అలా భయంతో గజగజ వణుకుతున్నావు? ఏమిటి సంగతి?’ అంది ఎలుగు దాన్ని చూస్తూ. సింహం, నక్క తనకు చేసిన అన్యాయం గురించి కొంగ చెప్పి వాపోయింది. ‘వాళ్లంతే! నీచులు’ అంది ఎలుగు.అంతలోనే నక్క అటుగా రావటం చూసి కొంగ ఎగిరిపోయింది. నక్క చెట్టుకు దగ్గరకు వచ్చి ‘మామా! మన రాజుగారి గుహపైన ఒక కంత ఉంది. పెద్ద బండతో దాన్ని నువ్వు పూడ్చాలి. వెంటనే రమ్మని రాజాజ్ఞ’ అంది నక్క దర్పంగా. ‘అలాగే అల్లుడు... పద వస్తాను’ అంటూ చెట్టు దిగింది ఎలుగు. రెండూ గుహ దగ్గరకు వచ్చాయి. నక్క దర్జాగా గుహలోకి వెళ్ళి, సింహంతో ముచ్చట్లు పెట్టింది. ఎలుగు గుహ పైకి ఎక్కి కంత ఎక్కడ ఉందో చూసింది. ఈ రెంటికి బుద్ధి చెప్పాలని అనుకున్న ఎలుగు– కంతకు సరిపడ బండ కాక కొద్దిగా చిన్న సైజు బండతో దాన్ని కప్పబోయింది. అంతే! ఆ బండ దడేల్న లోపల ముచ్చట్లు చెప్పుకుంటున్న నక్క తలను పచ్చడి చేసి, పక్కనే ఉన్న సింహం పైకి దొర్లింది. దాని ముందు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. సింహం బాధతో, భయంతో అరవడం మొదలు పెట్టింది. గుహ తలుపులు మూసి ఉండడం వల్ల ఆ అరుపులు బయట ఎవరికీ వినపడలేదు. ఎలుగు నవ్వుకుంటూ, కంతకంటే పెద్దదైన బండతో ఆ ఖాళీని అప్పుడు మూసేసింది. రాజు, మంత్రి అనే గర్వంతో సింహం, నక్క చేస్తున్న అరాచకాలకు అలా అడ్డుకట్ట వేసింది ఎలుగు. సింహం ఆహారం, నీళ్లు లేక గొంతు ఎండుకు పోయేలా అరిచి అరిచి కొన్నాళ్లకు ప్రాణాలు విడిచింది. చంద్ర ప్రతాప్ కంతేటి (చదవండి: పుణ్యశీలుడి వృత్తాంతం: అందుకోసమే వైశాఖ ధర్మాలు..) -
పుణ్యశీలుడి వృత్తాంతం: అందుకోసమే వైశాఖ ధర్మాలు..
పూర్వం పాంచాల రాజ్యాన్ని పురుయశుడు అనే రాజు పాలించేవాడు. అతడి కొడుకు పుణ్యశీలుడు. బాల్యంలోనే పుణ్యశీలుడు సదాచారాలను పాటించేవాడు. గురుకులంలో చేరి, అస్త్రశస్త్ర విద్యలు సహా రాజోచితమైన విద్యలన్నీ నేర్చుకున్నాడు. తండ్రి పురుయశుడు గతించాక పుణ్యశీలుడు రాజ్యపాలన చేపట్టాడు. ధర్మం తప్పక ప్రజలను పాలించసాగాడు. కొన్నేళ్లు సజావుగానే గడిచినా, కొంతకాలానికి పుణ్యశీలుడి రాజ్యంలో దారుణ దుర్భిక్షం సంభవించింది. రోగాలు సోకి ఏనుగులు, గుర్రాలు మరణించాయి. ధనాగారంలోని ధనమంతా నశించింది. రాజ్య నిర్వహణ కష్టతరంగా మారింది. గజబలం, అశ్వబలం నశించడంతో పుణ్యశీలుడు బలహీనంగా మిగిలాడు. శత్రురాజులు ఈ సంగతి తెలుసుకుని, పుణ్యశీలుడి మీదకు దండెత్తి వచ్చారు. యుద్ధంలో పుణ్యశీలుడు ఓటమిపాలయ్యాడు. భార్య శిఖినితో కలసి అడవులకు చేరుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ఒక కొండగుహలో తలదాచుకోసాగాడు. రాజ్యాన్ని పోగొట్టుకుని, అడవులపాలైన పుణ్యశీలుడు తనలోనే తాను కుమిలిపోసాగాడు. ‘ఇంతటి దుస్థితి నాకెందుకు వచ్చింది? తల్లిదండ్రులను భక్తితో సేవించుకున్నాను. గురువుల పట్ల వినయ విధేయతలతో నడుచుకున్నాను. దైవభక్తి గలవాడిని. భూతదయాపరుడిని. సదా సదాచారపరాయణుడనైన నాకెందుకు ఇంతటి కష్టం కలిగింది’ అని నిత్యం బాధపడసాగాడు.పుణ్యశీలుడు అడవులపాలై యాభైమూడేళ్లు గడచిపోయాయి. అతడి దుఃఖం అంతకంతకు పెరగసాగింది. ఒకనాడు అతడు తన గురువులైన యాజ ఉపయాజకులను స్మరించుకున్నాడు. అతడు మనసులో తలచినదే తడవుగా యాజ ఉపయాజకులు అతడి ముందు ప్రత్యక్షమయ్యారు. పుణ్యశీలుడు ఎదుట నిలిచిన గురువులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజలాంఛనాలు లేకుండా, సామాన్యుడిలా ఉన్న పుణ్యశీలుడు గురువులను చూసి, కన్నీరు కార్చసాగాడు. వారు అతడిని లేవదీశారు. పుణ్యశీలుడు ఫలపుష్పాదులతో గురువులను పూజించాడు. ‘‘గురువులైన విప్రులారా! నేను రాజును. జన్మ కర్మల చేత పవిత్రుడను. పితృదేవతా భక్తుడను. పాపభీతి గలవాడను. నాకు ఇంతటి కష్టం సంభవించడానికి కారణమేమిటి? శత్రువుల చేతిలో ఓటమి పాలై, రాజ్యాన్ని, ధనాన్ని పోగొట్టుకుని, ఏళ్ల తరబడి ఎవరికీ తెలియకుండా, ఇలా అడవుల్లో గడపవలసిన దుస్థితి ఏర్పడటానికి కారణమేమిటి? అసలు నా రాజ్యంలో దుర్భిక్షం వాటిల్లడానికి కారణమేమిటి?’’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు.‘‘రాజా! నీ దుఃఖానికి, దుస్థితికి కారణాన్ని చెబుతున్నాం, విను. పూర్వం పదిజన్మలలో నువ్వు కిరాతుడివై ఉండేవాడివి. హింసాత్మకుడివై, కఠినాత్ముడివై జనాలను పీడించేవాడివి. ఏనాడూ ధర్మ కార్యాచరణ చేయలేదు. ఇంద్రియ నిగ్రహాది సుగుణాలు లేక యథేచ్ఛగా సంచరించేవాడివి. పొరపాటునైనా శ్రీహరి నామాన్ని ఉచ్చరించలేదు. తొమ్మిది జన్మలు ఇలాగే గడిచిపోయాయి. పదో జన్మలో సహ్యాద్రి ప్రాంతంలో కిరాతుడివై జన్మించావు. గడచిన తొమ్మిది జన్మల మాదిరిగానే పదో జన్మలో కూడా మనుషులను హింసించేవాడివి. నరమాంసభక్షణ చేసేవాడివి. నమ్మినవారిని హింసించడం వల్ల సోదరులు లేకుండాపోయారు. నీకు గత జన్మలో సంతానం కూడా లేకపోయింది. పరపీడన పాపం వల్ల నీకు ఈ జన్మలో వనవాసక్లేశం సంభవించింది. నరమాంసభక్షణ వల్ల నీకు తిండికి కరవైన పరిస్థితి ఏర్పడింది. మనుషులకు అప్రియమైన పనులు అనేకం చేయడం వల్ల నానా కష్టాలు నిన్ను చుట్టుముట్టాయి. సజ్జనులను హింసించడం వల్ల శత్రువుల చేతిలో ఓటమి ఎదురైంది. ఇదివరకటి జన్మలలో ఎవరికీ దానం చేయకపోవడం వల్ల దారిద్య్రబాధ సంభవించింది.’’ అని చెప్పారు. ‘‘మరి ఈ జన్మలో రాజవంశంలో ఎలా జన్మించాను?’’ అడిగాడు పుణ్యశీలుడు.‘‘ఆ కారణం కూడా చెబుతాం విను. నువ్వు కిరాతుడిగా ఉన్నప్పుడు ఒక వేసవిలో ఇద్దరు ధనిక వైశ్యులు, కర్షణుడు అనే విప్రుడు తారసపడ్డారు. నువ్వు ఆ ముగ్గురినీ అటకాయించావు. వారిలో ఒక వైశ్యుడిని చంపి, అతడి వద్దనున్న ధనం లాక్కున్నావు. రెండో వైశ్యుడు తన డబ్బు మూటను పొదల్లో పారవేసి పారిపోయాడు. విప్రుడు కూడా పరుగు లంకించుకున్నాడు. కొంత దూరం పరుగెత్తాక విప్రుడు సొమ్మసిల్లి పడిపోయాడు. రెండో వైశ్యుడు డబ్బును ఎటువైపు పారవేశాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నువ్వా విప్రుడికి శైత్యోపచారాలు చేసి, అతడి దప్పిక తీర్చావు. నీ పట్ల భయంతో అతడు రెండో వైశ్యుడు డబ్బు మూట ఎటువైపు పారవేశాడో చెప్పాడు. నువ్వు ఆ విప్రుడిని ప్రాణాలతో విడిచిపెట్టావు. నీ స్వలాభం కోసమైనా, వైశాఖమాసంలో విప్రుడికి ఉపచారాలు చేసి, దప్పిక తీర్చిన ఫలితంగా నువ్వు ఈ జన్మలో రాజవంశంలో జన్మించావు. అందువల్ల వైశాఖ ధర్మాలను నిర్వర్తిస్తే నువ్వు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందగలవు’’ అని చెప్పారు. గురువులైన యాజోపయాజకులు చెప్పిన ప్రకారం పుణ్యశీలుడు వైశాఖ ధర్మాలను ఆచరిస్తూ, శ్రీహరిని పూజించసాగాడు. కొన్నాళ్లకు అతడు తన బంధువులను కలుసుకోగలిగాడు. వారి సాయంతో శత్రువులు ఆక్రమించుకున్న తన రాజ్యానికి వెళ్లి, శత్రువులతో యుద్ధంచేసి, వారిని తుదముట్టించి, తిరిగి తన రాజ్యాన్ని దక్కించుకున్నాడు.సాంఖ్యాయన -
గాంధార నవ్వు
‘‘నాన్నా! నీకు ఫోన్ వచ్చింది.’’ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమవుతూ, వరండాలో బూట్లు పాలిష్ చేసుకుంటున్న ఆనంద్‌కు వినిపించింది కూతురి అరుపు.‘‘ఎవరమ్మా, పేరు చూడు.’’ అన్నాడు తన పని ఆపకుండా. ‘‘ప్రవల్లిక అమెరికా... అంట నాన్నా.’’ కూతురి మాట ఇంకా పూర్తవకముందే, పాలిష్ మధ్యలోనే ఆపేసి ‘‘లిఫ్ట్ చేయొద్దూ...’’ అని అంటూ చటుక్కున పైకి లేచాడు. కూతురు ఎక్కడ కాల్ లిఫ్ట్ చేస్తుందో అని హడావిడిగా ఇంట్లోకి కదిలాడు. ఈ తొందరలో అప్పటికే పాలిష్ పూర్తయిన ఒక షూ కాలికి తగులుకొని దూరంగా పడింది.ఈలోగానే ‘‘సరే నాన్నా..’’ అంటూ కూతురి మాటతో పాటు ఫోన్ మోగుతున్న శబ్దం ఆగిపోవడంతో కాస్త నెమ్మదించాడు.కూతురి చేతుల్లోంచి మొబైల్ తీసుకుని, మళ్లీ కాల్ వస్తుందేమో అని కాసేపు వేచి చూశాడు. రాకపోవడంతో తిరిగి చార్జింగ్ పెట్టబోయి, ఎందుకైనా మంచిదని ఆ ప్రయత్నం మానుకున్నాడు. మొబైల్‌ను ప్యాంట్ జేబులోకి తోశాడు. ఇదంతా వంటింట్లోంచి గమనిస్తోంది మీనాక్షి. ‘‘మాట్లాడడం ఇష్టం లేకపోతే బ్లాక్ చేయమని చాలాసార్లు చెప్పాను...’’ భర్తకు వినపడేలా గట్టిగా అంది.ఏమీ పలకలేదు ఆనంద్. ఆఫీస్‌కు రెడీ అవడంలో మునిగిపోయాడు. ‘‘.. అయినా, తను ఏం అడుగుతోంది? ఒకసారి కలసి మాట్లాడాలనే కదా? కలిపిస్తాననో కలిపించననో చెప్పొచ్చు కదా? ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా, మాట్లాడకుండా ఉండడం మంచి పద్ధతేనా?..’’ ఈసారి మరింత గట్టిగా వినిపించింది వంటగది నుంచి.‘‘ఏం నేనే చెప్పాలా?..నువ్వు చెప్పకూడదా? నీకూ ఫ్రెండే కదా?..’’నోరు తెరవొద్దనే నియమం మరచిపోయి అసంకల్పితంగా అనేశాడు. ఆ మాటతో విసురుగా హాల్లోకి వచ్చేసింది. ‘‘ఆ విషయం దానికి తెలియదా? అయినా నన్ను కాకుండా మిమ్మల్నే ఎందుకు అడుగుతోంది? మీ ఇద్దరూ జాన్ జిగిరీలు... నువ్వు చెబితే ఏమైనా చేస్తాడు. ఏదైనా వింటాడనే కదా? లేకపోతే తనే నేరుగా వెళ్లలేదా?.’’ దగ్గరికి రావడం వల్ల కాబోలు అరుస్తున్నట్లు వినబడింది. ఈసారి మాత్రం నోరు తెరవలేదు ఆనంద్. తెరిస్తే పెద్ద యుద్ధమే! అంతేకాదు, మరో నిమిషంలోనో అర నిమిషంలోనో అదే నెంబరు నుంచి మీనాక్షికి కాల్ వస్తుందనీ తెలుసు. అందుకే తిరిగి తన పనిలో తాను లీనమయ్యాడు. ఊహించినట్లే కాసేపటికి మీనాక్షి ఫోన్ మోగింది. భర్తను కొరకొరా చూస్తూ ఫోన్ తీసింది. కాసేపు మాట్లాడాక స్పీకర్ ఆన్ చేసింది. అటువైపు నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ‘‘అన్నయ్యా... మీరు నాతో ఎందుకు మాట్లాడరో నాకు తెలుసు. నన్ను తన దగ్గరికి తీసుకెళ్లమని మిమ్మల్ని ఇకపైన అడగను. ఎందుకంటే, నేనే వెళ్లి కలుస్తాను. రెండ్రోజుల్లో ఇండియాకు వస్తున్నాను. కానీ, మిమ్మల్ని, మీనాక్షిని, పాపను చూసే అవకాశం మాత్రం ఇవ్వన్నయ్యా!’’ అంటూ అభ్యర్థనగా పలికింది ప్రవల్లిక గొంతు. సమాధానం కోసం అటువైపు నుంచి ఎదురు చూస్తున్నట్లు భార్యాభర్తలిద్దరికీ అర్థమవుతోంది. ఏం జవాబు చెప్తాడో అని ఆనంద్ వైపే చూస్తోంది మీనాక్షి. అది గమనించి ‘సరే’ అని అంగీకరిస్తున్నట్లు తలూపి, హడావిడిగా ఇంటి నుంచి బయటపడ్డాడు. ఈ తొందరలో క్యారియర్ తీసుకోవడం మర్చిపోయి వెళుతున్న భర్తనే చూస్తూ ప్రవల్లికతో మాట్లాడుతోంది మీనాక్షి. ∙∙ ఆఫీస్‌కు వచ్చాడే గాని, పనేమీ చేయాలనిపించడం లేదు. కాసేపు అన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాడు. కుదరలేదు. తలనొప్పి ప్రారంభమైనట్లు అనిపించడంతో క్యాంటీన్ బాట పట్టాడు. ఎవరూ లేని టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని, కాస్త కాఫీ తాగాక ఆనంద్ ఆలోచనలు గతం వైపు పరుగు తీశాయి. ఆనంద్, రామకృష్ణ ఇద్దరూ ఇంటర్ నుంచి ఫ్రెండ్స్. ఒకే ఊరు, ఒకే గ్రూప్ కాకపోయినప్పటికీ అనుకోకుండా అయిన పరిచయం వాళ్లిద్దర్నీ మంచి స్నేహితులుగా మార్చింది. ఆ బంధం డిగ్రీలోనూ కొనసాగింది. అయితే, అక్కడా ఇద్దరివీ వేర్వేరు గ్రూపులే. ఒకరు బీఎస్సీ, మరొకరు బీకామ్. వీరి స్నేహం కాలేజీలో చాలామందికి విచిత్రంగా అనిపించేది. ఎందుకంటే ఆనంద్ నెమ్మదస్తుడు. తక్కువ మాట్లాడతాడు. బాగా దగ్గరైతే తప్ప ఎక్కువగా నోరు విప్పడు. అయితే, చదువులో మాత్రం ఎప్పుడూ ఫస్టే. రామకృష్ణ చదువులో మరీ ఫస్ట్ ర్యాంక్ స్థాయి కాకపోయినా, మెరిట్ స్టూడెంటే. అయితే, ఆటల్లో, కాలేజీల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మాత్రం అందరికంటే ముందుంటాడు. చలాకీగా, జోష్‌గా ఉండే రామకృష్ణ తీరు కాలేజీలో అమ్మాయిలకు ఎంతో నచ్చేది. దానికి తోడు కాస్త అందగాడు కూడా కావడంతో మొదటి ఏడాదిలోనే లవర్‌బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఎంతలా అంటే, అందరూ అతని పేరులోని రాముణ్ణి వదిలేసి కృష్ణుణ్ణి మాత్రమే గుర్తుచేసేలా.. ‘క్రిష్’ అని పిలుచుకునేంతగా.ఆ కాలేజీలోనే వీళ్లకు ప్రవల్లిక, మీనాక్షి పరిచయం. వీళ్లది ఒకే ఊరు. కానీ, కాలేజీలో మాత్రం ప్రవల్లిక బీకామ్, మీనాక్షి బీఏ. అందువల్ల మధ్యాహ్నం లంచ్ సమయంలోనో, క్యాంటీన్లోనో, తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడో తప్ప మీనాక్షి ఎక్కువగా వీళ్లతో కలిసేది కాదు. మరీ అంత నల్లగా కాకుండా, చామన ఛాయతో, కొంచెం బొద్దుగా కనిపించే ప్రవల్లిక మొహంలో కళ బాగుండేది. మొదటి ఏడాదిలోనే ఆనంద్‌కు, రామకృష్ణకు మంచి స్నేహితురాలైంది. ఆ ప్రయాణంలోనే రామకృష్ణ మీద ఏర్పడిన ఇష్టం ప్రేమగా మారింది. చివరి ఏడాది హాఫ్ ఇయర్లీ పరీక్షలు ముగిసిన రోజు తన మనసులోని మాటల్ని అక్షరాలుగా చేసిన ప్రేమలేఖను రామకృష్ణకు ఇచ్చింది.కానీ, వారం రోజులు ఎదురు చూసినా రామకృష్ణ నుంచి సమాధానం లేదు. రోజూ కాలేజీలో, క్లాసులో మాట్లాడడం, కలసి లంచ్ చేయడం అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. కానీ, రామకృష్ణ అభిప్రాయం మాత్రం చెప్పలేదు. రెండు మూడుసార్లు అడిగి చూసింది. అయినా జవాబు చెప్పకుండా తప్పించుకున్నాడు. ఉండబట్టలేక విషయాన్ని ఆనంద్‌కు చెప్పింది. అప్పటికే తనకు ఇద్దరు లవ్ ప్రపోజ్ చేశారని, లెటర్లు ఇచ్చారని చెప్పిన రామకృష్ణ– ప్రవల్లిక గురించి తన దగ్గర దాచడం ఆనంద్‌కు ఆశ్చర్యమనిపించింది. అదే విషయం గురించి సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరాక మిత్రుడిని కదిపాడు. ఆరోజు రామకృష్ణ చెప్పిన సమాధానం విన్నాక, ఆ తర్వాత ఆనంద్ కూడా ప్రవల్లికను తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. ప్రవల్లిక అడిగినా మాట దాటవేసేవాడు. మరో ఆర్నెల్లు గడిచి, డిగ్రీ పూర్తవగానే ఈసారి చదువు వాళ్లను విడదీసింది. ఎంసీఏ చేయడానికి ఆనంద్ హైదరాబాద్‌కు, సీఏ చేయడానికి రామకృష్ణ విజయవాడకు, పీజీ చేయడానికి ప్రవల్లిక తిరుపతికి వెళ్లాల్సొచ్చింది. ఆ తర్వాత చదువులు పూర్తవడం, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు అన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఆనంద్‌కు సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొని, మీనాక్షి ఇంట్లో వాళ్లతో మాట్లాడి వాళ్లిద్దరికీ పెళ్లి జరిపించింది ప్రవల్లికే. ‘‘సార్.. మేనేజర్‌గారు పిలుస్తున్నారు..’’ అనే పిలుపుతో ఆనంద్ ఆలోచనలు చెదిరిపోయాయి. వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లి మొహం కడుక్కొని, క్యాబిన్‌కు వెళ్లి మేనేజర్‌ను కలిశాడు. సాయంత్రం వరకు ఆఫీసులో అన్యమనస్కంగానే గడిపి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో అడుగుపెట్టగానే పొద్దున్నుంచి పరిస్థితిలో ఏమీ మార్పు లేదని గ్రహించాడు.మీనాక్షి ఏమీ మాట్లాడకుండా, తన పని తాను చేసుకుపోతోంది. మధ్య మధ్యలో విసిగిస్తున్న కూతుర్ని కోప్పడుతోంది. అదంతా తన మీద కోపమే అని ఆనంద్‌కు తెలుసు. భోజనాలు అయిపోయి, కూతుర్ని బెడ్రూమ్లో నిద్రపుచ్చిన తర్వాత హాల్లో టీవీ ఆన్‌చేసి కూర్చుంది మీనాక్షి. ‘ఇక తప్పదు ఈరోజు చెప్పాల్సి వచ్చేలా ఉంది’ అని మనుసులో అనుకుంటూ తాను కూడా వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. ‘‘ఇంతకీ ఏమంటోంది మీ ఫ్రెండ్..’’ అంటూ నోరుతెరిచాడు. భర్తను సీరియస్‌గా చూసింది మీనాక్షి. ‘‘ఏమంటుందో మీకు తెలియదా?’’ ఎదురు ప్రశ్నించింది. ‘‘తెలుసు... కానీ...’’ అని ఏదో చెప్పేలోపే అందుకుంది. ‘‘అయినా... అది రెండేళ్ల నుంచి మిమ్మల్ని ఏమడుగుతోంది? తనను రామకృష్ణ దగ్గరికి తీసుకెళ్లి ఒక్కసారి మాట్లాడనివ్వమనే కదా? తీసుకెళ్లడానికి మీకేంటి బాధ? తనేమైనా చిన్నపిల్లా... పన్నెండేళ్ల తర్వాత భర్తను, పిల్లల్ని వదిలేసి ఇండియాకు వచ్చి రామకృష్ణను పెళ్లి చేసుకోవడానికి? అయినా, తను అనుకుంటే సరిపోతుందా? భార్య, పిల్లల్ని వదిలేసి రామకృష్ణ అయినా ఎలా చేసుకుంటాడు దీన్ని?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. మౌనంగా వింటున్నాడు. ‘‘రామకృష్ణ ఎందుకు వద్దనుకున్నాడు? ఏ విషయం చెప్పకుండా ఎందుకు తప్పించుకు తిరిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసమే కదా తనని కలుస్తానంటోంది? మరి మీరెందుకు కలపడానికి ప్రయత్నించడం లేదు? అసలు మీ ఫ్రెండ్ ఆరోజు ఏమన్నాడో కనీసం నాకైనా చెప్పొచ్చుకదా?’’ అంటూ ఆగింది. ఇక తప్పదనుకొని నోరు విప్పాడు ఆనంద్. కాలేజీలో ప్రవల్లిక రాసిన ప్రేమలేఖ గురించి అడిగిన రోజు తనతోపాటు మిత్రుణ్ణి వాళ్ల ఊరికి తీసుకెళ్లాడు రామకృష్ణ. ఊరికి అరకిలోమీటరు దూరంలో ఒక పొలంలో ఉన్న ఆ ఇంట్లో రాత్రి భోజనాలయ్యాక, మిద్దె మీద పడుకొని ఉండగా మళ్లీ విషయం కదిపాడు ఆనంద్. సమాధానం చెప్పకుండా, దూరంగా ఊళ్లో కనిపిస్తున్న కొన్ని ఇళ్లను చూపించాడు రామకృష్ణ. ‘‘ఆ పెద్ద పెద్ద ఇళ్లు మా దాయాదులవి. ఇంకా చెప్పాలంటే... మా పెద నాన్న, చిన్నాన్న వాళ్లవి. వాళ్ల కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు కలిపి అందరూ నలభైమంది వరకు ఉంటారు. కానీ, వాళ్లెవరూ మాతో మాట్లాడరు. ఎందుకో తెలుసా?..’’ అంటూ ఆనంద్ వైపు చూశాడు. తెలియదన్నట్లు ఆనంద్ ప్రశ్నార్థకంగా మొహంపెట్టాడు.‘‘మా నాన్న పెళ్లి... తాతయ్యకు, అమ్మమ్మకు... ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకుండా చేసుకున్న ప్రేమ పెళ్లి. తనను ఇష్టపడిందని మా అమ్మను చేసుకున్నాడు. మా అమ్మ తరఫు వాళ్లు ఏమీలేనోళ్లు. అయినా, కట్నం కూడా లేకుండా చేసుకున్నాడు. ఇంట్లోవాళ్లెవరూ ఈ పెళ్లిని ఒప్పుకోకపోవడంతో తన వాటాకు వచ్చిన భూమిలో ఈ ఇల్లు కట్టుకొని వాళ్లందరికీ దూరంగా ఉంటున్నాడు. ముగ్గురు కూతుళ్లు, తర్వాత నేను పుట్టాక అమ్మ అనారోగ్యం పాలైంది. పంటలు కలిసి రాలేదు. అక్కలకు పెళ్లి చేసేసరికి మాకు మిగిలింది రెండెకరాల ఈ పొలం... అందులోని ఈ ఇల్లు...’’ అంటూ ఆగాడు. తన మాటల్లోని భావం కొంచెం కొంచెం అర్థమవసాగింది ఆనంద్‌కు. ‘‘ఓహో మీ నాన్నకు జరిగినట్లే నీకూ జరుగుతుందని ప్రేమ పెళ్లి వద్దనుకుంటున్నావా? అలాగయితే మరి ఈ విషయం నేరుగా ప్రవల్లికకే చెప్పొచ్చు కదా? అసలు ప్రవల్లిక అంటే ఇష్టం ఉందా లేదా?’’ అన్నాడు ఆనంద్.వెంటనే రామకృష్ణ. ఇంట్లోకి వెళ్లి రెండు లెటర్లు తీసుకొచ్చాడు. అవి అదే క్లాస్‌లో ఉండే మరో ఇద్దరు అమ్మాయిలు రాసిన ప్రేమలేఖలు. ‘‘ప్రవల్లికే కాదు... వీళ్లన్నా నాకు ఇష్టమే. కానీ, వీళ్లెవరికీ నేను కోరుకునేంత ఆస్తి లేదు. ఇంకా చెప్పాలంటే వీళ్లదీ మాలాంటి బతుకే...’’ స్నేహితుని నోటి నుంచి వస్తున్న మాటలు వింటూ తన నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. ‘అయితే, ఆస్తి కోసమా ప్రవల్లికను వద్దనుకుంటున్నది?!’ ఆనంద్ మనసులోని మాటను చదివేసినట్లు చెప్పసాగాడు రామకృష్ణ. ‘‘అవును. ఆస్తి కోసమే వద్దనుకున్నాను. ఆస్తే కాదు వీళ్లెవరూ అంత అందంగానూ లేరు. మిగిలిన ఇద్దరూ కొంచెం తెల్లగా అయినా ఉన్నారు. ప్రవల్లిక అయితే నలుపు. పైగా లావు. అయినా, పెళ్లి, జీవితం విషయంలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకోసమే నన్ను నేను మలచుకున్నాను. అమ్మాయిలు ఇష్టపడేలా తీర్చిదిద్దుకున్నాను. అలాగని ఎవరిని పడితే వాళ్లను చేసుకోవడానికి కాదు. చదువు అయిపోయాక, ఉద్యోగంలో ఎంత సంపాదిస్తామో తెలియదు. కానీ, కట్నం దండిగా తెచ్చే అందమైన అమ్మాయి భార్యగా రావాలని, మమ్మల్ని దూరం పెట్టిన మా వాళ్లందరూ కుళ్లుకునే స్థాయికి మేము ఎదగాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు కదా? ’’ అంటూ ఆగాడు. ఏమీ మాట్లాడలేదు ఆనంద్. అన్ని రోజులూ స్నేహితునిలో తాను గమనించలేకపోయిన మరో కోణం బయటపడేసరికి ఆ రాత్రంతా ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ..‘‘అదీ జరిగిన విషయం..’’ అంటూ చెప్పడం ముగించి మీనాక్షి వైపు చూశాడు ఆనంద్. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. ‘‘ప్రవల్లికకు వాడంటే చాలా ఇష్టం. ఎంతిష్టం అంటే.. నువ్వన్నట్లు వాడు ఓకే చెబితే భర్త, పిల్లల్ని వదిలేసి అమెరికా నుంచి వచ్చేసేంత ఇష్టం. కానీ, తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి ఏ కారణంతో తనను వద్దనుకున్నాడో తెలిస్తే తట్టుకోలేదు. అంతేకాదు, రామకృష్ణ ఆలోచనలు ఇలాంటివని తెలిస్తేనే భరించలేదు. అందుకే చెప్పలేదు. తనని కలవనివ్వలేదు. ‘తనను ఎందుకు ఇష్టపడలేదు?’ అనే ఆలోచన కన్నా ఇలాంటి కారణంతో తనను వద్దనుకున్నాడని జీవితాంతం గుర్తుచేసుకుంటూ బతకడం చాలా కష్టం’’ అంటూ ముగించాడు. మీనాక్షి ఏమీ మాట్లాడకపోయేసరికి లేచి బెడ్రూమ్లోకి వెళ్లిపోయాడు.∙∙ చెప్పినట్లుగానే రెండ్రోజుల తర్వాత హైదరాబాద్‌కు వచ్చింది ప్రవల్లిక. నేరుగా శ్రీనగర్ కాలనీలోని ఆనంద్ ఇంటికి చేరింది. బాగా సన్నబడి, కాస్త తెల్లగా కూడా మారిపోయి, తమ కంటే చిన్నదానిలా కనిపిస్తున్న ప్రవల్లికను చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. కుశలప్రశ్నలు, కుటుంబాల సంగతులు, కాలేజీ కబుర్లు అన్నీ చెప్పుకున్నాక రామకృష్ణను కలిసే విషయం ప్రస్తావించింది. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ఆనంద్ ‘మరుసటి రోజు కూకట్పల్లి హౌసింగ్‌బోర్డులో పెళ్లి రిసెప్షన్‌కు రామకృష్ణ వస్తున్నాడని, ఆరోజు వెళ్లి కలుద్దామ’ని చెప్పాడు. ‘సరే’ అంది ప్రవల్లిక. అయితే, అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు తాను తిరిగి అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నానని, రామకృష్ణను కలిశాక గచ్చిబౌలిలోని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి అట్నుంచటే ఎయిర్‌పోర్టుకు వెళతానని చెప్పింది. తర్వాతి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి రిసెప్షన్ జరిగే చోటుకు కారులో చేరుకున్నారు. అప్పటికే అక్కడ ప్రవల్లిక స్నేహితురాలు కారుతో సిద్ధంగా ఉంది. ప్రవల్లిక కారులోంచి దిగుతుండగా... ‘‘అదిగో అక్కడ తన ఫ్యామిలీతో ఉన్నాడు చూడు’’ అంటూ వేలును ఒక వైపు చూపించాడు ఆనంద్. అటువైపు చూసింది ప్రవల్లిక.‘‘ఎవరూ... అతనేనా? ’’ ‘‘అవును... అతనే ’’‘‘ఆ పక్కనున్నది?’’ ‘‘వాళ్లు తన భార్య, పిల్లలు. అన్నట్లు మీనాక్షి చెప్పే ఉంటుంది... రామకృష్ణ చేసుకున్నది తన కంపెనీ ఓనర్ కూతుర్నే... సరే, అవన్నీ వాళ్లను కలిశాక తీరిగ్గా మీరే అన్ని విషయాలూ మాట్లాడుకుందురు గానీ... రండి’’ అంటూ ముందుకు కదిలాడు. ప్రవల్లిక ఏమీ మాట్లాడలేదు. కారు దిగి, అక్కడే నిలబడి చూస్తోంది. ఉన్నట్లుండి నవ్వడం మొదలుపెట్టింది. తెరలు తెరలుగా... ఆపకుండా... ఆపుకోలేనంతగా... కళ్లలోంచి నీళ్లొచ్చేంతగా నవ్వుతోంది. ఆమె నవ్వుతున్నా చూపు మాత్రం రామకృష్ణ ఫ్యామిలీ వైపే ఉంది. దూరంగా బట్టతలతో, బాన పొట్టతో రామకృష్ణ... పక్కనే నిండుగా నగలు వేసుకొని, నల్లగా... భారీ ఆకారంతో భార్య... వాళ్లిద్దరి పక్కనే అమ్మ పోలికలతో నల్లని రంగులో మెరుస్తున్న ముగ్గురు కూతుళ్లు...కాసేపటి తర్వాత కాస్త తమాయించుకొని ‘‘వెళ్లొస్తా అన్నయ్యా... బై మీనాక్షి’’ అంటూ వెనకే ఆగి ఉన్న తన ఫ్రెండ్ కారులో కూర్చుంది. ఆనంద్‌కు ఏమీ అర్థంకావడంలేదు. ‘కలుస్తాను... కలుస్తాను అని రెండేళ్లుగా అడుగుతూ ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్లిపోవడం ఏంటి?’అదే విషయం అడిగాడు. ‘‘కలవాలని ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్లిపోతున్నావేంటమ్మా?!... నువ్వేంటి మాట్లాడకుండా నిల్చున్నావ్?! నువ్వైనా చెప్పు’’ అంటూ మీనాక్షి వైపు చూశాడు. భార్య మొహంలో కనిపిస్తున్న ప్రశాంతత, ఆమె మౌనం చూశాక... రామకృష్ణ గురించి తాను చెప్పిందంతా శ్రీమతి ముందే చేరవేసిందని అర్థమవసాగింది.కలవకుండా వెళ్లిపోవడం వరకు ఓకే... కానీ, ఆ నవ్వు ఎందుకో అతనికే కాదు మీనాక్షికీ అర్థం కావడం లేదు. రామకృష్ణ రూపం, నిజస్వరూపం ప్రత్యక్షంగా చూశాక... తనను వద్దనుకోవడానికి చెప్పిన కారణాలు ఇప్పుడు అతని చుట్టూనే ఉండడం గమనించాక... ఏళ్లుగా తాను పడుతున్న బాధ ఎంత అసంబద్ధమో తెలిశాక... ప్రవల్లిక అంతరాల్లోంచి నవ్వు అలా తన్నుకొని స్వేచ్ఛగా బయటికొస్తోందని వాళ్లకు తెలియదు. వెళుతున్న కారువైపే చూస్తున్నారు. ప్రవల్లిక పగలబడి నవ్వడం కారు అద్దంలోంచి వాళ్లకు కనిపిస్తోంది. అది... అడవి కాచిన వెన్నెల లాంటి నవ్వు... అది గాంధార నవ్వు. అది తనకు మాత్రమే సొంతమైన, తన కోసమే కురుస్తున్న చక్కటి, చిక్కటి, చల్లని నవ్వు. గౌకనపల్లె మహేశ్వరరెడ్డి (చదవండి: ఈ వారం కథ: కొత్త రంగుల పొద్దు -
సారస్వత పరిషత్‌లో... అరుదైన సాహితీ సంస్మరణ!
అద్భుతంగా పాఠం చెప్పే అధ్యాపకులు చాలామంది ఉంటారు. అజ్ఞానం దూరం చేసి, అపరిమిత జ్ఞానాన్ని అందించే ఆచార్యులూ అనేకులుంటారు. కానీ, చదువుతో పాటు సామాజిక చలనశీల సూత్రాల ఆధారంగా చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలో దోవ చూపి, ఆమరణాంతం వీడని ఆలోచనా మార్గం పట్టించే ఆచార్య వరేణ్యులు కొందరే ఉంటారు. శిష్యులను సైతం సహచరులుగా, మిత్రులుగా సంభావించి, వారిని తీర్చిదిద్దే అలాంటి ఆచార్యుల ఆలోచన, ఆచరణ, సాహిత్య - సామాజిక మూర్తిమత్వం ఆ శిష్యులపై చెరగని ముద్ర వేస్తుంది. హైదరాబాద్‌లో హైస్కూల్ టీచర్‌గా మొదలై, ఆగని అధ్యయనం, అధ్యాపనంతో ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ ప్రధానాచార్యులుగా, ‘హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ’ తెలుగు శాఖాధ్యక్షులుగా, హ్యుమానిటీస్ విభాగానికి డీన్‌గా ఎదిగి, ఎందరో విద్యార్థులను ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి – సారస్వతమూర్తి... ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు (1941 – 2021).సాహితీ లోకంలో కె.కె.ఆర్.గా సుప్రసిద్ధులైన ఆయన భౌతికంగా కనుమరుగై అయిదేళ్ళు నిండినా, ఇప్పటికీ సహచరులు, శిష్య మిత్రులెవరూ మరిచిపోలేని విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. మండు వేసవిలో సైతం ప్రతి మే నెలలో వారు ఆయనను ప్రత్యేకంగా స్మరించుకొనే తీరు అందుకు ఓ నిదర్శనం. చారిత్రక సాహితీ విమర్శకుడిగా కె.కె.ఆర్. విశిష్ట స్థానాన్ని మరోసారి గుర్తు చేస్తూ, ఈ ఏడాది కూడా ఆయన వర్ధంతిని ఆలోచనా స్ఫోరక సాహితీ సమావేశంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులు జరిపారు.ఇరవై ఒక్కేళ్ళ పాటు కె.కె.ఆర్. ప్రధానాచార్యత్వానికీ, సాహిత్య సంగోష్ఠికీ నెలవైన హైదరాబాద్‌లోని ‘తెలంగాణ (అప్పటి ఆంధ్ర) సారస్వత పరిషత్’ కళాశాల ప్రాంగణమే ఈసారి కూడా అందుకు వేదికగా నిలిచింది. కె.కె.ఆర్. వార్షిక సంస్మరణ ప్రసంగ కార్యక్రమం మే 15 సాయంత్రం ఆహూతుల మధ్య ఆత్మీయంగా సాగింది. సుప్రసిద్ధ చరిత్ర ఆచార్యులు డాక్టర్ వకుళాభరణం రామకృష్ణ ‘తెలుగువారి చరిత్ర – సంస్కరణోద్యమాలు’ అన్న అంశంపై ఈ ఏటి సంస్మరణ ప్రసంగం చేశారు. గత మూడేళ్ళుగా ఏటా జరుగుతున్న కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగాల పరంపరలో ఇది మూడో ప్రసంగం.“అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్”: ఆచార్య చంద్రశేఖరరెడ్డిప్రధాన ప్రసంగానికి ముందు ‘ఎమెస్కో బుక్స్’ ప్రధాన సంపాదకులు – సాక్షాత్తూ కె.కె.ఆర్. వద్దే చదువుకొని, సారస్వత పరిషత్‌లో సహోద్యోగిగా ఎదిగి, సన్నిహితంగా మెలిగిన ఆచార్య డాక్టర్ దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, కె.కె.ఆర్. ప్రత్యేకతను వివరించారు. “తెలుగు సాహిత్య విమర్శలో చారిత్రక దృక్కోణానికి పెద్ద పీట వేసి ఒరవడి దిద్దిన అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్. ఆయనకు చరిత్రపై అమితమైన ఆసక్తి. భారతదేశ చరిత్రను నిశితంగా అధ్యయనం చేశారు. చరిత్ర పరిణామాలను గమనించి ఊరుకోకుండా, చరిత్రలోని పరిణామాలకూ సాహిత్యంలోని పరిణామాలకూ మధ్య సంబంధాన్ని విశ్లేషించేవారు. ఎలాంటి చారిత్రక పరిస్థితుల్లో, ఎలాంటి సాహిత్యం వచ్చిందో లోతైన అధ్యయనం చేసి చెప్పేవారు. చరిత్ర నిర్దేశించే సాహిత్య స్వరూపాన్ని విశదీకరించేవారు. అందుకే, ఆయనను అరుదైన ‘చారిత్రక విమర్శకుడి’గా గణిస్తున్నాం. అగ్రశేణి తెలుగు సాహితీ విమర్శకులను పదిమందిని తీసుకున్నా... మొదటి అయిదుగురు ప్రాచీన సాహితీ విమర్శకులనుకుంటే, మిగిలిన అయిదుగురు ఆధునిక విమర్శకులలో ‘కనిష్ఠికాధిష్ఠితుడైన కాళిదాసు’ లాగా మున్ముందు చెప్పుకోవాల్సిన పేరు కె.కె.ఆర్.దే” అని డి. చంద్రశేఖరరెడ్డి అభిప్రాయపడ్డారు.అలాగే, కె.కె.ఆర్. వ్యక్తిత్వంలోని గొప్పదనాన్ని ఇంకా వివరిస్తూ, “సమాజంలోని సమకాలీన సంఘటనలపై ఆయన స్పందించేవారు. సర్వసాధారణంగా ఆయన ఎంత సంయమనం పాటిస్తారో, ప్రపంచంలో దుర్మార్గాన్ని చూస్తున్నప్పుడు అంత అసహనం వ్యక్తం చేసేవారు. వాటి గురించి రాయకున్నా, ఉపన్యసించకున్నా... మిత్రులతో తన బాధ, ఆవేదన, ఆవేశం పంచుకొనేవారు. చుట్టూ ఉన్న ప్రపంచంలోని మంచిని ఎంతగా అభిమానిస్తామో... చెడును అంత తీవ్రంగా ఖండించడమన్నది శిష్యులందరూ ఆయనను చూసి నేర్చుకున్నదే. అందుకే, ఒక్కమాటలో కె.కె.ఆర్. సంఘ సంస్కరణవాది కూడా” అని చంద్రశేఖరరెడ్డి విశ్లేషించారు. అందుకు తగ్గట్టే ‘తెలుగు వారి చరిత్ర – సంఘ సంస్కరణోద్యమాలు’ అంశంపై ప్రధాన ప్రసంగకర్త వకుళాభరణం రామకృష్ణ సైతం భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడైన ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ సర్వేపల్లి గోపాల్ వద్ద పరిశోధన సాగించిన ఉద్దండులంటూ ఆయన కృషిని స్థూలంగా పరిచయం చేశారు.“ఆ సమగ్ర స్వరూపమే తెలుగువారి చరిత్ర”: వకుళాభరణంవకుళాభరణం రామకృష్ణ ప్రధాన ప్రసంగం చేస్తూ, ఢిల్లీలోని జె.ఎన్.యు.లో సాగిన తన చరిత్ర పరిశోధన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రసిద్ధ చరిత్రకారులు, పరిశోధకులైన రొమిల్లా థాపర్, సర్వేపల్లి గోపాల్ తదితరులతో జరిగిన సంగతులు పంచుకున్నారు. “తెలుగునాట ఆధునిక సంఘ సంస్కరణలకు దీపధారి లాంటి కందుకూరి వీరేశలింగం మీద రిసెర్చ్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పినప్పుడు మా గైడ్ సర్వేపల్లి గోపాల్ అన్న ఓ మాట నాకు ఇప్పటికీ గుర్తు. ‘పరిశోధనంటే - వీరేశలింగం వితంతు వివాహాలు జరిపాడు, బాలికా విద్యను ప్రోత్సహించాడు లాంటివి కాదు రాయాల్సింది. ‘హౌ బి శానిటైజ్డ్ ది సొసైటీ’ (తెలుగు సమాజాన్ని ఆయన ఎలా శుభ్రపరిచాడు) అన్నది చెప్పాలి, రాయాలి’ అన్నారాయన. అది నా మనసులో నాటుకొని, పరిశోధనకు మార్గదర్శకమైంది. కష్టపడి ఆయన దగ్గరే ఎం.ఫిల్, ఆ తర్వాత పీహెచ్డీ చేశాను” అని తెలిపారు.“ఒకసారి ‘యునెస్కో’ ఆహ్వానంపై సర్వేపల్లి గోపాల్ గారు ప్యారిస్‌కు వెళ్ళినప్పుడు, ఆయన స్థానంలో నన్ను పెడితే, నేను పాఠాలు చెప్పడం ఓ అపూర్వ గౌరవం. ‘ఆఖరి టాపిక్ మిగిలిస్తే, విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత నేనే ఆ పాఠం చెబుతాన’ని వెళ్ళే ముందు గోపాల్ అన్నారు. తీరా, పర్యటన నుంచి తిరిగొచ్చాక విద్యార్థులకు ఆ పాఠం కూడా నన్నే చెప్పమనేశారు. నేను ఆ పాఠం చెబుతుంటే, ఆయన కూడా ఆ క్లాసులో కూర్చొని విన్న క్షణాలు మర్చిపోలేను” అని వకుళాభరణం పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళారు.ఈ మే 15 నాడే 88 వసంతాలు పూర్తి చేసుకొని, 89వ ఏట అడుగిడిన వకుళాభరణం దాదాపు నలభై నిమిషాల తన ప్రసంగంలో, ఆధునిక తెలుగు రాజకీయ చరిత్రలో జరిగిన ప్రధానమైన మార్పులను ఓపికగా ప్రస్తావించారు. బ్రిటీషు వారి కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేరుగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ మొదలైన ఉద్యమం, 1913 నాటి బాపట్ల ‘ప్రథమాంధ్ర మహాసభ’ నుంచి ఆంధ్ర రాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు, చివరకు 2013 నాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన పరిణామాల క్రమాన్ని ఆయన స్థూలంగా వివరించారు.కందుకూరి వీరేశలింగం పంతులు గారి ప్రవేశం తర్వాత నడచిన సంస్కరణోద్యమాల తీరుతెన్నుల గురించి ‘సోషల్ రిఫార్మ్స్ మూవ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే తన సిద్ధాంత గ్రంథంలో విపులంగా చర్చించిన వకుళాభరణం రామకృష్ణ, “గురజాడ, గిడుగు, కందుకూరి... ఈ ముగ్గురూ తెలుగు నేలకు వేగుచుక్కల త్రయం. వారిలో మొదటి ఇద్దరు సాహితీస్రష్టలూ విజయనగరం వారే కావడం విశేషం. అలాగే, తెలంగాణ ప్రాంతం నుంచి సాహిత్య, సామాజిక, రాజకీయ చైతన్యం తెచ్చినవారిలో కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు... ఈ ముగ్గురి పేర్లూ చెప్పుకొని తీరాలి” అని అభిప్రాయపడ్డారు. నక్సలైట్ల ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం లాంటి వాటిని ఆయన తన ప్రసంగంలో చూచాయగా ప్రస్తావించారు. రాజకీయంగా, సామాజికంగా, కళాత్మకంగా, సాంస్కృతికంగా తెలుగు నేలపై వచ్చిన మార్పుల్ని లోతుగా చూసినప్పుడే ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర – దాని పరిణామాలు – పర్యవసాలను సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతామని అన్నారు. హైదరాబాద్ వచ్చిన తొలిరోజుల్లో సారస్వత పరిషత్ గ్రంథాలయాన్ని తరచూ సందర్శించిన రోజులను గుర్తుచేసుకున్న వకుళాభరణం, చారిత్రక విమర్శ దృక్పథంతో కె.కె.ఆర్. చేసిన సాహిత్య కృషిని ప్రశంసించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా, కె.కె.ఆర్.తో సాగిన స్నేహాన్ని స్మరించుకున్నారు.అయిదేళ్ళుగా... ప్రతి ఏటా... అదే వేదికపై!నిజామాబాద్ జిల్లాలోని ‘తెలంగాణ విశ్వవిద్యాలయం’లో తెలుగు శాఖలో ఆచార్యత్వం వహిస్తున్న డాక్టర్ సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి ఈ మొత్తం సభా కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు. “ఉత్తమ ఆచార్యుడిగా, లోతైన సాహితీ విమర్శకుడిగా పేరున్న కె.కె.ఆర్. మరణానంతరం ఆయన శిష్య మిత్ర బృందం ఆచార్య చంద్రశేఖరరెడ్డి సారథ్యంలో ఏటా ఒక ప్రత్యేక సాహితీ కార్యక్రమం చేస్తోంది. తొలి ఏడాది ‘కె.కె.ఆర్. సంస్మరణ’ పేరిట ఆయన సంస్మరణ సంచిక తీసుకువచ్చారు. రెండో ఏడాది ఆయన బహుముఖీన వ్యక్తిత్వంపై ‘కె.కె.ఆర్. సాహిత్య వ్యక్తిత్వం’ పేరిట పలువురు సన్నిహితులు రాసిన వ్యాసాల సంకలనం వెలువరించారు. ఆ తర్వాత నుంచి మూడేళ్ళుగా ఏటా ఒక సుప్రసిద్ధుడితో సంస్మరణ ప్రసంగాలు చేయిస్తున్నారు. తత్త్వశాస్త్ర ఆచార్యులు డాక్టర్ అడ్లూరి రఘురామరాజు, సాహితీ విమర్శకుడు డాక్టర్ బి. తిరుపతిరావుల అనంతరం ఈసారి మూడో సంస్మరణ ప్రసంగం – చరిత్ర పరిశోధకులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ గారిది” అంటూ లక్ష్మణ చక్రవర్తి అయిదేళ్ళ ప్రస్థానాన్ని అద్దంలో చూపారు. అలాగే, తాజా సభలో విడుదలైన కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగ పుస్తకాలు రెంటికీ లక్ష్మణ చక్రవర్తే సంపాదకత్వ బాధ్యతలు వహించడం విశేషం. పిల్లలకు ప్రేమ పంచి... ఆచరణలో గౌరవం చూపి...ప్రధాన ప్రసంగానికి ముందు సభలో కె.కె.ఆర్. శిష్యమిత్రులు పలువురు మాట్లాడుతూ, మాస్టారితో తమ అనుబంధాన్నీ, వారి జ్ఞాపకాలనూ పంచుకున్నారు. కె.కె.ఆర్. వద్ద చదువుకున్న 73 ఏళ్ళ అధ్యాపకుడు డాక్టర్ డి. నరసయ్య అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటూ, “విద్యార్థులను సైతం గౌరవించడాన్ని ఆచరణలో చూపిన అరుదైన టీచర్ ఆయన. ఆ విశిష్ట గుణం ఆయన దగ్గరే చూశాను. విద్యార్థులతో ‘అంత్యాక్షరి పద్యపఠనం’తో పాటు ‘స్లో సైక్లింగ్’ లాంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ, పిల్లలతో అంతగా మమేకమైన టీచర్‌గా కె.కె.ఆర్. సార్‌ను మర్చిపోలేము” అన్నారు.జర్నలిస్ట్ రవీంద్రబాబు మాట్లాడుతూ, “ఎం.ఏ, ఎంఫిల్ కె.కె.ఆర్ గారి దగ్గరే చేశా. ఆధునిక కవిత్వం, స్ట్రక్చర్ ఆఫ్ మోడరన్ తెలుగు, సంస్కృతంలోని కాళిదాసు ‘మేఘసందేశం’... ఇలా ఏ సబ్జెక్ట్‌నైనా ఆయన బోధించేవారు. తాను చెప్పిన అంశం మీద కాకుండా, అప్పట్లో కొత్తగా వచ్చిన త్రిపురనేని శ్రీనివాస్ ‘హో’ కవితా సంపుటి మీద నేను పరిశోధన చేస్తానంటే ఆయన అభ్యంతర పెట్టలేదు. ముందుగా తానే ఆ పుస్తకం తెప్పించుకొని, చదివి, పరిశోధక విద్యార్థినైన నాకు సరైన మార్గనిర్దేశనం చేసిన అరుదైన గైడ్ ఆయన” అని వివరించారు.అరుదైన అధ్యయనశీలి ఆఖరి కోరిక!‘తెలుగు అకాడెమీ’కి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన రచయిత, భాషావేత్త డాక్టర్ అప్పం పాండయ్య మాట్లాడుతూ, “విద్యార్థులు, పరిశోధకులపై కె.కె.ఆర్. ఆప్యాయత అపారం. ఏదైనా తనకు తప్పు అనిపిస్తే మాత్రం... మిత్రధర్మం, శిష్యధర్మం ఎంత ఉన్నా సరే వెరవకుండా, వాటిని పక్కనబెట్టి మరీ నిక్కచ్చిగా ఆయన తన అభిప్రాయం చెప్పేవారు. కె.కె.ఆర్. తన విద్యాభ్యాసం, ఉద్యోగ జీవిత కాలంలోని సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, సమాజంలోని చైతన్యశీలత, మార్పులను చెబుతూ జీవిత కథనం రాయాలని భావించారు. తీరని ఆయన కోరికను ఇప్పటికైనా మిత్రులెవరైనా పూనుకొని తీరిస్తే బాగుంటుంది” అని సూచన చేశారు. సారస్వత పరిషత్‌లో చదువుకొని సినీ, టీవీ నటుడిగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న మానిక్ అప్పటి తన అనుభవాలు పంచుకున్నారు.కుటుంబంతో కాదు... సాహితీ కుటుంబంతో!ఈ కార్యక్రమానికి కె.కె.ఆర్. సతీమణి ఊర్మిళ, కుమారుడు సుమన్, మనుమడు స్వభావ్తో సహా కె.కె.ఆర్. కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. “కేవలం కుటుంబ సభ్యులమే కాకుండా, సాహితీ బంధువులందరితో కలసి ఏటా కె.కె.ఆర్.ను స్మరించుకోవడం కోసం అయిదేళ్ళుగా ఇలా సాహితీ ప్రసంగాల సభ జరుపుతున్నాం. గతంలో కె.కె.ఆర్. ఇలాంటి ప్రసంగాల ‘సారస్వత వేదిక’ను దాదాపు పదేళ్ళ పాటు నిర్వహించారు. దాని ఫలితంగానే, సాహిత్య చరిత్ర వ్యాసాలుగా చిరస్థాయిగా నిలిచిపోయిన ‘తెలుగు సాహిత్యం - మరోచూపు’, ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు’ లాంటి లాంటి పుస్తకాల రూపంలో ఆ ప్రసంగాలు మిగిలాయి. ఆ ఫక్కీలోనే ఇప్పుడీ వార్షిక ప్రసంగాలు చేయిస్తున్నాం. రానున్న రోజుల్లో యువతరంతోనూ, ఆధునిక వక్తలతోనూ ఇలాంటి ఆలోచనాత్మక సంస్మరణ ప్రసంగాలు ఇప్పించాలని భావిస్తున్నాం” అని ఊర్మిళ సభాముఖంగా ప్రకటించారు. అతిథులకు తమ కుటుంబ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంస్మరణ ప్రసంగ సభలో కె.కె.ఆర్.తో అనుబంధం ఉన్న ప్రముఖ కవి నిఖిలేశ్వర్, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు – సాహితీవేత్త మోత్కూరి నరహరి, సాహితీ విమర్శకుడు కె.పి. అశోక్ కుమార్, వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత హోదాల్లో పనిచేసిన ఆచార్య అయినవోలు ఉషాదేవి, ఆచార్య గారపాటి ఉమా మహేశ్వరరావు, ‘తెలుగు అకాడెమీ’ మాజీ సంచాలకులు ఆచార్య కె. యాదగిరి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, చరిత్ర ప్రొఫెసర్ వకుళాభరణం రాజగోపాల్, ‘ఆకాశవాణి’ వార్తావిభాగం మాజీ ఉద్యోగి సమ్మెట నాగమల్లేశ్వరరావు మొదలైన ప్రముఖులు పలువురు పాల్గొనడం విశేషం.దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ కార్యక్రమానికి ముందు, తరువాత కూడా వచ్చినవారందరూ ఆత్మీయంగా పరస్పరం పలకరించుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరువెసుకోవడం, సారస్వత పరిషత్ ప్రాంగణంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం అరుదైపోతున్న సాహితీ కుటుంబ వాతావరణాన్ని ప్రతిఫలించాయి. వచ్చే ఏడాది కలయికకు మరో ఆత్మీయ భూమికను సిద్ధం చేశాయి. సారస్వత్ పరిషత్ ప్రాంగణంలో దాదాపు పదేళ్ళ పాటు ‘సారస్వత వేదిక’ పేరిట విశిష్ట అతిథుల సాహితీ ప్రసంగాలు నిర్వహించినప్పుడు ఆచార్య కె.కె.ఆర్. ఆచరించింది, అభిలషించిందీ కూడా ఇదేనేమో! - రెంటాల జయదేవ -
సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..
అందరు చేసే వంటకమే కానీ దాన్ని సర్వ్ చేసే విధానం లేదా వండే విధానంలో ప్రత్యేకత ఉంటేనే కథ ఏ ఫుడ్ స్టాల్ అయినా క్లిక్ అయ్యేది. ప్రజాదరణ పెరిగేది. బహుశా దాన్నే క్యాచ్ చేశాడు ఈ టీనేజ్ యువకుడు. అలా ఇలా ఆలోచించలేదు ఈ యువకుడు. వంట చేసే విధానంలో సరికొత్తగా ఫ్యాషన్ జోడించడంతో అతడ ఫుడ్ స్టాల్ మూడు పువ్వులు ఆరు కాయల్లా దినదినాభివృద్ధితో దూసుకుపోతోంది. ఇంతకీ స్టైలిష్‌గా వంట చేయడం ఎలాగంటే..చైనాకు చెందిన ఒక యువకుడు ఒక సాధారణ ఫ్రైడ్ రైస్ దుకాణాన్ని తన క్రియేటివిటీతో కొత్త లుక్‌ని అందించడమే కాదు లాభాల బాట పట్టేలా చేశాడు. అందరిలా వండటం కంటే.. ప్రత్యేకంగా విభిన్నంగా వంట చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా అతడి వద్దకు వచ్చేవాళ్లు తినడాని కంటే..అతడు చేసే విధానం అతడి ఆహార్యం చూసి నివ్వెరపోతూ ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తిగా వస్తూ..ఇక అక్కడే తింటుండటం విశేషం. 19 ఏళ్ల లూ షాన్డాంగ్ ఈనే యువకుడు కుటుంబ దుకాణాన్ని చాలా విభన్నంగా నడిపిస్తున్నాడు. ఎవరైన వంట చేయాడానికి వచ్చే వాళ్లు కుక్ డ్రెస్ లాంటది వేసుకుంటారు. కానీ ఇక్కడ లూ ఫ్యాషన్‌గా ఉంటాడు. ఆయన ఆఫీస్‌కి వెళ్లే వ్యక్తిలా సూటు బూటు వేసుకుని కనిపించడం విశేషం. చైనాలోని ఓ సాదారణ ఫ్రైడ్ రైస్ స్టాల్ రెస్టారెంట్‌కు మించి క్రేజ్ సంపాదించుకుంది. అందుకు ప్రధాన కారణం అతడు వండే విధానమే. లీ చాలా స్టైలిష్‌గా వండుతున్న విధానం అందర్నీ ఆకర్షించి ఆ స్టాల్‌కి జనాలు క్యూకట్టేలా ప్రజాదరణ పొందింది. అంతేకాదండోయ్ ఎంతో రుచిగా క్షణాల్లో వేడివేడిగా వడ్డిస్తాడు. అతడు ఎంత బిజీలో అయినా ఫ్రైడ్ రైస్‌ని జస్ట్ మూడు నిమిషాల్లో తయారు చేస్తాడు. ఇక ఫైడ్‌రైస్ ఒక ప్లేటు రూ. 1401లు అట. అతడి ఖర్చులు పోగా నెలకు సుమారుగా రూ. 7లక్షలుపైనే ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. క్రియేటివిటీకి నైపుణ్యం తోడైతే అద్భుతాలు జరగుతాయి అంటే ఇదేగదా..!. లూ నవ్వు మామలు గ్రేట్ కాదు..సూపరో సూపర్..!. కాగా, ఈ స్టాల్ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈమేరకు లూ మాట్లాడుతూ..ఏదో సరదాగా కస్టమర్ల ముఖంలో నువ్వులు విరబూయించేందుకు ఇలా సూటు వేసుకుని వంట చేశాను. కానీ వాళ్ల నుంచి ఈ స్ధాయిలో స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదని సంతోషంగా చెబుతున్నాడు లూ. View this post on Instagram A post shared by Mothership (@mothershipsg) (చదవండి: కోడిగుడ్డంత పుచ్చకాయలు) -
వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా?
గత కొన్ని రోజులుగా భారత్‌లో ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయో తెలిసిందే. ఎండలు భగభగలాడిస్తున్నాయి. ఉదయం పది దాటితేనే సూర్ర్యు సుర్రు మంటున్నాడు. కనీసం బయటకు వెళ్లాలంటేనే వణుకుపుట్టుకొస్తుంది. అంతలా ఎండలు గజగజలాడిస్తున్నాయి. ప్రతి చోట నలభై డిగ్రీలు దాటేస్తున్నాయి. మెట్రో ప్రాంతాల్లో ఇక ఆ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అంతేగాదు ఎండల ధాటికి వడదెబ్బల బారినపడుతున్న వారు ఎక్కువే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు కొందరు వడదెబ్బ బారిన పడగానే..పారాసెటమాల్ వేసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకూడదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వడదెబ్బ రెండు విధాలుగా ఉంటుందని, అందుకోసం ఎలాంటి ఆరోగ్య సంరక్షక చర్యలు తీసుకోవాలో సవివరంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా!.దేశంలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45°C దాటుతుండగా, తీర ప్రాంతాలు తీవ్రమైన తేమ, భరించలేని వేడితో సతమతమవుతున్నాయి. పైగా ఆస్పత్రులలో వడదెబ్బ, వడతాపం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే..క్షణాల్లో ప్రాణాంతకంగా మారుతుందని అంటున్నారు డాక్టర్ విశాల్. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో వడదెబ్బకు, వడఘాతానికి మధ్య ఉన్న తేడాను కూడా వివరించారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో పారాసెటమాల్ వేసుకోవడం ఎంత ప్రమాదకరం, ఎలాంటి అత్యవసర చర్యలు తీసుకుంటే మంచిది, వంటి వాటి గురించి సవివరంగా వెల్లడించారు. ప్రస్తుతం భారతదేశంలో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు దగ్గరగా ఉందని, తీరప్రాంతలైతే అంతకమించి ఉంటున్నాయి. సాధరణంగా వడదెబ్బ తగిలినప్పుడు..రోగి అలసిపోయినట్లు కనిపిస్తాడు, కానీ అతనికి చెమట పడుతూనే ఉంటుంది. ఈ సందర్భంలో, చాలా సమయం ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది అని డాక్టర్ విశాల్ చెబుతున్నారు. అదే వడఘాతం అనేది ప్రాణాంతకమైన వైద్య పరిస్థితి అని పేర్కొన్నారు. శరీరం అంతర్గత ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా విఫలమైనప్పుడు ఇది సంభవిస్తుందట. రోగి పూర్తిగా స్పృహ కోల్పోతాడు, ఆ వ్యక్తి శీతలీకరణ వ్యవస్థ పనిచేయడం ఆగిపోతుంది. పైగా చెమట కూడ పట్టదు కాబట్టి చర్మం పొడిగా, వేడిగా ఉంటుందట. దానివల్ల, మెదడు అక్షరాలా మైక్రోవేవ్‌లో పెట్టినట్లుగా ఉడికిపోతుంది. దాని కారణంగా, రోగి స్పృహ కోల్పోవచ్చు, అతనికి మూర్ఛలు రావచ్చు, కోమాలోకి వెళ్ళవచ్చు, లేదా చనిపోవచ్చు కూడా అని అన్నారు.పారాసెటమాల్ వేసుకోవచ్చా..వడదెబ్బలో పారాసెటమాల్ పనిచేయదని అంటున్నారు వైద్యులు. అనారోగ్యం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పారాసెటమాల్ మెదడు థర్మోస్టాట్‌ను రీసెట్ చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కానీ వడదెబ్బ తగిలినప్పుడు, బయటి నుండి వచ్చే అధిక వేడి శరీర వ్యవస్థను అధిగమించినప్పుడు, శరీరాన్ని చల్లబరిచే యంత్రాంగం విఫలమవుతుంది. పైగా రోగిని చల్లటి నీటితో చల్లబర్చాలి, చంకల ప్రాంతంలో చల్లటి నీటినిపోయాలి. దాంతో వారిలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే రోగికి తగినంత నీఉ, ఓఆర్ఎస్ ఇవ్వడం వంటివి చేయాలి. ఇలాంటి వాళ్లు సాధ్యమైనంతవరకు చల్లటి నీటిని తాగుతూ..ఇంటిలోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్ విశాల్.గమనిక: ఇది కేవలం అవగాహాన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యులు లేదా నిపుణులకు సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Vishal Gabale (@health.with.vg) (చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?) -
పుదీనాతో చెమటకు చెక్!
పుదీనాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని డ్యామేజ్ కాకుండా రక్షించడమే కాకుండా, హైడ్రేట్ చేసి తాజాగా ఉండేలా చేస్తాయి. పుదీనాలోని విటమిన్ ‘ఏ’ చర్మంలోని జిడ్డును తగ్గించి, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పుదీనా ఆకుల పేస్ట్, గుడ్డు తెల్లసొన మిశ్రమంతో మాస్క్ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది. పుదీనాలోని శాలిసిలిక్ యాసిడ్ మొటిమలను తగ్గిస్తుంది. పుదీనా రసం, పచ్చి బొప్పాయి రసాన్ని కలిపి మచ్చలు, కీటకాలు కుట్టిన చోట లేదా చర్మ ఇన్ఫెక్షన్లపై రాస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. వేసవిలో చన్నీటిలో పుదీనా ఆకులను వేసి ముఖం కడుక్కోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో పుదీనా ఆకులు లేదా పుదీనా నూనె వేసుకుంటే అలసట తగ్గి, అధిక చెమట సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖంపై మొటిమల వల్ల ఏర్పడే మచ్చల నివారణకు కూడా పుదీనా తోడ్పడుతుంది. సమాన పరిమాణంలో ఎండిన తులసి, వేప, పుదీనా ఆకులను పొడి చేసి పెట్టుకోవాలి. ఒక చెంచా ఈ పొడికి కొంచెం పసుపు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి మచ్చలపై రాస్తే అవి క్రమంగా తగ్గుతాయి. చర్మ సంరక్షణ కోసం కానోపిఎంత ఖరీదైన ఫేస్ వాష్‌లు వాడినా, ముఖం కడుక్కోవడానికి ఉపయోగించే నీరు బాగుండకపోతే ఆ ప్రయత్నాలన్నీ వృథానే. కొళాయి నీటిలో ఉండే క్లోరిన్, ఇతర మలినాలు, హార్డ్ వాటర్ చర్మాన్ని పొడిగా మార్చడమే కాకుండా, మొటిమలు, అలర్జీలకు దారితీస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ వెల్నెస్ బ్రాండ్ కానోపీ తన సరికొత్త ఫాసెట్ ఫిల్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫిల్టర్ సాధారణ వాటర్ ఫిల్టర్ల లాగా కాకుండా, ప్రత్యేకంగా చర్మ సంరక్షణ కోసం రూపొందించినది. ఇది నీటిలోని క్లోరిన్, ఇతర మలినాలను తొలగించి, నీటిని సున్నితంగా మారుస్తుంది. దీనివల్ల చర్మంపై కలిగే మంట, అలర్జీలు తగ్గుతాయి. మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మం సహజసిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.ఈ ఫిల్టర్ కేవలం పనితీరులోనే కాకుండా, చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బాత్రూమ్ ఇంటీరియర్‌కు తగినట్లుగా ఇది లావెండర్, ఇత్తడి, మ్యాట్ బ్లాక్, బ్రష్డ్ నికెల్ వంటి అద్భుతమైన రంగులలో లభిస్తుంది. కానోపీ సంస్థ కేవలం ఫిల్టర్లకే పరిమితం కాకుండా, షవర్ హెడ్లు హ్యూమిడిఫైయర్లను కూడా సరికొత్త రీతిలో డిజైన్ చేస్తోంది. గృహోపకరణాలను బ్యూటీ టూల్స్‌గా మార్చడం ద్వారా మన ఇంట్లోనే చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?) -
గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దాంతో రక్తంలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదకరమా? నేను ఇకపై డయాబెటిక్‌గా ఉండాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరు.గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో రక్తంలో షుగర్ స్థాయి పెరగవచ్చు. దీనిని ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. ఇది గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల ప్రభావం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం కారణంగా వస్తుంది. ఇది సాధారణంగా 24 నుంచి 28 వారాల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ప్రతి గర్భిణీకి ఓజీటీటీ అనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు. కొంతమంది మహిళల్లో ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గత గర్భధారణలో జెస్టేషనల్ డయాబెటిస్ ఉండటం, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉండటం, 35 ఏళ్లకు పైబడిన వయస్సు, అధిక బరువు వంటి కారణాలు ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నప్పుడు తల్లి, బిడ్డకు కొన్ని సమస్యలు రావచ్చు. బిడ్డ బరువు ఎక్కువగా పెరగడం, ఉమ్మనీరు ఎక్కువ కావడం, డెలివరీ సమయంలో ఇబ్బందులు, డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత బిడ్డకు శ్వాస సమస్యలు లేదా తక్కువ షుగర్ లెవల్స్ రావచ్చు, కానీ ఇవి సాధారణంగా చికిత్సతో నియంత్రించవచ్చు. ఇది నిర్ధారణ అయిన తర్వాత మీరు డైట్ పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో షుగర్ స్థాయిలను తరచూ చెక్ చేసుకోవాలి. డైట్‌తో నియంత్రణలో లేకపోతే సురక్షితమైన మందులు లేదా ఇన్సులిన్ ఇవ్వవచ్చు. ఇవి తల్లికి, బిడ్డకు సేఫ్‌గా ఉంటాయి. చాలా సందర్భాల్లో డెలివరీ అయిన తర్వాత ఈ జెస్టేషనల్ డయాబెటిస్ తగ్గిపోతుంది. అయితే భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. నేను ఇప్పుడు ఎనిమిది వారాల గర్భవతిని. గతంలో ఏడు వారాలలో మిస్క్యారేజ్ అయింది. ఈ గర్భధారణలో ఇప్పటివరకు నాకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. – రూప, కర్నూలు.గర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశ చాలా కీలకం, ఎందుకంటే ఈ సమయంలో శిశువు ముఖ్యమైన అవయవ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. అయితే ఇదే సమయంలో మిస్క్యారేజ్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ప్రతి గర్భిణీ గమనించాల్సిన రెండు ముఖ్యమైన లక్షణాలు బ్లీడింగ్, కడుపు నొప్పి. ఫస్ట్ ట్రైమెస్టర్‌లో బ్లీడింగ్‌కు అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో చాలా సందర్భాల్లో ఇది తల్లి లేదా శిశువుకు హానికరం కాకపోవచ్చు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, ఇన్ఫెక్షన్లు, సెక్స్ తర్వాత రక్తస్రావం, హార్మోన్ల మార్పులు వంటి కారణాలు ఉండవచ్చు. అయితే ముందుగా తప్పకుండా రూల్ అవుట్ చేయాల్సిన రెండు ముఖ్యమైన పరిస్థితులు మిస్క్యారేజ్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. మీరు డాక్టర్‌ను కలిసినప్పుడు పూర్తి వైద్య చరిత్ర తీసుకుంటారు, శరీర పరీక్ష చేస్తారు, అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా శిశువు పరిస్థితిని చెక్ చేస్తారు. ఈ పరీక్షలతో బ్లీడింగ్‌కు గల అసలు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్యం స్థిరంగా ఉండి, స్కాన్‌లో బిడ్డ బాగానే కనిపిస్తే, బ్లీడింగ్ పరిమాణం, కారణాన్ని బట్టి చికిత్స ఇస్తారు. ఇందులో ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, మనశ్శాంతిగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైతే ప్రొజెస్టెరాన్ మందులు కూడా ఇస్తారు, ఇవి గర్భధారణకు మద్దతు ఇస్తాయి. గతంలో మిస్క్యారేజ్ జరిగినందుకు ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భధారణ వేరు. చాలాసార్లు సరైన పర్యవేక్షణతో ఆరోగ్యంగా గర్భధారణ కొనసాగుతుంది. బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ఆసుపత్రిలో అబ్జర్వేషన్ కోసం ఉంచవచ్చు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం, డాక్టర్ సూచనలు పాటించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలా మంది మహిళలు ఆరోగ్యంగా బిడ్డలను ప్రసవిస్తున్నారు.డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: బీపీని నియంత్రణలో ఉంచే ‘3-3-3’ రూల్ అంటే..? వైద్యులు ఏమంటున్నారంటే..) -
నిర్దోషని కోర్టు చెప్పినా..14 ఏళ్లు నిర్బంధంలోనే..
హత్య కేసులో ఓ వ్యకి జైలు కెళ్లాడు. సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. ఆ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయినా ఆ వ్యక్తికి స్వేచ్ఛ లభించలేదు. జైలు గోడలు దాటి బయటకు రాలేదు. రోజులు నెలలయ్యాయి.. నెలలు సంవత్సరాలయ్యాయి.. అలా 14 సంవత్సరాలు గడిచాయి. విడుదల ఊసు లేదు. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. తనను విడుదల చేయాలని బాధితుడే చివరికి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. ఫైలు కదిలింది..ఆ వ్యక్తికి విడుదల లభించింది. తీర్పుకు ముందే ఇదంతా జరిగింది. అయితే అధికారుల తీరును, వ్యవస్థలోని లోపాలను కోర్టు తప్పుబట్టింది. ఓ వ్యక్తి జీవించే హక్కును కాలరాశారంటూ మండిపడింది. పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఒక చారిత్రక ముందడుగుకు ఈ కేసు మార్గం చూపింది.బిహార్‌కు చెందిన రుదుల్ సాహ్ ఓ హత్య కేసులో అరెస్టయి జైలు కెళ్లాడు. ముజఫర్‌పూర్ సెషన్స్ కోర్టు అతనిపై నమోదైన అభియోగాలను కొట్టేసింది. 1968లో నిర్దోషిగా ప్రకటించింది. అయినా అతడ్ని విడుదల చేయలేదు. దాంతో 1982 వరకు అంటే 14 సంవత్సరాల పాటు నిర్బంధంలోనే ఉన్నాడు. ‘సుప్రీం’లో పిటిషన్తన నిర్బంధం చట్టవిరుద్ధమని, నిర్దోషిగా ప్రకటించినా కారాగారంలోనే ఉంచారని, వెంటనే విడుదల చేయాలని రుదుల్ సాహ్ సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.. పునరావాసం, అక్రమ నిర్బంధానికి పరిహారం ఇవ్వాలని అభ్యర్థించాడు. అయితే బాధితుడు పిటిషన్ వేసిన తర్వాత అధికారులు అతడ్ని జైలు నుంచి విడుదల చేశారు. ఈ పిటిషన్ 1982 నవంబర్ 22న విచారణకు వచ్చింది. పిటిషనర్ ఇప్పటికే విడుదలైనందున ‘విడుదల’ అభ్యర్థన అర్థం లేనిదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నాడు. విడుదలే పరిష్కారం కాదుపిటిషనర్ విడుదలతో ఈ కేసు ముగిసినట్టు కాదని విచారణ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్‌ను 14 సంవత్సరాలు జైల్లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు జైలులో ఉంచాలని సెషన్స్ కోర్టు పేర్కొంది..అతని మానసిక స్థితి కూడా సరిగా లేకపోవడంతో విడుదలలో జాప్యం జరిగింది’ అని ముజఫర్‌పూర్ జైలు అధికారి అఫిడవిట్ సమర్పించాడు. సరైన ఆధారాలేవీ?అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ మానసిక స్థితి సరిగా లేదని నిరూపించే మెడికల్ సర్టిఫికెట్లు, చికిత్స వివరాలు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. 1977లో సాధారణ స్థితికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత అయినా ఎందుకు విడుదల చేయలేదని ధర్మాసనం నిలదీసింది. ఒకవేళ పిటిషనర్ మానసిక స్థితి సరిగా లేకపోతే చట్టం అతడికి కల్పించిన హక్కుల ప్రకారం విచారణ కూడా చేయకూడదు కదా? అని ప్రశ్నించింది.‘ పిచ్చి వాడనే’వాదన తర్వాత తయారు చేసినట్టుగా కనిపిస్తోందని ఆక్షేపించింది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లింపునకు ఆదేశంప్రాథమిక హక్కు ఉల్లంఘిస్తే, ఆ ఉల్లంఘనకు పరిహారం చెల్లించాలని ఆదేశించడం కూడా కోర్టు పరిధిలోకి వస్తుందని ‘సుప్రీం’ స్పష్టం చేసింది. అక్రమంగా 14 ఏళ్లపాటు జైలులో ఉన్నాడు. కాబట్టి కావున అతనికి పరిహారం ఇవ్వడం తప్పని సరి అని కోర్టు పేర్కొంది. తాత్కాలిక ఉపశమనంగా చెల్లించిన ఐదువేల రూపాయలకి అదనంగా మరో రూ. 30,000 చెల్లించాలని ఆదేశించింది. మరింత నష్టపరిహారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయించడానికి ఇది అడ్డంకి కాదని పేర్కొంది. వ్యక్తిగత హక్కుల రక్షణే ప్రజాస్వామ్యానికి మూలాధారం. ప్రభుత్వ అధికారులు చేసిన తప్పుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని, ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిందే అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసుకు ముందు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే కేవలం విడుదల ఆదేశాలకు మాత్రమే కోర్టు పరిమితమయ్యేది. కానీ, ఒక వ్యక్తి ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తే .. నేరుగా జోక్యం చేసుకుని పరిహారం ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వగలదని ఈ కేసులో స్పష్టం అయింది. కేసులో ప్రధానంగా ఆర్టికల్ 21, ఆర్టికల్ 32 గురించి ధర్మాసనం ప్రస్తావించింది..ఆర్టికల్ 21: చట్టబద్ధమైన కారణం లేకుండా ప్రభుత్వం ఎవరినీ నిర్బంధించకూడదు. ఏ వ్యక్తి జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదని ఈ ఆర్టికల్ చెబుతోంది. ఆర్టికల్ 32: రాజ్యాంగ పరిహారాల హక్కుకు హామీ ఇస్తుంది . ఇది ప్రాథమిక హక్కుల అమలు కోసం నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించే అధికారాన్ని పౌరులకు కల్పిస్తుంది. -
కోడిగుడ్డంత పుచ్చకాయలు
పుచ్చకాయలు భారీగా ఉంటాయి. రెండు చేతులు పట్టనంత పరిమాణంలో ఉంటాయి. ఒక్కో పుచ్చకాయ బరువు సగటున ఏడు నుంచి తొమ్మిది కిలోల వరకు ఉంటుంది. మామూలు పుచ్చకాయలకు భిన్నంగా అమెరికాలోని నార్త్ వర్జీనియాకు చెందిన ఔత్సాహిక ఉద్యానవేత్తలయిన తల్లీకూతుళ్లు కోడిగుడ్డంత పుచ్చకాయలను పండిస్తుండటం ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం రెండంగుళాల వ్యాసంలో ఉండే ఈ పుచ్చకాయలు ఒక్కొక్కటి ఎనభై నుంచి వంద గ్రాముల బరువు మాత్రమే ఉండటం విశేషం. పరిమాణం, బరువు తక్కువగానే ఉన్నా; రుచిలో మాత్రం ఇవి ఏమాత్రం తీసిపోవని వీటిని పండిస్తున్న డిలానీ రాప్టిస్, ఆమె తల్లి చెబుతున్నారు. చిన్నసైజు పుచ్చకాయలను పండించడానికి ఐదేళ్లుగా ప్రయత్నాలు సాగించి, విజయం సాధించామని వారు తెలిపారు. జన్యుమార్పిడి పద్ధతులేవీ లేకుండానే, సహజమైన పద్ధతుల్లోనే వీటిని పండిస్తుండటంపై అమెరికాకు చెందిన ‘హార్టి డైలీ మ్యాగజైన్’ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది.దుర్వాసన వెదజల్లే పుష్పం ఫ్రెండ్స్.. ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం ఏంటో తెలుసా? రఫ్లేషియా. ఇది సుమారు 3 అడుగుల వెడల్పు, 10 కిలోల బరువు ఉంటుంది. సాధారణంగా మనం చూసే మొక్కలన్నింటికీ ఆకులు, కొమ్మలు, వేర్లు ఉంటాయి. కానీ ఈ రఫ్లేషియా పుష్పానికి కాండం, ఆకులు, కనీసం వేర్లు కూడా ఉండవు. ఇది అడవిలో దొరికే వేరే మొక్కల తీగలపై ఆధారపడి, వాటి నుంచి ఆహారాన్ని తీసుకుంటూ జీవిస్తుంది. అందుకే దీన్ని పరాన్నజీవి అంటారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఈ పువ్వు నుంచి వచ్చే వాసనను మనం అస్సలు తట్టుకోలేము. ఇది కుళ్ళిపోయిన మాంసం వంటి ఘోరమైన దుర్వాసనను వెదజల్లుతుంది. అందుకే దీనిని శవ పుష్పం అని కూడా పిలుస్తారు. ఈ అరుదైన పుష్పాలు ఆగ్నేయాసియాలోని ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల దట్టమైన వర్షారణ్యాలలో మాత్రమే కనిపిస్తాయి. ఈ పువ్వు పూర్తిగా విచ్చుకోవడానికి దాదాపు 9 నెలల సమయం పడుతుంది.(చదవండి: అపురూపమైన అడవి మామిడి పండ్ల జాతులు) -
కృత్రిమ గర్భధారణకు కృత్రిమ మేధోసాయం!
కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఒకటైన ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియను మరింత సమర్థంగా జరిగేలా ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తోడ్పడుతోంది. మునుపు దాదాపు పరిశోధనల్లో లేదా మరికొన్ని అంశాల్లో సహాయకారిగా ఉండే ఏఐ ఇప్పుడు వైద్యరంగంలోని చాలా విషయాల్లో తన సహాయం అందించడం పరిపాటి అయ్యింది. ఐవీఎఫ్ ప్రక్రియకు మరింత చేయూత ఇచ్చేందుకు అవసరమైన పరిజ్ఞానం సమకూర్చుకుంటోంది. ఆ వివరాలేమిటో చూద్దాం...పిల్లలు లేనివారు ఓ బిడ్డకోసం తాపత్రయపడటం మన సమాజంలో ఉన్నదే. ఇందుకు సహాయపడే కృత్రిమ గర్భధారణ ప్రక్రియల్లో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ఒకటి.ఐవీఎఫ్ అంటే... ఐవీఎఫ్ ప్రక్రియలో మొదట మహిళ అండాశయాల నుంచి అండాలను సేకరించి వీర్యకణంతో కృత్రిమంగా ఫలదీకరణం జరిగేలా చూస్తారు. దంపతులు కలిసినప్పుడు ఏదైనా కారణాలతో మహిళలో నేచురల్‌గా ఫలదీకరణం జరగనప్పుడు డాక్టర్లు ఇలా బయటే ఫలదీకరణ జరిగేందుకు సహాయపడుతుండటంతో దీన్ని ‘అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ’ (ఏఆర్టీ) అంటారు. ఫలదీకరణ లోపలే జరగకపోవడానికి కారణాలంటే... మహిళల్లో ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకు΄ోవడం, ఎండోమెట్రియాసిస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) లేదా ఓవరీ తాలూకు సమస్యలుండటం, నిర్దిష్టంగా ఇదీ సమస్య అని తెలియని కారణాలు ఉండటం. అదే పురుషుల విషయంలో వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) తక్కువగా ఉండటం. ఈ సమస్యలున్నప్పుడు ఫలదీకరణ జరిగేందుకు బయటే ఐవీఎఫ్ జరిగేలా చూస్తారు.ఎలా చేస్తారంటే... సంక్లిష్టమైన ప్రక్రియ అయి ఐవీఎఫ్‌ను అనేక అంచెల్లో చేయాల్సి ఉంటుంది. మొదట హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మహిళలో అండాలు పెరిగేలా చూస్తారు. మామూలుగానైతే మహిళలో నెలకు ఒక అండమే పెరుగుతుంది. ఇలా అనేక అండాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వడాన్ని ‘కంటెయిల్డ్ ఒవేరియన్ స్టిమ్యులేషన్’ అంటారు. ఇలా అండాలు పెరిగాక ఒక సూదిలాంటి పరికరంతో ‘ఫాలికిల్’ నుంచి వాటిని బయటకు తెస్తారు. అటు తర్వాత ఆ అండాలను ఓ ఇంక్యుబేటర్లోకి ప్రవేశపెడతారు. ఆపైన ఆ అండాల్లోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేయడాన్ని ‘ఇంట్రా సైటో΄్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్’ (ఐసీఎస్ఐ) అంటారు. ఫలదీకరణం అయిన అండం ఇక ‘పిండం’ (ఎంబ్రియో)గా మారుతుంది. బయట కృత్రిమంగా ఫెర్టిలైజ్ చేశాక... ఇక ఆ పిండాన్ని (ఎంబ్రియోను) గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) ద్వారా గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను ‘ఎంబ్రియో ట్రాన్స్ఫర్’ అంటారు. తాజా పిండాన్ని మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెట్టడాన్ని ‘ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంబ్రియో’ అంటారు. కొన్ని సందర్భాల్లో నిల్వ చేసిన ఎంబ్రియోలను మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెడితే దాన్ని ‘ఫ్రోజెన్ ట్రాన్స్ఫర్’ అని అంటారు. ఇలా మహిళలోకి ప్రవేశపెట్టిన పిండాన్ని గర్భసంచి ఆమోదించి, తనలో నేచురల్‌గా పెరిగేందుకు అనుమతిస్తే ఇక ఆ ప్రెగ్నెన్సీ మామూలు గర్భవతిలోలాగే పెరుగుతుంది. ఐవీఎఫ్‌లో జరిగేది ఇదే.ఏఐ సహాయం ఎక్కడెక్కడ...ఇప్పుడు ఐవీఎఫ్లోని అనేక దశల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) సహాయం చేస్తోంది. అదెలాగంటే... ∙హార్మోన్ ఇంజెక్షన్స్ ఏవేవి ఎంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించడం కృత్రిమంగా పెరిగిన అనేక అండాలలో నాణ్యమైన వాటి ఎంపిక పార్టనర్ వీర్యకణాల్లోనూ నాణ్యమైన వాటి ఎంపిక టైమ్–లాప్స్ ఎంబ్రియో ఇమేజింగ్ సిస్టమ్స్... అంటే ఇందులో పిండం (ఎంబ్రియో) డిస్టర్బ్ కాకుండా ఉండేలా చూస్తూ... కొన్ని అడ్వాన్స్డ్ కెమెరాల సహాయంతో... ఆ ప్రక్రియ ఎలాంటి అంతరాయాలూ లేకుండా జరుగుతోందా లేదా అనే అంశాన్ని పరిశీలించడం. ఈ డేటా సహాయంతో నాణ్యమైన ఎంబ్రియోను సూచించడం.భవిష్యత్తులో మరింత పురోగతి... ఏఐ పరిజ్ఞానాన్ని మరిన్ని అంశాల్లో మరింత లోతుగా ఉపయోగించుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యనిపుణులు భావిస్తున్నారు. వాటిలో కొన్ని... ∙గర్భధారణ ఏ మేరకు విజయవంతం కాగలదనే అంశాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ∙ల్యాబ్‌లలో జరిగే ప్రక్రియలు మరింత తేలిగ్గా / సులువుగా జరిగేందుకు తగిన సాంకేతికతను అభివృధ్ధి చేసుకోవడం (ఎంబ్రియాలజీ ల్యాబ్ ఆటోమేషన్) మహిళ దేహంలో జరుగుతున్న హార్మోనల్ మార్పులను పరిశీలించడం (డిజిటల్ పేషెంట్ మానిటరింగ్) ∙రోబోటిక్స్ సహాయంతో ప్రక్రియలు మరింత సునిశితంగా / ఖచ్చితత్వంతో జరిగేలా చూడటం ∙తనకు డాక్టర్ ఇచ్చిన సూచనలను మహిళ ఖచ్చితంగా పాటిస్తోందా లేదా అన్నది పరిశీలించడం (రియల్ టైమ్ అప్డేట్) ∙అండాలు/పిండాల నిల్వలో (క్రయోప్రిజర్వేషన్)లో గణనీయమైన మెరుగుదల.ఏఐ సహాయంతో ఇవీ ప్రయోజనాలు...మెరుగైన గర్భధారణ ఫలితాలు: నాణ్యమైన ఎంబ్రియో ఎంపికతో గర్భధారణకు మెరుగైన అవకాశాలు ప్రమాదాలు / ముప్పులు తగ్గడం : దేహానికి కోత / గాటు పెద్దగా లేకపోవడంతో (అతి తక్కువ ఇన్వేసివ్ పద్ధతుల వల్ల) తక్కువ నొప్పి, తక్కువ ముప్పు (రిస్క్) సునిశితత్వం / ఖచ్చితత్వం: ల్యాబ్ ప్రక్రియలన్నీ సమర్థంగా జరిగేలా చూడటం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించడం. చివరగా... ఐవీఎఫ్ అన్నది ఇప్పటికీ కొంత ఖరీదైన ప్రక్రియే. ఈ ప్రక్రియలో వేగాన్నీ, సునిశితత్వాన్ని, ఖచ్చితత్త్వాన్ని పెంచడం ద్వారా ఫలదీకరణ అవకాశాలు మరింత మెరుగుపరచడం, తద్వారా ఖర్చులు తగ్గించడం సాధ్యమవుతుంది. ఇలా ఏఐ సహాయంతో భవిష్యత్తులో ఐవీఎఫ్ మరింత ఫలవంతంగా రూపొందే అవకాశముంది.నిర్వహణ : యాసీన్ (చదవండి: ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?) -
మీ ఉప్పులో అయోడిన్ ఉందా?
పాత కాలంలో గాయం అయితే దానికి అయోడిన్ పూసి కట్టు కట్టే వారు. అంతకుమించి అయోడిన్ గురించి ఎక్కువగా తెలియదు. అయోడిన్ అన్నది ఒక ఖనిజం. అది మన ఆహారంలో తప్పకుండా ఉండి తీరాలి. శరీరంలో మామూలుగా జరిగే జీవ చర్యలను, పెరుగుదలను, జీర్ణ క్రియను, గుండె కొట్టుకునే వేగాన్ని, శరీరపు ఉష్ణోగ్రతను నియంత్రించే హార్మోన్ల తయారీలో అయోడిన్‌కు ప్రధాన పాత్ర ఉంటుంది. అంటే మనకు అనునిత్యం ఆహారంలో అయోడిన్ తప్పకుండా ఉండి తీరాలని అర్థం.గర్భవతులకు ప్రధానంగా అయోడిన్ అవసరం ఎక్కువ. థైరాయిడ్‌కు సంబంధించిన హార్మోన్లు గర్భంలో పెరిగే శిశువు పెరుగుదలను, ముఖ్యంగా శిశువు మెదడు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. అటువంటి స్థితిలో అయోడిన్ ఉండవలసిన స్థాయికన్నా ఏ కొంచెం తగ్గినా శిశువు తెలివితేటలు 0.3 నుంచి 13 ఐక్యూ పాయింట్ల దాకా తగ్గుతుంది. ఇక శిశువు పుట్టిన తర్వాత కూడా మెదడు పెరుగుదల థైరాయిడ్ పనితీరు విషయంగా అయోడిన్ ఎంతో అవసరం. పిల్లలలోగానీ, పెద్దలలోగానీ అయోడిన్ లోపం బలంగా ఉంటే ‘గాయిటర్’ అనే లక్షణం కనబడుతుంది. దీన్ని తెలుగులో ‘కంఠమాల’ అంటారు. గొంతు బాగా వాచి పెద్దదిగా కనిపించే ఈ సమస్యకు కారణం అయోడిన్ లోపమే. ఫలితంగా థైరాయిడ్ గ్రంథి పెద్దది అవుతుంది. ఎక్కువ అయోడిన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.20వ శతాబ్దంలో ప్రపంచమంతటా తెలివితేటలు పెరగడానికి కారణం అయోడిన్ కలిపిన ఉప్పు తినడమే అన్నసంగతి పరిశోధకులు గమనించారు. సముద్రంలో పెరిగే మొక్కలు, మిగతా సముద్రం నుంచి వచ్చే తిండి పదార్థాలలో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. ఆవు పాలలో కూడా అయోడిన్ ఉంటుంది. మనదేశంలో కాకపోవచ్చు కానీ చాలా చోట్ల ఆవులకు పెట్టే తిండిలో అయోడిన్ కలుపుతారు. పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో కొంతవరకు అయోడిన్ ఉండే వీలుంది. అవి నేల నుండి ఈ ఖనిజాన్ని గ్రహిస్తాయి. అయితే అన్నిచోట్లా ఈ పదార్థం అన్ని రకాల పంటలలో ఒకే రకంగా ఉండదు. ఒకప్పుడు స్విట్జర్లాండ్‌లోనూ, యూఎస్‌లోని మిషిగన్ ప్రాంతంలోనూ కంఠమాల వ్యాధి ఎక్కువగా కనిపించేది. భారతదేశంలో కూడా ఈ సమస్య గమనించవలసిన స్థాయిలో కనిపించేది.ఆ జాగ్రత్త ఉందా?1922 సంవత్సరంలో స్విట్జర్లాండ్ దేశంలో ఉప్పుతోబాటు అయోడిన్ కలిపి తినాలని నిర్ణయించారు. దాని తర్వాత కొంత కాలంలోనే ఆ దేశంలో గాయిటర్ వ్యాధి బాగా తగ్గినట్టు తెలిసింది. పిల్లల ఎత్తు బాగా పెరిగింది. ‘డిమిట్రా పొలిటి’ అనే ఆర్థికవేత్త తెలివి విషయంగా ఆ ప్రాంతాలలో జరిగిన మార్పు గురించి ఎంతో కృషిచేసి పత్రాలు సమర్పించారు. 1924లో మిషిగన్‌లో కూడా అయోడైజ్డ్ ఉప్పు వాడకం మొదలయింది. ఆ తర్వాత మరెన్నో దేశాలు అదే దారిలో నడిచాయి. మన దేశంలో మాత్రం ఆ జాగ్రత్త కనిపించలేదు. తర్వాత కాలంలో మాత్రమే అయోడైజ్డ్ ఉప్పు గురించి ప్రచారం మొదలైంది. మొత్తం మీద ప్రపంచమంతటా 20వ శతాబ్దంలో అయోడిన్ వాడకం కారణంగా ఐక్యూ స్థాయిలో పెరుగుదల కనిపించింది.అయోడిన్ ప్రకృతి సిద్ధమయిన ఖనిజ పదార్థం. కానీ అదేదో అనవసరమైనది అన్న భావం చాలామందికి ఉండటం ఆశ్చర్యకరం. యూఎస్‌లో జరిగిన ఇటీవల పరిశోధనల్లో సుమారు సగం మంది గర్భవతులకు తగినంత అయోడిన్ అందడం లేదని తేలింది. మనదేశంలో ఇటువంటి పరిశోధనలు జరుగుతున్న పరిస్థితి కనిపించడం లేదు. అందరూ మరొక సారి, అయోడిన్ కలిపిన ఉప్పు గురించి ఆలోచించాలి. దాని వాడకం ద్వారా పెద్దలకు, ముఖ్యంగా గర్భవతులు, శిశువులకు మెదడు పెరుగుదల గురించి కలిగే ప్రయోజనాలను అందరికీ అందజేయాలి అంటున్నారు పరిశోధకులు.-కే.బి, గోపాలం.. వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత -
పేరెంట్ మార్క్ స్కాలర్షిప్స్
సంస్థలు ఇచ్చేది మార్కులకు స్కాలర్షిప్. కాని తల్లిదండ్రులు ఇవ్వాల్సింది బతుకుకు స్కాలర్షిప్. ఈ సెలవుల్లో పిల్లలకు నేర్పాల్సిన ఆరు లక్షణాలు: 1. కుతూహలం 2. ఓర్పు 3. సహానుభూతి 4. శ్రమ 5. ఓటమి ఒప్పుకోలు 6. కృతజ్ఞత... రోజుకో గంట. సెలవులు మరో 30 రోజులు. ఎలా నేర్పాలో చదవండి. చివరి రోజు ‘స్కాలర్షిప్ సర్టిఫికెట్’ ఇచ్చి వాళ్లు కోరిన సబబైన కానుక ఇవ్వండి. అదే అసలైన వేసవి ఫలితం. వేసవి సెలవులు ఇంకో 30 రోజులున్నాయి. ఆటలూ పాటలూ సరే. వాటితోపాటు కొన్ని వ్యకిత్వ గుణాల్లో కూడా తర్ఫీదు ఇవ్వాలి. మార్కుల కోసం హితవు చెప్పినట్టే ఈ లక్షణాల పెంపు కోసం కూడా హితవు చెప్పాలి. అందుకు స్కాలర్షిప్లు ప్రకటించండి. పిల్లల్లో ఆరు ఉత్తమ లక్షణాలను నాటి, పెంచి, సెలవులు అయిపోయే రోజు ‘స్కాలర్షిప్’ పేరుతో వాళ్లు అడిగిన సబబైన కానుక ఇవ్వండి. ఆ కానుక అందుకునే సమయానికి పిల్లలు ‘మనిషి’గా తయారై ఉంటారు. అదీ సంతోషం. ఇంతకీ ఆ ఆరు లక్షణాలు ఏంటి? 1. కుతూహలం: ప్రశ్నించే గుణం లేకపోతే నేర్చుకునేది ఏదీ ఉండదు. ‘ఎందుకు? ఏమిటి? ఎలా? అని అడిగే ధైర్యం నీలో ఉండాలి’ అని చెప్పాలి. ఇలా నేర్పాలి: రోజూ ‘ఈ రోజు నువ్వు అడిగే మూడు ప్రశ్నలు’ అని ఒక పేపర్ ఇవ్వండి. అందులో ప్రశ్నలు మీరే రాయండి. సూర్యుడు ఎందుకు ఎర్రగా ఉంటాడు? ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఇలా. జవాబు తెలుసుకోమనండి. ‘జవాబు నాక్కూడా తెలీదు, కలిసి వెతుకుదాం పద’ అనండి. నెట్లో కాదు. లైబ్రరీకి తీసుకెళ్లండి. ప్రశ్న లేకపోతే జీవితమే ప్రశ్నార్థకవుతుందని తెలియచేయండి.2. ఓర్పు: రీల్స్, షార్ట్స్ యుగంలో పిల్లలకు పది సెకన్ల కన్నా ఎక్కువ వేచి చూసే ఓపిక ఉండటం లేదు. ఓర్పు లేని వాడు చదువులో, ఉద్యోగంలో, జీవితంలో సమస్యలు ఎదుర్కొంటాడు. అన్నీ క్షణాల్లో జరిగిపోవాలి అనే భావన సరికాదని తెలియచేయండి.ఇలా నేర్పాలి: ఒక మొక్క నాటించండి. రోజూ నీళ్లు పోయమనండి. ‘రేపటికి రేపు పండ్లు రావు. దానికి కొంత సమయం పడుతుంది’ అని చెప్పండి. ఓపిగ్గా చేయాల్సిన పజిల్స్, చెస్‌లో ఉంచండి. వంట చేయడం నేర్పండి. ‘సేమ్యా పాయసం ఉడకడానికి 20 నిమిషాలు ఆగాలి’ అని రుచి చూపించండి. ఈలోపు అతడు ఏడ్చినా, గొడవ చేసినా వెంటనే ఫోన్ ఇవ్వకండి. ‘ఐదు నిమిషాలు ఆగితే ఇస్తా’ అనండి. ఓర్పుకు రివార్డ్ ఇవ్వండి. 3. సహానుభూతి: ‘సాటివాడికి నొప్పి అయితే నాకూ నొప్పే’ అనే భావన కలిగించాలి. క్లాస్‌లో 95 శాతం మార్కులు తెచ్చుకుని అన్ని మార్కులు రాని వారితో కలవకపోతే, వారిని సహానుభూతితో చూడకపోతే ఒంటరిగా మిగలక తప్పదని చెప్పండి. రేపు ఉద్యోగమైనా అంతే అని చెప్పండి. ప్రపంచాన్ని నడిపేది ఐక్యూ కాదని; ఈ.క్యూ (ఎమోషనల్ కోషియెంట్) అని చెప్పండి.ఇలా నేర్పాలి: పనిమనిషి, పాలవాడు, చెత్త ఎత్తే అన్నతో మాట్లాడించండి. ‘వాళ్ల పిల్లలు ఏం చదువుతున్నారు?’ అని అడగమనండి. వీధికుక్కకు, పక్షులకు నీళ్లు పెట్టమనండి. ‘దానికి దాహం అవుతుంది’ అని చెప్పండి. టీవీలో యుద్ధం వార్త వస్తే ‘అక్కడ పిల్లలు స్కూల్‌కి వెళ్లలేరు కదా’ అని చర్చ పెట్టండి.4. శ్రమ: ‘నా పని నేను చేసుకుంటా’ అనే దర్జా కలిగి ఉండటమే జీవితం అని నేర్పండి. ఫోన్లో మీటలు నొక్కుతూ ఏ.సి. రూమ్‌లో కూర్చుని ఆర్డర్ వేస్తే అన్నీ ముంగిటకొస్తాయనుకునే తరం తయారవుతోంది. ఇలాంటి వారు డేటా అయిపోయినా, కరెంట్ లేకపోయినా, స్విగ్గీబాయ్ రాకపోయినా మిడిగుడ్లేస్తారు. ఇలా నేర్పాలి: వాళ్ల పక్క వాళ్లతోనే సర్దించండి. ప్లేట్ కడిగించండి. వారానికి ఒకరోజు ‘నో స్విగ్గీ డే’. కలిసి అన్నం వండండి, చపాతీలు చేయించండి. తల్లి, తండ్రి ఎంత శ్రమ చేస్తారో ఆఫీస్, షాప్, పొలం చూపించండి. ‘ఇంట్లో ఫ్యాన్ తిరగడానికి బయట నాన్న ఎంత చెమటోడుస్తున్నాడో’ చూపించండి.5. ఒప్పుకునే గుణం ‘ఓడిపోయా. తప్పు నాదే. నెక్ట్స్ ట్రై చేస్తా’ అనిపించే తత్త్వం పిల్లల్లో ముఖ్యం. 99 మార్కులు వచ్చి ఒక మార్కుతో ఫస్ట్ ర్యాంక్ పోతే కుంగిపోయే పిల్లలున్నారు. ఆటల్లో ఓడిపోతే బ్యాట్ విరగ్గొడుతున్నారు. జీవితం ర్యాంకుల గేమ్ కాదు పడి లేచే గేమ్ అని వారికి తర్ఫీదు ఇవ్వండి.ఇలా నేర్పాలి: వాళ్లతో కలిసి క్యారమ్స్, చెస్ ఆడండి. కావాలని ఓడించండి. ‘ఓటమి కొత్త గేమ్‌కి టికెట్’ అని చెప్పండి. మీరు కూడా చేసిన తప్పులు, పొరపాట్ల వల్ల ఓడిపోయిన ఉదంతాలు చెప్పండి. ‘నాన్న కూడా ఒకసారి ఫెయిల్ అయ్యాడు’ అనండి. ‘ట్రై’ అనే మాటకు చాలా బలం ఉందని చెప్పండి. ఓడినా గెలిచినవారి కథలు వినిపించండి.6. కృతజ్ఞత: ‘ఇది నాకు ఊరికే రాలేదు’ అని గుర్తించే పిల్లలూ, గుర్తుంచుకునే పిల్లలే ముందుకు వెళతారు. అన్నీ ఉన్నా ‘ఇంకా ఏం లేదు’ అని ఏడ్చే పిల్లలు ఉంటున్నారు. ఉన్నదానితో సంతృప్తి పడటం లేదు. కృతజ్ఞత లేని వాడు ఎప్పటికీ సంతోషంగా ఉండడని చెప్పాలి.ఇలా నేర్పాలి: రాత్రి పడుకునే ముందు ‘ఈ రోజు నీకు నచ్చిన మూడు మంచి విషయాలు’ చెప్పమనండి. అన్నం తిన్నాను, సినిమాకు వెళ్లాను, ఫ్రెండ్ బ్యాట్‌తో ఆడుకున్నాను – ఇలా ఏదైనా. అన్నం వండిన అమ్మకు, సినిమా కు డబ్బు ఇచ్చిన నాన్నకు, బ్యాట్ ఇచ్చిన ఫ్రెండ్‌కు మనసులో థ్యాంక్స్ చెప్పుకోమనండి. ‘థ్యాంక్యూ కార్డ్’ చేయించండి. ‘గ్లాస్ నీళ్లు ఇచ్చినందుకు థ్యాంక్స్‌రా’ అనండి. పిల్లలూ నేర్చుకుంటారు. ముగింపు – స్కాలర్షిప్ డేసెలవులు అయిపోయే రోజు ఇంట్లో చిన్న ఫంక్షన్. ‘నెల రోజుల స్కాలర్షిప్ ప్రోగ్రాం కంప్లీటెడ్’ అని సర్టిఫికెట్ మీ చేత్తో రాసి ఇవ్వండి. ‘నువ్వు స్కాలర్షిప్ గెలిచావ్. నీకు ఈ టెలిస్కోప్’ అని ఇవ్వండి. ఆ కానుక విలువ 500 కావచ్చు, 5000 కావచ్చు. ఎన్ని లక్షణాల్లో బాగా తర్ఫీదు అయ్యారో ఆ ప్రతి లక్షణానికి ఒక సర్టిఫికెట్, బహుమతి ఇవ్వండి. ఇవి జీవితాంతం గుర్తుంటాయి. ఆ లక్షణాలను కాపాడుకునేలా చేసి జీవితాంతం నడిపిస్తాయి. -
ప్రపంచం మెచ్చిన బ్రేక్‌ఫాస్ట్!
చిన్నారులూ! ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినే కార్న్‌ఫ్లేక్స్ అంటే మీకు ఎంతో ఇష్టం కదూ.. రుచిగా, కరకరలాడుతూ ఉండే వీటి తయారీ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది తెలుసా.. ఇది చదివేయండి. మీకే తెలుస్తుంది. ఆ కథేంటో...చాలా కాలం క్రితం అంటే సుమారు 130 సంవత్సరాల క్రితం, అమెరికాలో జాన్ కెల్లాగ్, విల్ కెల్లాగ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిద్దరూ ఒక హాస్పిటల్లో పనిచేస్తూ, అక్కడి రోగుల కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుండేవారు. అలా ఒకరోజు వారు రోగుల కోసం గోధుమలతో ఒక వంటకం చేయాలనుకున్నారు. అందుకోసం గోధుమలను ఉడకబెట్టారు. కానీ, వేరే ఏదో పనిలో పడి ఆ ఉడకబెట్టిన గోధుమలను అలాగే వదిలేసి మర్చిపోయారు. మరుసటి రోజు వచ్చి చూసేసరికి, ఆ గోధుమలు కాస్తా ఎండిపోయి, గట్టిగా మారిపోయాయి. అలా ఎండిపోయిన వాటిని వృథా చేయడం ఇష్టం లేక.. రోలర్ మిషన్ల ద్వారా నొక్కిచూశారు. అప్పుడు అవి ఫ్లేక్స్లా విడిపోయాయి. వాటిని కాస్త వేడి చేయగా, అవి చాలా క్రిస్పీగా మారాయి. అలా తయారైన వాటిని హాస్పిటల్‌లోని రోగులకు ఇస్తే, వారు చాలా ఇష్టంగా తిన్నారు. ఆ తర్వాత, తమ్ముడు విల్ కెల్లాగ్కు గోధుమలకు బదులుగా అదేవిధంగా మొక్కజొన్నలతో తయారు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. అలా చేసినప్పుడు అవి మరింత రుచిగా, కరకరలాడుతూ వచ్చాయి. అలా తయారైనవే ఈరోజు మనం ఎంతో ఇష్టంగా తినే కార్న్ ఫ్లేక్స్. -
నీటి విలువ నేర్పుదాం!
సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. ప్రస్తుతం ‘ఇండ్ఫేమ్’ పేరుతో పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..→ ‘‘పిల్లలకు థియరీగా చెప్పడం కంటే వారి నుంచి క్రియేటివిటీని రాబట్టడం ద్వారా మనో వికాసాన్ని కలిగించడం సులువు. కాకపోతే వారు చేస్తున్న పనుల్లో మనమూ ఇన్వాల్వ్ అవ్వాలి. → పిల్లలకు ఊహ తెలుస్తున్న దగ్గరనుంచే వారిచేత వివిధ రకాల యాక్టివీటీస్ చేయించవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా మన జీవనానికి ఆధారమైన ‘నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం’ ఇలా పంచభూతాల గురించి ఈ వేసవిలో పరిచయం చేద్దాం.→ పంచ భూతాలలో నీరు ప్రాణాధారమైనదనే విషయం పెద్దలుగా మనకు తెలుసు. ఈ విషయాన్ని పిల్లలకు ఎలా చెప్పాలి..?! తల్లిదండ్రులు లేదా టీచర్లు పిల్లల వయసును బట్టి 5 విభాగాలుగా తీసుకోవాలి.→ నర్సరీ, ప్రీ ప్రైమరీ నుంచి 2 వ తరగతి వరకు, 3–5 తరగతులు, 6–7 తరగతుల వారీగా తీసుకొని, విజువల్ ఆర్ట్ ద్వారా చూపించమనాలి. ఇలా చెప్పి చూడండి... నీటిచుక్క పరిమాణం, నీళ్లు వివిధ పాత్రలలో పోస్తే వచ్చే మార్పు.. ను డ్రాయింగ్ ద్వారా చూపమనవచ్చు.నీటి మాట→ నీటి ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తుంది. పంటలు పండుతాయి. ఇలాగే ఇంకేం లభిస్తాయి? పిల్లలనే అడగండి. → నీటి వనరులు లేని చోట వాతావరణం ఉండే విధానం, పరిష్కారం కూడా సూచించమనాలి.→ నీటి శుభ్రత గురించి ఏమేం చేయవచ్చో వారినే ఆలోచించి, ప్రెజెంట్ చేయమనాలి.→ వాటర్ వర్డ్స్ .. నీటికి సంబంధించిన పదాలతో క్రాస్ పజిల్స్, డూడుల్స్, సాంగ్స్... కళాత్మకమైన సందేశాన్ని ఇవ్వమని చెప్పవచ్చు. → రోజువారీ జీవన విధానంలో నీటి ప్రాముఖ్యత గురించి పిల్లలను చెప్పమని ప్రోత్సహిస్తూ, వారిచేత వివిధ రకాల యాక్టివిటీస్‌ను చేయించవచ్చు. ఆరోగ్యకరమైన పోటీని కూడా పిల్లల మధ్య పెట్టవచ్చు. పిల్లలు నీటి గురించి చేసే ఎన్నో విన్యాసాలకు వాళ్లే కాదు, పెద్దలూ నవ్వుతారు. తమ గురించి స్వచ్ఛమైన మనసులు పడే తపనను చూసి నీటి చుక్కలు కూడా అందంగా నవ్వుతాయి.ఇలా చెబుదాం...→ దాహం వేసినప్పుడు ఏం తాగుతాం. → నీళ్లను ట్రేలో పోసి, ఫ్రిజ్‌లో పెడితే ఐస్‌క్యూబ్స్‌గా ఎలా అవుతాయి. బయటకు తీస్తే ఐస్ క్యూబ్ కరిగిపోయి తిరిగి నీళ్లుగా ఎలా మారుతాయి. → హిమాలయాలు ఎందుకు అంతగా చల్లగా ఉంటాయి, అవి కరగడం వల్లనే నీళ్లు మన దాకా వస్తున్నాయా?→ కూరగాయలు, పండ్లు ఎలా వస్తాయి? → నీళ్లతో స్నానం చేస్తే మైండ్, బాడీ కూల్ అండ్ ఫ్రెష్ ఎందుకు అవుతుంది.→ వేసవిలో చెరువు నీళ్లలోకి దిగి ఈత కొట్టాలనిపిస్తుంది కదా, అలా దిగినప్పుడు ఆ నీళ్లు చల్లగా ఎందుకు ఉంటాయి. → చెరువులు, కుంటలు, నదులు, బ్యాక్ వాటర్, సముద్రం... భూమి మీద నీరు ఎక్కడెక్కడ ఉంటుంది, భూమిలోపలకు నీళ్లు ఎలా చేరుతాయి, మనం ఎన్ని విధాలుగా నీళ్లను వాడుకుంటున్నాం. చెట్లు నీళ్లు ఎలా తాగుతాయి.. ఇవన్నీ పిల్లలనే అడగాలి. ఇలా నీటికి సంబంధించిన ప్రతీ ఉపయోగం.. కథ, నాటకం, డ్రాయింగ్, ప్రయోగ రూపం... ఏదైనా పిల్లల నుంచే వచ్చినదై ఉండాలి.పొదుపు ఇలా...తాగు నీళ్ల కోసం కుళాయిల వద్ద, వేసవిలో ట్యాంకర్ల వద్ద జరిగే నీటి యుద్ధాల గురించి మనకు పరిచయమే. ఈ విషయాన్ని పిల్లలకు చెప్పలేం. భవిష్యత్తులో నీటియుద్ధాలు రాకుండా ఉండాలంటే నీటి పొదుపు గురించి వారి ఆలోచనల ద్వారానే చెప్పించవచ్చు.→ షవర్‌తో కాకుండా బకెట్ నీళ్లతో స్నానం చేయమనాలి. పూర్తి బకెట్ నీళ్లు కాకుండా అందులో నుంచి మరికొన్ని తగ్గించి వాడమనాలి ∙బట్టలు ఉతికిన నీళ్లను తిరిగి ఏ విధంగా ఉపయోగించవచ్చో చెప్పమనాలి.→ నీళ్లు తిరిగి భూమిలోకి ఎలా ఇంకుతాయో చూపమనాలి. ఈ విధానం వల్ల నీటి పిల్లల్లో నీటి వృధాను తగ్గించవచ్చు అనే ఆలోచన వస్తుంది.నిర్వహణ: నిర్మలారెడ్డి -
నిద్ర నా ప్రాణం
చూడగానే, ‘వావ్’ అనిపించే అందం, మాట్లాడగానే, ‘హా.. హా..’ అని నవ్వించే అల్లరి నటి కయాదు లోహార్ సొంతం. ఇలా ఒక్కో క్యారెక్టర్, ఒక్కో స్టయిల్‌తో ఎప్పుడూ ఫుల్ ఎనర్జీ అండ్ ఫుల్ ఫన్ ప్యాకేజీలా మెరిసే కయాదు అల్లరి కోణాన్ని, ఫన్నీ జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే విందాం..నా పేరు కష్టాలునా పేరు ’కయాదు’ అని పిలవడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. షూటింగ్ సెట్లో కొందరైతే నన్ను ‘కాయ్–దూ’, ‘క్యా–దూ’ అని పిలిచేవారు. ఒకసారి ఒకరైతే పొరపాటున ‘కావాలా?’ అని పిలిచారు! నేను వెంటనే ‘ఏం కావాలి?’ అని అడిగాను. ఇప్పుడు అందరికీ నా పేరు నోరు తిరుగుతోంది, అందుకు సంతోషం!గొడవ పడకుండా ఉండలేనునేను పుణెలోని ఒక మధ్యతరగతి వ్యాపార కుటుంబం నుంచి వచ్చాను. నాన్న బిజినెస్ చేస్తారు, అమ్మ గృహిణి. నాకు సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, ‘నీకు నచ్చిన రంగంలో నిరూపించుకో’ అని నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. ఇక మా తమ్ముడు నా అతిపెద్ద విమర్శకుడు, వాడితో గొడవ పడకుండా నాకు రోజే గడవదు.తెలుగు డైలాగ్స్.. ఒక పెద్ద సాహసం!కన్నడ సినిమా ‘ముగిల్ పేటె’తో మొదలై, తెలుగులో ‘అల్లూరి’ సినిమాతో మీ ముందుకు వచ్చాను. మొదట్లో తెలుగు నేర్చుకోవడం కష్టంగా ఉండేది. ఒకసారి సీరియస్ సీన్ లో కన్ఫ్యూజ్ అయి ‘దోశ కావాలా?’ అన్నట్టు ఏదో అనేశాను. సెట్లో అందరూ పడి పడి నవ్వారు. అప్పటి నుండి నేను డైలాగ్ పేపర్ కనిపిస్తే చాలు. ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్‌లా భయపడిపోతుంటాను!నా నిద్ర.. నా సామ్రాజ్యం!నాకు నిద్ర అంటే ప్రాణం. ఎవరైనా నన్ను నిద్రలో ఉన్నప్పుడు లేపితే, నాకు విపరీతమైన కోపం వస్తుంది. అందుకే సెట్లో అందరూ నన్ను నిద్రలేపేటప్పుడు చాలా జాగ్రత్తగా, భయం భయంగా ఉంటారు.డైట్ అంతా భోజనం ముందు వరకే!నేను డైట్ చేస్తాను.. కానీ అది కేవలం భోజనం వడ్డించే వరకే! ముఖ్యంగా పప్పు నెయ్యి కాంబినేషన్ చూస్తే ఆగలేను. ఒక్కోసారి నా ఫిట్నెస్ ట్రైనర్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూసి ‘కయాదు.. రేపు జిమ్‌లో నీకు చుక్కలే’ అని మెసేజ్ పెడుతుంటారు!పుష్ప స్టెప్పులకి పడిపోయానుఅల్లు అర్జున్ గారి డ్యాన్స్ చూస్తుంటే నా కాళ్లు కూడా తెలియకుండానే స్టెప్పులు వేస్తుంటాయి. కానీ ఆయన పక్కన డ్యాన్స్ చేయాల్సి వస్తే.. నేను బహుశా టెన్షన్ తో స్టేజ్ మీద పడిపోతానేమో! నిజం చెప్పాలంటే, ‘పుష్ప’ స్టెప్పులు ట్రై చేస్తూ ఇంట్లో రెండు మూడుసార్లు కింద పడ్డాను కూడా! -
హనీ!బీ అలెర్ట్
ప్రకృతిలో ఎన్నో కీటకాలు ఉన్నా, వాటిలో తేనెటీగల పాత్ర అత్యంత కీలకం. ప్రకృతిలోని జీవవైవిధ్యం కాపాడటానికి తేనెటీగలు అహరహం శ్రమిస్తుంటాయి. మొక్కల్లోని పరాగసంపర్కం తొంభైశాతం తేనెటీగల ద్వారానే జరుగుతుంది. తేనెటీగలే లేకుంటే, చాలారకాల వృక్షజాతుల మనుగడకు ముప్పు కలుగుతుంది. ఒకవేళ తేనెటీగలే అంతరించిపోతే, భూమ్మీద మానవాళి అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికి తేనెటీగలు అంతరించిపోయే పరిస్థితి లేదు గాని, వాటి మనుగడ మాత్రం కష్టాల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, తేనెటీగల మరణాలు ఆందోళనకరమైన స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్కోచోట తేనెటీగల మరణాలు దాదాపు నలభై శాతం వరకు ఉంటున్నాయి. మరోవైపు తేనెటీగల సహజ ఆవాసాలు కనుమరుగైపోతున్నాయి. ప్రకృతిలో తేనెటీగల పాత్ర, వాటి ప్రస్తుత స్థితిగతుల గురించి మే 20న ‘ప్రపంచ తేనెటీగల దినోత్సవం’ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం...తేనెటీగలు ప్రకృతిలోని అత్యంత కీలకమైన కీటకాలు. తేనెటీగల ద్వారానే దాదాపు డెబ్బయి శాతం పంటలు పండుతున్నాయి. తేనెటీగలు పూల నుంచి మకరందాన్ని సేకరిస్తాయి. ఈ క్రమంలో పూల పుప్పొడిని ఒకదాని నుంచి మరొకదానికి చేరవేయడం ద్వారా పరాగ సంపర్కానికి దోహదపడతాయి. తేనెటీగల వల్ల జరిగే పరాగ సంపర్కం కారణంగానే దాదాపు డెబ్బయి శాతం ఆహార ధాన్యాలు, పండ్లు పండుతున్నాయి. తేనెటీగలు మైనంలాంటి కొవ్వు పదార్థంతో షడ్భుజాకారంలో అద్భుతమైన గూళ్లు నిర్మించుకుంటాయి. ఇలాంటి గూళ్ల వరుసతో తేనెపట్టులు ఏర్పాటు చేసుకుంటాయి. రకరకాల పూల నుంచి సేకరించిన మకరందాన్ని వీటిలో భద్రపరచుకుంటాయి. తేనెటీగల సంఖ్య తగ్గిపోతే, ఆహార చక్రం అస్తవ్యస్తం అవుతుంది. పంటల దిగుబడి తగ్గిపోయి, ఆహార కొరత ఏర్పడుతుంది. తేనెటీగలు అంతరించిపోతే, మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండటంతో తేనెటీగలను కృత్రిమంగా పెంచే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినా కూడా పలుచోట్ల తేనెటీగల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది.తేనెటీగలకు ముప్పు వీటి వల్లనే...⇒ తేనెటీగల మనుగడకు ముప్పు కలిగిస్తున్న వాటిలో ప్రధానమైనవి రసాయనిక పురుగు మందులు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో రసాయనిక పురుగు మందుల వాడకం పెరిగింది. పురుగు మందుల్లోని ‘నియోనికోటినాయిడ్స్’ వంటివి పెద్దసంఖ్యలో తేనెటీగల ఉసురు తీస్తున్నాయి.⇒ అడవుల నరికివేత వల్ల చెట్లు తగ్గిపోతున్నాయి. తేనెటీగలు గూళ్లు కట్టుకోవడానికి అనువైన చెట్లు తగ్గిపోతుండటంతో అవి తమ సహజమైన ఆవాసాలను కోల్పోతున్నాయి. చెట్లు తగ్గడం వల్ల పూలు కూడా తగ్గిపోయి, తేనెటీగలు తమ ఆహారాన్ని కూడా కోల్పోతున్నాయి. ఆహారం, ఆవాసం కరవైన పరిస్థితుల్లో తేనెటీగలు నశించిపోతున్నాయి.⇒ వాయు కాలుష్యం తేనెటీగల మీద కూడా దుష్ప్రభావాన్ని చూపుతోంది. వాయుకాలుష్యం వల్ల తేనెటీగలు పూల సువాసనను గుర్తించలేక, తమ సహజమైన ఆహారాన్ని సేకరించుకోలేక నశిస్తున్నాయి.⇒ రకరకాల పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్ల వల్ల కూడా తేనెటీగలకు ముప్పు కలుగుతోంది. వ్యా«ధికారకమైన పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్లు సోకినప్పుడు తేనెటీగలు పెద్దసంఖ్యలో నశించిపోతుంటాయి.⇒ కొన్ని ప్రాంతాల్లో ఏకపంట సాగు కొనసాగిస్తుండటం కూడా తేనెటీగల మనుగడకు చేటు తెస్తోంది. ఏకపంట సాగు వల్ల తేనెటీగలు ఆహార వైవిధ్యాన్ని కోల్పోయి, క్రమంగా క్షీణిస్తున్నాయి.⇒ తేనె సేకరించడంలో మనుషులు అనుసరించే అనియంత్రిత విధానాల వల్ల కూడా తేనెటీగలు పెద్దసంఖ్యలో నశిస్తున్నాయి. తేనె సేకరణ కోసం తేనెపట్టులకు పొగబెట్టి, తేనెపట్టులను చెట్ల నుంచి తొలగించడం వంటి పనుల వల్ల తేనెటీగల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.ప్రపంచవ్యాప్త సమస్యతేనెటీగలు తగ్గిపోతుండటం ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదు, ఇది ప్రపంచవ్యాప్త సమస్య. ఒక్కో దేశంలో ఈ పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంటోంది. అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం..తేనెటీగలు తగ్గితే...⇒ పంటల దిగుబడి తగ్గి, ఆహార కొరత ఏర్పడుతుంది⇒ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది.⇒ పర్యావరణం సమతుల్యత కోల్పోతుంది.⇒ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.⇒ చివరికి మానవజాతి మనుగడకు ముప్పు ఏర్పడుతుంది.తేనెటీగలకు ప్లాస్టిక్ బెడదతేనెటీగలకు నానా రకాల కాలుష్యాలతో పాటు ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ బెడద కూడా పెరుగుతోంది. తేనెటీగలు సహజంగా రకరకాల చెట్ల నుంచి వెలువడే జిగురుతో గూళ్లు నిర్మించుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్ల జిగురు తగినంత దొరకక తేనెటీగలు తమ గూళ్ల నిర్మాణానికి చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలను కూడా ఉపయోగించుకుంటున్నాయి. తేనెటీగలు తమ గూళ్ల నిర్మాణానికి ప్లాస్టిక్ వినియోగించుకుంటున్న విషయం తొలిసారిగా 2013లో కెనడాలో వెలుగులోకి వచ్చింది. టొరంటోలోని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేనెగూళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు బయటపడ్డాయి.తర్వాత ఇదే పరిస్థితిని బ్రిటన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ తదితర దేశాల్లోనూ గుర్తించారు. నగర ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లోని తేనెగూళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు ఎక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదిలా ఉంటే, కొన్నిచోట్ల పారిశ్రామికంగా తేనెటీగల పెంపకం సాగిస్తున్నవారు తేనెగూళ్ల కోసం చెక్క ఫ్రేముల బదులుగా ప్లాస్టిక్ ఫ్రేములు వాడుతున్నారు. వీటి వల్ల కూడా తేనెటీగలకు మైక్రోప్లాస్టిక్స్ బెడద తప్పడం లేదు. తేనెగూళ్లలో ప్లాస్టిక్ కారణంగా రకరకాల దుష్పరిణామాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం తేనెగూళ్లలోకి ప్లాస్టిక్ చేరడం వల్ల తలెత్తే అనర్థాలు ఇవీ:తేనెపట్టులకు మహమ్మారిఅడవుల నరికివేత, రసాయనిక పురుగు మందులు, చిన్నా చితకా పరాన్నజీవులు, బ్యాక్టీరియా, వైరస్లు వంటివి తేనెటీగల మనుగడకు ముప్పు కలిగిస్తున్న సంగతి తెలిసిందే! వీటికి మించిన పెనుముప్పు ‘కాలనీ కొల్లాప్స్ డిజార్డర్’ (సీసీడీ) రూపంలో తేనెపట్టులను నామరూపాలు లేకుండా నాశనం చేస్తోంది. సీసీడీని పర్యావరణవేత్తలు ‘మహమ్మారి’గా అభివర్ణిస్తున్నారు. తేనెపట్టులను అకస్మాత్తుగా నాశనం చేసే ఈ పరిణామాన్ని తొలిసారిగా ఇరవై ఏళ్ల కిందట గుర్తించారు. అమెరికాలో 2006–07లో సీసీడీ కారణంగా కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 60% తేనెపట్టులు తుడిచిపెట్టుకుపోయాయి. తేనెపట్టుల్లో సీసీడీ పరిస్థితి ఏర్పడినప్పుడు తేనెను సేకరించే కార్మిక తేనెటీగలు అకస్మాత్తుగా కనిపించకుండాపోతాయి.తేనెపట్టులో రాణి ఈగ, ఇంకా రెక్కలురాని పిల్లలు మాత్రమే మిగిలి ఉంటాయి. చనిపోయిన తేనెటీగలు గూటి దగ్గర ఎక్కువగా కనిపించవు. కొద్దికాలంలోనే తేనపెట్టులోని తేనెటీగలేవీ మిగలవు. బ్రిటన్‌లోను, ఇతర యూరోప్ దేశాల్లోనూ సీసీడీ కారణంగా దాదాపు 30% వరకు తేనెపట్టులు నాశనమయ్యాయి. భారత్‌లో సీసీడీ ప్రభావం కొంత తక్కువగా ఉంది. భారత్‌లో సీసీడీ వల్ల 10%–20% మేరకు నష్టం వాటిల్లింది.సీసీడీ కేవలం ఒక కారణం వల్ల కాకుండా, అనేక కారణాల సమ్మేళనం వల్ల ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, పూల వైవిధ్యం తగ్గడం, మితిమీరిన రసాయనాలు, కాలుష్యం, అడవుల నరికివేత, పరాన్నజీవులు, సూక్ష్మజీవుల తాకిడి– ఇవన్నీ ఒకేసారి మితిమీరినప్పుడు సీసీడీ పరిస్థితి ఏర్పడుతుందని వివరిస్తున్నారు. సీసీడీ కేవలం తేనెటీగల సమస్య మాత్రమే కాదు, ఇది మానవుల ఆహారచక్రం సమస్య కూడా! ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగితే, వాటిల్లబోయే నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమే!తేనె చరిత్రతేనె వినియోగం పదివేల ఏళ్ల కిందటే మొదలైంది. తేనె కోసం కృత్రిమ పద్ధతుల్లో మట్టితో తేనెగూళ్లను నిర్మించే తొలి పద్ధతులు క్రీస్తూపూర్వం 3000 నాటికే వాడుకలో ఉండేవని పలు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రాచీన ఈజిప్టులో మానవులు తొలినాళ్లలో కృత్రిమంగా మట్టితో ఏర్పాటు చేసిన తేనెగూళ్ల అవశేషాలు బయటపడ్డాయి. స్పెయిన్‌లో బయటపడ్డ గుహాచిత్రాల ఆధారంగా మనుషులకు క్రీస్తుపూర్వం 8000 నాటికే తేనె వినియోగం తెలుసునని చరిత్రకారులు చెబుతున్నారు. పురాతన వైద్య పద్ధతుల్లో తేనెను ప్రధానంగా ఉపయోగించేవారు.వివిధ ఔషధాలను తేనెతో కలిపి సేవించడం ఇప్పటికీ మన ఆయుర్వేదం సహా అనేక సంప్రదాయ వైద్యపద్ధతుల్లో ఆచరణలో ఉంది. తేనె పోషకాల గని. ఎన్నాళు గడిచినా తేనెకు కాలం చెల్లదు. స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ చెడిపోదు. అందుకే పదార్థాలను దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి తేనెను ఉపయోగిస్తారు. తేనెను తక్షణ శక్తినిచ్చే పదార్థంగా, ఔషధంగా, సౌందర్య సాధనంగా, సంప్రదాయ క్రతువుల్లో పవిత్ర పదార్థంగా ఉపయోగిస్తారు. తేనెను వంటకాల్లో చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తారు.తేనె గురించి కొన్ని వాస్తవాలు⇒ ఒక టీ స్పూన్ తేనెను మనం అవలీలగా చప్పరించేస్తాం. నిజానికి టీ స్పూన్ పరిమాణంలోని తేనె దాదాపు డజను తేనెటీగల జీవితకాల శ్రమ.⇒ ప్రాంతాన్ని బట్టి, అక్కడ పూచే పూలను బట్టి తేనె రంగు, రుచి మారుతూ ఉంటుంది. తేనె సహజంగా పారదర్శకమైన లేత పసుపు నుంచి ముదురు గోధుమ రంగు వరకు రకరకాల రంగుల్లో ఉంటుంది. లేత రంగు తేనె కంటే ముదురు రంగు తేనె ఎక్కువ రుచిగా ఉంటుంది.⇒ తేనెలో నీటిశాతం తక్కువగా ఉండటం, ఆమ్లత్వం ఎక్కువగా ఉండటం వల్ల తేనెలో బ్యాక్టీరియా పెరగడం దాదాపు అసాధ్యం. తేనెను సరైన పద్ధతిలో నిల్వచేస్తే వేల ఏళ్లు గడిచినా చెడిపోదు. ఈజిప్టు సమాధుల్లో దొరికిన వేల ఏళ్ల నాటి తేనె ఈనాటికీ ఉపయోగించడానికి అనువుగా ఉంది.⇒ గాలిలోని తేమ సోకితే ఆహార పానీయాలు ఏవైనా త్వరగా చెడిపోతాయి. తేనె మాత్రం వాటికి పూర్తిగా భిన్నం. గాలిలోని తేమ సోకినా తేనె చెడిపోదు.⇒ తేనెను వేడిచేస్తే నాణ్యత కోల్పోతుంది. వేడి చేయడం వల్ల తేనెలోని కీలకమైన ఎంజైమ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి.తేనెటీగల పెంపకంఆధునిక యుగంలో పంతొమ్మిదో శతాబ్దం నుంచి కృత్రిమంగా తేనెటీగల పెంపకం మొదలైంది. అమెరికన్ శాస్త్రవేత్త లోరెండో లాంగ్స్ట్రోత్ 1851లో ఎక్కడికైనా సులువుగా తీసుకుపోయేందుకు అనువైన తేనెగూడును కృత్రిమంగా నిర్మించాడు. అప్పటి నుంచి తేనెటీగల పెంపకం (ఎపికల్చర్) వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా ఎదగడం మొదలైంది. ఇప్పుడు చాలా చోట్ల తేనె కోసమే కాకుండా, పంటల పరాగసంపర్కం కోసం కూడా తేనెటీగల పెంపకం సాగిస్తున్నారు.చైనా, టర్కీ, భారత్, అర్జెంటీనా వంటి దేశాల్లో కృత్రిమంగా తేనెటీగల పెంపకం పెద్దస్థాయిలోనే జరుగుతోంది. గడచిన దశాబ్ద కాలంలో చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా తేనె ఉత్పాదనలో నెమ్మదిగా పెరుగుదల నమోదవుతోంది. చైనా, భారత్, టర్కీ, అర్జెంటీనా వంటి దేశాల్లో పెరుగుదల బాగానే ఉన్నా, అమెరికా, యూరోపియన్ దేశాలలో తగ్గుదల నమోదవుతోంది. కేంద్ర ప్రభుత్వం 2017లో ‘మిషన్ హనీ’ కార్యక్రమం ప్రారంభించాక భారత్‌లో తేనె ఉత్పాదన క్రమంగా పుంజుకుంటోంది. ఒకవైపు ఉత్పాదన పెరిగినా, ప్లాస్టిక్ బెడద వల్ల తేనె నాణ్యత తగ్గుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.తేనె నాణ్యతకు విఘాతంప్రపంచవ్యాప్తంగా ఒకవైపు తేనె ఉత్పాదన నిలకడగా పెరుగుతూనే ఉన్నా, మరోవైపు తేనె నాణ్యత తగ్గుతోంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల నుంచి సేకరించిన తేనె నమూనాల్లో రకరకాల ప్రమాదకర పదార్థాలు ఉంటున్నట్లు పరీక్షల్లో బయటపడుతున్నాయి. నగరాలకు, పారిశ్రామిక ప్రాంతాలకు చేరువలో ఉన్న తేనెగూళ్ల నుంచి సేకరించే తేనెలో మైక్రోప్లాస్టిక్స్, పురుగుమందులు, యాంటీబయోటిక్స్, భారలోహాల అవశేషాలు చేరి ఉంటున్నట్లు పలు పరీక్షల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. తేనె నాణ్యతపై పలు దేశాలు కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి.నిబంధనల అమలులో లోపాలు ఉన్న దేశాల్లో దొరికే తేనెలో ప్రమాదకర పదార్థాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. తేనెగూళ్లు ఉండే తావుల్లో రసాయనిక కాలుష్యాలను అరికట్టడం, సేకరించిన తేనెను మార్కెట్లోకి పంపేముందు కట్టుదిట్టమైన నాణ్యత పరీక్షలు జరపడం వంటి చర్యలు చేపట్టకుంటే, ఆరోగ్యం కోసం తేనె తీసుకునేవారికి చేదు ఫలితాలే మిగులుతాయి. -
దీర్ఘాయుర్దాయ దేశాలు
ఆధునిక జీవితంలో ఆరోగ్యమే ఐశ్వర్యం. ఆరోగ్యం బాగుంటేనే దీర్ఘాయుర్దాయం ఉంటుంది. వార్ధక్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవే అయినా, కొన్ని దేశాల్లో మాత్రం ఏడుపదుల వయసు దాటే వరకు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. ఆ వయసు తర్వాత చిన్నా చితకా సమస్యలు ఉన్నా, దీర్ఘాయుష్కులుగా మనుగడ సాగించగలుగుతున్నారు.ఆరోగ్యకరమైన జీవనశైలి, తగిన వ్యాయామం, మెరుగైన వైద్య సౌకర్యాల కారణంగా ఆయుర్దాయంలోను, ఆరోగ్యకరమైన జీవన ప్రమాణంలోను (హెల్తీ లైఫ్ ఎక్స్‌పెక్టన్సీ) ముందంజలో ఉంటున్న దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం.⇒ భారతదేశంలో ఆరోగ్యకరమైన జీవనప్రమాణం సగటున 61 ఏళ్ల వరకు ఉంటోంది. సగటు ఆయుర్దాయం 70 ఏళ్ల వరకు ఉంటోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే, ఇది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. మన దేశంలో నగరాలలో ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు ఇప్పటికీ లేవు. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి కారణాలు ఆయుర్దాయాన్ని హరించేస్తున్నాయి.⇒ కరవు కాటకాలు, ఆధునిక వైద్య సౌకర్యాల లోటు, తరచు ఘర్షణలు వంటి కారణాల వల్ల ఆఫ్రికన్ దేశాలలో ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు, సగటు ఆయుర్దాయం ఇప్పటికీ తక్కువగానే ఉంటున్నాయి.⇒ వైద్య ఆరోగ్య రంగాల్లో ప్రపంచం ముందంజ వేస్తున్నా, ఇప్పటికీ కొన్ని దేశాలు ఆరోగ్యకరమైన జీవన ప్రమాణంలోను, ఆయుర్దాయంలోను ఇంకా వెనుకబడి ఉన్నాయి. అత్యల్పాయుర్దాయ దేశాలన్నీ ఆఫ్రికా ఖండంలోనే ఉండటం గమనార్హం. వీటి వివరాలు కూడా గణాంకాల్లో తెలుసుకుందాం... -
వేడుకగా విక్టోరియా డే!
చరిత్రతో ముడిపడిన సందర్భమే అయినా, కెనడియన్లు ఈ సమయాన్ని పూర్తిగా ఒక సమ్మర్ కిక్–ఆఫ్ ఈవెంట్‌గా భావిస్తారు. నెలల తరబడి మంచుతో, చలితో ఇబ్బంది పడే కెనడియన్లకు, చెట్లు పచ్చబడటం, వెచ్చని గాలులు వీచడం ఒక సంతోషకరమైన సమయం. అందుకే ఈ రోజున క్రీడా పోటీలు నిర్వహిస్తారు. రుచికరమైన వంటకాలతో విందులు చేసుకుంటారు. పలుచోట్ల కెనడా జాతీయ జెండాతో పాటుగా, యూనియన్ జాక్ జెండాను ఎగురవేస్తారు. రాజధాని నగరాల్లో తుపాకులతో ఘనంగా వందన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో కెనడా అంతటా ఒక నూతనోత్సాహం ఉట్టిపడుతుంది.కెనడాలో దేశవ్యాప్తంగా విక్టోరియా డే వేడుకలు మే 18 నుంచి మొదలవుతున్నాయి. మంచుతెరలు వీడి, ప్రకృతి పచ్చదనాన్ని పులుముకుంటున్న వేళ దేశమంతా సంబరాల్లో మునిగి తేలుతోంది. ఈ వేడుకలను విక్టోరియా రాణి పుట్టినరోజు సందర్భంగానే కాకుండా, సుదీర్ఘ శీతకాలం తర్వాత వచ్చే వెచ్చని వేసవికి స్వాగతం పలకడానికి జరుపుకొంటారు. బాణసంచా కాల్పులతో, విందు వినోదాలతో సరదాగా గడుపుతారు.విక్టోరియా మహారాణి పుట్టినరోజును అంటే మే 24న వేడుకగా జరుపుకోవడం 1845 నుంచి ఆచారంగా వస్తోంది. అప్పటి కెనడా ప్రావిన్స్ లెజిస్లేచర్ ఈ రోజును అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. 1901లో రాణి విక్టోరియా మరణానంతరం, ఈ పండుగ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆమె జ్ఞాపకార్థం కెనడా పార్లమెంట్ 1952లో ప్రతి సంవత్సరం మే 25కు ముందు వచ్చే సోమవారం రోజున ‘విక్టోరియా డే’ వేడుకలు నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించింది. దాని ప్రకారం ఈ ఏడాది మే 18న నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేసింది.కెనడియన్ల దృష్టిలో క్వీన్ విక్టోరియా అత్యంత గౌరవనీయురాలు. ఆమె హయాంలోనే కెనడాకు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్ర ప్రతిపత్తి లభించింది. అంతేకాకుండా, ప్రస్తుత రాజధాని ఒటావాను దేశ రాజధానిగా ఎంపిక చేసింది కూడా ఆమెనే! 1956 వరకు, తదుపరి రాజుల పుట్టినరోజులను కూడా క్వీన్ విక్టోరియా పుట్టినరోజు అయిన మే 24నే నిర్వహించేవారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, క్వీన్ ఎలిజబెత్ బాధ్యతలు చేపట్టినపుడు, ఆమె అసలు పుట్టినరోజు ఏప్రిల్ 21 అయినప్పటికీ, ఆమె అధికారిక జన్మదిన వేడుకలను విక్టోరియా డే రోజున నిర్వహిస్తుండటం విశేషం. ∙ రమా జంబుల -
చాప కింద నీరులా... కరుగుతున్న అంటార్కిటికా!
ఎండ తగిలితేనే కదా ఐస్ ముక్క కరుగుతుంది! కానీ అంటార్కిటికా ఖండంలోని మంచు పలకలు వాటి అడుగు భాగం నుంచి కూడా కరుగుతున్నాయట! అదీ త్వరత్వరగా!! అలా కరిగిన నీరు సముద్ర మట్టాలను పెంచితే, వాతావరణ సమస్థితి దెబ్బతిని, భూప్రపంచం అల్లకల్లోలం కావచ్చునని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఫ్రాన్సులోని యూనివర్సిటీ ఆఫ్ బోర్డియక్స్ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. సముద్ర ప్రవాహాలలో తీవ్రమైన మార్పులు రావటమే ఈ ‘అసాధారణ’ స్థితికి కారణం.పైన భూతాపం... కింద ఉష్ణ ప్రతాపం‘అంటార్కిటికా’ అనేది భూమికి చిట్టచివరన, దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న ఒక భారీ మంచు ఖండం. అక్కడ దాదాపు 98 శాతం మంచు ఉంటుంది. మిగతా 2 శాతంలో పర్వత శిఖరాలు, పొడి లోయలు, తీర ప్రాంతాలు, ద్వీపాలు, ఆ ద్వీపాల్లో పెంగ్విన్లు ఉంటాయి. శాస్త్రవేత్తలు తప్ప సాధారణ మనుషులు ఉండరు. ఇక ఆ 98 శాతం మంచుపొర సగటున 1.9 కిలోమీటర్ల మందంలో ఉంటుంది! భూతాపం వల్ల కొన్నేళ్లుగా ఈ మంచు కరుగుతూ వస్తోందనీ, ఒకవేళ అంటార్కిటికాలోని మంచు మొత్తం కరిగిపోతే, సప్త సముద్రాల నీటి మట్టాలు దాదాపు 200 అడుగుల వరకు పెరిగి తీర ప్రాంత నగరాలన్నీ మునిగిపోతాయనీ మనం ఎప్పటి నుండో వింటున్న సంగతే. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టింది ఏమిటంటే, పైనుంచి భూతాపం వల్లనే కాదు, అడుగు నుంచి వేడెక్కుతున్న నీటి ప్రవాహాల వల్ల కూడా అంటార్కిటికా కరుగుతోందని! అంటే, భూమికి మరింత త్వరగా ప్రమాదం ముంచుకు రాబోతోందని!అడుగున ఎలా వేడెక్కుతున్నాయి?!అంటార్కిటికా మంచు పలకల అడుగున సర్కమ్‌పోలార్ డీప్ వాటర్ (సి.డి.డబ్లు్య.) అని పిలిచే వేడి నీటి ప్రవాహాలను శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా గమనిస్తున్నారు. ఈ వేడి నీరు సముద్ర ఉపరితలం నుండి సుమారు 500 మీటర్ల (1,600 అడుగులు) దిగువకు, మంచు పలకలకు దూరంగా ఉంటుంది. అయితే మారుతున్న గాలి దిశలు, అంటార్కిటికాను చుట్టి ఉన్న ‘దక్షిణ మహాసముద్రం’లో వీస్తున్న బలమైన గాలుల వల్ల, ఈ లోతైన వేడి నీరు నెమ్మదిగా సముద్ర ఉపరితలం పైకి, మంచు పలకల వైపు కదులుతూ వస్తోంది. ఈ వేడి నీటి ఉష్ణోగ్రత కేవలం 2 సెల్సియస్ డిగ్రీలు (35.6 ఫారెన్‌హీట్ డిగ్రీలు) మాత్రమే అయినప్పటికీ, అతి శీతలంగా ఉండే అంటార్కిటికా మంచును బలహీనపరచడానికి అది చాలు! ‘‘గతంలో ఈ మంచు పలకల చుట్టూ చల్లటి నీరు ఉండేది, అది వాటిని కరగకుండా కాపాడేది. కానీ ఇప్పుడు సముద్ర ప్రవాహాల్లో మార్పు రావడం వల్ల, ఎవరో వేడి నీటి ట్యాప్ తిప్పినట్లుగా అక్కడి నీరు వేడెక్కుతోంది’’ అని ప్రొఫెసర్ సారా పుర్కీ అంటున్నారు. చల్లటి ఉప్పు నీరు – వేడి తీపి నీరు!ధ్రువ ప్రాంతాల దగ్గర మంచు గడ్డకట్టినప్పుడు, మిగిలిన నీరు అత్యంత చల్లగా, ఉప్పగా, సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నీరు బరువుగా ఉండి సముద్రం అడుగు భాగంలోకి చేరుతుంది. ఇలా నీరు కిందకు వెళ్లేటప్పుడు, తనతో పాటు ఉష్ణాన్ని, కార్బన్‌ను, పోషకాలను లోపలికి తీసుకెళ్తుంది. అలా వెళ్లటం అనేది ప్రపంచవ్యాప్తంగా సముద్రపు నీటిని ఒక క్రమ పద్ధతిలో, ఒక బెల్ట్ లాగా కదిలిస్తుంది. దానినే ‘ఓషన్ కన్వేయర్ బెల్ట్’ అంటారు. అయితే ఇప్పుడు అడుగు నుంచీ కరుగుతూ ఉన్న మంచు పలకలు తీపి వేడి నీరుగా (ఉప్పు లేని నీరుగా) సముద్రంలో కలిసినప్పుడు ఆ నీరు అంత త్వరగా కిందకు మునగదు. దీనివల్ల సముద్ర ప్రవాహాల వేగం మందగించి, సముద్రాల్లోని జీవజాలానికి అందే పోషకాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రవాహాలకు అడ్డుగా ‘తీపి’ నీరుకొత్త డేటా ప్రకారం, అంటార్కిటికా దిగువకు వెళ్లే (మునిగిపోయే) చల్లటి, ఉప్పటి నీటి శాతం తగ్గుతోంది. దానిని భర్తీ చెయ్యటానికి బయట నుండి మరింత వేడి నీరు (ఉప్పు లేని నీరు) మంచు పలకల వైపుకు వస్తోంది. ఆ క్రమంలో మంచును ఇంకా వేగంగా కరిగిస్తోంది. ఇందువల్ల సముద్రాల నీటి మట్టం పెరగడమే కాకుండా మరికొన్ని సమస్యలు కూడా వస్తాయి. సాధారణంగా సముద్రాలు వాతావరణంలోని అధిక వేడిని, కార్బన్‌ను సంగ్రహిస్తాయి. ప్రవాహాలు ఆగిపోతే, సముద్రం ఈ పనిని సరిగ్గా చేయలేదు. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ మరింత వేగంగా పెరుగుతుంది. తాజా అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ జోషువా లాన్హామ్ చెప్పినట్లుగా, ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే కాదు, ఇప్పుడు మన కళ్లముందు నిజంగా జరుగుతున్న మార్పులు!అడుగు నుంచైనా, పై నుంచైనా..... అంటార్కిటికా కరగడం అనేది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు, ఇది భూతాప భీకర రూపానికి ఒక సంకేతం. సముద్ర ప్రవాహాల వ్యవస్థ బలహీనపడితే, అది వాతావరణాన్ని అతలాకుతలం చేసి, రాబోయే తరాలకు మంచు యుగం వంటి కఠిన పరిస్థితులను కల్పించవచ్చు. ప్రకృతి మనకు ఇస్తున్న ఈ సంకేతాలను గమనించి, పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవడం అవసరం. బరువు తగ్గుతున్న మంచు పలకలుభూమి పై నుండి సముద్రం వైపు విస్తరించి, నీటిపై తేలుతూ ఉండే మంచు నదులనే మంచు పలకలు (గ్లేషియర్లు) అంటారు. అవి అంటార్కిటికా తీర ప్రాంతంలో దాదాపు 75 శాతం మేర విస్తరించి ఉన్నాయి. వీటి మందం 50 నుండి 600 మీటర్ల వరకు ఉంటుంది. వెనుక ఉన్న గ్లేసియర్ల నుండి మంచు ముందుకు నెట్టుకుని రావటం వల్ల, పైన కురిసే మంచు గట్టిపడటం వల్ల ఈ పలకలు పెరిగి, అంటార్కిటికాకు ఒక అడ్డుగోడలా లేదా ‘బ్రేక్’ లా పనిచేస్తాయి. దీనినే ‘బట్రెసింగ్’ అంటారు. భూమి మీద ఉన్న భారీ గ్లేషియర్లు వేగంగా సముద్రంలోకి జారిపోకుండా ఈ మంచు పలకలు అడ్డుకుంటాయి. ఒకవేళ ఈ పలకలు విచ్ఛిన్నమైతే, వెనుక ఉన్న గ్లేషియర్లు వేగంగా సముద్రంలోకి పడిపోతాయి, దీనివల్ల సముద్ర మట్టాలు ఒక్కసారిగా పెరుగుతాయి. గత 25 ఏళ్లలో 48 మంచు పలకలు వాటి బరువులో 30 శాతాన్ని కోల్పోయాయి. అంటే, అంటార్కిటికాను కాపాడుతున్న ‘అడ్డుగోడలు’ బలహీనపడుతున్నాయని అర్థం. ఇది ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత నగరాలకు పెద్ద హెచ్చరిక.ఐరోపాకు అట్లాంటిక్ ‘బెల్టు’ దెబ్బఈ శతాబ్దం పూర్తయ్యేసరికి ఎ.ఎం.ఓ.సి. (అట్లాంటిక్ మెరీడియనల్ ఓవర్‌టర్నింగ్ సర్క్యులేషన్) ప్రవాహం 50 శాతం వరకు దెబ్బతినే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ బోర్డియక్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత అంచనాల్లో ఇది కేవలం 32 శాతంగా మాత్రమే ఉండేది. ఎ.ఎం.ఓ.సి. అంటే అట్లాంటిక్ మహా సముద్రంలో నిరంతరం ప్రవహించే ఒక భారీ నీటి కన్వేయర్ బెల్ట్ వంటిది. అంటార్కిటికా ఖండానికి సరిహద్దుగా ఉన్న మూడు ప్రధాన సముద్రాలలో అట్లాంటిక్ మహా సముద్రం ఒకటి.మిగతా రెండూ.. పసిఫిక్ మహా సముద్రం, హిందూ మహా సముద్రం. ఈ మూడు భారీ జల రాశులు దక్షిణ దిశగా ప్రవహించి, దక్షిణ మహా సముద్రంలో విలీనం అవుతాయి. ఒకవేళ ఎ.ఎం.ఓ.సి. పూర్తిగా ఆగిపోతే, అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రవహించే ‘గల్ఫ్ స్ట్రీమ్’ ప్రయాణించే దిశ పూర్తిగా మారిపోతుంది. దాని వల్ల ఉత్తర ఐరోపా, బ్రిటన్ తీవ్రమైన చలి కాలంలోకి వెళ్లిపోతాయి. ఇది ఒక రకంగా కొత్త ‘మంచు యుగం’లా ఉంటుంది. అంటే ఐరోపాకు ప్రాణాంతకమైన మంచు యుగం వచ్చేస్తుంది.మంద గమనం పెరిగింది!1950 నుండి గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల అట్లాంటిక్ మెరిడియనల్ ఓవర్‌టర్నింగ్ సర్క్యులేషన్ (ఎ.ఎం.ఓ.సి.) వ్యవస్థ కదలిక మునుపటి కంటే చాలా వేగంగా బలహీనపడుతోందని పరిశోధకులు గుర్తించారు. గ్రౌండింగ్ లైన్: ఒక గ్లేషియర్ (మంచు పలక) సముద్ర అడుగుభాగంలోని రాతిని తాకే ప్రదేశాన్ని ‘గ్రౌండింగ్ లైన్’ అంటారు. వేడి నీరు ఈ పాయింట్‌ను వెనక్కి నెట్టివేస్తుంది. గ్రౌండింగ్ లైన్ వెనక్కి వెళ్లే కొద్దీ, అంతవరకు రక్షణగా ఉన్న మంచు అడుగు భాగం కూడా వేడినీటిలో మునిగిపోయి కరగడం మొదలవుతుంది. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ లూప్: ఇది ఒక విషవలయం లాంటిది. మంచు కరిగే కొద్దీ, ఆ మేర మరింత వేడి నీరు లోపలికి చేరుతుంది, ఆ వేడి నీరు మంచును ఇంకా వేగంగా కరిగిస్తుంది. ఇలా ఒకదాని వల్ల మరొకటి ప్రభావితమై మంచు కరగడం అనేది ఊహించనంత వేగంగా మారుతుంది. దీనినే ‘పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ లూప్’ అంటారు.నీటి వేడిని ఎలా కనిపెడతారు?అంటార్కిటికా ఖండం అడుగున నీటి ప్రవాహాల ఉష్ణోగ్రతల్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ‘ఆర్గో ఫ్లోట్స్’ అనే పరికరాలను ప్రయోగిస్తారు. ఇవి సముద్రంలో తేలుతూ, నిరంతరం నీటి ఉష్ణోగ్రత, ఇతర వివరాలను సేకరిస్తుంటాయి. తాజాగా శాస్త్రవేత్తలు ఓడల ద్వారా సేకరించిన పాత డేటాను, ఈ కొత్త ఆర్గో ఫ్లోట్స్ డేటాతో కలిపి గత 40 ఏళ్ల రికార్డును విశ్లేషించారు. దాంతో లోతులో ఉన్న నీటి వేడికి అంటార్కిటికా పైకి చొచ్చుకు వస్తోందని మొదటిసారి నిరూపణ అయింది. -
పిల్లల కథ: ఓర్పుకు ఫలితం
అనగనగా ఒక ఊరిలో రాము అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడికి ఎప్పుడూ తొందర. ఏ పని చేసినా అరకొరగానే చేసేవాడు. ఒకసారి వాడి తాతయ్య వాళ్ల ఇంటి పెరట్లో మామిడి చెట్టు నాటమని ఒక మొక్క ఇచ్చాడు. రాము గబగబా చిన్న గుంత తీసి, మొక్కను అలా పడేసి, మట్టి కప్పి నీళ్లు పోయకుండానే ఆడుకోవడానికి వెళ్లిపోయాడు. పక్కింటి లచ్చి మాత్రం తన మొక్క కోసం మోకాళ్ల లోతు గుంత తీసింది. పేడ ఎరువు వేసింది. రోజూ రెండు పూటలా నీళ్లు ΄ోసింది. పిట్టలు కొట్టకుండా చుట్టూ కంచె కూడా వేసింది.మూడు నెలలు గడిచాయి. వానాకాలం వచ్చింది. రాము నాటిన మొక్క ఎప్పుడో వాడిపోయింది. లచ్చి మొక్క మాత్రం లేత ఆకులతో, బలంగా పెరుగుతోంది.రాముకి కోపం వచ్చింది. ‘తాతయ్యా, నువ్వు నాకు చెడ్డ మొక్క ఇచ్చావు. లచ్చికి మంచిది ఇచ్చావు‘ అని ఏడ్చాడు. తాతయ్య నవ్వి, ఇద్దరినీ తీసుకెళ్లి రెండు గుంతలు తవ్వించాడు. రాము గుంతలో రాయి తగిలింది, వేరు పాకడానికి చోటు లేదు. మట్టి కూడా గట్టిగా ఉంది. లచ్చి గుంతలో మట్టి మెత్తగా, తడిగా ఉంది. అప్పుడు తాతయ్య చెప్పాడు, ‘మొక్క ఒకటే నాయనా. నువ్వు చేసిన పని, లచ్చి చేసిన పని వేరు. నీ తొందరపాటు వల్ల మొక్క చచ్చింది’.ఐదేళ్లు గడిచాయి. లచ్చి చెట్టు పెద్దదై, కాయలు కాసింది. ఆ ఊరి పిల్లలంతా దాని నీడలో ఆడుకునేవారు, పండ్లు తినేవారు. రాము సిగ్గుపడి, లచ్చిని అడిగి ఎలా నాటాలో నేర్చుకున్నాడు. మళ్లీ ఒక మొక్క తెచ్చి ఈసారి ఓపికగా నాటాడు. మూడేళ్లకే ఆ చెట్టు కూడా కాయడం మొదలుపెట్టింది. అప్పుడు రాము అందరితో అన్నాడు, ‘తొందర పనికి మొక్క కూడా మొలవదు. ఓపిక పట్టి, జాగ్రత్తగా చేస్తే రాయిలో కూడా చెట్టు పుడుతుంది’.నీతి: ఏ పని చేసినా పూర్తిగా తెలుసుకొని, ఓపికతో చేయాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది.చదవండి: పొరపాటున కూడా బంగారం కొనొద్దు.. ఎందుకో తెలుసా..? -
ఏలియెన్స్కి ఇల్లు దొరికిందా?
పిల్లలూ... నిజంగా ఏలియెన్స్ ఉన్నాయా అని సైంటిస్టులు రోజూ టెలిస్కోప్‌లతో ఆకాశాన్ని వెతుకుతున్నారు. 2026లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఓ2–18b అనే దూరపు గ్రహం గాలిని చూసింది. ఆ గాలిలో డైమిథైల్ సల్ఫైడ్ అనే వాయువు కనిపించింది. ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే భూమి మీద ఈ వాయువుని సముద్రంలో ఉండే చిన్న చిన్న జీవులు మాత్రమే తయారు చేస్తాయి. చెట్లు గానీ, రాళ్లు గానీ చేయలేవు. అంటే ఆ గ్రహం మీద కూడా సముద్రం ఉండి, అందులో ఏదైనా సూక్ష్మజీవం ఉందేమో అని సైంటిస్టులు అనుమానిస్తున్నారు. ఇది ఏలియెన్ అని కచ్చితంగా చెప్పలేం, కానీ ఇప్పటివరకు దొరికిన అతి పెద్ద క్లూ ఇదే.ఇంకో వింత విషయం. మన సూర్యుడికి దగ్గర్లోనే, కేవలం 10.7 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి కొత్త గ్రహం ఒకటి బయటపడింది. దాని సైజు భూమి అంతే ఉంటుంది. అది తిరిగేది సూర్యుడు లాంటి నక్షత్రం చుట్టూ! ఆ నక్షత్రం నుంచి కోపంగా మంటలు రావు, సున్నితంగా వెలుగు ఇస్తుంది. అందుకే ఆ గ్రహం మీద వాతావరణం చల్లగానూ ఉండదు, వేడిగానూ ఉండదు. సరిగ్గా నీళ్లు మనగలిగేంత దూరంలో ఉంది. నీళ్లు ఉంటే జీవం ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. సైంటిస్టులు ఇప్పుడు ఆ గ్రహం మీద గాలి ఉందా, ఆ గాలిలో ఆక్సిజన్ ఉందా అని చూస్తున్నారు. ఉంటే మాత్రం ఏలియెన్స్కి ఇల్లు దొరికినట్టే.ఏలియెన్స్ అంటే పచ్చగా ఉండి, పెద్ద తలకాయతో ఉండాలని లేదు. అవి బాక్టీరియా లాగా చిన్నగా కూడా ఉండొచ్చు. చిలీ దేశంలో అటకామా ఎడారి ఉంది. అక్కడ వానే పడదు, భూమి మీద అంగారక గ్రహం లాగా ఉంటుంది. అలాంటి చోట కూడా సైంటిస్టులు 2 మీటర్ల లోతులో రాళ్ల సందుల్లో దాక్కుని బతికే సూక్ష్మ జీవుల్ని 2026లో కనుక్కున్నారు. వెలుతురు లేకపోయినా, నీళ్లు లేకపోయినా అవి బతుకుతున్నాయి.చదవండి: పొరపాటున కూడా బంగారం కొనొద్దు.. ఎందుకో తెలుసా..?భూమి మీదే ఇలా ఉంటే, మరి అంగారకుడి మీద, లేదా దూరపు గ్రహాల మీద కూడా ఇలాంటి జీవం ఉండొచ్చు కదా. అందుకే సైంటిస్టులు ఇప్పుడు గ్రహాల పైపైన కాకుండా, లోపల తవ్వి చూస్తున్నారు. ఏదో ఒక రోజు నిజమైన ఏలియెన్ మనకు దొరుకుతుందేమో. -
పిల్లల్ని పొగడటం మంచిదేనా?
పిల్లలు ఏదైనా చిన్న మంచి పని చేయగానే "నువ్వు గ్రేట్", "you are a hero" అని ఆకాశానికి ఎత్తేస్తున్నారా? అలా పొగిడితే వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భావిస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్ తప్పకుండా చదవండి.పిల్లల పెంపకంలో ప్రశంస మంచిదే, కానీ అది ఏ మోతాదులో, ఎలా ఇస్తున్నామనే దానిపైనే వారి రేపటి విజయం ఆధారపడి ఉంటుంది.మీరు చేస్తున్న అతి ప్రశంస (Over-praise) వారి ఎదుగుదలకు ప్లస్ కాకపోగా, వారి భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీసే సైకలాజికల్ బాంబుగా మారుతోంది.Importance of Praiseచైల్డ్ సైకాలజీ కోణంలో చూస్తే, పిల్లల మెదడు వికాసానికి ప్రశంస అనేది ఒక పాజిటివ్ యాంకరింగ్ లాంటిది. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం, తల్లిదండ్రుల నుండి వచ్చే సానుకూల గుర్తింపు పిల్లల మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది వారిలో నేర్చుకోవాలనే జిజ్ఞాసను, సామాజిక నైపుణ్యాలను (Social Skills) పెంచుతుంది.అస్సలు ప్రశంసలు దక్కని పిల్లలు అండర్ కాన్ఫిడెన్స్ తో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో పెరుగుతారు.The Danger of Over-praiseసమస్య అంతా అవసరం లేని చోట, అతిగా పొగడటంతోనే మొదలవుతుంది. Journal of Experimental Child Psychology లో ప్రచురితమైన ఒక కీలక అధ్యయనం షాకింగ్ నిజాలను వెల్లడించింది. ఏదైనా మామూలు పని చేసినా లేదా అసలు శ్రమే పెట్టకపోయినా పిల్లలను అతిగా పొగిడితే, వారిలో Praise Addiction (ప్రశంసల వ్యసనం) ఏర్పడుతుంది.దీనివల్ల రేపు క్లాస్రూమ్లోనో, సమాజంలోనో ఎవరైనా తమను పొగడకపోతే వారు తీవ్ర నిరాశకు గురవుతారు. అంతేకాదు, తమను తాము ఎక్కువగా ఊహించుకునే నార్సిసిస్టిక్ (Narcissistic) ధోరణులు వారిలో పెరుగుతాయి.The Famous Dweck Studyప్రశంసకు, అతి ప్రశంసకు మధ్య ఉన్న అసలు తేడాను స్టాన్‌ఫర్డ్ సైకాలజిస్ట్ Carol Dweck తన ప్రసిద్ధ పరిశోధనలో నిరూపించారు. ఆమె పిల్లలను రెండు గ్రూపులుగా విభజించి ఒక పజిల్ టాస్క్ ఇచ్చారు.* మొదటి గ్రూప్ లో "నువ్వు చాలా స్మార్ట్", "నువ్వు చాలా ఇంటెలిజెంట్" అంటూ పిల్లల తెలివితేటలను పొగిడారు (Trait Praise).* రెండో గ్రూప్ లో "నువ్వు చాలా బాగా కష్టపడ్డావు", "చాలా శ్రద్ధగా చేశావు" అంటూ పిల్లల శ్రమను పొగిడారు (Process Praise).ఆ తర్వాత మరింత కష్టమైన పజిల్స్ ఇచ్చినప్పుడు... కేవలం తెలివితేటలను పొగిడిన మొదటి గ్రూప్ పిల్లలు ఓడిపోతామనే భయంతో టాస్క్‌లు వదిలేశారు (Fixed Mindset).కానీ, శ్రమను పొగిడిన రెండవ గ్రూప్ పిల్లలు సవాల్‌ను స్వీకరించి, కొత్తగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు (Growth Mindset).పేరెంట్స్ కోసం 3 ప్రాక్టికల్ టిప్స్ఈ అతి ప్రశంస లూప్ నుండి బయటపడటానికి పేరెంట్స్ ఈ క్రింది మూడు విషయాలను గుర్తుంచుకోవాలి.1. ఫలితాన్ని కాదు, ప్రయాణాన్ని పొగడండి. "నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు, నువ్వు తోపు" అనడానికి బదులు... "ఈ మార్కులు సాధించడానికి నువ్వు రోజు రాత్రి పడ్డ కష్టం నాకు నచ్చింది" అనండి.2. ప్రశంసను వారు సంపాదించుకునేలా చేయండి (Earned Praise). ప్రతి చిన్న సాధారణ విషయానికి కాకుండా, వారు నిజంగా పట్టుదల చూపించినప్పుడు మాత్రమే మెచ్చుకోండి.3. రియలిస్టిక్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. పొగడ్తల్లో నిజాయితీ లేకపోతే పిల్లలు దాన్ని సులభంగా పసిగట్టేస్తారు. కాబట్టి ప్రశంస ఎప్పుడూ జెన్యూన్‌గా ఉండాలి.పిల్లలకు పుట్టుకతో వచ్చిన తెలివితేటలను కాకుండా, వారు పెట్టే శ్రమను మాత్రమే ప్రశంసించండి. అప్పుడే రేపటి పోటీ ప్రపంచంలో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే Resilience, మానసిక దృఢత్వం కలిగిన అద్భుతమైన జనరేషన్‌ను మనం నిర్మించగలం!-సైకాలజిస్ట్ విశేష్ Founder, Genius Matrix Hub www.psyvisesh.com 8019 000066 -
పండ్లు ఎప్పుడు తినాలి?.. భోజనం తరువాత? ముందా?
పండ్లు, కాయగూరలు నిత్యం తినడం ఆరోగ్యానికి మంచిదని వింటూనే ఉంటాం. మనలో చాలామంది ఆరోగ్య సంరక్షణ కోసం తింటూ ఉంటారు కూడా. అయితే సాధారణంగా భోజనం తరువాత పండ్లు తింటూంటాం మనం. ఇది ఆరోగ్యానికి మేలు చేయదంటోంది తాజా అధ్యయనాలు. ఇలా ఎందుకు? ఎప్పుడు తినాలి? అన్నది బెంగళూరులోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఆదర్శ గౌడ మాటల్లో...చీకటిపడగానే నిద్ర... కడుపు ఖాళీ అవుతూండగానే ఆకలి అన్నది ప్రకృతి ద్వారా మనకు సహజసిద్ధంగా అందిన లక్షణాలు.. ఇలా కాకుండా.. పగలు నిద్రపోయినా.. ఇష్టానుసారం తిన్నా అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది. ఇది పండ్ల విషయంలోనూ వర్తిస్తుంది. భోజనం తరువాత లేదా భోజనంతో కలిపి తినడం వల్ల పండ్లు ఆరోగ్యాన్ని ఇవ్వవు. ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పండ్లలో మనకు ఉపయోగపడే ఎంజైమ్‌లు.. బొప్పాయిలోని పపెయిన్, అనాసలోని బ్రోమలీన్ వంటివి ఖాళీ కడుపులోనే బాగా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థలో ఇతర ఆహార పదార్థాలు ఏవి ఉన్నా.. ఈ ఎంజైమ్‌లు శరీరానికి ఒంటబట్టడం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. భోజనం తరువాత పండ్లు తింటే.. ఈ ఎంజైమ్‌లు వెనుకబడిపోతాయి. తేలికగా జీర్ణమయ్యే చక్కెరలు మాత్రమే శరీరానికి ముందుగా అందుతాయి. అందుకే కడుపారా భోంచేసిన తరువాత రక్తంలోని చక్కెర స్థాయులు హఠాత్తుగా పెరిగిపోవడం. ఈ క్రమంలో ప్రొటీన్లు, కొవ్వుల తరువాత మాత్రమే ఎంజైమ్‌లు జీర్ణమవుతాయి. ఫలితంగా ఇవి చిన్న పేవుల్లోకి చేరే ముందే (పోషకాలన్నీ శరీరానిక అందేది ఇక్కడి నుంచే) పులిసిపోయి పనికి రాకుండా పోతాయి.తరుణోపాయం...భోజనం తరువాత పండ్లు తీసుకోవడం సరికాదన్నది స్పష్టం. మరి ఎప్పుడు తీసుకోవాలి? ఉదయాన్నే పరగడుపున మంచిది అంటోంది యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం. ఇలా చేస్తే... రక్తంలో చెక్కర మోతాదు కూడా ఎక్కువగా పెరగలేదని ఈ అధ్యయనం తెలిపింది. అలాగే ఒక పండును ఉదయం తిన్నప్పుడు రక్తంలో విటమిన్ సి, కరొటనాయిడ్ మోతాదులు ఎక్కువగా ఉన్నాయని, అదే పండు సాయంకాలం తిన్నప్పుడు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఈ అధ్యయనం తెలిపింది.ఇంకోలా చెప్పాలంటే నిద్రకు సమయం ఉన్నట్టే పండ్లు తినేందుకు మంచి సమయం ఒకటి ఉందన్నమాట. ఉదయం పూట తిన్నప్పుడు పండ్లలోని ఫ్రక్టోస్ (ఒకరకమైన చక్కెర) మెరుగ్గా జీర్ణమవుతుంది. దీనికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు గ్లైకోజెన్ గురించి అర్థం చేసుకోవాలి. కాలేయంలో ఉంటుంది ఈ పదార్థం. రాత్రిపూట బాగా తగ్గిపోతుంది. శరీరానికి అవసరం కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని తయారు చేసుకోవాలి. ఉదయం పూట తినే పండ్లతో లభించే ఫ్రక్టోస్‌ను నేరుగా గ్లైకోజెన్‌గా మార్చేస్తుంది కాలేయం. కావాల్సినంత గ్లైకోజెన్ ఉంటే మాత్రం కాలేయం ఫ్రక్టోస్‌ను కొవ్వుగా మార్చేస్తుంది. అదన్నమాట విషయం. కాబట్టి ఇకపై పరగడుపునే కాసిన్న పండ్లు మీ పొట్టలోకి పడేశారనుకోండి... చక్కటి ఆరోగ్యం మీ సొంతమయ్యే అవకాశం ఎక్కువవుతుంది.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
‘పొరపాటున కూడా బంగారం కొనొద్దు.. ఎందుకో తెలుసా?’
అది నరకలోకం. ఆరోజు ఇద్దరు వ్యక్తులు భూలోకం నుంచి కొత్తగా నరకానికి వచ్చారు. అందులో మన దేశానికి చెందిన చెంబయ్య కూడా ఉన్నాడు. ఆ ఇద్దరికి ఒక మూలన ఓ రెడ్ ఫోన్ కనిపించింది. ‘ఏమిటది?’ అని డ్యూటీలో ఉన్న యమభటుడిని అడిగారు.‘ఈ ఫోన్ నుంచి మీ దేశానికి హాయిగా ఫోన్ చేసుకోవచ్చు. ఫ్రీగా కాదు. కక్షలు చెల్లించాల్సి ఉంటుంది’ అని చెప్పాడు యమభటుడు. ‘కక్షలు ఏమిటి?’ ఆశ్చర్యంగా అడిగాడు మన చెంబయ్య.‘మీ లోకంలో లక్షలు అంటారు కదా... మా లోకంలో కక్షలు అంటారు’ అని వివరణ ఇచ్చాడు యమభటుడు. ‘మా దేశానికి ఫోన్ చేసుకోవడానికి ఎన్ని కక్షలు అవుతాయి?’ అడిగాడు చెంబయ్య.‘అరవై కక్షలు అవుతాయి’ అని చెప్పాడు యమభటుడు.‘ఎన్ని గంటలు మాట్లాడవచ్చు?’ అడిగాడు చెంబయ్య.‘గంటలు కాదు... అరగంట మీద ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడాలి’ అని రూల్ చెప్పాడు యమభటుడు. ‘సరేలే...ఆ రెడ్ ఫోన్ ఇలా ఇవ్వు’ అని అరవై కక్షలు చెల్లించాడు చెంబయ్య.‘నా భార్య మంగతాయారుకు ఫోన్ చేస్తాను’ అనుకున్న చెంబయ్య అర క్షణంలోనే మనసు మార్చుకొని తన క్లోజ్‌ఫ్రెండ్ కోటేశ్వర్రావుకు ఫోన్ కలిపి... ‘హలో కోటిగా... ఎలా ఉన్నావురా?’ అని ఆప్యాయంగా అడిగాడు. ‘ఎవరు?’ అని గంభీరంగా అడిగాడు అటునుంచి కోటేశ్వర్రావు.‘ ఒక్కరోజుకే నన్ను మరిచిపోయావా... తెలివి తక్కువ దద్దమ్మ... వెస్ట్ ఫెలో... ఈస్ట్ఫెలో, నార్త్ ఫెలో, ఇడియెట్... రాస్కెల్.... సచ్చినోడా...’ అనడం మొదలు పెట్టాడు చెంబయ్య. కోటేశ్వర్రావుని ప్రేమగా, ఆప్యాయంగా, అనుబంధంగా వేస్ట్ ఫెలో, ఇడియెట్, రాస్కెల్, సచ్చినోడా... అని పిలిచే ఏకైన వ్యక్తి శ్రీ చెంబయ్య. దీంతో ఆ తిట్లకు కోటేశ్వర్రావు వెంటనే కనెక్ట్ అయ్యాడు.‘ఒరే చెంబిగా నువ్వట్రా ఫోన్ చేసింది! గుర్తు పట్టలేదు సుమీ...సారీ’ అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు కోటేస్వర్రావు. అంతలోనే అతడికి తెలుగు నవలలో లాగా భృకుటి ముడిపడింది. దవడ కండరం బిగుసుకుపోయిది. అతడి గుండెల్లో భయం అనే గుండె రాయి పడింది.‘ఒరే చెంబిగా.... నువ్వు నిన్ననే కదరా సచ్చింది..’ భయం భయంగా అడిగాడు కోటేశ్వర్రావు.‘యూ ఆర్ ఆబ్సొల్యూట్లీ కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్’ అని చెంబయ్య బదులు ఇచ్చాడో లేదో...‘వామ్మో దెయ్యం’ అని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు అందుకున్నాడు కోటేశ్వర్రావు.‘పిరికి వెధవ’ అని ఫ్రెండ్‌ను తిట్టుకున్న కోటేశ్వర్రావు తన భార్యకు ఫోన్ చేశాడు...‘ఎలా ఉన్నావు నా బంగారం’ అని భార్య మంగతాయారును ప్రేమగా, గోముగా అడిగాడు.‘పొరపాటున కూడా బంగారం కొనొద్దు. ఎందుకో తెలుసా...’ అంటూ నాన్‌స్టాప్‌గా చెప్పడం మొదలుపెట్టింది మంగతాయారు. ‘మంగా, అసలు నేను ఎవరనుకుంటున్నావు?’ కోపంతో ఉరిమాడు చెంబయ్య. ‘మీరెవరో నాకెలా తెలుస్తుంది? చెప్పండి’ అని విసుగ్గా అడిగింది శ్రీమతి మంగతాయారు.‘స్వయానా నీ భర్త చెంబయ్యను’ అని తనను తాను పునఃపరిచయం చేసుకున్నాడు చెంబయ్య.అంతే...‘యావండీ.. నన్ను విడిచి వెళ్లిపోవడానికి మీకు కాలేయం ఎలా వచ్చింది’ అంటూ అర క్షణం గ్యాప్ ఇవ్వకుండా ఏడ్వడం మొదలుపెట్టింది మంగతాయారు. ఆమె ఏడుపు పుణ్యమా అని అరగంట మీద ఆరు నిమిషాల టైమ్ గ్యాస్ స్టవ్ మీది కొవ్వొత్తిలా స్పీడ్‌గా కరిగిపోయింది. ఆ తరువాత అమెరికాకు చెందిన ఎలాస్కిన్ టేలర్ తన భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడాడు.‘అదేమిటి? నా దగ్గర అరవై కక్షలు తీసుకున్నావు. ఈ అమెరికా వాడి దగ్గర ఆరు కక్షలే తీసుకున్నావు?!’ యమభటుడిని అడిగాడు చెంబయ్య. ‘లోకల్ కాల్‌కు అంతే అవుతుంది’ అన్నాడు యమభటుడు. ‘అమెరికా లోకల్ ఏమిటి... అక్కడెక్కడో ఉంటే’ కోపంగా అన్నాడు చెంబయ్య. ‘ట్రంప్ వార్ మొదలు పెట్టినప్పటి నుంచి అమెరికన్ల జీవితం నరకప్రాయం అయింది. సో... ఇప్పుడు అమెరికా లోకల్ కాల్ పరిధిలోకే వస్తుంది’ శాంతంగా బదులిచ్చాడు యమభటుడు!– యాకుబ్ పాషా -
శుభ ముహూర్తాలకు తాత్కాలిక విరామం
ఈ ఏడాది మే 13తో శుభ ముహూర్తాలు ముగిశాయి. సుమారు 36 రోజుల పాటు శుభకార్యాలకు విరామం. జ్యేష్ఠమాసం కారణంగా ఈ విరామం ఏర్పడింది. ఈ నెలలో దైవ కార్యాలకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, శుభ కార్యాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు చేయటం శాస్తోక్తంగా అనుకూలంగా భావించరు. ఈనెల 18 నుంచి వచ్చే నెల 18 వరకు జ్యేష్ఠ మాసం(మూఢమి) కావటంతో వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ క్రమంలో చివరి ముహూర్తం మే13న పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. మళ్లీ జూన్ 19 నుంచి వివాహాది శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. వ్యాపారాలపై ప్రభావం... శుభ ముహూర్తాలకు బ్రేక్ పడటంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలతో పాటు ఇతర శుభ కార్యాలు నిలిచి పోయాయి. ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ, బ్యాండ్స్, డెకరేషన్ రంగాల వారికి దాదాపుగా పనులు నిలిచిపోయాయి. వీరంతా మళ్లీ జూన్ 19 నుంచి బిజీ కానున్నారు. శుభ ముహూర్తాలు... జూన్‌లో 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో అనుకూలంగా ముహూర్తాలు ఉన్నాయి. జూలై నెలలో 1, 2, 3, 4, 5, 8, 9, ఆగస్టులో 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 తేదీల్లో వరుసగా శుభ కార్యాలు జరగనున్నాయి. నెల రోజుల విరామం తరువాత పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలతో వ్యాపార వర్గాలు, ఫంక్షన్ హాళ్లకు భారీగా బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా కుటుంబాలు తమ పిల్లల వివాహాల కోసం తేదీలను ఖరారు చేసుకునేందుకు పండితులను సంప్రదిస్తున్నారు. ఫంక్షన్ హాల్స్, డెకరేషన్స్, క్యాటరింగ్, తదితర వాటికి అడ్వాన్స్‌లు ఇచ్చేస్తున్నారు. నెల రోజుల విరామం తాత్కాలిక ప్రభావం చూపినా జూన్ 19 తరువాత మళ్లీ శుభ ముహూర్తాల సీజన్ ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. జ్యేష్ఠ మాసం కారణంగా... జ్యేష్ఠ మాసం మూఢం కారణంగా మే 18 నుంచి జూన్ 18 వరకు వివాహాలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాల ప్రారంభోత్సవాలు వంటి ఏవిధమైన శుభకార్యాలు జరపకూడదు. ఈనెల 14 నుంచి శుభ కార్యాలకు విరామం ఏర్పడింది. –శివరాంభొట్ల పవన్‌శర్మ, ఆలయ పురోహితుడు, శ్రీతిరుపతమ్మవారి దేవస్థానం -
సిరాచుక్కల సిరిచుక్క
కుంతీపుత్రిక, ఈ తరం నది, జూనియర్ ఆర్టిస్ట్, అశ్రుతర్పణ, జీవితం గెలుపు నీది, మనస్విని, పిపాసి, వెన్నెల తేటి వంటి విభిన్నమైన 26 నవలలు, ఎనిమిది కథాసంపుటాలు, పలు నృత్య నాటికలు, నాటకాలతో సహా మొత్తం 82 పుస్తకాలు వెలువరించారు. ప్రముఖ సినీనటి భానుమతికి అత్యంత ఆత్మీయమైన స్నేహితురాలు, తెలుగు సినిమాకి పాట రాసిన మొదటి మహిళ శారద అశోక వర్ధన్ గురువారం కన్ను మూశారు. ఆమెకు నివాళిగా...భక్త ధ్రువ మార్కండేయ, గోడ మీద బొమ్మ వంటి చిత్రాలకు పాటలు రాసినా ఉద్యోగ ధర్మంగా పూర్తిగా అటు వెళ్లలేదు. వీరి ‘వినాయక సుప్రభాతం’ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గళంలో నేటికీ సుప్రసిద్ధం. అలాగే ఆంధ్రభూమి దినపత్రికలో ‘మరమరాలు’ పేరిట కాలమ్ నిర్వహించారు. 13 ఎపిసోడ్స్ సీరియల్ రాసి ఉత్తమ రచయిత్రిగా 1990. 1997, 2000లో నంది అవార్డులు పొందారు. వచన కవితలకేగాక నాటక రచయిత్రిగా తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అందుకున్నారు. రాజ్యలక్ష్మి అవార్డు, సుశీలా నారాయణరెడ్డి అవార్డు, గృహలక్ష్మి స్వర్ణ కంకణం వంటి ఎన్నో అవార్డులు పొందిన ప్రతిభామతి శారద అశోక వర్ధన్. ఆకాశవాణిలో పని చేసిన కాలంలాగే ఆ తర్వాత జవహర్ బాల భవన్ డైరెక్టర్‌గా శారద అశోక వర్ధన్ పని చేసిన కాలం ఓ స్వర్ణయుగమే. బాలచంద్రిక పత్రికతోపాటు సాహిత్యానికి ఎంతో ప్రోత్సాహం కల్పిస్తూ వందలాది గ్రంథాలు ప్రచురింపజేయడమేగాక తానే స్వయంగా పిల్లలకోసం బాలవికాస గ్రంథాలు రాశారు. పన్నెండుకుపైగా కవితాసంపుటులు వెలువరించారు. 28 జులై 1938లో సికిందరాబాద్‌లో జన్మించిన శారద తన జీవితమంతా ఆ నగరంతోనే పెనవేసుకున్న నేపథ్యంలో ఆత్మకథనాత్మక రచనగా నా (సుధామ) ముందుమాటతో బాటు ‘నా సిరిచుక్క సికింద్రాబాద్’ అనే గ్రంథాన్ని వెలువరించి ఒక నగర చరిత్రను కూడా అక్షర నిక్షిప్తం చేసిన వారయ్యారు. ఆమె తొలిసారిగా రాసిన ‘ఆత్మార్పణం’ అనే నాటకం స్థానం నరసింహారావుగారి దర్శకత్వంలో రేడియో నాటకంగా ప్రసారమైంది. సమాచారశాఖ లో చేరాక ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అనేక కథలు, కవితలు, నవలలు వెలయించారు. డిప్యుటేషన్‌పై ఆకాశవాణి కుటుంబ సంక్షేమ విభాగంలో కొన్నేళ్లు పని చేశారు. ‘మనసాయెరా మాధవా’ వంటి లలిత గీతాలెన్నింటినో రచించి ఒక కవయిత్రిగానూ ఖ్యాతి పొందారు. కుటుంబ సంక్షేమం గురించి ఆరుద్ర, సినారె, శశాంక వంటి వారి చేత పాటలు రాయించి, ‘గీత మాలిక’ గా ప్రసారం చేయించిన ఘనత ఆమెదే. బుర్రకథలు సైతం కుటుంబ నియంత్రణ ఇతివృత్తంగా రాసిన ఘనత వారిదే! ఆ సామర్థ్యంతోనే ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనపై బుర్రకథ రచించి, నాజర్ బృందంతో ప్రశంసలందుకున్న ఘనత ఆమెది. అతి పిన్న వయసులో వచ్చిన టీచర్ ఉద్యోగాలు తనకు సరిపడవని వినమ్రంగా తిరస్కరించి అనంతర కాలంలో అదే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలో జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ఉద్యోగ విరమణ చేశారు. భర్త అశోక వర్ధన్ లేకున్నా తమ నలుగురు ఆడపిల్లలనూ ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారి వివాహాలు చేసి నలుగురు మనుమలు, నలుగురు మనుమరాండ్రతో ఉద్యోగ విరమణానంతరం విశ్రాంత జీవనాన్ని గడుపుతూ కొంత అస్వస్థతతో 88వ ఏట గురువారం పెద్దకుమార్తె అరుణ ఇంట కన్నుమూశారామె. శ్రీమతి శారద అశోకవర్ధన్ నింగికెగసిన సికిందరాబాద్ సిరిచుక్క మాత్రమే కాదు.. తెలుగు సాహిత్యలోకం మరువలేని మంచి సాహితీవేత్త. మరపురాని మహిళామణి. సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తుతున్న అశ్రు నివాళులే సాక్షి. – సుధామ -
ఉమెన్ పవర్
‘మైనింగ్ రంగంలో మహిళలు ఏమిటి?’ అనే ఆశ్చర్యం... మహిళా ఉద్యోగులు సునిత్నమైన పనులు మాత్రమే... అదీ ఆఫీసు నాలుగు గోడల మధ్యే పనిచేయాలనే నమ్మకాలు, అపోహలు...వాటన్నింటినీ బద్దలు కొడుతూ ఉమెన్ పవర్ చాటి చూపుతున్నారు మహిళలు.తాజా విషయానికి వస్తే... మైనింగ్ రంగంలో 50, 100 టన్నుల బరువులు మోసుకెళ్లే హెవీ డ్యూటీ డంపర్లను మహిళలు నడిపిస్తున్నారు. తొలి అడుగు ఉత్తర భారతంలోని టాటా స్టీల్స్ కంపెనీలో పడగా, రెండో అడుగుకు తెలంగాణలోని సింగరేణి వేదికైంది.పదమూడు మంది మహిళా కార్మికులు సిరిసిల్లలోని ‘తెలంగాణ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్’లో హెవీ ఎర్త్ మూవర్ మెషిన్లను నడపడంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే ఇంటర్నల్ రిక్రూట్ ద్వారా సంస్థ పరిధిలోని పదిహేడు ఓపెన్ గనుల్లో విధులు నిర్వహించనున్నారు...వారిలో కొందరి హెవీ వాహన ప్రయాణం గురించి వారి మాటల్లోనే...ఆర్మీ మిస్సైనా... మరుదనాయగం శిరీషమాది మంచిర్యాల జిల్లా మందమర్రి. చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ అంటే ఇష్టం. మా తాత, తండ్రులు, బాబాయ్‌లు సైతం సైన్యంలో పనిచేశారు. వాళ్ల స్ఫూర్తితో పోలీస్ శాఖలో చేరాలని ప్రయత్నించాను. ఎస్.ఐ. పరీక్షల్లో పల్టీ కొట్టినా, ఆ తర్వాత ఇంట్లోవాళ్లను ఒప్పించి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు సిద్ధమయ్యాను. ఆర్మీలో జాయిన్ అవడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్న సమయంలో సింగరేణి కార్మికుడిగా పనిచేస్తోన్న నాన్న రఫేల్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో అమ్మ విక్టోరియా కోరిక మేరకు కుటుంబంకోసం ఆర్మీ కలలను పక్కనపెట్టి సింగరేణి కార్మికురాలిగా 2024 మార్చిలో జాయిన్ అయ్యాను. చిన్నప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడిపే అలవాటు ఉంది. ఆ తర్వాత కార్లు కూడా ధైర్యంగా నడిపించేదాన్ని. అయితే, గనుల్లో వాటికంటే పరిమాణంలో, సామర్థ్యంలో పెద్దవైన ప్రొక్లెయినర్లు, డంపర్లు, షావెల్స్ క్రేన్లు కనిపించేవి. కార్లు, బైకులు నడిపిన నాకు వాటిని కూడా నడిపించాలని అనిపించినా, ఎవరిని అడగాలో తెలియక ఆశను మనసులోనే దాచుకున్నాను. సీఎండీ బలరామ్‌నాయక్ 2024 చివర్లో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో నేరుగా కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యారు. అదే అదనుగా సీఎండీ సార్‌తో మాట్లాడుతూ ‘సార్, నాకు గనిలో ఎప్పుడు తిరుగుతూ కనిపించే డంపర్లు నడపాలని ఉంది. నాకు ఆ అవకాశం ఇస్తారా’ అని అడిగాను. దానికి ఆయన ‘అవి నడపాలంటే డ్రైవింగ్‌లో అనుభవం ఉండాలి. నీకు ఉందా?’’ అని ప్రశ్నించారు. దీంతో చిన్నప్పటి నుంచి బైకులు, కార్లు నడపడంలో నాకున్న అనుభవం గురించి వివరిస్తూ.. మాకు కూడా పురుషులతో సమానంగా డంపర్లు నడిపే ఛాన్స్ ఇవ్వండి అని మరోసారి కోరాను. నా ఉత్సాహం చూసిన సీఎండీ సార్ ‘ సరే,. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాను’ అని హామీ ఇచ్చారు. నిలబెట్టుకున్నారు.ప్రతీ చోట సవాలే.. ప్రయత్నిస్తే విజయాలే – తోకల త్రివేణిమాది మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్. మా నాన్న తోకల ఎల్లయ్య సింగరేణి కార్మికుడు. నాకు పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత 2022లో సింగరేణిలో జాయిన్ అయ్యాను. పెళ్లికిముందు నాకున్న కార్ డ్రైవింగ్ అనుభవం తర్వాత పనికి వచ్చింది. మహిళా కార్మికులకు డంపర్ ఆపరేటర్‌గా అవకాశం ఇస్తామంటూ 2025 ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నాను. సిరిసిల్ల ట్రైనింగ్ సెంటర్లో మొదటి వారం థియరీ, సిమ్యులేషన్ మీద క్లాసులు తీసుకున్నారు. తర్వాత 16 అడుగుల పొడవైన స్కూల్‌బస్సును, 26 అడుగుల పొడవు ఉండే ట్రక్ (లారీ)ని నడిపించడంపై గ్రౌండ్లో శిక్షణ ఇచ్చారు. కానీ శిక్షణ మలిభాగంలో అవే హెవీ వెహికల్స్‌ను నేరుగా రోడ్డుపై నడపమన్నారు. మొదట్లో కొంత భయపడ్డప్పటికీ, నా ఫస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను గుర్తు తెచ్చుకుని క్లచ్ వదిలి, ఎక్సలేటర్ తొక్కి గేరు మార్చాను అంతే!కెరీర్ గ్రోత్ కోసం...– షేక్ రహమత్ ఉన్నీసామా నాన్న షేక్ అబ్దుల్ ఖదీర్ భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడిగా పని చేసేవారు. ‘మనది సంప్రదాయ కుటుంబం, కట్టుబాట్లు పాటించాలి’ అనే పరిధిలోనే నేను డిగ్రీ పూర్తి చేయడం. పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే. ఐటీ సర్వీసెస్‌లో పనిచేసే నా భర్త జుబేర్ అహ్మద్‌తో పెళ్లి తర్వాత ఆయన నా ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చారు. కొత్తగా ఆయన కారు కొనుక్కోవడమే కాకుండా నాకు పట్టుబట్టి డ్రైవింగ్ నేర్పించారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2022లో సింగరేణిలో బదిలీ వర్కర్‌గా జాయిన్ అయ్యాను. ఇల్లెందు ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న సమయంలో 2025 ఆగస్టులో డంపర్ ఆపరేటర్ నోటిఫికేషన్ వచ్చింది. అప్లై చేయాలనుకున్నప్పుడు ఎవరెన్ని విధాలుగా వెనక్కి లాగాలని చూసినా వినలేదు. సంప్రదాయ పద్దతిలో రెగ్యులర్ ఆఫీస్ జాబ్‌కే పరిమితం అవడం కంటే కెరీర్ గ్రోత్ ఉండే డంపర్ ఆపరేటర్‌గా వెళ్లడమే ఉత్తమం అనుకుని ముందడుగు వేశాను. కొత్త బాటలో నడిచేటప్పుడు ఎన్నో అవమానాలు, అవహేళనలు, తిరస్కారాలు ఎదురుకావచ్చు. వాటిని లెక్కచేయక ముందుకు సాగి విజయం సాధిస్తే తరువాత అదే బాటని మిగిలిన వాళ్లు అనుసరిస్తారు.– తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
శని జయంతి ప్రాముఖ్యత..ఆయన అనుగ్రహం పొందాలంటే..!
శనీశ్వరుడి జయంతిని ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు. ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది.శనీశ్వరుడి జయంతిదేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం. ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి.చేయవలసిన పూజలుశని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం , నూనే , నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి. అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి. దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి. తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి. ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి.అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు , ఆవ నూనే లాంటివి దానం చేయాలి.శని దేవుడి ప్రాముఖ్యతసూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట , చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.శని శాంతి మంత్ర స్తుతి..ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహారవర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయకృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయశుద్ధబుద్ధి ప్రదాయనేయ ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతినవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి , తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.శన్యారిష్టే తు సంప్రాప్తేశనిపూజాంచ కారయేత్శనిధ్యానం ప్రవక్ష్యామిప్రాణి పీడోపశాంతయేఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు , నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.వై.వెంకటసుబ్బారెడ్డి9849100044మరిన్ని వివరాలకు కింది వీడియోపై క్లిక్ చేయండి (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
‘బార్బీ’కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!
హాయ్! ఫ్రెండ్స్ .. నేనూ.. మీకు ఎంతగానో ఇష్టమైన బార్బీని. ఇవాళ నా గురించి మీకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుదామని మీ ముందుకు వచ్చాను.. మీకూ తెలుసుకోవాలనుందా.. అయితే చదివేయండి మరి. ∙నా పూర్తి పేరు బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్. నన్ను సృష్టించింది రూత్ హ్యాండ్లర్ అనే ఒక వ్యాపారవేత్త. తన కూతురు బార్బీ పేరు మీదుగానే నాకు కూడా ‘బార్బీ’ అని పేరు పెట్టారు తెలుసా! మొట్టమొదటిసారి నన్ను న్యూయార్క్ టాయ్ ఫెయిర్‌లో ప్రపంచానికి పరిచయం చేశారు. 150 పైగా దేశాల్లో నాకు అభిమానులున్నారంటే ఆశ్చర్యమే కదా! నేను మొదట నలుపు, తెలుపు రంగుల జీబ్రా గీతల స్విమ్‌సూట్ ధరించి, పోనీటైల్ హెయిర్ స్టైల్‌తో ఉండేదాన్ని. ఇప్పటి వరకు నన్ను 250 కి పైగా వృత్తుల వేషధారణల్లో తయారుచేశారు. అందులో డాక్టర్, పైలట్, ఆస్ట్రోనాట్, దేశాధ్యక్షురాలు వంటివి కూడా ఉన్నాయి. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టడానికి 4 ఏళ్ల ముందే, అంటే 1965 లోనే బార్బీ ’ఆస్ట్రోనాట్’ రూపంలో నేను మార్కెట్లోకి వచ్చేశాను. నాకు ఎంతో ఇష్టమైన రంగు పింక్. దీనికి ఒక ప్రత్యేకమైన ΄పాంటోన్ షేడ్ కూడా ఉంది. నాకు జోడీగా కెన్ బొమ్మను1961లో విడుదల చేశారు. విచిత్రమేమిటంటే, రూత్ హ్యాండ్లర్ కొడుకు పేరు కెన్! నన్ను ఈ మధ్యకాలంలో రకరకాల ఆకృతులలో, ఎత్తులలో, 35 కంటే ఎక్కువ చర్మపు రంగులలో తయారుచేస్తున్నారు. అందం అంటే కేవలం ఒకేలా ఉండటం కాదు అని చెప్పడమే ఇందులోని ఉద్దేశం. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైపోయిన నా నమూనాల్లో ‘టోటల్లీ హెయిర్ బార్బీ’ ఒకటి. ఎందుకంటే ఈ నమూనాలో నా జుట్టు పొడవుగా నేలకు అంటుకుని ఉండడమే కారణం. ఇప్పుడు కేవలం నేను ఒక బొమ్మను మాత్రమే కాదండోయ్, యూట్యూబ్ వ్లాగర్‌ని కూడా! నాకు కూడా ఒక సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో నా జీవిత విశేషాలను షేర్ చేస్తుంటాను తెలుసా! (చదవండి: పల్లెటూరి అమ్మాయి ఘనత..రైతన్నల కోసం..! ఏకంగా జపాన్..) -
మిద్దెతోటల్లో కోకో పీట్తో ఇన్ని ఉపయోగాలా..?!
మిద్దెతోటలు లేదా టెర్రస్ గార్డెన్లు లేదా పెరటి తోటల్లో కోకో పీట్ (కొబ్బరి పొట్టు) వాడకం మొక్కల ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది కొబ్బరి పీచు నుంచి తయారయ్యే ఒక సేంద్రియ పదార్థం. దీని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి:1 కోకో పీట్ తన బరువు కంటే 8–10 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకొని నిల్వ ఉంచుకోగలదు. దీనివల్ల మొక్కల వేర్లకు ఎక్కువ సేపు తేమ అందుతుంది, వేసవిలో కూడా మొక్కలు త్వరగా ఎండిపోవు.2 మట్టి కంటే కోకో పీట్ చాలా తక్కువ బరువు ఉంటుంది, కాబట్టి మేడపై కుండీల వల్ల భారం పడకుండా ఉంటుంది.3 దీని నిర్మాణం గుల్లగా ఉండటం వల్ల వేర్లకు గాలి బాగా అందుతుంది. ఇది మొక్క వేర్లు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.4 విత్తనాలతో మొక్కలు పెంచటానికి ఇది ఒక అద్భుతమైన మాధ్యమం. ఇందులో విత్తనాలు చాలా వేగంగా మొలకెత్తుతాయి.5 ఎర్రమట్టి లేదా ఇతర రకాల మట్టితో కలిపి వాడినప్పుడు, ఇది నేల బిగుసుకుపోకుండా చూస్తుంది.6 ఇది కొబ్బరి వ్యర్థాల నుండి తయారవుతుంది కాబట్టి పూర్తిగా సహజమైనది, పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు.7 కూరగాయల మొక్కల వేర్లు త్వరగా విస్తరించడానికి కోకో పీట్ మట్టిని గుల్లగా ఉంచుతుంది. 30% కోకో పీట్ + 40% ఎర్రమట్టి + 30% వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు కలుపుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, బెండ వంటి కూరగాయలు మొక్కలకు ఈ మిశ్రమం ద్వారా పోషకాలు, తేమ సమపాళ్లలో అందుతాయి.8 పూలు బాగా పూయాలంటే నేలలో గాలి ప్రసరణ (ఎయిరేషన్) ఉండాలి. 40% కోకో పీట్ + 20% ఇసుక + 40% వర్మీ కంపోస్ట్ కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి. మందార, గులాబీ, చామంతి వంటి మొక్కల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా, అదనపు నీరు సులభంగా బయటకు పోయేలా కోకో పీట్ సహాయపడుతుంది.9 నిమ్మ, జామ, దానిమ్మ లాంటి పండ్ల మొక్కలు ఎక్కువ కాలం కుండీల్లోనే ఉండాలి కాబట్టి మట్టి గట్టిపడకుండా ఉండటం ముఖ్యం. 25% కోకో పీట్ + 50% ఎర్రమట్టి + 25% కంపోస్ట్, కొద్దిగా వేప పిండి కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇది మొక్క వేర్లు బలంగా నాటుకోవడానికి, ఎక్కువ పండ్లు కాయడానికి అవసరమైన పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది.10 మార్కెట్లో దొరికే కోకో పీట్ బ్లాక్స్‌ను ఉపయోగించే ముందు.. నీటిలో నానబెట్టి, అది మెత్తగా అయ్యాక అందులోని లవణాలను పోగొట్టడానికి 2–3 సార్లు నీటితో కడిగి, తర్వాత వాడాలి.11 కోకో పీట్ మట్టిని గుల్లగా ఉంచుతుంది కాబట్టి, అదనపు నీరు కుండీ అడుగున ఉన్న రంధ్రాల ద్వారా సులభంగా బయటకు పోతుంది.12 కుండీలలో మట్టి కొన్ని రోజుల తర్వాత రాయిలా గట్టిగా మారుతుంది. కోకో పీట్ కలిపితే మట్టి ఎప్పుడూ మెత్తగానే ఉంటుంది, దీనివల్ల వేర్లకు ఆక్సిజన్ బాగా అందుతుంది.13 కోకో పీట్లో సొంతంగా పోషకాలు ఉండవు. అది కేవలం ఒక మాధ్యమం మాత్రమే. కాబట్టి, తప్పనిసరిగా వర్మీ కంపోస్ట్ లేదా ఏదైనా సేంద్రియ ఎరువు కలిపితేనే మొక్కకు బలం అందుతుంది.14 మిద్దె తోటలో కుండీల్లో వాడటం కోసం మట్టి మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు వరి పొట్టు, కోకో పీట్ రెండూ ఉపయోగకరమైనవే.15 వరి పొట్టు మట్టిలో గాలి ప్రసరణను మెరుగుపరచడానికి, నీరు త్వరగా బయటకు వెళ్లడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మట్టిని గుల్లగా ఉంచుతుంది, తద్వారా వేర్లకు గాలి అందుతుంది. అదనపు నీరు నిలవకుండా బయటకుపోతుంది.16 వరి పొట్టులో సిలికా అధికంగా ఉంటుంది, ఇది మొక్కల కణజాలాన్ని దృఢపరిచి తెగుళ్లు, వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తుంది.17 వరి పొట్టు కోకో పీట్ కంటే నెమ్మదిగా కుళ్ళిపోతుంది, కాబట్టి కుండీలో మట్టి ఎక్కువ కాలం గట్టిపడకుండా ఉంటుంది. ఇది సాధారణంగా కోకో పీట్ కంటే చౌకగా లభిస్తుంది. – కొల్లి కృష్ణ కుమారి, మిద్దె తోటల సాగుదారు, గుంటూరుమొబైల్: 9490602366నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడిడెస్క్ చదవండి: అపురూపమైన అడవి మామిడి పండ్ల జాతులు -
పల్లెటూరి అమ్మాయి ఘనత.. రైతన్నల కోసం..!
