ఆరోగ్యవంతమైన సోడా..! | This Coke officially approved as a health drink in Japan. | Sakshi
Sakshi News home page

ఆరోగ్యవంతమైన సోడా..!

May 10 2026 11:18 AM | Updated on May 10 2026 11:18 AM

This Coke officially approved as a health drink in Japan.

రంగు రంగుల చల్లని సోడా పానీయాలకు వేసవిలో గిరాకీ విపరీతంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం అని డాక్టర్లు చెబుతుంటారు. కృత్రిమ రంగులు, మితిమీరిన మోతాదులో చక్కెర కలిపి తయారుచేసే సోడా పానీయాలు ఆరోగ్యానికి హానికరమే అనడంలో ఎలాంటి సందేహాం లేదు. అయితే, జపాన్‌లో దొరికే ఈ సోడా పానీయం మాత్రం చాలా ఆరోగ్యకరమైనది. ఎందుకంటే, ఇది మజ్జిగతో తయారు చేసే సోడా.

‘కాల్పికో సోడా’ పేరుతో 1919 నుంచి ఇది జపాన్‌లో అమ్ముడవుతోంది. మజ్జిగలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ ఇందులోనూ చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇది పొట్టకు మేలు చేస్తుంది. ఇందులో ఎలాంటి హానికర రసాయనాలు, కృత్రిమ రంగులు ఉండవు. ఒకరకంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన సోడా పానీయం అని చెప్పవచ్చు. 

(చదవండి: ఈ ఐస్‌క్రీమ్‌... చాలా హాట్‌ గురూ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement