ఈ ఐస్‌క్రీమ్‌... చాలా హాట్‌ గురూ! | The North Carolina Ice Cream So Spicy You Need To Sign | Sakshi
Sakshi News home page

ఈ ఐస్‌క్రీమ్‌... చాలా హాట్‌ గురూ!

May 10 2026 11:11 AM | Updated on May 10 2026 11:11 AM

The North Carolina Ice Cream So Spicy You Need To Sign

ఐస్‌క్రీమ్‌ అంటే చల్లచల్లగా తియ్యతియ్యగా ఉంటుందనేగా మీ అంచనా! ఈ ఐస్‌క్రీమ్‌ను గనుక ఒక్కసారి రుచి చూస్తే మీ అంచనాలన్నీ పటాపంచలైపోతాయి. దీని రుచి నాలుకను తాకిన తక్షణమే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఒళ్లంతా ముచ్చెమటలు పడతాయి. ఇదెక్కడి ఐస్‌క్రీమ్‌ బాబోయ్‌! అని నోరెళ్లబెట్టి, గుడ్లు తేలేస్తారు. ఇది అలాంటిలాంటి ఐస్‌క్రీమ్‌ కాదు, దీని పేరు ‘కోల్డ్‌ స్వెట్‌’. అన్ని ఐస్‌క్రీమ్‌ల మాదిరిగానే చాలా చల్లగా ఉంటుంది. 

రుచి చూస్తేనే దీని అసలు తడాఖా తెలిసొస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన రకాల మిరపకాయలు, మిర్చి సాస్‌ వంటి వాటితో తయారు చేయడం వల్లనే ఇది ప్రపంచంలోనే ఘాటైన ఐస్‌క్రీమ్‌గా పేరుపొందింది. అమెరికాలో నార్త్‌ కరోలినా రాష్ట్రం ఏంజియర్‌ పట్టణానికి చెందిన ‘సన్నీ స్కై హోమ్‌మేడ్‌ ఐస్‌క్రీమ్స్‌’ సంస్థ ఈ ఐస్‌క్రీమ్‌ను ఇరవై ఏళ్ల కిందట ప్రారంభించింది. విచిత్రమైన రుచులను ఆస్వాదించాలనుకునేవారు దీని కోసం ఇక్కడకు వస్తుంటారు. 

(చదవండి: జ్ఞాన శంఖం 'పూరి'ద్దాం!)

Advertisement
 
Advertisement
Advertisement