పిల్లలూ! ప్రతిరోజు మనం పాఠశాలకు వెళ్లి ఏం చేస్తాం? పాఠాలు వింటాం.. స్నేహితులతో ఆడుకుంటాం కదా.. కానీ పూజ అనే మనలాంటి ఒక విద్యార్థిని మాత్రం తను ప్రతిరోజూ పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కనిపెట్టాలనుకుంది. ఆలోచన వచ్చిందే ఆలస్యం ఒక యంత్రాన్ని ఆవిష్కరించేసింది. అది ఆ పాఠశాల విద్యార్థుల సమస్యని పరిష్కరించడమే కాదు.. మనకు అన్నం పెట్టే అన్నదాతల ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తోంది. మరి మంచి పనులు చేస్తే ఏం జరుగుతుందో తెలుసుగా .. పూజా పేరు దేశమంతటా ప్రశంసలతో మార్మోగింది.. ఎన్నో బహుమతులనూ సొంతం చేసుకుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...పేద కుటుంబానికి చెందిన పూజ ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ బడిలో చదువుకునేది. పంట కోతల సమయంలో పొలాల్లోని యంత్రాల (థ్రెషర్లు) నుంచి వచ్చే దుమ్ము, ధూళి గాలిలో కలిసి ఆమె తరగతి గదిలోకి వచ్చేవి. దానివల్ల పిల్లలకు సరిగ్గా ఊపిరి ఆడక΄పోయేది, పుస్తకాలు కూడా కనబడకపోయేవి. మరోవైపు ఈ కాలుష్యం వల్ల ఎంతో మంది రైతులు అనారోగ్యం పాలవ్వడం పూజను బాధించింది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించింది.డస్ట్ ఎక్స్ట్రాక్టర్ఒకరోజు ఇంట్లో తన తల్లి పిండిని జల్లెడ పట్టడం పూజ చూసింది. సన్నని పిండి కిందకు పడితే, గరుకుగా ఉండేవి జల్లెడలో ఉండిపోయాయి. అదే సూత్రం పూజను పరిష్కారం దిశగా ఆలోచించేలా చేసింది. పంటలోని దుమ్మును వేరు చేస్తే బాగుంటుందని ఆలోచించింది. వెంటనే తన సైన్స్ మాస్టారు సహాయంతో పాత రేకులు, వెల్డింగ్ మిషన్ ఉపయోగించి ఒక ప్రత్యేక యంత్రాన్ని తయారు చేసింది. దీనికి ఆమె డస్ట్ ఎక్స్ట్రాక్టర్ అని పేరు పెట్టింది. ఈ యంత్రం పొలాల్లో పని చేస్తున్నప్పుడు, పంట నూర్పిడి సమయంలో వెలువడే దుమ్మును పీల్చుకుని, ఒక చోట సేకరిస్తుంది. దీనివల్ల రైతులు పీల్చే గాలి శుభ్రంగా ఉంటుంది, తద్వారా ఆస్తమా, టీబీ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అలాగే ఈ యంత్రాన్ని ఎవరైనా సులభంగా కొనుగోలు చేసేలా, అందుబాటులో ఉండే వస్తువులతోనే పూజ దీనిని రూపొందించింది.దేశం గర్వించే గుర్తింపు!పూజ సాధించిన ఈ విజయానికి గానూ, ఎన్నో ప్రశంసలతోపాటు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకుంది. సైన్స్ అండ్ ఇన్నోవేషన్‌లో తను చూపించిన ప్రతిభకు గాను జపాన్‌కి వెళ్లే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అక్కడ ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలతో కలిసి పూజ తన యంత్రం గురించి వివరించింది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమెను ‘బాల శాస్త్రవేత్త’గా గుర్తించి లక్ష రూపాయల నగదు బహుమతిని అందించింది.పర్యావరణంపై చైతన్యంపూజ భవిష్యత్తులో ఒక గొప్ప శాస్త్రవేత్త కావాలని కలలు కంటోంది. పర్యావరణ పరిరక్షణపై తన గ్రామంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ చైతన్యం తీసుకువస్తోంది. పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కలిగే నష్టాల గురించి రైతులకు వివరిస్తోంది. ఒక సాదాసీదా పల్లెటూరి అమ్మాయి తన తెలివితేటలతో దేశానికే ఆదర్శంగా నిలిచింది. మనందరం ఆమెను చూసి నేర్చుకుందాం కదూ!మన చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు భయపడకూడదు. వాటికి పరిష్కారం ఆలోచించాలి. మన దగ్గర డబ్బు లేక΄ోయినా, పట్టుదల ఉంటే ఆకాశమంత ఎత్తుకు ఎదగవచ్చు.– పూజ (చదవండి: ఇద్దరు సిస్టర్స్ కృషి: 'యాత్రి'కుల కోసం..) -
అపురూపమైన అడవి మామిడి
వాడుక భాషలో అడవి మామిడి పండును తెలుగులో కొండ మామిడి, టౌర మామిడి, ఆద్వము అని కూడా పిలుస్తారు. అస్సామీలో ఆమ్రత అని, ఇంగ్లీష్‌లో ఇండియన్ హాగ్ ప్లం, వైల్డ్ మ్యాంగో అని, ఒరియాలో అంబడు, అంబ అని, కన్నడలో కడంబట్టే, అంబట్టేమర, పూండి, డి. గుడ్ల మాటే, ఆమెటి, గాయగిడ, గొడడకాయ, మరాహున్నె, కొడలిమావు అని, గుజరాతిలో అంబాడ అని, తమిళంలో అంబాళం, కింకం, పలుచకయి అని, బెంగాలీలో ఆమ్ర, ఆమడ, అంబడ అని, మరాఠీలో అమడ, అంబడ అని, మలయాళంలో అంపఝం అని, హిందీలో అంబారి, అమర, అంబర అని, సంస్కృతంలో ఆమ్రత, ఆమ్రతక, మెతుల అని పిలుస్తారు.పూత కాలం ఫిబ్రవరి – మార్చి. పండ్ల కాలం: జూన్–జులై.అడవి మామిడి చెట్టు మాను గట్టిగా ఉండి, బెరడుపై బూడిద పూసినట్లు ఉంటుంది. మానుకు దెబ్బ తగిలినప్పుడు జిగురు వస్తుంది. ఈ చెట్టు కూడా ఔషధగుణాలు కలిగి ఉంటుంది. ఈ చెట్లకు పూత ఫిబ్రవరి–మార్చి నెలల్లో వస్తుంది. కాలం అనుకూలిస్తే జనవరిలో కూడా పూత మొదలవుతుంది. పండ్లు మాత్రం జూన్–జులై మాసాలలో వస్తాయి. కానీ, ఈ ప్రక్రియ ప్రాంతాలను బట్టి పూత–కాతలో మార్పులు ఉండవచ్చు.ఉనికికొండ మామిడి ఎక్కువగా కొండల్లో కోనల్లో ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 1200 మీటర్ల (3,900 అడుగులు) ఎత్తు వరకు గల ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇది సతత హరితం. కానీ కొన్ని సందర్భాల్లో ఆకులు రాల్చుతుంది. వీటి జీనస్‌లో 17 జాతులు ఉన్నాయి.అడవి మామిడి స్వస్థలంభారత్, శ్రీలంక, ఆగ్నేయాసియా, మయన్మార్, నేపాల్ దేశాలు. ఇండియాలో ఎక్కువగా ఉన్న ప్రాంతాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ, వెస్ట్ బెంగాల్, అండమాన్, నికోబార్ దీవులు. అస్సాం, హిమాలయ దిగువ శ్రేణులు మొదలగు ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. ఈ చెట్లు దాదాపు 25 మీటర్ల ఎత్తువరకు పెరుగగలవు. అలాగే అన్ని ప్రాంతాలలో వీటి పండ్ల వినియోగం ఉన్నది. వీటిపైన పరిశోధనలు ఉన్నప్పటికీ, రైతుల చెంతకు చేరిన దాఖలాలు చాలా తక్కువే. వీటిపైన నిరంతర పరిశోధన జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చెట్లు నల్లమల అడవుల్లో వంకల వెంబడి, సెలయేర్ల వెంబడి అధికంగా ఉన్నాయి.ఉపయోగాలెన్నో...అడవి మామిడి చెట్టు ఎన్నో ఉపయోగాలతో కూడుకున్నది. కలప నిర్మాణ రంగంలో తాత్కాలిక పనులకు ఎంతగానో ఉపయోగపడుతాయి (సెంట్రింగ్ చెక్క, నగిషీలు చేయటానికి, బొమ్మల తయారీ మొదలైనవి)ఇది ప్లైఉడ్ తయారీలో ముఖ్యమైన వస్తువు. అగ్గిపెట్టెలు, పుల్లల తయారీకి వాడుతారు. క్రేట్స్, బాక్స్‌ల తయారీలో ఉపయోగిస్తారు.ఆకులను మేకలు, పశువులు తింటాయి.కొమ్మలు వంట చెరకుగా ఉపయోగపడతాయి.పండ్లను పిల్లలు ఇష్టంగా తింటారు. పులుపు–తీపి కలబోసినట్లు ఉంటాయి.వీటి కాయలను ఊరగాయ పచ్చడి పెట్టడానికి ఉపయోగిస్తారు. అట్లే పండ్ల నుండి జామ్ కూడా తయారు చేస్తారు.కాయలను చెక్కు తీసి ఒరుగు చేసుకోవచ్చు. ఆ ఒరుగును పప్పు, ఇతర కూరల్లో వేసుకుంటే పులుపుతో కూడిన రుచి వస్తుంది.గిరిజనులు అడవి మామిడి ఒరుగు చేసుకుంటారు. వీటిని వానాకాలం, చలికాలాల్లో పప్పుకూరలు, ఇతర కాయకూరలలో వాడుతారు.వీటి లేత ఆకులు, పూత, పండ్లు, వేర్లు, బెరుడును గిరిజనులు నాటు వైద్యంలో వాడుతారు. అట్లే ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తున్నారు.వీటి పండ్లు, వేర్లు ఎక్కువ దప్పికను నివారించడానికి వాడతారు. వీటి బెరుడు విరేచనాలను అరికట్టడానికి ఉపయోగిస్తారు. బహిష్టు క్రమబద్ధం చేయటానికి వేర్లను ఉపయోగిస్తారు. వేర్లను రుబ్బగా వచ్చిన గుజ్జును నీళ్ళల్లో కలుపుకొని తాగితే మధుమేహ సమస్య అదుపు అవుతుంది.అడవిమామిడి ఉపయోగాలు అనేకం ఉన్నాయి. క్యాన్సర్ కారకాలను, మైక్రోబియల్ చర్యలను అదుపు చేయగల శక్తి ఈ పండ్లకు ఉంది. పండ్ల గుజ్జు కీళ్లనొప్పిని తగ్గిస్తుంది.పోషక విలువలు (100 గ్రా. అడవి మామిడి పండ్ల గుజ్జులో)పోషకాలు విలువప్రోటీన్లు 0.7%కొవ్వు 3.0%పీచు పదార్థం 1.0%పిండి పదార్ధాలు 4.5%ఖనిజాలు 0.5%కాల్షియం 36.0 మి.గ్రా.భాస్వరం 11.02 మి.గ్రా.ఇనుము 3.9 2 మి.గ్రా.థయామిన్ 0.02 మి.గ్రా.రిబోఫ్లేవిన్ 0.02 మి.గ్రా.నికోటిన్ ఆసిడ్ 0.3 మి.గ్రా.విటమిన్ సి 21.0 మి.గ్రా.విటమిన్ ఎ 450 మైక్రో గ్రాములు–––––––––––––––––––––––––––––––––––( ౌuటఛ్ఛి: ఈౖఐ:10.130.40/్ఖ్క ఖ.0975–8232.5(4).1138–45)అడవి మామిడిపై పరిశోధనలు ఎంతైనా అవసరం. వీటి ఉనికిని, సాంద్రతను పెంచగలిగితే వాతావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. అడవి మామిడి సతత హరితం, కాబట్టి ఆకులు రాల్చే చెట్ల కన్నా అధికంగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అపురూపమైన అడవి పండ జాతులుమన దేశంలోని అడవుల్లో వందల కొలదీ మనుషులు తినదగిన, పోషకాలతో కూడిన అనేక జాతులు పండ్ల చెట్లు, మొక్కలు ఉన్నాయి. వీటిలో అతి ముఖ్యమైన కొన్ని పండ్ల జాతులను ఎంచుకొని పరిశోధనలను ముమ్మరం చెయ్య గలిగితే ఆ పండ్ల చెట్లను కూడా భవిష్యత్తులో రైతుల తోటల్లోకి, పెరటి తోటల్లోకి ఈ అరుదైన అడవి పండ్ల జాతులను ప్రవేశపెట్టవచ్చు అంటున్నారు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా రాజేంద్రనగర్‌లో ఉన్న భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా కొన్నేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ మొరుపోజు పద్మయ్య అంటున్నారు. ఆయన తన బాల్యంలో అడవుల్లో తిరుగుతూ రుచి చూసిన 65 రకాల అడవి పండ్ల జాతులపై లోతైన పరిశోధన చేసి, ‘ఆదరణ కరవైన అడవి పండ్లు– పోషక, ఔషధ నిధులు’ పేరుతో చక్కటి పుస్తకాన్ని వెలువరించారు. ఈ అపురూపమైన అడవి పండ్ల జాతులను పరిరక్షించుకోవటంతో పాటు ఈ మొక్కలను రైతులకు అందుబాటులోకి తేవటం ద్వారా ప్రజల ఆహారంలో పౌష్టికాహార స్థాయిని, వైవిధ్యాన్ని పెంపొందించవచ్చని, పర్యావరణంలోనూ జీవవైవిధ్యాన్ని పెంపొందించవచ్చని డాక్టర్ పద్మయ్య అంటున్నారు. ‘సాగుబడి ప్లస్’ పేజీలో ప్రతి శుక్రవారం ఒక్కో అడవి పండ్ల జాతి గురించి ఆయన అందిస్తున్న సమగ్ర సమాచారాన్ని ధారావాహికగా ప్రచురించడానికి సమ్మతించినందుకు డా. పద్మయ్యకు ధన్యవాదాలు. ఈ సమాచారం పాఠకులకు ఎంతో ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం.– డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్.మొబైల్: 94407 08924 – ఎడిటర్, సాక్షి (చదవండి: పాలలో ఆ నేల రుచి ఉంటుంది!) -
59 ఏళ్ల వయసులోనూ అంతే అందంగా మాధురి దీక్షిత్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో 1980-90ల్లో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. దాదాపు 70కి పైగా చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన డ్యాన్స్‌తో పాటు నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అలా ‘బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్’గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకి ఈ రోజుతో 59 ఏళ్లు నిండుతాయి. ఇప్పటికీ అంతే అందంగా యువ హీరోయిన్లకు తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఈ సందర్భంగా ఆమె మెరిసే అందం కోసం, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఏం చేస్తుంటుంది, ఎలాంటి కేర్ తీసుకుంటుంది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా.!.ఈ అందాల తార మాధురి దీక్షిత్ మాత్రం ఇప్పటికీ మెరిసేచర్మం, ఆరోగ్యకరమైన జుట్టుతో ఆకట్టుకుంటూనే ఉంటారామె. అందుకోసం ఏం చేస్తుంటుందో ఆమెనే స్వయంగా వెల్లండించారు. ఆరోగ్యకరమైన చర్మం కోసం..మాధురీ దీక్షిత్ అందం చర్మం లోపలి నుంచే మొదలవుతుందని చెబుతున్నారామె. అందుకోసం, ఆరోగ్యకరమైన ఆహారం, హైడ్రేటెడ్‌గా ఉండటం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు. అలాగే చర్మ సంరక్షణ అంటే ముఖానికి ఏం పూస్తున్నాం అనేది కాదని, శరీరానికి తేమను అందించేలా పుష్కలంగా నీరు తాగాలని అంటున్నారు.మెరిసే చర్మం కోసం..మాధురీ దీక్షిత్ తన రోజును ముఖంపై మురికిని తొలగించి, చర్మాన్ని తాజాగా ఉంచుకోవడానికి ఒక మంచి క్లెన్సర్‌తో ప్రారంభిస్తుంది.ఆ తర్వాత టోనర్‌ను ఉపయోగిస్తుంది. రోజ్ వాటర్ ఆమెకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైనది. అందువల్ల దాన్నే ఆమె టోనర్‌గా ఉపయోగిస్తుంటారామె.తర్వాత విటమిన్ సీ సీరం వస్తుంది, దీనిని ఆమె తన చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంది.చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలని చెబుతుంది. జిడ్డు చర్మం అయితే వాటర్ బేస్ట్ మాయిశ్చరైజర్, పొడి చర్మం అయితే చిక్కటి క్రీమీ మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలని అన్నారామె.ఆమె తన చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌తో తన ఉదయపు దినచర్యను ముగిస్తుంది.అలాగే మేకప్‌తో నిద్రపోవడం పెద్ద తప్పు అని మాధురీ దీక్షిత్ నొక్కి చెబుతున్నారు. ఆమె సాధారణంగా క్లెన్సింగ్ బామ్‌తో మేకప్‌ను తొలగిస్తారట. ఒక్కోసారి సున్నితమైన క్లెన్సర్‌తో ముఖాన్ని మళ్లీ కడుక్కోవడానికి ముందు వైప్స్‌తో మైసెల్లార్ వాటర్‌ను కూడా ఉపయోగిస్తానని అన్నారు.అలాగే రాత్రి సమయంలో కూడా టోనర్, విటమిన్ సీ సీరమ్‌ని అప్లై చేస్తానని అంటోంది. రోజుకు రెండుసార్లు అప్లై చేస్తానని చెబుతోంది.ఇక రాత్రంతా చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి రాత్రిపూట రొటీన్ మాయిశ్చరైజర్, అండర్-ఐ క్రీమ్, లిప్ బామ్ తప్పనిసరి అని అంటోంది.జుట్టు సంరక్షణ కోసం..మృదువైన, మెరిసే జుట్టు కోసం తాను ఉపయోగించే ఒక సాధారణ ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్‌ను కూడా మాధురి పంచుకుంది. ఈ మాస్క్‌లో మెత్తగా చేసిన అరటిపండు, కొబ్బరి నూనె, తేనె ఉంటాయి. ఇక్కడ అరటి పండ్లు జుట్టుకు లోతైన పోషణను ఇవ్వగా, కొబ్బరి నూనె జుట్టు చిట్లడాన్ని తగ్గించి, మెరుపుని ఇస్తుంది. ఇక తేనె కుదుళ్లను మృదువుగా చేసి వొత్తుగా పెరిగేలా చేస్తుందట. -
ఇద్దరు సిస్టర్స్ కృషి: 'యాత్రి'కుల కోసం..
వాన రాకడ, ప్రాణం పోకడ వరుసలో రైలు రాకడను కూడా చేర్చారు చమత్కారులు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తాము ప్రయాణిస్తున్న ట్రైన్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ముంబైకి చెందిన లఖీ సకరియ, రీవ సకరియ సిస్టర్స్ క్రియేట్ చేసిన ‘యాత్రి’ యాప్ మన దేశంలోని ప్రధాన నగరాలలో ప్రాచుర్యం పొందింది. ఈ యాత్రి యాప్ ఇప్పుడు ముంబై లోకల్ ట్రైన్ సిస్టమ్, సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేల అధికారిక యాప్‌గా ఉంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్., ఎంబీఏ చేసింది లఖీ. బి2బి, బి2జీ రంగాలలో సాఫ్ట్వేర్ అప్లికేషన్లను డెవలప్ చేసింది. రీవ కొన్ని సంవత్సరాలు కన్సల్టింగ్ కంపెనీలో పనిచేసింది. యాప్ ప్రారంభానికి ముందు రైల్వే అధికారులతో మాట్లాడి ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది లఖీ. రాకపోకలను కచ్చితంగా ట్రాక్ చేయడానికి ప్రతి స్టేషన్ చుట్టూ వర్చువల్ జియో ఫెన్స్‌లను సృష్టించి, దానికి జీపీఎస్ పరికరంలోని మోషన్ సెన్సర్లను జోడించారు. లైవ్ లొకేషన్ అప్డేట్లలో జాప్యాన్ని తొలగించడానికి పదిహేను మంది సభ్యులతో నెలరోజుల పాటు ప్రతిరోజూ రైళ్లలో ప్రయాణిస్తూ మాన్యువల్ పరీక్షలు నిర్వహించారు. యాప్ పరీక్షలో భాగంగా సిగ్నల్ అడ్డంకులను, టాంపరింగ్ సమస్యను తగ్గించడానికి జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పనితీరును పరీక్షించడానికి వివిధ రూట్ ప్యాచ్‌లలో సిగ్నల్ కనెక్టివిటీని విస్తృతంగా పరీక్షించారు. ‘యాత్రి’ ప్రధాన లక్ష్యం రియల్ టైమ్ లోకల్–ట్రైన్ ట్రాకింగ్. తమ సొంత జీపీఎస్ పరికరాల ద్వారా నేరుగా రైల్వే కంట్రోల్ బోర్డ్‌ల నుంచి సమాచారాన్ని తీసుకుంటుంది యాత్రి. క్రౌడ్ సోర్స్ చేయదు. ట్రైన్ లొకేషన్, ట్రైన్ ఆలస్యం కావడానికి సంబంధించిన సమాచారం, ఫ్లాట్‌ఫారమ్ మార్పు, నోటిఫికేషన్లు, అంతరాయాల అప్డేట్లు.. మొదలైన వాటిని ప్రయాణికులు ‘యాత్రి’ ద్వారా తెలుసుకోవచ్చు.ప్రత్యామ్నాయ మార్గాలుఒక ట్రైన్ దాని నిర్దేశిత వేగంలో మూడో వంతు వేగంతో వెళితే వెంటనే ఆలస్యం జరగదు. కానీ రద్దీ సమయాలలో దాని ప్రభావం మొత్తం లైన్‌పై పడుతుంది. వివిధ కారణాల వల్ల రైళ్ల రాకపోకలలో ఆలస్యం జరుగుతుందని, అందువల్ల వేలాది మంది ప్రయాణికులకు సమాచారం త్వరగా చేరాల్సిన అవసరం ఉంది’ అంటుంది లఖీ. ట్రైన్లు ఆలస్యంగా నడవడం అనే సమస్య కంటే ఆ ఆలస్య సమాచారం ప్రయాణికులకు చేరకపోవడమే అసలు సిసలు సమస్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘యాత్రి’ రైల్వే కంట్రోల్ రూమ్‌ల నుండి నేరుగా డేటాను తీసుకుంటుంది. ‘మేము తప్పుడు సమాచారాన్ని అందించే యాప్‌గా ఉండాలనుకోవడం లేదు. ప్రయాణికులు యాత్రి యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే తాము ప్రయాణించే రైలుకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోగలగాలి. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే అదే మార్గంలో ప్రత్యామ్నాయాలను చూడగలగాలి’ అంటుంది రీవ.అయిదు నగరాలలో...రియల్–టైమ్ ట్రాకింగ్‌తో పాటు ముంబై మహానగరంలోని మెట్రో, మోనోరైల్, బస్సులు, ఫెర్రీలతో సహా ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన సమగ్ర షెడ్యూల్ ఆధారిత సమాచారాన్ని ‘యాత్రి’ అందిస్తోంది. ప్రయాణికులు తమ ప్రారంభ స్థానం, గమ్యస్థానాన్ని నమోదుగా చేయగానే యాత్రి సమస్యలు లేని సరిౖయెన మార్గాన్ని మ్యాప్ చేస్తుంది. మెట్రో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా క్యూలో సమస్యలు లేకుండా చేస్తుంది. దాదాపు మూడు మిలియన్ల డౌన్లోడ్లతో ‘యాత్రి’ ఇప్పుడు ముంబైతో సహా. దిల్లీ, కొచ్చి, కాన్పూర్, పుణే నగరాల్లో అందుబాటులో ఉంది.నిరంతరంనగర జనాభాలో సగం మంది రైళ్లలో ప్రయాణిస్తారు. విద్యార్థుల నుంచి శ్రామికుల వరకు ఎన్నో వర్గాల ప్రయాణికులు ఉంటారు. అన్ని వర్గాల ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని యాప్‌కు సంబంధించిన యూఐని రూపొందించాం. తక్కువ డేటా కనెక్టివిటీ, వ్యక్తుల డిజిటల్ అక్షరాస్యతను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఎప్పటికప్పుడూ ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటూ యూఐనీ నిరంతరం మెరుగుపరుస్తున్నాం.– లఖీ సకరియ, రీవ సకరియ, యాత్రి–ఫౌండర్స్ -
నమ్మండి ప్లీజ్..ముగ్గురు కవలలకు జన్మనిచ్చా..! కంగుతిన్న వైద్యులు
డాక్టర్లు అనునిత్యం ఎంతో మంది రోగులకు చికిత్స అందిస్తుంటారు. కానీ వాళ్ల అనుభవంలో ఏదో ఒక విచిత్రమైన కేసు సవాలు విసురుతూనే ఉంటుంది. కొన్ని వాళ్ల వైద్య వృత్తికే అందని విధంగా ఉంటే..మరికొన్ని అత్యంత మిరాకిల్‌గా ఉంటాయి. అలాంటి వింత కేసే ఈ టీనేజర్ పేషెంట్‌ది. ఆమె చెబుతున్న మాటలకు వైద్యులు సైతం ఒక్క క్షణంపాటు అయోమయానికి గురయ్యారు. అసలేం జరిగిందంటే.. ఫ్రాన్స్‌లోని లియాన్‌కు చెందిన 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయి క్లేలియా వెర్డియర్ మూడువారాల కోమా తర్వాత కళ్లు తెరిచింది. ఆమె పలికిన మొదటి మాటలకు ఒక్కసారిగా వైద్యలు కంగుతిన్నారు. అంతేగాదు ఆ అమ్మాయి అడుగుతున్న మాటలకు సమాధానం చెప్పలేక గందరగోళానికి గురైంది ఆస్పత్రి సిబ్బంది. కోమా నుంచి మేల్కోని తొలిసారిగా ఆమె ఏం మాట్లాడిందంటే.." ప్లీజ్ నా కుమార్తెలను తీసుకురండి నేను వాళ్లని చూడలంటూ తల్లడిల్లిపోయింది". ఇదేంటి ఈ యువతికి పెళ్లికాలేదు, పైగా పిల్లలు అంటూ వాళ్లని పేర్లతో పిలవడంతో ఒక్కసారిగా వైద్యులు విస్తుపోయారు. ఒక్క క్షణం అసలు ఏం జరుగుతోందో తెలియక సతమతమయ్యారు. ఆ యువతి వాళ్లను ఒక్కసారి తన వద్దకు తీసుకురమ్మని అర్ధించడం అందర్నీ కలవరపాటుకు గురిచేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె ఇప్పటి వరకు ఎప్పుడు గర్భవతి కాలేదని వైద్యులు ధృవీకరించారు. పైగా ఆమె ఏడేళ్లుగా తన పిల్లలను చూసుకుంటున్నట్లు చెబుతోందంతా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమె మెదడు సృష్టించుకున్నదేనని తేల్చేశారు వైద్యులు. ఆమె గతేడాది జూన్ 2025లో అధిక మోతాదులో మందులు తీసుకుని ఆత్మాహత్యయత్నంకు ప్రయత్నించిందని, ఆ మందుల ప్రభావం కారణంగా మూడు వారాలపాటు కోమాలో ఉందని చెప్పుకొచ్చారు వైద్యులు. అయితే ఆ యువతి మాత్రం వైద్యులు తనని ప్రేరేపిత కోమాలో ఉంచారని, తనకు పిల్లలు ఉన్నారని, ప్రసవ వేదన కూడా అనుభవించానని చెబుతుంది. పైగా ఆమెకు ముగ్గురు కవల కుమార్తెలు పుట్టారని చెబుతోంది. కేవలం పుట్టుక మాత్రమే కాదు ఆ తర్వాత జీవితం గురించి అలవోకగా చెప్పేస్తుంది. వాళ్లను ఎలా పెచ్చింది, వాళ్లకు పెట్టిన పేర్లతో సహా చెప్పయడంతో విస్తుపోవడం వైద్యులు వంతైంది. పైగా తన కూతుళ్ల పేర్లు మిలా, మైల్స్, మైలీ అని పెట్టినట్లు తెలిపింది. అయితే మైలీ పుట్టిన కొద్దిసేపటికే చనిపోవడంతో చాలా ఏడ్చానని, మిగతా ఇద్దరికి తానే పాలివ్వడం నుంచి పెంచి పెద్ద చేయడం వరకు గుర్తుందని వాళ్లకు ఏడేళ్లు ఉంటాయని చెబుతూ ప్లీజ్ వాళ్లని పిలవండి చూడాలి అంటూ అడగడం అందర్నీ కంటతడి పెట్టించింది. అచ్చం అమ్మలా తల్లడిల్లిన తీరు అందరి హృదయాలను మెలిపెట్టింది. కానీ వైద్యలు మాత్రం మెదడుకు తీవ్రమైన గాయం అయితే.. తర్వాత కోమాలో కలలు రావడం సర్వసాదరణమేనని చెబుతున్నారు. కోమాలో ఉన్న రోగులకు చీకటి గానీ, నిద్ర గానీ అనుభవంలోకి రావు. చాలామందికి స్పష్టమైన, వివరమైన కలలు వస్తాయని, అవి పూర్తిగా రియల్‌గా అనిపిస్తాయని చెబుతుండగా, మరికొందరు మాత్రం అసలు ఏ జ్ఞాపకం లేకుండా మేల్కొంటారు. అయితే సదరు యువతి క్లేలియా మాత్రం నా కూతుళ్లు ఇప్పటికీ గుర్తొస్తున్నాంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. అంతేగాదు ఆమెకు కోమాలోంచి మేల్కోగానే పిల్లల పేర్లే కలవరించింది గానీ తన పేరుగానీ, తన తల్లిదండ్రుల పేర్లుగానీ ఆమెకేం గుర్తులేకపోవడం బాధకరం. పైగా తను తల్లిగాదని, పిల్లలు లేరని వైద్యులు చెప్పిన వెంటనే షాక్‌కి గురయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా తన తల్లిదండ్రులను, తన పేరుని గుర్తు తెచ్చుకుంది. కానీ ఇది జరిగి ఏడాది కావొస్తున్నా..ఇప్పటికీ క్లేలియా మాత్రం తాను పిల్లల తల్లిననే అని భావిస్తోంది, వాదిస్తోంది. పైగా ఇంకా ఆ బాధ తన నుంచి పోలేదని అంటోంది.(చదవండి: స్టూడెంట్ సాహసం..!జస్ట్ రూ. 16 వేలతో..) -
కేన్స్‌లో తొలిసారిగా భక్తి సందేశం..!
ఫ్రాన్స్‌లో జరుగుతోన్న కేన్స్ చిత్రోత్సవంలో భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన సినీ తారలు పాల్గొని, తమ అందచందాలతో అదరగొడుతున్నారు. మంగళవారంతో ఆరంభమైన ఈ ఫెస్టివల్ ఈ నెల 23తో ముగుస్తుంది. ఇప్పటికే భారత్ నుంచి బాలీవుడ్ నటి అలియా భట్ రెడ్ కార్పెట్‌పై మెరిసింది. మరో నటి ఊర్వశీ రౌతేలా కూడా క్రిస్టల్ గౌనుతో అదరహో అనిపించారు. కానీ తొలిసారిగా ఈ ప్రపంచ వేదికపై భారతీయ ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. ప్రముఖ గాయని, నటి, మోడల్ ఆర్తి ఖేతర్పాల్ కేన్స్ రెడ్ కార్పెట్‌పైకి బృందావన్ భక్తి స్ఫూర్తిని తీసుకువచ్చారు. ఆమె డిజైనర్ సులక్షణ మోంగా రూపొందించిన ప్రత్యేక బృందావన్ లెహంగాను ధరించారు. పైగా ఆ డిజైనర్ వేర్కి జతగా శ్రీకృష్ణుడి చిత్రంతో కూడిన జపమాల సంచి, తులసీ కంఠి మాలను జతచేశారు. ఆ సంప్రదాయ లెహంగాకు అనుగుణంగా పోల్కీ బ్రాస్లెట్, రాళ్ల నెక్లెస్, చెవిపోగులను ధరించారు. ఆమె తన వెంట చిన్న పవిత్ర భగవద్గీత ప్రతిని కూడా తీసుకువచ్చారు. ఈ ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలో తొలిసారి ఇలా సనాతన ధర్మాన్ని గర్వంగా చూపించడం. ఆ క్రెడిట్ నటి ఆర్తి ఖేతర్పాల్కే దక్కుతుంది. తన భక్తి మేళవింపుతో ఉన్న తన ఫ్యాషన్ స్టైల్ దేవుడిని విశ్వసించే ప్రతి మానవునికి, జపం నేర్పే గురువులు, సాధువులందరికీ, భగవద్గీతను రచించిన వేదవ్యాసునికి, అలాగే వేద గ్రంథాలను భవిష్యత్తుతరాలకు అందేలా చేస్తున్న ప్రచురణ సంస్థలకు, అలాగే ఫ్యాషన్లోకి భక్తి విశ్వాసాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న డిజైనర్లకు అంకితం అని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారామె. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారామె. కాగా, ఈ నటి 'సౌండ్స్ ఆఫ్ కుంభ' అనే ఆల్బమ్‌లో కనిపించారు, ఇది 2026 గ్రామీ అవార్డులకు నామినేషన్ పొందింది. ఈ ఏడాది ప్రారంభంలో, కూడా ఆర్తి ఇదే విధంగా గ్రామీ అవార్డులకు బృందావన అంశాలను తీసుకువచ్చారు. ఆ వేడుకలో ఆమె లడ్డూ గోపాల్, లేదా బాలకృష్ణుడు ఉన్న నెక్లెస్ ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. డిజైనర్లకు పురాణాలు, ఆధ్యాత్మికత అనేవి రోజురోజుకూ ప్రజాదరణ పొందిన ఇతివృత్తాలుగా మారడం విశేషం. ప్రముఖులు హిందూ దేవతల చిత్రాలను, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలలోని శ్లోకాలను ధరించి కనిపిస్తున్నారు. రామ నవమి నాడు, నీతా అంబానీ కూడా ఇలానే భక్తిని స్ఫురించేలా ఇకాత్ చీరను ధరించారు. ఆ చీరపై రామ శిల స్ఫూర్తితో రూపొందించిన మొజాయిక్ ఉంది, అలాగే "రామ్" అనే పదం అనేక భాషలలో లిఖించి ఉంది.(చదవండి: కేన్స్‌లో అందమైన గులాబీలా అలియా భట్) -
బీపీని నియంత్రణలో ఉంచే ‘3-3-3’ రూల్ అంటే..?
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి రక్తపోటు(బీపీ). దీనితో ముడిపడి చాలా రకాల ప్రమాదకర వ్యాధులు ఉన్నాయి. అందువల్ల వైద్యులు ప్లీజ్ బీపీని నియంత్రణలో ఉంచుకోండి, ‘ఉప్పు తక్కువ తినండి’ అని సదా చెబుతుంటారు. నిజానికి ఈ ఒక్క సాధారణ సలహా అన్ని వేళలా సముచితం కాదు. మందుల తోపాటు జీవనశైలిని ప్రభావితం చేసే ఈ 3-3-3 రూల్‌ని అనుసరిస్తే బీపీ దెబ్బకు నియంత్రణ ఉంటుందని నమ్మకంగా చెబుతున్న ఆరోగ్య నిపుణులు. మరి అదెలాగో సవివరంగా చూద్దామా.!.చాలామంది రోగులు ఎక్కువగా మందులపై ఆధారపడుతుంటారు. దానికంటే అర్థవంతమైన జీవన మార్పులతో ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జీవనశైలిని మంచిగా ప్రభావితం చేసే ఈ 3-3-3 రూల్ రక్తపోటుని చాలా సులభంగా నియంత్రణలో పెట్టగలదని అంటున్నారు. మరి ఈ రూల్ ఎలా సహాయపడుతుందంటే..సాధారణంగా ఉప్పు తక్కువ, వ్యాయమాలు అధికం వంటి సలహాలను రోగులు నిలకడగా పాటించాలంటే కష్టం. అలగే కేవలం ఉప్పు అధికంగా తీసుకోవడం వల్లే అధిక రక్తపోటుకి దారితీయడం లేదంటున్నారు. ఇన్సులిన్ నిరోధకత, జీవక్రియ లోపాలు వంటి కారకాలతో కూడా ముడిపడి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. జీవక్రియ లోపం కారణంగా శరీరంలోని కణాలు ఇన్సులిన్కి సరిగ్గా స్పందించడం మానేస్తాయి. దాని ఫలితంగా శరీరం సోడియం నీటిని నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతో రక్తనాళాలు గట్టిపడి, శరీరంలోని సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ చురుకుగా మారుతుంది. అంటే అంతర్లీనంగా ఉన్న జీవక్రియ లోపానికి చికిత్స తీసుకోకుండా కేవలం ఉప్పు తగ్గస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు నిపుణులు.‘3-3-3’ రూల్ అంటే..ఇందులో మొదటిది ఆహారం, రెండోది, రోజువారీ అలవాట్లు, మూడోది ఆరగ్యో తనిఖీలుగా విభజించి ఆరోగ్యంగా ఉండేలే చేసే హెల్దీ సూత్రం ఇది.1. మొదటి ‘3’ ఆహారపు అలవాట్లు(1) కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించడం..తెల్ల రొట్టె, బిస్కెట్లు, నమ్కీన్, స్వీట్లు, చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన తృణధాన్యాలు - ఇవి రోజంతా పదేపదే ఇన్సులిన్‌ను పెంచుతాయి. ఇలా ఇన్సులిన్ అధికంగా ఉండటం అనేది అధిక రక్తపోటుకు దారితీసే కారణాలో ఒకటి. వీటికి దూరం చేసే ఒక్క మార్పు రక్తపోటును గణనీయంగా తగ్గించడంలో అత్యంత ప్రభావంతంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.(2) ప్రతి భోజనంలో ప్రోటీన్ తీసుకోండిప్రతి భోజనంలో గుడ్లు, పనీర్, చికెన్ లేదా చేపల నుండి 25 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. తగినంత ప్రోటీన్ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లపై కోరికలను తగ్గిస్తుంది, అలాగే శరీరాన్ని ఇన్సులిన్-సెన్సిటివ్‌గా మార్చే కండర ద్రవ్యరాశికి మద్దతు ఇస్తుంది.వాస్తవానికి చాలా మంది భారతీయ అల్పాహారాలు మరియు మధ్యాహ్న భోజనాలలో ప్రోటీన్ ప్రమాదకరంగా తక్కువగా ఉంటుంది.(3) ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడందేశీ నెయ్యి, వెన్న, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, ఇవి రక్తపోటును పెంచవు. ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనది.2. రెండో ‘3’ డైలీ దినచర్య..(1) రోజువారీ అలవాట్లుకేవలం కార్డియో మాత్రమే కాకుండా, రెసిస్టెన్స్‌తో కదలండిఇవి వారానికి మూడు సెషన్లు, ఒక్కోసారి 30-40 నిమిషాలు చేయడం, కేవలం నడవడం కంటే రక్తనాళాలకు ఎక్కువ మేలు చేస్తుంది.(2) కూర్చోవడాన్ని తగ్గించడంఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా కూర్చోవడాన్ని సాయంత్రం నడకతో సరిచేయలేము.ప్రతి గంటకు 2-3 నిమిషాలు నిలబడి కదలండి.(3) శ్వాసపై ఫోకస్ప్రతిరోజూ 5-10 నిమిషాల పాటు నెమ్మదిగా శ్వాస తీసుకోండి.నిమిషానికి ఆరుసార్లు, ముక్కు ద్వారా గాలి లోపలికి పీల్చి, నెమ్మదిగా బయటకు వదలండి.క్రమబద్ధమైన శ్వాస సిస్టోలిక్ బీపీని తగ్గిస్తుంది.3. మూడో ‘3’ వారంతపు తనిఖీలేప్రతి వారం తనిఖీ చేయవలసిన 3 విషయాలు(1) బీపీ చెకింగ్వారానికి కనీసం రెండుసార్లు ఇంట్లోనే బీపీ చెక్ చేయడంఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చున్న తర్వాత, ఒకే చేతికి, ఒకే సమయంలో కొలవండి.(2) నడుము కొలతముఖ్యంగా దక్షిణాసియా వ్యక్తుల శరీరాల BMI కంటే నడుము-ఎత్తు నిష్పత్తి జీవక్రియ ప్రమాదాన్ని స్పష్టంగా అంచనా వేస్తుంది. మీ నడుమును మీ ఎత్తులో సగం కంటే తక్కువగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.(3) మంచి నిద్ర..కనీసం ఏడు గంటలు నిద్ర ఉండేలా చేసుకోవాలి. లేదంటే నిద్రలేమితో బాధపడే వారి శరీరాలు కార్టిసాల్‌పై ఆధారపడి పనిచేస్తాయి, ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచి, బీపీని అధికం చేస్తాయి.ఈ ‘3-3-3’ రూల్ మందులకు ప్రత్యామ్నాయం కాదని చెబుతున్నారు వైద్యులు. మందుల తోపాటు..జీవనశైలిలో ఈ రూల్‌ని అప్లై చేస్తే..సమర్థవంతంగా బీపీ నియంత్రణలో ఉండటమే గాక వివిధ అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?) -
ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్‌వాదీ ర్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్ ఓ ఫిట్నెస్ ఫ్రీక్. నిత్యం జిమ్ చేస్తూ ఉండటంతోపాటు లక్నోలో అనేక హై ఎండ్ వ్యాయామశాలలను ప్రారంభించాడు. కండలు తిరిగి, కమ్మెచ్చులు తేలి అత్యంత ఫిట్‌గా ఉండే తన దేహంతో రాష్ట్రవ్యాప్తంగా జిమ్ కల్చర్ ప్రమోషన్‌కు కారణమయ్యాడు. ఈనెల 13న ప్రతీక్ యాదవ్ ఆకస్మికంగా మృతి చెందడం చాలామందిని విషాదంతో పాటు ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరణించే నాటికి అతడి వయసు కేవలం 38 ఏళ్లు మాత్రమే. అటాప్సీ రిపోర్టులో అతడి దేహ స్వభావంలో రక్తపు ఉండలు ఏర్పడే స్వభావం ఉందనీ... దాంతో ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అనే ఆరోగ్య సమస్య కారణంగా పల్మునరీ ఎంబాలిజమ్ అనే కండిషన్ ఏర్పడి... అది అతడికి మరణం సంభవించిందనే నివేదిక వచ్చింది. డీవీటీ అంటే... దేహంలోని రక్తనాళాల్లో... ప్రధానంగా చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ (డీవీటీ)గా చెబుతారు. డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది చాలా ప్రమాదకమైన పరిస్థితి. దేహంలోని రక్తనాళాలన్నింటిలోనూ ఇది కనిపించే అవకాశం ఉన్నప్పటికీ కాలి సిరల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి 20 మందిలో ఒకరికి... తమ జీవితకాలంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ బాధపెడుతుంది. పల్మునరీ థ్రాంబో ఎంబోలిజమ్లో ఏం జరుగుతుందంటే... రక్తనాళంలో ఏర్పడ్డ గడ్డ (క్లాట్) లేదా రక్తపు ఉండ... కొన్నిసార్లు అలా రక్తప్రవాహంలో కొట్టుకుపోతూ... పంపింగ్ కోసం గుండెలోని కుడి భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి ఆక్సిజన్‌ను నింపుకోడానికి పల్మునరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తులకు రక్తం వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో పల్మునరీ ఆర్టరీలో రక్తపు ఉండ ఇరుక్కుపోవడం జరిగితే... బ్లడ్ సర్క్యులేషన్ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. దీన్ని పల్మునరీ ఎంబోలిజమ్ అంటారు. ఇలా జరగడం వల్ల కొన్నిసార్లు తక్షణం మరణం కూడా సంభవించవచ్చు. డీవీటీ లక్షణాలు... డీప్ వీన్ థ్రాంబోసిస్‌తో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రతి ఒక్కరిలోనూ అవే లక్షణాలు కనిపించక΄ోవచ్చు. పైగా లక్షణాల తీవ్రతలోనూ (మరీ ముఖ్యంగా డీవీటీ తొలి దశల్లో) మార్పులుంటాయి. రక్తపుగడ్డ చాలా చిన్నదిగా ఉంటే కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. కొందరిలో సమస్య దానంతట అదే సమసి΄ోవచ్చు కూడా. అయితే కొందరిలో కనిపించే లక్షణాలివి... రక్తం గడ్డ కట్టిన చోట చర్మం వాపు (ముఖ్యంగా కాలు, పాదం వంటివి) చర్మం ఎర్రబారడం, అక్కడ వేడిగా ఉన్నట్లు అనిపించడం ఒక్కోసారి చర్మంలోంచి రక్తనాళాలు కనిపించడం డీవీటీ కాల్లో ఏర్పడినప్పుడు కాలు బలహీనంగా ఉన్నట్లు అనిపించడం రక్తనాళాలు గట్టిబారడం నివారణ: ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. అంటే మంచి సమతులాహారం తీసుకోవడం అంటే పొట్టుతీయని కాయధాన్యాలూ (హోల్‌గ్రెయిన్స్), ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకుంటూ బరువు పెరగకుండా చూసుకోవడం. క్రమ తప్పకుండా వ్యాయామం చేయడం. (రోజుకు కనీసం 30 – 45 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల రక్తప్రవాహం సాఫీగా మారి రక్తపు గడ్డలు ఏర్పడటం తగ్గుతుంది). తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ దేహాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం. దీంతో రక్తం పలుచబారి ఉండలు అడ్డుపడకుండా సాఫీగా సాగి΄ోయే అవకాశాలు ఎక్కువ. ఒకేచోట కుదురుగా కూర్చుని ఉండకుండా, చురుగ్గా కదులుతుండటం. ఇలా కదులుతున్నప్పుడు కాసేపు నడక, స్ట్రెచ్చింగ్ వంటివి చేస్తూ ఉండటం. దూరప్రయాణాలు చేస్తున్నప్పుడు అదేపనిగా వాహనంలో కూర్చుని ఉండకుండా తరచూ బ్రేక్ తీసుకుంటూ ఉండటం. ∙రక్తనాళాల్లో రక్తప్రవాహం సాఫీగా సాగేందుకు కంప్రెషన్ స్టాకింగ్ వంటివి వాడటం. చికిత్స : డీప్ వీన్ థ్రాంబోసిస్ చికిత్సలో... దాంతో పాటు నివారణ చర్యలూ తప్పనిసరి. ఈ చికిత్స తీవ్రతను బట్టి ఉంటుంది. డీవీటీ వచ్చే అవకాశాలున్నవారు తొలిదశల్లో సపోర్ట్ స్టాకింగ్స్ / కంప్రెషన్ స్టాకింగ్స్ వాడటం.బ్లడ్ థిన్నర్స్ వాడటం : యాంటీ కోయాగ్యులెంట్స్ అని పిలిచే రక్తాన్ని పలచబార్చే మందులు వాడటం. క్లాట్ బస్టర్స్ / థ్రాంబోలైటిక్స్ చికిత్స : చిన్న పైప్ (క్యాథెటర్) ద్వారా రక్తం గడ్డకట్టిన చోటికి థ్రాంబోలైటిక్స్ అని పిలిచే మందును పంపి, రక్తపుగడ్డను చెదరగొట్టే ఈ ఔషధాల్ని వాడటం.ఇప్పుడు తాజాగా సక్షన్ ను ఉపయోగించి రక్తపు గడ్డను బయటకు లాగేసి, రక్తపు ఉండను తొలగించడం ద్వారా కూడా చికిత్స అందిస్తున్నారు. ఈ డీవీటీ ముప్పు ఉన్నప్పుడు రక్తపు ఉండలు ఏర్పడే స్వభావం ఉన్నవారు నిరంతరం డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ వైద్యులు చెప్పిన విధంగా ఫాలో అప్‌లో ఉండటం చాలా ముఖ్యం. – యాసీన్ (చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే) -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)...మరింత సహజంగా
‘రోబో’ సినిమాలో చిట్టి(రోబో) దూకుడు చూసి... ‘అయ్ బాబోయ్... ఎంతైనా యంత్రం యంత్రమేనండీ. అది మనిషిలా ఎందుకు స్పందిస్తుంది!’ అనుకున్నాం. ఏఐ టూల్స్ మొదట్లో అబ్బురపరిచినా... మనుషులతో పోల్చితే ఎక్కడో ఏదో లోపం కనిపించడం మొదలైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ.ఐ. టూల్స్‌లో సహజమైన మానవీయ స్పందనలు తీసుకురావడానికి ‘ఇంటరాక్షన్ మోడల్స్’తో నడుం కట్టారు ‘ఓపెన్ ఏఐ’ మాజీ సీటీవో, ‘థింకింగ్ మెషిన్ ల్యాబ్స్’ ఫౌండర్ మీరా మురాటి.... ఏ.ఐ. విప్లవ కాలంలో ఉన్నాం మనం. అయితే ఏఐ అనేది చాలావరకు వాకి–టాకిలా పనిచేస్తోంది అనే అభిప్రాయం ఉంది.భవిష్యత్ సూచనమనం ఏదైనా అడుగుతాం. ఆగి, విని, ఆలోచించి చివరికి సమాధానం ఇస్తుంది ఏఐ సాధనం. ఆ తర్వాత మళ్లీ వేచి చూస్తుంది. చాట్‌జీపీటి, జెమిని, క్లాడ్, గ్రోక్... ఏది ఉపయోగిస్తున్నా దాదాపుగా ప్రతి ఏఐ సాధనం ‘టర్న్–బేస్డ్’ నమూనానే అనుసరిస్తోంది. మొదట మనుషులు మాట్లాడతారు. ఆ తరువాత యంత్రాలు స్పందిస్తాయి. ఈ విధానంపై సిలికాన్ వ్యాలీలోని ఏఐ దిగ్గజాలు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ రంగానికి సంబంధించి ‘భవిష్యత్‌లో ఏం జరగబోతుంది?’ అనేదానికి సంబంధించి ‘థింకింగ్ మెషిన్ ల్యాబ్స్’ ఒక సిగ్నల్ ఇచ్చింది. కేవలం ప్రాంప్ట్‌లకు సమాధానం ఇవ్వడానికి కాకుండా, సూచనల కోసం వేచి చూసే చాట్‌బాట్‌లా కాకుండా కొలీగ్‌తో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి సహజత్వాన్ని ఏఐ సాధనాలలో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది మీరా మురాటి.ఇక ముందు అలా ఉండదు!ఏఐ సాధనాలు ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తాయి. వినియోగదారులు(యూజర్లు) మాట్లాడినప్పుడు లేదా టైప్ చేసినప్పుడు మోడల్ ఆ అభ్యర్థనను ప్రాసెస్ చేసి ఆ తర్వాతే స్పందిస్తుంది. ఈ విధానాన్ని మార్చడానికి సంభాషణలను 200–మిల్లీ సెకన్ల చిన్న చిన్న భాగాలుగా ప్రాసెస్ చేసే సిస్టమ్‌లతో ప్రయోగాలు చేస్తోంది మీరా కంపెనీ థింకింగ్ మెషిన్ ల్యాబ్స్. దీనివల్ల వ్యక్తి మాట్లాడుతుండగానే ఏఐ స్పందించగలుగుతుంది.తక్కువ లేటెన్సీ అంటే...‘ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అభిప్రాయం ఏర్పడడానికి సంభాషణ మొత్తం పూర్తి కానక్కర్లేదు. ఇక ఏఐ సాధనాల విషయానికి వస్తే... అవి సంభాషణ మొత్తం ముగిసే వరకు వేచి ఉండి దానిని ప్రాసెస్ చేసి, ఆ తరువాతే దాని గురించి ఆలోచిస్తాయి. తక్కువ లేటెన్సీ అంటే ఒక కంప్యూటింగ్ సిస్టమ్ లేదా నెట్వర్క్ తక్కువ ఆలస్యంతో ప్రతిస్పందించే సామర్థ్యం. ఈ నేపథ్యంలో మీరా మురాటి థింకింగ్ మెషిన్ ల్యాబ్స్ ప్రయోగాలు అతిపెద్ద బలంగా మారనున్నాయి. థింకింగ్ మెషిన్ ల్యాబ్స్‌కు సంబంధించి రియల్–టైమ్ ఇంటరాక్షన్ సిస్టమ్, ఇంటరాక్షన్ మోడల్స్ విషయానికి వస్తే మనతో మాట్లాడుతూనే ఈ మోడల్ ఆలోచించగలదు. చూడగలదు. ఇది చాలా శక్తిమంతమైన మోడల్’ అంటున్నారు ఏఐ ఎక్స్పర్ట్, ది కటింగ్ ఎడ్జ్ గ్రూప్ వ్యవస్థాపకుడు అన్ష్ మెహ్రా.భారీ మార్పుఏఐ రూపాన్ని గణనీయంగా తీర్చిదిద్దడంలో ఇంటరాక్షన్–మోడల్స్ కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఆదేశాలను ఎలా టైప్ చేయాలో, సమర్థవంతంగా ఎలా శోధించాలో, సూచనలను ఎలా ఇవ్వాలో యంత్రాలకు నేర్పించాం. ఇప్పుడు ఆ యంత్రాలు మావవ ప్రవర్తన, స్పందనలకు మరింత సహజంగా అలవాటు పడేలా చేయడానికి ....‘టు మేక్ ఏఐ ఫీల్ లెస్ మెషిన్ అండ్ మోర్ హ్యూమన్’ నినాదంతో మీరా మురాటి మానస పుత్రికలు ‘ ఇంటరాక్షన్ మోడల్స్’ రంగం మీదికి వచ్చాయి. భారీ మార్పు... ఇంటరాక్షన్– స్మాల్‘ ఇంటరాక్షన్ మోడల్స్ రూపంలో భారీ మార్పు సాంకేతికపరమైనది మాత్రమే కాదు తాత్విక పరమైనది కూడా’ అంటున్నారు నిపుణులు. ‘ఇంటరాక్షన్–స్మాల్’ అని పిలువబడే ఈ సిస్టమ్ ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది. దీని ఫలితాలు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.దీనిలో కొన్ని కీలక ఫీచర్లు...’ సీమ్‌లెస్ డైలాగ్ మేనేజ్మెంట్:మాట్లాడే మనిషి ఆలోచిస్తున్నారా, ఒత్తిడిలో ఉన్నారా...ఇలాంటి విషయాలను ఈ మోడల్ పరోక్షంగా ట్రాక్ చేస్తుంది.’వెర్బల్ అండ్ విజువల్ ఇంటర్జెంక్షన్స్: యూజర్లు మాట్లాడడం పూర్తి చేసే వరకు వేచి చూడకుండా, సందర్భాన్ని బట్టి ప్రతిస్పందించడానికి ఈ మోడల్ అనుమతిస్తుంది’సైమన్టెనీయస్లీ స్పీచ్‘లైవ్ ట్రాన్స్లేషన్’లాంటి సందర్భంలో యూజర్, మోడల్ ఒకే సమయంలో మాట్లాడేలా వీలు కల్పిస్తుంది.’ కంకరెంట్ టూల్ మాట్లాడుతూనే, వింటూనే శోధించడానికి, బ్రౌజ్ చేయడానికి, యుఐ (యూజర్ ఇంటర్ఫేస్) రూపొందించడానికి వీలుకల్పించే సాధనాలను ఏకకాలంలో ఉపయోగిస్తుంది.’ టైమ్ అవేర్నెస్సంభాషణల సమయంలో గడిచిన సమయాన్ని మోడల్‌కు తెలియజేస్తుంది. -
కలియుగ కల్పవృక్షం 'రావిచెట్టు'
భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే ప్రథమ తాంబూలం. చెట్టును, చేమను, పుట్టను, గుట్టను, రాతిని కూడా దైవ స్వరూపంగా భావించే ఉదాత్తమైన సంప్రదాయం మనది. ఈ వృక్ష సంపదలో అగ్రతాంబూలం అందుకునేది ‘రావి చెట్టు’. ఋగ్వేదం మొదలుకొని భగవద్గీత వరకు ప్రతిచోటా కొనియాడబడిన ఈ మహావృక్షాన్ని ‘కలియుగ కల్పవృక్షం’ అని ఎందుకు అంటారు. ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగానూ ప్రాణికోటిని రక్షించే ఈ అశ్వత్థ వృక్ష వైభవంపై ప్రత్యేక కథనం..సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వృక్షాలన్ని నేను రావి చెట్టును అని ప్రకటించిన ఈ వృక్షం సామాన్యమైనది కాదు.. త్రిమూర్తుల సమ్మేళనం. దీని వేర్లలో బ్రహ్మదేవుడు, కాండంలో శ్రీమహావిష్ణువు, అగ్రభాగంలో పరమశివుడు కొలువై ఉంటారని పురాణోక్తి. అందుకే ఈ చెట్టును పూజిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం.దోషాల నుంచి విముక్తికి...జీవితంలో ఎదురయ్యే గ్రహ దోషాలకు, పితృదోషాలకు రావి చెట్టు చెంత చక్కని పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శనిదేవుడు రావి చెట్టును వరమిచ్చాడని, ఎవరైతే శనివారం నాడు ఈ చెట్టును పూజించి దీపం వెలిగిస్తారో వారికి తన పీడ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున రావి చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా పితృదేవతలు తృప్తి చెందుతారని, తద్వారా వంశాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు.శాస్త్రీయ కోణంలో .. రావి చెట్టును కల్పవృక్షం అనడానికి కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి. ప్రకృతిలో 24 గంటల పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువును విడుదల చేసే ఏకైక వృక్షం రావి. దీని విశాలమైన నీడ పర్యావరణంలోని విష వాయువులను హరిస్తుంది. ఆయుర్వేదంలోనూ రావి బెరడు, ఆకులు, పండ్లను ఎన్నో మొండి వ్యాధుల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తారు. అందుకే ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధం.అనుగ్రహం పొందే మార్గం..ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక అశాంతితో బాధపడేవారు ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ‘ మంత్రాన్ని జపిస్తూ ఏడు ప్రదక్షిణలు చేయడం విశేష ఫలితాలనిస్తుంది. నమ్మకంతో చేసే ఈ చిన్న ప్రయత్నం అపారమైన మనశ్శాంతిని, కార్యసిద్ధిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ప్రకృతిని ప్రేమిద్దాం.. దైవత్వాన్ని పూజిద్దాం..! – పసుపులేటి వెంకటేశ్వరరావు (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..!
మన దక్షిణాదిన శుచీంద్రం ప్రముఖ శివ క్షేత్రాలలో ఒకటి. ఎంతో మహిమ గల శైవదేవాలయం. స్వర్గాధిపతి దేవేంద్రుడు శాపవిమోచన పొందిన స్థలం. మరి మనకి కూడా తెలిసీ తెలియక చేసిన తప్పులకి ప్రార్థనతో పొదవచ్చు. స్త్రీవ్యామోహంతో శాపం పొందిన ఇంద్రుడు ఇక్కడ పాప మోచనం పొంది శుచిత్వం పొందడంతో శుచీన్ద్రం అని పేరు వచ్చింది. ఆ కథ, శుచీంద్ర క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. ఒకసారి అహల్య అందాన్ని చూసి మోహ పరవశుడు అయ్యాడు దేవేంద్రుడు. అప్పుడు ఇంద్రుడు తెల్లవారక ముందే కోడికూత వేసి గౌతమ మునిని స్నానానికి పం΄ాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతమ ముని వేషంలో అనసూయ దగ్గరకి వచ్చాడు. జరిగిన మోసం గ్రహించి గౌతమ ముని తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఇంద్రుడిని, అహల్యని చూసి శపించాడు. శిలగా మారిన అహల్య శ్రీ రాముని పాదస్పర్శ తగిలి ఇక్కడే శాప విమోచనం పొందింది. ఇక్కడే అత్రి మహా ఋషికి ఆశ్రమం ఉండేది అందుకే జ్ఞానారణ్యం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక చెట్టు మొదలు నరికినప్పుడు శివలింగం కనిపించింది. గొడ్డలి దెబ్బకి శివలింగం నుండి రక్తం కారసాగింది. ఇది దేవాలయ మూలస్థానంగా చెబుతారు. సుచీన్ద్రంలో మహాశివుని ప్రతిష్ట ఉన్నప్పటికీ త్రిమూర్తి సంకల్పం కూడా ఉంది. కారణం ఇక్కడ వృక్షాలలో త్రిమూర్తులు ఉన్నారు అని చెట్లకు పూజ చేస్తారు. తప్పు చేసిన వారు పాప పరిహారంగా సుచీన్ద్రుని దర్శించుకుని భక్తులు పాప విమోచనం పొందుతారు. సుచీన్ద్రుని ముందు మరుగుతున్న నేతిలో వెండి విగ్రహాన్ని వేస్తాడు పూజారి. తప్పు చేసిన వారు ఆ విగ్రహాన్ని చేతితో తీయాలి. పూజారి ఆ చేతిని వస్త్రంతో కట్టి మూడు రోజుల తరువాత విప్పుతాడు. చేతి చర్మం రంగు మారినా వ్రణం ఏర్పడినా ఆ వ్యక్తి తప్పు చేసినట్టుగా నిర్ధారిస్తారు. బ్రిటిష్ వారు ఈ విధానానికి స్వస్తి పలికారు. మహాభిషేకం సమయంలో భక్తులు రథం లాగుతారు. ఈ కార్యక్రమానికి సుచీన్ద్రం వాసులు ఎక్కడ ఉన్నా వచ్చి పాల్గొంటారు. ఆ విధంగా తమ పాప ప్రక్షాళనం చేసుకుంటారు. ఈ దేవాలయం శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి. ఇక్కడి స్తంభాలను మీటితే సప్తస్వరాల ధ్వని వినిపిస్తుంది. స్త్రీ రూపంలో చెక్కిన వినాయకుడు, రుద్రవీణ వాయిస్తున్న రావణాసురుడు, నోటిలో తిరుగుతున్న భూగోళం, రామాయణ మహాభారతాల రాతి శిల్పాలు... ఎంత చూసినా అద్భుతమే. మన దేశంలో లాటరీ విధానం ఇక్కడ నుండి ప్రారంభించారు అని అధికారిక పత్రాలు ఉన్నాయి ఇక్కడ. శుచీన్ద్రం రాజ గోపుర పునరుద్ధరణకు డబ్బు అవసరం ఏర్పడింది. అప్పటి తిరువనంతపురం రాజు గారి అనుమతితో ఒక రూపాయి లాటరీ టికెట్ అమ్మకం చేశారు. పదివేల రూపాయల బహుమతి. యాభై వేల టికెట్లు అమ్మారు. బహుమతి సొమ్ము పోను మిగిలిన డబ్బుతో ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయం మంచి పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. పచ్చని అడవితో పాలార్ నదీ ప్రవాహం, శిల్పకళా వైభవం మంచి అనుభూతినిస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నా కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళ టూర్ శబరిమల యాత్రలో సుచీన్ద్రం వెళ్లడం సులువు. కన్యాకుమారి నుండి 18, నాగర్‌కోయిల్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది సుచీన్ద్రం శివ క్షేత్రం. సుచీన్ద్రంలో అంతగా లాడ్జీలు లేవు. నాగర్‌కోయిల్‌లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. – ఇ.ఎస్. మాధవన్, విశాఖపట్నం(చదవండి: మైసూరు మహాదేవి చాముండేశ్వరి) -
స్టూడెంట్ సాహసం..!జస్ట్ రూ. 16 వేలతో..
ఓ వ్యక్తి తలచుకుంటే అనితర సాధ్యమైనదంటూ ఉండదు అని నిరూపించాడు ఈ విద్యార్థి. విలాసవంతమైన స్పాన్సర్లు, ఎలాంటి సాహసయాత్ర చేసిన నేపథ్యం లేకుండా ఎవరెస్టుని చుట్టేయలని ఉత్సాహం మాత్రం ఆకాశమంత. ఏదైతేనేం తన దగ్గర ఉన్న తక్కువ డబ్బుతోనే ఎవరెస్టు బేస్ క్యాప్‌కు చేరుకుని ఓ చిన్నపాటి విజయం సాధించాడు పైగా తన వయసు యువకులకు జస్ట్ ఊహాలాంటి డ్రీమ్‌ని సాధ్యం చేసి..పరిమిత వనరులు, ఆర్థిక పరిస్థితి, మార్గదర్శక లేమి వంటివి ఏమీ పెద్ద అడ్డంకులు కావని ప్రూవ్ చేశాడు. కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన 21 ఏళ్ల కేశవ్ సునీష్ బీకామ్ విద్యార్ధికి ఎవరెస్టుని అధిరోహించడం అతని డ్రీమ్. అలా అని బాగా ధనవంతుల కుటుంబ నేపథ్యమా? అంటే అదీ కాదు. పోనీ సాహసయాత్రలు చేసిన చరిత్ర ఉందా ?అంటే అదీ లేదు. కానీ ఎలాగైనా ఆకోరిక నేరవేర్చుకోవాలన్న ప్రగాఢమైన కోరిక ఒక్కటే బలంగా ఉంది. అదే అతడిని ఇంత పెద్ద సాహసానికి పూనుకునేలా చేసింది. అందుకోసం అతను కూరగాయ దుకాణంలో సహాయకుడిగా, ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసిన పోదుపుతో ఎవరెస్టు బేస్ క్యాంప్‌కు చేరుకున్నాడు. ఈ యాత్ర కోసం అతడ ఖర్చు చేసిందో ఎంతో తెలిస్తే విస్తుపోతారు. కేవలం రూ. 16 వేలతో ఈ డ్రిమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకున్నాడు. అంత తక్కువ డబ్బుతో ఎలా సాధ్యం అంటే..మనసుంటే మార్గం ఉందని అంటాడు కేశవ్. నిజానికి ఆ స్టూడెంట్ ఆశయం సాధరణమైంది కాదు. ఎందుకంటే ఎవరెస్టు యాత్రకు అయ్యే ఖర్చు సుమారు రూ. 15 లక్షలు. అయితే ఎవరెస్టు శిఖరాగ్రం అతడి స్థోమతకు అందనిది, అందుకని చిన్న చిన్న దశలుగా విభజించుకుని ఒక్కో మైలు రాయిని చేరుకునేలా ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా దాదాపు 5 వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు బేస్ క్యాంప్‌కు చేరుకున్నాడు కేశవ్. అలాగే తన స్థోమతకు అనుగుణంగా ఖర్చులు తగ్గించుకునేలా యాత్ర ప్లాన్ చేశాడు. సెకండ్ క్లాస్ రైళ్లు, బస్సుల్లో ప్రయాణించి సోనౌలి సరిహద్దు ద్వారా నేపాల్‌లోకి ప్రవేశించి, కాలినడకన యాత్ర కోసం సల్లేరికి చేరుకున్నాడు.దాదాపు ఎనిమిది రోజులు పైయా, టెంగ్బోచే, డింగ్‌బోచే, లుబుచేలా గుండా ప్రయాణిస్తూ..చివరకు ఎవరెస్టుబేస్ క్యాంప్‌కు చేరుకున్నాడు. అలాగే క్యాంప్‌కు సమీపంలో ఉన్న గోరక్షెప్కు చేరుకోవడానికి 132 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. మధ్యమధ్యలో టెంట్ వేసుకుని నిద్రించాడు కూడా. అలాగే తన బడ్జెట్‌కి అనుగుణంగా స్వయంగా వండుకుని ఆహారం తినేవాడు. ఈ యాత్రకు ఎన్నో అడ్డంకులు..అతడు ఈ యాత్రను సెప్టెంబర్ 2025లో ప్రారంభించాడు. జనవరిలో తన అమ్మమ్మ మరణింతో మధ్యలోనే తిరిగి వచ్చేశాడు, కానీ సంకల్పం వదులుకోలేదు. ఆ తర్వాత చిన్న చితకా ఉద్యోగాల్లో చేరి డబ్బు ఆదా చేసి ఏప్రిల్ 7న అధిరోహణ పునః ప్రారంభించాడు. అలా రెండో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకున్నాడు. అతడి కథ..చుట్టూ ఎలాంటి వనరులు లేకపోయినా..కనీసం మార్గనిర్దేశం లేకపోయానా..సాధించాలి అన్న తపన ఎవరెస్టు వరకు నడిపించింది. చాలా శ్రమకోర్చి సాధించిన విజయం ఇది. పైగా కేశవ్ జస్ట్ 21 ఏళ్లకే దాన్ని సాధించాడు. అయితే అతడు శిఖరాగ్రం చేరుకోకపోవచ్చు..సమీపం వరకు వెళ్లి అనుకున్నది సాధించాడు. నిజానికి ఎవరెస్టు శిఖరాగ్రం చేరుకోవడానికి బేస్‌క్యాంప్‌లో ఫిజికల్ శిక్షణ, వంటివి చాలానే ఉంటాయి. అయినా ఇంత సాధించిన కేశవ్‌కి అదేమంత కష్టమేమి కాదు. మరి అతడికి ఆల్‌ది బెస్ట్ చెబుదామా..! View this post on Instagram A post shared by Kesav Suneesh | Traveller 🇮🇳 (@kesav_on_go) (చదవండి: ట్రాక్టర్ డ్రైవర్ కుమారుడు స్పేస్ టెక్ కంపెనీ సీఈవోగా..!) -
రోజుకి రెండు పెగ్గులు పడాల్సిందే..కంట్రోల్ చేయడం ఎలా?
మా నాన్న గారికి 64 ఏళ్లు. చిన్న వయసు నుంచే మందుకు బాగా అలవాటు పడ్డారు. ఆయనకు బీపీ, షుగర్ లాంటి సమస్యలు ఉన్నాయి. కానీ మందు మానడు. ఏమంటారంటే డాక్టర్లే చెబుతారు కదా... రోజుకి రెండు పెగ్గులు తీసుకోమని అని వాదిస్తుంటాడు. ఈ మధ్యకాలంలో మేము గమనించింది ఏమిటంటే ఆయన చెప్పే వాటిలో చాలా వరకు అబద్ధాలు ఉంటున్నాయి, కానీ ఆయనకి ఆ విషయం అర్థం కావట్లేదు. ఆయన బాగా తూలుతున్నారు. మాటిమాటికి పడిపోవడం, దెబ్బలు తగిలించుకోవడం జరుగుతోంది. మూత్రంపై అదుపు ఉండట్లేదు. గత ఆరు నెలల నుంచి నిద్ర సరిగ్గా పోవట్లేదు. ఇట్లా ఉండి కూడా మందు మాత్రం మానలేదు. మేము దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్కి, న్యూరాలజిస్ట్‌కి కూడా చూపించాము. వాళ్లు మందులు రాసిస్తున్నారు కానీ ఎటువంటి మార్పు కనిపించడం లేదు. మీరు దీని గురించి ఏమైనా సలహా ఇవ్వగలరా?– రమేష్, యానాం మీ సమస్య విన్నాక చాలా బాధగా ఉంది. ముందుగా ఈ డాక్టర్లు రెండు పెగ్గుల గురించి చెప్పుకునే విషయం ఎలా వచ్చిందంటే, దీనికి ఒక ‘మెడిటెరేనియన్స్ డైట్’ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ డైట్లో ΄పాశ్చాత్యదేశాల్లో ప్రజలు ఎక్కువగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకుంటారు. అంటే తాజాపండ్లు, ఆకుకూరలు, సముద్రపు చేపలు లాంటివి. వీటిలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వాటితోపాటు కొందరు రోజుకు 30 నుంచి 60 ఎం.ఎల్. వరకు మాత్రమే వైన్ తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ కాదు. అలాగే రోజూ వ్యాయామం కూడా చేస్తుంటారు. ఈ మొత్తం జీవనశైలిని కలిపి ‘మెడిటేరియన్స్ డైట్’ అంటారు. దీనివల్ల గుండెజబ్బులు తగ్గుతాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. కానీ మన దగ్గర చాలామంది ఈ మొత్తం విషయాన్ని పక్కన పెట్టేసి ‘‘రోజుకి రెండు పెగ్గులు మంచిదట’’ అన్న ఒక్క మాటనే పట్టుకుంటారు. దీనినే సైకాలజీలో ‘సెలక్టివ్ అబ్స్ట్రాక్షన్’ అంటారు. నిజానికి మన దగ్గర చాలామంది ఒకటి లేదా రెండు పెగ్గులతో ఆగరు. సరైన డైట్ కూడా తీసుకోరు. తాగిన తర్వాత భోజనం మానేస్తారు. దాంతో శరీరంలో విటమిన్ బీ1 లోపం వస్తుంది. అలా వచ్చినప్పుడు మొదట్లో అయోమయం, నడకలో తేడా, తూలడం లాంటివి వస్తాయి. ఇవన్నీ మీ నాన్నగారిలో కనిపిస్తున్న లక్షణాలే. ఈ దశలోనే మందు పూర్తిగా ఆపి సరైన వైద్యం తీసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ తగ్గించవచ్చు. కానీ చాలామంది ఆల్కహాల్ తాగుతూనే ఉంటారు, మందులు సరిగా వాడరు. దానివల్ల మెదడుకి శాశ్వతంగా నష్టం కలుగుతుంది. మెదడులో జ్ఞాపకశక్తి , సమతుల్యతకి సంబంధించిన భాగాలు దెబ్బ తింటాయి. దీనివల్ల మతిమరపు వస్తుంది. గుర్తు లేక΄ోయినా, ఖాళీలను నింపడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇవి కావాలనే చెప్పే అబద్ధాలు కాదు. ప్రస్తుతం దీనిని తగ్గించేందుకు ప్రత్యేకించి మందేం లేదు కానీ అధిక మోతాదులో విటమిన్లు ముఖ్యంగా విటమిన్ బీ1 ఇవ్వాలి. నిద్ర కోసం కూడా కొంతవరకు మందులు అవసరం కావచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. ఇవన్నీ చేస్తే కొంతవరకు రికవరీ కనిపిస్తుంది. ఇంటి దగ్గర ఆయన్ని ఆపడం కష్టమైతే, మంచి రీహాబిలిటేషన్ కేంద్రంలో చేర్పించండి. అక్కడ క్రమపద్ధతిలో చికిత్స ఉంటుంది కాబట్టి ఆయన బాగుపడే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.సమస్య నుంచి రిలీఫ్కని కొందరు; సంతోషాన్ని సెలబ్రేట్ చేసేందుకని కొందరు ఏదో ఒక వంకతో డ్రింక్ తీసుకోవటం తరచుగా మనందరం చూసే విషయమే! వారందరికీ తాగటం ముఖ్యం. దానికోసం ఏదో ఒక కారణం వెతుక్కుంటారు కాబట్టి ఆల్కహాల్ ఏ రూపంలోనూ తీసుకోకుండా పూర్తిగా దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి కూడా మంచిది. (డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com )(చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే) -
ఎవరీ సుసాన్ ఇలియాస్? 145 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న..
నూట నలభై అయిదు సంవత్సరాల ఘనచరిత్ర ఉన్న సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చదువుకోవడమే గొప్పగా భావిస్తారు. అలాంటి ప్రతిష్ఠాత్మకమైన కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేసే అవకాశం రావడం ఎంత ఘనత! సెయింట్ స్టీఫెన్ కాలేజీకి తొలి మహిళా ప్రిన్సిపల్‌గా నియామకం కావడం ద్వారా ప్రొఫెసర్ సుసాన్ ఇలియాస్ చరిత్ర సృష్టించారు....రాబోయే జూన్‌లో సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం కానుంది. సుసాన్ ఇలియాస్ ఈ ప్రసిద్ధ కాలేజీ మొదటి మహిళా ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.మూడు దశాబ్దాల అనుభంఫిబ్రవరి 1,1881న దిల్లీలో స్థాపించిన సెయింట్ స్టీఫెన్ కాలేజీ మన దేశంలోని అత్యంత పురాతనమైన, ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. సెయింట్ స్టీఫెన్ కాలేజీ అంటే... తత్త్వశాస్త్రం, రాజనీతి, లిబరల్ ఆర్ట్స్... మొదలైన మానవీయ శాస్త్రాలకు ప్రసిద్ధి గాంచిన కాలేజీ. గతంలో ఈ కాలేజీలో పనిచేసిన వారికన్నా భిన్నమైన విద్యా నేపథ్యం నుంచి వచ్చారు సుసాన్. ఇంజినీరింగ్, కంప్యూటింగ్ పరిశోధనలలో ఆమెకు మూడు దశాబ్దాల అనుభం ఉంది. ‘ప్రిన్సిపల్‌గా సుసాన్ నియామకం సెయింట్ స్టీఫెన్స్కు అత్యాధునిక సాంకేతికతను తీసుకురాగలదని విశ్వసిస్తున్నాను’ అన్నారు కాలేజీ చైర్మన్ పాల్ స్వరూప్. ప్రిన్సిపల్ ఎంపిక సరిౖయెన విధానంలోనే జరిగిందని అంటారు స్వరూప్. ప్రిన్సిపల్ పదవి కోసం బహిరంగ ప్రకటన ఇవ్వడం, ఆ తర్వాత ఇంటర్వ్యూలు, షార్ట్‌లిస్టింగ్, అభ్యర్థుల ప్రజెంటేషన్ల తరువాత తుది ఎంపిక జరిగింది. ప్రిన్సిపల్‌గా సుసాన్ నియామకాన్ని ఒక మైలురాయిగా అభివర్ణించారు కాలేజీ అకడమిక్స్ డీన్, చరిత్ర విభాగాధిపతి మలయ్ నీరన్. సెయింట్ స్టీఫెన్ కాలేజీకి తొలి భారతీయ ప్రిన్సిపల్‌గా 1906లో సుశీల్ కుమార్ రుద్ర చరిత్ర సృష్టించారు. తాజాగా అలాంటి ఘనతను సుసాన్ సొంతం చేసుకున్నారు.ఉన్నతమైన బాధ్యతలుసుసాన్ చెన్నైలో పుట్టి పెరిగారు. ఆమె విద్యా, ఉద్యోగ ప్రస్థానానికి చెన్నై ప్రధాన కేంద్రంగా ఉంది. భారత్ ఇంజినీరింగ్ కాలేజీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్, అన్నా యూనివర్శిటీ నుండి మల్టీ మీడియా టెక్నాలజీలో మాస్టర్స్ ఆఫ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్‌లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేశారు. ఎన్నో ప్రైవేట్ యూనివర్శిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలలో ఉన్నతమైన బాధ్యతలు నిర్వహించారు. హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో పరిశోధన డైరెక్టర్‌గా, డిజిటల్ హెల్త్ అండ్ బయో–ఇన్నోవేషన్స్ సెంటర్‌కు హెడ్‌గా పనిచేశారు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (సెన్స్) డీన్‌గా, అదే సంస్థలో అడ్వాన్స్డ్ డేటా సైన్సెస్‌కు డిప్యూటి డైరెక్టర్‌గా పనిచేశారు. తర్వాతి కాలంలో ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఏఐ అప్లికేషన్లపై దృష్టి సారించారు. మెషిన్ లెర్నింగ్, ఎక్స్ప్లెయినబుల్ ఏఐ, మెడికల్ ఇమేజింగ్, ఫెడరేటెడ్ లెర్నింగ్, రోబోటిక్స్, డిజిటల్ హెల్త్‌లాంటి రంగాలలో పరిశోధనలు చేశారు. లక్నోలోని చండీగఢ్ యూనివర్శిటీలో ప్రో వైస్ చాన్సలర్(పరిశోధన)గా పనిచేశారు.ఇక ఏఐపై దృష్టిసెయింట్ స్టీఫెన్స్ ఎంతోమంది మేధావులు, నాయకులను తీర్చిదిద్దింది. తమ కాలానికంటే ముందే ఆలోచించే పరిశోధకులు, పారిశ్రామికవేత్తలకు ఈ కాలేజీ పుట్టిల్లు. క్వాంటం కంప్యూటింగ్ యుగంలోకి ప్రవేశించడానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకోవాలి. ఎందుకంటే అదే మన సమీప భవిష్యత్. ఈ కోర్సులు విద్యార్థులకు మాత్రమే కాదు డిజైనర్లు, న్యాయవాదులు, జర్నలిస్ట్‌లతో సహా వివిధ రంగాల వారికి ఉపకరిస్తాయి. ∙యూనివర్శిటీలో ఏఐ సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టనున్నాం. విద్యార్థులను ఏఐకి సిద్ధం చేయడానికి, క్వాంటంపై అవగాహన కలిగించడానికి ప్రిన్సిపల్‌గా పనిచేయడం అనేది గొప్ప అవకాశం. ∙కళాశాల ఘనమైన వారసత్వాన్ని కాపాడుతూనే, పరిశోధనలకు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని కల్పిస్తాం.– సుసాన్ ఇలియాస్ఎందరో ప్రతిభావంతులుభారతదేశ తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని, ప్రముఖ చరిత్రకారిణి ఉపిందర్ సింగ్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీ, నటి రీచా చద్దా, ప్రముఖ న్యాయవాది, ఉమెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ వృందా గ్రోవర్, నటి కొంకణ సేన్ శర్మ, ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా, సుప్రీం కోర్ట్ మాజీ జడ్జీ హిమా కోహ్లీ... సెయింట్ స్టీఫెన్ కాలేజీలో చదువుకున్న ఎంతోమంది ప్రతిభావంతులలో కొందరు. -
బీపీ చిక్కును తట్టుకునేది ఇలా!
బీపీ ఎక్కువగా ఉంది అని తెలియడం ఆలస్యం. ఉప్పు తగ్గించండి అనేస్తూంటారు డాక్టర్లు. ఏళ్లుగా వింటున్నామీ సలహాను. సరైందే కానీ... ఈ ఒక్క చర్యతోనే అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుందా? ఊహూ సాధ్యం కాదంటున్నారు... డాక్టర్ ఎరం రావు, డాక్టర్ జమునా ప్రకాశ్‌లు! .మరి... ఏం చేయాలి? ఏది సరైన మార్గం?... ప్రపంచ హైపర్‌టెన్షన్ డే (మే-17) నేపథ్యంలో ఈ విషయాలు తెలుసుకోవడం మీకు ఎంతైనా అవసరం.. దేశంలో రక్తపోటు బాధితుల సంఖ్య ఏటికేడాదీ పెరిగిపోతోంది. ఆహారపు అలవాట్లు ఇందుకు ముఖ్య కారణం. చాలామందికి చిన్నప్పుడే ఏర్పడే రుచి, అభిరుచులు సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం పెద్దలైతే రోజుకు రెండు వేల మిల్లీగ్రాముల సోడియం మాత్రమే తీసుకోవాలి. అంటే సుమారు ఐదు గ్రాముల ఉప్పు. అంతే. కానీ మన దేశంలో సగటు వినియోగం ఎనిమిది గ్రాముల వరకూ ఉన్నట్లు ఇటీవలి లెక్కలు చెబుతున్నాయి. కొందరిలో ఇది మరింత ఎక్కువగానూ ఉండే అవకాశం ఉంది. అయితే “ఉప్పు తగ్గించండి” అనే సలహా ఎందుకు రక్తపోటును తగ్గించడంలో పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు?ఇంటి వంటతోనూ చిక్కే...భారతీయులు తీసుకునే సోడియంలో 80 శాతం కంటే ఎక్కువ వంట లేదా భోంచేసేటప్పుడు వేసే అదనపు ఉప్పుతోనే వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ బయట తినే అలవాట్లు పెరుగుతున్నప్పటికీ, ఇంటి వంట ఇప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ద్వారా సోడియం ఎక్కువగా అందుతున్న దేశాల్లో ఉప్పు మోతాదును నియంత్రించడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు కానీ... దేశంలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ కుటుంబ సభ్యుల రుచులు, వయసు, అలవాట్లు అన్నీ కలిసి ఉంటాయి. అందుకే కేవలం “ఉప్పు తగ్గించండి” అనే సలహా సరిపోదు.అవగాహన పెరగాలి..ప్రజారోగ్య ప్రచారాలు సాధారణంగా ప్రజలకు ప్రమాదం తెలుసు, గుర్తు చేస్తే మార్పు వస్తుందని భావిస్తాయి. కానీ వాస్తవం అంత సులభం కాదు. ఒక జాతీయ సర్వే ప్రకారం, అధిక ఉప్పు ఆరోగ్యానికి హానికరం అని తెలిసిన పెద్దలు మూడో వంతు కన్నా తక్కువ. అవగాహన తక్కువగా ఉన్నప్పుడు “ఉప్పు తగ్గించండి” అనే సందేశం పట్టించుకునేలా ఉండటం లేదు. కారణం పూర్తిగా అర్థం కాకపోతే అలవాట్లను మార్చడం కష్టం.రుచిని పట్టించుకోవడం లేదు...రక్తపోటును నియంత్రించేందుకు ఉప్పు తగ్గించాలని చాలామంది చెబుతారు. ఏమేం తినకూడదో కూడా చెబుతూంటారు. కానీ... రుచిని మాత్రం పట్టించుకోరు. ఉప్పు తక్కువగా ఉన్న చప్పిడి ఆహారం చాలామందికి రుచిగా అనిపించదు. అందుకే వారు తక్షణ సంతృప్తినిచ్చేందుకు మనకు బాగా పరిచయమైన ఉప్పును మళ్లీ మళ్లీ వాడుతూంటారు. అందుకే... ఉప్పు వాడుతూనే రుచిని కాపాడటం ఎలా? అన్నదానిపై దృష్టి పెట్టి... క్రమేపీ సోడియం మోతాదును తగ్గించాల్సి ఉంటుంది. అంటే.. ఆహారం రుచిగా ఉండేలా చూసుకుంటూ, సోడియాన్ని నెమ్మదిగా తగ్గించడం.ఇక మనం ఏమి చేయాలి?1) దేశీ వ్యూహం... WHO లక్ష్యాలకు అనుగుణంగా, 2030 నాటికి భారతదేశం ప్రజల సోడియం వినియోగాన్ని 30% తగ్గించేందుకు వంటగదులు, పాఠశాలలు, మార్కెట్ వ్యవస్థలు — అన్నింటినీ కలిపే సమగ్ర ప్రణాళిక అవసరం. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉప్పు తగ్గించడం మాత్రమే కాకుండా, కుటుంబాలకు ఉపయోగపడే ఆచరణాత్మక మార్గదర్శకాలు కూడా అవసరం.2) సంస్థలతో ప్రారంభించాలి...పాఠశాలలు, హాస్టళ్లు, కాంటీన్లు, ప్రభుత్వ ఆహార పథకాలు వంటి సంస్థల ద్వారా అందించే ఆహారాన్ని ఒకేరకమైన మార్గదర్శకాల ద్వారా తయారు చేసి పంపిణీ చేయాల్సిన అవసరముంది. తద్వారా ఇక్కడ ఉప్పును క్రమంగా తగ్గిస్తే, ప్రజల “సాధారణ రుచి” భావన కూడా మారుతుంది. అప్పుడు ప్రతి ఇంట్లో ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం తగ్గుతుంది.3) తక్కువ ఉప్పుతో కూడా రుచిగా ఉండే పరిష్కారాలు ఇవ్వాలిఈ సందర్భంలో MSG (మోనోసోడియం గ్లూటామేట్) గురించి శాస్త్రీయంగా చర్చించాలి. MSGలో సుమారు 12% సోడియం మాత్రమే ఉంటుంది, కానీ సాధారణ ఉప్పులో 39% సోడియం ఉంటుంది. MSG “ఉమామి” అనే రుచిని ఇస్తుంది. తక్కువ ఉప్పుతో పాటు MSG వాడితే రుచి తగ్గకుండా సోడియాన్ని 40% వరకు తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. CSIR–CFTRI నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం, ఉప్పు–MSG మిశ్రమాలను ఉపయోగించడం ద్వారా వెజ్ బిర్యానీ, దాల్ సాంబార్, పనీర్ కర్రీ, మురుకు, సేవ్, ఆలూ భుజియా, బ్రెడ్, బన్స్, బిస్కెట్లు వంటి భారతీయ ఆహారాల్లో సోడియం ను 22–32% వరకు తగ్గించవచ్చు. బాధ్యతాయుతంగా ఉపయోగిస్తే, MSG వాడకం ఫుడ్ ఇండస్ట్రీకి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది.4) సోడియం గురించి చెప్పే విధానాన్ని మార్చాలి“ఉప్పు తగ్గించండి” అన్నదాని బదులుగా, “నెమ్మదిగా తగ్గించండి, రుచి అలాగే ఉంచండి” అనే సందేశం ఇవ్వాలి. చిన్నచిన్న మార్పులు ఎలా చేయాలి? ఉప్పు మళ్లీ వేసే ముందు రుచి చూసే అలవాటు ఎలా చేసుకోవాలి? సహజమైన రుచులను ఎలా పెంచుకోవాలి? ఇలాంటి ఆచరణాత్మక సూచనలు ఎక్కువకాలం కొనసాగుతాయి.5) అయోడైజ్డ్ ఉప్పు వాడకం.. భారతదేశంలో అయోడైజ్డ్ ఉప్పు వినియోగం చాలా విజయవంతమైంది. 2020–21 గణాంకాల ప్రకారం, 94.3% కుటుంబాలు సరైన అయోడిన్ కలిగిన ఉప్పును వాడుతున్నాయి. కాబట్టి లక్ష్యం- మొత్తం ఉప్పు వినియోగాన్ని తగ్గించడం, కానీ అయోడిన్ లోపం రాకుండా చూసుకోవడం. మొత్తమ్మీద... రక్తపోటును నివారించాలంటే, సోడియం తగ్గింపును చూసే విధానాన్ని మార్చాలి. “ఉప్పు తగ్గించండి” అనే సాధారణ సలహాను దాటి, ఆరోగ్యకరమైన ఎంపికలను ప్రజలకు సులభంగా అనుసరించగల విధంగా చేయాలి. దానికి నెమ్మదిగా ఉప్పు తగ్గించే విధానాలు, సంస్థల ద్వారా మార్పుకు నాయకత్వం, రుచిని కాపాడే పరిష్కారాలు. ఈ చర్యలతోనే సోడియం తగ్గింపు అనేది సంవత్సరానికొకసారి వినిపించే సలహాగా కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య మార్పుగా మారుతుంది. -
ట్రాక్టర్ డ్రైవర్ కుమారుడు స్పేస్ టెక్ కంపెనీ సీఈవోగా..!
చాలా చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఎందరో ఉన్నతమైన వ్యక్తుల విజయగాథలను చూశాం. కానీ ఈ స్టోరీ విద్యాపరమైన గాథలా ఉండదు. ఎన్నో ఎదురుదెబ్బలు, ఆకస్మిక మలుపులు, సుదీర్ఘకాలం పాటు అనిశ్చితి తర్వాత ఉవ్వెత్తున ఎదిగిన శిఖరాగ్రంలా ఉంటుంది. కిలోమీటర్ల కొద్దీ నడిచి పాఠశాలకు వెళ్లి చదువుకున్న ఓ సామాన్య ట్రాక్టర్ డ్రైవర్ కొడుకు సాధించిన విజయం ఇది. ఆ వ్యక్తే డాక్టర్ ఆనంద్ మేఘలింగం. అతడి బాల్యం రాకెట్లు లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌కి గానీ సంబంధ లేకుండా సాగింది. ఆయన తమిళనాడులోని ఒక గ్రామీణ వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. అక్కడ ఆయన తండ్రి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవారు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఆశయాల కన్నా అవసరాల చుట్టూనే దైనందిన జీవితం సాగేది. ప్రతి రోజు ఆరుకిలోమీటర్లు దూరం నడిస్తే గానీ చదువుకోలేని పరిస్థితి. అదే అతడిలో నిశబ్దంగా క్రమశిక్షణను అలవరచుకునేలా చేసింది. అందరిలానే ఇంటర్ వచ్చాక ఎంసెట్ రాసి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాడు. కానీ అందులో సబ్జెక్టులేవి మైండ్‌కి ఎక్కేవి కాదు. దాంతో మధ్యలో కాలేజ్ చదువుకి స్వస్తి పలికాడు. కానీ మళ్లీ కొద్ది రోజులకి స్ట్రాంగ్‌గా వచ్చి ఈ సారి భిన్నమైన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎంచుకున్నాడు. అందులో అనూహ్యంగా మేఘలింగం మంచి అకడమిక్ మార్కులతో పాసవ్వడమే కాదు గోల్డ్ మెడల్ సాధించాడు.స్పేస్ జోన్ ఇండియా తొలి ప్రయాణంకాలేజ్ చదువు పూర్తి చేసిన అనంతరం డాక్టర్ ఆనంద్ మేఘలింగం స్పేస్ జోన్ ఇండియాను స్థాపించారు. అలా ఆయన ప్రైవేట్ స్పేస్-టెక్ ఉద్యమానికి వ్యవస్థాపకుడిగా నిలిచారు. ఈ స్పేస్ జోన్ ఇండియా ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. స్పేస్ జోన్ ఇండియా పరిమిత వనరులతో, గొప్ప ఆశయాలతో ప్రారంభమైంది. ప్రారంభ అభివృద్ధిలో ప్రయోగాత్మక ఆవిష్కరణలు, బలమైన వ్యక్తిగత నిబద్ధత కీలక పాత్ర పోషించడమే కాకుండా కుటుంబ మద్దతు కూడా తోడవ్వడంతో కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకునేలా నిలదొక్కుకుంది. మొబైల్ ప్లాట్‌ఫామ్ నుంచి ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్‌గా వర్ణించే RHUMI-H మిషన్ ఆ సంస్థ సాధించిన విజయాల్లో ఒకటి. ఈ ఘనత భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష రంగం అందరి దృష్టిని ఆకర్షించింది, ఇది ఒక సాంకేతిక ముందడుగు కూడా. కొద్దికాలంలో RHUMI మిషన్ ప్రాముఖ్యత అమాంత పెరిగింది. అలాగే భారతదేశపు ప్రైవేట్ అంతరిక్ష సామర్థ్యాలపై జరిగే చర్చలలో ఈ కంపెనీ స్థానం దక్కించుకునేలా పేరుతెచ్చుకోవడం విశేషం.ఆవిష్కరణలకు హద్దులు లేవు..డాక్టర్ మేఘలింగం ఏరోస్పేస్ అవకాశాలకు సంబంధించి యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ రంగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు అత్యంత కీలకం. కానీ వీసా తిరస్కరణతో అతి పెద్ద ఎదురదెబ్బ తగిలింది మేఘలింగంకి. కానీ ఆయన తగ్గేదే లే అంటూ భారత్‌లోనే తన పనిని కొనసాగించారు. సరిహద్దులు మనుషులకే గానీ ఆవిష్కరణలకు కాదు అని చెప్పపేలా తన ఆవిష్కరణలు కొనసాగించాడు.ఊహించని మలుపు నాసాతో అనుసంధానం..ఆ తర్వాత అతని కెరీర్ ఊహించని మలుపు తీసుకుంది. ప్రపంచ నిపుణుల బృందంతో కూడిన ఒక అంతర్జాతీయ నాయకత్వ కార్యక్రమం కోసం అమెరికా విదేశాంగ శాఖ ఆయన్ను ఎంపిక చేసుకోవడం ఆయన కెరీర్లో పెద్ద మైలురాయి, అనూహ్యమైన మలుపు కూడా. ఈ కార్యక్రమం మేఘలింగంకి ఆధునాతన ఏరోస్పేస్ పర్యావరణ వ్యవస్థలపై మంచి అవగాహన కల్పించింది. అంతేగాదు నాసా సౌకర్యాలతో అనుసంధానించబడిన శిక్షణా వాతావరణంలో కూడా పాల్గొని, ఉన్నత స్థాయి ఏరోస్పేస్ వ్యవస్థలు, రక్షణ సాంకేతికతలు, మిషన్ ప్రణాళికా చట్రాలపై పూర్తి స్థాయిలో అవగాహన పొందారాయన. ప్రస్తుతం మేఘలింగం చెన్నై నుంచి ఏకకాలంలో రాకెట్ ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకున్న RHUMI ట్విన్ ప్రాజెక్ట్ ప్రణాళికలతో సహా కొత్త మిషన్లకు నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఆయన కంపెనీ విలువ 800 కోట్లు టర్నోవర్ పైనే పలుతుందట.(చదవండి: శీర్షాసనంలో శివ తాండవ స్తోత్రం పఠించి ప్రపంచ రికార్డు!) -
పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!
జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జిల్లా కేంద్రంలోని చంపక్ హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది.అమ్మగా మారిన ఎస్ఎన్సీయూపాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్‌ఎన్‌సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్ఎన్సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు.తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యానికి..50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.పుట్టిన గంటలోనే.. తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జిల్లాలోని లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే పాప ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్‌రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్‌శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్‌నంబర్ ఆధారంగా నరేష్‌కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. -
చిన్నారి ఘనత..శీర్షాసనంలో శివ తాండవ స్తోత్రం!
ఓ చిచ్చర పిడుగు అనితర సాధ్యమైన ఘనత సాధించాడు. గుక్కతిప్పుకోకుండా వేగవంతంగా పాడే శివతాండవ స్త్రోత్రాన్ని ఓ చిన్నారి యోగాసనంలో రాజుగా పిలిచే శీర్షాసనంలో పఠించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఉచ్ఛ్వాశ నిశ్వాసాలపై నియంత్రణ సాగిస్తూ..కష్టతరమైన ఈ స్త్రోత్రాన్ని పఠించడం విశేషం. ఎవరా చిచ్చరపిడుగు అంటే..కర్ణాటకలోని సిర్సికి చెందిన ఎనిమిదేళ్ల ఓం ఈ రికార్డు నెలకొల్పాడు. సంస్కృత పదాలతో ఉండే శివతాండవ స్త్రోత్రాన్ని పఠించడానికి అపారమైన అంకితభావం, సాధన అవసరం. కానీ ఈ చిన్నారి ఓం గోడ ఆధారంగా చేసుకుని శీర్షాసనం వేసి చేతలు ఆధారం లేకుండా నమస్కరిస్తూ..అలవోకగా శివతాండవ స్త్రోత్రాన్ని పఠించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంత చిన్న వయసులో అపారమైన ఏకాగ్రత, బ్యాలెన్సింగ్, క్రమశిక్షణపై ఉన్న పట్టు అందర్నీ అమితంగా ఆకర్షించింది. ప్రపంచ రికార్డు ప్రకారం.. చిన్నారి ఓం ఫిబ్రవరి 15న 3 నిమిషాల 47 సెకన్లలో ఈ ప్రదర్శనను పూర్తి చేశాడు. ఇక్కడ యోగాసనాల్లో అత్యంత కష్టమైన కఠినమైన ఆసనాన్ని కొనసాగిస్తూనే లయబద్ధంగా సంస్కృత పఠనాన్ని నిరంతరాయంగా కొనసాగించడం అత్యంత సవాలు. కానీ ఈ రెండింటిని అలవోకగా బ్యాలెన్స్ చేయలంటే సదరు వ్యక్తికి శ్వాస నియంత్రణ, శారీరక స్థిరత్వం, మానసిక ఏకాగ్రత అపారంగా ఉండాల్సిందే. కానీ ఈ ఆ చిన్నారి ఓం అంత చిన్న వయసులోనే వాటన్నింటిపై పట్టు సాధించి ఆ సవాలుని తక్కువ సమయంలోనే దిగ్విజయంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడం విశేషం. View this post on Instagram A post shared by Boldsky (@boldskyliving) (చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే) -
ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..!
