పిల్లల్ని పొగడటం మంచిదేనా? | Special Story On Compliments Help Kids Thrive | Sakshi
Sakshi News home page

పిల్లల్ని పొగడటం మంచిదేనా?

May 16 2026 3:23 PM | Updated on May 16 2026 3:30 PM

Special Story On Compliments Help Kids Thrive

పిల్లలు ఏదైనా చిన్న మంచి పని చేయగానే "నువ్వు గ్రేట్", "you are a hero" అని ఆకాశానికి ఎత్తేస్తున్నారా? అలా పొగిడితే వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భావిస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్ తప్పకుండా చదవండి.

పిల్లల పెంపకంలో ప్రశంస మంచిదే, కానీ అది ఏ మోతాదులో, ఎలా ఇస్తున్నామనే దానిపైనే వారి రేపటి విజయం ఆధారపడి ఉంటుంది.

మీరు చేస్తున్న అతి ప్రశంస (Over-praise) వారి ఎదుగుదలకు ప్లస్ కాకపోగా, వారి భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీసే సైకలాజికల్ బాంబుగా మారుతోంది.

Importance of Praise
చైల్డ్ సైకాలజీ కోణంలో చూస్తే, పిల్లల మెదడు వికాసానికి ప్రశంస అనేది ఒక పాజిటివ్ యాంకరింగ్ లాంటిది. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం, తల్లిదండ్రుల నుండి వచ్చే సానుకూల గుర్తింపు పిల్లల మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది వారిలో నేర్చుకోవాలనే జిజ్ఞాసను, సామాజిక నైపుణ్యాలను (Social Skills) పెంచుతుంది.

అస్సలు ప్రశంసలు దక్కని పిల్లలు అండర్ కాన్ఫిడెన్స్ తో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో పెరుగుతారు.

The Danger of Over-praise
సమస్య అంతా అవసరం లేని చోట, అతిగా పొగడటంతోనే మొదలవుతుంది. Journal of Experimental Child Psychology లో ప్రచురితమైన ఒక కీలక అధ్యయనం షాకింగ్ నిజాలను వెల్లడించింది. ఏదైనా మామూలు పని చేసినా లేదా అసలు శ్రమే పెట్టకపోయినా పిల్లలను అతిగా పొగిడితే, వారిలో Praise Addiction (ప్రశంసల వ్యసనం) ఏర్పడుతుంది.

దీనివల్ల రేపు క్లాస్‌రూమ్‌లోనో, సమాజంలోనో ఎవరైనా తమను పొగడకపోతే వారు తీవ్ర నిరాశకు గురవుతారు. అంతేకాదు, తమను తాము ఎక్కువగా ఊహించుకునే నార్సిసిస్టిక్ (Narcissistic) ధోరణులు వారిలో పెరుగుతాయి.

The Famous Dweck Study
ప్రశంసకు, అతి ప్రశంసకు మధ్య ఉన్న అసలు తేడాను స్టాన్‌ఫర్డ్ సైకాలజిస్ట్ Carol Dweck తన ప్రసిద్ధ పరిశోధనలో నిరూపించారు. ఆమె పిల్లలను రెండు గ్రూపులుగా విభజించి ఒక పజిల్ టాస్క్ ఇచ్చారు.

* మొదటి గ్రూప్ లో "నువ్వు చాలా స్మార్ట్", "నువ్వు చాలా ఇంటెలిజెంట్" అంటూ పిల్లల తెలివితేటలను పొగిడారు (Trait Praise).

* రెండో గ్రూప్ లో "నువ్వు చాలా బాగా కష్టపడ్డావు", "చాలా శ్రద్ధగా చేశావు" అంటూ  పిల్లల శ్రమను పొగిడారు  (Process Praise).

ఆ తర్వాత మరింత కష్టమైన పజిల్స్ ఇచ్చినప్పుడు... కేవలం తెలివితేటలను పొగిడిన మొదటి గ్రూప్ పిల్లలు ఓడిపోతామనే భయంతో టాస్క్‌లు వదిలేశారు (Fixed Mindset).

కానీ, శ్రమను పొగిడిన రెండవ గ్రూప్ పిల్లలు సవాల్‌ను స్వీకరించి, కొత్తగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు (Growth Mindset).

పేరెంట్స్ కోసం 3 ప్రాక్టికల్ టిప్స్
ఈ అతి ప్రశంస లూప్ నుండి బయటపడటానికి పేరెంట్స్ ఈ క్రింది మూడు విషయాలను గుర్తుంచుకోవాలి.

1. ఫలితాన్ని కాదు, ప్రయాణాన్ని పొగడండి. "నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు, నువ్వు తోపు" అనడానికి బదులు... "ఈ మార్కులు సాధించడానికి నువ్వు రోజు రాత్రి పడ్డ కష్టం నాకు నచ్చింది" అనండి.

2. ప్రశంసను వారు సంపాదించుకునేలా చేయండి (Earned Praise). ప్రతి చిన్న సాధారణ విషయానికి కాకుండా, వారు నిజంగా పట్టుదల చూపించినప్పుడు మాత్రమే మెచ్చుకోండి.

3. రియలిస్టిక్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. పొగడ్తల్లో నిజాయితీ లేకపోతే పిల్లలు దాన్ని సులభంగా పసిగట్టేస్తారు. కాబట్టి ప్రశంస ఎప్పుడూ జెన్యూన్‌గా ఉండాలి.

పిల్లలకు పుట్టుకతో వచ్చిన తెలివితేటలను కాకుండా, వారు పెట్టే శ్రమను మాత్రమే ప్రశంసించండి. అప్పుడే రేపటి పోటీ ప్రపంచంలో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే Resilience, మానసిక దృఢత్వం కలిగిన అద్భుతమైన జనరేషన్‌ను మనం నిర్మించగలం!

-సైకాలజిస్ట్ విశేష్ 
Founder, Genius Matrix Hub 
www.psyvisesh.com 
8019 000066

Advertisement
 
Advertisement
Advertisement