ఒత్తిడి లేకుండా హాయిగా వందేళ్లు బతికేయాలని అందరికీ ఉంటుంది. అలాంటి జీవితం పొందాలంటే కోటీశ్వరుడే కానక్కర్లేదు. ఉరుకులు పరుగులతో రోజును గడపనక్కర్లేదు. చేయాల్సిందల్లా ప్రకృతితో, కుటుంబంతో, సంఘంతో సన్నిహితంగా గడపడమే. ఇది ఇంత సులువా అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ అలా బతకడాన్ని క్రమంగా అలవాటు చేసుకుంటే ఎవరైనా సరే దాన్నో జీవన విధానంగా మార్చుకోవచ్చు. దాన్ని నిరూపించి చూపిస్తున్నారు ఇకారియా ద్వీప ప్రజలు. అదెలాగో చూద్దాం.గ్రీస్‌లోని ఇకారియా ద్వీపం ప్రపంచంలోని ఐదు ’బ్లూ జోన్లలో ఒకటి. అక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరు 90 ఏళ్లకుపైగా జీవిస్తారు. వారి సుదీర్ఘ ఆయుష్షు వెనకున్న రహస్యం కేవలం వారు తినే ఆహారం మాత్రమే కాదు.. వారి విలక్షణమైన జీవనశైలి. వారి మంత్రం ‘నిదానమే ప్రధానం’.నిదానమైన జీవనశైలిఇకారియా ప్రజలకు ‘సమయం’ విషయంలో అస్సలు టెన్షన్ ఉండదు. వారు ఉదయం అలారం పెట్టుకొని పరుగు పరుగున లేవరు. నిద్ర లేవగానే నిదానంగా కాఫీ తాగుతూ కుటుంబంతో గడుపుతారు. అక్కడ వ్యాపారస్తులు కూడా తమ ఇష్టానుసారం షాపులు తెరుస్తారు. కస్టమర్లు కూడా గంటల తరబడి వేచి ఉండటానికి ఇబ్బంది పడరు. ఈ ధోరణి వల్ల వారిలో గుండె జబ్బులకు ప్రధాన కారణమైన ‘కార్టిసాల్’ (ఒత్తిడి హార్మోన్) చాలా తక్కువగాఉంటోందని తేలింది.మధ్యాహ్న నిద్ర ఇకారియాలోమధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం ఒక అలవాటు. ప్రతిరోజూ మధ్యాహ్నంకనీసం 30 నిమిషాలనిద్ర వల్ల గుండె జబ్బుల ప్రమాదం 37% తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వారిని రోజంతా ఉల్లాసంగా ఉంచుతోంది.ఆహార రహస్యాలుఇకారియావాసులు తినే ఆహారం పూర్తిగా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ ఆయిల్ ఎక్కువగా తీసుకుంటారు. వారు ప్రతిరోజూ రోజ్మేరీ, సేజ్, పుదీనాతో చేసిన టీ తాగుతారు. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి రక్తపోటును తగ్గిస్తాయి. రెడ్ మీట్ చాలా అరుదుగా తీసుకుంటారు. చక్కెర వాడకంచాలా తక్కువ.శారీరక శ్రమ ఇకారియా ప్రజలు జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తరు. కానీ రోజంతా కదులుతూనే ఉంటారు. ఇకారియా ద్వీపం కొండ ప్రాంతం కాబట్టి పక్కింటికి వెళ్లాలన్నా మెట్లు ఎక్కాలి. తోట పని చేయడం, నడవడం వారి దైనందిన జీవితంలో భాగం. ఈ సహజమైన శ్రమ వారిని 90 ఏళ్లలో కూడా దృఢంగా ఉంచుతోంది.సామాజిక అనుబంధాలు ఇకారియాలో ఎవరూ ఒంటరిగా ఉండరు. సాయంత్రం వేళల్లో స్నేహితులు, బంధువులతో కలిసి నవ్వుతూ చిన్నచిన్న పార్టీలు చేసుకుంటూ గడుపుతారు. వారిలో ఒంటరితనం అనే మాటే వినిపించదు. ఈ సామాజిక మద్దతు మానసిక ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతోంది.మరి మనం ఏం చేద్దాం?హడావుడి పడకుండా నిదానంగా పనులు చేయడం, ఆస్వాదిస్తూ పనుల్లో మునిగిపోవడం, ప్రకృతితో గడపడం, అవకాశం దొరికినప్పుడు తోటపని లేదాచిన్ననడక అలవాటు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే సహజ సిద్ధమైనఆహారం, పానీయాలు తీసుకోవడం, మధ్యాహ్నం చిన్న కునుకు తీయడం, కాసేపు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండి, కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడటం, స్నేహితులను పెంచుకొని వారితో కొన్ని గంటలు సరదాగా గడపడం చేస్తే చాలు..మనమూ దీర్ఘాయుష్షుతో జీవించగలం. సాక్షి స్పెషల్ డెస్క్(చదవండి: రెండు వారాల పాటు గ్రీన్ టీ తాగితే ఏం జరుగుతుందంటే..) -
రెండు వారాల పాటు గ్రీన్ టీ తాగితే ఏం జరుగుతుందంటే..
ఇటీల ఆరోగ్య స్పృహతో గ్రీన్‌టీ వంటివి తీసుకుంటున్నారు. అందులోనూ వర్కౌట్లు, డైట్లు పాటించేవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వారి రోజు గ్రీన్‌టీ తోనే మొదలవుతుంది. అయితే ఇలా గ్రీన్‌టీ క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఒక ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సోషల్ మీడియా వేదికగా దాని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి సవివరంగా వివరించారు. మరి అవేంటో చూద్దామా.!గ్రీన్ టీ తాగడం అనేది ఒక సాధారణ ఆరోగ్యకరమైన విధానంగా పేర్కొనవచ్చు. దీనిలో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలతో నిండిన గ్రీన్ టీతో మెరుగైన సంపూర్ణ ఆరోగ్యం ముడిపడి ఉందని చెబుతున్నారు నిపుణులు. అలాంటి గ్రీన్‌టీని క్రమంతప్పకుండా తీసుకుంటే.. జీవక్రియ, మెదడు పనితీరు, కాలేయ ఆరోగ్యం తదితరాలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపారు. కేవలం 14 రోజుల్లోనే..గొప్ప మార్పులు..కేవం 14 రోజుల్లోనే ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో అర్థవంతమైన మార్పులు ఎలా సంతరించుకుంటాయో గమనించొచ్చని అన్నారు. అంతేగాదు హర్వర్డ్ అండ్ స్టాన్‌ఫోర్డ్‌లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ 14 రోజుల పాటు ప్రతిరోజూ గ్రీన్ టీ తాగితే ఇలా జరుగుతుందంటూ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆయన ఈ వీడియోకి ఇది ఆరోగ్యకరమైన అలవాటా? లేక అతిగా ప్రచారం చేయబడిన ట్రెండా? అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు.కలిగే ప్రయోజనాలు..ఆ వీడియోలో గ్రీన్ టీ వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందే మొదటి అవయవాలలో కాలేయం ఒకటని ఆయన పేర్కొన్నారు. గ్రీన్ టీలో EGCG వంటి కాటెచిన్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు కాలేయ వాపును తగ్గించి, జీవక్రియను మెరుగుపరుస్తాయని అన్నారు. అంతేగాదు యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటం ద్వారా పనిచేస్తాయి, ఇది అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా కాఫీ వల్ల వచ్చే త్రీమైన వణుకుని నివారించి ఏకాగ్రత శక్తిని పెంచుతుందట. అంతేగాదు మెదడు చురుకుగా ఉంటుందని చెబుతున్నారు View this post on Instagram A post shared by Saurabh Sethi MD MPH | Gastroenterologist (@doctor.sethi) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చెమట ఇబ్బంది పెట్టకూడదంటే..) -
ఆ కుంచె గొంతులోమళ్లీ అమృతం
ఆమె మరణించి 85 ఏళ్లు అవుతున్నా భారతీయ కళారంగం తలుచుకుని అబ్బురపడుతూనే ఉంది. 28 ఏళ్లకే ఆమె చేతి కుంచెను మృత్యువు లాక్కున్నా ఆమె గీసిన చిత్రాన్ని 62 కోట్లు పెట్టి మరీ కొనుక్కుంటూనే ఉంది. అమృతా షేర్గిల్. భారతీయ అద్భుత చిత్రకారిణి. ఆమె బయోపిక్ త్వరలో రాబోతూ ఉంది. దర్శకురాలు మీరా నాయర్ దీని రూపకర్త. ఒక స్త్రీ మరో స్త్రీ జీవితాన్ని కెమెరా కేన్వాస్పై దించనుంది. వివరాలు....ఈ సినిమా కచ్చితంగా మీరా నాయర్ ఇంతకుముందు సినిమాల కంటే భిన్నమైనది. ఆమె ఇప్పటి వరకూ బయోపిక్స్ తీయలేదు. తీయాలనుకున్నది సామాన్యమైన వ్యక్తి గురించీ కాదు. ‘నేను సినిమాలు తీశానంటే అమృతా షేర్గిల్ గీసిన బొమ్మల ప్రభావం వల్లే. అందుకే ఆమె బయోపిక్ తీయడానికి ధైర్యం చేశా’ అంటారు మీరా నాయర్. అమృతా షేర్గిల్ పేరు భారతీయ చిత్రకళలో మరణం లేనిది. అమె గురించి తెలియడం, తెలియకపోవడం రెండూ కళాభిమానులను బాధించే విషయాలు. తెలిస్తే ‘అరె చిన్న వయసులో మరణించిందా’ అని బాధ. తెలియకపోతే ఇంత గొప్ప మనిషి తెలియకుండా పోయిందా... అనే బాధ. మన దేశంలో స్త్రీలు వంటిల్లు దాటడానికి కూడా భయపడిపోయే రోజుల్లో అమృతా షేర్గిల్ ΄్యారిస్కు వెళ్లి మరీ చిత్రకళ అభ్యసించింది. అక్కడి మహా చిత్రకారులతో భుజాలు రాసుకు తిరిగింది. తిరిగి భారతదేశానికి వచ్చి యూరోపియన్ వాసనలు లేకుండా తన కుంచె మెరుగుదనంతో భారతీయ సౌందర్యాన్ని చూపింది. అందుకే ఆమె కథ విశిష్టమైనది... ఆమె బొమ్మల్లానే. మీరా నాయర్ ఈ పాత్రకు తగిన నటి కోసం, రాయాల్సిన స్క్రిప్ట్ కోసం చాలా పరిశ్రమించింది. అమృత పాత్రకు త్రిప్తి డిమ్రి, తాన్య మణిక్తలా పేర్లు పరిశీలనకు వచ్చినా ‘బ్యాడ్ గర్ల్’ ఫేమ్ అంజలి శివరామన్ లోని భావగాఢత నచ్చి ఆమెను ఎంచుకుంది.దిగ్గజ బృందంతాను ఎవరి గురించి బయోపిక్ తీస్తున్నదో మీరాకు బాగా తెలుసు. భారతీయ ఆధునిక కళకు అమ్మగా, ‘పయొనీర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఆర్ట్’గా పిలువబడే షేర్గిల్ను తెర మీద సాక్షాత్కరించడం... సవాల్. తీశాక అభిమానులు, విమర్శకులు వేయికళ్లతో పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. వారి అభిమానం కంటే తన అభిమానమే గొప్పదని నిరూపించుకోవడానికి పరీక్షకు సిద్ధమైంది మీరా నాయర్. అమృతా షేర్గిల్ను అందరూ ‘అమ్రి’ అని ముద్దుగా పిలుస్తారు. మీరా కూడా అలానే పిలుచుకుంటుంది. అదే టైటిల్ ‘అమ్రి’.స్క్రిప్ట్ పనిలో ఫ్రెంచ్ స్క్రీన్ రైటర్ క్లారా రాయర్ సహాయం తీసుకుంది. ప్రియాంక చోప్రాను ముఖ్యపాత్ర వేయమని కోరడమే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉండేలా మెప్పించింది. ఎమిలీ వాట్సన్ , జైదీప్ అహ్లావత్, జిమ్ సర్భ్, అంజనా వాసన్ మంచి ఆర్టిస్టులను ఇతర పాత్రలకు తీసుకుంది. ఇండియా, హంగేరీలలో షూటింగ్ చేసింది.మృత్యువు గీసిన చివరి గీతఅమృతా షేర్గిల్ అనూహ్య ధోరణిలో ఎదిగింది. పురుష చిత్రకారులు దేవతల్ని గీస్తున్న రోజుల్లో అమృత గ్రామీణ స్త్రీల వేదనను గీసింది. పెళ్లి, ప్రేమ, సెక్స్– దేన్నీ దాచుకోలేదు. అందువల్ల స్కాండల్స్ వెంటాడినా పట్టించుకోలేదు. అందుకే ఆమెను ఎరిగినవాళ్లు ‘50 ఏళ్లు ముందు పుట్టింది’ అంటారు.‘ఆమె జీవితం ఒక సినిమా కన్నా నాటకీయం. ప్రతి ఫ్రేమ్‌లో పోరాటమే’ అని ఆమె జీవిత చరిత్రకారిణి యశోధర దాల్మియా వ్యాఖ్యానిస్తారు. ఇంత గొప్ప భవిష్యత్తు ఉన్న అమృత డిసెంబర్ 5, 1941న లాహోర్‌లో మరణించడం పెద్ద షాక్. అప్పటికి వయసు కేవలం 28. మరణానికి కారణం డాక్టర్లు ‘పెరిటోనైటిస్’ అన్నారు... అంటే ΄÷ట్టలో ఇన్ఫెక్షన్. చరిత్రకారులేమో ‘ఫెయిల్డ్ అబార్షన్’ అన్నారు. తల్లి మాత్రం ‘నా కూతుర్ని మొగుడే చంపేశాడు’ అని ఏడ్చింది. ఏది నిజమో ఎవరికీ తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే– భారతీయ ఆధునిక కళ ఉచ్ఛస్థితికి చేరుకుంటున్న సమయంలో, ఆ కళకు అమ్మ లాంటి అమృత చేతిలోంచి కుంచె జారిపోయింది.బయో పోయెమ్‘సలామ్ బాంబే’,‘మాన్ సూన్ వెడ్డింగ్’, ‘ది నేమ్‌సేక్’ తీసిన మీరాకు ‘అమ్రి’ పర్సనల్ ఫిల్మ్. ప్రొడ్యూసర్ మైఖేల్ నోజిక్ మాటల్లో చె΄్పాలంటే ‘మీరా నాయర్ దర్శకత్వంతో అంజలి పెర్ఫార్మెన్ ్స అద్భుతంగా ఉండబోతోంది’. అమృతగా అంజలి ఫస్ట్లుక్కే ప్రశంసలు వస్తున్నాయి. అమృతలోని క్రాస్ కల్చరల్ ఐడెంటిటీ, కళాత్మకత, ధిక్కారం ఇవన్నీ మీరా నాయర్ కెమెరాలో ఒదిగితే ‘అమ్రి’ ఒక విజువల్ పోయెమ్ అవుతుంది. 85 ఏళ్ల తర్వాత అమృత మళ్లీ బతుకుతుంది. అమృతా షేర్గిల్ ఎవరు?మీరా నాయర్‌నే కాదు ప్రపంచ కళాభిమానులను ఆకర్షించే అమృతా షేర్‌గిల్‌ది భిన్నమైన జీవితం. హంగేరీ తల్లి, పంజాబీ సిక్కు తండ్రికి 1913లోబుడాపెస్ట్లో జన్మించింది. పారిస్‌లోని ఆర్ట్ స్కూల్ ‘అకాడెమీ దె బోజార్’లో అతి చిన్న వయసులో చదువుకుంది. యూరోపియన్ టెక్నిక్‌తో భారతీయ గ్రామీణ స్త్రీల వేదన, ఒంటరితనం, దైనందిన జీవితాన్ని కాన్వాస్ పైకి తెచ్చింది.‘త్రీ గరల్స్’, ‘బ్రైడ్స్ టాయిలెట్’, ‘విలేజ్ సీన్’... ఈ మూడు చిత్రాలతో భారతీయ కళలో మోడర్నిజానికి తొలి అడుగులు వేసింది. అందుకే ఆమెను ఆమె 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ పెయింటింగ్ 2023లో 61.8 కోట్లకు అమ్ముడుపోయిందంటే ఇక ఆలోచించండి ఆమె కళావైశిష్ట్యం.– కె. -
చిన్నారుల మెదడుకు మేత..సామేత!
ఫ్రెండ్స్, మీరెప్పుడైనా మన తెలుగు సామెతలు విన్నారా? ‘చాలా విన్నాను’... ‘కొన్ని విన్నాను’ అనేవారితోపాటు... ‘సామెత అంటే ఏమిటి?’ అని అడిగేవారు కూడా మీలో ఉన్నారు.వినడానికి సామెతలు సరదాగా ఉంటాయి గానీ... అవి మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వాటిలో మంచి ఉంది. మనల్ని నవ్వించే కామెడీ ఉంది. జీవిత సత్యాలు ఉన్నాయి.లాంగ్వేజ్ స్కిల్స్‌లో సామెతలు ఉపయోగించడం కూడా ఒకటని మీరు గుర్తు పెట్టుకోవాలి.‘మన సామెతలను మనం తెలుసుకోవడం అంటే... మన ముత్తాతలతో మూడువేల సార్లు మాట్లాడినట్లు’ అనే సామెత కాని సామెత ఉంది. సామెతలు అనేవి సముద్రంలాంటివి. అందులో మనకు ఎన్ని తెలిస్తే అంతమంచిది. ఈరోజు మనం కొన్ని సామెతలు తెలుసుకుందాం. తెలుసుకోవడమే కాదు వాటిని ఎక్కడో ఒకచోట ఉపయోగించాలి కూడా!కొయ్యర కొయ్యర పోలిగా అంటే... టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట!వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి. అలా కాకుండా లేని విషయాన్ని బాగా పెద్దగా చేసి చెప్పడం మంచిది కాదు. దానివల్ల రకరకాల సమస్యలు వస్తాయి. మిరియాలు చిన్న సైజ్‌లో ఉంటాయి. ‘మా ఊళ్లో అలా కాదు... తాటికాయలంత ఉంటాయి’ అనడం అబద్ధం చెప్పడమే కదా! ఒక విషయాన్ని పదింతలు చేసి చెప్పే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది.తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అని అడిగితే... దూడకు గడ్డి కోయడానికి అన్నాడట!కొందరు వ్యక్తులు, మనం ఒకటి అడిగితే వారొకటి చెబుతారు. వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో ΄పొంతన లేని సమాధానాలు ఇచ్చి నవ్వులపాలవుతుంటారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి వాడే సామెత...‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అని అడిగితే... దూడకు గడ్డి కోయడానికి అన్నట్లు!’దీనికి సంబంధించి ఒక జోక్...రాత్రి బ్యాంకు దొంగతనానికి వచ్చిన దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు. ‘దొంగతనానికి వచ్చాను. తప్పయిపోయింది’ అనలేదు. ఏదోరకంగా తప్పించుకోవాలని... ‘సార్... మీరు పొరబడుతున్నారు. రాత్రిపూట కూడా బ్యాంక్ పనిచేస్తుందా లేదా? అనేది తెలుసుకోవడానికి వచ్చాను’ అన్నాడట!కుక్కను పెంచి...తానేమొరిగినట్లు!‘అనవసరంగా కష్టపడుతున్నారు’ అని చెప్పే సందర్భంలో ఉపయోగించే సామెత... కుక్కను పెంచి తానే మొరిగినట్లు!ఉదాహరణకు....ఒక వ్యక్తి తన ఇంటికాపలాకు వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ‘నువ్వు రెస్ట్ తీసుకో...నేను చూస్తాను’ అని వాచ్‌మెన్‌తో యజమాని అంటే ఎలా ఉంటుంది చెప్పండి!...ఇవే కాదు ఇంకా ఎన్నో సామెతలు ఉన్నాయి. పెద్దలను అడిగి వాటిని తెలుసుకోండి. నోట్‌బుక్‌లో రాసుకోండి. అన్ని ్ర΄ాంతాలకు తెలిసిన సామెతలతో పాటు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పాపులర్ అయిన సామెతలు కూడా ఉంటాయి. మీ ప్రాంతంలో పాపులర్ అయిన సామెతలు ఏమిటో తెలుసుకోండి.ఘడియ పురుసత్తు లేదు... దమ్మిడీ ఆదాయం లేదు!మనం కష్టపడ్డామంటే దానికి ఫలితం ఉండాలి. మనం ఒక పని మీద టైమ్ పెట్టామంటే ప్రయోజనం ఉండాలి. అలా కాకపోతే... టైమ్ వేస్ట్ చేసినట్లే కదా! ఇలాంటి సందర్భంలో ఉపయోగించే సామెత ఇది.సామెతల సముద్రంలో నుంచి కొన్ని సామెతలు...ఆశ దోషమెరుగదు అంగట్లో అరువు తల మీద బరువుఅంగడి అమ్మి గొంగళి కొన్నట్లు అండ ఉంటే కొండలు దాటొచ్చుప్రీతితో పెట్టింది పిడికెడు చాలు ఎంత చెట్టుకు అంతగాలిచేటు కాలానికి చెడు బుద్దులు మన దీపమని ముద్దాడితే మూతి మీది మీసాలు కాలకుండా ఉంటాయా!కాలికి చుట్టుకున్న పాము కరవక మానదుకడివెడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువపంచాంగం ΄పోయిందని తిథివారాలు పోతాయా? గుర్రాన్ని గుగ్గిళ్లకు అమ్మినట్లుకుక్క సింహం కాదు, కుందేలు తోడేలు కాదు నలుగురు నడిచేది దారి... పదుగురు చెప్పేది నీతి. -
చెమట ఇబ్బంది పెట్టకూడదంటే..
వేసవిలో శరీరానికి చెమట ఎక్కువగా పట్టడం సహజమే. అయితే కొందరికి మాత్రం ఈ చెమట వల్ల చర్మంపై బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది దుర్వాసనకు దారితీస్తుంది. ముఖ్యంగా హైపర్ హైడ్రోసిస్ సమస్య ఉన్నవారికి ఇది మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అటువంటి వారికోసం కొన్ని చిట్కాలు...స్నానానికి యాంటీ బ్యాక్టీరియల్ సబ్బును వాడటం వల్ల చర్మంపై ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత బాహుమూలలు, పాదాలు, చర్మం మడతలు ఉండే ప్రాంతాల్ని తడి లేకుండా పూర్తిగా తుడుచుకోవాలి.గాలి ఆడేలా ఉండే కాటన్ బట్టల్ని ధరించాలి. ఇవిగాక యాంటీ–పెర్స్పిరెంట్స్, డియోడరెంట్స్ వాడటం వల్ల దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను చంపి, మంచి సువాసనను ఇస్తాయి.వీటికన్నా ముఖ్యం ఏమిటంటే.. కారం ఎక్కువగా ఉండే పదార్థాలు, కెఫీన్, వెల్లుల్లి వంటి ఘాటైన వాసన వచ్చే ఆహార పదార్థాల్ని తగ్గించాలి.తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం సహజమైన సమతుల్యతను కలిగి ఉంటుంది. అలాగే తగినంత నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే చెమట గాఢత తగ్గి, దుర్వాసన తక్కువగా వస్తుంది. -
అచ్చం భారతీయ స్త్రీలా రష్యన్ మహిళ..!
ఇంతవరకు చాలామంది భారత్ ఉండటం ఇష్టపడటాన్ని చూశాం. ఇక్కడ భోజనానికి, జీవనశైలికి అలవాటు పడితే ఒక మహిళ ఏకంగా అచ్చం భారతీయ మహిళలా రష్యన్ మహిళ తనను తాను మార్చుకుంది. కేవలం కట్టు బొట్టు మాత్రమే కాదు..మన భారత నారి ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా కుటుంబంతో మసులుకుంటుందో అలా మొత్తం జీవనశైలినే మార్చుకుందామె. పైగా ఆ జీవనవిధానం తన వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా మార్చాయంటూ తన అనుభవాన్ని వివరిస్తూ వీడియో షేర్ చేసుకుంది. ముంబైలోని మొహాలీలో నివశిస్తున్న రష్యన్ మహిళ ఒక భారతీయ మహిళ నుంచి ఆ ఐదు అలవాట్లను నేర్చుకున్నా అంటూ వాటి గురించి వీడియోలో వివరించింది. ఉదయాన్నే త్వరగా లేవడం నుంచి ప్రతి నిర్ణయం తీసుకునే ముందుకు భర్తను సంప్రదించడం వరకు ప్రతి అలవాటు తన వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మార్చాయని పేర్కొంది. భారతీయ మహిళల నుంచి అలవర్చుకున్న అలవాట్లు అంటూ క్యాప్షన్ జోడించి మరి వీడియోని పోస్ట్ చేసింది.నేర్చుకున్న ఐదు అలవాట్లు..1. తాను రష్యాలో ఉంటే ఉదయం 10 అయితే గానీ లేచేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకున్నా. ఉదయం 5 నుంచి 7 లోపు మేల్కొంటానని చెప్పింది. భారత్‌లో రోజు చాలా త్వరగా ప్రారంభమవుతుంది. ఉదయాన్నే చెత్త సేకరించడం, తాజా కూరగాయలు, పాలు తెచ్చుకోవడం, దుకాణాలు తెరుచుకోవడం వంటివన్నీ చాఆ తొందరగా జరిగిపోతాయి అని పోస్ట్‌లో రాసింది.2. భర్త లేచేసరికే వంట చేయడం తనకు ఇష్టమని, అందుకే ఉదయాన్నే లేస్తానని చెప్పింది. కాచిన పాలను తాగడం అనేది తాను తప్పించుకోలేని రోజువారి ఉదయపు అలవాటుగా పేర్కొంది.3. అలాగే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు భర్తను సంప్రదించడం వంటివి కూడా చేస్తానని అంది. నిజానికి ఇది రష్యాలో అతి పెద్ద ప్రమాదకరమైన సమస్య, ముఖ్యంగా స్వేచ్ఛను హరించేదిగా తీవ్రంగా పరిగణిస్తారని, కానీ భారత్ ప్రకారం కుటుంబ ఐక్యతకు సంబంధించిందని అంటుంది. అంతేగాదు దాన్ని సింపుల్‌గా జట్టు కృష్టిగా అభివర్ణించిందామె. 4. ఇప్పుడు తన దగ్గర చీరలు, సూట్లు ఉన్నాయని, ప్రతి కార్యక్రమం "ప్రత్యేకంగా" అనిపిస్తుందని చెబుతోంది. ఎలాగైన భారతీయ వేషధారణ కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించినా..నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుందని చెబుతోంది.5. అతిథులు రాగానే భారతీయ మహిళల్లా నీళ్లు, టీ లేదా కాఫీ సర్వ్ చేయడం నేర్చుకున్నానని అంటోంది. ఒక భారతీయ మహిళ వడ్డించినట్టుగా భోజనం కూడా సర్వ్ చేస్తానని చెబుతోంది.నెటిజన్లంతా ఆమెతో ఏకభవిస్తూ..మాకు అత్యంత సర్వసాధారణం, జీవితంలో భాగమైన మా అలవాట్ల గొప్పతనాన్ని అద్భుతంగా వివరించడమే గాక, అనుసరించడం అభినందనీయం. ధన్యవాదాలు అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 𝑫𝒆𝒔𝒊𝒍𝒊𝒇𝒆 |𝑩𝒆𝒂𝒖𝒕𝒚 |𝑰𝒏𝒅𝒊𝒂 (@sofia_desilife) (చదవండి: కేన్సర్‌పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్‌పాండే హెల్త్ టిప్స్) -
మదర్ అదర్‌సైడ్ మాస్టర్ షెఫ్
ఒకప్పుడు సాధారణ గృహిణిగా, పిల్లల తల్లిగా ఇంటిపట్టునే ఉన్న కనక కతూరియా ఇప్పుడు మాస్టర్ షెఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేంతగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ‘కనక్స్ కిచెన్’ పేరుతో సోషల్ మీడియాలో మిలియన్ల మంది అభిమానం సొంతం చేసుకున్నారు. బార్బిక్యూ నేషన్స్‌లో మెక్సికన్ రుచులను పరిచయం చేయడానికి ముంబై నుంచి ఇటీవల హైదరాబాద్ వచ్చిన కనకను ‘సాక్షి ఫ్యామిలీ’ పలకరించింది. ఈ సందర్భంగా ఆమె తన ‘వంట’రి పోరాటాన్ని గురించి పంచుకున్న ఎన్నో విశేషాలు ఆమె మాటల్లోనే...‘‘పాతికేళ్లుగా వంటల్లో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను. ఇండియన్, ఇటలీ, చైనీస్, జపనీస్, మెక్సికన్, ఫ్రెంచ్, అమెరికన్.. అన్నిదేశాల రుచులూ మా ఇంటి కిచెన్‌లో నేటికీ ఘుమఘుమలాడుతూనే ఉన్నాయి. నేను పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పనిచేసే షెఫ్‌ని కాదు. సాధారణ గృహిణిని. కానీ, ఈ రోజు ఇండియన్ షెఫ్‌గా పేరొందాను.బిజీగా మార్చుకున్నాను...నేను ఎం.కామ్. చదివినా, పెళ్లయ్యాక ఇంటికే పరిమితం అయ్యాను. ఇద్దరు కూతుళ్ల పెంపకంలో రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియనంత బిజీ అయిపోయింది జీవితం. వంటలపై నాకున్న అభిరుచిని మెరుగుపరుచుకోవడానికి రోజూ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. పిల్లలు ఏడుస్తుంటే వారిని ఎత్తుకొని తిప్పుతూ, నిద్రపుచ్చుతూ, రకరకాల వెస్ట్రన్ వంటకాలు తయారు చేసేదాన్ని. ఆ సమయంలోనే వాటిని వీడియో తీసేదాన్ని. యూ ట్యూబ్ ల్యాంచ్ అయిన తొలినాళ్ల నుంచీ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాను.హోస్ట్‌గా.. గెస్ట్‌గా...ఒక్క రోజులో ఏదీ సాధ్యం కాదు. ఇంటి పనులు, పిల్లల చదువులు, నా వంటకాలు బ్లాగ్లు, వీడియోలు... ఇవన్నీ కొనసాగిస్తూ వచ్చాను. మా ఇద్దరు అమ్మాయిలు కాలేజీ స్థాయి చదువుల్లో రాణిస్తున్నారు. నా వంటలకు మొదట వారే టేస్టర్స్. ‘మా అమ్మ చేతి వంట ది బెస్ట్’ అని మార్కులు ఇస్తుంటారు. వాళ్ల పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటూనే దేశంలో జరిగే అన్నిరకాల ఫుడ్ ఫీస్ట్లకు జడ్జిగా హాజరయ్యాను. ఫుడ్ ఈవెంట్స్‌ను హోస్ట్ చేశాను. ప్రముఖ రెస్టారెంట్స్‌తో కలిసి వర్క్ చేశాను. వెస్ట్రన్ ఫుడ్స్ అందించే విషయంలో నన్ను ఆహ్వానిస్తుంటారు. నా వంటకాల రుచులనూ ఈ సందర్భంగా పరిచయం చేస్తుంటాను. టీవీ రియాలిటీ షో మాస్టర్ షెఫ్ ఇండియా ఫస్ట్సీజన్లో పాల్గొన్నాను. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషలలో కనక్స్ కిచెన్ పేరుతో ఫుడ్ ఛానెల్స్ తీసుకు వచ్చాను. ఏ విభాగంలోనైనా సవాళ్లు ఎదుర్కోవడానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ, వంటల తయారీలో ప్రతీ రోజూ, ప్రతి డిష్ ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. రుచిలో అందరినీ మెప్పించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఏ చిన్న పొరపాటు జరిగినా అంతా వృథా అయిపోతుంది. మనసు పెట్టి చేసే వంట మన అనుకున్నవారందరినీ చేరువ చేస్తుంది. అదే నా సక్సెస్ మంత్ర’ అని వివరించారు ఈ ఇండియన్ షెఫ్.ఫిట్‌గా హెల్తీగా...టేస్టీ, హెల్తీ, వెజ్, నాన్‌వెజ్... ఇలా ఇన్నిరకాల వంటకాలు చేస్తూ, రుచి చూస్తూ, తింటూ ఉంటారు కదా! ‘బరువు పెరుగుతారు’ అని చాలా మంది అనేవారు. కానీ, ఈ విషయంలోనూ హెల్తీగా ఫిట్‌గా ఉండటానికి కృషి చేస్తుంటాను. యాక్టివ్‌గా ఉండటానికి జిమ్, వాకింగ్ నా లైఫ్స్టైల్లో భాగం చేసుకున్నాను. – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి -
సహజీవనంలో కూడా ఆ చట్టం వర్తిస్తుందా?
గత నాలుగు సంవత్సరాలుగా ఒకవ్యక్తితో సహజీవనం చేస్తున్నాను. ఒకే ఇంట్లో ఉంటున్నాము. అంతా బాగానే ఉంది కదా పెళ్లి చేసుకుందాము అనుకున్నాను. పోయిన ఏడాది అతన్ని వాళ్ళ ఇంట్లో చెప్పమని అన్నాను. కానీ మా కులాలు వేరు కావడంతో వాళ్ళ ఇంట్లో మాత్రం వద్దు అన్నారు. అప్పటినుంచి తన వ్యవహార శైలి మారిపోయింది. ప్రతి చిన్నదానికి గొడవ పడుతున్నాడు. తన బలవంతంపై ఒకసారి అబార్షన్ కూడా చేయించుకున్నాను. ప్రతి వారం నాకు చెప్పకుండా ఎటో వెళ్తున్నాడు. తన వాటా అద్దెకానీ, ఇంటి సరుకులకు కానీ డబ్బు కూడా ఇవ్వడం లేదు. అడిగితే అప్పులు ఉన్నాయని అంటున్నాడు. అప్పుడప్పుడు చెయ్యి చేసుకుంటూ... ఇష్టం లేకుంటే వెళ్ళిపో అంటున్నాడు. పెళ్ళి చేసుకుంటా అని మోసం చేశాడు అని కేసు పెట్టమని ఒకరు సలహా ఇచ్చారు. నాకు మాత్రం గృహహింస చట్టం కింద కేసు వేయాలి అని ఉంది. ఏం చేయమంటారు?– ఒక సోదరి, విశాఖపట్నంపెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న వారికి కూడా గృహహింస నిరోధక చట్టం వర్తిస్తుంది. కానీ ప్రతి సహజీవనం కేసులో గృహహింస నిరోధక చట్టం వర్తింప చేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం ‘వివాహ స్వరూపంలో ఉన్న సంబంధం’ ఏ పరిస్థితుల్లో ఉంటుందో నిర్ధారించడానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఇవి సంపూర్ణమైనవి కాక΄ోయినా, అలాంటి సంబంధాల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయి అని కోర్టు చెప్పింది. అందులో ముఖ్యమైనవి...సంబంధం కొనసాగిన కాలవ్యవధిడీవీ చట్టంలోని సెక్షన్ 2(జ) మేరకు వారి సంబంధం ఒక సముచిత కాలం పాటు కొనసాగి ఉండాలి. ఆ కాలవ్యవధి ప్రతి కేసులోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు.సహవాస గృహం (షేర్డ్ హౌస్ హోల్డ్) ఏదో ఒక సమయంలో కలిసి ఒకే ఇంట్లో నివసించారు అనే ఆధారం.ఆర్థిక వనరుల భాగస్వామ్యం ఒకరికి ఒకరు ఆర్థికంగా సహకరించడం, జాయింట్ బ్యాంకు ఖాతాలు నిర్వహించడం, స్థిరాస్తులను ఇద్దరిపేర్లపై లేదా మహిళ పేరుపై కొనుగోలు చేయడం, వ్యాపారాల్లో లేదా షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలు.గృహ వ్యవహారాల నిర్వహణ ముఖ్యంగా మహిళకు ఇంటి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, ఉదాహరణకు వంట చేయడం, శుభ్రపరచడం, ఇంటిని నిర్వహించడం వంటి పనులు చేయడం.లైంగిక సంబంధం వివాహ స్వరూపంలోని సంబంధం అనేది కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే ఉండే లైంగిక సంబంధం కాదు. అది భావోద్వేగ, ఆత్మీయ బంధం, సంతానం పొందాలనే ఉద్దేశం, స్నేహభావం, పరస్పర ప్రేమాభిమానాలు, శ్రద్ధ వంటి లక్షణాలను కలిగి ఉండాలి.పిల్లలు/సంతానం పిల్లలు ఉండటం అనేది వివాహ స్వరూపంలోని సంబంధానికి బలమైన సూచన. ఎందుకంటే అది దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశాన్ని చూపిస్తుంది. పిల్లలను పెంచడం, వారి బాధ్యతలను పంచుకోవడం కూడా అలాంటి సంబంధానికి బలమైన సూచన.సామాజికంగా భార్యాభర్తలుగా ప్రవర్తించడంస్నేహితులు, బంధువులు, సమాజంలోని ఇతరుల ముందర భార్యాభర్తలుగా ప్రవర్తించడం, అలాగే తమను అదేవిధంగా పరిచయం చేసుకోవడం, ఆ సంబంధం వివాహ స్వరూపంలో ఉందని నిర్ధారించడానికి బలమైన ఆధారంగా పరిగణించబడుతుంది.ఇరుపక్షాల ఉద్దేశం, ప్రవర్తనతమ సంబంధం ఎలా ఉండాలి, దాని స్వభావం ఏమిటి, ఇద్దరి పాత్రలు, బాధ్యతలు ఏమిటి అనే విషయాలపై ఇరుపక్షాల ఉద్దేశం ఆ సంబంధ స్వభావాన్ని ప్రధానంగా నిర్ణయిస్తుంది. ఆ ఉద్దేశం స్పష్టంగా వ్యక్తపరచబడవచ్చు లేదా ప్రవర్తన ద్వారా పరోక్షంగా అర్థమవవచ్చు. వివాహానికి సాధారణంగా ఉండే లక్షణాల విషయంలో వారి ఉద్దేశమే ముఖ్యమైనది.పైన సూచించిన విధంగా మీ బంధం/సహజీవనం కొనసాగి ఉంటే మీకు గృహహింస చట్టం వర్తిస్తుంది. సహజీవనం చేస్తున్న వారు చాలామంది ఎటువంటి ఆధారాలను ఉంచుకోవడం లేదు. ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటే అందులో కేవలం ఒకరి పేరు మాత్రమే ఉంటుంది. ఇద్దరి పేర్లు ఉంటే మంచిది. వారి బంధాన్ని ఎవరికీ చెప్పుకోకుండా గోప్యంగా ఉంచుకోవడం కూడా మంచిది కాదు. పైన సూచించిన అంశాలను గుర్తుపెట్టుకుని సహజీవనం చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటే మంచిది.అదలా ఉంటే మీకు మీ సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకు పెళ్లి చేసుకుంటాను అని మోసపూరితంగా శారీరకంగా కలిశారు అంటూ బీ.ఎన్.ఎస్. లోని సెక్షన్ 69 ప్రకారం కూడా క్రిమినల్ కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది. కానీ అది నిజమైతే మాత్రమే క్రిమినల్ కేసు పెట్టండి. సెక్షన్ 69 ప్రకారం పురుషునికి మొదటి నుండి మోసపూరిత ఉద్దేశం ఉంది అని రుజువు చేయాల్సి ఉంటుంది. మీ హక్కులు మీకు ఉన్నప్పటికీ, మీ వ్యక్తిగత జీవితం చాలా ముఖ్యమైనది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ, వ్యక్తిగత జీవనం భంగపడకుండా చూసుకోండి. ప్రస్తుత బంధాన్ని ముగించవలసి వస్తే, ఆ పని చేసి కేసులను నడిపించవచ్చు.శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది( మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. )(చదవండి: కేన్సర్‌పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్‌పాండే హెల్త్ టిప్స్) -
కేన్సర్‌పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్‌పాండే హెల్త్ టిప్స్
కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక వచ్చిందంటే ఆ క్షణమే సగం ప్రాణాలు పోతాయ్. కానీ ఇలా భయపడొద్దని చెబుతోంది బాలీవుడ్ నటి రాజశ్రీ దేశ్‌పాండే. తాను కేన్సర్‌తో పోరాడినప్పుడు అలానే చేశానంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. మరి అదెలాగో చూద్దామా..!.'సేక్రేడ్ గేమ్స్' (2018), 'ట్రయల్ బై ఫైర్' (2023) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి రాజవ్రీ దేశ్పాండ్కు మార్చిలో గ్రేడ్1 రొమ్ము కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. తనకు ఇన్ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా (NOS) నిర్ధారణ అయినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఆమె తను తీసుకుంటున్న చికిత్స, వ్యాధి నిర్ధారణ, శారీరక మానసిక ఆరోగ్యంపై ఆ వ్యాధి ఎలా ప్రభావం చూపిస్తుంది తదితరాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటున్నారామె.పోరాడాలి..పోరాడుతూనే ఉండాలి..ఈ కేన్సర్ మహమ్మారి సోకిన తర్వాత మనం కంటకి కనిపించని భూతాలతో పోరాడుతూ ఉండాల్సి ఉంటుందన్నారామె. ఎందుకంటే నిలకడ లేని మనసులను మనల్ని ప్రలోభ పెట్టే ఇబ్బందుల్ని భూతలుగా అభివర్ణిస్తు ఇలా అన్నారామె. జీవితం అంటే అదేనని, పోరాడాలి..పోరాడుతూనే ఉండాలన్నారు. అస్సలు దీన్ని కష్టమైనదిగా భావించొద్దు. మనల్ని మనం సరిదిద్దుకునే జీవితంగా భావించండి. అప్పుడు ప్రతీది తేలికగా మారుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, మెరుగ్గా ఉండేలా జీవించే ప్రయత్నం చేయండి. రోజువారీ పనుల్లో ఆనందాన్ని వెత్తుక్కోవాలి. అలాగే కేన్సర్‌కి వాడే మందులు ఎంత కఠినండో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. 35 ఏళ్ల తర్వాత పెరిమెనోపాజ్ లేదా మెనోపాజ్ దశలో ఉన్న ప్రతి మహిళకు ఇవి ఎంత కష్టమో తనకు తెలుసని అన్నారు. ఆ చిన్ననాటి సంఘటనే నా ధైర్యం..ఈ కేన్సర్‌ని ఎదుర్కొనడానికి ధైర్యాన్ని ఇచ్చిన ఆ చిన్ననాటి సంఘటనను పంచుకున్నారు. చిన్నతనంలో తనకు దెయ్యాలంటే చాలా భయంగా ఉండేదని, అప్పుడు నాన్నగారు దెయ్యాలంటే చెడ్డవాళ్లని చెప్పారు. అంతే ఆ క్షణం నుంచి అవి అంటే భయం పోయింది. అలానే ఈ కేన్సర్‌ని కూడా చెడ్డదిగా బావించి, పారద్రోలే ప్రయత్నం చేశానంటోంది. అంతేగాదు అందుకోసం మనసు, హృదయం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ చెడ్డవాళ్ల తలంపు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తే చాలు అంటోంది. తన ఫ్యామిలీ డాక్టర్ కూడా అదే చెప్పారని చెప్పుకొచ్చింది. ఆయన మీలో సంతోషకరమైన హార్మోన్ల తోపాటు చుట్టూ సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులు ఉండాలన్నారు. దాంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలన్నారు. ఇలా చేస్తే ఏ మహమ్మారి మిమ్మల్ని ఏం చేయలేదన్నారు. కాగా నటి రాజశ్రీ దేశ్‌పాండే తన తదుపరి మరాఠీ చిత్రం 'బాప్యా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఈ నెల మే 15న విడుదల కానుంది. ఇందులో ఆమె ట్రాన్స్ మ్యాన్ పాత్ర పోషించినట్లు అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: ఇక నుంచి 'పీసీఓఎస్' కాదు 'పీఎంఓఎస్') -
ఇక నుంచి 'పీసీఓఎస్' కాదు 'పీఎంఓఎస్'
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరును అధికారికంగా పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్ (PMOS)గా మార్చారు. అందరు ఈ వ్యాధిని దీర్ఘకాలిక వ్యాధిగా కాకుండా సంతానలేమి సమస్యగా పరిగణిస్తూ అపార్థం చేసుకోవడంతో ప్రపంచ వైద్య ఏకాభిప్రాయం తర్వాత ఇలా అధికారికంగా ఆ వ్యాధి పేరు మార్చారు. ప్రపంచంలోని చాలామంది మహిళల్లో కనపించే అత్యంత సాధారనమైన రుగ్మతలలో ఒకటి ఇది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండేందుకు ఇలా చారిత్రాత్మకంగా కొత్తపేరు నామకరణం చేశారు. అంతర్జాతీయ ఎండోక్రైన్ అండ్ పునరుత్పత్తి ఆరోగ్య నిపుణుల నేతృత్వంలో ప్రపంచ వైద్యుల చర్చల ఫలితమే ఈ పీఎంఓస్గా పేరు మార్పు. దేని గురించి ఈ పేరు మార్పు..ఇన్నాళ్లు ఈ పీసీ ఓఎస్ అనేది అండాశయ తిత్తుల గురించే నొక్కి చెప్పలా ఉంది. నిజానికి చాలామంది మహిళలకు అండాశయ తిత్తులనేవి ఉండవు. అందువల్ల ఈ పందం "PCOS" వైద్యపరంగా తప్పుదోవ పట్టించేలా ఉందని నిపుణులు వాదించారు. పైగా జీవక్రియ, హార్మోన్లు, మానసిక ఆరోగ్యం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పాత పేరు సరిగా వివరించలేకపోయిందని అన్నారు.ఈ కొత్తపేరు ఏం వివరిస్తోందంటే..పాలీఎండోక్రైన్: అనేక హార్మోన్ల వ్యవస్థలు ప్రభావితమవుతాయిమెటబాలిక్: ఈ పరిస్థితి ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదంతో దగ్గరి సంబంధం ఉందిఓవేరియన్: ఇది ఇప్పటికీ అండోత్పత్తి, రుతుస్రావం, సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందిసిండ్రోమ్: ఇది ఒకదానికొకటి సంబంధించిన లక్షణాలు,ఆరోగ్య ప్రమాదాల సమూహాన్ని సూచిస్తుందిఈ పేరు మార్పు లక్ష్యం రోగ నిర్ధారణను మెరుగుపరచడం, అపవాదును తగ్గించడం, మరింత సంపూర్ణమైన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం అని ఎండోక్రైన్ సొసైటీ తెలిపింది. స్కాన్లలో అండాశయ తిత్తులు కనపడితే తప్ప తమకు PCOS ఉండదని చాలా మంది మహిళలు నమ్మడం వల్ల, పాత పేరు తరచుగా రోగ నిర్ధారణను ఆలస్యం చేసిందని నిపుణులు నొక్కి చెబుతున్నారు.PMOS అంటే..?PMOS అనేది గతంలో PCOS అని పిలువబడిన అదే వైద్య పరిస్థితి. దీని నిర్ధారణ ప్రమాణాలు మారలేదు. ఇది ఒక హార్మోనల, జీవక్రియ రుగ్మత,లక్షణాలు:క్రమరహిత లేదా ఋతుస్రావం లేకపోవడంఅధిక ఆండ్రోజెన్ హార్మోన్లుమొటిమలు,ముఖంపై రోమాలు పెరగడంబరువు పెరగడం లేదా బరువు తగ్గడంలో ఇబ్బందిఇన్సులిన్ నిరోధకతసంతానోత్పత్తి సవాళ్లుకొంతమంది రోగులలో అనేక అపరిపక్వ అండాశయ ఫోలికల్స్ ఉండటంఈ పరిస్థితి వల్ల వచ్చే ఆరోగ్య ప్రమాదాలు..టైప్ 2 మధుమేహంఅధిక రక్తపోటుగుండె జబ్బులుఫ్యాటీ లివర్ వ్యాధినిద్రలేమిడిప్రెషన్, ఆందోళనప్రపంచవ్యాప్తంగా, దాదాపు ఎనిమిది మంది మహిళల్లో ఒకరు PMOSతో బాధపడుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ సమస్యకు గల కారణాలు:నిశ్చల జీవనశైలిప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగంపెరుగుతున్న ఊబకాయంసరిగా నిద్రపోకపోవడంఒత్తిడివంశపారంపర్య కారణాలురోగ నిర్ధారణను మెరుగుపరుస్తుందిఇక ఈ కొత్త పేరు PMOS అనే పదం సంతానలేమి సమస్యల నుంచి దృష్టిని మళ్లించి, మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యల కోసం ముందుగానే స్క్రీనింగ్ చేయించుకోనేలా ప్రోత్సహిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది మహిళలు ఈ వ్యాధిని తేలికగా తీసుకుని వైద్య పరీక్షలు చేయించుకునేవారు కాదు. ఈ పేరు మార్పుతో మహిళలంతా ఆరోగ్య స్పృహతో ఆలోచించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: ఎవరీ లారెన్ వాసర్..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్‌గా మార్చింది..) -
ఎవరీ లారెన్ వాసర్..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్‌గా మార్చింది..
మెట్‌గాలా 2026లో ఎందరో ట్రెండ్ సెట్టింగ్, రికార్డ్ మేకింగ్ లుక్స్‌ని అందించారు. చాలామంది వివిధ రకాల ఫ్యాషన్ వేర్లతో సందడి చేశారు. ఎందరో సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించిన యాక్సెసరీలు, కళాత్మక డిజైనర్ వేర్లు చర్చనీయాంశంగా మారాయి. వారిలో ఒక మహిళ మాత్రం అందర్నీ ఆకర్షించేలా సన్సేషన్‌గా మారింది. ఈ అమ్మాయి లుక్‌ని చూడగానే టాలీవుడ్ మూవీ మురారీలోని "బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో" అనే పాట ఠక్కున గుర్తుస్తోంది. అయితే ఆమె కథ తెలిస్తే మాత్ర కన్నీళ్లు జలజల వచ్చేస్తాయ్. ఆ బాధను దిగమింగి అజేయంగా నిలబడి ఎదగాలన్న ఆమె తపన చూస్తే స్థైర్యం అంటే ఇది కదా అనిపిస్తుంది. చిన్నచిన్న సమస్యలకే సతమతమై ప్రాణాలకు తీసుకునే యవతకు ఆమె కథ ఓ స్ఫూర్తి.ఆ ధీర మహిళే అమెరికన్ మోడల్ లారెన్ వాసర్. ఆమె మే4న న్యూయార్క్ నగరంలోని మెట్ గాలా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో బంగారు రంగు ప్రబల్ గురుంగ్ సూట్ ధరించి వచ్చింది. ఇందులో పెద్ద సన్సేషన్ ఏముంది అనుకోకండి. ఆమె ఈ వేడుకలో నిజమైన బంగారు కృత్రిమ కాళ్లతో వచ్చింది. అందరు ఈ వేడుకలో ఆర్టిఫిషయల్ యాక్సెసరీలతో రెడ్‌కార్పెట్‌పైకి రాగా ఆమె మాత్రం నిజమైన "బంగారు కాళ్ల"తో వచ్చి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. పైగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. అంతేగాదు దీని కారణంగానే లారెన్‌కు "బంగారు కాళ్ల అమ్మాయి" ముద్దు పేరు కూడా వచ్చింది.లారెన్ వాసర్ ఎవరు?లారెన్ వాసర్ అమెరికాలో ప్రసిద్ధిగాంచిన మోడల్. 38 ఏళ్ల లారెన్ వోగ్, గ్లామర్ అండ్ హార్పర్ బజార్ వంటి ఫ్యాషన్ పత్రికల ముఖచిత్రంగా ఫోజులిచ్చింది కూడా. అంతేగాదు 2017లో ఫోర్బ్స్ అండర్ 30 పురస్కార గ్రహీతగా కూడా ఎంపికైంది అలాగే 2023లో గ్లామర్ జర్మనీ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా నిలిచారామె. 2023లో 'ది డైరీ ఆఫ్ ఎ సీఈఓ' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ..లారెన్ తన కథను పంచుకోవడంతో ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. సడెన్‌గా ఒక రోజు నిద్రలోనే కోమాలోకి వెళ్లి మృత్యువు అంచులదాక వెళ్లింది. సకాలంలో ఆమె కుటుంబ సభ్యులు చూడకపోతే లారెన్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయుండేవి. ఏం జరిగిందో తెలియదు. లారెన్ గదిలోకి వచ్చేప్పటికీ అపస్మారక స్థితలో బెడ్‌పై పడి ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా...అక్కడ ఆమె బతికే అవకాశాలు చాల తక్కువని తేల్చేశారు వైద్యులు. పాదాలు నల్లగా మారిపోవడం వంటి ఆకస్మిక మార్పులన్నీ లారెన్స్ శరీరంలో చూస్తుండగానే చోటుచేసుకోవడం మొదలైంది. ఆమె పాదాలు నల్లగా అయిపోవడం ప్రారంభించింది. కానీ ఆమె తల్లిదండ్రుల తమ కూతర్ని ఏదోలా బతికించమని వైద్యులని వేడుకోవడంతో డాక్టర్లు తమ సాయశక్తులా కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రాణం కాపాడేందుకే మొదట నీలం రంగులోకి మారిపోతున్న కుడికాలుని తొలగించారు. ఆమెకు టాక్సిక్ షాక్ సిండ్రోమ్(టీఎస్ఎస్)గా పిలిచే వ్యాధి బారిన పడ్డట్లు వెల్లడించారు వైద్యులు. ఇది ఒక నిర్ధిష్టమైన బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థాల వల్ల కలిగే అరుదైన ప్రాణాంతక వ్యాధి. ఆ తర్వాత ఆమె శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి కొన్ని రకాల ద్రవాలను పంపించారు వైద్యులు. దాంతో జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎడమ కాలుని కూడా తొలగించారు వైద్యులు. దాంతో సుదీర్ఘంగా ఎనిమిది నెలల పాలు వీల్‌చైర్‌కి పరిమితమైపోయిందది. జీవితం ముగిసిపోయింది ఇంకేమి లేదనుకున్న నైరాశ్యంలో ఉన్న లారెన్‌కు 14 ఏళ్ల తమ్ముడిని చూడగానే కొత్త ఆశ రేకెత్తింది. కనీసం వాడి బాగోగులు చూసుకోవడం కోసమైన బతకాలని నిర్ణయించుకుని తన సమస్యను అంగీకరించడం మొదలుపెట్టింది. అలా మోడల్లో నెమ్మది నెమ్మదిగా రాణిస్తూ..దివ్యాంగుల్లో స్ఫూర్తిని రగులుస్తోందామె. ఇంతకీ లారెన్‌కి సోకిన టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే..టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే?టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (టీఎస్ఎస్) అంటే టాంపోన్ వాడకంతో సంబంధం కలిగి వ్యాధి. ఇక్కడ టాంపోన్ అంటే టాంపోన్ (Tampon) అనేది ఋతుస్రావం సమయంలో (Periods) వెలువడే రక్తాన్ని పీల్చుకోవడానికి యోనిలోకి చొప్పించే ఒక చిన్న, పత్తి లేదా ఇతర శోషక పదార్థాలతో చేసిన స్త్రీ పరిశుభ్రత ఉత్పత్తి. ఇది ప్యాడ్లకు భిన్నంగా, ఇది శరీరం లోపల ఉంటుంది. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది గంటలకు మించి ఉంచకూడదు. లేదంటే దీనిలో ఉండే స్టెఫిలోకాకస్ ఆరియస్ బాక్టీరియా రక్తప్రవాహంలో విషపదార్థాలను విడుదల చేసి టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికారణంగా తీవ్రమైన అవయవ నష్టం లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.🇬🇧🩸🦿 Beaucoup l’ont vue au Met Gala sans savoir qu’elle a PERDU ses 2 jambes à cause d’un TAMPON HYGIÉNIQUE.Lauren Wasser était une mannequin de 24 ans en pleine ascension lorsqu’un simple tampon a failli lui coûter la vie. En octobre 2012, elle s’est couchée fiévreuse et a… pic.twitter.com/bJcysI84Ah— Cultination (@Cultination1) May 11, 2026 ఈ సిండ్రోమ్ లక్షణాలు:తక్కువ రక్తపోటుతల తిరగడం, మగతగా ఉండటం లేదా స్పృహ కోల్పోవడంనీళ్ల విరేచనాలుఅకస్మాత్తుగా అధిక జ్వరం, చలి, ఒళ్ళు నొప్పులు మరియు ఇతర ఫ్లూ వంటి లక్షణాలువికారం లేదా వాంతులుపాదాల అరికాళ్ళు లేదా చేతుల అరచేతులపై చర్మం పొట్టులా ఊడిపోవడంకళ్ళు, గొంతు ఎర్రబడటంతీవ్రమైన ఎండదెబ్బలాంటి దద్దుర్లు లేదా చర్మంపై ఎర్రటి చుక్కలుఆ ఘటనతో రాబిన్ డేనియల్సన్ చట్టంఆ వ్యాధి తన జీవితాన్ని మార్చేయడంతో లారెన్ రాబిన్ డేనియల్సన్ అనే ఋతుస్రావ సంరక్షణ ఉత్పత్తుల భద్రతా చట్టాన్ని తీసుకొచ్చేలా పాటుపడింది. పైగా దానికి మద్దతుదారిగా మారింది. ఇది ఋతుస్రావ ఉత్పత్తులలో తరచుగా కనిపించే రసాయనాలు, సింథటిక్ ఫైబర్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై పరిశోధన చేయమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)ను ఆదేశించే లక్ష్యంతో ప్రతిపాదించబడిన ఒక US బిల్లు.(చదవండి: అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?) -
కేన్స్‌లో అందమైన గులాబీలా అలియా భట్
ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరంలో 79వ కేన్స్ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆరంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 23 వరకు జరుగనున్నాయి. ఇప్పటికే అలియా ఫ్రాన్స్ చేరుకున్నారు. ఓ బ్యూటీ ప్రాడెక్ట్కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆమె అందులో భాగంగానే అక్కడకి వెళ్లారు. తొలి రోజు రెడ్ కార్పెట్‌పై నడిచే ముందు ఆలియా ఫ్రెంచ్ రివెరా దగ్గర ఫ్లోరల్ ప్రింట్ ఫ్రాక్‌లో అద్భుతంగా కనిపించి ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. తాజాగా కాన్స్ రెడ్కార్పెట్లపై అలియా అందర్నీ కట్టిపడేసింది. ఈ బ్యూటీ గతేడాది తర్వాత ఇలా మళ్లీ ఇలా కేన్స్‌లో సందడి చేయడం రెండోసారి. రెడ్‌కార్పెట్‌పై అలియా గులాబీలా హోయలు ఒలికిస్తూ నడిచిన తీరు అందర్నీ అమితంగా ఆకర్షించింది. తమారా రాల్ఫ్ రూపొందించిన లేత గులాబీ బ్లష్-టోన్డ్ బస్టియర్ గౌన్‌లో అత్యద్భుతంగా కనిపించింది. దీనికి మరిన్ని హంగులు చేర్చి భారతీయ లుక్‌ని అందించారు బాలీవుడ్ నిర్మాత రియాకపూర్. అలియా తన లుక్‌కి ఒక స్టేట్మెంట్ జెమ్‌స్టోన్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులను జతచేసి మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేశారామె. చెప్పాలంటే కాన్స్‌లో అలియా ఫ్యాషన్ సందడే ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. రెడ్ కార్పెట్‌పై కనిపించడానికి ముందే అలియా ఫ్యాషన్ ప్రియులను ఇంప్రెస్ చేసింది. Alia Bhatt at Cannes Film Festival 📸 pic.twitter.com/NitpbocSJN— Alia's nation (@Aliasnation) May 12, 2026రెండోసారి రెడ్కార్ప్ట్పై ముగ్ధమనోహరంగా కనిపించి మరింతగా ఆకట్టుకుంది. కాగా, ఈ ఏడాది కాన్స్ వేడుకల్లో వివిధ సినీ పరిశ్రమలు తోపాటు ప్రాంతీయ సినిమా రంగాల నుంచి కూడా గణనీయంగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అలియా తోపాటు ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా లోరియల్ పారిస్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా మరోసారి సందడి చేయనున్నారు. ఇక చిత్రనిర్మాత అశుతోష్ గోవారికర్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ హోదాలో భారతదేశ అధికారిక ప్రతినిధి బృందంలో భాగంగా హాజరుకానున్నారు. అలాగే చిత్రనిర్మాత కరణ్ జోహార్‌తో పాటు, నటీమణులు తారా సుతారియా, మౌనీ రాయ్, పూజా బాత్రా తదితరులు కూడా సందడి చేయనుననారు. (చదవండి: గోల్డ్ డిజైనర్‌వేర్‌లో రాధికా మర్చంట్ స్టన్నింగ్ లుక్!) -
రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
పెళ్లికి ముఖ్యమైంది ముహూర్తం. పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుంచి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తాం. అలాంటి ముహూర్తాలకు 36 రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వివాహాలు భారీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒక్కటయ్యాయి. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి) కావడంతో వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ క్రమంలో ఈనెలలో ఆఖరి ముహూర్తమైన 13న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. అందుకు ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధి వేదిక కానుంది. మళ్లీ జూన్ 19 నుంచి వివాహాధి శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. 36 రోజులు ఖాళీ వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, పచ్చిపూల మండపాలు నిర్మించే వారు, డెకరేషన్ చేసేవారు, షామియానా పందిళ్లు వేసేవారు, వాయిద్యకారులు, క్యాటరింగ్ వ్యాపారులు, లైటింగ్ ఏర్పాటు చేసే వారికి 36 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జూన్ 19 నుంచి బిజీ కానున్నారు. ఈ ఏడాది ముహూర్తాలు ఇవే వివాహాలకు ఈ ఏడాది జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28, జులై 1, 2, 3, 4, 5, 8, 9, ఆగస్టు 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, సెపె్టంబర్ 1, 3, 4, 5, అక్టోబర్ 11, 14, 29, 30, నవంబర్ 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26, డిసెంబర్ 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31 తేదీల్లో ముహూర్తాలున్నాయి. ఈ మాసమంతా ఆగాల్సిందేఈ నెల 14 నుంచి శుభకార్యాలకు విరామం ఏర్పడనుంది. మే 18 నుంచి జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠమాసం కారణంగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు ప్రారంభోత్సవాలు వంటి ఏవిధమైన శుభకార్యాలు జరపకూడదు. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ 36 రోజులు ఆగాల్సిందే. – గోవింద వఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల -
మూడు రోజులు తిండి మానేస్తే ఏమవుతుంది?
సోషల్ మీడియాలో హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్లు మొదలుకొని ఫిట్నెస్ విషయంలో అత్యంత శ్రద్ధ వహించే సెలబ్రిటీల వరకు.. ఇప్పుడు అందరి నోటా ‘72 గంటల ఉపవాసం’ గురించే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ తన ఫిట్నెస్ సీక్రెట్‌ను బయటపెడుతూ.. క్రమశిక్షణతో పాటు ఫిట్నెస్ను కాపాడుకునేందుకు తాను అప్పుడప్పుడు మూడు రోజుల పాటు కఠిన ఉపవాసం చేస్తానని చెప్పడంతో ఈ ట్రెండ్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. అసలు 72 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటే శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి? ఇది నిజంగానే సురక్షితమేనా? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరి మదినీ తొలిచేస్తున్నాయి.72 గంటల ఫాస్టింగ్‌పై ఎందుకంత క్రేజ్ఒకప్పుడు కేవలం వైద్యపరమైన లేదా మతపరమైన కారణాలకే పరిమితమైన ఉపవాసం, ఇప్పుడు మోడ్రన్ వెల్నెస్ కల్చర్‌లో భాగమైపోయింది. చాలా మంది సెలబ్రిటీలు, ఫిట్నెస్ నిపుణులు శరీరాన్ని ‘రీసెట్’ చేయడానికి, క్రమశిక్షణను మెరుగుపరచుకోవడానికి, బరువు తగ్గడానికి ఉపవాసాలు ఒక గొప్ప మార్గమని చెబుతున్నారు. మూడు రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడం వల్ల అధిక ఏకాగ్రత అలవడటంతో పాటు శరీరం చాలా తేలికగా అనిపిస్తుందంటూ వారు చేస్తున్న పోస్టులు చూస్టుంటే.. ఇది కొత్త ఆరోగ్య రహస్యమా లేక మరొక ట్రెండా అనే క్యూరియాసిటీ సామాన్యుల్లో సైతం కలుగుతోంది.శరీరంలో జరిగే సైంటిఫిక్ మ్యాజిక్ ఇదే72 గంటల ఉపవాసం అంటే.. మూడు రోజుల పాటు శరీరానికి ఎలాంటి క్యాలరీలు ఇవ్వకపోవడం. కేవలం నీరు, టీ లేదా బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకుంటారు. ఉపవాసం మొదలైన ఒక రోజు తర్వాత, శరీరంలో నిల్వ ఉన్న చక్కెర స్థాయిలు పూర్తిగా తగ్గిపోయి, అప్పటి నుండి శక్తి కోసం కొవ్వును కరిగించడం మొదలవుతుంది. ఈ ప్రక్రియనే ‘కీటోసిస్’ అంటారు. మూడవ రోజుకు, శరీరం పూర్తిగా ఈ స్థితికి అలవాటు పడి, కార్బోహైడ్రేట్లకు బదులుగా కొవ్వు ద్వారా వచ్చే ఇంధనాన్ని వాడుకుంటుంది. దీనివల్ల కొందరిలో ఆకలి తగ్గి మానసిక స్పష్టత వస్తే, మరికొందరిలో శరీరం సర్దుబాటు చేసుకునే క్రమంలో విపరీతమైన అలసట, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఇది నిజంగానే బాడీని ‘డీటాక్స్’ చేస్తుందా?సాధారణ చర్చలలో ‘డీటాక్స్’ అనే పదం తరచుగా వినిపిస్తుంది. కానీ శాస్త్రీయంగా చూస్తే మన శరీరంలో సహజంగానే కాలేయం, మూత్రపిండాలు డీటాక్స్ వ్యవస్థలుగా పనిచేస్తాయి. నిజానికి ఉపవాసం ఎలా పనిచేస్తుందంటే.. శరీరం శక్తిని గ్రహించే విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. ఈ సుదీర్ఘ ఉపవాస సమయంలో, ఇన్సులిన్ స్థాయిలు పడిపోయి, కొవ్వు నిల్వలు చురుకుగా కరగడం మొదలవుతుంది. దీనికి తోడు పాడైన కణాలను శుభ్రపరిచే ‘ఆటోఫాగీ’ వంటి ప్రక్రియలు వేగవంతం అవుతాయి. అందుకే చాలా మంది దీనిని ఒక ‘మెటబాలిక్ రీసెట్’గా భావిస్తారు. అయితే ఈ ప్రభావాలు అందరిలో ఒకేలా ఉండవు.ఎవరెవరు ఈ సాహసానికి దూరంగా ఉండాలి?నిజానికి ఈ 72 గంటల ఉపవాసం అనేది అందరూ క్యాజువల్‌గా చేసే ఒక లైఫ్‌స్టైల్ అలవాటు కాదు. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర పరిణామాలు తప్పవు. బిజీ షెడ్యూల్, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేసేవారు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఉపవాసం చేస్తే తీవ్రమైన నీరసం, లో బ్లడ్ షుగర్ లేదా డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఆరోగ్యవంతులైన వ్యక్తులు సైతం సరైన పర్యవేక్షణ లేకుండా చేస్తే తలనొప్పి, అలసట, ఏకాగ్రత లోపించడం అనేవి జరుగుతాయి. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, శిక్షణలో ఉన్న అథ్లెట్లు దీనికి కచ్చితంగా దూరంగా ఉండాలి.లాభాల కంటే ముప్పు ఎక్కువసోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా 72 గంటల ఉపవాసం అనేది అద్భుతాలు చేసే మ్యాజిక్ ట్రిక్ కాదు. నిపుణుల పర్యవేక్షణలో, సరైన ప్రణాళికతో చేస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన అవగాహన లేకుండా ఎవరికి వారు సొంతంగా ప్రయోగాలు చేస్తే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. దీని ఫలితాలు అందరికీ ఒకేలా ఉండవు కాబట్టి, వైద్యుల సలహా లేకుండా.. ముఖ్యంగా గర్భిణిలు, మందులు వాడేవారు, 18 ఏళ్ల లోపు వారు ఈ ఉపవాసాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు! -
చిలుకల తల్లికి గ్రీన్ ఆస్కార్
చంబల్... ఒకప్పుడు బందిపోట్లకు నెలవు. ఇప్పుడు అదే చంబల్ అంతరించిపోతున్న అందమైన పక్షి జాతికి అభయారణ్యం. ఆ మార్పుకు కారణం – పర్వీన్ షేక్. నిప్పుకణిక లాంటి ముక్కుతో చిలుకల్లా ఉండే ‘ఇండియన్ స్కిమ్మర్’ పక్షులు ఒరిజినల్‌గా ఏ దేశానివి. అవి మన దేశానికి వలస పక్షులా? లేక మన దేశంలో ఉంటాయా? ఆ పక్షులు అంతరిస్తుంటే ఆమె వాటి సంఖ్యను పెంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అందుకే ‘గ్రీన్ ఆస్కార్స్’గా పిలిచే ‘విట్లీ అవార్డు’ ఆమెను వరించింది.లండన్ లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ హాల్... వేదిక మీద బ్రిటన్ రాకుమారి ప్రిన్సెస్ ఆన్... ఆమె చేతిలో 50,000 పౌండ్ల చెక్... ప్రిన్సెస్ ఆన్ నుంచి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక ‘విట్లీ అవార్డు’ అందుకునేందుకు పర్వీన్ షేక్ వేదిక ఎక్కగానే చప్పట్లు మార్మోగాయి. అంతరించిపోతున్న ‘ఇండియన్ స్కిమ్మర్’ అనే చంబల్ చిలుకలను కాపాడినందుకు ఆమెకు గౌరవం. ‘ఈ అవార్డు నాకు కాదు, చంబల్ ఇసుకలో గూళ్లకు కాపలా కాసిన నా గ్రామీణ సోదరులకు’ అని వేదిక మీద ఆమె చెప్పిన మాటలకు హాల్ అంతా చప్పట్లతో మార్మోగింది. ‘గ్రీన్ ఆస్కార్’గా భావించే విట్లీ అవార్డును అందుకున్న పర్వీన్ తాను చేసిన సుదీర్ఘ పోరాటాన్ని తలుచుకుని ఉద్వేగం పొందింది.పక్షి ప్రేమికురాలు...పర్వీన్ షేక్ ముంబై అమ్మాయి. రామ్‌నరైన్ రూయా కాలేజీలో జువాలజీ చదివిన రోజుల్లోనే పక్షుల మీద పిచ్చి పట్టుకుంది. ‘‘నా కాలేజ్ చదువే నన్ను బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వైపు నడిపించింది’’ అంటారామె. 2012లో బాంబే నేచురల్ హిస్టరీలో సైంటిస్ట్‌గా చేరిన పర్వీన్ కి ఒక క్లారిటీ ఉండేది– ‘అంతరించిపోతున్న పక్షి జాతుల కోసం పని చేయాలి’ అని. ఆ అన్వేషణలోనే ఒకరోజు ఆమె దృష్టి ఒక మేగజీన్లోని ఒక పక్షి ఫొటో మీద పడింది. నల్లటి రెక్కలు, తెల్లటి పొట్ట, నిప్పు అంటుకున్నట్టు ఎర్రగా మెరిసే ముక్కు. కింది దవడ పైదవడ కంటే పొడుగు. పేరు ‘ఇండియన్ స్కిమ్మర్’. ఒకప్పుడు దక్షిణ ఆసియా అంతటా కనిపించే ఈ పక్షి, ఇప్పుడు ఇండియా, బంగ్లాదేశ్‌లలో మాత్రమే మిగిలింది. మన దేశంలో 1990లో 10,000 ఉండే ఈ పక్షులు 2017కి 400కి పడిపోయాయని తెలిశాక ఆమె గుండె విలవిలలాడింది. వీటిని కాపాడలేనా అనుకుందామె.చంబల్ లోయకు ప్రయాణం...మన దేశంలో ఇండియన్ స్కిమ్మర్ పక్షులు ఎక్కువగా చంబల్ లోయలో ఉంటాయి. అందుకే డిసెంబర్ 2016లో పర్వీన్ బృందం చంబల్ నది మీద బోట్లో సర్వే మొదలుపెట్టింది. ఇది ఇండియాలో ఇండియన్ స్కిమ్మర్ మీద జరిగిన మొదటి శాస్త్రీయ సర్వే. అక్కడ కనపడిన దృశ్యాలు ఆమె మనసును ఇంకా వికలం చేశాయి. ఇండియన్ స్కిమ్మర్ పక్షి నది ఒడ్డున ఇసుక లోడి గుడ్లు పెడుతుంది. అదే దాని గూడు. అలాంటి గూళ్ల మీద ఆవుల మందలు నడుస్తూ నాశనం చేస్తున్నాయి. ఇసుక మాఫియా ట్రాక్టర్లకు మిగిలినవి బలి అవుతున్నాయి. మిగతావి కుక్కలు, నక్కలు, మనుషుల ఆటలకు. ‘పక్షులను చంపుతోంది ప్రకృతి కాదు. మన నిర్లక్ష్యం’’ అని ఆ రోజు డైరీలో రాసుకుంది.నెస్ట్ గార్డియన్స్...‘గూళ్లకు కాపలా పెడితే?’– పగిలిన గుడ్డు చేతిలో పట్టుకుని పర్వీన్ వేసుకున్న శపథం అది. కానీ చెప్పడం తేలిక. చేయడం? బందిపోట్ల లోయ అనే పేరున్న చంబల్‌లో, ఇసుక మాఫియా రాజ్యమేలే చోట, ముంబై నుంచి వచ్చిన ఒక మహిళా సైంటిస్టు మాట ఎవరు వింటారు? పర్వీన్ గ్రామాల్లో తిరిగింది. ‘ఈ పక్షులు నది ఆరోగ్యానికి గుర్తు. ఇవి పోతే నది చచ్చిపోయినట్టే. నది చస్తే మనమూ బతకలేం’ అని అర్థమయ్యే భాషలో చెప్పింది. మొదట్లో నవ్వారు. తర్వాత విన్నారు. అర్థం చేసుకున్నారు. అలా 30 మందికి పైగా స్థానిక యువకులు, మత్స్యకారులు ‘నెస్ట్ గార్డియన్స్’గా మారారు.వాళ్లు చేసే పని మామూలుది కాదు. ఆ పక్షుల బ్రీడింగ్ సీజన్ మార్చి నుంచి జూన్ దాకా ఎండనకా వాననకా, ఇసుక తిన్నెల దగ్గర కాపలా కాస్తారు. గూళ్ల చుట్టూ వెదురు కంచె వేసి ‘పక్షులు గుడ్లు పెడుతున్నాయి, దయచేసి దూరంగా వెళ్లండి’ అని బోర్డులు పెడతారు. ఫలితం? 2025లో పక్షుల సంఖ్య 400 నుంచి 1000 దాటింది. అంతకంటే గొప్ప విషయం ఏంటే, ‘ఇవి మన పక్షులు’ అని గ్రామస్తులు ఓన్ చేసుకున్నారు. ఇదే పర్వీన్ కి అతిపెద్ద విజయం. పర్వీన్ చేతిలో తుపాకీ లేదు. ఇసుక తిన్నెల మీద వెలిసిన పక్షుల గూళ్ల మీద అవ్యాజమైన ప్రేమ ఒక్కటే ఉంది. అందుకే ఇవాళ చంబల్ చిలుకలు తిరిగి ఆకాశంలో ఎగురుతున్నాయి. ‘గ్రీన్ ఆస్కార్’ పర్వీన్ కి దక్కిన గౌరవం కాదు, చంబల్ నది ఆమె పాదాలు కడిగి చెప్పిన కృతజ్ఞత. -
నీట్‌గా ఉందాం..ఆ మొక్కల చిక్కులొద్దు!
మొక్కలు నేల మీదే పెరుగుతూ ఉంటాయన్నది అపోహ. కానీ అవి నేల మీదే కాదు... మానవుల చర్మం సహా అన్ని రకాల జంతువుల దేహాల మీదా, మొక్కల మీద కూడా పెరుగుతుంటాయి. మనుషుల చర్మం మీదే కాదు... వెంట్రుకల మీదా, గోళ్ల మీద కూడా పెరుగుతాయి. దీనికి తార్కాణాలను మనం చాలాసార్లు అనుభవించే ఉంటాం. కానీ అవి మన దేహం మీద పెరిగే ‘ఫంగస్’ కారణంగా అని తెలియదు. ఉదాహరణకు తప్పని పరిస్థితుల్లో తడి అండర్వేర్ తొడుక్కున్న సమయాల్లో గజ్జల్లో ఒరుసుకుపోయినట్లు కావడం, తొడలు, పిరుదులు, ప్రైవేట్ పార్ట్స్ వద్ద చర్మం నల్లబారి దురదగా అనిపించడం, గోరు మీద గోరుచుట్టు... ఇవన్నీ ఫంగస్ పెరుగుదల వల్ల కనిపించేవే. వీటినే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా ఫంగల్ డిసీజెస్‌గా పేర్కొంటారు. సాధారణంగా మన దేహంలోని అనేక చోట్ల పెరిగే ఫంగల్ డిసీజెస్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం...నిజానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి దేహంలో అక్కడా ఇక్కడా అని కాకుండా ఎక్కడైనా రావచ్చు. అందుకే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లను అబిక్విటస్ అంటారు. నిజానికి నేల (సాయిల్) మీద లేదా పండ్ల మీద కూడా కుళ్లుతున్నచోట ఇవి మొలుస్తుంటాయి. పండ్లు కుళ్లడానికి కారణం ఈ ఫంగసే. వృథా పదార్థాలన్నీ మళ్లీ ఖనిజలవణాల్లా రూపంలోకి మారిపోయి తమ మౌలికమైన అణువులుగా తనలో కలిసిపోడానికి ప్రకృతి తన కోసమే ఈ ఫంగల్ రూపాలనుసృష్టించుకుందని చెప్పవచ్చు. అలా చూసినప్పుడు ఫంగస్ జీవులు ప్రకృతికి మేలే చేస్తాయి.పూర్తిగా మొక్కలూ కావు... సూక్ష్మజీవులూ కావు... జీవశాస్త్రపరం (బయలాజికల్)గా చూసినప్పుడు మొదట్లో వాటిని మొక్కల్లోని ఒక విభాగంగా చూసేవారు. అందుకే వృక్షశాస్త్రం (బాటనీ)లోని ఒక విభాగంగానే వాటి అధ్యయనం కొనసాగేది. కానీ వాటిలోనే పలు రకాల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అవి పూర్తిగా మొక్కలూ కావనీ, అలాగని పూర్తిగా సూక్ష్మజీవుల కింద కూడా వాటిని పరిగణించలేమని తేలింది. దాంతో ఫంగస్‌లను ఇప్పటికీ వృక్షశాస్త్రవిభాగంలోనే చదువుతున్నప్పటికీ... వాటి గురించి చాలా లోతుగా, సూక్ష్మంగా అధ్యయనం చేసేవారు మాత్రం ఫంగస్‌లను ‘మైకాలజీ’ అనే ఓ ప్రత్యేక శాస్త్రవిభాగంగా పరిణమిస్తుంటారు.ఫంగస్ రకాలు... ఫంగస్‌లోని రకాలను వర్గీకరించేటప్పుడు వాటిలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. ఉదాహరణకు...ఆకృతిని బట్టి : వాటి ఆకారాన్నీ / ఆకృతిని బట్టి వర్గీకరణ చేస్తే... ఈస్ట్ అనీ, మౌల్డ్స్ అనీ వర్గీకరించవచ్చు, ఇందులో ఈస్ట్ అనేవి ఆహారాన్ని పులిసేలా చేస్తూ మనకు ఉపయోగపడుతుంటాయి. కానీ మౌల్డ్స్ మాత్రం ఆహారానికి బూజులా పట్టి మన ఆహారాలను తినడానికి యోగ్యం కాకుండా చేస్తాయి. (ఉదాహరణకు బ్రెడ్‌ను అలాగే వదిలేస్తే ఆకుపచ్చరంగులో బూజు రావడం మనకు తెలిసిందే).స్పీషీస్ (ప్రజాతులను) ఆధారంగా: ఫంగస్ ప్రజాతులను అంటే వాటి స్పీషీస్‌ను బట్టి చూసినప్పుడు... డెర్మటోఫైట్ స్పీషీస్, క్యాండిడా స్పీషీస్, మలేసేజియా స్పీషీస్ అనే రకాలు ఉంటాయి. మన దేహంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో చర్మంపై వచ్చేవి డర్మటోఫైట్స్ స్పీషీస్‌కు చెందినవనీ, ఇక గజ్జలు లేదా చర్మం ముడతల్లో వచ్చే ఎర్రటి ఇన్ఫెక్షన్ను క్యాండిడా స్పీషీస్వని చెప్పవచ్చు.ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి : చర్మంపై వాటి తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే వాటిని ఉపరితలానికే పరిమితమయ్యేవి (సూపర్ఫీషియల్), చర్మంలోపల చాలా లోతుగా ఇన్ఫెక్ట్ చేసేవి (డీప్ స్కిన్) అని వర్గీకరించవచ్చు. సాధారణంగా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ పైపైనే వస్తాయి. కానీ ఎయిడ్స్ వ్యాధి సోకినవారిలో వచ్చేవి చాలా డీప్ స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉంటాయి.ఎన్విరాన్మెంట్ను బట్టి చూస్తే : మన పర్యావరణంలో అవి పెరిగే చోటను బట్టి కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను వర్గీకరించవచ్చు. ఉదాహరణకు నేల మీద పెరిగేవాటిని జియోఫిలిక్ అనీ, జంతువులపై నివసించేవాటిని జూఫిలిక్ అనీ, కేవలం మానవుల దేహంపైనే పెరిగేవాటిని ‘యాంథ్రపోఫిలిక్’ అని అంటారు.సాధారణంగా అడల్ట్స్‌లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లుటీనియా కార్పోరిస్ : ఇది టైకోఫైటాన్ రబ్రబ్ అనే పంగ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది పాదాలూ, చేతులు, మర్మావయవాలు (ప్రైవేట్ ΄పార్ట్స్) మినహా దేహంలో ఎక్కడైనా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది అన్ని వయసుల వారిలోనూ రావచ్చు. ముఖ్యంగా పాడిపశువుల, పందుల పెంపకంలో నిమగ్నమయ్యేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు కొందరిలో వారాలూ, నెలలూ, కొన్ని సందర్భాల్లో కొన్నేళ్ల పాటు కూడా ఏమాత్రం మానకుండా అదేపనిగా కనిపిస్తూ ఉంటుంది. చాలాసందర్భాల్లో ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే కొందరిలో మాత్రం దురద రావచ్చు. కొందరిలో మాత్రం చిన్నవి మొదలుకొని పెద్దగా ఉండే ఎర్రటి, గుండ్రటి, అంచులు ఉబ్బినట్టుగా కనిపించే ప్యాచ్‌లు రావచ్చు. ఈ గుండ్రటి అంచులు అన్ని పక్కలకూ వ్యాప్తిస్తూ... మధ్యలోని చర్మం మామూలుగా ఉండవచ్చు. ఇలా వచ్చే రింగులు ఒకదారితో మరొకటి కలిపిపోయేంతగా విస్తరిస్తూ పెద్దగా పెరగవచ్చు. కొన్నిసార్లు పగుళ్లూ, పొక్కల వంటివి (బ్లిస్టర్స్ అండ్ గ్రాన్యులోమా) వంటివీ కనిపించవచ్చు. వీటినే మాజోకాస్ గ్రాన్యులోమా అని పిలుస్తారు. కొన్నిసార్లు కొందరిలో అంతగా ప్రకాశవంతంగా లేని వెండిరంగులో ఉండే సోరియాఫార్మ్ మచ్చల వంటివీ కనిపించవచ్చు. ఇది జంతువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది.టీనియా క్రూరిస్ (ధోబీస్ ఇచ్) : ఇది ప్రైవేట్ పార్ట్స్ వద్ద కనిపించే ఫంగల్ ఇన్ఫెక్షన్. దీన్నే సాధారణంగా అందరూ ‘ధోబీస్ ఇచ్’ లేదా ‘జాక్ ఇచ్’ అని పిలుస్తారు. ఒక్కోసారి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గడ్డ›రూపంలో వచ్చి బాధిస్తుంటుంది. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చెమట పట్టి తడిగా, చెమ్మతో ఉండే చోట్ల ఇది ఎక్కువగా వస్తుంటుంది. సాధారణంగా బిగుతైన దుస్తులు ధరించడం వల్లా... అలాగే స్థూలకాయం కారణంగా బట్టలు బిగుతుగా ఉన్నప్పుడూ... ఇక చాలాకాలంగా కార్టికోస్టెరాయిడ్స్ వాడుతున్నవారిలోనూ ఈ సమస్య కనిపించడానికి అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ ఉన్నవారిలో ఈ సమస్య తరచూ వస్తూ ఉంటుంది. నెలల నుంచి ఏళ్ల తరబడి బాధిస్తూ ఉండే అవకాశాలు ఎక్కువ. గతంలో పాదాలకు ‘టీనియా పెడిస్’ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు మరీ మరీ ఎక్కువ. ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఎర్రటి / నల్లటి మచ్చలతో... అలాగే తరచూ దురదతో చాలా అసౌకర్యానికి గురిచేస్తుంటుంది. అయితే ఇది వృషణాల సంచి చర్మంపైనా లేదా పురుషాంగం పైనా పాకడం మాత్రం చాలా చాలా అరుదు.టీనియా మ్యాన్యువమ్ : ఇది చేతులకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఒక్కోసారి కాళ్లలో కూడా రావచ్చు. చేతులపై దురద వస్తుంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన చోట... మధ్యనుండే చర్మం బాగానే కనిపిస్తున్నా అంచులు స్పష్టంగా అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంటుంది. అరచేతుల వెనకవైపున కనిపిస్తూ... ఒక్కోసారి అరచేతుల్లో పగుళ్లు కనిపిస్తుంటాయి. దీనికి పూత మందులు పనిచేయవు. నోటి ద్వారా (ఓరల్‌గా) ఇట్రకెనజోల్, ఫ్లూకెనజోల్ వంటి మందులు వాడాలి.టీనియా పెడిస్ (అథ్లెట్స్ ఫూట్) : ఆటలాడే వయసున్న పిల్లల్లోనూ, యుక్తవయసువారిలోనూ ఇది కనిపించడం వల్ల దీన్ని ‘అథ్లెట్స్ ఫూట్’ అంటారుగానీ... ఆటలకూ దీనికి సంబంధం ఉండదు. అయితే అరుదుగా కొందరిలో 50 ఏళ్ల వయసు వారిలోనూ కనిపించవచ్చు. అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. బిగుతుగా ఉండే ΄పాదరక్షలు (ఫుట్‌వేర్) వాడేవారిలోనూ, పాదాలకు చెమట ఎక్కువగా పట్టేవారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా రెండు రకాల లక్షణాలు కనిపిస్తాయి. పాదానికి వచ్చినప్పుడు చర్మం పొట్టులా రాలవచ్చు. అలాగే కొందరిలో కాలి బొటనవేలి కింద పగులులా రావచ్చు. సాధారణంగా కాలివేళ్లలో నాలుగు, ఐదో వేలి మధ్యన కనిపిస్తుండవచ్చు. ఎక్కువగా నీళ్లలో ఉండేవారిలో కనిపిస్తుంటుంది. ఇందులో రెండు రకాలుంటాయి. మడమకూ, మడమ అంచులకు మాత్రమే పరిమితైన దాన్ని ‘మోకాసిన్ టైప్’ అంటారు. ఒకవేళ పాదం / మడమ అంతటా నీటిబుడగలు, తిత్తుల రూపంలో కనిపిస్తే దాన్ని ‘బ్లూలస్ టైప్’ అంటారు. కాస్తంత వదులుగా, సౌకర్యంగా ఉండే పాదరక్షలు ధరించడం, స్నానం తర్వాత పాదాలను బెంజోల్ పెరాక్సైడ్‌తో శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలతో దీన్ని నివారించవచ్చు. అలాగే క్లాకిమాజోల్, మైకోనజోల్, కీటోకెనజోల్, ఎకోనజోల్ వంటి పూతమందులతోనూ దీనికి చికిత్స అందించవచ్చు.క్యాండిడియాసిస్ : ఇది ఈస్ట్ తరహా ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. సాధారణంగా నోటిలోనూ లేదా ప్రైవేట్ పార్ట్స్ (మర్మావయవాల) వద్ద వస్తుంటుంది. అక్కడ నిత్యం చెమట పడుతూ తడిగా, చెమ్మగా ఉండటం వల్ల ఇది వ్యాప్తిచెందుతుంది. క్యాండిడే అబ్బిలెన్స్ అనే ఒక రకం ఫంగస్... మానవుల నోటి నుంచి మలద్వారం వరకు ఉండే జీర్ణవ్యవస్థకు చెందిన మార్గం (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్)లో కాలనీలుగా ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉంటుంది. దీని లక్షణాలను బ్యాక్టిరియల్ లక్షణాలుగా పొరబడి యాంటీబయాటిక్స్ వాడేవారిలో దీని తీవ్రత మరింత పెరిగి బాధిస్తుంది. స్థూలకాయం, డయాబెటిస్, ఎయిడ్స్, చర్మం ఎక్కువగా పట్టే గుణం, ఎండోక్రైన్ సమస్యలూ, స్టెరాయిడ్స్ వాడటం, దీర్ఘకాలిక జబ్బులున్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మం ఎర్రబారడం, దోక్కుపోయినట్టుగా ఉండటం వంటి లక్షణాలతో వ్యక్తమవుతుంది. కొందరు మహిళల్లో ఇది రొమ్ముల కింది భాగంలో ఎర్రబారినట్టుగా వ్యక్తమవుతుంది.ప్రైవేట్ పార్ట్స్ వద్ద వచ్చే క్యాండిడియాసిస్ : ఇది పురుషుల్లో మర్మావవం వద్ద... అలాగే మహిళల్లో యోని వద్ద కనిపిస్తుండే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇందులో వుల్వైటిస్, వుల్వోవెజినైటిస్, బెలనైటిస్, బెలనో΄ోస్థైటిస్ వంటి రకాలు ఉంటాయి. పూతమందులతో, నోటి ద్వారా వాడే మందులతో ఈ ఇన్ఫెక్షన్ను తగ్గించవచ్చు.శోభి మచ్చలు (పిటిరియాసిస్ వెర్సికలర్) : తెలుగులో శోభిమచ్చలు అని పిలిచే ఈ తెల్లమచ్చలు / తెల్లపొడ కూడా ఒక రకం ఫంగస్ వల్లనే వస్తుంది. ఈ సమస్యలో ఎలాంటి నొప్పీ, బాధా లేకపోయినప్పటికీ కాస్తంత అసహ్యంగా కనిపిస్తూ కాస్మటిక్‌గా ఇబ్బందిని కలిగిస్తుంది. ఒక్కోసారి ఒక మచ్చపైకి మరో మచ్చ పెరుగుతూ ‘మలసేజియా ఫర్ఫర్’ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. ఎక్కువగా బాగా వేడి వాతావరణంలో ఉండేవారిలోనూ, బాగా చమటలు పడుతూ అవి త్వరగా ఆరి΄ోని పరిస్థితుల్లోనూ, జిడ్డు చర్మం ఉన్నవారిలోనూ ఈ సమస్య ఎక్కువ. అలాగే ఎయిడ్స్ వంటి జబ్బు ఉన్నవారిలో ఈ ఫంగస్ వచ్చే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. వేసవిలో బాగా పెరుగుతుంది. కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా కనిపిస్తుంటుంది. కొందరిలో కాస్త దురదలూ కనిపించవచ్చు.కొందరిలో ఈ సమస్యతో ఒక్కోసారి చర్మం పొట్టులా, పొలుసుల్లా రాలిపోతూ ఉండవచ్చు. ఛాతీ, భుజాలూ, మెడ, వీపు, పొట్ట, అరుదుగా కొందరిలో ప్రైవేట్ పార్ట్స్, తొడల వద్ద ఈ సమస్య కనిపించవచ్చు. కర్రదీపంలో చూసినప్పుడు ఈ సమస్య ఉన్నచోట చర్మం నీలి, ఆకుపచ్చ మెరుపుతో కనిపిస్తుంది. ఈ సమస్యకు కీటకెనజోల్ షాంపూలు వాడుతూ, కీటకెనజోల్ క్రీమ్, క్లాట్రిమాజోల్ క్రీమ్ వంటి పూత మందులు వాడుతూ... నోటి ద్వారా (ఓరల్‌గా) ఇట్రకెనజోల్, ఫ్లూకెనజోల్ వంటి మందులు తీసుకోవడం ద్వారా చికిత్స చేయవచ్చు.వెంట్రుకల్లో వచ్చే టీనియా రకాలు టీనియా క్యాపిటిస్ : ఇది రోమం అంకురంలో వచ్చే ఇన్ఫెక్షన్. టీనియా క్యాపిటిస్ మాడు మీద వస్తే పేనుకొరుకుడులా కనిపిస్తుంది. పిల్లల్లో యుక్తవయసుకంటే ముందుగా అంటే... 6 – 10 ఏళ్లవారిలో ఎక్కువగా వస్తుంటంది. తలలో పొలుసుల మాదిరిగా కనిపిస్తాయి. వెంట్రుకలు విరిగిపెతుంటాయి. తలలో మొటిమల్లా వస్తూ కొన్నిసార్లు అక్కడ చీము వంటి స్రావం కనిపిస్తుండవచ్చు. చివరగా... అక్కడి వెంట్రుకలన్నీ గుండ్రని ఆకృతిలో రాలిపోయి మచ్చలా (స్కారింగ్ అలొపేషియాగా) కనిపిస్తుంటుంది. ఇది స్కూలు పిల్లల్లో వచ్చినప్పుడు ఒక చిన్నారి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. పలు ప్రాంతాల్లో ఉండే స్కూళ్లలో పిల్లలను దగ్గర దగ్గరగా కూర్చోబెట్టినప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. ఒక్కోసారి ఒకరు వాడిన దువ్వెనను మరొకరు వాడినప్పుడూ ఇది వ్యాప్తి చెందుతుంటుంది. ఇందులోని ఒక రకాన్ని ‘బ్లాక్ డాట్’ అంటారు. ఇందులో మాడుపైన రోమమూలంలో వెంట్రుక విరిగిపోతుంది. వెంట్రుక మూలం దగ్గర క చుక్కలాగా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి ఉబ్బిన చుక్కల గుంపు అంతా ఒక ప్యాచ్‌లా కనిపిస్తుంటుంది.ఇక ‘గ్రే ప్యాచ్’ అనే మరోరకం మచ్చ వచ్చిన చోట కూడా వెంట్రుకలన్నీ విరిగిపోయి... అక్కడ ఓ గోధుమ రంగు ప్యాచ్‌లా అది కనిపిస్తుంటుంది. ఈ ప్యాచ్‌లో పొలుసులన్నీ కాస్తంత ఎరుపురంగుకు తిరిగి మచ్చలా కనిపిస్తాయి. ఈ సమస్యలోనూ వెంట్రుకలన్నీ విరిగి రాలిపోయి పేనుకొరుకుడు మచ్చలా కనిపిస్తాయి. కర్రమంట వెలుగులో చూస్తే ఈ మచ్చ... ఆకుపచ్చరంగులో కనిపిస్తుంది.టీనియా బార్బే : ఇది మాత్రం గడ్డంలో వచ్చి... అక్కడ పేనుకొరుకుడులా కనిపిస్తుంది. కొన్నిసార్లు మీసంలోనూ కనిపిస్తుంది. గడ్డం లేదా మీసంలోని వెంట్రులన్నీ రాలిపోవడంతో అక్కడ పేనుకొరుకుడు మచ్చ కనిపిస్తుంది.ఆగ్మినేట్ ఫ్యాలుక్యులైటిస్ : ఇది కూడా కీకన్ లాగే ఎర్రటి మచ్చలతో కనిపించేదే అయినా... దీనిలో నొప్పి తీవ్రత తక్కువ.ఫేవస్ : ఇందులో రోమమూలంలో ఎర్రగా కనిపిస్తుంటుంది. వెంట్రుకలు ఒకదానితో మరొకటి కలిసి పోయినట్లుగా చిక్కుబడినట్టుగా అల్లుకుపోయి కనిపిస్తుంటాయి. వెంట్రుకల మొదళ్లలో మొదటి ఎరుపురంగులో కనిపించేవి కాస్తా తర్వాత ఉబ్బినట్టుగా పసుపు పొక్కుల్లా కనిపిస్తుంటాయి. రోమంతో పాటుగా అక్కడి చర్మం కూడా శిథిలమై వెంట్రుక కుప్పగా పడిపోవడం వల్ల అది పసుపు పొక్కులా కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అక్కడి నుంచి దుర్వాసన కూడా రావచ్చు. ఒక్కోసారి వెంట్రుకలన్నీ రాలిపోయి పేనుకొరుకుడుగా కనిపించవచ్చు.పిల్లల్లో సమస్య నివారణ / చికిత్స...స్కూలు పిల్లల తల ఆరోగ్యంగా ఉందా లేదా అని తల్లిదండ్రులు తరచూ వాళ్ల తలలను / మాడును పరిశీలిస్తూ ఉండాలి.కీటోకొనజాల్తో పాటు సెలేనియమ్ సల్ఫైడ్ ఉన్న షాంపూలతో తల స్నానం చేయిస్తూ ఉండటం వల్ల ఫంగస్ల వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చు.పైపూత (టాపికల్ మెడిసిన్)గా రాయాల్సిన యాంటీ ఫంగల్ పూత మందులను వాడటం ద్వారా కొన్ని రకాల ఫంగస్లకు చికిత్స చేయవచ్చు.నోటి ద్వారా యాంటీ ఫంగల్ మందులు ఇవ్వడం ద్వారా చేసే చికిత్స : గ్రీసియోఫల్విన్ మందులుగా చెప్పే యాంటీ ఫంగల్ మందులతో ఈ ఇన్ఫెక్షన్లకు చికిత్స అందించవచ్చు. ఇక వాటితో పాటు టెర్బినాఫిన్స్, ఇట్రాకెనజోల్, ఫ్లూకోనజోల్, కీటాకెనజోల్ వంటి మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ల విచక్షణ మేరకు చర్మంపైన వచ్చే ఎర్రటి మచ్చలను తగ్గించడానికి అవసరమైతే కొన్నిసార్లు కార్టికోస్టెరాయిడ్స్ కూడా ఇవ్వాల్సిరావచ్చు. పరిస్థితి కాస్త తీవ్రమై... ఇన్ఫెక్షన్ గనక మొదటి దశ దాటిపోతే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా సోకే (సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్) దశకు చేరితే అప్పుడు యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు.గోళ్లకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్...టీనియా అన్‌గ్యువమ్ : ఇది గోరు (నెయిల్ ప్లేట్)కు వచ్చే ఫంగస్. ట్రైకోఫైటాన్, రబ్రమ్, ట్రైకోఫైటాన్ మెంటారోఫైట్స్, ఎపిడర్మోఫైటాన్ ఫ్లోకసమ్ వంటి ఫంగల్ రకాల వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇందులో గోటికి ఇరువైపులా ఉండే గోరుభాగం పైకి వచ్చిన చర్మం ముడతల నుంచి వ్యాపిస్తుంది. గోరు తన పారదర్శకతను క్రమంగా కోల్పోతుంది. శిథిలం అవుతుంది. కట్ చేసినప్పుడు స్పష్టంగా తెగకుండా... పొట్టుగా రాలిపోతుంది. యుక్తవయసుదాటిన వారిలో, బలహీనమైన గోళ్లు ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలెక్కువ. ఇందులో డిస్టల్ అండ్ ల్యాటరల్ సబ్ అన్‌గ్యువల్ ఒనైకోమైకోసిస్, సూపర్ఫీషియల్ వైట్ ఒనైకోమైకోసిస్, ప్రాక్సిమల్ సబ్ అన్‌గ్యువల్ ఒనైకోమైకోసిస్ వంటి రకాలూ ఉంటాయి. త్వరగా చికిత్స తీసుకుంటే త్వరగా తగ్గే అవకాశం. పూతమందులు పనిచేయవు. ఇట్రకెనజోల్, టర్బినాఫిన్ వంటి మందులు వాడాలి. చివరగా... ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, ఎప్పుడూ తగిన హైజీన్ పాటిస్తూ శుభ్రంగా ఉండేవారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు చాలా తక్కువ. అందుకే ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణలో కీలక భూమిక పోషిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.డాక్టర్ విజయ గౌరి బండారు, సీనియర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ -
అవార్డుల వేడుకలో హాట్‌టాపిక్‌గా టీవీ స్టార్ 'బ్రెడ్ డ్రెస్'..!
"వెర్రి వేయి రకాలు - పిచ్చి పలు రకాలు" అంటే ఇదేనేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. క్రియేటివిటీ ఉండోచ్చు మరి అధ్వాన్నమైన సృజనాత్మకతను తట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడో ఓ టీవీ స్టార్ క్రియేటివిటీ కూడా అలానే ఉంది. వెరైటిగా కనపడాలని అనుకుందో లేక కొత్తగా ఆలోచించాలనుకుందో గానీ ఆమె ధరించిన డ్రెస్ మాత్రం ఒక్కసారిగా అందరికీ ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకునేలా చేసింది. అసలే పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోలు సంక్షోభం, తోపాటు తర్వలో ఆహార సంక్షోభం వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఆ స్టార్ డ్రెస్ అందరికి కోపం తెప్పించడమే కాదు..ఏమనుకుంటున్నావ్ అంటూ తింట్ల దండకం అందుకున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..ఆఫ్రికా మ్యాజిక్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డ్స్ (AMVCA) వేడుకలో, రియాలిటీ టీవీ స్టార్ క్వీన్ మెర్సీ అటాంగ్ సుమారు 500 బ్రెడ్లతో తయారు చేసిన గౌనులో దర్శనమిచ్చింది. ఆమె రెడ్‌కార్పెట్ పైకి రావడంతో ఒక్కసారిగా నెట్టింట హాట్‌టాపిక్‌గా మారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ దుస్తులను డిజైన్ చేసింది టియానాస్ ఎంపైర్‌కు చెందిన డిజైనర్ టోయిన్ లవానీ. ఆ టీవీ స్టార్ అటాంగ్ బేకరీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసే నిమిత్తం వాళ్లు ఇలా రూపొందించారట. అంతేగాదు సదరు టీవీ స్టార్ అటాంగ్ సైతం తన వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకునేందుకు ఇంతకన్న మంచి ప్రదేశం ఏముంటుంది అని ప్రశ్నించడం శేషం. బ్రెడ్ డ్రెస్‌పై వెల్లువెత్తిన వ్యతిరేకత..ఆ లుక్ సృజనాత్మకతకు నిదర్శనంగా ఉన్నా..సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆహారాన్ని ఫ్యాషన్‌గా ఉపయోగిస్తారా..?, కనీసం నైతికత కూడా లేదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. అంతేగాదు ఇది చాలా అసభ్యకరం, అసలు ఆ దుస్తులు రూపొందించిన డిజైనర్లు నిజంగా ఫ్యాషన్ డిజైనర్లేనా? అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు.This is so crass.Honestly, this is the kind of thing people should actually be fixating on tonight and asking real questions about.Is that real bread? Is it dummy bread? Because even if it turns out to be fake, the visual alone is still deeply tone deaf.Bread is one of the… pic.twitter.com/3NxxfwjJOp— AFTER HOW MANY CHILDREN (@tomisin_ms) May 9, 2026 (చదవండి: Tara Sutaria: బ్లేజర్ జస్ట్ రూ. 65 వేలు..కానీ హ్యాండ్ బ్యాగ్ మాత్రం అన్ని లక్షలా..!) -
గర్భం దాల్చిన ఐదో నెలకు బ్లడ్ కేన్సర్..!చివరికి..
గర్భం దాల్చక ముందు ఏదైన అనారోగ్యం సమస్య బారినపడితే రిస్క తక్కువగా ఉంటుంది. పైగా ఏదోరకంగా చికిత్స పొంది ఆ రోగం బారి నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యొచ్చు. అదే గర్భం దాల్చక అది కూడా క్రిటకల్ స్టేజ్‌లో అంటే ఏ ఐదు లేదా ఆరో నెలలో ప్రాణాంతక అనారోగ్య సమస్య బయటపడితే..ఇక ఆ బాధ మాటలకందనిది. అను క్షణం ఓ నరకం ఏ జరుగుతోందన్న టెన్షన్ వెంటాడుతూ ఉంటాయి. అలాంటి బాధనే చవిచూసింది ఈ గర్భిణి.ఈ బాధకర ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళకు గర్భం దాల్చిన ఐదోనెలలో బ్లడ్ కేన్సర్ బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె అక్యూట్ లింఫోబ్లాస్లిక్ లుకేమియాదో బాధపడుతోంది. గర్భధారణ సమయంలో కేన్సర్‌కి చికిత్స చేయడం అంటే అత్యంత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే కీమోథెరపీ వంటి ఇతర చికిత్సలు పుట్టుబోయే బిడ్డకు ప్రమాదకరంగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి. దాంతో ఢిల్లీ వైద్యులు సురక్షితంగా గర్భాన్ని పొడిగిస్తూనే వ్యాధిని నియంత్రించడానికి చికిత్స అందించింది. గర్భధారణ సమయంలో వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అనేది అత్యంత అరుదైన ప్రమాదకరమైన పరిస్థితి. దీనికి తక్షణమే చికిత్స అవసరం. పిండం సంరక్షణ చూస్తూనే తీవ్రమైన ఈ కేన్సర్‌ని నియంత్రించడం అన్నది భయానక సవాలు అని చెబుతున్నారు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వైద్యులు. ఎట్టకేలకు వైద్యుల ప్రయత్నం ఫలించి 32 వారాల నాలుగు రోజుల సమయంలో అత్యవసర సిజేరియన్ చేశారు. శిశువు బరువు 1.28 కిలోలు అని, ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఇక నవజాత శిశువుకు ప్రత్యేక నియోనాటల్ సంరక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే తల్లికి ల్యుకేమియా కోసం తదుపరి చికిత్స అందిచనున్నట్లు తెలిపారు.అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అంటే..ఎముక మజ్జ (bone marrow) ను ప్రభావితం చేసే వేగవంతమైన కేన్సర్. ఇది తెల్ల రక్త కణాల (lymphocytes) అపరిపక్వ రూపాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లలలో సర్వసాధారణం (ముఖ్యంగా 2-5 ఏళ్లు). అలాగే పెద్దలలో కూడా రావచ్చు.లక్షణాలు: తీవ్రమైన అలసట, జ్వరం, తరచుగా ఇన్ఫెక్షన్లు, సులభంగా గాయాలు కావడం లేదా రక్తస్రావం, ఎముకల నొప్పులు.చికిత్స: కీమోథెరపీతో చికిత్స చేస్తారు. సరైన సమయంలో చికిత్స అందిస్తే చాలా మంది పిల్లలలో, కొంతమంది పెద్దలలో కూడా ఈ కేన్సర్ పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఎక్కువే. (చదవండి: మెరుగైన ఆరోగ్యం కోసం వంట నూనెలో చిన్న మార్పు) -
మెరుగైన ఆరోగ్యం కోసం వంట నూనెలో చిన్న మార్పు
ప్రస్తుతం అందరిలో ఆరోగ్య స్పృహ చికిత్స నుంచి నివారణ వైపు మారుతోంది. చాలా ఏళ్లుగా ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తిన తర్వాత గానీ చికిత్స గురించి ఆలోచించేవారు కాదు. కానీ ఇప్పుడు దీర్ఘకాలిక ఆరోగ్యం అనేది రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుందనే సంగతి గుర్తిస్తున్నారు. ఆ దిశగా అవగాహన పెంచుకుంటున్నారు.. ఈ మార్పులో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది రోజువారీ జీవితంలో అత్యంత స్థిరమైన అంశాలలో ఒకటి. భారతీయ గృహాలలో, వంట చేయడం అనేది కేవలం పోషణకు సంబంధించినది మాత్రమే కాదు. ఒకరి పట్ల చూపే శ్రద్ధ, సంప్రదాయానికి సంబంధించినది. రోజూ ఉపయోగించే అన్ని పదార్థాలలో వంట నూనెకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. మొత్తం ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో అవగాహన పెంచుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు, మధుమేహం వంటి జీవనశైలి సంబంధిత పరిస్థితులు సర్వసాధారణం అవుతున్నందున, ఉపయోగించే నూనెలో కొవ్వుల నాణ్యతపై దృష్టి సారిస్తున్నారు. ఆరోగ్యదాయకమైన వంట నూనెలో తక్కువ సంతృప్త కొవ్వులతో పాటు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (PUFA, MUFA) మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ను సమతుల్య నిష్పత్తిలో ఉండాలని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవన్నీ రైస్ బ్రాన్ ఆయిల్లో సమృద్ధిగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. రోజువారి వంట అవసరాలకు అత్యుత్తమైనది తేల్చి చెప్పారు. -
బ్లేజర్ జస్ట్ రూ. 65 వేలు..కానీ హ్యాండ్ బ్యాగ్ మాత్రం అన్ని లక్షలా..!
79వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) ఈ నెల మే 12, 2026 నుంచి ము 23, 2026 వరకు ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరంలో జరగనుంది. ఈ వేడుకలో అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉంది బాలీవుడ్ నటి తారా సుతారియా. తన స్టైలిష్ లుక్‌తో ఆ వెంట్లో ఎలా కనిపించనుందో ముందుగానే చిన్న హింట్ ఇచ్చేసిందామె. ఎయిర్పోర్ట్ నుంచే పవర్ డ్రెస్సింగ్ అవుట్‌ఫిట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. లగ్జరియస్ ఫ్యాషన్‌ని ఎలా నిశబ్దంగా సింపుల్‌గా ప్రదర్శించాలో తన లుక్‌తో అద్భుతంగా చూపించారామె. తారా సుతారియా ఎయిర్‌పోర్ట్‌లో అసాధారణ దుస్తుల సముదాయంతో మెరిసింది. నల్లటి సూట్లో అద్వితియంగా కనిపించింది. ఈ సూట్ జర్మనీకి చెందిన 'హెల్సా' అనే ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎంపిక చేసుకుంది. మ్యాచింగ్‌గా అదే బ్రాండ్‌కు చెందిన బ్యాగీ ప్యాంట్‌తో స్టైలిష్‌గా కనిపించింది. అయితే ముందు వైపు బటన్ క్లోజర్, ప్యాడెడ్ షోల్డర్స్, హెవీవెయిట్ ట్విల్ ఫ్యాబ్రిక్‌తో కూడిన ఈ ముదురు బూడిద రంగు చారల బ్లేజర్ ధర రూ. 65,789. బటన్ క్లోజర్‌తో కూడిన జిప్-ఫ్లై ఉన్న బ్యాగీ ప్యాంట్ ధర దగ్గర దగ్గర రూ. 37 వేలు పలుకుతుందట. ఆ స్టైలిష్ డ్రెస్‌కి అనుగుణంగా నలుపు రంగు జిల్ లెదర్ హైహిల్స్‌ని ధరించింది తారా. తన లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మినీ లేడీ డియోర్ బ్యాగ్. దీని ధర వింటే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఎంతంటే సుమారు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. నల్లటి గొర్రె చర్మంతో తయారు చేసిన ఈ లెదర్ బ్యాగ్ అత్యంత అద్భుతమైన వస్తువుగా నిలిచింది. ఈ బ్యాగ్‌కు తీసివేయగల చైన్ షోల్డర్ స్ట్రాప్, లోపల జిప్ పాకెట్ వంటివి ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ధరించి సన్‌గ్లాసెస్ కూడా తారాను మరింత అందంగా కనిపించేలా చేసింది. అంతేకాదండోయ్ ఆ గాగుల్స్ ధర కూడా ఏకంగా రూ. 8 వేలు పైనే పలుకుతుందట. ఈ బ్యూటీ తన లగ్జరీయస్ అవుట్‌ఫిట్ లుక్‌తో ఈ కేన్స్ వేడుకలో తనెంత విలాసవంతమైన గ్లామరస్ కనిపించనుందో పరోక్షంగా చెప్పేసింది కదూ..!. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: గోల్డ్ డిజైనర్‌వేర్‌లో రాధికా మర్చంట్ స్టన్నింగ్ లుక్!) -
గోల్డ్ డిజైనర్‌వేర్‌లో రాధికా మర్చంట్ స్టన్నింగ్ లుక్!
భారతదేశ జాతీయ పెవిలియన్ ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడానికి అంబానీ కుటుంబం అంతా ఇటలీలోని వెనిస్కు చేరి అత్యంత అద్భుతమైన కళాత్మక దుస్తుల్లో కనిపించి అబ్బరుపరిచారు. తాజాగా ఈ 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శన – లా బినాలే డి వెనిజియాలో అంబానీ చిన్న కోడలు సరికొత్త లుక్‌కి సంబంధించిన ఫోటోలు సన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఎప్పటిలాగే రాధికా ఈ వేడుకలో తన గ్లామర్ లుక్‌తో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను రియా కపూర్ మే 11న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలలో రాధికా ఫ్యాషన్‌ను భారతీయ హస్తకళలను మేళవించిన డిజైనర్‌వేర్ ఆధునిక కాలపు అందగత్తెలా మెరిశారామె. కస్టమ్ ఎర్డెమ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులలో రాధికా లుక్ అదుర్స్ అనిపించింది. యూరోపియన్ కౌంచర్ సౌందర్యాన్ని, భారతీయ వస్త్రాల గొపతనాన్ని మేళవించేలా డిజైన్ చేసింది. భారతీయ ఫ్యాబ్రిక్‌పై పూల మోటిఫ్‌లతో అలంకరించిన మెటాలిగ్ గోల్డ్ బ్రోకేడ్ ప్రధాన ఆకర్షణగా ఉంది. ఒక రకంగా ఈ డ్రెస్ ప్రపంచ వేదికపై భారతీయ నేత కార్మికుల నైపుణ్యాన్ని అందంగా ప్రదర్శించింది. ఈ డిజైనర్‌వేర్ ఆఫ్-షోల్డర్ డ్రేప్డ్ కార్సెట్ విత్ నేలవరకు జాలువారే కేప్‌ని కలిగి ఉంది. దాంతో రాధికా లుక్‌ని రాజసం ఉట్టిపడేలా చేసింది. దీనికి మ్యాచింగ్‌గా స్ట్రెయిట్-కట్ బేజ్ రంగు ప్యాంటుతో జతచేసి,ఆధునిక ఫ్యాషన్‌తో కలగలిసిన భారతీయ వారసత్వ సంప్రదాయాన్ని ప్రదర్శించింది. అందుకు తగ్గట్టుగా రాధికా మెరిసే ఐషాడో, వింగ్డ్ ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలతో తన రూపాన్ని తీర్చిదిద్దుకుంది. హెయిర్‌ని కూడా పాపిడి తీసి మొత్తాన్ని కర్ల్స్లో వదిలేయడంతో మరింత గ్లామరస్‌గా కనిపించింది. కాగా రాధికా శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి. అలాగే ఆమె తల్లిదండ్రులతో కలిసి ఎన్కోర్ హెల్త్‌కేర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యురాలిగా కార్పొరేట్ ప్రపంచంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) (చదవండి: వెనిస్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నీతా అంబానీ కుటుంబం) -
కాఫీ వృద్ధాప్యాన్ని తగ్గించగలదా?
కాఫీ మితంగా తాగటం వల్ల ఆయుష్షు పెరుగుతుందనేది శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతూ వస్తున్నదే. అయితే తాజాగా ఆ విధంగా ఆయుష్షు పెరగడానికి మూల కారణాన్ని పరిశోధకులు కనిపెట్టారు. మన శరీర కణాల్లోనే ఆ మర్మం దాగి ఉందని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలోని వెటర్నరీ మెడిసిన్ అండ్ బయోమెడికల్ సైన్సెస్ అధ్యయనంలో తేలింది.ఇంతవరకు తెలిసింది కాఫీలోని కొన్ని పదార్థాలు మన శరీరంలోని కణాలలో ఉండే ఒక నిర్దిష్ట ఎంజైమ్‌ను ప్రేరేపిస్తాయి. ఆ ఎంజైమ్ కణాల వయసు త్వరగా పెరగనివ్వకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు శరీరంలో ఇన్ఫ్లమేషన్ (మంట, వాపులు) నయం అవుతాయి. దాంతో హృద్రోగాలు వచ్చే ముప్పు తగ్గుతుంది. రోజుకు ఇన్ని కప్పులు అని మితంగా కాఫీ తీసుకోవడం వల్ల జీవక్రియలు మెరుగుపడి, వృద్ధాప్య లక్షణాలు నెమ్మదిస్తాయి.ఇప్పుడు తెలుసుకున్నది మన శరీర ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని నిర్ణయించే కణ స్థాయిలోని ‘నియంత్రణ వ్యవస్థే’కాఫీ సేవించే అలవాటు ఉన్నవారిని ఆరోగ్యంగా ఉంచుతోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీనినే ‘టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ’ పరిశోధకులు ‘బయోలాజికల్ స్విచ్’అంటున్నారు. మనం సేవించే కాఫీ కణాల్లోని అటువంటి ఒక స్విచ్‌ను ఆన్ చేయడం ద్వారా మనం వృద్ధులుగా మారటాన్నినెమ్మదింపజేస్తోందన్న మాట. ఏమిటీ ‘బయొలాజికల్ స్విచ్’? మన శరీరంలోని కణాలలో కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్లు లేదా అణువులు ఉంటాయి. ఇవి బయట నుండి వచ్చే సంకేతాల (ఉదా: మనం కాఫీ తాగినప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు వచ్చే సంకేతాలు) ద్వారా శరీరంలో కొన్ని రసాయన ప్రక్రియలను ‘ఆన్’లేదా ‘ఆఫ్’అయ్యేలా చేస్తాయి. వీటినే బయోలాజికల్ స్విచ్‌లు అంటారు. కాఫీ తాగినప్పుడు అది శరీరంలోని ఒక నిర్దిష్ట స్విచ్‌ను ‘ఆన్’చేస్తుంది. ఈ స్విచ్ ఆన్ అయినప్పుడు మన కణాలు తమను తాము శుభ్రం చేసుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది. మేలు చేసే కొన్ని ఎంజైమ్‌లు కూడా విడుదల అవుతాయి. దీనివల్ల వృద్ధాప్యం లక్షణాలు ఆలస్యమవుతాయి. అలాగే మన శరీరంలోకి ఏదైనా వైరస్ చొరబడినప్పుడు,ఒక బయోలాజికల్ స్విచ్ ‘ఆన్’అయ్యి తెల్ల రక్తకణాలను యుద్ధానికి పంపిస్తుంది. వైరస్ చనిపోయాక, ఆ స్విచ్ మళ్లీ ‘ఆఫ్’అవుతుంది. సాక్షి స్పెషల్ డెస్క్ -
అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?
వాషింగ్టన్, డి.సి.లోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, ప్రసిద్ధ విమానాలు , అంతరిక్షయానానికి సంబంధించి పరికరాల ప్రదర్శనకు ప్రసిద్ధిగాంచింది. అయితే తాజాగా ఆ ప్రదర్శనలో ఒక సాధారణ భారతీయ మహిళా శాస్త్రవేత్త చీర దర్శనమిస్తోంది. ఆ చీర భూ వాతారణాన్ని దాటి వెళ్లకపోయినా..ఆ శారీని ధరించిన మహిళ భారతదేశం మరో గ్రహాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషించింది. ఈ చీర ఇస్రోకి చెందిన ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ది. ఎవరామె అంటే..భారతదేశపు మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళ్యాన్)లో నందిని నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఆమె తండ్రి గణిత ఇంజనీర్ కాగా, తల్లి గణిత ఉపాధ్యాయురాలు. ఇస్రోలో చేరడానికి ముందు ఇంజనీరింగ్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. భారత అంతరిక్ష సంస్థలో 20 ఏళ్లకు పైగా సాగిన కెరీర్లో ఆమె 14కు పైగా మిషన్లకు మద్దతునిచ్చారు. ఒక ఇంటర్వ్యూలో నందిని తన మిషన్ల గురించి మాట్లాడుతూ.. "తాము పనిచేసే ప్రతి మిషన్ అత్యంత ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. అయితే వాటిలో మంగళ్యాన్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే చాలా మంది ప్రజలు ఒక్కసారిగా మావైపు చూశారు. అది మా నైపుణ్యానికి, లభించిన గుర్తింపుగా, గర్వంగా అనిపిస్తుందని అన్నారు. అంతేగాదు ఆ మిషన్ విజయవంతం అవ్వడంతో సాక్షాత్తు ప్రధాని మంత్రి కరచాలనం చేసి అభినందించారు. అలాగే నాసా కూడా మమ్మల్ని అభినందించింది. అంతేగాదు ఈ గెలుపు కారణంగా నాసాతో మాతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చింది. పైగా సోషల్ మీడియాలో కూడా చాలామంది మమ్మల్ని ఫాలో అవుతున్నారంటూ". సంతోషంగా చెప్పుకొచ్చారామె.ఆ సీరియల్ కారణంగానే..అంతరిక్ష పరిశోధనలంటే ఎందుకు నందిని ఇష్టమో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా వివరించారు. ఒక ప్రముఖ టీవీ సీరియల్ చూడటం ద్వారా తనకు అంతరిక్షంపై ఆసక్తి మొదలైందన్నారు. అప్పట్లో టీవీలో 'స్టార్ ట్రెక్' అనే చాలా ప్రజాదరణ పొందిన సీరియల్ ఒకటి ఉండేది, దాని కారణంగానే అంతరిక్ష ఫరిశోధనాలంటే ఇష్టం ఏర్పడిందని ఈటీ ఎంటర్ప్రైజ్ ఏఐ 'మేకింగ్ ఏఐ వర్క్ సమ్మిట్ 2025'లో చెప్పారామె. తమ కుటుంబం మొత్తం ఆ సీరియల్‌కి వీరాభిమానులమని, ఒక్క ఎపిసోడ్‌ని మిస్ అయ్యేవాళ్లం కాదంటు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారామె. అలాగే తాను పదేపదే ఇష్టంగా చూసే సినిమా అపోలో 13 అని, అందులో టీమ్‌గా పనిచేసి విజయం సాధించడం తదితరాలు తన మదిలో శాశ్వతంగా నిలిచిపోయానని అన్నారామె.ఆ చీర ఎందుకు?భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చెందిన మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి సహాయపడ్డారు. ఇస్రో మంగళయాన్ మిషన్‌ని నవంబర్ 5, 2013న ప్రారంభించింది. సెప్టెంబర్ 24, 2014న విజయవంతంగా భూమికక్ష్యను విడిచిపెట్టి విజయవంతంగా అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. అంటే సుమారు 300 రోజుల ప్రయాణాన్ని విజయంవతం చేసేందుకు ఆమె ఈ చీరను ధరించి పనికి వచ్చారని స్మిత్సోనియన్ మ్యూజియం ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది అంతేగాదు ఆ పోస్ట్‌లో.."ఒక రాకెట్ శాస్త్రవేత్తగా, మార్స్ ఆర్బిటర్ మిషన్ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా నందిని హరినాథ్ మిషన్ ప్రణాళిక, కార్యకలాపల్లో కీలక పాత్ర షోషించారు. దాదాపు ఆరు నుంచి పది నెలల కాలపరిమిత గల తన మిషన్‌ను ఏకంగా ఎనిమిదేళ్లు అంగారక కక్ష్యలో గడిపి అక్కడి ఉపరితల వాతావరణ పరిస్థితుల్ని నమోదు చేయడం విశేషం. ఆ నేపథ్యంలోనే ఈ మిషన్‌లోని మహిళా నాయకులు ధరించిన చీరలు వారి జాతీయ గుర్తింపు, అంతరిక్షంలో భారతదేశం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచాయి" అని సదరు మ్యూజియం పేర్కొంది. అంతేగాదు ఆ చీరకు సంబంధించిన వీడియో, ఫోటోలను కూడా మ్యూజియం పంచుకుంది. ఈ చీరలో నీలం రంగు జాకెట్, ఎరుపు-నీలంతో కలగలసిన డ్రేప్డ్ ఫాబ్రిక్ ఉన్నాయి. View this post on Instagram A post shared by Smithsonian (@smithsonian) (చదవండి: జేఈఈలో రెండుసార్లు ఫెయిల్, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్..! చివరికి..) -
‘నాన్నని వద్దంటున్న అమ్మ’.. కలెక్టర్‌ను కలిసిన చిన్నారులు
పాలక్కడ్: కుటుంబ కలహాలు ఆ పసిమొగ్గల పాలిట శాపంగా మారుతున్నాయి. ‘అమ్మకు మేం కావాలి, కానీ నాన్న వద్దు.. మాకు మాత్రం ఇద్దరూ కావాలి’ అంటూ కేరళలోని పాలక్కాడ్ జిల్లా కలెక్టరేట్ మెట్లెక్కిన ఇద్దరు చిన్నారుల ఆవేదన అందరి హృదయాలను కలచివేస్తోంది. విడిపోతున్న తమ తల్లిదండ్రులను ఎలాగైనా కలపాలని వారు చేసిన వేడికోలు ఇప్పుడు సంచలనంగా మారింది.విదేశీ పర్యటనలో మొదలైన దూరంత్రిథాలలోని అనక్కరకు చెందిన 10, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు.. తమ మేనత్త కూతురైన 12 ఏళ్ల సోదరితో కలిసి సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎస్. మాధవికుట్టిని కలిశారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న తమ తల్లి వద్దకు విషు పండుగ సందర్భంగా నాన్నతో కలిసి వెళ్లామని పిల్లలు తెలిపారు. అయితే, అక్కడ రెండు నెలలు ఉన్నప్పటికీ తల్లి తమను పెద్దగా పట్టించుకోలేదని, కనీసం తమతో సరిగా గడపలేదని వారు కలెక్టర్‌కు వివరించారు. ఆ విదేశీ పర్యటన వారిని తీవ్ర మానసిక ఆవేదనకు గురిచేసింది.విడిపోదామన్న తల్లి.. వ్యసనంలో తండ్రికేరళకు తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. తండ్రి మద్యానికి బానిస కావడం, ఇంట్లో నిత్యం గొడవలు, పోలీసు కేసులు ఆ పసివాళ్లను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి. ఈ క్రమంలో గత బుధవారం కేరళకు తిరిగొచ్చిన తల్లి.. తండ్రి లేకుండా తనతోనే వచ్చేయాలని పిల్లలకు తేల్చిచెప్పింది. అయితే, ‘ఇద్దరూ కలిసి ఉంటేనే వస్తాం’ అంటూ ఆ చిన్నారులు తెగేసి చెప్పారు.రంగంలోకి కలెక్టర్.. కౌన్సెలింగ్ ఏర్పాటుతమ తాతయ్య, సోదరి మద్దతుతో కలెక్టర్ వద్దకు రాకముందే ఈ చిన్నారులు బాలల సంక్షేమ సమితిని (సీడబ్ల్యూసీ) కూడా ఆశ్రయించారు. కలెక్టర్‌తో జరిగిన సమావేశంలో 12 ఏళ్ల సోదరి వారికి ప్రతినిధిగా వ్యవహరించి, కుటుంబంలో నెలకొన్న కలహాలను పూసగుచ్చినట్లు వివరించింది. పిల్లల పరిస్థితికి చలించిపోయిన కలెక్టర్ మాధవికుట్టి తక్షణమే జోక్యం చేసుకుని, మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ద్వారా ఆ చిన్నారులకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. వారికి పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చి అధికారుల సాయంతో సురక్షితంగా ఇంటికి పంపించారు. ఇది కూడా చదవండి: మంత్రి అరోరాకు ఈడీ షాక్: వెలుగులోకి డమ్మీ అకౌంట్లు -
లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు!
అందమైన పగడపు దీవులు.. అంతుచిక్కని నీలిరంగు సముద్ర తీరాలతో పర్యాటకులను కట్టిపడేసే అద్భుత ప్రదేశం లక్షద్వీప్. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలని కలలు కనేవారికి ఇప్పుడు ఒక శుభవార్త! ఇన్నాళ్లూ లక్షద్వీప్ వెళ్లాలంటే స్థానికుల స్పాన్సర్షిప్ కోసం వెతకడం, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం పడిగాపులు కాయడం లాంటి ఎన్నో కష్టాలు ఉండేవి. అయితే పర్యాటక రంగాన్ని భారీగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లక్షద్వీప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు నిబంధనలు సడలిస్తూ, ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలు ప్రయాణికులకు పూల దారిలా మారాయి. ఇంతకీ భద్రతలో ఏమాత్రం రాజీపడని లక్షద్వీప్ యంత్రాంగం పెట్టిన కొత్త రూల్స్, అమలు చేస్తున్న సడలింపులు ఏమిటి?తొలగిపోయిన ప్రధాన అడ్డంకులుతాజా మార్గదర్శకాల ప్రకారం, పర్యాటకులకు అతిపెద్ద అడ్డంకిగా మారిన ‘లోకల్ స్పాన్సర్’ (స్థానిక వ్యక్తి లేదా సంస్థ హామీ) నిబంధనను యంత్రాంగం పూర్తిగా ఎత్తివేసింది. దీనితో పాటుగా, ప్రయాణికులు తమ సొంత రాష్ట్రం నుంచి సమర్పించాల్సిన ‘పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ)’ అవసరం ఇకపై ఉండదు. అయితే భద్రత విషయంలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, దరఖాస్తు చేసిన తర్వాత లక్షద్వీప్ పోలీసులే స్వయంగా అంతర్గత భద్రతా తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీలు సజావుగా జరగడానికి, పర్యాటకులు తమ ప్రయాణ తేదీకి కనీసం 14 రోజుల ముందే పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. లక్షద్వీప్‌లో ఏ ఏ దీవులను సందర్శించాలనుకుంటున్నారు? ఏ ఏ తేదీల్లో అక్కడ ఉంటారనే వివరాలను అప్లికేషన్లో స్పష్టంగా పేర్కొనాలి. పర్మిట్ దక్కని ఏ ఇతర దీవిలోనూ అడుగుపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లభించదు. ప్రయాణ మార్గంలో కవరత్తి లేదా అగత్తి దీవుల్లో గరిష్టంగా 12 గంటల పాటు మాత్రమే ట్రాన్సిట్ కోసం ఆగేందుకు అనుమతి ఉంటుంది.పర్మిట్ వచ్చాకే బుకింగ్స్ఎంట్రీ పర్మిట్ దరఖాస్తులను అధికారులు కేవలం మెరిట్ ఆధారంగా, అన్ని అర్హతలు పూర్తయిన తర్వాత మాత్రమే ఆమోదిస్తారు. అధికారికంగా ఎంట్రీ పర్మిట్ చేతికి వచ్చేలోపు ఎలాంటి విమాన లేదా హోటల్ బుకింగ్స్ చేసుకోవద్దని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పర్మిట్ రాకపోతే చివరి నిమిషంలో క్యాన్సిలేషన్ల వల్ల భారీగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఉండే పీక్ సీజన్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే ప్రాధాన్యత ఇస్తారు. ఇకపోతే లక్షద్వీప్ స్థానికులు, ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులకు మినహా.. భారతీయులతో సహా విదేశీయులందరికీ ఈ ఎంట్రీ పర్మిట్ తప్పనిసరి. పర్యాటకులు అన్ని దీవులకు వెళ్లలేరు. భారతీయ పౌరులు కేవలం ఐదు దీవులను (కవరత్తి, అగత్తి, బంగారం, కద్మత్, మినికాయ్) మాత్రమే సందర్శించేందుకు అనుమతి ఉంది. ఈ సున్నితమైన ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం కఠినమైన నియంత్రణలు కొనసాగుతాయి.దరఖాస్తు ఎలా చేయాలి? పర్యాటకులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతుల్లో ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ఎంచుకునేవారు అధికారిక ‘ఈ-పర్మిట్ (ePermit)’ పోర్టల్ లోకి వెళ్లి (https://epermit.utl.gov.in/pages/signup) అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అందులో ప్రయాణ తేదీలు, పర్సనల్ వివరాలు నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఆమోదం పొందితే ప్రయాణానికి సుమారు 15 రోజుల ముందు ఈ-మెయిల్ ద్వారా పర్మిట్ అందుతుంది. ఆఫ్‌లైన్ విధానం ద్వారా కూడా లక్షద్వీప్ యంత్రాంగ వెబ్సైట్ నుంచి ఫారాలు డౌన్లోడ్ చేసుకుని, కవరత్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేరుగా సమర్పించవచ్చు. కానీ దీనికి ప్రాసెసింగ్ సమయం ఎక్కువ పడుతుంది. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఓటర్ ఐడీ లేదా ఆధార్ కార్డ్), ప్రయాణ టికెట్లు (ఫ్లైట్ లేదా పడవ), హోటల్ బుకింగ్ కన్ఫర్మేషన్ (అవసరమైన చోట) డాక్యుమెంట్లను తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: మత్తు వల్లకాడుగా మారుతున్న కేరళ -
కరువు కాలపు పంట బ్రహ్మజెముడు
ముళ్ళు లేని బ్రహ్మజెముడు (స్పైన్‌లెస్ కాక్టస్) కరువుప్రాంతాల్లో రైతులకు చక్కని పశుగ్రాసం సహా 5 రకాలుగా ఉపయోగపడే ఒక చక్కని పంట. వాతావరణ మార్పులను తట్టుకోగల పంట. తక్కువ నీటితో పెరుగుతుంది. సారహీనమైన నేలల్లో కూడా (చౌడు భూముల్లో తప్ప) పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న తోటల్లో మధ్యలో వరుసలుగా దీన్ని పెంచవచ్చు. ఇది చిన్న రైతులను ఆదుకునే పంట. కరువు పీడిత రైతులకు బహుళ ఆదాయ మార్గాలను సృష్టిస్తుంది. సుస్థిర జీవనోపాధిని కల్పిస్తుంది.హెక్టారుకు 80 నుంచి 100 టన్నులుముళ్ళు లేని బ్రహ్మజెముడు ఒక్కసారి నాటితే 25 సంవత్సరాలకు పైగా ఫలసాయాన్నిచ్చే దీర్ఘకాలిక పంట. చిన్న పండ్లతో సహా ఈ చెట్టులోని ప్రతి భాగం విలువైన పశువుల మేతగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో సమకూరే పచ్చిమేతను అందిస్తుంది. సంవత్సరానికి హెక్టారుకు 80 నుంచి 100 టన్నుల వరకు బ్రహ్మజెముడు ఆకుల దిగుబడి వస్తుంది. కరువు సమయంలో నమ్మకంగా, తక్కువ ఖర్చుతో కూడిన పశుగ్రాసాన్ని అందిస్తుంది. తద్వారా పశుగ్రాస ఖర్చులను తగ్గిస్తుంది. దీని ఆకులను అంగుళం ముక్కలుగా కోసి పశువులకు మేపాలి. పాలిచ్చే పశువులకు రోజుకు 10–15 కిలోలు (రోజువారీ పచ్చిమేతలో 25% వరకు) మేపవచ్చని కర్నాల్‌లోని ఎన్డీఆర్ఐ నిపుణులు చెబుతున్నారు. ఇతర పశువులకు రోజుకు 8–12 కిలోల వరకు, ఆర్నెల్లు పైబడిన దూడలకు 2–4 కిలోలు మేతగా ఇవ్వొచ్చు. క్రమంగా అలవాటు చెయ్యాలి.బయోగ్యాస్ తయారీకి ఉపయోగంముళ్ళు లేని బ్రహ్మజెముడు బయోగ్యాస్ తయారీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని ఆకులకు 60–65% మీథేన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. బయోగ్యాస్ తయారీ తర్వాత వెలువడే స్లర్రీ విలువైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. 3 కిలోల బ్రహ్మజెముడు ఆకులతో 3.38 చదరపు అడుగుల విస్తీర్ణం గల బయో–లెదర్ షీట్‌ను తయారు చేయొచ్చు. దీనితో రెండు జతల బూట్లు లేదా మూడు చిన్న బ్యాగులు తయారు చేయవచ్చు. దీని పండ్లు పోషక విలువలతో కూడి ఉంటాయి. దీని ఆకులను కూరగానూ వండుకొని తినొచ్చు.ఎవరిని సంప్రదించాలి?ముళ్లులేని బ్రహ్మజెముడు పంట సాగును వ్యాప్తిలోకి తేవాలంటే రైతులకు దీని గురించి తెలియజె΄్పాలి. నాటుకునే బ్రహ్మజెముడు ఆకులను అందించాలి. మార్కెట్‌ను అనుసంధానం అవసరం. పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు కలసి పనిచేస్తే ఈ కరువు కాలపు పంటను వేగంగా రైతులకు అందించవచ్చు.ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫాడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనిపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. అదనపు సమాచారం కోసం డా. శివ్ కుమార్ అగర్వాల్‌ను సంప్రదించవచ్చు. sk.agrawal@cgiar.org -
వేడి ఒత్తిడి నివారణ ఎలా?
పాడి ఆవులు, గేదెల పెంపకంలో వేడి ఒత్తిడి ఒక కీలకమైన సమస్య. ఇది పాల దిగుబడిపై, పునరుత్పత్తిపై, మొత్తం పశువుల శ్రేయస్సుపై గణనీయ ప్రభావం చూపుతుంది. పశువులు తమ శరీరంలోని అధిక వేడిని బయటకు పంపటానికి ఇబ్బంది పడినప్పుడు ఒత్తిడికి గురవుతాయి. ఆవులు, గేదెలు 5 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటే సౌకర్యంగా ఉంటాయి. ఆపైన పెరిగే వేడితో పాటు గాలిలో అధిక తేమ శాతం కూడా వేడి ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా మేత తీసుకోవటం తగ్గుతుంది. పాల ఉత్పత్తి పడిపోతుంది. ఆవులు, గేదెలలో వేడి ఒత్తిడిని తగ్గించడానికి పోషకాహార నిర్వహణ, నివాస మార్పులు, మెరుగైన నిర్వహణ పద్ధతులతో కూడిన బహుముఖ విధానం పాటించటం అవసరమని అక్షయకల్ప ఆర్గానిక్కు చెందిన పశువైద్య నిపుణులు డాక్టర్ తేజేశ్వర రెడ్డి (63669 59100) అంటున్నారు.వేడిమి ఒత్తిడి అంటే ఏమిటి?పశువులు శరీరంలోని వేడిని బయటకు సమర్థవంతంగా వదలలేనప్పుడు శరీరంలో వేడి భారం పెరిగి ఒత్తిడి ఏర్పడుతుంది. ఎక్కువ పాలు ఇచ్చే ఆవులు/గేదెలపై వేడి ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.వేడిమి ఒత్తిడితో పశువులకు నష్టాలు:→ మేత తీసుకోవటం 10–20% తగ్గుతుంది. → ఆ మేరకు పశువుల ఒంట్లో శక్తి తగ్గుతుంది.→ పాల ఉత్పత్తి తగ్గుతుంది.→ దూడల్లో పెరుగుదల మందగిస్తుంది.→ చూడి కట్టే అవకాశాలు తగ్గుతాయి. → రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.→ అబార్షన్లు, వడదెబ్బ, మరణం సంభవించవచ్చు.వేడిమి భారం సూత్రంశరీరంలో పుట్టిన వేడి + వాతావరణం నుంచి గ్రహించిన వేడి – శరీరం నుంచి బయటికి వదిలే వేడి = మొత్తం వేడి భారం→ వాతావరణ మార్పు, తీవ్రమైన వేడి పశువుల ఆరోగ్య రక్షణకు కీలకమైన సవాళ్లుగా మారాయి.→ ఇతర పశువుల కన్నా అధిక పాల దిగుబడినిచ్చే పాడి పశువులు ఎక్కువగా వేడి ఒత్తిడికి గురవుతాయి.→ శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరుగుతుంది.→ ఆవుల కన్నా గేదెలు వేడి ఒత్తిడికి ఎక్కువగా గురవుతాయి. ఎందుకంటే గేదెలకు వేడిని శరీరం నుంచి బయటకు వదిలేందుకు స్వేద గ్రంధులు తక్కువగా ఉంటాయి. వాటి నలుపు శరీర రంగు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది.మేత నిర్వహణ:→ ఉదయం/ రాత్రి చల్లటి సమయాల్లో మాత్రమే మేత వెయ్యండి. → అధిక పీచు పదార్థాలు (ఎండు గడ్డి) మేపటం తగ్గించాలి. → పచ్చిమేత/ సైలేజ్ ఇవ్వాలి. → ఎలక్ట్రోలైట్లు, విటమిన్ సి, ఇ, సెలీనియం.. ఇవ్వాలి.→ ప్రొ బయోటిక్స్– ఎంజైమ్‌లు ఇవ్వాలి.చల్లపూటే పనులు→ పశువులపై ఒత్తిడిని తగ్గించడానికి పాలు పితకటం, మేత పెట్టటం, వాటిని పట్టుకొని కడగటం వంటి పనులను పగటి పూట చల్లగా ఉండే సమయాల్లోనే చేయండి.→ మధ్యాహ్నం ఎండు మేత ఇవ్వకూడదు.పర్యవేక్షణ:→ అధికంగా ఆయాస పడుతున్నాయా? శ్వాస రేటు పెరిగిందా? మేత తినటం తగ్గిందా? వంటి వేడి ఒత్తిడి సంకేతాల కోసం పశువుల శరీర పరిస్థితిని, ప్రవర్తనను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండండి.అత్యవసర ప్రణాళికలు:→ అతి తీవ్రమైన వేడి పరిస్థితుల్లో ఇబ్బంది వస్తే ఏం చెయ్యాలో అత్యవసర ప్రణాళికలను రూపొందించుకోండి.→ పశువులను త్వరగా చల్లబరిచే మార్గాలు ఆలోచించిపెట్టుకోండి. → అత్యవసరమైన వైద్య సహాయం అందించండిగాలి ప్రసరణ – శీతలీకరణ→ పశువుల షెడ్డులో నిలువు ఫ్యాన్లు అమర్చాలి ∙మిస్టర్లు/ స్ప్రింక్లర్లు వినియోగించాలి.→ పశువుల శాల లేదా షెడ్లోకి గాలి బాగా వచ్చి ΄ోయేలా చూసుకోండి. → పశువుల శరీరంపై నేరుగా నీటిని చల్లండి. → తడిపిన గోనె సంచులను పశువుల శరీరంపై కప్పండి. → షెడ్లో ఎక్కువ పశువులను ఉంచకుండా రద్దీగా లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది వాటి శరీరంలో వేడి ఉత్పత్తి తగ్గటానికి, గాలి ప్రసరణ పెరగటానికి దోహదపడుతుంది.షెడ్డు నిర్వహణ→ పశువులకు షెడ్‌కు పక్కనే అదనంగా చెట్ల నీడ ఉండేలా చూడాలి లేదా షేడ్ నెట్‌ను కట్టి నీడ ఏర్పాటు చెయ్యటం ద్వారా వేడిమి ఒత్తిడిని తగ్గించవచ్చు. → షెడ్ పైకప్పుపై తెల్లని పెయింట్ వేస్తే వేడి తక్కువగా ఉంటుంది. → షెడ్ ఎత్తు 12–14 అడుగులు; ΄÷డవు 8–10 అడుగులు ఉంటే గాలి ΄ారాడుతూ వేడి తీవ్రత తగ్గుతుంది. నీటి నిర్వహణ→ శుభ్రమైన నీటిని పశువులకు ఇవ్వాలి. రోజంతా నిరంతరాయంగా అందించాలి.→ వేడి వాతావరణంలో ఆవులు/ గేదెలు ఆయాసం, చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవటానికి ఎక్కువ నీరు తాగుతాయి. → 24 గంటలూ చల్లని నీరు ఇవ్వాలి. నీటి ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండాలి. → వేసవిలో నీటి తొట్టెల సంఖ్య పెంచాలి. → గేదెలు నీటిలో మునగటానికి ఇష్టపడతాయి.→ అందుకోసం వాలో ట్యాంకులు ఏర్పాటు చెయ్యాలి. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
మాటంటే మనిషి తీరే!
పిల్లలు మన ఎదురుగా మాట్లాడే మాటలు వేరు. ఫ్రెండ్స్‌తో మాట్లాడే మాటలు వేరు. వారు ఏయే మాటలు వింటున్నారో ఏయే మాటలు మాట్లాడుతున్నారో గమనించారా? ఇటీవల సి.బి.ఎస్.ఇ.బోర్డు కూడా స్కూల్లో పిల్లలు బూతు మాట్లాడటాన్ని కంట్రోలు చేయమంది. ఈ సెలవుల్లో మన పిల్లల మాటను సరిచేద్దామా?పిల్లల నోట ‘బీప్’ మాటలు ‘ఫ్యాషన్’గా మారిపోయాయి. రీల్స్‌లో, గేమ్స్‌లో, ఫ్రెండ్స్ గ్రూప్‌లో– ఎక్కడ చూసినా అవే. పల్లెల్లో అయితే ‘నా మనవడు తిడితే భలే ముద్దొస్తాడు’ అని మురిసిపోయే తాత, ‘అబ్బో ఇంగ్లిష్ బూతులు కూడా నేర్చేసాడు’ అని గర్వపడే నాన్న... వీళ్లే మొదటి ముద్దాయిలు. ఎప్పుడైనా సరే మాటే మనిషి. నోటిని అదుపులో పెట్టుకోలేకపోతే జీవితాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టం. ఈ సెలవులు ‘టూర్’కి కాదు ‘ట్యూనింగ్’కి వాడండి. పిల్లాడి ‘మైండ్‌సెట్’ ట్యూనింగ్. ‘మాట’ ట్యూనింగ్.బీప్ మాటలు మాట్లాడితే ఏమవుతుంది?చెడ్డ మాటలు అలవాటైతే పిల్లల వ్యక్తిత్వం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. బూతు అనేది కేవలం తిట్టు కాదు, అదొక ఆలోచనా ధోరణి. అలా మాట్లాడే పిల్లలు ఎదుటివాళ్లను గౌరవించడం మానేస్తారు. తిట్లతో మాట్లాడే పిల్లలతో మంచి పిల్లలు స్నేహం చేయడానికి ఇష్టపడరు, దానివల్ల వీళ్లు ఒంటరి అయిపోతారు. చాలామంది పిల్లలకు తిట్లు తప్ప మంచి మాటలే రావడం లేదు. దానివల్ల వాళ్లు తమ భావాలను సరిగ్గా వ్యక్తపరచలేక కోపం, చిరాకు పెంచుకుంటున్నారు.ఎందుకునేర్చుకుంటున్నారు?పిల్లలు ఈ చెడ్డమాటలు ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే దానికి కారణం ఓటీటీ వెబ్ సిరీస్‌లు, సినిమాలు. కథకు అవసరం లేకపోయినా ఇరికిస్తున్నారు. దాన్నే పిల్లలు ఫాలో అవుతున్నారు. రెండోది ఫ్రెండ్స్ మధ్య పీర్ ప్రెషర్. ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు కదా నేను కూడా అంటేనే కూల్ అనే ఫీలింగ్. మూడోది ఇంట్లో వాతావరణం. పెద్దలు కోపంలో తిడుతుంటే విని పిల్లలు నేర్చుకుంటారు. మరి ఎలా మాన్పించాలి?‘సబ్‌స్టిట్యూట్’ చెప్పాలిఅదేదో సినిమాలో ‘మైదాపిండి’ అనేది తిట్టుగా వాడతాడు హీరో. చెడ్డమాటకు బదులు ఇలా కూడా వాడొచ్చు. ఏ చెడ్డ అర్థం లేని ‘జ΄్ఫా’ లాంటి సౌండ్స్ కూడా వాడొచ్చని చెప్పోచ్చు. ఇలాంటి టెక్నిక్ వాడిన సినిమా జంధ్యాల ‘హైహై నాయకా’ను వీలైతే చూపించాలి. పెద్దవాళ్లు, గొప్పవాళ్లు ఎలా మాట్లాడతారో ఉదాహరణ ఇవ్వాలి. బాగా కోపం వచ్చినప్పుడు ఎవరికి వారు ఒక మాట అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు ‘ఫినిష్’ అనే మాట పిల్లాడు తన తిట్టుగా పెట్టుకున్నాడనుకోండి. వాడు ‘ఫినిష్’ అన్నాడంటే బాగా కోపం వచ్చినట్టు. అందుకు చెడ్డమాటే మాట్లాడాల్సిన పని లేదు.మన పిల్లలు మాట్లాడే ప్రతి మాటా వాళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని పేరెంట్స్‌గా మనం గుర్తుంచుకోవాలి. మాట తీరు మనిషి స్థాయి చెబుతుంది. ఈ వేసవిలో ఈ మాటను గుర్తుపెట్టుకుని పిల్లల భవిష్యత్తుకు బాట వేద్దాం.తిట్టొద్దుపిల్లాడు చెడ్డమాట మాట్లాడితే ‘నోర్ముయ్’ అని అరవొద్దు. అలా చేస్తే మీ ముందు ఆపేసి వెనక పది రెట్లు మాట్లాడతాడు. దాని బదులుగా ‘ఆ మాట అర్థం తెలుసారా?’ అని కూల్‌గా అడగాలి. 90 శాతం పిల్లలకి అర్థం తెలీదు. ట్రెండ్ కోసం వాడతారు. అర్థం చెప్తే వాడే సిగ్గుపడతారు. సెలవుల్లో రోజుకో ముప్పై నిమిషాలు పిల్లాడి ‘గ్యాంగ్’తో కూర్చోవాలి. సరదాగా మాట్లాడాలి. వాళ్ల భాష ఏంటో తెలుసుకుంటూ మెల్లగా అందరికీ నచ్చజెప్పాలి. ఇది అందరూ మారాల్సిన విషయం. సెటైర్ నేర్పాలి‘మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడతారు డాడీ’ అంటే ‘సరేలే’ అని వదిలేయకూడదు. ‘ముందు ఇంట్లో మానెయ్. మెల్లగా బయట కూడా మానేయ్’ అని హద్దు గీస్తేనే విలువ తెలుస్తుంది. ఇంట్లో ప్రతి ‘బీప్’ మాటకి ‘ఫైన్’ పెట్టాలి. ఒక తప్పు మాటకు 10 రూపాయలు. ఆ డబ్బు వాడి పిగ్గీ బ్యాంక్ నుండి తీసి, ఎవరికైనా దానం చేయాలని చెప్పాలి. తిట్టాలంటే వ్యంగ్యంతో వెటకారంతో కూడా తిట్టొచ్చు అని చెప్పాలి. పిల్లాడు మంచి మాట మాట్లాడినప్పుడు భలే మాట్లాడావు అని మెచ్చుకోవాలి. మీ మెప్పే వాళ్లకు పెద్ద రివార్డ్. -
భవిష్య కిరణం
కొన్ని సంవత్సరాల క్రితం... ‘ఎందుకలా భయపడుతున్నావు?’ అని ఆ అమ్మాయిని అడిగారు కిరణ్ మజుందార్ షా. ‘కంపెనీ నిర్వహణకు నా వయసు సరిపోదేమో’ అని సందేహించింది ఆ అమ్మాయి. ‘నేను బయోకాన్ ప్రారంభించినప్పుడు నీ కంటె చిన్నదాన్ని’ అని చెప్పి ఆమెను ఒప్పించారు కిరణ్. బయోకాన్ అనుబంధ సంస్థ ‘బికార’ ఫౌండర్–సీఈవోగా ఆ అమ్మాయి తనను తాను నిరూపించుకుంది. ఆ అమ్మాయి పేరు... క్లెయిర్ మజుందార్. కిరణ్ మజుందార్ షా మేనకోడలు. బయోకాన్ వ్యాపార సామ్రాజ్య వారసురాలిగా తెర ముందుకు వచ్చారు క్లెయిర్ మజుందార్....ప్రఖ్యాత బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ నిర్వహణ బాధ్యతలను చైర్పర్సన్ మజుందార్ షా నుంచి ఆమె మేనకోడలు క్లెయిర్ మజుందార్ షా స్వీకరించనున్నారు.– బంగారు కుండ‘నాకు ఒక బంగారు కుండ దొరికితే, తీవ్రమైన వ్యాధులను నయం చేసే కొత్తమందులను తయారు చేయడానికి ఆ కుండను అత్తయ్యకు ఇస్తాను’ అని ఆరేళ్ల వయసులో ఎరిక్ మజుందార్ ఒక కుండ బొమ్మ వేసి కాగితంపై రాశాడు. ఆ అబ్బాయి క్లెయిర్ సోదరుడు. విశేషం ఏమిటంటే అప్పుడెప్పుడో రాసిన ఆ బొమ్మల కాగితం ఇప్పటికీ కిరణ్ మజుందార్ షా దగ్గర భద్రంగా ఉంది.‘ఆరేళ్ల వయసులో ఎరిక్ నాకు పంపిన అందమైన సందేశం ఇది’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కిరణ్.ఎరిక్ తన గౌరవనీయ అత్తయ్యకు బంగారు కుండ ఇవ్వలేదు. అయితే కిరణ్ మాత్రం ఎరిక్ సోదరి, తన ప్రియమైన కోడలు క్లెయిర్ మజుందార్‌కు ‘బయోకాన్ బాధ్యతలు’ అనే బంగారు కుండను ఇచ్చారు!– అడుగడుగునా సవాళ్లే... అయినా సరే...కిరణ్ మజుందార్ షా అసాధారణ విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. గాలివాటుగా లేదా అదృష్టవశాత్తూ వచ్చింది కాదు. ఒక గ్యారేజీలో 1978లోప్రారంభమైన ఆమె ప్రయాణం... ప్రతికూల వాతావరణం లో సవాళ్లను అధిగమిస్తూ నిరంతర పోరాటంగా సాగింది.బయోటెక్నాలజీ అంటే పెద్దగా ఎవరికి తెలియని రోజుల్లో పెట్టుబడుల కోసం అన్వేషించడం, బయోటెక్నాలజీని పెద్దగా గుర్తించని కాలంలో పాజిటివ్‌గా ముందుకు సాగడం, స్వల్పకాలిక లాభాలపై దృష్టి సారించే మార్కెట్లతో పోరాడటం... ఇలా ఎన్నో అనుభవాలు కిరణ్‌కు ఉన్నాయి. ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ కూడా ఆవిష్కరణల ఆధారిత బయోటెక్ వ్యవస్థను నిర్మించడం అనేది సాధారణ విషయం కాదు.‘నేను విజయం సాధించే వరకు నాకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు’ అంటారు కిరణ్ మజుందార్ షా.– క్లెయిర్ది నల్లేరుపై నడక కాదుబయోకాన్ సామ్రాజ్య వారసురాలిగా క్లెయిర్ మజుందార్‌ది నల్లేరు మీద నడక కాదు. ఎన్నో సవాళ్లు ఉంటాయి. ‘సవాళ్లను అధిగమించి సత్తా చాటడంలో తన మేనత్తను గుర్తుతెస్తోంది’ అనిపించుకోవాలి.వ్యాపారం, ఔషధ ఆవిష్కరణలో పునరావిష్కరణ(రీఇన్వేషన్) కిరణ్ కార్యాచరణ సూత్రం. కంపెనీకి సంబంధించి ప్రతి దశాబ్దంలోనూ ఒక కీలక మలుపు ఉండేది. మొదటి మలుపు... పారిశ్రామిక ఎంజైమ్‌లపై దృష్టి సారించడం.ఆ తరువాత దశాబ్దంలో బయోకాన్ ఇన్సులిన్‌పై దృష్టి సారించి ప్రపంచంలోని టాప్ 3 ఇన్సులిన్ తయారీదారులలో ఒకరిగా నిలిచారు. 2009 తరువాత పేటెంట్ పొందిన బయోలాజికల్ ఔషధాల రివర్స్–ఇంజినీరింగ్ వెర్షన్లు అయిన బయోసిమిలర్స్‌పై దృష్టి సారించి భారతదేశపు ఏకైక గ్లోబల్ బయోసిమిలర్ సంస్థగా, ప్రపంచంలోని టాప్ 5 సంస్థలలో ఒకటిగా నిలిచింది బయోకాన్.→ ధైర్యం ఇచ్చి... దారి చూపారుఅమెరికాలోని బయోకాన్ అనుబంధ సంస్థ బికారాకు నాయకత్వం వహించడానికి ఒక సీఈవో కావాలని కిరణ్ అనుకొని అందుకోసం తన మేనకోడలైన క్లెయిర్ మజుందార్‌ను ఎంపిక చేసుకున్నారు. క్లెయిర్ మజుందార్ బయోలాజికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, స్టాన్ఫోర్డ్ నుండి ఎంబీఏ, స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి క్యాన్సర్ బయాలజీలో పీహెచ్డీ చేశారు.‘థర్డ్ రాక్ వెంచర్స్’ అనే వెంచర్ క్యాపిటల్(వీసి) సంస్థలో సీనియర్ అసోసియేట్‌గా పనిచేసేవారు. బికారాలో చేరడానికి మొదట్లో ఆమె విముఖత వ్యక్తం చేశారు.‘ఈ వయసులో అంత పెద్ద బాధ్యతలను నిర్వహించలేను’ అనేది క్లెయిర్ విముఖతకు కారణం. అలా అని అత్తయ్య ఊరుకోలేదు.‘నేను బయోకాన్ప్రారంభించినప్పుడు నీ కంటె చిన్నదాన్ని’ అని క్లెయిర్‌ను ఒప్పించారు కిరణ్. అలా బికారలో ఫౌండర్–సీఈవోగా చేరి సత్తా చాటారు క్లెయిర్ మజుందార్. అమెరికాలోని వెంచర్ క్యాపిటల్ కమ్యూనిటీతో పనిచేసిన అనుభవం మూల«ధనాన్ని ఆకర్షించడంలో ఆమెకు సహాయపడింది.కిరణ్ ఆరోజు ఇచ్చిన ఆ ధైర్యమే భవిష్యత్‌లో క్లెయిర్ మజుందార్‌ను ముందుకు నడిపించనుంది. అందుకే ఆమె నా వారసురాలునా వారసురాలికి మూడు లక్షణాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అవి... రిస్క్ తీసుకునే సామర్థ్యం, వ్యూహాత్మకంగా ఆలోచించే తత్వం, విలువను సృష్టించే నైపుణ్యం. నేను బయోకాన్‌కు యజమానిని. నా సంస్థను మంచి వ్యక్తికి అప్పగించానని నేను నిర్థారించుకోవాలి. నా మేడకోడలు క్లెయిర్‌ను నా వారసురాలిగా చూస్తున్నాను. ఆమెలో నేను కోరుకునే మూడు లక్షణాలు ఉన్నాయి. కంపెనీని క్లెయిర్ విజయవంతంగా నడిపించగలదని నమ్ముతున్నాను.– కిరణ్ మజుందార్ షా -
మంచులోకపు చివరి చిరునామా
మంచు పరుపుపైన ఆకాశం వాలిపోతుంటే ప్రకృతి తన మౌనరాగాన్ని వినిపిస్తుంది. అక్కడ సూర్యుడు ఉదయించడు.. ఉదయిస్తే అస్తమించడు.మనుషుల కన్నా పోలార్బేర్ ఎక్కువ ఉండే మంచు రాజ్యం స్వాల్బార్డ్. ఆర్కిటిక్ వెలుగు మధ్య నిశ్శబ్దంగా నిలిచిన ‘స్వాల్బార్డ్’ అనే ఈ ప్రాంతం నార్వే దేశంలో భాగం. యూరప్ నుంచి దూరంగా ఉండే మంచుతో నిండిన ద్వీప సమూహం ఇది. మంచులోకపు చివరి చిరునామాను తెలుసుకోవాలంటే ‘స్వాల్బార్డ్’ వెళ్లాల్సిందే!ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి స్వాల్బార్డ్కు నేరుగా విమాన సర్వీసులు లేవు. ముందునార్వే రాజధాని అయిన ఓస్లో వరకు చేరుకుని అక్కడి నుంచి స్వాల్బార్డ్లోని లాంగ్ఇయర్బైయెన్ ప్రాంతానికి వెళ్లవచ్చు. విజయవాడ నుంచి స్వాల్బార్డ్ వెళ్లాలి అనుకుంటే ముందుగా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది.ఎక్కడ ఉండాలి?స్వాల్బార్డ్లో స్టే అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. లాంగ్ఇయర్బైయెన్లో ఉన్న చిన్న బుటిక్ హోటల్స్, గెస్ట్ హౌసెస్ చాలా బాగుంటాయి. వుడ్‌తో చేసిన గోడల మధ్య బయట చలి ఉన్నా.. లోపల ఉండే ఆ వెచ్చదనం మనసుకి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. అక్కడ ఉన్న లగ్జరీ అమెనిటీస్ కన్నా అక్కడి సింప్లిసిటీ, హాస్పిటాలిటీ మనసుని గెలుచుకుంటాయి. లాడ్జిలోని వెచ్చని మంట దగ్గర కూర్చుని పుస్తకం చదవడం కానీ, లేదా బయట ఉన్న మంచును చూడటం ఒక మెమొరీగా మిగిలిపోతాయి.ఏం చూడాలి?స్వాల్బార్డ్లో చూడాల్సిన ప్రదేశాలు, చేయడానికి ఆక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఆర్కిటిక్ వైల్డర్నెస్లో డాగ్ స్లెడింగ్ చేస్తూ మంచులో వెళ్లడం చాలా మందికి నచ్చుతుంది. స్నో మొబైలింగ్ చేయడం, నార్తర్న్ లైట్స్ చూడటం ఇవన్నీ చాలా మంది చేసేవే. కానీ మీరు వెళ్తే మాత్రం అక్కడ ఉన్న డూమ్స్‌డే వాల్ట్ అనే ప్రపంచ విత్తనాల బ్యాంకును చూడటం మరవకండి. గ్లేషియర్స్, వాటి మధ్యలో ఉన్న మంచు గుహలను చూసేందుకు మంచి ట్రావెల్ ఏజెన్సీలు సాయం చేస్తాయి. దీంతో పాటు సోవియట్ కాలంలో తవ్వి వదిలేసిన పిరామిడెన్, బారెంట్స్‌బర్గ్ అనే మైనింగ్ టౌన్ ఒక సినిమాటిక్ ఫీలింగ్ అందిస్తాయి. ఇక్కడి మ్యూజియంలో పోలార్ బేర్స్, అంటే ధ్రువపు ఎలుగుబంట్ల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.ఏం తినాలి?ఆర్కిటిక్ వాతావరణంలో ఫుడ్ ఒక సూపర్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ లోకల్‌గా లభించే సీ ఫుడ్, ముఖ్యంగా ఫ్రెష్ ఆర్కిటిక్ చార్ అనే కోల్డ్ వాటర్ ఫిష్ డెఫినెట్‌గా ట్రై చేయాల్సిందే. దీంతో పాటు లోకల్ కాఫీ, రీన్డీర్ మీట్, లోకల్ సూప్స్ ఫుడ్ లవర్స్‌కు మంచి ఆప్షన్స్‌గా ఉంటాయి.నిజానికి ఇక్కడ ఫుడ్ అనేది ఆకలి తీర్చుకునే సాధనం మాత్రమే కాదు.. ఆ వాతావరణంలో మనసుని తృప్తిపరచుకునే మార్గం కూడా.సందర్శనీయ స్థలాలుస్వాల్బార్డ్లో లాంగ్ఇయర్బైయెన్ అనే చిన్న టౌన్ నుంచి మంచు కొండల మధ్యలోకి వెళ్లే కొద్దీ మనకు వినపడే ఒకే ఒక శబ్దం.. నిశ్శబ్దం. ఇక్కడి పిరామిడెన్ అనే ఘోస్ట్ టౌన్ చూస్తుంటే గత కాలంలో మనుషుల జీవితం ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అక్కడున్న ప్రతీ కట్టడం, కోల్ మైన్స్ ఇప్పుడు మంచులో కలిసిపోయి ఒక వింత కథను చెబుతాయి. నై–ఆలేసుండ్ అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు హఠాత్తుగా ఆకాశంలో నక్షత్రాలు మనకు దగ్గరయ్యాయేమో అని అనిపిస్తుంది.ఆసక్తికరమైన విషయాలుస్వాల్బార్డ్లో మనుషుల కన్నా పోలార్ బేర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మిడ్నైట్ సన్ వల్ల సమ్మర్లో 24 గంటలూ సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ఇక్కడే ఉంది. దీనిని డూమ్స్‌డే వాల్ట్ అని కూడా అంటారు. ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ చాలా తక్కువ. ప్రయాణానికి స్నో మొబైల్స్ ఎక్కువగా వాడతారు. స్వాల్బార్డ్లో చనిపోయిన వారిని ఖననం చేయరు. దీనికి కారణం ఇక్కడ నేల మొత్తం శాశ్వత మంచుతో ఉండటమే. దీనిని పెర్మాఫ్రోస్ట్ అంటారు. దీని వల్ల మృతదేహాలు పూర్తిగా డీ కంపోజ్ కావు.పోలార్ బేర్స్ అడ్డాస్వాల్బార్డ్ ప్రయాణం ఎంత అందమైనదో అంతే ప్రమాదకరం కూడా. ఇక్కడ మనుషుల కన్నా పోలార్ బేర్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే పట్టణం పరిధి దాటి బయటికి వెళ్లినప్పుడు చేతిలో రైఫిల్ తీసుకెళ్లడం అక్కడ తప్పనిసరి. ధ్రువపు ఎలుగుబంట్లు ఎంత అందంగా ఉంటాయో అంతే శక్తివంతమైనవి కూడా. ఇవి 8 నుంచి 10 అడుగుల ఎత్తు, సుమారు 700 కిలోల బరువుతో కూడా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే మ్యాగ్జిమం ఉస్సెయిన్ బోల్ట్ స్పీడ్ గంటకు 37 కిమీ మాత్రమే. మంచు కొండల మధ్య హఠాత్తుగా ఒక పోలార్ బేర్ కనిపిస్తే గుండె క్షణం పాటు ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే అక్కడ చాలా మంది గైడ్ లేకుండా ఎక్కడికీ వెళ్లరు.స్వాల్బార్డ్లో చేయాల్సిన 5 పనులుఫ్రోజెన్ బబుల్ ఫోటోగ్రఫీలాంగ్ఇయర్బైయెన్ లో అత్యంత చల్లని వాతావరణంలో వేడి నీటి బుడగలు నేల నుంచి బయటికి వచ్చి పేలుతుంటాయి. ఈ ప్రత్యేక దృశ్యాలను ఫోటోగ్రఫీ చేయడం చాలా మందికి ఇష్టం.ఆర్కిటిక్ బోట్ సఫారిఇస్ఫ్యోర్డెన్ ప్రాంతంలో ఐస్‌బర్గ్‌లు, గ్లేషియర్స్ చూడొచ్చు. అలాగే మంచు ప్రపంచంలో మాత్రమే కనిపించే పోలార్ బేర్స్‌ను కూడా చూడవచ్చు.బారెంట్స్‌బర్గ్ ట్రిప్స్థానిక కల్చర్, వారి జీవనశైలి గురించి తెలుసుకోవాలి అంటే రష్యన్ సెటిల్మెంట్ ఉన్న బారెంట్స్‌బర్గ్ వెళ్లవచ్చు.గుడ్ నైట్ చెప్పని సూరీడుస్వాల్బార్డ్లో ఏప్రిల్ చివరి నుంచి ఆగస్టు చివరి వరకు సూర్యుడు అస్తమించడు.పోలార్ నైట్ అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి మధ్య వరకు సూర్యుడు ఉదయించడు. దీనినే పోలార్ నైట్ అంటారు. ఇదే స్వాల్బార్డ్ ప్రత్యేకత.యాత్ర – బడ్జెట్ వివరాలుస్వాల్బార్డ్ ప్రయాణం కొంచెం ఖర్చుతో కూడినదే. అయితే అక్కడ లభించే అనుభవం మాత్రం పక్కా పైసా వసూల్ అనిపిస్తుంది.ఈ సుదీర్ఘ ధ్రువ ప్రయాణానికి 5 రోజులు కేటాయిస్తే సుమారు రూ.4.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు బడ్జెట్ అవుతుంది.హైదరాబాద్ నుంచి ఓస్లోకు ఫ్లైట్ టికెట్‌ను బట్టి 12 నుంచి 22 గంటల వరకు సమయం పడుతుంది. అప్ అండ్ డౌన్ టికెట్ ధరలు రూ.99 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉండొచ్చు.ఓస్లో నుంచి లాంగ్ఇయర్బైయెన్ కు ఫ్లైట్‌లో వెళ్తే వన్ వే జర్నీకి సుమారు రూ.45 వేల వరకు ఖర్చవుతుంది. టికెట్ ధరలు సీజన్ ను బట్టి మారొచ్చు.స్టే ఆప్షన్స్ విషయానికి వస్తే మీ బడ్జెట్‌ను బట్టి రూ.8 వేల నుంచి రూ.62 వేల వరకు కూడా హోటల్స్ లేదా లాడ్జ్‌లలో రూమ్స్ దొరికే అవకాశం ఉంది.ఫుడ్ అండ్ లోకల్ సఫారీ విషయానికి వస్తే డైలీ రూ.12 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ట్రిప్ కొనసాగించవచ్చు. అదే మీరు ఆర్కిటిక్ క్రూజ్‌లో ప్రయాణించాలి అనుకుంటే రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది.కరెన్సీ తక్కువ..స్వాల్ బార్డ్ అధికారిక కరెన్సీ నార్వేజియన్ క్రోన్. కె.ఆర్ నగదు మొత్తానికి ముందు రాస్తారు. నగదు వాడకం చాలా తక్కువ. ఎక్కువ శాతం కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తారు. వీసా అవసరమా?భారతీయులకు స్వాల్బార్డ్ వెళ్లేందుకు సాధారణ నార్వే షెంజెన్ వీసా అవసరం అవుతుంది. నిజానికి స్వాల్బార్డ్ వెళ్లేందుకు ప్రత్యేక వీసా అవసరం లేదు. టెక్నికల్‌గా అది వీసా–ఫ్రీ జోన్.అయితే అక్కడికి వెళ్లాలంటే నార్వే మెయిన్ లాండ్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే భారతీయులకు మల్టిపుల్ ఎంట్రీ షెంజెన్ వీసా అవసరం అవుతుంది. అలాగే పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ, ట్రావెల్ ఇన్సూరెన్స్, హోటల్ బుకింగ్స్, రిటర్న్ టికెట్స్ వంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం అవుతాయి.ఇక్కడ ఇచ్చిన ట్రావెల్ అండ్ బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు వివరాలు స్వయంగా వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.ఇక్కడ రాత్రి లేకుండా సాగిపోయే సమయం, మనసులో వెలుగును మిగిల్చే ఒక అనుభవంగా మారుతుంది. స్వాల్బార్డ్ ఇది కేవలం ఒక ప్రదేశం కాదు ఒక అనుభూతి. ఆర్కిటిక్ సముద్రం మధ్యలో మంచు కొండల నడుమ మనుషుల హడావిడి లేని ఒక ప్రశాంతమైన ప్రపంచం. ప్రకృతి తన విశ్వరూపాన్ని ఎంత అందంగా చూపిస్తుందో ఇక్కడ మనం వీక్షించవచ్చు. ఇక్కడ సమయం అనేది ఒక నెంబర్ కాదు.. ఒక ఎమోషన్. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు (చదవండి: వరుణుడు కోసం అగ్నిబాణాలు) -
సమ్మర్ ట్రిప్స్‌లో ఈ కిట్ తప్పనిసరి!
సమ్మర్ వెకేషన్స్ అంటే మన తెలుగు వాళ్లకు వెంటనే గుర్తుకు వచ్చేవి హిల్ స్టేషన్స్, జలపాతాలు, బీచ్ ట్రిప్స్, ఆలయాలు. కానీ ఎండలు ఎక్కువగా ఉన్న సీజన్ కాబట్టి చిన్ననాటి ఏమరపాటు అయినా మొత్తం ట్రిప్‌ను స్పాయిల్ చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా లాంగ్ డ్రైవ్స్, ట్రెక్కింగ్, ఫ్యామిలీ టూర్స్, పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ కిట్ అనేది తప్పనిసరి!చాలా మంది బట్టలు, చార్జర్స్, కెమెరా ప్యాక్ చేస్తారు కానీ ఎమర్జెన్సీకి పనికొచ్చే వస్తువులు మర్చిపోతారు. కానీ మన జర్నీలో ఈ కిట్ ఒక సూపర్ హీరోలా అవసర సమయంలో ఆదుకుంటుంది అని చాలా మందికి తెలియదు. ప్రయాణంలో అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగపడేందుకు మీ వద్ద ఈ కిట్ మెయింటేన్ చేయడం మరవకండి.ఎమర్జెన్సీ కిట్‌లో ఏముండాలి?ఈ ఎమర్జెన్సీ కిట్‌లో తప్పకుండా స్పేర్‌గా ఒక వాటర్ బాటిల్, కొన్ని ఓఆర్ఎస్ ΄్యాకెట్స్ ఉండాలి. ఎందుకంటే ఎండాకాలంలో డీహైడ్రేషన్ అనేది చాలా పెద్ద సమస్య. అందుకే రీయూజబుల్ బాటిల్‌తో ΄ాటు ఓఆర్ఎస్ ΄్యాకెట్స్ క్యారీ చేయండి.బేసిక్ మెడిసిన్స్.. తలనొప్పి ట్యాబ్లెట్స్, ఫీవర్ మెడిసిన్, మోషన్ సిక్నెస్ ట్యాబ్లెట్స్, ఆసిడిటీ రెగ్యులేటర్ ట్యాబ్లెట్స్, బ్యాండ్ ఎయిడ్స్, యాంటిసెప్టిక్ క్రీమ్ తప్పకుండా ఉండాలి. పిల్లలతో వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. ఇవన్నీ తీసుకున్నాక అవసరమైతే దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించడం మరవకండి!సన్‌స్క్రీన్, క్యాప్... మన తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పీఎఫ్ సన్‌స్క్రీన్, సన్‌గ్లాసెస్, క్యాప్ లేకపోతే వేడికి చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పవర్ బ్యాంక్ అండ్ టార్చ్ ... కొండప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలకు వెళ్తే చార్జింగ్ పేయింట్స్ లభించకపోవచ్చు. పవర్ బ్యాంక్, చిన్న టార్చ్ లైట్ చాలా ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఈ సమస్యలు సాధారణమే.వెట్ వైప్స్, శానిటైజర్... రోడ్ ట్రిప్స్‌లో హైజీన్ మెయింటేన్ చేయడానికి వెట్ వైప్స్ చాలా ఉపయోగపడతాయి. శానిటైజర్ మీ బ్యాగ్‌లో తప్పకుండా ఉండేలా చూసుకోండి.చిరుతిళ్లు ... బిస్కిట్స్, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ బార్స్ లాంటి స్నాక్స్ క్యారీ చేయడం మరవకండి. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఎండాకాలం రోడ్ ట్రిప్ అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. ఉదయం త్వరగా బయల్దేరి ఎండ పెరిగేలోపు ప్రయాణించండి. తరువాత సాయంత్రం సమయంలో ప్రయాణాన్ని కొనసాగించండి. ఇలా చేస్తే మీ ప్రయాణం మరింత కంఫర్టబుల్‌గా సాగుతుంది. (చదవండి: చిన్న నది.. పేద్ద కథ!) -
చిన్న నది.. పేద్ద కథ!
భారతదేశంలో నదులు అంటే ముందు గంగా, గోదావరి, కృష్ణా, బ్రహ్మపుత్ర లాంటి మహానదుల పేర్లే గుర్తొస్తాయి. కానీ మన దేశంలో ఉన్న అత్యంత చిన్న నది ఏంటో తెలుసా? ఈ ప్రశ్నకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. భౌగోళిక నిపుణులు, ట్రావెల్ గైడ్స్, కొన్ని జియోగ్రఫీ రిఫరెన్సుల ప్రకారం ఈ అత్యంత చిన్న నదుల్లో ఒకటిగా ఎక్కువగా వినిపించే పేరు ఆర్వారీ నది.ఆర్వారీ నది ఎక్కడుంది?రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లాలో ప్రవహించే ఈ నది సుమారు 45 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని చెబుతారు. చివరకు ఇది సాహిబీ నదీ వ్యవస్థలో కలుస్తుంది. చిన్నదైనా ఈ నది పేరు మాత్రం జియోగ్రఫీ డిస్కషన్స్‌లో చాలాసార్లు వినిపిస్తుంది.అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇండియాలో ‘అఫీషియల్ షార్టెస్ట్ రివర్’ అంటూ ఫిక్స్డ్ నేషనల్ రికార్డు ఏమీ లేదు. కొందరు ఇంకొన్ని చిన్న నదుల పేర్లు కూడా ప్రస్తావిస్తారు. కానీ ఆర్వారీ నదిని ఈ జాబితాలో ముందుగా చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నదికి స్పష్టమైన సోర్స్ టు ఎండ్ అంటే నది చివర అంతం.మాయం అయిన నది.. మళ్లీ ప్రవహించిన కథఒకప్పుడు ఈ నది పూర్తిగా ఎండిపోయి దాదాపు మాయం అయిందట. నేల చిట్లిపోయి, నీటి జాడ కూడా కనిపించని పరిస్థితి వచ్చిందని చెబుతారు. కానీ అక్కడి స్థానిక గ్రామస్థులు, నదీ సంరక్షణ సంఘాలు, ప్రకృతి ప్రేమికులు కలిసి నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు. చెక్‌డ్యామ్‌లు, సంప్రదాయ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులతో ఈ నదికి మళ్లీ ప్రాణం పోశారు. అందుకే పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడినప్పుడు ఆర్వారీ నది పునరుజ్జీవన కథను చాలా మంది ఉదాహరణగా చెబుతుంటారు.నిజానికి మన దేశంలో కేవలం వర్షాకాలంలోనే ప్రవహించే చిన్న వాగులు చాలా ఉంటాయి. కానీ వాటిని అధికారికంగా నదులుగా పరిగణించరు. ఆర్వారీ మాత్రం చిన్న నది అయినా, దాని వెనక ఉన్న మానవ ప్రయత్నం మాత్రం చాలా పెద్దది. ఈ చిన్న నది మనకు చెప్పే విషయం ఒక్కటే ప్రకృతిని మనం కంటికి రెప్పలా కాపాడుకుంటే ప్రకృతి కూడా మనల్ని అంతే ప్రేమగా కాపాడుకుంటుంది. (చదవండి: ఎలక్ట్రిక్ యూనిసైకిల్ రైడ్‌కి ట్రాఫిక్ పోలీసులే ఫిదా! చివరికి..) -
జేఈఈలో రెండుసార్లు ఫెయిల్, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్..! చివరికి..
జీవితమంతా వైఫల్యాలు అడగడుగున పలికరిస్తూనే ఉన్నా వదలిపెట్టని ధీరుడి కథ. అదేంటి అన్ని పెయిల్యూర్స్ ఎదుర్కొటే ధీరుడు, శూరుడు అంటారేంటి అనుకోకండి. ఎందుకంటే గెలిస్తే వాట్ నెక్స్ట్ అంటూ సాగిపోతావు..అదే ఆపకుండా ఓటమి హగ్ ఇస్తూ ఉంటే..పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాలంటే అజేయమైన ఓర్పు, ఆత్మ విశ్వాసం కావాలి. ముఖ్యంగా చుట్టూ ఉన్నవాళ్లలో కొందరు జాలిచూపులతో సానుభూతి చూపితే, మరికొందరు నీ వల్ల కాదు అన్న విమర్శల బాణాలు.. అయినా సరే డోంట్ కేర్ అంటూ ముందుకు సాగాలంటే ఆకాశమంత ధైర్యం కావలి. అందుకు ఉదాహరణ ఈ టెకీ. అతడి కథ వింటే..ఫెయిల్యూర్లు, రిజెక్ట్‌లు చూసినోళ్లే గొప్పోళ్లు అని కచ్చితంగా అంటారు. మరి అతడి కథేంటో చకచక చదివేద్దామా..!.చాలామంది విద్యార్థులకు పోటీ పరీక్షలు ప్రారంభ విద్యా మైలురాళ్లలా విజయానికి అంతిమ కొలమానంగా ఉంటే..హర్యానాలోని రోహ్తక్కు చెందిన రిజుల్ సింగ్ మాలిక్ విషయంలో మాత్రం అలా కాదు. ఎడతెగని ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో అందుకున్న గొప్ప గెలుపు రికార్డు అతడిది. అతడు పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. రిజుల్ తన పాఠశాల విద్యను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వసంత్ కుంజ్‌లో పూర్తి చేశాడు.ఆ తర్వాత అందరిలానే ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఐఐటీ జేఈఈకి ప్రిపేరయ్యాడు. మొదటిసారి ఓటమి ఎదుర్కొనడంతో మరోసారి ప్రయత్నించాడు. ఈ సారి హోమ్ ట్యూటర్, ఒక ఏడాది వృధా చేసుకుని లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుని మరి ప్రిపేరయ్యాడు. అయినప్పటికీ ఓటమిని ఎదుర్కొనక తప్పలేదు. కానీ ఇంతలా ప్రిపేరైనా..కనీసం కటాఫ్ మార్కులు కూడా సాధించలేకపోయాడు రిజుల్. పైగా ఒక ఏడాది వృధా చేసుకోవడం బంధువులు, మిత్రులు అంతా ఒకటే విమర్శించడం ప్రారంభించారు. పాపం రిజుల్ ఆ అవమానం తట్టుకోవడం సాధ్యం కాక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు కూడా. అయితే 18 ఏళ్ల వయసులో రాసే ప్రవేశ పరీక్ష కెరీర్లో రాబోయే 40 ఏళ్లను నిర్దేశించదని గ్రహించి బీటెక్ ఐటీ చేరి విజయవంతంగా పూర్తి చేశాడు. అయినప్పటికీ ఆ జేఈఈ ఫెయిల్యూర్ తలుచుకున్నప్పుడల్లా అతడిని బాగా మెలిపెడుతుండేది. ప్రతీదాంట్లో.. రెండు మూడు సార్లు వైఫల్యమేఅయితే 2019లో జరిగిన బర్కిలీ సమ్మర్ స్కూల్ అతని జీవితంలో ఒక ప్రధాన మలుపు. అక్కడ అతనికి డేటా సైన్స్‌తో మొదటిసారిగా గట్టి పరిచయం ఏర్పడింది. అలా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ (UC Irvine లేదా UCI)అమెరికాలో అకడమిక్ ప్రొబేషన్) ప్రవేశం పొందడం అతడి లక్ష్యంగా మారింది. అందుకోసం జీఆర్ఈఈకి సన్నద్ధమయ్యాడు. అయితే అది కూడా రిజుల్‌కు చుక్కలు చూపించింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు ఆ పరీక్షనురాశాడు. మొదటి ప్రయత్నంలో 303, రెండవ ప్రయత్నంలో 305, మూడవ ప్రయత్నంలో 307 దాటి, చివరకు నాల్గవ ప్రయత్నంలో 308 స్కోర్ చేశాడు. అన్నిసార్లు రాయడంతో మరోసారి జీఆర్ఈకి రెడీ అవుతున్నా అని చెప్పాలంటే భయపడేవాడు. అయితే అనుకోకుండా యూసీ ఇర్విన్ నుండి అంగీకారం రావడంతో ఇది నిజమేనా అని నమ్మలేకపోయాడు. అయితే అక్కడి అధికారి స్కోరు నిజమైన విజయం కాదని, నువ్వు పట్టువదలకుండా రాయడమే అసలైన గెలుపు అని బదులిచ్చాడు. పాపం యూసీ ఇర్విన్లోని ఎంఎస్ ప్రోగ్రామ్ నుంచి కూడా మళ్లీ సవాళ్లు మొదలయ్యాయి. సరిగ్గా అమ్మ పుట్టిన రోజు అని భారత్‌కు వస్తే..తన GPA (Grade Point Average) అకడమిక్ ప్రతిభ 2.8కి పడిపోవడంతో, ఆ అకడమిక్ ప్రొబేషన్‌లో ఉంచేశామని, మెరుగుపడకపోతే తదుపరి చర్యలు ఎదుర్కొనక తప్పదని మెయిల్ వచ్చింది. దాంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన ఉత్సాహం కాస్తా ఉసురుమంది గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చా అటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. పైగా అందరు ఉత్తీర్ణులయ్యారు, తానొక్కడినే పరాజితుడిగా ఉండిపోయానంటూ నాటి సంఘటనను తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అదీగాక అమెరికాలో జాతివివక్ష వంటి పలు సవాళ్లు కూడా తోడవ్వడంతో తనపై ఒత్తిడి ఎక్కువగా ఉండేదని చెప్పుకొచ్చారు. చివరికి తన జీపీఏను మెరుగుపరుచుకుని విజయవంతంగా తన అకడమిక్ని పూర్తి చేశాడు. ఇక తక్షణమే ఉద్యోగ వేట అందరి కంటే ముందు మొదలు పెట్టాను గానీ, ప్రతిది రిజెక్ట్ అయ్యేదని చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడగా చివరికి ఓ ఇంటర్న్‌షిప్‌కి అర్హత లబించినట్లు తెలిపాడు. అలా ఈవై, వాల్‌మార్కట్ కంపెనీల్లో పనిచేశాడు. అక్కడ పనిసంస్కృతి గొప్ప పాఠాలే నేర్పాయి. తన సహోద్యోగులు, మేనేజర్ నుంచి చాలా తక్కవుమద్దతే లభించేదని పేర్కొన్నాడు. ఒక సందర్భంలో, తాను సహాయం కోసం ఒక సీనియర్‌ను సంప్రదించగా, ఆ విషయాన్ని తన మేనేజర్ వరకు తీసుకెళ్లి చివాట్లు, నిందలు పడేలా చేశాడంటూ నాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. గూగుల్‌లో జాబ్ కొట్టడం కోసం..ఆ అనుభవం భవిష్యత్ కార్యాలయాల పట్ల ఎలా ఉంటే బెస్ట్ అనేది తెలుసుకోగలిగానని న్నారు. దాంతో మంచి పనిసంస్కృతి ఉండే ఉద్యోగ కోసం అన్వేషించే పనిలో పడ్డట్లు తెలిపాడు. ఆ క్రమంలోనే గూగుల్‌లో జాబ్ కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నాడట అందుకోసం ఏ పదో, 20 కాదు ఏకంగా 520 సార్లకు పైగా తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. అయితే ఆ సమయంలో తనని ప్రోత్సహించింది మాత్రం తన కాబోయే ప్రియురాలు, తల్లిదండ్రులేని అంటున్నాడు. వాళ్లిచ్చిన అండదండలతో వెనక్కి తగ్గకుండా గుగుల్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లు వివరించాడు. అలా ఓ రోజు మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో, తన వాల్‌మార్ట్ ఆఫీస్ నుంచి బయటకు వస్తుండగా ఆఫర్ లెటర్ పంపబడుతోందని ఫోన్ కాల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. దాంతో తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు. గూగుల్‌లో జాబ్ రాగానే తన కాబోయే భార్య ఖుషీకే ఫోన్ చేశానని, ఆ తర్వాత అమ్మనాన్నలకు చేసినట్లు తెలిపాడు. ఎందుకంటే అన్ని రిజెక్షన్లు రావడంతో నాకే ఎందుకు జరుగుతోందంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే రిజుల్ ప్రియురాలు ఏంకాదు, కచ్చితంగా గెలుస్తావ్, ఆఫర్ లెటర్ అందుకుంటావ్ అంటూ ధైర్యం చెబుతూనే ఉండేది, ఒక్కసారి కూడా పోనీలే వదిలేయ్ అన్న మాట తన నోటినుంచి రాలేదంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఇతడి కథ చూస్తుంటే హాలీవుడ్ మూవీలోని ఒక కొటేషన్ గుర్తొస్తోంది. జీవితం అంటే "ఎంత బలంగా కొట్టావన్నది కాదు, ఎన్ని ఎదురదెబ్బలు తగలినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగడమే" అన్న వాక్యానికి నిలువెత్తు నిదర్శనం కదూ. ఎన్ని వైఫల్యాలు రానీ పట్టుదలతో సాగేవాడి ఎదురేలేదు, పైగా ఏదో ఒకనాటికి విజయం తథ్యం అనేది జగమెరిగిన సత్యం. View this post on Instagram A post shared by Rijul (@rijulsinghmalik_) (చదవండి: కోటి రూపాయలు శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!) -
విద్యార్థి దశలో భక్తి కూడా ప్రధానమే..!
ఈ కాలంలో పిల్లలు చదువుల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. భక్తి అనేది వారిలో ఒక రకమైన భరోసాను నింపుతుంది. ‘మనల్ని రక్షించే శక్తి ఒకటి ఉంది‘ అనే నమ్మకం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన పురాణగాథల్లోని ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వారి కథలు వినడం ద్వారా సత్యం, ధర్మం, ఓర్పు వంటి లక్షణాలు అలవడతాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ‘దైవ భీతి’ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడనే భావన పిల్లలను చెడు మార్గాల వైపు వెళ్లకుండా అడ్డుకుంటుంది. దైవ చింతన, ఆధ్యాత్మిక పరిమళం ఉన్న ఇంట్లో పెరిగే పిల్లలకు క్రమశిక్షణ ఉంటుంది.సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్. నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః (శంకరాచార్యుల భజగోవిందం) చిన్నతనంలోనే దైవచింతన ఉన్నవారితో కలవడం వల్ల కలిగే మార్పు. మంచి వారితో స్నేహం (సత్సంగం) వల్ల ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. భక్తి అనేది ఇంట్లోనే మొదలవ్వాలి. మాతృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్యదేవో భవ. అతిథిదేవో భవ. బాల్యంలోనే ఈ భావం కలగడం వల్ల పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. క్రమశిక్షణ, సత్యం పలకడం, ఇతరులకు సహాయం చేయడం వంటి ఉత్తమ గుణాలను అలవరుచుకోవడం.‘కౌమారే విద్యార్థినః’విద్యతోపాటు విజ్ఞానాన్ని ఇచ్చే భక్తి కూడా అవసరం. లోకజ్ఞానాన్ని ‘విద్య’ ఇస్తే, భక్తి విచక్షణా జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రాణం పోయాక ఎంతో ప్రేమగా చూసుకునే భార్య వాకిలి వరకే వస్తుంది. బంధుమిత్రులు వల్లకాటి వరకే వస్తారు. కాని ఎన్ని జన్మలెత్తినా కూడా మనతో ఉండి ఎప్పుడెప్పుడు మనలను తరింపచేద్దామా అని ఆ పరబ్రహ్మ మనలను వదలకుండా ఏ దేహం ధరించినా అందులో హృదయవాసిగా ఉంటున్నాడు. అటువంటి పరబ్రహ్మను వదిలేసి జీవితమంతా ప్రాపంచపు విషయాల్లో ఉంటూ జల్సాలు చేస్తే చివరికి మిగిలేది దుఃఖమే. చిన్నప్పుడే దైవ భక్తిని అలవరచుకోవడం అనేది వ్యక్తి జీవన ప్రయాణానికి బలమైన దిక్సూచిని నిర్మించుకోవడంతో సమానం. బాల్యంలో మనసు స్వచ్ఛంగా, మృదువుగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో నాటిన భక్తిబీజాలు జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాయి.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
టీ ఇలా చేయాలి.. అలా కాదు!
అనగనగా ఒక ఊరు.రచ్చబండ దగ్గరే రోజూ ఉదయాన్నే...జనంతో కిక్కిరిసే టీకొట్టు!కొట్టు యజమాని అనయ చేతి టీ తాగితే...గుండె గట్టిపడుతుందని కొందరు... మెదడు చురుకుగా మారుతుందని ఇంకొకరు..ఇలా అందరూ కలిసి ఆ కొట్టు.. అక్కడ దొరికే టీని వైరల్ చేసేశారు.మరి... ఇదంతా నిజమేనా? టీకి... గుండెకు లింకేమిటి?..అనయ కథతోనే ముందుకెళదాం.. టీ కొట్టు బ్రహ్మాండంగా నడుస్తూండగానే రవి అనే కొత్త కుర్రాడు పనోడిలా చేరాడక్కడ. అందరూ అక్క చేతి టీ ఆరోగ్యానికి మంచిదంటున్నారు కదా... దాన్ని మరింత స్ట్రాంగ్ చేద్దాం అనుకున్నాడీ కుర్రాడు. అక్క రెండు నిమిషాలు మాత్రమే కాస్తోంది. నేను ఇంకో రెండు నిమిషాలు ఎక్కువ ఉడకబెడతా అని ప్రయోగం మొదలుపెట్టాడు. అలాగే ఉడికించాడు కూడా. ఈ టీ తాగినవాళ్లు.... వాసన కమ్మగా ఉందని మెచ్చుకున్నారు కానీ... కొంచెం చేదుగా ఉందని ఫిర్యాదు కూడా చేశారు. ఒకట్రెండు రోజులు అంతా బాగానే ఉండింది కానీ.. ఆ తరువాత ఊళ్లో చాలామంది నీరసంగా ఉందని, తలనొప్పి దంచేస్తోందని అనడం మొదలుపెట్టారు. ఇంకొందరు కడుపులో గడబిడగా ఉందంటే.. మరికొందరు నిద్రపట్టడం లేదని వాపోవడం మొదలుపెట్టారు. వీళ్లందరూ అనయ కొట్టులో టీ తాగే వాళ్లే. ఊళ్లో జరిగే విషయాలు తెలిసిన అనయ కించిత్ ఆశ్చర్యపోయింది. ఏమై ఉంటుందా? అని ఆలోచించింది. రవితో మాటలు కలిపింది. విషయం వెంటనే అర్థమైపోయింది..‘‘బాబూ రవి... మనం కాచే టీ మందులా పనిచేస్తుంది. కాకపోతే అది మనం దాన్ని సక్రమంగా ఎలా తయారు చేయాలో తెలిసినంత వరకే. మంచి వాసన వస్తోంది కదా అని ఎక్కువ సేపు ఉడికించావనుకో.. అంతే సంగతులు. మందు కాస్తా విషమైపోతుంది’’ అని అసలు విషయాన్ని బయటపెట్టింది...మరగిస్తే విషమే..టీని మరిగించిన కొద్దీ అందులోని పాలిఫినాల్స్ ముక్కలు ముక్కలైపోతాయి. ఫలితంగా వాటితో మనకు మంచి జరక్కపోగా... హాని జరిగే అవకాశాలు పెరిగిపోతాయి. టీని ఒకట్రెండు నిమిషాలు మాత్రమే మరిగించడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. అప్పుడు రుచి, పోషకాలు రెండూ సమతౌల్యతతో ఉండి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇలా కాకుండా... మూడు నుంచి ఐదు నిమిషాలపాటు ఉడికించినా సరే... పాలిఫినాల్స్ తాలూకూ లాభాలు తగ్గిపోతాయి. పది నిమిషాలపాటు ఉడికిస్తే... ప్రయోజనం మరింత తగ్గిపోతుంది. ఇంతకంటే ఎక్కువ మరిగించిన టీతో మేలు జరగదు. తలనొప్పి, కడుపులో గడబిడ, నిస్సత్తువ వంటి అసౌకర్యాలు మొదలవుతాయి. అంతేకాదు... టీ ని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తయారు చేసుకుని తాగాలని, చల్లారిందని టీని పదే పదే ఉడికించడమూ మంచిది కాదని అనయ రవికి వివరించింది. ఉదయాన్నే తాగే టీ శరీరానికి శక్తినిచ్చి ఫోకస్న పెంచితే.. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో తాగే టీ ఒత్తిడిని దూరం చేసే మనల్ని రిఫ్రెష్ చేస్తుందని రవికి తెలిపింది. సాయంత్రం ఆరు గంటల తరువాత తాగే టీ నిద్రను పాడు చేసే అవకాశాలు ఎక్కువని స్పష్టం చేసింది.టీ లవర్స్ మాత్రమే కాదు.. ‘‘మేము రోజూ గ్రీన్ టీ తాగుతామండి.. కానీ ఎందుకో మాకేమీ ఆరోగ్య లాభం లభించడం లేదు’’ అని చెప్పే వారు కూడా టీని ఎంత సేపు మరగిస్తున్నారో ఒకసారి గమనిస్తే మేలని అనయ సూచిస్తోంది. ‘‘అక్క చెప్పిన మాటల్లో లాజిక్కు ఉంది’’ అని తెలుసుకున్న రవి కూడా టీని రెండు కంటే ఎక్కువ నిమిషాలు మరగించకపోవడంతో ఇప్పుడు ఊళ్లో అందరూ హ్యాపి!టీని పద్ధతిగా చేస్తే... 1. శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. 2. చురుకుదనాన్ని పెంచుతుంది. 3. గుండెకు మంచిది.4. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.ఎక్కువగా మరిగిస్తే...1. టానిన్లు ఎక్కువవుతాయి. అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి, తలనొప్పిలాంటివి వస్తాయి.2. శరీరం ఇనుమును శోషించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా రక్తహీనత ఏర్పడవచ్చు.3. పొట్ట లోపలి పొరను చీకాకు పెడుతుంది. ఇది కాస్తా గ్యాస్ ఏర్పడేందుకు, అసౌకర్యానికి దారితీయవచ్చు.4. జీర్ణ సమస్యలతోపాటు కేన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది.5. మనకు మేలు చేసే ఆంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు నశించిపోతాయి.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్‌రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా, లావణ్య భర్త భూపాల్‌రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. అయినప్పటికీ, తల్లి లావణ్య మనోస్థైర్యంతో తన పిల్ల లను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు. -
నిరంత అలసట, జుట్టురాలడం ఆ వ్యాధికి సంకేతం కావొచ్చు..!
చాలామంది అలిసిపోడం, జుట్టు రాలడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. కొందరిలో కీళ్ల నొప్పులు, నోటి పూతలు తరుచుగా వస్తుంటాయి. అయితే ఇలాంటి వాటిని అస్సలు తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పైకి సాధారణంగా కనిపించే ఈ లక్షణాలు ఆ వ్యాధికి సంకేతం కావొచ్చని హెచ్చరిస్తున్నారు. పైగా ఇలాంటి సమస్యలు ఎక్కుగా 20 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళల్లోనే అధికం అని అంటున్నారు. ఇంతకీ ఆ వ్యాధి ఏంటంటే..బాగా అలసిపోవడం, జుట్టురాలిపోవడం, తరుచుగా నోటిపూతలు, కీళ్ల నొప్పులు..ఒక వారానికి పైగా ఉండటం, లేదా మళ్లీ మళ్లీ అదేపనిగా ఈ సమస్యలు రావడం వంటివి జరిగితే అది లూపస్ వ్యాధికి సంకేతం కావొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే యువతులలో తరుచుగా ఈ వ్యాధి నిర్ధారణ కాకుండానే ఉండిపోతోందని అంటున్నారు. ఈ సమస్య తీవ్రమైన లక్షణాలతో మొదలవుతుందని అనుకుంటారు. కానీ ఇది నిరంతర అలసట, కీళ్ల నొప్పులు, కారణం తెలియని జుట్టు రాలడం, నోటి పూతలు, స్వల్ప జ్వరం, ఎండ తగిలిన దద్దుర్లు వంటి వాటితో ప్రారంభమవుతుందని అన్నారు. ఇది రోజువారి చిన్నపాటి సమస్యలతో పోలి ఉండటంతో చాలామంది యువతులు ఈ సమస్యలను తేలిగ్గా కొట్టిపారేస్తుంటారని అంటున్నారు. ఎందుకు వస్తుందంటే..మహిళలు కెరీర్‌ని నిర్మించుకునే క్రమంలో గర్భధారణ ప్లాన్స్ వేసుకోవడం, లేదా గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి చేస్తుంటారు. అదీగాక కొందరు హర్మోన్ల మార్పులతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్లలో ఈ లూపస్ వ్యాధి మరింత సమస్యాత్మకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎక్స్ క్రోమోజోమ్‌లతో ముడిపడి ఉన్న రోగ నిరోధక సంబంధింత జన్యువుల కారణంగా పురుషుల కంటే మహిళలకు సహజంగానే బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలు ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. ఈ బలమైన రోగనిరోధక వ్యవస్థ తరచుగా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడినప్పటికీ, కొన్నిసార్లు అది అతి చురుకుగా మారి పొరపాటున శరీరం సొంత కణజాలాలపై దాడి చేస్తుందట. దీన్నే లూపాస్ వ్యాధి అంటారట. ఇదొక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది చాలామటుకు ఒకే కారకం వల్ల అరుదుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. కానీ ఒక్కోసారి ఈ క్రింది వాటి కలయిక వల్ల మరింత వేగవంతమవుతుందంటుననారు.జన్యుపరమైన సున్నితత్వంహార్మోన్ల మార్పులుసూర్యరశ్మికి గురవ్వడం(ఎండకు బహర్గతమవ్వడం)ఇన్ఫెక్షన్లుమానసిక లేదా శారీరక ఒత్తిడిలక్షణాలు:నిరంతర అలసటకీళ్ల నొప్పి లేదా వాపుజుట్టు రాలడంనోటి పూతలుస్వల్ప జ్వరంఎండ తగిలిన తర్వాత చర్మంపై దద్దుర్లుకండరాల నొప్పిమెదడు మసకబారడంకారణం తెలియని బలహీనతఈ లక్షణాలు ఒత్తిడి, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత లేదా సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం వంటి వచ్చే సమస్యల్లా కనిపించడంతో చాలామంది మహిళలు తేలికగా తీసుకుంటారట. దాంతో తక్షణ వైద్య సహాయం ఆలస్యమవుతోందని చెబుతున్నారు.లూపస్ కేవలం హార్మోన్ల వల్ల వచ్చే వ్యాధి కాదు, కానీ ఈస్ట్రోజెన్ రోగనిరోధక ప్రతిస్పందనలను పెంచుతుంది. జన్యుపరంగా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్నవారిలో, ఆ అదనపు రోగనిరోధక ప్రేరణ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులులూపస్ని ప్రభావితం చేసేవి..ఋతుచక్రాలు, గర్భధారణ, ప్రసవానంతర కోలుకోవడం, గర్భనిరోధకం సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు కొంతమంది రోగులలో లూపస్ తీవ్రతను ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో లూపస్పై కేర్ తీసుకుంటారట వైద్యులు. లేకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. సరైన పర్యవేక్షణ మరియు చికిత్సతో, లూపస్ ఉన్న చాలా మంది మహిళలు ఆరోగ్యకరమైన గర్భధారణను కలిగి ఉండగలరని నిపుణులు నొక్కి చెబుతున్నారు.సకాలంలో చికిత్స తీసుకోకపోతే..కీళ్ళుచర్మంమూత్రపిండాలుఊపిరితిత్తులుగుండెనాడీ వ్యవస్థ తదితరాలను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలసట, జుట్టురాలడం, కీళ్లనొప్పులు, జ్వరం వంటివి తరుచుగా వస్తే తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముందుగానే ఈ సమస్యను గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి అదుపులో ఉంటుంది లేదా నివారించొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.మరిన్ని వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!) -
ఎలక్ట్రిక్ యూనిసైకిల్ రైడ్‌కి ట్రాఫిక్ పోలీసులే ఫిదా! చివరికి..
ఒక బెంగళూరు వ్యక్తి తన ఎలక్ట్రిక్ యూని సైకిల్‌పై రోజూ చేసే ప్రయాణg ఓ ట్రాఫిక్ పోటీసులో కుతుహాలం రేపి, ఆ వ్యక్తిని ఆపి మరి దాని గురించి తెలసుకునేలా చేసింది. చివరికి ఆ పోలీసు ఒక సారి ఆ సైకిల్ని ట్రై చేసి చూశాడు కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జెరోమ్ ఆనంద్ అనే ఆ వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆయన రోజు తన ఆఫీస్ నుంచి ఇంటికి ఆ ఎలక్ట్రిక్ యూని సైకిల్‌పై వెళ్తుంటారు. ఎప్పటిలానే ఆ రోజు కూడా సాధారణ ప్రయాణంగా ప్రారంభమైన తన రైడ్ చివర్లో అసాధారణంగా మారింది. ఆయన ఆఫీస్ నుంచి ఇల్లు జస్ట్ 25 కి.మీటర్లే కావడంతో ఆ ఒంటి చక్ర వాహనంపై రోజు వెళ్తుంటాడాయన. అందులోనూ బెంగళూరు ట్రాఫిక్‌లో ప్రయాణించడం ఎంత సాహసమో తెలియంది కాదు. ఆ రోజు కూడా ఆనంద్ ఎప్పటిలానే తన ఒంటి చక్ర వాహనంపై ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నడు. ఇంతలో తన జర్నీకి ట్రాఫిక్ పోలీసుల రూపంలో సడెన్ బ్రేక్ పడింది. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపుతారు. ఆయన ఇలా ప్రయాణించడం కూడా ఏదైన ట్రాఫిక్ ఉల్లంఘన ఏంటీ అనుకుని ఆగిపోతాడు. వాళ్లు ఈ వాహనంపై ఎలా ప్రయాణిస్తారు వంటి కుశల ప్రశ్నలు అడుగతారు. దాంతో అతను ఆ వాహనం ఫీచర్స్ గురించి సవివరంగా వివరించడమే కాదు రైడ్ చేసి చూస్తారా అని అడుగుతాడు. దాంతో ఆ ట్రాఫిక్ పోలీస్ ఆనంద్ వాహనంపై ఎక్కి సరదాగా రైడ్ చేస్తాడు కూడా. ఆ సైకిల్‌పై రైడ్ చేయడంలో ఆనంద్ పోలీస్‌కి హెల్ప్ చేస్తాడు కూడా. అయితే ఈ వాహనంతో పెట్రోల్ టెన్షన్, పార్కింగ్ హైరానా ఉండదని కూడా వివరిస్తాడు. పైగా ట్రాఫిక్ని సులభంగా నిర్వహించొచ్చు, చాలా దూరం సునాయాసంగా ప్రయాణించొచ్చు అని ఆనంద్ ఆ ట్రాఫిక్ పోలీసులకు వివరిస్తాడు. ఆయన ఆ వీడియోకి "ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు... చివరికి అతను నా ఈయూసీని నడపడంతో ముగిసింది" అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు ఆనంద్. అంతేగాదు ఏమో ఎవరు చెప్పగలరు ఏదో ఒక రోజు ట్రాఫిక్ పోలీసులు కూడా బెంగళూరు రోడ్లపై EUC తో గస్తీ కాయొచ్చేమో..అని చమత్కిరిస్తూ పోస్ట్‌ని ముగించాడు. View this post on Instagram A post shared by Jerome anand (@jro_thestreetrider) (చదవండి: అమ్మగా గర్వించే క్షణం..!) -
67 కిలోల నుంచి 53 కిలోలకు..! కానీ జంక్‌ఫుడ్‌కు నో చెప్పక్కర్లేదట..
బరువు తగ్గడం అనేది ఆరోగ్య స్పృహతో కూడిన ట్రెండ్‌గా మారింది. యువత కాదు పెద్దలు సైతం స్మార్ట్, హెల్దీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చేతనైనంతలో కొద్దిపాటి వ్యాయామాలు, మితంగా భోజనం, చక్కటి జీవనశైలిని పాటించేందుకు మక్కువ చూపిస్తున్నారు. అంతేగాదు బరువు తగ్గడం భారం కాదు అనారోగ్యం బారిన నుంచే కాపాడుకునే రక్షణచర్యగా భావిస్తున్నారు. ఆ క్రమంలో చాలామంది మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవలోకి తాజాగా ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ చేరిపోయారు. ఆమె కేవలం 12 కిలోలను బరువుని చాలా తేలికపాటి అలవాట్లతో తగ్గించుకుని శెభాష్ అనిపించుకున్నారు. కష్టంగా కాకుండా చిన్నచిన్నగా సాధ్యమై వాటినే ఎంచుకుని, పాటిస్తే బరువు తగ్గడం చాలా ఈజీ అని అంటున్నారామె. మరి అవేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!.తక్షణ పరిష్కారాలపై ఆధారపడకుండా, సమతుల్య దినచర్యలు, ఆలోచనాత్మకమైన ఆహారం, శక్తి శిక్షణ, తగినంత నీరు తాగడం, నాణ్యమైన నిద్రపై దృష్టి పెట్టడమే బరువు తగ్గడానికి ఆదర్శవంతమైన మార్గం. అంతేగాదు కొలెస్ట్రాల్‌ని రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే సాధారణ అలవాట్లతోనే తగ్గించుకోవచ్చని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సృష్టి కృష్ణన్. దీర్ఘకాలం హాయిగా చేయగలిగే చిన్నపాటి జీవనశైలి మార్పులతో 14 కిలోలకు పైగా తగ్గారామె.జంక్ ఫుడ్‌కు నో చెప్పకండి..వాట్ ఇదేంటి అనకండి. మనకు తినాలనిపించే వాటిని వద్దని కంట్రోల్ చేయడం వల్ల తెలియకుండానే అతిగా లాగించేస్తాం అంటోంది. అదే దాన్నే అణిచివేసే బదులు..జంక్ ఫుడ్ తినాలనిపించిన వెంటనే ఫటాఫట్ తినేయండి. ఆ తర్వాత అందుకు తగ్గట్టు వర్కౌట్లు, లేదా కేలరీ తగ్గించుకునే ప్రయత్నం చేయండని అంటోందామె.ప్రతిరోజు నడక..ప్రతిరోజూ నడవడం వల్ల కొవ్వు కరుగుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పదివేల అడుగులు నడవాలని పెద్ద లక్ష్యాలు ఏమి అవసరం లేదు. కొన్ని రోజులు రెండు వేల అడుగులకుపైగా నడచేందుకు ప్రయత్నించండి చాలు. అది కూడా ఇష్టపూర్వకంగా చేయండని అంటోంది.రాత్రిపూట కార్బోహైడ్రేట్లు వద్దు..రాత్రి భోజనంలో అన్నం, రోటీకి బదులుగా గుడ్లు, పనీర్, పప్పు, చికెన్ తినమని ఈ ఇన్ఫ్లుయెన్సర్ సిఫార్సు చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఉదయం చాలా హాయిగా మేల్కోగలుగుతారు.నెమ్మదిగా తినండినెమ్మదిగా తినడం వల్ల మీ ప్రేగులు కడుపు నిండిన సంకేతాలను మెదడుకి అందిస్తాయి. తినడానికి 20-30 నిమిషాలు తీసుకోవడం ద్వారా జీవక్రియను సహజంగా మెరుగుపరుచుకోవచ్చు, ఆకలిని తగ్గించుకోవచ్చు. భోజనానికి ముందు నీళ్లు తాగండి..భోజనానికి సుమారు 30 నిమిషాల ముందు నీళ్ళు తాగడం వల్ల, కడుపు నిండిన భావన పెరిగి, కేలరీల వినియోగం తగ్గి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ అలవాటు కడుపు నిండిన అనుభూతిని కలిగించి అతిగా తినడాన్ని నివారిస్తుంది.తరుచుగా బరువు చెక్చేయొద్దు..ప్రతిరోజూ బరువు చూసుకోవడం అనేది మిమ్మల్ని మరింత నిరాశపరుస్తుంటుంది. వారానికి ఒకసార లేదా అప్పుడప్పుడు చేస్తే మనసు ఉల్లాసంగా, హెల్దీగా ఉంటుంది.వేళకు నిద్రపోవడం..సరిగ్గా నిద్రపోకపోతే తినాలనే కోరికలు ఎక్కువ అవుతాయి. ఏడు గంటల నిద్ర అన్నింటిని మార్చేస్తుందని అంటోంది.చీట్ మీల్ గురించి భయపడొద్దు..కొందరు తినాలనిపించినవి తొనేసి మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం అనే మైండ్‌సెట్‌తో ఉంటుంటారు. ముందు ఆ ధోరణిని తీసేయండి. తప్పులేదు. ఒక్కోసారి జిహ్వచాపల్యం నియంత్రించడం కష్టమవ్వచ్చు. అందుకని నచ్చినవి హాయిగా తినండి. కానీ తినే ముదు కాస్త మితం అనుకోండి, ఒక వేళ్ల ఫుల్‌గా లాగించినా..అందుకు తగ్గట్టుగా ఆరోజు కేలరీలు తగ్గించే పనిపట్టండని అంటోందామె. ఈ చక్కటి జీవనశైలి మార్పులు ఆరోగ్య లక్ష్యాలను అంచలంచెలుగా అందుకోవడానికి చక్కగా హెల్ప్ అవుతాయని అంటోంది. View this post on Instagram A post shared by Srishti Krishnan (@srishhhsaidwhat) గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
అమ్మగా గర్వించే క్షణం..!
పిల్లలు ప్రయోజకులైతే అంతకుమించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అత్యంత అపురూపమైన క్షణం కూడా. మన పెంపకానికి సార్థకత అంటే పిల్లలు మంచి స్థితిలో ఉండేటమే కదా..!. అలాంటి భావోద్వేగపు ఆనందాన్నే దక్కించుకుంది ఈ మహిళ. అందుకు సంబంధించిన వీడియోని పారిశ్రామిక దిగ్గంజ ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.ఆ వీడియోలో మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌కు చెందిన మహిళ తన కొడుకుని అభినందిస్తూ కనిపిస్తుంటుంది. కూరగాయలు అమ్ముకునే ఆ మహిళ అకస్మాత్తుగా తన కొడుకు రావడం చూస్తుంటుంది. అతడు చిరునవ్వుతో ఓ శుభవార్తతో వస్తూ ఆమె కాళ్లపై పడిపోతాడు. ఆ విషయం ఏంటో తన కుమారుడు నోటితో విని సంతోషంతో ఉబ్బితబ్బిబవ్వుతుంది. అంతేగాదు కొడుకుని ఆత్మీయంగా కౌగిలించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తుంది. అక్కడున్న కుమారుడి స్నేహితులు రంగులు చల్లుతు వాళ్ల వేడుకుని మరింత ఆనందభరితంగా మార్చడం స్పషంగా కనిపిస్తుంటుంది. ఆ తల్లి తన కుమారుడిని పాఠశాలకు పంపే స్థోమత లేక జీవితమంతా కాలిబాటన కూరగాయలు అమ్ముతూ ఎంతో శ్రమకోర్చి చదివించుకుంది. తన కుమారుడు గోపాల్సావంత్ చదువు కోసం ఆమె మహారాష్ట్రలో కాలిబాటన ఎండలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించింది. CRPFకు ఎంపికైన వెంటనే, గోపాల్ నేరుగా తన తల్లి పనిచేస్తున్న కూరగాయల మార్కెట్ వద్దకు కాలిబాటన వెళ్లి..ఆమె పాదాలపై పడి తాను సీఆర్పీఎఫ్గా ఎంపికయ్యానంటూ చెప్పాడు. ఒక్కసారిగా ఇద్దరు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి గొప్ప విజయం వెనుక ఓ తల్లి అపారమైన త్యాగం తప్పక ఉంటుందని ఈ సంఘటన అత్యంత శక్తిమంతంగా గుర్తుచేస్తోంది కదూ..! అంటూ అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అంతేగాదు పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించే ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాక్షలు అంటూ తన పోస్ట్‌ని ముగించారు ఆనంద్ మహీంద్రా.Gopal Sawant’s mother spent every day under the sun selling vegetables on a Maharashtra sidewalk just to keep his education on track.After being selected for the CRPF, Gopal went straight to the dusty Kudal footpath where his mom was working. In front of her vegetable crates,… pic.twitter.com/e5EMNXLRXl— anand mahindra (@anandmahindra) May 10, 2026 (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..) -
భక్తితో బాల్యంలోనే భరోసా
ఈ కాలంలో పిల్లలు చదువుల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. భక్తి అనేది వారిలో ఒక రకమైన భరోసాను నింపుతుంది. ‘మనల్ని రక్షించే శక్తి ఒకటి ఉంది‘ అనే నమ్మకం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన పురాణగాథల్లోని ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వారి కథలు వినడం ద్వారా సత్యం, ధర్మం, ఓర్పు వంటి లక్షణాలు అలవడతాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ‘దైవ భీతి’ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడనే భావన పిల్లలను చెడు మార్గాల వైపు వెళ్లకుండా అడ్డుకుంటుంది. దైవ చింతన, ఆధ్యాత్మిక పరిమళం ఉన్న ఇంట్లో పెరిగే పిల్లలకు క్రమశిక్షణ ఉంటుంది.సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్. నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః (శంకరాచార్యుల భజగోవిందం) చిన్నతనంలోనే దైవచింతన ఉన్నవారితో కలవడం వల్ల కలిగే మార్పు. మంచి వారితో స్నేహం (సత్సంగం) వల్ల ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. భక్తి అనేది ఇంట్లోనే మొదలవ్వాలి. మాతృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్యదేవో భవ. అతిథిదేవో భవ. బాల్యంలోనే ఈ భావం కలగడం వల్ల పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. క్రమశిక్షణ, సత్యం పలకడం, ఇతరులకు సహాయం చేయడం వంటి ఉత్తమ గుణాలను అలవరుచుకోవడం.‘కౌమారే విద్యార్థినః’విద్యతోపాటు విజ్ఞానాన్ని ఇచ్చే భక్తి కూడా అవసరం. లోకజ్ఞానాన్ని ‘విద్య’ ఇస్తే, భక్తి విచక్షణా జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రాణం పోయాక ఎంతో ప్రేమగా చూసుకునే భార్య వాకిలి వరకే వస్తుంది. బంధుమిత్రులు వల్లకాటి వరకే వస్తారు. కాని ఎన్ని జన్మలెత్తినా కూడా మనతో ఉండి ఎప్పుడెప్పుడు మనలను తరింపచేద్దామా అని ఆ పరబ్రహ్మ మనలను వదలకుండా ఏ దేహం ధరించినా అందులో హృదయవాసిగా ఉంటున్నాడు. అటువంటి పరబ్రహ్మను వదిలేసి జీవితమంతా ప్రాపంచపు విషయాల్లో ఉంటూ జల్సాలు చేస్తే చివరికి మిగిలేది దుఃఖమే. చిన్నప్పుడే దైవ భక్తిని అలవరచుకోవడం అనేది వ్యక్తి జీవన ప్రయాణానికి బలమైన దిక్సూచిని నిర్మించుకోవడంతో సమానం. బాల్యంలో మనసు స్వచ్ఛంగా, మృదువుగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో నాటిన భక్తిబీజాలు జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాయి.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
జయ హనుమంత! అమిత బలవంత!
చాలా గొప్ప వైవిధ్యభరిత పాత్రలనే రత్నాలతో కూర్చబడిన హారం శ్రీ మద్రామాయణం. అన్నిటి మధ్యనా తళుకులీనే మేటి మణిపూస వంటి పాత్రగా హనుమంతుడు మనకు దర్శ నమిస్తాడు. మహా జ్ఞాన సంపన్నుడు, అద్భుత బలశాలి, వినయశీలి, మహా భక్తుడు, ధీరాగ్రేసరుడు, కార్యసాధకుడుగా మనకు గోచరమవుతాడు.శివాంశతో, వాయుదేవుని అనుగ్ర హంతో కేసరి, అంజనాదేవి దంపతులకు జన్మించిన ఆంజనేయుడు బాల్యం నుండే తన అద్భుత శక్తి సామర్థ్యాలను చూపించాడు. సముద్ర లంఘనం, రాక్షస సంహారం, సంజీవనిని తేవడం వంటి ఘనకార్యాలు మారుతివంటి బలశాలికి తప్ప ఇతరులకు సాధ్యమయే విషయాలు కావు. బాల్యంనుండే తన దేహబలాన్ని దుందుడుకు పనులకు ఉపయోగిస్తున్న బాలాంజనేయునికి ఆయన హితైషులు ఒక శాపం వంటి వరాన్ని ఇచ్చారు. అదేమంటే తన శక్తి తనకు తెలియక పోవడం. ఇతరులెవరైనా తెలిపితే తప్ప మారు తికి తన శక్తి సామర్థ్యాలు తనకు తెలియకూడదని శ్రేయోభిలాషుల ఆంతర్యం.విద్యావినయసంపన్నుడు– కేసరీ నందనుడుపట్టుదల, బుద్ధికుశలత, సూక్ష్మగ్రాహిత్వము, విద్యా పారీణతలకు ఆంజనేయుడు ప్రతీక. ఆయనను సేవిస్తే విద్యలలో కౌశల్యం, సూక్ష్మ బుద్ధి తప్పక లభిస్తాయని పరాశర సంహిత చెబుతుంది. అంతటి విద్య, ఘనమైన దేహబలమున్నా, మూర్తీభవించిన వినయస్వరూపుడు హనుమ. తన ప్రభువైన సుగ్రీవుని పట్ల, తనకు దైవమైన శ్రీరాముని పట్ల ఆయ న ప్రదర్శించిన వినయం అద్వితీయ మైనది. తాను వారికి సేవకునిగా, బంటుగా ఎప్పుడూ భావించేవాడు ఆయన. ఇది లోకులందరకూ స్ఫూర్తి దాయకం. అతని భక్తికి నిదర్శనమా అన్నట్లు మారుతి లేని రామాలయం ఎక్కడా కనపడదు.కార్యదీక్షా తత్పరుడు ఒక కార్యాన్ని తలపెట్టిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కు తగ్గే ప్రసక్తే లేకుండా, ఆ కార్యం నెరవేర్చే దాకా విశ్రమించని లక్షణం హనుమది. సామాన్యులకు సరే సరి... అంగద, జాంబవంతాది వీరులకు కూడా దాటడానికి సాధ్యం కాని సముద్రాన్ని దాటి, లంక ను చేరి, సీతమ్మ జాడ కనుగొని, తమ శక్తిని శత్రువులకు తెలియజేసి, తిరిగి ఆ విషయాన్ని శ్రీరామునికి నివేదించే వరకూ హనుమ విశ్రమించలేదు. ఆతిథ్యాన్ని అందించ వచ్చిన మైనాకునితో మరియు సముద్రునితో ఆ విషయమే సవినయంగా తెలిపి ముందుకు సాగిన కార్య నిబద్ధుడు ఆంజనేయుడు.ఎన్నో సుగుణాలు, ఆదర్శాలు మూర్తీభవించి ఉన్న హనుమను తమలపాకులు, వడల మాలలు, సింధూరాలతో పూజించిన భక్తులకు బుద్ధి, దేహబలం, కీర్తి, ధైర్యం, నిర్భయ త్వం, ఆరోగ్యం, పాపనివృత్తి, వాక్పాటవం కలుగుతాయని పెద్దల మాట. అంతేకాదు. ఆంజనేయుని పూజించే వారి కి భోగ, మోక్షాలు రెండూ సులభంగా లభిస్తాయని పరాశర సంహిత చెబు తున్నది. మన దేశంలోని దాదాపు ప్రతి చిన్న పల్లెలోనూ రామాలయాలు, ఆంజనే యుని ఆలయాలూ ఉన్నాయి. ముఖ్యంగా అర్ధగిరి, కొండగట్టు, గండి, కసాపురం, శింగరకొండ వంటి సుప్రసిద్ధ హనుమత్ క్షేత్రాలన్నింటిలోనూ హనుమజ్జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
అమృతోత్సవ సోమ నాథుడు
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమస్థానం సోమనాథ క్షేత్రానిదే... ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్రలో అరేబియా సముద్ర తీరాన ఉంది. చంద్రునికి శాపవిముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథ క్షేత్రంగా పేరొందింది. పరమేశ్వరుడు జ్యోతిర్లింగ ఆకారంలో యుగాల నుంచి దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సిరిసంపదలతో వున్న ఈ క్షేత్రంపై అనేకమంది విదేశీపాలకులు లెక్కలేనన్ని సార్లు దండయాత్రలు చేశారు. అయితే ఎన్ని దండయాత్రలకు గురైనా మళ్లీ అన్నిసార్లూ పునర్ నిర్మితమైన క్షేత్రమిది. చంద్రుని పేరుమీదుగా సోమనాథుడుస్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. బ్రహ్మ మానసపుత్రుడైన దక్షప్రజాపతి అశ్విని నుంచి రేవతి వరకు గల 27 మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే చంద్రుడు రోహిణి ఒక్కదానినీ అనురాగంతో చూస్తూ, మిగిలిన వారిని అలక్ష్యం చేయసాగాడు. దాంతో... తక్కిన 26 మంది తమ తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్త లోకవాసులు, తమ కష్టాలు తీరే మార్గం చూపమని బ్రహ్మని ప్రార్థించగా ఆయన చంద్రునితో ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించవలసిందిగా చెబుతాడు. బ్రహ్మ దేవుని సలహాను అనుసరించి, భక్తి శ్రద్ధలతో శివుని పూజించిన చంద్రుడికి శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దినమొక కళ చొప్పున పెరుగుతుందనీ అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేరకు సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీ సమేతంగా వెలసి భక్తులను కటాక్షిస్తున్నాడు పరమేశ్వరుడు.అలనాడు స్వర్ణాలయం..ఈ క్షేత్రంలో తనకు శాపవిముక్తి కలిగినందుకు పరమానందభరితుడైన చంద్రుడు సువర్ణంతో పరమేశ్వరునికి ఆలయం నిర్మించాడట. అనంతర కాలంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని రావణాసురుడు వెండితో పునర్ నిర్మించగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చందనపు చెక్కలతో నూతన ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత రాజా భీమ్దేవ్ ఈ ఆలయాన్ని రాతితో పునర్నిర్మించాడు. పునఃప్రతిష్ఠకు డెబ్భై ఐదు ఏళ్లు పూర్తిసోమనాథక్షేత్రంలో భారీ సంపద వుండటంతో అనేకసార్లు దండయాత్రలకు గురైంది. క్రీ.శ. 1024లో గజనీ మహమ్మద్ దండయాత్రలో ఆలయం తీవ్ర నష్టానికి గురైంది. అనంతరం స్థానిక పాలకులు తిరిగి నిర్మించారు. దిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ, మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలోనూ ఆలయంపై దాడులు జరిగాయి. జునాగఢ్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన తరువాత ఉక్కుమనిషి, భారతదేశ ప్రథమ హోంమంత్రి వల్లభాయ్‌పటేల్ ఆలయాన్ని సందర్శించి పునర్ నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. 1951లో నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది. నాటి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఆలయాన్ని ప్రారంభించారు. ఇది జరిగి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సోమనాథేశ్వరునికి అమృత మహోత్సవాలను జరిపించాలని సంకల్పించడమే కాదు... అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.సోమనాథునికి ప్రధాని ప్రత్యేక పూజలు1951లో బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ జరిగిన నాటి నుండి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో పాల్గొననున్నారు. అంతేకాదు, సోమనాథునికి స్వయంగా అభిషేకం, ధ్వజ పూజ, మహాపూజలు నిర్వహించనున్నారు. నిత్యం పూజలు, హారతులు, సౌండ్ అండ్ లైట్ షోలతో ఆలయం సందడిగా ఉంది. ఆలయ దర్శనం ఉదయం 6:00 నుండి రాత్రి 10:00 వరకు ఉంటుంది, మధ్యాహ్నం 1:00 నుండి 5:00 వరకు దర్శనం ఉండదు. – డి.వి.ఆర్. -
కళ్ళు మూసుకున్న సమాజానికి కన్నతల్లి మేలుకొలుపు!
కోట్లు ఖర్చు పెట్టిన తీసిన సినిమాలు సైతం పట్టుమని వారమైనా ఆడని ఈ రోజుల్లో... ఒక నాటిక గత 13 నెలల కాలంలో వివిధ ప్రాంతాల్లో సగటున వారానికి ఒక ప్రదర్శన జరుపుకుందంటే నమ్మగలరా. ఈ వింతకు ఓ తెలుగు డ్రామా కారణమైందన్న మాట కలలోనైనా ఊహించగలరా. అవును... మీరు విన్నది నిజమే. అందుకే, ఇది అపూర్వమే కాక అందరినీ ఆశ్చర్యపరిచే సందర్భం. ‘అమ్మ చెక్కిన బొమ్మ’ అనే ఓ తెలుగు నాటిక రంగస్థలంపై రాకెట్ లా దూసుకుపోతోంది. తెలుగు నేలతో పాటు రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ... ప్రతి చోటా ప్రేక్షకాదరణతో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే... 53 ప్రదర్శనలు! 150 బహుమతులు!!ఇటీవల ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే కేవలం నాలుగే నాలుగు రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు వేదికలపై (గచ్చిబౌలిలో రంగభూమి, లకడీకాపూల్ వద్ద రవీంద్రభారతి) ఈ నాటిక ప్రదర్శన జరిగింది. రెండు చోట్లా విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. వెనువెంటనే కాకినాడ దగ్గర కత్తిపూడి దగ్గర ప్రదర్శనకు సిద్ధమైంది. వెరసి, ఈ మే నెల ప్రథమార్ధంలో వారం రోజుల్లోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3 ప్రదర్శనలు. ప్రదర్శన జరిగిన ప్రతిచోటా ఈ నాటికకు జేజేలు. నటి – రచయిత్రి జ్యోతిరాజ్ బీశెట్టి రచించగా, గోవాడ క్రియేషన్స్ పతాకంపై నట - దర్శకుడు డాక్టర్ వెంకట్ గోవాడ సారథ్యంలోని నట, సాంకేతిక బృందం ఈ ఘనత సాధించింది. గుజరాత్‌లోని వడోదరాలో సైతం సభికులతో స్టాండింగ్ ఒవేషన్ అందుకున్న సమకాలీన రంగస్థల సూపర్ హిట్ ఇది.అంతేకాదు... తెలుగు నేలపై దాదాపు 35 నాటక పరిషత్తులు జరుగుతుంటే, అందులో 32 పరిషత్తుల్లో ఈ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ ఉత్తమ నాటికగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లోనే నిలిచి, 32 బహుమతులు సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి... ఇలా పలు విభాగాల్లో ఈ నాటిక ఇప్పటి వరకు ఒకటీ, రెండు కాదు... ఏకంగా 150 దాకా బహుమతులు గెలుచుకొని, అరుదైన ఘనత సాధించింది. “ఇటీవలి కాలంలో ఓ తెలుగు నాటిక వరుసగా ఇన్ని ప్రదర్శనలు, ఇంత ప్రాచుర్యం, ప్రజాదరణ సంపాదించింది లేదు. అందుకే, సమకాలీన తెలుగు రంగస్థల చరిత్రలో ఈ నాటికకు ప్రత్యేక స్థానం ఉంది” అని సీనియర్ రంగస్థల పరిశోధకులు, రచయిత డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు వ్యాఖ్యానించారు.సరిగ్గా గత ఏడాది మార్చి చివరలో (2025 మార్చి 28) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నెలకొన్న ‘రంగభూమి స్పేసెస్’లో ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక తొలి ప్రదర్శన జరిగింది. ఏడాది తిరిగేసరికల్లా... 50 ప్రదర్శనలు పూర్తి చేసుకొని, ఈ మే నెల 5న సరిగ్గా అదే ప్రాంగణంలో 51వ ప్రదర్శన జరగడం గమనార్హం. అంతేకాదు... సినిమాలే యాభై రోజుల విజయోత్సవం జరుపుకోవడం గగనమవుతుంటే, ఓ నాటిక యాభై ప్రదర్శనలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా అభినందన సభ, ప్రత్యేక ప్రదర్శన జరిపారు.ఆ పోషకుల్ని అంతగా కదిలించిందేమిటి?కళాపోషకులు, రసహృదయలైన గుదే పాండురంగారావు దంపతులు ఈ ప్రదర్శన, విజయోత్సవం ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన ఆ దంపతులు, వారి బృందం ఎన్.టి.ఆర్. కళాపరిషత్ పక్షాన ప్రత్యేకంగా హైదరాబాద్‌లో వచ్చి మరీ, ఈ 51వ ప్రదర్శన, విజయోత్సవం నిర్వహించడం వారి కళాప్రియత్వానికి మచ్చుతునక. “నేను నటుణ్ణి, దర్శకుణ్ణి కాదు. కేవలం కళాభిమానిని. మూడో ప్రదర్శన సమయంలోనే ఈ నాటిక చూశాను. నాలుగేళ్ళుగా పరిషత్ నాటకాల పోటీలు నిర్వహిస్తున్న నాకు ఈ నాలుగేళ్ళ కాలంలో మనసుకు బాగా నచ్చిన నాటిక ఇది. అందుకే, అభినందించాను. అంతేకాకుండా, ఈ నాటిక ఊరూరా ప్రదర్శనలతో అఖండ విజయం సాధిస్తుందని చెప్పాను. యాభై ప్రదర్శనలు పూర్తయినప్పుడు మా సంస్థ పక్షాన ఉత్సవం చేస్తామనీ అప్పుడే మాట ఇచ్చాను. మా అంచనా నిజమై, ఈ నాటిక ఈ స్థాయికి చేరడం ఆనందంగా ఉంది” అని పాండురంగారావు తన భావాలు పంచుకున్నారు. ఇంతగా అందరినీ కదిలించిన ఈ నాటికలో ఇంతకీ ఏముంది అంటే... అమ్మ ప్రేమ ఉంది. కట్టుకున్నవాడు కాదన్నా, కంచెలు వేసిన సమాజం ఏమన్నా సరే... కన్నబిడ్డలోని శారీరకమైన మార్పునూ, మానసికమైన సంఘర్షణనూ అర్థం చేసుకున్న అసలైన అమ్మదనం ఉంది. బ్రహ్మ చేసిన మానవ సృష్టిని అర్థం చేసుకొని, కడుపున పుట్టిన బిడ్డ కష్టాన్ని అవగాహన చేసుకొని, కడుపులో పెట్టుకొని కాపాడి, కృషితో విజయతీరం వైపు నడిపించిన అపర బ్రహ్మ అమ్మ గొప్పదనం ఉంది. ఓ ట్రాన్స్ జెండర్ తాలూకు ఆవేదన ఉంది. మన మధ్యే ఉన్న అలాంటి మనుషుల పట్ల మనకుండాల్సిన కనీసపాటి మానవత్వం గురించి ఆలోచన ఉంది. వాళ్ళూ మనలాగే మనుషులే అన్నది మర్చిపోతున్న మన దృష్టికోణంలోని లోపాన్ని ప్రశ్నించడం ఉంది. మారాల్సిన మన తీరును గుర్తు చేయడం ఉంది.ఒక్క మాటలో చెప్పాలంటే.... మనిషి సృష్టికర్త బ్రహ్మ అయినా, ఆ మనిషిని ఈ లోకంలోకి తెచ్చిన అమ్మే... మన లోపాలనూ, మనసునూ అర్థం చేసుకొని, సరైన మార్గంలో పెట్టి, మనిషిని మనీషిగా తీర్చిదిద్దగల మరో బ్రహ్మ. ఆ మాటే ఈ నాటిక భావోద్వేగాలతో బలంగా చెబుతుంది.కనిపించని దేవుడి తప్పు... కని పెంచిన అమ్మ తీర్పు ఇటీవలి కాలంలో భిన్నమైన ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న నాటిక ఇది. నిజానికి, దర్శక – నటుడు వెంకట్ గోవాడ తన తల్లి పేరు మీద అమ్మ కథాంశంగా సాగే ఓ నాటికల రచన పోటీ గతంలో నిర్వహించారు. అందులో ద్వితీయ బహుమతి పొందిన నాటిక ఇది. దానికి మరింత మెరుగులు దిద్ది, దేశం నలుమూలలా చేస్తున్న ప్రదర్శన – ‘అమ్మ చెక్కిన బొమ్మ’.స్థూలంగా కథ చెప్పాలంటే... అబ్బాయిగా పుట్టి, స్కూలు చదువులకు ఎదుగుతాడు శశి (బాల నటుడు భానుప్రకాశ్). అయితే, హార్మోన్ల మార్పు ఫలితంగా అమ్మాయిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడని తల్లి అనసూయ (నటి జ్యోతిరాజ్ బీశెట్టి) గ్రహిస్తుంది. భర్త గోవర్ధన్ (నటుడు వెంకట్ గోవాడ) – బంధువులు – లోకం ఏమన్నా సరే ఆ బిడ్డ మానసిక పరిస్థితికే తల్లి మద్దతుగా నిలుస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో కష్టనష్టాలు ఎదురైనా, సహిస్తుంది. భరిస్తుంది. అదే సమయంలో కన్నబిడ్డ దారి తప్పకుండా చూస్తుంది. అతని మానసిక స్థితికి అనుగుణంగా శారీరకంగా అమ్మాయిగా (వెన్నెల పాత్ర – నటి హర్షిణి మేకల) మారేందుకు అవసరమైన వైద్యచికిత్స చేయిస్తుంది. ఏటికి ఎదురీదుతుంది. అపురూపమైన అమ్మ ప్రేమ, త్యాగం, కష్టం చూసిన ఆ బిడ్డ, కన్నతల్లికి మాటిచ్చి మరీ, చదువులో ఉత్తమ ఫలితాలు సాధిస్తుంది. చివరకు ‘వెన్నెల ఐ.ఏ.ఎస్’ అవుతుంది. అక్షరాలా ‘అమ్మ చెక్కిన బొమ్మ’గా సమాజంలో నిలుస్తుంది. కనిపించని దేవుడు చేసిన తప్పును, కని పెంచిన అమ్మ ఓ దేవతలా అలా సరిచేస్తుంది. సమస్యల్ని గెలుస్తుంది.తెలుగులో అరుదైన ఇతివృత్తంఆధునిక తెలుగు నాటకరంగం 1860 ప్రాంతంలో ఆరంభమయ్యాక... స్త్రీ, పురుషులు కాక, ఈ తృతీయ ప్రకృతిని సైతం రంగస్థలంపై పాత్రలుగా చూపెడుతూ ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ సహా పలు నాటికలు, నాటకాలు రాకపోలేదు. కానీ, జన్మ రీత్యా పురుషుడైన పాత్ర ఆధునిక వైద్యవిధానంతో స్త్రీగా మారడం, మారేందుకు పడిన మానసిక సంఘర్షణ, కుటుంబంలో – సమాజంలో ఎదుర్కొన్న చిక్కులు... లాంటి అంశాలను సున్నితంగా చూపెడుతూ, ఆలోచింపజేసిన ప్రయత్నం మాత్రం ‘అమ్మ చెక్కిన బొమ్మే’ అని రంగస్థల పరిశీలకుల మాట. “ఎన్నో రంగస్థల రచనలు చేసిన నేను కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు. అందుకే, ఈ నాటిక చూసినప్పుడు ఆనందంతో కూడిన అసూయకు లోనయ్యాను” అని కేంద్ర సంగీత – నాటక అకాడెమీ అవార్డు గ్రహీత, ప్రముఖ నాటక రచయిత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ అని ఛలోక్తిగానే ‘అమ్మ చెక్కిన బొమ్మ’ ప్రదర్శనను ప్రశంసించారు. ‘7 స్టెప్స్ ఎరౌండ్ ది ఫైర్’ అంటూ ఇంగ్లీషులో మహేశ్ దత్తానీ, అలాగే తొమ్మిది మంది హిజ్రా పాత్రలతో నవరసాలను అభినయింపజేస్తూ ‘నవ’ అంటూ కన్నడంలో శరణ్యా రామ్ ప్రకాశ్ చేసిన ప్రయోగాలను ఆయన ప్రస్తావించారు.రంగభూమిపై.. భావోద్వేగ ప్రయాణం!ఇటు భర్త – అటు బిడ్డల మధ్య నలిగిపోయి, చివరకు కట్టుకున్నవాడి కన్నా, కన్నబిడ్డ వైపు మొగ్గే తల్లి పాత్రలో జ్యోతిరాజ్ వివిధ భావోద్వేగాలను పండించారు. గెంటేస్తానంటున్న తండ్రి – గేళి చేస్తున్న తోటి స్నేహితులు – శరీరంలో తనకు తెలియకుండానే కలుగుతున్న భావాల మధ్య, మానసికంగా సంఘర్షణలో చిక్కుకొన్న బాలుడు శశి పాత్రపోషణ ఈ నాటికకు మరో మూలస్తంభం. గతంలో పలు సినిమాల్లోనూ నటించిన బాలనటుడు భానుప్రకాశ్ అమ్మాయిగా మారాలనుకొనే అబ్బాయి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఓ సన్నివేశంలో “అమ్మా! నిన్ను ముట్టుకోవచ్చా అమ్మా?” అంటూ బాధ, ఆవేదన, సంకోచాలను అభినయించినప్పుడు అప్రయత్నంగా ప్రేక్షకులతో కన్నీరు పెట్టించాడు.తండ్రి పాత్రలో నటించడమే కాక, వీలైనంత తక్కువ సెట్టింగులతోనే ప్రతీకాత్మకంగా నాటకాన్ని నడిపించడంలో దర్శకుడు వెంకట్ గోవాడ అనుభవం, శ్రమ అభినందనీయం. నిజజీవితంలో ట్రాన్స్ జెండరైన హర్షిణి తన జీవితానుభవాన్ని వెన్నెల పాత్రలోకి ప్రవహింపజేశారు. చివరకు వచ్చేసరికి, “ఆపదలలో తోడు లేని నేను, ఆనందంలో భాగం ఆశించకూడదు. నువ్వు తల్లిగా గెలిచావు, నేను తండ్రిగా ఓడిపోయాను” అంటూ నేపథ్యంలో వినిపించే తండ్రి పాత్ర మాటలు ఆగి, ఆలోచింపజేస్తాయి. ఇన్ని ప్రదర్శనలుగా ఓ నాటిక విజయవంతం కావడం వెనుక ఎంత సమష్టి కృషి ఉందో కూడా ప్రదర్శన చూసినవారు ఇట్టే గ్రహిస్తారు.ప్రాణమై నిలిచిన పాట, సంగీతం!“బొమ్మరా ఇది బొమ్మరా... అమ్మ చెక్కిన బొమ్మరా....” అంటూ నాటికలో వివిధ సందర్భాల్లో వినిపించే శీర్షికా గీతం మరో హైలైట్. “బృహన్నలకు బంధువా, శిఖండికి తా చిహ్నమా, అర్ధనారి స్వరూపమా, మోహినీ అవతారమా” అంటూ నాటికా రచయిత్రే రాసిన ఈ పాట, దానికి సురభి నాగరాజు చేసిన బాణీ కరుణ రసాత్మకంగా నేరుగా మనసు తాకుతాయి. వర్ధమాన గాయని ఎన్. శ్రీనిధి తన గళంతో ఆ పాటకు మరింత జీవం నింపారు. “పాపమెవరిది, శాపమెవరిది, బాధ ఎవరిది, రోదనెవరిది” అన్న మాటలు ఆమె గొంతులో పలికినప్పుడు కరగని ప్రేక్షక హృదయం అరుదు.అలాగే, “అమ్మ ప్రేమకు సాటి ఏది, అమ్మ కరుణకు తూకమేది, అమ్మ లాలనకు అంతమేది, అమ్మ కన్నా మిన్న ఏది” అన్న చరణం వింటుంటే కన్నతల్లి జ్ఞాపకాలు గుర్తుకు రానివారూ ఉండరు. ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే, కళారంగంలో మనకు మరో మంచి గాయని లభించినట్టే! “నిజానికి, ఆ పాట, ఆ బాణీ, శ్రీనిధి పాడిన విధానం... ఈ నాటికను మరోస్థాయిలో నిలబెట్టాయి. ముందుగా నేను ఊహించిన దాని కన్నా ఎక్కువగా పదుల కొద్దీ ప్రదర్శనలకు ముందుకు నడిపించడంలో ఓ కీలక పాత్ర పోషించాయి” అని ఈ నాటక రథసారథి వెంకట్ గోవాడ స్వయంగా వివరించారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే, నేపథ్య సంగీతం, లైటింగ్ సైతం ఈ నాటిక ప్రదర్శనలకు అంతే ఆయువుపట్టుగా నిలిచాయని ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది.“మనసు చంపుకొని నటిస్తున్నాం!”: సినీ నటి శివపార్వతిఈ నాటికను తిలకించిన ప్రముఖ సినీ, టీవీ, రంగస్థల నటి శివపార్వతి, నాలుగున్నర దశాబ్దాల క్రితం నాటకంపై ప్రేమతో ఒకప్పుడు తామెలా రంగస్థలంపై కృషి సాగించిందీ గుర్తు చేసుకున్నారు. “నా పదమూడో ఏట నుంచి నేను రంగస్థలం ఒడిలోనే పెరిగాను. పరుచూరి బ్రదర్స్ ప్రోత్సాహంతో నాటక రంగం నుంచే వెండితెరకు పరిచయమయ్యాను. ఇవాళ సినిమా, టీవీ, ఓటీటీ ఎన్నో వచ్చినా... నటిస్తున్నా... నాకు అన్నం పెట్టి, నన్ను ఇంతదాన్ని చేసిన రంగస్థలాన్ని మర్చిపోలేదు. కరెంట్ పోయినా, వర్షం పడి తడుస్తున్నా... అంకితభావంతో సాగించిన ఆ రోజుల్ని మర్చిపోలేను. కానీ, ఇవాళ చాలా సందర్భాల్లో కెమెరా ముందు మనసు చంపుకొని నటించాల్సి వస్తోంది. ‘ఆఁ’, ‘ఊఁ’, ‘అమ్మా నాన్న’ లాంటి వాటికి కూడా ప్రాంప్టింగ్ చెప్పించుకొనే తరం, పరభాషీయులదే పెత్తనం. మనం ఏదన్నా చెప్పినా చాదస్తంగా భావిస్తూ, ‘మీకు నటన తెలీదు. ఆ నాటకాల నటన వద్దు’ అని కించపరిచిన చేదు అనుభవాలూ ఎదురయ్యాయి. కానీ, అదే షూటింగ్ సెట్ లో... ఒకే షాట్లో 3 పేజీల డైలాగును ఏకబిగిన చెప్పి అందరితో శభాష్ అనిపించుకున్నానంటే అది రంగస్థల అనుభవం పెట్టిన భిక్షే” అని శివపార్వతి తన మనోభావాలను పంచుకున్నారు.రంగస్థల ఆచార్యులు డాక్టర్ డి.ఎస్.ఎన్. మూర్తి, రంగస్థల ప్రదర్శనల గుణనిర్ణేత మానాపురం సత్యనారాయణ, తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళనమైన ‘వేదిక’ సంస్థకు అధ్యక్షుడైన రంగస్థల, సినీ, టీవీ నటుడు ముత్తవరపు సురేశ్ బాబు, మరో నటుడు చలపతిరాజు తదితరులు ‘అమ్మ చెక్కిన బొమ్మ’ బృందాన్ని ప్రశంసించారు. ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ వారు సైతం తెలుగు రంగస్థలాన్ని చూసి అబ్బురపడేలా ఆ మధ్య గుంటూరులో జాతీయ నాటకోత్సవాలకు తాము ఆతిథ్యం ఇచ్చిన సంగతులను ముత్తవరపు ప్రస్తావించారు. పల్నాడు జిల్లా యడ్లపాడులో “ఏటా పుచ్చలపల్లి సుందరయ్య నాటక కళాపరిషత్ ద్వారా ఇప్పటికి 23 ఏళ్ళుగా సాగిస్తున్న కృషి చేస్తున్నాం. సమాజంలోని వివిధ రంగాలకు చెందిన 20 మంది న్యాయ నిర్ణేతలతో నిష్పాక్షికంగా విజేతలను ఎంపిక చేస్తున్నాం. అన్నీ అనుకూలిస్తే, త్వరలోనే ‘మాయాబజార్’ చిత్రాన్ని రంగస్థలంపై కొత్త పద్ధతిలో, భారీ నాటక ప్రదర్శనగా రూపొందించాలని యోచిస్తున్నాం” అని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు.హాస్య దర్శకుల్ని మెప్పించిన సెంటిమెంట్‘అమ్మ చెక్కిన బొమ్మ’ ప్రదర్శన ప్రముఖ సినీ దర్శకుల, పత్రికా విమర్శకుల ప్రశంసలు సైతం పొందడం అసామాన్యం. గురువు దాసరి నారాయణరావు బాటలోనే పయనించి, 90కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన రేలంగి నరసింహారావు తన ప్రసంగంలో, “పదిహేనేళ్ళ వయసులోనే పాలకొల్లులో నాటకాల్లో పాల్గొన్న అనుభవం నాది. చాలా రోజుల తర్వాత ‘అమ్మ చెక్కిన బొమ్మ’ రూపంలో ఓ మంచి నాటిక చూశాను. హాస్య చిత్రాల దర్శకులుగా పేరొందిన నన్ను, శివనాగేశ్వరరావును కదిలించి, కన్నీరు పెట్టించిన సెంటిమెంటల్ డ్రామా ఇది. మా గురువు దాసరికి సినిమాలే జీవితమైతే, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని రంగస్థలానికే అంకితమైన గోవాడకు నాటకాలే జీవితం. ఆదుర్తి, దాసరి లాంటి దిగ్దర్శకుల బాటలో ఈ నాటికలో సింబాలిక్ షాట్స్‌ను దర్శకుడు గోవాడ బాగా ఉపయోగించారు” అని అభినందించారు.దర్శకుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, “రచయిత, దర్శకుడు పోటాపోటీగా చేసిన నాటిక ఇది. ఇదే నాటికను ఆ మధ్య పరిషత్ పోటీల్లో చూసి, న్యాయనిర్ణేతలందరం ఏకాభిప్రాయంతో అనేక బహుమతులు ప్రకటించాం. ఇప్పుడు రెండోసారి చూస్తున్నా, రంగస్థలంపై రసానుభూతి మారలేదు. నాలో స్పందన మారలేదు. తొలిసారి ఎక్కడ కంట నీరు పెట్టుకున్నానో, ఈసారీ అక్కడే అప్రయత్నంగా కన్నీరు ఒలికింది. ఒక కళారూపం విజయానికి అంతకు మించిన గీటురాయి ఏముంటుంది” అన్నారు. క్యారవాన్ సంస్కృతితో నేడు సినీ నటుల్లో సైతం కొరవడిన ప్రొఫెషనలిజం నటిగా జ్యోతిరాజ్లో చూసి, ఆనందం, ఆశ్చర్యం కలిగాయి అని సినీ దర్శకుడు యాట సత్యనారాయణ ప్రశంసించారు. సీనియర్ జర్నలిస్ట్-రచయిత డాక్టర్ రెంటాల జయదేవ ప్రసంగిస్తూ, ఇతివృత్తం ఎంపిక, నాటిక నిర్వహణ, నటీనటుల అభినయంలోని ప్రతిభా ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. “ముఖ్యంగా, తానే ఆ పాత్రగా మారి, అమ్మాయిగా కూడా అద్భుతంగా హావభావాలు చూపిన భానుప్రకాశ్ ఇలాగే శ్రద్ధగా కృషి చేస్తే, మరో జూనియర్ ఎన్టీఆర్ అంతవాడు అవుతాడు” అని అంచనా వేశారు.మంచిరోజులు మళ్ళీ వస్తున్నట్టే(నా)!?వెరసి, ‘అమ్మ చెక్కిన బొమ్మ’ విజయం ఈ మధ్య కాలంలో తెలుగు నాటకానికి కొత్త ఉత్సాహం తెచ్చింది. నట, సాంకేతిక బృందాన్ని, అతిథులనూ ఎన్.టి.ఆర్. కళాపరిషత్ స్థాపకులు పాండురంగారావు పేరు పేరునా ప్రత్యేకంగా ఆహ్వానించి, జ్ఞాపికలతో సత్కరించడం కళాకారుల కళ్ళల్లో వెలుగులు నింపింది. “నిర్విరామంగా నాటకోత్సవాలు జరుపుతున్న మా పరిషత్ రానున్న రోజుల్లోనూ ఇలాంటి మంచి నాటకాలను ఇలాగే మరింత ప్రోత్సహిస్తుంది. తెలుగు నాటకం దానికి అదే ఓ ఆదాయవనరుగా మారాలనీ, కళాకారులు రంగస్థలం మీదే ఆధారపడి జీవనోపాధి సంపాదించుకొనే స్థాయికి మన నాటకరంగం ఎప్పటికైనా చేరాలనీ నా కోరిక. అందుకోసం ఉడతాభక్తిగా మా సంస్థ వంతున కృషి చేస్తాము” అని పాండురంగారావు తన సతీమణి సాక్షిగా ప్రేక్షకుల చప్పట్ల మధ్య ప్రకటించారు. నిజానికి, దర్శక – నటుడు వెంకట్ గోవాడ సతీమణి, చివరకు ఎం.బి.బి.ఎస్. చదివిన వారి కుమార్తె సైతం ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటికలో నటించడం, ప్రదర్శన రక్తి కట్టడానికి ప్రతి చిన్నపనిలో భాగం కావడం గమనార్హం. రంగస్థలంపై ఆ కుటుంబానికి ఉన్న ప్రేమ, అంకిత భావాలకు అది నిదర్శనం. అంతేకాదు... సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నా అభినయంపై ఆసక్తితో ఇంకా పలువురు యువతీ యువకులు ఈ ప్రదర్శనలో భాగమైన తీరు చూసినప్పుడు ముచ్చటేస్తుంది. అలాగే, నగరం నడిబొడ్డుకు దూరంగా ‘రంగభూమి’లో ప్రదర్శన జరుగుతున్నా... ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో విచ్చేయడం, ఆకస్మిక వర్షం - విద్యుత్ సరఫరా లోపాల మధ్య కూడా ఆసక్తిగా ఆసాంతం కూర్చోవడం తెలుగు నాటక రంగంపై ఆశలు చిగురింపజేస్తోంది. సరైన శిక్షణ, ప్రోత్సాహం ఉంటే కొత్త తరం రంగస్థలంపై విజృంభిస్తుంది. సరికొత్త ఇతివృత్తాలు, సమయపాలన, ప్రొఫెషనలిజం ఉంటే... ప్రేక్షకులు సైతం నేటికీ నాటకాన్ని ఆదరిస్తారని అర్థమవుతోంది. అందుకు ఒకరకంగా, ‘అమ్మ చెక్కిన బొమ్మ’ విజయం శుభ నాందీ సూచకమైతే... మన రంగస్థలానికి కచ్చితంగా మంచి రోజులు వచ్చినట్టే!::: రెంటాల జయదేవ -
సమ్మర్లో కడుపు చల్లగా ఉంచే వంటకాలు చేసేయండిలా
ఎండలు మండే వేసవి కాలంలో కడుపు చల్లగా ఉంటేనే ఆరోగ్యం. వేసవి ప్రత్యేకంగా పిల్లా పెద్దా అందరికీ కడుపు చల్లగా ఉంచే వంటకాలు మీ కోసం... స్వీట్‌కార్న్ స్టూ (6 నెలల పైబడిన పిల్లలకు)కావలసినవి: స్వీట్‌కార్న్: 1 టిన్ (160 గ్రాములు) వెల్లుల్లి: 1 చిన్న రెబ్బ, నూనె: 1 టీస్పూన్ ఉల్లిపాయ: పావు వంతు (చిన్న ముక్కలుగా కోసినది), పాలు: 200 మి.లీ మిక్స్డ్ హెర్బ్స్: పావు టీస్పూన్ (ఆప్షనల్)తయారీ: ఒక పాన్‌లో నూనె వేసి వేడి చేయండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి 1 నుంచి 2 నిమిషాల పాటు అవి మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత అందులో స్వీట్‌కార్న్, పాలు పోయాలి. పాలు మరిగిన తర్వాత, మంటను తగ్గించి సుమారు 15 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనిచ్చి, ఆ తర్వాత దీనిని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. దీనిని ఆరు నెలల పైబడిన పిల్లలకు రోజుకు 40 గ్రాముల వరకు తినిపించవచ్చు. దీనిని నిల్వ పెట్టుకోవాలనుకుంటే ఒక గాలిచొరని డబ్బాలో పెట్టి ఫ్రీజర్‌లో పెట్టాలి. దీనికి తోడుగా ఉడికించిన కూరగాయలు, హోల్‌మీల్ బ్రెడ్ ముక్కలను కూడా కలిపి తినిపించవచ్చు. జల్ జీరాకావలసినవి: తాజా పుదీనా ఆకులు: 1/2 కప్పు జీలకర్ర పొడి: టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు: టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు: టీస్పూన్, నిమ్మరసం: టేబుల్ స్పూన్ బెల్లం పొడి: టేబుల్ స్పూన్, నీళ్లు: 4 కప్పులు నిమ్మకాయ ముక్కలు: అలంకరణ కోసంతయారీ: ఒక బ్లెండర్లో పుదీనా ఆకులు, జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు, నల్ల ఉప్పు, నిమ్మరసం, బెల్లం పొడి వేయండి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక జగ్గులోకి వడకట్టండి. ఇప్పుడు మిగిలిన నీటిని పోసి బాగా కలపండి. ఈ జల్ జీరాను కొన్ని గంటల పాటు రిఫ్రిజిరేటర్లో బాగా చల్లబడే వరకు ఉంచాలి. ఈ చల్లబడిన జల్ జీరాను గ్లాసుల్లో పోసి, ఐస్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేయండి. మీ రుచికి తగినట్లుగా పులుపును అడ్జస్ట్ చేసుకోవచ్చు. జల్ జీరా వేసవికి చాలా మంచిది. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.చికూ పెకాన్ కుల్ఫీ కావలసినవి: పెకాన్ గింజలు (సిమ్లా అక్రోట్): 30 నుంచి 40 సపోటాలు: 5 నుంచి 6 (గింజలు తీసి, తొక్కతో సహా ముక్కలుగా కోసినవి) చక్కెర: 1/4 కప్పు పాల పొడి: 3 టేబుల్ స్పూన్లు ఏలకుల పొడి: 1/2 టీస్పూన్ మరిగించి చిక్కబరిచిన పాలు: 3 కప్పులు గార్నిష్ కోసం: సపోటా ముక్కలు, పెకాన్ గింజలు. తయారీ: 15 నుంచి 20 పెకాన్ గింజలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిన పెకాన్ గింజలను మిక్సీ జార్లో వేసి రఫ్‌గా గ్రైండ్ చేయాలి. అందులోనే సపోటా ముక్కలు, చక్కెర, పాల పొడి, ఏలకుల పొడి వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో సగం కోసిన పెకాన్ ముక్కలు, చిక్కబరిచిన పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మోల్డ్స్‌లో పోసి, మూతలు పెట్టి 6 నుంచి 8 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. కుల్ఫీ గడ్డకట్టిన తర్వాత బయటకు తీసి, మిగిలిన పెకాన్ ముక్కలపై దొర్లించాలి. ప్రతి కుల్ఫీని మధ్యలోకి కట్ చేసి, సపోటా ముక్కలు, పెకాన్ గింజలతో అలంకరించి చల్లగా వడ్డించాలి.(చదవండి: ఐస్‌క్రీం షాపే పెళ్లి వేదికగా..ఒక్కటైన జంట!) -
కాంతివంతమైన మెరిసే ముఖం కోసం..!
పెదవుల ఆకృతిని మార్చుకోవడానికి ఫిల్లర్ చికిత్సలపై ఆధారపడే మహిళలకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ బ్యూటీ టెక్నాలజీ సంస్థ సిల్కెన్ పెదవుల సంరక్షణ, అందం కోసం ‘లూమిలిప్స్ ఎల్ఈడీ లిప్ మాస్క్’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.ఫేస్ మాస్క్‌లు సాధారణంగా ముఖం అంతటికీ కాంతిని అందిస్తాయి. కానీ, ఈ లూమిలిప్స్ మాస్క్ ప్రత్యేకంగా పెదవులు, వాటి చుట్టూ ఉండే చర్మంపై దృష్టి పెడుతుంది. ఇది కాంతి కిరణాల సహాయంతో పెదవులలోని కొవ్వు పొరను లక్ష్యంగా చేసుకుని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల పెదవులు సహజంగానే మృదువుగా, నిండుగా కనిపిస్తాయి. ఈ పరికరం రెండు మోడ్లలో పనిచేస్తుంది. ఒకటి: వాల్యూమ్ యాంటీ ఏజింగ్ మోడ్. ఇది పెదవుల చుట్టూ ఉండే ముడతలు, స్మైల్ లైన్స్, వయసురీత్యా వచ్చే మార్పులను తగ్గిస్తుంది. మరొకటి: గ్లో అండ్ సూతింగ్ మోడ్. ఇది చర్మ ఛాయను మెరుగుపరచడమే కాకుండా, పెదవులకు సహజమైన మెరుపును ఇస్తుంది. ఈ మాస్క్‌ని రోజుకు 3 నుంచి 5 నిమిషాలు ఉపయోగిస్తే చాలు. కేవలం రెండు వారాల్లోనే స్పష్టమైన మార్పును గమనించవచ్చు. దీనిని ఉపయోగించినప్పుడు ఎలాంటి నొప్పి ఉండదు.వైనో థెరపీ..వైన్ తాగడం పురాతన కాలం నుంచి మామూలే! కానీ పురాతన కాలంలో వైన్‌ను ఒక సౌందర్య సాధనంగా కూడా ఉయోగించేవారు. రోమన్ మహిళలు ద్రాక్ష గింజలు, తొక్కలతో చేసిన మాస్క్‌లను ముడతలు పోగొట్టుకోవడానికి వాడేవారు. అలాగే ద్రాక్ష గుజ్జును బుగ్గలకు మంచి రంగు రావడం కోసం వాడేవారట! తరువాత 17వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లోని ఉన్నత వర్గాల మహిళలు చర్మం కాంతిమంతంగా మెరవడానికి రెడ్ వైన్‌తో ముఖం కడుక్కునేవారట! ముఖ్యంగా ఈ ప్రక్రియకే ఆధునికులు ‘వైనోథెరపీ’గా పేరుపెట్టారు. వైనోథెరపీ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం 1990లో. ఫ్రాన్స్‌కి చెందిన మథిల్డే థామస్, ఆమె భర్త బెర్ర్టాండ్ థామస్ ఈ ఆధునిక వైనోథెరపీకి మూలకారకులు. ఫ్రాన్స్‌లో మొదలైన ఈ వైనోథెరపీ ఇప్పుడు జపాన్, అర్జెంటీనా, అమెరికా, భారత్ వరకు విస్తరించింది.అతి జాగ్రత్తలే అసలు సమస్య!జుట్టు ఆరోగ్యంగా ఉండాలని ఒక్కోసారి మనం అతి జాగ్రత్తలతో చేసే పనులు సమస్యను తగ్గించడానికి బదులుగా మరింత పెంచుతాయి. జుట్టు జిడ్డుగా మారుతుందని తరచు షాంపూలతో తలస్నానాలు చేస్తుంటారు. దీనివల్ల తలలో సహజంగా ఉండే నూనెలు పోతాయి. చర్మం మరింత పొడిబారి, ఇంకా ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల మైల్డ్ షాంపూలను మాత్రమే ఉపయోగించాలి. అలాగే వేసవిలో చాలామంది జుట్టును బిగుతుగా ముడి వేస్తుంటారు. దీనివల్ల తలలో చెమట, వేడి పెరిగి జుట్టు కుదుళ్లు బలహీన పడతాయి. అలాగే డ్రై షాంపూలు, స్ప్రేలు వాడినప్పుడు అవి చెమటతో కలిసి తల మీద ఒక పొరలా పేరుకుపోతాయి. ఇవి చర్మరంధ్రాలను మూసివేసి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అందువల్ల తలపై పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి సున్నితమైన స్క్రబ్‌ను వాడాలి. ఎండలో వెళ్లేటప్పుడు హ్యాట్, లేదా స్కార్ఫ్ ధరించాలి. సూర్యరశ్మి వల్ల తల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. మన ముఖ చర్మం లాగే, తల చర్మం కూడా చాలా ముఖ్యం. అందువల్ల తలపై దురద పెడుతున్నా, జుట్టు పల్చబడుతున్నా, జిడ్డుగా ఉంటున్నా– అది మీ సహాయం కోరుతోందని అర్థం. అందువల్ల సమస్య చిన్నగా ఉన్నప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. -
వరుణుడు కోసం అగ్నిబాణాలు
వానలు సమృద్ధిగా కురవాలి; పంటలు పుష్కలంగా పండాలి. ఇంటికి సిరిసంపదలు తేవాలి– ప్రతి దేశంలోనూ రైతులందరి ఆశ ఇది. ఇదే ఆకాంక్షతో థాయ్‌లాండ్, లావోస్ ప్రజలు ప్రతి ఏటా ‘బున్ బాంగ్ ఫై’ అనే రాకెట్ ఫెస్టివల్‌ను అత్యంత ఉత్సాహభరితంగా, అంగరంగ వైభవోపేతంగా జరుపుకొంటారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ అద్భుత వేడుక యసోథోన్ ప్రావిన్స్‌లో మే 8న ప్రారంభమై మే 10తో ముగుస్తుంది.తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. లావోస్ వానదేవుడైన ‘పయా థేన్’ ఒక నాగ సర్పం కారణంగా ఆగ్రహించడంతో వర్షాలు కురవక కరవు వాటిల్లింది. దీంతో ప్రజలు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి వెదురుతో తయారు చేసిన భారీ రాకెట్లను ఆకాశంలోకి ఎగురవేశారట! ఈ పురాణం ఆధారంగా వానదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వెదురు రాకెట్లను ఎగురవేసే సంప్రదాయం మొదలైంది. వీరు ఎగురవేసే రాకెట్లు నేరుగా స్వర్గానికి చేరుకుని, ప్రజల అవసరాలను వానదేవుడికి విన్నవిస్తాయని, ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. థాయ్‌లాండ్ ఈశాన్య ప్రాంతంలోని మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. కాబట్టి వారికి వర్షాలు చాలా కీలకం. రుతుపవనాలు సకాలంలో రావడం వారికి చాలా ముఖ్యం. ఈ ప్రకృతి పండుగను థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రాంతాలైన యసోథోన్, రోయి ఎట్, కలసిన్, ఉడాన్ థాని, నోంగ్ ఖై, మహా సారఖామ్, సిసాకెట్, నోంగ్ బువా లాంఫు, లోయి, అమ్నాత్ చారోయెన్ ప్రావిన్స్‌లతో పాటు ఉత్తర ప్రాంతంలోని కొన్ని ప్రావిన్స్‌లలో విస్తృతంగా జరుపుకొంటారు. మూడు రోజుల పాటు నిర్వహించుకునే ఈ ఉత్సవం రంగురంగుల ఊరేగింపులతో, జానపద నృత్యాలతో కోలాహలంగా సాగుతుంది. సుమారు 20 నుంచి 25 కిలోల గన్‌పౌడర్‌తో నింపిన ఈ రాకెట్లను బౌద్ధ పురాణాల్లోని ‘నాగ’ అనే పౌరాణిక సర్పం బొమ్మతో అలంకరిస్తారు. రాకెట్లను ప్రయోగించే ముందు బౌద్ధ సన్యాసులు వీటికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదిస్తారు. రాకెట్లను తయారు చేసిన బృందాలకు బహుమతులు అందజేస్తారు. అయితే, ఒకవేళ ఏదైనా రాకెట్ ప్రయోగం విఫలమైతే, ఆ రాకెట్ తయారుచేసిన వాళ్లని సరదాగా బురదలో ముంచి శిక్షిస్తారు. ఇది దేవుడికి ఆగ్రహం కలిగించిందని భావించి చేసే ఒక వినోదాత్మక ఆచారం. పురుషులు, స్త్రీల వేషధారణలో కనిపిస్తూ, హాస్యభరితమైన ప్రదర్శనలతో పర్యాటకులను అలరిస్తారు. వ్యవసాయ ఇతివృత్తాలతో కూడిన జానపద నృత్యాలు ఇక్కడ ప్రధానం. ముఖ్యంగా ‘లామ్ వాంగ్’ అనే నృత్యంలో పాల్గొనేవారు వృత్తాకారంలో లయబద్ధంగా నర్తిస్తారు. వేడుక సందర్భంగా బంధుమిత్రులతో కలిసి విందులు చేసుకుంటారు. ఈ బున్ బాంగ్ ఫై కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా, ఒక అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణగానూ మారింది. టూరిజం అథారిటీ ఆఫ్ థాయ్‌లాండ్ 1974 నుంచి ఈ వేడుకలకు అండగా నిలుస్తోంది. ఈ మూడురోజుల పండుగ కాలాన్ని ఈశాన్య ప్రాంతంలో సెలవుదినంగా గుర్తిస్తారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమవ్వడానికి ముందు రైతులు జరుపుకునే ఈ వినోదభరిత ఉత్సవం ప్రకృతికి, మానవ సంకల్పానికి మధ్య ఉన్న విడదీయలేని బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. రమా జంబుల(చదవండి: -
ఆవకాయదే అగ్రస్థానం!
వేసవి అంటే ఊరగాయల సీజన్ కూడా! మామిడికాయలతో తయారు చేసే ఆవకాయ, నిమ్మకాయ ఊరగాయ, మిర్చి ఊరగాయ– ఇలా ఎన్ని రకాలు ఉన్నా, ఊరగాయల మార్కెట్లో అగ్రస్థానం మామిడి ఆవకాయకే దక్కుతుంది. మన దేశంలో తయారయ్యే ఊరగాయల్లో దాదాపు మూడోవంతు వాటా ఆవకాయదే! ఉత్పాదన ప్రకారం ఊరగాయల వివరాలు గణాంకాల్లో చూద్దాం...దేశవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న రకరకాల ఊరగాయల ఉత్పాదనలో దాదాపు 70% కుటీర పరిశ్రమల్లా ఇళ్ల వద్ద తయారు చేసిన ఊరగాయలే ఉంటాయి. ఊరగాయల మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తుల వాటా సుమారు 30% మాత్రమే! ఊరగాయల ఉత్పాదనలో రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఊరగాయల ఉత్పాదనలో మొదటి పది స్థానాల్లో ఉన్న రాష్ట్రాల వివరాలు ఇవీ:చేపలు, రొయ్యలు, చికెన్, మటన్ ఊరగాయల ఉత్పత్తి కేరళలలోను, ఈశాన్య రాష్ట్రాల్లోను అత్యధికంగా ఉంటోంది. ఈశాన్య రాష్ట్రాల్లోను, తూర్పు రాష్ట్రాల్లోను వెదురు మొలకలు, తామరతూళ్ల ఊరగాయలు, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో యాపిల్ ఊరగాయ వంటివి ప్రత్యేకంగా తయారు చేస్తారు. (చదవండి: కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!) -
కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!
చాలామంది కొన్ని రకాల ఆహారాలు తిన్న వెంటనే కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో, దేనికి సంకేతమో ఆలోచించారా అని ప్రశ్నిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే సులభంగా ఈ సమస్యను అధిగమించొచ్చని చెబుతున్నారు. మరి అదెలాగో ఆయన మాటల్లోనే చూద్దామా..!.ఆహారం సరిగ్గా విచ్ఛిన్నం కాకుండా ప్రేగులలోని బ్యాక్టీరియా దానిని పులియబెట్టినప్పుడు కడుపు ఉబ్బరం వస్తుంది. ఈ బ్యాక్టీరియా చర్య వలనే గ్యాస్ ఏర్పడుతుంది. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు. మనం ఏం తీసుకున్నాం, అది ఎంత భాగా జీర్ణమైంది అన్న దానిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని కూడా నొక్కి చెప్పారు. ఉదాహరణకు బీన్స్ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటే, పప్పుధాన్యాలలో ఉండే సంక్లిష్ట చక్కెరలను విచ్ఛిన్నం చేయడానికి మీ శరీరంలో తగినంత ఆల్ఫా-గాలక్టోసిడేస్ ఎంజైమ్ లేదని అర్థం. అదే పాల ఉత్పత్తులు తిన్న తర్వాత ఇలా ఉంటే..లాక్టేస్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉందని అర్థం. అలా కాకుండా గోధుమలు తిన్న తర్వాత ఐతే గ్లూటెన్ జీర్ణక్రియకు ఆటంకం కలిగించేంతగా చిన్నప్రేగుల్లో వాపు ఉందని అర్థం. ఇలా ఆయా ఆహారాలు తిన్న వెంటనే ఈ సమస్య ఉత్పన్నమవుతుందంటే..శరీరంలో ప్రోటీన్‌ను సరిగ్గా విచ్ఛిన్నం చేయడానికి కడుపులోని ఆమ్లం చాలా తక్కువగా ఉందని అర్థం. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు అల్లం తీసుకుంటే అది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించి, కడుపు త్వరగా ఖాళీ అవ్వడానికి సహాయపడుతుందన్నారు. భోజనానికి ముందు తీసుకునే ఆపిల్ సైడర్ వెనిగర్, కడుపులో తగినంత ఆమ్ల ఉత్పత్తి లేని వారిలో ఆమ్ల స్థాయిలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. పప్పుధాన్యాలను బాగా నానబెట్టి, ఉడికించడం వల్ల, శరీరంలోకి ప్రవేశించక ముందే పులియబెట్టడానికి కారణమయ్యే సంక్లిష్ట చక్కెరలు తగ్గుతాయని అంటున్నారుఅంతేగాదు కడుపు ఉబ్బరం అనేది ఒక సందేశం, ఒక అనారోగ్య పరిస్థితి కాదు. దానిని సరిగ్గా గ్రహిస్తే, జీర్ణక్రియలో సరిగ్గా ఏమి లోపిస్తుందో అది మీకు తెలియజేస్తుంది.డా. ఆదర్శ గౌడప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈఓ)అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)ఐసిఎఆర్–జాతీయ పాడి పరిశోధనా సంస్థ, బెంగళూరు -
ఐస్‌క్రీం షాపే పెళ్లి వేదికగా..ఒక్కటైన జంట!
ఇటీవల కాలంలో లగ్జరీ కళ్యాణ మండపాలు, పెద్ద పెద్ద హోటళ్లు, రిసార్ట్, పచ్చని పొలాలు వంటి అనే ఎన్నో కొంగొత్త ట్రెండీ వెడ్డింగ్ ఫంక్షన్ హాల్లు ప్రత్యక్షమవుతున్నాయి. అంతెందుకు కొందరు రాయల్ తరహాలో ప్రఖ్యాత రాజుల కోటల్లో పెళ్లిచేసుకోవడం కూడా చూశాం. కానీ ఈ జంట ఆవేమి కాదని ఐస్‌క్రీం షాప్‌లో పెళ్లి చేసుకున్నారు. ఎందుకిలా చేసుకున్నారో, దాని వెనుకున్న ఆసక్తికర కథేంటో చూద్దామా..!.పోర్ట్‌ల్యాండ్‌కి చెందిన స్పోర్ట్ మెడిసిన్ డాక్టర్ మిషెల్ చిన్నప్పటి నుంచి తన స్నేహితులతో కలిసి ఆ దుకాణానికి వెళ్లేది. మహమ్మారి సమయంలో ఇండియానా యూనివర్సిటీలో రెసిడెన్సీ చేస్తున్నప్పుడు తరుచుగా అక్కడకే వచ్చి ఐస్‌క్రీమ్ ఆస్వాదించేది. అలాగే ఈ పోర్టుల్యాండ్కు తిరిగి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఈ ఐస్‌క్రీం షా కూడా అని చెప్పుకొచ్చింది. నిజానికి అలెక్స్‌తో ఫస్ట డేట్‌కి వెళ్లిందట మిషెల్. అయితే తాను న్యూయార్క్ వెళ్లిపోతాననే ఉద్దేశ్యంతో లైట్ తీసుకుందట. విధి మరోలా స్క్రిప్ట్ రాయడంతో మళ్లీ తిరిగి పోర్ట్ల్యాండడే వచ్చింది మిషెల్. ఎందుకుంటే అక్కడే ఉద్యోగం రావడంతో రాక తప్పలేదు. అలా జనవరి 2024న మంచు తుఫాను సమయంలో ఇద్దరు అనుకోకుండా ఇదే ఐస్‌క్రీం షాపుకి ఇరువురు రావడం కలుసుకోవడం జరిగిందట. తొలిసారి కలిసినప్పుడు అర్బెక్వినా ఆలివ్ ఆయిల్ ఐస్‌క్రీమ్ టేస్ట్ చేశారట. ఆ తర్వాత అలెక్స్ ఆ ఐస్‌క్రీం షాపులోనే ప్రపోజ్ చేశాడట. అలాగే సదరు ఐస్క్రీ షాపు ఓ ప్రత్యేకమైన రోజున పలు జంటలను ఈ షాపుతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకోమంటే మిషెల్, అలెక్స్‌లు తమ లవ్‌స్టోరీ కథను పంచుకున్నారట. దాంతో సదరు ఐస్‌క్రీం షాపు ఓనర్ తామే వివాహం ఘనంగా జరిపిస్తామని ఓ డేట్ ఫిక్స్ చేసుకోమని చెప్పడంతో తమ ఆనందానికి అవధుల లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు అలెక్స్. అలా ఆ జంట ప్రసిద్ధ స్థానిక సాల్ట్ & స్ట్రా అనే ఐస్‌క్రీం షాపులో అత్యంత వైభవోపేతంగా పెళ్లి చేసుకున్నారు. అంతేగాదండోయ్ వధువరుల చేతిలోని పూలబోకేలు సైతం అచ్చం ఐస్‌క్రీం కోన్ మాదిరిగా డిజైన్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Salt & Straw Ice Cream (@saltandstraw) (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..) -
కోటి రూపాయల శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!
మనం జీవితంలో ఏదో ఒక దశలో ఎత్తుపల్లాలు చూస్తుంటాం. కానీ ఆ క్రిటికల్ టైంలో కూడా ధైర్యంగా నిలబడిన వాడే మనిషి. అదే చెబుతోంది ఈ భారత సంతతి మహిళ కథ. ఒక్కోసారి మన రేంజ్ ఆకాశమంత ఉంటే..అకస్మాత్తుగా విధి అథఃపాతాళానికి పడేస్తుంటుంది. మళ్లీ లేచి నిలబడలేనంతగా విపత్కర పరిస్థితి ఎదురవ్వతుంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా మనకు దొరికిన చిన్న చిన్న అవకాశాల నుంచి మళ్లీ మొదలు పెడుతూ నిలబడ్డ వ్యక్తి సత్తా ఉన్న హీరో. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం ఆమె.భారత సంతతి మహిళ శ్వేతా దేశాయ్ ఒకప్పుడు లండన్‌లోని ఒక ప్రముఖ వాణిజ్య వ్యాపార వెబ్సైట్లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్‌గా పనిచేశారు. ఏకంగా కోటి రూపాయల వేతనం అందుకుంటూ మంచి లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేసేవారామె. అలాంటి 37 ఏళ్ల శ్వేతకు 2023 చివరలో తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మెల్బోర్న్కు వెళ్లడంతో ఆమె పరిస్థితి తలకిందులైపోయింది. అక్కడ తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టమైపోయింది. మెల్బోర్న్ ఉద్యోగ మార్కెట్ అత్యంత చిన్నాభిన్నంగా ఉండటంతో జాబ్ వేట చుక్కలు చూపించిందామెకు. అప్పటి వరకు అంత పెద్ద హోదాలో ఉన్న శ్వేతకు తన గుర్తింపును కోల్పోతున్న వేదన ఎక్కువైంది. తన అర్హతలకు తగిన ఉద్యోగం దొరక్క చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. దాంతో తనకు వస్తున్న ఉద్యోగాల ఆఫర్లలో జాయిన్ అయ్యేందుకు రెడీ అయిపోయింది. అదెలాంటి ఉద్యోగం అంటే..కార్పొరేట్ ఉద్యోగ జీవితం నుంచి అపార్ట్మెంట్లు శుభ్రం చేసే స్థాయికి చేరిపోవాల్సి వచ్చింది. ఆమెకు వచ్చిన తొలి జాబ్ ఆఫర్ Airbnb అపార్ట్మెంట్ల నిర్వహణనే నిర్వర్తించేందుకు రెడీ అయినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఆమె అపార్ట్మెంట్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం , అతిథుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తదితరాలు ఉంటాయి. ఇక ముంబైలో పుట్టి పెరిగిన శ్వేత ఉన్నత చదువుల కోసం 2008లో లండన్‌కు వెళ్లింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు బ్రిటిస్ రాజధానిలో ఒక ఇంటిని, జీవితాన్ని నిర్మించడంలో గడిపింది. 2023 నాటికి లండన్ బోటిక్ వెడ్డింగ్ రిజిస్ట్రీలో వార్షిక ఆదాయం దాదాపు రూ. కోట్లు ఆదాయం ఆర్చించేది. భర్త ఉద్యోగ రీత్యా మెల్బోర్న్కి వెళ్లడంతో పరిస్థితి అత్యంత విభిన్నంగా మారిపోయింది. ఈ మార్పు సహజంగానే ఆమె జీవనశైలిని తగ్గించుకునేలా చేసింది. లండన్‌లో, శ్వేతకు డిజైనర్ బ్యాగులు, ఫ్యాన్సీ మేకప్, ఆర్థిక స్వేచ్ఛ ఉండేవి. కానీ మెల్బోర్న్లో ఆమెకు అదే విలాసవంతమైన జీవితం దొరకలేదు. ఈ అనూహ్యమైన మార్పు తనను చాలా దారుణంగా కుంగదీసిందని చెప్పుకొచ్చింది. పైగా ఎవ్వరైన స్నేహితులు, బంధువుల ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడూ ఏ చెప్పాలో తెలిసేది కాదు. ఒక్కోసారి హౌస్ వైఫ్ అని ముసుగు కప్పుకుని తిరగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలో తనకు దొరికిన మొదటి ఉద్యోగ ఆఫర్లో వెంటనే చేరిపోయినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఈ ఉద్యోగం కారణంగా మళ్లీ ఇదవరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉండగలిగానంటోంది. తాను అపార్ట్మెంట్లు నిర్వహించడం తోపాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధించడం, సొంతంగా వ్యాపారాన్ని, కోచింగ్ ప్రాక్టీస్ వంటి వాటిని నిర్వహిస్తున్నారామె. ఏ ఉద్యోగం దొరకలేదని ఆగిపోకుండా..దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అందులో జాయిన్ అయిపోవడమే మేలని అంటోంది. చాలామంది డబ్బుకు అంత విలువలేదని ఏవేవో చెబుతుంటారు కానీ వాస్తవికంగా అది కరెక్ట్ కాదని అంటోందామె. అంతేగాదు ఆర్థిక స్వతంత్రను కలిగి ఉండటం అంటే తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపే స్వేచ్ఛను కలిగి ఉండటం. డబ్బు అంటే ఎన్నో అవకాశాలు, స్వేచ్ఛ, కొన్నిసార్లు సంతోషం కూడా అని చెప్పుకొచ్చిందామె. ఒకప్పుడు అంత పెద్ద ఉద్యోగ హోదాతో చాలా బాగా బతికాను, పైగా తెలియకుండా ఆ లెవెల్ అహం నాలో చాలా పెరిగిపోయిందని తెలసుకున్నా అంటోందామె. ఇలా ఈ రేంజ్‌కి వచ్చేసినా..ప్రస్తుతం మూడు వేర్వరే పనులు చేస్తున్నట్లు తెలిపింది. ఇలా తనలా వేరేప్రాంతానికి మారడంతో ఉద్యోగం కోల్పోయి, ఐడెంటిటీని కోల్పోయి నరకం చూస్తున్న మహిళలకు కోసం “ది రీబిల్డ్ రూమ్” అనే వాట్సాప్ కమ్యూనిటీని ప్రారంభించానని, పైగా అలాంటివాళ్ల కోసం ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shweta (@shweta_lifecoach) (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..) -
అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..
ఓ మహిళ అనారోగ్యంలో సైతం తన భర్త ఎలా అండగా నిలబడ్డాడో వివరిస్తూ షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసులను అమితంగా గెలుచుకుంది. నిజానికి మనకిష్టమైన వాళ్ల కోసం చాలా వాటిని షేర్ చేసుకోగలమేమో గానీ కొన్నింటిని మాత్రం షేర్ చేసుకోవడానికి చాలా పెద్ద మనసు కావాలి. అదే ఈ మహిళ వివరిస్తూ తన కథను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నమర్తా నితిన్ గోయెల్ తన వైద్య ప్రయాణంతో తనకు మద్దతుగా నిలిచి గుండు చేయించుకుంటున్న భర్త వీడియోని షేర్ చేశారు. ఆమె తాను కేన్సర్ బాధితురాలిననని, కీమో ధెరపీ కారణంగా తన జుట్టుని కోల్పోవడంతో తనకు సంఘీభావం తెలిపేలా తన భర్త గుండు చేయించుకున్న వీడియోని షేర్ చేషింది. కష్టకాలంలో సైతం తమ మధ్య బలమైన బంధం ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనం అంటూ భావోద్వేగం చెందింది. ఆ వీడియోలో కీమోథెరపీ తర్వాత జుట్టు రాలిపోవడంతో తాను అనుభవించిన బాధ గురించి ఆమె మాట్లాడింది. తన రెండవ కీమోథెరపీ సెషన్ తర్వాత, జుట్టు విపరీతంగా రాలిపోవడం ప్రారంభమైందని, తన తల చర్మం చాలా సున్నితంగా, బాధాకరంగా మారిందని ఆమె చెప్పింది. జుట్టు రాలినప్పుడల్లా నొప్పి మరింత తీవ్రమయ్యేదని కూడా చెప్పుకొచ్చింది. ఆ విషయాన్ని ఆయనకు చెప్పడంతో ఆ బాధను తాను కూడా పంచుకుంటానంటూ ఆమె భర్త ట్రిమ్మర్‌తో గుండు చేయించుకున్నారని తెలిపింది. ఆ క్రమంలో ట్రిమ్మర్ తలపైన సున్నిత చర్మానికి తగిలినప్పుడల్లా ఆయనకు గాయమవ్వడం తాను చూశానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నిజానికి కేన్సర్ చికిత్సలో భాగం జుట్టు ఊడిపోతుందని తెలుసు కానీ అందుకు తాను సిద్ధంగా లేనని వివరించింది. తన బాధను చూసే ఆమె భర్త ఇలా చేసినట్లు పేర్కొంది. నెటిజన్లే ఈ వీడియోని చూసి..భాగస్వాముల మధ్యలో ఉండాల్సిన శ్రద్ధను ఈ ఘట్టం తెలుపుతోందని, మరికొందరు..'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటే మీ దంపుతులే అంటూ ప్రశంసలు, ఆశీస్తులు అందిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Namarta Nitin Goel (@goelnamarta) (చదవండి: ఈ ఐస్‌క్రీమ్... చాలా హాట్ గురూ!) -
సూపర్ ఎల్ నినో భయం వద్దు.. సిద్ధం కండి!
ప్రపంచానికి ప్రళయ ఘంటికలు వినిపిస్తున్నాయి. ఈ మే నెల నుంచి భూగోళం నిప్పుల కొలిమిలా మారబోతోంది! పసిఫిక్ మహా సముద్రం నుంచి అప్పుడే సంకేతాల అలజడి కూడా మొదలైంది! చరిత్రలోనే ఇది అత్యంత ‘మండే ఎండల’ ఏడాది అవబోతోంది. ఇప్పటి వరకు మనం విన్నది ‘ఎల్ నినో’ అనే మాట మాత్రమే. ఇప్పుడు వింటున్నది ‘సూపర్’ ఎల్ నినో! ఏమైనా కానివ్వండి. భయం వద్దు. సిద్ధం కండి. భద్రంగా ఉండండి.ఈ ఏడాది మే, లేదా జూన్ నెలల నాటికే బలమైన సూపర్ ‘ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించింది . ఈ శతాబ్దంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత వేగంగా పసిఫిక్ మహాసముద్రపు నీరు వేడెక్కుతోందట! పర్యవసానమే సూపర్ ఎల్ నినో అంటున్నారు. అంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరబోతున్నాయి. ‘‘గత వందేళ్లలోనే ఇది అత్యంత బలమైన ఎల్ నినో కావచ్చు. సముద్ర ఉష్ణోగ్రతలు సగటు కంటే 1.5 సెల్సియస్ డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది’’ అని బ్రిటన్ వాతావరణ సంస్థ ‘మెట్ ఆఫీస్’ ప్రకటించింది. ‘‘ఉష్ణోగ్రతలు 2 సెల్సియస్ డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగి, ‘అత్యంత బలమైన’ ఎల్ నినో వచ్చే అవకాశం 25 శాతం వరకూ ఉంది’’ అని అమెరికా సముద్ర వాతావరణ సంస్థ ‘నేషనల్ ఓషియానిక్ అండ్ ఎట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్’ (ఎన్.ఓ.ఎ.ఎ.) హెచ్చరించింది.వ్యక్తిగతంగా శాస్త్రవేత్తలు కూడా ‘భద్రం బీ కేర్ ఫుల్’ అంటున్నారు. ‘‘చాలా వాతావరణ నమూనాలు (క్లైమేట్ మోడల్స్) ఉష్ణోగ్రత పెరుగుదల 2 సెల్సియస్ డిగ్రీల లోపే ఉంటుందని చెబుతున్నప్పటికీ, అది 2 సెల్సియస్ డిగ్రీలను దాటే అవకాశం కూడా ఉండటం అన్నది ఆందోళన కలిగిస్తోంది’’ అని ‘యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్’ సంస్థ సభ్యులు డాక్టర్ మార్క్ అలెస్సీ కలవర పడుతున్నారు. ‘‘గత 140 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైన ‘ఎల్ నినో’ వచ్చే అవకాశం ఈ ఏడాది మే నెలలో ఉంది’’ అని న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ పాల్ రౌండీ అంటున్నారు. ‘ఎల్ నినో’ అంటే తెలిసిందేప్రకృతిలో సహజంగా జరిగే మార్పుల్లో ‘ఎల్ నినో’ ఒకటి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలోని నీరు సాధారణం కంటే ఎక్కువ వేడెక్కినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెద్ద మార్పులు వస్తాయి. కానీ ఇప్పుడొస్తున్నది సూపర్ ఎలన్ నినో అంటున్నారు. అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 2 సెల్సియస్ డిగ్రీల కంటే ఎక్కువ పెరిగినప్పుడు సంభవించే పరిణామం. అయితే శాస్త్రవేత్తలు అధికారికంగా ‘సూపర్’ అనే ఈ పదాన్ని పెద్దగా వాడరు. వాతావరణ నమూనాలన్నీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ‘ఎల్ నినో’ మరింత తీవ్రం కానుంది. అంటే ఈ మే నెల నుంచి రాబోయే రోజుల్లో ప్రపంచం భారీ ఎండలను, ఎండలతో పాటుగా అసాధారణ వాతావరణ మార్పులను, అకాల భారీ వర్షాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎల్ నినో అన్నది లక్షల ఏళ్లుగా ఉన్నదే అయినా, ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తున్న సంకేతాల ప్రకారం ఈ ఏడాది, చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోలలో ఒకటిగా నమోదయ్యే అవకాశం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.వేడి ఎలా పెరుగుతుంది?ఎల్ నినో సమయంలో, పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కిన నీరు అంతటా విస్తరిస్తుంది. దీనివల్ల భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. సముద్రంలోని ఈ వేడి, వాతావరణంలోకి విడుదలయ్యి, కొన్ని నెలల పాటు భూమిని వేడెక్కిస్తుంది. ఈ ఏడాది ఎల్ నినో, సూపర్ ఎల్ నినో అవొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా ఏప్రిల్ నెలలో ఉండే వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తును అంచనా వేయడం కష్టం. ఈ అడ్డంకిని శాస్త్రవేత్తలు ‘ఏప్రిల్ అడ్డంకి’ అంటారు. వాళ్ల పరిభాషలో అది ‘స్ప్రింగ్ ప్రిడిక్టబిలిటీ బారియర్’. అయినప్పటికీ, ఈసారి సూపర్ ఎల్ నినో వస్తుందని శాస్త్ర నిపుణులు గట్టిగానే చెబుతున్నారు.ఎల్ నినో చరిత్రలో 2024వాతావరణ మార్పు, ఎల్ నినో అనేవి రెండు వేర్వేరు అంశాలు. ఎల్ నినో అనేది వాతావరణ మార్పుల వల్ల ఏర్పడేది కాదు. ఇది ప్రకృతిలో సహజంగా జరిగే ప్రక్రియ. అలాగే గ్రీన్హౌస్ ప్రభావం వల్ల ఎల్ నినో మరింత తీవ్రమవుతుందని చెప్పడానికి కూడా ఇప్పటి వరకు శాస్త్రవేత్తల దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవు. వాతావరణ మార్పుల వల్ల భూమి వేడెక్కుతోంది. దీనికి బలమైన ఎల్ నినో కూడా తోడైతే, ఆ అదనపు వేడి కారణంగా ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగిపోతాయి. గ్రీన్హౌస్ వాయువులు, బలమైన ఎల్ నినో కలవడం వల్లే 2024 చరిత్రలోనే అత్యంత వేడైన సంవత్సరంగా నిలిచింది. ఇక ఇప్పుడు ‘సూపర్’ ఎల్ నినో వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో, ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ వర్షాలు, లేదా కరువు కాటకాలు సంభవించ వచ్చు. ఈ ఏడాదే ఎందుకని?!ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం, ఈ ఏడాది మే, జూన్ నెలల్లో భూమిపై దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, కరీబియన్ దీవులు, యూరప్, ఉత్తర ఆఫ్రికాలో ఈ ప్రభావం కనిపించవచ్చు. దీనివల్ల దక్షిణమెరికా, తూర్పు ఆఫ్రికా ప్రాంతం, మధ్య ఆసియాలో విపరీతమైన వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంది; ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో తీవ్రమైన కరవు ఏర్పడవచ్చు. ఆగ్నేయ ఆసియా దేశాలలో అడవులు అంటుకుని మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి, నీటి లభ్యత, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. ‘సూపర్’ అనే మాట కొత్తది!పసిఫిక్ మహాసముద్రంలో క్రమబద్ధంగా మారే వాతావరణ మార్పులను ‘ఎల్ నినో సదరన్ ఆసిలేషన్’(ఇ.ఎన్.ఎస్.ఓ.) అని పిలుస్తారు. ఇందులో ప్రధానంగా రెండు దశలు ఉంటాయి. ఒకటి: ‘ఎల్ నినో’ (వేడి దశ), రెండు : ‘లా నినా’ (చల్లని దశ). ఈ దశలు ప్రతి రెండు నుండి ఏడు సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, గాలులు వర్షపాతంలో ఊహించని మార్పులను కలిగిస్తాయి. ఇక, ఇ.ఎన్.ఎస్.ఓ.లోని మూడో దశ ‘తటస్థ స్థితి’. ఎల్ నినో ఈ ఏడాది తీవ్రంగా ఉంటుందని చెప్పటానికే దీనిని ‘సూపర్ ఎల్ నినో’ అని అభివర్ణిస్తున్నారు.ఎల్ నినో : ఈ దశలో పసిఫిక్ మహాసముద్రం; మధ్య, తూర్పు ప్రాంతాల్లో నీటి ఉపరితలం సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతుంది. భూమధ్యరేఖ వెంబడి తూర్పు నుండి పడమరకు వీచే గాలులు బలహీనపడతాయి. కొన్నిసార్లు ఇవి అందుకు భిన్నంగా పడమర నుండి తూర్పుకు వీస్తాయి. ఈ ప్రభావంతో ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోతాయి. కానీ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో వర్షాలు పెరుగుతాయి!లా నినా : ఈ దశలో పసిఫిక్ మహాసముద్రం; మధ్య, తూర్పు ప్రాంతాల్లో నీరు సాధారణం కంటే ఎక్కువగా చల్లబడుతుంది. తూర్పు నుండి వీచే గాలులు మరింత బలంగా మారుతాయి. ఆ ప్రభావంతో ఇండోనేషియాలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, కానీ పసిఫిక్ మహాసముద్ర మధ్య ప్రాంతంలో వర్షాలు తగ్గుతాయి.తటస్థ స్థితి : ఇది ఎల్ నినో గానీ, లా నినా గానీ ఉండని సమయం. ఈ స్థితిలో పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు సాధారణంగా సగటు స్థాయిలోనే ఉంటాయి. ్చపసిఫిక్ మహా సముద్రంలోనే ఎందుకు?నిజానికి ఇతర మహాసముద్రాల్లో కూడా చిన్నపాటి వాతావరణ మార్పులు జరుగుతుంటాయి, కానీ ‘ఎల్ నినో’ అంతటి శక్తిమంతమైన మార్పులు కేవలం పసిఫిక్ మహాసముద్రంలోనే రావడానికి ముఖ్య కారణం ఆ సముద్ర పరిమాణం. ఉదా : అట్లాంటిక్ మహాసముద్రం ఒక నీళ్ల టబ్ లాంటిదైతే, పసిఫిక్ మహాసముద్రం ఒక పెద్ద చెరువు లాంటిది. టబ్‌లో నీటిని కదిలిస్తే చిన్న అలలు మాత్రమే వస్తాయి, కానీ పెద్ద చెరువులో నీరు కదిలితే అది చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఇక్కడా అంతే. పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది ఎంత వెడల్పుగా ఉంటుందంటే, భూమధ్యరేఖ వద్ద ఇది భూమి చుట్టుకొలతలో దాదాపు సగానికి పైగా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం చాలా విశాలంగా ఉండటం వల్ల, దాని తూర్పు ప్రాంతానికి (దక్షిణమెరికా), పశ్చిమ ప్రాంతానికి (ఇండోనేషియా) మధ్య ఉష్ణోగ్రతల్లో భారీ తేడా ఉంటుంది. ఈ భారీ తేడానే ప్రపంచవ్యాప్త గాలులను శాసిస్తుంది. చిన్న సముద్రాల్లో ఉష్ణోగ్రత తేడాలు తక్కువగా ఉంటాయి, కాబట్టి అవి వాతావరణాన్ని అంతగా ప్రభావితం చేయలేవు.‘క్లైమేట్ మోడల్స్’ అంటే?భూమి, సముద్రాలు, భూతలం పైన వాతావరణాలు ఎలా మారుతాయో అంచనా వేసే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్ ప్రోగ్రాములే ‘క్లైమేట్ మోడల్స్. ఇవి గాలి వేగం, ఉష్ణోగ్రత, గ్రీన్హౌస్ వాయువుల వంటి గణిత సమీకరణాలను ఉపయోగించి భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉండబోతుందో ముందే చెబుతాయి. శాస్త్రవేత్తలు వీటిని ఉపయోగించి ఎల్ నినో వంటి మార్పులను లెక్కిస్తారు.‘బాల యేసు’ అని అర్థం!‘ఎల్ నినో’ అనే పదం స్పానిష్ భాష నుండి వచ్చింది, దీని అర్థం ‘బాలుడు‘ లేదా ‘బాల యేసు’ (బేబీ జీసస్). పసిఫిక్ మహాసముద్రంలో ఈ వేడి నీటి ప్రవాహం సాధారణంగా డిసెంబర్ (క్రిస్మస్) సమయంలో కనిపిస్తుంది కాబట్టి, దక్షిణ అమెరికా జాలర్లు దీనికి ఆ పేరు పెట్టారు. దక్షిణ అమెరికాలోని పెరూ దేశపు జాలర్లు వందల ఏళ్ల క్రితమే ఎల్ నినో ఉనికిని కనిపెట్టారు. -
హేమకాంతుడి వైశాఖధర్మం
కృతయుగంలో వంగదేశాన్ని కుశకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడి కుమారుడు హేమకాంతుడు. ఒకనాడు హేమకాంతుడు కొందరు భటులను వెంటబెట్టుకుని, వేట కోసం అడవికి వెళ్లాడు. అది వైశాఖమాసం. హేమకాంతుడు అడవిలో అనేక మృగాలను వేటాడాడు. మధ్యాహ్నవేళ ఎండ నడినెత్తికి వచ్చేసరికి అతడు బాగా అలసిపోయాడు. విశ్రాంతికి తగిన చోటు కోసం వెదుకులాడుతూ, అడవిలోనే ఉన్న మునుల ఆశ్రమ ప్రదేశానికి చేరుకున్నాడు.అక్కడ ఉండేవారు శతర్చినులు అనే మునులు. వారు అతిథి సత్కారాల వంటి విప్రకృత్యాలను ఎరుగరు. వారెరిగిన కర్మ తపశ్చర్య మాత్రమే! హేమకాంతుడు ఆ ఆశ్రమ ప్రదేశంలో అడుగుపెట్టే వేళకు శతర్చినులు తపస్సమాధిలో ఉన్నారు. బాహ్యస్పృహను మరచి సమాధి స్థితిలో ఉన్న వారికి హేమకాంతుడి ఆగమనం తెలియలేదు. హేమకాంతుడు సమీపానికి వచ్చినా, వారు అతడి రాకను గుర్తించలేదు. రాజైన తనను మునులు పట్టించుకోనందున హేమకాంతుడు ఆగ్రహం చెందాడు. వారిని చంపాలని నిశ్చయించుకుని, వారిపైకి కత్తి దూశాడు. హేమకాంతుడి దూకుడు గమనించిన శతర్చినుల శిష్యులు అక్కడకు పరుగు పరుగున వచ్చారు. ‘‘ఓరీ దురాత్ముడా! మా గురువులైన శతర్చినులు తపస్సమాధిలో ఉన్నారు. బాహ్యస్పృహలో లేని వారిపైకి కత్తి దూయడం తగని పని. మునులను వధించబూనడం మహాపాతకం, పాపాత్ముడా!’’ అని పలికారు.ముని శిష్యుల మాటలకు హేమకాంతుడు ‘‘విప్రులారా! నేను వేట కోసం ఈ అడవిలోకి వచ్చాను. వేటలో అలసిపోయి, ఇక్కడకు చేరుకున్నాను. మీ గురువులకు వీలు లేకపోతే, మీరైనా నాకు భోజనం పెట్టండి’’ అన్నాడు.‘‘రాజా! మేము గురువులు పెట్టిన భిక్ష తిని బతుకుతున్నాము. వారి అనుమతి లేకుండా ఏ పనీ చేయలేము. వారి ఆజ్ఞ లేనిదే నీకు అతిథి సత్కారాలు చేయడం మాకు కుదరని పని’’ అని పలికారు ముని శిష్యులు. వారి మాటలకు హేమకాంతుడు మండిపడ్డాడు. వారి చంపడానికి విల్లు సంధించాడు. ‘‘దుర్మార్గమైన దొంగలు, క్రూరమృగాలు లేకుండా ఈ అరణ్యాన్ని చక్కదిద్దాను. మీకు భయం లేకుండా చేశాను. మీరు మా వలన అగ్రహారాది సత్కారాలను, ఉపకారాలను పొందారు. ఈ మునులు చేసిన మేలు మరచి, నేను ఇక్కడకు వచ్చినా, నా వంక చూడటం లేదు. ఆకలి దప్పులతో అలసి సొలసి వచ్చిన నాకు అన్నం పెట్టడానికి మీరు వెనుకాడుతున్నారు. మీలాంటి క్రూరులను సంహరించినా పాపం ఉండదు’’ అని పలికి, బాణం విడిచాడు.హేమకాంతుడు ఆగ్రహంతో బాణం సంధించేసరికే ముని శిష్యులు భయభ్రాంతులై అడవిలోకి పారిపోయారు. కోపం చల్లారని హేమకాంతుడు వారిని వెంబడించి, వారిపై బాణ ప్రయోగం చేశాడు. అతడి బాణాలకు మూడువందల మంది శిష్యులు మరణించారు. మిగిలిన వారు పారిపోయారు.ఈ కలకలం సద్దుమణిగాక, హేమకాంతుడి ఆజ్ఞపై రాజభటులు ఆశ్రమాల్లోకి చొరబడి, దొరికిన వంట పదార్థాలను తీసుకొచ్చారు. అందరూ వాటిని ఆరగించాక, కాసేపు విశ్రమించి, సాయంత్రం ఇంటికి బయలుదేరారు.అడవిలో తన కొడుకు హేమకాంతుడు చేసిన దుష్కార్యం తెలుసుకుని, కుశకేతుడు దుఃఖించాడు. కొడుకును నిందించాడు. ‘‘నీవంటి దుర్మార్గుడు రాజ్యపాలనకు తగడు’’ అని పలికి అతడికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు.తండ్రి ఆజ్ఞతో హేమకాంతుడు ఇల్లు వదిలి, కీకారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ అతడు బ్రహ్మహత్యా పాతకంతో బాధపడుతూ కిరాతునిలా దొరికిన పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసం తింటూ జీవించసాగాడు. హేమకాంతుడు అలా ఇరవై ఎనిమిదేళ్లు ఆ అరణ్యంలోనే గడిపాడు. ఒక వైశాఖ దినాన త్రితుడు అనే ముని తీర్థయాత్రలకు బయలుదేరి ఆ అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ, మధ్యాహ్న వేళ ఎండ వేడికి తాళలేక మూర్ఛపోయాడు. అదృష్టవశాత్తు హేమకాంతుడు మూర్ఛిల్లిన మునిని గమనించి, అతడికి మోదుగు ఆకుల గొడుగు నీడ కల్పించి, శైత్యోపచారాలు చేశాడు. ముని స్పృహలోకి వచ్చాక అతడికి సొరకాయ బుర్రలో ఉన్న నీరు ఇచ్చి, దప్పిక తీర్చాడు. మార్గాయాసంతో మూర్ఛిల్లిన మునికి శైత్యోపచారాలు చేయడం వల్ల హేమకాంతుడి బ్రహ్మహత్యా పాతకం నశించింది. అతడి మనసు నిర్మలమైంది. అప్పటి నుంచి అతడు సదా శ్రీహరిని స్మరించసాగాడు. కొంతకాలానికి హేమకాంతుడు వ్యాధిగ్రస్థుడై మరణించాడు. అతడిని తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. అదే సమయంలో విష్ణుదూతలు వచ్చి, యమదూతలను అడ్డుకున్నారు. హేమకాంతుడు వైశాఖ ధర్మాలను నెరవేర్చాడని, అందువల్ల అతడి పాపాలన్నీ నశించాయని, అతడిని వైకుంఠానికి తీసుకు రమ్మని శ్రీహరి ఆజ్ఞ అని చెప్పి, యమదూతలను తరిమేశారు. విష్ణుదూతలతో కలసి హేమకాంతుడు వైకుంఠానికి చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
అమ్మ హెల్త్ అందరికీ హెల్త్!
అమ్మదనం గురించీ, అమ్మదనపు మంచితనం గురించి కవులూ, రచయితలూ ఎంతో చెప్పారు. అంతకంటే అపురూపంగా అద్భుతంగా చెప్పడమిక దాదాపు అసాధ్యం. కానీ వైద్యపరంగా మాత్రం ఎంతోకొంత చెప్పవచ్చు. అందుకే మాతృ దినోత్సవపు ఈ అమృత సమయాన వివిధ వయసుల్లోని మాతృమూర్తుల కోసం వాళ్ల పిల్లలూ, తల్లిగా మారిన, మారబోతున్న తమ భార్యల కోసం భర్తలూ... కాబోయే మాతృమూర్తుల తల్లిదండ్రులూ... ఇలా ఎవరి పరిధుల్లో వారు నెరవేర్చగలిగే కొన్ని బాధ్యతలూ, సూచనలు, చేయించాల్సిన వైద్యపరీక్షలూ... చికిత్సలూ... ఇవిగో... ఇవి మీకోసం.ఇక్కడ పేర్కొన్నవి మాత్రమే కాకుండా... మరికొన్ని స్పెషలైజ్డ్ పరీక్షలూ ఆయా మహిళల అవసరాల కోసం చేయించాల్సి రావచ్చు. కొన్ని ప్రామాణికమైన బేసిక్ పరీక్షలు...సీబీపీ రక్త పరీక్ష : మనదేశపు మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. దాదాపు 65 శాతం నుంచి 70 శాతం మహిళల్లో అనీమియా సమస్య ఉంటుందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఓ ఆడపిల్ల యువతిగా మారే క్రమంలో మొదలైన రుతుస్రావంలో నెలనెలా రక్తస్రావం జరుగుతుంటుంది. అందుకే మహిళల్లో ఇది సాధారణమైన సమస్య. యువతి ఆరోగ్యం బాగుండాలన్నా, భవిష్యత్తులో తల్లికాబోయే ముందరైనా రక్తహీనత లేకుండా తగినంత హీమోగ్లోబిన్ ఉండటం అవసరం. అందుకే తల్లిదండ్రులు యుక్తవయసులోని తమ పిల్లల్లోని హీమోగ్లోబిన్‌తో పాటు రక్తంలోని మిగతా అంశాలైన తెల్లరక్తకణాలూ... అందులోని బేసోఫిల్స్, ఈసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ వంటి వాటితో పాటు రక్తం గడ్డకట్టించే ప్లేట్లెట్స్ వంటి వివరాలు తెలుసుకుని అవి నార్మల్‌గా ఉన్నాయా లేదంటే అందుకు తగినట్లుగా సిరప్, టాబ్లెట్లు వాడటానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) అనే రక్తపరీక్ష మేలు చేస్తుంది. మూత్ర పరీక్ష : పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు ఎక్కువ. ఈ ఇన్ఫెక్షన్లను తెలుసుకునేందుకు మూత్ర పరీక్ష ఉపయోగపడుతుంది. కిడ్నీ వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, కాలేయ సమస్యలు, డయాబెటిస్ తీవ్రత వంటివి తెలుసుకునేందుకు కూడా మూత్ర పరీక్ష ఉపయోగపడుతుంది. బోన్డెన్సిటీ పరీక్ష : యాభై ఏళ్లు వయసు పైబడ్డ మహిళ ఎముకల్లో క్రమంగా క్యాల్షియమ్ తగ్గుతూపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనే ఆరోగ్య సమస్య వస్తుంది. ముఖ్యంగా మెనో΄ాజ్ దాటాక ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గుతూపోతుండటంతో ఇంచుమించు మహిళలందరిలోనూ కనిపించే సమస్య ఇది. 60 ఏళ్లు దాటిన 50% మంది మహిళల్లో 80 ఏళ్లు దాటినవారిలో 90 శాతం మందిలో కనిపిస్తుంది. బోన్‌డెన్సిటో మీటర్ (డెక్సా స్కాన్) ద్వారా బోన్డెన్సిటీనీ తద్వారా ఆస్టియోపోరోసిస్‌ను కనుక్కోవడం చాలా సులభం. దీని నివారణకు వ్యాయామం, ఆహారంలో క్యాల్షియం చాలా ముఖ్యం. పాప్ స్మియర్... మధ్యవయసుకు వస్తున్న వయసులోని మహిళలకు అంటే 30 నుంచి 35 ఏళ్ల వయసున్న వారిలో సర్వికల్ క్యాన్సర్‌ను తెలుసుకోడానికి ఉపకరించే పరీక్ష. ఈ సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రీ–క్యాన్సర్ దశ సుదీర్ఘకాలం ఉంటుంది. పదేళ్ల ముందుగా కూడా దీన్ని కనుగొనేందుకు అవకాశం ఉంది. ఏ మాత్రం నొప్పి లేకుండా చేసే పరీక్ష ఇది. మామోగ్రామ్ : మహిళల్లో అత్యధికంగా కనిపించే బ్రెస్ట్‌క్యాన్సర్‌ను తెలుసుకునేందుకు చేయించే పరీక్ష ఇది. తొలిదశలోనే కనుగొంటే రొమ్మును తొలగించనవసరం లేకుండానే (మాసెక్టమీ చేయకుండానే) చికిత్స అందించవచ్చు. నలభై ఏళ్ల తర్వాత చేయించాల్సిన ఈ పరీక్షను రొమ్ములో నొప్పి, సలపరం ఉంటే తప్పక చేయించాలి. టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్ష: థైరాయిడ్ సమస్యను కనుగొనడం కోసం చేసే ఒక రకం రక్తపరీక్ష ఇది. థైరాయిడ్ గ్రంథి పనితీరు అంతగా లేని హైపోథైరాయిడిజమ్నూ, ఆ గ్రంథి అత్యంత చురుగ్గా పనిచేస్తున్న హైపర్థైరాయిడిమ్ అనే సమస్యలను తెలుసుకోడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సంబంధిత సమస్యలను తెలుసుకోవడం కోసం టీ3, టీ4, టీఎస్‌హెచ్ పరీక్ష చాలా ముఖ్యం.క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్: సర్విక్స్ క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే పాప్ స్మియర్, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే మామోగ్రామ్ పరీక్షలు కాకుండా... ఇతర రకాల క్యాన్సర్ల కోసం మరికొన్ని రక్తపరీక్షలూ అవసరం. ఉదాహరణకు సెర్విక్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకునే పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) పరీక్షలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పును తెలుసుకునే లో–డోస్ హెలికల్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ పరీక్షలు; పెద్దపేగు, మలద్వారం వద్ద క్యాన్సర్ రిస్క్ తెలుసుకోడానికి సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ (ఎఫ్ఓబీటీ) వంటివి చేయించవచ్చు. షుగర్ పరీక్ష : చక్కెర వ్యాధిని గుర్తించడానికి పరగడుపున ఫాస్టింగ్ షుగర్ టెస్ట్, ఏదైనా తిన్న గంటన్నర తర్వాత పోస్ట్ ఫుడ్ షుగర్ టెస్ట్ వంటివి మాత్రమే కాకుండా... డాక్టర్ సూచనల మేరకు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ), మూడు నెలల సగటు షుగర్ తెలుసుకోడానికి హెచ్‌బీఏ1సీ వంటి పరీక్షలు అవసరం. మధ్య వయసు దాటాక ఈ చక్కెర పరీక్షలు చేయించడం చాలా అవసరం. ఇవే కాకుండా బీపీ రీడింగ్ మొదలుకొని... ఆయా మహిళల ఆరోగ్య అవసరాల మేరకు కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయించడం మంచిది. ఇందుకోసం ఆ తల్లుల బిడ్డలూ, భర్తలూ, పేరెంట్స్ ఇలా అందరూ పూనుకోవడం వల్ల మహిళ ఆరోగ్యం బాగుంటుంది. దాంతో సమాజంలో అందరి ఆరోగ్యమూ బాగుంటుంది.డాక్టర్ లక్ష్మీదేవి అప్పసాని,సీనియర్ కన్సల్టెంట్ అబ్స్ట్రెటీషియన్ – గైనకాలజిస్ట్డాక్టర్ చల్మేడ నివేదిత, సీనియర్ ఫిజీషియన్ నిర్వహణ: యాసీన్(చదవండి: పీఛే చల్! ఇలా నడిచి చూశారా?) -
క్లూషియల్: అతడే హంతకుడు
ఒక్కసారిగా ఆ ప్రాంతం పోలీస్ సైరన్లతో నిండిపోయింది.కరుడుగట్టిన నేరస్థుడు, రెండు రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చిన రాకీ సెవెన్‌హిల్స్ బస్టాప్ దగ్గర హత్యకు గురయ్యాడు. అతడి గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది కూడా అదే! ఇన్స్పెక్టర్ అభిమన్యు దర్యాప్తులో ముందుగా రాకీ క్రిమినల్ హిస్టరీ చూశాడు. అతను చేయని నేరం లేదు, పాల్పడని ఘోరం లేదు. గంజాయి అమ్మకం నుంచి ఆడపిల్లల్ని వేధించడం వరకు అతని మీద చాలా కేసులు ఉన్నాయి.రాకీ చనిపోవడానికి మూడు గంటల ముందు ఒక అమ్మాయిని వెంటపడి ఏడిపించాడు. ఆమె చెప్పు తీసి అతడిని బెదిరించింది. ఇద్దరి మధ్య జరిగిన గొడవ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రాత్రి తొమ్మిది గంటలకు ఈ గొడవ జరిగింది. అప్పుడే పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ రావడం చూసి, రాకీ అక్కడి నుంచి తప్పుకున్నాడు.ఇది జరిగిన మూడు గంటల తర్వాత పోలీస్ స్టేషన్‌కు ఫోన్ వచ్చింది. సెవన్‌హిల్స్ బస్టాప్ దగ్గర రాకీ శవం పడి ఉందని ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్లో చెప్పాడు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.ఇన్స్పెక్టర్ అభిమన్యు అక్కడ గుమిగూడిన జనాన్ని జరిగిన హత్య గురించి అడిగాడు. వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. ఒక వ్యక్తి మాత్రం ముందుకు వచ్చాడు. రాకీని రాజీవి అనే అమ్మాయి బెదిరించిందని, తాను అప్పుడు అక్కడే ఉన్నానని చెప్పాడు. ఆ సంఘటనను తన ఫోన్లో చిత్రించినట్టు చెప్పి, తన ఫోన్ ఇచ్చాడు. అందులో రాజీవి అనే అమ్మాయి ‘నిన్ను చంపేస్తాను’ అని రాకీని బెదిరించడం స్పష్టంగా ఉంది. మరో గంటలో రాజీవి ఇంటి ముందున్నాడు అభిమన్యు. తాను కోపంతో అతడిని చంపేస్తానని బెదిరించిన మాట నిజమే అని, ఆ తర్వాత భయంతో ఇంటికి వచ్చేశానని రాజీవి చెప్పింది.ఒక మామూలు అమ్మాయి ఒక్కతే అంత దృఢంగా ఉండే రాకీని చంపగలదా?రాకీ ఒంటిపై ఉన్న గాయాలు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చేసినట్లుగా ఉన్నాయి.అభిమన్యు రాకీ ఫోన్ రికార్డులను పరిశీలించాడు. చనిపోవడానికి ముందు రాకీకి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించాడు.‘‘నీ పేరేంటి?’’ అడిగాడు అభిమన్యు అతడిని.రాకీని రాజీవి బెదిరించిన వీడియో తీసింది అతనే!‘‘రాజు...’’ తడబడుతూ చెప్పాడు అతడు.‘‘నీ అసలు పేరు చెప్పు వేలాయుధం’’ అన్నాడు అభిమన్యు. ఉలిక్కిపడిన ఆ వ్యక్తి కంగారుగా లేవబోయాడు.‘‘ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. నువ్వూ రాకీ తోడు దొంగలు. చెన్నైలో మీ పరిచయం. అతడు ఇక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. నువ్వు తప్పించుకున్నావు. మీ ఇద్దరి మధ్య డబ్బు గొడవలు ఉన్నాయి. బెయిల్ మీద విడుదలైన రాకీని చంపాలని నీ ప్లాన్. రాజీవితో రాకీకి జరిగిన గొడవ నీకు కలిసొచ్చింది. రాజీవిని దోషిగా నిలబెట్టి నువ్వు ఎస్కేప్ అవ్వాలనుకున్నావు. ఆ ప్రయత్నంలో నీ రెండో సిమ్‌తో పోలీసులకు ఫోన్ చేశావు. మొదటి సిమ్‌తో వీడియో తీశావు.రాకీకి ఫోన్ చేసి సెవెన్ హిల్స్ బస్టాప్ వెనుక వైపు రమ్మన్నావు. అక్కడ సీసీ కెమెరాలు లేవన్నది నిజమే. కానీ కాస్త దూరంలో నిర్మాణంలో వున్న ఒక భవన యజమాని సీసీ కెమెరాలు పెట్టించాడు. ఆ సీసీ కెమెరాల్లో నిర్మాణంలో వున్న భవనంలోకి నువ్వెళ్ళడం రికార్డు అయ్యింది. నీ క్రిమినల్ రికార్డు బయట పడింది. నువ్వు ఇందాక ఫోన్ ఇచ్చినప్పుడు ఫోన్ మీద నీ ఫింగర్ ప్రింట్స్, రాకీ ఒంటి మీద వున్న గుర్తులతో మ్యాచ్ అయ్యాయి. శిక్షకు సిద్ధంగా వుండు...’’ అన్నాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.వేలాయుధాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.‘‘థాంక్యూ సర్! నన్ను సేవ్ చేశారు...’’ రాజీవి కృతజ్ఞతగా అంది.‘‘నేను న్యాయం చేశాను. నీ ధైర్యమే కరెక్ట్. కానీ వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ఈ ఇబ్బంది ఉండేది కాదు’’ అంటూ ముందుకు కదిలాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు. - శ్రీసుధామయి -
లిట్‌వరల్డ్: పేరు ‘జింకపిల్ల’, బెబ్బులి కూనయా...
సంగీత సారస్వతాలను చదువులతల్లి స్తన్యంతో పోల్చాడు మహాకవి కాళిదాసు. సంగీతం ఆపాతమధురంగానూ, సాహిత్యం ఆలోచనామృతంగానూ వుంటాయని కూడా ‘కవికులగురువు’ అన్నాడట. సంస్కృతం చదువుకోకపోయినా ఆ విషయం తెలిసిన ఇరవయ్యొకటో శతాబ్ది రచయిత్రి ఒకరున్నారు– ఆమె పేరు ఎల్ఫ్రైడ్ జెలెనిక్. ఆమె సాహిత్యం చదువుతుంటే శ్రావ్యంగా వుంటుందనేది అందరి అనుభవం; దాని గురించి ఆలోచించే కొద్దీ, మన సామాజిక జీవనం గురించిన ఆలోచన పదునెక్కుతూ పోతుందనేది మాత్రం కొందరి అనుభవమే! నవలా రచన– రూపక ప్రక్రియల్లో అందెవేసిన చెయ్యి అనిపించుకున్న ఎల్ఫ్రైడ్ జెలెనిక్ది ఆస్ట్రియా. 2004 నోబెల్ సాహిత్య పురస్కారం ఎల్ఫ్రైడ్ గెల్చుకున్నట్టు ప్రకటిస్తూ ఎంపిక సంఘం చేసిన ‘అధికారిక ప్రకటన’లో రచయిత్రి శైలికి జేజేలు పలుకుతూ ఇలా అన్నారు: ‘ఆమె నవలలూ, రూపకాల్లో సంగీతబద్ధమైన స్వరాలూ, అనుస్వరాలూ అసాధారణమైన భాషాభినివేశంతో జాలువారతాయి. జనం నెత్తిన లోకం రుద్దిన అరిగిపోయిన మూసకట్టు పదబంధాల అసంబద్ధతనూ, వాటి పెత్తందారీ పోకడలనూ ఎల్ఫ్రైడ్ శైలి బట్టబయలు చేస్తుంది!’– ఓ మూసకట్టు పదబంధాన్నే ఉపయోగించదలిస్తే, ‘ఈ మాటల్లో ఆవగింజంతైనా అతిశయోక్తి లేదూ’ అనొచ్చు. బాల్యం నుంచే, అరడజను సంగీతవాద్యాల్లో సుశిక్షితురాలైనందువల్లనే ఎల్ఫ్రైడ్ శైలి అంత శ్రావ్యతను ఆపాదించుకున్న దేమో! వియెన్నా సంగీత విశ్వవిద్యాలయం నుంచి –పిన్న వయసులోనే– ఆర్గనిస్టుగా పట్టా పొందారామె. ఆర్గన్తో పాటు పియానో, వయోలిన్, వయోలా, గిటార్, రికార్డర్ తదితర వాద్యాల్లో కూడా ఆమె ప్రవీణురాలు. పట్టా పొందిన కొద్ది రోజులకే, కుటుంబసంబంధాల కారణంగా ఎల్ఫ్రైడ్ తీవ్రమైన మానసిక ఆందోళన పాలబడ్డారు. చిత్తశాంతి కోసం తడుముకునే క్రమంలోనే ఆమె ఇరవయ్యేళ్ళ ప్రాయంలో కలంపట్టారు. మరుసటి సంవత్సరమే, తన తొలి కవితా సంకలనం ‘లిజా నీడ’తోనే ఎల్ఫ్రైడ్ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. నాటినుంచి నేటివరకూ, ఆమె సాహిత్యప్రస్థానం ఎదురులేకుండా సాగుతూనేవుంది.ఎల్ఫ్రైడ్ అంటే, చెక్ భాషలో ‘ప్రశాంతపాలిక’ అని అర్థమట! ఇక జెలెనిక్ అంటే, ‘జింకపిల్ల’ అని అర్థమట! బహుశా అందుకే కొందరు విమర్శకులు ఆమెని ‘ప్రశాంత హరిణం’ అనడం కద్దు. కానీ తొలి రచన మొదలుకొని నోబెల్ పురస్కారం అందుకున్న ఇరవయ్యేళ్ళకు –2024లో– రాసిన ఆత్మకథాత్మక నవల ‘వ్యక్తిగత వివరాలు’ వరకూ ఎక్కడా ఆమె ప్రశాంత హరిణంలా కనిపించదు. (ఈ రచనకు ప్రామాణిక ఇంగ్లిష్ అనువాదం ఇంతవరకూ వెలువడనే లేదు!) ‘అది ఓ కృతో, ఓ కీర్తనో కావచ్చు– లేదా, ఓ కథో కథానికో కావచ్చు అనునిత్యం ఓ కళాఖండం జీవం కోల్పోతూనే వుంటుంది. చరిత్రలో దాని చెలామణీ చెల్లిపోవడం వల్లనే అలా జరుగుతూ వుంటుంది. ఒకప్పుడు మరణమెరుగని కళాఖండాలుగా భావించిన రచనలే కాలక్రమంలో కనుమరుగైపోవచ్చు. వాటి గురించి భవిష్యత్ తరాలవారికి ఏమీ తెలియకుండానూ పోవచ్చు. అయినప్పటికీ, ప్రతి ఒక్క కళాఖండానికీ నాలుగు కాలాల పాటు బతికిబట్టకట్టే హక్కు ఉంది!’ అని ఎరికా కోహుట్తో అనిపిస్తారు ఎల్ఫ్రైడ్ ‘ద పియానో టీచర్’ నవలలో. (ఆ నవలకు ప్రధాన పాత్ర ఎరికాయే. 28 సంవత్సరాల తర్వాత మైకేల్ హానెక్ ఈ నవలను సినిమాగా తీశారు!) వియెన్నా సంగీత విశ్వవిద్యాలయంలో పియానో శిక్షణ విభాగంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకున్న ప్రొఫెసర్ ఎరికా. ఆమె అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న కళాకారిణి; మంచి శిక్షకురాలు కూడా! అయితే చండశాసనురాలి లాంటి తల్లి పెంపకంలో ఆమె ప్రతిభ రెక్కలు ముడుచుకుని బతుకీడుస్తూ వుంటుంది. వృత్తిజీవితం విషయానికివస్తే ఎరికా విద్యార్థులతో కటువుగా వ్యవహరించే శిక్షకురాలన్నట్లు రచయిత్రి చిత్రించారు. తన విద్యార్థులు అత్యున్నత ప్రమాణాలు సాధించాలనే ఆమె అలా ప్రవర్తిస్తూ వుంటుంది. వ్యక్తిగత జీవితంలో మాత్రం, తల్లి పెట్టే ఆరళ్ళ కారణంగా ఎరికా చిత్తక్షోభకు గురవుతూ వుంటుంది. ఈ వైరుధ్యాన్ని ఎరికా ఎలా పరిష్కరించుకున్నదనేదే ఈ నవల్లో కథాంశం. ప్రొఫెసర్ ఎరికాకూ, యువ విద్యార్థి వాల్టర్ క్లెమర్కూ మధ్య అల్లుకున్న అనుబంధం ఆసరాతోనే ఆమె తన జీవన వైరుధ్యం పరిష్కరించుకున్నట్లు రాశారు ఎల్ఫ్రైడ్.ఈ వైరుధ్యం ఎరికాకే పరిమితమైంది కాదు– ఎల్ఫ్రైడ్ జీవితంలోనూ ఆమె ఇలాంటి వైరుధ్యం ఎదుర్కొన్న విషయం రచయిత్రే వెల్లడించారు. ఎరికా పాత్రకు రక్తమాంసాలతో పాటు ఆత్మను సైతం సమకూర్చడానికి ఈ ‘ఆత్మానుభవం’ రచయిత్రికి ఎంతో తోడ్పడి వుంటుంది. పైపైన చూస్తే ఇది చవకబారు ‘శృంగార నవల’గా అనిపించవచ్చు. సాహిత్యం ఆలోచనామృతమనే వాస్తవాన్ని మనసులో పెట్టుకుని చూసేవారికే, ఎల్ఫ్రైడ్ జెలెనిక్ దృష్టికోణంలోని విశిష్టత కనిపిస్తుంది.- మందలపర్తి కిషోర్ -
దేనినీ అతి చేయవద్దు
‘ఈ రోజుల్లో పిల్లలను అన్ని విషయాల్లోనూ అదే పనిగా పట్టుకొని ఉండటం వల్ల వారి ఎదుగుదలలో సమస్యలు వస్తున్నాయి’ అంటున్నారు సినీ దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్. ‘‘అమ్మను భూమాతతో పోల్చుతాం. భూమి ఎక్కడా ఆగిపోకుండా, తిరుగుతూనే ఉంటుంది. కానీ, పిల్లలమైన మనల్ని పడిపోకుండా నిలబెడుతుంది. అమ్మ కూడా అంతే. పిల్లలు వారి జీవితంలో నిలదొక్కుకోవడానికి తిరుగుతూనే ఉండాలి. కానీ, అతిగా పట్టుకోకూడదనేది నా ఆలోచన.ఆ(హా)ర్ట్ ఫుల్‌గా!నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మా వారు నన్ను ఆర్ట్స్ నేర్చుకోమని ప్రోత్సహించారు. ఆ సమయంలోనే పెయింటింగ్, మ్యూజిక్, డ్యాన్స్ నేర్చుకున్నాను. ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ బుక్స్ చదివేదాన్ని. వేవిళ్లతో ఉన్నప్పుడు అవి నేర్చుకోవడం కష్టమనిపించేది. కానీ, తప్పేది కాదు. బాబు పుట్టాక వాడి కోసం మా ఆయన కేరింగ్ మరింత ఎక్కువయ్యింది. ‘ఇంత పొసెసివ్‌గా ఉండటం ఎందుకు?’ అనేదానిని. మా బంధువుల్లో కూడా చాలా మంది అంటుండేవారు. కానీ, ఆయన పట్టించుకునేవారు కాదు. నేను అది పొసెసివ్‌నెస్ అనుకున్నాను. అలాంటిది 6వ తరగతిలో ఉన్న బాబును స్టేట్ ఆర్ట్ కాంపిటీషన్‌కు మైసూరుకు ఒక్కణ్ణే పంపించారు. ఆ సమయంలో నేను భయపడ్డాను చిన్నపిల్లాడు కదా అని. కానీ, తను వినలేదు. తరుణ్ ఆ కాంపిటిషన్లో పాల్గొన్నాడు, ప్రైజ్ కూడా తీసుకొచ్చాడు. బాబు కోసం ఫుల్‌టైమ్ జాబ్ వద్దనుకున్నాను. దీనికి కూడా మావారే కారణం. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లినే ముందుగా వెతుక్కుంటారు. వారు ఒక దశకు వచ్చేవరకు తల్లితో ఉన్న అటాచ్మెంట్ దూరం అవకూడదు అనేవారు. దీంతో ఆర్ట్ టీచర్‌గా ఫుల్‌టైమ్ జాబ్ చేసే నేను పార్ట్ టైమ్‌కి షిఫ్ట్ అయ్యాను.ఈజీ ఫీలింగ్ వద్దుడబ్బులు పొదుపు, సంపాదన గురించి ఎప్పుడూ చెప్పలేదు. అలాగని, ఎప్పుడూ కండిషన్స్ పెట్టలేదు. ప్రతి తల్లీతండ్రీ సాధ్యమైనంత వరకు పిల్లల అవసరాలు తీర్చడానికే ప్రయత్నం చేస్తారు. మేం ఆర్థికంగా కష్టపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ, అవేవీ బాబుకు చెప్పలేదు. కానీ, నన్ను డబ్బులు అడిగితే మాత్రం నేరుగా ఇచ్చేదాన్ని కాదు. మావారికి డబ్బులు ఇచ్చి, ఆయననే ఇవ్వమనేదానిని. ‘అమ్మ సంపాదిస్తుంది. నేను అడిగితే ఈజీగా ఇచ్చేస్తుంది’ అనే ఫీలింగ్ బాబులో రాకూడదనుకున్నాను. డబ్బు గురించి కాదు ఆనందించే సందర్భాలు కోల్పోకూడదు అని తాపత్రయపడేదాన్ని. ఎందుకంటే మళ్లీ ఆ రోజులు, ఆ సందర్భాలు తిరిగి రావు.కథలా చెప్పాలినాకు ప్రతీదానితో కనెక్ట్ చేసి కథలు చెప్పడం అలవాటు. అలాగే సోలార్ ఎనర్జీతో మనకున్న బంధం, మన శరీరంలో ఉన్న అవయవాలతో బంధం ఎలా ఉంటుందో చెప్పేదాన్ని. నాన్న దేవాలయం, అమ్మ అందులో దేవత, బ్రదర్ పూజారి, ప్రసాదం అందరం కలిసి తినేది.. ఇలా ఒక కథలా చెబితే పిల్లలు ఆనందంగా వింటారు, ఆలోచిస్తారు. ఆ కుటుంబ బంధం కూడా బాగుంటుంది. పిల్లల ముందు బంధువుల్లో ఎవరి గురించీ చెడుగా చెప్పకూడదు.సరి చేయాలనుకోకూడదుపిల్లల మెదళ్లలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. పెయింటింగ్‌లో అయినా, ఏ సృజనాత్మక పనులు అయినా వారు చేసింది మనం సరిచేయవద్దు అనేది నా ఆలోచన. వారి మైండ్‌లో ఏముందో అది మన ముందు పెడతారు. దానిలో మనం కల్పించుకోవద్దు. మా అబ్బాయి ఎక్కడా పెయింటింగ్ నేర్చుకోలేదు. కానీ, పోర్ట్రయిట్స్ చాలా బాగా వేస్తాడు. తబలా వాయిస్తాడు. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌లో కాలేజీ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్‌లు వచ్చాయి. నేను ఆర్ట్ టీచర్ని. కానీ, ఏదీ బాబు చేయిపట్టి నేర్పలేదు. కాలేజీ రోజుల్లోనే షార్ట్ ఫిల్మ్‌లు ప్లాన్ చేస్తుండేవాడు. అందుకు వాడి స్నేహితులు కూడా ఇంటికి వచ్చేవారు. వారందరికీ కావల్సినవి అమర్చిపెట్టేదాన్ని. తరుణ్ స్నేహితులు నాకు కూడా పిల్లలైపోయారు. ఇప్పటికీ వారందరితో స్నేహబంధం బాగుంటుంది.ఏ కాలానికి ఆ కాలంలో పిల్లల పెంపకంలో వివక్ష ఉంది. ఒత్తిడి ఉంది. ‘ఎక్కడికి వెళ్లావు, ఏం చేస్తున్నావు, అదెందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు ఉన్నావు... ’ అంటూ పదే పదే అంటూనే ఉంటారు. అయితే, పిల్లలకు కూడా బాధ్యత తెలుసు. ఎలా ఉండాలో తెలుసు. మనం ఒక ఫ్రెండ్‌లా గైడ్ చేయాలి. అంతవరకే మన విధి. అంతకు మించి ఎక్కువ పట్టుకోకూడదు’’ అని తెలిపారు. ∙నిర్మలారెడ్డి -
పీఛే చల్! ఇలా నడిచి చూశారా?
వాకింగ్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. కానీ అదే వాకింగ్‌ను వెనక్కి చేస్తే డబుల్ ఆరోగ్యం లభిస్తుందంటే నమ్మగలరా? నిజమే! ఫిట్నెస్ ప్రపంచంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ – ‘రెట్రో వాకింగ్’ బాగా పాపులర్ అవుతోంది. నిపుణుల ప్రకారం, ఇది సాధారణ వాకింగ్ కంటే మరింత ప్రయోజనాలు ఇచ్చే వ్యాయామం. ఇలా వెనక్కి నడిస్తే మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ముందుకు నడిచేటప్పుడు ఎక్కువగా పని చేయని కాళ్ల కండరాలు కూడా వెనక్కి నడిచేటప్పుడు యాక్షన్‌లోకి దిగుతాయి. సాధారణ వేగంతో నడిచినా దాదాపు ‘నలభై శాతం ఎక్కువ క్యాలరీలు’ కరిగిపోతాయి. అంటే తక్కువ టైమ్‌లో ఎక్కువ పని చేసినట్టే! ఇంకా మెదడు సంగతి చెప్పాలంటే, వెనక్కి నడవడం కొత్త పని కాబట్టి అది ఫుల్ అలర్ట్‌లోకి వెళ్లి బ్యాలెన్స్, ఫోకస్, జ్ఞాపకశక్తి అన్నింటినీ మరింత పదును పెడుతుంది. కొందరికి వెన్నునొప్పి, కాళ్లు బిగపట్టడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఒక విషయం మాత్రం తప్పక గుర్తుంచుకోండి. మొదట రెండు నుంచి మూడు నిమిషాలు నెమ్మదిగా, ఖాళీ ప్రదేశంలో మాత్రమే ప్రయత్నించండి. లేదంటే వ్యాయామం కంటే ముందు యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది! ∙ -
ఈ వారం కథ: కొత్త రంగుల పొద్దు
‘‘ఆహా... జిల్లా అయిపోవడంకాదు గాని, ఏందసి పట్టింది ఈ ఏరియాకి! ఒకప్పుడు దెయ్యాలు తిరిగే సోటిది. నా సిన్నపుడు సేపలు పడ్డానికి కూడా ఇటైపు రావడానికే బయమేస్సీది..’’ నిర్మానుష్యంగా కంకరరోడ్లతో అక్కడక్కడా వేసిన కరెంటు స్తంభాల్ని, కట్టిన భవంతుల్ని చూస్తూ అన్నాడు మరియదాసు.‘‘ఎద్దెప్పుడు ఒకేపక్క తొంగోదు. ఊరెప్పుడూ ఒకేలాగ ఉండిపోదు సిన్నాన్న. ఆటో వచ్చీసింది. పద... పద... సామాన్లు దించిద్దుము.’’ దూరంగా నిల్చున్న ఇద్దరిలో ఒకడైన కృపారావు నడుస్తూ అన్నాడు. రంగులు వేయని భారీ మట్టివిగ్రహంలా బూడిద రంగులో వారివెనుకే అంతెత్తున కనిపిస్తోంది కొత్త ఇల్లు.ఆటోలో నుంచి బకెట్లు, బ్లేడ్లు, పుట్టిబస్తాలు, కేరేజీలు కిందకి దించి; లోపల వాటిని జాగ్రత్తగా భద్రపరచారు. విశాలమైన రూములు, కిచెన్, వెయిటింగ్ హాల్, ఔటర్ బాత్రూమ్, లావెట్రీలతో చుట్టూ కాంపౌండ్ వాల్‌తో ఇల్లు ముచ్చటగా వుంది. నడివేసవి. ఉదయం పదిగంటల సమయం. బహిరంగప్రదేశం అయినప్పటికీ వాతావరణంలో ఉక్కపోత. ముందు రూమ్‌లో ముగ్గురూ వరసలో నిలబడి అర్ధనిమీలిత నేత్రాలతో, భక్తిప్రపత్తులతో చేతులు జోడించి నోరు విప్పారు.‘‘ఆదియునూ అంతమునూ అయిన యేసయ్యా... లోకంలో సర్వశక్తిమంతుడైన ప్రభువా... మేము ఈరోజు నుంచి తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమగునటుల...’’ దైవప్రార్ధన ముగిసింది. ఒంటిమీద షర్టుల్ని, ఫాంటుల్ని విప్పి ఒక దగ్గర ఒబ్బిడిగా ఉంచి, షార్ట్‌లు, బనియన్లు వేసుకున్నారు.పెద్దబ్లేడ్లతో గోడల్ని గీకే పనిని కృపారావు, ఎర్రయ్య మొదలుపెట్టారు. బకెట్లో మెషిన్ ఆన్ చేసి పుట్టి పౌడర్‌ను నీటితో కలియబెట్టే పనిలో పడ్డాడు దాసు.‘‘సిన్నాన్న... మనలో మన మాట. ఇల్లు సూస్తే పెద్దది. పని చేస్తే ఎక్కువే. ఓనరు ఇచ్చిన లచ్చాఏభైవేల వర్కులో మన కూల్లు పోగా మనకేటైనా మిగుల్తాదా?’’ తొలి ప్రశ్న వేసేడు పాతికేళ్ల కృపారావు.‘‘నీకా డవుటేల? అందిన కూల్లే మనకు గట్టి.’’ బ్లేడ్లకు సర్దిన పుట్టిముద్దను గోడకు రాస్తూ అన్నాడు దాసు.‘‘మరి ఇంతోటి పనిని కాంట్రక్టుకి సెయ్యడమేల?’’‘‘సెయ్యక ఏటి సేస్తామురా? మనుషులెట్టి, లచ్చలకు లచ్చలు మదుపులెట్టి కాంట్రాక్టు పనులు సేస్తూ బొక్లీసుగా తిరగడానికి మనకాడ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులున్నాయేటి? కూలాడితేనే గదా కుండాడతాది...’’‘‘అవునులే సిన్నన్నా.’’‘‘అందికే అన్నీ మూసుకొని మన పని మనం కామ్‌గా సేసుకోవాల. ఇలాంటి పనులు సెయ్యమని నిగడదీసి తొంగుంటే నష్టం మనకే, ఆలకి కాదు. కూడు జల్లితే కాకులు కరువా! ఇరవైరోజుల్లోన ఈ వర్క్ అయిపోవాలట. అద్దమైందా...’’ దాసు మాటకి బుద్ధిగా తలూపేడు కృపారావు‘‘షాపు ఓనర్ల పనే బాగుందన్నా. ఒక పక్క ఏపారాలు, మరోపక్క లాభాలు...’’ నవ్వాడు ఎర్రయ్య.‘‘షాపు ఓనరుకి మనతోన అగ్రిమెంట్ లక్షాఏభై. ఇంటి ఓనరుతో ఎంతకి వప్పన్నమో మనకి తెలీదు. అయినా అతనెంత తింటే మనకెందుకు? మన పని మనం సూస్కోవాలి గానీ...’’మొదటి రూమ్ పుట్టిపని పూర్తయ్యింది. రెండో రూమ్ కోసం సిద్ధమవుతున్నాడు దాసు.ఇంతలో టీలు వచ్చాయి. ముగ్గురూ టీలు తాగి విశ్రాంతిగా కూర్చున్నారు. నోట్లో ఒంపుకున్న ఖైనీలు పళ్లకింద నలుగుతున్నాయి.మధ్యాహ్నం రెండింటికి అన్నాలు తిని పని ముగించేసరికి చీకటి పడింది. ఇరవైయ్యో రోజున ఇంటి ఓనరు వచ్చాడు. మార్పు చేర్పులేవో చెప్పాడు. దానికో రోజు పట్టింది. తర్వాత రోజు సాయంత్రం.., గంగరాజు షాపు దగ్గరికి ముగ్గురూ చేరేరు. అంతవరకూ ఇచ్చిన మెటీరియల్ మొదలుకొని ఆటోచార్జీలు, నిచ్చెనల అద్దె వరకూ అయిన ఖర్చులన్నీ లెక్కలేసి చివరకు లక్షాఏభై మూడువేలుకు బిల్లు తేల్చాడు షాపు ఓనరు. అదనంగా తనకు మూడు వేలు ఖర్చయ్యిందని కనుక చివరిరోజు కూలీ రాదని దాసుతో చావుకబురు చివరికి చల్లగా చెప్పాడు. అవాక్కయ్యాడు దాసు. కృపారావుకి ఒళ్ళు మండింది.‘‘ఇదన్నేయం... కూలీ ఇవ్వననడం మీకు దరమ్ము కాదు.’’ బతిమాలుతున్న ధోరణిలో ఆక్రోశించాడు దాసు. పక్కనున్న గొడౌన్‌లోకి వెళ్లేందుకుగాను కిందకు దిగిన గంగరాజు సన్నగా నవ్వి అన్నాడు..‘‘చివరిరోజు కూలీ నీక్కావాలి. మంచిదే. కాదనను. కానీ అనుకున్న దానికంటే మూడు వేలు ఎక్కువయ్యింది. మరి దాని మాటేటి? ఇరవై రోజుల్లో పనవ్వాలని కండిషను. అయ్యిందేటి? ముందే కంప్లీట్ చేసేస్తే కాదంటానా? మిగిల్తే తీసుకోవడానికి రడీగా ఉన్నప్పుడు తగిలినప్పుడు కూడా భరించాలోయ్.రోజంతా పన్చేసి వట్టిసేతుల్తో ఇంటికి తిరిగి ఎలాగెల్లమంటారు సర్..’’ అన్నాడు కృపారావు.‘‘సరే. మీ కూలీ మీకిచ్చేస్తాను. కానీ నాకో పని చెయ్యాలి.’’‘‘ఏటి సార్ అది?’’‘‘పుట్టిబస్తాలు, రంగుడబ్బాల లోడు రేపొస్తది. మనషాపు ముందే వేను ఆపుతాడు. మీ ముగ్గురూ ఉదయం ఏడింటికల్లా వచ్చి పెరిగీయండి. చాలు... ఎంత... రెండు గంటల పని. మీ డబ్బులు మీకిచ్చేస్తాను. ఇంకో పనికి కూడా మీరు వెళ్లిపోవచ్చు.’’ తను చెప్పాల్సింది చెప్పి గోడౌన్‌లోకి దూరిపోయాడు ఓనరు.ముఖాలు వేలాడేసుకొని ముగ్గురూ ఇళ్లకు తిరిగొచ్చేశారు. నీళ్లలో ఉడుకుతోన్న గవ్వసున్నం మాదిరిగా దారిపొడవునా కృపారావు కుతకుతలాడుతూనే ఉన్నాడు. జేవురించిన ముఖంతో ముద్దగా ఉండిపోయాడు దాసు.రాత్రి పదకొండయ్యింది. కృపారావుకి చాలాసేపు నిద్ర పట్టలేదు. చివాల్న లేచి బయటకి వచ్చాడు. ఆరుబయట వేసుకున్న మంచాలపై పగలంతా పడ్డ కష్టాన్ని మరిచి మత్తుగా నిద్రపోతోంది ఇందిరా కాలనీ. ఎక్కడో వీధికుక్కొకటి అరుస్తూ ఉంది. ఎదురింట్లోకి వెళ్లి నిద్రపోతున్న దాసుని తట్టి లేపాడు.కృపారావుని అలా చూసేసరికి దాసుకి నిద్రమత్తంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది.‘‘ఎక్కడా సూడనేదు ఇంత అన్నేయం... అన్ని కర్సులు మన మీద పడీసి అనవసర కండీషన్లు పెట్టీసి, సివరికి ఒకపూట కూలీ ఎగ్గొట్టీసి మల్లీ రేపు పనికొస్తే డబ్బులు ఇస్తానంటాడా... ఏటి ఆడికంత సోస. మనకేటి సేతకాదన... సెయ్యలేమన... అసలు తప్పు ఆడిది కాదు, నీది. ఎంటనే కాలరు పట్టుకొని నలుగుర్లో కడిగీసి ఉంటే దెబ్బకి అటో ఇటో తేలిపోను. ఇప్పుడు సూడు... సచ్చినట్టుగా ఎల్లాలి.’’పిచ్చెక్కినవాడిలా అరిచాడు కృపారావు. గ్లాసుతో అతనికి నీళ్లిచ్చి, తాగమని చెప్పి తాపీగా బీడీ వెలిగించి గట్టిగా దమ్ము లాగాడు దాసు.‘‘ఒరేయి ఎర్రినాయాల... నువ్వీ మజ్జిన వచ్చినావు. నీకివి కొత్త. నువ్వే కాదు, నేను కూడా నీకంటే గట్టిగా అరవగల్ను. దానివలన లాభమేటి? అక్కడితో కట్... ఇంకో పనికి మనల్ని పిలరు. పిలనియ్యరు. బ్లాక్ లిస్ట్ అంటారే, అలాగ... ఓనర్లంతా ఇక్కడ సిండికేటురా నాయన.’’ అన్నాడు దాసు.‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము?’’‘‘పలాన ఇన్ని రోజులని ఇంకనుకోలేదురా. అనుకున్న ఎంటనే చెప్తాన్లే..’’ పకాలున నవ్వాడు దాసు.‘‘ఇదిగో... అలాటి కుయ్యోత్తులాడితేనే నాకు సిరాకు..’’‘‘లేకపోతే యేట్రా? పెశ్నించడం సులువే... జవాబు సెప్పడమే కష్టం. అందులోని నువ్వడిగిన పెశ్నకు జవాబు తెలిస్తే మనమెందుకిలాగ ఉంటాము. మన బతుకులెందుకిలాగుంటాయి.?’’ నిదానంగా అన్నాడు దాసు.‘‘మా గొప్పగా సెలవిచ్చెవులే... నిన్నడగడం నాదే బుద్ది తక్కువ.’’ చిరాగ్గా వెళ్ళిపోయాడు కృపారావు.మంచంపై పడుకున్నాడేగానీ దాసుకి కూడా ఎంతకూ నిద్ర పట్టడం లేదు. అటూ ఇటూ దొర్లుతున్నాడు.‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము?’’తన యవ్వనారంభ దశలో తండ్రికి వేసిన అదే ప్రశ్న. ఈసారి కృపారావు నుంచి మరోసారి... నిద్ర రానివ్వని ప్రశ్న.. జవాబు దొరకని ప్రశ్న... మనసులో సుళ్ళు తిరుగుతూ... సుమారు పాతికేళ్ల నాటి పరిస్థితి. పేరుకే ఆ ఊరు మున్సిపాలిటీ. పల్లె కంటే కొంచెం ఎక్కువగానూ పట్నం కంటే చాలా తక్కువగానూ ఉంటుందా ఊరు. ఊరి చివరన ప్రధాన రహదారికి ఒక పక్కన చాకలి వీధి, గొడగలవీధి, మొండివీధి, దిగువ రాజ్యం... ఇలా అనేక వీధుల సముదాయంలో ఇందిరాకాలనీ ఇంకొంచెం ముందుంటుంది. ముందుగా ఎండియ్య టీకొట్టు,దానిపక్కనే కొత్తపట్నం షావుకారి కిరాణా దుకాణం, ఇంకొంచెం దూరంలో పొంగడాలు, బూరెలు, దుంపలు అమ్మే నీలవేణి బడ్డీ, అంతా కలిపి వంద గడపతో కనిపిస్తుంది. కంపు గొడుతూ పందులు తాగే కుడితి తొట్టెలు అన్ని చోట్లా... ప్రభుత్వ రుణాలతో అగ్గిపెట్టెల్లా లేచిన స్లాబ్ ఇళ్ళు కొన్ని చోట్ల కనిపిస్తాయి.‘‘నాలుగైపోతంది... మాట గాసేస్తానేటో... దాసుగాడేడి?’’చివికిన రెల్లుగడ్డితో పొగచూరిన పైకప్పును చూస్తూ మట్టి అరుగుపై ఉన్న బొంతపై అటూ ఇటూ దొర్లుతున్న ఆదెయ్య, నర్సమ్మను అలా అడగడం నాలుగోసారి.‘‘అడివి నుంచి ఇప్పుడే వొచ్చినాను గదా. నాకేటి తెల్సు?’’రెండురూపాయలిచ్చి ఎండియ్య టీకొట్టు నుంచి దోసకాయచెంబు నిండా టీ తీసుకువచ్చిన నరసమ్మ అంది. రెండు గ్లాసుల నిండా సర్ది భర్తకొకటి ఇచ్చి తనొకటి తీసుకొని తాగడం మొదలుపెట్టిందామె.పొద్దున్ననగా గంజన్నం, పిండొడెంతో కారేజీ సర్దుకొని, దగ్గర్లో ఉన్న అడవికి వెళ్తుందామె. మారేడు, ఉసిరిక పత్రీ, బంగాళాకుల్ని తెంపి, పెద్ద గోనె సంచిలోకి మూటకట్టి ఇంటికి తీసుకువస్తుంది. పత్రిని చిన్న కట్టలుగా కట్టి రోజూ గుడికి వెళ్లే శ్రీమంతుల ఇళ్లకూ, బంగాళాకుల్ని పెద్ద కట్టలుగా కట్టి హోటళ్లకూ, కిరాణా షాపులకు సరఫరా చేస్తూ నెలకింతని సంపాదిస్తుందామె. అందుకని ఆమెకు ఆకుల నర్సమ్మ అని మరోపేరు. ‘‘అదిగో... మాటల్లోనే వస్తన్నాడు బాబు.’’ తువ్వాలు మూటను చేత్తో పట్టుకుని వస్తోన్న దాసుని చూసి అంది నరసమ్మ. గడపలోకి రాగానే మూటను విప్పి దాసు గచ్చు మీద విదిల్చాడు.‘‘ఎక్కడ పట్టేర్రా ఇవి.?’’ కిందామీదా పడుతూ కొట్టుకుంటోన్న మిట్టల్‌ని చూస్తూ అంది నరసమ్మ.‘‘పెట్రోలుబంకు ఎనకాతల మళ్లల్లో గుమ్ములు నేవా... అక్కడ. నానూ, పిట్టడు, సొట్టరాజుగాడు ముగ్గురము కలిసి పట్టేము.’’ అన్నాడు దాసు.సంబరంగా తపేలాలో వాటిని సర్ది లోపలకు వెళ్ళిపోయిందామె.‘‘దాసు... టైము నాలుగైంది. పిల్లల్ని తీసుకురాడానికి ఎల్లవేటి?’’ అన్నాడు ఆదెయ్య.‘‘ఆ... ఇదిగిదిగో... ఎల్తన్నాను.’’ఇంటి పక్కనున్న రిక్షాను రోడ్ మీదకు ఎక్కించి రయ్‌మని తొక్కుకుంటూ వెళ్లిపోయాడు దాసు.మూడిళ్లల్లోని పిల్లల్ని రోజూ స్కూలుకు రిక్షామీద తిప్పే ఆదెయ్యకు గత వారం నుంచి బాగోలేదు.అందుకని డాక్టర్ సలహా మేరకు కొడుక్కి ఆ పనిని ఒప్పజెప్పాడు ఆదెయ్య. కొడుకు తెచ్చిన చేపలకి తోడు నెయ్యిల సీతమ్మ దగ్గర పదిరూపాయిలకు పిత్తపరిగెల వాటాను తీసుకుంది నరసమ్మ. పరిగెల్ని పులుసుగానూ, మిట్టల్‌ని ఇగురుగానూ వండింది. భార్యచేత తిట్లు తినడం ఇష్టంలేని ఆదెయ్య మందెయ్యకుండానే తొలిసారి నీసుకూరతో ఆ రాత్రికి భోజనం కానిచ్చాడు.దాసుకి ఆటలంటే ఇష్టం. ఇంటరు పోవడానికి అతని ఆటలే సగం కారణం. పగలంతా పక్కనున్న రామయ్యబందలో రోజూ మిత్రులతో కలిసి వాలీబాల్ ఆడతాడు. శుక్రవారం రాత్రయితే చాలు ఉత్సాహంగా రోడ్లపై తిరుగుతాడు. షాపులు కట్టే వేళల్లో దిష్టికని వాటిముందు కొట్టే కొబ్బరి చిప్పల్ని వరసగా ఏరతాడు. కొత్తపట్నం షావుకారి దగ్గర కొన్న పది రూపాయల పంచదార పొట్లాన్నీ, తన వాటాగా వచ్చిన కొబ్బరిచిప్పల్నీ తల్లికిస్తాడు. వాటితో కొబ్బరి చక్కీల్ని పొయ్యడమో, ఒక్కోసారి అంబలితో కారంగా నంజుకునే కొబ్బరిపచ్చడి చెయ్యడమో చేసేదామె. రోజులో రెండు తడవలు పిల్లల్ని స్కూల్లో దింపాక బయట బేరాలకని నెయ్యిల వీధి సెంటర్లో రిక్షాను ఉంచుతాడు ఆదెయ్య. పాసెంజర్లకు మొదట బేరమెంతో చెప్పి ఆనక వాళ్ళెంత ఇస్తే అంత అందుకుని ‘సాలదు బాబూ’ అని గొణుక్కుంటూ వెళ్లిపోవడం అతనికలవాటు. అందుచేత అతని వ్యవహారం చూసి అసలుబేరం కంటే తక్కువ ఇచ్చేవాళ్లే ఎక్కువ. ఆదివారంనాడు శుభ్రంగా తయారై బైబిల్ చేత పట్టుకొని కుటుంబంతో సహా చర్చికి వెళ్లి దైవవాక్యం వినడం అతనికిష్టం.అదేరోజు సాయంత్రం కలిగినవారి కుటుంబాల్ని సినిమా థియేటర్లకు దిగబెట్టి వాళ్ళెంత ఇస్తే అంత తీసుకొని తిరిగొచ్చేయడం అతని బలహీనత. ఇక్కడే దాసుకీ, ఆదెయ్యకి నప్పేది కాదు. శ్రమకి తగిన డబ్బుని అడగడంలో తప్పేముందని తండ్రిని ప్రశ్నించేవాడు. గొడవ పడేవాడు.‘‘అలాగడిగిన మనిషికి ఇలువుండదురా. ఆలంతా పెద్దోలు. అవకాశాలున్నోలు. మనం ఆమాత్రం మురాబు వుంచుకుంటే ఎవరైన సాయపడరేటి..?’’ అనేవాడు తండ్రి.‘‘అది నీ బ్రెమ... ఎవరైనా ఎందుకు చేస్తారు?’’‘‘అలగనీకరా... ఏమో... ఎవరితో ఏ అవసరముంతాదో!’’‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము? ’’జవాబు చెప్పలేక మౌనంగా ఉండే ఆదెయ్యను మరిక రెట్టించేవాడు కాదు దాసు. కాని ఆ ప్రశ్నమాత్రం అతనిలో బలంగా పాతుకుపోయింది. కొన్నాళ్లకి తల్లిదండ్రులు గతించడంతో గానుగెద్దులా కష్టపడటమే తప్ప అతనికి మరొకటి తెలియకుండా పోయింది.కాలక్రమేణా టౌన్ రూపురేఖలతోపాటు, వీధి రూపురేఖలు కూడా మారిపోయాయి. రిక్షాలు మాయమై ఆటోలు, తోపుడు బళ్ళు ప్రవేశించాయి. రిక్షా కార్మికులు, సిమెంట్, ఐరన్ షాపుల్లో కళాసీలుగానూ, తాపీ మేస్త్రీలుగానూ, కాయగూరలు అమ్మే చిల్లర వర్తకులుగాను మారేరు. పది పాసైన కుర్రాళ్లంతా ఆర్మీలోకి వెళ్ళిపోతే, పోయిన వాళ్లంతా నగరాల్లో సెక్యూరిటీ గార్డులయ్యారు. కొద్దిమంది మాత్రమే ఉద్యోగస్తులయ్యేరు. ఎటూ వెళ్లలేని దాసులాంటి వారు పెయింటర్లయ్యారు. కానీ అతనితో పాటు అతనిలో ఏళ్ల తరబడి అంటుకట్టుకొని పోయిన ఒకప్పటి అతనిప్రశ్న మాత్రం సలపరించే గాయమై బాధిస్తూనే ఉంది. కొన్ని తరాల నుంచి తమ కుటుంబం సమాజం పట్ల ప్రదర్శించిన విధేయత, మంచితనం వలన ఒరిగిందేంటి? తండ్రి ఆశించిన మేలేదైనా జరిగిందా? లేదే! అలాంటప్పుడు ఎందుకీ అనవసరపు తాపత్రయం. స్వతంత్రంగా బతకలేమా... సగౌరవంగా బతికి చూపించలేమా... సగం రాత్రి వరకు దాసులో సాగిన ఆలోచనలెన్నో! మూత్రం పోయడానికని బయటకు వచ్చి, ఆ పని కానిచ్చి యథాలాపంగా బయట నిల్చున్నాడు దాసు. నిర్మానుష్యంగా... నిశ్శబ్దంగా ఉన్న రోడ్డుపై ఒక చేత్తో వెలుగు దారి చూపిస్తూ, మరొక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని నిల్చుని ఉన్న నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం వీధి లైటు వెలుతురులో దూరంగా, మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. వెలుగు రేఖలేవో ప్రసరించినట్టయ్యింది.‘లోడు దించడానికి ఉదయాన్నే గభీల్న ఎల్లాల... ఏటయితే అదవ్వనీ... తర్వాత సూద్దుము.’ మంచంపై పడుకుంటూ మనసులో అనుకున్నాడు దాసు. తెల్లవారి మూడు దాటాక అతనికి మాగన్నుగా నిద్ర పట్టింది.∙∙ తర్వాత రోజు ఉదయం పదిగంటలకు షాపు తెరవడానికి వచ్చిన గంగరాజు అక్కడి దృశ్యం చూసి కోపోద్రిక్తుడయ్యాడు. పట్టరాని ఆవేశంతో సెల్ తీసి దాసుకి ఫోన్ చేశాడు. నిమిషాల్లో ఎర్రయ్య, కృపారావులతో పాటు మరికొంతమందిని వెంటబెట్టుకొని వచ్చాడు దాసు..‘‘దాసూ... నేను చెయ్యమన్నదేంటి... నువ్వు చేసిందేంటి? ‘‘షాపుముందు వరసగా పేర్చి ఉన్న పుట్టి బ్యాగుల్ని, రంగు డబ్బాల్ని చూస్తూ అన్నాడు గంగరాజు.‘‘మీరు సెప్పిందే గదేటి... ఇంకేటి సేశాను?.’’ అన్నాడు దాసు.‘‘ఏం చెప్పాను..?’’‘‘లోడుని పెరిగీమన్నారు... పెరిగీసాం గదా..’’‘‘పెరిగీడమంటే గౌడౌన్ లోపలకి పెట్టాలని తెలీదా?’’ విరుచుకుపడ్డాడు గంగరాజు.‘‘ఆ మాట నిన్న మీరనలేదు గదా.’’‘‘అలాగని రోడ్ మీద దించేస్తారా ..’’‘‘టైమెక్కడిది సారూ? మీరే గదా రెండు గంటల్లో దించేసి ఇంకో పనికి ఎళ్లిపొమ్మన్నారు?’’‘‘ఏటివోయ్ దాసు... కొత్తగా మాట్లాడుతున్నావు. ఏటి సంగతి...’’‘‘మేమేటి కొత్తగా అనడంలేదు. మీరన్నదే... మా కూల్లు మాకిచ్చేస్తే మేమింకో పనికి ఎళ్ళిపోతాం.’’‘‘గోడౌన్ తాళాల కోసం ఇంటికి రాకపోతే లోడు రాలేదేటోననుకున్నాను. ఇలాంటి మడతపేచీ ఉందనుకోలేదు. సరే, తగువెందుకులే గానీ ముందు లోపలకి సామాన్లు పెరిగీయండి. డబ్బులిచ్చేస్తాను.’’ కొంచెం మెత్తబడి అన్నాడు గంగరాజు.‘‘కుదరదు.’’‘‘ఏం... ఎందుకని? ‘‘‘‘నిన్నటిది ఇయ్యాల్టిది... కలిపి రెండు రోజులు కూలవుద్ది... పెరిగీమంటారా?’’‘‘కూలీ ఒక్కరోజుదే కదా... రెండు రోజులేటి?’’‘‘అదంతే... ఇష్టం నేకపోతే సెప్పండి. లోడు ఇక్కడే ఇక్కడే వుంటాది... మా దారిన మేము పోతాము. ఎవులుతో పెరిగిస్తావో చూస్తాము. అంతేకాదు ముందు డబ్బిస్తేనే పని. నేదంటే నేదు...’’ఆ మాటకి గంగరాజు కోపం నషాళానికి అంటింది. అయినా తమాయించుకున్నాడు. చేసేదేంలేక నాలుగువేల ఎనిమిది వందల రూపాయలు జేబులోనుంచి చిరాగ్గా తీసి దాసుకి అందించాడు. లోడు గోడౌన్‌లోకి చేరింది. ఊపిరి పీల్చుకున్నాడు గంగరాజు. జేబులోనుంచి పన్నెండు వందలు తీసి అతని చేతిలో పెట్టాడు దాసు. ప్రశ్నార్థకంగా చూశాడతను.‘‘నిన్నటిది పూర్తి కూలీ. ఈ రోజుది సగం కూలీ. పోను మిగతాది ఈ డబ్బు... మీరే దాసుకోండి. కోట్లు గడించీయండి. మాకేటి ఎంగిలి కూడు అక్కర్లేదు మీలాగ...’’అన్నాడు దాసు. చేతిలో నలిగిన నోట్లనీ... నిశ్చలంగా ఉన్న దాసు ముఖాన్నీ చూస్తూ ఏదో మాట్లాడబోయాడు గంగరాజు. కానీ దాసు అవేవీ వినిపించుకోలేదు. నింగికెగసిన పక్షుల గుంపులో తానొక పక్షిలా స్వేఛ్ఛగా తనవారితో కలిసి వడివడిగా రోడ్డు దాటి వెళ్ళిపోయాడు.- పాలకొల్లు రామలింగస్వామి -
ఆరోగ్యవంతమైన సోడా..!
రంగు రంగుల చల్లని సోడా పానీయాలకు వేసవిలో గిరాకీ విపరీతంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం అని డాక్టర్లు చెబుతుంటారు. కృత్రిమ రంగులు, మితిమీరిన మోతాదులో చక్కెర కలిపి తయారుచేసే సోడా పానీయాలు ఆరోగ్యానికి హానికరమే అనడంలో ఎలాంటి సందేహాం లేదు. అయితే, జపాన్‌లో దొరికే ఈ సోడా పానీయం మాత్రం చాలా ఆరోగ్యకరమైనది. ఎందుకంటే, ఇది మజ్జిగతో తయారు చేసే సోడా.‘కాల్పికో సోడా’ పేరుతో 1919 నుంచి ఇది జపాన్‌లో అమ్ముడవుతోంది. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఇందులోనూ చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇది పొట్టకు మేలు చేస్తుంది. ఇందులో ఎలాంటి హానికర రసాయనాలు, కృత్రిమ రంగులు ఉండవు. ఒకరకంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన సోడా పానీయం అని చెప్పవచ్చు. (చదవండి: ఈ ఐస్‌క్రీమ్... చాలా హాట్ గురూ!) -
కథాకళి: ఓ వర్షం రాత్రి
జిగ్నేష్‌కి అతని క్లాస్మేట్ కావ్యమణి ఐదేళ్ళ తర్వాత అకస్మాత్తుగా మెట్రోలో తారసపడింది. ఇద్దరూ ఒకే స్టేషన్ లో దిగాక జిగ్నేష్ ఆమెని ఎదురుగా ఉన్న కాఫీ షాప్‌కి ఆహ్వానించాడు. మోమోస్ తిని, కాఫీ తాగుతూ ఒకరి గురించి మరొకరు చెప్పుకున్నారు. కావ్యమణికి పెళ్ళై విడాకులు కూడా అయ్యాయని తెలిశాక అతను ఆహ్వానించాడు.‘‘మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఈ రాత్రికి మా ఇంటికి రారాదు? నువ్వు వర్కింగ్ ఉమెన్ ్స హాస్టల్లో ఉంటున్నావు కాబట్టి ఎవరి అనుమతి అవసరం లేదు.’’‘‘ఆలోచిస్తాను. ఇందుకు మెంటల్‌గా నేను ప్రిపేర్ అవడానికి కొంత సమయం పడుతుంది. సాయంత్రం ఐదు తర్వాత ఫోన్ చేస్తాను.’’ కావ్యమణి జవాబు చెప్పింది. ‘‘నేను వంట కూడా బాగా చేస్తాను.’’ జిగ్నేష్ ‘వంట’ పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పాడు. ఆరున్నర దాకా అతను ఆమె ఫోన్ చేస్తుందా, లేదా అనే ఆదుర్దాకి గురయ్యాడు. ఆరు ముప్ఫై ఐదుకి కావ్యమణి నుంచి ఫోన్ వచ్చింది. ‘‘మీ ఇంటికి ఎలా రావాలో లొకేషన్ పంపు. నేను ఎనిమిదిన్నరకి రావచ్చా?’’‘‘ష్యూర్ అండ్ థాంక్స్.’’ విప్పారిన మొహంతో చెప్పాడు.అతను ఎనిమిదింటికి బియ్యం నానపెట్టాడు. ఫ్రిజ్ తెరచి కూరగాయలు తరిగి సిద్ధం చేశాడు. ఎనిమిదింపావుకి ఆకాశంలో మబ్బులు కనిపించాయి. మెరుపులని చూసి వర్షం వస్తుందని అనిపించాక కావ్యమణి రావటం విరమించుకుంటుందా అని భయపడ్డాడు.వంటపనిలో ఉండగా డోర్ బెల్ మోగితే తలుపు తెరిచాడు. మంచి పెర్ఫ్యూమ్ వాసన. కావ్యమణి వచ్చింది. ఆమె తన హెల్మెట్‌ని సోఫా మీద ఉంచి అడిగింది.‘‘నా స్కూటీని కార్ పార్క్‌లో నీ కారు వెనక పార్క్ చేశాను. ఓకే కదా?’’‘‘ఓకే.’’ఆమె ఫ్రెంచ్ డోర్‌ని తెరిచి బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలోకి కొద్ది క్షణాలు చూసి మళ్ళీ లోపలకి వచ్చి అడిగింది.‘‘స్నాక్స్ ఏమైనా ఉన్నాయా? ఆకలిగా ఉంది.’’‘‘కూర్చో. నాలుగైదు నిమిషాల్లో బర్గర్ చేస్తాను.’’అతను బర్గర్ పేటీని డీప్ఫ్రీజర్లోంచి తీసి, రెండువైపులా నెయ్యి స్ప్రే చేసి, ఏర్ ఫ్రైయర్లో ఉంచి, మూడు నిమిషాల తర్వాత వెనక్కి తిప్పాడు. ఈలోగా టొమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర కోసి, బర్గర్ బన్ మధ్యకి కోసి పెనం మీద కాల్చాడు. బర్గర్లో అన్నిటినీ పెట్టేముందు టొమాటో, మస్టర్డ్, చిల్లీ సాస్‌లు వేశాడు.‘‘బావుంది. బావుంది కాదు. ఎక్సలెంట్.’’ చెప్పి ఆమె జీరో కోక్ తాగింది.జిగ్నేష్ భార్య పుట్టింటికి కానుపుకి వెళ్ళి నాలుగు నెలలైంది. అతనికి అప్పటి నించి స్త్రీ సంపర్కం లేదు. తొందరగా ఉంది.‘‘వాతావరణం బావుంది కదా?’’ బాల్కనీలోంచి ఫ్రెంచ్ డోర్ ద్వారా చల్లటి గాలి వీస్తూండటంతో అడిగాడు.‘‘అవును. మనకి చక్కటి మూడ్ ఇచ్చే వాతావరణం.’’ కావ్యమణి చెప్పింది.ఆమెకి తన భార్య నైటీ ఇచ్చాడు. అతని ఎదురుగానే దాన్ని మార్చుకుంది. ఆమెని కౌగిలించుకుని చుంబించబోయాడు. అకస్మాత్తుగా ఫ్రెంచ్ డోర్ లోంచి తూనీగలు, రెక్కల పురుగులు, వందల సంఖ్యలో లోపలికి రాసాగాయి. అతను ఆమెని వదిలి ఫ్రెంచ్ డోర్ మూయబోయాడు.‘‘ఒద్దు.’’ కావ్యమణి అతన్ని ఆపి చెప్పింది.‘‘ఒద్దేమిటి? దీపం పురుగులు.’’ ఆశ్చర్యంగా చెప్పాడు.కావ్యమణి నేలరాలిన ఓ పురుగుని తీసి పరిశీలించి చూసి ఆనందంగా చెప్పింది.‘‘ఉసుళ్ళు.’’‘‘ఉసుళ్ళా?’’‘‘అవును. వీటిని ఉసుళ్ళు అంటాం. మీ ఇంటి దగ్గరలో చెదల పుట్టలు ఉండి ఉండాలి. వాటికి ఎండాకాలం వానకి రెక్కలు వచ్చి, మూకుమ్మడిగా పుట్టలోంచి బయటికి వస్తాయని, వీటి ఆయుష్షు నాలుగైదు గంటలు మాత్రమేనని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది. ఇవి ప్రొటీన్ ఫుడ్ అని తెలుసా? వీటిని వేయించుకుని తింటాం. చాలా రుచిగా ఉంటాయి. చాలా కాలానికి భలే దొరికాయి.’’కావ్యమణి ఓ బేసిన్ లో నేలరాలిన ఉసుళ్ళని ఏరి, వాటి ట్రాన్స్పరెంట్ రెక్కలను తుంచి, పురుగులను బేసిన్ లో వేయడాన్ని జిగ్నేష్ అసహ్యంగా చూశాడు. ఆమె ఆ పనిని అరగంటకి పైగా పూర్తి చేశాక స్టవ్ వెలిగించి, ఆ పురుగులను నూనెలో వేయించి ఉప్పు కారం కలిపి రెండు ప్లేట్లలో పెట్టి తెచ్చింది.‘‘తిను. చాలా టేస్టీ.’’‘‘నో. థేంక్స్. నువ్వే తిను.’’ఆమె వాటిని తింటూంటే చెప్పాడు.‘‘నేను బయటికి వెళ్ళొస్తాను.’’అతను ఆ రాత్రి తిరిగి రాలేదు. మర్నాడు ఉదయం అతను వచ్చేసరికి కావ్యమణి ఆఫీస్‌కి వెళ్ళడానికి సిద్ధమై, అతని కోసం ఎదురుచూస్తోంది.‘‘రాత్రి నువ్వు రానని టెక్స్ట్ మెసేజ్ ఇచ్చావు. ఏమైంది?’’ అడిగింది.‘‘అర్జంట్‌గా ఆఫీస్ పని చేయాల్సివచ్చింది.’’ఆమె వెళ్ళాక అతను బేసిన్ ను, బాణలిని చెత్త డబ్బాలో పడేసి, ఆఫీస్‌కి వెళ్ళడానికి సిద్ధమవుతూ అనుకున్నాడు.‘ఇంకా నయం. త్వరపడి కావ్యమణి పెదాలని ముద్దు పెట్టుకోలేదు’ ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
మెల్లగా కరిగే నైస్..ఐస్
నిశ్శబ్దంగా గ్లాసు అంచున చేరి, చల్లని స్పర్శతో పరిచయం అవుతుంది. ఆయుష్షు రెండు నిమిషాలే అయినా, వచ్చిన క్షణం నుంచే చిరునవ్వులు కురిపిస్తుంది. ఉన్నంత సేపూ ‘చిల్’ చేస్తూ, రోజంతటి అలసటను కరిగించేస్తుంది.మాయమైయ్యే ఆఖరి క్షణం కూడా మనసు నిండా ప్రశాంతతను నింపి, మీకొక ‘కూల్ క్యారెక్టర్’నిస్తుంది. ఇంతకీ ఎవరీ కూల్ ఫ్రెండ్ అనుకుంటున్నారా? ఇంకెవరు.. మన పానీయాల ప్రథమ బంధువు, ‘ఐస్’! అవును, నిన్నటి దాకా ఒక తెల్లటి మొండి మంచు గడ్డగా మాత్రమే కనిపించే ఇది. నేడు, ఒక అపురూపమైన వజ్రంలా ‘క్రాఫ్ట్ ఐస్’గా రూపు మార్చుకుని, విలాసానికి చిరునామాగా మార్కెట్లో మెరిసే ఐస్వర్యంగా మారిపోయింది! ఒక రాతిని మలిస్తే ఎలా శిల్పంగా మారుతుందో, అచ్చం అలాగే ఐస్ కూడా వివిధ రూపాల్లో క్రాఫ్ట్ ఐస్‌గా మారి, ప్రత్యేకమైన గౌరవం, హోదా, అందాన్ని సొంతం చేసుకుంటోంది. ఎందుకంటే, ఈ క్రాఫ్ట్ ఐస్, సాధారణ ఐస్ క్యూబ్ కంటే చాలా స్పష్టంగా అందంగా మెరుస్తూ, నెమ్మదిగా కరుగుతుంది. ఇది డ్రింక్ రుచిని కూడా మెరుగ్గా చేస్తుంది. అందుకే, ఇప్పటి ప్రపంచంలో డ్రింక్‌కి మొదటి హీరో క్రాఫ్ట్ ఐస్గామారింది. ఇదివరకు అది గ్లాస్లో నిశ్శబ్దంగా కూర్చునే ఒక ‘ఎక్స్ట్రా ప్లేయర్’. కాని ఇప్పుడు ఒక డ్రింక్ రుచి, లుక్‌ను మార్చేసే పవర్ సొంతం చేసుకొని స్టేజ్‌పై స్పాట్లైట్ దక్కించుకున్న ‘స్టార్’. ఎందుకంటే అది సాధారణ ఐస్ నుంచి క్రాఫ్ట్ ఐస్‌గా రూపాంతరం చెందింది. డ్రింక్ ఆర్డర్ చేసినప్పుడు చాలామంది అడిగేది ‘చల్లగా ఉందా?’ అని, కాని, గ్లాస్లో పడే ఐస్ ముక్క గురించి ఎవరూ ఆలోచించరు. దాని క్వాలిటీ, సైజ్, డిజైన్ వంటివన్నీ అసలు పట్టించుకునే వారే కారు. కాని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.మబ్బుల్లేని మంచు! ఇంట్లో తయారు చేసే ఐస్ క్యూబ్స్‌ను గమనించారా? మధ్యలో తెల్లగా, మబ్బు పట్టినట్టు కనిపిస్తాయి. సైన్స్ పరంగా, ఆ తెల్లటి మసక వివిధ గాలి బుడగలు, నీటిలోని చిన్న మలినాలు కలిసి గడ్డకట్టిన గుర్తు. కానీ క్రాఫ్ట్ ఐస్ మాత్రం అలా ఉండదు. ఇది ప్రత్యేక పద్ధతిలో నెమ్మదిగా, ఒకే దిశలో గడ్డకట్టేలా తయారవుతుంది. దాంతో గాలి బుడగలు బయటకు వెళ్లిపోతాయి, మిగిలేది మాత్రం పూర్తిగా పారదర్శకమైన స్వచ్ఛమైన మంచు. అందుకే దీనిని మబ్బుల్లేని మంచు అని కూడా అంటారు. ఇది అచ్చం పటిక బెల్లంలా, లేదా ఒక ఖరీదైన వజ్రంలా గ్లాస్లో మెరిసిపోతూ, చూడటానికి అందంగా ఉండటమే కాదు. నెమ్మదిగా కరిగి డ్రింక్ అసలు రుచిని అలాగే కాపాడుతుంది. చిన్న తేడా మాత్రమే అనిపించినా, ఇదే స్పష్టత ఒక సాధారణ పానీయానికి ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.ఎందుకు ముఖ్యం?సాధారణ ఐస్‌కి, క్రాఫ్ట్ ఐస్‌కి మధ్య ఉన్నది చిన్న తేడాలే అయినా, వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దవి. ఉదాహరణకు, ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుని ఊహించండి. అందులో వేసిన ఐస్ మసకగా, బుడగలతో నిండిపోయి ఉంటే అది కొంచెం అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. అదే గ్లాస్లో క్రిస్టల్‌లా మెరిసే క్రాఫ్ట్ ఐస్ ముక్క పడితే? ఆ గ్లాస్ ఒక్కసారిగా ప్రొఫెషనల్ లుక్‌లో స్టార్ హోటల్ రేంజ్‌ను సొంతం చేసుకుంటుంది. కేవలం చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, రుచి కూడా మెరుగ్గా అనిపిస్తుంది.ఐ స్ డిజైనర్స్! ఐస్ కూడా ఇప్పుడు ఒక డిజైనర్ ప్రాడక్ట్‌గా మారింది. బ్రాండెడ్ వాచీలు, ఖరీదైన ఫర్నిచర్ తరహాలోనే ఐస్ కూడా ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్. అందుకే మార్కెట్లో ‘ఐస్ డిజైనర్స్’ హడావుడి కూడా మొదలైంది. వీరు సృష్టించే మంచు ముక్కలు వజ్రంలా మెరిసే డైమండ్ షేప్‌లో, పర్ఫెక్ట్ ట్రైయాంగిల్, ఒక అందమైన పూల ఆకారాల్లో దర్శనమిస్తూ గ్లాసులో పడగానే ‘ఇది డ్రింక్ కాదు, ఒక అద్భుతమైన కళాఖండం’ అనే భావనను కలిగిస్తాయి. ఇందుకోసం, మార్కెట్లో కూడా ఈ ఐస్ తయారీకి ప్రత్యేకమైన టూల్స్, ట్రేలు, పిల్లలకు నచ్చేలా జంతువుల, మౌల్డ్స్, బాక్స్‌లు, టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో ఇంట్లో కూడా ఈ కొత్త ట్రెండ్ జోరుగా కనిపిస్తోంది.కామన్ ఐస్∙మసకగా, మబ్బుగా కనిపిస్తుంది. ∙త్వరగా కరిగిపోతుంది.∙త్వరగా కరిగిపోతే డ్రింక్ నీరుగా మారుతుంది.∙రుచి తగ్గిపోతుంది.క్రాఫ్ట్ ఐస్∙క్రిస్టల్‌లా స్పష్టంగా, పారదర్శకంగా కనిపిస్తుంది.∙నెమ్మదిగా కరుగుతుంది.డ్రింక్ రుచిని అలాగే ఉంచుతుంది. గ్లాస్ లుక్ కూడా మెరుగ్గా, మరింత స్టయిలిష్‌గా కనిపిస్తుంది.∙అంటే చిన్న ఐస్ ముక్కే పెద్ద డిఫరెన్స్ చేస్తుంది!చిన్న ట్విస్ట్!ప్రత్యేకమైన ఈ క్రాఫ్ట్ ఐస్ తయారీ విధానం వలన, ఈ ఐస్ తయారయ్యేందుకు సాధారణ ఐస్‌తో పోలిస్తే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈ నెమ్మదిగా గడ్డకట్టే ప్రక్రియ వలనే దీనికి ఆ స్పష్టత, బలం, అందం కూడా వస్తుంది. అంటే త్వరగా తయారయ్యే ఐస్ ఒక ‘ఫాస్ట్ ఫుడ్’ అయితే, క్రాఫ్ట్ ఐస్ మాత్రం నిజంగా ఒక ‘ఫైన్ డైనింగ్’ అనుభవం లాంటిదే! అందుకే దీని డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.సీక్రెట్ సైన్స్!క్రాఫ్ట్ ఐస్ ఇలా అద్దంలా మెరుస్తుందంటే, దానికి వెనుక ఒక చిన్న మాయ కాదు. ఒక పెద్ద సైన్స్ ఉంది. దీనికోసం ‘డైరెక్షనల్ ఫ్రీజింగ్’ అనే ప్రత్యేక టెక్నిక్ వాడతారు. పేరు వినగానే కొంచెం కష్టంగా అనిపించినా, కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్. అంటే నీరు అన్ని వైపులా కాకుండా, ఒకే ఒక వైపు నుంచి నెమ్మదిగా గడ్డకట్టేలా’ చేస్తారు. ఇలా చేస్తే, నీటిలో ఉన్న గాలి బుడగలు, చిన్న మలినాలు అన్నీ కింద భాగంలోకి వెళ్లిపోతాయి. పై భాగంలో మాత్రం అచ్చం అద్దంలా, వజ్రంలా మెరిసే స్వచ్ఛమైన మంచు మిగులుతుంది. అందుకే క్రాఫ్ట్ ఐస్ చూడగానే, ‘గ్లాస్ డైమెండ్గా’లా అనిపిస్తుంది.లక్షల ఏళ్ల నాటి చల్లదనం!కథ ఇక్కడితో ఆగలేదు. ఇప్పుడు దుబాయ్ లాంటి నగరాల్లో కొన్ని లగ్జరీ బార్లు మరింత స్పెషల్‌గా ఆలోచిస్తున్నాయి. ప్రత్యేకమైన అతిథుల కోసం సాధారణ క్రాఫ్ట్ ఐస్ కాదు. గ్రీ¯Œ లాండ్ గ్లేషియర్ల నుంచి తెప్పించిన లక్ష ఏళ్ల నాటి మంచు గడ్డలు వాడుతున్నారు. అవును, నిజంగానే! మనం రోజూ ఫ్రీజర్‌లో తయారు చేసే ఐస్ కొన్ని గంటల వయసు మాత్రమే ఉంటుంది. కానీ ఈ గ్లేషియర్ ఐస్ మాత్రం లక్ష ఏళ్ల చరిత్రను తనలో దాచుకుని ఉంటుంది. అందుకే ఇప్పుడు లగ్జరీ ప్రపంచంలో ఒక కొత్త జోక్ కూడా వినిపిస్తోంది. ‘డ్రింక్ ఎంత పాతదో కాదు, ఐస్ కూడా ఎంత పాతదో చెప్పాలి!’. అలా ఇప్పుడు లగ్జరీని గ్లాస్లో పడే ఐస్ ముక్కతో కూడా కొలుస్తున్నారు.ఇదొక పెద్ద బిజినెస్.. అప్పట్లో ప్రపంచంలో కాలుష్యం అనే మాటే లేదు! అందుకే ఆ కాలంలో ఏర్పడిన ఈ మంచు గడ్డలు ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనవిగా భావిస్తారు. ఈ అరుదైన మంచును ‘ఆర్కిటిక్ ఐస్’ అనే స్టార్టప్ సేకరించి, ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. ఇలా మీరు తాగుతున్నది కేవలం ఒక కాక్టెయిల్ మాత్రమే కాదు, హిమయుగం నాటి స్వచ్ఛతతో కూడిన చల్లదనం అంటూ, ఇదే విధంగా మరికొన్ని సంస్థలు కూడా వివిధ రకాల క్రాఫ్ట్ ఐస్ బిజినెస్ చేస్తున్నాయి. అంతేకాదు, ప్రపంచ మార్కెట్ లెక్కల ప్రకారం, క్రాఫ్ట్ ఐస్ మార్కెట్ 2031 నాటికి భారీగా పెరిగి, సుమారు 138.9 బిలియ¯Œ డాలర్లకు చేరుకోనుందని అంచనా. అంటే చిన్నగా కనిపించే ఈ ఐస్ ముక్క వెనుక ఇప్పుడొక పెద్ద బిజినెస్, పెద్ద ట్రెండ్, పెద్ద స్టేటస్ సింబల్ దాగి ఉన్నాయి.ప్రయోగాలన్నీ రుచికోసమే! ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే కాకుండా, ప్రతి ముద్దలోనూ, ప్రతి గుటకలోనూ ఒక సరికొత్త అనుభూతిని వెతకడమే అసలైన భోజన ప్రియుల లక్షణం. అందుకే, జ్యూస్ గ్లాస్లో పడే ఐస్ ముక్క నుంచి కూరలో చివరగా చల్లే కొత్తిమీర వరకు మనం చేసే ప్రతి ప్రయోగం వెనుక ఒక అద్భుతమైన ‘రుచి రహస్యం’ దాగి ఉంటుంది. ఇలాంటి వారికోసమే, క్రాఫ్ట్ ఐస్ జ్యూస్‌కు ప్రాణం పోసే చిన్న చిన్న ప్రయోగాలు, రుచిని రెట్టింపు చేసే ఆ చిట్కాలు పాటిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం కొన్ని ‘ఇన్ఫ్యూజ్డ్ ఐస్’ పేరుతో వివిధ రకాల రుచికరమైన క్రాఫ్ట్ ఐస్ అందుబాటులో ఉన్నాయి.టీ ఫ్లేవర్డ్ ఐస్ఎడారిలో కూడా టీ తాగేటటువంటి చాయ్ లవర్స్‌కి ఇదొక కూల్ సొల్యూషన్. ఐస్డ్ టీలు లేదా కాక్టెయిల్స్ తాగేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఐస్ కరుగుతున్న కొద్దీ టీ ఫ్లేవర్ తగ్గకుండా, మరింత పెరుగుతుంది. ఇందుకోసం, ముందుగా మాచా టీ, గ్రీన్ టీ లేదా మీకు నచ్చిన ఏదైనా ఫ్లేవర్డ్ టీని డికాక్షన్‌లా మరిగించి చల్లార్చాలి. ఆ నీటిని ఐస్ ట్రేలలో పోసి గడ్డకట్టించాలి. కేవలం ఇంట్లో ఉండే టీ పొడి లేదా టీ బ్యాగులతో కేవలం రూ. 5 నుంచి రూ. 10లతో వీటిని తయారు చేసుకోవచ్చు.సిట్రస్ ఐస్డ్రింక్కి ఒక తాజాదనాన్ని ఇచ్చేందుకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇది కేవలం రుచినే కాదు, గ్లాసుకి మంచి సువాసనను కూడా ఇస్తుంది. సిట్రస్ రకాలకు చెందిన నిమ్మకాయ లేదా నారింజ పండు పై తొక్కల సన్నని తురుము ఇందుకోసం చాలా అవసరం. ఒక ఐస్ ట్రేలో నీళ్లు పోసి, అందులో ఈ తురుమును లేదా చిన్న నిమ్మ చెక్కలను వేసి ఫ్రీజ్ చేయాలి. దీనికి అయ్యే ఖర్చు దాదాపు సున్నా. కేవలం మనం వాడేసి పారేసే నిమ్మ తొక్కలతోనే వీటిని సిద్ధం చేసుకోవచ్చు.ఫ్రూట్ ఐస్పిల్లలకి ఇచ్చే జ్యూస్‌ల నుంచి పెద్దలు తాగే పానీయాల వరకు ఇది ఒక విజువల్ అండ్ టేస్టీ ట్రీట్. పుచ్చకాయ, దానిమ్మ , దాక్ష రసాన్ని తీసి, వడకట్టి నేరుగా ఐస్ ట్రేలలో పోయాలి. మరింత అందంగా కనిపించాలంటే రసంతో పాటు చిన్న పండ్ల ముక్కలను కూడా అందులో వేయవచ్చు. సాధారణంగా ఒక ట్రే ఐస్ కోసం రూ.20 నుంచి రూ. 50 వరకు ఖర్చు అవ్వచ్చు.డిఫరెంట్ షేప్డ్ ఐస్ఆకారమే ఇక్కడ ప్రధాన ఆకర్షణ. గుండ్రంగా, స్టార్ ఆకారంలో, హార్ట్ షేప్‌లో ఇలా ఎన్నో ప్రత్యేక ఆకారాల్లో ఐస్ తయారు చేస్తున్నారు. ఇవి గ్లాస్లో పడిన క్షణం నుంచే డ్రింక్‌ను ఒక స్టయిలిష్ ప్రెజెంటేష¯Œ గా మార్చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మార్కెట్లో లభించే సిలికా¯Œ ట్రేలు లేదా మోల్డ్‌లు ఉపయోగిస్తారు. ఒకసారి కొనుగోలు చేస్తే చాలా రోజుల పాటు వాడుకోవచ్చు. సాధారణంగా ఈ ట్రేలు రూ. 100 నుంచి రూ. 300 వరకు ఉంటాయి.ఎడిబుల్ గోల్డ్ – ఫ్లవర్ ఐస్ఇది అల్టిమేట్ రాయల్ లుక్ ఇచ్చే పద్ధతి. లగ్జరీ ఈవెంట్లలో దీనికి భలే క్రేజ్ ఉంటుంది. విజువల్ ట్రీట్ కోసం ఈ ఐస్ క్యూబ్స్ మధ్యలో అందమైన పువ్వులు, బంగారు రేకులను ఉంచుతూ గ్లాసును ఒక చిన్న సర్ర్పైజ్ బాక్స్లా తయారు చేస్తారు. ఇది కాస్త ఖరీదైన వ్యవహారం. రూ. 500 నుంచి పదివేలు అంతకు మించి కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది.రంగు రంగుల ఐస్గ్లాస్లో రంగులు మెరిస్తే, మనసు కూడా ఫ్రెష్ అయిపోతుంది కదా! అందుకే ఇప్పుడు రంగురంగుల ఐస్ కొత్త ట్రెండ్‌గా మారింది. ఇది ముఖ్యంగా పిల్లల పార్టీలు, బర్త్‌డే సెలబ్రేషన్లు లేదా సమ్మర్ డ్రింక్‌లకు స్పెషల్ అట్రాక్ష¯Œ గా ఉంటుంది. ఇందుకోసం నీటిలో సహజ రంగులు ఇచ్చే పండ్ల రసం లేదా ఫుడ్ కలర్ కొద్దిగా కలిపి ఐస్ ట్రేలలో పోసి గడ్డకట్టించాలి. ఖర్చు కూడా రూ. 10 నుంచి రూ. 30ల మధ్యలోనే సిద్ధం చేసుకోవచ్చు.ఫ్లేవర్డ్ ఐస్ఇది నిజంగా ఒక చిన్న సర్ప్రైజ్ లాంటిది. ఐస్ కరుగుతున్న కొద్ది కొత్త రుచి మెల్లగా డ్రింక్‌లో కలుస్తుంది. పుదీనా, తులసి, అల్లం, లేదా బెర్రీ పండ్లతో తయారు చేసే ఫ్లేవర్డ్ ఐస్ ఇప్పుడు చాలా పాపులర్. ఇందుకోసం మీకు నచ్చిన ఫ్లేవర్ పదార్థాలను చిన్నగా కట్ చేసి నీటిలో కలిపి ఐస్ ట్రేలో పోసి గడ్డకట్టించాలి. ఇది కేవలం చల్లదనం మాత్రమే కాదు, ఒక కొత్త రుచి ఇస్తుంది. దీని ఖర్చు రూ. 15 నుంచి రూ. 40 మధ్యలో ఉంటుంది.చల్లని సత్యం! కరిగిపోయే లోపే కంటికి విందును, మనసుకి హాయిని ఇచ్చే ఈ క్రాఫ్ట్ ఐస్– అచ్చం మన జీవితం లాగే షార్ట్ అండ్ స్వీట్! అందుకే, మీరు కూడా ఈ ‘కూల్ ఫ్రెండ్’తో ఒక్క రెండు నిమిషాలు చిల్ అవ్వండి, రోజంతటి అలసటను ఇట్టే మర్చిపోండి!-కొండి దీపిక -
ఈ ఐస్‌క్రీమ్... చాలా హాట్ గురూ!
ఐస్‌క్రీమ్ అంటే చల్లచల్లగా తియ్యతియ్యగా ఉంటుందనేగా మీ అంచనా! ఈ ఐస్‌క్రీమ్‌ను గనుక ఒక్కసారి రుచి చూస్తే మీ అంచనాలన్నీ పటాపంచలైపోతాయి. దీని రుచి నాలుకను తాకిన తక్షణమే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఒళ్లంతా ముచ్చెమటలు పడతాయి. ఇదెక్కడి ఐస్‌క్రీమ్ బాబోయ్! అని నోరెళ్లబెట్టి, గుడ్లు తేలేస్తారు. ఇది అలాంటిలాంటి ఐస్‌క్రీమ్ కాదు, దీని పేరు ‘కోల్డ్ స్వెట్’. అన్ని ఐస్‌క్రీమ్‌ల మాదిరిగానే చాలా చల్లగా ఉంటుంది. రుచి చూస్తేనే దీని అసలు తడాఖా తెలిసొస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన రకాల మిరపకాయలు, మిర్చి సాస్ వంటి వాటితో తయారు చేయడం వల్లనే ఇది ప్రపంచంలోనే ఘాటైన ఐస్‌క్రీమ్‌గా పేరుపొందింది. అమెరికాలో నార్త్ కరోలినా రాష్ట్రం ఏంజియర్ పట్టణానికి చెందిన ‘సన్నీ స్కై హోమ్మేడ్ ఐస్‌క్రీమ్స్’ సంస్థ ఈ ఐస్‌క్రీమ్‌ను ఇరవై ఏళ్ల కిందట ప్రారంభించింది. విచిత్రమైన రుచులను ఆస్వాదించాలనుకునేవారు దీని కోసం ఇక్కడకు వస్తుంటారు. (చదవండి: జ్ఞాన శంఖం 'పూరి'ద్దాం!) -
బేబీ బ్లూస్..! డెలివరీ తర్వాత ఇలా ఎందుకనిపిస్తోంది..
నాకు వారం రోజుల క్రితం సిజేరియన్ ద్వారా డెలివరీ అయింది. బేబీ కూడా బాగానే ఉంది, నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాను. కానీ గత కొన్ని రోజులుగా నాకు చాలా సాడ్ ఫీలింగ్ వస్తోంది. మాటిమాటికి కళ్లలో నీళ్లు వస్తున్నాయి, బేబీతో ఆడుకోవాలని కూడా అనిపించడం లేదు. ఒంట్లో బలహీనంగా అనిపిస్తోంది. ఇది సాధారణమేనా?– లావణ్య, కడప.డెలివరీ తర్వాత కొంతమంది మహిళల్లో ఇలా సడెన్‌గా సాడ్ ఫీలింగ్ రావడం, ఏడుపు రావడం, బలహీనంగా అనిపించడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సాధారణంగా ‘పోస్ట్‌పార్టమ్ బ్లూస్’ అంటారు. డెలివరీ అయిన తర్వాత మొదటి రెండు నుంచి మూడు వారాల వరకు సుమారు 70 నుంచి 80 శాతం మహిళల్లో ఈ మార్పులు కనిపించడం సాధారణమే. ఇది ఎక్కువగా జీవనశైలిలో ఒక్కసారిగా వచ్చే మార్పుల వల్ల జరుగుతుంది. డెలివరీ తర్వాత తల్లి పూర్తిగా కోలుకోకముందే ప్రతి రెండు గంటలకు లేచి బిడ్డను చూసుకోవడం, పాలివ్వడం వంటి బాధ్యతలు పెరుగుతాయి. అలాగే శరీరంలో హార్మోన్ మార్పులు కూడా ఈ భావోద్వేగ మార్పులకు కారణం అవుతాయి. సాధారణంగా ఈ బేబీ బ్లూస్ రెండు వారాల లోపే తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల సహాయం, కొద్దిగా ప్రోత్సాహం, సరైన విశ్రాంతి, సపోర్ట్ ఉంటే ఎక్కువగా ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే సమస్య సద్దుమణుగుతుంది. అయితే కొంతమందిలో ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే దాన్ని ‘పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ అంటారు. ఇది భారతదేశంలో దాదాపు 10 నుంచి 25 శాతం మహిళల్లో కనిపించే సమస్య. దీనికి ప్రధాన కారణాలు హార్మోన్ మార్పులు, ముందుగా ఉన్న ఆందోళన లేదా డిప్రెషన్ సమస్యలు, డెలివరీ సమయంలో ఎదురైన ఒత్తిడి లేదా కుటుంబంలో సరైన సపోర్ట్ లేకపోవడం వంటి అంశాలు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి చాలా లో మూడ్‌లో ఉండటం, బిడ్డపై ఆసక్తి తగ్గడం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, చిరాకు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులు తల్లి ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పులను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని ప్రత్యేక ప్రశ్నల ద్వారా ఈ సమస్యను సులభంగా గుర్తించవచ్చు. అవసరమైతే కౌన్సెలింగ్, సైకాలజికల్ థెరపీ వంటి చికిత్సలు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా మందులు కూడా ఇవ్వవచ్చు. ఈ మందులు సాధారణంగా తల్లి పాలిచ్చే సమయంలో కూడా సురక్షితంగా వాడేలా ఉంటాయి. సరైన చికిత్స, కుటుంబ సభ్యుల ప్రేమ, సహాయం, ప్రోత్సాహం ఉంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. డా. కప్పగంతుల అపర్ణ , సీనియర్ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ ∙(చదవండి: ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే.. -
మారిన పేరు..ఏడేళ్లు జైలు శిక్ష
పేరు మనిషికి గుర్తింపునిస్తుంది. అదే పేరు తారుమారై, తప్పుగా నమోదైతే? గుర్తింపు సరిగా లేకపోతే ఏమౌతుంది? జీవితం నాశనమై, కుటుంబం కకావికలం అవుతుంది. మహారాష్ట్రలో ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఏడేళ్ల జైలు శిక్షకు కారణమైంది. కుటుంబానికి దూరం చేసింది. ‘పదిమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. కాని, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’ అనేది ప్రాథమిక న్యాయసూత్రం. అయితే కొన్ని సందర్భాల్లో విచారణలో పొరపాట్లు జరిగి నిర్దోషులు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. అలాంటి సంఘటనలు అరుదు. వాటి ప్రభావం బాధితుల జీవితాలపై తీవ్రంగా ఉంటుంది. ఈ తరహా ఘటనలో ఓ వ్యక్తి అత్యాచారం కేసులో నిందితుడిగా సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించాడు. తరువాత అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. తనకు జరిగిన అన్యాయానికి రూ. 200 కోట్లు పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. కేసు నమోదు..శిక్ష ఖరారుమహారాష్ట్రలోని ఘట్కోపర్ రైల్వే స్టేషన్ వంతెనపై ఓ మహిళ నిద్రిస్తోంది. తెల్లవారుజామున ఓ వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేసిన వ్యక్తి పేరు ‘గోపి’ అని పేర్కొంది. పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించారు. కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. న్యాయమూర్తి దోషిగా తేల్చారు. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 400 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో నెల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని 2010లో తుది తీర్పు వెలువరించారు.నిర్దోషి అని తేలింది.. కానీబాధితురాలు చెప్పిన వ్యక్తి, పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి ఒకరేనా? నిందితుడి గుర్తింపులో పొరపాటు జరిగిందా? అనే సందేహాలు హైకోర్టు విచారణ సందర్భంగా వెల్లువెత్తాయి. బాధిత మహిళ తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి పేరు‘గోపి’ అని చెప్పింది. కానీ పోలీసులు అరెస్ట్ చేసింది గోపాల్ని. ‘ఈ కేసుకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, గుర్తింపులో పొరపాటు జరిగిందని’ గోపాల్ పేర్కొన్నాడు. ట్రయల్ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాడు. అది పెండింగ్‌లో ఉండగా, బెయిల్ కోసం అభ్యర్థించాడు. కోర్టు తిరస్కరించింది. దీంతో జైలులోనే గడపాల్సి వచ్చింది. చివరికి హైకోర్టులో అప్పీలు పిటిషన్ విచారణకు వచ్చింది. నిందితుడి గుర్తింపును ప్రాసిక్యూషన్ సరైన విధంగా చేయలేదని హైకోర్టు తెలిపింది. ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేసి, గోపాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. తప్పు చేయలేదని తేలినా, అప్పటికే కాలం కరిగిపోయింది. ఏడేళ్లు గడిచిపోయింది. శిక్షా కాలం పూర్తయిపోయింది. పరిహారం కోసం పోరాటం‘నాపై తప్పుగా కేసు నమోదు చేశారు. ఏడేళ్లపాటు అన్యాయంగా కారాగారంలో బంధించారు. నా జీవితం నాశనం అయింది. నేను జైలుకు వెళ్లడంతో నా భార్య నన్ను వదిలి వెళ్లిపోయింది. మనోవేదనతో నా తండ్రి చనిపోయాడు. పిల్లలు అనాథశ్రమంలో చేరాల్సి వచ్చింది. నా ఉద్యోగాన్నీ కోల్పోయాను. కావున నాకు రూ. 200 కోట్లు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని గోపాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో తాత్కాలిక పరిహారంగా రూ. 100 కోట్లు ఇవ్వాలని అభ్యర్థించాడు. తనను అన్యాయంగా కేసులో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ వ్యవహారంపై సీబీఐతో పునర్విచారణ జరిపించాలని పేర్కొన్నాడు. అతడ్ని అన్యాయంగా నిర్బంధించిన కారణంగా స్వేచ్ఛను కోల్పోయాడని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుకు ఇది విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్‌ను హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడం వాస్తవమే కానీ, పరిహారం ఇవ్వాల్సిన పరిస్థితులు లేవని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కేసు నమోదు చేయడంలో పిటిషనర్‌పై దర్యాప్తు అధికారులకు ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. కోర్టు తీర్పు ఇలా..తనను ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులో ఇరికించారని పిటిషనర్ ఆరోపించారు. కానీ దురుద్దేశం ఉందని ఎక్కడా నిరూపించ లేకపోయారని కోర్టు పేర్కొంది. అతడ్ని కేసులో ఇరికించడానికి దర్యాప్తు అధికారులు, ఇతర సాక్షులు ప్రయత్నించారని అనడానికి కారణాలు కనిపించలేదు. కేవలం నిర్దోషిగా విడుదలయ్యాడనే కారణంతో పరిహారం కోరడం సరైంది కాదు’ అని కోర్టు అభిప్రాయపడింది. పబ్లిక్ లా కింద పరిహారం ఇవ్వడానికి తగిన ఆధారాలు లేవని తేల్చింది. ఈ కేసులో నిందితుడి విడుదల ‘తప్పు నిరూపించ లేకపోవడం వల్ల మాత్రమే జరిగింది. తప్పుడు కేసులో కావాలనే ఇరికించారని నిరూపణ కాలేదని పేర్కొంది. పిటిషనర్ కోరిన అభ్యర్థనకు చట్టపరంగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఏడేళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషిగా విడుదలైన వ్యక్తి పట్ల కోర్టుకు సానుభూతి ఉన్నా, చట్టపరంగా పరిశీలిస్తే అతని ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టు ఎక్కడా నిరూపించుకోలేకపోయాడని కోర్టు పేర్కొంది. పరిహారం చెల్లించాలని ప్రతీ కేసులో చెప్పలేమని, అది పూర్తిగా కేసు పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఈ కేసులో స్పష్టంగా తేల్చింది. పిటిషనర్‌కు ఎలాంటి పరిహారం లేదా ఉపశమనం ఇవ్వకుండా పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. దిలీప్ మాదిరెడ్డి(చదవండి: బొమ్మజెముడు పొద మీద నెత్తుటి మరక!) (చదవండి: ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే..) -
క్షణం క్షణం ఉత్కంఠ నడుమ స్నేహపూర్వక బ్రేక్‌ఫాస్ట్..!
తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించాయి. ఎట్టకేలకు ఆ ట్విస్ట్‌ల మధ్య చివరికి విజయ్ విజిల్ గట్టిగా మోగింది. రోజుల తరబడి సాగిన రాజకీయ ప్రతిష్టంభన తమిళనాడు గవర్నర్ ఆర్ వి అర్లేకర్‌తో జరిగి వరుస సమావేశాల అనంతరం మొత్తం 120 ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో లోక్ భవన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి..అధికారిక ఆహ్వానాన్ని స్వీకరించి బయటకు వచ్చారు. ఇంత భారీ ఉత్కంఠ నడుమ గవర్నర్ నివాసం లోపల సహృద్భావ పూర్వక స్నేహ వాతావరణం ఉండటం విశేషం. ఆ నివాసం లోప కూటమికి సంబంధించి..సంఖ్యాబల లెక్కలు, రాజ్యంగపరమైన చర్చల తోపాటు చక్కటి రుచికరమైన అల్పాహార విందు, కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ వంటి సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..లోక్‌భవన్ జరిగిన సమావేశం సందర్భంగా విజయ్, ఆయన మిత్రపక్ష నాయకులకు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై కూడా ఉన్నారు. అక్కడ వడ, హల్వా, కాఫీ వడ్డించారు. గత కొన్ని రోజులగా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై తీవ్రమైన అనిశ్చితి ఉన్నప్పటికీ లోపల వాతావరణం మాత్రం ఎంతో స్నేహపూర్వకం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, అధికారిక చర్చలు ముగిసిన తర్వాత కూడా, విజయ్ లోక్ భవన్ లోపలే దాదాపు ఒక గంట పాటు గడిపినట్లు సమాచారం. గవర్నర్ నుంచి అధికారిక నియమాక పత్రాన్ని స్వయంగా స్వీకరించిన తర్వాత ఆయన ఆ ప్రాంగణం నుంచి బయలుదేరారని ఆ వర్గాలు తెలిపాయి. పైగా గత నాలుగు రోజుల్లో గవర్నర్‌తో విజయ్ జరిపిన నాల్గొవ సమావేశం ఇది. అంతేగాదు ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ఖరారైన తర్వాత, సమావేశంలో కొన్ని సరదా సందర్భాలు కూడా చోటుచేసుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం, కూటమిలోని కొందరు నాయకులు తమ కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్ చేసి, తమ పిల్లలతో కాసేపు మాట్లాడమని విజయ్‌ని కోరారు. ఏదీఏమైతేనేం రీల్స్ హీరో కాస్తా రియల్ హీరోలా తమిళనాడు ముఖ్యమంత్రిగా నేడు(ఆదివారం మే 10, 2026) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేవలం రెండేళ్ల క్రితం స్థాపించబడి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరుకున్న 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీకి ఈ పరిణామం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది.(చదవండి: సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..) -
సివిల్స్‌లో ఆరు సార్లు ఫెయిల్.. ఏడోసారి విజయం!
‘నాన్న హెడ్ కానిస్టేబుల్, అమ్మ గృహిణి. మేము ఇద్దరం కూతుళ్లం. నాన్న ఉద్యోగానికి వెళితే.. మాకు అమ్మే అన్నీ చూసుకునేది. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. నన్ను ఉన్నతాధికారిగా చూడాలనే అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఐఎఫ్ఎస్ సాధించగలిగాను’ అని సూర్యాపేటకు చెందిన చల్లా యామిని చెప్పారు. యూపీఎస్సీ వెల్లడించిన ఐఎఫ్ఎస్ పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయిలో 119వ ర్యాంకు సాధించిన యామిని శనివారం ‘సాక్షి’ తో మాట్లాడారు.సూర్యాపేటటౌన్ : కూతుళ్లు అనే భావన లేకుండా మమ్మల్ని అమ్మానాన్న బాగా పెంచారు. తనను ఉన్నతాధికారిగా ఉండాలని అమ్మానాన్న ప్రోత్సాహించారు. మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సివిల్స్‌లో రాణించాలనే లక్ష్యంతో ఆరు సార్లు పరీక్ష రాసి విఫలమయ్యాను. పట్టువదలకుండా సివిల్స్‌తో పాటు యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ పరీక్ష రాసి 119వ ర్యాంకు సాధించాను. నేను పెద్ద కూతురిని. నాకు ఒక చెల్లె నందిని ఉంది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తోంది. నాన్న తన పైస్థాయి అధికారులను చూపిస్తూ ఇలా ఉన్నతాధికారి కావాలని చెబుతుండేవారు. ఉన్నతాధికారిగా ఉన్నప్పుడే ప్రజలకు సేవ చేయగలమని, అలాంటి ఉద్యోగం సాధించాలని చెబుతుండటంతో.. ఉన్నతాధికారిగా ఉద్యోగం సాధించాలనే తపన, కృషితో చదివాను. ఉద్యోగం చేస్తూనే..సూర్యాపేటలో పదో తరగతి వరకు, హైదరాబాద్‌లో ఇంటర్, జేఎన్టీయూలో బీటెక్ చదివాను. బీటెక్ తర్వాత ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉద్యోగాల వేటలో పడి 2022లో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న డిఫెన్స్ అకౌంట్స్ ఆడిటర్‌గా ఉద్యోగం వచ్చింది. సివిల్స్‌లో విఫలమై...2020 నుంచి సివిల్స్ పరీక్ష రాస్తున్నా. ఇప్పటి వరకు మొత్తం ఆరు సార్లు సివిల్స్ రాసి విఫలమయ్యాను. 2021లో ఇంటర్వ్యూ అయిపోయాక ఫైనల్ లిస్టులో 40 మార్కుల తేడాతో ఉద్యోగం రాలేదు. అలాగే 2023లో 20 మార్కుల తేడాతో ఉద్యోగం రాలేదు. అయితే సివిల్స్‌తో పాటు ‘ఆల్ ఇండియా ఫారెస్ట్ సర్వీస్’ పరీక్ష రాయాలని స్నేహితుల ద్వారా తెలుసుకొని 2025 సంవత్సరంలో సివిల్స్‌తో పాటు యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ పరీక్ష రాశాను. అయితే సివిల్స్‌లో ర్యాంకు రాలేదు. ఐఎఫ్ఎస్లో ఆలిండియాలో 119వ ర్యాంకు సాధించగలిగా. కేవలం రెండు నెలలే ఈ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యాను. ఉద్యోగం చేసూ్తనే ఎలాంటి కోచింగ్ లేకుండా పరీక్షకు సన్నద్ధమయ్యాను. చాలా ఆనందంగా ఉంది యామిని చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్ ఉండేది. ఉన్నత స్థాయిలో పెద్ద అధికారి కావాలని నేను చెబుతుండేవాడిని. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నతాధికారిగా ఉద్యోగం సాధించగలిగింది. ఈ ఉద్యోగం రావడం పట్ల చాలా ఆనందంగా ఉంది. నా ఆశయాన్ని నెరవేర్చింది. –చల్లా యాదగిరి, యామిని తండ్రికష్టపడితేనే ఫలితం జీవితంలో ఫెయిల్యూర్ వస్తేనే.. సక్సెస్‌కు దారిపడుతుంది. కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుంది. ప్రస్తుత యువత కూడా ఒక్కసారి ఫెయిల్ అయితే జీవితం అయిపోయిందనే అపోహతో నిరుత్సాహ పడుతున్నారు. ప్రయత్నిస్తే కచ్చితంగా మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. -
అమ్మ అంటే.. అంతులేని బలం
ఫ్రెండ్స్, ఈరోజు మదర్స్ డే కదా. మరి అమ్మకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? నిజానికి అమ్మకు అసలు సిసలు గిఫ్ట్ ఏమిటో తెలుసా? ఆమె చెప్పిన మాటను పాటించడం. అలా పాటిస్తే... మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎంతోమంది గొప్ప వ్యక్తులు అమ్మ మాటను విజయానికి బాటగా చేసుకున్నారు. ‘అమ్మ నా వెనుక ఉంది’ అనుకుంటే వారికి ఎంతో బలంగా ఉండేది. ‘అమ్మ నాతో ఉంది’ అనుకుంటే ఎంతో సందడిగా, సంతోషంగా ఉండేది. ‘అమ్మ ఆశీర్వచనం ఉంది’ అని గుర్తు తెచ్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరిగేది. విజయం చేరువయ్యేది. ఎందరో మహానుభావులు... అందరికి వెనుక అమ్మ ఉంది...నా ప్రపంచం అమ్మకు మాత్రమే తెలుసు!ప్రఖ్యాత శా్రçస్తవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తకంలో తన తల్లి గురించి ఇలా కవితాత్మకంగా రాశారు...‘నాకు పదేళ్ల వయసున్న ఆరోజు ఇంకా గుర్తుందిఅన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అసూయపడేలా....నీ ఒడిలో నిద్రిస్తున్నప్పటి సంగతి. అది ΄పౌర్ణమి రాత్రి.నా ప్రపంచం నీకు మాత్రమే తెలుసు అమ్మా... నా అమ్మా!అర్ధరాత్రి, నా మోకాళ్లపై కన్నీళ్లు జారుతుండగా... నేను మేల్కొన్నప్పుడు...నీ బిడ్డ బాధ నీకు తెలుసు, నా అమ్మా నీ శ్రద్ధగల హస్తాలు నా బాధను సున్నితంగా తుడిచివేశాయినీ ప్రేమ, విశ్వాసం, శ్రద్ధ నాకు బలాన్ని ఇచ్చాయి.అమ్మకు ఇచ్చిన మాటగాంధీజీ లా చదవడం కోసం ఇంగ్లాండ్‌కు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు తోటి ప్రయాణికుడైన ఆంగ్లేయుడు పరిచయం అయ్యాడు. కొన్ని మాటల తరువాత మాంసం ప్రస్తావన వచ్చింది.‘నేను తినను’ అని చెప్పారు గాంధీజీ‘ఇంగ్లాండ్‌లో ఎంతో చలిగా ఉంటుంది. అక్కడ మాంసం లేకుండా బతకడం అసాధ్యం’ అన్నాడు ఆంగ్లేయుడు.‘అక్కడి ప్రజలు మాంసం లేకుండా కూడా జీవించగలరని విన్నాను’ అన్నారు గాంధీజీ.‘పచ్చి అబద్ధం. మాంసం తినకుండా అక్కడ జీవించడం అసాధ్యం. అది లేకుండా మీరు జీవించలేరు’ అన్నాడు ఆంగ్లేయుడు.‘మీ సలహాకు థ్యాంక్స్. కాని నేను మా అమ్మకు మాంసం తినను అని మాట ఇచ్చాను. ఒకవేళ అది లేకుండా జీవించడం అసాధ్యం అని తేలితే నేను భారతదేశానికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడతాను’ అన్నారు గాంధీజీ.తియ్యటి ఆ పిలుపు ఎప్పుడూ గుర్తుంటుంది! సచిన్ తెందూల్కర్ తల్లి పేరు...రజని.‘ఆమె ప్రోత్సాహం, ప్రార్థనలు నాకు వెన్నుదన్నుగా ఉన్నాయి. అమ్మ నా బలం’ అనేవారు సచిన్.చిన్నప్పుడు సచిన్ క్రికెట్ ఆడుతున్నప్పుడు...‘సచిన్... సచిన్’అంటూ పిలిచేవారు రజని.‘సచిన్... సచిన్ అనే అమ్మ పిలుపు తీయగా ఉంటుంది. అది ఎప్పుడూ గుర్తుండిపోతుంది’ అంటారు సచిన్.‘ప్రతి తల్లి తన బిడ్డ ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే కోరుకుంటుంది. సచిన్ విషయంలో నేను కూడా అంతే’ అనేవారు రజని. -
నేటి అమ్మ మేటి యోధ
వయసు ముప్పై వచ్చేసరికి ఆమె భార్య, తల్లి, కోడలు, ఉద్యోగి. యువతిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! కుటుంబం.. సమాజం... విసిరే సవాళ్లు ఎన్ని! కాని గెలవడం ఆమెకు తెలుసు. ఆమె నేటి అమ్మ. ఈ అమ్మకు పద్మవ్యూహాలు ఛేదించడం తెలుసు.నాకు నేను మిగలాలిపెళ్లి అయ్యింది. పిల్లాడు పుట్టాడు. ఉద్యోగం ఉంది. సంతోషమే. కానీ ‘నేను’ ఏమయ్యాను అనే ప్రశ్న ఎదురుగా వచ్చి నిలబడుతుంది. అద్దంలో చూసుకుంటే కనిపించేది ఒకరి భార్య, ఒకరి తల్లి, ఒక కంపెనీ ఉద్యోగి. కానీ వీళ్ల వెనుక ఉత్సాహం ఉరకలెత్తే ‘అమ్మాయి’ కూడా ఉండాలే. నాటి అమ్మాయిని కాపాడుకోవడం నేటి అమ్మకు తెలుసు. అందుకు తను ఏం చేస్తోంది? తనకంటూ కొంత సమయాన్ని మిగుల్చుకుంటోంది. తనకు ఆసక్తి ఉన్న రాజకీయ, సామాజిక అంశాలు తెలుసుకుంటోంది. వాలెంటరీ గ్రూప్‌తో పని చేస్తోంది. నెలకి ఒక్కసారైనా ఫ్రెండ్స్‌ను కలుస్తుంది. పూర్వపు బృందానికి లంకెలా పని చేస్తోంది. నేటి అమ్మ ఏకకాలంలో అమ్మ, వ్యక్తి కూడా.80శాతం తృప్తి చాలుఆఫీసులో ప్రమోషన్ కోసం మీటింగ్ నడుస్తోంది. ఇంట్లో పిల్లాడికి జ్వరం వచ్చింది. అటు వైపు చూడాలా.. ఇటు వైపు చూడాలా? 30 ఏళ్ల అమ్మ రెండుగా చీలిపోతుంది. ఉద్యోగం వదిలేస్తే ఆర్థిక స్వాతంత్య్రం పోతుంది. పిల్లాడిని వదిలేస్తే మనసు ముల్లు గుచ్చుకుంటుంది. అందుకే రెండూ బేలెన్స్ చేసుకుంటోంది. ‘గిల్ట్’ని పక్కన పెట్టడం నేర్చుకుంటోంది. ఆఫీసులో 100 శాతం, ఇంట్లో 100 శాతం ఇవ్వలేనని ఒప్పుకుని, రెండు చోట్లా 80 శాతం నిజాయితీగా ఇస్తోంది. ‘సూపర్ ఉమన్’ కాకపోయినా ‘తృప్తి ఉన్న అమ్మ’ అవుతోంది.నా శరీరం నా కవచండెలివరీ తర్వాత పొట్ట మీద గీతలు, జుట్టు రాలడం, నడుం నొప్పి, నిద్రలేమి. 20 ఏళ్ల వయసులోని చురుకుదనం 30కి వచ్చేసరికి మాయం. సోషల్ మీడియాలో ‘ఫిట్ మామ్’లను చూసి తనను తాను తిట్టుకోవాలా? నో. నేటి అమ్మ అలా చేయదు. అద్దంలో కనిపించే గీతల్ని ‘యుద్ధ గాయాలు’గా చూస్తోంది. వాటిని అలా ఉండనిచ్చి పిల్లాడిని స్కూల్లో దింపి వచ్చేటప్పుడు 30 నిమిషాలు నడుస్తోంది. యూట్యూబ్ చూసి 10 నిమిషాల యోగా చేస్తోంది. ‘సైజ్ జీరో’ కాదు, ‘జీరో టెన్షన్ హెల్త్’ తన టార్గెట్ చేసుకుంది. శరీరాన్ని ద్వేషించడం మానేసి, అక్కున చేర్చుకోవడం మొదలుపెట్టింది. నేటి అమ్మ... జీవన ప్రయాణాన్ని గౌరవిస్తోంది.నేను ముద్దాయిని కానుపిల్లాడు మార్కులు తక్కువ తెచ్చుకున్నాడా... ‘అమ్మ సరిగా చూడట్లేదు’. పిల్లాడు అల్లరి చేశాడా... ‘తల్లి ఉద్యోగం చేస్తే పిల్లలు ఇలాగే ఉంటారు’. బయటి వాళ్ల మాటలు సరే... సొంత వాళ్లే ‘మా అమ్మలా నువ్వు లేవు’ అని పోలుస్తారు. 30 ఏళ్ల అమ్మ ప్రతి రోజూ బోనులో నిలబడుతుంది. అయితే ముద్దాయిలా కాదు. నిర్దోషిగా. పరాయి మాటలకు చెవులు మూసుకోవడం నేర్చుకుంటోంది. ‘నా పిల్లాడికి ఏం కావాలో నాకు తెలుసు’ అనే నమ్మకాన్ని గట్టిగా పట్టుకుంటోంది. ఫోన్ పక్కన పెట్టి పిల్లాడితో రోజూ 30 నిమిషాలు మాట్లాడుతోంది. మార్కులతో పాటు వాడితో అనుబంధం ముఖ్యమని చెబుతోంది. జడ్జిమెంట్ ఇచ్చేవాళ్లకు తన పిల్లాడి నవ్వే సమాధానం అని ప్రూవ్ చేస్తోంది.నా రేపటి చూపుపిల్లాడి స్కూల్ ఫీజు, ఇంటి ఇ.ఎం.ఐ, అత్తమామల మందులు... సంపాదనలో సగం కళ్ల ముందే కరిగిపోతుంది. ఫ్రెండ్ మంచి చీర కొనుక్కుంటే ‘నేను ఎప్పుడు కొనుక్కోవాలి’ అని 30 ఏళ్ల అమ్మ మనసు చిన్నబోతుంది. తన కలల్ని ‘తర్వాత’ అనే అరలో దాచేస్తుంది. అయితే ఎన్నాళ్లు? అందుకే అమ్మ మారింది. ‘తర్వాత’ని ‘ఇప్పుడే’గా మార్చుకుంటోంది. నెలకి కొన్ని డబ్బులైనా తన పేరు మీద సేవ్ చేస్తోంది. ఫ్రీలాన్స్ పని చేస్తోంది. ఆన్లైన్లో చీరలు అమ్ముతోంది. భర్తతో బడ్జెట్ డిస్కస్ చేస్తోంది. ‘కుటుంబం కోసం’ అనే మాటతో పాటు ‘నా కోసం’ అనే ‘అర’ను జత చేసుకుంటోంది.నా టాలెంట్ నా కల పెళ్లికి ముందు ఆమెకు ఒక కల ఉండేది. డ్యాన్సర్ అవ్వాలి, లేదా బిజినెస్ పెట్టాలి, లేదా ఒక్కతే లడాఖ్ వెళ్లాలి. పిల్లాడు పుట్టాక ఆ కలల ఫైల్ మూసేసింది. ‘ఇప్పుడు కుదరదులే’ అని తనకు తానే సర్ది చెప్పుకుంది. మరి ఇప్పుడు? తన కలలను తవ్వి బయటకు తీస్తోంది. ఉద్యోగం, పిల్లాడితో సమయం... పోగా మిగిలిన కాసేపు తన కల కోసం కేటాయిస్తోంది. ఆన్ లైన్ క్లాస్‌లో డ్యాన్స్ నేర్చుకుంటోంది. కథలు రాస్తోంది. ఇంటి నుంచే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. భర్తతో ‘నాకూ ఒక లడాఖ్ కావాలి’ అని ధైర్యంగా అడుగగలుగుతోంది. ‘అమ్మ’ అయిన తర్వాత కలలు చావవు, విరామంతో మేల్కొంటాయి అంతే అని ప్రపంచానికి చెబుతోంది. మరి నేటి అమ్మ కదా. అమ్మా... మము కన్నందుకు పాదాభివందనందేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడట. తప్పు. అమ్మతో సాటి రాగల దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడు కూడా అంగీకరించడు. అందుకే కవి అంటాడు... ‘అమ్మ లేకుంటే జననం లేదు, అమ్మ లేకుండా గమనం లేదు’. అవును. అమ్మ లేకుండా చేసేది ఏమి గమనం’ అమ్మ లేకుండా సాగేది ఏమి గమ్యం? అమ్మా... ఎలా సాకావు మమ్మల్ని. ‘అకలి’ అని నువ్వు ఏనాడూ అనలేదు. మా కడుపు నిండితే నీ కడుపు నిండిందనుకున్నావు. ‘స్వార్థం’ అనే భావన ఏనాడూ చూపలేదు. నీకున్నదంతా మాకే పంచి పెట్టావు. అలసిన సంగతి తెలియనిచ్చావా? తెచ్చిపెట్టుకున్న హుషారుతో మమ్మల్ని విజయాల వైపు పరుగులెత్తించావు.మేము పాసైతే నువ్వు పాసయ్యావనుకుని, మేము ఇంటర్వ్యూకెళితే నువ్వు ఉపవాసం ఉండి, మేము గెలిస్తే నీకు ప్రైజ్ వచ్చిందనుకుని మురిసిపోయే అమాయకురాలివి. ఎంత క్షమ నీకు. ఎంత ఆర్తి. ఎంత ఆర్ద్రత నీ పిల్లల కోసం. నీ ప్రతి ప్రార్థన మా కోసమే కదా. ‘మదర్స్ డే’ అని చెప్పి స్టేటస్ పెట్టి, నీతో సెల్ఫీ దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేస్తే బాధ్యత తీరిపోతుందనుకుంటున్నాం. నువ్వనే ఒక మహాకావ్యంలో మేమొక అధ్యాయమని తెలుసుకోవాలి. తెలుసుకుంటాం. కృతజ్ఞతాశ్రువులతో నీ చేతులను ముద్దాడతాం. ‘అమ్మా.. మము కన్నందుకు పాదాభివందనం’ అని నీ పాదాలు అంటి ఆశీర్వాదం తీసుకుంటాం.అమ్మా.. నీకు శతకోటి ప్రణామాలు. -
తిరుపతి గంగజాతర: వారు మాత్రమే ఆ వేషాలు వేస్తారు!
‘తిరుపతి కొండంత కొండ, పేరూరు గుట్టంత గుట్ట, తిరుపతి గంగజాతరంత జాతర’ లేవని తిరుపతి ప్రాంతీయుల నమ్మకం. నేడు తిరుపతి గంగజాతర రాష్ట్ర స్థాయి జాతర. ఇందులో 20 దున్న పోతుల్ని, 400 మేకపోతుల్ని, 700 కోళ్లని బలి ఇచ్చే సంప్రదాయం ఉన్నట్టు 1881 నాటి ఆర్కాట్ మాన్యువల్‌లో ఆర్థర్ ఎఫ్ కాక్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం దున్నపోతు బలి నిషేధితం. జాతరకి చిత్రి మాసంతో కత్రి కార్తెతో సంబంధం ఉంది. తిరుపతి గంగజాతర చాటింపు చిత్రి నెల నాలుగో మంగళవారం (మే 5, 2026). జాతర ముగింపు తర్వాతి మంగళవారం రాత్రి.చాటింపునకు ముందు అవిలాల గ్రామం (Avilala Village) నుంచి ఆడబిడ్డ సాంగ్యం తేవడం ఆనవాయితీ. ఇచ్చేది ముళ్లపూడి పెదరెడ్డి కుటుంబీకులు. తెచ్చేది తాళ్లపాక గంగమ్మ గుడి పూజారులైన కైకాల కుటుంబీకులు. అవిలాల ఆడబిడ్డ సాంగ్యంలో భాగంగా అమృతపళ్లెం, గండదీపం, పసుపు కుంకుమ, వేపాకు, నిమ్మకాయలు, ఆకు వక్కలు, పానకం, ఒడిబియ్యం, పచ్చిపిండి (బియ్యపుపిండి) తప్ప నిసరి. చాటింపులో పానకం దుత్త, పసుపు ముంతకు ప్రాధాన్యం ఉంది. చాటింపుకు ముందు అందరికీ నానబియ్యంతో పాటు పానకం ఇస్తారు, ఆడవారికి పసుపు పంచుతారు. వేపాకు, తమల పాకు, అరటి పండు దోసిట్లో పట్టుకొని పోతురాజు ముందు ఎర్నీళ్లు లేదా వసంతం నీళ్లు పూజారి పోస్తుండగా వదిలి, వెనక్కి చూడకుండా వెళ్తారు. కైకాల, తోటివారు పంబ పలకలు అనుసరిస్తుండగా చాటింపు వేసే ప్రాంతానికి వెళ్తారు.వేషాల వరుసచాటింపు మర్నాడు నుంచి గుడి తరపున మిరాశీ దారులు వేసే వేషాలు... వేషాలమ్మ గుడి నుంచి ప్రారంభమై మిరాశి ఉన్న ఇళ్లకు వెళ్లి చాటు దాటకుండా తిరిగి వేషాలమ్మ గుడికి చేరుకుంటాయి. బుధవారం పొద్దున వచ్చే బైరాగి వేషం మొదటిది. సాయంత్రం పాముల వేషం, బేస్తవారం పొద్దున గొల్ల, సాయంత్రం బండ వేషాలు ఉంటాయి. శుక్రవారం పొద్దున కోమటి, సాయంత్రం తోటి వేషాలు. శనివారం పొద్దున్నే ఒకప్పుడు జంగం వేషం వచ్చేది కాని ఇపుడు రావడం లేదు. సాయంత్రం దొర లేదా రాజు వేషం, బంటు వేషాలు. రాజు పాళెగాణ్ణి వధించి ‘బండిపీనుగు’ అని పాళెగాని శవాన్ని ఊరేగిస్తారు.ఆదివారం మాతంగి, పోతురాజు వేషాలు కాని ఇపుడు పోతురాజు వేషం రావడం లేదు. సోమవారం రెండు పసుపు కుండల వేషాలు. మంగళవారం పేరంటాలు వేషం ఊరు తిరుగు కుంటూ బుధవారం తెల్లవారు జామున గుడిలో ప్రత్యేకంగా తయారు చేసిన గంగమ్మ బొమ్మ చెంప నరుకుతుంది. తోటి వేషం నుంచి వేపాకు తప్పనిసరి. భక్తులు ఎక్కువ ఇష్టపడే వేషం తోటి వేషం. పాళెగాణ్ణి పట్టుకోవడానికి గంగమ్మ వేషాలు వేస్తుందనీ, దొర వేషంలో పట్టుకొని చంపివేస్తుందనీ కొన్ని కథలు చెప్తాయి.బైరాగి వేషం గొడుగు, పాముల వేషం కావడి, గొల్ల వేషం మజ్జిగ దుత్తతో వస్తే; బండ, తోటి వేషాలు కొత్త చేటతో వస్తాయి. దొర చేతిలో కత్తి, పేరంటాలు చేతిలో గంగమ్మ అద్దం, కోమటి వేషం మెడలో కరవాళ్ల జందెం ఉంటాయి. వేషాలు ఇంటి గుమ్మం తొక్కి ఆశీర్వదించడంలో కూడా ఒక వ్యవస్థ ఉంది. మాతంగి హారతి పళ్లెంలో ఒడిబాల బియ్యం వేసి, సున్నపుకుండలు, పసుపు ఇచ్చి, పేరంటాలు పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వదిస్తే; తోటి వేషం చేటతో, పొరకతో కొట్టి ఆశీర్వదిస్తుంది.చదవండి: భవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు?గంగజాతరలో గుడి తరపు వేసే వేషాల్ని కైకాల వారు, మేకల తూరి, మంగపతి ఇంటిపేరు కల్గిన చాకలి వారు మాత్రమే వేస్తారు. చాకలి వారు బైరాగి నుంచి రాజు వేషం దాకా వేస్తే... మాతంగి, పసుపుకుండలు, పేరంటాలు వేషాలు కైకాలవారు వేస్తారు. ప్రస్తుతం ప్రతి వేషంతో పాటు ఆడవేషం కూడా వస్తోంది. వేషాల్లో చాకలి వారు వేసేవి ఒక వర్గంగా, కైకాలవారు వేసేవి మరో వర్గంగా విభజించి చూసినపుడు వాటి మధ్య ఒక అడ్డురేఖ ఉన్న విషయం గుర్తించవచ్చు. మగ వేషాలు మిరాశీ లేదా పూర్వం నుంచి పోతున్న కుటుంబాల దగ్గరికే పోతాయి. ఆడవేషాలు ప్రతి ఇంటి గడప తొక్కు తాయి. వేషధారణ, దీవెనలో కూడా తేడా ఉంది. మగ వేషాలకు ప్రత్యేక పాటలున్నాయి, బూతు పాటలున్నాయి. మగ వేషాలు గంగమ్మ గుడి దగ్గరకు పోతాయి కాని గుడిలోకి పోవు. రాజు మంత్రి వేషాలు వేశాలమ్మ గుడి దగ్గరకు పోతాయి గాని గుడిలోకి పోవు.- ప్రొఫెసర్ నాగపట్ల భక్తవత్సల రెడ్డి జానపద విజ్ఞాన పరిశోధకులు -
మెట్ఫార్మిన్ ఎన్ని రోగాలకు మందో తెలుసా?
దేశంలో సుమారు 10 కోట్ల మంది మధుమేహలున్నారు. వీరిలో చాలామంది వాడే మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఒక్క మధుమేహానికి మాత్రమే కాదు.. అనేక ఇతర రోగాలకూ చికిత్సగా ఉపయోగపడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. పైగా.. ఈ మందు ఇప్పటివరకూ అనుకుంటున్నట్లు కాలేయంలో కాకుండా... మన ప్రేగుల్లో పనిచేస్తూ రకరకాల వ్యాధుల ఉపశమనానికి పనికొస్తున్నట్లు నార్త్వెస్ట్ర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ తాజా పరిశోధన వివరాలు.. మీకు తెలుసా.. మెట్ఫార్మిన్కు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. 1922లో బ్రిటిష్, ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా తొలిసారి దీన్ని తయారు చేస్తే... ఆ తరువాత 1957 నుంచి ఫ్రాన్స్‌లో వాడకంలో ఉంది. కానీ.. 1995లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చిన తరువాత మాత్రమే ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఒక్క అమెరికాలోనే సుమారు రెండు కోట్ల మంది ఈ మందు వాడుతూ రక్తంలోని చక్కెర మోతాదులను నియంత్రించుకుంటున్నారు. కాలేయంలో చక్కెర ఉత్పత్తిని కట్టడి చేయడం ద్వారా ఈ మందు పనిచేస్తున్నట్లు ఇప్పటివరకూ అనుకునే వారు కానీ.. వాస్తవానికి ఈ మందు ప్రేగుల్లోని మైటోకాండ్రియాపై ప్రభావం చూపడం ద్వారా కణాలు ఎక్కువ గ్లూకోజును శోషించుకునేలా చేస్తోంది అంటున్నారు నవదీప్ ఛండేల్.నార్త్ వెస్ట్ర్న్ యూనివర్శిటీ ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ఈ శాస్త్రవేత్త మెట్ఫార్మిన్ మన పేవుల్లో ఎలా పనిచేస్తున్నాయో గుర్తించేందుకు పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే మెట్ఫార్మిన్ అనేది పేగు కణాల్లోని మైటోకాండ్రియా సిట్రులిన్ అనే రసాయనం ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ఈ రసాయనం చిన్న పేగు కణాల్లోని మైటోకాండ్రియాలో మాత్రమే ఉత్పత్తి అవుతుండటం విశేషం. అలాగే మెట్ఫార్మిన్ అనేది ఆకలిని తగ్గించే సంకేతాలు పంపే గ్రోత్ డిఫరెన్షియయేషన్ ఫ్యాక్టర్ 15 ఉత్పత్తిని పెంచుతున్నట్లు తేలింది. ఫలితంగా పేగు కణాలు మరింత ఎక్కువ గ్లూకోజును శోషించుకున్నట్లు నవ్‌దీప్ ఛండేల్ వివరించారు. ఇలా శోషించుకున్న అధిక గ్లూకోజును కణాలు లాక్టేట్, లాక్ఫే అనే పదార్థాలుగా మార్చేస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మధుమేహ నియంత్రణకు ఉపయోగపడుతుందని భావిస్తున్న బెర్బెరిన్, ఫిన్ఫార్మిన్ వంటివి కూడా ఇదే పద్ధతిలో పేగుల్లోనే చక్కెరలను నియంత్రిస్తున్నట్లు వీరు తెలిపారు. పరిశోధన వివరాలు నేచర్ మెటబాలిజమ్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.శుభవార్త ఏమిటంటే...మెట్ఫార్మిన్ ఒక్క చక్కెర నియంత్రణకు మాత్రమే పరిమితం కాదని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఒజెంపిక్, మంజారో వంటి జీఎల్పీ-1 మందుల వాడకాన్ని నిలిపివేసిన వాళ్లు శరీర బరువును నియంత్రించుకునేందుకూ మెట్ఫార్మిన్ ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది. వయసుతోపాటు కణాలను చుట్టేసే మంట/వాపులను నియంత్రించడం, ప్రొస్టేట్ కేన్సర్ బాధితుల్లో వ్యాయామంతో వచ్చే లాభాలను అదేదీ లేకుండానే ఇవ్వడం మెట్ఫార్మిన్ తాలూకూ లక్షణాలని శాస్త్రవేత్తలు గుర్తించారు.ఎముకలు. కీళ్లు అరిగిపోయిన సందర్భంలో వచ్చే నొప్పిని కూడా ఈ మందు నియంత్రిస్తుందని, మెదడు పనితీరును కూడా పరిరక్షిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ పరిశోధనలు తొలి దశలో మాత్రమే ఉండటం గమనార్హం. మరిన్ని విస్తృత స్థాయి పరిశోధనలు జరిగి ఫలితాలు నిర్ధారణ అయితేగానీ.. ఇతర ఆరోగ్య సమస్యలకు మెట్‌ఫార్మిన్‌ను మందుగా వాడటం ప్రారంభం కాదు. అప్పటివరకూ వేచి చూడాల్సిందే మరి. -గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
తెలంగాణ పురుషుల్లో జుట్టుతో పాటు జీర్ణశక్తి కూడా క్షీణిస్తోంది..!
1.6 లక్షల మంది భారతీయ పురుషుల పై నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జీర్ణఆరోగ్యం అత్యంత వేగంగా క్షీణిస్తున్న రాష్ట్రంగా తెలంగాణతొ లిస్థానంలో నిలిచింది. పురుషుల్లో జుట్టురాలడం మరియు జీర్ణఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. దేశంలో జుట్టు రాలుదల సమస్యలకు పరిష్కారాలు అందిస్తున్న ప్రముఖ బ్రాండ్ త్రాయ హెల్త్ నిర్వహించిన జాతీయ గట్-హెయిర్‌హెల్త్ అధ్యయనం తెలంగాణలో నిశ్శబ్దంగా ముదురుతున్న ఆరోగ్యసం క్షోభాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దేశంలోని పది ప్రధాన ప్రాంతాలపై 2024డిసెంబర్ నుంచి 2025డిసెంబర్ వరకుసేకరించిన 1.6లక్షల మందికి పైగా భారతీయ పురుషుల స్వీయ ఆరోగ్య వివరాలను ఈ అధ్యయనం పోల్చింది. జీర్ణ వ్యవస్థ పని తీరును అంచనా వేయడానికి మలబద్ధకం తరచుదల్ని ప్రధానసూచికగా తీసుకుని, పురుషుల్లో జుట్టు రాలుదలతో సంబంధం ఉన్న మార్పులను విశ్లేషించింది. అధ్యయనంలో భాగమైన పది రాష్ట్రాల్లో తెలంగాణలోనే జీర్ణఆరోగ్యం అత్యధికంగా క్షీణించినట్లు తేలింది.తెలంగాణ పరిస్థితిరోగ్యకరమైన జీర్ణ క్రియకు సూచికగా భావించే “మలబద్ధకం తక్కువగా లేదా లేకపోవడం” తెలిపిన తెలంగాణ పురుషుల శాతం 2024 డిసెంబర్లో 19.13% ఉండగా, 2025 డిసెంబర్‌కు 15.03%కు పడిపోయింది. ఏడాదిలోనే 4.10 శాతం పాయింట్ల పడిపోవడం నమోదైంది. అధ్యయనంలో ఇది రాష్ట్రస్థాయిలో నమోదైన అతి పెద్ద క్షీణత. రాష్ట్ర జనాభా పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ తగ్గుదల వేలాది మంది పురుషులు తెలియకుండానే దీర్ఘకాలిక జీర్ణ సమస్యల వైపు జారుతున్నారనే సంకేతంగా నిపుణులు చెబుతున్నారు.దేశంలో అత్యంత పట్టణీకరణ, విద్యావంతులశాతం, ఆర్థిక చురుకుదనం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. హైదరాబాద్ దేశ ఐటీ రంగానికి కేంద్రంగా నిలుస్తోంది. ఇదే సమస్యకు ప్రధాన కారణమవుతోందని త్రాయ హెల్త్పేర్కొంది.ఆధునిక పట్టణ జీవనశైలి కారణాలు జీర్ణ ఆరోగ్య క్షీణతకు దారితీస్తున్న ప్రధాన అంశాలుగా గుర్తించింది:10 నిమిషాల డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల సులభంగా అందుబాటులోకి వచ్చిన అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారంఐటీ, సర్వీ సెస్రంగాల్లో నిరంతర పని సంస్కృతి కారణంగా అసమయ భోజనాలువరుస పనులతో నీరుతాగడంలో నిర్లక్ష్యంఒత్తిడిని తగ్గించుకోవడానికి అలవాటైన స్ట్రెస్ ఈటింగ్జీర్ణ క్రియ–జుట్టు సంబంధం మన జీర్ణ వ్యవస్థనే జుట్టుకు అవసరమైన పోషకాల సరఫరా గొలుసుగా నిపుణులు వివరిస్తున్నారు. జుట్టు ప్రధానంగా ప్రోటీన్‌తో తయారవుతుంది. ఐరన్, జింక్, విటమిన్లు వంటి పోషకాలు జుట్టు మూలాలకు చేరాలంటే ముందుగా అవి పేగుల ద్వారా శోషించబడాలి. జీర్ణ క్రియ బలహీనపడితే శరీరం అవసరమైన పోషకాలను ముఖ్య అవయవాలకు మళ్లిస్తుంది. జుట్టుకు మిగిలినదే అందుతుంది. దీని ప్రభావం కాలక్రమేణా జుట్టు రాలుదలగా కనిపిస్తుంది.అలాగే బలహీనమైన జీర్ణ వ్యవస్థ శరీరంలో అల్ప స్థాయి వాపును (ఇన్ఫ్లమేషన్) పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదల చక్రాన్ని దెబ్బతీసి, జుట్టు ముందుగానే విశ్రాంతి దశలోకి వెళ్లేలా చేస్తుంది. కొత్త జుట్టు పెరుగుదల తగ్గి, పాత జుట్టు రాలడం పెరుగుతుంది.ఈ సమస్యలను షాంపూలు లేదా ఆయిల్స్ ద్వారా పరిష్కరించడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ప్రాంతీయ స్థాయి పరిశీలనలు తెలంగాణ వినియోగదారుల పై త్రాయహెల్త్ సేకరించిన డేటా కూడా ఇదే పరిస్థితిని చూపిస్తోంది. జుట్టు రాలుదలతో వచ్చే పురుషుల్లో జీర్ణ సమస్యలు, పోషకాల శోషణలోపం, అసమయ జీర్ణ క్రియ, అంతర్గత వాపు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడించింది.త్రాయ హెల్త్ సహ వ్యవస్థాపకురాలు సలోని ఆనంద్ మాట్లాడుతూ…“తెలంగాణ గణాంకాలు నిర్లక్ష్యం చేయలేని హెచ్చరిక. ఇవి ఆరోగ్యస మస్యలతో బాధపడుతున్న వ్యక్తుల గణాంకాలు కావు; దేశంలోని అత్యంత చురుకైన నగరంలో పని చేస్తున్న వృత్తి పరులవి. కానీ అదే జీవనశైలి జీర్ణ వ్యవస్థను నెమ్మదిగా దెబ్బతీస్తోంది. జీర్ణ క్రియ దెబ్బతింటే మొదట కనిపించే ప్రభావం జుట్టు రాలుదల ”అని పేర్కొన్నారు. -
బొమ్మల ప్రపంచంలోకి...
ఫ్రెండ్స్, గ్రేట్ పెయింటర్ పికాసో గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఆయన మీ గురించి ఏమన్నారో తెలుసా? ‘పిల్లలందరూ చిత్రకారులే!’ అని. మీకు తెలియకుండానే మీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారన్నమాట. ఆ ఆర్టిస్ట్‌ను ఈ సెలవుల్లో బయటికి తీసుకువస్తే భలే ఉంటుంది కదూ! మీకో విషయం చెప్పాలి... ‘ఎప్పుడూ కార్టూన్ సీరియల్స్ చూసే బదులు బొమ్మలు వేయడం నేర్చుకోవచ్చు కదా!’ అని మొన్న ఒక అబ్బాయితో వాళ్ల నాన్నగారు అంటే... ‘ఎందుకు టైమ్‌వేస్ట్... ఇలా ప్రాంప్ట్ ఇస్తే అలా బొమ్మలు వచ్చే యాప్స్ చాలా ఉన్నాయి’ అన్నాడట ఆ పిడుగు! మీకు కూడా ‘నిజమే కదా!’ అనిపిస్తుంది. ఇలా ప్రాంప్ట్ ఇవ్వగానే, అలా బొమ్మలు రావడం బానే ఉంటుంది. అయితే మనమే స్వయంగా బొమ్మలు గీయడం వల్ల, బొమ్మలు వేయడం నేర్చుకోవడం వల్ల బో...లెడు ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏమిటంటే...→ కంటితో చూస్తున్నదానికి అనుగుణంగా చేతి కదలికలు (హ్యాండ్ మూమెంట్స్) చేయడానికి మీలాంటి పిల్లలు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. చిత్రకళ ఆ సమస్య లేకుండా చేస్తుంది.→ గీతల లోపల రంగులు వేయడం ద్వారా చేతి–కంటి సమన్వయం(హ్యాండ్–ఐ కోఆర్డినేషన్) మెరుగుపడుతుంది.→ హ్యాండ్–ఫింగర్ స్ట్రెంగ్త్ మెరుగుపడుతుంది.→ స్పాంజ్ ఆర్ట్. వేలితో రంగులు వేయడం, టెక్స్చర్డ్ పేపర్‌ను ఉపయోగించడం ద్వారా స్పర్శజ్ఞానం (టాక్టయిల్ పెర్సెప్షన్) పెరుగుతుంది.→ రకరకాల సైజుల బ్రష్‌లను ఉపయోగించడం వల్ల గ్రిప్ అండ్ కంట్రోల్ పెరుగుతుంది.→ రాయడానికి, పట్టుకోవడానికి, కత్తిరించడానికి... తదితర పనులకు రిస్ట్ స్టెబిలిటీ కావాలి. అడ్డంగా, నిలువుగా బ్రష్‌తో గీతలు గీయడం ప్రాక్టిస్ చేయడం వల్ల రిస్ట్ మజిల్స్ స్ట్రెంతెన్ అవుతాయి.→ చిత్రలేఖనం ఏకాగ్రతను పెంచుతుంది.→ బొమ్మలు గీయడం అనేది కొత్తగా ఆలోచించడాన్ని నేర్పుతుంది. మీరు ఎంపిక చేసుకున్న కలర్స్, బ్రష్ స్ట్రోక్స్, కొల్లాజ్ పీస్ మీలో క్రియేటివిటీని, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుస్తాయి.→ చిత్రకళ మీ దినచర్యలో భాగం అయ్యేలా చూసుకోండి. మీ ఫీలింగ్స్‌ను వ్యక్తీకరించడానికి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కు ఆర్ట్ సాధనంగా ఉపయోగపడుతుంది.→ మీలో ఊహశక్తి (ఇమాజినేషన్) విస్తరించడానికి చిత్రకళ ఉపయోగపడుతుంది.ఆల్ఫాబెట్స్‌తో అలవోకగా బొమ్మలే బొమ్మల్!ఆల్ఫాబెట్స్, అంకెలతో స్పీడ్ స్పీడ్‌గా బొమ్మలు గీయడం భలే సరదాగా ఉంటుంది. ‘ఏబిసిడి డ్రాయింగ్’ ‘ఎంటైర్ ఆల్ఫాబెట్ ఏబీíసీ డ్రాయింగ్స్’ ‘హౌ టూ డ్రా విత్ ఆల్ఫాబెట్స్’ ‘ఆల్పాబెట్స్ డ్రాయింగ్స్ ఫర్ కిడ్స్’ ‘ఈజీ డ్రాయింగ్స్ విత్ ఎబిసిడి’ ‘హౌ టు డ్రా ఏ పిక్చర్ ఫ్రమ్ నంబర్ 6’ ‘హౌ టు డ్రా ఎనీథింగ్ ఫ్రమ్ నంబర్స్ ఈజీ’లాంటి వీడియోలు ఎన్నో యూట్యూబ్‌లో ఉన్నాయి.చిన్న వయసులోనే...పెద్ద పేరు!→ అహ్మదాబాద్‌కు చెందిన దుర్వ హిరల్ బ్రహ్మభట్ రెండు సంవత్సరాల ఆరు నెలల వయస్సులోనే కాన్వాస్, కాగితంపై వందకు పైగా చిత్రాలను గీసి రికార్ట్ సృష్టించింది.→ ‘ఆరుషి ఆర్ట్’గా ఫేమస్ అయిన ఆరుషి భట్నాగర్ చిన్న వయసు నుంచి బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. 52 చిత్రాలతో సోలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న ఆరుషి చిత్రకళలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.→ గుజరాత్‌కు చెందిన అవ్యాన్ పటేల్ రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో తాను గీసిన 250కి పైగా పెయింటింగ్స్‌తో సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన బాలుడిగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.పిల్లలూ... పికాసోఫ్రెండ్స్... పాబ్లో పికాసో చాలా పెద్ద ఆర్టిస్ట్ అనే విషయం మీకు తెలుసుకదా! ‘కళలో స్వచ్ఛత ఉండాలంటే చిత్రకారులలో పసితనం ఉండాలి’ అనేది పికాసో మాట. మీరు (పిల్లలు) అంటే పికాసోకు చాలా ఇష్టం. ఆయన మాటల్లో మీపై ఉన్న ప్రేమ కనిపిస్తుంది. పికాసోకు చిన్నప్పుడు బొమ్మలు గీయడం, పేపర్స్ నుంచి బొమ్మలను కత్తిరించడం అంటే ఇష్టం. క్లాస్‌రూమ్‌లో ఒక మూల కూర్చొని బొమ్మలు వేస్తుండేవాడు! ఎనిమిది సంవత్సరాల వయసులో మొదటి ఆయిల్ పెయింటింగ్ వేశాడు. దీనికి ‘ది లిటిల్ యెల్లో పికాడోర్’ అని పేరు పెట్టాడు. తొమ్మిది సంవత్సరాల వయసులో తనకు ఇష్టమైన పావురాలు, ఎద్దుల పోరాట దృశ్యాలు గీసేవాడు. మనం ఏ రంగంలో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నామో...ఆ రంగంలోని పెద్ద వాళ్లపై వచ్చిన పుస్తకాలు లేదా వారు రాసిన పుస్తకాలు చదువుతూ ఉండాలి. గ్రేట్ ఆర్టిస్ట్ పికాసో గురించి... ఏ లైఫ్ ఆఫ్ పికాసో, పికాసో: ఎ బయోగ్రఫీ, పికాసో క్యూబిజం... మొదలైన పుస్తకాలు ఎన్నో వచ్చాయి.– యాకుబ్ -
అమ్మ ప్రేమకో నూలుపోగు
చిన్నప్పుడు అమ్మ మన చేయి పట్టుకుని బజారుకు తీసుకెళ్లి ఎన్నో కొని పెట్టి ఉంటుంది. మనం అమ్మకు ఏదైనా కొని పెట్టి ఎంతకాలం అయ్యింది? అమ్మ ఏమీ అడగదు... పిల్లలకు ఇబ్బంది అని. కాని చిన్నప్పుడు మన ప్రతి ఇబ్బందిని వెయ్యి కళ్లతో చూసి దూరం చేసి ఉంటుంది. మే 10 మదర్స్ డే. ఇక్కడున్న బహుమతులన్నీ మీరు అమ్మకు ఇవ్వొచ్చు. అన్నీ కలిపినా పదీ పదిహేను వేలు మించవు. అమ్మ ప్రేమ ముందు ఆ విలువ దిగదుడుపు కదూ.1. ఎలక్ట్రికల్ హాట్ వాటర్ బ్యాగ్మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పితో అమ్మ రాత్రిళ్లు నిద్రపోదు. కాపడం పెట్టుకోవడానికి గ్యాస్ మీద నీళ్లు కాచి పొయ్యి దగ్గర నిలబడే ఓపిక ఉండదు. మనందరం ఆమె ఇంటి సభ్యులమే. కాని ఎవరు ఏ పనిలో ఉన్నారో అని అమ్మ డిస్ట్రబ్ చేయదు. మౌనంగా నొప్పులు భరిస్తుంది. ఆమెకు ఈ హాట్ వాటర్ బ్యాగ్ కానుకగా ఇస్తే ఎంత బాగుంటుంది. ఈ బ్యాగ్‌ను అయిదు నిమిషాలు ఛార్జ్ చేస్తే ఆరు గంటలు వేడిగా ఉంటుంది. రాత్రి పక్కలో పెట్టుకుంటే వెన్ను నొప్పి మాయం, హాయిగా నిద్ర. ‘వీడు నా నొప్పిని గుర్తుపెట్టుకున్నాడు’ అమ్మ తృప్తి పడితే ఎంత సంతోషం! వెల: రూ.300 నుంచి.2. నాన్–స్లిప్ స్లిప్పర్స్ + బాత్రూమ్ హ్యాండిల్ బార్‘అమ్మా జాగ్రత్త‘ అని ఫోన్ లో చెప్తాం కానీ బాత్రూమ్లో జారి పడితే లేపడానికి ఉండం. ఈ స్లిప్పర్స్ వేసుకుంటే తడి నేల మీద కూడా జారదు. గోడకి ఒక హ్యాండిల్ బార్ బిగిస్తే పట్టుకుని లేవొచ్చు, అమ్మ కోసం అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అమ్మ నిద్ర పోయే ముందు ఆమె పాదాలు నొక్కుతూ కూర్చునే టైమ్ ఉండటం లేదు. కనీసం ఈ స్లిప్పర్స్‌తో అయినా కొంత పరిహారం చేసుకోవచ్చు. వెల: రూ.800 నుంచి3. బిగ్ బటన్ ఫోన్ విత్ ఎస్.ఓ.ఎస్స్మార్ట్ఫోన్ ఇస్తే అమ్మకి కన్ ఫ్యూజన్. లాక్ తియ్యడం, వాట్సాప్ చేయడం... ఒక్కోసారి రాంగ్ నంబర్‌కి కాల్ వెళ్తుంది. అదే ఈ ఫోన్ లో అయితే నంబర్లు పెద్దగా కనిపిస్తాయి. పైగా మూడు ఫోటో బటన్లు ఉంటాయి. మన ఫోటో నొక్కితే డైరెక్ట్‌గా మనకే కాల్ వస్తుంది. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే అయిదు నంబర్లకి కాల్, మెసేజ్ వెళ్తుంది. అమ్మకు మనం గుర్తు పెట్టుకుని ఫోన్ చేయకపోయినా అమ్మ మనల్ని గుర్తు పెట్టుకొని ఫోన్ చేయడానికి ఇదే మంచి కానుక. వెల: 1200 నుంచి.4. రీడింగ్ గ్లాసెస్అమ్మకు కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఆమెకు కొత్త అద్దాలు మార్చి ఎంత కాలం అయ్యింది? మంచి రీడింగ్ గ్లాసులు కొని పెడితే ఆమె చదువుకునే గీత, రామాయణం స్పష్టంగా కనపడతాయి. న్యూస్‌పేపర్ హాయిగా చదువుకోవచ్చు. టీవీ సీరియల్ కంటే ఈ పుస్తకం మనశ్శాంతి ఇస్తుంది, టైమ్‌పాస్ అవుతుంది. చిన్నప్పుడు ఒళ్లో కూర్చోబెట్టుకుని నీతి కథలు, రాముడి కథ చెప్పి నిద్రపుచ్చింది. ఇవాళ మనం ఇచ్చిన కళ్లజోడు ఆవిడకి కథల పుస్తకాలు చదివేందుకు ఉపయోగపడి నిద్ర పుచ్చుతాయి. రూ. 500 నుంచి.5. వాకింగ్ స్టిక్ విత్ ఎల్.ఇ.డి. లైట్ ప్లస్ సీట్ఒక వయసుకు వచ్చాక గుడికి వెళ్లాలన్నా, మార్కెట్‌కి వెళ్లాలన్నా ‘తోడు ఎవరున్నారు‘ అనే భయం అమ్మకు. ఈ స్టిక్ పట్టుకుంటే ఆసరాగా ఉంటుంది. అలిసిపోతే మడత విప్పి సీట్ మీద కూర్చోవచ్చు. రాత్రి కరెంట్ పోయినా ఎల్ఇడి లైట్ వెలిగిస్తే దారి కనపడుతుంది, కాలు జారదు. ‘అమ్మా, నువ్వు నడవలేవులే‘ అని ఇంట్లో కూర్చోబెట్టే బదులు ‘ఈ స్టిక్ పట్టుకో, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు‘ అని ధైర్యం ఇస్తే అదే అసలైన గిఫ్ట్. రూ. 1000 నుంచి.6. మెడిసిన్ ఆర్గనైజర్ బాక్స్ విత్ అలారంషుగర్, బీపీ, కీళ్ల నొప్పులు... రోజుకి నాలుగు రకాల మాత్రలు. ‘వేసుకున్నానో లేదో‘ అని అమ్మ కన్ ఫ్యూజ్ అవుతుంది. ఒకోసారి రెండుసార్లు వేసుకుంటుంది. ఈ బాక్స్‌లో ఏడు రోజుల మందులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి లెక్కన విడివిడిగా సర్దొచ్చు. టైమ్‌కి అలారం మోగితే తిప్పలు లేకుండా వేసుకుంటుంది. మనకు జ్వరం వస్తే అర్ధరాత్రి లేచి మరీ మాత్ర వేసిన అమ్మకు ‘అమ్మా, నీ ఆరోగ్యం నాకు గుర్తుంది‘ అని చెప్పే కానుక ఇది. రూ.700 నుంచి.7. ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ మానిటర్‘తలనొప్పిగా ఉంది... కళ్లు తిరుగుతున్నాయి’... అని అమ్మ అంటే వెంటనే హాస్పిటల్‌కి పరుగెత్తక్కర్లేదు. చేతికి కట్టి బటన్ నొక్కితే 30 సెకన్లలో బి.పి, పల్స్ రీడింగ్ ఇస్తుంది. డాక్టర్‌కి ఫోన్ లో చెప్పొచ్చు, వైద్య సలహా తీసుకోవచ్చు. చిన్నప్పుడు మనం జారి పడితే అమ్మ గుండె వేగం పెరిగేది, ఇవాళ ఆవిడ గుండె లయ తప్పకుండా చూసే బాధ్యత మనది. ‘అమ్మా, నీ గుండె చప్పుడు నాకు వినపడుతుంది, ఇదిగో మిషన్ పెట్టి చూస్తున్నా’ అని భరోసా ఇవ్వొచ్చు. వెల: రూ.15008. మెత్తటి కాటన్ నైటీలు – 2 జతలుఅమ్మ ఇంట్లో వేసుకునే బట్టల మీద ఎప్పుడైనా దృష్టి పెట్టామా? చిరిగిపోయిన, వెలిసిపోయిన, బిగుతుగా ఉండే నైటీతోనే రాత్రిళ్లు నిద్రపోతుంది. ‘నాకు కొత్త బట్టలేందుకురా, ఉన్నవి చాల్లే‘ అంటుంది. కానీ మెత్తటి, లూజ్‌గా, చెమట పీల్చే కాటన్ నైటీ వేసుకుంటే ఆవిడకి హాయిగా నిద్రపడుతుంది. ముఖ్యంగా వేసవిలో. లేత రంగు, పెద్ద సైజు, ముందు జిప్ లేదా బటన్స్ ఉన్న రెండు జతల నైటీలు కొనివ్వండి. చిన్నప్పుడు స్కూల్ యూనిఫాం మాసిపోకుండా, మడత నలగకుండా అమ్మే ఇస్త్రీ చేసి వేయించేది. ఇవాళ ఆవిడ సౌకర్యంగా ఉండటానికే అమ్మ ప్రేమకో నూలుపోగు. వెల: రూ.1200 నుంచి 2 జతలకి.కె. -
జ్ఞాన శంఖం 'పూరి'ద్దాం!
‘‘కంగారూ అంటూ దానికా పేరెందుకు పెట్టారం’టే ‘‘సింపుల్.. అది కంగారుపడుతూ ఉండే జంతువు కాబట్టి’’ అనగలడు మా రాంబాబు గాడు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే...సరిగ్గా మా రాంబాబుగాడు పూరీ తింటున్న టైమ్‌కు వెళ్లి బుక్కయియాన్నేను. ‘లోకాస్సమస్త పూరీ తినంతు... నువ్వు కూడా పూరీ తిందువుగానీ రారా... ’ అంటూ ఆనంమాయంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచాడు మా రాంబాబుగాడు. ‘‘ఆ కొటేషన్‌కు అర్థమేంట్రా?’’ అడిగా. ‘‘లోకాలన్నింటికీ పూరీ తినే అదృష్టం దక్కుగాక! ఎందుకంటే పూరీ అనేది ఓ అద్భుతమైన తినుబండారం. దాని బండారం బట్టబయలైతే... బోల్డన్ని లైఫ్ లెసన్స్ చెబుతుందది’’ గ్యాపులేకుండా మరో కొటేషన్ విసరనే విసిరాడు. ‘‘పూరీ లైఫ్ లెసన్స్ చెప్పడమేంట్రా?’’ ‘‘సరిగ్గా చూడు. పెనం మీదికి చపాతి ఠపీమంటూ మళ్లీ లేవకుండా పడిపోతుంది. కానీ మన పూరీ...?! సిమ్మింగ్పూల్లోకి డైవ్ కొట్టినంత చలాగ్గా చులాగ్గా ఏటవాలుగా నూనెలోకి ఇలా మునుగుతుందా... అంతలోనే ఆ తైలం తాలూకు నునుపైన అలల మీద అలా అలా తేలియాడుతూ మూకుడులో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ పాడుతూ ‘పూరీ విహారం’ చేస్తుంది. అంటే ఏమిటర్థం? చపాతీలా చతికిలపడిపోకూడదూ... చుట్టూ కష్టాల నూనెసాగరం ఉన్నా సరే... పూరీలా తేలి పైకిరావాలీ! పిండి గోధుమరంగులో ఉన్నా... నూనెలో తనను కాల్చేస్తున్నా, మాడ్చేస్తున్నా తనను తాను మెరుగుపెట్టుకుని మెరుగుబంగారు రంగు సంతరించుకుని మెరుస్తుండాలీ... అనే సందేశమిస్తుందిరా పూరీ. ఇంతకంటే లైఫ్ లెసన్ ఏముంటుంద్రా’’ ఆవేశపడ్డాడు రాంబాబుగాడు. ‘‘నేనెప్పుడూ అంత ఆలోచించలేదురా’’ అన్నా. అంతే... ‘‘ఒరేయ్... ప్లేటులోకి పూరి పడిపోగానే ఎప్పుడెప్పుడు తిందామా అంటూ ఆబగా నువ్వెదురు చూస్తావు. కానీ బాగా లోతైన అంతర్గత అవలోకిత మహా మహిమాన్విత తత్వలోకైక తాత్విక దృష్టితో విషయాల్ని పరిశీలించినప్పుడపు ఇంకెంతో జ్ఞానాన్ని ప్రసాదించేదేరా పూరీ. అందుకే ‘సర్వ టిఫినానాం పూరీ ప్రధానం’ అన్నది శాస్త్రోక్తి’’ అంటూ మళ్లీ చెలరేగిపోయాడు. ‘‘నిజమేరా... ఎంత జ్ఞానం రా బాబూ నీకూ’’ అంటూ కాస్త వ్యంగ్యం మిక్స్ చేసి కొట్టా గానీ... లాభం లేదు. దీన్నీ వాడు సీరియస్ పొగడ్తగానే తీసుకున్నాడు. ‘‘అన్నట్టు... ఇక్కడ జ్ఞానానికీ పూరీకి కూడా ఓ పోలిక ఉంది చూశావా? పూరీలో పొరలున్నాయనీ... వాటి మధ్య ఖాళీ స్థలమనేది ఉందనే విషయం కూడా తెలియనట్టే అమాయకంగా ఉంటుందది. టైమొచ్చినప్పుడు తన పొరలలోకి గాలిని జ్ఞానంలా నింపుకుంటుంది. అంటే ఏమిటీ... మనిషనేవాడు ఏ హడావుడీ లేకుండా, నిరాడంబరంగా, నిశ్శబ్దంగా మెదడులోకి జ్ఞానం ఊరేలా చేసుకోవాలి. ఎట్టకేలకు... పూరీలా ఊరేంత జ్ఞానసముపార్జన చేసుకోవడం కంటే మనిషి బతుక్కు ఇంతకు మించి సార్థకత లేదూ– అనే సందేశమిస్తుందిరా మన పూరీ!’’ఇంతవరకు విన్నాక అలా బయటకెళ్తూ ‘‘కంగారుపడుతూ ఉండటం వల్ల ఆ జంతువుకు ‘కంగారు’ అనే పేరొచ్చిందనేది ఎంత నిజమో... వేలెట్టి పొడిచి బొక్కెట్టాక పూరీలోని గాలి విశ్వవ్యాపితం కావడం ఎంత వాస్తవమో... నీ జ్ఞానం కూడా ఒకనాటికి విశ్వమంతటా విస్తరించడం కూడా అంతే ఖాయం రా’’ అంటూ గొణుక్కుంటూ బయల్దేరా. కానీ వాడు మాత్రం ‘‘కరెక్ట్... పూరీ రక్షతి రక్షితః’’ అంటూ మరో ముక్క తుంచి... బొంబాయి చట్నీలో ముంచి... నోరంతా తెరచి... హాయిహాయిగా... రుచిరుచిగా తినడానికి రెడీ అయ్యాడు. – యాసీన్ -
‘బేబీ రిస్ట్’ అంటే ఏంటో తెలుసా..!
నెలల పిల్లలనూ, క్యూట్‌గా ఉండే టాడ్లర్స్నూ గాల్లోకి ఎగరేసినట్టుగా అమాంతం ఎత్తుతుంటారు తల్లులు. చిన్నపిల్లలను ముఖ్యంగా తల్లిదండ్రులు తమ బొటన వేలూ, చూపుడువేలు మధ్యన ఎత్తుకుని గిరగిర తిప్పుతూ ఎగరేసినట్లుగా చేసే సమయంలో చూపుడువేలూ, బొటనవేలి మధ్యనా, అలాగే మణికట్టు దగ్గర ఒత్తిడి కారణంగా టెండన్లు దెబ్బతినడం వచ్చే నొప్పిని ‘బేబీ రిస్ట్’ అంటారు. ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘డి క్వెర్వెయిన్స్ టెనోసినోవైటిస్’ లేదా ‘డి క్వెర్వెయిన్స్ టెండనైటిస్’ అంటారు. ఈ నొప్పి లేదా ఇన్ఫ్లమేషన్ మరీ ఎక్కువగా ఉంటే పెయిన్‌కిల్లర్స్‌తో చికిత్స అందించవచ్చు. (చదవండి: పెళ్లికి ముందు ఆ వైద్య పరీక్ష తప్పనిసరి..! లేదంటే..) -
ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే..
సాధారణ చెవుడు, బ్రహ్మ చెవుడు వంటివి వాటి గురించి విన్నాం. కానీ కేవలం పురుషుల మాటలు మాత్రం చెవికి వినపడని అరుదైన వైద్య పరిస్థితి గురించి విన్నారా..!?. ఔను అలాంటి వింత అనారోగ్య పరిస్థితితో బాధపడుతోంది ఈ మహిళ. పాపం తన ప్రియుడి మాటలు తనకు వినిపించడం లేదని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె. ఇదేం చెవుడు రా బాబు అనిపిస్తోంది కదూ. మరి ఆ కథా కమామీషు ఏంటో చూసేద్దామా..!.చైనాలోని జియామెన్‌లో ఒక మహిళ అక్షరాలా పురుషుల మాటలు వినలేదట. ఆమెకు మగవాళ్లంటే నచ్చక ఇలానేమో అనుకోకండి. చైనాలోని జియమోమెన్లో నివశించే మహిళ తన ప్రియుడు మాటలు వినపించడం లేదని తెలుసుకుంటుంది. అన్ని పెద్ద పెద్ద శబ్దాలు వినగలిగినా..తన లవర్ మాటలే తనకు ఎందుకు వినిపించడం లేదని వైద్యులను ఆశ్రయిస్తే అసలు విషయం బయటపడింది. ఆమె రివర్స్ స్లోప్ హియరింగ్ లాస్‌తో బాధపడుత్నుట్లు గుర్తించారు. ఈ అరుదైన వ్యాధి కారణంగానే ఆమె మగవాళ్ల గొంతుని వినలేదట. అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోవడంగా చెప్పొచ్చు. ధ్వని వర్ణపలంలో చాలా వరకు పురుషుల గొంతులు కచ్చితంగా తక్కువ ఫ్రీక్వెన్సీలోనే ఉంటాయట. కానీ ఈ బాధిత మహిళ అధిక స్థాయి శబ్దాలను, గొంతులను స్పష్టంగా వినగలుగుతుంది కానీ తక్కువ శ్రేణి లేదా ఓ మోస్తారు మీడియం శబ్దంలో వచ్చే మాటలు అస్సలు వినలేదని తేల్చి చెప్పారు వైద్యులు. ఆ హియరింగ్ లాస్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే..రోగి వినికిడిని మ్యాప్ చేయడానికి వైద్యులు ఉపయోగించే ఆడియోగ్రామ్ అనే చార్ట్‌పై ఈ వ్యాధి ఏర్పరిచే ఆకారం నుంచే దానికి ఆ పేరొచ్చిందంట. చాలా వరకు వినికిడి లోపం చార్ట్‌పై క్రిందకి వాలి ఉంటుందని, ఇది అధిక ఫ్రీక్వెన్సీల నష్టాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ ఆ మహిళ విషయంలో మాత్రం..అందుకు విరుద్ధంగా ఉంటుందని వివరించారు వైద్యులు. ఇలా కేవలం పురుషుల గొంతులకే పరిమితం కాదు, తక్కువ స్థాయిలో మాట్లాడే మహిళల స్వరాలను సైతం వినలేకపోవచ్చని కూడా అన్నారు. అదే సమయంలో అధిక స్థాయిలో మాట్లాడే పురుషుల మాటలు వినపడే అవకాశం ఉందని కూడా చెప్పారు. అంతేగాదు తక్కువ పౌనఃపున్య శబ్దాలు మానవ మాటలకు మించి విస్తరించి ఉంటాయని కూడా చెప్పారు. ఈ వ్యాధిని అంత తేలిగ్గా గుర్తించలేం..ఈ పరిస్థితిని అంత సులభంగా ఎవ్వరూ గుర్తించలేరని అంటున్నారు వైద్యులు. ఎందుకంటే చెవులు చిల్లులుపడే శబ్దాలను వినపడకపోవడాన్ని సులభంగా గుర్తించగలిగినంత ఈజీ కాదని చెప్పుకొచ్చారు. పాపం కొందరు ఈ అరుదైన వైద్య పరిస్థితి గురించి తెలియక ఏళ్లతరబడి గడిపేస్తుంటారని కూడా అన్నారు. మెనియర్స్ వ్యాధి, వైరల్ ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్ సంబంధిత సమస్యల వల్ల ఈ పరిస్థితి కారణం కావొచ్చని అన్నారు. అలాంటి బాధితులకు కొంత వరకు వినికిడి పరికరాలు కాస్త ఉపశమనం అందిస్తాయని అన్నారు. అలాగే ఆ మహిళ ప్రియుడికి దీన్ని వ్యక్తిగతంగా తీసుకుని ఇబ్బంది పెట్టడం వంటివి చేయకూడదని వైద్యులు సూచించారు కూడా. (చదవండి: బెల్స్ పాల్సీ వ్యాధి బారిన టెకీ..! కట్‌చేస్తే..) -
పాలలో ఆ నేల రుచి ఉంటుంది!
పచ్చిక బయళ్లు పరిరక్షించబడే చోట అత్యంత ఆరోగ్యదాయకమైన పాల ఉత్పత్తులను సమాజానికి అందించవచ్చని అంటున్నారు జార్జియా దేశానికి చెందిన మహిళా రైతు నీనా. ఊరికి దగ్గర్లో ఉండే పచ్చిక బయళ్లను పరిరక్షించుకుంటూ ఉండబట్టే తమ జీవనం ఒదిదొడుకుల్లేకుండా సజావుగా సాగుతోందని ఆమె అంటున్నారు. ఒకప్పుడు పచ్చిక బయళ్లలోకి వెళ్లటం, పాడి పరిశ్రమ పనులు చేపట్టటం మహిళలకు సంబంధం లేని విషయంగా ఉండేదట. అయితే, పట్నం నుంచి స్వగ్రామానికి తిరిగొచ్చిన ఆమె పట్టుదలతో కొద్ది సంవత్సరాలుగా ‘పచ్చిక బయళ్ల ఆధారిత డెయిరీ రైతు’గా నిలదొక్కుకున్నారు. తనలాంటి చిన్న మహిళా పాడి రైతుల నుంచి పాలు కొనటం ద్వారా వారికి స్థిరంగా సొంత ఆదాయం వచ్చేలా చేస్తున్నారామె. అంతేకాదు, మరుగునపడిన ‘డో’ అనే ఒక పాతకాలపు ప్రత్యేక జార్జియన్ పాల ఉత్పత్తిని తిరిగి అందుబాటులోకి తేవటం నీనా చేసిన మరో మంచి పని!జార్జియా దేశంలోని కాస్పి సామూహిక పచ్చిక బయళ్లలో మహిళా రైతు నీనో నుగ్జరాష్విలి కృషి ప్రత్యేకమైనది. ఆమె భర్త తమ పాడి పశువులను మేత కోసం తోలుకు΄ోతుండగా, ఆమె తమ పశువుల పాలను అనేక రకాల సురక్షితమైన, అధిక–నాణ్యత గల పాల ఉత్పత్తులుగా మార్చే పనిలో నిమగ్నమవుతుంటుంది. ఆమె స్వయంగా పశువులను మేపడం అరుదుగా చేస్తుంటుంది. అందుబాటులో ఉన్న ఆ పచ్చిక బయళ్లే వారి జీవనాధారంగా నిలిచాయి. ‘సహజమైన పచ్చిక బయళ్లలో దొరికే మేతే మాకు సర్వస్వం. తక్కువ ఖర్చుతో పాలను ఉత్పత్తి చెయ్యటానికి పచ్చిక బయళ్లు మాకు ఆధారం. ఈ సహజమైన పచ్చిక వల్ల పాలకు పూర్తిగా భిన్నమైన నాణ్యత వస్తుంది. దొడ్డిలో పశువులను కట్టేసి మేపే పద్ధతిలో పెరిగే పశువుల పాల రుచి, విశాలమైన పచ్చిక బయళ్లలో తిరుగాడుతూ పెరిగే పశువుల పాల రుచికి, నాణ్యతకు సాటి రాదు..’ అంటారు నీనో. ‘ఒకప్పుడు మహిళలు పచ్చిక బయళ్లకు వెళ్లలేరని లేదా పశువులను మేపలేరని నమ్మేవారు, కానీ ఈ రోజుల్లో మహిళలు అవన్నీ చేస్తున్నారు..’ అని చీజ్ తయారీ పనులు చేస్తూనే ఆమె చెప్పారు.చాలా సంవత్సరాల క్రితం నీనో తన గ్రామాన్ని విడిచిపెట్టి జార్జియాలోని పర్వత ప్రాంతమైన త్సాల్కా మునిసిపాలిటీకి వెళ్లి.. స్థానికుల దగ్గర జున్ను తయారీ కళను నేర్చుకుంది. జార్జియన్ సుల్గుని, ఇమెరులి, ఇతర సాధారణ రకాల జున్నులను తయారుచేసే రహస్యాలను నేర్చుకుంది.ఆమె కుటుంబం ఆరు సంవత్సరాల క్రితం తన గ్రామానికి తిరిగి వచ్చి రెండు ఆవులను పెంచుకుంటూ పాలు అమ్మకుండా, ఆ పాలతోజున్ను, వెన్న, ‘డో’ అనే ఒక అరుదైన పురాతన (పాలను పులియబెట్టి తయారు చేస్తారు) పాల ఉత్పత్తిని తయారు చేయటం ప్రారంభించింది. ప్రస్తుతం ‘డో’ జార్జియాలో దాదాపుగా కనుమరుగైపోయింది. ‘డో’కి ఘాటైన రుచి, గొప్ప చరిత్ర ఉన్నాయని ఆమె వివరిస్తుంది. అది మా మార్కెట్లో కనిపించటమే లేదు. నేను దాన్ని నెమ్మదిగా మార్కెట్లోకి తిరిగి తీసుకురావాలనుకున్నాను అన్నారామె. ‘డో’ తయారీకి ఎక్కువ శ్రమపడాలి. సరైన యంత్ర పరికరాలు సమకూర్చుకోలేకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టం. ‘డో’ను పునరుద్ధరించడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాల గురించి వార్త వ్యాపించడంతో, మార్కెట్ స్పందించింది. దాదాపుగా మర్చిపోయిన ఈ ఉత్పత్తికి చప్పున అధిక డిమాండ్ ఏర్పడింది. అయితే, పాలను ‘డో’గా ఉత్పత్తి చేయడానికి, ప్రాసెస్ చేయడానికి అవసరమైన పరికరాలు నీనో వద్ద ఇంకా లేవు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఆర్థిక తోడ్పాటుతో ఆమె పాశ్చరైజర్ తదితర యంత్ర పరికరాలను సమకూర్చుకోగలిగింది. అంతేకాకుండా, శిక్షణ కూడా పొందింది.నీనో సమాజంలో, గ్రామీణ మనుగడకు సామూహిక పశువుల మేత భూములు అత్యవసరం. అయితే, భూమి లభ్యతపై ఆందోళన పెరుగుతోంది. కేవలం రెండు లేదా మూడు ఆవులు ఉన్న కుటుంబాలు దాదాపు పూర్తిగా బహిరంగ పచ్చిక బయళ్లపైనే ఆధారపడి ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో, భూముల అమ్మకాలు, భూమి క్షీణత, పచ్చిక బయళ్లలోకి ప్రవేశించే అవకాశాల్లేక΄ోవటం కారణంగా అనేక గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని ్ర΄ాంతాలలో పచ్చిక బయళ్లు ఇప్పటికే పూర్తిగా కనుమరుగయ్యాయి. కొంతమంది రైతులు తమ పశువులను అమ్ముకోవలసి వచ్చింది.పచ్చిక బయళ్ళు కేవలం పాల ఉత్పత్తికి తోడ్పడే వ్యవస్థలు మాత్రమే కాదు. అంతకంటే ఎంతో ఎక్కువ. జీవవైవిధ్యాన్ని, సాంస్కృతిక సంప్రదాయాలను, ఆహార వారసత్వాన్ని పచ్చిక బయళ్లు నిలబెడతాయి. ‘సహజంగా పెరిగిన గడ్డిని ఆరుబయట తిరుగుతూ పశువులు మేయడం వల్ల వచ్చే పాలలో ఆ నేల రుచి ఉంటుంది. అది మనల్ని మన పర్యావరణానికి, మన చరిత్రకు అనుసంధానిస్తుంది..’ అని ఆమె అన్నారు. ఎఫ్ఏఓ శిక్షణా తరగతుల్లో చేరిన కొద్దికాలానికే, నీనో మ్యాచింగ్ గ్రాంట్‌ను కూడా ΄పొందింది. దీనితో ఆమె పాశ్చరైజర్, మిల్క్ కూలర్, మిల్క్ ఎనలైజర్ వంటి ఆధునిక పరికరాలను కొని ఉపయోగించగలుగుతోంది. ఆమె వంటి 11 వేల మంది జార్జియా మహిళా రైతులకు ఈ ఏడాది మ్యాచింగ్ గ్రాంట్, శిక్షణను ఇచ్చింది. ఈ సంవత్సరం వారిదే!2026ని ఐక్యరాజ్యసమితిలోని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) నీనా వంటి పచ్చిక బయళ్లపై ఆధారపడి పశువులను పెంచుకొని జీవనోపాధి పొందే రైతులపై దృష్టిని కేంద్రీకరించేందుకు ‘అంతర్జాతీయ పచ్చిక బయళ్ళు– పశుపోషకుల సంవత్సరం’గా, ‘అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం’గా కూడా జరుపుతోంది. పశుపోషకులు, మత్స్యకారుల నుండి ప్రాసెసర్లు, వ్యాపారులు, గ్రామీణ పారిశ్రామికవేత్తల వరకు ఉన్న మహిళా రైతుల కృషికి జేజేలు పలకటమంటే.. ఆరుగాలం కష్టించి చాకిరీ చేస్తూ సమాజానికి తిండిపెట్టే రైతమ్మలకు జేజేలు పలకటమే.భూమిలో సగం పచ్చిక బయళ్లే!భూమిపై సగం భూభాగంలో విస్తరించి ఉన్న పచ్చిక బయళ్ళు కోట్లాది మంది పశు΄ోషకులు, పశువుల పెంపకందారుల జీవనోపాధికి ఆధారంగా నిలిచాయి. వారు తమ సంచారశీలత, సాంప్రదాయ జ్ఞానం, జీవవైవిధ్యం, సహజ వనరులను పరిరక్షించే సుస్థిర పద్ధతుల ద్వారా పచ్చిక బయళ్లను పశువులు మేపుకోవటానికి ఉపయోగించుకుంటూనే సంరక్షిస్తున్నారు. చాలా మంది మహిళా రైతులకు పశుపోషణ అనేది వారి సంస్కృతి, జీవనోపాధి, సామాజిక భద్రతకు అతి ముఖ్యమైన పనిగా ఉంది. (చదవండి: Savidya: ఉచిత డిజిటల్ సహకార కోర్సులు) -
బెల్స్ పాల్సీ వ్యాధి బారిన టెకీ..! కట్‌చేస్తే..
ఒక్కోసారి ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడుతుంటాం. అయితే ఆ సయమంలో మనం సానుకూల దృక్పథంతో స్పందిస్తే అద్భుతాలు చేయొచ్చని ఈ టెకీ నిరూపించాడు. కొందరు ఏ వ్యాధి అయినా వచ్చింది అనగానే దబాలున కుంగిపోతుంటారు. అలా కాకుండా నాకే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అనే నైరాశ్యం కంటే..తనలాంటి వాళ్లుకు ఉపశమనం ఏంటి అనే ఆలోచన తళుక్కుమంటే..కచ్చితంగా హీరోగా, ప్రత్యేకమైన వ్యక్తిగా నిలుస్తాం అనేందుకు ఈ యువ టెకీనే ఉదాహరణ. అసలేం జరిగిందంటే..పీసెస్ AIలో సీనియర్ డెవలపర్ అడ్వకేట్‌గా పనిచేస్తున్న అలీ ముస్తఫా సింగపూర్ ఎంతో ఆనందంగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. ఆ క్రమంలో అనుకోకుండా ముఖ పక్షవాతానికి కారణమయ్యే బెల్స్ పాల్సీ అనే వ్యాధి బారినపడ్డారు. దాంతో అతడు ముఖం కుడివైపు మొత్తం కదపలేని పరిస్థితి ఎదురైంది. బొంబాయికి తిరిగి వచ్చిన వెంటనే ఈ పరిస్థితి ఎదుర్కొంది. దాంతో హుటాహుటినా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ముఖంలోని ఒక వైపు కండరాలలో అకస్మాత్తుగా బలహీనతను కలిగించే బెల్స్ పాల్సీ అనే వ్యాధి బారినపడ్డట్లు వైద్యులు గుర్తించారు. ఈ పరిస్థితి కొన్ని నెలల్లోనే మెరుగుపడుతుందని చెప్పారు వైద్యులు. అందుకోసం కండరాల బలం కోసం ముఖ వ్యాయామాలు, ఫిజికల్ థెరపీ అవసరం అని సూచించారు కూడా. అయితే అక్కడితో ఆగిపోలేదు అలీ. ఈ సమస్యకు తన సాంకేతిక సామర్థ్యాన్ని జోడించి ఏఐ ఫేస్ ట్రాకింగ్ మిర్రర్ యాప్‌ను రూపొందించారు. ఇది ముఖ వ్యాయామాల మార్గనిర్దేశం తోపాటు పరిస్థితి ఎంతవరకు మెరుగ్గా ఉందనేది ట్రాక్ చేస్తుంది. తాను ఈ యాప్‌ను OpenAI ఏజెంట్ కోడెక్స్ తోపాటు ఆంత్రోపిక్ క్లాడ్ని ఉపయోగించినట్లు తెలిపారు. యాప్ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ..ఒక వీడియోని కూడా పంచుకున్నారు. ఆ వీడియోలో అతని ముఖ వ్యాయామాలను విశ్లేషించి ఫిజియోథెరపిస్ట్‌కు పంపుతుంది. అంతేగాదు ప్రతి వ్యాయామాన్ని రికార్డ్ చేయడానికి, అలాగే ఫిజియో వ్యాయామాలను సమీక్షించి ఫీడ్‌బ్యాక్ అందించడానికి వీలుగా ఒక సమగ్ర నివేదికను కూడా అందిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే..వ్యాయామం చేసిన ప్రతిసారీ, యాప్ సెషన్ వ్యవధిని రికార్డ్ చేస్తుంది, అలాగే ముఖ కదలికలు ఎంత వరకు మెరుగ్గా మారిందో అంచనా వేస్తుంది. నెటిజన్లు అతని చొరవును ప్రశంసించడమే గాక, కొన్ని ఆఫర్లు కూడా అందించారు. ఇక ఓపెన్ఏఐ ఎగ్జిక్యూటివ్ వైభవ్ శ్రీవాస్తవ్ ఆలీని మరిన్ని ప్రయోగాలు చేయడానికి వీలుగా ChatGPT సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తానని ఆఫర్ చేశారు. అలాగే ఇలాంటి మరెన్నో వినూత్న ఆవిష్కరణలు చేయాలంటూ ప్రోత్సహించారు కూడా. Last week, I hit rock bottom. I was diagnosed with Bell’s Palsy, and my right face got paralysed;I honestly wondered how I was going to get through it!I vibe-coded my way out and built an AI face tracking app that guides my facial exercises, measures facial symmetry in real… pic.twitter.com/oFN8wJ8vTR— Ali Mustufa (@ialimustufa) May 6, 2026 (చదవండి: పెళ్లికి ముందు ఆ వైద్య పరీక్ష తప్పనిసరి..! లేదంటే..) -
పెళ్లికి ముందు ఆ వైద్య పరీక్ష తప్పనిసరి..! లేదంటే..
కొన్ని వ్యాధులు పెళ్లికి ముందు యవ జంటలు ఈ వైద్య పరీక్షలు చేయించుకుంటే పిల్లలకు ప్రాణాంత వ్యాధులు బారినపడరు. అలాంటి వ్యాధుల్లో ఒకటే ఈ ప్రాణాంతక తలసేమియా వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఎందరో బాధితులు అను నిత్యం నరకం చూస్తుంటారు. ఎందుకంటే రేపు రోజు ఎలా ఉంటుందో తెలియని స్థితి. పైగా ప్రతి నెల రక్తం ఎక్కించుకోవాల్సిన దుస్థితి. ఇవాళ అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం ఈ సందర్భంగా ఈ వ్యాధి ఎందువల్ల వస్తుంది? నివారణ ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.తలసేమియా అంటే..తలసేమియా (Thalassemia) అనేది జన్యుపరమైన రక్తహీనత వ్యాధి, ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. దీనివల్ల ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఏర్పడక, బాధితులు ప్రతి 2-4 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంది. వేసవి సెలవుల్లో రక్త సేకరణ శిబిరాలు తగ్గడంతో రక్త నిల్వల కొరత ఏర్పడుతోంది. తలసేమియా మహమ్మారి చిన్నారులకు నరకం చూపిస్తోంది. ప్రభుత్వం ఈ వ్యాధికి ఉచిత చికిత్స అందుతున్నా, నిరంతర రక్త అవసరం, నిల్వల కొరతతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.నివారణ ఎలాగంటే..పెళ్లికి ముందు జంటలు 'హీమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరేసిస్' పరీక్ష చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.సమస్య ఉన్నవారు రక్తమార్పిడితో పాటు, ఐరన్ ఓవర్‌లోడ్ (Iron overload) తగ్గించడానికి అవసరమైన మందులు వాడాలి.తలసేమియా మేజర్ ఉన్నప్పటికీ, సరైన చికిత్స, పట్టుదలతో తిరుచ్చికి చెందిన పరమేశ్వరి వంటి వారు ఉన్నత చదువులు చదువుతూ ఇతరులకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఈ వ్యాధి గురించి మరింత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి. (చదవండి: 'ఉప్పు' ఇంత ప్రాణాంతకమా..? పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
'ఉప్పు' ఇంత ప్రాణాంతకమా..?
2023లో ప్రపంచవ్యాప్తంగా 59 లక్షల మంది కేవలం ఆహారపు అలవాట్లతో ముడిపడిన గుండె జబ్బుల వల్ల మరణించారట. 204 దేశాలకు సంబంధించి సమాచారం ఆధారంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం వివరాలు ది ఇన్నోవేషన్ న్యూట్రీషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ మరణాల్లో అత్యధిక శాతం చైనా(13.6 లక్షలు), భారత్(11 లక్షలు)లో సంభవించాయి. తర్వాతి స్థానాల్లో రష్యా, అమెరికా, ఇండోనేసియా ఉన్నాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పళ్లు, తృణ ధాన్యాలు తక్కువ తీసుకోవడం వంటివాటిని వీటికి ప్రధాన కారణాలుగా పరిశోధకులు గుర్తించారు.మనమేం చేయాలి దేశపు ఆహారపు విధానాల్లో మార్పులు అత్యవసరం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందింపజేయాలి. ముఖ్యంగా సోడియం(ఉప్పు) వినియోగాన్ని తగ్గించే విధానాలు తేవాలి. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై పోషకాల వివరాలను తప్పనిసరిగా ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలి. సాక్షి, నేషనల్ డెస్క్(చదవండి: ఫైబర్ ఎందుకు అధికంగా తీసుకోవాలి? కలిగే లాభాలు..) -
వెనిస్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నీతా అంబానీ కుటుంబం
ఇటలీలోని వెనిస్లో జరుగుతున్న లా బియెన్నాలే డి వెనిజియా 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో అంబానీ కుటుంటం భారత జాతీయ పెవిలియన్‌ను ప్రారంభించింది. ఇది ఫ్యాషన్‌తో కూడిన భారతీయ వారసత్వ సమ్మేళనానికి అద్భుతమైన సాక్ష్యంగా నిలిచింది. ఈ మేరకు మే 7న సాయంత్రం అంబానీ కుటుంబం వెనిస్లో ఒక ఆత్మీయ వేడుకని నిర్వహించింది. ఆ వేడుకలో అంబానీ కుటుంబం ఆధునిక శైలులు, సాంప్రదాయ భారతీయ వైభవాన్ని సంపూర్ణంగా సమతుల్యం చేసేలా పలు రకాల లుక్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుకలో నీతా అంబానీ కుటుంబం భారతీయ కళ, ఫ్యాషన్ వైభవాన్ని ఎలా మిళితం చేసిందంటే..గోల్డ్ శారీలో నీతా అంబానీ..సాంస్కృతిక కార్యక్రమాల వెనుక దార్శనికురాలిగా, నీతా అంబానీ ఒక క్లాసిక్ గోల్డ్ టిష్యూ చీరలో అందానికి కేరాఫ్‌గా కనిపించారు. ఈ కార్యక్రమంలో నీతా తన కుటుంబంతో కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తున్నప్పుడు, ఆమె ధరించిన చీర మిరిమిట్లుగొల్పేలా కాంతిని వెదజల్లింది. సాంప్రదాయ భారతీయ వస్త్రధారణ విలాసానికి అంతిమ చిహ్నంగా నిలుస్తుందని ఆమె ఆహార్యం నిరూపించింది. నీతా తన లుక్‌ని ఒక భారీ వజ్రాలు-పచ్చల నెక్లెస్ సెట్, ఒక చిన్నబన్తో జత చేశారు.పుదీనా రంగులో రాధికా మర్చంట్ రాధికా మర్చంట్, సున్నితమైన పుదీనా నీలం రంగులో ఉన్న ఒక అందమైన వన్-షోల్డర్ గౌనులో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిసింది. ఈ గౌను నడుము వద్ద ముడుచుకుని, గ్రీకు శైలిలో క్లిష్టమైన డ్రేపింగ్ను కలిగి ఉంది. మెడ భాగంలో మెరుస్తున్న, స్ఫటికాకార అంచు, దానికి సరిపోయే ఆర్మ్ కఫ్, ఈ గౌనుకు ఆధునిక మెరుపును జోడించి మరింత శోభను చేకూర్చింది. రాధిక తన జుట్టును నునుపైన, ఒత్తుగా ఉన్న పోనీటెయిల్‌తో స్టైల్ చేశారు. దీంతో ఆమె ప్రకాశవంతమైన మేకప్, ప్రత్యేకమైన వజ్రాల చెవిపోగులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.వైన్ గౌనులో మెరిసిపోతున్న ఇషా అంబానీఇషా అంబానీ అధునాతన ముదురు వైన్ రంగులో ఉన్న ఫ్లోర్-లెంగ్త్ గౌనును ధరించారు. ఈ గౌను పాశ్చాత్య ఫ్యాషన్ శైలిలో కనిపిస్తూ..సాంప్రదాయ చీర కట్టుతో మేళవించింది. గౌను పైభాగంలో ఉన్న అద్భుతమైన బంగారు ఎంబ్రాయిడరీ, పూల డిజైన్లు భుజాల మీదుగా జాలువారుతూ, ముదురు రంగు వస్త్రానికి గొప్ప కాంట్రాస్ట్‌ను అందించాయి. ఇషా తన జుట్టును మృదువైన, రొమాంటిక్ అలల రూపంలో వేసుకుని, ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్, పచ్చలు పొదిగిన ఆభరణాలతో తన రూపాన్ని పూర్తిచేశారు.ఆకర్ణణీయమైన లుక్‌లో ఆనంద్ పిరమాల్, అనంత్ అంబానీలు..వెనిస్లో, అంబానీ కుటుంబం వారసత్వ సంప్రదాయాన్ని, ప్రపంచ ఫ్యాషన్‌తో మేళవించి, పవర్ డ్రెస్సింగ్‌ను పునర్నిర్వచించారు. ఆ సాయంత్రం కేవలం భారతీయ కళల వేడుకగా మాత్రమే కాకుండా, ప్రపంచ వేదికపై భారతీయ వస్త్రధారణ నైపుణ్యానికి ఒక ప్రదర్శనగా నిలిచింది. ఇకఇషా అంబానీ భర్త, వ్యాపారవేత్త ఆనంద్ పిరమాల్, రాజసం ఉట్టిపడేలా అలంకరించిన వెండి బ్రోచ్తో కూడిన నల్లటి వెల్వెట్ జాకెట్లో ఆకర్షణీయంగా కనిపించగా, అనంత్ అంబానీ, తమ కుటుంబం మెచ్చే సూక్ష్మమైన హస్తకళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే అలంకారమైన లాపెల్ పిన్‌తో కూడిన నల్లటి సూట్లో అద్భుతంగా కనిపించారు. View this post on Instagram A post shared by Vogue Arabia (@voguearabia)(చదవండి: Met Gala 2026: రూ. 142 కోట్ల నెక్లెస్‌తో మెరిసిన సుధా రెడ్డి..!) -
ఫైబర్ ఎందుకు అధికంగా తీసుకోవాలంటే..?
చాలా మంది తమ రోజువారీ ఆహారంలో తగినంత ఫైబర్ పొందడం లేదని, దాని కారణంగా చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని పోషకాహార నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ప్రతి మనిషికి రోజుకు సుమారుగా 25 నుంచి 30 గ్రాముల వరకు ఫైబర్ అవసరం అయితే నివేదికలు కేవలం 15 నుంచి 20 గ్రాములే వినియోగిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇది వ్యాధులకు దారితీసే ప్రమాదానికి సంకేతమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. గ్రామీణ ఆహారాల్లో పప్పుధాన్యాలు, ముతక ధాన్యాలలో కనీసం ఏదో రకంగా ఫైబర్ ఉంటుంది. కానీ పట్టణ ఆహారాల్లో ఆ లోటు అధికం అని చెబుతున్నారు నిపుణులు. అసలు ఫైబర్ ఎందుకు అవసరం అంటే..మన ఆహారంలో అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతామని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..మెరుగైన జీర్ణక్రియ, మలబద్ధకం నుంచి ఉపశమనంపేగుల ఆరోగ్యానికి మద్దతు, ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు పోషణరక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచి, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందికడుపు నిండిన భావనను పెంచి, బరువు నిర్వహణలో సహాయపడుతుంది.ఫైబర్ అందించే ఆహారాలుచియా గింజలు, కాయధాన్యాలు, బీన్స్, పండ్లు, తృణధాన్యాలు వంటి సాధారణ ఆహారాలు ఈ లోటును పూరించగలవు. తెల్ల బియ్యం బదులు బ్రౌన్ రైస్ తినడం లేదా హోల్-గ్రెయిన్ బ్రెడ్ ఎంచుకోవడం వంటి చిన్న, స్థిరమైన మార్పులు పెద్ద తేడాను కలిగిస్తాయని పోషకాహార నిపుణులు నొక్కి చెబుతున్నారు. భారతీయ ఆహారంలో అధిక ఫైబర్ ఉన్న ఆహారాలుచిరుధాన్యాలు (రాగి, జొన్న, బజ్రా) – వీటిలో కరిగే, కరగని ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి.పప్పుధాన్యాలు (కందిపప్పు, పెసరపప్పు, మసూర్ పప్పు).చిక్కుడు జాతి గింజలు (రాజ్మా, శనగలు, చిక్పీస్).పండ్లు (జామకాయ, బొప్పాయి, అరటిపండు, ఆపిల్).కూరగాయలు (పాలకూర, బెండకాయ, క్యారెట్లు).తృణధాన్యాలు (బ్రౌన్ రైస్, గోధుమ చపాతీ).కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యాన్ని నివారించడానికి ఫైబర్‌ను క్రమంగా పెంచుకుంటూ..పుష్కలంగా నీరు త్రాగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. డాక్టర్ ఆదర్శ గౌడచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్,అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)ICAR–నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు(చదవండి: జస్ట్ రెండు నెలల్లో 20 కిలోలు తగ్గాలంటే..! ఆ 12 అలవాట్లు..) -
స్పెల్లింగ్ బీ బాద్షా... దేవ్ షా
ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న అబ్బాయి పేరు... దేవ్ షా. నేషనల్ స్పెల్లింగ్ బీ చాంపియన్. ‘స్పెలింగ్ బీ’ గురించి దేవ్ షా మాటలు వింటే ఆ పోటీ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ‘నేను కూడా సాధించాలి’ అనే పట్టుదల మీలో పెరుగుతుంది. ‘స్పెల్లింగ్ బీ’ గురించి దేవ్ షా మాటల్లో...నేను సెకండ్ గ్రేడ్ నుంచి స్పెల్లింగ్ బీ పోటీల్లో పాల్గొంటున్నాను. ఎన్నోసార్లు ఓడిపోయాను. కొన్నిసార్లు పోటీకి అర్హత కూడా సాధించలేకపోయాను. నేను తడబడిన మొదటి పదం వెన్స్డే. స్పెలింగ్ తప్పుగా చెప్పాను. ఈ పోటీల కోసం ప్రిపేర్ కావడం చాలా భారంగా అనిపించేది. దీంతో గూగుల్ షీట్లో నా ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవడం మొదలుపెట్టాను. నేను చదివిన పదాల సంఖ్య, మూల పదాలు, ఎటిమోలజీ టెక్ట్స్ బుక్‌లో నేను చదివిన పేజీలు నమోదు చేసేవాడిని.పెద్దపనులు... చిన్న చిన్న భాగాలుగా...డిక్షనరీలో దాదాపు 5,00,000 పదాలు ఉంటాయి. వాటిలో నాకు చాలా కష్టంగా అనిపించేవి, సులభంగా అనిపించేవి...ఇలా రకరకాలుగా వాటిని గూగుల్ ఎక్సెల్ షీట్లో వర్గీకరించుకున్నాను. పెద్ద పెద్ద పనులను చిన్న చిన్న పార్ట్స్‌గా విభజించడం మొదలుపెట్టాను. ఇలా విభజించాలంటే ఓపిక ఉండాలి. ప్రతిరోజూ ఏడు నుంచి పదిగంటల వరకు మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ చదివేవాడిని. ఇలా చదవడం వల్ల చరిత్ర నుంచి జీవశాస్త్రం వరకు ఎన్నో పదాలు, వాటి మూలాల గురించి తెలుసుకోగలిగాను.గుర్తుంచుకోవడానికి...స్పెల్లింగ్‌లను గుర్తుంచుకోవడానికి బండ గుర్తులు, రైమింగ్ ట్యాక్టిక్స్, రకరకాల మెమొరీ టిప్స్ ఉపయోగించేవాడిని. రోజూ ప్రిపేర్ కావడం ద్వారా నాలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగాయి.నేషనల్ స్పెల్లింగ్ బీలో పదజాలం(వొకాబులరీ) అనేది ముఖ్యమైన భాగం. ఒక పదాన్ని సరిగా యూజ్ చేయకపోతే దాన్ని నేర్చుకోవడంలో అర్థం లేదు. నేను నేర్చుకున్న పదాలను నేను రాసే వ్యాసాలలో ఎక్కడో ఒకచోట వాడుతుంటాను.ఎలాగైనా గెలవాలి అనే ఆరాటం వద్దు!ఎలాగైనా గెలవాలి...అనే ఆరాటం వల్ల ఒత్తిడికి గురవుతాము. ఈ ఒత్తిడి వల్ల మైండ్ పనిచేయదు. నేను ఒకప్పుడు స్పెల్లింగ్ బీ పోటీకి ఎంపిక కానప్పుడు బాగా బాధపడ్డాను. ‘నేను గతంలో కంటే చాలా కష్టపడ్డాను. మరి ఎందుకు ఓడిపోయాను?!’ అని నా డైరీలో రాసుకున్నాను. ఆ తరువాత మాత్రం నాలో మార్పు వచ్చింది. గెలవాలనే ఒత్తిడిని వదిలేసి, దానికి బదులుగా కొత్త కొత్త పదాలను నేర్చుకోవడం ద్వారా ఆనందించడంపై ఎక్కువ దృష్టి పెట్టాను. నేను స్పెలింగ్ చెబుతున్నప్పుడు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన స్థితిలోకి వెళతాను. స్పెల్ బీ ప్రయాణం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందమే చివరికి నన్ను చాంపియన్‌షిప్ టైటిల్ గెల్చుకునేలా చేసింది.


